General Elections 2024
-
కాంగ్రెస్ వల్లే బీజేపీ గెలిచింది: మమతా బెనర్జీ
కోల్‌కతా:కాంగ్రెస్ పార్టీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఫెయిలవడం వల్లే 2024లో ఇండియా కూటమి కేంద్రంలో అధికారం దక్కించుకోలేకపోయిందని విశ్లేషించారు.బంగ్లార్ నిర్బచోన్ ఒ ఆమమ్రా పేరుతో తాను రాసిన మూడు పుస్తకాలను మమతా బెనర్జీ బుధవారం(జనవరి29) విడుదల చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు కోసం తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నించింది. కూటమిలో పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవడం వల్లే బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ రాణించకపోవడం ఇండియా కూటమి ఓటమికి కారణం’అని 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మమత తన పుస్తకాల్లో లోతుగా విశ్లేషిచారు. -
జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. మెటాకు భారత్ సమన్లు
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్రం సమన్లు జారీ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలపై ఆ సంస్థ బాస్ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ‘అసత్య ప్రచారపు’ వ్యాఖ్యలే అందుకు కారణం. గతేడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. అయితే.. జుకర్‌బర్గ్ చేసిన వాదనను భారత ప్రభుత్వం ఖండించింది. బీజేపీ ఎంపీ, ఐటీ & కమ్యూనికేషన్ పార్లమెంటరీ హౌజ్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దుబే మెటాకు సమన్లు పంపే విషయాన్ని ధృవీకరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకే సమన్లు అని ఎక్స్ వేదికగా తెలిపారాయన. मेरी कमिटि इस ग़लत जानकारी के लिए @Meta को बुलाएगी । किसी भी लोकतांत्रिक देश की ग़लत जानकारी देश की छवि को धूमिल करती है । इस गलती के लिए भारतीय संसद से तथा यहाँ की जनता से उस संस्था को माफ़ी माँगनी पड़ेगी https://t.co/HulRl1LF4z— Dr Nishikant Dubey (@nishikant_dubey) January 14, 2025ప్రజాస్వామ్య దేశం విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ తప్పునకు భారత దేశ ప్రజలకు, చట్ట సభ్యులకు క్షమాపణ చెప్పాల్సిందే అని దుబే ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అంతకు ముందు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కౌంటర్ బదులిచ్చారు.‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్-19 తర్వాత భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయి అని జుకర్‌బర్గ్ చెప్పడంలో వాస్తవం లేదు. .. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220కోట్ల వ్యాక్సిన్లు అందించడంతోపాటు కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోదీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయి’’ అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే జుకర్‌బర్గ్ అలా మాట్లాడటం నిరాశకు గురిచేసిందన్న అశ్వినీ వైష్ణవ్.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటాను టాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.జుకర్‌బర్గ్ ఏమన్నారంటే..జనవరి 10వ తేదీన ఓ పాడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్ మాట్లాడారు. 2024 సంవత్సరం భారీ ఎన్నికల సంవత్సరంగా నిలిచింది. ఉదాహరణగా.. భారత్‌తో సహా ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే అన్నిచోట్లా అక్కడి ప్రభుత్వాలు అక్కడ ఓడిపోయాయి. దీనికి కరోనాతో ఆయా ప్రభుత్వాలు డీల్ చేసిన విధానం.. అది దారితీసిన ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం అని అన్నారాయన. -
డేటా మటాష్.. స్లిప్‌లు ‘బర్న్’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియలో అధికారుల వ్యవహారశైలి తొలి నుంచీ అనుమానాస్పదంగానే ఉంటోంది. కలెక్టరేట్లోని ఎన్నికల సెల్లో ఉండాల్సిన ఈవీఎంలు భద్రపరిచిన బాక్సు తాళం చెవులు మరోచోట ప్రత్యక్షమవడం దాకా ఈ మాయాజాలం కొనసాగుతూనే ఉంది. బ్యాటరీ స్టేటస్‌పై ముసురుకున్న సందేహాలపై చేపట్టిన రీ– వెరిఫికేషన్ ప్రక్రియలో.. కొత్త బ్యాటరీ వినియోగంతో మొదలైన మాక్ పోలింగ్ వ్యవహారం రెండో రోజూ అదే అనుమానాలతో కొనసాగింది. ఫిర్యాదుదారులు కోరినట్లుగా వెరిఫికేషన్ చేయడం సాధ్యం కాదని అధికారులు అసలు సంగతి తేల్చిచెప్పారు. ఈవీఎం డేటా తీసేశామని (ఎరేజ్).... అంతేకాకుండా వీవీ ప్యాట్లలో స్లిప్‌లను ‘‘బర్న్’’ చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇదంతా చేశామని చెప్పడం గమనార్హం. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించగా దీనిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్సార్ సీపీ గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య, విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ జూన్ 10న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఒకవైపు పోటీ చేసిన అభ్యర్థుల నుంచి అనుమానాలు ఉన్నాయని, రీ–వెరిఫికేషన్ చేయాలంటూ వచ్చిన అభ్యర్థనలను పరిష్కరించకుండానే డేటాను తొలగించాలంటూ ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడటం వెల్లువెత్తుతున్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. రీ–వెరిఫికేషన్‌లో పార్టీల గుర్తులు కాకుండా ఇష్టారీతిన గుర్తులను కేటాయించి మాక్ పోలింగ్ నిర్వహించడం మొదలు అంతులేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్నికల కమిషన్ ప్రస్తుత టెక్నికల్ నిబంధనల్లో (ఎస్వోపీ) బ్యాటరీ పవర్ పర్సంటేజీ అంశం లేదని బెల్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎం పరిశీలనకు అభ్యర్థి అభ్యర్థి బెల్లాన నిరాకరించినందున మంగళవారం పరిశీలన జరగలేదని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.21 రోజుల తరువాత 99 శాతం బ్యాటరీ స్టేటస్..విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోదాం వద్ద రెండో రోజు మంగళవారం కూడా హైడ్రామా కొనసాగింది. ఈవీఎంల సేఫ్ ట్రంక్ బాక్స్ తాళం చెవి కనిపించలేదంటూ సోమవారం మూడు గంటలు ఆలస్యం చేసిన అధికారులు అర్ధరాత్రి వరకూ మాక్ పోలింగ్ కొనసాగించారు. కొత్త బ్యాటరీ ఉపయోగించగా మాక్ పోలింగ్ ముగిసే సమయానికి 80 శాతం స్టేటస్ చూపించింది. అంటే 20 శాతం తగ్గింది. కానీ మే 13వ తేదీ పోలింగ్ రోజున దాదాపు 12 గంటలు ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ మాత్రం 21 రోజుల పాటు భద్రపరచిన తర్వాత కూడా 99 శాతం చూపించడం పలు సందేహాలకు తావిస్తోంది. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, వీవీ ప్యాట్ల లెక్కింపుతో పాటు ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీ ఫుటేజీని ఇవ్వాలని కోరుతూ విజయనగరం లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. గజపతినగరం నియోజకవర్గంలో మే 13వ తేదీన దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరిగిందని, దాదాపు 81.06 శాతం ఓటింగ్ నమోదైందని తమ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈవీఎంకు, వీవీ ప్యాట్లకు బ్యాటరీ స్టేటస్ 50 శాతం ఉన్నట్లు సీసీ కెమెరాల్లోనూ రికార్డు అయ్యిందని పేర్కొన్నారు. పోలింగ్ తర్వాత రమారమి 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం తెరచినప్పుడు బ్యాటరీ స్టేటస్ (పవర్) 99 శాతం చూపించడంపై సందేహం వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా గజపతినగరం అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద పోలింగ్ స్టేషన్ నంబర్ 20లో ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని బొత్స అప్పలనర్సయ్య ఎన్నికల కమిషన్‌ను కోరారు. అలాగే విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోమటిపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుంపాం పోలింగ్స్టేషన్ల తాలూకు ఈవీఎంల బ్యాటరీ స్టేటస్ తెలియచేయాలని, వీవీ ప్యాట్లను ఓట్లతో సరిపోల్చి లెక్కించాలని, ఆయా పోలింగ్ స్టేషన్లలో సీసీ ఫుటేజీ ఇవ్వాలని బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికల కమిషన్‌ను కోరారు. అందుకు అవసరమైన రుసుము వారిద్దరూ చెల్లించారు. అయితే దీని పరిశీలనకు నెల్లిమర్ల ఈవీఎం గోదాం వద్దకు వెళ్లగా... ఈసీఐ ప్రస్తుత టెక్నికల్ ఎస్‌వోపీల్లో బ్యాటరీ పవర్ పర్సంటేజీ అంశం లేదని బెల్ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని బెల్లానకు అధికారులు వివరించారు. దీంతో ఆయన రీ–వెరిఫికేషన్‌కు నిరాకరించారు.డేటా అంతా ఖాళీయే...ఫిర్యాదుదారులు కోరినట్లు వెరిఫికేషన్ చేయడానికి వీలుకాదని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం డేటా తీసేశామని (ఎరైజ్), వీవీ ప్యాట్లలో స్లిప్‌లను ‘‘బర్న్’’ చేశామని అధికారులు పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి నిబంధనల మేరకు ఈ డేటాను 45 రోజుల వరకూ భద్రపరచాలి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ సమయంలో సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఫిర్యాదుదారులు వెరిఫికేషన్ కోసం జూన్ 10వ తేదీన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వెరిఫికేషన్ రుసుము చలానా ద్వారా చెల్లించారు. ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఆ ఈవీఎంల్లో డేటా, వీవీ ప్యాట్లలో స్లిప్పులను అధికారులు భద్రపరచాలి. కానీ వాటిని ఆగమేఘాలపై ఆనవాళ్లు లేకుండా చెరిపేయడం కొత్త సందేహాలకు తావిస్తోంది. పైగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే డేటా మొత్తం తొలగించినట్లు అధికారులు పేర్కొనడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది.బ్యాటరీ స్టేటస్ గుట్టు రట్టు...వెరిఫికేషన్ కోరిన పెదకాద పీఎస్ నంబర్ 20కు సంబంధించిన ఈవీఎంను సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు బయటకు తీసి దానికి సంబంధించిన బ్యాటరీని అధికారులు సీజ్ చేశారు. ఆ బ్యాటరీకి బదులు మరో కొత్త బ్యాటరీతో ఈవీఎం మాక్ పోలింగ్‌ను సోమవారం అర్ధరాత్రి వరకూ కొనసాగించారు. పార్టీ గుర్తులు లోడ్ చేయకుండా మరేవో గుర్తులు లోడ్ చేసి సుమారు 1,400 ఓట్లు మాక్ పోలింగ్ చేశారు. ఇది ముగిసిన తర్వాత బ్యాటరీ స్టేటస్ పరిశీలిస్తే 80 శాతం నమోదు కావడం గమనార్హం. అలాంటప్పుడు పోలింగ్ రోజున ఈవీఎం, వీవీ ప్యాట్లకు వాడిన బ్యాటరీ స్టేటస్ 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత కౌంటింగ్ రోజున తెరిచేసరికి 99 శాతం ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయం తాము తేల్చలేమని అధికారులు పేర్కొన్నారు. కేవలం మాక్ పోలింగ్‌లో బ్యాటరీ స్టేటస్ ఎంత ఉందో మాత్రమే చెబుతామని అధికారులు సమాధానమిచ్చారు. పాత బ్యాటరీ స్టేటస్ గుట్టు ఏమిటో వెల్లడించాలనేదీ తమ డిమాండ్ అని, అంతేకానీ మాక్ పోలింగ్ కాదని ఫిర్యాదుదారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు తమ డిమాండ్‌ను మెయిల్ ద్వారా పంపించారు.ట్యాంపరింగ్ అయినట్లుంది...కౌంటింగ్ రోజు ఈవీఎంల బ్యాటరీ స్టేటస్ 99 శాతం చూపించిందని ఎన్నికల ఏజెంట్లంతా చెప్పారు. దీంతో జూన్ 10వ తేదీనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశా. దాదాపు 12 గంటలకు పైగా పోలింగ్ కొనసాగడమే గాక 21 రోజుల పాటు స్టాండింగ్ మోడ్‌లో ఉన్నా కౌంటింగ్ రోజున తెరిచేసరికి బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎలా ఉందనేది మా ప్రశ్న. కానీ అధికారులు మేము కోరినట్లు కాకుండా కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ చేస్తామన్నారు. దీన్ని మేం వ్యతిరేకించాం. ఆ బ్యాటరీ స్టేటస్ ఇప్పుడు చూసినా 99 శాతం ఎందుకు కనిపిస్తోంది? ఉపయోగించిప్పుడు తగ్గిపోవాలే కానీ పెరగడం ఏమిటన్న ప్రశ్నకు ఎన్నికల కమిషన్ సరైన సమాధానం ఇవ్వలేకపోతోంది. ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ఈసీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని నాకు అనిపిస్తోంది. దీనిపై న్యాయపోరాటం చేయాలని యోచిస్తున్నాం.– బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ, విజయనగరంకౌంటింగ్ రోజే ప్రశ్నించాం..ఈవీఎం బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఉండటాన్ని కౌంటింగ్ రోజే మా పార్టీ ఏజెంట్లు గుర్తించారు. అధికారులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదన్నారు. జూన్ 10వ తేదీనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. పెదకాద పోలింగ్ స్టేషన్లో ఉదయం 7 నుంచి రాత్రి 8:30 గంటల వరకూ దాదాపు 1,400 ఓట్ల పోలింగ్ జరిగింది. ఈ ప్రక్రియలో బ్యాటరీ స్టేటస్ తగ్గాలి కానీ 21 రోజుల తర్వాత కౌంటింగ్ రోజు కూడా 99 శాతం ఉండటం సందేహాలకు తావిస్తోంది. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని అన్ని రాజకీయ పార్టీలూ సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ చేస్తే బ్యాటరీ స్టేటస్ 80 శాతానికి తగ్గింది. దీనిపై సందేహాలను నివత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని, అదనంగా ఈవీఎంలను కొనుగోలు చేశారని.. ఇలా పలు చర్చలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. వీటన్నింటిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం కూడా స్పందించాలి.– బొత్స అప్పలనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే, గజపతినగరంనిలిచిన ఈవీఎం పరిశీలననెల్లిమర్ల ఈవీఎం గోదాంలో ఈవీఎం పరిశీలన ప్రక్రియ నిలిచిపోయినట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రం కంట్రోల్ యూనిట్ బ్యాటరీ పవర్ పర్సంటేజ్‌ను అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అడిగారని, అయితే ఈసీఐ ప్రస్తుత టెక్నికల్ ఎస్‌వోపీలో బ్యాటరీ పర్సంటేజ్ లేదని బెల్ ఇంజనీర్లు, అధికారులు ఆయనకు తెలియజేశారని పేర్కొన్నారు. దీంతో ఆయన నిరాకరించడంతో ఈవీఎం పరిశీలన జరగలేదన్నారు. -
యూపీలో బీజేపీ వెనుకంజ అందుకే.. యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వెనుకబడడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి నమ్మకమే పార్టీ కొంప ముంచిందన్నారు. లక్నోలో ఆదివారం(జులై 14) జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో యోగి మాట్లాడారు. ‘ఎన్నికల్లో కొన్ని ఓట్లు, సీట్లు కోల్పోయాం.దీంతో గతంలో మన చేతిలో ఓడిపోయిన ప్రతిపక్షం ఎగిరెగిరి పడుతోంది. అంత మాత్రానా బీజేపీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మనమెన్నో మంచి పనులు చేశాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజల కోసం పోరాడాం. అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు పటిష్టం చేశాం. యూపీని మాఫియా రహితంగా చేశాం’అని యోగి అన్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ కేవలం 33 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ సమాజ్‌వాదీ(ఎస్పీ) 37 సీట్లు గెలుచుకుని ముందంజలో నిలిచింది. -
ఢిల్లీలో ‘ఆప్’ వల్లే ఓడాం: కాంగ్రెస్ బ్లేమ్‌గేమ్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన ఆమ్‌ఆద్మీపార్టీపై(ఆప్) బ్లేమ్‌గేమ్ ప్రారంభించింది. ఢిల్లీలో పోటీ చేసిన సీట్లలో కాంగ్రెస్ ఓడిపోవడానికి లిక్కర్ స్కామే కారణమని కాంగ్రెస్ నేత అభిషేక్‌దత్ అన్నారు. తాము గనుక ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవన్నారు.#WATCH | Delhi: Congress leader Abhishek Dutt says, "When we exposed excise scam, we demanded the then government to conduct a proper investigation. ED and CBI didn't take any action, even after 18 months of filing the case. But, just 1 month before the Lok Sabha polls, they… pic.twitter.com/9TYjbifIce— ANI (@ANI) June 29, 2024 ఢిల్లీలో నీటి సంక్షోభం వస్తే మంత్రి అతిషి చర్యలు తీసుకోవాల్సిందిపోయి నిరాహారదీక్ష పేరుతో డ్రామా చేసిందని విమర్శించారు. భారీ వర్షం పడి ఢిల్లీ స్తంభించి పోవడానికి ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మరో కాంగ్రెస్ నేత దేవేందర్‌యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు ఆప్ స్పందించింది. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతిపక్షపార్టీలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని, వాటి మధ్య చీలికలు మంచివి కావని ఆప్ నేత సౌరభ్‌భరద్వాజ్ సూచించారు. -
బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు ఏమైంది..?
ఏ పార్టీకైనా సొంతగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి అండగా ఉంటుంది. అందుకే ప్రతి పార్టీ ఓట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకుని కాపాడుకుంటూ ఉంటుంది. అధికారంలో ఉన్నపుడు తమకు అనుకూలంగా ఉన్నవర్గాలకు అవసరమైన పథకాలు అమలు చేయడం కూడా సహజమే.తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ తనకంటూ ఓట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయిందా? అధికారం కోల్పోయాక గులాబీ నేతల్లో దీనిపై అంతర్మథనం మొదలైంది. ఇంతకీ బీఆర్ఎస్కు ఓట్ బ్యాంక్ ఉందా? లేదా? ఒక రాజకీయ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవాలంటే ఆ పార్టీకి ఉన్న ఓట్ షేర్ ఎంతనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ పార్టీకి నిబద్దతతో ఓటు వేసేవారు ఎంతమంది ఉన్నారో వారినే ఓట్ బ్యాంక్‌గా భావిస్తారు. అలా ప్రజల మద్దతు ఉన్న పార్టీకే విలువ ఉంటుంది. కులం, మతం, ప్రాంతం లాంటి భావోద్వేగ అంశాల ఆధారంగా ఓటు బ్యాంక్ ఏర్పాటవుతుంది. తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి..2014 తర్వాత అసలు సిసలైన రాజకీయ పార్టీగా రూపొందిన గులాబీ పార్టీ 23 ఏళ్ళుగా అనేక ఎన్నికలను ఎదుర్కొంది. కేసీఆర్ ఆకట్టుకునే ప్రసంగాలు, రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. రెండుసార్లు అధికారాన్ని అప్పగించిన ఓటు బ్యాంకు ఇప్పుడు ఏమైందనే చర్చ జరుగుతోంది.గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 16.68 శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు వచ్చాయి. అంటే ఆరు నెలల కాలంలో గులాబీ పార్టీకి చెందిన 21 శాతం ఓట్లు దాని ప్రత్యర్థి పార్టీలకు మళ్ళాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా పొందగా..మిగిలిన ఓటర్ల మద్దతును బీజేపీ పొందింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా ఇతర పార్టీల వైపు షిఫ్ట్ అయిపోయింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హైదరాబాద్ మినహా చెరిసగం ఎంపీ సీట్లను దక్కించుకున్నాయి. దీనికి కారణం బీఆర్ఎస్కు బలమైన, సుస్ధిర ఓటు బ్యాంక్ లేకపోవమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.గులాబి బాస్ కేసీఆర్‌కు ఓటు బ్యాంక్ రాజకీయాలపై అవగాహన వుంది. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ సామాజిక వర్గం బలం చూసుకుంటే చాలా పరిమితంగా ఉంటామని ప్రాంత భావనతో అయితే ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలందరినీ ఓటు బ్యాంక్‌గా మలచుకోవచ్చని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదంతో సొంత పార్టీ స్థాపించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతీసారి తెలంగాణ సెంటిమెంట్‌ను అస్త్రంగా మలుచుకున్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో వున్న తెలంగాణ పేటెంట్‌ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి.కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంక్‌గా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం, తెలంగాణ సెంటిమెంట్ గత ఎన్నికల్లో పెద్దగా పనిచేయలేదనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ తన వ్యూహంతోనే రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. పదేళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఏ ఒక్క సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ వాదం క్రమంగా బలహీనపడటంతో ఇటీవలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.పార్టీలోను, ప్రభుత్వంలోనూ రెడ్డి సామాజికవర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఆరుగురు రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా వుంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వారంతా బీఆర్ఎస్కు షిఫ్ట్ అయ్యారు.మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపునకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీల్లోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని బలమైన సామాజిక వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటేనే పార్టీ బలపడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
అధిర్ రంజన్ చౌదరి రాజీనామా
కోల్‌కతా: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అధిర్ రంజన్ ఛౌదరి తన పదవికి శుక్రవారం(జూన్21) రాజీనామా చేశారు.పార్టీ పేలవ ప్రదర్శనకు గల కారణాలపై పీసీసీ భేటీలో సమీక్ష నిర్వహించిన అనంతరం అధిర్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా ఆమోదంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. బహరంపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 5సార్లు గెలుపొందిన అధిర్ లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరించిన ఆయన బెంగాల్లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తుపైనా పార్టీ అధిష్ఠానంతో విభేదించారు. అధీర్ తీరు రాష్ట్రంలో అధికార తృణమూల్-కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణకు కారణమైందనే వాదన ఉంది. ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకే ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. అదీర్ రాజీనామాతో మాల్దా-దక్షిణ్ నుంచి గెలుపొందిన ఇషాఖాన్ చౌధరికి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
మోదీ 3.0 కేబినెట్ తొలి భేటీ.. కీలక నిర్ణయాలివే..
సాక్షి,ఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడ్డాక తొలి కేబినెట్ భేటీ బుధవారం(జూన్18) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారు. నూనె గింజలు, పప్పులకు మద్దతు ధర ఎక్కువగా పెంచారు. కందిపప్పునకు క్వింటాలుకు 552 రూపాయల ధర పెంచగా వరి, రాగి, జొన్న , పత్తి తదితర పంటలకు నూతన మద్దతు ధర ప్రకటించారు. -
‘వయనాడ్’కు రాహుల్ రాజీనామా..?
సాక్షి,ఢిల్లీ: రాహుల్‌గాంధీ తాను గెలిచిన రెండు ఎంపీ సీట్లలో ఏ సీటును వదులుకుంటారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ సీట్ల నుంచి భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు సీట్లలో ఒకదానిని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ సీటు వదులుకుంటారనేది సోమవారం(జూన్16) సాయంత్రం జరిగే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 24 న ఎంపీల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాహుల్ ఏ సీటు వదులుకోవాలనేదానిపై పార్టీ నిర్ణయించనుంది. కాగా, రాహుల్ వ్యూహాత్మకంగా కేరళలోని వయనాడ్ సీటునే వదులుకోవచ్చని తెలుస్తోంది. -
ఈవీఎంల గుట్టు విప్పేదెవరు?
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంలు) పనితీరుపై ముసురుకుంటున్న అనుమానాలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం సాయంతో వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చని టెక్ దిగ్గజం, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని చాట్ జీపీటీ నిపుణుడైన ఆయన గట్టిగా డిమాండ్ చేయడం గమనార్హం. మరోవైపు ముంబైలో గెలుపొందిన శివసేన (షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు ఒకరు మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేసి ఆపరేట్ చేసినట్లు వెలుగులోకి రావడం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు, పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా తమ ఓట్లన్నీ ఏమయ్యాయంటూ గ్రామాలకు గ్రామాలే నిలదీస్తుండటం గమనార్హం. గెలుపొందిన అభ్యర్థులు సైతం ఊహించని స్థాయిలో మెజారిటీలు రావటంపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నా... తాము వేసిన ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తున్నా.. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని యావత్ దేశం నిలదీస్తున్నా... ఇవిగో ఈవీఎం మోసాలంటూ ఆధారాలు చూపిస్తున్నా... కేంద్ర ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకు చావండి’ అనే రీతిలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు సంబంధం లేదనే రీతిలో బాధ్యతల నుంచి ఈసీ పలాయనం చిత్తగించడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనంతరం అందులో లొసుగులు గుర్తించడంతో వాటిని నిషేధించిన దేశాల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ విధానాన్నే అనుసరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని సాధారణ ఓటర్లతోపాటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పరీక్షిస్తే కానీ ఈ రహస్యం వీడదని టెక్ నిపుణులు వాŠయ్‌ఖ్యానిస్తున్నారు. చిప్‌లోనే చిదంబర రహస్యం..! ఈవీఎంలలో ఉపయోగిస్తున్న చిప్‌లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిజ్ఞానంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సూటిగా సమాధానం చెప్పకపోవడం సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు సవాళ్లు విసురుతున్నా ఈసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈసీ చేసిన ప్రకటన మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంలలలో బ్లూటూత్ టెక్నాలజీ లాంటిది ఉండదు కాబట్టి హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఈసీ ఇటీవల వరకు వాదిస్తూ వచ్చింది. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్ చిప్‌లు ఉపయోగిస్తున్నామని, ఫ్లాష్ మెమరీ వాడకం కూడా ఉంటుందని ఈసీ ఇటీవల తొలిసారిగా అంగీకరించింది. ప్రోగ్రామబుల్ చిప్‌లు, ఫ్లాష్ మెమరీని హ్యాక్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈవీఎంలు భద్రమేనా? అంటే ఈసీ సూటిగా సమాధానం చెప్పడం లేదు. భద్రతా సందేహాస్పదమే ఈవీఎంల భద్రత, నిర్వహణపైనా నీలి నీడలు అలుముకుంటున్నాయి. నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు ఈసీ సూటిగా సమాధానాలు చెప్పడం లేదు. ఈవీఎంల నిర్వహణ విషయంలో ఎన్నో భద్రత లోపాలు, ఇతర లొసుగులు ఉన్నట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. 2017 డిసెంబరు నాటికే ఈవీఎంల చోరీ, ధ్వంసం ఉదంతాలు దాదాపు 70 వరకూ చోటు చేసుకున్నట్లు ‘ద వైర్’ ప్రచురించిన కథనం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈవీఎంలను తయారు చేసే ఎల్రక్టానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటన ప్రకారం.. ఈసీఐ కోరిన దాని కంటే 1,97,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయి. 2024 ఎన్నికల సందర్భంగా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈవీఎంలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద లభించాయి. ఇక చోరీకి గురైన ఈవీఎంలపై ఈసీ స్పందన విడ్డూరంగా ఉంది. ప్రతి ఈవీఎంకు ప్రత్యేకమైన ఐడీ ఉంటుందని, యంత్రం చోరీకి గురైనా, కనిపించకుండా పోయినా ఆ ఐడీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పేర్కొంది. తద్వారా ఆ ఈవీఎంలలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది. మరి చోరీకి గురైన యంత్రాల్లో పరికరాలను మార్చినా, ఓటింగ్ నమోదు చేసేందుకు వాడిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఇతర ఈవీఎంలతో కలిపేస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు ఈసీ మౌనం దాల్చడం గమనార్హం. ఈవీఎంలను భద్రపరుస్తున్న ప్రదేశాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉంటే వాటి ఫుటేజీని అందరికీ ఎందుకు అందుబాటులోకి ఉంచడం లేదు? అందులో ఇబ్బంది ఏమిటి? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంల భద్రత వ్యవస్థ ఎంతవరకు పటిష్టం? అనే సందేహాలున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌ల సీసీ కెమెరాల ఫుటేజీలను అన్ని పార్టీలకూ అందుబాటులో ఉంచితే పారదర్శకంగా ఉంటుంది. ఈ డిమాండ్‌పై ఈసీ కనీసం స్పందించలేదు. ఒకవైపు ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని నిపుణులు బల్లగుద్ది చెబుతుండగా సందేహాలను నివృత్తి చేయాల్సిన ఈసీ దాగుడుమూతలు ఆడటం అనుమానాలను బలపరుస్తోంది. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? దేశంలో ఏకంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించకపోడం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 60 లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకోగా వాటిలో 40 లక్షల ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు కేటాయించినట్టు ఈసీ వెల్లడించింది. మరి మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయనే ప్రశ్నకు ఇటు ఈసీగానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ జవాబు చెప్పడం లేదు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గట్టిగా డిమాండ్ చేశారు. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడినట్లు కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వైఎస్సార్ సీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు తమకు అత్యంత బలమైన స్థానాల్లో కూడా ఓడిపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీకి ఏమాత్రం బలం లేని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీల అభ్యర్థులకు అనూహ్య మెజార్టీలు వచ్చాయి. ఇక ఒడిశాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పడ్డ పాట్లన్నీ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో.. కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి వాహనంలో ఈవీఎంలు తరలిస్తున్న విషయం ఎన్నికల ముందే బయటపడింది. పిఠాపురం నియోజకవర్గంలో ఈవీఎంలను బస్సులో తరలించారు. ఓ ప్రైవేట్ వాహనంలో సైతం ఈవీఎంలు తరలించినట్లు బయటపడ్డా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే రీతిలో ఈవీఎంలను ప్రైవేట్ వ్యక్తుల పర్యవేక్షణలో తరలించినట్లు తెలుస్తోంది. అవన్నీ కనిపించకుండాపోయిన 20 లక్షల ఈవీఎంలలోనివేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదృశ్యమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో వెల్లడించాలని వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షల ఈవీఎంతోనే ఎన్నికలు నిర్వహించామని, మిగిలిన 20 లక్షల ఈవీఎంల సంగతి తమకు తెలియదంటూ ఈసీ దాటవేత వైఖరి అనుసరిస్తోంది. ఈసీ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవీఎంలను నిషేధించాలి: ప్యూర్టోరికోలో ఎన్నికల అక్రమాలపై ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలను నిషేధించాలి. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సరికాదు. వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చు. ఈ భూమ్మీద హ్యాక్ చేయలేనిది ఏదీ లేదు. సంబంధిత వార్త: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు! ఎలాగంటే..ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌లు: ఎక్స్‌లో రాహుల్‌గాందీఈవీఎంలు బ్లాక్ బాక్సులు లాంటివి. వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం తీవ్ర ఆందోళనకరం. నిషేధిస్తూ విధాన నిర్ణయాలుప్రపంచంలో మెజార్టీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, వెనిజులా తదితర దేశాల్లో మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొబైల్‌తో ఈవీఎం హ్యాకింగ్‌ఈవీఎంలు ఎంత లోపభూయిష్టమో... వాటిని ఎంత సులువుగా హ్యాక్ చేయవచ్చో బహిర్గతమైంది. ముంబై నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ‘మిడ్ డే’ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి ఎంపీగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించిన శివసేన (ఏక్నాథ్ షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ సమీప బంధువు మంగేశ్ పండిల్కర్ తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 4న ముంబైలోని నెస్కో సెంటర్లో నిర్వహించారు. ఎంపీ బంధువు మంగేశ్ పండిల్కర్ ఈ సందర్భంగా తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓటీపీ జనరేట్ చేయడం ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేయడం గమనార్హం. మొదట్లో శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) అభ్యర్థి అమోల్ సంజన కీర్తికర్ కంటే వెనుకబడిన రవీంద్ర వైకర్ అనూహ్యంగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం, అదే ఫోన్ ద్వారా శివసేన (ఏక్నాథ్ షిండే) అభ్యర్థి పలువురితో మంతనాలు జరపడంపై ముంబై పోలీసులు ఈ నెల 14న కేసు నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేశారు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. అయితే మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేశారన్న మిడ్ డే పత్రిక కథనాన్ని ఎన్నికల కమిషన్ ఖండించింది. -
మోదీ వల్లే గెలిచాం: పవార్ సెటైర్లు
ముంబై: ప్రధాని మోదీకి ఎన్సీపీ(శరద్‌చంద్రపవార్) నేత శరద్‌పవార్ కృతజ్ఞతలు తెలిపారు. మహావికాస్అఘాడీ(ఎమ్వీఏ) నేతలు ఉద్థవ్ థాక్రే, పృథ్విరాజ్ చవాన్లతో కలిసి పవార్ శనివారం(జూన్15) ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మహారాష్ట్రలో చేసిన ప్రచారంపై పవార్ సెటైర్లు వేశారు. మోదీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ప్రతి చోట ఎంవీఏ ఘన విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. ‘ఎక్కడైతే ప్రధాని రోడ్‌షోలు చేశారో అక్కడ మేం గెలిచాం. ఇందుకే ప్రధానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది నా బాధ్యత. ఎన్డీఏను గట్టి దెబ్బ కొట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి’ అని పవార్ అన్నారు.తిరిగి తన మేనల్లుడు, ఎన్సీపీ అధినేత అజిత్‌పవార్‌తో కలిసే అవకాశం లేదని శరద్‌పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల పంపకంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఉద్ధవ్, చవాన్ తెలిపారు.కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కంటే కాంగ్రెస్,ఎన్సీపీ(శరద్‌పవార్), శివసేన(ఉద్ధవ్) పార్టీల కూటమే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. -
2024 ఎన్నికలు: ఒక అడుగు వెనక్కి
నూతనంగా కొలువుదీరిన 18వ లోక్‌సభలో 469 మంది పురుషులతో పాటు కేవలం 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతం. ఈ వాటా 2019లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. లోక్‌సభ, శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారతదేశం ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి. స్థానిక స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తరించే విషయంలో భారతదేశం ముందుండి నడిపించింది. రాష్ట్ర, జాతీయ స్థాయులలోని అంతరాలను పరిష్కరించడంలో కూడా మనం ఇదే విధమైన నిబద్ధతను ప్రదర్శించాలి.2024 లోక్‌సభ ఎన్నికలు ఆధునిక భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన పోకడను సూచిస్తాయి. దీనిపై విశ్లేషించడానికి, వేడుక జరుపుకోవడానికి చాలా ఉంది కానీ, ఒక రంగంలో మాత్రం మనం ఒక అడుగు వెనక్కి వేశాం. 18వ లోక్‌సభలో 469 మంది పురుషులతో పాటు 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. 74 మందితో కూడిన ఈ మహిళా బృందంలో కచ్చితంగానే అనేక మంది శక్తిమంతమైన, చిత్తశుద్ధిగల, కష్టపడి పనిచేయగల ప్రజాప్రతినిధులు ఉన్నారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతంగా మాత్రమే ఉన్నారు. ఈ వాటా దారుణంగా వక్రంగా ఉండటమే కాకుండా, 2019 ఎన్నికల్లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం.2024 ఎన్నికలు జరిగిన సందర్భాన్ని పరిశీలిస్తే, మహిళా పార్లమెంటరీ ప్రాతినిధ్యం చెప్పుకోదగ్గ అభివృద్ధిని నమోదు చేసి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారతదేశం ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి. ఈ బిల్లు అమలులోకి వచ్చాక మహిళల సీట్లు వారికే కేటాయించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ సరిపోదు!గత ఏడాది పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినప్పుడు, అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును తెలియజేయడమే కాకుండా, ఈ చారిత్రాత్మక పరిణామంలో తమకూ పాత్ర ఉందని ప్రకటించుకున్నాయి. పైగా, ఈ ఎన్నికల్లో మహిళలు ముఖ్యమైన ఓటర్లుగా ఉన్నారు. పార్టీల మేనిఫెస్టోలు, అగ్ర నాయకుల ప్రచార ప్రసంగాల నుండి మహిళల ఓటింగ్ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం వరకు, సుదీర్ఘకాలం సాగిన ఎన్నికల సీజన్లో భారతీయ మహిళ చాలా స్పష్టంగా (కొంతవరకు సమస్యాత్మకంగా) తన ఉనికిని కలిగి ఉంది.అయితే ఈ ఊహాగానంలో మహిళలు ఓటర్లు, లబ్ధిదారుల పాత్రకే పరిమితమయ్యారు, రాజకీయ సోపానక్రమాలలో సమానమైన భాగస్వామ్యానికి అర్హులైన మహిళా నాయకులు, ప్రతినిధులు లేకుండాపోయారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంకలనం చేసిన డేటా ప్రకారం, ఈ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో 9.6 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు (పార్టీ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థుల్లో మహిళలు 11 శాతం మంది). అభ్యర్థులలో మహిళల వాటా తొమ్మిది శాతంగా ఉన్న 2019 సంవత్సరం నుండి చూస్తే ఇది చాలా కొద్ది మెరుగుదల మాత్రమే అని చెప్పాలి. పైగా పుండుపై కారం జల్లినట్టుగా, ఎన్నికల్లో పోటీ చేసిన అనేక మంది మహిళలు తమ తోటివారి నుండి స్త్రీద్వేష వ్యాఖ్యలను, అపహాస్యాన్ని ఎదుర్కొన్నారు.ఈ విధంగా కొద్ది మంది మహిళలే ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎన్నికైనవారిలో వారి ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పార్లమెంట్లు పురుషుల ఆధిపత్యంలో కొనసాగుతున్నప్పటికీ, భారతదేశం దాని సహచర పార్లమెంట్ల కంటే చాలా వెనుకబడి ఉంది. ఉదాహరణకు, 2023లో, ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించాయి. వీటిలో సగటున, 27.6 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని, ఇంటర్–పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) డేటా చెబుతోంది. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా, ప్రస్తుతం ఉన్న మొత్తం ఎంపీలలో మహిళలు 26.9 శాతం ఉన్నారు. 18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఐపీయూ డేటా ప్రకారం, ఈ పరామితిలో మొత్తం 185 దేశాలలో భారతదేశం 143వ స్థానంలో ఉంది. కొత్త పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యంలో తగ్గుదల నమోదైన నేపథ్యంలో, మన దేశ ర్యాంకింగ్ మరో ఐదు లేదా ఆరు స్థానాలు పడిపోయే అవకాశం ఉంది.మెక్సికో నుండి ఒక ఉదాహరణభారతదేశంలో ఎన్నికల లెక్కింపు జరగడానికి ఒక రోజు ముందు, ప్రపంచంలోని మరొక భిన్నమైన ప్రాంతంలో మరో చారిత్రక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వివిధ రాజ్యాంగ పదవులకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి మెక్సికోలో సాధారణ ఎన్నికలు జరిగాయి. అక్కడ క్లాడియా షీన్బామ్ అత్యున్నత పదవికి చక్కటి మెజారిటీతో ఎన్నికయ్యారు. మెక్సికో అధ్యక్షురాలిగా ఒక మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. కానీ పురుషులకే పరిమితమైన దుర్బేధ్యమైన కంచుకోట బద్దలవడం ఒక ఉల్లంఘన కాదు, మెక్సికో తన రాజకీయాలను మరింత ప్రాతినిధ్యంగా మార్చే ప్రయాణంలో ఇదొక తార్కికమైన తదుపరి దశ మాత్రమే.గత కొన్ని దశాబ్దాలుగా, అట్టడుగు స్త్రీవాద ఉద్యమాల ద్వారా ముందుకు సాగిన మెక్సికో, తన రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడమే కాకుండా లింగ సమానత్వాన్ని నిర్ధారించడానికి చట్టబద్ధమైన సంస్కరణల సమితిని ప్రవేశపెట్టింది; అమలు చేసింది కూడా. చట్టం ప్రకారం ప్రతిదానిలో, అంటే ప్రభుత్వంలోని అన్ని రంగాలలో సమానత్వం అవసరం. అలాగే ఎన్నికలలో లింగ సమానత్వంతో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ఉంచాలని ఆదేశించింది. ఈ సంస్కరణల ఫలితంగా, మెక్సికో అనేక ముఖ్యమైన రాజకీయ ఉన్నత పదవులను ఆక్రమించిన మహిళలతో పాటు, దాని పార్లమెంటు ఉభయ సభలలో స్త్రీ పురుష సమానత్వాన్ని కలిగి ఉంది. 2024లో, అధ్యక్ష పదవికి పోటీ చేసిన మొదటి ఇద్దరు అభ్యర్థులు మహిళలు కావడం, ఆ దేశ చరిత్రలో దేనితోనూ పోల్చలేని అరుదైన పరిణామం.అయినంతమాత్రాన మెక్సికోలో సమస్యలు లేవని చెప్పలేం. అక్కడ రాజకీయ, లింగ ఆధారిత హింస తీవ్రమైన సమస్యగా ఉంది. అయితే లింగ నిర్ధారిత నిబంధనలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకమైన, ఆలోచనాత్మకమైన సంస్కరణల ద్వారా పురోగతి సాధ్యమవుతుందని ఇది చూపిస్తోంది. అనేక ఇతర దేశాలు కూడా తమ రాజకీయాలను, పార్లమెంట్లను మరింత ప్రాతినిధ్యంగా ఉంచుతూ, సమానంగా మహిళలను కలుపుకుపోయేలా, లింగపరమైన సున్నితత్వంతో మలచడానికి చిన్న, పెద్ద రెండు చర్యలనూ తీసుకున్నాయి.మనమందరం బాధ్యులమే!స్థానిక స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తరించే విషయంలో భారతదేశం ముందుండి నడిపించింది. రాష్ట్ర, జాతీయ స్థాయులలోని అంతరాలను పరిష్కరించడంలో మనం ఇదే విధమైన నిబద్ధతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి ఎగువ నుండి సంస్కరణ అవసరం. కానీ పురోగతిని నిర్ధారించే అంతిమ బాధ్యత మన రాజకీయ పార్టీల భుజాలపైనే ఉంటుంది. మహిళా ప్రాతినిధ్యంలో ఈ పతనాన్ని చిన్నవిషయంగా చూడకూడదు. మహిళల (ప్రత్యేకించి సాంప్రదాయకంగా అట్టడుగున ఉన్న సమూహాల) భాగస్వామ్యాన్ని ప్రారంభించే విషయానికి వస్తే, పురోగతి చాలా అరుదుగా సరళంగా ఉంటుంది. పైగా దానికి ఎప్పుడూ హామీ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయంలో శాశ్వతమైన జాగరూకత చాలా అవసరం. అలాగే మనం అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలి.అక్షీ చావ్లా వ్యాసకర్త పరిశోధకురాలు, అశోకా యూనివర్సిటీలోని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్’(సీఈడీఏ)లో పనిచేస్తున్నారు -
‘‘వయనాడ్, రాయ్‌బరేలీలో ఏది వదులుకోవాలి’’
తిరువనంతపురం: వయనాడ్, రాయ్‌బరేలీలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తెలియడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. బుధవారం(జూన్12) కేరళలోని మల్లప్పురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ‘నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ.. వయనాడ్, రాయ్‌బరేలీల్లో ఒక నియోజకవర్గానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’అని రాహుల్ వ్యాఖ్యానించారు. రెండింటిలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలనే అంశంపై రాహుల్ పార్టీ పెద్దలకు ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. ఎంపీగా రెండు చోట్ల విజయం సాధించిన అనంతరం తొలిసారి బుధవారం కేరళలో రాహుల్ పర్యటించారు. -
ఉద్ధవ్ థాక్రే నష్టపోయారు: బీజేపీ నేత కీలక కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ వైఖరి మారుతోందా.. పాత మిత్రుడు ఉద్ధవ్ థాక్రేపై బీజేపీకి సాఫ్ట్ కార్నర్ పెరుగుతోందా.. ఉద్ధవ్‌తో కలిసి వెళితేనే త్వరలో రానున్నమరాఠా అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అవుతామని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ కష్టం వల్లే కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీలకు మహారాష్ట్రలో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయని బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ మంగళవారం(జూన్11) వ్యాఖ్యానించారు. ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ ఉద్ధవ్ ఇండియా కూటమి కోసం కష్టపడ్డారని ప్రశంసించారు.గతంలో ఉద్ధవ్ బీజేపీతో ఉన్నప్పుడు 18 ఎంపీ సీట్లు గెలుచుకుని ఇప్పుడు కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారని గుర్తు చేశారు. కాగా, ప్రస్తతం కేంద్రంలోని మోదీ3.0 ప్రభుత్వంలో చేరాల్సిందిగా బీజేపీ నేతలు ఉద్ధవ్ థాక్రేను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. -
వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే.. రాహుల్ సంచలన కామెంట్స్
లక్నో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చెల్లి ప్రియాంక గాంధీ గనుక తన మాట విని వారణాసిలో ప్రధానిమోదీపై పోటీ చేసి ఉంటే భారీ మెజార్టీతో గెలిచి ఉండేదన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో మంగళవారం(జూన్11) నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారణాసిలో ప్రధానమంత్రికి చావుతప్పి కన్నులొట్టబోయింది. నా చెల్లి ప్రియాంక నా మాట విని ఉంటే ఆమె చేతిలో వారణాసిలో మోదీ 2నుంచి3 లక్షల మెజార్టీతో ఓడిపోయేవారు.బీజేపీతో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఉందని ప్రజలు తెలుసుకోవడం వల్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడింది.’అని రాహుల్ అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్‌కు సహకారం అందించాడని చెప్పారు. గతంలోలా పొత్తుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్నామని చెప్పారు. -
ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
న్యూఢిల్లీ: ఒడిశా సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒడిశా బీజేపీ కీలక నేత మాజీ కేంద్ర మంత్రి నేత ధర్మేంద్ర ప్రదాన్‌కు మోదీ3.0 కేబినెట్లో మళ్లీ బెర్త్ దక్కింది. దీంతో సీఎం రేసు నుంచి ఆయన తప్పుకున్నట్లయింది. మిగిలిన సీనియర్ నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు.సీఎం ఎవరనేది తేల్చడానికి బీజేపీ హైకమాండ్ ఇద్దరు అగ్రనేతలను సోమవారం(జూన్10) పరిశీలకులుగా నియమించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు భూపేందర్‌యాదవ్‌కు ఈ పని అప్పగించింది. 11న భువనేశ్వర్‌లో ఒడిషా బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 12న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారని ఒడిషా బీజేపీ ఇంఛార్జ్ విజయ్‌పాల్‌సింగ్ తోమర్ తెలిపారు. సీఎం పదవి రేసులో బ్రజరాజ్‌నగర్ ఎమ్మెల్యే సురేష్ పూజారీ, బీజేపీ స్టేట్ చీఫ్ మన్మోహన్ సమాల్‌తో పాటు సీనియర్ నేతలు కేవీ సింగ్, మోహన్ మాజీలు ఇప్పటివరకు ముందున్నారు. కాగా, రాష్ట్రంలోని 21 ఎంపీ సీట్లలోనూ బీజేపీ 20 గెలుచుకుంది. వరుసగా 24 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బిజూజనతాదల్‌ను మట్టి కరిపించి బీజేపీ ఒడిశా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. -
ఒడిశా: పాలిటిక్స్‌కు వీకే పాండియన్ గుడ్‌బై
భువనేశ్వర్: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్ భావోద్వేగానికి గురయ్యారు. -
యూపీలో కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర
లక్నో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అధికారం ఇవ్వకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇండియా కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని యూపీలో బరిలోకి దిగిన హస్తం పార్టీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరించింది. సమాజ్‌వాదీ పార్టీతో కలిసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని దెబ్బ తీసింది. దీంతో యూపీలో ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమి తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయోత్సాహంతో యూపీలో జూన్11నుంచి15 దాకా ధన్యవాద్ యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర జరగనున్నట్లు తెలిపింది. పార్టీ సీనియర్ నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా సమాజాంలోని పలు వర్గాలకు చెందిన వారికి రాజ్యాంగం కాపీలను బహుకరించనున్నారు. -
ఎన్డీఏ,‘ఇండియా’ టఫ్ ఫైట్ .. వేలు కోసుకున్న యువకుడు
రాయ్‌పూర్: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడడం సాధారణమే. అయితే ఆయా పార్టీల కరుడుగట్టిన ఫ్యాన్స్‌కు మాత్రం గెలుపు ఓటములను అంత ఈజీగా తీసుకోరు. ఇలాంటి కోవకే చెందిన బీజేపీ అభిమాని ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో తన వేలును కోసి దుర్గామాతకు సమర్పించుకున్నాడు.బలరాంపూర్‌కు చెందిన దుర్గేష్‌పాండే బీజేపీ అభిమాని. జూన్4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో లీడ్‌లోకి రాలేదు. ఒక దశలో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన దుర్గేష్ పాండే ఫలితాలు చూడడం ఆపేసి దగ్గర్లోని ఖాళీ మాత గుడికి వెళ్లి మొక్కుకుని వచ్చాడు. చివర్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆనందంతో గుడికి వెళ్లి తన వేలును కోసి ఖాళీ మాతకు సమర్పించుకున్నాడు. గాయం తీవ్రమవడంతో దుర్గేష్ కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వేలు తెగిపోయి అప్పటికే ఆలస్యమవడంతో డాక్టర్లు దానిని తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేష్ ఆరోగ్యం స్థిరంగా ఉంది.ఫలితాల ఆరంభంలో కాంగ్రెస్‌కు లీడ్ రావడంతో తట్టుకోలేకపోయానని, అందుకే ఖాళీ మాతకు మొక్కుకుని, ఎన్డీఏ గెలిచాక మొక్కు తీర్చుకున్నానని దుర్గేష్ చెప్పాడు. ఎన్డీఏకు 400 సీట్లు వస్తే ఇంకా ఆనందపడేవాడినన్నాడు. -
అమాత్య పదవిపై ఆశలు!
కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు అమాత్య పదవులపై కన్నేశారు. మంత్రి పీఠం ఎక్కేందుకు ముచ్చటపడుతున్నారు. దర్జాగా బుగ్గ కారులో తిరిగాలని ఆశపడుతున్నారు. నూతనంగా ఏర్పాటవుతున్న కూటమి ప్రభుత్వంలో అధికారం అనుభవించాలని తహతహలాడుతున్నారు. కేబినెట్లో చోటు దక్కించుకుని పరిపాలనలో భాగస్వాములు కావాలని ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని పలువురు ఆశవహులు తమ అధినేతల ముందు ప్రతిపాదనలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సర్కారులో ఉన్నత స్థానం పొందేందుకు చిత్తూరు ఎంపీ సైతం పోటీపడుతున్నారు.సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. కూటమి గెలుపొందింది. త్వరలోనే కేబినెట్ కూర్పు జరగనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతోపాటు కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ జాబితాలో ఎవరికి చోటు లభిస్తుందనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే కుప్పం నుంచి గెలుపొందిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపడుతారు. మంత్రి పదవులకు వచ్చేసరికి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డికే ఎక్కువ అవకాశం ఉంది. జిల్లాలోనే సీనియర్ కావడం, గతంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం, చంద్రబాబు, లోకేష్‌తో మంచి సంబంధాలు ఉండడం ఆయనకు కలిసిరానున్నట్లు సమాచారం. ఓసీ కోటా కింద ఒకరికి ఇవ్వాల్సి వచ్చినా.. చిత్తూరు జిల్లా నుంచి అమరనాథ్‌రెడ్డికే ఛాన్స్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఓసీలకు అవకాశం లేదంటే.. ఎస్సీ ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు పూతలపట్టు నుంచి గెలుపొందిన మురళీమోహన్, మరొకరు గంగాధరనెల్లూరు ఎమ్మె ల్యే థామస్. ఈ ఇద్దరిలో మురళీమోహన్కి మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కావడమే అందుకు కారణం . నగరి, చిత్తూరు ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్, జగన్మోహన్కి మంత్రి పదవి అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు.తిరుపతి జిల్లా జాబితా పెద్దదేజిల్లాలో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో మొదటి సారి గెలుపొందిన వారి జాబితాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా విజయశ్రీ ఉన్నారు. మహిళల కోటా కింద మంత్రి పదవి వరిస్తే.. విజయశ్రీకే అవకాశాలు ఉన్నాయి. బొజ్జల సుధీర్‌రెడ్డి విషయానికి వస్తే.. తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్‌ని దింపేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఆ కోణంలో ఆలోచిస్తే బొజ్జల సుధీర్‌రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశముంది. సీనియర్లకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఉన్నారు. ఈ ముగ్గురిలో సీనియర్ కురుగొండ్ల రామకృష్ణ. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. సీనియర్ల జాబితాలో ఇస్తే గిస్తే వెంకటగిరి ఎమ్మెల్యేనే మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఎస్సీ కోటా కింద మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే.. ఆదిమూలం లేదా పాశం సునీల్‌కుమార్.. వీరిలో ఎవరికో ఒకరికి మంత్రి వర్గంలో స్థానం దక్కవచ్చు.జనసేన కోటాలో ఆరణికి అవకాశంకూటమిలో జనసేన పాత్ర కీలకం. ఈ కూటమి ఏర్పడడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కారణం. బీజేపీని ఒప్పించి టీడీపీతో జట్టు కట్టించారు. ఈ మూడు పార్టీలు ఏకమవడంతోనే అధికారం దక్కించుకున్నారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో జనసేన నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండో సారి ఎమ్మెల్యే కావడం కూడా ఆయనకు కలిసి రానుంది.కేంద్ర మంత్రి పదవిపైనా కన్ను!చిత్తూరు ఎంపీగా గెలుపొందిన దగ్గుమళ్ల ప్రసాద్‌రావు కేంద్ర మంత్రి పదవిపై కన్నేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యం కావడంతో ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన ఇప్పటికే చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. -
‘మోదీ మూడో టర్ము’.. భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు
రాయ్‌పూర్: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంపై ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్‌పూర్‌లో శుక్రవారం(జూన్7) జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బగేల్ మాట్లాడారు. ‘లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రావొచ్చని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బగేల్ పిలుపునిచ్చారు. ‘పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలలు లేదా ఏడాదిలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు. యోగి ఆదిత్యనాథ్ కుర్చీ కదులుతోంది. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ కుర్చీ ఊగుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్ ఇప్పటికే రాజీనామా చేస్తానంటున్నారు’అని బగేల్ ఎద్దేవా చేశారు. -
ఎన్నికల కోడ్ ముగిసింది: ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రవర్తనావళి గడువు ముగిసింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కమిషన్ గురువారం పంపిన ఒక సర్క్యులర్‌లో ఈ విషయం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెల్సిందే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఎత్తివేత నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటింది. లోక్‌సభతోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరపడంతోపాటు అధికార పార్టీలు, ప్రభుత్వాలు అధికార దుర్వినియోగాన్ని నివారించే లక్ష్యంతో దేశంలో 1960 నుంచి ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. -
ECI: పోలింగ్ 65.79 శాతం
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 65.79 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్లను ఇంకా ఇందులో కలపని కారణంగా తుది పోలింగ్ శాతంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించడం తెల్సిందే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 67.40 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలనాటికి దేశవ్యాప్తంగా 91.20 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆనాడు వారిలో 61.50 కోట్ల మంది మాత్రమే ఓటేశారు. ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లకు పెరగడం విశేషం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విడివిడిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, మొత్తంగా ఓటింగ్ శాతాల సమగ్ర వివరాలు తమకు అందాక అందరికీ అందుబాటులోకి తెస్తామని ఈసీ గురువారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. -
మోదీ 3.0.. చిరాగ్‌కు కేబినెట్ బెర్త్ ?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ, జేడీయూలతో పాటు లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్) కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. పోటీ చేసిన ఐదుకు ఐదు సీట్లను గెలుచుకుని ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటడంలో తన వంతు పాత్ర పోషించింది. దీంతో ఎల్జేపీ(రాంవిలాస్) పార్టీ అధినేత చిరాగ్, తన తండ్రి దివంగత ఎల్జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్‌కు అసలు సిసలైన రాజకీయ వారసుడిగా అవతరించారని ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చిరాగ్పాశ్వాన్కు ఒక కేబినెట్ బెర్త్‌తో పాటు బిహార్ రాష్ట్ర కేబినెట్లో పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయనకు ఇప్పటికే బీజేపీ పెద్దలు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనిపై మాట్లాడడానికి చిరాగ్ పాశ్వాన్ నిరాకరించారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది పూర్తిగా ప్రధాని మోదీ నిర్ణయమని చెప్పారు. -
చంద్రబాబు, నితీశ్‌కు అందరూ స్నేహితులే: సంజయ్‌రౌత్
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏలో కీలకంగా మారిన నితీశ్‌కుమార్, చంద్రబాబులపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో జరిపే భేటీకి సంజయ్‌రౌత్ బయలుదేరారు. సందర్భంగా రౌత్ మీడియాతో మాట్లాడారు.‘బీజేపీకి మెజారిటీ ఎక్కడుంది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, నితీశ్‌కుమార్ అందరికీ స్నేహితులే.ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసేవారికి వారు మద్దతిస్తారని నేను అనుకోను. అయితే ఎన్నికలకు ముందే వారు బీజేపీతో కలిసి పోటీ చేసినందున వారు ఎన్డీఏ సంకీర్ణంలో కొనసాగే అవకాశాలే ఉన్నాయిసంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే శక్తి మోదీకి లేదు. ఆయన ఇంకా తన వైఖరినీ వీడలేదు. మోదీ సర్కార్, మోదీగ్యారెంటీ అని మాట్లాడుతున్నారు’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. -
రాముడు వచ్చాడు.. న్యాయం చేశాడు: అభిషేక్ బెనర్జీ సెటైర్లు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీపై సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకబడడంపై ఆయన బుధవారం(జూన్5) స్పందించారు. ‘రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు ’అని బీజేపీని ఉద్దేశించి సెటైర్ వేశారు.‘బీజేపీపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్నది ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తోంది. అయితే ఎంత మార్జిన్‌తో వాళ్లు వెనుకబడ్డారన్నదానిపై నేను మాట్లాడను. బీజేపీ సెట్ చేసిన రామమందిరం ఎజెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి చేరింది.అయితే మేమంతా రామ మందిరం నిర్మిస్తే రాముని ప్రతిష్టాపన బీజేపీ ఎలా చేస్తుందని వారంతా అడుగుతున్నారు. ఒక మనిషి దేవుని ప్రతిష్ట చేయొచ్చా. ఎవరికైనా అంత శక్తి ఉందా. ఎక్కడైతే వాళ్లు రాముని ప్రతిష్ట చేశారో అక్కడే అయోధ్యలో వాళ్లు ఓడిపోయారు. రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు’అని అభిషేక్ బెనర్జీ అన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్‌బెంగాల్‌లో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ హవానే కొనసాగడం గమనార్హం. బెంగాల్లో తృణమూల్‌కు 29 ఎంపీ సీట్లు రాగా బీజేపీకి 12, కాంగ్రెస్‌కు ఒకటి వచ్చాయి. -
ప్రధాని పదవికి మోదీ రాజీనామా
న్యూఢిల్లీ: మోదీ 2.0 కేబినెట్ చివరి సమావేశం ఢిల్లీలో ముగిసింది. 17వ లోక్‌సభను రద్దు చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రధాన పదవికి రాజీనామా లేఖతో పాటు 17వ లోక్‌సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందించారు.ఈ నెల 7న జరిగే బీజేపీ,ఎన్డీఏ సమావేశంలో మోదీని నేతగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 8న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు కేబినెట్ భేటీలో ఎన్డీఏ 3.0 ప్రభుత్వ ఏర్పాటుపైనా చర్చించిట్లు తెలుస్తోంది. కాగా, ఇవాళ సాయంత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల భేటీ కూడా జరగనుంది. ఈ భేటీలో కొత్త ప్రభుత్వ కూర్పు, ఫ్రెండ్లీ పార్టీలకు మంత్రిపదవులు, ప్రభుత్వ కామన్ ఎజెండా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. -
దాతల సాయంతో గెలుపు.. కాంగ్రెస్ అభ్యర్థి భావోద్వేగం
అహ్మదాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొందరికి విజయాన్ని మరికొందరికి అపజయాన్ని మిగిల్చాయి. అయితే విజయం కొందరిని అంతులేని ఆనందాన్ని ఇవ్వడంతో పాటు భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇందుకు గుజరాత్ బనస్కాంతా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి గెనిబెన్ థాకూర్ గెలుపే నిదర్శనం.తాను గెలిచినట్లు తెలియగానే థాకూర్ కౌంటింగ్ సెంటర్ వద్ద తీవ్ర భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఆమె తనవారిని పట్టుకుని ఏడ్చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం ఒకటి. ఇదే కాకుండా ఈమె తన ఎన్నికల ప్రచారానికి కావాల్సిన నిధులను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా దాతల నుంచి సేకరించం మరొకటి. ఏది ఏమైనా కొందరికి ఎన్నికల్లో గెలుపు సాధారణమే అయినప్పటికీ గెనిబెన్ లాంటి వాళ్లకు మాత్రం విజయం అసాధారణమనే చెప్పొచ్చు. Geniben Thakor of Congress won historic seat in Banaskantha, Gujarat. She had to crowdsource funds to contest.Such stories needs to be cherished. pic.twitter.com/MvZtlxtmqK— Nehr_who? (@Nher_who) June 4, 2024 -
కీలక రాష్ట్రాల్లో ’ఇండియా‘కు అనూహ్య లీడ్
న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రస్తుత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మంగళవారం 12 గంటల వరకు వెలువడ్డ ఫలితాలు బీజేపీకి కొంత మేర నిరాశ కలిగించినట్లు కనిపిస్తోంది. భారీ విజయం సాధిస్తామనుకున్న వారి ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఈసారి సొంతగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటడం బీజేపీకి అంత సులువుకాదని ఫలితాల సరళిని పరిశీలిస్తే తెలుస్తోంది. ఇప్పటివరకు ఫలితాల్లో బీజేపీ సొంతగా 238 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ సొంతగా 95 స్థానాల్లో, ఇండియా కూటమి 230 సీట్లలో లీడ్‌లో కొనసాగుతోంది. ఇతరులు 21 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఎన్డీఏ,ఇండియా కూటముల వారిగా చూసుకుంటే ఎన్డీఏ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 272 దాటేసింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీలు బీజేపీ దూకుడుకు కళ్లెం వేశాయి. యూపీలో ఇండియా కూటమి 42, మహారాష్ట్రలో 28, తమిళనాడు 37, కేరళ 17 సీట్లలో లీడ్‌లో కొనసాగుతూ ఎన్డీఏ కూటమిపై ఆధిక్యాన్ని ప్రదిర్శిస్తోంది. పశ్చిమబెంగాల్లో టీఎంసీ బీజేపీపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక్కడ బీజేపీకి ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదు. కాగా, జాతీయ స్థాయిలో బీజేపీ, ఎన్డీఏలకు భారీ మెజారిటీ వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాస్త తప్పినట్లు తెలుస్తోంది. -
ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ!
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార బిజూ జనతాదల్ (బీజేడీ) ఆధిక్యానికి చెక్ పడేలా కనిపిస్తోంది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది.సుదీర్ఘ కాలంగా పవర్లో ఉన్న బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో తాజా ఫలితాల ప్రకారం బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. మరోవైపు అధికార బీజేడీ మూడు పదుల సీట్లతో రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. -
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీనియర్ సిటిజన్లు, మహిళలకు సెల్యూట్: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్(లేచి చప్పట్లు కొట్టడం) ఇచ్చారు ఈసీ సభ్యులు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇవాళ సీఈసీ రాజీవ్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన సీనియర్ సిటిజన్స్, మహిళలకు తాము సెల్యూట్ చేస్తున్నామని కేంద్రం ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ క్రమంలో ప్రెస్‌మీట్‌లోనే ఆయన ఓటర్లకు స్టాండింగ్ ఓయేషన్ ఇచ్చారు. #WATCH | Delhi | Election Commission of India gives a standing ovation to all voters who took part in Lok Sabha elections 2024 pic.twitter.com/iwIfNd58LV— ANI (@ANI) June 3, 2024 ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 642 మిలియన్ల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఓటింగ్‌లో భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మన దేశంలో 31 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య.. జీ-7 దేశాల జనాభాకు ఒకటిన్నర రేట్లు ఎక్కువ. జమ్మూ కశ్మీర్లో నాలుగు దశాబ్ధాల్లో జరగనంత పోలింగ్ జరిగింది. #WATCH | Delhi | "This is one of the General Elections where we have not seen violence. This required two years of preparation," says CEC Rajiv Kumar on Lok Sabha elections. pic.twitter.com/HL8o0aQvAz— ANI (@ANI) June 3, 2024 పోలింగ్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. కేవలం రెండు రాష్ట్రాల్లోనే 39 ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడే రీపోలింగ్ అవసరముందన్నారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారాయన. -
ప్యాసింజర్ వాహనాలు.. స్లో
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహన హోల్‌సేల్ అమ్మకాలు గత నెల(మే)లో మందగించాయి. కంపెనీల నుంచి డీలర్లకు సగటున వాహన పంపిణీ(హోల్‌సేల్) 4 శాతమే పుంజుకుంది. మొత్తం 3,50,257 యూనిట్లకు చేరాయి. ఏడాది క్రితం(2023) ఇదే నెలలో హోల్‌సేల్ అమ్మకాలు 3,35,436 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ నీరసించడం, అంతక్రితం అధిక వృద్ధి నమోదుకావడం(బేస్ ఎఫెక్ట్) కారణమయ్యాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీ అమ్మకాలు నామమాత్రంగా పెరిగి 1,44,002 యూనిట్లను తాకాయి. గతేడాది మే నెలలో 1,43,708 వాహనాలు విక్రయించింది. ఎంట్రీలెవల్(చిన్న కార్లు), కాంపాక్ట్ కార్ల అమ్మకాలు వెనకడుగు వేశాయి. వీటి అమ్మకాలు 12,236 యూనిట్ల నుంచి 9,902కు తగ్గాయి. అయితే యుటిలిటీ వాహనాలు బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎరి్టగా, ఎస్‌క్రాస్, ఎక్స్ఎల్6 విక్రయాలు 46,243 యూనిట్ల నుంచి 54,204కు ఎగశాయి. చిన్నకార్ల విభాగానికి దన్నునిచ్చేందుకు ఆల్టో కే10, ఎస్ప్రెస్సో, సెలెరియో మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్ధో బెనర్జీ పేర్కొన్నారు. ఇతర దిగ్గజాల తీరిలా..⇥ హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 49,151 వాహనాలకు చేరింది. 2023 మే నెలలో 48,601 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల మందగమనం కొనసాగవచ్చని భావిస్తున్నట్లు కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ అంచనా వేశారు. ⇥ ఎలక్ట్రిక్ వాహనాలుసహా ఇతర ప్యాసిజంర్ వాహన అమ్మకాలు దేశీయంగా 2 శాతం బలపడి 47,705కు చేరినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. గతంలో 45,984 యూనిట్లు విక్రయించింది. ⇥ మహీంద్రా అండ్ మహీంద్రా వాహన విక్రయాలు 31 శాతం జంప్‌చేశాయి. 43,218 యూ నిట్లను తాకాయి. 2023 మే నెలలో 32,886 వాహనాలు మాత్రమే డీలర్లకు పంపిణీ చేసింది. ⇥ టయోటా కిర్లోస్కర్ సైతం గత నెలలో హోల్‌సేల్‌గా 24 శాతం వృద్ధితో మొత్తం 25,273 వాహన విక్రయాలను సాధించింది. ⇥ కియా ఇండియా 4 శాతం అధికంగా 19,500 యూనిట్లను డీలర్లకు పంపిణీ చేసింది. గతేడాది మే నెలలో 18,766 వాహనాలు విక్రయించింది. ఈ ఏడాది పోటీకి అనుగుణంగా పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ సీనియర్ వీపీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. ⇥ ఎంజీ మోటార్ ఇండియా వాహన హోల్‌సేల్ అమ్మకాలు గత నెలలో 5 శాతం క్షీణించి 4,769 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2023 మే నెలలో డీలర్లకు 5,006 వాహనాలు పంపిణీ చేసింది. -
వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది: అబ్బయ్య చౌదరి
సాక్షి,ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని, ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ చేయబోతోందని దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారి అబ్బయ్య చౌదరి అన్నారు. ఏ ఎగ్జిట్ పోల్స్ చూసినా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతోందని స్పష్టం చేశారు.‘నేషనల్ మీడియా సంస్థలన్నీ కేంద్రానికి భయపడి తల తోక లేని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయి. గత ఐదేళ్లలో జగన్మోహన్రెడ్డి మంచి చేశారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ వైసీపీకి అధికారం కట్టబెట్టనున్నారు. రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ పడిన కష్టం ఈనెల 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడంతో ఫలితం దక్కబోతోంది. గతం కంటే కూడా ఈసారి ఎక్కువ మెజార్టీ స్థానాలు రాబోతున్నాయి.రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో వరుసగా రెండవసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 9వ తేదీన వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది’అన్నారు. -
అమిత్ షాపై ఆరోపణలు.. జైరాంరమేష్‌కు ఈసీ లేఖ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం(జూన్2) కోరింది. ఈ మేరకు ఆయనకు ఈసీ ఒక లేఖ రాసింది. ఎన్నికల కౌంటింగ్‌పై అమిత్ షా 150 మంది జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేశారని జైరాం రమేష్ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది.మీరు చేసే ఆరోపణలు ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తాయని, వాటిపై విచారణ జరిపేందుకు ఆధారాలుంటే సమర్పించండని ఈసీ జైరామ్‌రమేశ్‌ను కోరింది. ఆధారాలు చూపితే తగిన చర్యలు తీసుకుంటామని రమేష్‌కు ఈసీ లేఖలో తెలిపింది. హోంమంత్రి ఇప్పటివరకు 150 మంది కలెక్టర్లతో మాట్లాడారు. వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. విజయం పట్ల బీజేపీ ఎంత నిరాశలో ఉందో దీని ద్వారా తెలుస్తోంది. ఇండియా కూటమి విజయం సాధిస్తుందని జైరాం రమేష్ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఎగ్జిట్‌పోల్స్‌పై రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. అవి ఎగ్జిట్‌పోల్ ఫలితాలు కాదని మోదీ మీడియా పోల్స్ అని రాహుల్ మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనేదానిపై చర్చించడానికి ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఇండియా కూటమి ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పాయి. -
మోదీ మూడోసారి ప్రధాని కాలేడు : సోమనాథ్ భారతీ
ఢిల్లీ: పలు పర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ, ఎన్డీయే కూటిమి సుమారు 350 స్థానాలు గెలుస్తాయని అంచనా వేశాయి. బీజేపీ, ఎన్డీయే కూటమికి అధిక సీట్లు వస్తాయిని పేర్కొన్న సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతీ తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం కౌంటింగ్ రోజున అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలిపోతాయని అన్నారు. బీజేపీ అధిక సీట్లు గెలుచుకొని మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేయించుకుంటానని ఛాలెంజ్ చేశారు.‘‘నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేసుకుంటా. నా మాటలు రాసిపెట్టుకోండి. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని జూన్ 4న తెలిసిసోతుంది. నరేంద్రమోదీ మూడోసారి పీఎం కాలేడు. ఢిల్లీ మొత్తం ఏడు స్థానాల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి గెలుస్తుంది. మోదీపై ఉన్న భయంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆయన ఓడిపోతారని వెల్లడించవు. మేము జూన్ 4న విడుదల అయ్యే నిజమైన ఫలితాల కోసం ఎదురు చుస్తున్నాం. ప్రజలు ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ భారీగా ఓట్లు వేశారు’’ అని సోమనాథ్ భారతీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.I will shave off my head if Mr Modi becomes PM for the third time.Mark my word!All exit polls will be proven wrong on 4th June and Modi ji will not become prime minister for the third time.In Delhi, all seven seats will go to India ALLIANCE.Fear of Mr Modi does not allow…— Adv. Somnath Bharti: इंसानियत से बड़ा कुछ नहीं! (@attorneybharti) June 1, 2024 ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన బీజేపీ.. తాము సులభంగా అధిక సీట్లు గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. దేశ ప్రజలు మోదీ మూడుసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కానీ, సోమనాథ్ భారతీలానే చాలా మంది ప్రతిపక్ష నేతలు ఎగ్జిట్ పోల్స్‌ను తప్పని అంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.2019లో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ మొత్తం ఏడు సీట్లకు 6 సీట్లు కౌవసం చేసుకుంటుందని పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తే.. ఏకంగా ఏడు సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈసారి ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేసింది. ఈసారి ఏడు సీట్లలోను తామే గెలుస్తామని ఆ రెండు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: 44 సీట్లలో బీజేపీ విజయం
Counting Updates అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయంఅరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 44 సీట్లలో విజయం2 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లలో గెలుపు10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమేజిక్ ఫిగర్ స్థానాలు 30పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 సీట్లలో గెలుపునేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1 స్థానం గెలుపు , 2 ముందంజ ఇండిపెండెంట్లు 3 గెలుపు సిక్కింలో అధికార కాంత్రికారి మోర్చా ఘన విజయంసిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ 26 సీట్లలో విజయం5 స్థానాల్లో సీకేఎం లీడింగ్మేజిక్ ఫిగర్ 17 సీట్లుసిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1 స్థానం గెలుపుసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ ప్రేమ్ సింగ్ తమంగ్ రెనోక్ స్థానంలో 7044 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ దూసుకుపోతోంది11 సీట్లలో సీకేఎం పార్టీ విజయం20 స్థానాల్లో సీకేఎం లీడింగ్‌సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక్కస్థానంలో లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది26 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీనేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 18 సీట్లలో విజయం సాధించింది28 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజపీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 స్థానాల్లో లీడింగ్10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీ#WATCH | Celebration begins at the BJP office in Itanagar as the party is set to return to power in Arunachal Pradesh The ruling BJP crossed the halfway mark; won 17 seats leading on 29. National People's Party is leading on 6 seats. The majority mark in the State Assembly is… pic.twitter.com/GEEfXggrEO— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిసిక్కిం క్రాంతికారి మోర్చా రెండు స్థానాల్లో గెలుపు29 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానంలో లీడింగ్‌లో ఉంది.#WATCH | Sikkim: Pintso Namgyal Lepcha from the Sikkim Krantikari Morcha (SKM) wins from the Djongu Assembly constituency He says, "I thank all the voters who supported me and made me win with a huge margin. I also thank my party president who gave me the ticket..." pic.twitter.com/BHVMQJvwB2— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ తమంగ్ గోలే.. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమంగ్ గోలే భార్య కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్‌లో ముందంజలో ఉన్నారు.Sikkim CM and Sikkim Krantikari Morcha (SKM) chief Prem Singh Tamang, who is contesting the Assembly elections from Rhenock and Soreng-Chakung seats, is leading on both the seats.SKM crossed the halfway mark; leading on 29 seats. The majority mark in the Sikkim Assembly is 17… pic.twitter.com/1NIYCEmihZ— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న కమలం10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమిగిలిన 50 స్థానాల్లో 29 చోట్ల కమలం హవామొత్తం 39 సీట్లలో బీజేపీ ఆధిక్యం8 చోట్ల లీడింగ్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకాంగ్రెస్ ఒకచోట మాత్రమే ఆధిక్యంసిక్కింలో మరోసారి అధికారం దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చాఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కింలో క్లీన్ స్వీప్ చేసే దిశగా క్రాంతికారి మోర్చా పార్టీమొత్తం 32 సీట్లకుగాను 29 స్థానాల్లో ఎస్కేఎం ఆధిక్యంఒక స్థానంలో ఎస్ డీఎఫ్ లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్‌నేషల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్ ఫిగర్ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) 8 సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్‌ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో లీడింగ్‌ఇండిపెండెంట్ ఒక స్థానంలో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎస్‌కేఏం భారీ లీడింగ్‌లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒక స్థానంలో లీడింల్ ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో కౌంటింగ్ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) 2 సీట్లలో లీడింగ్‌లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్‌లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్‌కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్‌కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు. -
ఢిల్లీ పీఠం ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ సంచలనం..
సాక్షి,న్యూఢిల్లీ: సుదీర్ఘంగా నలభై రోజులకుపైగా జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ శనివారం(జూన్1) సాయంత్రం 6 గంటలకు ముగిసింది.అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న2024 పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తుది, ఏడవ విడత పోలింగ్ ముగిసిన వెంటనే టీవీ ఛానళ్లు, ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు రిలీజ్ చేశాయి. రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ఎన్డీఏ-354ఇండియా-153ఇతరులు-30మొత్తం -543ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఇప్పటికి ప్రకటించినవి -463ఎన్డీఏ -294-329ఇండియా- 123-154ఇతరులు- 8-20మొత్తం సీట్లు-543ఎన్డీటీవీఎన్డీఏ-365ఇండియా-142ఇతరులు -36జన్‌కీ బాత్ ఎన్డీఏ-362-392ఇండియా-141-161ఇతరులు -10-20న్యూస్ నేషన్ ఎన్డీఏ-340-378ఇండియా-153-169ఇతరులు -21-23దైనిక్ భాస్కర్ఎన్డీఏ-281-350ఇండియా-145-201ఇతరులు -33-49 -
ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం
సాక్షి, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానం విరమించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో గురువారం సాయంత్రం మొదలైన మోదీ ధ్యానం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. ఆయన దాదాపు 45 గంటలపాటు ధ్యానంలో నిమగ్నమయ్యారు. రెండు రోజులపాటు కేవలం ద్రవాహారం తీసుకున్నారు. ధ్యానం ముగిసిన తర్వాత మోదీ రాక్ మెమోరియల్ నుంచి పడవలో అక్కడికి సమీపంలోని తమిళ కవి తిరువళ్లువర్ విగ్రహం కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. తిరవళ్లువర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం తీరానికి చేరుకున్న మోదీ హెలికాప్టర్లో తిరువనంతపురం బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. మరోసారి ఎన్డీఏకే పట్టం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి మోదీ న్యూఢిల్లీ: కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అవకాశవాద ‘ఇండియా’ కూటమిని ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. విపక్ష కూటమి తిరోగమన రాజకీయాలను జనం తిరస్కరించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆఖరి విడత పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తమ ప్రభుత్వ ట్రాక్ రికార్డును ప్రజలు చూశారని, తమకు మళ్లీ అధికారం అప్పగించబోతున్నారని వెల్లడించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజల క్రియాశీల భాగస్వామ్యమే మూలస్తంభమని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు తోడ్పడిన భద్రతా దళాలకు సైతం ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
ముగిసిన లోక్‌సభ ఎన్నికల తుది దశ పోలింగ్
Lok Sabha Election 2024 Phase 7 Updates.. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ 58.34 శాతంబీహార్ లో 8 లోక్ సభ స్థానాల పరిధిలో 48.86 శాతం పోలింగ్ నమోదుఛండీఘడ్ లో 62.80 శాతం పోలింగ్ నమోదుహిమాచల్ ప్రదేశ్ లో నాలుగు లోక్ సభ స్థానాల పరిధిలో 66.56 శాతం పోలింగ్ నమోదుజార్ఖండ్ లో మూడు లోక్ సభ స్థానాల్లో 67.95 శాతం పోలింగ్ నమోదుఒడిస్సా లో 6 లోక్ సభ స్థానాల్లో 62.46 శాతం పోలింగ్ నమోదుపంజాబ్ లో 13 స్థానాల్లో 55.20 శాతం పోలింగ్ నమోదుఉత్తరప్రదేశ్ 13 స్థానాల్లో 54. శాతం పోలింగ్ నమోదుపశ్చిమ బెంగాల్ 9 లోక్ సభ స్థానాల్లో 68.98 శాతం పోలింగ్ నమోదు👉 మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.09 శాతం పోలింగ్ నమోదు ఢిల్లీ:7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదయిన పోలింగ్ శాతం 40.09బీహార్(8)-35.65ఛండీఘడ్(1)-40.14హిమాచల్ ప్రదేశ్(4)-48.63జార్ఖండ్(3)-46.80ఒడిస్సా(6)-37.64పంజాబ్(13)-37.80ఉత్తరప్రదేశ్ (13)- 39.31పశ్చిమ బెంగాల్( 9)-45.07 👉ఓటు వేసిన నటి, టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి. కోల్‌కత్తాలోని పోలింగ్ బూత్ ఓటు వేసిన మిమీ చక్రవర్తి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు వేసి నా బాధ్యత తీర్చుకున్నాను. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. #WATCH | West Bengal: Actor and former TMC MP Mimi Chakraborty casts her vote at a polling booth in Kolkata. #LokSabhaElections2024 pic.twitter.com/lt8L6GSZJO— ANI (@ANI) June 1, 2024 👉ఎన్నికల వేళ విషాదం.. మనోరంజన్ సాహో మృతిఓడిషాలో బింజర్‌హర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్-157లో బూత్ లెవన్ ఆఫీసర్ మనోరంజన్ సాహో మృతిచెందారు. ఎన్నికల విధుల్లోనే ఆయన మరణించినట్టు కలెక్టర్ నిఖిల్ పవన్ కల్యాణ్ తెలిపారు. Odisha | One BLO (Block Level Officer), Manoranjan Sahoo (58) of booth no-157 under Binjharpur Assembly Constituency of Jajpur district died while on election duty: Collector & DM cum DEO, Nikhil Pavan Kalyan#LokSabhaElections2024— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన నటుడు ఆయూష్మాన్ ఖురానా. ఛండీగఢ్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.#WATCH | Actor Ayushmann Khurrana shows the indelible ink mark on his finger after voting at a polling booth in Chandigarh.He says, "I came back to my city to cast my vote and exercise my right...Mumbai recorded a very low voter turnout this time but we should cast our… pic.twitter.com/7UTPNGCMl1— ANI (@ANI) June 1, 2024 👉ఓటుపై అవగాహన కోసం వినూత్న ప్రయోగం.. యూపీకి చెందిన ఓ వ్యక్తి గుర్రంపై కుషీనగర్ పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాను 2012 నుంచి ఎలాంటి ఎన్నికలు జరిగినా గుర్రంపై వచ్చి ఓటు వేస్తున్నట్టు తెలిపాడు. #WATCH | To create voter awareness, a man arrives on a horse at a polling station to cast his vote in Kushinagar, Uttar PradeshHe says, "In the 2012, 2017 & 2022 Assembly elections and 2014 & 2019 Lok Sabha polls also I had arrived on horse to cast my vote." pic.twitter.com/Qw2vlivoM1— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్.#WATCH | On clash during Lok Sabha elections in West Bengal today, BJP leader & MP Dilip Ghosh says, "...TMC is doing al this due to fear of losing, but voting will be completed." pic.twitter.com/VNFPikOiGR— ANI (@ANI) June 1, 2024👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్ నేత బిక్రమ్ సింగ్ మజితియా. 👉 ఓటు హక్కు వినియోగించుకున్న రేఖా పాత. బసిర్‌హట్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రేఖా. #WATCH | North 24 Parganas, West Bengal: BJP Lok Sabha Candidate from Basirhat, Rekha Patra shows her inked finger after casting her vote for #LokSabhaElections2024TMC has fielded Haji Nurul Islam from Basirhat. pic.twitter.com/eNN5bg4OkI— ANI (@ANI) June 1, 2024 👉 11 గంటల వరకు 26.30 పోలింగ్ శాతం నమోదు. ఢిల్లీ:7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 11 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 26.30బీహార్(8)-24.25ఛండీఘడ్(1)-25.03హిమాచల్ ప్రదేశ్(4)-31.92జార్ఖండ్(3)-29.50ఒడిస్సా(6)-22.64పంజాబ్(13)-23.91ఉత్తరప్రదేశ్ (13)- 28.02పశ్చిమ బెంగాల్( 9)-28.10 👉ఓటు వేసిన హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ. హర్మీర్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. #WATCH | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu casts his vote at a polling station in Hamirpur for the seventh phase of #LokSabhaElections2024 pic.twitter.com/c7zzjs6SnO— ANI (@ANI) June 1, 2024 👉ఎన్నికల్లో ఓటు వేసిన బీహార్ సీఎం నితిశ్ కుమార్. భక్తియార్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన వేశారు.#WATCH | Bihar CM Nitish Kumar leaves after casting his vote at a polling booth in Bakhtiyarpur. #LokSabhaElections2024 pic.twitter.com/2qogPy72zU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన జమ్మూ కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. యూపీలోని గాజీపూర్‌లో వేశారు. #WATCH | Uttar Pradesh | Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha casts his vote for #LokSabhaElections2024 in Mohanpura village, Ghazipur. pic.twitter.com/LV5N4AoNjU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్ ప్రెసిడెంట్ సుఖ్బీర్ సింగ్ బాదల్, ఎస్ఏడీ నేత హర్సిమ్రత్ కౌర్. ఫిరోజ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో వీరు ఓటు వేశారు. #WATCH | Sri Muktsar Sahib, Punjab: Shiromani Akali Dal (SAD) leader Harsimrat Kaur Badal casts her vote at a polling booth in Badal village under the Firozpur Lok Sabha constituency SAD has fielded Nardev Singh Bobby Mann from this seat. BJP has fielded Gurmit Singh Sodhi,… https://t.co/BhwLlKUElF pic.twitter.com/FGxN45jioQ— ANI (@ANI) June 1, 2024 👉పోలింగ్ వేళ బెంగాల్లో ఉద్రిక్తతలు..సౌత్ పరగాణా-24లో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ను మురికి కాల్వలో పడేసిన దుండగులు. VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal. (Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్. VIDEO | Lok Sabha Elections 2024: Punjab CM Bhagwant Mann interacts with media after casting vote.#LSPolls2024WithPTI #LokSabhaElections2024(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/1YxNaPwBQ5— Press Trust of India (@PTI_News) June 1, 2024 VIDEO | Lok Sabha Elections 2024: "I hope there will be record voting. I am confident that the excitement in the seventh phase will be more that what we have witnessed in the last six phases of elections. There will be bumper voting and then later bumper victory," says Anurag… pic.twitter.com/RbDCOPjfY4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న కంగనా రనౌత్. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.VIDEO | Lok Sabha Election 2024: "I want to appeal to everyone to exercise their Constitutional rights and participate in this festival of democracy," says actor and BJP candidate from Himachal Pradesh's Mandi seat Kangana Ranaut (@KanganaTeam) after casting vote.… pic.twitter.com/7womwYt3xV— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన బీజేపీ నేత తరుణ్‌చుగ్. పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. VIDEO | Lok Sabha Elections 2024: "We have been given the right by the Constitution to choose who will rule for the next five years and who will decide the country's strategies. We should all exercise this right. I am feeling very proud and happy that I have come here along with… pic.twitter.com/zSElxK3PEd— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 తొమ్మిది గంటల వరకు 11.31 శాతం పోలింగ్ నమోదు.. ఢిల్లీ:చివరి విడతలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 9 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 11.31బీహార్(8)-10.58ఛండీఘడ్(1)-11.64హిమాచల్ ప్రదేశ్(4)-14.35జార్ఖండ్(3)-12.15ఒడిస్సా(6)- 7.69పంజాబ్(13)-9.64ఉత్తరప్రదేశ్ (13)- 12.94పశ్చిమ బెంగాల్( 9)- 12.63 👉 ఓటు హక్కు వినియోగించుకున్న హిమాచల్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా. గోరఖ్‌పూర్‌లో ఓటు వేసిన శుక్లా. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. #WATCH | Uttar Pradesh: After casting his vote in Gorakhpur, Himachal Pradesh Governor Shiv Pratap Shukla says, "I have cast my vote today. All the voters should cast their votes today and vote for a government that can carry forward development work..."#LokSabhaElections2024 pic.twitter.com/WFVlID9xh3— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన లాలూ ఫ్యామిలీ. సరన్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీ, ఆర్జేజీ అభ్యర్థి రోహిణీ ఆచార్య. #WATCH | Bihar: RJD chief Lalu Prasad Yadav, Rabri Devi and their daughter & party candidate from Saran Lok Sabha seat Rohini Acharya leave from a polling booth in Patna after casting their vote. #LokSabhaElections2024 pic.twitter.com/LTmGnXM4BH— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. యూపీలో వారణాసిలోని రామ్‌నగర్‌లో ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Uttar Pradesh | Sikkim Governor Lakshman Prasad Acharya says, "I am happy to take part in this festival of democracy. I think that voting is a duty along with being a constitutional right and everyone should perform their duty and exercise their right..." https://t.co/qwNLm28hP9 pic.twitter.com/V2EMlKNxMu— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్. జలంధర్‌లోని పోలింగ్ బూత్ ఓటు వేసిన బజ్జీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని కామెంట్స్ చేశారు. #WATCH | Punjab: Former Indian cricketer and AAP Rajya Sabha MP Harbhajan Singh casts his vote at a polling booth in Jalandhar#LokSabhaElections2024 pic.twitter.com/Ph55BxqFbp— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవి కిషన్. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ బూత్ వేసిన రవి కిషన్, ఆయన కుటుంబ సభ్యులు. #WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Gorakhpur, Ravi Kishan & his wife Preeti Kishan cast their votes at a polling booth in the constituency. The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf.#LokSabhaElections2024 pic.twitter.com/bTC51NMa3E— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న యూపీ సీఎం యోగి ఆద్యితనాథ్. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన యోగి. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో రవి కిషన్. #WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath casts his vote at a polling booth in Gorakhnath, Gorakhpur.The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf. #LokSabhaElections2024 pic.twitter.com/2Ao7uC7slU— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా #WATCH | BJP national president JP Nadda cast his vote at a polling booth in Bilaspur, Himachal Pradesh. His wife Mallika Nadda also cast her vote here. #LokSabhaElections2024 pic.twitter.com/7XZC3pU2zw— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా..👉 ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన రాఘవ్ చద్దా.. #WATCH | After casting his vote for the seventh phase of #LokSabhaElections2024, AAP MP Raghav Chadha says, "Today is the grand festival of India...Every vote by the citizen will decide the direction & condition of the country...I request everyone to exercise their right to… pic.twitter.com/tBqPTEdBci— ANI (@ANI) June 1, 2024 👉 చివరి దశలో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. Voting for the seventh - the last - phase of #LokSabhaElections2024 begins. Polling being held in 57 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/BkcIZxkmYC— ANI (@ANI) June 1, 2024 👉 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ ప్రారంభమైంది. 👉 కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పాటు బీహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 👉 వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ కొనసాగుతోంది. అంతేకాకుండా బీహార్‌లో ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, బెంగాల్లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగుతోంది.👉 చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. -
ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా రేపు వెలువడబోయే ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటితో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. దీంతో రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడాల్సి ఉంది. అయితే.. నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ఇవ్వకూడదని ఈసీ తాజాగా ఆదేశాలు విడుదల చేసింది. రేపు అంటే జూన్ 1వ తేదీ శనివారం సాయంత్రం 6:30 తరువాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాల్సిందేనని తాజా ఆదేశాల్లో ఈసీ పేర్కొంది.లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు,అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే వీటన్నింటికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఈసీ బ్యాన్ చేసింది. పూర్తి స్థాయిలో అంతటా పోలింగ్ ముగిసిన తర్వాతే వెల్లడించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు మార్చి 28వ తేదీ జారీ చేసిన నోటిఫికేషన్లో ఈసీ స్పష్టం గా పేర్కొంది. -
రేపే చివరి విడత పోలింగ్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రేపు(శనివారం) చివరి(ఏడో)విడత పోలింగ్ జరగనుంది. ఈమేరకు ఏడో విడత పోలింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడో విడతలో భాగంగా 57 లోక్ సభ స్థానలకు పోలింగ్ జరగనుంది. దీంతోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 స్థానాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తారు. రేపు(శనివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 10.06కోట్ల మంది ఓటర్లలో 5.24 కోట్లమంది పురుషులు, 4.82కోట్ల మంది మహిళ ఓటర్లు, 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రముఖుల స్థానాలుప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( వారణాసి), బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ (మండి) స్థానాల్లో పోలింగ్ జరగనుంది. వీరితో పాటు పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. -
ఒడిశాలొ ‘పాండియన్’ పాలిటిక్స్.. నవీన్ పట్నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
భువనేశ్వర్: బీజేడీ నేత వీకే పాండియన్ వ్యవహారం ఒడిశా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒడిశా సీఎంను పాండియన్ నియంత్రిస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు సీఎం నవీన్ పట్నాయక్‌కు పాండియన్ రాజకీయ వారసుడంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గురువారం స్పందించారు.ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా నవీన్ పట్నాయక్.. ‘‘ నా వారసుడి విషయంలో ఇదివరకే చాలా క్లారిటీగా చెప్పాను. నా వారసుడిని ఒడిశా రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ఇలాంటివి చాలా సహజంగా ప్రజల ద్వారానే జరిగిపోయే విషయాలు. ప్రజస్వామ్యంలో పార్టీల్లో నేతలు వివిధ పదువుల్లో ఉంటారు. మంత్రులుగా ప్రజల ప్రతినిధులు ఉంటారు. అదేవిధంగా అధికారాలను కలిగి ఉంటారు. పాండియన్ ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.#WATCH | On being asked about "putting VK Pandian above other BJD leaders", Odisha CM Naveen Patnaik says "I find all of this quite nonsensical..."On VK Pandian, he further says "Party members have a great say, they have high positions, they are ministers, they are the people's… pic.twitter.com/XigUlX4wS1— ANI (@ANI) May 30, 2024 ఇక.. వీకే పాండియన్ నన్ను కంట్రోల్ చేస్తున్నారన్న ఆరోపణలు చాలా హాసాస్పదం.. వాటికి అసలు ఎటువంటి ప్రాధాన్యతా లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రాష్ట్రంలో తిరిగి బీజేడీ ప్రభుత్వ ఏర్పడుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో సైతం 21 స్థానాల్లో గెలుస్తాం. ఒడిశా ప్రజలకు సంక్షేమం అందించడమే నా తొలి ప్రాధాన్యం’’ అని అన్నారు.ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతుండగా వణుకుతున్న ఆయన చేతులను పాండియన్ సరిచేసిన విషయం తెలిసిందే. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ సీఎం పట్నాయక్‌పై విమర్శలు గుప్పించారు. వీకే పాండియన్ మాత్రమే నవీన్ పట్నాయక్‌తో ఎందుకు ఉంటారో సమాధానం చెప్పాలి. పట్నాయక్‌తో పాటు పాండియన్ మైక్ పట్టుకొని, వణుకుతున్న చేతులను కంట్రోల్ చేస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. ఎవరీ వీకే పాండియన్..?తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ 2000 సంవత్సరంలో ఒడిశా ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌గా చేరారు. మొదట్లో ధరమ్‌ఘర్, కలహండి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఒడిశాలోని అతిపెద్ద జిల్లా మయూర్‌భంజ్‌లో కలెక్టర్‌గా మారుమూల గ్రామాలను అభివృద్ధి చేశారు. హెచ్ఐవీ సోకిన వ్యక్తులకు పునరావాసం కల్పించిన కృషికి వీకే పాండియన్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు. 5T కార్యక్రమాల వల్ల దాదాపు తొంభై శాతానికి పైగా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలో పాండియన్ కీలకమైన బ్యూరోక్రాట్‌గా పేరు సంపాధించారు. 2011 సంవత్సరంలో వీకే పాండియన్ ప్రతిభను గమనించి సీఎం నవీన్ అతన్ని సీఎం కార్యాలయానికి తీసుకున్నారు. సీఎంకు ప్రైవేట్ సెక్రటరీగా కూడా పని చేశారు. ఇక.. 2023లో వీకే పాండియన్ తన బ్యూరోక్రాట్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం 2023, నవంబర్ 27న సీఎం నవీన్ పట్నయక్ సమక్షంలో బిజు జనతా దళ్‌లో చేరి సీఎంకు సన్నిహితంగా ఉంటూ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. -
సెఫాలజిస్ట్ యోగేంద్ర ప్రెడిక్షన్... శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతగా మ్యాజిక్‌ఫిగర్ దాటదని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్రయాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. మ్యాజిక్ ఫిగర్‌కు కావల్సిన 272 సీట్లు బీజేపీకి ఈసారి సొంతగా రావని యోగేంద్ర ఇటీవల చెప్పారు.ఎన్డీఏ కూటమి మొత్తం కలిసి మాత్రం మెజారిటీ సీట్లు సాధిస్తుందని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మెరుగైన సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. దీనిపై శశిథరూర్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.ప్రభుత్వ వ్యతిరేకత ఫ్యాక్టర్ వల్ల బీజేపీ 230 సీట్లకు కూడా పడిపోవచ్చన్నారు. ముందు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకేనే అవకాశం ఉందని థరూర్ పేర్కొన్నారు. -
ముగిసిన లోక్‌సభ 2024 ఎన్నికల ప్రచారం
న్యూఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఎనిమిది రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. చివరి విడతలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. బీహార్ లో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు 134 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. చండీగఢ్ 1 లోక్ సభ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ నాలుగు లోక్‌సభ స్థానాలకు 37 మంది పోటీ పడుతున్నారు. జార్ఖండ్ 3 లోక్‌సభ స్థానాల్లో 52 మంది, ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలకు 66 మంది, పంజాబ్ 13 లోక్‌సభ స్థానాలకు 328 మంది, ఉత్తర ప్రదేశ్ 13 లోక్‌సభ స్థానాల్లో 144 మంది బరిలో నిలిచారు. వెస్ట్ బెంగాల్ 9 స్థానాలకు ,124 మంది బరిలో ఉన్నారు. చివరి విడతలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ, మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, హామిపూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గోరక్‌పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు.18వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొత్తం ఏడు దశల్లో 44 రోజులపాటు సాగనుంది. 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్న ఎన్నికలు ఇవే. -
‘ప్రసంగాలతో గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ’
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండిచారు. ప్రతిపక్షాలు, ఓ వర్గం ప్రజలపై ప్రధాని మోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని ఆఫీసు గౌరవాన్ని దిగజార్చాయి. ఇలా గౌరవాన్ని దిగజార్చిన తొలి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్ ప్రజలకు లేఖ రాశారు.‘‘ ప్రధాని మోదీ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి దేశ ప్రజల్లో విభజన తీసుకువచ్చే విద్వేశ వ్యాఖ్యలు. 2022 వరకు మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. మోదీ విధానాల వల్ల గత పదేళ్లలో రైతులు ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. రోజుకు జాతీయ సగటు రైతు ఆదాయం రూ. 27 ఉంటే, సగటు అప్పు మాత్రం రూ. 27 వేలు ఉంది. ఇందనం, ఎరువులు అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో రైతుల ఆదాయం తగ్గిపోయింది. పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. జీఎస్టీ, నోట్ల రద్దు, కరోనాను సరిగా ఎదుర్కొకపోవటం వల్ల దేశం దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లింది. గ్రోత్ రేట్ కూడా పడిపోయింది. సుమారు 750 మంది రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో మృతి చెందారు. లాఠీలు, రబ్బరు బుల్లెట్లతోనే కాకుండా ప్రధాని మోదీ తన మాటలతో రైతులపై దాడి చేశారు. రైతులను ‘‘ఆందోళన జీవులు’’ అని అవమానించారు. తమను సంప్రదించకుండా చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కోరారు. గడిచిన పదేళ్లలో పంజాబ్, పంజాబ్ ప్రజలను బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా దూషించింది’’ అని మన్మోహన్ సింగ్ తెలిపారు.ఏప్రిల్‌లో మోదీ రాజస్థాన్‌లోని ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలు కనేవారికి పంచిపెడతారని అన్నారు. ముస్లీంలకు తొలి ప్రాధాన్యమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించినట్లు కూడా మోదీ ఆరోపణులు చేసిన విషయం తెలిసిందే. -
ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
2024 సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడవ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. జరిగిన ఆరు దశల్లో నమోదైన అత్యల్ప ఓటింగ్ శాతం ఓటర్లలోని నిరుత్సాహాన్ని తెలియజేస్తోంది. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యాలను మార్చుకోవడం కూడా మిశ్రమ సందేశాన్ని అందిస్తోంది. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ‘మోదీ హవా’ కనిపించింది. కానీ అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాన్ని ఉదాసీనత భర్తీ చేసింది. ‘ఈసారి 400 సీట్లు దాటుదాం’ అన్న నినాదం ఎత్తుకోవడంతో కూడా కాషాయపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా ప్రతిపక్షాలను, ప్రధానంగా సమాజ్‌వాదీ పార్టీని అదుపులో ఉంచడంలో మాత్రం బీజేపీ విజయం సాధించింది.చాలామంది రాజకీయ పండితులతోపాటు, మేము మాట్లాడిన అత్యధిక సాధారణ ఓటర్ల ప్రకారం... 2014, 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఏమంత ఉత్సాహంగా లేవు. బీజేపీ సంపూర్ణ ఆధిపత్యం, ఎటువంటి బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం దీనికి కారణాలు. బీజేపీ ప్రధాన మద్దతుదారుల్లో ఉన్న అసంతృప్తి కూడా ఎన్నికల ఉత్సాహాన్ని తగ్గించింది. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యాలను మార్చుకోవడం కూడా మిశ్రమ సందేశాన్ని అందిస్తోంది. ఎన్నికల తొలి దశల్లో ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టింది. అన్ని వైపులా పేలవమైన ప్రచారం, విజేత ముందుగానే తెలిసిపోవడం లాంటివి వీటికి కారణాలు. వీటన్నింటికీ మించి, ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికలలో మరో రెండు అంశాలు గమనించదగినవి: ఒకటి, బీజేపీ తన తిరుగులేని స్థితిని సాధించిన విధానం. దీనిని మనం గుజరాత్ నమూనా ఎన్నికల ఆధిపత్యం అని పిలవొచ్చు. రెండు, ‘శాంతి భద్రతల’ ప్రాముఖ్యత. అందువల్లే, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఎప్పటిలాగే, బీజేపీ ఎన్నికల ప్రచార ఒరవడిని జాగ్రత్తగా ప్లాన్ చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ స్పష్టంగా ఈ ప్రణాళికలో భాగమే. ఇది నిజంగానే ఉత్కంఠకు దారితీసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలలు... బీజేపీ నాయకుడొకరు చెప్పినట్లుగా, ‘ఇది గర్భధారణకు సంబంధించిన చివరి త్రైమాసికం. బూత్ స్థాయి కార్యకర్తలను ప్రసవానికి సిద్ధం చేయడంలో ఇది చాలా కీలకం’. ఈ మూడు నెలల్లో స్పష్టంగా ‘మోదీ హవా’ కనిపించింది. కానీ ఉత్సాహం ఒక్కసారి శిఖర స్థాయికి వెళ్లాక, అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాన్ని ఉదాసీనత భర్తీ చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా గణనీయంగా 40–50 శాతం వరకు కూడా ఉంది. అందుకే పశ్చిమ యూపీలోని కీలకమైన యుద్ధభూమిలో ఓటింగ్ మొదటి కొన్ని దశల్లో బీజేపీ కీలక కర్తవ్యం, దాని ప్రధాన ఓటు పునాదిని ఏకీకృతం చేయడంగానే ఉండింది. 2013 అల్లర్ల నుండి స్థానికంగా ఉన్న హిందూ, ముస్లిం తగాదాల కారణంగా ఇది బీజేపీకి సులభమైన పనిగా కనిపించింది. అలాగే ముఖ్యమంత్రి కూడా బలమైన సానుకూల అంశంగా కొనసాగుతున్నారు. జాతీయ సమస్యల విషయంలో మోదీ రికార్డుపై ఓటర్లు ఆధారపడుతున్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం శాంతిభద్రతల నిర్వహణ విషయంలో యోగీ అందించిన తోడ్పాటునే ఎక్కువ పరిగణనలోకి తీసుకుంటున్నారు.ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఓటర్ల ఉత్సాహం ఉధృతంగా ఉంది. అయినప్పటికీ స్పష్టమైన ప్రభంజనం మాత్రం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే అప్పటికి సిట్టింగ్ ఎంపీలపై ఆగ్రహం రూపంలో అనేక వ్యతిరేకతలు గూడుకట్టుకుని ఉన్నాయి. ద్రవ్యోల్బణం, సంచరించే పశువుల బెడద, తప్పుడు అభ్యర్థుల ఎంపిక కారణంగా బీజేపీ మీద విసుగు చెందిన అనేక మందిని మేము చూశాము. అయినప్పటికీ ఓటు విషయానికి వస్తే, ఎక్కువ మంది తాము బీజేపీకే ఓటు వేస్తామని అంగీకరించారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుందన్న ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ, యూపీలో బీజేపీ గుజరాతీకరణకు ప్రయత్నిస్తోంది. అంటే కుల ఇంజినీరింగ్ ద్వారా తమ ఓటు పునాదిని నిర్మించడం, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయడం. బూత్, జిల్లా స్థాయుల్లో ఎంతోమంది విపక్ష నేతలు పార్టీలు మారి బీజేపీలో చేరారనేది ఆశ్చర్యం కలిగించే అంశం. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా ప్రతిపక్షాలను, ప్రధానంగా సమాజ్‌వాదీ పార్టీని తగ్గించడంలో బీజేపీ విజయం సాధించింది. ఇటావా, మైన్‌పురీ, కన్నౌజ్‌లలో తప్ప ఎక్కడా సమాజ్ వాదీ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నట్లు కనిపించదు. ఇది తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి నుండి కూడా స్పష్టమైన మార్పును సూచిస్తోంది.గత కొన్ని నెలల్లో ఒక్క గోరఖ్‌పూర్ ప్రాంతంలోనే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 11,000 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారని ఒక హిందీ వార్తాపత్రిక పేర్కొంది. చెప్పాలంటే, రెండు నెలల్లో యూపీలోని 10 మంది బీఎస్పీ ఎంపీల్లో ఐదుగురు బీజేపీలో చేరారు. బీజేపీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను– టికెట్ రానివారు లేదా ఏ కారణం చేతనైనా ఆయా పార్టీలలో పక్కన పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కుశీనగర్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన ఎస్పీ మాజీ ఎమ్మెల్యే నాథుని ప్రసాద్ కుశ్వాహా ఇటీవలే బీజేపీలో చేరారు. అదేవిధంగా, 2019 గోరఖ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రోజునే బీజేపీలో చేరారు.ఒక పార్టీగా, కొత్తగా ప్రతిపక్ష నాయకులను చేర్చుకోవడం, అదే సమయంలో సొంత కార్యకర్తలను సంతోషంగా ఉంచడం వంటి భారీ సవాళ్లను బీజేపీ ఎదుర్కొంటోంది. దీనివల్ల అనివార్యంగా బీజేపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అలాంటి ఆగ్రహానికి గురైన ఒక కార్యకర్త ‘భారతదేశంలో కాంగ్రెస్‌ను లేకుండా చేసే ప్రయత్నంలో, బీజేపీయే కాంగ్రెస్ అవుతోంది’ అని వ్యాఖ్యానించారు. బలహీనమైన ప్రారంభం ఉన్నప్పటికీ, ఈ సంస్థాగతమైన తికమక బీజేపీ కంటే సమాజ్ వాదీ పార్టీనే ఎక్కువగా దెబ్బతీస్తోంది. ఎస్పీ బలహీనతను పసిగట్టిన బీజేపీ, మధ్యప్రదేశ్‌కు చెందిన యాదవ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను వ్యూహాత్మకంగా రంగంలోకి దింపింది. ఎస్పీ, ఆర్జేడీల యాదవుల ఓట్లను లాక్కోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి యూపీ, బిహార్లలో మోహన్ యాదవ్ పోస్టర్ బాయ్‌గా మారారు.యూపీలోని ప్రత్యర్థి పార్టీల ఓటర్లు, మద్దతుదారుల విషయానికి వస్తే, తమ అభ్యర్థుల గెలుపు సాధ్యం కాదని గ్రహించడంతో వారిలో ఉదాసీనత మొదలైంది. మేం సర్వే చేసిన ఒక వ్యక్తి ఇలా చెప్పారు: యోగీజీ వల్ల ముస్లింలు, యాదవుల పరిస్థితి 1990లలో బిహార్, యూపీల్లోని బ్రాహ్మణులు, క్షత్రియుల మాదిరిగా తయారైంది. బయటకు వెళ్లి ఓటు వేయడానికి వారికి ఎటువంటి ప్రేరేపకమూ లేదు. ఎందుకంటే ఇది వారికి ఎటువంటి లాభమూ చేకూర్చదు. వాస్తవానికి యూపీలో బీజేపీని రెండు సవాళ్లు ఇబ్బంది పెడుతున్నాయి. మొదటిది, యూపీలో మొదటి రెండు దశల్లో ఓటింగ్ శాతం దాదాపు 5 శాతం తగ్గింది. డజను కంటే కొంచెం ఎక్కువ నియోజకవర్గాల్లో దాదాపు 8.9 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రతి బూత్‌లోని ఒక్కో ఓటునూ విలువైనదిగా భావించి పనిచేసే పార్టీకి ఇది ఆందోళనకరం. రెండవది, ‘అబ్ కీ బార్, 400 పార్’ (ఈసారి 400 సీట్లు దాటుదాం) అంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీని కొంతైనా అది వెనక్కి నెట్టింది. రిజర్వేషన్లను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికే బీజేపీ ఇంత భారీ మెజారిటీని కోరుతోందనే అత్యంత తీవ్రమైన అభియోగాన్ని ఆ పార్టీ ఎదుర్కొంటోంది (ఈ ప్రచారం 2015 బిహార్ రాష్ట్ర ఎన్నికలలో వారికి వ్యతిరేకంగా అత్యంత ప్రభావం చూపింది). ఆ సంక్షోభ తీవ్రతను తగ్గించడానికి చాలాకాలంగా ఉన్న హిందూ–ముస్లిం రగడతో సహా అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలనూ బీజేపీ సమీకరించింది. వ్యాసకర్తలు శశాంక్ చతుర్వేది ‘ నిర్మా విశ్వవిద్యాలయం, అహ్మదాబాద్; డేవిడ్ ఎన్ గెలినర్ ‘ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్; సంజయ్ కుమార్ పాండే ‘ జేఎన్‌యూ, ఢిల్లీ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఒడిశా సీఎం ఆరోగ్యంపై ప్రధాని సంచలన ప్రకటన
భువనేశ్వర్: ఒడిాశా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిాశా అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే నవీన్‌పట్నాయక్ ఆరోగ్యంపై ఒక కమిటీ వేసి విచారణ జరుపుతామని ప్రకటించారు. బుధవారం(మే29) ఒడిషా బరిపడలో జరిగిన ఎన్నిల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘కొన్ని సంవత్సరాల నుంచి నవీన్ పట్నాయక్ సన్నిహితులు నన్నెప్పుడు కలిసినా ఆయన ఆరోగ్యం గురించి తప్పకుండా చర్చించేవాళ్లు. నవీన్ తనకు తాను సొంతగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేవాళ్లు. నవీన్ ఆరోగ్యం విషయంలో ఏదో కుట్ర జరుగుతోందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. సీఎం అనారోగ్యం వెనుక ఎవరున్నారని తెలుసుకోవడం ఒడిషా ప్రజల హక్కు.మేం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నవీన్‌బాబు అనారోగ్యం వెనుక ఎవరున్నారనేదానిపై కమిటీ వేసి విచారణ జరుపుతాం’అని మోదీ హామీ ఇచ్చారు. కాగా, నవీన్ పట్నాయక్ అనుయాయుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్‌ను ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా నవీన్ పట్నాయక్ వీకే పాండియన్ చేతిలో బంధీగా మారారని ఎక్స్‌లో ఒక వీడియో పోస్టు చేయడం గమనార్హం. -
దేవుడైతే గుడి కడతాం... ప్రధానిపై ‘దీదీ’ సెటైర్లు
కోల్‌కతా: చివరి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. తనను దేవుడు పంపాడని ప్రధాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై చురకలంటించారు. ‘ఒకరేమో దేవుళ్లకే దేవుడినని అంటారు. మరో నేతేమో పూరి జగన్నాథుడే ఆయన భక్తుడంటారు.దేవుడయితే మేం ఆయనకు గుడి కడతాం. పూలు,పండ్లు, స్వీట్లు, ప్రసాదం పెడతాం. ఆయన కావాలనుంటే గుజరాతీ వంటకం ఢోక్లా కూడా పెడతాం’అని మమత ఎద్దేవా చేశారు. దేవుడైతే రాజకీయాల్లో ఉండకూడదని, అల్లర్లు రెచ్చగొట్టొద్దని సూచించారు. కాగా, ప్రధాని మోదీ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా అమ్మ బతికున్నంతవరకు నేను అందరిలాగే పుట్టాననుకున్నాను. కానీ ఆమె చనిపోయిన తర్వాత నన్ను దేవుడు పంపించాడేమో అనిపిస్తోంది. ఈ శక్తి నాకు శరీరం నుంచి రావడం లేదు. దేవుడిస్తున్నాడు. నేననేది ఏమీ లేదు. నేను దేవుని సాధానాన్ని మాత్రమే’అని ప్రధాని ఇంటర్వ్యూలో చెప్పడంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
దేశానికి ప్రధానిగా మోదీ అవసరం లేదు: సీఎం మమత
కోల్‌కతా: తనను దేవుడు గొప్ప ఉద్దేశమే కోసం భూమిపైకి పంపించాడని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. కోల్‌కతాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలు పాల్గొని మమత మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు తాను ఒక దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటున్నారు. అలా అయితే మోదీ తనకోసం ఒక దేవాలయం కట్టించుకొని అందులో కూర్చోవాలి. అంతేగాని దేశాన్ని ఇబ్బందుల పాలుచేయటం మానుకోవాలని సీఎం మమత ఎద్దేవా చేశారు.‘‘ఒక నేత మోదీని దేవుళ్లకే దేవుడు అంటారు.. మరో నేత పూరీ జగన్నాథ్ స్వామినే మోదీ భక్తుడు అంటారు. ఒకవేళ మోదీ దేవుడు అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లో రాజకీయాలు చేయకూడదు. దేవుడు ఎప్పడు అల్లర్లను ప్రేరేపంచడు’’ అని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘‘అటల్ బిహారీ వాజ్పయి వంటి ఎంతోమంది ప్రధాన మంత్రులతో నేను కలిసి పనిచేశాను. వాళ్లు అందరూ నాతో ప్రేమగా మెలిగేవారు. మన్మోహన్సింగ్, రాజీవ్ గాందీ, పీవీ, దేవేగౌడ వంటి ప్రధానులతో పని చేశాను కానీ, మోదీ వంటి ప్రధానిని నేను చూడలేదు. ఇటువంటి ప్రధాని భరతదేశానికి అవసరం లేదు’’ అని మోదీపై సీఎం మమత ధ్వజమెత్తారు.ఇటీవల ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను భౌతికంగా జన్మించలేదు. తనను భూమిపైకి దేవుడే పంపాడన్న విషయం తెలిసిందే. అదేవిధంగా బీజేపీ పూరీ పార్లమెంగ్ నియోజకవర్గ అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ స్వామి ప్రధాని మోదీకి భక్తుడని వ్యాఖ్యానించిన సంగతి విధితమే. -
ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆరవ విడతలో భాగంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 25న జరిగిన ఈ ఎన్నికల్లో రాజధాని వాసులు గతంలో కంటే తక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆరవ విడతలో ఓటర్ టర్నవుట్ డేటాను ఈసీ మంగళవారం(మే28) వెల్లడించింది.గతంలో ఢిల్లీలో 60.52 శాతం ఓట్లు పోలైతే ప్రస్తుత ఎన్నికల్లో అది 58.69 శాతానికి తగ్గిపోయింది. ఇక్కడ అత్యధికంగా కన్హయ్యకుమార్, మనోజ్‌తివారీ తలపడిన ఈశాన్య ఢిల్లీలో 62.87 శాతం ఓట్లు పోలవడం గమనార్హం. కన్హయ్యకుమార్ కాంగ్రెస్ నుంచి ఈ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఢిల్లీలో కాంగ్రెస్,ఆప్ కూటమి,బీజేపీ మధ్య ద్విముఖ పోరు జరిగింది.ఢిల్లీలో మొత్తం ఏడు ఎంపీ సీట్లున్నాయి. -
ఫలితాల తర్వాత నితీష్ ఏదైనా చేయొచ్చు: తేజస్వి
పాట్నా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిహార్ సీఎం మరోసారి కూటమి మారడానికి రెడీ అవుతారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై మంగళవారం(మే28)న తేజస్వి మీడియాతో మాట్లాడారు. జూన్ 4 తర్వాత సీఎం నితీష్ తన పార్టీని కాపాడుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పారు.కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు వేర్వేరు పార్టీలో పొత్తులు పెట్టుకుని అధికారంలో కొనసాగారు. అయితే ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో నితీష్ మాట్లాడుతూ ఇక మీదట తాను బీజేపీతో తప్ప మరే పార్టీతో పొత్తు పెట్టుకోనని హామీ ఇచ్చారు. తాను ప్లేటు ఫిరాయించడం ఇదే చివరిసారన్నారు. కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు బీజేపీ, ఆర్జేడీలతో పొత్తులు మార్చారు. -
నవీన్ పట్నాయక్‌పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
భువనేశ్వర్: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌పై అస్సాం సీఎం, బీజేపీ ఫైర్ బ్రాండ్ హిమంత బిశ్వశర్మ ఎక్స్(ట్విటర్)లో సంచలన పోస్టు పెట్టారు. సీఎం నవీన్ చేతుల కదలికలను కూడా ఆయన అనుయాయుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాండియన్ నియంత్రిస్తున్నారని హిమంత ఆరోపించారు. దీన్ని బట్టి పాండియన్ చేతిలో నవీన్ ఎంతగా బంధీగా మారారో తెలుస్తోందన్నారు. ప్రజలతో నవీన్ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. కాగా, తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ పట్నాయక్ ఒక పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతుండగా ఆయన చేతులు వణికాయి. ఇంతలో నవీన్‌కు మైక్ పట్టుకున్న పాండియన్ వెంటనే నవీన్ పట్నాయక్ వణుకుతున్న చేయి కనిపించకుండా పక్కకు పెట్టిన వీడియోను హిమంత తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒడిషాలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. This is a deeply distressing video. Shri VK Pandian ji is even controlling the hand movements of Shri Naveen Babu. I shudder to imagine the level of control a retired ex bureaucrat from Tamil Nadu is currently exercising over the future of Odisha! BJP is determined is give back… pic.twitter.com/6PEAt7F9iM— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 28, 2024 -
ప్రచారం ముగిశాక కన్యాకుమారికి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారి వెళ్లనున్నారు. జూన్ 1న జరగనున్న ఏడవ, తుది విడత ఎన్నికల ప్రచారానికి మే 30వ తేదీ సాయంత్రంతో గడువు ముగుస్తుంది.ప్రచారం ముగించుకుని 30న ప్రధాని కన్యాకుమారి చేరుకుంటారు. జూన్ 1 వరకు 3 రోజుల పాటు ఆయన కన్యాకుమారిలోనే ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా సముద్రం ఒడ్డున ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని ధ్యానం చేయనున్నారు. ఇదే స్థలంలో స్వామి వివేకానంద ఒకప్పుడు మూడు రోజులపాటు ధ్యానం చేశారు.ఈ పర్యటనలో ప్రధాని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే సమయం కేటాయించనున్నారు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనరు. 2019లోనూప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కేదార్‌నాథ్‌కు ధ్యానం చేసేందుకు వెళ్లారు. -
జూన్ 4 తర్వాత నవీన్‌బాబు ఇంటికే: అమిత్ షా
భద్రక్: ఒడిశాలో ఈసారి బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ, 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. మంగళవారం(మే28) భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చాంద్‌బలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొని మట్లాడారు. జూన్ 4 తర్వాత నవీన్‌బాబు సీఎంగా ఉండరన్నారు . 25 ఏళ్ల తర్వాత ఒడిశాకు ఒడియా భాష, సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన కొత్త వ్యక్తి సీఎంగా రాబోతున్నారన్నారు. ప్రస్తుతం తమిళ్‌బాబు(రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్) తెర వెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యువత ఉపాధి కోసం ఇక్కడే పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. -
స్వాతి మలివాల్ ‘ఆప్’ను వీడతారా..?
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి రాజీనామా చేసే విషయమై ఆ పార్టీ ఎంపీ స్వాతిమలివాల్ స్పందించారు. తాను ఆప్‌ను వీడటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలివాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.మే13న సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఆయన అనుచరుడు బిభవ్‌కుమార్ చేతిలో మలివాల్ దాడికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారని, ఆమె త్వరలో పార్టీ మారనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె తాజాగా ఖండించారు. బీజేపీ నేతలు తనతో టచ్‌లోకి రాలేదని చెప్పారు.తాను ఆప్‌లోనే కొనసాగుతానని, ఆ పార్టీ ఏ ఒకరిదో ఇద్దరిదో కాదన్నారు. పార్టీ కోసం తన చెమట, రక్తాన్ని ధారపోశానన్నారు. నిజానికి తనపై దాడి తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాత్రమే తనతో మాట్లాడారని, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తని మలివాల్ చెప్పుకొచ్చారు. -
జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ పూర్తి అయింది. ఏడో విడత పోలింగ్ జూన్1న జరగనుంది. ఏడో విడత పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి ఆల్ పార్టీ మీటింగ్ జూన్ 1(శనివారం)న జరగనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఏడో విడత పోలింగ్ కూడా ఉంది. కూటిమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలకు ఫలితాలకు నాలుగు రోజుల ముందు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలుకు వేళ్లే ఒక రోజు ముందు ఇండియా కూటమి మీటింగ్ జరగనుంది. సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అదే రోజు సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో విపక్ష కూటమి తీసుకోవల్సిన చర్యలు, లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు కనబర్చిన పనితీరుపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సామాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఇతర కీలక నేతలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.ఇక.. ఎన్డీయే కూటమిని ప్రతిపక్షాల ఇండియా కూటమి స్వీప్ చేస్తుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘ఆరు విడుతల పోలింగ్ పూర్తి అయింది. 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. పదవి నుంచి దిగిపోయే ప్రధాని రిటైర్మెంట్ ప్రణాళికలు రచించుకుంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విధి పూర్తిగా మూసివేయబడింది. దక్షిణంలో పూర్తిగా, ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతంలో సంగానికి బీజేపీ పడిపోయింది’’ అని జైరాం రమేష్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దించడానికి లక్ష్యంగా 28 విపక్ష పార్టీలతో కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్‌క్లూషన్ అలియన్స్ (INDIA) పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. -
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్‌కు.. అమిత్ షా కీలక ప్రకటన
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగియడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. అక్కడ ప్రశాంత వాతావరణంలో మోదీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందన్నారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. పీటీఐకి ఇచ్చిన తాజా ఇంటర్యూలో అమిత్ షా జమ్మూ కాశ్మీర్ విషయంలో తమ ప్రభుత్వ భవిష్యత్తు లక్ష్యాలను వెల్లడించారు. కాశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో అక్కడ అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇది చాలా పెద్ద పరిణామం. కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం మోదీ సర్కార్‌కు దక్కిన అతిపెద్ద విజయం. ఎన్నికలు ముగిసిన వెంటనే కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తాం’అని షా పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పోటీ వారి మధ్యే: ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
పాట్నా: ముస్లింల ఓటు బ్యాంకు ముందు ఇండియా కూటమి అవసరమైతే ముజ్రా డ్యాన్స్ చేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రధాని బిహార్‌ను అవమానించారని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి మనోజ్ కుమార్ తరపున బిహార్‌లోని ససరంలో ఆదివారం(మే26) ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఖర్గే మాట్లాడారు.ప్రధాని తనను తాను తీస్మార్ఖాన్ అనుకొంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రజలే తీస్మార్ఖాన్లని గుర్తుంచుకోవాలన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే ప్రజలు ఏమీ మాట్లాడటానికి కూడా ఉండదన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలు ప్రజలు వర్సెస్ మోదీయే తప్ప రాహుల్ వర్సెస్ మోదీ కానే కాదన్నారు. -
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరు విడతల్లో పోలింగ్ పూర్తి అయింది. అయితే.. విపక్షాల ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరితే.. ప్రధానమంత్రి ఎవరూ అని అడిగిన మీడియా ప్రశ్నకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున చమత్కారంగా స్పందించారు. ఈ ప్రశ్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి?’లా ఉందని అన్నారు. ఆయన శనివారం సిమ్లాలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇండియా కూటమి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా ప్రధాని మంత్రి ఎవరూ అనేవిషయంపై నాయకులమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. 2004 నుంచి 2014 వరకు యూపీఏ కూటమి పదేళ్లు పాలన చేసింది. ప్రధాని అభ్యర్థి ప్రకటన లేకుండా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే 2004లో కాంగ్రెస్‌లో కొంతమంది నాయకులకు సోనియా గాంధీ ప్రధాని కావాలని ఉండేది. కానీ ఆమె తిరస్కంచారు. అప్పుడు మాకు మేజార్టీ(140 సీట్లు) లేదు. 2009లో మేము 209 సీట్లను గెలిచాం. అలా యూపీఏ కూటమిగా పదేళ్లు పాలన అందించాం. కొన్నిసార్లు తెలివైనవాళ్లు కూడా చరిత్ర మర్చిపోతారు( బీజేపీ నేతలను ఉద్దేశించి). 2014లో బీజేపీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం తగ్గింపు ఏమి జరగలేదు. ప్రధాని మోదీ, 2014, 2019లో ఇచ్చిన పెద్దపెద్ద హామీలను పక్కన పడేశారు. ప్రకృతి విపత్తులతో తల్లిడిల్లిన హిమాచల్ ప్రదేశ్ ప్రధాని మోదీ చిన్న సాయం కూడా చేయలేదు. దేశంలో బీజేపీ ప్రభుత్వాలను కూలగొట్టింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు పన్నింది’’ అని ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ఫిబ్రవరి 27 జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటు వేశారు. అనంతరం వారు బీజేపీలో చేరారు. ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లో ఏడో విడతలో జూన్ 1 నాలుగు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడదల కానున్నాయి. -
మోదీ, బీజేపీని ఇరుకున పెట్టే వాళ్లు అయినందుకేనా?
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ మే 25 (శనివారం) ముగిసింది. నిన్న జరిగిన పోలింగ్‌లో గాంధీ కుటుంబం, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దేశంలో బలమైన ప్రతిపక్ష గొంతును వినిపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం.. అన్యాయమైన కేసుల్లో ఇరికించి నేర దర్యాప్తు పేరుతో టార్గెట్ చేసిందని తెలిపారు. దశాబ్దాలుగా ఏలిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై గతేడాది బీజేపీ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో సూరత్ కోర్టు దోషి తేల్చి.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అనంతరం ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. రెండేళ్ల జైలు శిక్షపై అత్యున్నత న్యాయ స్థానం స్టే విధించింది.మరోవైపు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తిరిగి జూన్‌లో తీహర్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఇన్‌కం టాక్స్ విభాగం స్తంభింపచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపచేయటం వల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఇబ్బందులు కలుగుతాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా.. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోని ప్రధాని మోదీ, బీజేపీ.. ప్రతిపక్ష పార్టీలు, నేతలను బలహీనపరుస్తున్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో దేశంలోని ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో అధికార బీజేపీ ప్రతిపక్షాలను బలహీన పర్చడానికి ప్రభుత్వ సంస్థలను వాడుకుంటోందని ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కౌంటింగ్ ఏజెంట్లే కీలకం
సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఎన్నికల నిబంధనలు–1961 ప్రకారం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ ఆమోదంతో కౌంటింగ్ ఏజెంట్లను నియమిస్తారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థి తరఫున ప్రతినిధిగా వ్యవహరించే కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కౌంటింగ్‌కు మూడు రోజుల ముందు సాయంత్రం 5గంటల్లోపు కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించిన ఫారం–18ను సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ఆర్వోలు కౌంటింగ్ ఏజెంట్లకు ఐడీ కార్డులు తయారు చేసి పంపుతారు. కౌంటింగ్‌కు గంట ముందు అపాయింట్మెంట్ లెటర్, ఐడీ కార్డ్ ఆర్వోలకు సమర్పించాల్సి ఉంటుంది. ఫారం–19 ద్వారా కౌంటింగ్ ఏజెంట్ అపాయింట్మెంట్ను రద్దు చేసే అధికారం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్‌కు ఉంటుంది. ఏజెంట్లకు అవగాహన అవసరం సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారం–17సీ పార్ట్–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం–17సీలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గం నంబర్, పోలింగ్ కేంద్రం పేరు, ఆ పోలింగ్ కేంద్రంలో వినియోగించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఆ ఫారంలోనే నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. టెండర్ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపర్ సీళ్లు (ఓటరుకు పోలింగ్ కేంద్రంలో ఇచ్చే రెండు రంగుల స్లిప్‌లు), సీరియల్ నంబర్లు, ఎన్ని పేపర్లు వినియోగించారు, వినియోగించని పేపర్ సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి, పాడైపోయిన పేపర్ సీళ్లు, సీరియల్ నంబర్ల వంటి వివరాలు ఇందులో ఉంటాయి.ట్యాంపరింగ్ జరిగితే..కంట్రోల్ యూనిట్ టేబుల్‌పైకి రాగానే అభ్యర్థి సీలింగ్ సెక్షన్ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్ ఏజెంట్లు, పరిశీలకులు చూసుకోవాలి. రిజల్ట్ సెక్షన్‌పై స్ట్రిప్ సీల్, గ్రీన్ పేపర్ సీల్ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్ నంబర్లు ఫారం–17సీలో నమోదు చేసినవే ఉండాలి. కంట్రోల్ యూనిట్ పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్ల ట్యాంపరింగ్ జరిగాయని గుర్తిస్తే పరిశీలకులు ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ట్యాంపరింగ్ జరగని కంట్రోల్ యూనిట్లను మాత్రమే లెక్కించాలి.మార్గదర్శకాలు ఇవీ..అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండిన వారిని ఏజెంట్లుగా నియమించుకుంటే వారు కౌంటింగ్ సక్రమంగా వీక్షించేందుకు వీలుంటుంది. సాయుధ రక్షణ కలిగిన వ్యక్తులను కౌంటింగ్ హాల్లోకి అనుమతించరాదని ఈసీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మునిసిపల్, జెడ్పీ చైర్మన్లు, పబ్లిక్‌రంగ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఏజెంట్లుగా కూర్చునేందుకు అనర్హులు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందేవారు, ప్రభుత్వ–ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే పార్ట్ టైమ్ ఉద్యోగులు, పారామెడికల్ స్టాఫ్, రేషన్ డీలర్లు, అంగన్వాడీ ఉద్యోగులు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 సెక్షన్ 134 (ఏ) ప్రకారం శిక్షార్హులవుతారు. వీరికి మూడు నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. సర్పంచ్‌లు, పంచాయతీ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. భారత పౌరసత్వం కలిగిన ఎన్నారైలు కూడా కూర్చోవచ్చు. ప్రభుత్వ గన్‌మెన్ సౌకర్యం ఉన్నవారు ఎన్నికల ఏజెంట్‌గా, కౌంటింగ్ ఏజెంట్‌గా ఉండకూడదు. అలాంటి వ్యక్తి సెక్యూరిటీతో గాని, సెక్యూరిటీ లేకుండా గానీ కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించకూడదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తనకున్న సాయుధ రక్షణను స్వచ్ఛందంగా వదులుకుంటే కౌంటింగ్ హాల్లో కూర్చునేందుకు అనుమతిస్తారు. ఒక కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు, ఒక ఆర్వో టేబుల్ కలిపి మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఆ మేరకు అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్లు, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీ పీబీఎస్) లెక్కింపునకు అదనపు టేబుళ్లు అవసరం అని భావిస్తే అందుకోసం వేరే కౌంటింగ్ హాల్లో అదనపు టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడు అభ్యర్థులు అక్కడ అదనంగా మరో కౌంటింగ్ ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. -
ఇండియా కూటమి 272 సీట్లలో గెలిచేసింది: జైరామ్‌రమేశ్
న్యూఢిల్లీ: ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి టార్గెట్ 350 సీట్లలో ఇప్పటికే 272 సీట్ల మార్క్ దాటామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ అన్నారు. ఈ మేరకు శనివారం(మే25) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పరిస్థితి సౌత్ మే సాఫ్, నార్త్ మే హాఫ్ అన్నట్లుగా తయారైందన్నారు. దక్షిణాదిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో పాటు ఉత్తరాదిలో బీజేపీ సీట్లు గతంతో పోలిస్తే సగానికి తగ్గనున్నాయన్నారు. హర్యానా, పంజాబ్‌లలో అయితే బీజేపీ లీడర్లను ప్రచారానికి రాకుండా ప్రజలు తరిమి కొడుతున్నారని చెప్పారు. బీజేపీ ప్రచారం గడువు కంటే ముందే ముగిసినందున ప్రధాని మోదీ తన రిటైర్మెంట్ను ప్లాన్ చేసుకునేందుకు కావల్సిన సమయం దొరుకుతుందని సెటైర్ వేశారు. -
ముగిసిన ఆరవ విడత పోలింగ్... ప్రధాని మోదీ కీలక ట్వీట్
న్యూఢిల్లీ: ఆరో విడత పోలింగ్‌లో ఓటు వేసిన వారందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం(మే25) సాయంత్రం ఎక్స్(ట్విటర్)లో మోదీ ఒక పోస్టు చేశారు. ఆరో విడత పోలింగ్ తర్వాత ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పెరిగిందన్నారు.ఇండియా కూటమి ఎలాగూ అధికారంలోకి రాదని ప్రజలు తెలుసుకున్నారని, అందుకే వారికి ఓటు వేయడం వృథా అని భావిస్తున్నారు. ఇదిలాఉంటే తమకు ఈ ఎన్నికల్లో రానున్న 352 సీట్లలో ఇప్పటికే 272 సీట్లు తమ ఖాతాలో వేసుకున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా, శనివారం ముగిసిన ఆరో విడత పోలింగ్‌తో దేశంలో ఇప్పటివరకు 486 ఎంపీ సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఏడవ, తుది విడత పోలింగ్ జూన్1న జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. -
ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
కోల్‌కతా: ఆరో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా బెంగాల్‌లోని ఝర్గ్రామ్లో బీజేపీ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గర్బెటాలోని పోలింగ్ బూత్‌లో కొందరు దుండగులు ఓటర్లను బెదిరిస్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి ప్రణత్‌టుడు ఆయన అనుచరులతో పోలింగ్ బూత్‌కు వెళ్లారు.వారు అక్కడికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ఆయనపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ప్రణత్ టుడు, పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రణత్‌ను అక్కడినుంచి సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో బీజేపీ నేత కారు ధ్వంసమైంది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రణత్ సెక్యూరిటీ గార్డు పోలింగ్ బూత్ వెలుపల ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళపై దాడి చేశాడని టీఎంసీ నేతలు కౌంటర్ ఆరోపణలు చేశారు. -
జయలలితపై అన్నామలై వ్యాఖ్యలు... ఖండించిన శశికళ
చెన్నై: దివంగత అన్నాడీఎంకే అధినేత జయలలిత గొప్ప హిందుత్వ నాయకురాలని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై జయలలితను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.అయోధ్యలో రామజన్మభూమిని నిర్మించాలని కోరుకున్న తొలి బీజేపీయేతర నేత జయలలిత అని అన్నామలై చెప్పారు. 2014కు ముందు తమిళనాడులో హిందూ ఓటర్లంతా జయలలితవైపే మొగ్గు చూపేవారని గుర్తు చేశారు. అయితే జయలలితపై అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలను ఆమె నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ కీలక నేత శశికళ ఖండించారు. జయలలితను ఏ ఒక్కవర్గానికో పరిమితం చేయడం సరికాదన్నారు.ఎంజీఆర్, అన్నాదురై బాటలో అన్ని వర్గాల కోసం జయలలిత కృషి చేశారని కొనియాడారు. అన్నామలై వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని శశికళ కొట్టిపారేశారు. -
ఐదు విడతల ఓటర్ టర్నవుట్ డేటా వెల్లడి.. ఈసీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఐదు విడతల కచ్చితమైన పోలింగ్ ఓటర్ టర్నవుట్ డేటాను ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం(మే25) వెల్లడించింది. ఓటింగ్ శాతాల డేటా అభ్యర్థులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. టర్నవుట్ డేటా అందించడంలో ఎలాంటి ఆలస్యం జరగలేదని, ప్రతి విడత పోలింగ్ రోజు ఉదయం 9.30నుంచి ఎప్పటికప్పుడు ఓటింగ్ డేటాను ఓటర్ టర్నవుట్ యాప్‌లో ఉంచామని తెలిపింది. పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని స్పష్టం చేసింది. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఈసీ ఖండించింది. ఐదు విడతల్లో బూత్‌ల వారిగా పోలింగ్ డేటాను వెబ్సైట్లో ఉంచాల్సిందిగా ఈసీని ఆదేశించాలని ఏడీఆర్ వేసిన పిటిషన్‌పై శుక్రవారమే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తాము ఈ విషయంలో ప్రస్తుత ఎన్నికల వేళ ఎలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీం తెలిపింది. ఈ విచారణ జరిగిన మరుసటి రోజు ఐదు విడతల్లో పోలైన కచ్చితమైన ఓటర్ టర్నవుట్ డేటాను ఈసీ వెల్లడించడం గమనార్హం.ఈసీ వెల్లడించిన పోలింగ్ శాతాలు..తొలివిడత - 66.14రెండో విడత- 66.71మూడో విడత- 65.68నాలుగో విడత-69.16ఐదో విడత - 62.20 -
ముందు మీ దేశం సంగతి చూసుకోండి: కేజ్రీవాల్ స్ట్రాంగ్ రిప్లై
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు, భారత్‌లో ప్రస్తుత రాజకీయాలపై జోక్యం చేసుకున్న పాకిస్థాన్ మాజీ మంత్రికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు రిప్లై ఇచ్చారు. మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ దేశం సంగతి మీరు చూసుకోండని చురకంటించారు. మీ సపోర్ట్ ఏమీ అవసరం లేదని తిప్పికొట్టారు. లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో శనివారం(మే25) కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఓటు వేసిన ఫొటోను తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. కేజ్రీవాల్ చేసిన ఈ పోస్ట్‌ను పాకిస్థాన్ మాజీ మంత్రి, ఎంపీ చౌధరి ఫహద్ హుస్సేన్ రీపోస్ట్ చేశారు.ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్‌ను జత చేశారు. ఇండియా ఎలక్షన్స్ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. చౌధరి కామెంట్లకు అరవింద్ కేజ్రీవాల్ తిరిగి వెంటనే స్పందించారు.‘చౌధరి సాహిబ్ మా దేశంలో సమస్యలను నేను, నా దేశ ప్రజలు పరిష్కరించుకోగలం. ఇందుకు మీ సలహాలు మాకు అక్కర్లేదు. అసలే మీ దేశం పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ముందు ఆ పని చూడండి. భారత్‌లో ఎన్నికలు పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. మీ జోక్యాన్ని మా దేశం ఏమాత్రం సహించదు’అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. -
ఓటు బ్యాంకు కోసం డ్యాన్సులు కూడా చేస్తారు: ప్రధాని మోదీ
పాట్నా: ఓటుబ్యాంకు ముందు ఇండియా కూటమి నేతలు అవసరమైతే డ్యాన్సులు వేస్తారని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు లాక్కుంటానంటే తాను మాత్రం చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. శనివారం(మే25) బిహార్‌లోని పాటలీపుత్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి నేతలు వారి ఓటు బ్యాంకు కోసమే పనిచేస్తారని, తనకు మాత్రం రాజ్యాంగమే సుప్రీం అని స్పష్టం చేశారు. ‘బిహార్ ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు నేను హామీ ఇస్తున్నా. మోదీ బతికున్నంతవరకు మీ హక్కులు ఎక్కడికి పోనివ్వను.ఓటుబ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తామంటే ఇండియా కూటమి నేతలను చేయనివ్వండి. నాకు మాత్రం రాజ్యాంగమే ముఖ్యం. ఆర్జేడీ,కాంగ్రెస్ కూటమి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు. -
ఇండియా కూటమి ఎఫెక్ట్..! కన్ప్యూజన్లో ఎగ్జిట్ పోల్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. దీంతో జూన్ ఒకటిన జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ప్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ నినాదంతో.. ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు ప్రారంభమయ్యాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో.. ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు.400సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగిన బీజేపీ.. నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్‌గా 303సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధి మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తరువాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్‌గా 300మార్కు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డునే తానే తిరగరాస్తానంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్‌లో పడిపోయిన ఇండియా కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్‌ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న ఇండియా కూటమి నాయకులు తరువాతి కాలంలో అసలు బీజేపి అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు, నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్‌సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్‌లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్‌లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. యూపీలో అఖిలేష్ మీటింగ్‌లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడునాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండి కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40 సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని.. కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం… విదేశీవిధానం, ఆర్ధిక పురోగతిలాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. నాలుగు వందల సీట్లు సాధ్యమే అని… ఒకవేళ 400సాధ్యం కాకపోయినా… గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని వీరు వాదిస్తున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ అంటున్నారు.అయితే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతారని దీంతో నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని సంజీవ్ అంచనా వేస్తున్నారు. రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ… ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రుచిర్ శర్మ గత పాతికేళ్లుగా భారత ఎన్నికల సరళిపై అధ్యయనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్రయాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీదాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమిత అవుతుందని యోగేంద్రయాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు.. ఎగ్జిట్ పోల్స్‌పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిగ్ పోల్స్ ఇవ్వడం అంత ఆశామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్ పోల్స్ ఈసారి మాత్రం కత్తిమీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు.:::: ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి -
ఈవీఎం ట్యాంపరింగ్‌పై స్పందించిన ఈసీ
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యలో శనివారం టీఎంసీ బీజేపీపై ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేసింది. బెంగాల్ రఘునాథపూర్లోని బంకురాలో బీజేపీ ఈవీఎం ట్యాపరింగ్‌కు పాల్పడినట్లు టీఎంసీ మండిపడింది. దీనికి సంబంధించిన ఫోటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఐదు ఈవీఎం మిషన్లకు బీజేపీ ట్యాగ్లు ఉండటం ఆ ఫోటో గమనించవచ్చు. ఈ వ్యవహరంలో బీజేపీపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం మమత నేతృత్వంలోని టీఎంసీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది.Smt. @MamataOfficial has repeatedly flagged how @BJP4India was trying to rig votes by tampering with EVMs.And today, in Bankura's Raghunathpur, 5 EVMs were found with BJP tags on them.@ECISVEEP should immediately look into it and take corrective action! pic.twitter.com/aJwIotHAbX— All India Trinamool Congress (@AITCofficial) May 25, 2024 ‘‘బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగి చేసి రిగ్గింగ్‌కు పాల్పడుతోంది. ఈ రోజు రఘునాథ్‌పూర్‌లో ఐదు ఈవీఎంకు బీజేపీ ట్యాగ్లు ఉండటం మా దృష్టకి వచ్చింది. ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని టీఎంసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి ఇది తొలిసారి కాదని టీఎంసీ విమర్శలు చేసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో కూడా బీజేపీ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని, ఒట్లర్లపై సైతం దాడి చేశారని సీఎం మమతా తీవ్ర విమర్శలు చేశారు.స్పందించిన బెంగాల్ ఎన్నికల సంఘం:టీఎంసీ ఆరోపణలపై బెంగాల్ ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పెట్టినప్పుడు కామన్ అడ్రస్ ట్యాగ్‌లను ఇస్తుంటాం. వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటాం. టీఎంసీ పేర్కొన్న కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టిన సమయంలో కేవలం బీజేపీ అభ్యర్థికి చెందిన ఏజెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నారు.(2/1) While commissioning, common address tags were signed by the Candidates and their agents present. And since only BJP Candidate's representative was present during that time in the commissioning hall, his signature was taken during commissioning of that EVM and VVPAT. pic.twitter.com/54p78J2jUe— CEO West Bengal (@CEOWestBengal) May 25, 2024 .. అందుకే ఆ ఏజెంట్ సంతకం మాత్రమే తీసుకున్నాం. ఇక.. ఆ తర్వాత పోలింగ్ జరుగుతున్న సమయంలో మిగతా ఏజెంట్ల సంతకాలు కూడా వాటిపై పెట్టించాం. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాం. ఈ ప్రక్రియనంతా వీడియో తీశాం. సీసీటీవీల్లోనూ రికార్డ్ అవుతుంది’’ అని ఈసీ స్పష్టం చేసింది. -
మోదీ కొత్త రాగం.. బీజేపీలో బిగ్ ట్విస్ట్!
