Lok Sabha Elections 2024
-
మహారాష్ట్రలో 70 లక్షల ఓటర్లను కలిపారు
న్యూఢిల్లీ: గత ఏడాది జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు మహారాష్ట్రలో ఉన్న ఓటర్ల సంఖ్య హఠాత్తుగా నవంబర్ నెల వచ్చేసరికి 70 లక్షలు పెరిగిందని లోక్‌సభలో విపక్షనేత రాహు ల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా సోమవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమగ్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అదే రాష్ట్రంలో జూన్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ ఉన్న ఓటర్ల సంఖ్యకు నవంబర్‌లో ఎలా 70 లక్షల ఓటర్లు పెరుగుతారు?. గత ఐదేళ్లలో పెరిగిన ఓట్ల కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ. మొత్తం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల సంఖ్యకు సమాన స్థాయిలో ఓటర్లను కలిపారు. ఇందులో మతలబు ఏంటో కేంద్ర ఎన్నికల సంఘం తేల్చాలి. ఈసీ దీనిపై స్పష్టతనివ్వాలి’’అని రాహుల్ డిమాండ్‌చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత షిర్డీలోని ఒక భవంతి అడ్రస్‌తో దాదాపు 7,000 ఓట్లను కలిపారని రాహుల్ చెప్పారు. -
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఖర్చు రూ.1,737 కోట్లు
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన వ్యయం రూ. 1,737.68 కోట్లు. ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ ఈ మేరకు నివేదిక సమర్పించింది. ఇందులో సాధారణ పార్టీ ప్రచారం కోసం పెట్టిన ఖర్చు రూ. 884.45 కాగా, అభ్యర్థులకు సంబంధించిన వ్యయం రూ.853.23 కోట్లు. సుమారుగా రూ.611.50 కోట్లను కేవలం మీడియాలో ప్రకటనల కోసమే వెచ్చించింది. ఇందులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్లు, కేబుల్, వెబ్సైట్లు, టీవీ చానెళ్లలో ప్రచారం వంటివి ఉన్నాయి. మరో రూ.55.75 కోట్లను పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు ప్రచార సామాగ్రికి ప్రత్యేకించింది. బహి రంగ సభలు, ర్యాలీల ఏర్పాట్ల కోసం మరో రూ.19.84 కోట్లు ఖర్చు చేసింది. స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చుల కోసం రూ. 168. 92 కోట్లను, ఇతర పార్టీ నేతల ప్రయా ణాలకు రూ.2.53 కోట్లు ఖర్చయింది. సార్వ త్రిక ఎన్ని కలతోపాటే మూడు రాష్ట్రాలు.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు వరుసగా రూ.5,552.57 కోట్లు, రూ.5,552.41 కోట్లు, రూ.5,555.65 కోట్లు వెచ్చించినట్లు బీజేపీ తన నివేదికలో వెల్లడించింది. -
Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు
భారత రాజకీయాల్లో మహిళల పాత్ర అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర మంత్రివర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు అన్ని రాజకీయ పార్టీలలో మహిళా భాగస్వామ్యం మరింతగా పెరుగుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో మహిళల భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2024లో రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలువురు మహిళా నేతలు తామేమటన్నదీ రుజువుచేసుకున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములను పక్కన పెడితే పలువురు మహిళా నేతలు ఈ ఏడాది వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.కంగనా రనౌత్నటి కంగనా రనౌత్ ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై గెలుపొంది, పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఈ విజయంతో కంగనా రనౌత్ తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా 2024లో వార్తల్లో నిలిచారు.మహువా మోయిత్రాపశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మోయిత్రా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ముఖ్యాంశాలలో నిలిచారు. మహువా మోయిత్రా జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.స్వాతి మలివాల్సామాజిక కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలైన స్వాతి మలివాల్ 2024లో వార్తల్లో నిలిచారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెక్రటరీపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దరిమిలా స్వాతి మలివాల్ పేరు హెడ్ లైన్స్ లో నిలిచింది.కొంపెల్ల మాధవీ లతహైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కొంపెల్ల మాధవీ లతకు బీజేపీ టికెట్ ఇచ్చింది. నాలుగుసార్లు హైదరాబాద్ ఎంపీగా ఎన్నికైన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై మాధవీ లత పోటీ చేశారు. ఆమె ఎన్నికల్లో ఓటమిపాలైనా ప్రజల దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో తరచూ కనిపించారు.వసుంధర రాజేరాజస్థాన్లో బీజేపీ విజయం సాధించిన దరిమిలా మహిళా నేత వసుంధరా రాజే సీఎం అవుతారనే వార్తలు వినిపించాయి. అయితే దీనికి భిన్నంగా బీజేపీ నేత భజన్‌లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాలకు కలతచెందిన వసుంధరా రాజే రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు. వసుంధర రాజే తన ప్రసంగాలు, వ్యాఖ్యల కారణంగా ఈ ఏడాది వార్తల్లో నిలిచారు.ప్రియాంకా గాంధీరెండు దశాబ్దాల కిందట గాంధీ - నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయమైన ప్రియాంక గాంధీ 2024లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచి రికార్డుస్థాయి విజయం అందుకున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో సమీప అభ్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ప్రచార సమయంలో ఆమె ప్రజలతో మమేకమవుతూ ‘తానొక ఫైటర్’ని అంటూ చేసిన చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే.. -
జార్ఖండ్ తొలి దశకు సర్వం సిద్ధం
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు. బుధవారం తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. తొలిదశ పోలింగ్ జరుగుతున్న 43 స్థానాల్లో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వ్, ఆరు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపయి సోరెన్ పోటీ చేస్తున్న సెరాయ్‌కెల్లా నియోజకవర్గంలోనూ బుధవారమే పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ జంషెడ్పూర్ ఈస్ట్ నుంచి బరిలో దిగారు.ఇక్కడ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ కోడలు పూర్ణిమా సాహూ పోటీచేస్తున్నారు. జంషెడ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సతీమణి గీత బీజేపీ తరఫున బరిలో దిగారు. ఇక్కడ కాంగ్రెస్ నేత సోనారాం సింకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జంషెడ్పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ నేత, ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీచేస్తున్నారు. ఈయనపై జేడీయూ నేత సరయూరాయ్ బరిలోకి దిగారు. సరయూరాయ్ 2019లో నాటి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌నే ఓడించడం విశేషం. రాంచీలో ఈసారి జేఎంఎం ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మహువా మాఝీని రంగంలోకి దింపింది.ఐదవ జార్ఖండ్ శాసనసభ కాలపరిమితి వచ్చే ఏడాది జనవరి ఐదో తేదీన ముగియనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలుబుధవారమే 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానానికీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఆమెపై ఎల్డీఎఫ్ నుంచి సథ్యాన్ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్ నిలబడ్డారు. ఇక 31 ఎమ్మెల్యే స్థానాల్లో రాజస్తాన్‌లో 7, పశ్చిమబెంగాల్లో 6, అస్సాంలో 5, బిహార్‌లో 4, కర్నాటకలో 3 మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. -
ఎంపీగా ఓడిన కొద్ది వారాలకే సీఎం
శ్రీనగర్: జూన్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లాలో ఓటమిని చవిచూసిన ఒమర్ అబ్దుల్లా కేవలం కొద్ది వారాల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గతంలోనూ ఇలాగే 38 ఏళ్ల వయసులో తొలిసారిగా జమ్మూకశ్మీర్ సీఎంగా పగ్గాలు చేపట్టి రికార్డ్ సృష్టించారు. అత్యంత పిన్న వయసులో సీఎం అయి 2009–14 కాలంలో రాష్ట్రాన్ని పాలించారు.స్కాట్లాండ్లోని స్ట్రాత్క్లీడ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేస్తూ చదువును మధ్యలో వదిలేసిన ఒమర్ 1998లో తొలిసారిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 28 ఏళ్ల వయసులో 12వ లోక్‌సభకు ఎన్నికై అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1999లోనూ జయకేతనం ఎగరేసి పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. గోధ్రా ఉదంతాన్ని తీవ్రంగా నిరసిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జమ్మూకశ్మీర్ శాసనసభ సమరంలో అడుగుపెట్టి చతికిలపడ్డారు. 2002లో నేషనల్ కన్ఫెరెన్స్ కంచుకోట గందేర్బల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనామక ఖాజీ మొహమ్మద్ అఫ్జల్చేతిలో ఓడిపోయారు. తర్వాత 2004లో మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు. తర్వాత జమ్మూకశ్మీర్ అటవీప్రాంతాన్ని శ్రీ అమర్నాథ్ ఆలయబోర్డ్కు 2008లో ఇచ్చేందుకు నాటి అటవీమంత్రిగా అఫ్జల్ తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అసంతృప్తి నెలకొంది. దీన్ని అవకాశంగా మలచుకున్న ఒమర్ ఆందోళనలు లేవనెత్తారు. పార్టీ బలాన్ని పెంచి ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచించి ఎన్సీని అతిపెద్ద పార్టీగా అవతరింపజేశారు. దీంతో 38 ఏళ్ల వయసులో ఒమర్ కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 54 ఏళ్ల ఒమర్ ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అబ్దుల్లాల కుటుంబం నుంచి సీఎం అయిన మూడోవ్యక్తి ఒమర్. గతంలో ఈయన తాతా షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూక్ అబ్దుల్లా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. చదవండి: నేనెందుకు అరెస్టయ్యానో మీకు తెలుసా? -
జమిలి ఇలా రెండు దశలుగా అమలు
కోవింద్ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమరి్పంచింది. ’ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ఏం చెప్పిందంటే... → జమిలి ఎన్నికలను అమల్లోకి తెచ్చేందుకు చట్టపరంగా చెల్లుబాటయ్యే వ్యవస్థను కేంద్రం అభివృద్ధి చేయాలి. → తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. → అనంతరం 100 రోజుల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపేలా వ్యవస్థలను రూపొందించాలి. → సార్వత్రిక ఎన్నికలు జరిగి, కొత్తగా కొలువుదీరే లోక్‌సభ తొలిసారి సమావేశమయ్యే తేదీని ‘అపాయింటెడ్ డే’గా రాష్ట్రపతి నోటిఫై చేయాలి. దాంతో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు నాంది పడుతుంది. → అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడే అన్ని అసెంబ్లీల గడువూ లోక్‌సభతో పాటే ముగుస్తుంది. తదనంతరం లోక్‌సభ, అన్నీ అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. → లోక్‌సభలో ఏ పారీ్టకీ మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడి, లేదా అవిశ్వాస తీర్మానం వంటివి నెగ్గి సభ రద్దయినా మళ్లీ ఎన్నికలు జరపాలి. → అలాంటి సందర్భంలో కొత్త సభ గడువు.. రద్దయిన సభలో మిగిలిన కాలావధి వరకు మాత్రమే ఉంటుంది. → అసెంబ్లీలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే హంగ్ తదితర కారణాలతో ఎన్నికలు జరిగి మధ్యలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీలు ఐదేళ్లు కొనసాగకుండా లోక్‌సభతో పాటే రద్దవుతాయి. → అన్ని ఎన్నికలకూ ఉమ్మడిగా ఒకే ఎలక్టోరల్ రోల్, ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉపయోగించాలి. ఆమోదం ఈజీ కాదు జమిలి ఎన్నికలకు పార్లమెంటు ఆమోదముద్ర పొందడం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుకు అంతా ఈజీ కాబోదు. నవంబర్ గేమ్ అధికార కూటమికి అంత అనుకూలంగా లేదు. జమిలికి సంబంధించి కోవింద్ కమిటీ పలు రాజ్యాంగ సవరణలు సూచించింది. వాటికి ఆమోదం లభించాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అందుకు 543 మంది ఎంపీలున్న లోక్‌సభలో 362 మంది; 245 మంది ఎంపీలుండే రాజ్యసభలో 164 మంది మద్దతు అవసరం. కానీ ఎన్డీయే కూటమికి లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 113 మంది ఎంపీలే అన్నారు. అయితే కోవింద్ కమిటీ ముందు జమిలిని సమరి్థంచిన పారీ్టలకున్న లోక్‌సభ సభ్యుల సంఖ్య 271 మాత్రమే. దాన్ని వ్యతిరేకించిన 15 పారీ్టలకు 205 మంది లోక్‌సభ సభ్యులున్నారు. విపక్ష ఇండియా కూటమికి రాజ్యసభలో 85 మంది సభ్యుల బలముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్‌ను బీజేపీ నిలువరించేనా?
పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ హరియాణాలో ‘ప్రభుత్వ (ప్రజా) వ్యతిరేకత’ను ఎదుర్కొంటోంది. ఫలితంగా కొన్ని బలమైన వర్గాలు పార్టీకి క్రమంగా దూరమౌతున్న సంకేతాలున్నాయి. ఇటీ వలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, పలు సర్వే సంస్థలు రాబట్టిన సమాచార వివ రాలు ఇదే విషయాన్ని నొక్కి చెబు తున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యతను ప్రధాన సర్వే సంస్థలన్నీ చెప్ప కనే చెబుతున్నాయి. కానీ, ప్రజాక్షేత్రం కొన్నిసార్లు గోప్యంగా, గుంభనంగా ఉండటం రాజకీయాల్లో సహజం. క్షేత్ర సమాచారం, సంకేతాలు, మేధావుల విశ్లేషణలు ప్రతికూలంగా ఉన్నా తమ ప్రయత్నాలు మాత్రం మానకుండా పార్టీలు కొనసాగి స్తాయి. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. 2014, 2019 ఎన్నికల్లో పదికి పది లోక్‌సభ స్థానాలు గెలిచిన బీజేపీ, ఈసారి 5 చోట్ల ఓడిపోయింది. చేసిన తప్పులు దిద్దుకునే పనిలో బీజేపీ ఉంటే, అవన్నీ తప్పులనీ సదరు తప్పుడు విధానాలన్నీ తాము అధికారంలోకి రాగానే పక్కన పెడతామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ప్రజలు ఎవరిని నమ్ముతారన్న దాన్ని బట్టే వారి మొగ్గు ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర సర్కార్లపై హరియాణా ప్రజానీ కానికి కోపం ఎందుకు? మహిళా రెజ్లర్ల అవమానాలు, రైతు పంటకు ఎమ్మెస్పీ దక్కకపోవడం, మూడు వ్యవసాయ చట్టాలు పరోక్షంగా తొంగిచూడటం, కోటాల వివాదం, నిరుద్యోగం, అగ్నివీర్... వంటి విధాన వ్యవహార పరమైన అంశాల రీత్యా ప్రజావ్యతిరేకత పెరుగుతూ వస్తున్నట్టు ‘పీపుల్స్ పల్స్’ క్షేత్ర పరిశీలనలో వెల్లడవుతోంది. వీటికి తోడు, ఎలక్ట్రానిక్ పాలనకై బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ, చివరకు అమలు లోపాల వల్ల వికటించింది. రైతుల పేరిట ఈ–అకౌంట్లు తెరిపించి, సబ్సిడీలు, పంట నష్టపరిహారాలు, ఇతర ప్రయోజనాలను నేరుగా వారికే అందేట్టు ఏర్పాటు చేసిన (మేరా ఫసల్ మేరా బయోరా – ఎమ్మెఫ్ఎంబీ) పథకం ఆచరణలో విఫలమైంది. సరైన శిక్షణ లేక, అవగాహన కల్పించక రైతులు దీన్ని వాడక పోగా చీదరించుకున్నారు. అటువంటిదే, ‘పరివార్ పహచాన్ పత్ర్’ (పీపీపీ) కూడా ప్రజలకు పెద్దగా నచ్చలేదు. మరోపక్క, ‘పోర్టల్ సర్కార్...’ అని విమర్శించిన కాంగ్రెస్ నేత హుడా, తాము అధికారంలోకి రాగానే ఇందులో చాలా పద్ధతులు, విధానాలను ఎత్తివేస్తామని చెబుతున్నారు.పంజాబ్‌తో విడిపోయి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హరి యాణా వికాస్ పార్టీ, భారతీయ క్రాంతిదళ్, హరియాణా జన సభ, భారత జాతీయ లోక్‌దళ్, జననాయక్ జనతా పార్టీ... ఇలా పలు ప్రాంతీయ పార్టీలొచ్చాయి. కొన్ని పొత్తులు ఎన్నికల ముందు కుదిరితే, మరి కొన్ని ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు సమయాల్లో కుదిరిన దాఖలాలున్నాయి. ఇప్పుడు హరియాణాలో ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌కు ఎవరి తోనూ పొత్తు లేదు. ఎన్నికల ముందు మాత్రం ఐఎన్ఎల్డీ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో జట్టుకట్టింది. వీరు చూపే ప్రభావం, ఆ యా నియోజకవర్గాల్లో చీల్చే ఓట్లను బట్టి జాట్లతో పాటు దళిత ఓటర్ల మొగ్గులో తేడాలు రావచ్చు. బయటకు కనిపించే దాన్ని బట్టి, అది విపక్షమైన కాంగ్రెస్‌కే దెబ్బగా పరిణమించొచ్చు. ఇటువంటి పరిస్థితే జేజేపీ–ఎఎస్పీ (కాన్షీరావ్‌ు వర్గం) జోడీ వల్ల కూడా ఎదురయ్యే ఆస్కార ముంది. సంఖ్యాపరంగా జనాభాలో జాట్లు (25 శాతం), దళి తులు (20 శాతం) అధికులుగా ఉండటమే ఈ సమీకరణాల ఆలోచనలకు కారణం. 2019 ఎన్నికల్లో తాను గెలిచిన 10 అసెంబ్లీ స్థానాలతో మద్దతు ప్రకటించి, బీజేపీతో సంకీర్ణ సర్కా రులో భాగమైన జేజేపీ ఇప్పుడు వారితో లేదు. అందుకు కారణం లేకపోలేదు. జాటేతర వర్గాల్లో పట్టుపెంచుకోవాలనే కోరిక బీజేపీది. అందుకే, మెజా రిటీ వర్గంగా, అంటే 30 శాతం జనాభాగా ఉన్న ఓబీసీలపై కన్నేసింది. జేజేపీకి రెండు కారణా లున్నాయి. ఒకటి, భాగస్వామిగా ఉన్న తమనే బీజేపీ కకావి కలు చేసిందని కోపం. గెలిచిన 10 మందికి గాను ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే జేజేపీలో మిగిలారు. ప్రజా వ్యతిరేకత బలంగా ఉన్న బీజేపీతో అంటకాగటం వల్లే తమ ఉనికి, నిన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రశ్నార్థకమైందని జేజేపీ ఆందోళన చెందుతోంది. ‘ఇండియా’ కూటమి భాగస్వామి ‘ఆప్’ ఇక్కడ విడిగా పోటీ చేయడం కాంగ్రెస్‌కు నష్టం కలిగిం చేదే! ‘ఎవరికీ మెజారిటీ రాదు, చివరకు మేమే కీలకం అవుతాం’ అని జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఇప్పటికే ప్రకటించారు.దాదాపు నేరుగా తలపడుతున్న ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీల్లో అంతర్గత కుమ్ములాటలున్నాయి. పదేళ్ల పాలకపక్షంగా 2014–19 కాలం కన్నా 2019–24 లోనే పార్టీ సంస్థాగతంగా ఇబ్బందులెదుర్కొంటోంది. మాజీ ముఖ్య మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రధాని మోదీ మనిషి. అయినా... ప్రజా వ్యతిరేకత గుర్తించి, ఇంకోపక్క ఓబీసీల్లో పట్టు పెంచుకునే క్రమంలో, 2024 ఎన్నికల ముందు ఆయన్ని దింపి నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి చేసుకున్నారు. అయినా... ఆశించిన ఓట్లు రాలలేదు. నాటి పరిస్థితిని మించి, ఇప్పుడు ఖట్టర్‌ను కేంద్ర మంత్రిని చేస్తే ఆయన మళ్లీ హరి యాణా ప్రజల ముందుకు వచ్చారు. ఏ మేర వారు ఆదరిస్తారో చూడాలి. 2019 ఎన్నికల్లో లభించిన 28.5 శాతం ఓటు వాటా నుంచి నిన్నటి (2024) ఎన్నికల్లో 43.67 శాతానికి ఓటు వాటా పెంచుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా అంతర్గత లుకలుకలతో రగు లుతోంది. ‘పార్టీ పునరుద్ధరణలో... మేమూ హక్కుదారులమే!’ అనే సంకేతాలతో పోటీ ర్యాలీలు జరుపుతూ, అసెంబ్లీ బరిలో పోటీకి ఆసక్తి కనబరచిన షెల్జాకుమారి, రణ్‌దీప్ సూర్జేవాలా... వంటి వారి అత్యుత్సాహానికి అధిష్టానం అడ్డుకట్ట వేసింది. పార్టీ నాయకత్వ పరంగా, ప్రజాదరణ పరంగా చివరకు భూపీందర్ హుడానే కాంగ్రెస్‌కు రథ సారథిగా నిలుస్తున్నారు. పార్టీ ఎంపీ లెవరూ అసెంబ్లీకి పోటీ చేయబోరని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టత నిచ్చింది. ప్రజల దృష్టిలో బలమైన ప్రాంతీయ పరిక ల్పనలు, ఆశలు, ఆకాంక్షలుండే హరియాణాలో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యరు్ౖథలై ఒకరిపై ఒకరు ఏ మేరకు ఆధిపత్యం సాధిస్తారనేదే రేపటి ఎన్నికల ఫలితం! వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థదిలీప్ రెడ్డి -
సుప్రియపై భార్యను నిలబెట్టి తప్పు చేశా: అజిత్ పవార్
ముంబై: కుటంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను ఇంటి వరకు రానివ్వకూడదని ఆయన అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన భార్యను, సోదరి సుప్రియా సులేకు వ్యతిరేకంగా నెలబెట్టి తప్పు చేశానని పేర్కొన్నారు,.రాష్ట్రవ్యాప్తంగా 'జన్ సమ్మాన్ యాత్ర' చేపట్టిన ఉన్న అజిత్ పవార్ ఒక మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో సునేత్రాను(అజిత్ భార్య) పోటీ చేయించాలనే నిర్ణయం ఎన్సీపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నారు."నేను నా సోదరీమణులందరినీ ప్రేమిస్తాను. రాజకీయాలను ఇంట్లో వరకు రానివ్వకూడదు. నా సోదరిపై సునేత్రను పోటీకి దింపి నేను తప్పు చేశాను. ఇది జరిగి ఉండకూడదు. కానీ పార్లమెంటరీ బోర్డు (ఎన్సీపీ) ఈ నిర్ణయం తీసుకుంది. అది తప్పు అని ఇప్పుడు నేను భావిస్తున్నాను’ అని అజిత్ పవార్ అన్నారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ భార్య సునేత్రపై సుప్రియా సూలే 1.5 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతి స్థానం నుంచి వరుసగా నాలుగోసారి ఆమె గెలుపొందారు. సుప్రియా సూలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె. ఇదిలా ఉండగా ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాతత సునేత్ర పవార్ జూన్ 18న రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
538 నియోజకవర్గాల ఓట్లలో తేడా: ఏడీఆర్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని ఆసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం తెలిపింది. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఈ 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 5,54,596 తక్కువగా ఉన్నాయని వివరించింది. అలాగే 176 నియోజకవర్గాల్లో పొలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 35,093 అదనంగా ఉన్నాయని తెలిపింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఇంకా స్పందించలేదు. -
సొంతగూటి సమస్యలు!
సాగినంత కాలం మనంతటి వాళ్ళు మరొకరు లేరనుకోవడం సహజమే. సాగనప్పుడు కూడా సమైక్యంగా నిలిచి, సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడే సత్తా తెలుస్తుంది. రాజకీయంగా, చట్టసభల్లో సంఖ్యాపరంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ (యూపీ)లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొన్నేళ్ళుగా తిరుగు లేకుండా సాగింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలేవరకు అత్యంత పటిష్ఠంగా కనిపించిన ఆ పార్టీ రాష్ట్రశాఖలో ఒక్కసారిగా ఇప్పుడు లుకలుకలు బయటకొస్తున్నాయి. ఎదురు లేని నేతగా గుర్తింపు తెచ్చుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటలకు మొదటిసారిగా సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. స్వయానా ఉపముఖ్యమంత్రే గొంతు పెంచడం, మంగళవారం ఢిల్లీ వెళ్ళి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడితో సమావేశం కావడం, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా దేశ రాజధానికి చేరి పార్టీ అధ్యక్షుడితో – ప్రధానితో విడివిడిగా భేటీ అవడం... ఈ పరిణామాలన్నీ పార్టీలో అంతా సవ్యంగా లేదని తేటతెల్లం చేస్తున్నాయి. యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు త్వరలో రానున్న వేళ పార్టీలో అందరినీ మళ్ళీ ఒక్క తాటి మీదకు తీసుకురావడం ఇప్పుడు అధిష్ఠానానికి తలనొప్పిగా తయారైంది. లక్నోలో పార్టీ రాష్ట్రశాఖ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆదివారం మాట్లాడుతూ... ఓట్ల బదలీ, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయని యోగి వ్యాఖ్యానించారు. దాంతో ఇప్పుడీ తేనెతుట్టె కదిలింది. తర్వాత డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య ప్రసంగిస్తూ, ‘ప్రభుత్వం కన్నా పార్టీ పెద్దది. పార్టీ కన్నా ఎవరూ పెద్ద కాదు’ అనేశారు. కర్రు కాల్చి వాత పెట్టిన ఈ మాటలతో రచ్చ రాజుకుంది. ఒకప్పుడు మోదీకి శిష్యవారసుడిగా పేరుబడ్డ యోగికి ఇలాంటి పరిస్థితి ఎదురవడం చిత్రమే. అయితే, అది స్వయంకృతమే. ఇటీవలి ఎన్నికల్లో కమలనాథులకు లోక్‌సభలో కావాల్సిన మెజారిటీ రాకపోవడానికి ప్రధాన కారణం – యూపీ నిరాశపరచడమే అన్నది బహిరంగ రహస్యం. 2019లో రాష్ట్రంలోని 80 సీట్లకు గాను 62 గెల్చుకున్న ఆ పార్టీ ఈసారి 33కే పరిమితమైంది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ – కాంగ్రెస్ కూటమి 43 గెలిచి దూసుకొచ్చింది. చివరకు రామమందిరం నిర్మించామంటూ ఊరూవాడా గొప్పలు చెప్పుకున్నా, అయోధ్య నెలకొన్న ఫైజాబాద్‌లోనూ బీజేపీ ఓడిపోయింది. మోదీ సైతం వారణాసిలో గతంలో 4.79 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గితే, ఈసారి 1.52 లక్షల ఓట్ల తేడాతోనే బయటపడ్డారు. ఇవన్నీ యోగి ప్రతిష్ఠను దెబ్బతీసినవే. ఇప్పటి దాకా సాగిన ఆయన ఒంటెద్దుపోకడను ఇరుకునపెట్టినవే.చివరకు మిత్రపక్షాల గొంతులు సైతం పైకి లేస్తున్నాయి. ‘బుల్డోజర్లు ప్రయోగిస్తే ఓట్లెలా వస్తాయి? ఉద్యోగ నియామకాల్లో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల పట్ల దుర్విచక్షణ చూపడం పెద్ద తప్పు! అసలు మొన్న లోక్‌సభ ఎన్నికల్లో మాకు బీజేపీ నుంచి సహకారం లభించనే లేదు’ – ఇలా యూపీలో మిత్రపక్ష నేతలే యోగి సర్కార్‌ను తప్పు పడుతుండడం గమనార్హం. మొత్తం మీద సొంత గూటిలో సమస్యలు పెరుగుతున్నాయనేది వాస్తవం. రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటక ముందే బీజేపీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకొని, కీలక నిర్ణయం తీసుకోవాలంటూ సాక్షాత్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే బాహాటంగా అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పదవి నుంచి యోగిని పక్కకు తప్పించవచ్చనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో మొదలైంది. దేశంలోనే అత్యంత పాపులర్ సీఎంగా నిన్న మొన్నటి సర్వేల్లోనూ ఉన్న మనిషిని పక్కనపెట్టడం పార్టీకి అంత తేలిక కాదు.ఏమంత తెలివైన పనీ కాదు. కాకపోతే, ఇది కచ్చితంగా బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. కీలక మంత్రులతో సహా అంతా గత హయాంకు కొనసాగింపు కేంద్ర సర్కారనే భావన కల్పిస్తున్న ఆ పార్టీ... ఎన్నికల్లో ఎదురుదెబ్బకు కారణాలు లోతుగా అధ్యయనం చేసుకోకపోతే చిక్కే!పెన్షన్ అంశం, పార్టీ కార్యకర్తల్లో పెరిగిన అసంతృప్తి, గత ఆరేళ్ళలో పదే పదే పేపర్ లీకులు, ప్రభుత్వోద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ, అగ్నివీర్ల అంశం, రాజ్‌పుత్‌ల ఆగ్రహం, రాజ్యాంగాన్ని మార్చేస్తామన్న పార్టీ నేతల ప్రకటనలు – ఇలా అనేకం యూపీలో ఎదురుగాలి వీచేలా చేశాయని పార్టీ అంతర్గత నివేదిక. మరోపక్క కరడుగట్టిన బీజేపీ భక్త ఓటరు గణం చెక్కు చెదరకున్నా – దేశాభివృద్ధికి మోదీయే దిక్కని భావించినవారు, లబ్ధిదారులు, మోదీ ఆకర్షితుల్లో తరుగుదల కాషాయధ్వజుల జోరుకు పగ్గాలు వేసినట్టు స్వతంత్ర విశ్లేషకుల మాట. ఎవరి మాట ఏదైనా అంతా సవ్యంగా ఉంది, అసలేమీ జరగలేదన్నట్టుగా ఉష్ట్రపక్షిలా వ్యవహరిస్తే నష్టం బీజేపీకే! ఎన్నికల్లో తలబొప్పి కట్టిందని ముందు గుర్తించాలి. నిత్యం కార్యకర్తలతో చర్చిస్తూ, క్షేత్రస్థాయి స్పందన తీసుకుంటూ, నిరంతరం ఎన్నికల ధోరణిలోనే ఉంటుందని పేరున్న బీజేపీ మళ్ళీ మూలా ల్లోకి వెళ్ళాలి. మోదీ నామమే తారకమంత్రమన్న మూర్ఖత్వం మాని, కళ్ళు తెరిచి ప్రజాక్షేత్రంలోని చేదు నిజాలను విశ్లేషించాలి. పార్టీలో పరస్పర నిందారోపణల్ని మించిన మార్గమేదో అన్వేషించాలి. ముందు రోగం కనిపెడితేనే తర్వాత సరైన మందు కొనిపెట్టగలరు. బీజేపీ అధిష్ఠానం తొందర పడాల్సింది అందుకే. ఇటీవల దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్ని కల్లో 10 స్థానాల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమే గెలిచింది. అధికారపక్ష వ్యతిరేకత కనిపించడమే కాక, బీజేపీ ఓటు షేర్ తగ్గడం ఆ పార్టీకి పారాహుషార్ హెచ్చరికే. యూపీలో తాజా విజయాలతో సమాజ్‌వాదీ – కాంగ్రెస్ కూటమి సమధికోత్సాహంతో అడుగులు వేస్తోంది. ఇప్పుడు గనక బీజేపీ దిద్దుబాటు చర్యలతో, సొంత ఇంటిని చక్కబెట్టుకోకుంటే, ప్రతిపక్షం కీలకమైన యూపీలో మరింత విస్తరిస్తుంది. అప్పుడిక కమలనాథులు ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే! -
యూపీలో బీజేపీకి తగ్గిన సీట్లు.. ఆరు కారణాలు ఇవే!
లక్నో: లోక్ సభ ఎన్నికల్లో తమకు కుంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. గత లోక్ సభ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా సీట్లు తగ్గాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో వైఫల్యానికి గల కారణాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్‌కు నివేదికి సమార్పించింది. ఈసారిగా ఓటమి, సీట్లు తగ్గుదలకు గల కారణాలను అందులో వివరించారు. ఈ నివేదికను అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ముఖ్యంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీట్లు ఆమేథీ, అయోధ్యల్లో మొత్తంగా సుమారు 40 వేల కార్యకర్తలు అభిప్రాయలతో తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆశించి సీట్ల రాకపోవడానికి ఈ నివేదిక ఆరు ప్రధానమైన కారణాలను వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలకు పవర్ లేకపోవటం. ప్రభుత్వం అధికారుల చేతిలో అధికారంలో ఉండటంతో పార్టీ కార్యకర్తల తీవ్రంగా అవమానంగా భావించారు. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయలేకపోయాయని ఓ సీనియర్ నేత పేర్కొన్నారు.రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో సుమారు 15 సార్లు పేపర్ల లీక్ అయ్యాయి. దీన్ని ప్రతిపక్షలు ప్రజల్లో తీసుకువెళ్లటంలో విజయం సాధించారు. దీంతో బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మారు.ప్రభుత్వంలో పెద్దస్థాయిలో పోస్టులను కాంట్రాక్టుల ఉద్యోగులతో భర్తీ చేయిటంలో ప్రతిపక్షాల ఆరోపణలు మరింత బలం చేకూరి ప్రజలు ఆందోళనకు గురయ్యారు.కూర్మీ, మౌర్య సామాజిక వర్గాలు ఓట్లు ఈసారి బీజేపీ పడలేదు. దీంతో పాటు దళిత ఓటర్లను కూడా బీజేపీ తమవైపు తిప్పుకోలేకపోయింది. బీఎస్పీతో ఓటు బ్యాంక్ ఉన్న దళితులను తమవైపుకోని కాంగ్రెస్ ఓటుషేర్‌ను పెంచుకుంది.ఎన్నికలకు ముందుగానే బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కార్యకర్తలు సైతం ఎన్నికల ప్రచారంలో నిర్లక్ష్యం వహించారు. పలు దశల్లో పోలింగ్ జరగటంతో కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గుతూ వచ్చింది.రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర నాయకులే వ్యాఖ్యలు చేయటంతో వాటిని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. బీజేపీ నేతలు వ్యాఖ్యలను ప్రజలు సీరియస్‌గా తీసుకోని ప్రతిపక్షాలవైపు మొగ్గుచూపారు.బీజేపీ 370 సీట్ల నినాదంతో ఎన్నికల బరిలోకి దిగగా.. 240 సీట్లకు పరిమితమైంది. దీంతో మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ అధికారంలో వచ్చి మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లకు గతంలో 62 సీట్ల నుంచి 33 స్థానాలుకు తగ్గిపోయింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఏకంగా 37 సీట్లను గెలుచుకుంది. దీనిపై ఇటీవల యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరీ, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి పార్టీ ఓటమిపై చర్చలు జరిపారు. -
ఎన్నికల్లో ఓటమి.. బీజేపీ నేత కొత్త నినాదం!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన మైనార్టీ విభాగాన్ని రద్దు చేయాలని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన సబ్కా సాత్ సబ్కా వికాశ్ నినాదం చేయవద్దని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోల్‌కతాలో జరిగిన రాష్ట్ర బీజేపీ ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఒక కొత్త నినాదాన్ని చేశారు. జో హమారే సాత్, హమ్ ఉన్కే సాత్ ( ఎవరైతే మాతో ఉంటారో.. వారితో మేము ఉంటాం)అని అన్నారు. ‘జాతీయవాద ముస్లీంల గురించి నేను మాట్లాడితే.. మీరంతా సబ్కా సాత్, సబ్‌గా వికాస్ అని నినాదాలు చేసేవారు. కానీ ఇక నుంచి ఆ నినాదాన్ని నేను పలకను. ఇప్పుడు నేను మరో నినాదాన్ని పలకుతాను. అదేంటి అంటే.. ‘జో హమారే సాత్, హమ్ ఉన్కే సాత్’. మీరు కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్ అనటం మానేయండి. ఇక నుంచి మనకు మైనార్టీ మోర్చా అవసరం లేదు’అని అన్నారు. లోక్ సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనివాళ్ల కోసం ఓ పోర్టల్‌ను సువేందు అధికారి ప్రారంభించారు.మరోవైపు.. ‘సుమారు 50 లక్షల మంది హిందూ ఓటర్లను లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయటానికి అనుమతించలేదు. అదేవిధంగా ఇటీవల జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలో సైతం సుమారు 2 లక్షల హిందూ ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించలేదు’ అని ‘ఎక్స్’లో తెలిపారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో ఎంపీ స్థానాలు గెలచుకోలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 12 సీట్లకే పరిమితమైంది. ఇటీవల జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో మొత్తం అధికారం టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికల్లో తమ బీజేపీ గెలుపునుకు ముస్లీం ఓటు బ్యాంక్ అడ్డంకిగా మారిందని బీజేపీ నేత సువేందు అధికారి భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక.. కులం, మతాలకు అతీతంగా భారతీయులంతా అభివృద్ధి చెందాలని ప్రధాని మోదీ 2014లో ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ నినాదం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు ముస్లిం ఓట్లు ఆశించినంత పడకపోవటంపై సువేందు అధికారి అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. -
లోకల్ టు స్టేట్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతో మొదలు పెట్టి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యేలా స్వల్ప, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు (నెల నుంచి 1500 రోజులకు) సిద్ధం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. తెలంగాణలో ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నందున ఈ సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని సంస్థాగతంగా బలపడాలని తీర్మానించింది.అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 14% ఓటింగ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో 35 శాతానికి పెంచుకున్నందున, 2028 శాసనసభ ఎన్నికల్లో పార్టీ అధికారానికి వచ్చేందుకు అనుకూల పరిస్థితులున్నాయని అంచనా వేసింది. ఏడునెలల కాంగ్రెస్ పాలనలో ప్రధాన హామీలేవీ అమలుకు నోచుకోకపోవడంతో.. రైతులు, మహిళలు, యువత, ఓబీసీలు, ఇలా అన్ని వర్గాల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరుగుతోందని అంచనా వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవకపోవడం ద్వారా బీఆర్ఎస్ బలహీనపడినట్టుగా బీజేపీ భావిస్తోంది. ఈ పరిస్థితులను ఉపయోగించు కుని తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని తీర్మానించింది. త్వరలో చింతన్బైఠక్లు అధికార కాంగ్రెస్‌కు బీజేపీ రాజకీయంగా ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు పార్టీ నుంచి పెద్దసంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకునేలా కృషి చేయాలని పిలుపునిచి్చంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నాయకులు కృషి చేయాలని నిర్ణయించింది. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమయ్యేందుకు వెంటనే గ్రామాలకు తరలి పని ప్రారంభించాలని నిర్ణయించింది.పారీ్టపరంగా వ్యూహాలను పటిష్టంగా అమలుచేసేందుకు తొందరలోనే 17 ఎంపీ నియోజకవర్గాల వారీగా లేదా 32 జిల్లాలను 4 ప్రాంతాలుగా విడదీసి ‘చింతన్ బైఠక్’(మేథోమథన శిబిరాలు) నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం శంషాబాద్‌లోని మల్లికా గార్డెన్స్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో చేపట్టాల్సిన రూట్‌మ్యాప్‌పై చర్చ సాగింది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ .జెండా ఆవిష్కరించగా, ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు.పీఎం మోదీని అభినందిస్తూ ఘన విజయం అందించిన తెలంగాణ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర హోం శాఖ సహాయ బండి సంజయ్ తీర్మానం ప్రవేశ పెట్టగా, జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ దానిని బలపరిచారు. సమావేశంలో ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, గోడెం నగేశ్, ఎమ్మెల్యే లు టి.రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకే‹Ùరెడ్డి, డా.పాల్వాయి హరీ‹Ùబాబు, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బంగారు శ్రుతి, ఎస్సీమోర్చా జాతీయకార్యదర్శి ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు. హామీలన్నింటినీ వెంటనే అమలుచేయాలికాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ తీర్మానం ఆమోదించారు. సమావేశంలో ఏలెటీ మహేశ్వర్ రెడ్డి రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎంపీలు ఈటల, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు దానిని బలపరుస్తూ మాట్లాడారు.రాజకీయ తీర్మానంలో ముఖ్యాంశాలు ⇒ వెంటనే రైతు రుణమాఫీని అమలు చేయాలి. ⇒ రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12వేలు వెంటనే విడుదల చేయాలి ⇒ గ్రామపంచాయతీల్లో పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలి ⇒ గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి ⇒ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారంపై సీబీఐకి అప్పజెప్పాలి ⇒ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా సీపీఐ కి అప్పజెప్పాలి⇒ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న శక్తులను గుర్తించి, శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి ⇒ విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై జ్యుడీíÙయల్ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేయాలి ⇒ గొర్రెల స్కాం మీద పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి ⇒ ల్యాండ్, శాండ్, గ్రానైట్, లిక్కర్, డ్రగ్స్ మాఫియాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి ⇒ ధాన్యం కుంభకోణంపై విచారణ చేయాలి ⇒ వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలి ⇒ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలి ⇒ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి.. ధరణి ప్రక్షాళన చేపట్టాలి. -
ముగిసిన కాంగ్రెస్ ‘పోస్టుమార్టమ్’
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు అంచనా వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన త్రిసభ్యకమిటీ తొలిదఫా సమీక్షలు పూర్తయ్యాయి. వాస్తవానికి, గురు, శుక్ర, శనివారాల్లో ఈ పోస్టుమార్టమ్ జరగాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల రెండురోజులకే కుదించారు. కుటుంబసభ్యులు మరణించడంతో కమిటీకి నేతృత్వం వహించిన రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ పీజే.కురియన్ గురువారం రాత్రే కేరళ వెళ్లిపోయారు. దీంతో గురువారం సమీక్షల్లో పాల్గొన్న అసోం ఎమ్మెల్యే రకీబుల్ హసన్తోపాటు పంజాబ్ ఎమ్మెల్యే పర్గత్‌సింగ్‌లు శుక్రవారం గాం«దీభవన్ వేదికగా కాంగ్రెస్నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.తొలిరోజు గురు వారం మొత్తం 16 మంది అభిప్రాయాలు తీసుకున్న కురియన్ కమిటీ రెండో రోజు శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో సమావేశమై వారి నుంచి లోక్‌సభ ఎన్నికల ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. ఉమ్మడిజిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్చార్జులతో సమావేశమైంది. పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్‌పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, శ్రీగణేశ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ తదితరులు కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు.అయితే, ఎవరైనా తమ అభిప్రాయాలను ఫోన్లో అయినా తెలియజేయవచ్చంటూ కమిటీ సభ్యులు ఫోన్‌నంబర్లు ఇచ్చి వెళ్లారని, లిఖితపూర్వకంగా అయినా తమకు పంపొచ్చని నేతలకు చెప్పారని సమాచారం. శుక్రవారం కూడా కురియన్ కమిటీకి గురువారం వచి్చన తరహాలోనే ఫీడ్‌బ్యాక్ వచి్చందని, పోస్టుమార్టమ్‌కు హాజరైన పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు, వ్యక్తిగత ఆలోచనలను రకీబుల్హసన్, పర్గత్సింగ్లకు వివరించారు.కోదాడ ఎమ్మెల్యేఉత్తమ్పద్మావతి రెడ్డి తన నియోజకవర్గంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలను పోలింగ్ బూత్‌ల వారీగా తెచ్చి కమిటీకి సమర్పించారు. కోదాడతోపాటు మంత్రి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీలు ఎలా సాధ్యమయ్యాయని కమిటీ సభ్యులు ప్రశ్నించగా, లోక్‌సభ ఎన్నికల్లో తాము శ్రమించిన తీరును పద్మావతి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆమెను అభినందించారు. ⇒ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, దీనివల్ల రాష్ట్ర రాజధాని చుట్టూ అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా సాగడం లేదని, జీహెచ్ఎంసీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ జిల్లాలకు చెందిన ఎవరికైనా మంత్రిపదవి ఇవ్వాలని కోరారు. ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదని, అయితే, తమ జిల్లాలకు మంత్రిపదవి ఇవ్వాలని కమిటీకి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు కూడా. ⇒ మెదక్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఓ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మిగిలిన అన్నిచోట్ల మంచిఓట్లు వచి్చనా సదరు ఎమ్మెల్యే దూకుడు కారణంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు తగ్గాయని చెప్పారు. ⇒ కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఎన్నికలకు 16 రోజుల ముందే అభ్యర్థిని ప్రకటించారని, అయినా తమ శక్తివంచన లేకుండా వెల్చాల విజయం కోసం కృషి చేశామని చెప్పుకొచ్చారు. బీజేపీ నాలుగు నెలల ముందే ఎన్నికల ప్రచారం ప్రారం భించిందని, మోదీ సభలతో పాటు అయోధ్యఅక్షింతలు ఆ పార్టీకి కలసి వచ్చా యని చెప్పినట్టు సమాచారం. ⇒ నల్లగొండజిల్లా నేతలతో జరిగిన సమావేశంలో నల్లగొండ కాంగ్రెస్ కంచుకోట అని, పార్టీకి అన్ని రకాలుగా కలసిరావడంతో మంచి మెజారిటీలు సాధ్యమయ్యాయని కమిటీకి తెలిపారు. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి గెలుస్తాడనే టాక్ వచ్చినా తాను ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని మార్చివేశామని, మంచి మెజారిటీతో పార్టీ అభ్యరి్థని గెలిపించుకున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమిటీకి వెల్లడించారు. ⇒ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచి్చంది కాబట్టే బీజేపీకి సీట్లు పెరిగాయని నిజామాబాద్ జిల్లా నేతలు కమిటీకి స్పష్టం చేశారు. కామారెడ్డిలో బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో 60వేల ఓట్లు వస్తే, లోక్‌సభ ఎన్నికల్లో అది 20వేలకు తగ్గిపోయిందని చెప్పారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కోసం బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ప్రకటించారని ఈ సమావేశంలో షబ్బీర్‌అలీ కమిటీకి చెప్పినట్టు సమాచారం. అందరి అభిప్రాయాలను విన్న కమిటీ నాయకుల అభిప్రాయాలను క్రోడీకరించి ఈనెల 21న అధిష్టానానికి తమ నివేదిక ఇవ్వనుంది. ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు రకీబుల్ హుస్సేన్ మీడియాకు వెల్లడించారు. -
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన మేర సీట్లు రాలేదని ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కొన్ని స్థానాల్లో మాత్రం ఎమ్మెల్యేల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని, ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా కలసి రాలేదని చెప్పారు. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై పోస్టుమార్టం నిర్వహించేందుకు హైకమాండ్ పంపిన కురియన్ కమిటీకి తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కురియన్‌తోపాటు అస్సాం ఎమ్మెల్యే రకీబుల్ హుస్సేన్ గురువారం గాంధీభవన్‌కు వచ్చారు. మూడు రోజుల షెడ్యూల్లో భాగంగా తొలి రోజు ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులతో వీరిరువురూ భేటీ అయ్యారు. 17 మంది అభ్యర్థులకుగాను 16 మంది హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న కారణంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కమిటీ ముందుకు రాలేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫహీం, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తదితరులు కూడా కురియన్ కమిటీని మర్యాదపూర్వకంగా కలిశారు. మొత్తం సీన్ మారిపోయింది... తొలి రోజు షెడ్యూల్లో భాగంగా ఉదయమే గాం«దీభవన్‌లో కురియన్ కమిటీ ఎంపీ అభ్యర్థులతో సమావేశమైంది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లురవి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, ఓడిపోయిన అభ్యర్థులు ఆత్రం సుగుణ, దానం నాగేందర్, సఫీవుల్లా, సునీతా మహేందర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, వెల్చాల రాజేందర్రావు, చల్లా వంశీచందర్‌రెడ్డి, నీలం మధు, జీవన్‌రెడ్డిలు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జరిగిందని, కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా జరిగిందని వెల్లడించినట్టు తెలిసింది. ‘అసెంబ్లీ ఎన్నికల సమీకరణలు లోక్‌సభ ఎన్నికల్లో లేవు. పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. బీఆర్ఎస్ బాహాటంగానే బీజేపీకి మద్దతిచ్చింది. తాము గెలవకపోయినా కాంగ్రెస్ గెలవొద్దని, బీజేపీని గెలిపించడం ద్వారా తమ రాజకీయ ప్రయోజనాలను రక్షించుకోవాలనేది బీఆర్ఎస్ ఉద్దేశం’అని వెల్లడించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న కురియన్ బీజేపీ అంటే బీఆర్ఎస్కు కోపం ఉండాలి కదా... ఓట్లు వేసి సహకరించుకునే సాన్నిహిత్యం ఆ రెండు పార్టీల మధ్య ఉందా అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని మొదటి నుంచీ తెలంగాణ ప్రజల్లో అభిప్రాయం ఉండేదని, రాజకీయ క్షేత్రంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య వైరుధ్యం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొంత ఉండేదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం మారిపోయిందని చెప్పారు. కేసుల్లో ఇరుక్కుపోయిన బీఆర్ఎస్ నేతలు బీజేపీకి సహకరించారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు సహకరించలేదు... కొందరు ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం తమకు ఎన్నికల్లో సహకరించని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల పేర్లను కూడా కురియన్ కమిటీకి చెప్పారని తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయామని, అక్కడ బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసిన డి.కె.అరుణ కాంగ్రెస్ నుంచి ఎదిగారని, దీంతో చాలా స్వల్పంగా అయినా కాంగ్రెస్ కేడర్ ఆమెకు సహకరించిందని, ఈ నియోజకవర్గంలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా సరిగా పనిచేయలేదనే చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే మెదక్ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో సహకారం అందలేన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇక, ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, వేణుగోపాలాచారి లాంటి నేతల చేరికలు పార్టీకి కలసి రాలేదని, వాళ్ల ఓట్లు కూడా పడలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇవ్వడం కూడా కొంత ప్రభావం చూపిందని చెప్పినట్లు సమాచారం. కరీంనగర్ లాంటి స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం చివరి నిమిషం వరకు ఆగకుండా ఉండాల్సిందనే అభిప్రాయాలు కూడా వెల్లడైనట్లు తెలిసింది. కాగా, శుక్రవారం కమిటీ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జులు, పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ భేటీ కానుంది. వారి అంతర్గత పొత్తుతోనే: ఎంపీ చామల కిరణ్ కురియన్ కమిటీతో భేటీ అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను కురియన్ కమిటీకి వివరించామని చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 12–13 స్థానాలు వచ్చేవని, బీజేపీ–బీఆర్ఎస్ల అంతర్గత పొత్తు కారణంగానే ఎనిమిది సీట్లకు పడిపోయామని చెప్పారు. కొన్ని స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల స్థాయి కంటే తక్కువ ఓట్లను పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పొందిందని, పార్లమెంటు ఎన్నికల నాటికి సమీకరణాలు మారిపోయాయని చెప్పారు. -
ఫలితాలపై పోస్ట్‌మార్టమ్.. గాంధీభవన్‌లో కురియన్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో ఏఐసీసీ ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడుతున్న కురియన్ కమిటీ.. ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాలు సమయం కేటాయించింది. తమ వాదన సైతం కురియన్ కమిటీకి వినిపిస్తామంటున్నారు టికెట్ రాని నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిజనిర్ధారణ కమిటీలు వేసింది. కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో కురియన్ కమిటీ తిరగనుంది.పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందారు? పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల్లో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? లోపాలు ఏంటి? వంటి అంశాలపై కురియన్ కమిటీ ఆరా తీస్తోంది. ఓటమికి కారణాలపై వివరాలను కురియన్ కమిటీ అభ్యర్థుల నుంచి సేకరిస్తోంది. -
రాజ్యాంగ రక్షణే అత్యవసరం
పదవిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. కానీ ఎమర్జెన్సీ కంటే రాజ్యాంగపు తిరగరాత మరింత ప్రమాదకరమైనది. 2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి.18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘అబ్ కీ బార్ 400 పార్’ అని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని నినాదమిచ్చారు. దాని తరువాత ఆయన మోదీ గ్యారెంటీ నినాదమిచ్చారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలో పార్టీని పక్కకు పెట్టి వ్యక్తి గ్యారెంటీ మ్యానిఫెస్టో రాయించారు. ఇది మామూలు విషయం కాదు. ఆ వెనువెంటనే ఆరెస్సెస్, బీజేపీ లీడర్లు కొంతమంది 400 సీట్లు రాగానే దేశ రాజ్యాంగాన్ని తిరగ రాస్తామని ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా తిరగరాత సిద్ధాంతం ఉన్న ఆరెస్సెస్ నాయకులెవరు ఇటువంటి ప్రకటనలను ఖండించలేదు. ఆనాటికి గానీ, ఇప్పుడు గానీ ఎన్డీఏలో ఉన్న పార్టీలవారికి... అనుకున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రక్రియను ఎదుర్కొనే శక్తి లేదు. వారికి అధికారం తప్ప బలమైన సిద్ధాంతం కూడా లేదు. వాళ్ళ పార్టీ అధికారం తప్ప దేశం ఎటుపోయినా ఫర్వాలేదు. ఈ స్థితిలో ఇండియా కూటమి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశాన్ని చేసింది. ఎన్నికల తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని, అంబేడ్కర్ బొమ్మనీ బహిరంగ సభల్లో చూపిస్తూ తిరిగారు. ఎన్నికల పోరాటమంతా రాజ్యాంగం చుట్టూ తిరిగే స్థితి మొదటిసారి వచ్చింది. ప్రపంచ పత్రికలు కూడా ఒక దేశం రాజ్యాంగ రక్షణ అంశం ఇంత పెద్దఎత్తున ఏ దేశ ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం కాలేదని రాశాయి. టీవీలు, సోషల్ మీడియా మాట్లాడాయి. ఐతే ఎన్నికల సమయంలో ఒక మోదీ తప్ప ఆరెస్సెస్ ప్రధాన నాయకుడైన మోహన్ భాగవత్ సహా రాజ్యంగాన్ని తిరగరాసే ఆలోచన లేదని చెప్పలేదు. మోదీ మాత్రం మేమే ఈ రాజ్యాంగ రక్షకులమని కొన్ని సభల్లో మాట్లాడారు. కానీ ఆరెస్సెస్, బీజేపీ నాయకులంతా సైలెంట్‌గా ఉన్నారు. దానికి ప్రధాన కారణమేమిటంటే, ఈ రాజ్యాంగం పరిధిలో పార్లమెంట్, ఇతర సంస్థలపై సంపూర్ణ పట్టు సాధించి తరువాత ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది వారి ఆలోచన. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ఇప్పుడున్న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండే దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మనుధర్మ శాస్త్ర లక్షణాలు ఏ మాత్రం లేవనేది వారి ప్రధాన వాదన. వాళ్ళ అవగాహనలో భారతీయ చట్ట సంస్కృతి అంటే మనుధర్మ శాస్త్ర చట్ట సంస్కృతి. దాంట్లో ప్రధానమైన వర్ణ–కుల వ్యవస్థనీ, స్త్రీ అసమాన జీవితాన్నీ కాపాడటం. సమాజ అసమానతలు భారతీయ సంస్కృతిలో భాగం అని వారి భావన. అదృష్టవశాత్తు బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడం, దానికి రాజ్యాంగ రక్షణ డిబేట్ దోహదపడటం జరిగింది. అయితే రాజ్యాంగ పర చర్చ ప్రజల జీవనంలోకి చొచ్చుకుని పోకుండా ఉండటానికి ఆరెస్సెస్, బీజేపీ ఒక ఎత్తుగడ వేశాయి. అది 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమస్యను ముందుకు తేవడం! ఎమర్జెన్సీలో చాలా అట్రాసిటీలు, అరాచకాలు జరిగిన మాట నిజమే కానీ అది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రమాద ఘట్టం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసి ఎంతోమంది యువకులు ఎమర్జెన్సీలో ఎదురు కాల్పుల పేరిట చంపబడ్డారు. ఐతే రాజ్యాంగానికి వచ్చేవరకు ఆ కాలంలో చేసిన రెండు సవరణలు: ప్రియాంబుల్‌లో ‘సోషలిజం’ అనే పదం చేర్చడం; రెండవది ఫండమెంటల్ రైట్స్‌కు కొంత అఘాతం కలిగించే ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడం. ఆరెస్సెస్, బీజేపీ సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించాయి. కానీ ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడాన్ని బలపర్చాయి. బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ నుంచి విడగొట్టి, పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించినందుకు ఇందిరాగాంధీని దుర్గాదేవిగా వర్ణించిన వారిలో ఆరెస్సెస్, బీజేపీ వారు ఉన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు వంటి ఆమె నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ మూడు సిద్ధాంతకర మార్పులు సోషలిస్టు సిద్ధాంత ప్రభావంతో ఇందిరాగాంధీ చేస్తున్నారని వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ వంటి నాయకులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు... శ్రమ జీవులకు, ఉత్పత్తి కులాలకు మేలు చేశాయి. ఈ క్రమంలో ఆమె భూ సంస్కరణల చట్టం చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. 1972లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బలమైన భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 27 ఎకరాల తరి, 57 ఎకరాల ఖుశ్కి భూమి కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదని చట్టం తెచ్చింది ఆమెనే. ఆ చట్టాన్ని ఎమర్జెన్సీలో భూస్వాములపై ఒత్తిడి తెచ్చి కొంత అమలు చేశారు. నేను 1980లో ఈ చట్టం అమలుపై ఎంఫిల్ «థీసిస్ కోసం చాలా గ్రామాల్లో ల్యాండ్ రిఫామ్ ఎలా జరిగిందో పరిశీలించాను. భూస్వాములు భూములను బినామీ పేర్లమీద మార్చి చాలావరకు కాపాడుకున్నప్పటికీ ఎమర్జెన్సీలో కొంత భూమి పంచబడింది. ఆ కాలంలో తన పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిర అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. నిజమే. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. తర్వాత వాళ్లు పౌరహక్కుల రక్షణ జోలికి పోలేదు. కనుక ఎమర్జెన్సీ అనేది రెండువైపుల పదునున్న కత్తిలా పని చేసింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ ఈ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలనుకున్న ఆలోచనలో శూద్రుల, దళితుల, ఆదివాసుల పక్షపాత ఆలోచనలు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. వాళ్లు అనుకున్నట్టు నిజంగానే 400 సీట్లు వచ్చి ఉంటే వాళ్లు కొత్త కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీని స్థాపిస్తే దాంట్లో ఎటువంటి మేధావి వర్గం ఉండేవారు? ఆ రాజ్యాంగ పరిషత్ కుల అసమానతలను, అంటరానితనాన్ని, బీదరికాన్ని తొలగించే గట్టి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉండేదా! నిజానికి బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుపై చర్చ జరుగుతున్నప్పుడు ఆరెస్సెస్, బీజేపీ నాయకుల వాదనలు; రాజరిక వ్యవస్థ పట్ల జమీందారీ హక్కుల పట్ల వాళ్లు ఎంత అనుకూలంగా ఉన్నారో తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌లో ఉన్న ‘సోషలిజం’ అనే పదాన్ని వాళ్లు తొలగించాలనుకునేది భారతీయ కష్ట జీవుల పక్షాన ఉండటానికా? పెట్టుబడిదారుల పక్షాన ఉండటానికా?2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఐతే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. చంద్రబాబు, నితీష్‌కుమార్ వంటి సిద్ధాంత రహిత ప్రాంతీయ నాయకులు కూడా ఈ భవిష్యత్ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడలేరు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి. ఓటు రాజ్యాంగ రక్షణ ఆయుధాలలో కీలకమైంది. ఐతే దాన్ని ప్రజలు, ముఖ్యంగా యువకులు నిరంతరం ఇప్పుడున్న రాజ్యాంగంతో ముడేసి చూడాలి. ఈ ఎన్నికల్లో రాజ్యంగం పట్ల కలిగిన కొత్త చైతన్యాన్ని తగ్గించేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ఎమర్జెన్సీ అంశాన్ని ముందు పెట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. జూన్ 25న వి.పి. సింగ్ జయంతి సభ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో జరిగింది. మాట్లాడటానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అందులోనే చాలా పెద్ద హాలులో రైట్‌వింగ్ ఆలోచనాపరులు ఎమర్జెన్సీలో జె.పి. మూమెంట్‌పై మీటింగ్ పెట్టారు. ఎందుకో తెలుసా? రాజ్యాంగ మార్పు కంటే ఎమర్జెన్సీ ప్రమాదకరమని చెప్పడానికి!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
వాళ్లు ఓటు వేస్తే.. 40 సీట్లు గెలిచేవాళ్లం: సీఎం ఏక్నాథ్ షిండే
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో తమ మహాయుతి కూటమికి సీట్లు తగ్గటంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సీఎం ఎక్నాథ్ షిండే పాల్గొని మాట్లాడారు. ‘‘లోక్‌సభ పోలింగ్ రోజు మహారాష్ట్రలో మా కుటమికి అనుకూలంగా ఓటువేసే సంప్రదాయ ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు రాకుండా హాలీడే తీసుకున్నారు. అందుకే మహారాష్ట్రలో మహాయుతి కుటమికి సీట్లు తగ్గాయి. దేశంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉండటం వల్ల ఎన్డీయే కూటమి 400 సీట్ల మార్క్‌ను దాటలేకపోయింది. ఇలా జరగకపోతే ఎన్డీయే 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకుని ఉండేది. ఈ నష్టం మమ్మల్ని భవిష్యత్తులో మరింత వ్యూహాత్మకంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. పోలింగ్‌లో 60 శాతం ఓటర్లు పాల్గొని ఉంటే మేము కచ్చితంగా 40 సీట్లు గెలిచేవాళ్లం. లోక్‌సభ ఎన్నికల అనుభవాన్ని సమీక్షించుకుంటున్నాం’’ అని అన్నారు. అదే ర్యాలీలో పాల్గొన్న డిప్యూటీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడారు. సీఎం ఎక్నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కూటమి వ్యాప్తి చేసిన అసత్య ప్రచారాన్ని తమ కూటమి నేతలు పట్టించుకోలేదని అన్నారు. దానివల్ల కూడా తమకు సీట్లు తగ్గినట్లు అభిప్రాయపడ్డారు.మొత్తం 48 సీట్లలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 30 సీట్లు గెలుచుకుంది. ఇక.. మహాయుతిలోని బీజేపీ 9, శివసేన(షిండే) 7 సీట్లు మాత్రమే సాధించిగా.. ఎన్సీపీ ఖాతా కూడా తెరవలేదు. -
‘బీజేపీ 400 సీట్ల నినాదం ఫలించింది! కానీ మనదేశంలో కాదు’
ఢిల్లీ: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు ఏకంగా 412 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. దీనిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ బీజేపీపై విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన నినాదం.. మొత్తానికి ఇప్పడు నిజమైందని ఎద్దేవా చేశారు. బీజేపీ ‘అబ్ కీ బార్, 400 పార్’సాధ్యం అయింది. కానీ, అది భారత్‌లో కాదు. మరో దేశంలో సాధ్యం అయిందని ‘ఎక్స్’ వేదికగా సెటైర్లు వేశారు.Finally “ab ki baar 400 paar” happened — but in another country! pic.twitter.com/17CpIp9QRl— Shashi Tharoor (@ShashiTharoor) July 5, 2024 ‘మొత్తానికి బీజేపీ చేసిన ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదం సాధ్యం అయింది. కానీ, అది మరో దేశంలో!’ అని శశీ థరూర్ సెటైర్ వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసింది. తాము తప్పకుండా 400 సీట్లు గెలుస్తామని ప్రధాని మోదీతో సహా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ‘అబ్ కీ బార్ 400 పార్’ అనే నినాదాన్ని హోరెత్తించారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా బీజేపీ సొంతంగా 240 సీట్లు, ఎన్డీయే కూటమి 293 స్థానాలకే పరిమితమైంది. మిత్రపక్షాల సాయంతో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఇక.. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో గెలుపొందగా.. ఇండియా కూటమి 234 సీట్లను కైవసం చేసుకుంది.ఇక.. బ్రిటన్‌లో తాజాగా అధికారాన్ని చేపట్టిన లేబర్ పార్టీ 2019లో 211 సీట్లు గెలవగా.. ఈసారి 412 సీట్లను గెలుచుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.చదవండి: తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య -
Sonia Gandhi: ఫలితాలు ప్రధానికి నైతిక ఓటమే
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గిస్తూ తాజా లోక్‌సభ ఎన్నికల్లో వెలువడిన ప్రజాతీర్పు ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ, నైతిక ఓటమికి నిదర్శనమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఒక జాతీయ పత్రికలో రాసిన సంపాదకీయంలో మోదీ, ఎన్డీఏ ప్రభుత్వంపై సోనియా విమర్శలు సంధించారు. ‘‘ ఎన్నికల ప్రచారంవేళ తానొక దైవాంశ సంభూతుడిని అన్నట్లు స్వయంగా ప్రకటించుకుని 400 సీట్ల ఖాయమని భ్రమలో గడిపిన ప్రధాని మోదీకి జూన్ 4న వెల్లడైన ఫలితాలు ప్రతికూల సంకేతాలు చూపించాయి. విభజన, విద్వేష రాజకీయాలు, మోదీ పరిపాలనా విధానాలను ప్రజలు తిరస్కరిస్తున్నట్లు నాటి ఫలితాల్లో వెల్లడైంది. ఏకాభిప్రాయం ఉండాలని మోదీ వల్లెవేస్తారుగానీ ఆచరణలో అవేం ఉండవు. స్పీకర్ ఎన్నికలు ఇందుకు తార్కాణం. డెప్యూటీ స్పీకర్ పదవి విషయంలో విపక్షాల సహేతుక విజ్ఞాపనను పట్టించుకుంటే స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రభుత్వానికి మేం సంపూర్ణ మద్దతు ఇస్తామని ‘ఇండియా’ కూటమి స్పష్టంచేసింది. అయినాసరే మోదీ వైఖరి మారలేదు. 17వ లోక్‌సభలోనూ డెప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించలేదు’’ అని అన్నారు. అంతటి మెజారిటీ మోదీ సర్కార్‌కు రాలేదు ‘‘రాజ్యాంగంపై ఎన్డీఏ దాడి అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే లోక్‌సభ తొలి సెషన్లోనే ఎమర్జెన్సీ అంశాన్ని మోదీ సర్కార్ పదేపదే ప్రస్తావించింది. పారీ్టలకతీతంగా, పక్షపాతరహితంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కూడా అదే బాటలో పయనిస్తూ ‘ఎమర్జెన్సీ’పై తీర్మానం చదవడం దిగ్భ్రాంతికరం. నాటి ఎమర్జెన్సీకి కారణమైన ఇందిరాగాం«దీని ఆనాడు ప్రజలు తిరస్కరించినా తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. భారీ మెజారిటీతో గెలిపించారు. అంతటి మెజారిటీ మోదీ సర్కార్‌కు కూడా రాలేదు’’ అని సోనియా అన్నారు. ఆ మూడు చట్టాల అమలు నిలిపేయాలి ‘‘పార్లమెంట్లో దారుణమైన భద్రతావైఫల్యాన్ని ఎలుగెత్తిచాటినందుకు అక్రమంగా ఇరుసభల్లో 146 మంది విపక్ష సభ్యులను బహిష్కరించారు. వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కీలకమైన మూడు నూతన నేర బిల్లులను ఎలాంటి చర్చ జరపకుండానే ఏకపక్షంగా చట్టాలుగా ఆమోదింపజేసుకున్నారు. బిల్లులను సంస్కరించాల్సిఉందని, చర్చ జరగాలని ఎందరో న్యాయకోవిదులు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే వీటిపై సమగ్ర చర్చ జరగాలి. అప్పటిదాకా ఈ నేర చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలి’’ అని సోనియా అన్నారు. నీట్ లీకేజీలపై ప్రధాని మాట్లాడరా? ‘‘లక్షలాది మంది యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతం వెలుగుచూస్తే మోదీ మాట్లాడరా? పరీక్ష పే చర్చా అంటూ తరచూ విద్యార్థులతో మాట్లాడే మోదీ ఈసారి ఎందుకు అదే విద్యార్థులకు మరోసారి పేపర్ లీక్ కాబోదని భరోసా ఇవ్వలేకపోతున్నారు? దారుణ నిర్లక్ష్యానికి విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఎన్సీఈఆర్టీ, యూజీసీ, విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు గత పదేళ్లలో ఎంతగా పడిపోయాయో ఇట్టే అర్థమవుతోంది’’ అని అన్నారు. -
Lok Sabha Elections 2024: ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈవీఎంలలోని మైక్రో–కంట్రోలర్ చిప్‌లు ట్యాంపరింగ్‌కు గురయ్యాయో లేదో తనిఖీ చేయాలని ఆయా లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఆరు రాష్ట్రాల పరిధిలోని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులుసహా ఎనిమిది దరఖాస్తులు ఈసీకి అందాయి. తమిళనాడు, హరియాణాలో చెరో రెండు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధప్రదేశ్, తెలంగాణలో చెరో స్థానంలో ఇలా మొత్తంగా 8 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. పేపర్ బ్యాలెట్ విధానానికి మారుదామంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ, ఈవీఎం విధానాన్ని సమర్థిస్తూ ఏప్రిల్ 26వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువడిన వేళ ఇలా ఈసీకి అభ్యర్థనలు రావడం గమనార్హం. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓడి రెండో, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఐదు శాతం ఈవీఎంలను చెక్‌చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుంటూ ఓడిన అభ్యర్థులు కొందరు తాజాగా ఈసీని ఆశ్రయించగా ఆయా వివరాలను ఈసీ వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో కలిపి 92 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను చెక్ చేయనున్నారు. అయితే ఒక్కో ఈవీఎం సెట్‌ను తనిఖీచేయడానికి నిర్వహణ ఖర్చుగా రూ.47,200ను ఆ అభ్యర్థి ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని జూన్ ఒకటో తేదీన ఈసీ ఒక ప్రకటన జారీచేయడం తెల్సిందే. ఈవీఎంల తనిఖీ ఖర్చును భారత్ ఎలక్ట్రానిక్స్ (బెల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్)లు రూ.40,000 నిర్ణయించగా జీఎస్టీ 18 శాతం(రూ.7,200) కలుపుకుంటే ఖర్చు రూ. 47,200గా తేలింది. అయితే ఈవీఎంల తరలింపు, వాటిని తనిఖీని రికార్డ్ చేసేందుకు సీసీటీవీల ఏర్పాటు, విద్యుత్ చార్జీలు, వీడియోగ్రఫీ, జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఇతర నిర్వహణ ఖర్చులు అదనంగా ఉండొచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి సంజయ్ రాధాకృష్ణ విఖే పాటిల్ 40 పోలింగ్ కేంద్రాల్లో తనిఖీ చేయాలని దరఖాస్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక లోక్‌సభ పరిధిలోని 4 పోలింగ్ స్టేషన్లను, హరియాణాలోని రెండు లోక్‌సభ స్థానాల్లోని 6 పోలింగ్ స్టేషన్లను, తమిళనాడులోని 2 లోక్‌సభ స్థానాల్లోని 20 పోలింగ్ స్టేషన్లను అభ్యర్థులు తనిఖీకి ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలను తనిఖీ చేయాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరారు. గజపతినగరం అసెంబ్లీ స్థానంలో ఒక పోలింగ్ స్టేషన్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ స్టేషన్లను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంచుకున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో 7 , జహీరాబాద్‌లో 7, ఆందోల్‌లో 6 పోలింగ్ స్టేషన్లను బీజేపీ అభ్యర్థి ఎంచుకున్నారు. ఒడిశాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 13 పోలింగ్ స్టేషన్లను బీజేడీ అభ్యర్థి ఎంచుకున్నారు. -
అధికారంలో ఉన్నా.. ఆశ తీరలేదేం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను కనీసం 11–12 చోట్ల గెలుస్తామని.. పరిస్థితి సానుకూలంగా ఉంటే 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలు వేసుకుంది. తక్కువలో తక్కువగా 10 స్థానాలైనా గెలుస్తామని భావించింది. కానీ ఫలితాలు గతం కంటే మెరుగే అయినా.. 8 స్థానాల్లోనే కాంగ్రెస్ గెలిచింది. అదే సమయంలో బీజేపీ కూడా ఇదే సంఖ్యలో సీట్లు సాధించింది. దీంతో తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదని.. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశమున్నా ఎందుకిలా జరిగిందని అధిష్టానం పోస్టుమార్టం ప్రారంభించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు రాజ్యసభ మాజీ చైర్మన్ కురియన్, అసోం ఎంపీ రకీబుల్ హసన్, పంజాబ్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్‌లతో కమిటీని ఏర్పాటు చేసింది. నిజానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ నుంచి ఇప్పటికే అధిష్టానానికి నివేదిక వెళ్లింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా తన నివేదికను అందించారు. కాంగ్రెస్ అధిష్టానం వాటిని కాదని కమిటీని ఏర్పాటు చేయడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఏం చేస్తారు.. ఎక్కడికి వెళ్తారు?ఇటీవలి లోక్‌సభ ఎన్నికల పనితీరుపై సమీక్షతోపాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం రూపొందించే కార్యాచరణ కోసమే కొత్తగా త్రిసభ్య కమిటీని నియమించారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఆ కమిటీ త్వరలోనే తెలంగాణకు వచ్చి పని ప్రారంభిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కమిటీ మూడు అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తుందని అంటున్నారు. ‘అధికారం, అన్ని వనరులు ఉండి కూడా బీజేపీతో అంత గట్టిగా ఎందుకు పోటీపడాల్సి వచ్చింది? తూర్పు, దక్షిణ తెలంగాణల్లో పట్టు నిలుపుకొన్న పార్టీ.. పశ్చిమ, ఉత్తర తెలంగాణల్లో ఎందుకు నిలబడలేకపోయింది? పార్టీ నాయకులందరూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారా లేదా?’ అన్న కోణాల్లో పోస్టుమార్టం జరుగుతుందని నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా తక్కువ తేడాతో ఓడిపోయిన మెదక్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాల విషయంలో ఏం జరిగిందనేది తేల్చే చాన్స్ ఉందని అంటున్నారు. ఇంకొంచెం కష్టపడి ఉంటే ఈ మూడు చోట్ల గట్టెక్కేవాళ్లమని పేర్కొంటున్నారు. ఈ స్థానాలు దక్కించుకోలేక పోవడానికి ఎలాంటి పరిస్థితులు కారణమనే అంశంపై.. పార్టీ ముఖ్య నేతలతోపాటు ఆయా చోట్ల పోటీచేసి ఓడిన అభ్యర్థులతోనూ మాట్లాడనున్నట్టు తెలిసింది. ఇక చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఏ మేరకు ఉపయోగపడిందనే కోణంలోనూ త్రిసభ్య కమిటీ నిగ్గు తేలుస్తుందని సమాచారం. అన్ని విషయాల్లో ఓ అంచనాకు వచ్చిన తర్వాత ఈ కమిటీ హైకమాండ్‌కు నివేదిక ఇస్తుందని.. ఆ నివేదిక ఆధారంగా టీపీసీసీ ప్రక్షాళన జరుగుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సరిగా పనిచేయని నేతలకు ఝలక్ ఇచ్చే అవకాశం ఉందని నేతలు అంటున్నారు.22న ‘నామినేటెడ్’ ఉత్తర్వులు?లోక్‌సభ ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో ప్రకటించిన 37 నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు ఈనెల 22వ తేదీన వచ్చే అవకాశముందని తెలిసింది. వాటితోపాటు మరో 17 పోస్టులను కలిపి ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం రేవంత్ భావించినా.. ఈ 17 పోస్టులకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తికాలేదని సమాచారం. వీలునుబట్టి మొత్తం పోస్టులకు, లేదా ఇప్పటికే ప్రకటించిన 37 పోస్టులకు ఉత్తర్వులు వస్తాయని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో నేతల పనితీరు ఆధారంగా నామినేటెడ్ పోస్టుల్లో మార్పులు జరుగుతాయనే ప్రచారం జరిగినా.. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య నామినేటెడ్ పందేరంలో తలెత్తిన విభేదాల కారణంగానే జాప్యం జరిగిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడా ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య నెలకొందని, నామినేటెడ్ ఉత్తర్వులకు లైన్ క్లియర్ అయిందని అంటున్నాయి. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ అగ్రనాయకత్వం.. త్వరలో జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులు, సహ ఇంచార్జులుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాధ్యతలు అప్పగించింది.జమ్మూ కశ్మీర్ ఇన్‌చార్జీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమించింది. కిషన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ , కో-ఇన్ చార్జ్‌గా అశ్వని వైష్ణవ్, హర్యానా ఎన్నికల ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కో ఇన్చార్జ్గా విప్లవ కుమార్ దేవ్లను నియమించిన కేంద్రం జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ , కో ఇన్చార్జ్గా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మలను కేంద్రం ఖరారు చేసింది. -
‘ఒక్క స్వీట్ బాక్స్‌తో మోదీ ఇమేజ్‌కు రాహుల్ చెక్’
చెన్నై: లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చి సాధించుకున్న ఇమేజ్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్క స్వీట్ బాక్స్‌తో ముక్కలు చేశాని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కోయంబత్తూరులో డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల ‘విజయ ర్యాలీ’ సభలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.‘‘ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను చివరిసారి కోయంబత్తూరు వచ్చినప్పడు నా పర్యటన దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. మోదీ తమిళనాడకు 8 సార్లు పర్యటించి పొందిన ఇమేజ్ను కోయంబత్తూరులో రాహుల్ గాంధీ నాకు కేవలం ఒక స్వీట్ బ్యాక్స్ ఇచ్చి ముక్కలు చేశారు. నేను కోయంబత్తూరులో ఉన్న సమయంలో తమిళనాడుకు వచ్చిన రాహుల్ నాకు స్వీట్ బాక్స్ ఇచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ నాపై చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోను’’ అని స్టాలిన్ అన్నారు.నరేంద్ర మోదీ బీజేపీ సొంతబలంతో ప్రధానమంత్రి కాలేదని, భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మోదీ ఫెయిల్యూర్‌కు నిదర్శనం అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన విజయం సాధారణమే అయినప్పటికీ.. మోదీని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేకుండా చేయటంలో ‘చారిత్రాత్మక విజయం’ గా మారిందని అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో మొత్తం 40 స్థానాల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించిందన్నారు. అయితే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పిందని, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 41వ విజయం సాధించిందని తెలిపారు. ఇదే విజయాన్ని 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రిపీట్ చేస్తామని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. -
బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ నేత యూ టర్న్!
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్‌సభ బీజేపీపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అహం పెరిగిపోవడం వల్లే సరైన ఫలితం రాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పేరు ప్రస్తావించకుండా ప్రతిపక్ష కూటిమిపై విమర్శలు గుప్పించారు. ఇక.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపటంతో క్లారిటీ ఇచ్చారు.‘‘ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాముడిని వ్యతిరేకించిన వాళ్లు అధికారంలో లేరు. రాముడిని గౌరవించాలనే సంకల్పం ఉన్నవాళ్లు ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు. అదే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది’’ అని ఇంద్రేష్ కుమార్ స్పష్టం చేశారు.జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారు.మరోవైపు.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు.మరోవైపు.. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా .. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని అన్నారు. ఇటీవల ఆఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు. -
2024 ఎన్నికలు: ఒక అడుగు వెనక్కి
నూతనంగా కొలువుదీరిన 18వ లోక్‌సభలో 469 మంది పురుషులతో పాటు కేవలం 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతం. ఈ వాటా 2019లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. లోక్‌సభ, శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారతదేశం ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి. స్థానిక స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తరించే విషయంలో భారతదేశం ముందుండి నడిపించింది. రాష్ట్ర, జాతీయ స్థాయులలోని అంతరాలను పరిష్కరించడంలో కూడా మనం ఇదే విధమైన నిబద్ధతను ప్రదర్శించాలి.2024 లోక్‌సభ ఎన్నికలు ఆధునిక భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన పోకడను సూచిస్తాయి. దీనిపై విశ్లేషించడానికి, వేడుక జరుపుకోవడానికి చాలా ఉంది కానీ, ఒక రంగంలో మాత్రం మనం ఒక అడుగు వెనక్కి వేశాం. 18వ లోక్‌సభలో 469 మంది పురుషులతో పాటు 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. 74 మందితో కూడిన ఈ మహిళా బృందంలో కచ్చితంగానే అనేక మంది శక్తిమంతమైన, చిత్తశుద్ధిగల, కష్టపడి పనిచేయగల ప్రజాప్రతినిధులు ఉన్నారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతంగా మాత్రమే ఉన్నారు. ఈ వాటా దారుణంగా వక్రంగా ఉండటమే కాకుండా, 2019 ఎన్నికల్లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం.2024 ఎన్నికలు జరిగిన సందర్భాన్ని పరిశీలిస్తే, మహిళా పార్లమెంటరీ ప్రాతినిధ్యం చెప్పుకోదగ్గ అభివృద్ధిని నమోదు చేసి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారతదేశం ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి. ఈ బిల్లు అమలులోకి వచ్చాక మహిళల సీట్లు వారికే కేటాయించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ సరిపోదు!గత ఏడాది పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినప్పుడు, అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును తెలియజేయడమే కాకుండా, ఈ చారిత్రాత్మక పరిణామంలో తమకూ పాత్ర ఉందని ప్రకటించుకున్నాయి. పైగా, ఈ ఎన్నికల్లో మహిళలు ముఖ్యమైన ఓటర్లుగా ఉన్నారు. పార్టీల మేనిఫెస్టోలు, అగ్ర నాయకుల ప్రచార ప్రసంగాల నుండి మహిళల ఓటింగ్ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం వరకు, సుదీర్ఘకాలం సాగిన ఎన్నికల సీజన్లో భారతీయ మహిళ చాలా స్పష్టంగా (కొంతవరకు సమస్యాత్మకంగా) తన ఉనికిని కలిగి ఉంది.అయితే ఈ ఊహాగానంలో మహిళలు ఓటర్లు, లబ్ధిదారుల పాత్రకే పరిమితమయ్యారు, రాజకీయ సోపానక్రమాలలో సమానమైన భాగస్వామ్యానికి అర్హులైన మహిళా నాయకులు, ప్రతినిధులు లేకుండాపోయారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంకలనం చేసిన డేటా ప్రకారం, ఈ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో 9.6 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు (పార్టీ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థుల్లో మహిళలు 11 శాతం మంది). అభ్యర్థులలో మహిళల వాటా తొమ్మిది శాతంగా ఉన్న 2019 సంవత్సరం నుండి చూస్తే ఇది చాలా కొద్ది మెరుగుదల మాత్రమే అని చెప్పాలి. పైగా పుండుపై కారం జల్లినట్టుగా, ఎన్నికల్లో పోటీ చేసిన అనేక మంది మహిళలు తమ తోటివారి నుండి స్త్రీద్వేష వ్యాఖ్యలను, అపహాస్యాన్ని ఎదుర్కొన్నారు.ఈ విధంగా కొద్ది మంది మహిళలే ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎన్నికైనవారిలో వారి ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పార్లమెంట్లు పురుషుల ఆధిపత్యంలో కొనసాగుతున్నప్పటికీ, భారతదేశం దాని సహచర పార్లమెంట్ల కంటే చాలా వెనుకబడి ఉంది. ఉదాహరణకు, 2023లో, ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించాయి. వీటిలో సగటున, 27.6 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని, ఇంటర్–పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) డేటా చెబుతోంది. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా, ప్రస్తుతం ఉన్న మొత్తం ఎంపీలలో మహిళలు 26.9 శాతం ఉన్నారు. 18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఐపీయూ డేటా ప్రకారం, ఈ పరామితిలో మొత్తం 185 దేశాలలో భారతదేశం 143వ స్థానంలో ఉంది. కొత్త పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యంలో తగ్గుదల నమోదైన నేపథ్యంలో, మన దేశ ర్యాంకింగ్ మరో ఐదు లేదా ఆరు స్థానాలు పడిపోయే అవకాశం ఉంది.మెక్సికో నుండి ఒక ఉదాహరణభారతదేశంలో ఎన్నికల లెక్కింపు జరగడానికి ఒక రోజు ముందు, ప్రపంచంలోని మరొక భిన్నమైన ప్రాంతంలో మరో చారిత్రక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వివిధ రాజ్యాంగ పదవులకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి మెక్సికోలో సాధారణ ఎన్నికలు జరిగాయి. అక్కడ క్లాడియా షీన్బామ్ అత్యున్నత పదవికి చక్కటి మెజారిటీతో ఎన్నికయ్యారు. మెక్సికో అధ్యక్షురాలిగా ఒక మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. కానీ పురుషులకే పరిమితమైన దుర్బేధ్యమైన కంచుకోట బద్దలవడం ఒక ఉల్లంఘన కాదు, మెక్సికో తన రాజకీయాలను మరింత ప్రాతినిధ్యంగా మార్చే ప్రయాణంలో ఇదొక తార్కికమైన తదుపరి దశ మాత్రమే.గత కొన్ని దశాబ్దాలుగా, అట్టడుగు స్త్రీవాద ఉద్యమాల ద్వారా ముందుకు సాగిన మెక్సికో, తన రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడమే కాకుండా లింగ సమానత్వాన్ని నిర్ధారించడానికి చట్టబద్ధమైన సంస్కరణల సమితిని ప్రవేశపెట్టింది; అమలు చేసింది కూడా. చట్టం ప్రకారం ప్రతిదానిలో, అంటే ప్రభుత్వంలోని అన్ని రంగాలలో సమానత్వం అవసరం. అలాగే ఎన్నికలలో లింగ సమానత్వంతో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ఉంచాలని ఆదేశించింది. ఈ సంస్కరణల ఫలితంగా, మెక్సికో అనేక ముఖ్యమైన రాజకీయ ఉన్నత పదవులను ఆక్రమించిన మహిళలతో పాటు, దాని పార్లమెంటు ఉభయ సభలలో స్త్రీ పురుష సమానత్వాన్ని కలిగి ఉంది. 2024లో, అధ్యక్ష పదవికి పోటీ చేసిన మొదటి ఇద్దరు అభ్యర్థులు మహిళలు కావడం, ఆ దేశ చరిత్రలో దేనితోనూ పోల్చలేని అరుదైన పరిణామం.అయినంతమాత్రాన మెక్సికోలో సమస్యలు లేవని చెప్పలేం. అక్కడ రాజకీయ, లింగ ఆధారిత హింస తీవ్రమైన సమస్యగా ఉంది. అయితే లింగ నిర్ధారిత నిబంధనలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకమైన, ఆలోచనాత్మకమైన సంస్కరణల ద్వారా పురోగతి సాధ్యమవుతుందని ఇది చూపిస్తోంది. అనేక ఇతర దేశాలు కూడా తమ రాజకీయాలను, పార్లమెంట్లను మరింత ప్రాతినిధ్యంగా ఉంచుతూ, సమానంగా మహిళలను కలుపుకుపోయేలా, లింగపరమైన సున్నితత్వంతో మలచడానికి చిన్న, పెద్ద రెండు చర్యలనూ తీసుకున్నాయి.మనమందరం బాధ్యులమే!స్థానిక స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తరించే విషయంలో భారతదేశం ముందుండి నడిపించింది. రాష్ట్ర, జాతీయ స్థాయులలోని అంతరాలను పరిష్కరించడంలో మనం ఇదే విధమైన నిబద్ధతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి ఎగువ నుండి సంస్కరణ అవసరం. కానీ పురోగతిని నిర్ధారించే అంతిమ బాధ్యత మన రాజకీయ పార్టీల భుజాలపైనే ఉంటుంది. మహిళా ప్రాతినిధ్యంలో ఈ పతనాన్ని చిన్నవిషయంగా చూడకూడదు. మహిళల (ప్రత్యేకించి సాంప్రదాయకంగా అట్టడుగున ఉన్న సమూహాల) భాగస్వామ్యాన్ని ప్రారంభించే విషయానికి వస్తే, పురోగతి చాలా అరుదుగా సరళంగా ఉంటుంది. పైగా దానికి ఎప్పుడూ హామీ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయంలో శాశ్వతమైన జాగరూకత చాలా అవసరం. అలాగే మనం అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలి.అక్షీ చావ్లా వ్యాసకర్త పరిశోధకురాలు, అశోకా యూనివర్సిటీలోని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్’(సీఈడీఏ)లో పనిచేస్తున్నారు -
దేశం, ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధాని మోదీ నాయకత్వంలో వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటిలాగే దేశం, ప్రజల భద్రతకు కట్టుబడి ఉంటుందన్నారు. మోడీ 3.0 భారతదేశ భద్రత కోసం తన ప్రయత్నాలను తదుపరి స్థాయికి తీసుకువెళుతుందని ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. తిరుగుబాటు, నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు.మోదీ దార్శానికతకు అనుగుగుణంగా రైతులకు సాధికారత కల్పించడం, గ్రామీణ జాతీయ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా సహకార మంత్రిత్వ శాఖ పనిని కొనసాగిస్తుంది. లక్షలాది మందికి కొత్త అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
సీట్లు తగ్గడానికి బాధ్యులెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన స్థానాలపై వారం రోజుల్లోగా ఏఐసీసీ నాయకత్వం పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావడంపై ఒకింత అసహనంగా ఉన్న హైకమాండ్ దీనికి బాధ్యులెవరని గుర్తించడంతో పాటు ఓటమికి కారణాలను సూక్ష్మ స్థాయిలో పరీశీలన చేయనుంది.దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికలతో రావాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ కబురు పంపినట్లు తెలిసింది. నిజానికి రాష్ట్రంలో కనీసంగా 14 సీట్లు గెలవాలని ఏఐసీసీ లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఎనిమిది స్థానాల్లోనే గెలిచింది. ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీకి సైతం 8 స్థానాలు దక్కాయి. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఈ స్థాయి వైఫల్యాలపై ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు.గెలవాల్సిన రాష్ట్రాల్లోనూ పార్టీ మెరుగైన సీట్లు సాధించలేకపోయిందని తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఫలితాలను ప్రస్తావించారు. ఈ రాష్ట్రాలపై విడిగా సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కర్ణాటక ఫలితాలను ఖర్గే, రాహుల్‌గాంధీ సమీక్షించారు. కేబినెట్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీకి తక్కువ ఓట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించారు. ఇదే మాదిరి సమీక్ష తెలంగాణలోని ఓటమి చెందిన నియోజకవర్గాలకు సంబంధించి ఉంటుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. -
ఆ సీట్లలో గెలిస్తే కేంద్రమంత్రులే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుల్లో కొన్నేళ్లుగా బలపడిన సెంటిమెంట్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లోనూ నిజమైంది. గత ముప్పై ఏళ్లుగా ఉమ్మడి ఏపీలో, ఇప్పుడు తెలంగాణలోనూ ఈ సెంటిమెంట్ బలపడుతూ వస్తోంది. ఉమ్మడి ఏపీలోని సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ, సీహెచ్.విద్యాసాగరరావు, నరసాపురం నుంచి గెలిచిన రెబెల్‌స్టార్ యూవీ కృష్ణంరాజు గతంలో వాజ్‌పేయి కేబినెట్లో సహాయమంత్రులుగా పనిచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ నుంచి గెలిచిన దత్తాత్రేయ కేంద్ర సహాయమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత గవర్నర్‌గా నియమితులయ్యారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి.కిషన్‌రెడ్డి తొలుత మోదీ కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవిని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రిగా కేబినెట్ హోదా పొందారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచే గెలిచి తిరిగి మోదీ కేబినెట్లో ఈ దఫా బొగ్గు, గనులశాఖ మంత్రి అయ్యారు. ఇక గతంలో కరీంనగర్ నుంచి గెలిచిన విద్యాసాగరరావు వాజ్‌పేయి కేబినెట్లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇప్పుడు కరీంనగర్ నుంచి రెండోసారి గెలుపొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం తాజాగా మోదీ మంత్రివర్గంలో అదే పదవిని పొందారు. ఉమ్మడి ఏపీలోని నరసాపురం నుంచి గెలిచిన సినీ హీరో కృష్ణంరాజుకు కేంద్ర సహాయమంత్రి పదవి దక్కగా, 2024 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచిన శ్రీనివాసవర్మకు మోదీ కేబినెట్లో గ్రామీణ సహాయమంత్రి శాఖ లభించింది.ఎప్పుడూ అవే స్థానాలకు పదవులా? గతంలో మాదిరిగానే సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే మళ్లీ పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈసారైనా తెలంగాణలోని వెనకబడిన జిల్లాలైన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాలకు మోదీ కేబినెట్లో చాన్స్ లభిస్తుందేమోననే ఆశాభావం వ్యక్తమైంది. కానీ మళ్లీ సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే చోటు లభించడంతో కొందరు నిరుత్సాహపడటం కొసమెరుపు. -
మణిపూర్‌లో సమస్యకు గన్ పరిష్కారం కాదు: సుప్రియా సూలే
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే స్వాగతించారు. మణిపూర్‌లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అన్నారామె.‘‘ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మణిపూర్‌పై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఎందుకంటే మణిపూర్ భారత్‌లో భాగం. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనందరినీ చాలా తీవ్రంగా కలచివేస్తోంది. మణిపూర్ విషయంపై చర్చ జరగాలి. మణిపూర్‌లో నెలకొన్న అశాంతిపై చర్చ జరపాలని ఇండియా కూటమి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది’’ అని అన్నారు.#WATCH | Pune, Maharashtra: On RSS chief Mohan Bhagwat's statement, NCP-SCP MP Supriya Sule says, "I welcome his statement because Manipur is part of India. And when we see our people suffering so much, it is extremely disturbing for all of us. This is something we have been… pic.twitter.com/JgRvnDET6y— ANI (@ANI) June 11, 2024 ‘‘ ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలతో ఒక మంచి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ద్వారా మణిపూర్ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించాలి. ప్రతి సమస్యకు గన్‌తో పరిష్కారం లభించదు’’ అని సుప్రియా సూలే అన్నారు. మణిపూర్‌లో శాంతి, ఎన్నికలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన ఓ కార్యక్రమంలో తొలిసారి మాట్లాడారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలిచిన అనంతరం మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘‘మణిపూర్‌లో అల్లర్లు చెలరేగి ఏడాది అవుతోంది. అయినా అక్కడ శాంతి నెలకొనటం లేదు. గత పదేళ్లలో శాంతంగా ఉన్న మణిపూర్‌లో ఒక్కసారిగా గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇక్కడి సమస్యను పరిష్కరించటమే తొలి ప్రాన్యంగా భావించాలి. ఎన్నికల్లో చూపించిన మాటల చాతుర్యం వదిలేసి.. దేశంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.‘‘ ఎన్నికల ఫలితాల కంటే ప్రజాస్వామ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా సమాజం మారుతోంది. అదే ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో ఎకరినొకరు దూషించుకోవటం, సాంకేతికతను తప్పుదారి పట్టించటం, నకిలీ వార్తలు సృష్టించటం సరికాదు. ఎన్నికలు, ఫలితాలు వాటి నుంచి బయటకువచ్చి దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి’’ అని మోహన్ భగవత్ అన్నారు. -
హీరో శివ రాజ్‌కుమార్‌పై సొంత బామ్మర్ది సంచలన ట్వీట్!
సాక్షి, బెంగళూరు(శివాజీనగర): ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌ను బావమరిది కించపరిచేలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గలో శివ భార్య గీత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ బాధలో ఉండగానే బావమరిది, బీజేపీ నేత కుమార బంగారప్ప హేళనలు ఆయన అభిమానులను మరింత వేదనకు గురిచేశాయి. కుమార బంగారప్ప ఇంటిని హీరో శివరాజ్ కుమార్ అభిమానులు శనివారం ముట్టడించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్ కుటుంబాల గురించి కుమార ఇటీవల చులకనగా మాట్లాడారు. అది తమకు బాధకు గురి చేసిందని, ఆయన బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలని అభిమానులు పట్టుబట్టారు. బెంగళూరులో సదాశివనగరలో ఉన్న కుమార బంగారప్ప ఇంటి గేట్ లోపలికి చొరబడి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివ రాజ్‌కుమార్ ఫొటోలను ప్రదర్శించారు. పరిస్థితి తీవ్రస్థాయికి చేరుతుండగా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇంటి నుంచి వెళ్లాలని పోలీసులు అభిమానులను హెచ్చరించారు. ఆ తరువాత కేఎస్ఆర్పీ పోలీసులతో అధిక భద్రత కల్పిపించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులను పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. సమీప పార్కు చుట్టుపక్కల నిల్చున్నవారిని సైతం నిర్బంధించారు. హేళనగా కుమార పోస్టు తన సోదరుడు, మంత్రి మధు బంగారప్ప, సోదరి గీతాను, గీతా భర్త శివరాజ్‌కుమార్ గురించి సోషల్ మీడియాలో హేళనగా రాశారు. శివరాజ్‌కుమార్ నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం లేదు. మా గ్రామ జాతరలో నృత్యం చేసే పనికి దరఖాస్తు వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నా చెల్లెలు గీతా.. సినిమా డ్యాన్సర్ కాబట్టి ఊరికే ఉండాల్సిన పని లేదు. దొడ్డమనె వ్యవహారం చాలా ఉంటుంది. వేరేవారికి అవకాశం లభించరాదు. బెదిరించడం, భయపెట్టడం, హుషార్ అనే మాటలు ఏమున్నా గొంతు లోపలే, నాలుగు గోడల లోపలే ఉండాలి. మా సైన్యం ఆన్‌లోనే ఉంటుంది అని హెచ్చరికలు చేశారు.pic.twitter.com/6YPDJcjkmh— Kumar Bangarappa (@kumarbangarappa) June 4, 2024 -
లోక్ సభ ఫలితాలపై ఖర్గే అసంతృప్తి..
-
కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరించేనో!!
సాక్షి, హైదరాబాద్: త్వరలో కొలువుదీరనున్న కేంద్ర మంత్రివర్గంలో గ్రేటర్ ఎంపీల్లో ఎవరికి చోటు దక్కుతుందోనని అటు బీజేపీ నేతల్లో, ఇటు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి కేంద్రమంత్రి పదవి గ్యారంటీ అనే అభిప్రాయాలున్నాయి. గెలిచిన నేతల అభిమానులు మాత్రం ఇద్దరికి మంత్రి పదవులిచి్చనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు. పదవి ఖాయమే.. కానీ.. నగరానికి చెందిన బండారు దత్తాత్రేయకు వాజపేయీ, మోదీ హయాంల్లోనూ మంత్రి పదవులు లభించాయి. కేంద్ర సహాయమంత్రి, కేబినెట్ మంత్రి పదవుల్ని ఆయన నిర్వర్తించారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ నుంచి రెండో పర్యాయం ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డికి సైతం గత మోదీ ప్రభుత్వ హయాంలో తొలుత సహాయ, తర్వాత కేబినెట్ మంత్రి పదవులు వరించాయి. దత్తాత్రేయ కీలకమైన పట్టణాభివృద్ధిశాఖ, కారి్మకశాఖల మంత్రిగానూ పనిచేశారు. కిషన్‌రెడ్డి తొలుత హోంశాఖ సహాయ మంత్రిగా, అనంతరం పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈసారీ రాజధాని పరిధిలోని వారికి మంత్రి పదవి ఖాయంగా లభించనుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరిని ఆ పదవి వరించనుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఓసీకైతే కిషన్‌రెడ్డి.. బీసీకైతే ఈటల.. కిషన్‌రెడ్డికే మరోసారి మంత్రిగా అవకాశం కలి్పస్తారని భావిస్తున్న వారితోపాటు మల్కాజిగిరి నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌కు అవకాశం లభించవచ్చని భావిస్తున్న వారూ ఉన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ సమయం నుంచీ రాజకీయాల్లో ఆయన క్రియాశీలపాత్ర వహించడం, అన్నివర్గాల వారిని కలుపుకొని పోయే తత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి గెలిచినందున అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యమిస్తుందని చెబుతున్నారు. వివిధ సమీకరణాలు, రాష్ట్రంలో గెలిచిన ఇతర ప్రాంతాల వారినీ పరిగణనలోకి తీసుకుంటే.. నగరం నుంచి ఓసీకి ఇవ్వాలనుకుంటే కిషన్‌రెడ్డికి, బీసీకి ఇవ్వాలనుకుంటే రాజేందర్‌కు మంత్రి పదవి లభించగలదని భావిసున్నవారు ఉన్నారు. క్యూలో ‘కొండా’ సైతం.. కాగా.. చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సైతం మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈటల రాజేందర్‌కు మంత్రిగా లేదా పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గెలిచిన ఎంపీలు సైతం ఎవరికి వారుగా తమకు మంత్రి పదవి లభించగలదనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మంత్రి పదవి ఎవరిని వరించనుందన్నది తేలాలంటే ప్రకటించేంతవరకు ఆగాల్సిందే. -
కేంద్ర మంత్రివర్గంలో డీకే అరుణకు చోటు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి విజయం సాధించగా.. కేబినెట్ కూర్పులో తెలంగాణ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కనున్నాయనే అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన సీనియర్ నాయకురాలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేంద్ర మంత్రి వర్గంలో చోటుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యంతో పాటు సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఖాయమనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్‌రెడ్డిని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న నాయకురాలిగా గుర్తింపు పొందడం వంటి అంశాలు కలిసివస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం..డీకే అరుణ పుట్టినిల్లు, మెట్టినిల్లు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి, మామ డీకే సత్యారెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రజలకు సేవలందించారు. భర్త డీకే భరత్‌సింహారెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా భరత్‌సింహారెడ్డి అన్న డీకే సమరసింహారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు మంత్రిగా పనిచేశారు.1996లో రాజకీయాల్లోకి వచ్చిన డీకే అరుణ మహబూబ్‌నగర్ ఎంపీగా, ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్‌గల్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి తొలి విజయాన్ని అందుకున్నారు. 2004లో సమాజ్‌వాది పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడిపై భారీ విజయం సాధించారు. 2009, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. 2009లో వైఎస్ కేబినెట్లో, ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో 2019లో బీజేపీలో చేరిన డీకే అరుణ అదే సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందారు. తాజాగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు.మహిళా కోటాలో దక్కే అవకాశంగత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాల్లో (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గంలో కిషన్‌రెడ్డికి బెర్త్ లభించింది. తాజాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఎనిమిది స్థానాల్లో (మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్) విజయం సాధించింది. ఈ మేరకు ఇద్దరికి లేదా ముగ్గురికి మంత్రి పదవులు దక్కవచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకరికి కీలక మంత్రిత్వ శాఖతో పాటు మరో ఇద్దరికి సహాయ మంత్రులుగా అవకాశం కలి్పంచనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మహిళా కోటాలో సీనియర్ నాయకురాలైన డీకే అరుణకు మోదీ కేబినెట్లో మంత్రిగా బెర్త్ దక్కే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.పాలమూరు నుంచే భవిష్యత్‌కు బాట..! బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని సమర్థంగా ఢీకొని ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందిన వారే కాగా.. వారందరూ చల్లా గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేశారు. మరోవైపు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరులోని పలు ప్రాంతాల్లో 11 పర్యాయాలు పర్యటించారు. అయినా డీకే అరుణ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. పలు మండలాల్లో బీజేపీ కేడర్ బలహీనంగా ఉన్నా.. అన్నింటినీ అధిగమించి డీకే అరుణ విజయకేతనం ఎగురవేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ముందుకుసాగుతోంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ పదవులు కేటాయించే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణలో పాలమూరు నుంచే అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన పాలమూరు నుంచే భవిష్యత్‌కు బాట సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంతో పాటు సీఎం రేవంత్, కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనే నాయకురాలిగా గుర్తింపు ఉన్న డీకే అరుణకు ఈ సారి కేంద్ర కేబినెట్లో బెర్త్ ఖాయమనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. -
‘ ఏడాదిలోపు మధ్యంతర ఎన్నికలు ’.. చత్తీస్‌గఢ్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
రాయ్‌పూర్: దేశంలో ఆరు నెలల నుంచి ఏడాది లోపు మధ్యంతర ఎన్నికలు రానున్నాయని చత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఓ బహిరంగ సభలో మాట్లాడారు.‘‘ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలల నుంచి ఏడాది లోపు దేశంలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లను పక్కన పెట్టనున్నారు. యోగి ఆదిత్యనాథ్ కుర్చి కదులుతోంది. సీఎం భజన్‌లాల్ తడబడుతున్నారు. ఫడ్నవిస్ రాజీనామా చేస్తున్నారు. .. రోజుకు మూడు డ్రెస్సులు మార్చే వారు (మోదీ) ఇప్పడు ఒకే డ్రెస్‌తో మూడు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇప్పడు వాళ్లు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం ధరిస్తున్నారనేది ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గట్టి గుణపాఠం. పార్టీలను విడగొట్టే, ప్రజల చేత ఎన్నకోబడిన సీఎంలను జైలులో పెట్టిన బీజేపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు’’ అని బఘేలా అన్నారు.మరోవైపు.. ఎన్డీయే కూటమి పక్షనేతగా నరేంద్రమోదీని భాగస్వామ్య పక్షనేతలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్న రోజునే భూపేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేయటంతో సంచలనంగా మారింది. -
లోక్ సభ ఎన్నికల ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రాహల్ గాంధీ: శశిథరూర్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా రాహుల్ గాంధీ నిలిచారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఇండియా కూటమి పుంజుకోవటంలో రాహుల్ గాంధీ శ్రమకు క్రెడిట్ ఇవ్వాలని అన్నారు. రాహుల్ గాంధి మాత్రమే లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా ఉండేందుకు అర్హుడని వ్యాఖ్యానించారు.‘‘ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలిచేలా కష్టపడి రాహుల్ గాంధీ.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచారు. రాహుల్, మల్లికార్జున ఖర్గే ఇద్దరూ దేశం మొత్తం తిరిగి ప్రచారం చేశారు. ఖర్గే రాజ్యసభలో పక్షనేతగా పార్టీని ముందుండి నడిపించారు. ఖర్గే లాగా లోక్‌సభలో పార్టీని ముందుండి నడిపించటంలో రాహుల్ గాంధీ సామర్థమైన వ్యక్తి. ఈ అభిప్రాయాన్ని నేను ఏ వేదికపైన అయినా చెప్పగలను. .. ఎన్డీయే కూటమి ప్రభుత్వం సమర్థంగా నడిపించటం కచ్చితంగా మోదీ, అమిత్ షాలకు ఒక సవాల్. వారి పాలన విధానాలు మార్చుకోవడానికి ఇది ఒక పరీక్ష లాంటింది. ప్రభుత్వానికి, పత్రిపక్షానికి రెండింటికి సామరస్యపూర్వకంగా ఉంటుందని ఆశిస్తున్నా. చాలా సమస్యలు ఉన్న భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వానికి మద్దతు నిలుపుకోవటం సాధ్యం కాదు. మోదీ మూడోసారి చేపట్టే ప్రభుత్వం నమ్మకం కోల్పోయేలా ఉండనుంది’’ అని శశిథరూర్ అన్నారు. -
ECI: పోలింగ్ 65.79 శాతం
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 65.79 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్లను ఇంకా ఇందులో కలపని కారణంగా తుది పోలింగ్ శాతంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించడం తెల్సిందే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 67.40 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలనాటికి దేశవ్యాప్తంగా 91.20 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆనాడు వారిలో 61.50 కోట్ల మంది మాత్రమే ఓటేశారు. ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లకు పెరగడం విశేషం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విడివిడిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, మొత్తంగా ఓటింగ్ శాతాల సమగ్ర వివరాలు తమకు అందాక అందరికీ అందుబాటులోకి తెస్తామని ఈసీ గురువారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. -
‘లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీనే ఎన్నుకోవాలి’
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ తర్వాత సింగిల్‌గా కాంగ్రెస్ పార్టీనే అధిక సీట్లు సంపాధించుకుంది. ఇండియా కూటమిలో సైతం కాంగ్రెస్ పార్టీనే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరు ఉండాలనే విషయంపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.కాగా, గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని పుంజుకోవటంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాహుల్ గాంధీనే లోక్ సభలో కాంగ్రెస్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండాలని తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు.లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా రాహుల్ గాంధీ ఉండాలని తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్ స్థానంలో గెలుపొందిన మాణిక్యం ఠాగూర్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ‘‘ నా పార్లమెంట్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పేరు మీదనే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాను. నాకు తెలిసి లోక్‌సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రతిపక్షనేత ఉండాలి. ఎన్నికైన ఎంపీలందరిలో ఇదే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాంగ్రెస్ ఒక ప్రజాస్వామ్య పార్టీ’’ అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వివేక్ తన్ఖా సైతం లోక్‌సభలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షనేతగా ఎన్నకుంటే బాగుంటుందని తలిపారు. ‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ ముందుండి నడిపించారు. లోక్‌సభలో కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అయితే రాహుల్ గాంధీ తన కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోరు. ఇలాంటి నిర్ణయాలను పార్టీ పెద్దలు, ఎంపీలు తీసుకుంటారు. కానీ ఏకగ్రీవంగా ఉన్న ఒకే ఒక అవకాశం.. రాహుల్ గాంధీనే’’ అని తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం కూడా స్పందించారు. నా వ్యక్తిగతంగా.. లోక్ సభలో కాంగ్రెస్ ప్రతిపక్షపార్టీ నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకుంటే అది సరైన నిర్ణయంగా భావిస్తానని అన్నారు. ఇక 2019లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలుకావటంతో రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ గతం కంటే మెరుగైన స్థానాలు గెలవటంతో లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలనే చర్చ పార్టీ నేతల్లో జోరుగా సాగుతోంది. -
‘ఓటమి అంగీకరిస్తున్నా.. ముందుంది మరింత కష్ట కాలం’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్ పార్లమెంట్ స్థానంలో ఓడియారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ చేతిలో 85000 ఓట్ల తేడాతో అధీర్ పరాజయం పాలయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుందో చెప్పలేనని తెలిపారు.‘‘ రానున్న రోజులు చాలా కఠినమైనవి. బెంగాల్లో నేను టీఎంసీ ప్రభుత్వంపై పట్టుదలతో పోరాటం చేశాను. నా ఆదాయ మార్గాలను సైతం నిర్లక్ష్యం చేశాను. నాకు రాజకియాలు తప్పు మరో స్కిల్ తెలియదు. అయితే నేను చాలా కష్టాలు పాలుకానున్నాను. వాటిని ఎలా ఎదుర్కొవాలో కూడా నాకు తెలియటం లేదు. తర్వలో ఢిల్లీలోని ఎంపీ అధికార నివాసాన్ని ఖాళీ చేస్తాను. నాకు కూతురు చదువుకోడానికి ఈ నివాసాన్ని కొన్ని రోజులు ఉపయోగించుకునేది. త్వరలో నేను మరో ప్రాంతంలో నివాసం చూసుకుంటాను. .. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమి చేరటాన్ని నేను వ్యతిరేకించటం లేదు. బహరంపూర్‌లో నా ఒటమి అంగీకరిస్తున్నా. గతంలోనే పీసీసీ విషయంలో నా కంటే సమర్థవంతమైన నేతను ఎన్నుకోవాలని పార్టీ నేతలను కోరారు. అయితే సోనియా గాంధీ కోరిక మేరకు నేను ఈ పదవిలో ఉండాల్సి వచ్చింది. మా నాయకుల నుంచి నాకు ఎటువంటి పిలుపురాలేదు. నాకు అధిష్టానం నుంచి పిలుపురాగానే నేను నా వైఖరినీ పార్టీ నేతలకు తెలియజేస్తాం. .. రాహుల్ భారత్ జోడో యాత్ర ముర్షిదాబాద్ నుంచి వెళ్లింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల్దా సెగ్మెంట్‌కు ప్రచారానికి వచ్చారు. నా సెగ్మెంట్ ఎవరూ ప్రచారనికి రాలేదు. దీనిపై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయను’’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట స్థానం బహరంపూర్. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయినా.. మాల్దా దక్షిణ్‌లో గెలుపొంది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ గెలుపొందిన సీటు మాల్దా దక్షిణ్ సెగ్మెంట్. ఇక్కడ టీఎంసీ 29 సీట్లు, బీజేపీ 12 సీట్లు గెలుచుకుంది. -
బీజేపీని నమ్మి తెలంగాణ ప్రజలు 8 సీట్లలో గెలిపించారు
-
తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ లోక్ సభ ఎన్నికలో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ బీజేపీని నమ్మి తెలంగాణ ప్రజలు 8 సీట్లలో గెలిపించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతుండటం సంతోషకరం. కాంగ్రెస్, బీఆర్ఎస్ను కాదని బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసం చూపించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారు. తెలంగాణలో బీజేపీ బలపడటం ఒక ఆరంభం మాత్రమే. తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది. ఇకపై భవిష్యత్తు మాదే. తెలంగాణలో పదేళ్లలో పది లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కాంగ్రెస్ విష ప్రచారం చేసింది. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి పోలింగ్ శాతం తగ్గింది.సీఎం రేవంత్‌రెడ్డి గతంలో గెలిచిన మల్కాజిగిలో మాకు 4 లక్షల మెజార్టీ వచ్చింది. కంచుకోట మెదక్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీనే గెలిచింది. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పేరుతో మజ్లిస్ పోటీ చేసింది. 8 చోట్ల మేం గెలిచాం. ఆరేడు స్థానాలో రెండో స్థానంలో నిలిచాం. బీఆర్ఎస్ 14 చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది ’’అని కిషన్‌రెడ్డి అన్నారు. -
లోక్‌సభ ఎన్నికలు: ప్రత్యేకతను చాటారు.. వార్తల్లో నిలిచారు!
హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల్లో పలు అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. కొన్ని చోట్ల ప్రత్యర్థులు.. సీనియర్టీ, డబ్బు, పలుకుబడి, కుల సమీకరణాల అనుకూలతలతో బరిలో నిలిచారు. అయితే వాటన్నింటికి భయపడకుండా.. తీవ్రమైన ప్రతికూలతలను సైతం ఎదుర్కొని కొందరు ఈ లోక్ సభ ఎన్నికల్లో గెలిచి వార్తల్లో నిలిచారు. ఇలా గెలిచిన వారిలో తక్కువ, అధిక వయసు ఉన్న అభ్యర్థులు, తక్కువ మెజార్టితో గెలుపొందినవారున్నారు. అదీకాక జైలులో ఉండి మరీ విజయం సాధించిన అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ మైనార్టీ ముస్లిం మహిళ గెలుపొందింది. ఇలా ఓ ముస్లిం మహిళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఒడిశా చరిత్రలో తొలిసారి కావటం గమనార్హం.అతి తక్కువ మెజార్టీతో గెలుపుఎన్నికల్లో కొన్నిసార్లు ఒక్క ఓటు కూడా అభ్యర్థి గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్సెస్ శివసేన (సీఎం ఏక్నాథ్ షిండే) నేతృత్వంలోని పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇద్దరి మధ్య గెలుపు దోబూచులాడింది. చివరికి 48 ఓట్ల అతితక్కువ మెజారిటీతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయ్‌కర్ తన సమీప ప్రత్యర్థి అమోల్ కీర్తికర్‌పై గెలుపొందారు. వాయ్‌కర్‌కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్‌కు 4,52,596 ఓట్లు లభించాయి. ఇక.. కేరళలోని అత్తింగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ కేవలం 684 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. రాజస్తాన్‌లోని జైపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్ 1,615 ఓట్ల తేడాతో గెలిచారు.అత్యంత పిన్న వయసు, అత్యంత వృద్ధుడు గెలుపుఉత్తరప్రదేశ్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులుగా కౌశంబీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పుష్పేంద్ర సరోజ్, మచిలీషహర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రియా సరోజ్ విజయం సాధించారు. వారిద్దరి వయసు 25 ఏళ్లే కావడం విశేషం. వీరిద్దరే ఈసారి అత్యంత పిన్నవయస్కులైన ఎంపీలుగా రికార్డు సృష్టించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి టి.ఆర్.బాలు సులువుగా నెగ్గారు. 82 ఏళ్ల టి.ఆర్.బాలు ఈ ఎన్నికల్లో అత్యంత వృద్ధుడైన ఎంపీగా రికార్డుకెక్కారు.దాతల సాయంతో గెలుపులోక్సభ ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాభిమానం, పార్టీ మద్దతుతో పాటు డబ్బు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యర్థులకు ధీటుగా కాకపోయిన ఎన్నికల ప్రచారానికైనా లక్షల్లో డబ్బులు ఖర్చు చేయాల్సిందే. అయితే గుజురాత్లో మాత్రం ఓ అభ్యర్థికి దాతలు ముందుకువచ్చి క్రౌడ్ సోర్సింగ్ ద్వారా నిధులను సేకరించారు. గుజరాత్ బనస్కాంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెనిబెన్ థాకూర్ గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే.జైలులో నుంచే గెలుపులోక్ సభ ఎన్నికల్లో ఓ ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఏకంగా జైలులో ఉండి మరీ.. ప్రజల మద్దతు, అభిమానంలో విజయం సాధించారు. అందులో సిక్కు వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని కాదూర్ సాహిబ్ స్థానం నుంచి గెలుపొందారు. ఉగ్రవాదలకు నిధులు సమకూరుస్తున్నారనే కేసులో ఆయన అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక.. మరో అభ్యర్థి జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లాలో ఇంజనీర్ రషీద్ కూడా జైలులో ఉండి ఎన్నకల్లో ఎంపీగా విజయం సాధించారు. ఇంజనీర్ రషీద్ 2019 నుంచి తిహార్ జైలులో ఉన్నారు. ఆయనపై ఉగ్రవాదులకు నిధలు సేకరిస్తున్నరనే ఆరోపణలపై కేసు నమోందైంది. ఇక.. వీరి ప్రమాణస్వీకారంపై చర్చ జరుగుతోంది.ఒడిశా చరిత్రలో తొలి ముస్లిం మహిళ గెలుపుఒడిశాలో బీజేపీ 78 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీ 51 స్థానాల్లో గెలుపొంది అధికారం కోల్పోయింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలిచి మూడో స్థానానికి పరిమిమైంది. అయితే కాంగ్రె పార్టీ తరఫున బారాబతి-కటక్ అసెంబ్లీ సెగ్మెంట్లో సోఫియా ఫిర్దౌస్ అనే ముస్లిం మహిళా అభ్యర్థి విజయం సాధించారు. ఒడిశాలో చరిత్రలో ఓ ముస్లిం మహిళ ఎమ్యెల్యేగా విజయం సాధించటం ఇదే తొలిసారి. -
తండ్రికి సాధ్యం కానిది... కుమారుడు సాధించాడు
మైసూరు: మైసూరుకు రాజ వంశానికి చెందిన శ్రీకంఠదత్త నరసింహరాజు ఒడెయార్ మైసూరు పార్లమెంటుకు బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. అయితే ఆయన దత్త కుమారుడు యదువీర్ శ్రీకంఠదత్త చామరాజ ఒడెయార్ బీజేపీ నుంచి పోటీ చేసి మొదటిసారే విజయం సాధించారు. శ్రీకంఠదత్త నరసింహరాజు ఒడెయార్ 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో కాంగ్రెస్ పారీ్టలో చేరి మైసూరు ఎంపీగా పార్లమెంట్‌కు పోటీ చేసి మొదటిసారి విజయం సాధించారు.అనంతరం 1991లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అనంతరం ఆ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రప్రభ అరసుపై ఓటమి చవి చూశారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరి 1996, 1999లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.2004 ఎన్నికలో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సీహెచ్ విజయశంకర్‌పై ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలను దూరంగా ఉన్నారు. శ్రీకంఠ దత్త నరసింహరాజు ఒడెయార్ మరణాంతరం రాజవంశానికి చెందిన వారు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు.అయితే రాజమాత ప్రమోదాదేవి రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. ఆమె అయిష్టత చూపారు. 2015 ఫిబ్రవరి 23న యదువీర్ కృష్ణరాజ చామరాజ ఒడెయార్ను ప్రమోదాదేవి దత్తత తీసుకున్నారు. యదువంశానికి చెందిన 27వ యువరాజు శ్రీకంఠదత్త ఒడెయార్కు సంతానం లేదు. ప్రస్తుతం ఆయన దత్త కుమారుడు యదువీర్ మైసూరు–కొడగు పార్లమెంట్ నియోజకర్గానికి పోటీ చేసి విజయం సాధించారు.యదువీర్‌కు 1.30 లక్షల మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణ్‌కు 6,56,241 ఓట్లు, యదువీర్‌కు 7,95,503 ఓట్లు వచ్చాయి. యదువీర్‌కు 1,39,262 ఓట్ల మెజారిటీ లభించింది. -
లక్ష మందికిపైగా నోటాకే ఓటేశారు
సాక్షి, మంచిర్యాల డెస్క్: తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నోటాకు 1,04,244 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో 1,583 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సరైనవారు లేరని ఓటర్లు భావించిస్తే.. నోటాకు ఓటువేసే అవకాశం ఎన్నికల సంఘం 2013 నుంచి కల్పించింది. ఈవీఎంలో అభ్యర్థుల గుర్తుల తర్వాత చివరిగా నోటా గుర్తు ఉంటుంది. చాలాచోట్ల రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా ఓట్లు సాధించడంలో నోటా కంటే వెనుకబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత నోటాకు ఓట్లు పడగా నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. మల్కాజిగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 13,206 ఓట్లు నోటాకు పడగా, అత్యల్పంగా జహీరాబాద్ నియోజకవర్గంలో 2,933 ఓట్లు పడ్డాయి. పోస్టల్ ఓట్లలో కూడా మల్కాజిగిరిలో అత్యధికంగా 160 ఓట్లు వచ్చాయి. -
Lok Sabha Election Results 2024: ఏకంగా 280 కొత్త ముఖాలు
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభలో ఏకంగా 280 మంది ఎంపీలు మొదటిసారిగా దిగువసభకు ఎన్నికైన వారున్నారు. ఇందులో మాజీ సీఎంలు, సినీ తారలు, వారసులు, హైకోర్టు మాజీ జడ్డి తదితరులున్నారు. అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా 45 కొత్తముఖాలు కనిపించునున్నాయి. వీరిలో టీవీ రాముడు అరుణ్ గోవిల్, జెయింట్ కిల్లర్ కిశోరీలాల్ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ తదితరులున్నారు. మహారాష్ట్రలో 48 స్థానాలుండగా 33 మంది తొలిసారిగా ఎంపీలుగా గెలిచారు. స్కూల్ టీచర్ భాస్కర్ భాగ్రే ఎన్సీపీ (పవార్) తరఫున ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం డిండోరి నుంచి గెలుపొందారు. పీయూష్ గోయల్ కూడా లోక్‌సభకు రావడం ఇదే తొలిసారి. మాజీ ముఖ్యమంత్రులు నారాయణ్ రాణే (మహారాష్ట్ర), త్రివేంద్ర సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా), బిప్లవ్‌కుమార్ దేవ్ (త్రిపుర), జితిన్‌రామ్ మాంఝి (బిహార్), బస్వరాజ బొమ్మై (కర్నాటక), జగదీశ్ షెట్టర్ (కర్నాటక), చరణ్‌జిత్ సింగ్ చన్నీ (పంజాబ్)లు తొలిసారిగా దిగువసభలో అడుగుపెట్టనున్నారు. సినీ తారల్లో సురేష్ గోపి (త్రిసూర్), కంగనా రనౌత్ (మండి)లు తొలిసారి నెగ్గినవారే. రాజకుటుంబీకుల్లో ఛత్రపతి సాహు (కొల్హాపూర్), యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ (మైసూర్), కీర్తి దేవి దేవ్బర్మన్ (త్రిపుర ఈస్ట్)లు, ఎన్నికలకు ముందు హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై పశి్చమబెంగాల్‌లోని తమ్లుక్ నుంచి పోటీ చేసిన గెలిచిన అభిజిత్ గంగోపాధ్యాయ్లు మొదటిసారి ఎంపీలుగా గెలిచిన వారే. ముస్లిం ఎంపీలు 24 మంది నూతన లోక్‌సభకు 24 మంది ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (టీఎంసీ), అసదుద్దీన్ ఓవైసీ, అస్సాంలో 10 లక్షల పైచిలుకు మెజారిటీతో నెగ్గిన కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్‌లు ఉన్నారు. ఈసారి మొత్తం 78 మంది ముస్లిం అభ్యర్థులు పోటీచేయగా 24 మంది గెలిచారు. కిందటి లోక్‌సభలో 26 మంది ముస్లిం ఎంపీలు ఉండగా.. ఈసారి వారి సంఖ్య రెండు తగ్గింది. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా ఏడుగురు ముస్లిం ఎంపీలు ఎన్నికకాగా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు, సమాజ్‌వాది నుంచి నలుగురు, ఇండియన్ ముస్లిం లీగ్ నుంచి ముగ్గురు ముస్లింలు ఎంపీలుగా గెలిచారు. -
‘వలస’ నేతల్లో ఒక్కరే గెలుపు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసిన ‘వలస’ నేతల్లో ఒకే ఒక్కరే విజయతీరానికి చేరుకుని సత్తా చాటారు. మొత్తం 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీలో చేరి బీజేపీ టికెట్ తెచ్చుకున్నవారు లేదా పార్టీకి ప్రత్యక్షంగా సంబంధం లేని వారు మొత్తంగా 9 మంది పోటీచేశారు. ఈ వలస నేతల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ గోడం నగేష్.. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్ నుంచే గెలుపొందారు. మిగతా ఎనిమిది మంది పరాజయం పాలయ్యారు. జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్‌కర్నూల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ పి.రాములు (ఆయన తన కుమారుడు భరత్ ప్రసాద్‌కు టికెట్ ఇప్పించుకున్నారు), మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎంపీ డా.సీతారాంనాయక్, వరంగల్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేశ్, నల్లగొండ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌నేత గోమాస శ్రీనివాస్, ఖమ్మం నుంచి సంఘ్‌పరివార్ క్షేత్రాల్లో పనిచేస్తూ గుర్తింపు పొందిన తాండ్ర వినోద్‌రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన మాధవీలత (సంఘపరివార్‌తో ఉన్న సంబంధాలు కలిసిరాగా, టికెట్ వచ్చే నాటికి బీజేపీ సభ్యత్వం లేకపోయినా ఆమెకు సీటు) వలసనేతల జాబితా కోవలోకి వస్తారు.గెలిచిన 8 ఎంపీల విషయానికొస్తే...ప్రస్తుతం బీజేపీ గెలిచిన 8 సీట్లలో సిట్టింగ్ ఎంపీలు జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ ధర్మపురి (నిజామాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్–బీఆర్ఎస్ నుంచి ఎన్నికలకు ముందు బీజేపీలో, చేరారు), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), డీకే అరుణ (మహబూబ్‌నగర్), ఎం.రఘునందన్‌రావు (మెదక్), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల) ఉన్నారు. వీరిలో అర్వింద్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే బీజేపీలో చేరి ఆ ఎన్నికల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ గత లోక్‌సభ ఎన్నికల్లోనే బీజేపీ టికెట్‌పై పోటీచేసినా, ఆమె ఎక్కువకాలం కాంగ్రెస్‌లో కొనసాగినందున కొత్తగా కమలం గుర్తుతో ఆమెను ఓటర్లు గుర్తించలేదు. దాంతో ఆమె బీజేపీ టికెట్‌పై మళ్లీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటి తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగు పెడుతున్నారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన రఘునందన్‌రావు బీజేపీలో చేరి పదేళ్లకు పైగానే కాగా, 2018–23 మధ్యలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందారు. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే ఓటమిపాలయ్యారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి గెలిచి తొలిసారి ఎంపీ అయ్యారు. ఇక కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విషయానికొస్తే...2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. 2019లో చేవెళ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడారు. ఆ తర్వాత బీజేపీలో చేరి మళ్లీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడి నుంచే ఆ పార్టీ టికెట్‌పై ఎంపీగా విజయం సాధించారు. టీఆర్ఎస్లో నెంబర్–టుగా ప్రాధాన్యత గల నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యాక బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేగా రాజీనామాతో వచ్చిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొంది సంచలనం సృష్టించారు. ఐతే 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై మల్కాజిగిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే...బీజేపీలోనే పుట్టి పెరిగి ఒరిజనల్, పక్కా కమలనాథులుగా ఉంటూ ఎంపీలుగా గెలిచిన వారు మాత్రం కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమేనని పాతతరం పార్టీ నాయకులు పేర్కొంటుండడం కొసమెరుపు. -
Lok Sabha Election Results 2024: మహిళా ఎంపీలు @ 74
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభకు మొత్తం 74 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. 543 మంది సభ్యులు గల లోక్‌సభలో మహిళా ఎంపీలు 13.62 శాతం మాత్రమే. ఈ 74 మందిలో 30 మంది గత లోక్‌సభలోనూ సభ్యులు కాగా, ఒకరు రాజ్యసభ సభ్యురాలు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళలు పోటీచేయగా... బీజేపీ అత్యధికంగా 69 మందిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ 41 మంది మహిళలకు టికెట్లిచి్చంది. చట్టసభల్లో 33 శాతం సీట్లను రిజర్వు చేసే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పోందాక జరిగిన తొలి ఎన్నికలివి. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా అమల్లోకి రాలేదు. బీజేపీ నుంచి హేమమాలిని, టీఎంసీ నుంచి మహువా మొయిత్రా, ఎన్సీపీ (ఎస్పీ) నుంచి సుప్రియా సూలే, ఎప్సీ నుంచి డింపుల్ యాదవ్‌లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, లాలూ కూతురు మీసా భారతి తొలిసారిగా నెగ్గి దేశం దృష్టిని ఆకర్షించారు. సమాజ్‌వాది పార్టీ నుంచి 25 ఏళ్ల ప్రియా సరోజ్ (మచిలీషహర్), 29 ఏళ్ల ఇర్కా చౌదరి (కైరానా)లు లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయసు మహిళా ఎంపీలు. దేశంలో అత్యధిక మంది మహిళా ఎంపీలను లోక్‌సభకు పంపిన రాష్ట్రంగా పశి్చమబెంగాల్ నిలిచింది. బెంగాల్ నుంచి గెలిచిన 11 మంది మహిళా ఎంపీలూ టీఎంసీ వారే కావడం విశేషం. భారత లోక్‌సభ చర్రితలో అత్యధికంగా 17వ లోక్‌సభలో 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. దక్షిణాఫ్రికాలో 46 శాతం, యునైటెడ్ కింగ్డమ్లో 35 శాతం, అమెరికాలో 29 శాతం మంది మహిళా ఎంపీలు ఉన్నారు. -
గెలుపు, ఓటములు సహజం.. నంబర్స్ గేమ్ కొనసాగుతుంది: మోదీ
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్. అయితే గత రెండు పర్యాయాల్లోనూ (2014, 2019) సొంతంగా మెజార్టీ సాధించిన కాషాయ పార్టీ.. ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో బుధవారం మోదీ 2.0లో చివరి కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని అన్నారు. అయితే నంబర్స్ గేమ్ మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘గత పదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశాం. అదే మంచిని ఇక ముందు కూడా కొనసాగిస్తాం. గెలుపు, ఓటములు రాజీకీయాల్లో భాగం నంబర్స్ గేమ్ కొనసాగుతుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్లోని మంత్రుల పనితనాన్ని మొచ్చుకున్నారు. పదేళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసినందుకు, తమ విలువైన సేవలను అందించి ప్రభుత్వానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రధాని పదవికి రాజీనామా సమర్పించేందుకు రాష్ట్రపతి భవన్‌కు మోదీ బయలుదేరారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. అలాగే కొత్త ప్రభుత్వం కొలువు దీరేవరకు వరకు కొనసాగవలసిందిగా మోదీ, మంత్రిమండలిని కోరినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం మూడోసారి ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్ నటి హ్యాట్రిక్.. అభినందించిన కూతురు!
ఈ ఏడాది జూన్ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో సీనియనర్ నటి హేమ మాలిని విజయం సాధించింది. యూపీలోని మథుర లోక్‌సభ నియోజకవర్గం బరిలో నిలిచిన ఆమె వరుసగా మూడోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌కు చెందిన ముఖేష్ ధన్గర్పై 5,10,064 ఓట్ల మెజారిటీలో గెలుపొందారు. తాజాగా ఈ విజయంపై ఆమె కూతురు, నటి ఇషా డియోల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు అభినందనలు మమ్మా.. హ్యాట్రిక్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. కాగా.. హేమ మాలిని 1999లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2003లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2004లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. తాజాగా హ్యాట్రిక్ కొట్టడంపై హేమమాలిని స్పందించారు. ప్రజలకు మూడోసారి సేవ చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by ESHA DEOL (@imeshadeol) -
డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పుకుంటా: ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కూటమి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ పెద్దలను కలిసి తన నిర్ణయాన్ని తెలియజేయనుట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకోనే విషయంపై మాట్లాడనున్నట్లు తెలిపారు. ఇక నుంచి కేవలం పార్టీ కోసం కృషి చేయనున్నట్లు వెల్లడించారు.కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోర పరాజయం చెందడంతో ఫడ్నవీస్ రాజీనామా నిర్ణయం తెరమీదకొచ్చింది. 2019 ఎన్నికలలో మహారాష్ట్రలోని 48 సీట్లలో 23 సీట్లను సొంతం చేసుకున్న కాషాయ పార్టీ.. ఈసారి కేవలం తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకుంది. దీంతో గత ఎన్నికలతో పోలిస్తే 14 స్థానాలను చేజార్చుకుంది. 2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ సీట్లకు కోత పడటంలో యూపీ, మహారాష్ట్రనే ముందు వరుసలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ కేవలం 240 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇది మెజార్టీ మార్కుకు(272) 32 స్థానాలు తక్కువ కావడం గమనార్హం.ఇక 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో కాంగ్రెస్ 13 చోట్ల విజయం సాధించింది. ఉద్దవ్ వర్గం శివసేన 9 స్థానాలను, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 8 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 9 స్థానాల్లో, శివసేన(ఏక్నాథ్ షిండే)7 చోట్ల, ఎన్సీపీ( అజిత్ పవార్) ఒక చోట విజయం సాధించింది. ఓ స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. -
బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నేతల ఆత్మబలిదానం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచినవారికి సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని అన్నారు. లోక్‌సభ ఫలితాలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ లోక్ ఎన్నికల ఫలితాలు మా 100 రోజుల పాలనకు రెఫరెండం. దేశవ్యాప్తంగా రాహుల్ జోడోయాత్ర పరిస్థితి మారిపోయింది. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుంది. 2019లో 3 సీట్లు గెలిస్తే.. ఇప్పుడు 8 సీట్లు గెలిచాం. సిద్దిపేటలో కూడా బీజేపీకి మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుండుసున్నా ఇచ్చారు. బీజేపీ అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీ కూడా ఓట్లు, సీట్లు పెరిగాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతల తీరు మార్చుకోవాలి. మోదీ గ్యారంటీకి ఉన్న వారంటీ ముగిసింది. మోదీ వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలి. తెలంగాణ లోక్‌సభ ఫలితాలు ఉగాది పచ్చడిలాగా సగం తియ్యగా, సగం పులుపుగా ఉన్నాయి. మల్కాజిగిరిలో ఓడినా.. కంటోన్మెంట్లో విజయం సాధించాం. కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. ఎప్పటికప్పుడుతెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. -
భారత ఎన్నికల ప్రక్రియపై అమెరికా ప్రశంసలు
వాషింగ్టన్: భారత్‌లో మంగళవారంవ వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత దేశ పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదని అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు.‘‘ భారత ప్రభుత్వం, దేశంలోని ఓటర్లు అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచారు?. ఎవరు ఓడిపోయారు? అనే అంశంపై మాకు ప్రాధాన్యం కాదు. వాటి మేము వ్యాఖ్యలు చేయటం లేదు. గత ఆరు వారాలను నుంచి ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదైన ఎన్నికలు ప్రక్రియ భారత్‌లో జరగటం చూశాం. అదే మాకు చాలా ముఖ్యం’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు. ఇక.. ఏడు విడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫతితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ 242 స్థానాలు గెలుపొందింది. ఇక.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేటమి 294 స్థానాలు విజయం సాధించింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో మూడోసారి అధికారం చేపట్టనుంది. మరోవైపు.. ప్రతిపక్షాల ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
నీ సోదరిగా గర్విస్తున్నా..నువ్వెంత ధీశాలివో మాకు తెలుసు!
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మిత్ర పక్షాలతో ఇండియా కూటమిగా ఏర్పడి ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అంటూ నినదించిన బీజేపీకి భారీ షాకిచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 328 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు ఎక్కువ సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఎక్స్‌వేదికపై స్పందించారు. తన సోదరుడు రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు.You kept standing, no matter what they said and did to you…you never backed down whatever the odds, never stopped believing however much they doubted your conviction, you never stopped fighting for the truth despite the overwhelming propaganda of lies they spread, and you never… pic.twitter.com/ev7QYFI1PR— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 5, 2024 ‘వారు (బీజేపీ నేతలు) ఎంతఅవమానించినా, అవహేళన చేసినా, దూషించినా చాలా దృఢంగా నిలబడ్డావు. అవహేళనలు, కష్టాలను చూసి ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. నీ నమ్మకాన్ని ఎంతగా అనుమానించినా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎంతగా నీపై అవాస్తవాలు, అబద్ధాలతో విపరీతమైన ప్రచారం చేసినా సత్యం కోసం నీ పోరు ఆగలేదు. కోపం ద్వేసం, నీ దరి చేరనీయలేదు. సంయమనం కోల్పోలేదు. ప్రతిరోజూ నీపై ద్వేషాన్ని కుమ్మరించినా నీ గుండెల్లోని ప్రేమ, దయతోనే, నిజం కోసం పోరాడావు. ఇది వాళ్లందరికీ ఇపుడు అర్థం అవుతుంది. కానీ నువ్వెంత ధీశాలివో ఎల్లపుడూ మాలో కొందరికి తెలుసు. నేను సోదరిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. ఈసందర్భంగా ఒక కార్టూన్‌ను కూడా షేర్ చేశారు. కాగా బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ఇప్పటికీ సగం సీట్లతో సరిపెట్టుకోవచ్చు, కానీ రాహుల్, ప్రియాంకా ద్వయం మాత్రం స్టార్ క్యాంపెయినర్లుగా నిలిచి బీజేపీ ఆశలకు భారీగా గండి కొట్టారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ తమ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని యావద్దేశానికి చాటి చెప్పారు రాహుల్‌గాంధీ. అంతేకాదు తల్లి, చెల్లి పట్ల బాధ్యతగా, ప్రేమగా ఉంటూ అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాగే ప్రియాంకా 2024 ఎన్నికలలో ప్రసంగాల్లో బాగా రాణించారు. తన తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ప్రసంగాలాతో ఓటర్లను ఆకర్షించారు. కాంగ్రెస్‌విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోటలైన, అమేథీ ,రాయ్‌బరేలీలలో కాంగ్రెస్ ప్రచారాన్ని లీడ్ చేశారు. అంతేకాదు గాంధీ కుటుంబ విధేయుడు కిషోరి లాల్ శర్మ విజయం కోసం శ్రమించారు. తద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడించి 2019లో రాహుల్ గాంధీ ఓటమికి స్వీట్ రివెంజ్ తీర్చుకున్నారు. -
ఎన్నికల్లో వర్కౌట్ అయిన 'గ్లామర్'.. ఎవరెవరు ఎక్కడ గెలిచారంటే?
ఎన్నికల సందడి అయిపోయింది. దేశంలో ఎన్టీయే ప్రభుత్వం అధికారం దక్కించుకుంది. మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించగా, చంద్రబాబు సీఎం కానున్నారు. వీళ్ల సంగతి పక్కనబెడితే దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసిన పలువురు సెలబ్రిటీలు అధికారం దక్కించుకున్నారు. కొందరికి మాత్రం నిరాశ తప్పలేదు.(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే)బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా ఎన్నికైంది.మలయాళ నటుడు సురేష్ గోపీ రికార్డ్ సృష్టించారు. త్రిసూర్ నుంచి ఎంపీగా గెలిచారు. కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయం కావడం విశేషం.టీవీ సీరియల్ 'రామాయణ్'తో చాలా గుర్తింపు తెచ్చుకున్న రాముడు పాత్రధారి అరుణ్ గోవిల్.. ఈసారి మీరట్ నుంచి ఎంపీగా గెలిచారు.టాలీవుడ్లో హీరోయిన్గా చేసిన రచనా బెనర్జీ.. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచి ఎంపీగా జయకేతనం ఎగరవేసింది.'రేసుగుర్రం' విలన్ రవికిషన్.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా ఈయన రెండోసారి గెలిచారు.బాలీవుడ్ బ్యూటీ క్వీన్ హేమామాలిని.. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం.బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా పశ్చిమ బెంగాల్‌లోని అసన్ సోల్ నుంచి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీలుగా గెలిచారు.ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, హిందుపూర్, పవన్ కల్యాణ్ పిఠాపురంలో విజయం సాధించారు.ఇలా చాలామంది ఈ సారి ఎన్నికల్లో గెలిచారు. మరోవైపు కొందరు ఓడిపోయారు కూడా. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీత.. షిమోగాలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ కూడా మహారాష్ట్ర అమరావతి లోక్‌సభ ఎంపీ బరిలో దిగి ఓడిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హిట్ స్పోర్ట్స్ బయోపిక్ మూవీ.. ఫ్రీగా స్ట్రీమింగ్) -
లోక్‌సభ ఎన్నికలు 2024: చివరిదాకా ఉత్కంఠ, సత్తా చాటిన వర్షాతాయి
2024 లోక్‌సభ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో జరిగిన పోరులో మహారాష్ట్ర ఉద్ధవ్ సేన ఎట్టకేలకు తన ఆధిపత్యాన్ని నిరూపించుంది. ముంబై మహా వికాస్ అఘాడి (MVA) కీలక విజయాలను సాధించింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ పోరు తీవ్ర ఉత్కంఠగా నిలిచింది. ముంబై నార్త్‌లో కాంగ్రెస్ మళ్లీ ఘోర పరాజయాన్ని చవిచూస్తున్న క్రమంలో ఆ పార్టీ ముంబై అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ తన సత్తా చాటారు. ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిపై దాదాపు 16 వేల 514 ఓట్ల తేడాతో గెలుపొందారు.పాకిస్థాన్‌కు చెందిన అజ్మల్ కసబ్‌ను ఉరితీసిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఓట్ల లెక్కింపులో తొలి ట్రెండ్స్‌లో ఉజ్వల్ నికమ్ ఆధిక్యంలో ఉన్నారు. చివరి రౌండ్లలో తన ఆధిక్యాన్ని చాటుకుని వర్ష గైక్వాడ్ (49)విజయం సాధించారు.శివసేన ముంబై సౌత్, సౌత్ సెంట్రల్ , నార్త్ ఈస్ట్ మూడు చోట్ల పోరాడింది. హోరాహోరీగా సాగిన పోరులో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి అమోల్ కీర్తికర్ విజయం సాధించారు. నార్త్ ముంబై లోక్‌సభ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయం సాధించారు. ముంబై సౌత్ నియోజకవర్గంలో ఉద్ధవ్ వర్గానికి చెందిన అరవింద్ సావంత్ షిండేసేనకు చెందిన యామినీ జాదవ్‌పై 52 వేల 673 ఓట్ల తేడాతో గెలుపొందగా, ఉద్ధవ్ థాకరే విశ్వసనీయ సహచరుడు అనిల్ దేశాయ్ షిండేసేనకు చెందిన రాహుల్ షెవాలేపై 53 వేల 384 ఓట్లతో విజయం సాధించారు.ఎవరీ వర్షా గైక్వాడ్ధారవి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత మహిళ. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన ఆమె 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో మహారాష్ట్ర 11వ శాసనసభకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
తెలంగాణలో బలం పుంజుకున్న బీజేపీ
-
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
హస్తం... పదిలం
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికలు మా పాలనకు రెఫరెండం.. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. దీనిని సమర్థించుకునేందుకు వీలుగా మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లే కాంగ్రెస్ సాధించగలిగింది. అయితే రేవంత్ విశ్వాసానికి తగిన స్థాయిలో గెలుపు సాధ్యం కాకపోయినా కాంగ్రెస్ పార్టీ ఓట్లు మాత్రం పదిలంగానే ఉన్నాయని లోక్‌సభ ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ గెలిచిన చోట్ల భారీ మెజార్టీలనే సాధించగలిగింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి, పెద్దపల్లిల్లో లక్ష నుంచి ఐదున్నర లక్షల మెజార్టీ సాధించగా, నాగర్‌కర్నూల్‌లో లక్షకు దగ్గరగా, జహీరాబాద్‌లో మాత్రం అత్యల్పంగా 50 వేల లోపు తేడాతో గెలిచింది. ఇక మహబూబ్‌నగర్, మెదక్‌లలో స్వల్ప తేడాతోనే ఓడిపోయింది. మరోవైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో అతిపెద్ద మూడో మెజార్టీని నల్లగొండ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి సాధించగా, ఆ స్థానం పరిధిలోనికి వచ్చే హుజూర్‌నగర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఏకంగా 1.05 లక్షల పైచిలుకు మెజార్టీ రావడం గమనార్హం. అక్కడ ఇన్చార్జిగా మంత్రి, సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యవహరించడం తెలిసిందే.కోటలు బీటలు వారకుండా..అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయానికి ఎక్కడా తీసిపోకుండా లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయతీరాలను చేరడంతో కాంగ్రెస్ పార్టీ కేడర్ ఊపిరి పీల్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన కంచు కోటలకు ఎక్కడా బీటలు వారకుండా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓట్లను రాబట్టుకోగలిగింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 36 అసెంబ్లీ స్థానాలుండగా, అందులో 34 చోట్ల ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు ఆ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోనికి వచ్చే నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాదాపు అసెంబ్లీలో సాధించిన స్థాయిలోనే ఆయా నియోజకవర్గాల్లో ఓట్లను రాబట్టుకోగలిగింది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందగా, ఇప్పుడు కూడా ఆ పార్లమెంటులో మంచి మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీతో హోరాహోరీ తలపడిన కాంగ్రెస్ అక్కడ కూడా మంచి విజయాలనే సాధించగలిగింది. నాగర్‌కర్నూల్‌లో 94 వేల ఓట్లు, పెద్దపల్లిలో 1.3 లక్షల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని కేవలం ఐదువేల లోపు ఓట్ల తేడాతో కోల్పోయింది.కరీంనగర్లో భారీ తేడాతో ఓటమికరీంనగర్ లోక్‌సభ స్థానాన్ని మాత్రం భారీ తేడాతో పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన మెదక్ పార్లమెంటు స్థానంలో మాత్రం రెండో స్థానానికి చేరుకోగలిగింది. ఇక్కడ కేవలం 40 వేల ఓట్ల తేడాతో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పరాజయం పాలయ్యారు. మొత్తం మీద మహబూబ్‌నగర్, మెదక్ స్థానాల్లో గెలుపు అంచుల వద్ద బోల్తా పడ్డామని, లేదంటే తాము ఆశించిన డబుల్ డిజిట్ స్థానాలు వచ్చేవనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.గాంధీభవన్‌లో సంబురాలురాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆశించిన సీట్లు గెలవడంతో బాణాసంచా మోతసాక్షి, హైదరాబాద్: ఇటు తెలంగాణలో, అటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు గాంధీభవన్‌లో సంబురాలు చేసుకున్నాయి. తెలంగాణలో 8 ఎంపీ స్థానాల్లో గెలవడం, కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో డప్పులు మోగిస్తూ, బాణాసంచా కాల్చుకుంటూ, స్వీట్లు పంపిణీ చేసి తమ సంతోషాన్ని పంచుకు న్నారు.ఈ సంబురాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, పార్టీ నేతలు హర్కర వేణు గోపాల్, ఫహీం ఖురేషీ, రోహిణ్‌రెడ్డి, మెట్టుసాయి కుమార్, సంగిశెట్టి జగదీశ్వరరావు పాల్గొన్నారు.తప్పిదాలు సరిదిద్దుకుంటాం: మహేశ్కుమార్గాంధీభవన్లో మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఇటు తెలంగాణలో, అటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు రేవంత్ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి అద్దం పడుతుందన్నారు. తాము చెప్పినట్టుగా లోక్‌సభ ఎన్నికలను రెఫరెండంగానే భావిస్తున్నామని, గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కంటే ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఎక్కువ ఓట్లు వచ్చాయని, అంటే ప్రజల్లో తమపై విశ్వాసం పెరిగినట్టేనని చెప్పారు. తన కంటిని తన వేలుతో పొడుచుకున్నట్టు స్వయంకృతాపరాథంతో బీజేపీని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిపించారని, ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందంతోనే బీజేపీ 8 స్థానాల్లో గెలవగలిగిందని చెప్పారు. మోదీని ప్రజలు తిరస్కరించారు: వీహెచ్మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పదేళ్లలో ఏమీ చేయలేదని, ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. ఇస్‌బార్ చార్సౌ పార్ అన్న మోదీని ప్రజలు తిరస్కరించారన్నారు. తుది విడత పోలింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన ఎగ్జిట్‌పోల్స్ చూస్తే రాత్రి తనకు నిద్ర పట్టలేదని, గోడీ మీడియా ఎంత ఊదరగొట్టినా ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారని చెప్పారు. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ మోదీ గ్యారంటీ ఎక్స్పైరీ అయిందని, మోదీ ప్రధాని పదవికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
వికసించిన కమలం
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది ఎంపీ స్థానాల్లో గెలిచి బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి ఏపీలో చూసినా, తెలంగాణలో చూసినా ఇవే మెజారిటీ స్థానాలు. ఈ ఎన్నికల్లో కచి్చతంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని అటు అగ్రనేతలు మోదీ, అమిత్‌షా మొదలు రాష్ట్రనేతలు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ పేర్కొన్నా, రెండెంకెల సీట్లను మాత్రం సాధించలేకపోయింది. అయితే అధికార కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచి్చంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బలమైన ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఎదుగుతుందనే ధీమాను ఆ పార్టీనేతలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించడంతో నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఎంపీగా గెలిచినట్టుగా రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.» 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా పోటీచేయగా, జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), అరి్వంద్ ధర్మపురి (నిజామాబాద్), సోయం బాపూరావు (ఆదిలాబాద్)గెలిచారు. » 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 4 సిట్టింగ్ స్థానాలకు తోడు (ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు స్థానంలో గోడెం నగే‹Ù), అదనంగా 4 చోట్ల ఈటల రాజేందర్(మల్కాజిగిరి), డీకే అరుణ (మహబూబ్‌నగర్), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), ఎం.రఘునందన్‌రావు (మెదక్) గెలిచారు. » 1980లో బీజేపీ ఏర్పడ్డాక...ఉమ్మడి ఏపీలో జరిగిన 1999 అసెంబ్లీ/లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో అత్యధికంగా 12 ఎమ్మెల్యే, 7 ఎంపీ సీట్లు (అందులో నాలుగు తెలంగాణ నుంచి) గెలుపొందారు. బీజేపీ గెలిచిన అత్యధిక సీట్లు అవే. » 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందినా...ఇప్పుడు జరిగిన ఎంపీ ఎన్నికల్లో...ఒక్క తెలంగాణ నుంచే అత్యధికంగా 8 ఎంపీ సీట్లలో గెలిచి గత రికార్డులను బ్రేక్ చేసింది. » 1984లో ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ రెండే రెండు సీట్లలో గెలుపొందింది. అందులో ఒకటి ఉమ్మడి ఏపీ హనుమకొండ స్థానం. ఇక్కడి నుంచి మాజీ కేంద్రమంత్రి పీవీ నరసింహారావును చందుపట్ల జంగారెడ్డి ఓడించారు. మరో స్థానంలో గుజరాత్‌లోని మెహసినా నుంచి ఏకే పాటిల్ గెలిచారు. » ఉమ్మడి ఏపీలో జరిగిన 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేసి సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, కరీంనగర్ నుంచి సీహెచ్ విద్యాసాగరరావు, కాకినాడ నుంచి సినీనటుడు కష్ణంరాజు, రాజమండ్రి నుంచి గిరిజాల వెంకటస్వామి నాయుడు గెలిచారు. » 1999 ఎన్నికల నాటికి టీడీపీ కలిసి బీజేపీ పోటీ చేయగా, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, కరీంనగర్ నుంచి సీహెచ్ విద్యాసాగరరావు, మెదక్ నుంచి ఆలె నరేంద్ర, మహబూబ్‌నగర్ నుంచి ఏపీ జితేందర్‌రెడ్డి, రాజమండ్రి నుంచి ఎస్‌బీపీబీకే సత్యనారాయణ, నరసాపురం నుంచి ఉప్పలపాటి కృష్ణంరాజు, తిరుపతి నుంచి వెంకటస్వామి గెలుపొందారు. తెలంగాణ వచ్చాక... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నో ఎగుడు దిగుళ్లను చవిచూసింది. » 2014 అసెంబ్లీ/లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసింది. 7% ఓట్లతో 5 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీట్లో బీజేపీ గెలుపొందింది. » 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకసీటు గెలిచి 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యింది. ఆ ఎన్నికల్లో కేవలం ఏడుశాతం ఓటింగ్ సాధించింది. » 2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 4 ఎంపీ సీట్లు గెలుపొంది గణనీయంగా 19 శాతం ఓటింగ్‌ను సాధించి బీజేపీ సత్తా చాటింది. వరుసగా బీజేపీ బలం పుంజుకోవడంతోపాటు అధికార బీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తలపడి బీజేపీ అభ్యర్థులు ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ గెలుపొందారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం దగ్గర దాకా చేరుకొని 12 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. » 2020 డిసెంబర్లో జరిగిన జీహేచ్ఎంసీ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లు గెలుపొందడం ద్వారా బీజేపీ సంచలనం సష్టించింది. అంతకు ముందు ఆ పారీ్టకి నలుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉండగా ఏకంగా వారి సంఖ్య 48కు చేరుకుంది. » ఆ తర్వాత మొదటిసారిగా పార్టీ బీ ఫామ్‌పై టీచర్ ఎమ్మెల్సీ స్థానం (గతేడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో) నుంచి ఏవీఎన్‌రెడ్డి సంచలన విజయం సాధించారు. » 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో.14 శాతం ఓటింగ్‌తో 8 ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించింది. » 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 35.08 శాతం ఓటింగ్‌తో 8 ఎంపీ సీట్లలో గెలుపొంది కాషాయ పార్టీ ఆధిక్యతను చాటింది. -
20 ఏళ్ల తర్వాత తొలిసారి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని రీతిలో పరాజయాన్ని చవి చూసింది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ సరిగ్గా 20 ఏళ్ల తర్వాత లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. 2004 ఎన్నికల్లో (14వ లోక్‌సభ) ఐదు, 2009లో 2, 2014లో 11, 2019లో 9 స్థానాలు సాధించింది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు సాధించడం లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డింది. కానీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక పోయింది. చివరకు పార్టీకి పట్టు ఉన్న మెదక్ సెగ్మెంటు సహా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించిన మరో ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో సైతం పార్టీ అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బస్సుయాత్రతో 13 లోక్‌సభ సెగ్మెంట్లను చుట్టి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు సుడిగాలి ప్రచారం చేసినా ఎన్నికల ఫలితాలు పూర్తిగా నిరాశకే గురి చేశాయి. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కూడా పార్టీ పరాజయం పాలైంది. అసెంబ్లీ ఫలితాలతో అప్రమత్తమైనా..గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్టిలో పెట్టుకుని జనవరి మొదటి వారం నుంచే ఓటమిపై సమీక్ష పేరిట లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధతను ప్రారంభించింది. కేటీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశాల్లో కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేఆర్ఎంబీకి కృష్ణా జలాల అప్పగింతను నిరసిస్తూ నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు.. కేసీఆర్ ఊతకర్ర సాయంతో (కేసీఆర్ ఇంట్లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే) హాజరయ్యారు. ఎండిన పంట పొలాల పరిశీలనకు పొలం బాట పేరిట ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో బస్సుయాత్ర చేశారు. మరోవైపు ‘చలో మేడిగడ్డ’ పేరిట కేటీఆర్, హరీశ్‌ల నేతృత్వంలో బీఆర్ఎస్ కీలకనేతలందరూ ప్రాజెక్టును సందర్శించారు. పార్టీ కేడర్‌లో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. మార్చి మొదటి వారం నుంచే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కేసీఆర్ దృష్టి పెట్టారు. అదే సమయంలో ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేసేందుకు మార్చి 12న ‘కరీంనగర్ కదనభేరి’ సభను నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయంలో చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.సిట్టింగ్ ఎంపీలు పార్టీకి దూరంలోక్సభ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్, కేటీఆర్ సెగ్మెంట్ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరారు. 9 మంది సిట్టింగ్ ఎంపీలకు గాను కేవలం ముగ్గురు మాత్రమే తిరిగి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, మన్నె శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్), మాలోత్ కవిత (మహబూబాబాద్), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం) మాత్రమే తిరిగి పోటీ చేశారు. వెంకటేశ్ నేత (పెద్దపల్లి), పి.రాములు (నాగర్‌కర్నూలు), బీబీ పాటిల్ (జహీరాబాద్), రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), పసునూరు దయాకర్ (వరంగల్) బీఆర్ఎస్కు దూరమయ్యారు. పార్టీ టికెట్ ఖరారు చేసినా రంజిత్‌రెడ్డి, పి.రాములు, బీబీ పాటిల్ పార్టీకి దూరమవడం పార్టీ కేడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుతో పాటు రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనప్ప, పట్నం మహేందర్‌రెడ్డి, సైదిరెడ్డి తదితరులు కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వలస వెళ్లడం కూడా బీఆర్ఎస్పై ప్రభావం చూపింది. ఇలా బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన 9 మందికి బీజేపీ, కాంగ్రెస్‌లు ఎంపీ టికెట్లు ఇచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కవిత అరెస్టుతో విమర్శలుబీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై దృష్టి కేంద్రీకరించిన సమయంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయ్యారు. దీంతో బీఆర్ఎస్ తీవ్ర విమర్శ లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాయి. ఇక బస్సు యాత్ర కొనసా గుతున్న సమయంలోనే కేసీఆర్ ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధాన్ని విధించింది. సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. బస్సు యాత్రకు జనం స్పందన భారీగా రావడంతో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపించినా చివరకు పూర్తిస్థాయిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు ఆశించిన రీతిలో రావడం లేదని రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు.మూడో స్థానంతో నిరాశకానీ బీఆర్ఎస్కు మాత్రం లోక్‌సభ ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచిన పద్మా రావు గౌడ్, బాజిరెడ్డి గోవర్దన్ (నిజామాబాద్), ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ (నాగర్ కర్నూల్), పి.వెంకట్రామిరెడ్డి (మెదక్). ఆత్రం సక్కు (ఆదిలాబాద్) లాంటి నేతలు కూడా మూడో స్థానానికి పడిపోయారు. మహబూబాబాద్, ఖమ్మం మినహా అన్ని చోట్లా మూడో స్థానానికి పడిపోయిన బీఆర్ఎస్, హైదరాబాద్‌లో 4వ స్థానంలో నిలిచింది. సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న మాలోతు కవిత (మహబూబాబాద్), నామా నాగేశ్వరరావు (ఖమ్మం)లు మాత్రమే రెండో స్థానంలో ఉండి కొంత పోటీ ఇవ్వగలిగారు. గత ఫలితాలతో పోలిస్తే 3 స్థానాలున్న కాంగ్రెస్ బలం 8 స్థానాలకు పెరగ్గా, గతంలో 4 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. ఇక, పోటీ చేసిన 17 స్థానాల్లో 8 చోట్ల గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ, 8 చోట్ల రెండో స్థానంలో, ఒక్కచోట మాత్రం మూడోస్థానంలో నిలిచింది. -
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
అమేథీ: అమేథీ నియోజకవర్గంలో 2019లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే ఓడించిన బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఈయన ఢీకొట్టగలరా? అన్న విశ్లేషకుల అనుమానాలను పటాపంచలు చేస్తూ కిశోరీ లాల్ శర్మ జయకేతనం ఎగరేశారు. మంగళవారం అమేథీ నియోజవర్గంలో çస్మృతి ఇరానీపై 1,67,196 ఓట్ల మెజారిటీతో కిశోరీ లాల్ శర్మ ఘన విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే లక్షకుపైగా మెజారిటీ సాధించి అమేథీ కాంగ్రెస్‌కు కంచుకోట అని కిశోరీలాల్ మరోసారి నిరూపించారు.రాహుల్‌ను ఇరానీ గతంలో 55వేల ఓట్ల తేడాతో ఓడిస్తే ఈసారి ఆమెను శర్మ అంతకు మూడురెట్లకు మించి మెజారిటీతో ఓడించడం విశేషం. ‘‘ ఈ విజయం నా ఒక్కరిది కాదు. మొత్తం నియోజకవర్గ కుటుంబాలది. ఇంతటి విజయం అందించిన అమేథీ ప్రజలకు నా కృతజ్ఞతలు. ఈ విజయం అమేథీ ప్రజలు, గాంధీల కుటుంబానికే చెందుతుంది. మనది బలీయ, ప్రజాస్వామ్య భారతం అని అమేథీ చాటింది’ అని ఫలితం వెలువడ్డాక కిశోరీలాల్ వ్యాఖ్యానించారు.విజయం సాధించిన విధేయత: గాంధీల కుటుంబానికి అత్యంత విధేయుడిగా కిశోరీ లాల్ శర్మకు మంచి పేరుంది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. శర్మ సొంత రాష్ట్రం పంజాబ్. లూథియానాకు చెందిన శర్మ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీకి సన్నిహితుడు కూడా. 1983లో రాజీవ్‌తోపాటు యూపీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. నాటి నుంచి స్థానిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 1991లో రాజీవ్ మరణానంతరం గాంధీల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. 1999లో తొలిసారిగా సోనియాగాంధీ అమేథీ నియోజవర్గంలో ఘన విజయం సాధించడంలో శర్మ కృషి దాగిఉందని అమేథీ రాజకీయ వర్గాలు చెబుతాయి.అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున అన్ని పనులు శర్మనే చూసుకునేవారు. అమేథీ, రాయ్‌బరేలీల్లో రాహుల్, సోనియా అందుబాటులో లేనపుడు నియోజకవర్గ సమస్యలపై పార్టీ అగ్రనాయకత్వానికి తెలియ జేయడం వంటి పనులనూ చక్క బెట్టేవారు. రాయ్‌బరేలీ ప్రజలతో ఈయన మంచి పరిచయం ఉంది. గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ ఓడిపోయాక నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యవహారాలను శర్మనే చూసుకున్నారు.కొంతకాలం బిహార్, పంజాబ్ రాష్ట్రాల వ్యవహారాలనూ చూశారు. అమేథీ రాజకీయాల్లో తెరవెనుకే ఉండిపోయిన కిశోరీ లాల్.. రాహుల్ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయినా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించడం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్‌పై స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదే ఊపులో బరిలో దిగిన స్మృతి ఇరానీని శర్మ ఈసారి ఇంటిబాట పట్టించారు. నియోజవర్గ సమస్యలపై పోరాటం చేసినందుకు ఫలితంగానే కిశోరీలాల్‌కు విజయకిరీటాన్ని ఓటర్లు కట్టబెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు.కిశోరీ భాయ్.. ముందే చెప్పా: ప్రియాంకా గాంధీకిశోరీ లాల్ గెలుపుపై పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ‘‘ కిశోరీ భాయ్.. మొదట్నుంచీ మీ గెలుపు మీద నాకు ఏమాత్రం సందేహం లేదు. మీరు గెలుస్తారని తొలినుంచీ బలంగా నమ్ముతున్నా. మీకు, నియోజకవర్గ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ‘ఎక్స్’లో హిందీలో ట్వీట్‌చేశారు. -
‘అబ్ కీ బార్...’ పాచిక పారలేదు
లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు తిరుగులేని విజయాలు. ఈసారి 370 సీట్ల లక్ష్యం. 300 నుంచి 350 స్థానాల దాకా ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యం. కానీ ఎగ్జాక్ట్ ఫలితాలు బీజేపీకి తేరుకోలేని షాకిచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా కనీసం మెజారిటీ మార్కును కూడా అందుకోలేకపోయింది. కేవలం 240 స్థానాలకు పరిమితమై చతికిలపడింది. తరచి చూస్తే ఇందుకు పలు కారణాలు కని్పస్తున్నాయి...⇒ అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శన ఎవరూ ఊహించనిది. అక్కడ బీజేపీ బలం 62 నుంచి ఏకంగా 33 స్థానాలకు పడిపోయింది. రాష్ట్రంలో ఓబీసీలతో పాటు ప్రధానంగా దళిత, ముస్లిం ఓట్లను ఎస్పీ–కాంగ్రెస్ కూటమి పూర్తిస్థాయిలో ఒడిసిపట్టడమే ఇందుకు కారణం. దాంతో వాటి భాగస్వామ్యం యూపీలో సూపర్‌హిట్టయింది. బీజేపీకి దేశవ్యాప్తంగా తగ్గిన 63 సీట్లలో సగానికి సగం యూపీలోనే కావడం విశేషం. ⇒ యూపీ తర్వాత కీలకమైన మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను బీజేపీ చీలి్చన తీరును జనం వ్యతిరేకించారు. తాజా ఫలితాల్లో చీలిక వర్గాలకే ఆదరణ లభించింది. ఆ మేరకు రాష్ట్రంలో ఎన్డీఏ స్థానాలకు భారీగా గండి పడింది. ⇒ ప్రచారం పొడవునా మోదీతో పాటు బీజేపీ నేతలు ప్రదర్శించిన మితిమీరిన దూకుడు కూడా బెడిసికొట్టింది. ⇒ నానాటికీ పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మధ్య తరగతి, యువతలో ఆగ్రహానికి కారణమయ్యాయి. ⇒ సైన్యంలో చేరేందుకు మోదీ సర్కారు తెచ్చిన అగ్నివీర్ పథకాన్ని యువత దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. ఆ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ హామీ యువకులను బాగా ఆకట్టుకున్నాయి. ⇒ సైనిక దళాల్లో యువత ఎక్కువగా చేరే రాజస్తాన్, హరియాణాల్లో బీజేపీకి సీట్లు తగ్గడం అగ్నివీర్ పథకంపై ఆగ్రహ ప్రతిఫలమే. ⇒ ఓవైపు ఇన్ని సమస్యలు కన్పిస్తుంటే పట్టించుకోకుండా బీజేపీ ఇచ్చిన ‘అబ్ కీ బార్, 400 పార్ (ఈసారి 400 సీట్లకు మించి)’ నినాదాన్ని ప్రజలు హర్షించలేదు. 2004 నాటి ‘ఇండియా షైనింగ్’ నినాదం అంతగా కాకున్నా ‘అబ్ కీ బార్...’ బీజేపీకి కాస్త చేటే చేసిందంటున్నారు. నిజంగానే అన్ని సీట్లు వస్తే నిరంకుశత్వానికి బాటలు పడతాయన్న భావన ప్రబలింది. అంతేగాక బీజేపీ నేతల్లో అలసత్వానికి కూడా ఈ నినాదం కారణమైంది. మోదీ మాటతీరు... ⇒ పార్టీని పూర్తిగా తోసిరాజని ఈసారి ప్రచారంలో సర్వం మోదీమయంగా మారింది. ప్రతిదానికీ ‘మోదీ హామీ’ అంటూ ప్రధాని పదేపదే చెబుతూ వచ్చారు. ఏకంగా బీజేపీ మేనిఫెస్టో పేరునే ‘మోదీ కీ గ్యారెంటీ’గా మార్చేశారు! సర్వం తననే కేంద్రం చేసుకుని నడిపించారు. ⇒ దీనికి తోడు మోదీ మాటతీరును, విపక్షాలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు ఆమోదించలేదు. విపక్షాలపై ఆయన చేసిన ముజ్రా తదితర విమర్శలు బీజేపీకి మేలు కంటే కీడే ఎక్కువ చేశాయి. ⇒ మంగళసూత్రాలు మొదలుకుని మాంసాహారం, ముస్లిం రిజర్వేషన్ల దాకా మోదీ చేసిన వ్యాఖ్యలను జనం జీరి్ణంచుకోలేదని ఫలితాలు చెబుతున్నాయి. ⇒ వీటికి తోడు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన దేశవ్యాప్తంగా ఆ వర్గం ఓట్లు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా సంఘటితమయ్యేందుకు కారణమైంది. ⇒ షా ప్రకటనను కాంగ్రెస్, విపక్షాలు అందిపుచ్చుని బీజేపీ మళ్లీ వస్తే మొత్తం రిజర్వేషన్లనే ఎత్తేస్తుందంటూ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఇది బీజేపీకి చెప్పలేనంత చేటు చేసింది. ⇒ విపక్షాలపైకి మోదీ సర్కారు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందన్న ప్రచారం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఎన్నికల వేళ ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్టు కూడా చేటే చేసింది. ⇒ ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, మహిళలకు ఏటా రూ.లక్ష సాయం వంటి హామీలు ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమయ్యాయి. ⇒ మోదీ పాలనలో అంబానీ, అదానీ వంటి కొద్దిమంది కుబేరులకే భారీ లబ్ధి చేకూరుతోందంటూ కాంగ్రెస్, విపక్షాలు పదేపదే చేసిన ప్రభావం కూడా ప్రజల్లోకి వెళ్లింది. ⇒ అభ్యర్థుల ఎంపికలోనూ బీజేపీ పలు తప్పిదాలు చేయడం పలు చోట్ల ఓటమికి కారణాలుగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లోని బరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన యూసఫ్.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌధురిపై 73 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందాడు. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన యూసఫ్.. రాజకీయ దురంధరుడు, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు, మూడు ఎంపీ అయిన అధిర్ రంజన్‌పై సంచలన విజయం సాధించడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధిర్ రంజన్ ప్రస్తుతం తాను ఓటమి చవిచూసిన బరంపూర్ నుంచే 1999 నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. అధిర్ రంజన్ గత లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తొలి క్రికెటర్‌గా యూసఫ్ అరుదైన ఘనత సాధించాడు. గత లోక్‌సభలో ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపీగా ఎన్నికయ్యాడు. అయితే అతను ఈసారి ఎన్నికల్లో పాల్గొనలేదు.కాగా, ఇవాళ (జూన్ 4) వెలువడుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయాలు సాధిస్తూ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. టీఎంసీ 29 స్థానాల్లో జయకేతనం ఎగరేసే దిశగా దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ ఈ ఎన్నికల్లో బెంగాల్ నుంచి టీఎంసీ విజయదుందుభి మోగించనుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఇక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వచ్చింది. అయితే బీజేపీ మాత్రం కేవలం 12 సీట్లకే పరితమితమయ్యేలా కనిపిస్తుంది.దేశవ్యాప్తంగా వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే.. గతంలో కంటే ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గణనీయంగా సీట్లు తగ్గేలా ఉన్నాయి. ప్రస్తుతమున్న సమాచారం మేరకు 543 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 292 సీట్లకు పరిమితమయ్యేలా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఈ కూటమి 300కు పైగా సీట్లు సాధించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి అనూహ్య విజయాలు సాధించే దిశగా దూసుకుపోతుంది. ఈ కూటమి ప్రస్తుతమున్న సమాచారం మేరకు 236 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. -
Lok Sabha Elections: లక్ష్యాన్ని చేరుకోని ఇరు పార్టీలు!
దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. అబ్ కి బార్... 400 పార్’ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ కూటమి (ఎన్డీయే) ఆ లక్ష్యాన్ని అందుకునే లక్షణాలు దాదాపుగా కనిపించకపోగా... అధికార పక్షాన్ని గద్దె దింపుతాం... 295 స్థానాలతో పగ్గాలు చేపడతాం అని బీరాలకు పోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి (ఇండియా) కూడా తన లక్ష్యానికి దగ్గరలోనే నిలిచిపోయింది. కాకపోతే గత ఎన్నికల్లో కేవలం 52 స్థానాలు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కోల్పోయిన కాంగ్రెస్ ఈ సారి వంద సీట్ల వరకూ సాధించడం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతానికి ఎన్డీయే, ఇండియా కూటమి భాగస్వాముల్లో ఫిరాయింపుల్లాంటివేవీ కనిపించడం లేదు కానీ.. ఫలితాలన్నీ వెలువడిన తరువాత అసలు రాజకీయం మొదలకానుంది. సరే.. రెండు ప్రధాన కూటములు తమ తమ లక్ష్యాలను సాధించలేక పోయాయి? ఎందుకు? అతి విశ్వాసమా? లేక వ్యూహ రచన లోపమా?ఎన్డీయేలో ఏం కొరవడింది?ముందుగా ఎన్డీయే కూటమి విషయం చూద్దాం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఎన్నికల రణనీతిని సమర్థంగా అమలు చేయడంలో మోడీ చాలా దిట్ట అన్న పేరు ఉంది. మోడీ-అమిత్ షాల ద్వయం అప్పట్లో కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితం కాగా.. తరువాతి కాలంలో బీజేపీ వెనకుండి నడిపించే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల బలాన్ని, క్రమశిక్షణను ఆసరాగా చేసుకుని జాతీయ స్థాయి ఎన్నికల్లోనూ తమ సత్తా చాటగలిగారు. ప్రతి నియోజకవర్గాంలోని ఒక్కో పోలింగ్ బూత్‌కు బాధ్యులుగా కొందరు కార్యకర్తలను నియమించడం... ప్రణాళికాబద్ధంగా ప్రచారం సాగించడం... తమకుతాము ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం మోడీ-అమిత్ షాల శైలి రాజకీయాలని అర్థమవుతుంది. ఈ శైలితోనే మోడీ ప్రధానిగా రెండుసార్లు గెలవగలిగారనడం అతిశయోక్తి కాదు. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303కుపైగా సీట్లు సాధించి రికార్డు సృష్టించింది కూడా. అయితే ఈ విజయంలో భాగమైన చాలామంది భాగస్వామ్య పక్షాలను నిలబెట్టుకోలేకపోయిందన్నది కూడా నిష్టూర సత్యం. భాగస్వామ్య పక్షాలు చాలావరకూ తప్పుకున్న నేపథ్యంలో బీజేపీ కొత్త మిత్రులను వెతుక్కునే ప్రయత్నాలు చేసింది. కాకపోతే ఈ మిత్రత్వం ప్రభావం తక్కువే అన్నది తాజా ఫలితాల నేపథ్యంలో స్పష్టమవుతోంది.కాంగ్రెస్ మాటేమిటి?ఒకప్పుడు దేశంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలు (రాజీవ్ గాంధీ హయాంలో 425) సాధించిన... దశాబ్దాల పాటు దేశ రాజకీయాలను ఏకపక్షంగా శాంసిన కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో గణనీయంగా బలహీన పడిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. పార్టీ రాజకీయాలన్నింటికీ ఢిల్లీని కేంద్రం చేసుకోవడం.. నమ్మకంగా పనిచేసిన సీనియర్ నేతలను నిరాదరించడం, సమయానకూలంగా వ్యూహాలను, కార్యాచరణను మార్చుకోకపోవడం వంటివన్నీ కాంగ్రెస్ పతనానికి కారణాలుగా చెప్పవచ్చు. అయితే 2019 ఎన్నికల్లో అతి స్వల్ప స్థానాలకు పరిమితమైన తరువాత గానీ ఈ పార్టీ తగిన పాఠలు నేర్చుకోలేకపోయింది. ఎన్డీయే దెబ్బకు కుదేలు కాగా మిగిలిన జవసత్వాలు కొన్నింటినైనా ఒక్కటి చేసుకుని మళ్లీ పైకి ఎదిగే ప్రయత్నాలు మొదలుపెట్టంది. పార్టీ అధ్యక్షుడిగా వైఫల్యాలు మూటకట్టుకున్న రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన భారత్ జోడో యాత్ర కానీ.. భారత్ న్యాయ యాత్ర కానీ రాహుల్ గాంధీపై అప్పటివరకూ ఉన్న ‘పప్పు’ ముద్రను తొలగించడంలో ఎంతో ఉపకరించిందనడంలో సందేహం లేదు. గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ దశ తిరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. నేతలందరూ ఐకమత్యంగా నిలబడి పోరాడితే విజయావకాశాలు పెరుగుతాయని తెలంగాణ విజయంతో అర్థమయింది. ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది మొదలు కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త జోష్‌తో పనిచేసిందని చెప్పాలి. బీజేపీ ప్రచారానికి మాటకు మాట రీతిలో జవాబివ్వడంతోపాటు ప్రచారంలోనూ కొత్త పుంతలు తొక్కింది ఈ పార్టీ. అదే సమయంలో ప్రతిపక్షాలన్నింటినీ ఒక దగ్గర చేర్చేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించాయని చెప్పాలి. దళిత నేత మల్లికార్జున ఖర్గేను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించడం, ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించబోమన్న హామీల నేపథ్యంలో ఆప్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ వంటివి ఇండియా కూటమిలో భాగంగా నిలిచాయి. ఎన్నికల్లోనూ ఐకమత్యంతో పోరాడాయి. అంతిమ ఫలితాలేమైనప్పటికీ కాంగ్రెస్, ఇండియా కూటముల ప్రదర్శన మునుపటి కంటే మెరుగుపడటం ఎన్నో రాజకీయ పాఠాలు నేర్పుతుంది. -
లోక్‌సభ ఎన్నికలు 2024 : విమెన్ పవర్ ట్రెండ్
2024 సార్వత్రిక ఎన్నికల పోరులో దేశవ్యాప్తంగా తాజా ట్రెండ్ ప్రకారం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 74 మంది మహిళా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు.భారత లోక్‌సభ ఎన్నికలలో మహిళా ఓటర్లు, పాత్ర గణనీయంగా పెరిగినప్పటికీ ఈస్థాయిలో వారికి ప్రాతినిధ్య మాత్రం పెరగడం లేదు. ఈ ఏడాది ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. 2019 ఎన్నికలలో 726 మంది మహిళలు పోటీ చేశారు. వీరిలో 78 మంది మాత్రమే పార్లమెంటు సభ్యులు (ఎంపీ) గా ఎన్నికయ్యారు.లోక్‌సభ , రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని లక్ష్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాత ఆమోదించుకున్నప్పటికీ ఇది అమలుకు నోచుకోలేదు అనడానికి ఈ ఏడాది ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యమే పెద్ద ఉదాహరణ. 2019 ఎన్నికలతో పోలిస్తే మహిళల కేటాయింపు స్వల్పంగా మాత్రమే పెరిగింది. మొత్తం 8,337 మంది అభ్యర్థుల్లో కేవలం 797 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే మహిళల సంఖ్య 1957లో 3 శాతం ఉండగా, 2024 నాటికి దాదాపు 10 శాతానికి పెరిగింది. కానీ విజేతల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది.థింక్ ట్యాంక్ PRS విశ్లేషణ ప్రకారం గత 15 ఏళ్లలో ఈ ట్రెండ్‌లో పెరుగుదల చాలా స్వల్పం. 2009లో మొత్తం అభ్యర్థులల 7 శాతం మహిళలు ఉండగా, 2024లో 9.6 శాతానికి పెరిగింది. 2014లో 8 శాతంగా ఉన్న మహిళా ప్రాతినిధ్యం 2019లో 9 శాతానికి చేరింది. 1962లో, 74 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 36 మంది విజయం సాధించారు. అత్యధిక స్ట్రైక్ రేట్ 48.6శాతంగా ఉండటం గమనార్హం. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇపుడు 2024లో పొలిటిక్ క్వీన్‌గా అవతరించింది. బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానం విజయం సాధించారు.పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ, జాదవ్‌పూర్ , మేదినిపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో తృణమూల్ కాంగ్రెస్‌కు ముగ్గరు యాక్టర్ కం పొలిటీషియన్స్ రచనా బెనర్జీ, సయానీ ఘోష్ , జూన్ మలియా గెలుపు దిశగా ఉన్నారు.బాన్సూరి స్వరాజ్: దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 23000 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి వెనుకంజలో ఉన్నారు.సుప్రియా సూలే: బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్సీపీ నేత సుప్రియా సూలే 20 వేల ఆధిక్యంతో గెలుపు.హేమమాలిని: మధుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ హేమమాలిని 1,70,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధన్గర్ వెనుకంజలో ఉన్నారు.మహువా మొయిత్రా: కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా 50,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్ వెనుకంజలో ఉన్నారు. హర్యాలోని సిరీ ఎంపీ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ 4500ఓట్ల మెజార్టీతో గెలుపు -
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ
-
కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ.. నటుడికి భారీ విజయం
2024 లోక్ సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి, నటుడు సురేశ్ గోపి విజయం సాధించారు. కేరళలోని త్రిసూర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన మలయాళ నటుడు తన ప్రత్యర్థిపై గెలుపొందారు. ఆయన విజయంతో భాజపా కేరళలో తన ఖాతా తెరిచింది. తన సమీప ప్రత్యర్థి వీఎస్ సునీల్ కుమార్‌పై(సీపీఐ) ఘనవిజయం సాధించారు. దాదాపు 73 వేలకు పైగా మెజార్టీతో సురేశ్ గోపి గెలిచారు. -
భార్య కోసం పొర్లుదండాలు.. ప్చ్, ఫలించని పూజలు!
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రకారం ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉంది. మరోసారి నరేంద్రమంత్రి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటూ సినీ నటుడు శరత్‌కుమార్ సోమవారం నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.తమిళనాడులోని విరుదునగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న తన సతీమణి, నటి రాధిక విజయం సాధించాలని, అలాగే వారణాసిలో నరేంద్రమోదీ గెలవాలని ఆలయంలో పొర్లుదండాలు పెట్టారు. అనంతరం భార్యతో కలిసి గుడిలో విశేష పూజలు నిర్వహించారు.ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌లో విరుదునగర్‌లో రాధిక మూడోస్థానానికి పడిపోయారు. విజయప్రభాకరన్ (డీఎండీకే), మాణిక్యం ఠాగూర్ (కాంగ్రెస్)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి మధ్య ఓట్ల తేడా 32గా ఉంది. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరికి గెలుపు తథ్యమని తెలుస్తోంది. రాధిక ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. Actor Sarathkumar visited the Sri Parasakthi Mariamman temple in Virudhunagar to pray for his wife and NDA candidate Radhika's success, as the counting of votes will be held on June 4.#actor #sarathkumar #visited #srioarasakthitemplE #wifesuccess @radhikasarath pic.twitter.com/eLJ5KbXEB8— Pradeep (@PRADEEPDEE2) June 3, 2024చదవండి: 100 మార్క్ దాటనున్న కాంగ్రెస్ : 2014 తరువాత ఇదే తొలిసారి -
తెలంగాణలో తొలి విజయం: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి భారీ గెలుపు
ఖమ్మం: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి విజయం నమోదైంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ విజయం సాధించారు. సుమారు 4,67,847 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. రఘురాంరెడ్డి గెలుపు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు బాధ్యతలు తీసుకొని ప్రచారం చేశారు. ఈ స్థానం ఇన్చార్జీ పొంగులేటి శ్రీనివాస్ అన్నీ తానై వ్యహరించి రఘురాంరెడ్డి గెలుపులో కీలకం అయ్యారు. సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే రఘురాంరెడ్డి. మంత్రి పొంగులేటికి వియ్యంకుడు అవుతారు.కాంగ్రెస్: 759603బీఆర్ఎస్: 297592బీజేపీ: 117075పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...కాంగ్రెస్: 7326బీఆర్ఎస్: 1490బీజేపీ: 1561 -
భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న త్రిపుర మాజీ సీఎం..
ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ముందంజలో ఉన్నారు. దిగ్గజ నేతలైన మోదీ, రాహుల్ గాంధీ వారి వారి నియోజక వర్గాల్లో దూసుకెళ్తున్నారు. త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది .2018 నుంచి 2022 వరకు త్రిపుర ముఖ్యమంత్రిగా పని చేసిన బిప్లబ్ కుమార్ దేబ్.. త్రిపుర పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నిలిచారు. ఈయన ఇప్పటికే తన సమీప ప్రత్యర్థి ఆశిష్ కుమార్ సాహా కంటే.. 5,70,071 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.అదే సమయంలో త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానంలో, బీజేపీ అభ్యర్థి కృతి దేవి డెబ్బర్మన్ తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ(ఎం)) రాజేంద్ర రియాంగ్‌పై 2,92,164 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.Former Tripura CM and BJP candidate from West Tripura Lok Sabha constituency, Biplab Kumar Deb leading from this seat with a margin of 5,70,071 votes(file pic) #LokSabhaElections2024 pic.twitter.com/CBVyvLRMa5— ANI (@ANI) June 4, 2024 -
లోక్‌సభ ఎన్నికల్లో నోటా సంచలనం
ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకునే హక్కు ప్రతీ ఓటర్‌కు ఉంది. అలాగే.. ఏ అభ్యర్థి నచ్చకుంటే నోటా(None Of The Above)కు ఓటేయొచ్చు. ఇందుకోసమే 2013లో నోటాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో నోటా సరికొత్త రికార్డు సృష్టించింది.మధ్యప్రదేశ్ ఇండోర్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఏకంగా నోటాకు లక్షన్నరకు పైగా ఓట్లు పడ్డాయి. విశేషం ఏంటంటే.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ 9,90,698 ఓట్లు పోల్‌కాగా, రెండో స్థానంలో నోటా ఓట్లు(1,72,798) ఉన్నాయి. మూడో స్థానంలో బీఎస్సీ అభ్యర్థి సంజయ్ సోలంకీ 20,104 ఓట్లతో నిలిచారు.విచిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ తమ ఓట్లను నోటాకే ఓటేయాలని ప్రచారం చేయడం. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఇక్కడ నామినేషన్ వేసిన అక్షయ్ కంటీ బామ్.. చివరి నిమిషంలో తన నామినేషన్ విత్‌డ్రా చేసుకుని బీజేపీలో చేరారు. ఇది కాంగ్రెస్‌కు పెద్ద షాకే ఇచ్చింది. ఈ పరిణామంపై ఇక్కడి నుంచి ఏడుసార్లు నెగ్గిన అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక్కడి నుంచి ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావించినా.. అందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అంగీకరించలేదు. దీంతో అనివార్యంగా పోటీ నుంచి వైదొలగింది. అయితే బరిలో నిలిచిన వాళ్లకు మద్దతు ఇవ్వకుండా.. నోటాకు ఓటేయాలని ప్రచారం చేసింది కాంగ్రెస్. తద్వారా తమ పార్టీ అభ్యర్థిని లాక్కెల్లిన బీజేపీకి నోటా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రయత్నించింది.నోటా చరిత్ర తిరగేస్తే..2019లో బీహార్ గోపాల్‌గంజ్(ఎస్సీ)లో 51,660 నోటా ఓట్లు పడ్డాయి. ఇది నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో 5 శాతంఅక్కడ జేడీయూ అభ్యర్థి డాక్టర్ అలోక్ కుమార్ సుమన్ 5,68,160 ఓట్లతో గెలుపొందారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నీలగిరిలో 46, 559 నోటా ఓట్లు పడ్డాయి. -
ఓటమి దిశగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
కాంగ్రెస్ కంచుకోట అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2024 ఎన్నికల్లో ప్రతిష్టాత్మక పోరుగా భావిస్తున్న అమేధీ నుంచి ఆమె వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిదిశగా పయనిస్తున్నారు.. కి కాంగ్రెస్ అభ్యర్థి, గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్ శర్మ 28వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నువ్వే నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో ఉత్కంఠగా మారింది.శర్మకు గత 40 సంవత్సరాలుగా అమేథీతో అనుబంధం ఉంది. అమేథీలో ప్రియాంక గాంధీ వాద్రా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమేథీకి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన రాహుల్ 2019లో ఇరానీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇండియా కూటమి దాదాపు226పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు 2019లో భారీ మెజార్జీసాధించిన బీజేపీ గతంతో పోలిస్తే 61 సీట్లతో నష్టంతో కేవలం 291 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారం పీఠం ఎవరికి దక్కనుంది అనేదానిపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమేథీ చరిత్ర ఇదీ1980లో సంజయ్ గాంధీ విజయంతో వారసత్వం ప్రారంభమైంది. అతని ఆకస్మిక మరణం తరువాత, అతని సోదరుడు రాజీవ్ గాంధీ 1981 ఉప ఎన్నికలలో విజయం సాధించారు మరియు 1984, 1989 , 1991లో విజయం సాధించారు. రాజీవ్ హత్య తర్వాత, కుటుంబ విధేయుడైన సతీష్ శర్మ 1991 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో సోనియాగాంధీ, 2004, 2009, 2014లో రాహుల్‌గాంధీ అమేథీ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నారు. -
పదేళ్ల తర్వాత సెంచరీ కొట్టిన కాంగ్రెస్
2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి, అప్కీబార్ 400 పార్అంటూ బరిలోకి దిగిన బీజేపీకి భారీ షాకిస్తోంది. 2024 ఎన్నిల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 100 మార్క్‌ను దాటే దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 227కు పైగా సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎన్డీఏ 292 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు పోటీచేసిన రెండు స్థానాల్లో రాహుల్‌గాంధీ (వాయనాడ్ , రాయబరేలీ) గెలుపుదిశగా పయనిస్తున్నారు. ఒకదశలో వారణాసిలో ప్రధాని మోదీ, తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కంటే 6223 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అలాగే యూపీలో లోక్ సభ, మహారాష్ట్ర ఫలితాలు సంచలనంగా మారబోతున్నాయి.2014లో కేవలం 44, 2019 ఎన్నికల్లో 52 సీట్లు గెలుచుకున్నకాంగ్రెస్ 2024లో 100కు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2009లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లీడ్‌గా 206 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.2014లో ఏం జరిగింది?2014లో కాంగ్రెస్ - అప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో 'మోడీ వేవ్' నేపథ్యంలో భారీ పరాజయాన్ని చవిచూసింది, 162 సీట్లు కోల్పోయింది దాదాపు 9.3 శాతం ఓట్లు పడిపోయాయి.పశ్చిమాన గుజరాత్ , రాజస్థాన్ నుండి తూర్పున బిహార్ , జార్ఖండ్ , మధ్యప్రదేశ్ వరకు హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోబీజేపీ క్లీన్ స్విప్ చేసింది. దేశంలోని 543 సీట్లలో 336 సీట్లు గెలుచుకునే మార్గంలో పదేళ్ల క్రితం బీజేపీ ఈ రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ సొంతంగా 282 సీట్లు గెలుచుకుంది.ఎన్డీయే యూపీలో 73, మహారాష్ట్రలో 41, బీహార్‌లో 31, మధ్యప్రదేశ్‌లో 27 సీట్లు గెలుచుకుంది. గుజరాత్‌లోని 26, రాజస్థాన్‌లో 25, ఢిల్లీలో ఏడు, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు, ఉత్తరాఖండ్‌లో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది జార్ఖండ్‌లోని 14లో 12, ఛత్తీస్‌గఢ్‌లోని 11లో 10, హర్యానాలోని 10 సీట్లలో ఏడు గెలుచుకుంది.2019లో ఏం జరిగింది?బీజేపీ సొంతంగా 303 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి 353 సీట్లు గెలుచుకుంది. యూపీలో 74, బీహార్‌లో 39, మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలు కైవసం చేసుకోవడంతో మరోసారి హిందీ బెల్ట్ కాంగ్రెస్ ఆశలను దెబ్బతీసింది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ,ఢిల్లీలో కూడా 77 స్థానాలను గెలుచుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొమ్మిది, జార్ఖండ్‌లో 11 స్థానాలను కలుపుకుంటే బీజేపీ ఈ బెల్ట్‌లో 238 సీట్లు సాధించింది. 2019లో అమేథీ నియోజకవర్గం బీజేపీ స్మృతి ఇరానీ చేతిలో ఘోరంగా ఓటమిని చవిచూశారు రాహుల్‌గాంధీ. -
లోక్‌సభ ఎన్నికలు 2024: ప్రధాని మోదీకి ఇష్టమైన సాత్విక ఆహారాలివే..!
ఈ రోజు (జూన్ 4, 2024) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సర్వత్ర ఉత్కంఠగా ఉంది. యావత్తు ప్రజల దృష్టి ఫలితాలపైనే ఉంది. ఏం జరుగుతుంది? ప్రజల ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు అనే ప్రశ్నలతో టెన్షన్..టెన్షన్‌గా ఉంది దేశమంతా. ఈ ప్రజా తీర్పు ఎటువైపు ఉందోనని కొందరూ అభ్యర్థులో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏం జరిగినా ..చివరికి పాజిటివ్ స్పిరిట్‌తో ముందుకు పోవాల్సిందే. ఈ రసవత్తరమైన ఆందోళనలో నేపథ్యంలో మన దేశాన్ని ఏల్లే నేతలు ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో చూద్దామా. ముఖ్యంగా మన ప్రధాని మోదీ ఇష్టపడే ఆహారాలు ఏంటో సవివరంగా తెలుసుకుందాం.ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 31న తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద దాదాపు 45 గంటలు సుదీర్ఘ ధ్యాన సెషన్లో పాల్గొన్నారు. పైగా జూన్ 1వ తేదీ వరకు కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకున్నారు. శాంతియుత జీవనాన్ని ఇషపడే మోదీ సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ఎక్కువగా గుజరాత్‌లోని వాద్నగర్లో తన ఇంటి స్థానిక రుచికరమైన వంటకాలను ఇష్టపడతాడు. మోదీకి ఇష్టమైన ఎనిమిది ఆహారాలివే..వెజ్ థాలీనివేదికల ప్రకారం, ప్రదాని మోదీ పార్లమెంటు క్యాంటీన్లో రెగ్యులర్‌గా భోజనం చేస్తారు. ఆయన ఇక్కడ ఎక్కువగా ఆర్డర్ చేసేది సాధారణ శాఖాహారం థాలీ.ఫ్రూట్ చాట్అతను స్మార్ట్ స్నాక్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి చట్పాటా చాట్ మసాలా చిలకరించిన పండ్ల మిశ్రమం అంటే చాలా ఇష్టం మోదీకి.ఖిచ్డీఒక సాధారణ గిన్నె ఖిచ్డీ, పప్పు, అన్నం మిశ్రమంలతో చేసే ఖిచ్డీ కడుపు నిండిన ఫీల్ కలిగించడమే కాకుండా మనసుకు హాయిని ఇచ్చే మంచి ఆహారం. సెవ్ తమటార్ కర్రీగుజరాతీ ఫేవరెట్, ఈ టాంగీ టొమాటో గ్రేవీ, కరకరలాడే సెవ్‌తో అగ్రస్థానంలో ఉంటుంది. మోతీ ఇష్టపడు ఆహారంలో ఇది ఒకటి. బజ్రా రోటీతన కుక్ బద్రీలాల్ మీనా తయారుచేసిన కిచ్డీతో జత చేసిన బజ్రా రోటీ తనకు ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్ అని ఒక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీనే స్వయంగా వెల్లడించారు.ధోక్లాఈ మెత్తటి ఆవిరి గుజరాతీ చిరుతిండి కూడా మోదీకి ఇష్టమైన ఆహారాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇది పులియబెట్టిన బేసన్ పిండితో తయారు చేయడం జరుగుతుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. ఖాండ్విగుజరాతీ అల్పాహారం యొక్క మరొక ప్రత్యేకత, బేసన్ యొక్క మాయాజాలంతో తయారు చేయబడిన ఈ ఆవిరి పిండి యొక్క గట్టిగా చుట్టబడిన స్పైరల్స్. ధోక్లా మరియు ఖాండ్వీని కొంచెం చాయ్‌తో సరిపోల్చండి మరియు మీకు సరైన మధ్యాహ్నం ఉంటుంది.బాదం హల్వాప్రదాని మోదీ ఇష్టపడే స్వీట్లలో బెల్లం, నెయ్యిలతో చేసే బాదం హల్వా అంటే మహా ఇష్టం. (చదవండి: మాయిశ్చరైజర్లను ఇంజెక్ట్ చేయడం గురించి విన్నారా..?) -
#ElectionsResults: సెకనుకు 2లక్షల మంది వీక్షణ
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లెక్కింపులో పారదర్శకత పాటిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకోసం అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లను అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపింది. ఓట్ల లెక్కింపుపై మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. ఈ సందర్భంగా.. ఈసీ వెబ్‌సైట్‌ను సెకనుకు 2లక్షల మంది చూస్తున్నారని తెలిపారాయన. అలాగే.. కౌంటింగ్‌ను ఈసీ బృందాలు వర్చువల్‌గా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. -
బిగ్ జడ్జిమెంట్ డే: మోదీ హ్యాట్రిక్ కొడతారా?
దేశవ్యాప్తంగా 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 543 లోక్‌సభ సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో తెలిసిపోతాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఎన్నికల ఫలితాలు 8,360 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని బయటపెట్టనున్నాయి. సర్వేలు పేర్కొన్నట్లు ఈ ఏట మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలిస్తే.. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అవుతారు. వరుసగా మోదీ మూడోసారి గెలిస్తే జవహర్లాల్ నెహ్రూ సరసన నరేంద్ర మోదీ చేరుతారు. ఇది 1984 తరువాత అతి పెద్ద రికార్డ్ అనే చెప్పాలి.ఇప్పటికే నరేంద్ర మోదీ 400 సీట్లు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయన్న రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జరిగిన ఎన్నికల్లో బీజేపీ మొత్తం 441 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 328 స్థానాల్లో బరిలోకి దిగింది.ఎన్నికల కౌంటింగ్ మొదలైపోయింది. ఇప్పటి వరకు బీజేపీ హవా సాగుతోంది. బీజేపీ ముందంజలో దూసుకెళ్తోంది. గెలుపోటములు మరి కొన్ని గంటల్లో తెలుస్తాయి. -
మొదలైన కౌంటింగ్.. బీజేపీ ఖాతాలోనే తొలి విజయం
లోక్‌సభ ఎలక్షన్ 2024 కౌంటింగ్ మొదలైంది. కానీ, బీజేపీ తొలి విజయాన్ని అందుకుందని మీకు తెలుసా?. అదేంటీ ఫలితం ఒక్క రౌండ్ కూడా పూర్తి కాకముందే ఈ గెలుపు ఎక్కడిది అంటారా?. నిజానికి ఎన్నికల కౌంటింగ్ మొదలవ్వకముందే.. బీజేపీ బోణీ కొట్టేసింది. నెల రోజులకు ముందే బీజేపీ అభ్యర్థి 'ముకేష్ దలాల్' సూరత్ నుంచి ఏకగ్రీవంగా గెలిచారు. అక్కడ నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ కొన్ని కారణాల వల్ల తిరస్కరించబడింది. అంతే కాకుండా ఇక్కడ నామినేషన్ వేసిన అభ్యర్థులంతా.. నామినేషన్ వెనక్కు తీసుకున్నారు. దీంతో ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించారు. అలా.. బీజేపీ మొదటి విజయాన్ని సాధించింది. -
బీజేపీ ప్రధాన కార్యాలయంలో స్వీట్స్ తయారీ.. గెలుపు కోసం పూజలు - వీడియో
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రి అవుతారని ఇప్పటి వరకు సర్వేలన్నీ.. మూకుమ్మడిగా పేర్కొన్నాయి. అయితే ఫలితాలు మరికొన్ని గంటల్లోనే వెల్లడవుతాయి.లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే పాట్నాలో బీజేపీ కార్యకర్తలు పండితులతో పూజలు చేయించారు. ఇందులో మోదీ ఫోటోలను ప్రదర్శిస్తూ.. పండితులు పూజలు చేస్తుంటే.. కార్యకర్తలు భజనలు చేయడం కూడా చూడవచ్చు.#WATCH | Bihar: BJP workers perform hawan and pooja in Patna ahead of the Lok Sabha Election results.Vote counting for #LokSabhaElections2024 to begin at 8 am. pic.twitter.com/lMqhtaNELh— ANI (@ANI) June 4, 2024బీజేపీ గెలుపు అనంతరం విజయోత్సవాల కోసం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పూరీలు, స్వీట్లు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో వంట చేసే కార్మికులు ఎక్కువ సంఖ్యలో తయారు చేయడం చూడవచ్చు.#WATCH | Poori and sweets being prepared at the BJP headquarters in Delhi ahead of the Lok Sabha election results .Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/XkrSIua7uF— ANI (@ANI) June 4, 2024 -
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
'అబ్కీ బార్ 400 పార్'.. అదే నిజమైతే పెనుసంచలనమే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి గెలుస్తారని ఇప్పటికే దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ రోజు (జూన్ 4) వచ్చే ఫలితాలే.. బీజేపీ సర్కార్ మళ్ళీ కేంద్రంలో వస్తుందా? వస్తే ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయాలు వెల్లడవుతాయి.ఎన్నికల ప్రచారంలో మోదీ చెప్పిన 'అబ్కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్' అనే నినాదాన్ని ప్రతిపక్షాలు అపహేళన చేశాయి. ఇప్పటి వరకు వచ్చిన 12 ప్రధాన సర్వేలు, బీజేపీ గెలుస్తుందనే చెబుతున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవేళా మోదీ ఈ మ్యాజిక్ ఫిగర్‌ను కొట్టినట్లయితే.. అది పెద్ద రికార్డ్ కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రికార్డ్‌ను ఎప్పుడో కాంగ్రెస్ దశాబ్దాల ముందే ఖాతాలో వేసుకుంది.1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.నాలుగు దశబ్దాలకు ముందు.. యూపీలో 83, బీహార్‌లో 48, మహారాష్ట్రలో 43, గుజరాత్లో 24, అలాగే మధ్యప్రదేశ్‌లో 25, రాజస్థాన్‌లో 25, హర్యానాలో 10, ఢిల్లీలో 7, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.2019లో బీజేపీ 353 స్థానాల్లో గెలిచింది. దీంతో నరేంద్ర మోదీ ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారు. 2004లో కూడా బీజేపీ, దాని మిత్ర పక్షాలు విజయం సాధించింది. అయితే ఇప్పుడు అబ్కీ బార్ 400 పార్ నినాదం కీలకమైనదిగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ పార్టీ యుపి (68), బీహార్ (33), మహారాష్ట్ర (29), రాజస్థాన్ (21), మరియు హర్యానా (7), అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో క్లీన్ స్వీప్‌ను అందజేస్తుందని చెబుతున్నాయి. ఈ సారి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనేది సర్వత్రా ఉత్కంఠభరితమైంది. -
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు.. ఘన విజయం సాధించినవారు వీరే..
Updates తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్-8, బీజేపీ-8, ఎంఐఎం-1 స్థానాల్లో విజయం సాధించాయి. వరంగల్ పార్లమెంట్ సభ్యులురాలిగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్యకు ధ్రువీకరణ పత్రం అందచేస్తున్న రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యపాల్గొన్న మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, రేవురి ప్రకాష్ రెడ్డి,నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ కెఆర్ నాగరాజు, తదితరులు మహబూబాబాద్‌లో కాంగ్రెస్ గెలుపుకాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3.24లక్షల మెజార్టీతో ఘన విజయం నాగర్‌కర్నూలులో కాంగ్రెస్ గెలుపుకాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి 85వేలకు పైగా మెజార్టీతో విజయంపెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపుకాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31లక్షలకు పైగా మెజార్టీతో విజయం భువనగిరిలో కాంగ్రెస్ గెలుపులోక్సభ ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,10,000 మెజార్టీతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అధికారికంగా ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. కరీంగనగర్‌లో బండి సంజయ్ విజయంబండి సంజయ్ కు సర్టిఫికెట్ అందజేతకరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు.మల్కాజిగిరిలో బీజేపీ గెలుపుమల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయంవరంగల్లో కాంగ్రెస్ గెలుపువరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయంజహీరాబాద్ కాంగ్రెస్ విజయంజహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ విజయం సాధించారు. సుమారు 51 వేల కోట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పై గెలుపొందారు. టిఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం హోరా హోరీగా సాగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. అధికారికంగా ఫలితాలు వెలువడవలసి ఉంది.మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 5,059 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిపై విజయం మెదక్ పార్లమెంట్లో బీజేపీ గెలుపుబీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ ఆల్ టైం రికార్డ్ మెజారిటీకేసీఆర్, వినోద్ కుమార్ పేరిట ఉన్న అత్యధిక రికార్డును బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్..2006 ఉపఎన్నికలో 2 లక్షల 1వేయి 582 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ విజయం..2014లో వినోద్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్ల మెజారిటీ..ఇంకా తుది ఫలితం వెలువడకముందే 2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో రికార్డ్ బద్ధలు కొట్టిన సంజయ్.మహబూబ్‌నగర్ పార్లమెంట్లో టెన్షన్ నెలకొందిఈవీఎం లెక్కింపుల్లో డీకే అరుణ కేవలం 1800 మెజార్టీలో ముందంజలో ఉంది.ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతోంది.పోస్ట్ బ్యాలెట్ ఓట్లు 8000 వేలు ఉన్నాయి. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుపుఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ ఘన విజయంకాంగ్రెస్ అభ్యర్థిపై 90 వేల 932 ఓట్ల మెజార్టీతో ఘన విజయంనిజామాబాద్లో బీజేపీ గెలుపునిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విజయం1,09,241 ఓట్ల మెజారిటీలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సమీప కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి మీద విజయం సాధించారు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పూర్తి అయిన కౌంటింగ్లక్ష 20 వేల ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్అధికారిక ప్రకటనే తరువాయికొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్ఇది మోదీ కుటుంబ సభ్యుల విజయంఇది ప్రజల విజయంనా గెలుపు కోసం కష్ట పడ్డ కార్యకర్తలకు ధన్య వాదాలుమూడో సారి ప్రధాని అవుతున్న మోదీ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి పురోగతి సాధిస్తుంది.పెద్దపల్లి పార్లమెంట్:రామగిరి జేఎన్టీయూ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణసుమారు లక్షకుపైగా ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణగత పది సంవత్సరాల కాలంలో పెద్దపెల్లి పార్లమెంటు అభివృద్ధిలో వెనుకబడిపోయిందిపెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తాతన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మంత్రి శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన వంశీకృష్ణనల్లగొండ పార్లమెంట్‌రికార్డ్ మెజార్టీతో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి23వ రౌండ్ ముగిసేసరికి 5,51,168 ఓట్ల ఆధిక్యం లో రఘువీర్ రెడ్డికాంగ్రెస్ రఘువీర్ రెడ్డి - 7,70,512రెండవ స్థానం - బిజెపి - శానంపూడి సైదిరెడ్డి - 2,19,344మూడవ స్థానం - బీఆర్ఎస్ - కంచర్ల కృష్ణారెడ్డి - 2,16,050 నాగర్ కర్నూల్ పార్లమెంట్ (రౌండ్ 14)కాంగ్రెస్ 24,427బీజేపీ 21,814బీఆర్ఎస్ 14,099కాంగ్రెస్ మొత్తం లీడ్ 49,986భువనగిరి పార్లమెంట్(రౌండ్: 12)బీజేపీ: 22292కాంగ్రెస్: 31512బీఆర్ ఎస్: 13380రౌండ్ లీడ్: 9220మొత్తం లీడ్ 117308ఖమ్మం పార్లమెంట్ఖమ్మం లోక్‌సభలో 4, 48, 209 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్కాంగ్రెస్-735697బీఆర్ఎస్-287488బీజేపీ-114957మెదక్ పార్లమెంట్12వ రౌండ్. పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 29,300 ఓట్ల ఆధిక్యంకాంగ్రెస్ 2,45,089బీజేపీ =2,74,389బీఆర్ఎస్- 2,24,831 మెదక్ పార్లమెంట్10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 19739 ఓట్ల ఆధిక్యంకాంగ్రెస్ 203632బిజెపి 223371బి ఆర్ ఎస్ 192533చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ఓటమిని అంగీకరిస్తూ.. కొండ విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన గడ్డం రంజిత్ రెడ్డిప్రజలు ఏకధాటిగా వెళ్లిన విషయంపై ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపిన రంజిత్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్‌రికార్డ్ మెజార్టీ దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి5 లక్షల 18 వేల ఓట్ల ఆధిక్యంలో విజయం దిశగా రఘువీర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్పెద్దపల్లి పార్లమెంటు నియోజవర్గ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీమల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2 లక్షల ఓట్ల ఆధిక్యంజహీరాబాద్ పార్లమెంటు ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ( 31, 236 ఓట్ల లీడ్) కాంగ్రెస్ - 416927బీజేపీ.. బీబీ పాటిల్- 385301బీఆర్ఎస్... గాలి అనిల్ - 140006కాంగ్రెస్ తొలి విజయంతెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి విజయం నమోదైంది.ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. కరీంనగర్ పార్లమెంట్ 11 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 1,25,575 ఓట్ల ఆధిక్యతబిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 3,02,109కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 1,76,623బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 1,44,541 నల్లగొండ పార్లమెంట్నల్లగొండలో విజయం దిశగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి24 వ రౌండ్ ముగిసే సమయానికి 3,55,674 ఓట్లతో రఘువీర్ రెడ్డి అధిక్యం నిజామాబాద్ పార్లమెంట్10వ రౌండ్ ముగిసే సరికి 60,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్అధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్లలో బీజేపీ ఆధిక్యం.జగిత్యాల, బోధన్, నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి స్వల్ప ఆధిక్యం ఆదిలాబాద్ పార్లమెంట్బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ 50,913 లీడింగ్బీజేపీ: 2, 81, 004కాంగ్రెస్ : 2,30,091బిఆర్ఎస్ : 68, 43111 రౌండ్ల కౌంటింగ్ పూర్తిమహబూబ్ నగర్ పార్లమెంటుబీజేపీ అభ్యర్థి డీకే అరుణ 15, 571 ఓట్ల ఆధిక్యంబీజేపీ 2,58,932కాంగ్రెస్ 2,43,361బీఆర్ఎస్ 86,86810 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి పెద్దపల్లి పార్లమెంట్63,507 ఓట్ల ఆదిక్యంతో గడ్డం వంశీకృష్ణ ముందంజబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు (95,959).కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు (2,51,127).బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ కు (1,87,620).10వ రౌండ్ల కౌంటింగ్ పూర్తి ఖమ్మం పార్లమెంట్3,06,090 ఓట్ల కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి భారీ ఆధిక్యంలో ఉన్నారు.కాంగ్రెస్: 510057భారాస: 203967భాజపా: 80562నల్లగొండ పార్లమెంట్నల్లగొండ పార్లమెంట్ 22వ రౌండ్ ఫలితాలు3,28,534 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.కాంగ్రెస్ 4,82,305బీజేపీ 1,53,771బీఆర్ఎస్ 1,36,268భువనగిరి పార్లమెంట్1,01,814 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 2,97,419బీజేపీ 1,95,605బీఆర్ఎస్ 1,29,07117వ రౌండ్ల కౌంటింగ్ పూర్తి నల్గొండ పార్లమెంట్20వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 3,03,645 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ - 4,48,198బీజేపీ... 1,44,553బీఆర్ఎస్... 1,24,247 వరంగల్ పార్లమెంట్10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 85,193 లీడ్‌బీజేపీ: 1,51,212కాంగ్రెస్: 2,36,405బీఆర్ఎస్: 96,839 ఆదిలాబాద్.. గోడం నగేశ్ (భాజపా) 47,301 లీడ్చేవెళ్ల.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి (భాజపా) 61,783 లీడ్హైదరాబాద్.. అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) 38,424 ఓట్ల ఆధిక్యంకరీంనగర్.. బండి సంజయ్ (భాజపా) 92,350 ఆధిక్యంఖమ్మం.. రామసహాయం రఘురామ్ రెడ్డి (కాంగ్రెస్) 2,56,407 లీడ్మహబూబాబాద్.. బలరాం నాయక్ (కాంగ్రెస్) 1,42,229 లీడ్సికింద్రాబాద్.. జి కిషన్ రెడ్డి (భాజపా) 43,569 ఓట్ల లీడ్మహబూబ్ నగర్.. డీకే అరుణ (భాజపా) 10,714 లీడ్‌మల్కాజిగిరి.. ఈటల రాజేందర్ (భాజపా) 1, 47,229 లీడ్నాగర్ కర్నూల్.. మల్లు రవి (కాంగ్రెస్) 24,274 లీడ్నిజామాబాద్.. ధర్మపురి అర్వింద్ (భాజపా) 28,969 లీడ్మెదక్.. రఘునందన్ రావు (భాజపా) 10,714 లీడ్పెద్దపల్లి.. గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 37,171 లీడ్వరంగల్.. కడియం కావ్య (కాంగ్రెస్) 77,094 ఓట్ల లీడ్జహీరాబాద్.. సురేశ్ షెట్కార్ (కాంగ్రెస్) 12,574 ఓట్ల లీడ్ పెద్దపల్లి పార్లమెంట్ఏడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 37,481 ఆధిక్యంకాంగ్రెస్... 174522బీజేపీ... 137041బీఅర్ఎస్... 67435నల్లగొండ పార్లమెంట్16వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 2,56,293 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 3,75,969బీజేపీ 1,19,676బీఆర్ఎస్ 103717భువనగిరి పార్లమెంట్12 రౌండ్లు పూర్తి ఆయ్యేసరికి 84,013 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 2,38,118బీజేపీ 1,54,105బీఆర్ఎస్ 1,02,155నల్లగొండ పార్లమెంట్14వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 2,44,952 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 3,59,298బీజేపీ 1,14,346బీఆర్ఎస్ 98,295తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గం ఫలితాల వివరాలు...నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థుల లీడ్.37వేల ఆధిక్యంలో కొనసాగుతున్న ఆదిలాబాద్ బిజెపి అభ్యర్థి గోదాం నగేష్.59 వేల మెజారిటీతో కొనసాగుతున్న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల కిరణ్.33000 ఆదిత్యంలో కొనసాగుతున్న చేవెళ్ల బిజెపి పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.ముప్పై నాలుగువేల ఆధిక్యంలో కొనసాగుతున్న హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అభ్యర్థి ఓవైసీ.72,000 ఆదిత్యంలో కొనసాగుతున్న కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ఒక లక్ష 74 వేల ఆదిత్యంలో కొనసాగుతున్న ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి.లక్ష ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్.9000 ఓట్ల ఆదిత్యంలో కొనసాగుతున్న మహబూబ్‌నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ.ఒక లక్ష తొమ్మిది వేల ఆదిత్యంలో కొనసాగుతున్న మల్కాజిగిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్.3000 ఓట్ల ఆదిత్యంతో కొనసాగుతున్న మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి.21 వేల ఓట్ల ఆదిత్యంతో కొనసాగుతున్న నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి.1,98,000 ఆదిక్యంలో కొనసాగుతున్న నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్.16 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నిజామాబాద్ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్.32వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.43 వేల ఓట్ల ఆదిత్యంలో కొనసాగుతున్న సికింద్రాబాద్ బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి.56 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య.పదివేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్టికారి.ఆదిలాబాద్ పార్లమెంట్గోడెం నగేశ్ (బీజేపీ) 38,283 ఓట్ల ఆధిక్యంచేవెళ్ల పార్లమెంట్బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి 33,086 ఓట్ల లీడ్‌మల్కాజిగిరి పార్లమెంట్ ఈటా రాజేందర్ (బీజేపీ) 1, 05,472 లీడ్ హైదరాబాద్ పార్లమెంట్34,125 ఓట్ల లీడింగ్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఖమ్మం పార్లమెంట్ 10 వ రౌండ్ ముగిసేసరికి 1,68,922 ఆధిక్యంలో కాంగ్రెస్కాంగ్రెస్.. 2, 85905బీఆర్ఎస్.. 118983బీజేపీ.. 39105నల్లగొండ పార్లమెంట్1,70,783 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.కాంగ్రెస్...2,47,930బీజేపీ....77,147బీఆర్ఎస్... 71,984నల్లగొండ లోక్‌సభ ఆరు రౌండ్లు పూర్తిమహబూబ్ నగర్: మూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి డీ. కే. అరుణకు 6,984 ఓట్ల ఆధిక్యతమెదక్ పార్లమెంట్బీఆర్ఎస్ ముందంజబీఆర్ఎస్ అభ్యర్థి పరిపాటి వెంకట్రామిరెడ్డి 109931 ఓట్ల ఆధిక్యంపెద్దపల్లి పార్లమెంట్:నాలుగు రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ 24511 లీడ్‌లో కొనసాగుతోందికాంగ్రెస్:103344బీజేపీ:78833బీఆర్ఎస్:39145 భువనగిరి పార్లమెంట్‌భువనగిరి పార్లమెంట్ ఆరో రౌండ్ పూర్తి అయ్యేసరికి 48,622 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం.కాంగ్రెస్ 1,43,167బీజేపీ 94,545బీఆర్ఎస్ 64,241సీపీఐఎం 11,772 పెద్దపెల్లి పార్లమెంట్3వ రౌండ్ తర్వాత ముందంజలో కాంగ్రెస్12700 ఓట్ల మెజారిటీలో గడ్డం వంశీకృష్ణ కరీంనగర్ పార్లమెంట్4 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 51,770 ఓట్ల ఆధిక్యతబిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 11,4779కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 63,009బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 52,432 ఆదిలాబాద్ పార్లమెంట్ : నాలుగొవ రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ 31965 లీడ్‌బీజేపీ:- 1,09,766కాంగ్రెస్ : 77801బిఆర్ఎస్ : 25198 ఖమ్మం పార్లమెంట్కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఖమ్మం పార్లమెంట్6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1,26,000 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాహాయం రఘురాం రెడ్డి వరంగల్ పార్లమెంట్మూడు రౌండ్లు ముగిసేసరికి వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 34,522 లీడ్నిజామాబాద్ పార్లమెంట్మొదటి రౌండ్ ముగిసేసరికి జగిత్యాల్ తప్ప మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఆదిక్యత మొత్తం 11606 ఓట్ల ఆదిక్యంలో బీజేపీఖమ్మం పార్లమెంట్కాంగ్రెస్ లీడ్ : 24130 ( 3వ రౌండ్ )బీఆర్ఎస్ : 18206కాంగ్రెస్ : 42336బీజీపీ : 4841 ఖమ్మం పార్లమెంట్6వ రౌండ్ వరకు 1,25,360 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటీ నల్లగొండ జిల్లాకౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన నల్లగొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డికరీంనగర్ పార్లమెంట్ 26 వేల 208 ఓట్లతో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్2 రౌండ్లు పూర్తి నాగర్ కర్నూల్లో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ఆధిక్యంమహబూబ్నగర్లో డీకే ఆరుణ (బీజేపీ) ముందంజపెద్దపల్లిలో గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) ముందంజజహీరాబాద్లో సురేష్ షెట్కార్ (కాంగ్రెస్) ఆధిక్యంభువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి( కాంగ్రెస్) ముందంజ వరంగల్‌లో కడియం కవ్య (కాంగ్రెస్) ఆధిక్యం సికింద్రాబాద్ పార్లమెంట్ 7113 ఓట్ల ఆదిక్యoలో కొనసాగుతున్న బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిజహీరాబాద్ పార్లమెంట్కాంగ్రెస్ అభ్యర్తి సురేష్ షెట్కార్ లీడ్ 7,501రెండో రౌండ్ లెక్కింపు పూర్తికాంగ్రెస్ 27,508 బీబీ పాటిల్ - బిజెపి 23,350 గాలి అనిల్‌కుమార్ టిఆర్ఎస్ - 8,363 వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2009 ఓట్ల ఆధక్యతనిజామాబాద్ పార్లమెంట్బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆధిక్యంరెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి14156 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అరవింద్.కనీస పోటీ ఇవ్వలేక పోతున్న బీఆర్ఎస్కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్న బీఆర్ఎస్ ఏజెంట్లుజహీరాబాద్ పార్లమెంట్ రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 7,501 ఓట్ల ఆదిత్యం చేవెళ్ల పార్లమెంట్రెండు రౌండ్లు ముగిసే సరికి 14169 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముందంజనల్లగొండ పార్లమెంట్భారీ ఆధిక్యం దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిఐదో రౌండ్ ముగిసేసరికి 91 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి భువనగిరి పార్లమెంట్‌భువనగిరి లోక్ సభ 4వ రౌండ్ ముగిసేసరికి 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ 5094 లీడ్పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో 1వ రౌండ్ పూర్తి.గోమాస్ శ్రీనివాస్ బీజేపి:- 18401గడ్డం వంశీ కృష్ణ కాంగ్రెస్:- 23495కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్:- 9312 నల్లగొండ జిల్లాభారీ ఆధిక్యం దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిమూడో రౌండ్ ముగిసేసరికి 70 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి ఆదిలాబాద్ పార్లమెంట్ మొదటి రౌండ్లో బిజెపి అభ్యర్థి గోడం నగేష్ 8806 ఓట్లతో ఆధిక్యంబీజేపీ :- 28429కాంగ్రెస్ : 19623బిఆర్ఎస్ : 5660 మహబూబ్ నగర్ మొదటి రౌండ్ 874 ఓట్ల ఆదిక్యంలో బీజేపీ బీజేపీ - డీకే అరుణ దేవరకద్రలో పోలైన ఓట్లు 4648కాంగ్రెస్ - చల్లా వంశీచంద్ రెడ్డి దేవరకద్రలో పోలైన ఓట్లు 3774బీఆర్ఎస్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి దేవరకద్ర లో పోలైన ఓట్లు 1700. నల్లగొండ జిల్లానల్లగొండ, భువనగిరి రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ మెదక్ పార్లమెంట్బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం నిజామాబాద్నిజామాబాద్ లోక్ సభలో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఏడు వేల ఓట్ల ఆధిక్యం వరంగల్ పార్లమెంట్మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అధిక్యంకాంగ్రెస్: 30123బీజేపీ: 21719బీఆర్ఎస్: 14683లీడ్: 8404 (కాంగ్రెస్) మెదక్ పార్లమెంట్ ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆధిక్యంనీలం మధు కాంగ్రెస్ 3888రఘునందన్ రావు బీజేపీ 1538వెంకటరామిరెడ్డి టిఆర్ఎస్ 2213 నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యం ఖమ్మం పార్లమెంట్కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ఆధిక్యం2వ రౌండ్ (కాంగ్రెస్ లీడ్ : 26008)బీఆర్ఎస్ : 20041కాంగ్రెస్ : 46049బీజీపీ : 5216రెండు రౌండ్లు పూర్తి అయేసరికి 42,710 లీడ్ యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ భువనగిరి రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4000కు పైగా ఓట్ల ముందంజమహబూబ్ నగర్ బీజేపీ లీడ్ 874ఖమ్మంలో నామా ఔట్..!కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఆధిక్యం నల్లగొండ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం2777 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికాంగ్రెస్-6001భాజపా-3224బీఆర్ఎస్ -1264యాదాద్రి భువనగిరి జిల్లామొదటి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4204 ఆధిక్యత భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ఆధిక్యం కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్ మహబూబాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో 14, 526 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందుంజ ఆదిలాబాద్ పార్లమెంట్ముధోల్ నియోజకవర్గంమొదటి రౌండ్లీడ్ : 3091(బీజేపీ)కాంగ్రెస్: 2363బిజెపి : 5464బిఆర్ఎస్ : 715 నల్లగొండమొదటి రౌండ్లో కాంగ్రెస్ 2777 మెజారిటీకాంగ్రెస్ ... 6001బిజెపి .... 3224టిఆర్ఎస్.... 1264 మహబూబాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో 11406 ఓట్ల మెజార్టీ మహబూబ్ నగర్లో పోస్టల్ బ్యాలెట్లలో డీకే అరుణ లీడ్నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ లీడ్కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ ఆధిక్యంమొదటి రౌండ్లో 1400 ఓట్లు ఆధిక్యంలో బండి సంజయ్ మహబూబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 10283 ఓట్ల మెజార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5644 ఓట్ల మెజార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్: లీడ్ (బిజెపి): 1168నిర్మల్ నియోజకవర్గ: మొదటి రౌండ్ : బిజెపి 3872కాంగ్రెస్ 2643బీఆర్ఎస్ 585నిజామాబాద్ పార్లమెంటుపోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం వరంగల్ పార్లమెంట్ ( 1వ రౌండ్)బిజెపి లీడ్ : 240బీఆర్ఎస్ : 3870కాంగ్రెస్ :6494బీజీపీ : 6726మహబుబాబాద్నర్సంపేట నియోజకవర్గంలో మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ 1083 ఓట్ల ఆధిక్యం ఖమ్మం పార్లమెంట్ (1వ రౌండ్)కాంగ్రెస్ లీడ్ : 16702బీఆర్ఎస్ : 18794కాంగ్రెస్ :35496బీజీపీ :4351 మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఆధిక్యం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2000 పైచిలుకు ముందంజ నల్లగొండ మొదటి రౌండ్లో కాంగ్రెస్ ముందంజ జహీరాబాద్: తొలి రౌండులో ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్ కరీంనగర్లో బండి సంజయ్ ఆధిక్యం యాదాద్రి భువనగిరిభువనగిరి సెగ్మెంట్లో మొదటి రౌండ్లో బూర నర్సయ్య గౌడ్ లీడ్తొలి రౌండ్ లో 117ఓట్ల ఆధిక్యంలో బీజేపీబీజేపీ 3976కాంగ్రెస్ 3859బీఆర్ఎస్ 2681 వరంగల్‌లో కడియం కావ్య ఆధిక్యం కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రారంభమైన ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియఆదిలాబాద్ పార్లమెంట్: ఖానాపూర్ నియోజకవర్గం:మొదటి రౌండ్: కాంగ్రెస్: 3,297బిజెపి : 3902బిఆర్ఎస్ : 859లీడ్ : 605(బీజేపీ) సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ఆధిక్యం నల్లగొండ జిల్లానల్లగొండ లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి ఆధిక్యం ఖమ్మంఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘురం రెడ్డి ముందంజ ముషీరాబాద్ నియోజకవర్గం AV కాలేజీ లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తిబీజేపీ 4733 కాంగ్రెస్ 1318బీఆర్ఎస్ 10973325 ఓట్ల లీడ్ లో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్లో మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ లీడ్816 ఓట్ల తో ముందంజ మహబూబ్ నగర్లో డీకే అరుణ ఆధిక్యంఖమ్మంలో కాంగ్రెస్ ఆధిక్యంమల్కాజిగిరిమల్కాజిగిరి పార్లమెంట్ పరిధి ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెట్లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్లతో ఆధిక్యంబీజేపీ :-8811కాంగ్రెస్ :2581బిఆర్ఎస్ :1418కరీంనగర్ జిల్లా: బీజేపీ ముందంజమొత్తం పోస్టల్ బ్యాలెట్: 108479287 (ఎంప్లాయిస్ + సర్వీస్ ఓటర్లు)1560 (హోం ఓటింగ్) యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి పట్టణ పరిధిలో అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంన కౌంటింగ్ ప్రక్రియ ఖమ్మంలోని కిట్స్ కాలేజీలో ప్రారంభమైన కౌంటింగ్మంచిర్యాల జిల్లాలో ఐజ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ పెద్దపెల్లి జిల్లా :ప్రారంభమైన పెద్ద పెల్లి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది,పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపునిజామాబాద్నిజామాబాద్ లోక్ సభ కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ సెంటర్లో అపశ్రుతికౌంటింగ్ సూపర్ వైజర్‌కు అస్వస్థతకళ్ళుతిరిగి పడిపోవడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు నల్లగొండ జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియనల్లగొండ పార్లమెంటుకు సంబంధించి దుప్పలపల్లిలోనే వేర్ హౌసింగ్ గోదాముల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపుమొదట పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఆ తర్వాత ఈవీఎం లలోని ఓట్లను లెక్కిస్తున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్లో మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకరీంనగర్ జిల్లా:ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందిపోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పూజలుఅమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలుకేంద్రంలో మూడోసారి ఎన్డీయే కూటమిదే విజయంతెలంగాణలో బీజేపీ అధిక సీట్లు గెలుచుకుంటుంది#WATCH | Union Minister & BJP's Telangana President G Kishan Reddy says, "PM Narendra Modi will take oath in the second week of this month with the blessings of the people..."He says, "People from all over the world are watching our Lok Sabha elections. I have full faith that… pic.twitter.com/2a3r4wxlW8— ANI (@ANI) June 4, 2024మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుస్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎం లను లెక్కింపు కేంద్రాలకు తరలింపు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులుకోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం గ్రౌండ్స్, ఏవి కాలేజ్ మాసబ్ ట్యాంక్ లలో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులుహైదరాబాద్:సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పార్లమెంట్ కౌంటింగ్ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కలు వేయనున్న అధికారులుఎనిమిదిన్నరకు ఈవీఎంల లెక్కలను ప్రారంభించనున్న సిబ్బందికంటోన్మెంట్ లో మాత్రం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం నల్లగొండ జిల్లానల్లగొండ లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుయాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునిజామాబాద్: ఓట్ల లెక్కింపు ప్రారంభం8హాళ్లలో మొదలైన కౌంటింగ్తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది నిజామాబాద్: డిచ్పల్లి సిఎంసిలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధంపార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్.8 హళ్ల లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్న అధికారులునిజామాబాద్ రూరల్ & అర్బన్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 20 టేబుళ్ళుబోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల కు 18 చొప్పున టేబుళ్ళ ఏర్పాటు.15 రౌండ్లు లో మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తి.మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితంఓట్ల లెక్కింపు కోసం 558 మంది కౌంటింగ్ సిబ్బంది,అభ్యర్థులు ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలనీ అధికారుల సూచనరిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఎంట్రీ పాస్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి.మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.కౌంటింగ్ కేంద్రం చుట్టూ ,5 కిలో మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలుమూడు అంచెల్లో భద్రత ఏర్పాట్లు1000 మంది పోలీసులతో బందో బస్తుపోలైన పోస్టల్ ఓట్లు 7414మొత్తం సర్వీస్ ఓట్లు 724మొత్తం ఓట్లు 17,4867పోలైన ఓట్లు 12, 26 133పోలింగ్ శాతం. 71.9240 నిమిషాల్లో తొలి రౌండ్ పలితంఖమ్మంలోకసభ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంపోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ఖమ్మం పార్లమెంటు పరిధిలో ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లు7 అసెంబ్లీ సెగ్మెంట్ లలో తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటుప్రతి కౌంటింగ్ హాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్, ఏర్పాటుఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి 18 టేబుళ్లు ఏర్పాటుకౌంటింగ్ విధుల నిర్వహణకు ప్రతి కౌంటింగ్ హాల్ వద్దఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులు ఉంటారుఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 20 రౌండ్లుపాలేరు, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లుమధిర లో 19, వైరాలో 18, కొత్తగూడెం లో 18, అశ్వారావుపేట సెగ్మెంట్ లో 13 రౌండ్లు లెక్కింపు చేపడుతారుపోస్టల్ బ్యాలెట్ ఓట్లు తో కౌంటింగ్ మొదలు అవుతుంది.వీ వీ ప్యాట్ల స్లిప్ లు ప్రామాణికంగా తీసుకుంటారు.పోస్టల్ బ్యాలెట్ ఇటిపిబిఎస్ లతో కలిపి 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తారుకంట్రోల్ యూనిట్ల లోని ఓట్లు లెక్కించిన తరువాతగెలుపొందిన పార్టీ అభ్యర్థి ని కౌంటింగ్ సూపర్ వైజర్ నిర్ధారించాల్సి ఉంటుందిఅనంతరం సదరు అభ్యర్థి కి అర్ ఓ ద్రువపత్రం అందజేస్తారు..దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభంఫలితాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లలో టెన్షన్హైదరాబాద్, సికింద్రాబాద్ కేంద్రాల్లో 14-15 రౌండ్లలో ఓట్ల లెక్కింపుచొప్పదండి, దేవరకొండ అసెంబ్లీ స్థానాల్లో 21 రౌండ్లలో కౌంటింగ్మంచిర్యాల, మంథని, పెద్దపల్లిలో 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు కరీంనగర్:ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఓట్లు లెక్కింపునకు సర్వం సిద్ధంహైదరాబాద్మల్కాజీగిరి పార్లమెంట్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధంమొత్తం 158 టేబుల్స్19 లక్షల ఓట్ల లెక్కింపుపోస్టల్ బ్యాలెట్ కోసం మరో 20 అదనంగా టేబుల్స్ఏడు నియోజకవర్గాలకు 9 కౌంటింగ్ హాల్స్బోగారం హోలీ మేరీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంమొత్తం 178 టేబుల్స్ ఏర్పాటువీటిలో 20 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం ఏర్పాటు చేసారుమొత్తం 37 లక్షల 79 వేల 596 ఓటర్లు ఉండగా వీరిలో 19 లక్షల 19 వేల 131 ఓట్లు పోలయ్యాయిమొత్తంగా 50.78 శాతం ఓట్లు నమోదయ్యాయిఈ ఓట్లను 575 మంది సిబ్బంది లెక్కించనున్నారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంనల్లగొండ స్థానానికి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్‌లో కౌంటింగ్భువనగిరి స్థానానికి అరోరా కాలేజ్ లో కౌంటింగ్ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటునల్లగొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 17, 25, 465పోలైన ఓట్లు 12,77, 137నల్లగొండ లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 22భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 39నల్లగొండ వివరాలుఅసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్ లు, రౌండ్లుమిర్యాలగూడ 264(19)సూర్యాపేట 271(20)నల్లగొండ288(21)కోదాడ296(22)హుజూర్ నగర్ 308(22)నాగార్జునసాగర్ 306(22)దేవరకొండ 328(24) నల్లగొండ లోక్ సభ పరిధిలో తొలుత పూర్తి కానున్న మిర్యాలగూడ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుచివరగా పూర్తి కానున్న దేవరకొండ నియోజకవర్గ ఓట్లుభువనగిరి లోక్ సభ స్థానంమొత్తం ఓటర్లు 18,08, 585పోలైన ఓట్లు 13,88,680అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూతులు రౌండ్లుఇబ్రహీంపట్నం 348(18 రౌండ్లు, 20 టేబుల్స్)మునుగోడు 317(18 రౌండ్లు, 18 టేబుల్స్)తుంగతుర్తి 326 (19, 18 టేబుల్స్)భువనగిరి 257(19)నకిరేకల్ 311(23 రౌండ్లు)ఆలేరు 309(23)జనగామ 278(20)భువనగిరి స్థానంలో పోలింగ్ బూతులు ఎక్కువగా ఉన్నా తొలుత పూర్తికానున్న ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, మునుగోడుహైదరాబాద్‌బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతఫలితాలు కోసం ఎదురు చూస్తున్నాబీజేపీ 400 సీట్లు గెలుస్తాం#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf— ANI (@ANI) June 4, 2024 నాగర్ కర్నూల్ జిల్లా:నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఎర్పాట్లు పూర్తినాగర్ కర్నూల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు7 అసెంబ్లీలో సెగ్మెంట్ లలో - 17,38,254 ఓటర్లు7 సెంబ్లీలలో 2057 పోలింగ్ కేంద్రాలుఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,07,471 (69.46%)పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 14,491. (85.95%)ఉదయం. 8-00 గంటలనుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంమొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రతా ఏర్పాట్లుప్రతీ కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్‌కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటుపోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన 12455 ఓట్ల లెక్కింపుకు ప్రత్యేకంగా 14 టేబుల్స్ మహబూబ్ నగర్పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.ఏడు సెగ్మెంట్లలోని 1937 ఈవీఎంల కౌంటింగ్బరిలో 31 మంది అభ్యర్థులు.నాగర్ కర్నూల్వ్యవసాయ మార్కెట్ కమిటీ లో నాగర్ కర్నూల్ ఓట్ల లెక్కింపుఏడు సెగ్మెంట్లలోని 2057 ఈవీఎంల కౌంటింగ్బరిలో 19 మంది అభ్యర్థులు ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించి కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుందిఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లోని మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయిఖమ్మం నియోజకవర్గం సంబంధించి మాత్రం 18 టేబుల్స్ ఏర్పాటు చేయగా మిగతా ఆరు నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారుప్రతి టేబుల్ దగ్గర ముగ్గురు అధికారుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కౌంటింగ్ కోసం కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి..ఉదయం 8 గంట నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్..బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు..మొత్తం 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లు..పోలైన ఓట్లు 13 లక్షల 3 వేల 691..పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు వేర్వేరుగా హాల్స్ ఏర్పాటు..కరీంనగర్ నియోజకవర్గానికి 18 టేబుల్స్ ఏర్పాటు..మిగిలిన 6 నియోజకవర్గాలకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు..రౌండ్స్ వారీగా కొనసాగనున్న లెక్కింపు ప్రక్రియ..కరీంనగర్ 22, చొప్పదండి 24, వేములవాడ 19, సిరిసిల్ల 21, మానకొండూరు 23, హుజూరాబాద్ 22, హుస్నాబాద్ 22 రౌండ్లవారీగా కొనసాగనున్న లెక్కింపు..ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం కానున్న ప్రక్రియ..పోస్టల్ బ్యాలెట్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు..కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 9 వేల 287 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు..నేటి నుంచి రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షల కొనసాగింపు, 144 సెక్షన్ అమలు..ఒక్క రౌండ్ ఫలితం వెల్లడి కావడానికి అరగంట సమయం..మధ్యాహ్నం వరకు విజేత ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం..ఒక్కో నియోజకవర్గంలో ర్యాండమ్ గా 5 ఈవీఎంలకు సంబంధించిన 5 వీవీ ప్యాట్ల లెక్కింపు చేయనున్న అధికారులు..ఈవీఎంలు, వీవీప్యాట్లలో లెక్క సరిపోతేనే అధికారికంగా అభ్యర్థి ప్రకటన..ఒక్కో టేబుల్ కు ముగ్గురు సిబ్బంది చొప్పున 124 మంది కౌంటింగ్ సూపర్ వైజర్స్, 124 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 124 మంది మైక్రో అబ్జర్వర్స్ ఏర్పాటు.పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం(SC)అభ్యర్థులు 42 మందిఅసెంబ్లీ నియోజకవర్గం టేబుల్స్ రౌండ్స్ చెన్నూర్ నియోజకవర్గం 14 16 బెల్లంపల్లి నియోజకవర్గం 14 16మంచిర్యాల నియోజకవర్గం 14 21 ధర్మపురి నియోజకవర్గం 14 19రామగుండం నియోజకవర్గం 14 19మంథని నియోజకవర్గం 14 21పెద్దపల్లి నియోజకవర్గం 14 21పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ టేబుల్స్ 98, రౌండ్స్ 132#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf— ANI (@ANI) June 4, 2024 రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ సీట్లు సాధిస్తుందన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.మంగళవారం ఉదయమే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు.గత నెల 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయంతెలిసిందే.కంటోన్మెంట్ సీటు ఓట్లను సైతం మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.మొత్తంగా 525 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2,18,14,025 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.65.67శాతం పోలింగ్ నమోదైంది.లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో.. మొత్తం 139 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు.ఇందులో 120 హాళ్లలో ఈవీఎం ఓట్లు, 19 హాళ్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఒక్కో హాల్లో 24 టేబుల్స్ ఉంటాయి.మహేశ్వరం స్థానం పరిధిలో 28 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి రావడంతో రెండు హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు.దీంతో ఈవీఎం ఓట్ల కౌంటింగ్ హాళ్ల సంఖ్య 120కి పెరిగింది. మొత్తం 10వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు.చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన లోక్‌సభ ఓట్లను అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కించనున్నారు.ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కిస్తారు.చాలా స్థానాల పరిధిలో 18 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.ఒక్కో టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక ఏఆర్ఓ, ఇద్దరు సహాయకులు, అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు.ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఏకకాలంలో అన్ని టేబుళ్లలో నిర్వహించే లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారు.అలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్ వివరాలను కేంద్రం నుంచి వచి్చన పరిశీలకుడి పరిశీలనకు పంపిస్తారు.పరిశీలకుల ఆమోదం తర్వాత తదుపరి రౌండ్ లెక్కింపును ప్రారంభిస్తారు.అదే సమయంలో ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తయిన కొద్దీ.. స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఫలితాలను ప్రకటిస్తారు.రౌండ్ల వారీగా ఫలితాలపై ఫారం–17సీ మీద కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు.ప్రతి శాసనసభ స్థానం పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి.. ఈవీఎంలలోని ఓట్లను, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి చూస్తారు.ఎన్నికల ఫలితాలను ప్రదర్శించడానికి 78 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే రానిస్తారు.నేడు మద్యం షాపులు బంద్‌లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం రోజున తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.ఇక ఫలితాలు వచి్చన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు.స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ముందుగా అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చు.ఉదయం 10.30 కల్లా ఆధిక్యతపై స్పష్టత!మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.2.18లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువే సమయం పట్టే అవకాశం ఉంది.ఇక 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల కల్లా చాలా లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఆధిక్యతలో ఉన్నారనేది తేలే అవకాశం ఉంది.మధ్యాహ్నం 12.30 గంటలకల్లా విజయావకాశాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. -
సంబరాలు... సవాళ్ళు...
దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇక, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. వరుసగా మూడోసారి కూడా మోదీ సారథ్యంలోని బీజేపీయే పగ్గాలు చేపడుతుందని అంచనాలు వినిపిస్తున్న వేళ ఓట్ల లెక్కింపుతో అసలైన ఫలితాలు ఇవాళ రానున్నాయి. అయితే, ఎన్నికలు ముగింపు దశలో ఉండగానే జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గత శుక్రవారం వెలువరించిన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఆసక్తికరమైన చర్చ రేపుతున్నాయి. జీడీపీ వృద్ధి దాదాపు 7.8 శాతం ఉండవచ్చని తొలుత అందరూ భావించినా, వాస్తవంలో అది 8.2 శాతానికి చేరింది. అంతకు ముందు ఏడాది (2022–23) సాధించిన 7 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. పైగా, వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ 7 శాతం, అంతకు మించి పెరిగిందన్న మాట. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోందని నిపుణుల మాట. ఇది విశేషమే... కాదనలేం. కానీ, ఈ ఏడాది కూడా ఇదే పురోగతిని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? అలాగే, దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం తదితర సమస్యల మాటేమిటి?నిజానికి, దేశ వాస్తవిక జీడీపీ ఇటు అధికారిక, అటు ప్రైవేట్ అంచనాలన్నిటినీ అధిగమించి ఆశ్చర్యపరిచింది. కోవిడ్ దెబ్బ కొట్టిన తర్వాత, అందులోనూ ప్రపంచమంతా నత్తనడక నడుస్తున్నప్పుడు వృద్ధిలో ఈ రకమైన గణాంకాలు వచ్చాయంటే, అనేక ఆటుపోట్లను భారతీయ గృహవ్యవస్థ, వ్యాపారాలు తట్టుకొని దృఢంగా నిలబడడమే కారణం. అలాగే, ప్రధానంగా నిర్మాణ, వస్తూత్పత్తి రంగాల పుణ్యమా అని కూడా గడచిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థికవ్యవస్థ అనుకున్న దాని కన్నా మెరుగైన వృద్ధిని సాధించినట్టు విశ్లేషణ. ప్రైవేట్ పెట్టుబడులు వేగం పుంజుకోకున్నా, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వృద్ధిలో సింహభాగానికి కారణమని చెబుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద వచ్చే సర్కారుకు ఈ అంకెలు, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ బదలాయించిన మిగులు నిధుల లాంటివి కొంత సౌకర్యాన్నిచ్చే అంశాలు. అక్కడ నుంచి సమతూకం నిండిన ఆర్థికాభివృద్ధి వైపు ఎలా నడిపించాలన్నది కీలకమైన అంశం. గమనిస్తే... ఆర్థిక వృద్ధిలో మెరుగుదల ఏడేళ్ళ పాటు నిదానంగా సాగింది. దానికి కొత్త ఊపునిచ్చేందుకు మోదీ సర్కార్ ఏటా రైల్వే, రోడ్లు, పట్టణ రవాణా, వాటర్‌వర్క్స్, రక్షణ ఉత్పత్తులపై ఏటా రూ. 11 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు రావాలి. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య ఇప్పటికీ ప్రబలంగా కనిపిస్తోంది. దానికి తోడు ఆర్థిక వ్యత్యాసం, ద్రవ్యోల్బణం సామాన్యుల్ని వేధిస్తున్నాయి. ఉదాహరణకు భవన నిర్మాణ రంగంలో నూటికి 80 మంది ఉండే నైపుణ్య రహిత కార్మికుల సగటు రోజు వారీ కూలీ సైతం అనేక రాష్ట్రాల్లో జాతీయ సగటు కూలీ కన్నా తక్కువే ఉందని విశ్లేషణలు తేల్చాయి. మహిళా శ్రామికుల కూలీలైతే మరీ కనాకష్టం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే... మన దేశ తలసరి ఆదాయం, మరో మాటలో నికర జాతీయ ఆదాయం 2014–15లో రూ.72,805 ఉండేది. అది కేవలం 3.83 శాతం వార్షిక చక్రవృద్ధి రేటుతో 2022–23లో రూ.98,374కు చేరింది. వాస్తవిక ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే, ఈ వృద్ధి రేటు అసలైతే ఇంకా తక్కువే ఉంటుంది. అది అటుంచితే – విద్య, ఆరోగ్యం, ప్రజారవాణా, కాలుష్యం వగైరా అంశాల్లో సగటు జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. సరికదా ఇంకా దిగజారాయి. అదే విషాదం. ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోని అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ అనే నినాదంలో గర్వించడానికి తగిన అంశాలు కొన్నే కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల తలసరి ఆదాయం జాబితాలో 2018లో మనం 153వ స్థానంలో ఉండేవాళ్ళం. అప్పటితో పోలిస్తే, మనం మెరుగుపడి 144వ స్థానానికి చేరాం. కానీ, ఇప్పటికీ మనం అడుగునే ఉన్నామని మర్చిపోలేం. సాధించిన కొద్దిపాటి మెరుగుదల దేశ ప్రజల్ని దారిద్య్రం నుంచి బయటపడేయడానికి చాలదు. నాణ్యమైన జీవన ప్రమాణాలకూ సరిపోదు. 2029 నాటికి గానీ మన దేశం తలసరి ఆదాయంలో ఉజ్బెకిస్తాన్, పాపువా న్యూ గినియా, అంగోలా లాంటి దేశాలను అధిగమించలేదని గుర్తించాలి. కాబట్టి, కొత్త ప్రభుత్వానికి తన ముందున్న సవాలేమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భారత జనాభాలో ఇప్పటికీ అధిక శాతం గ్రామీణ, బస్తీ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. వారి కష్టనష్టాలు, జీవన పరిస్థితులు స్టాక్ మార్కెట్ల విజృంభణను చూసి చప్పట్లు కొట్టే వర్గాలకు పెద్దగా తెలియవు. తాజా ఎన్నికల దయతో నిరుద్యోగం, ఆర్థిక అసమతౌల్యం, ద్రవ్యోల్బణం లాంటివి మళ్ళీ కనీసం చర్చకైనా వచ్చాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లోని దురవస్థల’ ప్రస్తావన జరిగింది. అందుకే, గడచిన నాలుగు త్రైమాసికాలను కలిపి తీసిన ఆఖరి లెక్కలు పైకి సంతోషం రేపుతున్నా, క్షేత్రస్థాయిలోని ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే కష్టమే. ఇప్పటి లెక్కలతో తృప్తిపడి, ఉదాసీనంగా వ్యవహరించకుండా సవాళ్ళను ఎదుర్కొంటూ ముందడుగు వేయాలి. అందుకోసం ఆర్థిక విధానాలను నిర్ణయించే ప్రభుత్వ యంత్రాంగం దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలి. ప్రజల నైపుణ్యాలను పెంచి, వారిని మరింత ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టాలి. అందుకు తగ్గ సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే ఏటికేడు ఈ వృద్ధి అంకెలు స్థిరపడతాయి. సామాన్యుల జీవితాలు నిలబడతాయి. లేదంటే ‘వికసిత భారత్’ మాటల్లో, లెక్కల్లోనే మిగిలిపోతుంది. -
ఓట్ల లెక్కింపు వేళ బీజేపీ నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు, మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన చర్యలపై బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. సోమవారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నేత బీఎల్ సంతోష్ తదితరులు హాజరయ్యారు. పోలింగ్ శాతం, బలాలు, బలహీనతలపై విశ్లేíÙంచారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ ఎన్నికలపైన, కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలాలు, బలహీనతలపై సమీక్ష జరిపాం. ఓటింగ్ శాతం, కొన్ని చోట్ల తక్కువ ఓటింగ్ నమోదుకు కారణాలపై సమగ్రంగా చర్చించాం. రాష్ట్రాల్లో కౌంటింగ్ సన్నాహాలు, అలాగే ఫలితాలు వెలువడ్డాక విజయోత్సవాల నిర్వహణపైనా చర్చించాం. హరియాణాలో బీజేపీ పరిస్థితి బాగాలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నడ్డా, అమిత్ షా మాజీ సీఎం ఖట్టర్‌తో ప్రత్యేకంగా చర్చించారు’అని తావ్డే తెలిపారు. -
EC: ఓటర్లకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మొత్తంగా 64.2 కోట్ల మంది భారతీయ పౌరులు ఓటు హక్కును వినియోగించుకుని నూతన ప్రపంచ రికార్డును సృష్టించారని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు. దేశ చరిత్రలో తొలిసారి ఓట్ల లెక్కింపునకు ముందు తోటి కమిషనర్లతో సహా సీఈసీ సోమవారం ఢిల్లీలో పత్రికాసమావేశం ఏర్పాటుచేసి పలు అంశాలపై మాట్లాడారు. జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ ‘‘ 31.2 కోట్ల మంది మహిళలుసహా 64.2 కోట్ల మంది ఓటేశారు. ఈ సంఖ్య జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 యురోపియన్‌యూనియన్ దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ అభినందనలు’’ అంటూ సీఈసీ వేదికపై లేచి నిలబడి ఓటర్లకు అభినందనలు తెలిపారు. ‘‘ఎన్నికల సిబ్బంది జాగ్రత్త, అప్రమత్తత వల్లే తక్కువ చోట్ల మాత్రమే రీపోలింగ్ చేపట్టాల్సి వచి్చంది. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగితే ఈసారి 39 మాత్రమే జరిగాయి’’ అని పేర్కొన్నారు. మా గురించి మాట్లాడుకోరు ‘ 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది పోలింగ్ పర్వంలో పాల్గొన్నారు. 4 లక్షల వాహనాలను వినియోగించాం. 135 ప్రత్యేక రైళ్లలో సిబ్బంది, బలగాలను తరలించాం. 1,692 సార్లు హెలికాప్టర్లను వాడాం. కరెన్సీ కట్టలు, ఉచిత తాయిలాలుగా పంపిణీచేస్తున్న వస్తువులు, మద్యం, మత్తుపదార్థాలు సహా రూ.10,000 కోట్లు సీజ్‌చేశాం. ఇంత చేస్తే ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూల జాడ లేదంటూ ‘లాపతా జెంటిల్మెన్’ అని మీమ్స్ వేస్తున్నారు. మేం ఎక్కడికీ పోలేదు. మీ ముందే ఉన్నాంకదా. ఎప్పుడూలేనంతగా ఎన్నికలవేళ 100 పత్రికా ప్రకటనలు, అడ్వైజరీలతో అందర్నీ చైతన్యపరిచాం. మమ్మల్ని చూశాకైనా ‘లా పతా జెంటిల్మెన్ ఆర్ బ్యాక్’ అని మీమ్స్ మారుస్తారేమో. విరబూసిన పువ్వులనే చూస్తారుగానీ తోటమాలిని ఎవరూ పట్టించుకోరు. ప్రజాస్వామ్యంలో గెలుపుఓటములనే అందరూ పట్టించుకుంటారుగానీ సమర్థవంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించిన మా గురించి ఎవరూ మాట్లాడుకోరు’’ అని అన్నారు. దమ్ముంటే నిరూపించండి ‘‘ ఎన్నికలను విదేశీ శక్తులు ప్రభావితం చేసే ప్రమాదముందని, వాటిని అడ్డుకునేందుకు మేం ఎప్పుడో సిద్ధమయ్యాం. తీరాచూస్తే ఇక్కడి విపక్షాలే అనవసర ఆరోపణలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభావితం చేయనున్నారని రిటర్నింగ్ అధికారులపై విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. దమ్ముంటే మీ ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించండి. పుకార్లు వ్యాపించజేసి అనుమాన మేఘాలు కమ్ముకునేలా చేయకండి. రిటరి్నంగ్ అధికారులుగా పనిచేసే జిల్లా మేజి్రస్టేట్, కలెక్టర్లపై మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే కౌంటింగ్‌కు ముందే వారిపై కఠిన చర్యలకు మేం సిద్ధం’ అని అన్నారు. ఎన్నికల తర్వాత హింసనూ అడ్డుకుంటాం ‘‘ ఎన్నికల కోడ్ ముగిసినా సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు కొనసాగుతాయి. ఫలితాలు వచ్చాక ఎన్నికల తర్వాత హింసను అడ్డుకునే లక్ష్యంగా తొలిసారిగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నాం. ఎన్నికల వేళ ఘర్షణ ఘటనలు చోటుచేసుకున్న పశి్చమబెంగాల్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్‌సహా పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మొహరిస్తాం. రాష్ట్రాలు, కేంద్ర పరిశీలకుల సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏపీ, బెంగాల్‌లలో ఓట్ల లెక్కింపు తర్వాత 15 రోజులపాటు, యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌లో రెండు రోజులపాటు బలగాలు కొనసాగుతాయి’’ అని సీఈసీ వివరించారు. జమ్మూకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జమ్మూకశీ్మర్‌లో నాలుగు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా గరిష్టంగా 58.58 శాతం పోలింగ్ నమోదైంది. కశీ్మర్ లోయలో గరిష్టంగా 51.05 శాతం రికార్డయింది. సెపె్టంబర్ 30లోపు జమ్మూకశీ్మర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అందుకే అక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకుంటాం. ఇవి నిజంగా అత్యంత సంతృప్తికరమైన క్షణాలు అని అన్నారు. -
Bhupesh Baghel: పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చేశారు
న్యూఢిల్లీ: పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైనా ఎన్నికల సంఘంపై, ఈవీఎంల పనితీరుపై విపక్షాల ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగెల్ సోమవారం రాత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోటీ చేసిన రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ ముగిశాక పలుచోట్ల ఏకంగా ఈవీఎంలనే మార్చేశారని పేర్కొన్నారు! ‘‘పలు బూత్‌ల్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల సీరియల్ నంబర్లు పోలింగ్ తర్వాత మారిపోయాయి. ఫామ్ 17సీలో పొందుపరిచిన సమాచారమే ఇందుకు రుజువు. దీనివల్ల వేలాది ఓట్లు ప్రభావితమవుతాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సాక్ష్యాలంటూ ఈవీఎంల తాలూకు తొలి నంబర్లు, మారిన నంబర్లతో కూడిన వివరాలను పోస్ట్ చేశారు. ‘‘ఇలా మార్చిన ఈవీఎం నంబర్ల తాలూకు జాబితా చాలా పెద్దది. అందరికీ తెలియాలని చిన్న జాబితా మాత్రమే పోస్ట్ చేస్తున్నా’’ అని తెలిపారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. ఇలా నంబర్లను ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ అని ఈసీని ఉద్దేశించి భగెల్ ప్రశ్నించారు. చాలా లోక్‌సభ స్థానాల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నాం. నంబర్లను ఏ పరిస్థితుల్లో మార్చాల్సి వచి్చందో ఈసీ బదులివ్వాల్సిందే. దీనివల్ల ఆయా స్థానాల్లో ఎన్నికల ఫలితంపై ప్రభావం పడితే అందుకు ఎవరిది బాధ్యత?’’ అంటూ మండిపడ్డారు. పోలింగ్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా 150 జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆదివారం ఆరోపించడం తెలిసిందే. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, రుజువులుంటే ఇవ్వాలని సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు. -
20 రోజుల్లో ఉద్దవ్ బీజేపీలో చేరుతారు: మహారాష్ట్ర ఎమ్మెల్యే
సాక్షి, ముంబై: అమరావతి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానా శివసేన(ఉద్దవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ థాక్రేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్వం జరిగిన 20 రోజుల్లో ఉద్ధవ్ బీజేపీతో చేరుతారని జోస్యం చెప్పారు. జూన్ 20లోపు ఉద్ధవ్ వర్గం శివసేన ఎన్డీయే కూటమిలో చేరబోతుంని తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భార్య నవనీత్ కౌర్‌తో ఎమ్మెల్యే రవి రానా‘నేను నమ్మకంగా చెప్పగలను. కేంద్రలో మోదీ మళ్లీ ప్రధాని అయిన 20 రోజుల్లో ఉద్దవ్ ఠాక్రే మోదీ ప్రభుత్వంలో కలుస్తారు. రాబోయే కాలం మోదీదే.. ఆ విషయం ఉద్దవ్‌కు కూడా తెలుసు. బాబాసాహెబ్ థాక్రే ఆలోచనలు ముందుకు తీసుకెళ్తేది మోదీనే. ఉద్దవ్ కోసం ప్రధాని మోదీ ఓ కిటికీ ఎప్పుడూ తెరిచే ఉంచుతారు. ఈ విషయం మోదీనే స్వయంగా చెప్పారు కూడా. బీజేపీలో చేరేందుకు ఉద్ధవ్ ఈ ‘విండో’ను ఉపయోగించుకుంటారు’ అని పేర్కొన్నారు.గతంలోనూ శివసేన, ఎన్సీపీ నుంచి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వైదొలుగుతారని తాను ఖచ్చితంగా చెప్పానని, తరువాత అదే జరిగిందని అన్నారు. కాగా ఎన్సీపీ వ్యవస్థాపకుడు, శరద్ పవార్‌తోపాటు ఉద్దవ్ ఠాక్రేలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాని ఇటీవల మోదీ కోరారు. కాంగ్రెస్‌లో విలీనమై కనుమరుగవడం కంటే బీజేపీలో చేరడం మేలని అన్నారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల ఆయనకున్న ప్రేమ, ఆప్యాయతను తాను ఎప్పటికీ మరచిపోలేనని మోదీ అన్నారు. -
సీనియర్ సిటిజన్లు, మహిళలకు సెల్యూట్: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్(లేచి చప్పట్లు కొట్టడం) ఇచ్చారు ఈసీ సభ్యులు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇవాళ సీఈసీ రాజీవ్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన సీనియర్ సిటిజన్స్, మహిళలకు తాము సెల్యూట్ చేస్తున్నామని కేంద్రం ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ క్రమంలో ప్రెస్‌మీట్‌లోనే ఆయన ఓటర్లకు స్టాండింగ్ ఓయేషన్ ఇచ్చారు. #WATCH | Delhi | Election Commission of India gives a standing ovation to all voters who took part in Lok Sabha elections 2024 pic.twitter.com/iwIfNd58LV— ANI (@ANI) June 3, 2024 ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 642 మిలియన్ల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఓటింగ్‌లో భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మన దేశంలో 31 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య.. జీ-7 దేశాల జనాభాకు ఒకటిన్నర రేట్లు ఎక్కువ. జమ్మూ కశ్మీర్లో నాలుగు దశాబ్ధాల్లో జరగనంత పోలింగ్ జరిగింది. #WATCH | Delhi | "This is one of the General Elections where we have not seen violence. This required two years of preparation," says CEC Rajiv Kumar on Lok Sabha elections. pic.twitter.com/HL8o0aQvAz— ANI (@ANI) June 3, 2024 పోలింగ్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. కేవలం రెండు రాష్ట్రాల్లోనే 39 ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడే రీపోలింగ్ అవసరముందన్నారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారాయన. -
తెలంగాణలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి..
-
Telangana: కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఫస్ట్ రిజల్ట్ అక్కడే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పగడ్బంధీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.కాగా, తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్‌కు 10వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, మరో 50 శాతం మంది అడిషనల్‌గా అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. ప్రతీ టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది.కౌంటింగ్‌లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్‌లో అత్యధికంగా చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా.. అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక, చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ- కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2లక్షల 80వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ పేర్కొంది.అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్‌లలో పెడతామని.. భారీ బందోబస్తు ఉంటుందని ఈసీ వెల్లడించింది. -
ఇంట్లో కూర్చుని రెడీ చేశారా?.. ఎగ్జిట్‌పోల్స్‌పై మమతా బెనర్జీ సెటైర్లు
కోల్కత్తా: దేశంలో ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. దేశవ్యాప్తంగా రేపు(మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక, ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ అయ్యాయి. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఎగ్జిట్‌పోల్స్‌ను రెండు నెలల క్రితమే ‘ఇంట్లో తయారు చేశారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కాగా, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై మమతా బెనర్జీ ఆదివారం స్పందించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేవు. వీటిని రెండు నెలల క్రితమే ఇంట్లో కూర్చుని తయారు చేసినట్టు అనిపిస్తోంది. బెంగాల్లో 2016, 2019, 2021లో ఎగ్జిట్ పోల్స్ ఎలా చేశారో అందరూ చూశారు. వారి అంచనాలేవీ నిజం కాలేదు. ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రజా స్పందన ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ధ్రువీకరించడం లేదు అంటూ కామెంట్స్ చేశారు.అలాగే, ఇండియా కూటమికి సంబంధించి కూడా మమత కీలక వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, స్టాలిన్‌తో పాటు అన్నిచోట్లా ప్రాంతీయ పార్టీలు మెరుగైన పనితీరు కనబరుస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. "Exit polls were 'manufactured at home' two months ago", claims Mamata Banerjee"The way BJP tried to polarise and spread false information that Muslims were taking away quotas of SC, ST and OBCs, I don't think Muslims will vote for BJP And, I think the CPI(M) and Congress… pic.twitter.com/JiL76naHAI— Ashish Kumar (@BaapofOption) June 2, 2024 ఇదిలా ఉండగా.. ఎన్నికలకు సంబంధించి దాదాపు ఎగ్జిట్‌పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. మోదీనే మరోసారి ప్రధాని అవుతారని ఫలితాలను వెల్లడించాయి. ఇండియా కూటమికి భారీ ఓటమి తప్పదని తేల్చేశాయి. అయితే, అటు కూటమి నేతలు కూడా ఎగ్జిట్‌పోల్స్ ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు. -
AP Election Update: కౌంటింగ్‌కు కొనసాగుతున్న కౌంట్‌డౌన్
AP Elections Counting Count Down4:37 PM, 3rd June, 2024విజయవాడఉమ్మడి కృష్ణా జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిమొత్తం 16 నియోజకవర్గాలకి నాలుగు కౌంటింగ్ కేంద్రాలుకైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఏలూరు లో కౌంటింగ్ సెంటర్మచిలీపట్నం పార్లమెంట్‌తో పాటు గన్నవరం, పెనమలూరు, పామర్రు, గుడివాడ, పెడన, అవనిగడ్డ, మవిలీపట్నం నియోజకవర్గాలకి మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్విజయవాడ పార్లమెంట్ తో పాటు విజయవాడ తూర్పు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాలకి ఇబ్రహీంపట్నం నిమ్రా కళాశాలలో కౌంటింగ్విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, తిరువూరు, నందిగామ నియోజకవర్గాలకి నోవా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 15 మంది అభ్యర్ధులు, అసెంబ్లీకి 79 మంది అభ్యర్ధులువిజయవాడ పార్లమెంట్ పరిధిలో 17, అసెంబ్లీకి 96 మంది అభ్యర్ధులుఎన్టీఆర్ జిల్లాలో 79.5 %, కృష్ణా జిల్లాలో 84.45% పోలింగ్విజయవాడ పార్లమెంట్ లో ఓటు హక్కు వినియోగించుకున్న 13,52,964 ఓటర్లుమచిలీపట్నం పార్లమెంట్ లో ఓటుహక్కు వినియోగించుకున్న 12,93,948 ఓటర్లుమచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిప్రతీ రౌండ్‌కి 14 టేబుళ్లు ఏర్పాటుప్రతీ రౌండ్ ఫలితానికి 25 నిమిషాల సమయంసాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడికి అవకాశంఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి ఫలితం మచిలీపట్నం...ఇక్కడ 15 రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు, పెనమలూరులలో చివరి ఫలితాలు..ఇక్కడ 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు2:19 PM, 3rd June, 2024కర్నూలు: కర్నూలు జిల్లా వ్యాప్తంగా భద్రత ఏర్పాటు చేశాం: కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్సెంట్రల్, లోకల్ పోలీసుల ద్వారా నాలుగు అంచుల భద్రత ఏర్పాటు చేశాము.కౌంటింగ్ హల్లో కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాము.కౌంటింగ్ సిబ్బందికి, ఏజెంట్లు వివిధ రూపాల్లో కౌంటింగ్ పాస్స్ లు కల్పించాముకౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో 1000 మంది పోలీసులను ఏర్పాటు చేశాము, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా అమలు అవుతుంది188 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పికెట్స్ ఏర్పాటు చేశాము.ఫలితాలు వచ్చిన తరువాత కూడా భద్రత ఏర్పాట్లను చేశాం, ఫలితాలు వచ్చిన తరువాత ర్యాలీలు, సంబరాలు జరుపుకోవడం నిషేధంఎన్నికల తనిఖీలల్లో భాగంగా 11 కోట్లు రూపాయాల విలువ చేసే 80 లక్షల నగదు, బంగారు, వెండి, ఇతర వస్తువులను పట్టుకున్నాము7 వేలు దాకా కర్నూలు జిల్లా వ్యాప్తంగా బైండోవర్ కేసులు నమోదు చేశాంకౌంటింగ్ సంబంధించిన 4 అంచెల భద్రత ఏర్పాటు చేశాం 2:15 PM, 3rd June, 2024ఏపీలో ఈసీ కొత్త నిబంధన ఎందుకు?: సజ్జలదేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధనదేశంలో ఎక్కడాలేని నిబంధనలు ఏపీలో మాత్రమే పెట్టారు.అధికార యంత్రాంగంపై చంద్రబాబు పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబు అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.బాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు.ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంతాకం ఉంటే చాలనే నిబంధన పెట్టారు.కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.చంద్రబాబుకు బీజేపీతో పొత్తు లేకుంటే కరెక్ట్ ఎగ్జిట్‌పోల్స్ వచ్చేవి. 1:50 PM, 3rd June, 2024గీత దాటితే తాట తీస్తాం: డీజీపీ హరీష్ గుప్తా వార్నింగ్‌అమరావతి..డీజీపీ కార్యాలయం ప్రకటనకౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసు శాఖ ఫోకస్రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాడీజీపీ హరీష్ గుప్తా కామెంట్స్..గీత దాటితే తాట తీస్తాం.సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు.కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతున్నారువ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారుఅలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవుIT act కింద కేసులు నమోదు చేస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం.PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తప్పవు..పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో వారిపై కూడా విచారణ చేస్తాం.రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషిద్ధం.గ్రూప్ అడ్మిన్లు అలెర్ట్‌గా ఉండాలి.సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుంది. 1:30 PM, 3rd June, 2024కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: సీఈవో మీనాఅమరావతి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్..రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంపార్లమెంటుకు 454 మంది, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారుఅన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయిముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది8.30కి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుందిపోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట ఈవీఎంల కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభం అవుతుందిపార్లమెంట్ సెగ్మెంట్ల ఈవీఎం కౌంటింగ్ ఎనిమిది గంటలకే ప్రారంభంకౌంటింగ్ కోసం 196 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది 1:00 PM, 3rd June, 2024విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు: ఎస్పీ నయీమ్ కృష్ణా జిల్లా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి కామెంట్స్..కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రశాంతం జరిగింది. పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగాయి.ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది.విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు .144 సెక్షన్ అమలులో ఉంది.రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలు పాటించాలి.50 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం.133 గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసాం.70 కేసులు నమోదు చేశాం.40 కేసుల్లో చార్జ్ షీట్స్ కూడా వేశాం.కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు.స్పెషల్ ఫోర్స్ ని రంగంలోకి దింపాం.సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా పోలీసులను మోహరించాం.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. 12:45 PM, 3rd June, 2024ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు: వైవీ సుబ్బారెడ్డివిశాఖ..వైస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్..పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలి.ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.సర్వేల గురించి ఎవరూ ఆలోచించవద్దు.మహిళలు, వృద్ధులు మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే సీఎం కావాలని కోరుకున్నారు.వైఎస్సార్సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. 11:59 AM, 3rd June, 2024పిన్నెల్లిపై కొనసాగుతున్న కుట్రలుమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీం కోర్టు ఆంక్షలుకౌంటింగ్ రోజు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని, పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని ఆదేశంపిన్నెల్లిని ఇరకాటం పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న పచ్చ బ్యాచ్‌ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌అనుకూల పోలీసులతో పిన్నెల్లిపై మూడు అక్రమ కేసులుకోర్టు ఆదేశాలతో ఆ కేసుల్లోనూ ఊరట పొందిన పిన్నెల్లితాజాగా తమ నేతలతో సుప్రీంలో కేసులు వేయించిన టీడీపీటీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు వేసిన పిటిషన్‌పై సుప్రీం తాజా ఆదేశాలుఈ నెల 6న ఈ కేసు పరిష్కరించాలని ఏపీ హైకోర్టును సూచించిన సుప్రీం 11:30 AM, 3rd June, 2024పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అప్రమత్తత అవసరం: వైవీ సుబ్బారెడ్డివిశాఖ:వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేసిన వైవీ సుబ్బారెడ్డి.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలని సూచన. 10:40 AM, 3rd June, 2024వైఎస్సార్సీపీదే విజయం: అబ్బయ్య చౌదరిఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కామెంట్స్‌ఎగ్జిట్‌పోల్స్ సర్వేలన్నీ వైఎస్సార్సీపీదే విజయమని తేల్చేశాయి. సంబరాలు చేసుకునేంటుకు వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. జూన్ 4న సాయంత్రానికి జగనన్న 2.O సిద్ధం!ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ వైయస్ఆర్సీపీదే విజయమని ఇప్పటికే తేల్చేశాయి-ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/8osnnXHvSf— YSR Congress Party (@YSRCParty) June 3, 2024 10:15 AM, 3rd June, 2024YSRCP పిటిషన్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్‌నేడు సుప్రీంకోర్టులో ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసు విచారణవిచారణ జరుపనున్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనంజాబితాలో 44వ ఐటమ్ గా లిస్ట్ అయిన కేసురేపు కౌంటింగ్ నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని కోరిన వైఎస్ఆర్సిపీఆ అభ్యర్థనకు అంగీకరించి నేడే విచారణ జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైఎస్ఆర్సిపీ అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ తో పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సడలింపు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ9:43 AM, 3rd June, 2024విజయవాడలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధంవిజయవాడ పార్లామెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్దంసాయంత్రం 5 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా ప్రణాళికఇబ్రహీంపట్నంలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల కౌంటింగ్నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకి కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం కౌంటింగ్ లకి ప్రత్యేక ఏర్పాట్లుఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతీ రౌండ్ కి 14 టేబుళ్లు ఏర్పాటుఏడు అసెంబ్లీ, పార్లమెంట్ కి కలిపి 198 టేబుళ్లు ఏర్పాటు17596 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి 14 టేబుళ్లు ఏర్పాటురెండు రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యేలా చర్యలుపోస్టల్ బ్యాలెట్ ఒక్కొక్క రౌండ్ లెక్కింపుకి మూడు గంటల సమయం పట్టే అవకాశంఈవీఎం ఒక్కొక్కరౌండ్ కి 25 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుందని అంచనాఏడు అసెంబ్లీలకి పోలింగ్ బూత్ ల ఆధారంగా 16 నుంచి 22 రౌండ్లలో లెక్కింపుకౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్ లకి అనుమతి లేదుసీసీ టీవీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ8:30 AM, 3rd June, 2024నేడు సుప్రీంకోర్టు ముందుకు పోస్టల్ బ్యాలెట్ కేసు..ఢిల్లీ:నేడు సుప్రీంకోర్టు ముందుకు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఅధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలన్నఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీనేడు త్వరగా విచారణ చేపట్టాలని మెన్షన్ చేయనున్న వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాదిఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ 8:15 AM, 3rd June, 2024నేడు ఈసీ మీడియా సమావేశం..ఢిల్లీ:నేడు మ.12.30కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంరేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో సమావేశం 8:00 AM, 3rd June, 2024కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ..ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభంమరో 24 గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది.కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు.ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసిన ఈసీసమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ఫోకస్‌మాచర్ల, పల్నాడులో 144 సెక్షన్‌ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై స్పెషల్ ఫోకస్‌ముందస్తు జాగ్రత్తగా పలు చోట్ల కర్ఫ్యూ విధించిన పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈవో ముఖేష్‌కుమార్ మీనా ప్రెస్‌మీట్‌నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం అనంతలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఅనంతపురం:ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలుఅనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులుకౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరింపు144 సెక్షన్, 30 యాక్ట్ అమలుఆరు వేల మంది బైండోవర్400 మందిపై రౌడీషీట్లురేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నానికి ఫలితాలుతిరుపతిలో ఏర్పాట్లు పూర్తి..తిరుపతితిరుపతి పార్లమెంట్ స్థానంతోపాటు, జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారులురేపు ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను నలుగురు అబ్జర్వర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారుఉదయం ఎనిమిది గంటకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం,8.30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రం వద్ద 164 సీసీ కెమెరాలు ఏర్పాటు, మూడు అంచెల భద్రత144 సెక్షన్ అమలులో ఉంది,2 కంపెనీలు సీఐఎస్ఎఫ్ బలగాలు జిల్లాకు కేటాయింపుకౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదుఎన్నికల ఫలితాలు తర్వాత ఎలాంటి ర్యాలీ, బాణాసంచా పేల్చరాదు ఏజెంట్లే కీలకంఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలి ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం ఉండాలి ఫారం 17 సీ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి అభ్యంతరాలను కచ్చితంగా లిఖితపూర్వకంగా తెలిపిధ్రువీకరణ తీసుకోవాలి తుది ఫలితం ప్రకటించే దాకా హాల్ విడిచి వెళ్లకూడదు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు ప్రత్యర్థులు కవ్వించినా సంయమనంతో వ్యవహరించాలి అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్‌కుమార్ మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా కామెంట్స్..ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపండిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండిఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు మరుసటి రోజే ఈసీఐకి చేరాలి లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్’ పక్కాఅసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణదేశ వ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్ భాస్కర్ గ్రూప్‌ల ఎగ్జిట్ పోల్స్‌దీ అదే మాట50 శాతం ఓట్లతో 14 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీవేనన్న టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో 15–17 లోక్‌సభ సీట్లు వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న దైనిక్ భాస్కర్(డీబీ)రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్ పోల్స్‌లో 24 పోల్స్ వైఎస్సార్సీపీ వైపేబీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, ఎన్డీటీవీ, జీన్యూస్‌ల ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం భిన్నంగా వెల్లడి‘ఈనాడు’తో భాగస్వామ్యం ఉన్న సీఎన్ఎన్ న్యూస్–18 ఎగ్జిట్ పోల్స్‌దీ అదే దారి2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తప్పులో కాలేసిన ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్‌తాజా ఎగ్జిట్‌పోల్స్‌లో కనీసం వైఎస్సార్సీపీ గుర్తును కూడా ఫ్యాన్‌కు బదులు చీపురుగా చూపిన సంస్థగుర్తు తెలియకుండా, క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులుతాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్టు రాజ్‌దీప్ మహిళలు, గ్రామీణ ఓటర్లు వైఎస్సార్సీపీవైపే ఉన్నారని అదే చానెల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలుబీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లటమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌రాజస్థాన్, హిమాచల్, హరియాణాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడిరాజధాని, స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే కూటమి గెలుస్తోందంటూ వ్యాఖ్యలుకానీ.. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోని తీరుబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంద్‌లు, నిరసనలు కూడా జరిగిన దాఖలాల్లేవుహైదరాబాద్‌లో ‘ఐటీ గ్రూప్’ పేరిట కూపన్లిచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులువాస్తవానికి రాష్ట్రంలో అన్నివర్గాలకూ మేలు చేసే పాలనతో పటిష్ఠంగా నిలబడ్డ వైఎస్సార్‌సీపీతమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావనతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలుఇవన్నీ వైఎస్సార్సీపీని స్పష్టంగా విజయంవైపు తీసుకెళుతున్నాయని తేల్చిన సర్వే సంస్థలుసెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు, నారా లోకేశ్ -
ప్యాసింజర్ వాహనాలు.. స్లో
