మోదీకేనా అమిత్‌ షా పరోక్ష సంకేతం: చిదంబరం | congress chidambaram says Amit Shah Hinted at PM over age remark Naveen Patnaik | Sakshi
Sakshi News home page

మోదీకేనా అమిత్‌ షా పరోక్ష సంకేతం: చిదంబరం

Published Wed, May 22 2024 12:10 PM | Last Updated on Wed, May 22 2024 12:21 PM

congress chidambaram says Amit Shah Hinted at PM over age remark Naveen Patnaik

ఢిల్లీ:  వయసు ఎక్కువైంది కాబట్టి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ రిటైర్‌ కావాలని అంటున్న కేంద్ర హోం మంత్రి... ప్రధాని నరేంద్ర మోడీకి పరోక్షంగా అదే సూచన  చేస్తున్నారా? అని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పి. చిదంబరం ప్రశ్నించారు.  అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. ప్రధాని నరేంద్ర మోదీకి  వయసు విషయంలో ఓ సంకేతం  ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. ఒకవేళ మళ్లీ బీజేపీ అధికారంలోకి  వస్తే.. మోదీ పీఎం కుర్చిని అమిత్‌ షా లాక్కునే ఆలోచనలో ఉ‍న్నారని  ‘ఎక్స్‌’వేదికగా  విమర్శలు గుప్పించారు.

‘‘అధిక వయసు (77 ఏళ్లు) కారణంగా  ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను అమిత్‌ షా రిటైర్‌ కావాలంటున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. అధిక వయసుకు సంబంధించి ముందుగానే ప్రధాని మోదీ (73 ఏళ్ల ఏడు నెలలు)కి అమిత్‌ షా ఒక సంకేతం ఇచ్చారా?. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే అత్యంత సంతోషించే వ్యక్తి అమిత్‌ షా. ఎందుకు కంటే  వయసు రీత్యా మోదీ కాకుండా ప్రతిపక్ష నేతగా అమిత్‌ షా కూర్చుంటాని తెలుస్తోంది!’’ అని చిదంబరం మండిపడ్డారు.

 

ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా సీఎం నవీన్‌ పట్నాయక్‌పై ధ్వజమెత్తారు. ‘‘నవీన్‌ పట్నాయక్‌ 77 ఏళ్లు ఉంటారు. అధిక వయసు, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన రిటైర్‌ కావాలి. ఇక.. ఒడియా భాష స్పష్టంగా మాట్లాడే భూమి పుత్రుడిని ఒడిశాకు సీఎం చేస్తామని బీజేపీ వాగ్ధానం చేస్తుందని తెలిపారు. ఇప్పటికే జరిగిన ఐదు విడుతల్లోబీజేపీ 310 స్థానాల్లో గెలస్తుంది. అన్ని విడతల్లో మొత్త 400 స్థానాలను కౌవసం చేసుకుంటుంది’’ అని అమిత్‌ షా అ‍న్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement