ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నాయకులు కాంగ్రెస్ మేనిఫెస్టో మీద కీలకవ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో 'వారసత్వ పన్ను' అనే పదం ఎక్కడా లేదని మాజీ ఆర్ధిక మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మేము రూపొందించని ఒక మేనిఫెస్టోను వారే క్రియేట్ చేసుకుని సభల్లో చెప్పుకుంటున్నారని చిదంబరం అన్నారు. ఈ అంశాలపైన మోదీ చర్చించాలని డిమాండ్ చేశారు.
సామ్ పిట్రోడా ప్రస్తావించిన 'వారసత్వ పన్ను' వ్యాఖ్యలపై ప్రధాని పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడతున్న నేపధ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు మేనిఫెస్టోలో లేని అంశాలను గురించి మోదీ ప్రస్తావించడం ఏ మాత్రం సరికాదని చిదంబరం అన్నారు.
మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే చాలా విపరీతాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేస్తామని చిదంబరం హామీ ఇచ్చారు.
The Hon'ble Prime Minister continues to discover and read in the Congress' Manifesto words and sentences that are not there!
He has imagined a Congress' Manifesto written by one of his ghost speech writers.
The phrase 'inheritance tax' does not occur anywhere in the Manifesto.…— P. Chidambaram (@PChidambaram_IN) April 28, 2024
Comments
Please login to add a commentAdd a comment