p chidambaram
-
ప్రస్తుతం జమిలి ఎన్నికలు అసాధ్యం: చిదంబరం కీలక వ్యాఖ్యలు
న్యూడిల్లీ: ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందన్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ సాధ్యం కాదని, అందుకోసం కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని తెలిపారు.సోమవారం ఆయన చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగం సవరణలు చేయాలని వాటిని లోక్ సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు మోదీకి మెజారిటీ సంఖ్య లేదని అన్నారు. ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే రాజ్యాంగపరమైన అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయని నొక్కి చెప్పారు. జమిలీ ఎన్నికలు అసాధ్యమని, ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.అయితే రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందంటూ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మాటలకు ఖండించారు. తాము ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాము. వాటిని ఎందుకు రద్దు చేయాలని కోరుకుంటామని అన్నారు. తాము కేవలం 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలని మాత్రమే చెబుతున్నామని తెలిపారు. కుల గణన కోరేది మేమే.. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నాం.. ప్రధాని చెప్పేవన్నీ నమ్మొద్దు’ అని వెల్లడించారు.ఇదిలా ఉండగా గత నెలలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలపై గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుంచి బయట పడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
కేంద్ర బడ్జెట్ 2024-25: ఎవరేమన్నారంటే..
ఢిల్లీ: 2024-25 ఏడాదికి సంబంధించి మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మి శ్రమ స్పందనలు వస్తున్నాయి. బడ్జెట్‌పై ఎవరు ఏమన్నారో వారి మాటల్లోనే..సామాన్య ప్రజలకు ఏం లేదు: రాహుల్ గాంధీకేంద్ర బడ్జెట్‌పై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది కుర్చీ బచావో బడ్జెట్‌గా అభివర్ణించారు. ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కనబెట్టి.. మిత్రపక్షాలకు ప్రభుత్వం హామీల వర్షం కురిపించిందని మండిపడ్డారు. బడ్జెట్ వల్ల సాధారణ ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు. ఇది గత బడ్జెట్ల కాపీ పేస్ట్ మాత్రమేనని చెప్పారు. మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్పందించారు. లోక్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదివినట్లు తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే.. ‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని 30 పేజీలో వివరించిన ఉపాధి సంబంధిత పోత్సాహకం (ఈఎల్ఐ)ను బడ్జెట్లో పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. మేనిఫెస్టోలోని 11వ పేజీలో పేర్కొన్న ప్రతి ఒక్క అప్రెంటీస్‌కు అలవెన్స్‌తో కూడిన అప్రెంటీస్‌షిప్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు సంతోషం. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఇంకా కొన్ని ఇతర అంశాలను ఆర్థిక మంత్రి కాపీ చేసి ఉంటే బాగుండేది’ అన్నారు. I am glad to know that the Hon'ble FM has read the Congress Manifesto LS 2024 after the election resultsI am happy she has virtually adopted the Employment-linked incentive (ELI) outlined on page 30 of the Congress ManifestoI am also happy that she has introduced the…— P. Chidambaram (@PChidambaram_IN) July 23, 2024 కేంద్ర బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల కోసం కాదు.. ప్రభుత్వాన్ని కాపాడుపోవటం కోసమే’అని అన్నారు.#WATCH | Post Union Budget, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "I think this budget should be called 'PM Sarkaar Bachao Yojana' because they have realised if they want to save this Govt for the next 5 years, they would need their alliance partners to be happy. After… pic.twitter.com/PShIvHAqWR— ANI (@ANI) July 23, 20242024-25 బడ్జెట్ ‘పీఎం సర్కార్ బచావో యోజనా’ అని శివసేవ (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది విమర్శలు చేశారు. ఈ బడ్జెట్‌ను గమనిస్తే.. ఐదేళ్ల తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం ప్రవేశపెట్టిందిగా ఉంది. బీజేపీ మిత్రపక్షాల సంతోషం కోసం ఈ బడ్జెట్ రూపొందించారు. కేంద్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన..తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాం. దక్కింది శూన్యం.రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారుబడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం.తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే.ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీలపైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారుఅనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాంములుగు యూనివర్సిటీకి అదనపునిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు.రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదు.ఐఐఎం సహా నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదుతెలంగాణ నుంచి ముంబై- నాగపూర్, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదుమెగా పవర్ లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగిన కూడా కేంద్రం స్పందించలేదు.తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదుతెలంగాణకి మరోసారి ఈ కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండుస్తున్నా.తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముందిఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన మాకు తెలియజేస్తోందిపార్లమెంట్లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదుఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళు8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుడ్ను సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు.ఆంధ్రప్రదేశ్‌కి నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదుసోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపుల పైన, వారు బాగుండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదు.రాజధాని అమరావతి కోసం, పోలవరంతో, పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారుఏపీ ఇండస్ట్రీయల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి దుగ్ధలేదు, సంతోషమే.కానీ ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరంఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదుకేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ మాట్లాడారు. రైతుల కోసం ఎన్డీయే ప్రభుత్వం పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసింది. ప్రభుత్వం వాగ్దానాల వల్ల రైతులు ఏం సాధించారు?. ఈ బడ్జెట్లో ఎంఎస్పీ ప్రస్తావన లేదు. కిసాన్ నిధిని పెంచలేదు. బీహార్, ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలకు మాత్రం బీజేపీ భారీ కేటాయింపులు ప్రకటించింది.#WATCH | Post Budget 2024: Congress leader Pramod Tiwari says, "... They had made big promises for farmers, but what did they get? There was no mention of MSP, and neither was there an increase in Kisan Nidhi... They have handed a 'jhunjhuna' to Bihar and Andhra Pradesh..." pic.twitter.com/gXuKMqj2vJ— ANI (@ANI) July 23, 2024‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘పెహ్లీ నైక్రి పక్కి’అని ప్రతిపాధించిన అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆర్థిక మంత్రి కాపీ చేసి కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారు’అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు చేశారు. The Finance Minister has taken a leaf out of the INC's Nyay Patra 2024, with its internship program clearly modelled on the INC's proposed Apprenticeship Program that was called Pehli Naukri Pakki. However, in their trademark style, the scheme has been designed to grab… pic.twitter.com/1viGt9rgfg— Jairam Ramesh (@Jairam_Ramesh) July 23, 2024 -
ఎమర్జెన్సీ తప్పేనని నాడు ఇందిరనే ఒప్పుకున్నారు: చిదంబరం
ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం 1975 నాటి ఎమర్జెన్సీపైనే ప్రత్యేకంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ విధించడం పొరపాటని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా అంగీకరించారని చిదంబరం చెప్పుకొచ్చారు.కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ చిదంబరం తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘దేశంలో నేడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతాన్ని బీజేపీ మర్చిపోవాలి. ఇవాళ దేశంలో నివసిస్తున్న 75 శాతం ప్రజలు 1975 తర్వాత పుట్టినవారే ఉన్నారు. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ గురించి ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం లేదు కాదా?. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటే సరిపోతుంది. అయినా, ఎమర్జెన్సీ విధించడం పొరపాటు అని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా అంగీకరించారు’ అని గుర్తు చేశారు.ఇదిలా ఉండగా.. కేంద్రం జూలై 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిరోజూ ‘రాజ్యాంగ హత్య’కు పాల్పడుతోందన్నారు. దేశంలోని పేదలు, అణగారిన ప్రజల ఆత్మగౌరవాన్ని దోచుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సీనియర్ నేత జైరాం రమేష్.. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఫలితాలు విడుదలైన రోజును(జూన్ 4)ను మోదీ ముక్తీ దివస్‌గా జరుపుకోవాలని సూచించారు. -
మోదీకేనా అమిత్ షా పరోక్ష సంకేతం: చిదంబరం
ఢిల్లీ: వయసు ఎక్కువైంది కాబట్టి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రిటైర్ కావాలని అంటున్న కేంద్ర హోం మంత్రి... ప్రధాని నరేంద్ర మోడీకి పరోక్షంగా అదే సూచన చేస్తున్నారా? అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం ప్రశ్నించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. ప్రధాని నరేంద్ర మోదీకి వయసు విషయంలో ఓ సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. ఒకవేళ మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే.. మోదీ పీఎం కుర్చిని అమిత్ షా లాక్కునే ఆలోచనలో ఉన్నారని ‘ఎక్స్’వేదికగా విమర్శలు గుప్పించారు.‘‘అధిక వయసు (77 ఏళ్లు) కారణంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను అమిత్ షా రిటైర్ కావాలంటున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. అధిక వయసుకు సంబంధించి ముందుగానే ప్రధాని మోదీ (73 ఏళ్ల ఏడు నెలలు)కి అమిత్ షా ఒక సంకేతం ఇచ్చారా?. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే అత్యంత సంతోషించే వ్యక్తి అమిత్ షా. ఎందుకు కంటే వయసు రీత్యా మోదీ కాకుండా ప్రతిపక్ష నేతగా అమిత్ షా కూర్చుంటాని తెలుస్తోంది!’’ అని చిదంబరం మండిపడ్డారు.When Mr Amit Shah said that Mr Naveen Patnaik should retire because of "advanced age" (77 years) was he throwing a hint to Mr Narendra Modi (73 years, 7 months) -- in case the BJP formed the government? It seems that Mr Amit Shah will be the happiest person if the BJP did not…— P. Chidambaram (@PChidambaram_IN) May 22, 2024 ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా సీఎం నవీన్ పట్నాయక్‌పై ధ్వజమెత్తారు. ‘‘నవీన్ పట్నాయక్ 77 ఏళ్లు ఉంటారు. అధిక వయసు, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన రిటైర్ కావాలి. ఇక.. ఒడియా భాష స్పష్టంగా మాట్లాడే భూమి పుత్రుడిని ఒడిశాకు సీఎం చేస్తామని బీజేపీ వాగ్ధానం చేస్తుందని తెలిపారు. ఇప్పటికే జరిగిన ఐదు విడుతల్లోబీజేపీ 310 స్థానాల్లో గెలస్తుంది. అన్ని విడతల్లో మొత్త 400 స్థానాలను కౌవసం చేసుకుంటుంది’’ అని అమిత్ షా అన్నారు. -
రాహుల్ గాంధీ డిమాండ్ సరైనదే: చిదంబరం
న్యూఢిల్లీ: ఇద్దరు పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్‌కు డబ్బు పంపిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధినేత 'రాహుల్ గాంధీ' కోరడం సరైనదే అని కేంద్ర మాజీ మంత్రి 'పీ చిదంబరం' అన్నారు. దీనికి సంబంధించి తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ ట్వీట్ కూడా చేశారు.ప్రధానమంత్రి చేసిన ఆరోపణను చాలా సీరియస్‌గా చూడాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ న్యాయమైనదే.. కానీ ఈ విషయం మీద బీజేపీ మౌనం వహిస్తోంది.కాంగ్రెస్ పార్టీ అంబానీ, అదానీలతో ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపిస్తూ.. రాహుల్ గాంధీ కోసం ఇద్దరు పారిశ్రామికవేత్తల నుంచి ఆ పార్టీకి భారీగా నల్లధనం వచ్చిందా అని మోదీ అన్నారు. మోదీ ఆరోపణల ఆధారంగా అదానీ, అంబానీలపై దర్యాప్తునకు సీబీఐ లేదా ఈడీల విచారణకు మోదీ ఎప్పుడు ఆదేశిస్తారంటూ పలువురు కాంగ్రెస్ నేతలు తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లలో వీడియో సందేశాలను కూడా ఉంచారు.Mr Rahul Gandhi is absolutely correct in demanding an enquiry into the Hon'ble Prime Minister's allegationThe Hon'ble Prime Minister had made a very serious allegation: that two prominent industrialists have tempo-filling quantities of cash and they were delivered to the…— P. Chidambaram (@PChidambaram_IN) May 10, 2024 -
మేనిఫెస్టోలో లేని విషయాలను మోదీ చెబుతున్నారు: చిదంబరం
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నాయకులు కాంగ్రెస్ మేనిఫెస్టో మీద కీలకవ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో 'వారసత్వ పన్ను' అనే పదం ఎక్కడా లేదని మాజీ ఆర్ధిక మంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. మేము రూపొందించని ఒక మేనిఫెస్టోను వారే క్రియేట్ చేసుకుని సభల్లో చెప్పుకుంటున్నారని చిదంబరం అన్నారు. ఈ అంశాలపైన మోదీ చర్చించాలని డిమాండ్ చేశారు.సామ్ పిట్రోడా ప్రస్తావించిన 'వారసత్వ పన్ను' వ్యాఖ్యలపై ప్రధాని పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడతున్న నేపధ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు మేనిఫెస్టోలో లేని అంశాలను గురించి మోదీ ప్రస్తావించడం ఏ మాత్రం సరికాదని చిదంబరం అన్నారు.మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే చాలా విపరీతాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేస్తామని చిదంబరం హామీ ఇచ్చారు.The Hon'ble Prime Minister continues to discover and read in the Congress' Manifesto words and sentences that are not there! He has imagined a Congress' Manifesto written by one of his ghost speech writers.The phrase 'inheritance tax' does not occur anywhere in the Manifesto.…— P. Chidambaram (@PChidambaram_IN) April 28, 2024 -
బీజేపీకి అర్థం కావడం లేదు!.. మండిపడ్డ మాజీ ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ 'తీవ్రమైన సంక్షోభంలో' ఉంది. బీజేపీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 - 24లో భారతదేశ ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా ఉందని బీజేపీ చెబుతోంది. ఇదే నిజమైతే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎందుకు తగ్గుతున్నాయి. దీనికి తగిన వివరణ ఎవరూ ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఎఫ్‌డీఐ అనేది ఒక దేశం, ప్రభుత్వం.. దాని విధానాలపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని వివరించారు. విదేశీ పెట్టుబడిదారులకు 2023-24లో అలాంటి విశ్వాసం బాగా తగ్గిపోయిందని చిదంబరం అన్నారు. బీజేపీ తనకు తానుగానే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటోంది. మంచి సర్టిఫికేట్ అనేది విదేశీ & భారతీయ పెట్టుబడిదారుల నుంచి రావాలని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంపైన పెట్టుబడిదారులు విశ్వాసం వ్యక్తం చేయలేదని ఆయన అన్నారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, నిజమైన వేతనాలు నిలిచిపోయాయి, నిరుద్యోగం పెరుగుతోంది.. గృహ వినియోగం తగ్గుతోంది. ఇవి తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితమైన సంకేతాలు. కానీ ఇవన్నీ బీజేపీకి అర్థం కావడం లేదు అని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం అన్నారు. BJP claims that the Indian economy is in robust health in 2023-24, but has no explanation why net FDI inflows have dropped by 31 per cent FDI is a measure of the confidence that foreign investors have in a country, the government and its policies. Such confidence has declined… — P. Chidambaram (@PChidambaram_IN) March 28, 2024 -
దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్ రావు కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణాల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శల వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యలపై తెలంగాణా మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందంటూ ఎక్స్ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని అపుడుఅధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయారనీ,చరిత్ర తెలియనిది కేసీఆర్‌కి కాదుచిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే సంగతిని మర్చి,అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహించాలన్నారు. అలాగే తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికల్ని పరిశీలిస్తే మంచిదని కూడా అన్నారు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరంకు దమ్ముంటే ఆయన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్ . సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్‌గా నిలిపింది కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీనే దీవించబోతున్నారు అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పు భారీగా పెరిగిందని చిదంబరం కేసీఆర్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాట్లాడిన ఆయనతెలంగాణ అప్పు రూ.3.66లక్షల కోట్లకు చేరుకుందని, ప్రతి తెలంగాణ పౌరుడిపై సగటున రూ. లక్ష అప్పు ఉందని వ్యాఖ్యానించారు. వంట గ్యాస్ సిలిండర్ ధర ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లోనే ఎక్కువనీ, నిరుద్యోగం, అధిక ధరల్ని నియంత్రించడంలో ఇంతచేసినా ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్న నిధులు అరకొరగానే ఉన్నాయని విమర్శించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది. 👉 పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. 👉పొట్టి… — Harish Rao Thanneeru (@BRSHarish) November 16, 2023 -
ప్రతిపక్ష నేత ఎంపికపై సందిగ్ధం..! నాన్చుతున్న కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచి్చనప్పటికీ..రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎవరన్న దానిపై ఇంకా కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చలేదు. తదుపరి ప్రతిపక్ష నేత ఎంపికపై ఇంతవరకూ కాంగ్రెస్ ఎలాంటి చర్చలు జరుపకపోవడంతో ఉత్కంఠ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలున్నాయి. కనీసం సమావేశాల నాటికైనా కాంగ్రెస్ నిర్ణయం చేస్తుందా? లేక ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేనే ప్రతిపక్ష„ నేతగా కొనసాగిస్తుందా? అన్నది కొంత ఆసక్తిగా మారింది. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’అన్న కాంగ్రెస్ నిబంధన మేరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన రోజునే ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తూ తన లేఖను అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాం«దీకి పంపారు. అనంతరం కొత్త నేతను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ హోదాలో సోనియాగాంధీ ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ అది జరుగలేదు. ప్రధానంగా పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్‌లలో ఒకరిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా దక్షిణాదికి చెందిన ఖర్గే ఉన్నందున ఉత్తరాదికి చెందిన దిగ్విజయ్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని చర్చ జరిగింది. వీరితో పాటే సీనియర్ నేతలు పి.చిదంబరం, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీలపేర్లు చర్చల్లోకి వచ్చాయి. అయితే శీతాకాల సమావేశాల సమయంలోనూ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో జైరా, దిగి్వజయ్ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ సభకు హాజరయ్యే అవకాశాలు తక్కువని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఈ నేపథ్యంలో ఖర్గేను శీతాకాల సమావేశాల వరకు ప్రతిపక్ష నేతగా కొనసాగిస్తారంటున్నారు. దీనిపై ఏఐసీసీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ ‘సమావేశాలకు కొద్ది రోజుల ముందు ప్రతిపక్ష నేత ఎంపికపై నిర్ణయం చేస్తారు’అని వ్యాఖ్యానించారు. చదవండి: ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్ -
గుజరాత్‌ను నడిపిస్తున్నది వారే.. వంతెన ప్రమాదంపై చిదంబరం ఫైర్
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్స్ రచిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక, చిదంబంరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నడపడం లేదని.. ఢిల్లీ నుంచి నడుస్తోందని విమర్శించారు. ఇటీవల గుజరాత్లో కుప్పకూలిన మోర్బీ తీగల వంతెన ఘటన దారుణమైందన్నారు. ఈ ఘటన గుజరాత్‌కే తలవంపులు తెచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ప్రమాదంపై బీజేపీ ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు ఎవరూ క్షమాపణ చెప్పలేదన్నారు. ఈ ప్రమాద ఘటనకు ఎవరూ బాధ్యత వహించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. కేంద్ర దర్యాప్తు సంస్థలపై కూడా చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఏజెన్సీలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ఏజెన్సీల ద్వారా అరెస్టు చేయబడిన వారిలో 95 శాతం మంది ప్రతిపక్ష నాయకులేనని చిదంబరం ఆరోపించారు. ఈ సందర్భంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీపై కూడా సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ముందు దేశ రాజధాని గురించి ఆలోచన చేయాలని హితవు పలికారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, గాలి నాణత్య గురించి ప్రజలు ఆలోచిస్తే.. కేజ్రీవాల్‌కు ఎవరూ ఓటు వేయరని అన్నారు. Gujarat | #MorbiBridgeCollapse has brought shame to the fair name of Gujarat... The most shocking development is that no one, on behalf of the govt, has apologized for the tragedy. No one has resigned taking responsibility: Congress MP P Chidambaram pic.twitter.com/tLs6muBk79 — ANI (@ANI) November 8, 2022 -
కాంగ్రెస్ కొత్త సారథి ఎవరైనా గాంధీల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పార్టీలో గాంధీ కుటుంబం ఉనికిని ఏ మాత్రం ప్రభావితం చేయవని ఆ పార్టీ సీనియర్ నేత పి.చిందరం అభిప్రాయపడ్డారు. కొత్త సారథిగా ఎవరు బాధ్యతలు చేపట్టిన గాంధీల సలహాలు, సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా రిమోట్ కంట్రోల్ మాత్రం గాంధీల చేతిలోనే ఉంటుందనే ఆరోపణలను చిదంబరం తోసిపుచ్చారు. జిల్లా స్థాయిలో ఓటింగ్ జరిగి అధ్యక్షుడ్ని ఎన్నుకున్న తర్వాత కూడా ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారం ఓటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 9 వేల మంది పార్టీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఖర్గే గాంధీల విధేయుడని, ఆయన గెలిచినా నడిపించేది గాంధీలేనని విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో చిదంబరం స్పందించారు. 2024 ఎన్నికల్లో విజయం కోసం పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కోరిన నేతల్లో ఆయన కూడా ఉన్నారు. కొత్తగా పార్టీ బాధ్యతలు చేపట్టేవారు సంస్థాగత ఎన్నికలు నిర్వహించి కొత్త నాయకులను ఎన్నుకునేలా చేయాలని, పార్టీలో మార్పులు తీసుకురావాలని తాజాగా సూచించారు. మరోవైపు తాను గెలిస్తే పార్టీలో సమూల మార్పులు తీసుకొస్తానని పోటీకి ముందే శశిథరూర్. ఖర్గే కూడా పార్టీలో యువతకే ఎక్కువ అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు. గాంధీల నుంచి విలువైన సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఖర్గే, థరూర్‌లో ఎవరు గెలుస్తారో బుధవారం తెలిపోనుంది. ఆరోజే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. 96% ఓటింగ్ నమోదు -
కాంగ్రెస్ నేత చిదంబరానికి గాయాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం(76) గాయపడ్డారు. సోమవారం రాహుల్ గాంధీ ఈడీ విచారణ సందర్భంగా.. ఢిల్లీలో జరిగిన పార్టీ నిరసనల్లో ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత పి.చిదంబరంను పోలీసులు తోసివేయడంతో ఆయన ఎడమ పక్కటెముకలో ఫ్రాక్చర్ అయ్యాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. మోదీ ప్రభుత్వం అనాగరికత ప్రతిపరిమితిని దాటిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓ ట్వీట్ చేశారు. మాజీ హోం మంత్రి పి చిదంబరాన్ని పోలీసులు కొట్టారు. ఆయన అద్దాలు నేలపై విసిరారు. ఎడమ పక్కటెముకలో హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఎంపీ ప్రమోద్ తివారీని రోడ్డుపై పడేశారు. ఆయన తలకు గాయం కావడంతో పాటు పక్కటెముక ఫ్రాక్చర్ అయ్యింది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే.. అంటూ సూర్జేవాలా ట్వీట్ చేశారు. मोदी सरकार बर्बरता की हर हद पार कर गई। पूर्व गृह मंत्री, श्री पी.चिदंबरम के साथ पुलिस की धक्कामुक्की हुई, चश्मा ज़मीन पर फेंका, उनकी बायीं पसलियों में हेयरलाइन फ्रैक्चर है। सांसद प्रमोद तिवाड़ी को सड़क पर फेंका गया। सिर में चोट और पसली में फ्रैक्चर है। क्या यह प्रजातंत्र है? pic.twitter.com/rRLOhIOTJ3 — Randeep Singh Surjewala (@rssurjewala) June 13, 2022 -
ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కరరామన్ అరెస్ట్
చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వీసా కన్సల్టెన్సీ స్కాంలో కీలక మలుపు చోటుచేసుకుంది. చిదంబరం కుమారుడు కార్తీ అనుచరులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నైలో కార్తీ సన్నిహితుడు ఎన్ భాస్కర్ రామన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా విదేశీ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయంటూ కార్తీ చిదంబరంపై సీబీఐ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల కిందట యూపీఏ హయాంలో తన తండ్రి చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో పవర్ కంపెనీ పనుల నిమిత్తం భారత్ వచ్చిన 250 మంది చైనా పౌరులకు వీసాలు ఇచ్చేందుకు కార్తీ రూ. 50 లక్షల లంచం తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మంగళవారం కార్తి, ఆయన సన్నిహితుడు భాస్కరరామన్ సహా పలువురి నివాసాలు, అధికారిక కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, ఒడిశా, శివగంగైలో ఈ సోదాలు జరిగాయి. తాజా కేసులో కార్తీతోపాటు ఆయన సన్నిహితుడు ఎన్ భాస్కర రామన్, తలవండీ, పవర్ ప్రాజెక్ట్ ప్రతినిధి వికాస్ మఖరియా, ముంబైకు చెందిన బెల్‌టూల్స్ తదితరుల పేర్లను కూడా చేర్చారు. భాస్కరరామన్ వద్ద చిక్కిన కొన్ని పత్రాలు ఈ కేసులో కీలకంగా సీబీఐ భావిస్తోంది. చదవండి: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ -
కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరంపై మరో కేసు నమోదైంది. పదకొండేళ్ల క్రితం చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండగా రూ.50 లక్షల లంచం తీసుకొని ఒక విద్యుత్ కంపెనీ కోసం 263 మంది చైనీయులకు వీసాల మంజూరుకు సహకరించారంటూ కార్తీపై సీబీఐ కేసు నమోదు చేసింది. కార్తీతో పాటు ఆయన సన్నిహితుడు ఎస్.భాస్కరరామన్, నాటి తల్వాండి సాబో పవర్ ప్రాజెక్టు అధ్యక్షుడు వికాస్ మఖారియా తదితరులపై ఏపీసీ 120బీ, 477ఏ, అవినీతి నిరోధక చట్టంలోని 8, 9 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, చెన్నైలోని చిదంబరం, కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై, ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, ఒడిశా, పంజాబ్ సహా 10 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. సోదాల సమయంలో చిదంబరం ఢిల్లీలో, కార్తీ లండన్‌లో ఉన్నారు. వీటిపై కార్తీ, ‘‘ఇప్పటివరకు నాపై ఎన్నిసార్లు ఇలా దాడులు చేశారో గుర్తు లేదు. ఇది కచ్చితంగా ఒక రికార్డే’’ అని ట్వీట్ చేశారు. ఎఫ్ఐఆర్లో నాపేరే లేదు: చిదంబరం మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిదంబరం కొడుకు కార్తీపై నమోదైన కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీబీఐ దాడులపై చిదంబరం స్పందించారు. This morning, a CBI team searched my residence at Chennai and my official residence at Delhi. The team showed me a FIR in which I am not named as an accused. The search team found nothing and seized nothing. I may point out that the timing of the search is interesting. — P. Chidambaram (@PChidambaram_IN) May 17, 2022 ‘ఈ రోజు(మంగళవారం) ఉదయం చెన్నై, ఢిల్లీలోని నా నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. అధికారులు ఎఫ్ఐఆర్ కాపీ చూపించారు. కానీ అందులో నిందితుడిగా నా పేరే లేదు. అంతేగాక సోదాల్లో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి అధికారులు ఎలాంటి పత్రాలనూ స్వాధీనం చేసుకోలేదు. ఇక అధికారులు సెర్చింగ్ చేసే సమయం ఆసక్తికరంగా సాగింది’ అంటూ చిదంబరం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చదవండి: ‘ఢిల్లీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆప్‌దే’ I have lost count, how many times has it been? Must be a record. — Karti P Chidambaram (@KartiPC) May 17, 2022 -
కేంద్ర మంత్రికి గట్టి కౌంటర్ ఇచ్చిన చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లక్ష్మణ రేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తీవ్రంగా స్పందించారు. రాజద్రోహం చట్టం విషయంలో సుప్రీంకోర్టుకు లక్ష్మణ రేఖ గీసే అధికారం కేంద్ర న్యాయశాఖ మంత్రికిరణ్ రిజిజుకు లేదని ఘట్టి కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగంలోని 13వ సెక్షన్‌ను చదువుకోవాలని కేంద్ర మంత్రికి చిదంబరం హితవు పలికారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ప్రభుత్వాలు చట్టాలను చేయలేవని అలాంటి చట్టాలను అనుమతించరని చిదంబరం అన్నారు. దేశద్రోహ చట్టం రాజ్యాంగంలోని 19, 21 ఆర్టికల్స్‌ను ఉల్లంఘిస్తోందని, రాజుల గుర్రాలు, రాజులందరూ ఆ చట్టాన్ని రక్షించలేరని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా న్యాయశాఖతో సహా రాజ్యాంగ వ్యవస్థలన్నీ లక్ష్మణరేఖ దాటకూడదని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ రాజద్రోహం నమోదు చేయరాదనిసుప్రీం వ్యాఖ్యానించింది. అయితే దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై బుధవారం మీడియా ప్రశ్నలకు బదులిస్తూ ఆయన ఈ మేరకు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టులు ప్రభుత్వాన్ని, శాసన వ్యవస్థను గౌరవించాలి. ప్రభుత్వం కూడా కోర్టులను గౌరవించాలి. ఈ మేరకు స్పష్టమైన లక్ష్మణరేఖను రాజ్యాంగం ఎప్పుడో నిర్దేశించి ఉంచింది. దాన్ని ఎవరూ మీరకూడదు’’ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలగని రీతిలో దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పారు. దీన్ని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. చట్టాలు చేయడం ప్రభుత్వ బాధ్యతన్నారు. The Law Minister of India has no authority to draw any arbitrary Lakshman Rekha He should read Article 13 of the Constitution The Legislature cannot make a law, nor can a law be allowed to remain on the statute book, that violates the Fundamental Rights — P. Chidambaram (@PChidambaram_IN) May 12, 2022 -
కోర్టు వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు నిరనస సెగ
కొల్కతా: కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది పి.చిదంబరంకు నిరసన సెగ తగిలింది. కొల్కతాలో సొంతపార్టీకి చెందిన లాయర్లు చిదంబరంను అడ్డుకున్నారు. మెట్రో డైరీ అవినీతి కేసు విచారణ కోసం కొల్కతా హైకోర్టుకు వచ్చిన చిదంబరంపై కాంగ్రెస్ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం ఓ బ్రోకర్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, మెట్రో డైరీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం తరపున కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సొంతపార్టీకి వ్యతిరేకంగా కేసుకు ఒప్పుకున్న చిదంబరంపై కాంగ్రెస్ లాయర్లు మండిపడ్డారు. చదవండి: (కస్టడిలో వ్యక్తి మృతి.. రాత్రి సమయంలో విచారణ చేయొద్దు.. -
'ఉమ్రాన్ మాలిక్ హరికేన్'.. ప్రశంసలు కురిపించిన మాజీ కేంద్ర మంత్రి
ఐపీఎల్--2022లో భాగంగా బుధవారం(ఏప్రిల్ 27) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్లో ఐదు వికెట్ల ఫీట్ అందుకున్న ఐదో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ అనూహ్యంగా ఓటమి పాలైనప్పటికీ.. మాలిక్ బౌలింగ్‌కు అభిమానులు సలాం కొడుతున్నారు. ఈ క్రమంలో మాలిక్‌పై ట్విటర్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. మాలిక్‌ను ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ట్విట్ చేశారు." ఉమ్రాన్ మాలిక్ తుపాన్ బౌలింగ్ ధాటికి ఎవరూ నిలవలేరు. అతడి బౌలింగ్‌లో వేగం, దూకుడు ఆకట్టుకుంటోంది. ఈ మ్యాచ్‌లో అతడి ప్రదర్శన ఈ ఏడాది సీజన్‌కే హైలెట్‌గా నిలుస్తోంది. అదే విధంగా మాలిక్‌కు ఓ ప్రత్యేకమైన కోచ్‌ను ఏర్పాటు చేసి, అతడికి భారత జట్టులో చోటు కల్పించాలని" చిదంబరం పేర్కొన్నారు. చదవండి: Marco Jansen: ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ బౌలర్ చెత్త రికార్డు -
IPL 2022: అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి.. ప్రత్యేక కోచ్‌తో..
IPL 2022- Umran Malik 5 Wickets: ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ యువ కెరటం కేవలం 25 పరగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు కూల్చాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన ఐదో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అతడిపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. ఉమ్రాన్ మాలిక్ ఆటకు ఫిదా అయిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఈ జమ్మూ కశ్మీర్ బౌలర్ ప్రదర్శనను ఆకాశానికెత్తారు. ‘‘ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పదునైన పేస్‌తో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈరోజు తన ప్రదర్శన చూసిన తర్వాత ఫైండ్ ఆఫ్ దిస్ ఐపీఎల్ ఎడిషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అంటూ కొనియాడారు. అదే విధంగా.. వీలైనంత త్వరగా ఉమ్రాన్ మాలిక్‌ను జాతీయ జట్టులోకి ఎంపియ చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి చిదంబరం సూచించారు. అంతేకాదు బీసీసీఐ ఉమ్రాన్ కోసం ప్రత్యేకంగా ఓ కోచ్‌ను నియమించి మరింత రాటుదేలేలా శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇక శశి థరూర్ సైతం.. ‘‘అత్యద్భుతమైన ప్రతిభ. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయండి. బుమ్రాతో కలిసి ఉమ్రాన్ బ్రిటిష్ ఆటగాళ్లను బెంబేలెత్తిస్తాడు’’ అని ట్వీట్ చేశారు. ఇక బుధవారం(ఏప్రిల్ 28) నాటి మ్యాచ్ విషయానికొస్తే... గుజరాత్ టైటాన్స్ ముందు సన్‌రైజర్స్ తలొగ్గక తప్పలేదు. ఆఖర్లో గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ బ్యాట్‌తో రాణించడం(11 బంతుల్లో 31 పరుగులు- నాటౌట్)తో విజయం హార్దిక్ సేన సొంతమైంది. ఐదు వికెట్ల తేడాతో గుజరాత్.. సన్‌రైజర్స్‌పై గెలుపొందింది. ఇక ఉమ్రాన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐపీఎల్ మ్యాచ్ 40: ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ఎస్ఆర్హెచ్- 195/6 (20) గుజరాత్ టైటాన్స్- 199/5 (20) చదవండి👉🏾 Muttiah Muralitharan Vs Marco Jansen: 'మైండ్ దొబ్బిందా.. ఆ బౌలింగ్ ఏంటి?'.. మురళీధరన్ ఆగ్రహం WHAT. A. GAME! 👌👌 WHAT. A. FINISH! 👍👍 We witnessed an absolute thriller at the Wankhede and it's the @gujarat_titans who edged out #SRH to seal a last-ball win! 🙌 🙌 Scorecard ▶️ https://t.co/r0x3cGZLvS #TATAIPL #GTvSRH pic.twitter.com/jCvKNtWN38 — IndianPremierLeague (@IPL) April 27, 2022 The Umran Malik hurricane is blowing away everything in its way The sheer pace and aggression is a sight to behold After today’s performance there can be no doubt that he is the find of this edition of IPL — P. Chidambaram (@PChidambaram_IN) April 27, 2022 We need him in India colours asap. What a phenomenal talent. Blood him before he burns out! Take him to England for the Test match greentop. He and Bumrah bowling in tandem will terrify the Angrez! #UmranMalik https://t.co/T7yLb1JapM — Shashi Tharoor (@ShashiTharoor) April 17, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Prashant Kishor: పీకే అలాంటి ప్రతిపాదనేం చేయలేదు
ఢిల్లీ: జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ నాయకత్వం విషయంలోనూ పలు కీలక సూచనలు చేశాడని, ప్రియాంక గాంధీ వాద్రాను అధ్యక్ష బరిలో నిలపాలని అధిష్టానంతో చెప్పాడంటూ.. కథనాలు జాతీయ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందించారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నాయకత్వం గురించి ప్రతిపాదనేం చేయలేదని చిదంబరం స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. చాలా నెలలు కష్టపడి ఆయన(పీకేను ఉద్దేశిస్తూ) డాటా సేకరించారు. దానిపై ఆయన విశ్లేషణ.. ఆకట్టుకునేలా ఉంది. ఆ ప్రతిపాదనల్లో కొన్నింటిని కచ్చితంగా ఆచరించాలనే ఉద్దేశంతో పార్టీ ఉంది కూడా’ ఆయన చిదంబరం స్పష్టం చేశారు. అయితే.. కాంగ్రెస్ నాయకత్వ సమస్యపై పీకే తన ప్రజెంటేషన్‌లో ప్రస్తావించలేదు. అధ్యక్ష అభ్యర్థిగా ప్రియాంక పేరు ప్రతిపాదించిన విషయం నేను వినలేదు. అది నిజం కాదు కూడా. ఓ వర్గం మీడియా దానిని తెర పైకి తీసుకొచ్చింది. నాయకత్వ సమస్య పార్టీ అంతర్గత విషయం. ఏఐసీసీనే దానిని పరిష్కరిస్తుంది. ఆగష్టు చివరినాటికి ఎన్నికలతో ఆ సమస్య పరిష్కారం కావొచ్చు అని చెప్పారు. ఇక పార్టీ చేసిన ప్రతిపాదనను నిరాకరించిన విషయంపై పీకేను మళ్లీ వివరణ ఏమీ కోరలేదని, బహుశా ఆయన రాజకీయ వ్యూహకర్తగానే కొనసాగాలన్న ఆలోచనతో ఉన్నాడేమోనని చిదంబరం అభిప్రాయపడ్డారు. అంతేకానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో ఐ-పీఏసీ(Indian Political Action Committee)(ప్రశాంత్ కిషోర్ స్థాపించిన కన్సల్టెన్సీ) చేసుకున్న ఒప్పందం వల్లే పీకే, కాంగ్రెస్‌లో చేరలేదన్న వాదనలో అర్థం లేదని చిదంబరం పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌లో చేరకపోవడానికి కారణం ఇదే- ప్రశాంత్ కిషోర్ -
కాంగ్రెస్‌ను చీల్చొద్దు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఓటమి ఫలితాలపై కాంగ్రెస్‌లో ముఖ్యంగా గాంధీ కుటుంబ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక గాంధీ కుటంబ నాయకత్వం పక్కకు తప్పుకోవాల్సిందేనని జీ23 గ్రూపు నేతలు పెద్ద ఎత్తును డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటమికి.. గాంధీ కుటుంబ నాయకత్వం మాత్రమే బాధ్యుల్ని చేయడం సరికాదని అన్నారు. పరాజయం బాధ్యత నుంచి ఎవరు పారిపోవడం లేదని.. ఓటమికి తాము బాధ్యత వహిస్తున్నామని గాంధీ కుటుంబం ప్రకటించిందని గుర్తుచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఓటమికి తానూ బాధ్యత వహిస్తున్నానని చిదంబరం తెలిపారు. అదే విధంగా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కూడా ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యనేతలు బాధ్యత వహిస్తున్నారని చెప్పారు. జీ 23 గ్రూప్ నేతలు తమ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేయవద్దని చిదంబరం విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆగస్ట్‌లో జరిగే అవకాశం ఉందని, అప్పటివరకు సోనియా గాంధీనే నాయకత్వం వహిస్తారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై గాంధీ కుటుంటాన్ని నిందించడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘ఎవరూ బాధ్యత నుంచి పారిపోరు. బ్లాక్, జిల్లా, రాష్ట్ర AICC(ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) స్థాయిలో నాయకత్వ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఆ బాధ్యత ఉంది. ఎన్నికల ఓటమికి కేవలం ఏఐసీసీ నాయకత్వానిదే బాధ్యత అనడం సరికాదు’ అని చిదంబరం అన్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలోకి తీసుకురావడానికి కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని జీ23 గ్రూపు నేతల్లో ఒకరైన సీనియర్ నేత కపిల్ డిమాండ్ చేస్తున్నారు. -
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంపై చిదంబరం తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి చదవని పెట్టుబడిదారీ బడ్జెట్ ప్రసంగం చేశారని ధ్వజమెత్తారు. మొత్తం బడ్జెట్ ప్రసంగంలో పేదలన్న పదం కేవలం రెండుసార్లు మాత్రమే(పేరా ఆరులో) వచ్చిందని.. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారని గుర్తు చేసినందుకు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. ఈ పెట్టుబడిదారీ బడ్జెట్‌ను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. చదవండి: వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ 99.99 శాతం ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు రాబోయే 25 ఏళ్ల ప్రణాళికను వివరిస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పడం ఆశ్చర్యమేసిందని చిదంబరం పేర్కొన్నారు అంటే ప్రస్తుతంపై ఎలాంటి శ్రద్ధ అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోందని విమర్శించారు. అమృత గడియల వరకు ఓపికగా వేచి ఉండమని చెప్పడం.. భారత ప్రజలను అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. దేశంలోని అత్యంత ధనవంతుల కోరిక మేరకే కేంద్రం ఈ బడ్జెట్ తెచ్చినట్లుగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీ నేటి నుంచి చట్టబద్ధమని ఆర్బీఐకి బదులు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వీటన్నింటి వల్ల దేశంలోని 99.99 శాతం ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. చదవండి: అందుకే పన్నులను పెంచలేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
ఏడుపు ఆపండి సార్! బీజేపీకి కాంగ్రెసే ఆశాకిరణం!
కాంగ్రెస్ అనేది బీజేపీకీ ఆశాకిరణమే తప్ప.. గోవా ప్రజలు కాదు అని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం ట్విట్టర్లో సోమవారం చేసిన పోస్ట్‌కి ప్రతిస్పందనగా కేజ్రీవాల్ ఈ కౌంటర్ ఇచ్చారు. The choice before the voter in Goa is stark and clear. Do you want a regime change or not? I appeal to the voters of Goa to vote for a regime change and vote Congress. — P. Chidambaram (@PChidambaram_IN) January 17, 2022 ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఓట్లను చీల్చి.. బీజేపీని గెలుపునకు కారణమవుతున్నాయని కేజ్రీవాల్ చెబుతున్నారంటూ చిదంబరం ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆప్ నేత కేజ్రీవాల్ ‘ఆ ఏడుపు ఆపండి సార్.. ఇప్పటికే 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 15 మంది బీజేపీలోకి చేరిపోయారు’’ అంటూ ఘాటుగా స్పందించారు. తద్వారా కాంగ్రెస్‌కి పడాల్సిన ప్రతి ఓటు బీజేపీకి ఖాతాలో పడిపోతుందంటూ వ్యాఖ్యానించారు. सर, रोना बंद कीजिए- “हाय रे, मर गए रे, हमारे वोट काट दिए रे” Goans will vote where they see hope Cong is hope for BJP, not Goans.15 of ur 17 MLAs switched to BJP Cong guarantee- every vote to Cong will be safely delivered to BJP. To vote BJP, route thro Cong for safe delivery https://t.co/tJ0cswgi74 — Arvind Kejriwal (@ArvindKejriwal) January 17, 2022 పైగా బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్‌కి రావల్సిన ప్రతి ఓటు సురక్షితంగా బీజేపీ ఖాతాలో పడిపోవడం ఖాయం కాబట్టి కాంగ్రెస్‌నే గెలిపించండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు కేజ్రీవాల్. ఐదు రాష్ట్రాల్లో పంజాబ్, గోవాలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. (చదవండి: దళితులు అవసరం లేదు!... దళిత ఓటు బ్యాంకే లక్ష్యం!) -
ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదా: చిదంబరం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు మరణం కూడా నమోదు కాలేదని కేంద్రం తాజాగా ప్రకటించడం దుమారాన్ని రాజేసింది. దీనిపై ప్రతిపక్షపార్టీనాయకులు, ఇతరనేతలు కేంద్రంపై దుమ్మెత్తి పోశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీచిదంబరం మరోసారి నరేంద్రమోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. గుడ్డి, చెవిటి ప్రభుత్వం సత్యాన్ని చూడలేదు, నిజాలను వినలేదంటూ మండిపడ్డారు. ప్రతీ విషాదాన్ని అబద్దాలు, అసత్యాలతో మాయం చేసే ఆర్ట్ ప్రభుత్వం సొంతమని ఆయన ఎద్దేవా చేశారు. మొదట వ్యాక్సీన్ల కొరత లేదన్నారు. మధ్యప్రదేశ్‌లో టీకాల కొరత ఏర్పడింది. దేశంలో చాలా టీకా కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇపుడు ఆక్సిజన్ కొరత కారణంగా మరణాల నివేదికలు లేవని కేంద్రం చెబుతోందంటూ మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. మరణాలు లేవని ప్రకటించలేదు... మరణాల నివేదికలు లేవని మాత్రమే మంత్రిగారు ప్రకటించారు దీన్ని గమనించాలంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా రెండో దశలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతాల్లో ఆక్సిజన్ కారణంగా కరోనా మరణాలు సంభవించలేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభకు తెలియజేశారు. అయితే ఆక్సిజన్‌కు డిమాండ్‌లో భారీగా పెరగడంతో రాష్ట్రాల మధ్య సమాన పంపిణీకి కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. మొదటి దశలో 3,095 మెట్రిక్ టన్నులతో పోలిస్తే రెండోదశలో దాదాపు 9,000 మెట్రిక్ టన్నులకు చేరిందని వివరించింది. ఏప్రిల్ 15 న మొదటి కేటాయింపు జరగ్గా, తీవ్రతను బట్టి ఎప్పటికపుడు సమీక్షిస్తూ ఆక్సిజన్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. 2021 మే 28 నాటికి అధిక భారం ఉన్న 26 రాష్ట్రాలకు మొత్తం 10,250 మెట్రిక్ టన్నుల కేటాయించినట్టు వెల్లడించారు. Now, it is “no reports of deaths due to shortage of oxygen”. Read that carefully. Minister did not say there were “no deaths”. He said “no REPORTS of deaths” A blind and deaf government will not be able to “see” or “hear” the truth. — P. Chidambaram (@PChidambaram_IN) July 20, 2021 -
వ్యాక్సిన్ల సంఖ్య ఎందుకు తగ్గుతోంది: చిదంబరం ఫైర్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నివారణకు టీకా ఎంతో కీలకమని ఆయా దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇటీవలే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు సగం మందికిపైగా వారి జనాభాకు టీకాలు పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నాయి. భారత్‌లో మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ అంత వేగంగా జరుగుతున్నట్లు అనిపించడం లేదని కాంగ్రేస్ నేతలు ఇప్పటికే మండిపడుతున్నరు. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం వైఖరిపై పలు సార్లు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం దేశంలోని వ్యాక్సిన్ల కొరత పై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరతపై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రోజూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ వ్యాక్సిన్ వ్యూహాన్ని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 2 నాటితో పోలిస్తే ప్రస్తుతం రోజూ వేస్తున్నటీకాల సంఖ్య తగ్గుతోందనే ఆ డేటాను చిదంబరం ఆదివారం ట్వీట్ చేశారు. ఏప్రిల్ 2న రోజుకు 42 లక్షల వ్యాక్సిన్ డోసులు వేసిన కేంద్రం శుక్రవారం ఆ సంఖ్య 11.6 లక్షలకు పడిపోయిందని, ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. ఓ పక్క వ్యాక్సిన్ల కొరతతోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంటే, మరో పక్క ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత లేదని చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా దేశం తీవ్రంగా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటోంది. అయితే, జూలై చివరి నాటికి భారతదేశంలో టీకాల సంఖ్య 51.6 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు. ( చదవండి: ‘శత్రువు కనిపించకపోవచ్చు.. మీ వైఫల్యాలు కనిపిస్తున్నాయి’ ) Why is the number of vaccinations administered going down every day? It was only 11,60,000 doses on Friday, bringing down significantly the daily average of May It is a far cry from the 42 lakh doses administered on April 2 — P. Chidambaram (@PChidambaram_IN) May 16, 2021 -
ప్రధాని మోదీకి చిదంబరం గట్టి కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ సెషన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఆందోళన జీవి’ అని చెప్పుకునేందుకు తాను గర్విస్తానంటూ ప్రకటించారు. అలాగే మహాత్మాగాంధీ అత్యుత్తమ ఆందోళన జీవి అని పేర్కొన్నారు. ప్రతి నిరసనలోనూ, దేశానికి పరాన్నజీవులుగా ఉంటున్న ఆందోళన జీవులు వాలిపోతారంటూ విమర్శలు గుప్పించిన మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చిదంబరం బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఉద్యమకారులకు మద్దతిస్తున్న వారిపై సెటైర్లు వేశారు. మనుషుల్లో రకరకాల జీవులు ఉన్నట్లే, మన దేశంలో కొత్త రకమైన జీవులు ‘ఆందోళన జీవులు’ తయారయ్యారంటూ వ్యంగ్యోక్తులు విసారు. లాయర్లు, విద్యార్థులు, కార్మికులు, దేశంలో ఎవరు,ఎక్కడ, నిరసన చేపట్టినా, ఈ ఆందోళన జీవులు అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. వాళ్లు పరాన్న జీవులు, ఆందోళన లేకుండా ఉండలేరన్నారు. ఇలాంటి ఆందోళన జీవులు, విదేశీ విధ్వంసక సిద్ధాంతకారులు (ఎఫ్‌డీఐ)ల గుర్తించి, వారినుంచి దేశాన్ని రక్షించుకోవాలంటూ ప్రధాని ఉద్యమకారులపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. I am a proud andolan jeevi. The quintessential andolan jeevi was Mahatma Gandhi.#iamanandolanjeevi — P. Chidambaram (@PChidambaram_IN) February 10, 2021 -
కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది: నడ్డా
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 ని తిరిగి పునరుద్దరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. బీహార్ ఎన్నికలకు మందు కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తోందంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుపడ్డారు. జమ్మూ కశ్మీర్లో ప్రజల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎజెండా లేకపోవడం వల్లనే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. (చదవండి: నడ్డా టీంలో పురందేశ్వరి, డీకే అరుణ) గతేడాది అగష్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో మోదీ ఏకపక్ష, రాజ్యాంగ విరుద్దమైన నిర్ణయాలను తిప్పికోట్టాలంటూ చిదంబరం చేసిన ప్రకటనపై నడ్డా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాకిస్థాన్‌ను ప్రశంసించడం, ఆ పార్టీ మరో నేత చిదంబరం కాశ్మీర్లో అర్టికల్ 370ని అమలు చేయాలని కోరడం సిగ్గుచేటన్నారు. అయితే గతేడాది ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. (చదవండి: కమలంలో కలకలం: సీఎంపై తిరుగుబాటు) -
కనీస మద్దతు ధర : చిదంబరం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ఆమోదించిన నూతన వ్యవసాయ బిల్లులపై విపక్ష పార్టీల నిరసన కొనసాగుతున్న తరుణంలో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పై ఆయన తన దాడిని ఎక్కుపెట్టారు. ప్రభుత్వం వద్ద ప్రైవేటు వాణిజ్యానికి సంబంధించిన డేటా అందుబాటులో లేనప్పుడు రైతులకు కనీస మద్దతు ధర ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భారతదేశం అంతటా ప్రతిరోజూ వేలాది గ్రామాల్లో మిలియన్ల ప్రైవేటు లావాదేవీలు జరుగుతాయి. ఏ రైతు ఏ వ్యాపారికి ఏ ఉత్పత్తులను అమ్మారో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ప్రణాళికలు వేస్తోందని చిదంబరం ట్వీట్ చేశారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్) రైతుకు చెల్లించే ధర మద్దతు ధరకంటే చాలా తక్కువగా ఉంటోందని చిదంబరం ఆరోపించారు. రైతుల పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ చెబుతున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయలేదని నిలదీశారు. దీన్ని గుడ్డిగా నమ్మేందుకు రైతులు మూర్ఖులు అని మంత్రి ప్రభుత్వం భావిస్తోందా అని మండిపడ్డారు. దీంతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనంపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రధానంగా ప్రతి భారతీయుడి ఖాతాలో15 లక్షలు రూపాయలు వేస్తామన్న హామీని మోదీ ప్రభుత్వం నెరవేర్చిందా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారాట? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం సంగతి ఏమిటని చిదంబరం ప్రశ్నించారు. కాగా, వ్యవసాయానికి సంబంధించిన ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మార్స్ సర్వీసు బిల్లులకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలుపగా, ఆదివారం రాజ్యసభ కూడా ఆమోదించింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు అమలులోకి రానున్నాయి. కొత్త వ్యవసాయ బిల్లులంటూ రాజకీయ రగడ నడుస్తోంది. కార్పొరేట్లకు కొమ్ముకాసేందుకే ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. The Modi government should stop lying to the farmers and making false promises. The promise of guaranteeing MSP in private transactions is like the promise to deposit Rs 15 lakh in the bank account of every Indian — P. Chidambaram (@PChidambaram_IN) September 21, 2020 -
కరోనా : సెప్టెంబరు చివరి నాటికి 65 లక్షల కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసుల ఉధృతి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. లాక్డౌన్ వ్యూహం నుంచి ప్రయోజనాన్ని పొందలేని ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశమేనని వ్యాఖ్యానించారు. లాక్డౌన్ ద్వారా అన్ని దేశాలు కరోనా మహమ్మారిని అదుపు చేస్తే భారత్‌లో మాత్రం కరోనా విజృంభిస్తోందన్నారు. ఈమేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దాడి చేశారు. సెప్టెంబర్ 30 నాటికి మొత్తం సంఖ్య 55 లక్షలకు చేరుకుంటుందని మొదట ఊహించాను... కానీ ఈ విషయంలో తనది తప్పు అంచనా అని పేర్కొన్నారు, సెప్టెంబర్ 20 నాటికి భారతదేశం ఆ సంఖ్యకు(55 లక్షలు) చేరుకోనుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు సెప్టెంబర్ చివరి నాటికి కేసులసంఖ్య 65 లక్షలకు చేరవచ్చని అంచనావేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 21 రోజుల్లో కరోనా వైరస్‌ను అంత చేస్తామంటూ మొదట్లో హామీలు గుప్పించారని, కానీ ఐదు నెలలు గడిచినా కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో ప్రధాని వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర దేశాలు విజయవంతం అయినప్పుడు భారతదేశం ఎందుకు విఫలమైందో వివరించాలన్నారు. వి షేప్ రికవరీ అంటూ ప్రజలను తప్పు దారి పట్టింస్తోందని మండిపడ్డారు అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికమందగమనం, ప్రతికూల వృద్ధిపై ఆర్థికమంత్రిత్వ శాఖ వద్ద సమాధానం లేదని మరో ట్వీట్లో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. కాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. అందులో 8,46,395 యాక్టివ్ కేసులు ఉండగా, 31,07,223 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరణాలు 69,561గా ఉ న్నాయి. -
మోదీ చెప్పిందే.. నేను చెప్తున్నాను
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కాంగ్రెస్ నేత పి.చిదంబరం గతంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఓ ట్వీట్‌ని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తాజాగా చిదంబరం పోస్ట్ చేసి.. విమర్శలు గుప్పించారు. 2013లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలో చిక్కుకుందని, యువతకు ఉద్యోగాలు కావాలని మోదీ అన్నారు. సమయాన్ని అనవసర రాజకీయ చర్యలకు కాకుండా ఆర్థికవ్యవస్థను బాగు చేసేందుకు కేటాయించాలని కోరుతూ మోదీ అప్పట్లో ట్వీట్ చేశారు. దానినే ఈ రోజు చిదంబరం గుర్తు చేస్తూ తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది ఇదే అంటూ విమర్శలు గుప్పించారు.(చదవండి: ఆ ఆర్మీ శునకాలను పొగిడిన మోదీ) I have to say the same thing to the Honourable Prime Minister! pic.twitter.com/reNmp84mRu — P. Chidambaram (@PChidambaram_IN) September 2, 2020 కరోనా వల్లనే జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది... ఇది దేవుని చర్య అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ తప్పిదాన్ని దేవుడి మీదకు నెట్టకూడదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని ఒక జోక్‌గా వర్ణించారు చిదంబరం. -
‘దేవుని చర్య’.. ఆగని విమర్శలు
న్యూఢిల్లీ: కరోనా వల్లనే జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది... ఇది దేవుని చర్య అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు పి. చిదబంరం మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. మానవ తప్పిదాన్ని దేవుడి మీదకు నెట్టకూడదన్నారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ.. ‘దేవుడిని నిందించవద్దు. నిజానికి మీరు దైవానికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు రైతులను ఆశీర్వదించాడు. మహమ్మారి ప్రకృతి విపత్తు. కానీ మీరు వైరస్‌ను మానవ నిర్మిత విపత్తుతో కలిపేస్తున్నారు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని ఒక జోక్‌గా వర్ణించారు చిదంబరం. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నెలకొన్న ఆర్థిక కొరత నేపథ్యంలో పరిహారం కోరుతూ రాష్ర్టాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: 2020–21లో ఆర్థిక వ్యవస్థ క్షీణత) కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థను గట్టిగానే తాకిందని, ఈ ప్రకృతి చర్యతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2020–21) వృద్ధి పడిపోనుందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2020–21లో రాష్ట్రాలు జీఎస్టీ ఆదాయాల రూపంలో రూ.2.35 లక్షల లోటును ఎదుర్కోవచ్చని కేంద్రం అంచనా వేసింది. -
కరోనాకు ముందే జీడీపీ పడిపోయింది కదా?
ఢిల్లీ : జీఎస్టీ పరిహారానికి సంబంధించి రాష్ర్టాలకు ఇవ్వాల్సిన వాటాలపై గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం ఖండించారు. కరోనా కారణంగానే జీఎస్టీ వృద్ధిరేటు పడిపోయిందన్న నిర్మలా వ్యాఖ్యలను తప్పుబట్టారు. మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టిగానే తాకిందని దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2020–21) వృద్ధి పడిపోనుందని ఈ ప్రకృతి చర్యను దేవుని చర్యగా ఆమె అభివర్ణించారు. దీంతో ఆర్థికమంత్రిని దేవుని దూతగా వ్యంగంగా పేర్కొన్న చిదంబరం.. కరోనా సంక్షోభానికి ముందు పతనమైన ఆర్థికవ్యవస్థపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018-19 నాటికి 7.1గా ఉన్న ఆరథి వృద్ధిరేటు 2019-20 త్రైమాసికం నాటికి 3.1 శాతానికి ఎలా పడిపోయిందో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చిదంబర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. (ఎన్‌పీసీఐకి షాక్ : ఎస్బీఐ కొత్త సంస్థ) If the pandemic is an ‘Act of God’, how do we describe the mismanagement of the economy during 2017-18 2018-19 and 2019-20 BEFORE the pandemic struck India? Will the FM as the Messenger of God please answer? — P. Chidambaram (@PChidambaram_IN) August 29, 2020 జీఎస్టి పరిహారాన్ని కేంద్రం రెండు ఆప్షన్లుగా రాష్ర్టాలకే వదిలేసింది. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిహార సెస్ కింద భవిష్యత్తులో రాబడులను తాకట్టు పెట్టడం ద్వారా రుణాలు తీసుకోవాలని మొదటి ఐచ్చికంలో ఉంది. అయితే దీని వల్ల ఆర్థిక భారం పూర్తిగా రాష్ట్రాలపై పడుతుంది. ఇక రెండో ఐచ్ఛిక కింద రాష్ట్రాలు ఆర్బిఐ విండో నుంచి రుణం తీసుకోమని ఉంది. ఇది మార్కెట్ రుణాల కంటే ఎక్కువ. దీని వల్ల రాష్ర్టాలకు ఒరిగే లాభమేంటి? కరోనా మహమ్మారి లాంటి ఒక విపత్తు తలెత్తినప్పుడు కేంద్రం చేయాతనివ్వాలి. కానీ కేంద్రం చెబుతున్న రెండు ఐచ్ఛికాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. రాష్ర్టాలకు ఇచ్చే ఆర్థిక పరిహారం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది అని పేర్కొన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా నెలకొన్న ఆర్థిక కొరత నేపథ్యంలో పరిహారం కోరుతూ రాష్ర్టాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (2020–21లో ఆర్థిక వ్యవస్థ క్షీణత) -
మరి..వారు ఆంగ్లంలో ఎందుకు మాట్లాడరు!
సాక్షి, న్యూఢిల్లీ : చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ డీఎంకే నేత కనిమొళి ‘హిందీ రాకపోతే భారతీయులం కాదా’ అని ప్రశ్నించిన క్రమంలో ఈ ఘటనపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం సోమవారం స్పందించారు. చెన్నై విమానాశ్రయంలో కనిమొళికి ఎదురైన అనుభవం అసాధారణమైనది కాదని ఆయన చెప్పుకొచ్చారు. తనకూ ఇదే తరహాలో గతంలో ఫోన్లో మాట్లాడే సందర్భాల్లో, ముఖాముఖిల్లోనూ హిందీలో మాట్లాడాలని పలువురు కోరారని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ అధికారుల నుంచి సాధారణ పౌరుల నుంచీ తనకు ఇలాంటి అనుభవాలు పలుమార్లు ఎదురయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. హిందీ, ఇంగ్లీష్ రెండూ అధికార భాషలైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ రెండు భాషల్లో మాట్లాడేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని చిదంబరం అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన హిందీయేతరులు సత్వరమే హిందీలో నైపుణ్యం సాధిస్తుంటే హిందీ మాట్లాడే ఉద్యోగులు ఆంగ్లంలో పట్టుసాధించి ఎందుకు మాట్లాడలేరని ఆయన మరో ట్వీట్లో ప్రశ్నించారు. కాగా కనిమొళికి ఎదురైన అనుభవంపై కాంగ్రెస్ నేత, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరన్ విస్మయం వ్యక్తం చేశారు. పౌరులకు భాషా పరీక్ష భావ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కారు బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని తనకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ కనిమొళి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కనిమొళికి కలిగిన అసౌకర్యంపై సీఐఎస్ఎఫ్ స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యురాలిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏ ఒక్క భాషపై తమకు పక్షపాతం లేదని స్పష్టం చేసింది. చదవండి : రక్షణ దిగుమతుల నిషేధం : చారిత్రక ప్రకటన ఇదేనా! -
రక్షణ దిగుమతుల నిషేధం : చారిత్రక ప్రకటన ఇదేనా!
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం విరుచుకుపడ్డారు. రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం గురించి రాజ్‌నాథ్ ఆడంబర వ్యాఖ్యలు చేసి ఆపై నీరుగార్చే ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఉదయం మెరుపులు ఉంటాయని హామీ ఇచ్చిన రక్షణ మంత్రి ఆపై నిట్టూర్పుతో ముగించారని వరుస ట్వీట్లలో చిదంబరం పేర్కొన్నారు. రక్షణ పరికరాలను కేవలం రక్షణ మంత్రిత్వ శాఖే దిగుమతి చేసుకుంటోందని దిగుమతి ఆంక్షలు ఏమైనా కేవలం ఆ ఒక్క శాఖకే వాటి ప్రభావం పరిమితమని చిదంబరం వ్యాఖ్యానించారు. దిగుమతి ఆంక్షలనేది పెద్ద మాటని అన్నారు. చదవండి : ‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా? తాము ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న పరికరాలను ఇక్కడే తయారుచేసేందుకు ప్రయత్నించి రెండు నుంచి నాలుగేళ్లలో దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని రక్షణ మంత్రి చెప్పుకొచ్చారని అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం వెల్లడించిన చారిత్రక ప్రకటనలో పసఏమీ లేదని, ఇది కేవలం మంత్రి తన కార్యదర్శులకు జారీ చేసే శాఖాపరమైన ఉత్తర్వు మాత్రమేనని చిదంబరం ఎద్దేవా చేశారు. కాగా, 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపారు. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆయుధాలతో పాటు ఇతర రక్షణ వస్తువులు ఇక మీదట దేశీయంగానే తయారవనున్నాయి. ఇది భారత రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజనాథ్ తెలిపారు. -
‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా?
న్యూఢిల్లీ: ప్రధాని సహాయ నిధి నుంచి యూపీఏ హయాంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కు నిధులు మళ్లించినట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం స్పందిచారు. బీజేపీ అన్నీ అర్థ సత్యాలే మాట్లాడుతుందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో చిదంబరం మాట్లాడుతూ.. ‘బీజేపీ ఆరోపణల మేరకు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు ఇచ్చిన రూ. 20 లక్షలు తిరిగి ఇచ్చేస్తుంది. అలానే బీజేపీ చైనా ఆక్రమణలను తొలగించి.. సరిహద్దులో యథాతథ స్థితిని తిరిగి తీసుకురాగలమని దేశ ప్రజలకు హామీ ఇవ్వగలదా’ అని ప్రశ్నించారు. (రాజీవ్ ఫౌండేషన్‌కి ‘ప్రధాని’ నిధులు) 2005లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్జీఎఫ్కు 20 లక్షలు బదిలీ చేశారు. దీన్ని నడ్డా తప్పుపట్టడాన్ని చిదంబరం వ్యతిరేకించారు. ఆ డబ్బును సునామీతో దెబ్బతిన్న అండమాన్ దీవుల్లో ఖర్చు చేసినట్లు చిదంబరం వెల్లడించారు. ప్రస్తుతం బీజేపీ ‘భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు’ అంశంపై ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు వాస్తవికతకు అనుగుణంగా సమాధానం ఇవ్వడంపై దృష్టి పెట్టాలని చిదంబరం కోరారు. అంతేకాక ఆర్జీఎఫ్ నిధులకు, చైనా ఆక్రమణకు ఏం సంబంధం ఉందని చిదంబరం ప్రశ్నించారు. ఒకవేళ ఆ డబ్బును ఇప్పుడు తిరిగిస్తే, తాజాగా చైనా ఆక్రమించిన భూభాగాన్ని ప్రధాని మోదీ తీసుకురాగలరా అని ఆయన బీజేపీని ప్రశ్నించారు. ఆర్జీఎఫ్కు విరాళాలు ఇస్తున్న చైనా ఎంబసీ ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నట్లే అని బీజేపీ ఆరోపించింది. చైనా సంక్షోభం నుంచి దారి మళ్లించేందుకు బీజేపీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు చిదంబరం మండిపడ్డారు -
‘గల్వాన్ లోయ మాదే.. చైనా అద్భుత డిమాండ్’
న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం పొరుగు దేశం చైనా తన వంకర బుద్ధిని మార్చుకోవడం లేదు. ఓ వైపు చర్చల పేరుతో శాంతియుతంగా ఉద్రిక్తలను తగ్గించుకుందాం అని చెబుతూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. బుధవారం లడఖ్‌లోని గల్వాన్ లోయ తమదేనని చైనా మరోసారి వ్యాఖ్యలు చేసింది. కాగా దీనిపై గురువారం కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందించారు.(అమెరికా: వారి నుంచి అధిక రుసుం వసూలు) ఏప్రిల్- జూన్ నెలలో చైనా బలగాలు భారత స్థితిని మార్చాయనే విషయం కాదనలేనిదన్నారు. భారత్‌ను యథాతథా స్థితిని పునరుద్ధరించడంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వం విజయం సాధిస్తుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, పీఎల్ఏఎ గల్వాన్ లోయ తమదేనని నొక్కి చెప్పాయి. భారత్ గల్వాన్ లోయను ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. అద్భుత డిమాండ్ అంటూ ట్వీట్ చేశారు. (6 లక్షల డాలర్లు లూటీ; ఎన్నారై డాక్టర్ అరెస్ట్) -
మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ చిదంబరం
న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ధ్వజమెత్తారు. భారత సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదన్న మోదీ వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ మేరకు శనివారం చిదంబరం స్పందిస్తూ.. ‘మోదీ వ్యాఖ్యలు ఇంతకముదు ఆర్మీ చీఫ్, రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ కలవరపరిచాయి. మే 5,6న చైనా బలగాలు మన భూభాగంలోకి ప్రవేశించకపోతే, మన సైనికులు ఎక్కడ గాయపడ్డారు, ఎందుకు అమరులయ్యారు’ అని ప్రశ్నించారు. ('చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారు') కాగా భారత భూభాగంలో ఎవరూ ప్రవేశించలేదని శుక్రవారం ప్రధానమంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్ వైపు కన్నెత్తి చూసిన వారికి సైనికులు గుణపాఠం నేర్పారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 16న గల్వాన్ లోయలో చైనా- భారత్ బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇక ఇదే విషయంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధాని వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధించారు. చైనా దురాక్రమణకు తలొగ్గిన ప్రధాన భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు. ఒకవేళ ఆ భూభాగం చైనా వారిది అయితే భారత జవాన్లు ఎందుకు మరణించారని ప్రధానిని ప్రశ్నించారు. (రాహుల్-అమిత్ షా మధ్య ట్విటర్ వార్) -
రూ.1000 కోట్లలో వారికి చేరేది సున్నా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్దీపన ప్యాకేజీలు, కేటాయింపులపై పెదవి విరుస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం మరోసారి కేంద్రంపై తన దాడిని ఎక్కు పెట్టారు. వలస కార్మికులకు పీఎం-కేర్స్ కేటాయించిన రూ.1000 కోట్ల వినియోగంపై సందేహాలు లేవనెత్తారు. కరోనా వైరస్ సంక్షోభం లాక్డౌన్ వల్ల ప్రభావితమైన వలస కార్మికుల కోసం కేటాయించిన రూ.1000 కోట్లలో వారికి చేరేది శూన్యమని విమర్శించారు. ‘దయచేసి సాధారణ తప్పు చేయవద్దు. ఈ డబ్బు వలస కార్మికులకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది. కార్మికుల ప్రయాణ ఖర్చులు, వసతి, మందులు, ఆహారం ఇతర ఖర్చులను భరించటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది తప్ప వలస కార్మికుల చేతుల్లోకి ఏమీ వెళ్ళద’ని చిదంబరం గురువారం ట్వీట్ చేశారు. అలాగే అన్ని ఆదాయ వనరులు మూసుకుపోయిన తరువాత వలస కార్మికుడి జీవనం ఎలా అని ఆయన ప్రశ్నించారు. అన్ని అడ్డంకులను దాటి తన గ్రామానికి తిరిగి వచ్చిన వలస కార్మికుడికి గ్రామంలో ఉపాధి, ఉద్యోగాలు లేవు. ఆదాయం లేదు. ఈ పరిస్థితుల్లో సదరు కార్మికుడు తన కుటుంబాన్ని ఎలా ఆదుకుంటాడని చిదంబరం ప్రశ్నించారు. (కరోనా ప్యాకేజీ: మాల్యా స్పందన) కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వలస కూలీలకు వాటా లేకపోవడాన్ని తీవ్రంగా విమర్శించిన చిదంబరం సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేశారు. సొంతగ్రామాలకు వెళ్లేందుకు ఆకలి కడుపులతో వందల కిలోమీటర్లు నడుస్తున్న పేద వలస కార్మికులను ప్రస్తావించక పోవడం, వారిని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని అని విమర్శించిన సంగతి విదితమే. కాగా, కోవిడ్-19పై పోరాటానికి గాను పీఎం కేర్స్ ఫండ్ బుధవారం 3,100 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటిలో వెంటిలేటర్లను కొనడానికి రూ. 2,000 కోట్లు, వలస కూలీలకు సహాయం చేయడానికి రూ. 1,000 కోట్లు, కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి సొంతవూరికి పయనమవుతున్న వలస జీవులు అనేకమంది మధ్యలోనే ప్రమాదాల కారణంగాప్రాణాలు విడుస్తున్న తీరు ఆందోళనకరంగా మారింది. గురువారం నాటికి భారతదేశం కరోనా వైరస్ కేసులు గురువారం నాటికి 78,003 కు పెరిగాయి, 2,549 మరణాలు సంభవించాయి. The money will not be given to the migrant workers but to the State governments to meet the expenses of travel, accommodation, medicine and food for the migrant workers. But nothing will go to the hands of the migrant workers. — P. Chidambaram (@PChidambaram_IN) May 14, 2020 -
మిగిలిన రూ.16.4 లక్షల కోట్లు ఎక్కడున్నాయి?
సాక్షి, అమరాతి : సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మండిపడ్డారు. దేశంలోని మొత్తం 6.3 కోట్ల ఎంఎస్ఎంఈల్లో 45 లక్షల ఎంఎస్ఎంఈలకు మాత్రమే నిర్మలా ప్యాకేజీ అనుకూలంగా ఉందని విమర్శించారు. ఆ రోజు ప్రకటించిన ప్యాకేజీలో వలస కూలీలకు వాటా లేకపోవడాన్ని బాధాకరమని అన్నారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తూ వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న వలస కార్మికుల గురించి ప్రస్తావించకపోవడం, వారిని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలోని పేదలకు డబ్బుల పంపిణీలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. 13 కోట్ల కుటుంబాలు లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయాయని, ప్రభుత్వ సాయం వారిని ఈ కష్టాల నుంచి కాపాడలేకపోయిందని చిదంబరం అన్నారు.( చదవండి : ఈపీఎఫ్: 3 నెలలు పొడిగింపు.. రూ. 2500 కోట్లు) ‘ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఇప్పటి వరకు కేంద్రం 3.6 లక్షల కోట్లు మాత్రమే ప్రకటించింది. మిగిలిన 16.4 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాలి. కానీ అలా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎక్కువ రుణాలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం అలా చేయదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ రుణాలు తీసుకోవాడానికి, ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి అనుమతించాలి. కానీ ఈ ప్రభుత్వం ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు’ అని చిదంబరం విమర్శించారు. (చదవండి : ఆర్థిక ప్యాకేజీ: చిదంబరం స్పందన) -
‘ఎవరికి ఏం దక్కుతుందో చూడాలి’
న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం దీనిపై బుధవారం స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న ప్రధాని నరేంద్ర మోదీ కేవలం హెడ్లైన్ చెప్పి ఖాళీ పేపర్‌ను వదిలేశారు. అందుకే నిన్న నా స్పందన కూడా బ్లాంక్‌గానే ఉంది. నేడు ఆర్థిక మంత్రి ఆ కాగితాన్ని పూరిస్తారు. కేంద్రం ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టే ప్రతి ఒక్క రూపాయిని మేం చాలా జాగ్రత్తగా లెక్కిస్తాం. ఎవరికి ఏం దక్కబోతుందో నేడు తెలుస్తుంది. పేదలు, మరి ముఖ్యంగా ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి సొంత ఊళ్లకు చేరుకున్న వలస కార్మికులకు మోదీ ప్రభుత్వం ఏం ఇవ్వబోతుందో తెలుసుకునేందుకు మేం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం’ అంటూ చిదంబరం ట్వీట్ చేశారు. Yesterday, PM gave us a headline and a blank page. Naturally, my reaction was a blank! Today, we look forward to the FM filling the blank page. We will carefully count every ADDITIONAL rupee that the government will actually infuse into the economy. — P. Chidambaram (@PChidambaram_IN) May 13, 2020 కరోనాతో కునారిల్లిన ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుతం ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకానికి రూపకల్పన చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలను ఆదుకునే ప్రణాళికతో రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. భారీ, మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమలవారు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, కూలీలు.. వ్యవస్థలోని అందరినీ ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజీ దేశ జీడీపీలో దాదాపు 10% అని ప్రధాని వెల్లడించారు. (చదవండి: నిందలు సరే నిర్ధారణ ఎలా) -
అదే ఏకైక డిమాండ్ కావాలి - చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కల్లోలం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. లాక్డౌన్ వల్ల గత 18 రోజులలో ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయిన పేదలను ఆదుకోవాల్సిందిగా కోరాలని ఆయన కోరారు. కరోనా సంక్షోభంతో దాచుకున్న కొద్దిపాటి సొమ్ము కూడా అయిపోయి, ఆకలితో అలమటిస్తూ పలువురు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తక్షణమే ప్రతి పేద కుటుంబానికి నగదును బదిలీ చేయాల్సిందిగా కోరాలని ముఖ్యమంత్రులకు సూచించారు. ఇందుకు 65,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని, ఇది పెద్ద భారం కాదని మాజీ ఆర్థికమంత్రి పేర్కొన్నారు. శనివారం వరుస ట్వీట్లలో చిదంబరం ఈ సూచనలు చేశారు. పేద ప్రజల జీవితాలు కూడా ముఖ్యమైనవని ఈ రోజు ప్రధానమంత్రికి చెప్పాలని ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్,అశోక్ గెహ్లోట్, భూపేష్ భాగెల్, వి నారాయణసామి, ఉద్దవ్ ఠాక్రే , పళనిస్వామిలను ఉద్దేశించిన చిదంబరం ట్వీట్ చేశారు. కోవిడ్-19 (కరోనా వైరస్) పై పోరాడుతున్నట్టుగానే, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పేదలు ఉపాధి కోల్పోయారు, వారు ఆకలితో అలమటిస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అని చిదంబరం ప్రశ్నించారు. పేదల సంక్షేమమే ఏకైక డిమాండ్ గా వుండాలని ఆయన ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతోంది. అయితే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 15వ తేదీ ఎత్తివేయాలా లేదా అనే విషయంపై ముఖ్యమంత్రులతో ప్రధాని శనివారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అయితే మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగింపునకే పలు సీఎంలు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఏప్రిల్ 30వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. (అతిచౌక ధరలో ఐఫోన్) Chief Ministers - @capt_amarinder @ashokgehlot51 @bhupeshbaghel @VNarayanasami @uddhavthackeray @EPSTamilNadu should tell the Prime Minister today that just as LIVES are important LIVELIHOOD of the poor is important. — P. Chidambaram (@PChidambaram_IN) April 11, 2020 -
అది ఓ చెత్త సలహా..
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు సరైన చర్య కాదని, ఇది ఎవరో ఇచ్చిన చెత్త సలహా ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆపద సమయంలో ప్రజల జీవితాలను కాపాడటం ముఖ్యమని, జీడీపీ లెక్కలు కాదని చిదంబరం హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చెత్త సలహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాయనే విషయం తనకు తెలుసని, అయితే ఇంత చెత్త సలహా పట్ల తాను ఆశ్చర్యపోతున్నానని వ్యాఖ్యానించారు. పీపీఎఫ్, చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటు తగ్గించడం సాంకేతికంగా సరైనది కావచ్చు..కానీ నిర్ణయం తీసుకున్న సమయం సరైంది కాదని చిదంబరం ట్వీట్ చేశారు. ప్రజల రాబడి అనిశ్చితిలో పడిన ఇలాంటి సందర్భాల్లో వారు తమ పొదుపుపై వచ్చే రాబడిపై ఆధారపడతారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే సమీక్షించి జూన్ 30 వరకూ పొదుపు ఖాతాలపై పాత వడ్డీరేట్లనే కొనసాగించాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు కేవలం 4.8 శాతానికే పరిమితమవుతుందని ఆయన అంచనా వేశారు. చదవండి : చిన్న పొదుపు పథకాలపై వడ్డీ కోత -
యస్ బ్యాంక్ పరిణామాలపై చిదంబరం విమర్శలు
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ఎస్బీఐ రూ.2450 కోట్ల పెట్టుబడితో.. 49శాతం వాటా కలిగి, ఒక్కో షేర్‌కు రూ.10 కన్న తక్కువ పొందడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఎలాగైతే ఐడీబీఐ బ్యాంక్ సంక్షోభాన్ని ఎల్ఐసీ పరిష్కరించలేదో అలాగే యస్ బ్యాంక్ సంక్షోభాన్ని ఎస్బీఐ పరిష్కరించదని పేర్కొన్నారు. కొన్ని సార్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలు వింటుంటే తాను ఆర్థిక మంత్రిగా, యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లు అనిపిస్తుందని చిదంబరం ఎద్దేవా చేశారు. 2014లో యస్ బ్యాంక్‌కు రుణాలు విడుదల చేసేటప్పుడు ఆర్బీఐ యస్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఆర్థిక సంస్థల నిర్వహణలో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చిదంబరం అన్నారు. చదవండి: స్టాక్‌మార్కెట్‌కు వైరస్, యస్ బ్యాంక్ షాక్.. -
కాంగ్రెస్‌లో చిచ్చురేపుతున్న ఢిల్లీ ఫలితాలు
-
చిదంబరంజీ.. మన దుకాణం మూసేద్దాం..!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని కప్పిపుచ్చుతూ బీజేపీ ఓటమిని ఆస్వాదిస్తూ ఆప్‌ను అభినందనల్లో ముంచెత్తిన కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ దీటుగా బదులిచ్చారు. ‘చిదంబరంజీ..బీజేపీని ఓడించే పనిని ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిందా..లేదంటే పార్టీ పరాజయాన్ని పక్కనపెట్టి ఆప్ విజయాన్ని సంబరంగా జరుపుకోవడం ఏంటి..? నా ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తే ఇక పీసీసీ దుకాణాలను మూసేద్దా’మని శర్మిష్ట ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఉండే వివిధ రాష్ట్రాల ప్రజలు కాషాయ పార్టీని ఓడించడంతో ప్రమాదకర బీజేపీ అజెండాను ప్రజలు తిరస్కరించారని వెల్లడైందని, 2021, 2022లో ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలకు సరైన ఉదాహరణగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చిదంబరం ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్ధానాలకు గాను ఆప్ 62 స్దానాలు దక్కించుకుని తిరిగి పాలనా పగ్గాలు చేపట్టగా బీజేపీ 8 స్ధానాల్లో గెలుపొందగా కాంగ్రెస్‌కు ఒక్క స్ధానం కూడా దక్కలేదు. -
‘ఐసీయూలో ఎకానమీ’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూపై ఉందని, దీన్ని పునరుద్ధరించేందుకు దీటైన వైద్యులు అవసరమని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు.కేంద్ర బడ్జెట్‌పై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రమణియన్ ఎకానమీ విషమ పరిస్థితుల్లో ఉందన్నారని, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ సైతం ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేయగా కేంద్ర మంత్రులు ఆయనపై విరుచుకుపడ్డారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఐసీయూ అంచుకు చేరిందని, సరైన డాక్టర్ల కోసం వేచిచూస్తోందని చిదంబరం చెప్పుకొచ్చారు. ఆర్థిక మందగమనాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని, తన పొరపాట్లను అంగీకరించేందుకు సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ప్రతి పరిశ్రమ ప్రతికూల ఫలితాలనే ఇస్తోందని దీనికోసం ఎంఆర్ఐ యంత్రంపై పరీక్ష అవసరం లేదని అన్నారు. గత ఆరేళ్లుగా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై గత ప్రభుత్వాన్ని నిందించడంతోనే నెట్టుకొస్తున్నారని ఇంకా ఎన్నాళ్లు ఇలా కాలక్షేపం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం నిధుల కొరతతో సతమతమవుతూ నమ్మలేని గణాంకాలతో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తొందరపాటు ధోరణితో లోపభూయిష్టమైన జీఎస్టీ అమలుకు పూనుకోవడం కూడా ఆర్థిక వ్యవస్థ కష్టాలకు ఓ కారణమని చెప్పుకొచ్చారు. చదవండి : రజనీ వస్తే అద్భుతమే : చిదంబరం -
మోదీజీ..ఈ మూడింటిపై నోరు మెదపండి!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ మరో మూడు రోజుల్లో ముందుకొస్తున్న క్రమంలో మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం విమర్శలు గుప్పించారు. మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్ధ కుదేలైన తీరును ప్రస్తావించారు. పన్ను రాబడి పడిపోయిందని, రిటైల్ ద్రవ్యోల్బణం చుక్కలు చూస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి వెచ్చించే నిధుల్లో కోత వేశారని వీటిపై ప్రధాని మోదీ నోరుమెదపాలని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దుందుడుకు ధోరణిని విడనాడి ఆరేళ్లలో కూడా అచ్ఛేదిన్ (మంచిరోజులు) ఎందుకు రాలేదో ఓటర్లకు వివరించాలని చురకలు వేశారు. వాస్తవాలను విస్మరించి ప్రధాని, కేంద్ర మంత్రులు భ్రమల్లో విహరిస్తున్నారని చిదంబరం ట్వీట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీలోని తిహార్ జైలులో 100 రోజులు పైగా గడిపిన చిదంబరం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నిర్వహించడం లేదని తరచూ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. -
‘ఇక ఐఎంఎఫ్‌పై విరుచుకుపడతారు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును కుదించినందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో పాటు ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్‌పై విరుచుకుపడేందుకు కేంద్ర మంత్రులు సిద్ధమవుతారని కాంగ్రెస్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అన్నారు. నోట్ల రద్దును తొలిగా వ్యతిరేకించిన వారిలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ ఒకరని, ఐఎంఎఫ్..గీతా గోపీనాథ్‌లపై మంత్రుల దాడికి మనం సంసిద్ధం కావాలని చిదంబరం మంగళవారం ట్వీట్ చేశారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే భారత వృద్ధి రేటును 1.3 శాతం మేర కోత విధిస్తూ 4.8 శాతానికి ఐఎంఎఫ్ సోమవారం కుదించింది. రుణాల జారీలో తగ్గుదల, దేశీయ డిమాండ్ పడిపోవడంతో భారత వృద్ధిరేటు అంచనాను తగ్గిస్తున్నట్టు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక పరిస్ధితిపై ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్‌లో వృద్ధి మందగమనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటునూ ప్రభావితం చేస్తుందని, వరల్డ్ ఎకానమీ వృద్ధి అంచనాను కూడా 0.1 శాతం మేర సవరించామని గీతా గోపీనాథ్ పేర్కొనడం గమనార్హం. కాగా భారత వృద్ధి రేటును సవరిస్తూ ఐఎంఎఫ్ తాజా అంచనా మరింత తగ్గవచ్చని చిదంబరం వ్యాఖ్యానించడం గమనార్హం. చదవండి : వృద్ధి అంచనా కుదింపు : ఐఎంఎఫ్ హెచ్చరిక -
‘భారతీయులు ఏం చెప్పినా నమ్మేస్తారు’
ఢిల్లీ : భారతీయులంతా అమాయకులను ఎక్కడా చూడలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. శుక్రవారం ఓ కార్యక్రమానికి హాజరైన చిదంబరం మాట్లాడుతూ.. ‘నేను నా జీవితంలో భారతీయులంతా అమాయకులను ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. ఎవరేం చెప్పినా ఏమాత్రం ఆలోచించకుండా ప్రతి దానిని నమ్ముతాం. గ్రామాలన్నీ విద్యుదీపాలతో వెలిగి పోతున్నాయంటే నమ్ముతాం. దేశంలోని 99 శాతం కుటుంబాలకు టాయిలెట్లు నిర్మించారని చెబితే నమ్మేస్తాం’ అని కేంద్ర పథకాలను ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారని చిదంబరం విమర్శించారు ఈ సందర్బంగా కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్‌పై ఆయన మండిపడ్డారు. ‘ఢిల్లీకి చెందిన నా డ్రైవర్ తండ్రికి ఆయుష్మాన్ భారత్ కింద సర్జరీ జరిగింది. అయితే అక్కడి వైద్యులు ఈ పథకం గురించి వారికి ఏం తెలియదని, ఇది వర్తించదని చెప్పారు. కానీ మనం ఆయుష్మాన్ దేశమంతా వర్తిస్తుందని, దీని ద్వారా అన్ని రోగాలకు వైద్యం చేయించుకోవచ్చని నమ్ముతాం. మనం అమాయకులం కదా. అనేక విషయాలకు సంబంధించిన వార్తలు, నివేదికలు అన్నీ వాస్తవానికి విరుద్దమే’ అని కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో లోపాలను ఎత్తి చూపారు. -
దుష్ట ఆలోచనలో భాగమే ఎన్నార్సీ
న్యూఢిల్లీ: జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ) అమలు చేయాలనే నిర్ణయం దేశాన్ని విభజించాలనే దుష్ట ఆలోచనలో భాగమేనని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం దుయ్యబట్టారు. హిందూ రాష్ట్ర విభజన ఎజెండాను ముందుకు తీసుకురావాలన్న ఆర్ఎస్ఎస్–బీజేపీ ప్రణాళికలో భాగంగానే ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ల అమలు నిర్ణయమని ఆరోపించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమయ్యేది ఎవరన్నా ఉన్నారంటే వారు భారత ముస్లింలు మాత్రమేనని అన్నారు. వేరే మతాలను ఎన్నార్సీ కింద మినహాయించి సీఏఏలో చేర్చారని, అయితే ఎన్నార్సీ కింద అక్రమ వలసదారులుగా గుర్తించే ముస్లింలను మాత్రం సీఏఏ నుంచి మినహాయించారని విమర్శించారు. దీంతో భారతీయ ముస్లింలలో భయం, ఆందోళన నెలకొని ఉన్నాయని అన్నారు. ఎన్పీఆర్–2010కి ఎన్పీఆర్–2020కి అసలు పొంతనే లేదని, దీనిని వ్యతిరేకించాలని వ్యాఖ్యానించారు. -
చిదంబరంను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఎయిరిండి యాకు నష్టం కలిగించేలా వ్యవహరించి, మనీ లాండరింగ్‌కు పాల్ప డ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి చిదంబరానికి ఈడీ గతేడాది ఆగస్టు 23న సమన్లు జారీచేసింది. అయితే ఆ సమయంలో ఆయన ఐఎన్ఎక్స్ మీడియాలో అవినీతి కేసుకు సంబంధించి అరెస్టు అయి సీబీఐ కస్టడీలో ఉన్నారు. -
మీ పని మీరు చూసుకోండి
తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు చేస్తున్న నిరసనలను ఉద్దేశించి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం మండిపడ్డారు. తిరువనంతపురంలో నిరసన ర్యాలీలో చిదంబరం మాట్లాడారు. ‘రాజకీయ నాయకులుగా మేమేం చేయాలో మాకు తెలుసు. ఆర్మీ చీఫ్‌గా మీ పని మీరు చూసుకోండి. యుద్ధంలో ఎలా పోరాడాలో మేం మీకు చెబుతున్నామా? మీ ఆలోచనల ప్రకారం మీరు యుద్ధం చేయండి. రాజకీయ నాయకులుగా మా పని మేం చేస్తాం’అని స్పష్టం చేశారు. -
మోదీ చాలెంజ్ వెనుక అర్థమేంటి?
న్యూఢిల్లీ: పాకిస్తానీయులందరికీ భారతీయ పౌరసత్వం కల్పిస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విసిరిన సవాలుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ‘పాకిస్థాన్ పౌరసత్వం గత వ్యక్తులకు మేం ఎందుకు భారత పౌరసత్వం ఇస్తాం. ప్రతిపక్షాలకు ఇలాంటి సవాళ్లు విసరడంలో అంతరార్థం ఏమిటి’ అని ఆయన ట్విటర్లో ప్రశ్నించారు. ‘దేశ యువత, విద్యార్థులు ఉదార, లౌకికవాద, సహనశీల దృక్పథాన్ని కనబర్చడం, మానవతావాదాన్ని ప్రదర్శిస్తుండటం ఆనందం కలిగిస్తోందని పేర్కన్నారు. ఈ ఉన్నతమైన విలువలను ప్రభుత్వం సవాలు చేయదల్చుకుందా?’ అని ఆయన ప్రశ్నించారు. పాకిస్తానీయులందరికీ భారతీయ పౌరసత్వం కల్పిస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా?.. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించి, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసే ధైర్య సాహసాలు ఆ పార్టీకి ఉన్నాయా అని ఉద్దేశించి మంగళవారం జార్ఖండ్‌లో ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ సవాలు విసిరిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టంతో భారత్‌లో పౌరులకు ఎలాంటి హాని జరగదని ఆయన పునరుద్ఘాటించారు. జామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసు చర్యల్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. అర్బన్ నక్సల్స్ పన్నిన కుట్ర వలలో విద్యార్థులు చిక్కుకోవద్దని హితవు పలికారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అర్బన్ నక్సల్స్, ఇతర రాజకీయ పార్టీలు విద్యార్థుల భుజం మీద తుపాకీ ఉంచి కాల్చడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఏ అంశంలోనైనా ప్రభుత్వంతో ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరపవచ్చునని విద్యార్థులకు పిలుపునిచ్చారు. -
వాళ్లంతా స్వాతంత్ర్య సమరయోధులు కాదు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిదంబరం బెయిల్ కండీషన్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో చిదంబరానికి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 106 రోజుల జైలు జీవితం తర్వాత ఆయన బుధవారం తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. (చదవండి : చిదంబరానికి బెయిల్) జైలు నుంచి బయటకు వచ్చిన చిదంబరం ..గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా తన రికార్డు స్వచ్ఛంగా ఉందని చెప్పారు. ‘అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. మంత్రిగా ఉన్న సమయంలో నేను ఏం చేశానో అందరికీ తెలుసు’ అని చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ జవదేకర్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిదంబరం బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపించారు. చిదంబరానికి వ్యతిరేకంగా నమోదైన ఈ కేసు.. కేంద్ర మంత్రిగా ఆయన పని చేసిన కాలంలో అవినీతికి సంబంధించినదేనని గుర్తు చేశారు. అటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రిగా తన రికార్డు స్వచ్ఛంగా ఉందని చెప్పడం బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. తాను బహిరంగంగా ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వబోనని బెయిల్ తెచ్చుకున్న చిదంబరం .. ఇప్పుడు కేంద్ర మంత్రిగా తన రికార్డు స్వచ్ఛంగా ఉందన్నారని, ఇది స్వీయ ధ్రువపత్రం ఇచ్చుకోవడమేనని జవదేకర్ అన్నారు. ‘కొంతమంది బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు. అంతమాత్రనా వాళ్లు స్వాతంత్ర్య సమరయోధులు కాబోరు’ అని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులను విమర్శించారు. -
మరి ఆమె అవకాడో తింటారా !
సాక్షి, న్యూఢిల్లీ : ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు అల్లాడుతున్న క్రమంలో తాము ఉల్లిపాయలు ఎక్కువగా తినమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మండిపడ్డారు. ఉల్లిపాయలు తిననని చెప్పిన మంత్రి అవకాడోలు తింటారా అని ఆయన ప్రశ్నించారు. ఆమె ఉల్లిపాయలు తినకున్నా వాటి ధరలు మండిపోతున్నాయని అన్నారు. ఐఎన్ఎక్స్ కేసులో 106 రోజులు జైలులో ఉండి బుధవారం బెయిల్‌పై విడుదలైన చిదంబరం నేడు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. మీడియా సమావేశంలో చిదంబరం మాట్లాడుతూ మోదీ సర్కార్ ఆర్థిక వ్యవస్థను సమర్ధంగా నడిపించడంలో విఫలమైందని విమర్శించారు. ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం అసమర్ధ మేనేజర్‌గా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. గ్రామీణ వినియోగం, వేతనాలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధి రేటును ఆర్బీఐ ఏడు శాతం అంచనా వేస్తే అది నాలుగు శాతానికే పరిమితమైందని ఇందుకు ఆర్బీఐ అసమర్ధ అంచనా కారణమా లేక కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా అని చిదంబరం నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తన గొంతును నొక్కేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కార్ కుప్పకూల్చిందని, ఎకానమీపై ప్రధాని నోరు మెదపడం లేదని చిదంబరం మండిపడ్డారు. -
పార్లమెంట్ సమావేశాలకు చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరు అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. కాగా ఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ఈ ఏడాది ఆగస్టు 21న చిదంబరాన్నికస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. చదవండి: చిదంబరానికి బెయిల్ -
చిదంబరానికి బెయిల్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. 106 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు బుధవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం ఉత్తర్వులు అందిన తర్వాత తీహార్ జైలు గేట్ నంబర్ 3 నుంచి రాత్రి 8.10 గంటలకు చిదంబరం బయటకి వచ్చారు. కుమారుడు కార్తితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు జైలు వెలుపల చిదంబరానికి ఘనంగా స్వాగతం పలికారు. జైలు బయట చిదంబరం స్పందన కోసం వేచి చూస్తున్న మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘106 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది‘ అని అన్నారు. ఇన్ని రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించినా తనపై ఒక్క అభియోగం కూడా నమోదు కాలేదని చెప్పారు. అంతకుముందు సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న ఈడీ వాదనల్ని తోసిపుచ్చింది. ‘చిదంబరం ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధి కాదు, ఆయనకు రాజకీయ అధికారాలు లేవు. సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశమే లేదు’ అని జస్టిస్ ఆర్.భానుమతి ధర్మాసనం పేర్కొంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ఆగస్టు 21న చిదంబరాన్నికస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత తీహార్‌జైల్లోనే ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టింది. ఇంటర్వ్యూలు వద్దు: బెయిల్‌పై విడుదలయ్యాక ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. ఈడీ ఎప్పుడు అడిగినా చిదంబరం అందుబాటులో ఉండి విచారణకు సహకరించాలని, ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశాలిచ్చింది. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది: కాంగ్రెస్ చిదంబరానికి బెయిల్ మంజూరు చేయడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించింది. పగ, ప్రతీకారాల కారణంగా చిదంబరం వంద రోజులకుపైగా జైలులో మగ్గిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిష్పాక్షికంగా జరిగే విచారణలో చిదంబరం నిర్దోషిత్వం రుజువు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, చిదంబరం ‘బెయిల్ క్లబ్’లో చేరారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. ఎందరో కాంగ్రెస్ నేతలు బెయిల్‌పై బయట తిరుగుతున్నారని ఆ క్లబ్లో ఇప్పుడు చిదంబరం చేరారంటూ హేళన చేసింది. -
ఈడీ కేసులో చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి ఈడీ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం తీర్పు వెలువరించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మీడియాతో మాట్లాడరాదని, పాస్‌పోర్టును సమర్పించాలని చిదంబరాన్ని జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసులో ఆగస్ట్ 21న చిదంబరం అరెస్ట్ కాగా, సీబీఐ కేసులోనూ ఆయనకు ఇప్పటికే బెయిల్ లభించింది. ఇక అరెస్ట్ అయిన అనంతరం 105 రోజుల తర్వాత ఈడీ కేసులోనూ బెయిల్ లభించింది. -
‘ఇక మన ఎకానమీని దేవుడే కాపాడాలి’
సాక్షి, న్యూఢిల్లీ : భవిష్యత్‌లో జీడీపీ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు సంకేతం కాబోవని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఆర్థిక విధానాలు చూస్తుంటే ఇక మన ఆర్థిక వ్యవస్థను దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు. దిగుమతి సుంకాల పెంపు, వ్యక్తిగత పన్నుల్లో కోత వంటి ప్రభుత్వ చర్యలు ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి దారితీస్తాయని ట్వీట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తిహార్ జైలులో ఉన్న చిదంబరం గత కొంత కాలంగా మోదీ సర్కార్ ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ 4.5 శాతానికి పరిమితం కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాలం చెల్లిన పద్ధతిలో జీడీపీని మదింపు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు జీడీపీ ప్రామాణికం కాదని బీజేపీ ఎంపీ దూబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దూబే వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇలాంటి ఆర్థిక వేత్తల నుంచి నవభారతాన్ని భగవంతుడే కాపాడాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా ట్వీట్ చేశారు. -
చిదంబరంను విచారించనున్న ఈడీ
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం తీహార్ జైళ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరాన్ని నవంబర్ 22,23 వ తేదిలలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. కాగా,ఐఎన్ఎక్స్ మీడియా కేసులో పి చిదంబరాన్ని విచారించాలని కోరుతూ ఈడీ గురువారం రోజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మరోపక్క నవంబర్ 15న జస్టిస్ సురేశ్ కైట్ ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయంటూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈడీ చేసిన దరఖాస్తులో నవంబర్ 15న జస్టిస్ కైట్ ఇచ్చిన తీర్పులో 2017లో సుప్రీంకోర్టు జారీ చేసిన నాలుగు పేరాగ్రాఫ్‌ల సారాంశాన్ని చదివి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాది రోహిత్ టాండన్‌తో పాటు చిదంబరానికి బెయిల్ తిరస్కరించారు. దీనిని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు చిదంబరాన్ని విచారించేందుకు ఈడీని అనుమతిస్తున్నట్లు తెలిపింది.అయితే డీమోనిటైజేషన్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో 2016లో రోహిత్ టాండన్‌ను అరెస్టు చేశారు. 2007లో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అందుకునేందుకు తన శాఖలోని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఆయన అనుమతి ఇప్పించారన్న ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 16న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అంతకు ముందే 2017 మే 15 న సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : చిదంబరం బెయిల్: ఈడీకి సుప్రీం నోటీసులు) -
చిదంబరానికి స్వల్ప ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో జీవితం గడుపుతున్న కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర విచారణను కోరుతూ చిదంబరం న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు 47వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం కానీ, బుధవారం గానీ దీనిపై వాదనలను విననుంది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ కాంగ్రెస్ నేత బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో చిదంబరం బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన స్పెషల్ కోర్టు ఈ నెల 27 వరకు జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ లభించవచ్చునని ఆశించిన ఆయన కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. 2007లో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అందుకునేందుకు తన శాఖలోని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఆయన అనుమతి ఇప్పించారన్న ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 16న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అంతకు ముందే 2017 మే 15 న సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
చిదంబరం ఆరోగ్యం ఓకే..కానీ !
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఆయన ఆరోగ్యం సంతృప్తికరంగా ఉందని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. చిదంబరంకు మినరల్ వాటర్‌తో పాటు ఇంటి ఆహారాన్నే సమకూర్చాలని కోర్టుకు మెడికల్ బోర్డు సూచించింది. ఈ నివేదిక ఆధారంగా చిదంబరానికి సురక్షిత పరిసరాలు ఉండేలా చూడటంతో పాటు దోమల నుంచి రక్షణ కల్పించాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఇక ఇదే కేసులో ప్రధాన బెయిల్ పిటిషన్ ఈనెల 4న విచారణకు రానుంది. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియాపై సీబీఐ కేసులో చిదంబరానికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. -
ఎయిమ్స్‌కు చిదంబరం
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి∙చిదంబరానికి కడుపునొప్పి రావడంతో ఎయిమ్స్‌కు సోమవారం తరలించారు. చికిత్స ముగిశాక తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఈడీ పర్యవేక్షణలో ఐఎన్ఎక్స్ కేసుకు సంబంధించి తీహార్ జైల్లో ఉన్నారు. మొదట ఆర్ఎమ్మెల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం సమయంలో ఎయిమ్స్‌కు పంపించి, అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు గంటలప్పుడు తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ఆయనకున్న సమస్యను డాక్టర్లు వెల్లడించడంలేదు. -
ఎయిమ్స్‌కు చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంను అస్వస్థతతో బాధపడుతుండటంతో సోమవారం సాయంత్రం ఎయిమ్స్‌కు తరలించారు. కడుపు నొప్పికి చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు రెండు రోజులు బెయిల్‌పై అనుమతించాలని గత వారం కోర్టు విచారణ సందర్భంగా చిదంబరం కోరారు. చికిత్స అనంతరం తన కస్టడీని కొనసాగించవచ్చని చెప్పారు. వైద్యం కోసం ఆయనను ఎయిమ్స్‌కు తీసుకువెళతామని ఈడీ పేర్కొంది. మరోవైపు కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు చిదంబరం తెలుపగా ఆయనను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఈడీ బృందం సాయంత్రం ఎయిమ్స్‌కు తరలించింది. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం ఈనెల 30 వరకూ ఈడీ కస్టడీలో కొనసాగుతారు. -
డీకేకు బెయిల్.. చిదంబరం వెయిటింగ్
న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు బెయిల్ లభించింది. ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 25 లక్షల పూచీకత్తు సమర్పించాలని, దేశం విడిచి వెళ్లరాదని ఉన్నత న్యాయస్థానం షరతులు విధించింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించరాదని హెచ్చరించింది. దర్యాప్తు సంస్థలకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించింది. తిహార్‌లో జైలులో ఉన్న శివకుమార్‌ను నేడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కలిశారు. అన్నివిధాల అండగా ఉంటామని ఆయనకు భోరోసాయిచ్చారు. కోట్లాది రూపాయల పన్నులు ఎగవేశారన్న ఆరోపణలతో 57 ఏళ్ల శివకుమార్‌ను సెప్టెంబర్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో బెయిల్ కోసం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యం క్షీణిస్తున్నందున బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై రేపు విచారించే అవకాశముంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఇదే కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ ఇచ్చింది. ఈడీ కస్టడీలో ఉండటంతో ఆయన జైలు నుంచి విడుదల కాలేదు. ప్రత్యేక కోర్టు ఆయనకు విధించిన ఈడీ కస్టడీ గడువు రేపటి వరకు ఉంది. (చదవండి: బెయిలు.. అయినా తప్పదు జైలు) -
బెయిలు.. అయినా తప్పదు జైలు
న్యూఢిల్లీ: ఎట్టకేలకు సీబీఐ దాఖలు చేసిన ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సుప్రీంకోర్టు మంగళవారం బెయిలు మంజూరు చేసింది. చిదంబరం సాక్షులను ప్రభావితం చేసే అవకాశంగానీ, విదేశాలకు పారిపోయే ప్రమాదంగానీలేదని కోర్టు అభిప్రాయపడింది. రూ.1లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ చిదంబరం పూర్తిగా జైలునుంచి విముక్తి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఐఎన్ఎక్స్ మీడియా స్కాంకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2007లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సా హక మండలి.. ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ నిధులు(రూ.305 కోట్లు) సమకూర్చిపెట్టేందుకు చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత 2017లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చిదంబరంపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఆగస్టు 21న చిదంబరంను ఢిల్లీలోని ఆయన నివాసంలోనే సీబీఐ అరెస్టు చేయడం తెల్సిందే. అక్టోబర్ 18న చిదంబరంని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలోకి తీసుకుంది. -
ఐఎన్ఎక్స్ కేసు : చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్ధానం ఆయనకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం అరెస్టయిన రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్ లభించడం గమనార్హం. ఈ కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తే ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇదే కేసులో ఆయన ఈడీ కస్టడీలో ఉండటంతో చిదంబరం జైలులోనే గడపాల్సి ఉంది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో చిదంబరంను సీబీఐ ఆగస్ట్ 21న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంతో పాటు మరికొందరు ఉన్నతాధికారులపైనా సీబీఐ చార్జిషీట్ నమోదైంది -
పీకల్లోతు కష్టాల్లో మాజీ ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోయారు. ఈ కేసులో తాజాగా చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీతో కలిపి మొత్తం 13మంది పేర్లను సీబీఐ చార్జీషీటులో చేర్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రూ. 310కోట్లు అక్రమంగా నిధులను మళ్లించడంపై ఆయనపై సీబీఐ అధికారులు చార్జిషీటు నమోదు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్ చేసి తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి సీబీఐ, ఈడీ అధికారుల సమక్షంలో కస్టడీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌సిబాల్ బెయిల్ తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేసిన ఫలించలేదు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరంపై చార్జీషీటు నమోదు కావడం ఇదే మొదటిసారి. కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కర్, కేంద్రమాజీ కార్యదర్శి ఆర్ ప్రసాద్, విదేశీ వ్యవహారాల మాజీ డైరెక్టర్ ప్రబోద్ సక్సేనా, ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అనూప్ పూజారి, అదనపు కార్యదర్శి సిద్దుశ్రీ కుల్హర్, చెస్ నిర్వహణ యాజమాన్యం పేర్లను కూడా సీబీఐ అధికారులు చార్జీషీటులో నమోదు చేశారు. చార్జీషీటు నమోదు కావడంతో కేసు మరింత జఠిలమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. (చదవండి : ఐఎన్ఎక్స్ కేసు : చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ ) -
చిదంబరం మళ్లీ అరెస్ట్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తీహార్ జైల్లో ఉన్న ఆయనను ఈ సారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ బృందం ఉదయం 8:15 గంటలకే తీహార్ జైలుకి చేరుకున్నారు. దాదాపుగా రెండు గంటల సేపు అక్కడే చిదంబరాన్ని విచారించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీ ల్యాండరింగ్‌పై గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయనని అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 14 రోజుల కస్టడీ విచారణ కోసం చిదంబరాన్ని అప్పగించాలంటూ కోర్టుని కోరారు. గతంలో ఎన్నోసార్లు చిదంబరాన్ని ఈడీ ప్రశ్నించినప్పటికీ ఆయనను అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే చిదంబరాన్ని అరెస్ట్ చేయవద్దనీ, ఆయనను బలవంతపెట్టే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని గతంలో కోర్టు ఆదేశాలు ఉండేవి. అయితే చిదంబరాన్ని విచారించవచ్చునని అవసరమైతే అరెస్ట్ కూడా చేయవచ్చునంటూ ట్రయల్ కోర్టు మంగళవారమే అనుమతినిచ్చింది. దీంతో ఈడీ తన విచారణలో కొత్త అంశాలను రాబట్టడానికి సకల సన్నాహాలు చేస్తోంది. చిదంబరాన్ని ఈడీ కస్టడీకి అప్పగించడానికి కోర్టు అనుమతిస్తే అన్ని కోణాల నుంచి విచారణకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల అంశం చుట్టూనే విచారణ సాగుతుందని ఈడీ కార్యాలయం అధికారులు తెలిపారు. ఈడీ బృందం ప్రశ్నించడానికి వచ్చినప్పుడు జైలు పరిసరాల్లో చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తీ కూడా కనిపించారు. -
ఐఎన్ఎక్స్ కేసు : చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బుధవారం ఉదయం నుంచి తిహార్ జైలులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరంను ప్రశ్నించిన ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ బృందం ఆయనను అరెస్ట్ చేసింది. కస్టడీలో చిదంబరంను ప్రశ్నించేందుకు ప్రత్యేక న్యాయస్ధానం అనుమతించిన మరుసటి రోజే ఆయనను ఈడీ అదుపులోకి తీసుకుంది. మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 74 సంవత్సరాల చిదంబరం సెప్టెంబర్ 5 నుంచి తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు చిదంబరంను కస్టడీ కోరుతూ ఈడీ అధికారులు మరికాసేపట్లో సీబీఐ కోర్టును ఆశ్రయించనున్నారు. కాగా చిదంబరంను కలిసేందుకు ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ చిదంబరం ఈరోజు ఉదయం తిహార్ జైలును సందర్శించారు. తన తండ్రి ఎన్ని ఇబ్బందులు ఎదురైన సానుకూల స్ఫూర్తితో ఉన్నారని, రాజకీయ జిమ్మిక్కులతో సాగుతున్న ఈ తంతును ఆయన ఎదుర్కొంటారని కార్తీ చిదంబరం పేర్కొన్నారు. ఇది బోగస్ విచారణ అని కార్తీ తన తండ్రిని కలిసిన అనంతరం వ్యాఖ్యానించారు. -
మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజులకు పైగా (సెప్టెంబరు 5) తీహార్ జైల్లో గడుపుతున్న చిదంబరానికి బెయిల్ విషయంలో ఢిల్లీ సీబిఐ కోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనను రేపు (బుధవారం) ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారు. తీహార్ జైల్లో ప్రశ్నించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఈడీకి ఢిల్లీ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. ఒక వైపు సిబిఐ, ఇంకో వైపు ఈడీ ఇలా వరుస కేసులతో చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలతో చిదంబరానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. -
అక్టోబర్ 17 వరకూ చిదంబరం కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు అక్టోబర్ 17 వరకూ పొడిగించింది. జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ దర్యాప్తు సంస్థ సీబీఐ అప్పీల్ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను ఆగస్ట్ 21న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంద్రాణి ముఖర్జి, పీటర్ ముఖర్జియాలు అప్రూవర్‌గా మారిన ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. కాగా ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రస్తుతం పీటర్, ఇంద్రాణిలు ముంబై జైలులో ఉన్నారు. ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంపై ఈడీ సైతం 2017లో మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్‌ను కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం చిదంబరం తాజాగా అప్పీల్ చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌ను తక్షణమే విచారించాలని చిదంబరం తరపు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా,జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీం బెంచ్‌ను కోరారు. -
మేం పదేపదే చెప్తున్నాం.. ఇది కక్షసాధింపే!
సాక్షి, న్యూఢిల్లీ: తిహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను ఆ పార్టీ సీనియర్ నాయకులు పలువురు గురువారం కలిశారు. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శ్మ, డీకే సురేశ్ జైల్లో ఉన్న శివకుమార్‌ను కలిసి.. కాసేపు ముచ్చటించారు. తిహార్ జైల్లోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఆయన తనయుడు కార్తీ చిదంబరం గురువారం కలిశారు. చిదంబరాన్ని కలిసిన అనంతరం జైలు బయట కార్తీ మీడియాతో మాట్లాడారు. ‘ఇది కక్షసాధింపు రాజకీయం తప్ప మరొకటి కాదని మేం పదేపదే చెప్తున్నాం. మంచి వక్తలై ఈ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగడుతున్న నాయకుల్ని బోగస్ కేసులతో టార్గెట్ చేశారు. మా నాన్న, శివకుమార్ మీద ప్రస్తుతం ఎలాంటి విచారణ జరగడం లేదు. వారిని దోషులుగా ఏ కోర్టు నిర్ధారించలేదు. అయినా, జ్యుడీషియల్ కస్టడీ కింద వారిని జైల్లో ఉంచారు. ఇది దేశ రాజకీయ వాతావరణాన్ని విషతుల్యంచేసి భయానక వాతావరణాన్ని సృష్టించడమే’ అని కార్తీ మండిపడ్డారు. -
పార్టీ బలంగా ఉన్నంతకాలం..నేను కూడా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నంత కాలం తాను కూడా ధైర్యంగా ఉంటానని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరం విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం జైలులో చిదంబరాన్ని కలిశారు. చదవండి : చిదంబరాన్ని కలిసిన సోనియా, మన్మోహన్ ఈ నేపథ్యంలో వారితో భేటీ విషయమై చిదంబరం ట్విటర్లో స్పందించారు. ‘నా తరపున నా కుటుంబాన్ని ట్వీట్ చేయని కోరాను. ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ, డా. మన్మోహన్సింగ్ నన్ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నంత కాలం నేను కూడా బలంగా ఉంటాను’ అని పేర్కొన్నారు. కాగా చిదంబరం తనయుడు కార్తీ కూడా సోమవారం జైల్లో ఉన్న తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా... ‘దేశం అంతా బాగానే ఉంది, నిరుద్యోగం, ఉన్న ఉద్యోగాన్ని తొలగించడం, తక్కువ వేతనాలు, కశ్మీర్ సమస్య, విపక్ష నాయకులను జైలుకు నెట్టడం మినహా’ అంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చిదంబరం మరో ట్వీట్లో పేర్కొన్నారు. I have asked my family to tweet on my behalf the following: I am honoured that Smt. Sonia Gandhi and Dr. Manmohan Singh called on me today. As long as the @INCIndia party is strong and brave, I will also be strong and brave. — P. Chidambaram (@PChidambaram_IN) September 23, 2019 -
ఎలా ఉన్నారు?
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం ఆగస్టు 21వ తేదీన నాటకీయ పరిణామాల మధ్య అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో తీహార్ జైల్లో ఉన్న చిదంబరాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ బుధవారం కలిశారు. వారివెంట చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఉన్నారు. తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన కాంగ్రెస్ నేతలు ఆయనతో దాదాపు అర్ధగంట సేపు ముచ్చటించారు. రాజకీయ అంశాలు ముఖ్యంగా కశ్మీర్ గురించి, రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి వీరి మధ్య చర్చ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జైల్లో ఉన్న చిదంబరం సోమవారం 74వ పుట్టినరోజును జరుపుకున్నారు. జైలు వర్గాల ప్రకారంచ ప్రస్తుతం చిదంబరం ఆరోగ్యంగా ఉన్నారు. -
మీరు లేకుండా మీ పుట్టిన రోజు అసంపూర్ణం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి.. ప్రస్తుతం తిహార్ జైలులో గడుపుతున్నారు కేంద్ర మాజీ మంత్రి పీ చిదబంరం. ఈ క్రమంలో జైలులోనే తన 74వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు చిదంబరం. ఈ సందర్భంగా చిందబరం తనయుడు కార్తీ తండ్రి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక చిదంబరం జైలు పాలైన నాటి నుంచి జరిగిన సంఘటనల గురించి వివరిస్తూ.. రెండు పేజీల లేఖ రాశారు. దానిలో కశ్మీర్ పునర్వ్యస్థీకరణ, ఆర్థిక మందగమనం, దానిపై ఆర్థిఖ మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు, గురుత్వాకర్షణ గురించి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు, అస్సాం ఎన్ఆర్సీ, మోదీ ప్రభుత్వం 100 రోజుల వేడక గురించి ప్రస్తావించారు. అంతేకాక ‘మీరు 76వ ఏట అడుగుపెట్టడం.. మోదీ ప్రభుత్వం వంద రోజుల వేడుక చేసుకోవడం రెండు ఒకేలాంటి అంశాలు కాదు. తన అనాలోచిత నిర్ణయాలతో బీజేపీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింద’ని కార్తీ ఆరోపించారు. దాంతో పాటు ‘మీరు లేకుండా మీ పుట్టిన రోజు వేడుకలు జరపుకోవడం చాలా లోటుగా ఉంది. మీరు లేకపోవడం మా హృదయాలను కదిలించింది. మీరు తిరిగి వచ్చి మాతో పాటు పుట్టిన రోజు వేడకల్లో పాల్గొంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ అలా జరగదని తెలుసు’ అంటూ కార్తీ లేఖలో పేర్కొన్నారు. -
చిదంబరానికి ఢిల్లీ కోర్టు షాక్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం(73)కు మరోసారి షాక్ తగిలింది. తీహార్ జైలు నుంచి బయటపడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను ఢిల్లీలోని ఓ కోర్టు తిరస్కరించింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి అప్పగించాలని చిదంబరం శుక్రవారం ఓ న్యాయస్థానంలో సరెండర్ పిటిషన్ దాఖలుచేశారు. దీంతో చిదంబరం దాఖలుచేసిన సరెండర్ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ దాన్ని తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఈడీ అధికారుల తీరుపై చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తీవ్రంగా మండిపడ్డారు. చిదంబరాన్ని మరింత వేధించేలా ఈడీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో సీబీఐ న్యాయస్థానం చిదంబరాన్ని సెప్టెంబర్ 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. సరైన సమయంలో అరెస్ట్ చేస్తాం: ఈడీ ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన అవినీతి కేసులో చిదంబరం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ‘చిదంబరం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయలేరు. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించేముందు కొన్ని అంశాల్లో మేం దర్యాప్తును పూర్తిచేయాల్సి ఉంది. కనీసం ఆరుగురు వ్యక్తులను విచారించాకే మేం చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకోగలం. ఎందుకంటే ఈ అక్రమ నగదు చెలామణి కేసు దేశాన్ని దాటి విస్తరించింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో చిదంబరం అరెస్ట్ తప్పనిసరి. దాన్ని మేం సరైన సమయంలో చేపడతాం. తనను కస్టడీలోకి తీసుకోవాలని ఓ నిందితుడు విచారణ సంస్థను ఆదేశించలేడు. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం విచారణ సంస్థదే. మేం చిదంబరాన్ని అరెస్ట్ చేశాక, అప్పటివరకూ సేకరించిన ఆధారాల్ని ఆయనముందు పెడతాం’ అని చెప్పారు. చిదంబరాన్ని వేధించాలనే: సిబల్ ఈ ఏడాది ఆగస్ట్ 20–21 తేదీల మధ్య చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. ‘కానీ ఇప్పుడు ఈడీ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఆయన మరింతకాలం జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగేలా, బాధపెట్టేలా ఈడీ అధికారులు దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు’ అని సిబల్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, చిదంబరం దాఖలుచేసిన సరెండర్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నేతను ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నది ఈడీ విచక్షణాధికారానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఈ సందర్భంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతుల కోసం భారీగా ముడుపులు చేతులుమారాయని సీబీఐ కేసు నమోదుచేసింది. -
చిదంబరానికి ఇంటి భోజనం నో
న్యూఢిల్లీ: ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిదంబరానికి ప్రత్యేక ఆహారం ఇవ్వడం కుదరదనీ, జైలులో అందరికీ ఒకే రకమైన ఆహారం ఉంటుందనీ హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణలో చిదంబరంకి ఇంటి నుంచి తెప్పించిన ఆహారాన్ని జైలులో అనుమతించాల్సిందిగా ఆయన తరఫున కపిలి సిబాల్ కోర్టుని కోరడంతో జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ‘‘జైలు లో అందరికీ ఒకే రకమైన ఆహారం అందుబాటులో ఉంటుంది’’అని తేల్చి చెప్పారు. అయితే తన క్లయింట్ 74 ఏళ్ళ వయస్సువారనీ, అందుకే ఇంటిభోజనాన్ని అనుమతించాలనీ సిబల్ వాదించగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కలుగజేసుకుంటూ ‘‘ఓమ్‌ప్రకాష్ చౌతాలా ఇంకా ఎక్కువ(84 ఏళ్ళు) వయస్సువారు, రాజకీయ ఖైదీ కూడా అయినప్పటికీ ఆయనకు జైలులో సాధారణ భోజనమే అందుతోంది. రాజ్యం ఎవ్వరి పట్లా భేదం పాటించదు’’ అని వ్యాఖ్యానించారు. -
‘నా కొడుకు కోసం ఏం చేయలేకపోతున్నాను’
లక్నో: ‘నా కుమారుడి కోసం ఏం చేయలేకపోతున్నాను.. ఉద్యోగ విరమణ తర్వాత ఎన్నో వ్యాపార ప్రయత్నాలు చేశాను. కానీ అవేవీ ఫలించలేదు. ఇందుకు యూపీఏ ప్రభుత్వం, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం నిర్ణయాలే కారణం’ అంటూ ఓ విశ్రాంత ఐఏఎఫ్ అధికారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. అస్సాంకు చెందిన బిజన్ దాస్ ఈ నెల 6న ఉత్తరప్రదేశ్, అలహాబాద్‌లోని ఓ లాడ్జీలో దిగాడు. అయితే ఆదివారం రోజున ఆయన గది బయటకు రాకపోవడమే కాక ఆహారం కూడా తీసుకోలేదు. అనుమానం వచ్చిన వెయిటర్ ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో వారు గది లోపలికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరేసుకున్న బిజన్ దాస్ వారికి కనిపించాడు. గదిలో రెండు వేల రూపాయలతో పాటు ఓ ఐదు పేజీల సూసైడ్ నోట్ కూడా లభించింది. దానిలో తన కుమారుడి కోసం ఏం చేయలేకపోతున్నాని.. ఉద్యోగ విరమణ తర్వాత వ్యాపారం ప్రారంభించినప్పటికి కలిసి రాలేదని తెలిపాడు బిజన్ దాస్. ఇందుకు గత యూపీఏ ప్రభుత్వాన్ని, చిదంబరాన్ని తప్పు పట్టాడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌లు, తప్పుడు నిర్ణయాల వల్ల మాంద్యం పరిస్థితులు తలెత్తాయని.. ఫలితంగా రిటైర్మెంట్ తర్వాత తాను ప్రారంభించిన వ్యాపారాలేవి కలిసి రాలేదని బిజన్ దాస్ ఆరోపించాడు. అంతేకాక ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల వల్ల తాత్కలిక ఇబ్బందులు మాత్రమే ఎదుర్కొన్నాం.. కానీ యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుత మాంద్యం పరిస్థితులు తలెత్తాయన్నాడు. తన కుమారుడు బాగా పాడతాడని.. ఓ టీవీ షోలో కూడా పాల్గొన్నాడని తెలిపాడు. తాను చనిపోవడంతో తన కుమారుడు దిక్కులేని వాడవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడు అతని కలలను సాకారం చేసుకునేందుకు మోదీ సహకరించాలని బిజన్ దాస్ విజ్ఞప్తి చేశాడు. అంతేకాక అలహబాద్లోనే తన అంత్య క్రియలు పూర్తి చేయాలని అందుకు గాను రూ. 1500లను గదిలో ఉంచానని చెప్పాడు. హోటల్ గది అద్దె చెల్లించడం కోసం మరో 500 రూపాయలను కూడా ఉంచుతున్నట్లు పేర్కొన్నాడు. తాను మరణించాననే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపవద్దని కోరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తీహార్ జైల్లో చిదంబరం
-
తీహార్ జైల్లో చిద్దూ; తొలిరోజు గడిచిందిలా..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తీహార్‌లోని జైలులో మొదటిరోజు నిద్రలేని రాత్రి గడిపారు. కొత్త వాతావరణంలో సరిగా నిద్రపోలేకపోయారు. కోర్టు ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీ పెంచడంతో ఆయనను గురువారం ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. తన కుమారుడు కార్తీ గతేడాది 12 రోజులు గడిపిన ఏడో నంబరు జైలు గదిలోనే ఆయన్ని ఉంచారు. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు 74 ఏళ్ల చిదంబరానికి ప్రత్యేక గదిని కేటాయించి కొన్ని సదుపాయాలు కల్పించారు. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత తలగడ, దుప్పటి అందజేశారు. జైలు గది బయట వాకింగ్ చేసేందుకు శుక్రవారం ఉదయం ఆయనకు అధికారులు అనుమతిచ్చారు. తర్వాత అల్పాహారం, తేనీరు అందించారు. అల్పాహారంగా అంబలి తీసుకున్నట్టు సమాచారం. ఇతర ఖైదీల్లాగే చిదంబరం కూడా లైబ్రరీని వాడుకోవచ్చనీ, నిర్దేశిత సమయంలో టీవీ చూడవచ్చని జైలు అధికారులు వెల్లడించారు. దినపత్రికలు కూడా అందిస్తామన్నారు. ఈరోజు చిదంబరాన్ని ఆయన న్యాయవాది జైలులో కలిసే అవకాశముందని వెల్లడించారు. (చదవండి: తీహార్ జైలుకు చిదంబరం) -
జైలులో చిదంబరం కోరికల చిట్టా..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 15 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరాన్ని గురువారం కోర్టు ముందు హాజరుపర్చగా, ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ప్రత్యేక జడ్జి ఆదేశాలు జారీచేశారు. దీంతో పోలీసులు ఆయన్ను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చిదంబరం విశ్వప్రయత్నాలు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమని న్యాయవాది కపిల్ సిబల్ ద్వారా తెలియజేశారు. తనను కస్టడీలోకి తీసుకోవాలని ఈడీని కోరారు. ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ సాగుతోందనీ, ఒకవేళ చిదంబరానికి బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే సీబీఐ చిదంబరంపై నిరాధార ఆరోపణలు చేస్తోందనీ, ఆయన నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కపిల్ సిబల్ కోర్టుకు చెప్పారు. ఈడీకి లొంగిపోయేందుకు చిదంబరం సిద్ధంగా ఉన్నారన్నారు. దీతో ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్, చిదంబరాన్ని ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో పోలీసులు నీలిరంగు బస్సులో చిదంబరాన్ని కోర్టు నుంచి 18 కి.మీ దూరంలోని తీహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చిదంబరం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్గం సుగమమైంది. 74వ పుట్టినరోజును జరుపుకోవడానికి సరిగ్గా 11 రోజుల ముందు చిదంబరం తీహార్ జైలుకు చేరుకోవడం గమనార్హం. సుప్రీంలో ఎదురుదెబ్బ అంతకుముందు ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం తిరస్కరించింది. ‘ఈ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం సరికాదు. ఎందుకంటే ఆర్థిక నేరాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు అవకాశమున్నప్పటికీ ఈడీ చొరవ తీసుకోలేదు. మరోవైపు ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసులో చిదంబరానికి ఢిల్లీ ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సహాక బోర్డు(ఎఫ్ఐపీబీ) ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల కోసం అనుమతులు జారీచేసింది. ఈ సందర్భంగా ముడుపులు చేతులు మారినట్లు, మనీలాండరింగ్ జరిగినట్లు సీబీఐ, ఈడీ కేసులు నమోదుచేశాయి. ఈ కేసులో గతనెలలో చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. కార్తీ గడిపిన జైలు గదిలోనే.. సీబీఐ కోర్టు ఆదేశాల నేపథ్యంలో చిదంబ రానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు తీహార్‌లోని జైల్ నంబర్ 7కు తరలించారు. ఈ విషయమై తీహార్ జైలు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు చిదంబరానికి ప్రత్యేక గదిని కేటాయించామనీ, అందులో వెస్ట్రన్ టాయిలెట్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. ఇతర ఖైదీల్లాగే చిదంబరం కూడా లైబ్రరీని వాడుకోవచ్చనీ, టీవీ చూడవచ్చని వెల్లడించారు. రాత్రి భోజనంలో భాగంగా చిదంబరానికి అన్నం, పప్పు, తాలింపును అందజేస్తామన్నారు. ఉదయం 7–8 గంటల మధ్య అల్పాహారం అందజేస్తామని పేర్కొన్నారు. జైలులో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్ నుంచి చిదంబరం నీరు తాగవచ్చనీ, లేదంటే క్యాంటీన్ నుంచి కొనుక్కోవచ్చని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదుచేసిన కేసులో కుమారుడు కార్తీ గతేడాది 12 రోజులు గడిపిన జైలు గదిలోనే ప్రస్తుతం చిదంబరాన్ని ఉంచడం గమనార్హం. చిద్దూ కోరికల చిట్టా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అప్పగించడంతో చిదంబరం వెంటనే రెండు ప్రత్యేక పిటిషన్లను న్యాయస్థానంలో దాఖలుచేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున మందులతో పాటు కళ్లద్దాలను తీహార్ జైలులోకి తీసుకెళ్లేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును కోరారు. అలాగే తాను జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తిని అయినందున ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించాలనీ, అందులో పాశ్చాత్య దేశాల్లో వాడే టాయిలెట్‌ను ఏర్పాటుచేసేలా జైలు అధికారుల్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. జైలులో తనకు తగిన భద్రత కల్పించాలని పిటిషన్లో కోరారు. చిదంబరం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి అజయ్ కుమార్, ప్రత్యేక గది, వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాట్లు చేయాలని తీహార్ జైలు అధికారుల్ని ఆదేశించారు. -
తీహార్ జైలుకు చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం (73)కి చివరికి ఎదురు దెబ్బ తప్పలేదు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సీబీఐ కోర్టు భారీ షాకిచ్చింది. ఇప్పటికే 15 రోజులు సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన్ను నేడు (గురువారం) కోర్టు ముందు హాజరుపర్చింది. దీంతో సెప్టెంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థికమంత్రిని దేశ రాజధానిలోని తీహార్ జైలుకు తరలించారు.14 రోజులు ఆయన తీహార్ జైల్లో గడపాల్సి వుంది. అయితే జైలులో తగిన భద్రత, సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీకోర్టును ఆశ్రయించారు చిదంబరం. జెడ్-కేటగిరీ భద్రతలో ఉన్న ఆయనకు అదే తరహా భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇక సౌకర్యాల విషయానికి వస్తే.. చిదంబరం నేలమీద కూర్చోలేరు కనుక వెస్ట్రన్ టాయిలెట్ ఉండాలని కూడా అభ్యర్థించారు. దీంతో జైలు మాన్యువల్‌కు లోబడి చిదంబరం తరఫున న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అన్ని అభ్యర్థనలను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ అనుమతించారు. జైలులో చిదంబరానికి తగిన భద్రత ఉంటుందని సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) హామీ ఇచ్చారు. అలాగే మందులను జైలుకు తీసుకెళ్లడానికి అనుమతి లభించింది. కాగాఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదరంబరం తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో మాజీ మంత్రిని ఆగస్టు 21 రాత్రి సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
ప్రతీకారమే పరమావధిగా..
ప్రత్యర్థులపై ప్రతీకారమే పరమావధిగా భారత రాజకీయాలు తీవ్రమైన విషవలయం చుట్టూ తిరుగుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రాల పరిధిలో ఉన్న ప్రతీకార రాజకీయాలు ఇప్పుడు న్యూఢిల్లీకి చేరుకున్నాయి. నరేంద్రమోదీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ వాటిని పరాకాష్టకు తీసుకుపోతున్నట్లుంది. నిఘా సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నేతలపై నేరారోపణ చేయడం, కస్టడీ, ఇంటరాగేషన్, కోర్టుల చుట్టూ తిప్పడం మీడియాను కనువిందు చేస్తున్నట్లుంది. ప్రత్యర్థి గతంలో తమకు ఏం చేశాడో తాము అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థికీ, అతడి మద్దతు దారులకూ దాన్నే అప్పగించడమే ఆధునిక రాజకీయాల్లో ప్రతికారానికీ, పైశాచికానందానికి కారణమవుతోంది. ప్రతీకార రాజకీయాలు ఒకరి వెంట ఒకరిగా రాజకీయనేతలనే చుట్టుముడుతుండటం నిజంగా ఒక విషవలయం. భారతదేశ రాజకీయాల్లో ప్రతీకారం తీర్చుకోవడం చాలా పాత విషయమే కావచ్చుకానీ నరేంద్రమోదీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ దాన్ని పరాకాష్టకు తీసుకుపోతున్నట్లుంది. వాళ్లు నీకేది చేస్తే నీవూ వాళ్లకు అదేవిధంగా చేయి అనే బైబిల్ సూక్తికి భారత రాజకీయాలు సరికొత్త వ్యాఖ్యానం చేస్తున్నట్లున్నాయి. తాజాగా బీజేపీ ఒకవైపు సీబీఐ, ఈడీ, ఐటీలను మరోవైపున టీవీ చానల్స్, సోషల్ మీడియాకు కోరలు పదునుపెడుతూ ప్రతీకార రాజకీయాలను తారస్థాయికి తీసుకుపోతోంది. కశ్మీర్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా నరేంద్రమోదీ, షాలు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను ఉసిగొల్పగలిగేంత సమయాన్ని అట్టిపెట్టుకున్నారు. అందుకే మాజీ హోం, ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఇంటిపై నిఘా సంస్థలు భారీ స్థాయి దాడులకు తలపడటం, ఆయనపై నేరారోపణ, ఇంటరాగేషన్, కస్టడీ, కోర్టుల చుట్టూ తిప్పడం వంటి న్యాయ ప్రక్రియలు శరవేగంగా కొనసాగుతూ పోయాయి. నిఘా సంస్థల ఈ సత్వర చొరవ ముందు, కశ్మీర్ ఘటనలు, ఇమ్రాన్ ప్రేలాపనలు, డొనాల్డ్ ట్రంప్ చేతిని మోదీ స్నేహపూర్వకంగా తట్టడం వంటి ప్రముఖ ఘటనలన్నీ వెలవెలబోయాయనే చెప్పాలి. సీబీఐ అధికారులు తమ ట్రౌజర్లను పైకి లాక్కుంటూ ఢిల్లీలో పి. చిదంబరం ఇంటి గోడలపైకి ఎగబాకుతున్న దృశ్యాలు మీడియాలో కనబడి వాటికి ఒక తమాషా విలువను ఏర్పర్చాయి. ఈ దృశ్యం నన్ను కొంతకాలం క్రితం, ప్రతీకారాన్ని బలంగా ఆచరించేంతగా మన రాజకీయనేతలను ఏది పురికొల్పుతోంది అనే అంశంపై ఓ రాజకీయ నేతతో నేను మాట్లాడిన ఒక సాయంకాలపు సంభాషణవైపు తీసుకుపోయింది. నన్ను విందుకు ఆహ్వానించిన వ్యక్తి ఈ ప్రశ్నతో మొదలెట్టారు. ‘‘రాజకీయాల్లో మన జీవితాలను ఎందుకు మదుపు చేస్తున్నాము? దుమ్ముతో, వేడితో, మొరటుదనంతో కూడిన హెలికాఫ్టర్లలో ప్రయాణిస్తూ ఎందుకు కష్టపెట్టుకుం టున్నాము? పరస్పరం జగడాలాడుతూ, కోర్టు కేసులు, అరెస్టుల పాలవుతూ మనం సాధిస్తున్న దాన్ని అధికారం అంటామా? మనల్ని ఇక వెనక్కు రాలేనంతగా ఇలాంటి చోటికి లాక్కెళుతోంది ఏమిటి?’’ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కూడా ఆయనే చెప్పారు. ‘‘డబ్బు కోసం కాదు. అయినా.. రాజకీయాల్లో ప్రవేశించి మీరు డబ్బు సంపాదించినా, నిజానికి దాన్ని మీరు అనుభవించలేరు. మన దేశ రాజకీయాల్లో మీరు సంపన్నులుగా కనబడలేరు. చివరకు మన కార్లు, ఇళ్లు, వేసుకునే కుర్తాలు కూడా నిరాడంబరంగానే కనిపించాల్సిందే. చివరకు మన కుటుంబాల్లో మహిళలు కూడా నగలు దిగేసుకోవడం, ధారాళంగా ఖర్చుపెట్టడం చేయలేరు’’ అని నిర్వేదం ప్రకటించారాయన. ‘‘మీరు సాధించే రాజకీయ అధికారాన్ని, సంపదను మీరు ఏమాత్రం ఆస్వాదించలేనప్పుడు ఇలాంటి స్థితి మనకెందుకు, మనకు అర్థం కానిదల్లా ఇదే గుప్తాజీ’’ అన్నారాయన. అధికారం చేతుల్లోకి రాగానే ఏం జరుగుతుందో తాను చెప్పుకుంటూ పోయారు. ‘‘మీ ప్రత్యర్థి మీకు గతంలో ఏం చేశాడో అతడిని ఓడించాక మీరు కూడా అదే చేస్తారు. అతడికన్నా అతడి వెన్నంటి ఉంటే ప్రజలకే ఎక్కువగా హాని చేస్తుంటాం. ఎందుకంటే ప్రతి జిల్లాలో, ప్రతిగ్రామంలో మన ప్రత్యర్థిని బలపర్చే ప్రజలు మనకు బాగా తెలుసు. అందుకే వారిపైకి మన పోలీసులను, నిఘా సంస్థలను సునాయాసంగా ఎగదోలుతుంటాం. వారిపై కిలో అక్రమ నల్ల మందును కలిగి ఉన్నారని, హత్య చేశారని కూడా ఆరోపించవచ్చు మనం. అలాంటి రాజకీయాల్లో తర్వాత ఏం జరుగుతుంది’’ అని ప్రశ్నించారాయన. ‘మీ ప్రత్యర్థి బాధపడుతుంటే మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లే కదా’ అని నేను సమాధానమిచ్చాను. ‘చూడండి గుప్తాజీ మీరు మా రాజకీయనేతలను అర్థం చేసుకోవడం లేదు’ అని మొదలెట్టారాయన. ‘‘మన ప్రత్యర్థిని బలపర్చే ప్రజలను మనం దెబ్బతీసినప్పుడు, వారు తమ నేతలవద్దకు వెళ్లి, అయ్యా మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకుంటారు. ఆ నేత తనచేతుల్లో అధికారం లేదు కాబట్టి ఇప్పుడు తానేం చేయలేనని చెబుతాడు. తనవాళ్లను కాపాడలేని బాధను అతడు అనుభవిస్తుంటే మనం మహదానందపడతాం. మన ప్రత్యర్థులు తమవాళ్లకు సహాయం చేయలేని నిస్సహాయత్వంలో కూరుకుపోతుంటే మనకు అది పైశాచిక ఆనందం కలిగిస్తుంది. అందుకే మేం రాజకీయాల్లో తీవ్రంగా కష్టాలపాలవుతుంటాం’’ అనీ ఆయన ముగించారు. ఇది రెండు దశాబ్దాల క్రితం మా మధ్య జరిగిన సంభాషణ. ఆరోజు ఆయన చెప్పింది ఎంత చక్కటి నిజమో తెలుపడానికి ససాక్ష్యంగా ఎన్నో ఘటనలు ఇటీవల జరుగుతూ పోయాయి. ప్రస్తుతం చిదంబరం కస్టడీలో ఉన్నారు,. ఆయన కుమారుడు కార్తీ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడు. కాంగ్రెస్ మాజీ కోశాధికారి మోతీలాల్ వోరా 90 ఏళ్ల ప్రాయంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ భూ కేటాయింపు కేసులో చిక్కుకున్నారు. ఇక కమల్‌నాథ్ ఐటీ కేసులో ఇరుక్కోగా, తన మేనల్లుడు అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాఫ్టర్ కొనుగోలులో ముడుపుల కేసులో ఇరుక్కున్నారు. ఇక సోనియా, రాహుల్ గాంధీలు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ ఈడీ నిఘాలో ఉంటున్నారు. (ఈయనను మంగళవారం అరెస్టు చేశారు) ఈ చిట్టా చాలానే ఉంది. గతంలోకి వెళితే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే, 2015లో హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ సీయం వీరభద్రసింగ్‌పై అవినీతి కేసు దాఖలయింది. ఆయన రెండో కుమార్తె పెళ్లి జరుగుతున్న రోజున ఆయన ఇంటిపై అధికారులు దాడి చేశారు. మమతా బెనర్జీ పార్టీ సహచరనేతలు, పలువురు స్థానిక పోలీసులు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇంకా వెనక్కు వెళితే 2001లో నాటి తమిళనాడు సీఎం జయలలిత మాజీ సీఎం కరుణానిధిని రూ. 12 కోట్ల ఫ్లైఓవర్ కుంభకోణం కేసులో ఇరికించారు. ఆయన ఇంటిపై అర్ధరాత్రి దాటాక పోలీసులు దాడి చేశారు. ఆ వృద్ధనేతను పోలీసులు మెట్లకిందికి లాక్కుంటూ పోతున్న దృశ్యాలు ఇప్పటికీ మీలో వణుకు తెప్పిస్తాయి మరి. ఇకపోతే ఎన్డీయే లేక యూపీఏ ఏది అధికారంలో ఉన్నా లాలూ, ములాయం, మాయావతిలపై సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు వరుసగా కేసులు పెడుతూ పోయాయి. తాజాగా ఐఎల్ ఎఫ్ఎస్ కుంభకోణంలో నకిలీ ఒప్పందాల ద్వారా రూ.20 కోట్లను దండుకున్న కేసులో రాజ్ థాకరేపై ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులన్నింటినీ నిశితంగా పరిశీలించినట్లయితే, ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్న రాజకీయ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలను అలాంటి సమస్యల్లోకే నెట్టడం కనిపిస్తుంది. దశాబ్దంపాటు అమిత్ షా, నరేంద్రమోదీ క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారు. షా అయితే బూటకపు ఎన్‌కౌం?టర్, హత్య కేసులో మూడునెలలు కస్టడీలో గడిపారు. తన బిడ్డ పెళ్లిలో ఉండగా అమిత్ షాను అధికారులు లాక్కెళ్లిన విషయాన్ని మర్చిపోవద్దు. ముందుగా రాయి విసిరిందెవరు అనేది ప్రశ్న కాదు. రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రాల స్థాయిలో జరుగుతూ వచ్చింది ఇప్పుడు కేంద్రందాకా పాకింది. దాన్ని బీజేపీ ఇప్పుడు మరొక దశకు తీసుకుపోయింది. మొదటగా మూడు కేంద్ర నిఘా సంస్థల కోరలకు పదునుపెట్టింది, కొన్ని టీవీ చానల్స్, సోషల్ మీడియాను కూడా వాటిలోభాగం చేసింది. రెండోది. బీజేపీలోకి ఫిరాయించాలని భావించేవారికి తన పక్క తలుపులు తెరిచి ఉంచింది. ఆనాడు నా అతిథేయి చెప్పిన కీలకాంశం ఇదే. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఇది కొనసాగింది. బాదల్ వర్సెస్ అమరీందర్, ములాయం వర్సెస్ మాయావతి, జయలలిత వర్సెస్ కరుణానిధి, దేవీలాల్ వర్సెస్ బన్సీలాల్.. ఇప్పుడు ఇది న్యూఢిల్లీకి చేరుకుంది. ఆధునిక ప్రతీకార రాజకీయాల గురించి, ప్రత్యర్థి బాధలు చూస్తూ పొందే పైశాచిక ఆనందం గురించి నాకు ఆరోజు మాస్టర్ క్లాస్ తీసుకున్న రాజకీయ ప్రముఖుడు ఎవరో కాదు. ఓం ప్రకాశ్ చౌతాలా. నాటి హర్యానా సీఎం. మా సంభాషణ హర్యానా భవన్లో జరిగింది. ఆయన ఇప్పుడు తీహార్ జైల్లో తన కుమారుల్లో ఒకరితో కలిసి అవినీతి కేసులో పదేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు. వారి ప్రతీకార రాజకీయాలు ఇప్పుడు వారినే చుట్టుముట్టాయి. రాజకీయాలు ఎక్కడకు వెళుతున్నాయనే అంశంపై ఇప్పుడేమనుకుంటున్నారనే అంశంపై ఆయన జైలునుంచి బయటకు వచ్చాక తాజాగా మళ్లీ సంభాషించాలనుకుంటున్నాను. వ్యాసకర్త: శేఖర్ గుప్తా ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
'5శాతం' అంటే ఏమిటో మీకు తెలుసా?
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా 300 కోట్ల రూపాయల కుంభకోణం కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను సీబీఐ మరో రెండు రోజులపాటు విచారించేందుకు ఢిల్లీ స్పెషల్ కోర్టు మంగళవారం అనుమతించింది. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంను తిహార్ జైలుకు పంపకుండా, గృహ నిర్బంధంలోనే ఉంచి విచారించేందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించడంతో ఆయనకు తాత్కలిక ఉపశమనం లభించింది. అయితే మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కోర్టు నుంచి బయటకు వస్తుండగా ఒక విలేకరి తన కస్టడీ గురించి చెప్పాలని కోరగా 'రాజకీయ నాయకులు చెప్పాలి.. ఐదు శాతం. 5% అంటే ఏమిటో మీకు తెలుసా?' అని ఎగతాళిగా మాట్లాడుతూ.. తన ఐదు వేళ్లను మీడియాకేసి చూపారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఐదు శాతం క్షీణించింది అనడానికి ఉదాహారణగా చిదంబరం ఐదు వేళ్లను చూపారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి మందగించి, ఆరు సంవత్సరాల కనిష్టానికి చేరిన నేపథ్యంలో చిదంబరం ఇలా తన చేతి వేళ్లతో బీజేపీ ప్రభుత్వ పని తీరును ఎద్దేవా చేశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో ముందంజలో ఉన్నభారత్, ఏప్రిల్-జూన్‌లో నమోదైన జీడీపీ వృద్ధితో చైనా కంటే వెనుకబడి ఉంది. -
చిదంబరం కేసులో 5న సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 5న తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా కల్పించిన తాత్కాలిక రక్షణ గడువును వచ్చే గురువారం వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. వచ్చే సోమవారం వరకు చిదంబరానికి సీబీఐ కస్టడీ కొనసాగుతుందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని ఈడీని ఆదేశించింది. చిదంబరం అరెస్టు శుభవార్తే: ఇంద్రాణి చిదంబరం అరెస్టుపై ఐఎన్ఎక్స్ మీడియా మాజీ ప్రమోటర్ ఇంద్రాణి ముఖర్జియా స్పందించారు. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం అరెస్టు కావడం శుభవార్తే అని వ్యాఖ్యానించారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఇంద్రాణిని గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరాన్ని అన్ని వైపుల నుంచి కట్టడి చేశారని అన్నారు. ఇదే కేసులో కార్తీ చిదంబరానికి మంజూరు చేసిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి అప్రూవర్‌గా మారడం తెల్సిందే. -
‘చిదంబరాన్ని అరెస్టు చేయడం సంతోషంగా ఉంది’
ముంబై: ఐఎన్ఎక్స్ కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్ట్‌పై ఇంద్రాణీ ముఖర్జీ స్పందించారు. అనూహ్యంగా ఐఎన్ఎక్స్ కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ ముఖర్జీ గురువారం ముంబై కోర్టు వెలుపల మాట్లాడుతూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్ట్ అవటం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐన్‌ఎక్స్ మీడియా సంస్థను స్థాపించిన ఇంద్రాణి ముఖర్జీ ఆమె భర్త పీటర్ కేసులో అప్రూవర్లుగా మారడంతో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. భారీ హైడ్రామాల మధ్య గత గురువారం చిదంబరాన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. కస్టడీలో ఉన్న చిదంబరం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. కోర్టులో అతనికి ఎదురుదెబ్బ తగిలింది. కాగా, 2017లో ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ముందు ఇంద్రాణి ఇచ్చిన వాంగ్మూలమే చిదంబరం అరెస్టుకు దారి తీసింది. విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం కోరినట్టుగా ఇంద్రాణీ ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ముందు పేర్కొన్నారు. ఆ సంవత్సరంలో ఐఎన్ఎక్స్ సంస్థకు రూ.305 కోట్ల విదేశీ నిధులు వచ్చాయని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. -
చిదంబరం సీబీఐ కస్టడీ మరో 4 రోజులు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను మరో నాలుగు రోజులపాటు విచారించేందుకు ఢిల్లీ స్పెషల్ కోర్టు సీబీఐకి అనుమతించింది. చిదంబరం నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీని మరో 5రోజులపాటు పొడిగించాలంటూ సీబీఐ విజ్ఞప్తి చేసింది. సీబీఐ వినతి న్యాయబద్ధంగా ఉందన్న స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ ఈ 30వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరంను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణను సుప్రీంకోర్టు మంగళవారం వరకు పొడిగించింది. ఇదే కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించటాన్ని సవాల్ చేస్తూ చిదంబరం వేసిన పిటిషన్‌పై వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అప్పటికే(ఆగస్టు 21) చిదంబరం అరెస్టయినందున దీనిపై విచారణ నిష్ప్రయోజనమని వ్యాఖ్యానించింది. అయితే, ఈ కేసులో చట్టబద్ధమైన పరిష్కారం కోరే స్వేచ్ఛ ఆయనకు ఉందని పేర్కొంది. దీంతో ఈడీ కౌంటర్ అఫిడవిట్‌కు సమాధానం(రీజాయిండర్) ఇస్తామని చిదంబరం తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ తెలిపారు. నిష్పాక్షిక విచారణ, దర్యాప్తు అనేవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో అంతర్భాగమని, చిదంబరం ప్రాథమిక హక్కులను న్యాయస్థానం కాపాడాలని పేర్కొన్నారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగించేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
చిదంబరానికి మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కస్టడీనీ మరో నాలుగు రోజులు పొడగిస్తూ చిదంబరానికి మళ్లీ షాకిచ్చింది. దీంతో ఆయన ఈ నెల 30 వరకు కస్టడీలో ఉండనున్నారు. ఈ కేసులో చిదంబరంను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి తరలించగా నేటితో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న ప్రత్యేక కోర్టు కస్టడీని పొగడిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన ఈ నెల 30 వరకు సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు. (చదవండి : చిదంబరానికి సుప్రీం షాక్) మరోవైపు సర్వోన్నత న్యాయస్ధానంలో కూడా చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరం బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ..ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను సవాల్ చేస్తూ చిదంబరం న్యాయవాదులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయనందున దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి పేర్కొన్నారు. (చదవండి : చిదంబరం అరెస్ట్) -
చిదంబరం పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ పిటిషన్‌తోపాటు ఇదే కేసులో దిగువ కోర్టు తనపై అరెస్టు వారెంట్ జారీ చేయడం, సోమవారం వరకు సీబీఐ కస్టడీకి పంపాలంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై కోర్టు బెంచ్ విచారణ జరపనుంది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన తన పిటిషన్‌ను జూలై 20, 21వ తేదీల్లో సుప్రీంకోర్టు విచారించక పోవడం వల్లే ఆగస్టు 21వ తేదీన అరెస్టయ్యానని చిదంబరం తెలిపారు. ఈ చర్యల రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మనీలాండరింగ్ కేసులో సోమవారం వరకు చిదంబరంను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తూ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈడీని ఆదేశించిన విషయం తెలిసిందే. చిదంబరం పిటిషన్లపై సమాధానం ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం ఈడీని కూడా ఇప్పటికే ఆదేశించింది. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ..దీని వెనుక భారీ మనీలాండరింగ్ కుట్రకోణం ఉందని తెలిపారు. -
సీబీఐకి ఓకే.. ఈడీకి నో!
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరాన్ని ఈ నెల 26వ తేదీ (వచ్చే సోమవారం) వరకూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక రక్షణ కల్పించింది. అయితే ఇదే కేసులో చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నా రు. విచారణను ఎదుర్కొంటున్నారు కూడా!!. సీబీఐ కస్టడీ కూడా ఆగస్టు 26నే ముగుస్తుండటం తో సుప్రీంకోర్టు ఆదేశాలు ఆయనపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. నిజానికి చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పించవద్దంటూ ఈడీ వాదించినా, కోర్టు వారి వాదనను తిరస్కరించింది. ఈడీ, సీబీఐలు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలన్న చిదంబరం అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 20న తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం తెలిసిందే. అలాగే తనను ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాలను కూడా సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఆగస్టు 26న విచారణ జరుపుతామనీ, అప్పటివరకు చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తున్నామని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఏఎస్.బోపన్నల ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల అన్ని లావాదేవీలూ, చెల్లింపుల వివరాలు ఇవ్వాలంటూ బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, మారిషస్, బెర్ముడాలకు సీబీఐ లెటర్ రొగేటరీలను (ఎల్ఆర్) పంపింది. సోమవారమే ఆ పత్రాలు ఇవ్వండి: జడ్జీలు ఈ కేసులో ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, చిదంబరం తరఫున కాంగ్రెస్ నేతలు, న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చిన వెంటనే.. మెహతా మరికొన్ని పత్రాలను సీల్డు కవర్లో జడ్జీలకు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ పత్రాలను చదివాక న్యాయమూర్తులు తమ అంతరాత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. మెహతా చర్యను సిబల్ వ్యతిరేకించారు. హైకోర్టులోనూ వాదనలు పూర్తయిన తర్వాత ఈడీ మరిన్ని పత్రాలను జడ్జీలకు అందజేసిందన్నారు. దీంతో మెహతా ఇచ్చిన పత్రాలను చదివేందుకు జడ్జీలు నిరాకరించారు. ఆ పత్రాలను సోమవారమే ఇవ్వాలని చెప్పారు. విదేశాల్లో 11 ఆస్తులు, 17 బ్యాంకు ఖాతాలు చిదంబరం విదేశాల్లో 11 చోట్ల ఆస్తులను కూడబెట్టారనీ, 17 బ్యాంకుల్లో ఖాతాలున్నాయని మెహతా తెలిపారు. ఐఎన్ఎక్స్ మీడియా విదేశాల నుంచి నిధులు అందుకునేందుకు ఎఫ్ఐపీబీ ఆమోదం తీసుకునే విషయమై ఐఎన్ఎక్స్ గ్రూప్ ప్రమోటర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలు చిదంబరాన్ని కలిసినప్పుడు కూడా, తన కుమారుడిని ‘జాగ్రత్తగా చూసుకోవాలి’ అని చిదంబరం వారితో అన్నట్లు మెహతా కోర్టుకు చెప్పారు. ‘అరెస్టు నుంచి రక్షణ కల్పించి విచారిస్తే చిదంబరం నిజాలు చెప్పరు. మోసం వివరాలను పూర్తిగా తెలుసుకునేందుకు ఆయనను కస్టడీలో ఉంచుకునే విచారించాలి. డొల్ల కంపెనీలను సృష్టించిన అనేకమంది చిదంబరం మనవరాలి పేరిట వీలునామా రాశారు. వీటిపై ప్రశ్నించాల్సి ఉంది’ అని ఆయన కోర్టుకు చెప్పారు. గతంలో చిదంబరాన్ని విచారించినప్పుడు సరైన సమాధానాలు ఇవ్వలేదని మెహతా అన్నారు. కోర్టు ఆ వ్యాఖ్యలు చేయాల్సింది కాదు సిబల్ వాదిస్తూ ఈడీ సమర్పించిన ఓ నోట్లోని మొత్తం సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా హైకోర్టు రికార్డులోకి తీసుకుని చిదంబరానికి ముందస్తు బెయిలును నిరాకరించిదనీ, అందులోని సమాచారంపై తామకు వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని సుప్రీంకోర్టుకు చెప్పారు. సింఘ్వీ వాదిస్తూ ‘ఆగస్టు 20న ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిలును తిరస్కరిస్తూ, ఆర్థిక నేరగాళ్లు ముందస్తు బెయిలు పొందకుండా చట్టాలను పార్లమెంటు సవరించాల్సిన సమయం వచ్చిందని జడ్జి అన్నారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. ఐఎన్ఎక్స్తో సంబంధం లేని ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసును ఆ రోజు జడ్జి ప్రస్తావించారు. అసలు సంబంధం లేని ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసు గురించి ఆయన ఎందుకు మాట్లాడారు? అంటే ఐఎన్ఎక్స్ కేసులో బెయిలు ఇవ్వకూడదని ఆ జడ్జి ముందుగానే అనుకున్నారు’ అని సుప్రీంకోర్టుకు తెలిపారు. ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 26కు వాయిదా వేసింది. ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసులో చిదంబరానికి ఊరట ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసుల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం, ఆయన కొడుకు కార్తీలను అరెస్టు చేయకుండా ఉన్న తాత్కాలిక రక్షణను ఢిల్లీ కోర్టు సెప్టెంబరు 3 వరకు పొడిగించింది. ముందస్తు బెయిలు కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై ఆదేశాలను కూడా సెప్టెంబర్ 3 వరకు రిజర్వ్‌లో ఉంచింది. అయితే ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసుల్లో సీబీఐ, ఈడీల అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేసేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. చిదంబరం, కార్తీలకు సంబంధించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, విచారణను వాయిదా వేయాలని సీబీఐ, ఈడీ కోరాయి. దీనికి ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘పరిస్థితులు నాకు చాలా ఇబ్బందికరంగా మారాయి. ప్రతిరోజూ మీరు ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు? దాదాపు సంవత్సరం నుంచి ఇలాగే చేస్తున్నారు’ అని మందలించారు. చిదంబరానికి ముందుస్తు బెయిలు అంశంలో ఆయనకు వ్యతిరేకంగా వాదనలేమైనా ఉంటే, వాటిని వినిపించేందుకు కోర్టు సెప్టెంబరు 3 వరకు సీబీఐ, ఈడీలకు గడువు ఇచ్చింది. రిజర్వ్‌లో ఉంచిన ఆదేశాలను సెప్టెంబరు 3న వెలువరిస్తామంది. -
చిదంబరం కేసు: సుప్రీంలో వాడివేడి వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి చిదంబరం అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆయన తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం వాడివేడి వాదనలు జరిగాయి. చిదంబరాన్ని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీలోకి తీసుకోవడం పూర్తిగా అప్రజాస్వామ్యమని ఆయన తరఫు లాయర్లు అన్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందంటూ న్యాయస్థానంలో వాదించారు. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్ద చేయాలని న్యాయవాది కపిల్ సిబాల్ ధర్మాసనాన్ని కోరారు. వారి వాదనలు విన్న న్యాయమూర్తి.. చిదంబరం కస్టడీని నిలిపివేయాంటూ ఉత్తర్వులు ఇవ్వలేమనీ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా విచారణలో భాగంగా ఈడీ అనేక తప్పిదాలకు పాల్పడిందని, సహజ న్యాయసూత్రాలను కూడా పాటించలేదని సిబాల్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆయన్ని అరెస్ట్ చేశారని, ఈడీ ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు కాపీ కొట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా చిదంబరం నేరానికి పాల్పడ్డట్లు తమ వద్ద సరైన ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు నివేధించారు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరాన్ని బుధవారం రాత్రి సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు ఆయన్ని అధికారులు ప్రశ్నించనున్నారు. -
చిదంబరం కేసు: ఈడీ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేసును తొలినుంచి విచారిస్తున్న ఈడీ అధికారి రాకేష్ అహుజాను బదిలీ చేసింది. ఆయనను ఢిల్లీ పోలీసు విభాగానికి అధికారిగా పంపిస్తున్నట్లు గురువారం అర్థరాత్రి ప్రకటన వెలువడింది. ఆయన ప్రస్తుతం ఈడీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. చిదంబరం అరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడంలో రాకేష్ కీలక పాత్ర పోషించారు. కాగా ఈడీ తాజా అనూహ్య నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత హఠాత్తుగా అహుజాను బదిలీ చేయాల్సిన అవసరమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలావుండగా.. అనేక నాటకీయ పరిణామాల అనంతరం బుధవారం అరెస్ట్ అయిన మాజీ కేంద్రమంత్రికి సీబీఐ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. (చదవండి: సీబీఐ కస్టడీకి..చిదంబరం) -
వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకులు ఇంద్రాణీ ముఖర్జీ–పీటర్ ఈ మనీలాండరింగ్ కేసులో అప్రూవర్లుగా మారడంతో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడకు ఉచ్చు బిగుసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని 2008లో అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కోరినట్లు ఇంద్రాణీ, పీటర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. తన కుమారుడికి సాయం చేస్తే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతులు వచ్చేస్తాయని చిదంబరం చెప్పారన్నారు. దీంతో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తాము కార్తీతో సమావేశమయ్యామనీ, ఈ సందర్భంగా తనకు 10 లక్షల డాలర్లు చెల్లిస్తే ఎఫ్‌ఐడీల కోసం అనుమతులు లభిస్తాయని కార్తీ చెప్పినట్లు ఇంద్రాణి ముఖర్జీ వెల్లడించారు. కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కంపెనీ ఖాతాలో రూ.10 లక్షలు జమచేసినట్లు పీటర్ ముఖర్జీ వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని ‘క్విడ్ ప్రో కో’గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభివర్ణించింది. అయితే 10 లక్షల డాలర్లలో మిగతా మొత్తాన్ని ఇంద్రాణీ–పీటర్లు కార్తీకి చెల్లించారా? లేదా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇంద్రాణీ–పీటర్ ముఖర్జీలు ఎవరో తెలియదు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ అధికారులు పి.చిదంబరాన్ని అరెస్ట్ చేశారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం తెలిపారు. చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్న కార్తీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీలను కలుసుకోలేదు. సీబీఐ విచారణలో భాగంగా ఓసారి బైకుల్లా జైలులో కలిశా. అలాగే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ)లో ఎవ్వరితోనూ నేను భేటీకాలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
సమాధుల పునాదుల పైన..
న్యూఢిల్లీ: చిదంబరంను ఉంచిన సీబీఐ ప్రధాన కార్యాలయ భవనం గురించి ఆసక్తికర కథలను సీబీఐ అధికారులు చెప్పుకుంటున్నారు. ఆ భవనం కట్టిన ప్రాంతం ఒకప్పుడు శ్మశానమని, సమాధులపై నిర్మించిన భవనం కాబట్టి వాస్తు సరిగా లేదంటున్నారు. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే ఆ భవనంలో విధులు నిర్వర్తించిన సీబీఐ డైరెక్టర్లందరూ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్నారు. డైరెక్టర్లుగా పనిచేసిన ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలపై సీబీఐ కేసు పెట్టింది. విజయ్‌మాల్యా పారిపోయేందుకు వీలు కల్పించాడని అనిల్ సిన్హాపై ఆరోపణలున్నాయి. అలోక్‌వర్మ తన సహచరుడితో వివాదంతో సీబీఐని భ్రష్టు పట్టించారని విమర్శలున్న విషయం తెలిసిందే. ప్రారంభోత్సవానికి చిదంబరం ఇదే భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథుల్లో ఒకరుగా చిదంబరం వచ్చారు. 2011, ఏప్రిల్ 30న నాటి ప్రధాని మన్మోహన్æ ఈ భవనాన్ని ప్రారంభించారు. కేంద్రమంత్రి హోదాలో చిదంబరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి సీబీఐ డైరెక్టర్ ఆ భవనాన్ని మొత్తం వారికి తిప్పిచూపించారు. ఇప్పుడు చిదంబరం బందీగా ఉన్న గెస్ట్‌హౌజ్‌లోని సూట్ నెం 5ను అప్పుడు ఆయన చూసే ఉంటారు. నేడు సుప్రీంలో విచారణ తనకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారణ జరపుతుందని గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. -
సీబీఐ కస్టడీకి..చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి నాలుగు రోజుల (ఆగస్టు 26 వరకు) సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో.. గురువారం మధ్యాహ్నమే చిదంబరాన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ.. అది సాయంత్రం వరకు పొడిగించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనంతరం గంటన్నరసేపు న్యాయమూర్తి అజయ్ కుమార్ చౌహాన్ ఇరువర్గాల వాదనలు విన్నారు. పదే పదే అవే ప్రశ్నలతో విసిగిస్తున్నారని చిదంబరం తరపు న్యాయవాదులు కపిల్ సిబల్, సింఘ్వీలు పేర్కొనగా.. కీలకమైన ప్రశ్నలకు ఆయన ఉద్దేశపూర్వకంగానే సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ వాదించారు. వాదనల తర్వాత.. లోతైన దర్యాప్తు కోసం చిదంబరాన్ని నాలుగురోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అంతకుముందు చిదంబరాన్ని సీబీఐ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య బుధవారం అరెస్టైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంకు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆయనను ఆగస్ట్ 26 వరకు(నాలుగు రోజులు) సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. ‘చిదంబరంపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. లోతైన దర్యాప్తు అవసరం. సంబంధిత పత్రాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అందువల్ల కస్టడీలో ఉంచి విచారణ జరపడం తప్పనిసరని విశ్వసిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ స్పష్టం చేశారు. చిదంబరంను కొత్తగా అడిగేందుకు సీబీఐ వద్ద ప్రశ్నలేవీ లేవని, బుధవారం ఉదయం గతంలో విచారణ సందర్భంగా వేసిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని, అందువల్ల కస్టడీ అవసరం లేదని చిదంబరం తరఫు న్యాయవాదులు చేసిన వాదనను ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. సీబీఐ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతీరోజు అరగంట పాటు చిదంబరంను ఆయన కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలుసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. కాగా, చిదంబరం అరెస్ట్‌పై రాజకీయం మరింత వేడెక్కింది. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప మరేం కాదని, ఈ కేసులో చార్జిషీటు వేసేందుకు అవసరమైన ఆధారాలు సీబీఐ వద్ద లేవని కాంగ్రెస్ ఆరోపించింది. చట్టం తనపని తాను చేసుకుపోతోందని బీజేపీ పేర్కొంది. జవాబులను దాటవేస్తున్నారు.. ముందస్తు బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన, అరెస్ట్ నుంచి తక్షణ ఊరట కల్పించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. హైడ్రామా అనంతరం బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితుల నడుమ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సీబీఐ గెస్ట్‌హౌజ్‌లో ఆ రాత్రి ఉంచారు. గురువారం ఉదయం నుంచి నాలుగు గంటలపాటు పలు దఫాలుగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే, చాలా ప్రశ్నలను చిదంబరం దాటవేశారని, కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. చిదంబరం ఖండించిన కొన్ని అంశాలకు సంబంధించిన ఆధారాలను అధికారులు ఆయనకు చూపడంతో.. ఆయన మౌనం దాల్చారని వెల్లడించాయి. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పటిష్ట భద్రత మధ్య చిదంబరంను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తి, చిదంబరం తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ తదితరులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. కోర్టులో దాదాపు గంటన్నరకు పైగా వాడి వేడి వాదనలు కొనసాగాయి. చిదంబరం కస్టడీ అవసరం లేదని, ఆయన బెయిల్‌కు అర్హుడని సిబల్, సింఘ్వీ వాదించగా.. కేసుకు సంబంధించిన మరింత లోతైన కుట్ర మూలాలను వెలికి తీసేందుకు, చిదంబరం దగ్గరున్న రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు కనీసం 5 రోజుల కస్టడీ అవసరమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ వాదనలను తిప్పికొట్టారు. అనంతరం తీర్పు రిజర్వ్‌లో ఉంచిన న్యాయమూర్తి.. సాయంత్రం 7 గంటల సమయంలో చిదంబరంను 4 రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం చిదంబరంను మళ్లీ సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. వాదనలు ఇలా.. సిబల్, సింఘ్వీ (చిదంబరం తరఫున) ► ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన ఇతర నిందితులందరూ.. చిదంబరం కొడుకు కార్తి సహా బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్టైన వ్యక్తి కార్తికి చార్టర్డ్ అకౌంటెంట్ అయిన భాస్కర్ రామన్. ఆయన బెయిల్‌పై ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ వేరే కేసులో జైలులో ఉన్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి వారు బెయిల్‌పై ఉన్నట్లే భావించాలి. ► విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ)కి అనుమతులు ఇచ్చింది సీనియర్ అధికారులు. వారెవ్వరినీ అరెస్ట్ చేయలేదు. ► బెయిల్ మంజూరు అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమే. ► చిదంబరం విదేశాలకు పారిపోయే వ్యక్తి కాదు. ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని సీబీఐ కూడా చెప్పడం లేదు. ► ఈ కేసు అంతా అప్రూవర్ గా మారిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన విషయాలపైనే ఆధారపడి ఉంది. ► తాను ఏం వినాలనుకుంటోందో.. అదే చిదంబరం చెప్పాలని సీబీఐ కోరుతోంది. అది సాధ్యం కాదు. ► జవాబులు దాటవేస్తున్నారనే కారణం చూపి కస్టడీ కోరడం సరికాదు. ► కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే కస్టడీ లోకి తీసుకోవాలి. ఈ కేసులో అలా అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన అంశాలేవీ లేవు. ► చిదంబరంను గతంలో విచారణ సందర్భంగా అడిగిన పాత ప్రశ్నలనే బుధవారం కూడా మళ్లీమళ్లీ అడిగారు. ► సీబీఐ చెప్పేవన్నీ వాస్తవాలే అని అనుకోకూడదు. ► ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నట్లయితే తమకు అందజేయాలని కోరుతూ చిదంబరంకు సీబీఐ లేఖ రాస్తే సరిపోయేది. సొలిసిటర్ జనరల్ తుషార్ (సీబీఐ తరఫున) ► చిదంబరం సరిగ్గా సమాధానాలివ్వలేదు. కొన్నింటికి డొంకతిరుగుడు సమాధానాలిచ్చారు. విచారణలో సీబీఐకి సహకరించలేదు కనుక కస్టడీ అవసరం. ► చిదంబరంతో సీబీఐ నేరాన్ని ఒప్పించడం లేదు.. కేసు మూలాలను తెలుసుకోవాలని మాత్రమే ప్రయత్నిస్తోంది. ► ఈ కుంభకోణంలో ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రలో చిదంబరం భాగస్వామి. ► ఇది చాలా సీరియస్ కేసు. ఇందులో తెలివైన వాళ్లు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేసు మూలాల్లోకి వెళ్లలేకపోతే మాకు వైఫల్యమే ఎదురవుతుంది. ► గతంలో కార్తిని కూడా కస్టడీలోకి తీసుకునే విచారణ జరిపాం. ► చిదంబరం చాలా తెలివైనవాడు. ఈ కేసు విచారణలో సహకరించకుండా ఉండేందుకు ఆయనకు చాలా మార్గాలున్నాయి. ► ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ ఓపెన్ కోర్టులో బహిరంగంగా వెల్లడించలేం. ► చట్టం ముందు అంతా సమానమే. ► చిదంబరం తరఫున సమర్థులైన న్యాయవాదులున్నారు. కాబట్టి ఆయన సొంతంగా వాదించుకోవాల్సిన అవసరం లేదు. ► చిదంబరం ముందస్తు బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. నగదు అక్రమ చలామణికి సంబంధించి ఈ కేసు గొప్ప ఉదాహరణ అని స్పష్టమవుతోంది అని ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. చిదంబరం ప్రధాన నిందితుడనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయంది. ► ఈ కేసులో చోటు చేసుకున్న క్విడ్ ప్రోకొ విషయాలు, కుట్ర అంశాలు తేలాల్సి ఉంది. ఆధారాలను చిదంబరం ముందు ఉంచి ప్రశ్నించాల్సి ఉంది. అందువల్ల ఆయన కస్టడీ చాలా అవసరం. 4 గంటలు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గురువారం ఉదయం దాదాపు 4 గంటల పాటు చిదంబరంను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతులు, ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలతో పరిచయం, వారితో జరిపిన సమావేశాలు, కార్తికి చెందిన చెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ సంస్థ.. తదితర విషయాలపై డెప్యూటీ ఎస్పీ ఆర్ పార్థసారథి నేతృత్వంలోని అధికారుల బృందం ఆయనను లోతుగా ప్రశ్నించింది. అయితే, వారి ప్రశ్నలకు చిదంబరం సూటిగా జవాబివ్వలేదని, చాలా ప్రశ్నలకు అసలు సమాధానమే ఇవ్వలేదని, కొన్ని ప్రశ్నలను దాటవేశారని, మరికొన్ని ప్రశ్నలకు డొంకతిరుగుడుగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదే కేసుకు సంబంధించి చిదంబరంను గత సంవత్సరం కూడా ఒకసారి ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడి గెస్ట్‌హౌజ్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న సూట్ నంబర్ 5ను ఆయనకు కేటాయించారు. గురువారం ఉదయం అల్పాహారం అనంతరం 10.20 గంటల సమయంలో ఇంటరాగేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భవనంలోకి మీడియాను కూడా పరిమితంగానే అనుమతించారు. వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు కోర్టు ముందు భారీ బందోబస్తు కోర్టు విచారణ తర్వాత చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తున్న అధికారులు చిదంబరంను కోర్టుకు తీసుకొస్తున్న కారు ట్రాఫిక్‌లో చిక్కుకున్న దృశ్యం -
ఐఎన్ఎక్స్ కేసు : చిదంబరానికి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంను ఆగస్ట్ 26 వరకూ ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. రోజుకు అరగంట పాటు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆయనను కలిసేందుకు కోర్టు వెసులుబాటు కల్పించింది. సీబీఐ అధికారులు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరాన్ని హాజరు పరిచారు. ఐఎన్ఎక్స్ మీడియాకు చిదంబరం లాభం చేకూర్చారని న్యాయస్ధానం ఎదుట సీబీఐ వాదించింది. మనీల్యాండరింగ్‌కు ఈ కేసు ఉదాహరణని పేర్కొంది. చిదంబరాన్ని కనీసం ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. కాగా, బోన్లో కూర్చునేందుకు నిరాకరించిన చిదంబరం వాదనలు జరిగిన ఆసాంతం నిలబడే ఉన్నారు. వాడివేడి వాదనలు కేసు డైరీలో చిదంబరం పాత్ర ఉందని, మరింత లోతైన విచారణ అవసరమని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నందున చిదంబరాన్ని అరెస్ట్ చేశామని చెప్పారు. ఐఎన్ఎక్స్ కేసులో ఆధారాలతో చిదంబరాన్ని కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాము అడిగిన ఏ ప్రశ్నకూ చిదంబరం సమాధానం ఇవ్వలేదని, విచారణకు ఆయన సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చిదంబరం అన్నీ తెలిసే అధికార దుర్వినియోగం చేశారని, ఐఎన్ఎక్స్ మీడియాకు అనుకూలంగా వ్యవహరించారని కోర్టు ఎదుట సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు. అరెస్ట్‌పై విస్మయం ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను ఎందుకు అరెస్ట్ చేశారో అర్ధం కావడం లేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో కార్తీకి ఇప్పటికే బెయిల్ వచ్చిందని రాజకీయ దురుద్దేశంతోనే చిదంబరాన్ని అరెస్ట్ చేశారని సిబల్ వాదించారు. సీబీఐ విచారణకు చిదంబరం ఎప్పుడూ గైర్హాజరు కాలేదని అన్నారు. సీబీఐ వద్ద ప్రశ్నలు సిద్ధంగా లేవని, కేవలం 12 ప్రశ్నలే అడిగారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పదేళ్ల తర్వాత ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. ఎఫ్ఐపీబీలో ఆరుగురు కార్యదర్శులు ఉంటారని, వారే ఐఎన్ఎక్స్లో విదేశీ నిధులకు ఆమోదం తెలిపినా వారిలో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు. సీబీఐ ఏదో జరిగిందన్న మాత్రాన అది నిజం కాదని పేర్కొన్నారు.నేరాన్ని అంగీకరించకపోతే సహకరించలేదనడం సరైంది కాదని వాదించారు. సీబీఐ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఆయన సమాధానం ఇచ్చారని చెప్పారు. విదేశాల్లో బ్యాంకు ఖాతాల్లేవు : చిదంబరం ఐఎన్ఎక్స్ కేసులో తాను సీబీఐ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చానని, ఈ వ్యవహారంలో తాను ఎవరినీ లంచం అడగలేదని చిదంబరం కోర్టుకు తెలిపారు. తనతో పాటు తన తనయుడి ఖాతాల వివరాలను సీబీఐకి అందచేశానని కోర్టుకు నివేదించారు. తనకు విదేశాల్లో బ్యాంకు ఖాతాలు లేవని స్పష్టం చేశారు. ఇక అంతకుముందు సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి చిదంబరంను అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం చిదంబరంను భారీ భద్రత నడుమ కోర్టుకు తరలించారు. మరోవైపు చిదంబరానికి బెయిల్ కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. పార్టీ సీనియర్ నేతలు, న్యాయవాదులైన కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, సల్మాన్ ఖర్షీద్‌లు ఆయనకు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిదంబరం భార్య నళిని, కుటుంబ సభ్యులు కోర్టుకు తరలివచ్చారు. కాగా చిదంబరం బెయిల్ పిటిషన్ శుక్రవారం న్యాయస్ధానం ఎదుట విచారణకు రానుంది. -
విధి ఆయనతో విచిత్రంగా ఆడుకుంది!
న్యూఢిల్లీ: విధి బలీయమైంది అనే సామెత మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఒకప్పుడు కేంద్ర మంత్రిగా తాను ప్రారంభించిన భవనంలోనే నేడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరాన్ని సీబీఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనను ఢిల్లీలోని సీబీఐ నూతన ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ భవనానికి ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో చిదంబరం ఈ భవన ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి హాజరయ్యారు. నేడు అదే భవనంలో చిదంబరాన్ని విచారిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం చిదంబరాన్ని భవనంలోని గెస్ట్ హౌస్ అంతస్తులోని లాక్-అప్ సూట్ 3లో ఉంచారు. విచారణలో భాగంగా ఇప్పటికే మొదటి రౌండ్ పూర్తయింది. రెండో రౌండ్ కూడా మొదలైంది. ఇందులో ముఖ్యంగా ఇంద్రాణి ముఖర్జీ పాత్రపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. కోర్టులో విచారణ పూర్తయిన అనంతరం చిదంబరం రిమాండ్‌కు సీబీఐ విజ్ఞప్తి చేయనుంది. గరిష్టంగా 14 రోజుల రిమాండ్‌కు కోరనున్నట్లు సమాచారం. (చదవండి: ఇదీ.. చిదంబరం చిట్టా) -
ఇదీ.. చిదంబరం చిట్టా
యూపీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తన కొడుకు కార్తీ కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చారని ఆరోపణలున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియాతోపాటు మరి కొన్ని కేసుల్లో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలివీ... ఐఎన్ఎక్స్: విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా! స్టార్ టీవీ ఇండియాకు సీఈఓగా దాదాపు పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత బయటకు వచ్చేసిన పీటర్ ముఖర్జియా సంస్థ పేరే ఐఎన్ఎక్స్ మీడియా. ఈయన తన భార్య ఇంద్రాణి ముఖర్జీతో కలిసి 2007లో ఐఎన్ఎక్స్ మీడియాను ఆరంభించారు. దాన్లో ఇంద్రాణి సీఈఓగా ఉండగా... పీటర్ ముఖర్జియా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా చేరారు. ఈ సంస్థలోకి విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిన రూ.305 కోట్లకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) పచ్చజెండా ఊపింది. ఈ ఎఫ్ఐపీబీ అనుమతుల విషయంలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. అంతేకాక విదేశీ పెట్టుబడుల రూపంలో ఐఎన్‌ఎక్స్‌లోకి వచ్చిన డబ్బులు వేరెవరివో కావని, చిదంబరం తనయుడు కార్తీకి చెందిన వివిధ కంపెనీలు ఈ పెట్టుబడుల్ని ఇండియాకు తరలించడానికి ఐఎన్ఎక్స్ మార్గాన్ని ఎంచుకున్నాయని, ఇది స్పష్టమైన మనీ లాండరింగ్ వ్యవహారమని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలు ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారిపోయారు. ఈ కేసులో తమను ఇరికించకుండా చూడడానికి వారు కార్తీకి 10 లక్షలు లంచం కూడా ఇచ్చారని సీబీఐ చెబుతోంది. ఎయిర్‌సెల్– మాక్సిస్: అక్రమ అనుమతులు! ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు 2011వ సంవత్సరం మేలో వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌సెల్ సంస్థ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తన సంస్థలోని 74 శాతం వాటాలను 2006లో మలేసియా కంపెనీ మాక్సిస్‌కు విక్రయించారు. అప్పటి కేంద్ర టెలికం మంత్రి దయానిధి మారన్ బలవంతంగా తనతో ఈ పని చేయించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ఆరంభించగా... ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. రూ.3,500 కోట్ల విలువ చేసే పెట్టుబడులను మాక్సిస్ సంస్థ ఎయిర్‌సెల్‌లో పెట్టిన సమయంలో ఆర్థిక మంత్రిగా చిదంబరమే ఉన్నారు. వాస్తవానికి ఈ స్థాయి విదేశీ పెట్టుబడులకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం నిబంధనల్ని తోసిరాజని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ద్వారా అనుమతులు మంజూరు చేశారని అభియోగాలున్నాయి. నిజానికి ఎఫ్ఐపీబీకి రూ.600 కోట్ల వరకు విలువున్న పెట్టుబడులకు మాత్రమే అనుమతినిచ్చే అధికారం ఉంది. ఈ ఒప్పందం కుదరడానికి చిదంబరం కుమారుడు కార్తీకి భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. 20 సార్లు చిదంబరానికి ఊరట ఐఎన్ఎక్స్, ఎయిర్‌సెల్, మాక్సిస్ కేసుల్లో ఇప్పటికే పలు దఫాలు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ చిదంబరాన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాయి. చిదంబరం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేసుకొని అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఈ ముందస్తు బెయిల్‌కు సంబంధించిన గడువుల్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. అలా మొత్తంగా 20 సార్లు చిదంబరానికి ఊరట లభించింది. ఇప్పటికే ఈడీ చిదంబరాన్ని గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో రెండు సార్లు ప్రశ్నించింది కూడా. బెయిల్‌పై ఉన్న కార్తీ ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం కుమారుడు కార్తీని గత ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేసింది. 23 రోజుల పాటు జైల్లో ఉన్న కార్తీ మార్చిలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి భారత్, యూకే, స్పెయిన్ దేశాల్లో కార్తీ చిదంబరానికి చెందిన రూ.54 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. పెండింగ్‌లో మరిన్ని కేసులు ► ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.1,272 కోట్ల విలువైన అవినీతి జరిగినట్టు కూడా చిదంబరంపై కేసు ఉంది. దీనిపై విచారణకు హాజరు కావాలని ఇటీవలే ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ► రూ.5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ ్చంజ్ వ్యవహారంలో చిదంబరం తీసుకున్న నిర్ణయాల వల్లే తమ సంస్థ భారీగా దెబ్బతిన్నదని ‘63 మూన్స్ టెక్నాలజీస్’సంస్థ (గతంలో దీనిపేరు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్) ఫిర్యాదు చేసింది. ► ఇక శారదా చిట్‌ఫండ్ కేసులో చిదంబరం భార్య నళిని ప్రమేయం ఉన్నట్టుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో 1.4 కోట్ల రూపాయల ముడుపులు నళినికి అందినట్టుగా ఆరోపణలున్నాయి. ► బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015 కింద చిదంబరం, ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ, కోడలు శ్రీనిధిని విచారించాలంటూ ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను గత ఏడాది మద్రాస్ హైకోర్టు కొట్టివేసినప్పటికీ, సుప్రీం కోర్టులో ఇంకా ఇది పెండింగ్‌లో ఉంది. ► చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పడు ఇష్రాత్ జహాన్ కేసులో అఫిడవిట్‌ను తారుమారు చేసినట్టుగా ఆరోపణలున్న కేసు ఢిల్లీ పోలీసుల వద్ద పెండింగ్‌లో ఉంది. దాక్కోలేదు.. నిందితుడిని కాను న్యూఢిల్లీ: బుధవారం రాత్రి అరెస్టవ్వడానికి కొద్దిసేపటి ముందు చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. అక్కడ చిదంబరం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఐఎన్ఎక్స్ కేసులో నేను కానీ, నా కుటుంబీకులు కానీ, లేదా మరెవ్వరూ నిందితులు కాదు. ఈ కేసులో సీబీఐ, ఈడీలు అభియోగపత్రం కూడా దాఖలు చేయలేదు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాల్లోనూ నేను తప్పు చేసినట్లు ఎక్కడా లేదు. అయినా నేను, నా కొడుకు ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు చెప్పడమనే రోగం ఉన్నవారు వ్యాప్తి చేస్తున్న అసత్యాలే ఇవన్నీ. నిజాన్ని దాటి ఏదీ ముందుకు వెళ్లలేదు. సీబీఐ, ఈడీలు నన్ను విచారించడం కోసం నోటీసులు ఇచ్చాయి. ముందుజాగ్రత్తగా అరెస్టు నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లి తాత్కాలిక రక్షణ కోరాను. నాకు దాదాపుగా గత 15 నెలలపాటు ఆ రక్షణ లభించింది. నేను ఎక్కడా దాక్కోలేదు. నిన్న రాత్రంతా నేను నా లాయర్లతో కలిసి కూర్చొని కోర్టులో సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నా. ఈ రోజు ఉదయానికే పని ముగిసింది. నా కేసును సుప్రీంకోర్టు శుక్రవారమే విచారిస్తుందని తెలిసింది. నేను న్యాయస్థానం ఆదేశాలకు తలవంచుతున్నాను. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేయకపోయినా సరే, నేను చట్టాన్ని గౌరవిస్తాను’అని మీడియాతో అన్నారు. కక్షగట్టారు: కాంగ్రెస్ చిదంబరానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే ఆయనపై కక్షగట్టి కేంద్రం వేధిస్తోందని వారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థ లను, ఓ వర్గం మీడియాను ఉపయోగించి చిదంబరం వ్యక్తిత్వాన్ని హతమార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహు ల్ గాంధీ ఆరోపించారు. చిదంబరాన్ని కేంద్రం వేటాడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఓ ట్వీట్ చేస్తూ ఏది ఏమైనా తాము చిదంబరానికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపింది. ‘అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా నిజం మాట్లాడే పౌరులను పీడించడం ద్వారా ప్రభుత్వం తన పిరికితనాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటోంది. చిదంబరం ఎన్నో అర్హతలున్న, గౌరవనీయ నాయకుడు. అంకితభావం, వినయంతో ఆయన ఈ దేశానికి సేవ చేశారు. సత్యాన్వేషణలో మేం ఆయనకు మద్దతుగా ఉంటాం. ఏది ఏమైనా సరే’అని కాంగ్రెస్ ట్విట్టర్లో పేర్కొంది. పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, ఇతర సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ, శశి థరూర్ తదితరులు చిదంబరానికి మద్దతుగా మాట్లాడా రు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులపై ఎన్ని ఆరోపణలున్నా వారంతా పదవులు అనుభవిస్తున్నారని వారు ఆరోపించారు. తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు: బీజేపీ చిదంబరంపై కేసు విషయంలో కాంగ్రెస్ చేసిన కక్షసాధింపు వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. విచారణలో తాము జోక్యం చేసుకోవడంలేదనీ, చిదంబరం తాను చేసిన పనుల వల్లే ఈ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. ‘ఆయన (చిదంబరం) ఏదైనా తప్పు చేసి ఉంటే, తప్పకుండా ఆయన ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాదేశాలతో పనిచేయవు. స్వతంత్రంగా పనిచేసే అధికారాలు వాటికి ఉన్నాయి’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. అరెస్ట్‌కు ముందు ఏఐసీసీ కార్యాలయంలో చిదంబరం చిదంబరం ఇంట్లోకి వస్తున్న సీబీఐ అధికారుల కారును అడ్డుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు -
చిదంబరం అరెస్ట్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో యూపీఏ హయాంలో కీలక హోం, ఆర్థిక శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించిన కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను సీబీఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. థ్రిల్లర్ సినిమాను తలపించే ఉత్కంఠభరిత మలుపుల నడుమ ఎట్టకేలకు చిదంబరం నివాసంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే ఉంచనున్నారు. గురువారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంను హాజరుపర్చే అవకాశముంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. అరెస్ట్ నుంచి తక్షణమే ఊరట కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో చిదంబరం తరఫు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తక్షణ విచారణ కుదరదని, శుక్రవారం లోపు ఈ కేసును విచారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దాంతో మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా ఉన్న చిదంబరం తప్పనిసరి పరిస్థితుల్లో.. బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికీ పారిపోవడం లేదని, ఈ కేసులో తాను నిందితుడిని కాదని పేర్కొంటూ తన వాదనను మీడియాకు వినిపించారు. ఆ వెంటనే అక్కడినుంచి జోర్ బాఘ్‌లోని తన నివాసానికి వెళ్లారు. కాసేపటికి అక్కడికి వెళ్లిన సీబీఐ అధికారులు ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. ఆయనను అదుపులోకి తీసుకుని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. చిదంబరం అరెస్ట్, అంతకుముందు చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ మండిపడింది. ఇది మోదీ సర్కారు కక్ష సాధింపేనని, తామంతా చిదంబరం వెనకే ఉన్నామని స్పష్టం చేసింది. (చదవండి : ఇదీ.. చిదంబరం చిట్టా) ఢిల్లీలో హై ఓల్టేజ్ డ్రామా.. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్షణం నుంచి.. చిదంబరం కేంద్రంగా దేశ రాజధానిలో ఉత్కంఠభరిత మలుపులతో హైడ్రామా కొనసాగింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి చిదంబరం అనూహ్యంగా అదృశ్యమయ్యారు. రెండు గంటల్లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత చిదంబరం ఇంట్లో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థల అధికారులు నోటీసులు అంటించారు. అయినా, ఆచూకీ తెలియకపోవడంతో చివరకు లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు. చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా నిరోధించాలని అన్ని విమానాశ్రయాలకూ సమాచారమిచ్చారు. ఈ లోపు, ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తక్షణమే విచారించలేమన్న సుప్రీంకోర్టు.. ఆ విచారణను ఏకంగా శుక్రవారానికి వాయిదా వేస్తూ బుధవారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ కార్యాలయంలో ప్రత్యక్షం.. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం అనూహ్యంగా దర్శనమిచ్చారు. అక్కడి విలేకరుల సమావేశంలో తన వాదన వినిపించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ప్రాణం కన్నా స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చే తత్వం తనదని చెప్పారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసేందుకు రాత్రంతా(మంగళవారం) తన లాయర్లతో కలిసి పిటిషన్‌ను రూపొందించానన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీట్లో తన పేరు లేదని వివరించారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో శుక్రవారం ఉన్నందున.. చట్టాన్ని గౌరవిస్తూ అప్పటివరకు తనను అదుపులోకి తీసుకోవద్దంటూ దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను నర్మగర్భంగా కోరారు. చిదంబరం కాంగ్రెస్ కార్యాలయంలో ఉన్న విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు అక్కడికి వెళ్లేలోపే.. చెప్పాల్సింది చెప్పేసి వెంటనే కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్లిపోయారు. అక్కడి నుంచి తన న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్‌లతో కలిసి నేరుగా జోర్బాఘ్లోని తన ఇంటికి వెళ్లారు. చిదంబరంను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లిన సీబీఐ అధికారులు.. అక్కడి నుంచి ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ వారికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చిదంబరం ఇంటి గేట్ కూడా వేసి ఉండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఓ పక్క నుంచి గోడ దూకి వారు ఇంట్లోకి వెళ్లారు. మరో పది నిమిషాల్లో సీబీఐకి చెందిన మరో టీమ్, ఈడీ అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకున్నాయి. శాంతిభద్రతల నిమిత్తం సీబీఐ కోరడంతో ఢిల్లీ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు కాసేపు చిదంబరంను ప్రశ్నించి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను తీసుకుని నేరుగా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. చిదంబరం నివాసం వద్ద మీడియాను, కార్యకర్తలను అదుపుచేస్తున్న అధికారులు బుధవారం ఉదయం నుంచీ సుప్రీంకోర్టులో.. బుధవారం ఉదయం నుంచి చిదంబరం బెయిల్ కేసుకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో హైడ్రామా కొనసాగింది. చిదంబరం బెయిల్‌కు సంబంధించిన పిటిషన్‌ను తక్షణమే విచారించాల్సిందిగా కపిల్ సిబల్ నేతృత్వంలోని న్యాయవాదులు పదేపదే జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనాన్ని కోరారు. వారి అభ్యర్థనలను తోసిపుచ్చిన జస్టిస్ రమణ.. ఆ పిటిషన్లపై విచారణ ఎప్పుడు జరపాలన్నది ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయి నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటల సమయంలో శుక్రవారం ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. అయితే, ఆ పిటిషన్‌ను ఎవరి నేతృత్వంలోని ఏ ధర్మాసనం విచారిస్తుందనేది గురువారం సాయంత్రం మాత్రమే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న పార్టీ శ్రేణులు ‘అయోధ్య’హాళ్లోకి.. మొదట జస్టిస్ రమణ, జస్టిస్ శంతనుగౌండర్, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం ముందు కపిల్ సిబల్ మొదట ఈ పిటిషన్ అంశం లేవనెత్తారు. తక్షణ విచారణ అవసరమా లేదా అని నిర్ణయించాల్సిందిగా ఆ పిటిషన్‌ను జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సీజేఐ వద్దకు పంపించింది. ఏ సమాచారం రాకపోవడంతో మధ్యాహ్న భోజన విరామం అనంతరం మళ్లీ సిబల్ జస్టిస్ రమణ ధర్మాసనం ముందు ఈ విషయాన్ని లేవనెత్తారు. పిటిషన్లో పొరపాట్లు ఉన్నాయని రిజిస్ట్రీ తమకు సమాచారమిచ్చారని, అందువల్ల, ఈ పిటిషన్‌ను తాము విచారించలేమని వారు స్పష్టం చేశారు. దాంతో కాసేపటి తరువాత ఆ కోర్టు హాలుకు వచ్చిన రిజిస్ట్రీ సూర్యప్రతాప్ సింగ్ ఆ పొరపాట్లు ఇప్పుడే సరిచేశారని, విచారణ జరిపే ధర్మాసనాన్ని నిర్ణయించే నిమిత్తం ఆ పిటిషన్‌ను సీజేఐ కార్యాలయానికి పంపించామని జస్టిస్ రమణ ధర్మాసనానికి తెలిపారు. సీజేఐ అయోధ్య కేసు విచారణలో ఉన్నారని, అది ముగిసేందుకు సాయంత్రం అవుతుందని, అందువల్ల మీరే విచారించాలంటూ కపిల్ సిబల్ జస్టిస్ రమణ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. వారు నిర్ద్వంద్వంగా నిరాకరించడంతో.. సీజేఐ జస్టిస్ గొగోయి నేతృత్వంలో అయోధ్య కేసు విచారణ జరుగుతున్న కోర్టు హాళ్లోకి కపిల్ సిబల్ వెళ్లారు. అక్కడ అయోధ్య విచారణ మధ్యలో.. అసాధారణ రీతిలో అ అంశాన్ని సిబల్ లేవనెత్తుతారేమోనన్న పలువురు భావించారు. కానీ రాజ్యాంగ ధర్మాసనం ముందు అలాచేయడానికి నిబంధనలు ఒప్పుకోనందువల్ల ఆ అంశాన్ని లేవనెత్తలేకపోయానని అనంతరం సిబల్ విలేకరులకు తెలిపారు. శుక్రవారం విచారణకు సీజేఐ నిర్ణయం తీసుకున్నారని తెలిసిన తరువాతే సుప్రీంకోర్టు ఆవరణ నుంచి కపిల్ సిబల్ బృందం వెళ్లిపోయింది. థ్రిల్లర్ మూవీలా.. చిదంబరం అరెస్ట్ వ్యవహారం బుధవారం దేశ రాజధానిలో థ్రిల్లర్ సినిమాలా సాగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుప్రీంకోర్టులో ఒక ఎపిసోడ్ కొనసాగింది. చిదం బరానికి అరెస్ట్ నుంచి ఊరట కల్పించేం దుకు అక్కడ ఆయన తరఫు లాయర్లు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, ఇందిరా జైసింగ్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అనూహ్యంగా రాత్రి 8 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన చిదంబరం మీడి యాకు తన వాదనను చెప్పేసి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. సీబీఐ మొదట ఏఐసీసీ ఆఫీస్‌కు, తర్వాత ఆయన ఇంటికి వెళ్లారు. దాదాపు ఓ 30 నిమిషాల తరువాత చిదంబరంను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయనను అక్కడినుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఐఎన్ఎక్స్ కేసులో నేను కానీ, నా కుటుంబీకులు కానీ, లేదా మరెవ్వరూ నిందితులు కాదు. – చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసు 2008లో జరిగిన పరిణామాలకు సంబంధించినది. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ఇప్పుడు ఈ కేసును అడ్డం పెట్టుకుని మా నాన్నను వేధిస్తున్నారు. – కార్తీ -
తరుముకొచ్చిన తప్పులు
‘‘మనం ఇతరులకు ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది..’’ తత్వవేత్తలే కాదు కాస్త తెలివి ఉన్నవాళ్లంతా తరచూ చెప్పేమాట ఇది. ఈ తత్వం బోధపడడానికి ఇంత తక్కువ సమయం పడుతుందని బహుశా పళనియప్పన్ చిదంబరం ఊహించి ఉండరు. కేంద్ర ఆర్థికమంత్రిగా, హోం మం త్రిగా పనిచేసిన అనుభవశాలి, కాకలు తీరిన కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు... వ్యవస్థలను స్వీయ ప్రయోజనాలకు వాడుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన నేరానికి దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ కేసులతో తరుముతున్నాయి. అరెస్టు చేయకుండా నివారించాలన్న మొరలను కోర్టులు వినడం లేదు. బుధవారం సుప్రీంకోర్టు తలుపు తట్టినా ఉపయోగం లేకపోయింది. పోలీసుల సాయంతో సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా’ కేసులో చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడమే కాక ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిందేనని మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడం కాంగ్రెస్ వర్గాలలో కలకలం రేపింది. అప్పటి నుంచి చిదంబరం కనిపించకుండా పోయారు. ఆయన సెల్‌ఫోన్ కూడా స్విచాఫ్ అయిపోయింది. దీంతో బుధవారం ఈడీ లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. కపిల్ సిబల్, వివేక్ తంఖా, సల్మాన్ ఖుర్షీద్, దయాన్ కృష్ణన్ వంటి ఉద్ధండులైన న్యాయవాదులు చిదంబరం తరఫున వకాల్తా పుచ్చుకుని సుప్రీంలో వాదించినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత చిదంబరం మీడియా ముందుకు వచ్చారు. ‘‘నేను సాక్ష్యాలను ప్రభావితం చేయడంలేదు, సాక్ష్యాలను తారుమారు చేయడం లేదు, అన్నీ నిరాధార ఆరోపణలు, రాజకీయ దురుద్దేశంతో నాపై ఆపాదిం చారు, దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతున్నా, 2007 నాటి ఉదంతంలో పదేళ్ల తర్వాత 2017లో కేసు దాఖలు చేశారు, రాజ్యసభ ఎంపీని కాబట్టి దేశం విడిచిపెట్టి వెళ్లే అవకాశాలు లేవు’’ అంటూ వాదించారు. అరెస్టు తప్పించుకునేందుకు అందరూ చెప్పే మాటలే ఇవి. ఈ వాదనలతో ఇప్పటికే 20సార్లు చిదంబరం, కార్తి అరెస్టు తప్పించుకున్నారని, న్యాయస్థానాల నుంచి ఊరట పొందారని న్యాయనిపుణులు అంటున్నారు. తగిన మోతాదులో సాక్ష్యం కనిపించబట్టే ఈసారి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించిందన్నది నిపుణుల మాట. చిదంబరం ఆర్ధిక మంత్రిగా ఉండగా 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు రూ.307 కోట్ల విదేశీ నిధులు వచ్చాయి. ఈ వ్యవహారంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, ఆయన కుమారుడు కార్తీకి కోట్ల మేర ముడుపులు అందినట్లు ఆరోపణలొచ్చాయి. విదేశీ పెట్టుబడు ల అభివృద్ధి బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతుల విషయంలో అవకతవకలు జరిగాయని 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. చిదంబరం, కార్తీ, కొందరు ఆర్థిక శాఖ అధికారులు, ఐఎన్ఎక్స్ సంస్థకు చెందిన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీ పై అభియోగాలు నమోదయ్యాయి. 2018 అక్టోబర్12న కార్తికి చెందిన రూ. 54 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇంద్రాణి, పీటర్లు అరెస్టయ్యారు. కార్తి గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. కార్తిని ఈడీ అనేక పర్యాయాలు విచారించింది. చిదంబరంను గత ఏడాది డిసెంబర్లో, ఈ ఏడాది జనవరిలో ఈడీ అధికారులు విచారించారు. అయితే జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్‌గా మారారని, ఈ కేసులో మారిషస్ దొంగదారులతో సహా అన్ని అవకతవకల గురించి పూసగుచ్చినట్లు ఏకరువు పెట్టారని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ హైకోర్టుకు ఈడీ అన్ని ఆధారాలు సమర్పించబట్టే చిదంబరం కథ కంచికి చేరిందని అంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణమే కాదు ఎయిర్‌సెల్ మాక్సిస్ కుంభకోణం కూడా చిదంబరం కుటుంబాన్ని 2006 నుంచి వెంటాడుతోంది. అలాగే 2జీ స్పెక్ట్రమ్ కేసు కూడా. ఆర్థిక మంత్రిగా ఉండగా చేసిన తప్పులన్నీ తరుముకొస్తున్నాయి. కుంభకోణాలే కాదు చీకటి ఒప్పందాలకూ చిదంబరం మారుపేరన్న ఆరోపణలున్నాయి. చిరకాల ప్రత్యర్థి పార్టీలైన తెలుగుదేశం,కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన రహస్య మిత్రత్వం వెనుక మం త్రాం గం నెరపిన మాయలమారిగా చిదంబరం పేరుమోశారు. కేంద్రంలో చిదంబరం మంచి ఫామ్‌లో ఉన్న రోజుల్లో ఆయనతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం మేరకే చంద్రబాబు మీద పలు కేసులు మాఫీ అయిపోయాయని ఏకంగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. టీడీపీ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు ఒక సందర్భంలో పార్లమెంటులో అనర్గళ ఉపన్యాసం ఇస్తుంటే.. నువ్వు, మీ నాయకుడు చంద్రబాబు నన్ను రహస్యంగా కలిసి ఏంమాట్లాడారో ఇక్కడ చెప్పమంటావా అంటూ చిదంబరం ఆయన నోరు మూయించడం చూసి తెలుగుదేశం మాత్రమే కాదు యావద్దేశం నివ్వెరపోయింది. ఇలాంటి వివాదాలు చిదంబరానికి కొత్తేమీ కాదు. మన దేశంలో ‘చెప్పు దెబ్బ’ తిన్న తొలి రాజకీయ ప్రముఖుడు కూడా ఘనత వహించిన చిదంబరమే. సిక్కుల ఊచకోత కేసులో జగదీష్ టైట్లర్‌కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన ఉదంతంపై 2009 ఏప్రిల్ 7న మాట్లాడుతుండగా చిదంబరం పై సిక్కు జర్నలిస్టు చెప్పు విసరడం అప్పట్లో సంచలనం సృష్టించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూలులో ఎంబీఏ పట్టా పుచ్చుకున్నా తండ్రి వ్యాపార వారసత్వాన్ని కొనసాగించకుండా మద్రాసు లా కాలేజీలో అందుకున్న ఎల్ఎల్బీ పట్టానే చిదంబరం నమ్ముకున్నారు. మద్రాసు హైకోర్టులో మొదలై సుప్రీంకోర్టు వరకు ఎదిగారు. కానీ తర్వాత న్యాయాన్యాయ లొసుగులను, హార్వర్డ్ వాణిజ్య కిటుకలను కలబోసి కుంభకోణాలు చేసే స్థాయికి దిగజారతారని ఎవరూ ఊహించలేదు. వీటితో పాటు ప్రత్యర్థులపై రాజ్యాంగ వ్యవస్థలను, దర్యాప్తు సంస్థలను ప్రయోగించడంలో చిదంబరాన్ని మించి నవారు లేరు. విధి బలీయమైనది.. రాజకీయ కక్షసాధింపు కేసులలో ఆయన ఏమేం చేశారో ఇపుడు అవే ఆయనకు జరుగుతున్నాయి.. కుట్ర కేసులు మోపి వేధించడం, ఆరోపణలు రుజువు కాకపోయినా అరదండాలు వేయించడం, బెయిల్ దొరక్కుండా చేయడం ఇలాంటివన్నీ ఎక్కడో విన్నట్లుంది కదూ... అందుకే అన్నారు.. మనం ఏమి ఇస్తే తిరిగి మనకు అదే వస్తుంది. -
చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరాన్ని నాటకీయ పరిణామాల మధ్య బుధవారం సాయంత్రం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసుల సాయం కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించినట్టుగా సమాచారం. అంతకు ముందు చిదంబరం నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీబీఐ, ఈడీ అధికారులు గోడలు దూకి ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. కాగా, మంగళవారం ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ పటిషన్‌ను తిరస్కరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లారు. సుప్రీం కోర్టులో కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే బుధవారం సాయంత్రం చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో సీబీఐ అధికారులు అక్కడికి చేరుకుని చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుక యత్నించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు సీబీఐ అధికారులను అడ్డుకోవడంతో.. చిదంబరం తన నివాసానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత సీబీఐ బృందం చిదంబరం నివాసానికి చేరుకుని లోనికి వెళ్లేందుకు యత్నించింది. అయితే గేట్లు తెరవకపోవడంతో సీబీఐ అధికారులు గోడపై నుంచి దూకి చిదంబరం నివాసంలోకి ప్రవేశించారు. మరోవైపు సుప్రీం కోర్టులో చిదంబరం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ శుశ్రవారం విచారణకు రానుంది. ఇక 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు సమకూరడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ఆమోదముద్ర వేయడంలో అప్పటి ఆర్థిక మంత్రిగా నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారని చిదంబరం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ నిధుల రాకకు ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. చదవండి : అజ్ఞాతం వీడిన చిదంబరం -
చిదంబరానికి రాహుల్ మద్దతు
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ వ్యవహరంలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె సోదరుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చిదంబరానికి మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ట్విట్ చేసిన రాహుల్.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను ఉపయోగించి చిదంబరం వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతియడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతకు ముందు చిదంబరానికి మద్దతుగా స్పందించిన ప్రియాంక.. ‘రాజకీయ విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి చిదంబరం. కేంద్ర హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలపై ఆయన మాట్లాడినందుకు కుట్రపూరితంగా కేసుల్లో ఇరికేంచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన చర్య ఇది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, చిదంబరంపై ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీంతో చిదంబరం అరెస్ట్‌కు అధికారులు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే చిదంబరం తన నివాసం వద్ద లేకపోవడంతో.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై చిదంబరానికి సుప్రీం కోర్టులో కూడా ఎదురుదెబ్బే తగిలింది. చిదంబరం తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ జస్టిస్ ఎన్వీ రమణ ముందుకు రావడంతో.. ఆయన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ముందుకెళ్లాలని సూచించారు. అయితే చీఫ్ జస్టిస్ అయోధ్య కేసుతో బిజీగా ఉండటంతో.. ఆయన అపాయింట్మెంట్ కోసం కపిల్ సిబల్ బృందం ఎదురుచూస్తోంది. -
‘మాల్యా, నీరవ్ బాటలో చిదంబరం’
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా విజయ్ మాల్యా, నీరవ్ మోదీలా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం గాంధీ కుటుంబానికి సహకరించారని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు.దర్యాప్తు సంస్థలకు సహకరించని చిదంబరం దేశం నుంచి పారిపోయిన పారిశ్రామికవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీల తరహాలో వ్యవహరిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ మోదీ ప్రభుత్వం విడిచిపెట్టదని హెచ్చరించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కోరుతూ చిదంబరం చేసిన అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చిన నేపథ్యంలో జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రధాన న్యాయమూర్తి ఎదుట పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు చిదంబరం న్యాయవాదులకు సూచించింది. -
చిదంబరం అరెస్ట్‌కు రంగం సిద్ధం!
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరంకు అరెస్ట్ నుంచి ఊరట లభించేలా లేదు. ముందస్తు బెయిలు పిటిషన్ కోసం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. మంగళవారం సాయంత్రమే దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చిదంబరం తరపున లాయర్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాడీవేడి చర్చ జరుగుతోంది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బెంచ్ నిరాకరించింది. మరోవైపు చిదంబరానికి బెయిల్ నిరాకరించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. పిటిషన్‌ను సీజేఐకి ట్రాన్స్ఫర్ చేయాలని చిదంబరం తరఫున లాయర్లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్, దీనిపై తదుపరి ఆదేశాలిచ్చేందుకు నిరాకరించారు. ఈ పిటషన్‌ను లంచ్ తరువాత సీజే రంజన్ గొగోయ్ దీనిపై విచారణ జరుతారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీజే తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చిదంబరంపై ఈడీ లుక్ అవుట్ నోటీసులను జారీచేసింది. దీంతో చిదంబరం అరెస్ట్‌కు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన అజ్ఞాతంలోకి పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
మోదీ సర్కారుపై ప్రియాంక ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయ కక్ష్యసారింపు చర్యలో భాగంగా చిదంబరాన్ని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘రాజకీయ విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి చిదంబరం. కేంద్ర హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలపై ఆయన మాట్లాడినందుకు కుట్రపూరితంగా కేసుల్లో ఇరికేంచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన చర్యఇది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా చిదంబరానికి అండగా ఉంటామని, న్యాయం కోసం పోరాటం చేస్తామని ప్రియాంక స్పష్టం చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోందనీ, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అవినీతి, నగదు అక్రమ చలామణి కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో చిదంబరంను అరెస్టు చేసేందుకు సీబీఐ, ఈడీలకు మార్గం సుగమమైంది. మంగళవారం రాత్రే సీబీఐ, ఈడీ అధికారుల బృందాలు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకోగా.. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని సమాచారం. 3రోజుల్లో తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నాననీ, అంతవరకు తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని చిదంబరం కోరినా హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో బుధవారమే అత్యవసర విచారణ కోరాలని చిదంబరం లాయర్లు నిర్ణయించారు. -
బిగ్ పొలిటికల్ ట్విస్ట్: అమిత్ షా ప్రతీకారం!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోందనీ, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి అవినీతి, నగదు అక్రమ చలామణి కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ కేసులో ఆయన్ని సీబీఐ, ఈడీ అధికారలు విచారించిన అనంతరం ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో బుధవారమే అత్యవసర విచారణ కోరాలని చిదంబరం లాయర్లు నిర్ణయించారు. అమిత్ షా ప్రతీకారం..! చిదంబరంపై ఈడీ దాడుల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రిగా పీ. చిదంబరం ఉన్నారు. అప్పట్లో ఆయన కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ.. చక్రం తిప్పారు. ఆ సమయంలో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయించి.. జైల్లో వేయించారు. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్లో అమిత్ షా హస్తముందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2005 నవంబర్ 22వ తేదీన గుజరాత్ పోలీసులు సోహ్రాబుద్దీన్ ను, ఆయన భార్య కౌసర్ బీని, మరో వ్యక్తిని పట్టుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన దేశ రాజకీయాల్లో ఇప్పటికే సంచలనమే. ఈ కేసులో అమిత్ షా మూడు నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఆ తరువాత ఆయనకు గుజరాత్ హైకోర్టులో బెయిలు మంజూరు కావడంతో బయటకు వచ్చారు. అరెస్ట్ తప్పదా..? ఇదిలావుండగా గడిచిన పదేళ్లలో దేశ రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అమిత్ షా నాడు గుజరాత్ హోంమంత్రిగా ఉండగా.. నేడు కేంద్ర హోంమంత్రిగా ఉంటూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. నాడు కేంద్రంలో చక్రం తిప్పిన చిదంబరం నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత విపక్ష నేతలపై ప్రతీకార్య చర్యలకు పాల్పడటం మన దేశంలో సర్వసాధారణమై పోయింది. ఈ నేపథ్యంలో తనను జైలుకు పంపిన చిదంబరంను ఎలాగైన కేసుల్లో ఇరికించి జైలుకు పంపాలని షా ప్రతీకార చర్యకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న చిదంబరంపై తాజాగా ఈడీ దాడికి దిగింది. అరెస్ట్‌ను ముందే పసిగట్టిన ఆయన ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిలును నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో రాత్రికే సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకున్నారు. అధికారులు వెళ్లిన సమయంలో చిదంబరం ఇంట్లో లేరని సమాచారం. చిదంబరం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైతే అరెస్ట్ చేయక తప్పదని ఈడీ వర్గాల సమాచారం. ఐఎన్ఎక్స్ కేసు ఇదీ.. 2007– ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి ఆమోదం తెలిపిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ). ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం. ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు. -
చిదంబరం కస్టడీ అవసరమే
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోందనీ, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి అవినీతి, నగదు అక్రమ చలామణి కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో చిదంబరంను అరెస్టు చేసేందుకు సీబీఐ, ఈడీలకు మార్గం సుగమమైంది. మంగళవారం రాత్రే సీబీఐ, ఈడీ అధికారుల బృందాలు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకోగా, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని సమాచారం. 3రోజుల్లో తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నాననీ, అంతవరకు తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని చిదంబరం కోరినా హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో బుధవారమే అత్యవసర విచారణ కోరాలని చిదంబరం లాయర్లు నిర్ణయించారు. విచారణను నీరుగార్చలేం.. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ చిదంబరం ఢిల్లీ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు. గురువారం పదవీ విరమణ పొందనున్న న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ చిదంబరం అభ్యర్థనను తోసిపుచ్చారు. చిదంబరమే ప్రధాన నిందితుడనీ ప్రాథమికంగా తెలుస్తున్నందున, న్యాయపరమైన అడ్డంకులను సృష్టించి దర్యాప్తు సంస్థలను విచారణను నీరుగార్చలేమని ఆయన అన్నారు. హైకోర్టులో ఎలాంటి ఉపశమనమూ లభించకపోవడంతో చిదంబరం ఆ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఆయనకు తక్షణ ఉపశమనమేదీ లభించనప్పటికీ, ఆయన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. చిదంబరం ఇంటికి సీబీఐ, ఈడీ చిదంబరానికి ముందస్తు బెయిలును నిరాకరిస్తూ సాయంత్రం 3.40 గంటల సమయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో రాత్రికే సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకున్నారు. మొదట సీబీఐ, ఆ తర్వాత కొద్దిసేపటికే ఈడీ అధికారులు వెళ్లారు. అయితే అధికారులు ఎవ్వరూ మీడియాతో మాట్లాడలేదు. చిదంబరం ఇంటికి రావడం వెనుక ఉన్న ఉద్దేశమేంటని ప్రశ్నించినా వారు నోరు మెదపలేదు. అధికారులు వెళ్లిన సమయంలో చిదంబరం ఇంట్లో లేరని సమాచారం. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం. చిదంబరం పార్లమెంటు సభ్యుడు అయినంత మాత్రాన ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వలేం. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చిదంబరంపై ఈ కేసులు పెట్టారని ఇప్పుడే చెప్పడం అర్థం లేని పని.’ – ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సునీల్ గౌర్ ‘మరో రెండ్రోజుల్లో పదవీ విరమణ పొందనున్న న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ హడావుడిగా సాయంత్రం 3.40 గంటలకు ఈ తీర్పు చెప్పారు. ఈ తీర్పును ఈ ఏడాది జనవరిలోనే రిజర్వ్‌లో ఉంచారు. మరో మూడు రోజులు ఆగి తీర్పును వెలువరించాలని కోరాం. అయినా జస్టిస్ గౌర్ మా విజ్ఞప్తిని పట్టించుకోకుండా మంగళవారమే తీర్పు ఇచ్చారు.’ – కపిల్ సిబల్, చిదంబరం తరఫు న్యాయవాది ఐఎన్ఎక్స్ కేసు ఇదీ.. 2007– ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి ఆమోదం తెలిపిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ). ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం. ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు. ► 2017 మే 15: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ. ► 2018 : ఐఎన్ఎక్స్ మీడియాపై మనీలాండరింగ్ కేసు పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ► 2018 మే 30 : సీబీఐ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన చిదంబరం. ► 2018 జూలై 23:ఈడీ కేసులోనూ ముందస్తు బెయిలు ఇవ్వాలని మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన చిదంబరం. ► 2018 జూలై 25 : ఈ రెండు కేసుల్లోనూ అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ తొలిసారి ఉత్తర్వులిచ్చిన ఢిల్లీ హైకోర్టు. ఆ తర్వాత పలుమార్లు ఆ గడువు పొడిగింపు. ► 2019 జనవరి 25: ముందస్తు బెయిలుపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఢిల్లీ హైకోర్టు. ► 2019 ఆగస్టు 20 : తీర్పు చెబుతూ, చిదంబరం బెయిలు అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. -
ఏవియేషన్ స్కామ్‌లో చిదంబరానికి ఈడీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఏవియేషన్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. బోయింగ్, ఎయిర్‌బస్‌ల నుంచి రూ 70,000 కోట్లకు విమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ కేసులో మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి ప్రఫుల్ పటేల్‌కు సీబీఐ గత వారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు నష్టం వాటిల్లేలా చర్యలు చేపట్టారని వీరిపై ఆరోపణలున్నాయి. ఈ స్కామ్ జరిగిన సమయంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా, ప్రఫుల్ పటేల్ పౌరవిమానయాన మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విమానయాన సంస్థలకు ఆయన అనుకూలంగా వ్యవహరించారని, ఏవియేషన్ లాబీయిస్ట్ దీపక్ తల్వార్‌తో టచ్‌లో ఉన్నారని ప్రఫుల్ పటేల్‌పై ఆరోపణలున్నాయి. విదేశీ ఎయిర్‌లైన్స్‌కు ప్రయోజనాలు దక్కేలా తల్వార్ పటేల్‌తో చర్చలు జరిపారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2004 నుంచి 2011 మధ్య పటేల్ పౌర విమానయాన మంత్రిగా వ్యవహరించారు. -
అలా అయితే ఆర్టికల్ రద్దయ్యేదా?: చిదంబరం
చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో హిందువుల శాతం అధికంగా ఉంటే ఆర్టికల్ 370ని రద్దు చేసేవారా అంటూ బీజేపీని ప్రశ్నించారు. అక్కడ ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని సోమవారమిక్కడ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఆర్టికల్ రద్దుకు మతం రంగు పులిమే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని విమర్శించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయికి తగ్గించేలా కేంద్ర పాలిత ప్రాంత హోదా ఇచ్చారని విమర్శించారు. కశ్మీర్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇప్పటికీ కశ్మీర్లో పరిస్థితి ప్రశాంతంగా ఏమీ లేదని, ఒకవేళ ప్రశాంతంగా ఉంటే దేశంలోని ఇతర ప్రాంతాల్లోలాగే అక్కడ ఎందుకు మీడియాను అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా తమకు, ఇతర పార్టీలు సహకరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. -
చిదంబరానికి మధ్యంతర ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో అరెస్ట్ కాకుండా కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబారానికి మంజూరు చేసిన మధ్యంతర ఊరటను ఢిల్లీ కోర్టు గురువారం ఈ నెల 9 వరకూ పొడిగించింది. కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీలు ఎప్పుడు సమన్లు జారీ చేసినా చిదబంరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం విచారణకు హాజరవుతారని వారి న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు నివేదించారు. చిదంబరం మార్చి 2006లో కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఎఫ్‌డీఐకి ఆమోద ముద్ర వేశారని దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించాల్సి ఉండగా, చిదంబరం ఆర్థిక మంత్రి హోదాలో విదేశీ సంస్ధకు ఎఫ్ఐపీబీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సీబీఐ ఆరోపిస్తోంది. రూ 3500 కోట్ల ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందంతో పాటు రూ 305 కోట్ల ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనూ దర్యాప్తు సంస్ధలు చిదంబరం పాత్రపై దర్యాప్తు సాగిస్తున్నాయి. -
దేశ ఆర్థిక వృద్ధి దారుణంగా నెమ్మదించింది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి దారుణంగా నెమ్మదించిందనీ, స్థూల ఆర్థిక సూచీలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. సమాచారాన్ని దాయడం, తమకు ఇష్టమొచ్చినట్లుగా దాన్ని మార్చడంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో నైపుణ్యం చూపిస్తున్నారని చిదంబరం ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుత ఆర్థిక స్థితి గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ దోషాలతో కూడిన వివరాలు ఇస్తోంది. బహుశా ఆర్థిక వ్యవస్థకు ఇదే బలహీనమైన సమయం కావచ్చు. బీజేపీ హయాంలో భారీగా దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థను బాగుచేయడానికి తర్వాతి ప్రభుత్వం భారీగానే కష్టపడాల్సి ఉంటుంది’ అని చిదంబరం పేర్కొన్నారు.. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితి ఏంటనేది ఎన్ఎస్ఎస్వో, సీఎస్‌వో లెక్కలు చూస్తే అర్థమవుతుందన్నారు. -
మౌన ప్రేక్షకుడిలా ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ: బీజేపీ అతిక్రమణలు, ప్రధాని మోదీ వ్యాఖ్యలు, ఆ పార్టీ పెద్దయెత్తున చేస్తున్న నగదు వ్యయంపై ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. మొత్తం మీద యావత్ భారతావనిని ఈసీ విఫలం చేసిందని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రజలేమైనా జాతి వ్యతిరేకశక్తులా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి భారతీయుడూ దేశ భక్తుడేనని, ఏ దేశ భక్తుడినీ జాతి వ్యతిరేకుడిగా పిలువజాలరని అన్నారు. దేశంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, అంతా భయంతోనే బతుకుతున్నారన్నారు. ప్రతిపక్ష అభ్యర్థు ఎన్నికల వ్యయంపై ఆరా తీసే ఈసీ ఇవే ప్రమాణాలు అందరికీ వర్తింపజేస్తే బీజేపీ అభ్యర్థులందరూ అనర్హులవుతారన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రాదనే విషయంపై తాను పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. కుల రాజకీయాలపై విశ్వాసం లేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ట్విటర్లో ఆయన స్పందించారు. ప్రజలను మతిమరుపుతో బాధపడుతున్న తెలివితక్కువ వాళ్లుగా ఆయన భావిస్తున్నారా? అని నిలదీశారు. తానో ఓబీసీని, చాయ్‌వాలా నంటూ కులం ప్రాతిపదికన ఉవ్వెత్తున ప్రచారం చేసి (2014లో) ప్రధాని అయిన ఒకేఒక్క వ్యక్తి మోదీ అని ఎద్దేవా చేశారు. -
పాక్ మారాలంటే ముందు భారత్ మారాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలంటే ముందుగా భారత్ పాక్పట్ల తన ప్రవర్తనను మార్చుకోవాలని కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం తెలిపారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ..‘మనం బలమైన సైన్యాన్ని తయారుచేసుకునేది యుద్ధం చేయడానికి కాదు. యుద్ధంరాకుండా నివారించడానికే. ఈ విషయం తెలుసుకున్నప్పుడు అని సమస్యలు పరిష్కారమైపోతాయి. ఇందుకోసం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా సరికొత్తగా, విప్లవాత్మకంగా వ్యవహరించాలి’అని సూచించారు. భారత్–పాక్‌ల మధ్య సత్సంబంధాల కోసం ఇరుదేశాల పౌరులు విరివిగా రాకపోకలు సాగించేలా వీలు కల్పించాలని చిదంబరం అన్నారు. ఇరుదేశాల మధ్య సమస్యలకు యుద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదన్నారు. -
దశల వారీగా ఆదాయ పథకం
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హమీ ఇచ్చిన కనీస ఆదాయ పథకాన్ని దశల వారీగా అమలు చేస్తామని, దాదాపు 5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని కాంగ్రెస్ నేత చిదంబరం చెప్పారు. ఈ విషయంలో ఆర్థికవేత్తలు, నిపుణులతో చర్చించామని, ఈ పథకాన్ని అమలు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని చాలామంది అంగీకరించినట్లు ఆయన చెప్పారు. పథకం అమలుకు జీడీపీలో 1.8 శాతం మాత్రమే అవసరం అవుతుందని వివరించారు. ఈ పథకాన్ని తొలుత క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే అమలు చేస్తామని తెలిపారు. 2009లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేసినప్పుడు.. దాని అమలు సాధ్యం కాదని బీజేపీ నేత జైట్లీ విమర్శించారని, కానీ దాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు గుర్తుచేశారు. కుటుంబానికి అవసరమైన మొత్తం ఆదాయాన్ని ప్రభుత్వం ఇవ్వలేదని, అందుకే కనీస ఆదాయం అందజేస్తామని చెప్పారు.మహిళ పేరుపై బ్యాంకు ఖాతా తెరవాలని, ఆ ఖాతాలోకి ఏటా రూ.72 వేలు జమ చేస్తామని చెప్పారు. -
ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరానికి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటుండగా తాజాగా చిదంబరంను ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐకి న్యాయమంత్రిత్వ శాఖ అనుమతి లభించింది. కేసులో సేకరించిన సాక్ష్యాధారాలను సమర్పించిన మీదట చిదంబరంపై న్యాయపరమైన చర్యలతో ముందుకెళ్లేందుకు గతంలో న్యాయమంత్రిత్వ శాఖను దర్యాప్తు సంస్ధ ఆశ్రయించిన సంగతి తెలసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కస్టడీ విచారణ అవసరమని సీబీఐ, ఈడీ ఈనెల 25న ఢిల్లీ హైకోర్టులో పేర్కొన్నాయి. కాగా ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరాన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన క్రమంలో తాజా పరిణామాలు ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చే క్రమంలో పెద్దమొత్తంలో ముడుపులు ముట్టాయని చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై సీబీఐ ఆరోపిస్తోంది. -
‘ఓటాన్ అకౌంట్ కాదు అకౌంట్ ఫర్ ఓట్స్’
-
ఆ రెండు అంశాలు లేవు: చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం పెదవి విరిచారు. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఓట్ల కోసం చేసిన జిమ్మిక్కుగా వర్ణించారు. ‘ఓటాన్ అకౌంట్ కాదు అకౌంట్ ఫర్ ఓట్స్’ అంటూ ఎద్దేవా చేశారు. తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్.. కాంగ్రెస్ డిక్లరేషన్‌ను కాపీ కొట్టారని ఆరోపించారు. మధ్యంతర బడ్జెట్‌ను ఎక్కువసేపు చదివిన మంత్రిగా ఆయన నిలిచిపోతారని వ్యంగ్యంగా అన్నారు. దాదాపు గంటా 40 నిమిషాలు ఆయన బడ్జెట్ ప్రసంగం చదివారని గుర్తుచేశారు. పీయూష్ బడ్జెట్ ప్రసంగం ఎన్నికల ప్రచారాన్ని తలపించిందని విమర్శించారు. బడ్జెట్లో సంతోషించదగ్గ అంశాలు లేవన్నారు. రైతులకు రోజుకు 17 రూపాయలు ఇస్తే సంతోషించాలా? అని ప్రశ్నించారు. విద్య, ఉపాధి గురించి ప్రస్తావించలేదని వెల్లడించారు. పది పాయింట్ల దార్శనిక పత్రంలో ఈ రెండు అంశాలు లేవని చిదంబరం తెలిపారు. -
‘ఈ సారి రూ.100 నోట్లను రద్దు చేయండి’
న్యూఢిల్లీ : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌పై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. మోదీ బడ్జెట్‌ను ఓట్ల బడ్జెట్‌గా చిత్రీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ వరుస ట్వీట్లు చేశారు. ‘మోదీ ప్రభుత్వం జీడీపీ వృద్ధి అంచనాలను పెంచుతు సవరణలు చేస్తోంది. కానీ పెగురుతున్న నిరుద్యోగుల సంఖ్యను మాత్రం దాచి పెడుతుంది. వాటిని కూడా సవరించండ’ని పేర్కొన్నారు. అలానే ‘మోదీ ప్రభుత్వంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన ఏడాదే అత్యధిక వృద్ధి రేటు(8.2 శాతం) నమోదయ్యింది. ఈ సారి వంద రూపాయల నోట్లను రద్దు చేయండి. మరోసారి అద్భుతమైన వృద్ధి రేటు నమోదవుతుందం’టూ ఎద్దేవా చేశారు. అంతేకాక ‘సగటున 7 శాతం కూడా ఉపాధి లేకుండా ఒక దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రశ్నిస్తున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం.. 45 ఏళ్ల కాలంలో అత్యధిక నిరుద్యోగిత ఇప్పుడే నమోదయ్యింది. అలాంటిది ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి సాధిస్తుందంటే మేం ఎలా నమ్మాల’ని ప్రశ్నిస్తూ చిదంబరం వరుస ట్వీట్లు చేశారు. Modi Government revises GDP growth figures upward. What government did not realise was that unemployment figure was also revised upwards! — P. Chidambaram (@PChidambaram_IN) February 1, 2019 The demonetisation year was the best year of growth (8.2%) under Mr Modi. So, let's have another round of demonetisation. This time let's demonetise 100 rupee notes. — P. Chidambaram (@PChidambaram_IN) February 1, 2019 -
కార్తీ చిదంబరంపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ కేసుల్లో విచారణ నిమిత్తం మార్చి తొలివారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కావాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. చట్టంతో చెలగాటమాడరాదని ఆయనను సర్వోన్నత న్యాయస్ధానం హెచ్చరించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించే షరతుల్లో భాగంగా రూ పది కోట్లను కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కార్తీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 21-28 తేదీల్లో తన ఫ్రాన్స్ పర్యటనకు అనుమతించాలని కోరుతూ కార్తీ గత ఏడాది నవంబర్‌లో అప్పీల్ చేశారు. ‘మీరు ఎక్కడికి వెళ్లదలుచుకుంటే అక్కడికి వెళ్లవచ్చు..ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు.. అయితే చట్టంతో మాత్రం ఆడుకోవద్దు..విచారణకు సహకరించకుంటే మాత్రం తాము తీవ్ర చర్యలకు వెనుకాడబో’ మని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ కార్తీపై మండిపడింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ కేసుల్లో కార్తీ చిదంబరం మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్ధల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం కార్తీ చిదంబరం ముడుపులు స్వీకరించారని దర్యాప్తు ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. -
‘వ్యక్తిగత స్వేచ్ఛ’పై రాద్దాంతం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : కంప్యూటర్ నుంచి వచ్చే ఏ సమాచారంపైనైనా నిఘా కొనసాగించి, దాన్ని మధ్యలో అడ్డుకోవడంతోపాటు సదరు సమాచారాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేశంలోని పది ప్రభుత్వ సంస్థలకు అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర హోం శాఖ గురువారం నాడు విడుదల చేసిన నోటిఫికేషన్‌పైనా శుక్రవారం నాడు పార్లమెంట్లో తుపానే చెలరేగింది. స్వేచ్చా వ్యవస్థ స్వరూపమే సర్వ నాశనం చేస్తుందని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించగా, సుప్రీం కోర్టు సమర్థించిన రాజ్యాంగబద్ధ వ్యక్తిగత స్వేచ్ఛను ఈ నోటిఫికేషన్ హరిస్తోందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ఘాటుగా విమర్శించారు. నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గొడవ చేయడంతో పార్లమెంట్ సమావేశం కూడా పలు సార్లు వాయిదా పడింది. (సెక్షన్ 69 బాంబు : మండిపడుతున్న ప్రతిపక్షాలు) ఇక పార్లమెంట్ వెలుపల ఈ నోటిఫికేషన్‌ను పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, సైబర్ భద్రతా నిపుణులు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ హరించుకు పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కంప్యూటర్లోని ఎవరి సమాచారమైనా, అది ఎలాంటి సమాచారమైన నిఘావేసి, అడ్డుకొని, తస్కరించే అధికారాలు అధికారులకు ఇప్పటికే ఉన్నాయన్న విషయాన్ని మరచిపోతున్నారు. 2000 నాటి సమాచార సాంకేతిక చట్టంలోనే ఈ ప్రత్యేకాధికారాలను సంస్థలు లేదా అధికారులకు కల్పిస్తూ 2008లో అప్పటి యూపీఏ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. నాడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సీపీఎం అప్పుడు మౌనం వహించి ఇప్పుడు గోల చేయడం విడ్డూరమే. సమాచార సాంకేతిక చట్టంలోని 69 (1) సెక్షన్ ప్రకారం ‘దేశ సార్వభౌమా«ధికారానికి లేదా దేశ రక్షణకు లేదా రాష్ట్ర భద్రతకు ముప్పుందని భావించినట్లయితే, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాల కోసం లేదా పాలనాపరమైన సంబంధాల కోసం అవసరమైతే, ఎలాంటి నేరాన్నైనా నిరోధించేందుకు ఉపయోగపడుతుందని భావించినట్లయితే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిగల అధికారులు ఎవరి కంప్యూటర్ సమాచారంపైనైనా నిఘా పెట్టవచ్చు. ఆ సమాచారాన్ని మధ్యలోనే అడ్డుకొని, స్వాధీనం చేసుకోవచ్చు. అయితే దర్యాప్తు అధికారులు ఏ కారణంతోని సమాచారాన్ని సేకరిస్తున్నారో మాత్రం లిఖితపూర్వకంగా స్పష్టం చేయాల్సి ఉంటుంది’ అని చెబుతోంది చట్టం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం లేదా? మాటి మాటికి లేదా కేసుబై కేసుకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర హోం మంత్రి అరుణ్ జైట్లీ దేశంలోని ‘ది ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, క్యాబినెట్ సెక్రటేరియట్, జమ్మూ కశ్మీర్, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసు కమిషనర్’లకు అధికారాలను కట్టబెట్టారు. ఈ సంస్థలకు చెందిన అధికారులకు సమాచారాన్ని సేకరించడంలో సహకరించడానికి ఎవరు నిరాకరించినా చట్ట ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారన్న హెచ్చరిక కూడా ఉంది. సమాచార సాంకేతిక చట్టంలోనే దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని సేకరించే వెసులుబాటు లేకపోయినట్లయితే నేడు అరుణ్ జైట్లీ జారీ చేసిన నోటిఫికేషనే చెల్లేదికాదు. ఇదంతా తెలిసే కాంగ్రెస్, సీపీఎం పార్టీలు రాద్ధాంతం చేయడం ఎందుకు? నిజంగా ఆ పార్టీలకు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందుగా ‘వ్యక్తిగత గోప్యత’ భద్రతకు చట్టం తీసుకురావాలి. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది. అప్పుడు దొడ్డి దారిన కూడా వ్యక్తిగత గోప్యతకు ఎవరూ ఎసరు పెట్టలేరు! -
చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వండి
న్యూడిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో నిజాలు రాబట్టేందుకు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను కస్టడీలోకి తీసుకుని విచారించడం తప్పనిసరని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీలోని ఓ కోర్టుకు తెలిపింది. కాంగ్రెస్ నేత అయిన చిదంబరం విచారణలో తమకు సహకరించడం లేదనీ, అన్నీ దాటవేత సమాధానాలిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ముందస్తు బెయిలు కోసం చిదంబరం చేసుకున్న అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. అనేక మంది ప్రముఖులతో సంబంధాలు కలిగిన ఆయన అత్యంత శక్తిమంతుడనీ, సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను నాశనం చేయతగ్గ వ్యక్తి కాబట్టి ముందస్తు బెయిలు ఇవ్వకూడదని ఈడీ వాదించింది. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించకపోతే దర్యాప్తును నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయడం సాధ్యం కాదని ఈడీ పేర్కొంది. కాగా అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం చేసిన అభ్యర్థనను ఈ ఏడాది మే 30న కోర్టు తొలిసారి మన్నించడం తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు ఈ వెసులుబాటును కోర్టు పొడిగించింది. గత నెల 8న కూడా ఆయనకు నవంబర్ 1 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
చిదంబరం కస్టడీని కోరిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఈ కేసులో చిదంబరం కస్టడీ విచారణకు అనుమతించాలని బుధవారం ఢిల్లీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఎదుట ఈడీ తన స్పందనను తెలియచేస్తూ ఆయనకు బెయిల్ ఇవ్వరాదని కోరింది. చిదంబరం తప్పించుకు తిరుగుతూ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు నివేదించింది. కాగా, చిదంబరం బెయిల్ పిటిషన్‌పై గురువారం ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఎదుట వాదనలు కొనసాగనున్నాయి. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో అక్టోబర్ 8న చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను నవంబర్ 1 వరకూ అరెస్ట్ చేయరాదని ఇచ్చిన ఉత్తర్వులు ముగియడంతో కోర్టు తదుపరి ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది. -
చిదంబరంపై ఈడీ చార్జిషీటు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఎయిర్‌సెల్–మాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టులో ఆయనపై చార్జిషీటు దాఖలు చేసింది. అనుమతులు ఇచ్చే విషయంలో విదేశీ పెట్టుబడిదారులతో కుమ్మక్కయ్యారని అందులో ఈడీ ఆరోపించింది. చిదంబరం కుమారుడు కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరన్ పేరును కూడా స్పెషల్ జడ్జి ఓపీ సైనీ ఎదుట సమర్పించిన ఆ చార్జిషీటులో ప్రస్తావించింది. అయితే సీబీఐ, ఈడీ ఆరోపణలను చిదంబరం, ఆయన కుమారుడు ఖండించారు. ఈ చార్జిషీటులో ఎయిర్‌సెల్ మాజీ సీఈవో వి.శ్రీనివాసన్, మాక్సిస్‌కు చెందిన ఆగస్టస్ రాల్ఫ్ మార్షల్, ఆస్ట్రో ఆల్ ఏసియా నెట్వర్క్స్ మలేసియా, ఎయిర్‌సెల్ టెలీవెంచర్స్ లిమిటెడ్, మాక్సిస్ మొబైల్ సర్వీసెస్, బుమీ అర్మడా బెర్హాద్ పేర్లను కూడా పొందుపరిచారు. నవంబర్ 26న ఈ చార్జిషీటు విచారణకు రానుంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇచ్చిన అనుమతులను 2006లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఆమోదం తెలిపారని, ఈ వ్యవహారంలో రూ.1.6 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
కాంగ్రెస్ కోర్ కమిటీ అధిపతిగా ఆంటోనీ
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలకు చైర్మన్లు, కన్వీనర్లను శనివారం ప్రకటించారు. మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కోర్ కమిటీకి, మరో సీనియర్ నాయకుడు పి.చిదంబరం మేనిఫెస్టో కమిటీకి, ఆనంద్ శర్మ ప్రచార కమిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌కు కోర్ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ ఎంపీ, పార్టీ పరిశోధనా విభాగం అధిపతి రాజీవ్ గౌడ మేనిఫెస్టో కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. పవన్ ఖేరా ప్రచార కమిటీకి కన్వీనర్‌గా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ ఈ కమిటీల అధిపతులతో సమావేశమై రాబోయే ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. -
‘రద్దు చేశారు.. రోడ్డున పడేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రధ్దు చేసి ప్రజలను నూరు పాట్లకు గురిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ధ్వజమెత్తారు. ఢిల్లీలో నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలపై దుమ్మెత్తిపోశారు. నోట్ల రద్దు చేస్తు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచలోని ఏ ఒక్క ఆర్థికవేత్త ప్రశంసించకపోవడం కాదుకదా సమర్థించడం కూడా జరగలేదని, అందరూ అది అనాలోచిత నిర్ణయమని అన్నారన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు. అసలు నోట్ల రద్దు విషయం ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్కే తెలియదన్నారు. నోట్ల రద్దు గురించి ఢిల్లీలో మోదీ వివరించిన రోజు సీఈఏ కేరళలో ఉన్నారని, సీఈఏకే తెలియకపోతే.. ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఇది? అంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు అన్నది అవినీతి, తీవ్రవాదం, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయాలుగా చెప్పుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మరి విజయం సాధించిందా అంటూ చురకలు అంటించారు. అమెరికాతో సహా ప్రపంచ దేశాలు మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను మెచ్చుకున్నారని.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు ఎలా అమలుచేస్తున్నారో అడిగి తెలుసుకునేవారని తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌పై కూడా చిదంబరం విమర్శల వర్షం కురిపించారు. అదొక భీమా పథకం లాంటిదని.. 130 కోట్లకుపైగా జనాభా గల భారత్‌లో భీమా పథకాలతో ప్రజలకు లాభం జరగుతుందనే నమ్మకంలేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి స్కీమ్‌లు ఏ దేశంలోనూ విజయవంతం కాలేదని వివరించారు. అంతేకాకుండా ఈ పథకంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్షంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆపై జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. -
చిదంబరాన్ని ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద చిదంబరం వాంగ్మూలం తీసుకున్నారు. ఒప్పందానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) అధికారుల వాంగ్మూలాల్ని ఈడీ రికార్డు చేసింది. ఆయన హయాంలో ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందానికి అనుమతిచ్చేందుకు ఎఫ్ఐపీబీ అనుసరించిన ప్రమాణాలు, ఇతర అంశాలపై జూన్‌లో ప్రశ్నించారు. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నపుడు మ్యాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌కి రూ.3,680 కోట్ల మేర ఎఫ్ఐపీబీ అనుమతులు జారీచేసింది. రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీనే అనుమతులివ్వాలి. చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి ఎలా అనుమతులిచ్చారనే విషయమై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. -
సాంకేతికతలో మనమే ముందుండాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో ఏటా 7 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదవుతున్నారు. వారంతా యువకులు కావడంతో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఎక్కువ ఉంటుంది. అదే పరిజ్ఞానంతో కొత్త ఓటర్లను ఆకర్షించడంలో సఫలం కావాలి. ఈ విషయంలో రాజ కీయ ప్రత్యర్థి కన్నా మనం ముందుండాలి. వారి వేగాన్ని అందుకునేలా శక్తి యాప్ లో సభ్యులను చేర్పించాలి’అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానమే కీలకపాత్ర పోషిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన శక్తి యాప్ సమీక్ష సమావేశానికి చిదంబరం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. తెలంగాణలో దాదాపు 2.2 కోట్ల ఓటర్లు ఉన్నారని, వారిలో కనీసం 10% (22 లక్షలు) మందిని యాప్‌లో సభ్యులుగా చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 119 నియోజకవర్గాల్లో ఇప్పుడున్న లక్ష సభ్యత్వాలు చాలా తక్కువని, ›ప్రతి పోలింగ్ బూత్ లో 25 మందిని సభ్యులుగా చేర్పించాలని కోరారు. ‘కాంగ్రెస్ నేతల కాళ్లు ఆఫీసుల్లో, సొంత పనుల్లో కాకుండా క్షేత్రంలో ఉండాలి. యాప్ ద్వారా నాయకత్వ స్థాయి నుంచి కింది స్థాయి వరకు సమాచారం వస్తుంది, దీన్ని పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఆలోగా ప్రతి నెలా 2 లక్షల మందిని యాప్‌లో సభ్యులుగా చేర్పించేలా నేతలు పనిచేయాలి’అని సూచించారు. అత్యధికంగా అంబర్‌పేటలో.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు శక్తి యాప్ చాలా ఉపయోగపడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శక్తి యాప్ ప్రాజెక్టును రాహుల్‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దీన్ని విజయవంతం చేసేందుకు శ్రద్ధతో పనిచేయాలని కోరారు. పార్టీ ప్రచార కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాప్ ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. యాప్ రాష్ట్ర ఇన్చార్జి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలో తెలంగాణలో లక్ష మందిని యాప్ సభ్యులుగా చేర్పించగలిగామన్నారు. అత్యధికంగా అంబర్‌పేట నియోజకవర్గంలో 13,240 మంది.. కోదాడలో 6,467, హుజూర్‌నగర్‌లో 6,120 మంది యాప్‌లో సభ్యులుగా చేరారని చెప్పా రు. యాప్ నమోదు విషయంలో నేతలు అడిగిన సాంకేతిక సమస్యలకు చిదంబరంతో పాటు ఏఐసీసీ విశ్లేషణ డేటా విభాగం ఇన్చార్జి ప్రవీణ్ చక్రవర్తి సమాధానాలు చెప్పారు. సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క, మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పరిస్థితులపై రాహుల్‌తో చర్చించా: ఉత్తమ్ సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు శక్తినివ్వాలనే ఆలోచనతో శక్తి యాప్‌కు రాహుల్ శ్రీకారం చుట్టారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకే చిదంబరం వచ్చారని వెల్లడించారు. శనివారం తన ఢిల్లీ పర్యటనపై మీడియా ప్రశ్నించగా, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు. పలువురు నేతల గైర్హాజరు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు, నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులంతా సమావేశానికి హాజరవాలని పీసీసీ నుంచి ఆహ్వానం వెళ్లింది. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలే హాజరయ్యారు. సమావేశంలో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి మాట్లాడాలని గ్రేటర్ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌ను కోరగా వీహెచ్ అడ్డుచెప్పినట్లు తెలిసింది. అనంతరం చిదంబరం మాట్లాడుతూ.. యువ నాయకులను తక్కువ అంచనా వేయొద్దని, నేతలందరూ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని హితవు పలికినట్లు సమాచారం. -
సర్కార్ నిర్వాకంతోనే ఆకలి చావులు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆకలితో అలమటిస్తూ ముగ్గురు చిన్నారి బాలికలు మరణించిన ఉదంతంపై సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ ఉపాథి హామీ పథకం, ఆహార భద్రత చట్టాల అమలులో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైందని విమర్శించారు. ఈ పథకాల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగానే ఆకలి చావులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ప్రజల క్షుద్బాధను తీర్చేందుకే జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని యూపీఏ సర్కార్ తీసుకువచ్చిందని, పేదలకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించడం ఈ పథకం ఉద్దేశమని చిదంబరం వివరించారు. పేదల ఆకలి తీర్చే ఉపాథి హామీ పథకంతో పాటు ఆహార భద్రత చట్టాన్నీ మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని చిదంబరం ట్వీట్ చేశారు. దేశంలో ఆకలితో చిన్నారుల మరణాలు సంభవించినంత వరకూ మనం సిగ్గుతో తలదించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులగా తిండిలేక ఢిల్లీలో ముగ్గురు మైనర్ బాలికలు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో మలుపు
-
చిదంబరం ఇంట్లో భారీ చోరీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ కేసులో ఇద్దరు పనిమనుషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దొంగతనం జరిగిందని తొలుత చేసిన ఫిర్యాదును చిదంబరం భార్య నళిని చిదంబరం ఆదివారం రాత్రి వెనక్కి తీసుకోవడం గమనార్హం. తమ నివాసంలో ఎలాంటి దొంగతనం జరగలేదన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం...చెన్నై నుంగంబాక్కం ఫైవ్‌క్రాఫ్ట్స్ రోడ్డులోని ఇంట్లో చిదంబరం, భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధి నివసిస్తున్నారు. ఓ కార్యక్రమానికి వెళ్లడానికి ముందు నగలు అలంకరించుకునేందుకు నళిని శనివారం తన గదిలోని బీరువా తెరచిచూడగా అందులో పెట్టిన పురాతన మరకతాలు, బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా, వారు ఇంటి ప్రాంగణంలో అమర్చిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుమారు నెల క్రితం ఇద్దరు మహిళలు ముఖాలకు ముసుగేసుకుని నళిని గదిలోకి వెళ్లడం, కొద్దిసేపటి తరువాత ఒక సంచితో బయటకు వచ్చిన దృశ్యాలు అందులో నమోదయ్యాయి. వాటిలోని వ్యక్తుల రూపురేఖల ఆధారంగా, చిదంబరం ఇంట్లో పనిచేస్తున్న వెన్నెల, విజిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చిదంబరం ఇంట్లో చోరీ.. ట్విస్ట్
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగింది. నుగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్ లో ఉన్న ఆయన ఇంట్లో లూటీ జరిగింది. చిదంబరం భార్య నళినీ చిదంబరం నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లి, గత రాత్రి తిరిగొచ్చారు. తలుపులు తెరిచి చూసేసరికి అల్మరాలు ఓపెన్ చేసి ఉండటంతో దోపిడీ జరిగిన విషయాన్ని ఆమె గుర్తించారు. వెంటనే పోలీసులకు ఆమె సమాచారం అందించారు. విలువైన ఆభరణాలు, రూ. 1.50 లక్షల నగదు, ఆరు విలువైన చీరలు చోరీ అయినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఘటన వెనుక తమ ఇంట్లో పనిచేసే ఇద్దరు పనిమనుషుల హస్తం ఉండొచ్చని ఆమె అనుమానించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తే, మాస్క్‌లు ధరించిన ఇద్దరు మహిళలు ఇంట్లోకి వెళుతుండటం కనిపించింది. పదిరోజుల క్రితమే ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు వెనక్కి.. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి అరెస్టులు జరగలేదు. పోలీసు ఫిర్యాదుతో కంగారుపడ్డ ఆ పని మనుషుల కుటుంబ సభ్యులు.. చోరీకి గురైన సొత్తు వెనక్కి ఇస్తామని చిదంబరం ఫ్యామిలీకి చెప్పారు. దీంతో ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదివారం ఉదయం కార్తీ చిదంబరం కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఆభరణాలు ఏవీ చోరీ కాలేదని, కేవలం డబ్బు మాత్రమే అయిందని కార్తీ తెలిపారు. -
జీఎస్టీ అంటే ఆర్ఎస్ఎస్ ట్యాక్స్
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని ఆర్ఎస్ఎస్ ట్యాక్స్‌గా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అభివర్ణించారు. దీని కారణంగా ప్రజలపై విపరీతంగా పన్ను భారం పెరిగిందనీ, అందుకే ఇది ‘చెడుమాట’గా మారిందన్నారు. ‘అది ఒక విచిత్రమైన జంతువు లాంటిది. సగటు జీవిపై జీఎస్టీతో విపరీత భారం మోపారు. ఒకే పన్ను రేటు ఉంటే జీఎస్టీ అనొచ్చు. అనేకమార్లు పన్నులు వసూలు చేస్తుంటే మాత్రం ఆర్ఎస్ఎస్ ట్యాక్స్ అని పిలవాల్సి ఉంటుంది’ అన్నారు. అధికారులు మాత్రమే జీఎస్టీ వల్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. పరోక్ష పన్నుల విధానంలోకి పెట్రోలియం ఉత్పత్తులను కూడా తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. -
జీఎస్టీపై బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వస్తు సేవల పన్ను( జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయింది. 2017 జూలై 1 నుంచి కేంద్ర సర్కారు దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జీఎస్టీ తొలి వార్షికోత్సవాన్ని బీజేపీ ఆదివారం నాడు ఘనంగా జరుపుకొంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ఈ రోజు ఉదయమే ట్వీట్ చేశారు. జీఎస్టీ ఏడాది కాలం పూర్తి చేసుకోవడంపై దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జీఎస్టీ వృద్ధిని ప్రోత్సహించింది. పన్నుల్లో పారదర్శకతను తీసుకొచ్చింది. ఆర్థిక అంశాలను వ్యవస్థీకృతం చేసేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు, వ్యాపారం మరింత సులభతర నిర్వహణకు సాయపడుతోంది. సహకారాత్మక సమాఖ్య వ్యవస్థకు, టీమిండియా స్ఫూర్తికి ఇదో అద్భుతమైన ఉదాహరణ. భారతీయ ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులను తీసుకొచ్చింది’’ అని ప్రధాని ట్వీటర్లో పేర్కొన్నారు. జీఎస్టీ ఒక గొప్ప ఆర్థికసంస్కరణ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. ‘గతంలోని సంక్షిష్ట పన్ను విధానానికి స్వస్తి చెప్పి 17 రకాల పన్నుల స్థానంలో ఒకే పన్ను వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక గొప్ప మార్పు జీఎస్టీ’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న జీఎస్టీ విధానం ఏడాదిలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం విమర్శించారు. 'ఆర్థిక వ్యవస్థ క్రమబద్దీకరణ హామీ ఇచ్చి ఏడాదైనా అది అమలుకు నోచుకోలేదు. నగదు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ అవాంతరాలు తలెత్తుతూనే ఉన్నాయి. జీఎస్టీతో వస్తువుల ధరలు 40 శాతం పెరిగాయి. జీఎస్టీ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఇంకా తొలగిపోలేదు’ అని ట్విటర్లో చిదంబరం పేర్కొన్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలను కృత్రిమంగా పెంచారు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలనపై కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం నిప్పులు చెరిగారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ఆయన విమర్శించారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని మండిపడ్డారు. చిన్నతరహా పరిశ్రమలు పెద్దసంఖ్యలో మూతపడ్డాయని తమిళనాడు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను కృత్రిమంగా పెంచడంపై దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని చిదంబరం అన్నారు. 2014 మే-జూన్ నాటితో పోల్చుకుంటే.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతో పెరిగిపోయాయని, ఇంతగా ధరలు పెరగడానికి ఎలాంటి సరైన కారణమూ కనిపించడం లేదని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. పెట్రోల్ ధరలు పెరిగిపోయి సామాన్యుల పరిస్థితి దీనంగా మారిపోయిందని చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ హయాంలో పెట్టుబడులు రావడం లేదని, అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయని, మార్కెట్‌పై ప్రభుత్వానికి నియంత్రణ లేదని విమర్శించారు. 50వేల చిన్న కంపెనీలను మూసేశారని, ఇదేనా అభివృద్ధిని కేంద్రాన్ని చిదంబరం ప్రశ్నించారు. నోట్లరద్దు వల్ల దేశంలో వ్యాపారులు దెబ్బతిన్నారని అన్నారు. కరెన్సీ నోట్లు కలిగి ఉండటం ప్రజల హక్కు అని, దానిని ప్రభుత్వం దూరం చేయకూడదని పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా చేశారని చిదంబరం మండిపడ్డారు. -
చిదంబరాన్ని 4 గంటలు ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం బుధవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు తన న్యాయవాదితో ఇక్కడి సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం సీబీఐ అధికారులు ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు తన హయాంలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడంపై చిదంబరాన్ని దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం చిదంబరం స్పందిస్తూ.. ‘విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పత్రాల ఆధారంగానే ప్రశ్నలు, జవాబులు సాగాయి. కాబట్టి చాలా తక్కువ అంశాలను మాత్రమే అధికారులు రికార్డు చేశారు’ అని ట్వీట్ చేశారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి స్వల్ప ఊరట
-
చిదంబరాన్ని అరెస్టు చేయకుండా ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జూలై 3వరకు ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ ఏకే పాఠక్ ఈ కేసు విషయంలో సీబీఐకి నోటీసులు జారీచేశారు. చిదంబరం ముందస్తు బెయిల్‌పై సీబీఐ వైఖరి ఏమిటో తెలుపాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ కేసు విచారణలో సీబీఐకి సహకరించాలని చిదంబరానికి న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ పిలిచినప్పుడల్లా విచారణకు హాజరుకావాలని సూచించింది. సీబీఐ తరఫున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ తుషాక్ మెహతా చిదంబరం అభ్యర్థనను వ్యతిరేకించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని, హైకోర్టును కాదని ఆయన వాదించారు. అయితే, మెహతా వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం గురువారం సీబీఐ ముందు హాజరుకావాల్సి ఉంది. ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందం కేసులోనూ చిదంబరాన్ని అరెస్టుచేయకుండా ట్రయల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీచేసిన సంగతి తెలిసిందే. -
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి: చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం బుధవారం ట్రయల్‌కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎయిర్‌సెల్–మాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు చిదంబరం తరఫున సీనియర్ లాయర్లు సిబల్, సింఘ్వీలు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్–మాక్సిస్ రూ.3,500 కోట్ల ఒప్పందంలో, ఐఎన్ఎక్స్ మీడియాకు రూ.350 కోట్ల విదేశీ పెట్టుబడుల అనుమతుల జారీలో అవకతవకలు జరిగాయని ఆరోపణ. ఈ నేపథ్యంలో ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసులో బుధవారం విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీచేయడంతో చిదంబరం ట్రయల్‌కోర్టును ఆశ్రయించారు. -
డీఆర్ఐ వద్దన్నా.. 80:20 తెచ్చారు
న్యూఢిల్లీ: పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా 2013లో ప్రవేశపెట్టిన 80:20 బంగారం దిగుమతుల పథకాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) వ్యతిరేకించినట్లు తెలిసింది. ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) ఉప కమిటీతో ఆర్థిక శాఖ అధికారులు ఈ వివరాలు పంచుకున్నట్లు వెల్లడైంది. ఆ పథకం ప్రారంభించడంలో అవలంబించిన పద్ధతులు, విధానాలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నేతృత్వంలోని ఉప కమిటీ నిర్ణయించింది. రెవెన్యూ కార్యదర్శితో పాటు ఈడీ, సీబీడీటీ, సీబీఈసీ ఉన్నతాధికారులు ఉప కమిటీ ముందు హాజరై ఈ పథకం గురించి వివరణ ఇచ్చారు. 80:20 పథకంతో నల్లధనం తెల్లధనంగా మారడంతో పాటు, మనీ లాండరింగ్ పెరుగుతుందని అప్పట్లోనే డీఆర్ఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్వ ఏడాది దిగుమతుల నుంచి 20 శాతం బంగారాన్ని ఎగుమతి చేసిన తరువాతే మళ్లీ బంగారాన్ని దిగుమతి చేసుకోవాలనే నిబంధనతో తెచ్చిన ఈ పథకాన్ని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత 2014 నవంబర్‌లో రద్దు చేసింది. కార్తీకి నార్కో పరీక్షలు?: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్టయిన కార్తీ చిదంబరానికి నార్కో పరీక్ష చేయడానికి అనుమతి కోరుతూ సీబీఐ ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. మార్చి 9న ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని స్పెషల్ జడ్జీ సునీల్ రానా చెప్పారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగించుకుని కార్తీ మళ్లీ అదే రోజు కోర్టుకు హాజరుకానున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్ భాస్కరరామన్, సహ నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీలపై జారీ అయిన వారెంట్లు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లనూ కోర్టు విచారణకు చేపడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్తీ విచారణకు సహకరించడం లేదన్న నేపథ్యంలో నార్కో పరీక్షల కోసం పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
చివరిరోజు ఆమోదించారు
న్యూఢిల్లీ: 2014లో లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు. ప్రైవేటు కంపెనీలకు లబ్ధిచేకూర్చేలా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పలు బిల్లులను ఆమోదించారని బీజేపీ ఆరోపించింది. గీతాంజలి జెమ్స్ సహా పలు కంపెనీలకు మేలు చేసేలా బంగారు దిగుమతి పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొంది.ఈ నిర్ణయం ద్వారా చిదంబరం ఎంత లాభం పొందారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. విపక్షాలు బీజేపీపై చేస్తున్న అసత్యాలను ప్రజలకు వివరించేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ.. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది.మొండి బకాయిలు బ్యాంకు పుస్తకాల్లో లేకుండా చేసింది. ప్రభుత్వం చివరి ఆరేళ్లలో రూ.52.15లక్షల కోట్లను అడ్వాన్స్‌గా కంపెనీలకు ఇచ్చింది. ఇందులో 36 శాతం నిధులు మొండి బకాయీలుగా గుర్తించగా.. అవి ప్రభుత్వం గద్దెదిగే సమయానికి 82 శాతానికి చేరాయి. గొప్ప ఆర్థికవేత్తలైన మన్మోహన్ సింగ్, చిదంబరంల హయాంలో అనవసర జోక్యం, మొండి బకాయిలను ప్రోత్సహించటం, ఒత్తిడి చేయటంతో బ్యాంకింగ్ వ్యవస్థ పట్టాలు తప్పింది’ అని వెల్లడించారు. 80:20 పథకం ద్వారా ఏడు ప్రైవేటు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరిందన్నారు. ‘మే 16న మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఓడిపోయింది. చిదంబరం కుర్చీ ప్రమాదంలో పడింది. చివరి రోజు అత్యవసరంగా ఏడు ప్రైవేటు కంపెనీలకు మేలు చేసేలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో.. చిదంబరం, రాహుల్ గాంధీ వెల్లడించాలి’ అని రవిశంకర్ చెప్పారు. పీఏసీకి ‘80:20’ వివరాలు యూపీఏ హయాంలో తెచ్చిన 80:20 బంగారు దిగుమతి పథకం వివరాలను పార్లమెంటు ప్రజాపద్దుల సంఘానికి (పీఏసీ) ఆర్థిక శాఖ అందజేయనుంది. ఈ పథకంలోని లొసుగులను వినియోగించుకునే గీతాంజలి గ్రూప్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారం టూ పీఏసీలోని బీజేపీ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో.. ఆర్థిక శాఖ పథకం వివరాలను సేకరిస్తోంది. పథకం, తదనంతర పరిణామాలపై 10 రోజుల్లో పీఏసీకి వివరాలు ఇవ్వనుంది. 80:20 బంగారు దిగు మతి పథకం ప్రకారం.. వ్యాపారస్తులు తా ము గతంలో దిగుమతి చేసుకున్న బంగారంలో కనీసం 20 శాతమైనా ఎగుమతి చేసి ఉంటేనే.. తర్వాత మరోసారి బంగారం దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. -
చిదంబరంను ప్రశ్నించనున్న సీబీఐ?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బడ్జెట్ రెండో దశ సమావేశాలు, కాంగ్రెస్ ప్లీనరీ నేపథ్యంలో ఐఎన్ఎక్స్ మీడియా అవీనితి కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరంను సీబీఐ ప్రశ్నించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో ఆయన కొడుకు కార్తీ అరెస్టయిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు ‘నీరవ్ మోదీ..’ అని నినాదాలు చేస్తే తాము ‘చిదంబరం..’ అని నినదిస్తామని కొందరు బీజేపీ ఎంపీలు బహిరంగంగానే ప్రకటించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం ద్వారా తమ ప్రతిష్టకు జరిగిన నష్టాన్ని కొంతవరకైనా భర్తీ చేసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. -
చిక్కుల్లో చిదంబరం: బుక్ చేసిన ఇంద్రాణి
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. బుధవారం చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్నిచెన్నైలో సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా, తాజాగా ఇంద్రాణి ముఖర్జీ స్టేట్మెంట్ చర్చనీయాంశమైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం తన కుమారుడు కార్తీకి సహాయం చేయమని కోరారని ఇంద్రాణి ముఖర్జీ దర్యాప్తు సంస్థ విచారణలో పేర్కొన్నట్టుగా వివిధ మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఢిల్లీలోని హోటల్ హయత్‌లో కార్తీని కలుసుకున్నట్టుగా కూడా ఆమె వెల్లడించారు. అలాగే కార్తీ చిదంబరానికి చెందిన విదేశీ, స్వదేశీ సంస్థలకు చెల్లించిన ముడుపులకు (రూ.4.5 కోట్లు) సంబంధించి ఐఎన్ఎక్స్ న్యూస్ మాజీ డైరెక్టర్ పీటర్ ముఖర్జీ సంతకం చేసిన నాలుగు ఇన్వాయిస్లను ఐఎన్ఎక్స్ మీడియా సీబీఐకి అందించింది. వీటిని సీబీఐ, ఈడీ పరిశీలిస్తున్నాయి. మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.5 కోట్లు) ముడుపుల కేసు విచారణ సందర్భంగా ఐఎన్ఎక్స్ న్యూస్ మాజీ డైరెక్టర్, కుమార్తె షీనా బోరా హత్యకేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జీని సీబీఐ, ఈడీ తాజాగా ప్రశ్నించాయి. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం పొందే క్రమంలో తన కుమారుడి వ్యాపారానికి సహకరించాలని చిదంబరమే తనను స్వయంగా కోరినట్టు ఇంద్రాణి తెలిపినట్టు సమాచారం. ఆయన కోరిక మేరకే తాను కొంత సహకరించానని కూడా ఇంద్రాణి వాగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో అతి త్వరలో చిదంబరాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కాగా బుధవారం అరెస్ట్ చేసిన కార్తీ చిదంబరాన్ని ప్రశ్నించడానికి వీలుగా ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతినిచ్చింది. సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ కార్తీకి కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు కార్తీ చిదంబరం అరెస్ట్‌పై స్పందించిన కాంగ్రెస్.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమను ఎన్డీయే సర్కారు ఇబ్బందులు పెడుతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
‘నా ప్రాథమిక హక్కుల్ని రక్షించండి’
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ప్రాథమిక హక్కులతో పాటు వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎయిర్‌సెల్–మాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో తన కుమారుడు కార్తీకి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు సమన్లు జారీచేయడంతో పాటు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చిదంబరం కోర్టును ఆశ్రయించారు. తనతో పాటు కార్తీ పేరు ఎఫ్ఐఆర్లో లేకపోయినప్పటికీ ఈడీ, సీబీఐలు వేధిస్తున్నాయనీ, ఈ చట్టవిరుద్ధమైన విచారణను వెంటనే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మెడికల్ హెల్త్ కేర్..అదో పెద్ద జిమ్మిక్కు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆర్థిక బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని చిదంబరం అభిప్రాయపడ్డారు. ప్రయివేటు రంగానికి వత్తాసు తప్ప సామాన్యుడికి ఒరిగేదీ లేదని మండిపడ్డారు. ప్రధానంగా ఆర్థిక ద్రవ్యలోటు బాగా నిరాశ పర్చిందన్నారు. 3.5 శాతంగా అంచనా వేసిన ద్రవ్యలోటు 3.2శాతానికి తగ్గడం దురదృష్టకరమన్నారు. 2018-19 బడ్జెట్లో ఆర్థిక ఏకీకరణ పరీక్షలో ఆర్థిక మంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. బడ్జెట్లో వ్యవసాయం రంగం కేటాయింపులు, రైతులకు ప్రయోజనాలపై స్పందించిన చిదంబరం వ్యవసాయం రంగంపై ఒత్తిడి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో తక్షణమే రైతులకు లభించే వాస్తవ ఆదాయమేదీ తనకు కనిపించలేదన్నారు. దిగుమతులపై పరిమితి విధించేందుకు అదనపు కస్టమ్ సుంకాన్ని విధించడంపై అభ్యంతరం వ్యక్తంచేసిన చిదంబరం ఎగుమతులను పెంచడానికి ఎలాంటి విధానాలను ప్రకటించదు.. అసలు ప్రభుత్వానికి ఆలోచనే లేదని దుయ్యబట్టారు. అతి పెద్ద మెడికల్ హెల్త్ కేర్ ఒక పెద్ద బూటకం. ఇది ఒక ఎలక్షన్ ఎత్తుడగ అని వ్యాఖ్యానించారు. ఇది కేవలం బీమా పథకం. అయితే ప్రీమియం సంగతి ఏంటి.. ఆ లెక్కలెక్కడా తనకు కనిపించలేదని చిదంబరం పేర్కొన్నారు. దీని వలన ప్రయివేటు రంగానికి భారీ ప్రయోజనాలు ఒనగూరనున్నాయన్నారు. అలాగే సగటు పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదని ఆరోపించారు. కాగా దేశంలోని పది కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్‌ను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్లో ప్రవేశపెట్టారు. దీని వల్ల ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల వరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇవ్వనున్నా మన్నారు. తద్వారా 10కోట్ల కుటుంబాలకు, సుమారు 50 కోట్ల మంది పేదలకు లబ్ది చేకూరనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘ఆధార్’పై వాగ్వాదం
ముంబై: పలు పథకాలకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేయడంపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్.నారాయణమూర్తి మధ్య ఆసక్తికరమైన సంవాదం నడిచింది. ఐఐటీ బాంబే శుక్రవారం నాడిక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. సమావేశంలో తొలుత చిదంబరం మాట్లాడుతూ.. ఎలాంటి సహేతుక కారణం లేకుండా ప్రతీదానికి ఆధార్‌ను అనుసంధానం చేస్తూ కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోందన్నారు. ‘వివాహం కాని ఓ యువజంట ఏకాంతంగా గడపాలనుకుంటే తప్పేంటి? ఓ యువకుడు కండోమ్స్ కొనాలంటే ఆధార్ లేదా మరో గుర్తింపు కార్డును చూపించాల్సిన అవసరమేంటి? నేనేం మందులు కొంటానో, ఏ సినిమాలు చూస్తానో, ఏయే హోటళ్లకు వెళ్తానో ప్రభుత్వం తెల్సుకోవాల్సిన అవసరం ఏమిటి?’ అని ప్రశ్నించారు. దీంతో చిదంబరం వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు మూర్తి ప్రకటించారు. చిదంబరం చెప్పిన వివరాలన్నీ గూగుల్లోనే లభ్యమవుతున్నాయన్నారు. చిదంబరం మాట్లాడుతూ.. బ్యాంక్ ఖాతాను తానింతవరకు ఆధార్‌తో లింక్ చేసుకోలేదన్నారు. దేశంలో ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా జరగటంలేదని, ప్రజల్ని ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిళ్లతో బెదరగొడుతున్నారన్నారు. పథకాల అమలు, సబ్సిడీల కోసం ఆధార్ వినియోగానికి తాను వ్యతిరేకం కాదన్నారు. మూర్తి స్పందిస్తూ ఆధార్ వివరాలు దుర్వినియోగం కాకుండా చట్టం చేయాల్సిన బాధ్యత పార్లమెంటుదేనన్నారు. వ్యక్తిగత గోప్యతకు తగిన రక్షణ తీసుకుంటే ఆధార్ కూడా డ్రైవింగ్ లైసెన్సులాగా ఓ గుర్తింపు పత్రంగా ఉంటుందని మూర్తి అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ ఇతర వినోద కార్యక్రమాలకు ఆధార్ కోరాలనడం సరైంది కాదన్నారు. -
కశ్మీర్ కల్లోలానికి కారణం ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేత సంబిత్ పాత్రా ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ‘‘నెహ్రూ నుంచి చిదంబరం దాకా కాంగ్రెస్ నేతలదంతా గజిబిజి వ్యవహారరమే. వాళ్ల హయాంలోనే రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. మనం ఇప్పుడు కశ్మీర్ గురించి ఇలా మాట్లాడుకోవటానికి కూడా కారణం వాళ్లే. అలాంటిది కశ్మీర్ స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని పాత్రా పేర్కొన్నారు. ఇక చిదంబరం ఓ దేశద్రోహిలా మాట్లాడాడని.. ఆయన్ని జైలుకు పంపాల్సిందేనని సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. మరోనేత కమల నేత షానవాజ్ హుస్సేన్ కూడా మాజీ ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కశ్మీర్ తోపాటు యావత్ దేశ ప్రజలు కశ్మీర్ పరిస్థితులకు కారణం పాకిస్థాన్ అని బలంగా నమ్ముతున్నారు. కానీ, చిదంబరంకు ఆ మాత్రం తెలీకపోవటం శోచనీయం. అయినా ఆజాదీ(స్వేచ్ఛ) అంటే స్వయంప్రతిపత్తి మాత్రమే కాదన్న విషయం చిదంబరం గుర్తించాలని హుస్సేన్ సూచించారు. కాగా, కశ్మీర్ ప్రజలకు ఆజాదీ అంటే స్వయం ప్రతిపత్తి అని చిదంబరం శనివారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్కడి ప్రజలతో తాను చర్చలు జరిపినప్పుడు తనకు ఈ విషయం అర్థమైందని, స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలతో మాజీ చర్చల ప్రతినిధి ఎంఎం అన్సారీ ఏకీభవించటం గమనార్హం. -
నిర్మాతలకు ముఖ్య గమనిక
సాక్షి, చెన్నై : మెర్సల్ చిత్ర డైలాగుల వివాదం రాజకీయ దుమారం రేగటం తెలిసిందే. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైద్యుడైన మారన్ పాత్రలో హీరో విజయ్ డైలాగులు చెప్పటం.. వెంటనే వాటిని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనదైన స్పందించారు. ‘‘నిర్మాతలకు ముఖ్యగమనిక. కొత్త చట్టం వచ్చింది. ఇకపై ప్రభుత్వాన్ని.. వాటి పథకాలను పొగుడుతూ చిత్రాలు నిర్మించాలి. లేకపోతే అంతే’’... అంటూ ఆయన శనివారం తన ట్విట్టర్లో తెలిపారు. వారు మెర్సెల్ విషయంలోనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఒకవేళ పరాశక్తి సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని చిదంబరం పేర్కొన్నారు. 1950లో వచ్చిన హిందుత్వ సంప్రదాయాలను విమర్శిస్తూ పరాశక్తి సినిమా అనే సినిమా విడుదలై విజయం సాధించింది. ఇక ఇప్పుడు మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ఇండియా విధానాలను వ్యతిరేకించేలా విజయ్ నోటి నుంచి డైలాగులు రావటం బీజీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. BJP demands deletion of dialogues in 'Mersal'. Imagine the consequences if 'Parasakthi' was released today. — P. Chidambaram (@PChidambaram_IN) October 21, 2017 Notice to film makers: Law is coming, you can only make documentaries praising government's policies. — P. Chidambaram (@PChidambaram_IN) October 21, 2017 -
కశ్మీర్ పరిస్థితులపై కాంగ్రెస్ ఆరా
సాక్షి, శ్రీనగర్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఒక బృందం కశ్మీర్ పరిస్థితులను తెలుసుకునేందుకు శనివారం శ్రీనగర్ చేరుకుంది. మన్మోహన్ బృందం రెండు రోజుల పాటు కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతలు, ఇతర అంశాలపై పరిశీలన చేయనుంది. అలాగే లోయలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం అవుతుంది. జమ్మూ బార్ అసోసియేషన్, ఛాంబర్ ఆప్ కామర్స్లతోనూ చర్చలు జరపనుంది. అంతేకాక యూపీఏ భాగస్వామ్య పక్షం నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు, వివిధ పక్షాల నాయకులు, సామాజిక కార్యకర్తలతో మన్మోహన్ బృందం చర్చలు జరపనుంది. ఈ బృందంలో మన్మోహన్ సింగ్‌తో పాటు మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అంబికా సోని, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ ఉన్నారు. -
సుప్రీం తీర్పు: ఆధార్ కాన్సెప్ట్‌లో లోపం లేదు!
న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత కూడా ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ పథకంలో ఎలాంటి లోపం లేదని, వ్యక్తిగత గోప్యతకు ఇది విరుద్ధం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వమే వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా ఆధార్‌ను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. 'ప్రైవసీ హక్కుకు అనుగుణంగా ఆధార్ పథకాన్ని తీసుకొచ్చాం. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టికల్ 21కి ఇచ్చిన నిర్వచనమే వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘిస్తోంది. ఆధార్ కాన్సెప్ట్‌లో ఎలాంటి లోపమూ లేదు. ఆధార్‌ను ఒక సాధనంగా వాడుకోవాలన్న, దుర్వినియోగం చేయాలన్న మోదీ ప్రభుత్వం ఆలోచనలోనే లోపముంది' అని చిదంబరం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. సుప్రీంకోర్టు నిర్ణయం ఫాసిస్టు శక్తులకు ఎదురుదెబ్బ అని, నిఘా వేసి అణచివేయాలన్న బీజేపీ భావజాలానికి ఇది తిరస్కృతి అని ఆయన ట్వీట్ చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజాబాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయని గతంలో పేర్కొంది. వ్యక్తిగత గోప్యత కూడా రాజ్యంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు) కిందకు వస్తుందని సుప్రీంకోర్టు తాజాగా చరిత్రాత్మక తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆధార్ పథకంపై నీలినీడలు కమ్ముకునే అవకాశముంది. ఆదాయపన్ను, పాన్ కార్డు సహా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం వంటి నిర్ణయాలు ప్రభావితం కానున్నాయి. -
చిదంబరం కుట్రకు బలయ్యాను
భోపాల్: మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీపై, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి పి చిదంబరంలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, చిదంబరం కుట్ర పన్ని తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో చికిత్స పొందుతున్న సాధ్వి.. బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం జ్యుడిషియల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటానని తెలిపారు. '2008లో అక్టోబర్ 10న మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు నన్ను చట్టవిరుద్ధంగా కస్టడీలోకి తీసుకున్నారు. ఏటీఎస్ అధికారులు నన్ను శారీరకంగా, మానసికంగా హింసించారు. చరిత్రలో నా మాదిరిగా ఏ మహిళ కూడా చిత్రహింసలు అనుభవించలేదు. ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరె, ఖాన్విల్కర్, ఇతర అధికారులు నన్ను తీవ్రంగా హింసించారు. ఐదు రోజులు వెంటిలేటర్‌పై ఉన్నాను. నేను ఎలాంటి నేరం చేయలేదు. అప్పటి హోం మంత్రి చిదంబరం కుట్రకు బలయ్యాను. దాదాపు 9 ఏళ్లు జైలులో గడిపాను' అని సాధ్వి అన్నారు.