ఢిల్లీ: భారత్ భవిష్యత్ కోసం ఎప్పుడో 18వ శతాబ్దంలో రూపొందించిన చట్టాలు, పద్దతులను తాను ఉపయోగించలేనన్నారు ప్రధాని మోదీ. కొత్త సంస్కరణలు, చట్టాలు తీసుకురావాలనే ఆలోచనలో తాను ఉన్నట్టు మనసులోకి మాటను కుండబద్దలు కొట్టారు. అలాగే, ఒక ముఖ్యమైన పని కోసం దేవుడు ఆయనను భూమి మీదకు పంపినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.కాగా, ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..‘వికసిత్ భారత్’ కల నెరవేర్చడం కోసం 2047 వరకు నిరంతరాయంగా పనిచేయాలనే బాధ్యతను దేవుడు నా మీద పెట్టాడు. ఆ పనిని పూర్తిచేయడానికే నన్ను భూమి మీదకు పంపించాడని నాకు అనిపిస్తున్నది. దీని కోసం దేవుడు నాకు దారిచూపించి, శక్తిని ఇచ్చాడు. ఇక, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానన్న నమ్మకం నాకుంది. అది నెరవేర్చే వరకు దేవుడు నన్ను పైకి పిలువడు’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.అయితే, బీజేపీ పార్టీ విషయానికి వస్తే కాషాయ పార్టీలో 75ఏళ్లకే రిటైర్మెంట్ అనే నిబంధన ఉంది. ఈ నిబంధన పార్టీలో ఉన్న ప్రతీ ఒక్కరికీ వర్తిస్తుంది. ఇక, ప్రస్తుతం మోదీ వయసు 74ఏళ్లు. మరో ఏడాదిలో మోదీ రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మోదీ.. వికసిత్ భారత్ నినాదం ఎత్తుకోవడంపై రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు.మోదీ మరికొన్నేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇలా కామెంట్స్ చేశారని చెబుతున్నారు. 75 ఏళ్లకే రిటైర్మెంట్ నిబంధన అనేది తనకు వర్తించబోదని మోదీ చెప్పారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన మనసులో దాచిపెట్టుకొన్న పదవీ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు బయటపెట్టారని అంటున్నారు. ఇక, బీజేపీలో 75 ఏళ్లు దాటిన కారణంగానే సీనియర్లను పక్క పెట్టిన విషయం తెలిసిందే. -
LS 2024: ముగిసిన ఆరో దశ ఎన్నికల పోలింగ్
Updatesఢిల్లీలో గతంతో పోలిస్తే తగ్గిన పోలింగ్ 7.45 గంటల వరకు 59 శాతం పోలింగ్ నమోదుఎండవేడికి ఓటింగ్‌కు రాని జనం బీహార్ : 53.30హర్యానా: 58.37జమ్మూ కాశ్మీర్: 52.28జార్ఖండ్ :62.74ఢిల్లీ : 54.48 ఒడిశా:60.07యూపీ:54.03వెస్ట్ బెంగాల్ : 78.19ముగిసిన ఆరో దశ ఎన్నికల పోలింగ్సాయంత్రం ఐదు గంటల వరకూ 57.70 శాతం పోలింగ్ ఢిల్లీ:సాయంత్రం 5 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 57.70బీహార్- 52.24హర్యానా -55.93జమ్మూ-కాశ్మీర్-51.35జార్ఖండ్- 61.41ఢిల్లీ -53.73ఒడిశా- 59.60ఉత్తరప్రదేశ్ - 52.02పశ్చిమ బెంగాల్- 77.99మధ్యాహ్నం 3 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 49.2బీహార్- 45.21హర్యానా -46.26జమ్మూ-కాశ్మీర్-44.41జార్ఖండ్- 54.34ఢిల్లీ -44.58ఒడిస్సా- 48.44ఉత్తరప్రదేశ్ - 43.95పశ్చిమ బెంగాల్- 70.19 ఢిల్లీ: సీపీఎం నేత ప్రకాశ్ కారత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | CPM leader Prakash Karat casts his vote in the sixth phase of Lok Sabha elections, in Delhi pic.twitter.com/858hVyqLos— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారం ఏచూరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | CPI(M) General Secretary Sitaram Yechury casts his vote in Delhi pic.twitter.com/xmd7RWEkVq— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఓటు వేశారు.#WATCH | Arvind Panagariya, Chairman of 16th Finance Commission casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi pic.twitter.com/BJlEKlYqOM— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:లోక్ సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోందిమధ్యాహ్నం 1 గంట వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన పోలింగ్ 39.13 శాతం బీహార్- 36.48%హర్యానా -36.48%జమ్మూ-కాశ్మీర్-35.22%జార్ఖండ్- 42.54%ఢిల్లీ - 34.37%ఒడిస్సా- 35.69%ఉత్తరప్రదేశ్ - 37.23%పశ్చిమ బెంగాల్- 54.80%పశ్చిమ బెంగాల్:బీజేపీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించకపోవటంపై మేదినిపూర్ బీజేపీ అభ్యర్థి అగ్ని మిత్రా పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి తన పోలింగ్ ఏజెంట్‌ను బూత్‌లో కూర్చుబెట్టారు.#WATCH | Paschim Medinipur, West Bengal | BJP candidate from Medinipur Lok Sabha seat, Agnimitra Paul alleges that BJP polling agents are not being allowed inside polling booths in Keshiary as voting is underway in the parliamentary constituency “Are you not seeing that our… pic.twitter.com/CREGf4awJa— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: బీజేపీ నేత నుపుర్ శర్మ హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Former BJP Spokesperson Nupur Sharma leaves from a polling station in Delhi after casting her vote for #LokSabhaElections2024(Earlier visuals) pic.twitter.com/BFYgtP82b5— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ: కేంద్రమంత్రి మీనాక్షి లేఖీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Union Minister and BJP MP Meenakashi Lekhi casts her vote for #LokSabhaElections2024 at a polling station in Delhi. She says, " I urge everyone to come out and vote. It is a festival of democracy and everyone should vote...Our government is going to be formed once… pic.twitter.com/27GokqlPi5— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Senior advocate and Rajya Sabha MP Kapil Sibal shows his inked finger after casting his vote at a polling booth in Delhi, for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/S8WLWfxQoM— ANI (@ANI) May 25, 2024 సీడీఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ దంపతులు ఓటు వేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Chief of Defence Staff (CDS) Gen Anil Chauhan, his wife Anupama Chauhan cast their votes for #LokSabhaElections2024 at a polling station in Delhi pic.twitter.com/aMdfHocLPU— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.#WATCH | Delhi CM Arvind Kejriwal, his family members show their inked fingers after casting their votes for the sixth phase of #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/Za10pO9sW2— ANI (@ANI) May 25, 2024 సీపీఐ(ఎం) సీనియర్ నేత బృందా కారత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | CPI(M) leader Brinda Karat says, "...I have voted against dictatorship and communalism. My vote will bring change..." https://t.co/c8aglrIvSd pic.twitter.com/v6OVwhCJMf— ANI (@ANI) May 25, 2024 లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 11 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన మొత్తం పోలింగ్ శాతం 25.76బీహార్- 23.67%హర్యానా -22.09%జమ్మూ-కాశ్మీర్-23.11%జార్ఖండ్-27.80%ఢిల్లీ -21.69%ఒడిస్సా-21.30%ఉత్తరప్రదేశ్ -27.06%పశ్చిమ బెంగాల్-36.88%#LokSabhaElections2024 | 25.76% voter turnout recorded till 11 am, in the 6th phase of elections. Bihar- 23.67% Haryana- 22.09% Jammu & Kashmir- 23.11% Jharkhand- 27.80% Delhi- 21.69% Odisha- 21.30% Uttar Pradesh-27.06% West Bengal- 36.88% pic.twitter.com/iwy8GyKzFe— ANI (@ANI) May 25, 2024 హర్యానా:ద్రోణాచార్య అవార్డు గ్రహిత, రెజ్లింగ్ కోచ్ మహవీర్ సింగ్ ఫోగట్ ఓటు వేశారు.#WATCH | Haryana: Dronacharya awardee and wrestling coach Mahavir Singh Phogat casts his vote. He also casts a vote on behalf of his wife at a polling centre in Charkhi Dadri for the sixth phase of #LokSabhaElections2024 Former wrestler and BJP leader Babita Phogat also cast… pic.twitter.com/BKLH5Hgrtt— ANI (@ANI) May 25, 2024 దిగ్గజ మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | After casting his vote for the #LokSabhaElections2024 , former Indian Cricketer Kapil Dev says "I feel very happy that we are under democracy. The important thing is to pick the right people for your constituency...What we can do is more important than what the govt can… pic.twitter.com/Cl0XAb71Aq— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన ప్రియాంకా గాంధీ వాద్రాఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra casts her vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/wrg0wOISAw— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన ప్రియాంకా గాంధీ కుమార్తె, కుమారుడుఢిల్లీ: ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా,కూతురు మిరాయా వాద్రా ఓటు వేశారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు.Raihan Rajiv Vadra and Miraya Vadra, children of Robert Vadra and Congress leader Priyanka Gandhi Vadra show their inked fingers after casting their votes for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/c1pcraZCdY— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన ఎంపీ స్వాతి మలివాల్ఢిల్లీ:ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.#WATCH | Aam Aadmi Party Rajya Sabha MP Swati Maliwal casts her vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling booth in Delhi. pic.twitter.com/4jLu7RoHdz— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన మాజీ రాష్ట్రపతిఢిల్లీ:మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ ఓటు వేశారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Former President Ram Nath Kovind casts his vote for #LokSabhaElections2024 at a polling centre in Delhi pic.twitter.com/9IE5wbI7LJ— ANI (@ANI) May 25, 2024 ఒడిశా:ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఓటు వేశారు. భువనేశ్వర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Odisha CM Naveen Patnaik casts his vote for the sixth phase of #LokSabhaElections2024 and third phase of Odisha Assembly elections, at a polling station in Bhubaneswar pic.twitter.com/c0sGZ5xsIe— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు వేశారుఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన రాహుల్.. అనంతరం తల్లి సోనియా గాంధీతో సెల్ఫీ ఫొటో దిగారు.తొలిసారి సోనియా గాంధీ కుటుంబం కాంగ్రెసేతర అభ్యర్థికి ఓటు వేశారు. ఢిల్లీలో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆప్‌లో పొత్తులో బరిలోకి దిగాయి.దీంతో ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతికి సోనియా గాంధీ కుటుంబం మద్దతు తెలిపింది.#WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and party MP Rahul Gandhi click a selfie as they leave from a polling station after casting their votes for #LokSabhaElections2024 pic.twitter.com/PIvovnGPdJ— ANI (@ANI) May 25, 2024 ఓటువేసిన ఉప రాష్ట్రపతి దంపతులుఢిల్లీ: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Vice President Jagdeep Dhankhar, his wife Sudesh Dhankhar show their inked fingers after casting their votes for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/LsUrRyEusU— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:ఢిల్లీలో మందకోడిగా పోలింగ్ఉదయం 9 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 10.82బీహార్- 9.66%హర్యానా -8.31%జమ్మూ-కాశ్మీర్-8.89%జార్ఖండ్-11.74%ఢిల్లీ -8.94%ఒడిస్సా-7.43%ఉత్తరప్రదేశ్ -12.33%పశ్చిమ బెంగాల్-16.54% ఢిల్లీ:ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓటు వేశారు.ఆయన ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj casts his vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Delhi pic.twitter.com/chqk73Ydxs— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఓటు వేశారు.#WATCH | President Droupadi Murmu casts her vote for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/O8wB4aLBLG— ANI (@ANI) May 25, 2024 జమ్మూ కశ్మీర్:పోలీసులు తీరుకు నిరసనగా పీడీపీ చీఫ్, అనంత్‌నాగ్- రాజౌరీ అభర్థి మెహబూబా ముఫ్తీ నిరసన దిగారు.ఏ కారణంగా లేకుండా పీడీపీ పోలింగ్ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె ఆరోపణలు చేశారు.#WATCH | Anantnag, J&K: PDP chief and candidate from Anantnag–Rajouri Lok Sabha seat, Mehbooba Mufti along with party leaders and workers sit on a protest. She alleged that the police have detained PDP polling agents and workers without any reason. pic.twitter.com/dPJb4dolKQ— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన తెలంగాణ గవర్నర్ రాంచీ:జార్ఖండ్, తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆయన రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఢిల్లీ:ఢిల్లీ మంత్రి అతిశీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు#WATCH | Delhi minister & AAP leader Atishi casts her vote for #LokSabhaElections2024, at a polling booth in Delhi pic.twitter.com/AdfX0qlvkW— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.#WATCH | Delhi: Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh casts his vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Ranchi. pic.twitter.com/UoaWLUxEg7— ANI (@ANI) May 25, 2024 ఒడిశా:బీజేడీ నేత వీకే పాండియన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనేశ్వర్‌లోని ఓ పొలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | 5T Chairman and BJD leader VK Pandian casts his vote for the sixth phase of #LokSabhaElections2024 and third phase of Odisha Assembly elections, at a polling booth in Bhubaneswar. pic.twitter.com/WBOdNJ4ZSX— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో గంబీర్ ఓటు వేశారు.#WATCH | BJP East Delhi MP and former India Cricketer Gautam Gambhir casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/1dNMGyCoUq— ANI (@ANI) May 25, 2024 జమ్మూ కశ్మీర్జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజౌరీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంత్ నాగ్-రాజౌరీ స్థానంలో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెస్స్ (జేకేఎన్సీ) తరఫున మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీలో ఉన్నారు. పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.#WATCH | Jammu and Kashmir BJP President Ravinder Raina casts his vote at a polling booth in RajouriJammu and Kashmir National Conference (JKNC) has fielded Mian Altaf Ahmad from the Anantnag-Rajouri Lok Sabha seat. PDP has fielded Mehbooba Mufti from this seat.… pic.twitter.com/LmEFuMkIOt— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-1 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.ఆయన ఈస్ట్ ఢిల్లీ నుంచి బరిలో దిగారు.ఆయనపై ఆప్ కుల్దీప్ కుమార్‌ను పోటీకి దింపింది.#WATCH | Delhi BJP president Virendraa Sachdeva casts his vote at a polling booth in Mayur Vihar Phase 1. BJP has fielded Harsh Malhotra from East Delhi Lok Sabha seat. AAP has fielded Kuldeep Kumar#LokSabhaElections2024 pic.twitter.com/I9ftlwnS12— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీన్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి బాన్సూరి స్వరాజ్ ఓటు చేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆమె ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిపై తలపడుతున్నారు#WATCH | BJP Lok Sabha candidate from New Delhi, Bansuri Swaraj casts her vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Delhi.AAP has fielded Somnath Bharti from the New Delhi Lok Sabha seat. pic.twitter.com/hCM2o3wqjx— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:విదేశాంగ మంత్రి డా. ఎస్ జైశంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | External Affairs Minister Dr S Jaishankar casts his vote at a polling booth in Delhi, for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/SbWDv9jWZc— ANI (@ANI) May 25, 2024 హర్యానా:హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.మీర్జాపూర్ గ్రామంలో ఓటు వేశారు.#WATCH | Haryana CM Nayab Singh Saini, his wife Suman Saini show their inked fingers after casting their votes at a polling booth in his native village Mirzapur, Narayangarh pic.twitter.com/TojCp0ygbU— ANI (@ANI) May 25, 2024ఢిల్లీ:ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది.ఢిల్లీలోని ఏడు సీట్లకు పోటీపడుతున్న 162 మంది అభ్యర్థులుఆరవ విడత లో 8 రాష్ట్రాల్లోని 58 సీట్లకు పోలింగ్ఒడిశా అసెంబ్లీలోని 42 సీట్లకూ పోలింగ్ఓటు హక్కు వినియోగించుకోనున్న 11.13 కోట్ల మంది ఓటర్లు1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు కొనసాగనున్న పోలింగ్ఇప్పటివరకు 25 రాష్ట్రాల్లోని 428 ఎంపీ సీట్లకు ముగిసిన పోలింగ్ఢిల్లీ:కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారుUnion Minister Hardeep Singh Puri, his wife Lakshmi Puri show their inked fingers after casting their votes at a polling booth in Delhi#LokSabhaElections2024 pic.twitter.com/j9norx9jL1— ANI (@ANI) May 25, 2024 ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేయాలి: ప్రధాని మోదీఆరో విడుతలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేయాలని కోరుతున్నా.ప్రతి ఓటు చాలా ముఖ్యమైంది.. మీ ఓటు కూడా కీలకమైంది.ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరంమహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయండి: ప్రధాని మోదీPrime Minister Narendra Modi tweets "I urge all those who are voting in the 6th phase of the 2024 Lok Sabha elections to vote in large numbers. Every vote counts, make yours count too. Democracy thrives when its people are engaged and active in the electoral process. I specially… pic.twitter.com/bqM3ba2Okq— ANI (@ANI) May 25, 2024 ఆరో విడత పోలింగ్‌లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు.ఈశాన్య ఢిల్లీలో మనోజ్ తివారీ- కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు.పురీలో సంబిత్ పాత్ర- అరూప్ పట్నాయక్ పోటీ పడుతున్నారు.హర్యానాలోని కార్నాల్‌లో మనోహర్ లాల్ కట్టర్- దివ్యాన్షు బుదిరాజా బరిలో ఉన్నారు. హర్యానా: హర్యానా మాజీ సీఎం, కర్నాల్ బీజేపీ అభ్యర్థి మనోహర్ లాల్ కట్టర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.కర్నాల్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు#WATCH | Former Haryana CM and BJP candidate from Karnal Lok Sabha seat, Manohar Lal Khattar casts his vote at a polling booth in Karnal, HaryanaCongress has fielded Divyanshu Budhiraja from this seat. pic.twitter.com/owrFUNtzXy— ANI (@ANI) May 25, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది.Voting for the sixth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 58 constituencies across 8 states and Union Territories (UTs) today. Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/leDZIY9HIa— ANI (@ANI) May 25, 2024 కాసేపట్లో లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ప్రారంభం కానుందిలోక్సభ ఎన్నికల్లో ఆరో విడతకు పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది.#WATCH | #LokSabhaElection2024 | People queue up outside a polling booth in Ranchi to cast their votes; voting will begin at 7 amJharkhand's 4 constituencies will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/nPm398UfeM— ANI (@ANI) May 25, 2024 హరియాణాలో మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలతో పాటు మశ్చిమ గాల్లోని గిరిజన ప్రాబల్య జంగల్‌మహల్ ప్రాంతంలోని పలు లోక్‌సభ స్థానాలు వీటిలో ఉన్నాయి.ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్ జరగనుంది. దీంతో 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది.#WATCH | #LokSabhaElection2024 | Preparations, mock polls underway at a polling booth in Rajouri, J&KJammu and Kashmir's Anantnag-Rajouri constituency constituency will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/15zvuLK08k— ANI (@ANI) May 25, 2024 మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. బరిలో కీలక నేతలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇందర్జీత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్‌తో పాటు మేనకా గాంధీ, సంబిత పాత్ర, మనోహర్‌లాల్ ఖట్టర్ (బీజేపీ), రాజ్‌బబ్బర్, కన్హయ్య కుమార్, దీపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.#WATCH | #LokSabhaElection2024 | Preparations, mock polls underway at a polling booth in Rohtak, HaryanaHaryana's 10 constituencies will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/p2Cws1ktcr— ANI (@ANI) May 25, 2024 హరియాణాలోని కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం నాయబ్‌సింగ్ సైటీ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన ఇటీవలే సీఎంగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. మరోవైపు హరియాణా, ఢిల్లీల్లో 2019లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. -
రేపు బీజేపీ కార్యకర్తలకు నడ్డా వేకప్ కాల్
న్యూఢిల్లీ: బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తలను శనివారం(మే25) ఉదయం 5 గంటలకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిద్ర లేపనున్నారు. అంత మంది ఇళ్లకు నడ్డా ఒకేసారి వెళ్లలేరు కాబట్టి వారి ఫోన్లకు ఆయన తెల్లవారుజామునే ఫోన్ చేయనున్నారు.ఫోన్ ఎత్తగానే నడ్డా ఇచ్చే ఒక్క నిమిషం సందేశాన్ని వారు విననున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవాలన్న నినాదాన్ని వారికి నడ్డా తన సందేశంలో గుర్తు చేయనున్నారు. ‘జన్‌జన్‌కీ యహీ పుకార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఇస్ బార్ 400 పార్’అని నడ్డా తన సందేశం వినిపించనున్నారు. శనివారం ఆరోవిడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. -
‘అగ్నిపథ్’ స్కీమ్‌పై వ్యాఖ్యలు... క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ:అగ్నిపథ్ స్కీమ్‌పై దేశ ప్రజలకు తామిచ్చిన హామీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)పరిధిలోకే వస్తుందని ఎన్నికల కమిషన్(ఈసీ)కి కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు పార్టీ ఈసీకి ఒక లేఖ రాసింది. సాయుధ దళాలను రాజకీయం చేయవద్దని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఈసీ సూచించిన నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.అగ్నిపథ్ స్కీమ్ విషయమై శుక్రవారం(మే24) ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్ సర్వీస్‌మెన్ విభాగం చీఫ్ కల్నల్ రోహిత్ మీడియా సమావేశంలో స్పందించారు. ‘సాయుధ దళాలు దేశ భద్రత కోసం గొప్పగా పనిచేస్తున్నాయి. మేం కేవలం అగ్నిపథ్ స్కీమ్ గురించే మట్లాడుతున్నాం. ఈ స్కీమ్‌ను తీసుకువచ్చి ఆర్మీని మోదీ ప్రభుత్వం బలహీనపరిచింది. ఈ స్కీమ్ దేశ ప్రజలు, ఆర్మీ జవాన్ల ప్రయోజనాలకు ఎంత మాత్రం మేలు చేయదు. అందుకే రద్దు చేస్తాం’అని తెలిపారు. -
రేపే ఆరో విడత.. 58 స్థానాలకు పోలింగ్
న్యూఢిల్లీ, సాక్షి: సుదీర్ఘంగా సాగుతున్న(46 రోజులపాటు) సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా.. రేపు(మే 25, శనివారం) ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఉదయం 7గం.కు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ విడతలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 889 మంది ఎన్నికల బరిలో నిలబడ్డారు.ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఢిల్లీ పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో, హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో ఒకేదఫాలో శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో 42 ఎమ్మెల్యే స్థానాలకూ రేపే పోలింగ్ జరగనుంది. బరిలో ముఖ్య నేతలు బీజేపీ నేతలు మనోహర్ లాల్ ఖట్టర్(హరియాణాలోని కర్నాల్), ధర్మేంద్ర ప్రధాన్(ఒడిశాలోని సంబల్పూర్), అభిజిత్ గంగోపాధ్యాయ్(పశి్చమబెంగాల్‌లోని తామ్లుక్), నవీన్ జిందాల్ (కురుక్షేత్ర), రావు ఇందర్జిత్ సింగ్( గురుగ్రామ్), మేనకా గాంధీ( ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్)తోపాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ( జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్–రాజౌరీ) బరిలో ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ నేత మనోజ్ తివారీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పోటీ పడుతున్నారు.ఇప్పటివరకు ఐదు దశల్లో వివిధ రాష్ట్రాల్లో 428 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. జూన్ 1వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఏడో విడత మిగిలిన 57 స్థానాలకు పోలింగ్‌తో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన లోక్‌సభతో పాటు ఒడిషా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తెలంగాణ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. -
‘సుల్తాన్పూర్ ప్రజల ‘అమ్మ‘కు మద్దతు ఇవ్వడానికి వచ్చా’
లక్నో: దేశంలో కేవలం సుల్తాన్పూర్ నియోజకవర్గం ప్రజలు మాత్రమే తమ ఎంపీని ‘అమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తారని బీజేపీ నేత వరుణ గాంధీ అన్నారు. వరుణ గాంధీ తన తల్లి మేనకా గాంధీ కోసం గురువారం సుల్తాన్పూర్ పార్లమెంట్ స్థానంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేనకా గాంధీ సుల్తాన్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా వరుణ్ గాంధీ మాట్లాడారు.‘‘దేశంలోనే ఒకే ఒక పార్లమెంట్ స్థానంలో అక్కడి ప్రజలంతా తమ ఎంపీని ఆప్యాయంగా ‘అమ్మ’ అని పిలుస్తారు. నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మ మేనకా గాంధీకి ప్రజలు మద్దలు ఇవ్వాలని కోరడానికి రాలేదు. సుల్తాన్పూర్ ప్రజల ‘అమ్మ’కు మద్దతు ఇవ్వాలని కోరటం కోసం వచ్చా’’ అని వరుణ్ గాంధీ అన్నారు.#WATCH | Uttar Pradesh | BJP leader Varun Gandhi campaigns for his mother and party candidate from Sultanpur constituency Maneka Gandhi "There is only one constituency in the country where its people do not call its MP as 'Sansad' but as 'Maa'...I am here not just to gather… pic.twitter.com/8n7u9k8Ztp— ANI (@ANI) May 23, 2024మేనకా గాంధీ సుల్తాన్పూర్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయటం ఇది రెండోసారి. 2019 ఎన్నికల్లో ఆమె ఇక్కడ 14000 వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈసారి భారీ మెజార్టీ సాధించటంపై బీజేపీ దృష్టి పెట్టింది. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం సుల్తాన్‌పూర్‌లో మేనకా గాంధీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఇక.. ఫిలిబీత్ సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్ గాంధీకి ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే వరుణ్ గాంధీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించటం వల్లనే బీజేపీ ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదని రాజకీయంగా పార్టీలో చర్చ జరుగుతోంది. -
స్వాతిమలివాల్‌పై దాడి.. తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై తన ఇంట్లో జరిగిన దాడి పట్ల పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనలో రెండు వెర్షన్లు ఉన్నాయని ఏది నిజమో తేలాలంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగాలన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం కావాలన్నారు. ఈ విషయమై బుధవారం(మే22) కేజ్రీవాల్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాగా, మే13న ఎంపీ స్వాతిమలివాల్ సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని మలివాల్ తొలుత ఆరోపించారు. వివాదం పెద్దదైన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంలో ఆప్ నేతలు, స్వాతిమలివాల్ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. -
ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను హెచ్చరించింది. ప్రచార సమయంలో కులం, భాష, మతపరమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని ఇరు పార్టీలకు ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది.ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో సహా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టార్ క్యాంపెయినర్లకు ఒక నోట్ జారీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున్ ఖర్గే, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలను ఈసీ ఆదేశించింది. వారి ప్రసంగాలను సరి చేసుకొవటంతోపాటు, తగిన శ్రద్ధ వహించాలని తెలియజేయాలన్నారు. వారసత్వంగా వస్తున్న నాణ్యమైన ఎన్నికల ప్రక్రియను దిగజార్చడాన్ని ఊరుకోబోమని ఎన్నికల సంఘం తేల్చి చేప్పింది.ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు సైతం ఎటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని ఈసీ సూచించింది. అగ్ని వీర్ వంటి పథకాలపై ప్రసంగించే సమయంలో సాయుధ బలగాలకు రాజకీయం చేవద్దని తెలిది. అలా చేస్తే సాయుధ బలగాల సామాజిక, సాంస్కృతిక ప్రతిష్టను దెబ్బతీయటం అవుతుందని కాంగ్రెస్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.