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహన హోల్‌సేల్ అమ్మకాలు గత నెల(మే)లో మందగించాయి. కంపెనీల నుంచి డీలర్లకు సగటున వాహన పంపిణీ(హోల్‌సేల్) 4 శాతమే పుంజుకుంది. మొత్తం 3,50,257 యూనిట్లకు చేరాయి. ఏడాది క్రితం(2023) ఇదే నెలలో హోల్‌సేల్ అమ్మకాలు 3,35,436 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ నీరసించడం, అంతక్రితం అధిక వృద్ధి నమోదుకావడం(బేస్ ఎఫెక్ట్) కారణమయ్యాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీ అమ్మకాలు నామమాత్రంగా పెరిగి 1,44,002 యూనిట్లను తాకాయి. గతేడాది మే నెలలో 1,43,708 వాహనాలు విక్రయించింది. ఎంట్రీలెవల్(చిన్న కార్లు), కాంపాక్ట్ కార్ల అమ్మకాలు వెనకడుగు వేశాయి. వీటి అమ్మకాలు 12,236 యూనిట్ల నుంచి 9,902కు తగ్గాయి. అయితే యుటిలిటీ వాహనాలు బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎరి్టగా, ఎస్‌క్రాస్, ఎక్స్ఎల్6 విక్రయాలు 46,243 యూనిట్ల నుంచి 54,204కు ఎగశాయి. చిన్నకార్ల విభాగానికి దన్నునిచ్చేందుకు ఆల్టో కే10, ఎస్ప్రెస్సో, సెలెరియో మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్ధో బెనర్జీ పేర్కొన్నారు. ఇతర దిగ్గజాల తీరిలా..⇥ హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 49,151 వాహనాలకు చేరింది. 2023 మే నెలలో 48,601 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల మందగమనం కొనసాగవచ్చని భావిస్తున్నట్లు కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ అంచనా వేశారు. ⇥ ఎలక్ట్రిక్ వాహనాలుసహా ఇతర ప్యాసిజంర్ వాహన అమ్మకాలు దేశీయంగా 2 శాతం బలపడి 47,705కు చేరినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. గతంలో 45,984 యూనిట్లు విక్రయించింది. ⇥ మహీంద్రా అండ్ మహీంద్రా వాహన విక్రయాలు 31 శాతం జంప్‌చేశాయి. 43,218 యూ నిట్లను తాకాయి. 2023 మే నెలలో 32,886 వాహనాలు మాత్రమే డీలర్లకు పంపిణీ చేసింది. ⇥ టయోటా కిర్లోస్కర్ సైతం గత నెలలో హోల్‌సేల్‌గా 24 శాతం వృద్ధితో మొత్తం 25,273 వాహన విక్రయాలను సాధించింది. ⇥ కియా ఇండియా 4 శాతం అధికంగా 19,500 యూనిట్లను డీలర్లకు పంపిణీ చేసింది. గతేడాది మే నెలలో 18,766 వాహనాలు విక్రయించింది. ఈ ఏడాది పోటీకి అనుగుణంగా పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ సీనియర్ వీపీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. ⇥ ఎంజీ మోటార్ ఇండియా వాహన హోల్‌సేల్ అమ్మకాలు గత నెలలో 5 శాతం క్షీణించి 4,769 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2023 మే నెలలో డీలర్లకు 5,006 వాహనాలు పంపిణీ చేసింది. -
డబ్బులు పంచనందుకే ఎన్నికల్లో ఓడిపోయా: తెలంగాణ గవర్నర్
సాక్షి, హైదరాబాద్: మహత్మా గాంధీ టెంపుల్ ట్రస్ట్ (హైదరాబాద్) ప్రతినిధుల బృందం ఆదివారం తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ బృందం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘‘ఒటర్ అవేర్నెస్ అండ్ ఎథికల్ ఓటింగ్ క్యాంపెయిన్’’ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని మే 1 నుంచి మే 13 వరకు నిర్వహించామని గవవర్నకు తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు వారికి గవర్నర్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా మద్యపాన నిషేధంపై కూడా అవగాహాన కార్యక్రమం చేపట్టాలని గాంధీ టెంపుల్ ట్రస్ట్ బృందానికి ఆయన సూచించారు. ఇక.. ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు, ఓటు వేసే ఓటర్లు.. మద్యం, డబ్బు ముట్టుకోమని ప్రతిజ్ఞ చేయాలన్నారు. అయితే తాను కూడా ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేశాని తెలిపారు. ఓటర్లకు ఎట్టిపరిస్థితులు డబ్బు పంచకూడదని ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో తాను ఓడిపోయినట్లు తెలిపారు.ఈ ట్రస్ట్ బృంద ఏపీ, తెలంగాణలోని 22 ప్రాంతాల్లో ఓటర్లకు అవగాహన కల్పించారు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. ఏపీలో వైజాగ్, రాజమండ్రీ, కాకినాడ, ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు, తెనాలి, నార్సరావుపేట, ఒంగోల్, నెల్లూరు, కర్నూల్, తిరుపతి, చిత్తూరు, కడప ప్రాంతాలో గాంధీ టెంపుల బృందం ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించింది.గవర్నర్ కలిసిన బృందంలో మహత్మా గాంధీ టెంపుల్ ట్రస్ట్ (హైదరాబాద్) అధ్యక్షులు భోపాల్ మోరా, సెక్రటరీ వీపీ కృష్ణారావు, సలహాదారులు వీపీ రావు, నగేంద్రరెడ్డి, ట్రస్టీలు డా. సీత, నర్సిరెడ్డిలు ఉన్నారు. -
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో హోరాహోరీ పోరు
-
మోదీ మూడోసారి ప్రధాని కాలేడు : సోమనాథ్ భారతీ
ఢిల్లీ: పలు పర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ, ఎన్డీయే కూటిమి సుమారు 350 స్థానాలు గెలుస్తాయని అంచనా వేశాయి. బీజేపీ, ఎన్డీయే కూటమికి అధిక సీట్లు వస్తాయిని పేర్కొన్న సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతీ తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం కౌంటింగ్ రోజున అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలిపోతాయని అన్నారు. బీజేపీ అధిక సీట్లు గెలుచుకొని మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేయించుకుంటానని ఛాలెంజ్ చేశారు.‘‘నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేసుకుంటా. నా మాటలు రాసిపెట్టుకోండి. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని జూన్ 4న తెలిసిసోతుంది. నరేంద్రమోదీ మూడోసారి పీఎం కాలేడు. ఢిల్లీ మొత్తం ఏడు స్థానాల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి గెలుస్తుంది. మోదీపై ఉన్న భయంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆయన ఓడిపోతారని వెల్లడించవు. మేము జూన్ 4న విడుదల అయ్యే నిజమైన ఫలితాల కోసం ఎదురు చుస్తున్నాం. ప్రజలు ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ భారీగా ఓట్లు వేశారు’’ అని సోమనాథ్ భారతీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.I will shave off my head if Mr Modi becomes PM for the third time.Mark my word!All exit polls will be proven wrong on 4th June and Modi ji will not become prime minister for the third time.In Delhi, all seven seats will go to India ALLIANCE.Fear of Mr Modi does not allow…— Adv. Somnath Bharti: इंसानियत से बड़ा कुछ नहीं! (@attorneybharti) June 1, 2024 ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన బీజేపీ.. తాము సులభంగా అధిక సీట్లు గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. దేశ ప్రజలు మోదీ మూడుసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కానీ, సోమనాథ్ భారతీలానే చాలా మంది ప్రతిపక్ష నేతలు ఎగ్జిట్ పోల్స్‌ను తప్పని అంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.2019లో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ మొత్తం ఏడు సీట్లకు 6 సీట్లు కౌవసం చేసుకుంటుందని పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తే.. ఏకంగా ఏడు సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈసారి ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేసింది. ఈసారి ఏడు సీట్లలోను తామే గెలుస్తామని ఆ రెండు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్..
-
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: 44 సీట్లలో బీజేపీ విజయం
Counting Updates అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయంఅరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 44 సీట్లలో విజయం2 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లలో గెలుపు10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమేజిక్ ఫిగర్ స్థానాలు 30పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 సీట్లలో గెలుపునేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1 స్థానం గెలుపు , 2 ముందంజ ఇండిపెండెంట్లు 3 గెలుపు సిక్కింలో అధికార కాంత్రికారి మోర్చా ఘన విజయంసిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ 26 సీట్లలో విజయం5 స్థానాల్లో సీకేఎం లీడింగ్మేజిక్ ఫిగర్ 17 సీట్లుసిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1 స్థానం గెలుపుసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ ప్రేమ్ సింగ్ తమంగ్ రెనోక్ స్థానంలో 7044 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ దూసుకుపోతోంది11 సీట్లలో సీకేఎం పార్టీ విజయం20 స్థానాల్లో సీకేఎం లీడింగ్‌సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక్కస్థానంలో లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది26 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీనేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 18 సీట్లలో విజయం సాధించింది28 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజపీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 స్థానాల్లో లీడింగ్10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీ#WATCH | Celebration begins at the BJP office in Itanagar as the party is set to return to power in Arunachal Pradesh The ruling BJP crossed the halfway mark; won 17 seats leading on 29. National People's Party is leading on 6 seats. The majority mark in the State Assembly is… pic.twitter.com/GEEfXggrEO— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిసిక్కిం క్రాంతికారి మోర్చా రెండు స్థానాల్లో గెలుపు29 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానంలో లీడింగ్‌లో ఉంది.#WATCH | Sikkim: Pintso Namgyal Lepcha from the Sikkim Krantikari Morcha (SKM) wins from the Djongu Assembly constituency He says, "I thank all the voters who supported me and made me win with a huge margin. I also thank my party president who gave me the ticket..." pic.twitter.com/BHVMQJvwB2— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ తమంగ్ గోలే.. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమంగ్ గోలే భార్య కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్‌లో ముందంజలో ఉన్నారు.Sikkim CM and Sikkim Krantikari Morcha (SKM) chief Prem Singh Tamang, who is contesting the Assembly elections from Rhenock and Soreng-Chakung seats, is leading on both the seats.SKM crossed the halfway mark; leading on 29 seats. The majority mark in the Sikkim Assembly is 17… pic.twitter.com/1NIYCEmihZ— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న కమలం10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమిగిలిన 50 స్థానాల్లో 29 చోట్ల కమలం హవామొత్తం 39 సీట్లలో బీజేపీ ఆధిక్యం8 చోట్ల లీడింగ్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకాంగ్రెస్ ఒకచోట మాత్రమే ఆధిక్యంసిక్కింలో మరోసారి అధికారం దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చాఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కింలో క్లీన్ స్వీప్ చేసే దిశగా క్రాంతికారి మోర్చా పార్టీమొత్తం 32 సీట్లకుగాను 29 స్థానాల్లో ఎస్కేఎం ఆధిక్యంఒక స్థానంలో ఎస్ డీఎఫ్ లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్‌నేషల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్ ఫిగర్ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) 8 సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్‌ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో లీడింగ్‌ఇండిపెండెంట్ ఒక స్థానంలో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎస్‌కేఏం భారీ లీడింగ్‌లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒక స్థానంలో లీడింల్ ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో కౌంటింగ్ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) 2 సీట్లలో లీడింగ్‌లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్‌లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్‌కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్‌కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు. -
Lok Sabha Election 2024: ఏడో విడతలో 62 శాతం పోలింగ్
న్యూఢిల్లీ/కోల్‌కతా/దుమ్కా: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండగగా పేరొందిన భారత సార్వత్రిక ఎన్నికల పర్వం శనివారంతో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ పోలింగ్ శనివారం పూర్తయింది. శనివారం రాత్రి 11.50 గంటలకు అందిన సమాచారం మేరకు 62 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిరీ్ణత పోలింగ్ సమయం ముగిసేలోపు క్యూ లైన్లలో నిల్చున్న వారిని ఓటింగ్‌కు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. ఏడో దశలో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం సహా ఏడు రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మూడోసారి అధికారం చేపట్టాలని ఉవి్వళూరుతున్న ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి నియోజకవర్గంలోనూ శనివారం పోలింగ్ నిర్వహించారు. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 73.47 శాతం పోలింగ్ నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ ప్రాంతంలోని మిత్ర ఇన్స్టిట్యూట్ స్కూల్ బూత్‌లో ఓటేశారు. బేరామరీలో బాహాబాహీ పశి్చమబెంగాల్లో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. బసీర్హాట్ లోక్‌సభ నియోజకవర్గంలోని సందేశ్‌ఖాలీ పరిధిలోని బేరామరీలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. భాంగర్‌లో టీఎంసీ, ఐఎస్ఎఫ్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు నాటుబాంబులతో దాడిచేసుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. తర్వాత కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ నుంచి మధ్యాహ్నం రెండుగంటల్లోపు 1,900 ఫిర్యాదులు వచ్చాయని ఈసీ తెలిపింది. ఈవీఎంలు మొరాయించడం, బూత్‌లోకి రాకుండా ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లను ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు అడ్డుకోవడం వంటి ఘటనలు జరిగాయని టీఎంసీ, బీజేపీ తదితర పార్టీలు ఫిర్యాదుచేశాయి. కుటుంబాన్ని మించిన కర్తవ్యం 80 ఏళ్ల తల్లి మరణం ఓవైపు, తప్పక ఓటేయాల్సిన బాధ్యత మరోవైపు ఉన్నా తొలుత ఓటేసి కన్నతల్లికన్నా భరతమాతకు ఎక్కువ గౌరవం ఇచ్చారు ఒక వ్యక్తి. బిహార్‌లోని జెహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో దేవ్కులీ గ్రామంలో మిథిలేశ్ యాదవ్ తల్లి శనివారం కన్నుమూశారు. ‘ చనిపోయిన అమ్మ ఎలాగూ తిరిగిరాదు. అంత్యక్రియల్ని కొద్దిసేపు ఆపొచ్చు. కానీ పోలింగ్‌ను ఆపలేం. ఎన్నికలు మళ్లీ ఐదేళ్లదాకా రావు. అందుకే ఓటేశాక అంతిమయాత్ర చేపట్టాలని మా కుటుంబం మొత్తం నిర్ణయించుకున్నాం’ అని మిథిలేశ్ చెప్పారు. ఓటేశాక వెంటనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. -
Exit polls 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా స్థానాలు కచి్చతంగా లభిస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలు తెలుసున్న తర్వాతే ఈ సంఖ్య చెబుతున్నామని వెల్లడించారు. తమది ప్రజల సర్వే అని, బీజేపీది ప్రభుత్వ సర్వే అని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫలితాల సరళి, ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై రెండున్నర గంటలపాటు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్ నాయకులు సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కె.సి.వేణుగోపాల్ పాల్గొన్నారు. ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ ముఖ్య నాయకుడు తేజస్వీ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, రాఘవ్ చద్ధా, జేఎంఎం నాయకులు చంపయ్ సోరెన్, కల్పనా సోరెన్, డీఎంకే నేత టి.ఆర్.బాలు, జమ్మూకశీ్మర్ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ నాయకుడు డి.రాజా, సీపీఐ(ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ హాజరు కాలేదు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. ఫలితాల పేరిట బీజేపీ మీడియా మిత్రులు తప్పుడు అంకెలను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా కౌంటింగ్ హాళ్లనుంచి బయటకు వెళ్లొద్దంటూ తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించామని ఖర్గే తెలిపారు. ఇండియా కూటమిలో తామంతా ఐక్యంగా ఉన్నామని, తమను విభజించే ప్రయత్నం చేయవద్దని మీడియాను కోరారు. బీజేపీ 220 సీట్లకే పరిమితం: కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా, బీజేపీకి 220 సీట్లు వస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మొత్తం 235 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వ ఏర్పాటు దిశగా తమ కూటమి ముందుకు సాగుతోందని తెలిపారు. -
విజయం సరే... విలువలు?
ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్ ది స్టేట్’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్ హాబ్స్ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్ కీ బార్... చార్ సౌ పార్’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్ సౌ పార్’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ప్రమోట్ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్ వెల్లడించారు. పండిత్ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, మార్టిన్ లూథర్‌కింగ్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్ మండేలా, పండిత్ నెహ్రూ, మదర్ థెరిసా, మార్గరెట్ థాచర్ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ప్రమోట్ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్ సౌ పార్’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్ఎస్ కు నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఆరా మస్తాన్ సర్వేఆరా మస్తాన్ సర్వే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.పోల్ లాబొరేటరీపోల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.ఇండియా టుడేఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10, బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.పోల్ స్టార్ట్‌బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్ స్టార్ట్ స్పష్టం చేసింది.పార్థ చాణక్యపార్థ చాణక్య ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.ఆపరేషన్ చాణక్య ఆపరేషన్ చాణక్య ప్రకారం.. కాంగ్రెస్ 7, బీజేపీ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.టైమ్స్ ఆఫ్ ఇండియాటైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్ 5-8, బీఆర్ఎస్ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.ఏబీపీ సీ ఓటర్‌ఏబీపీ సీ ఓటర్ సర్వే అయితే కాంగ్రెస్, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్ఎస్ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.న్యూస్ 24న్యూస్ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్ఎస్కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.ఎక్కడా కనిపించని కారు జోరుతెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది. -
వీడియో: మురికి కాల్వలో ఈవీఎంలు, వీవీప్యాట్స్
కోల్కత్తా: తుది దశలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. సౌత్ పరగణా-24లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం, వీవీప్యాట్లను మురికి కాల్వలోకి విసిరేశారు.కాగా, బెంగాల్లో పోలింగ్ సందర్భంగా పరిస్థితులు అదుపు తప్పాయి. సౌత్ పరగణా-24లో ఉన్న కుల్టై వద్ద పోలింగ్ బూత్ 40, 41లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం బూత్‌లో ఉన్న ఈవీఎంలు, వీవీప్యాట్లను మురికి కాల్వలోకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal. (Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4— Press Trust of India (@PTI_News) June 1, 2024ఇక, ఈ ఘటనపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించారు. ఈ సందర్భంగా..‘ఈరోజు ఉదయం 6.40 గంటలకు బేనిమాధవ్‌పూర్ ఎఫ్పీ స్కూల్ సమీపంలోని సెక్టార్ ఆఫీసర్ రిజర్వ్ ఈవీఎంలు, పేపర్లను కాల్వలోకి విసిరేశారు. ఈ క్రమంలో సెక్టార్ ఆఫీసర్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ప్రస్తుతం అక్కడ పోలింగ్ కొనసాగుతోంది’ అంటూ ట్విటర్ వేదికగా తెలిపింది. (1/2)Today morning at 6.40 am Reserve EVMs & papers of Sector Officer near Benimadhavpur FP school, at 129-Kultali AC of 19-Jaynagar (SC) PC has been looted by local mob and 1 CU, 1 BU , 2VVPAT machines have been thrown inside a pond.— CEO West Bengal (@CEOWestBengal) June 1, 2024 -
కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల చివరి విడత పోలింగ్
-
ఓడిపోతామని తెలిసి పారిపోతున్నారు: కాంగ్రెస్‌పై అమిత్ షా సెటైర్లు
న్యూఢిల్లీ: శనివారంతో ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనునన్నాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ నిర్ణయంపై అధికార బీజేపీ సెటైర్లు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతున్నామని కాంగ్రెస్ పార్టీకి ముందే తెలిసిందని విమర్శలు గుప్పించింది. అందుకే మీడియాకు, ప్రజలకు ముఖం చూపించలేక పారిపోతున్నారని మండిపడింది. ఎగ్జిట్ పోల్ డిబేట్లకు దూరంగా ఉండబోతున్నామంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ప్రకటనపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆ పార్టీ ప్రధాన వ్యూహకర్త, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.ఈ మేరకు అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా .. ‘భారీ ఓటమి ఎదురవ్వబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మీడియా, ప్రజలకు ఏం ముఖం చూపిస్తారు? అందుకే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా పారిపోతోంది. కాంగ్రెస్ పార్టీ పారిపోవద్దు. ఓటమిని ఎదుర్కొని ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను చెప్పదలచుకున్నాను’’ అని పేర్కొన్నారు.దేశంలో పురాతన పార్టీగా ఉన్న కాంగ్రెస్ చిన్న పిల్లల్లా ప్రవర్తించడం తగదని జేపీ నడ్డా విమర్శించారు, . తాను ఆడుకునే బొమ్మను ఎవరో లాగేసుకున్న తీరుగా హస్తం పార్టీ ధోరణి ఉందని, ప్రతిపక్షాల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుంచి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వతను ఆశిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా జరుగుతోందని ఆయన అన్నారు. -
ప్రారంభమైన ఆఖరి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్
-
ముగిసిన లోక్‌సభ ఎన్నికల తుది దశ పోలింగ్
Lok Sabha Election 2024 Phase 7 Updates.. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ 58.34 శాతంబీహార్ లో 8 లోక్ సభ స్థానాల పరిధిలో 48.86 శాతం పోలింగ్ నమోదుఛండీఘడ్ లో 62.80 శాతం పోలింగ్ నమోదుహిమాచల్ ప్రదేశ్ లో నాలుగు లోక్ సభ స్థానాల పరిధిలో 66.56 శాతం పోలింగ్ నమోదుజార్ఖండ్ లో మూడు లోక్ సభ స్థానాల్లో 67.95 శాతం పోలింగ్ నమోదుఒడిస్సా లో 6 లోక్ సభ స్థానాల్లో 62.46 శాతం పోలింగ్ నమోదుపంజాబ్ లో 13 స్థానాల్లో 55.20 శాతం పోలింగ్ నమోదుఉత్తరప్రదేశ్ 13 స్థానాల్లో 54. శాతం పోలింగ్ నమోదుపశ్చిమ బెంగాల్ 9 లోక్ సభ స్థానాల్లో 68.98 శాతం పోలింగ్ నమోదు👉 మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.09 శాతం పోలింగ్ నమోదు ఢిల్లీ:7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదయిన పోలింగ్ శాతం 40.09బీహార్(8)-35.65ఛండీఘడ్(1)-40.14హిమాచల్ ప్రదేశ్(4)-48.63జార్ఖండ్(3)-46.80ఒడిస్సా(6)-37.64పంజాబ్(13)-37.80ఉత్తరప్రదేశ్ (13)- 39.31పశ్చిమ బెంగాల్( 9)-45.07 👉ఓటు వేసిన నటి, టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి. కోల్‌కత్తాలోని పోలింగ్ బూత్ ఓటు వేసిన మిమీ చక్రవర్తి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు వేసి నా బాధ్యత తీర్చుకున్నాను. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. #WATCH | West Bengal: Actor and former TMC MP Mimi Chakraborty casts her vote at a polling booth in Kolkata. #LokSabhaElections2024 pic.twitter.com/lt8L6GSZJO— ANI (@ANI) June 1, 2024 👉ఎన్నికల వేళ విషాదం.. మనోరంజన్ సాహో మృతిఓడిషాలో బింజర్‌హర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్-157లో బూత్ లెవన్ ఆఫీసర్ మనోరంజన్ సాహో మృతిచెందారు. ఎన్నికల విధుల్లోనే ఆయన మరణించినట్టు కలెక్టర్ నిఖిల్ పవన్ కల్యాణ్ తెలిపారు. Odisha | One BLO (Block Level Officer), Manoranjan Sahoo (58) of booth no-157 under Binjharpur Assembly Constituency of Jajpur district died while on election duty: Collector & DM cum DEO, Nikhil Pavan Kalyan#LokSabhaElections2024— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన నటుడు ఆయూష్మాన్ ఖురానా. ఛండీగఢ్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.#WATCH | Actor Ayushmann Khurrana shows the indelible ink mark on his finger after voting at a polling booth in Chandigarh.He says, "I came back to my city to cast my vote and exercise my right...Mumbai recorded a very low voter turnout this time but we should cast our… pic.twitter.com/7UTPNGCMl1— ANI (@ANI) June 1, 2024 👉ఓటుపై అవగాహన కోసం వినూత్న ప్రయోగం.. యూపీకి చెందిన ఓ వ్యక్తి గుర్రంపై కుషీనగర్ పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాను 2012 నుంచి ఎలాంటి ఎన్నికలు జరిగినా గుర్రంపై వచ్చి ఓటు వేస్తున్నట్టు తెలిపాడు. #WATCH | To create voter awareness, a man arrives on a horse at a polling station to cast his vote in Kushinagar, Uttar PradeshHe says, "In the 2012, 2017 & 2022 Assembly elections and 2014 & 2019 Lok Sabha polls also I had arrived on horse to cast my vote." pic.twitter.com/Qw2vlivoM1— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్.#WATCH | On clash during Lok Sabha elections in West Bengal today, BJP leader & MP Dilip Ghosh says, "...TMC is doing al this due to fear of losing, but voting will be completed." pic.twitter.com/VNFPikOiGR— ANI (@ANI) June 1, 2024👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్ నేత బిక్రమ్ సింగ్ మజితియా. 👉 ఓటు హక్కు వినియోగించుకున్న రేఖా పాత. బసిర్‌హట్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రేఖా. #WATCH | North 24 Parganas, West Bengal: BJP Lok Sabha Candidate from Basirhat, Rekha Patra shows her inked finger after casting her vote for #LokSabhaElections2024TMC has fielded Haji Nurul Islam from Basirhat. pic.twitter.com/eNN5bg4OkI— ANI (@ANI) June 1, 2024 👉 11 గంటల వరకు 26.30 పోలింగ్ శాతం నమోదు. ఢిల్లీ:7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 11 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 26.30బీహార్(8)-24.25ఛండీఘడ్(1)-25.03హిమాచల్ ప్రదేశ్(4)-31.92జార్ఖండ్(3)-29.50ఒడిస్సా(6)-22.64పంజాబ్(13)-23.91ఉత్తరప్రదేశ్ (13)- 28.02పశ్చిమ బెంగాల్( 9)-28.10 👉ఓటు వేసిన హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ. హర్మీర్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. #WATCH | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu casts his vote at a polling station in Hamirpur for the seventh phase of #LokSabhaElections2024 pic.twitter.com/c7zzjs6SnO— ANI (@ANI) June 1, 2024 👉ఎన్నికల్లో ఓటు వేసిన బీహార్ సీఎం నితిశ్ కుమార్. భక్తియార్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన వేశారు.#WATCH | Bihar CM Nitish Kumar leaves after casting his vote at a polling booth in Bakhtiyarpur. #LokSabhaElections2024 pic.twitter.com/2qogPy72zU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన జమ్మూ కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. యూపీలోని గాజీపూర్‌లో వేశారు. #WATCH | Uttar Pradesh | Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha casts his vote for #LokSabhaElections2024 in Mohanpura village, Ghazipur. pic.twitter.com/LV5N4AoNjU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్ ప్రెసిడెంట్ సుఖ్బీర్ సింగ్ బాదల్, ఎస్ఏడీ నేత హర్సిమ్రత్ కౌర్. ఫిరోజ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో వీరు ఓటు వేశారు. #WATCH | Sri Muktsar Sahib, Punjab: Shiromani Akali Dal (SAD) leader Harsimrat Kaur Badal casts her vote at a polling booth in Badal village under the Firozpur Lok Sabha constituency SAD has fielded Nardev Singh Bobby Mann from this seat. BJP has fielded Gurmit Singh Sodhi,… https://t.co/BhwLlKUElF pic.twitter.com/FGxN45jioQ— ANI (@ANI) June 1, 2024 👉పోలింగ్ వేళ బెంగాల్లో ఉద్రిక్తతలు..సౌత్ పరగాణా-24లో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ను మురికి కాల్వలో పడేసిన దుండగులు. VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal. (Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్. VIDEO | Lok Sabha Elections 2024: Punjab CM Bhagwant Mann interacts with media after casting vote.#LSPolls2024WithPTI #LokSabhaElections2024(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/1YxNaPwBQ5— Press Trust of India (@PTI_News) June 1, 2024 VIDEO | Lok Sabha Elections 2024: "I hope there will be record voting. I am confident that the excitement in the seventh phase will be more that what we have witnessed in the last six phases of elections. There will be bumper voting and then later bumper victory," says Anurag… pic.twitter.com/RbDCOPjfY4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న కంగనా రనౌత్. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.VIDEO | Lok Sabha Election 2024: "I want to appeal to everyone to exercise their Constitutional rights and participate in this festival of democracy," says actor and BJP candidate from Himachal Pradesh's Mandi seat Kangana Ranaut (@KanganaTeam) after casting vote.… pic.twitter.com/7womwYt3xV— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన బీజేపీ నేత తరుణ్‌చుగ్. పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. VIDEO | Lok Sabha Elections 2024: "We have been given the right by the Constitution to choose who will rule for the next five years and who will decide the country's strategies. We should all exercise this right. I am feeling very proud and happy that I have come here along with… pic.twitter.com/zSElxK3PEd— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 తొమ్మిది గంటల వరకు 11.31 శాతం పోలింగ్ నమోదు.. ఢిల్లీ:చివరి విడతలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 9 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 11.31బీహార్(8)-10.58ఛండీఘడ్(1)-11.64హిమాచల్ ప్రదేశ్(4)-14.35జార్ఖండ్(3)-12.15ఒడిస్సా(6)- 7.69పంజాబ్(13)-9.64ఉత్తరప్రదేశ్ (13)- 12.94పశ్చిమ బెంగాల్( 9)- 12.63 👉 ఓటు హక్కు వినియోగించుకున్న హిమాచల్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా. గోరఖ్‌పూర్‌లో ఓటు వేసిన శుక్లా. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. #WATCH | Uttar Pradesh: After casting his vote in Gorakhpur, Himachal Pradesh Governor Shiv Pratap Shukla says, "I have cast my vote today. All the voters should cast their votes today and vote for a government that can carry forward development work..."#LokSabhaElections2024 pic.twitter.com/WFVlID9xh3— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన లాలూ ఫ్యామిలీ. సరన్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీ, ఆర్జేజీ అభ్యర్థి రోహిణీ ఆచార్య. #WATCH | Bihar: RJD chief Lalu Prasad Yadav, Rabri Devi and their daughter & party candidate from Saran Lok Sabha seat Rohini Acharya leave from a polling booth in Patna after casting their vote. #LokSabhaElections2024 pic.twitter.com/LTmGnXM4BH— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. యూపీలో వారణాసిలోని రామ్‌నగర్‌లో ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Uttar Pradesh | Sikkim Governor Lakshman Prasad Acharya says, "I am happy to take part in this festival of democracy. I think that voting is a duty along with being a constitutional right and everyone should perform their duty and exercise their right..." https://t.co/qwNLm28hP9 pic.twitter.com/V2EMlKNxMu— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్. జలంధర్‌లోని పోలింగ్ బూత్ ఓటు వేసిన బజ్జీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని కామెంట్స్ చేశారు. #WATCH | Punjab: Former Indian cricketer and AAP Rajya Sabha MP Harbhajan Singh casts his vote at a polling booth in Jalandhar#LokSabhaElections2024 pic.twitter.com/Ph55BxqFbp— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవి కిషన్. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ బూత్ వేసిన రవి కిషన్, ఆయన కుటుంబ సభ్యులు. #WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Gorakhpur, Ravi Kishan & his wife Preeti Kishan cast their votes at a polling booth in the constituency. The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf.#LokSabhaElections2024 pic.twitter.com/bTC51NMa3E— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న యూపీ సీఎం యోగి ఆద్యితనాథ్. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన యోగి. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో రవి కిషన్. #WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath casts his vote at a polling booth in Gorakhnath, Gorakhpur.The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf. #LokSabhaElections2024 pic.twitter.com/2Ao7uC7slU— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా #WATCH | BJP national president JP Nadda cast his vote at a polling booth in Bilaspur, Himachal Pradesh. His wife Mallika Nadda also cast her vote here. #LokSabhaElections2024 pic.twitter.com/7XZC3pU2zw— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా..👉 ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన రాఘవ్ చద్దా.. #WATCH | After casting his vote for the seventh phase of #LokSabhaElections2024, AAP MP Raghav Chadha says, "Today is the grand festival of India...Every vote by the citizen will decide the direction & condition of the country...I request everyone to exercise their right to… pic.twitter.com/tBqPTEdBci— ANI (@ANI) June 1, 2024 👉 చివరి దశలో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. Voting for the seventh - the last - phase of #LokSabhaElections2024 begins. Polling being held in 57 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/BkcIZxkmYC— ANI (@ANI) June 1, 2024 👉 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ ప్రారంభమైంది. 👉 కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పాటు బీహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 👉 వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ కొనసాగుతోంది. అంతేకాకుండా బీహార్‌లో ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, బెంగాల్లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగుతోంది.👉 చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. -
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ChatGPT: ఎన్నికలపై విదేశీ కుట్ర
న్యూఢిల్లీ: భారత్‌లో లోక్‌సభ ఎన్నికల చివరి దశ ముందు ఓపెన్ ఏఐ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. ప్రజల అభిప్రాయాలను కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కృత్రిమంగా ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్ కేంద్రంగా జరిగిన కోవర్ట్ ఆపరేషన్‌ను అడ్డుకున్నట్టు చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ ప్రకటించింది. అధికార బీజేపీని విమర్శిస్తూ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ప్రశంసిస్తూ ‘ఎస్టీవోఐసీ’ అనే రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ భారత ఎన్నికలపై కంటెంట్‌ను రూపొందించినట్టు తెలిపింది. ‘‘భారత్‌ను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీని విమర్శిస్తూ, కాంగ్రెస్‌ను పొగుడుతూ అభిప్రాయాలను ఎస్టీవోఐసీ మే నెలలో వ్యాప్తిలోకి తెచి్చంది. 24 గంటల్లోనే దీన్ని అడ్డుకున్నాం’’అని ఓపెన్ఏఐ వెల్లడించింది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ ప్లాట్‌ఫామ్‌లు, వెబ్సైట్లు, యూట్యూబ్ వేదికలపై ఓ సమూహంతో కూడిన అకౌంట్ల ద్వారా కంటెంట్ ఎడిట్, ప్రసారం చేసినట్టు, అలాంటి ఖాతాలను నిషేధించినట్టు ఓపెన్ ఏఐ ఓ నివేదిక రూపంలో బయటపెట్టింది. తమ ఏఐ టూల్స్ సాయంతో కథనాలు, అభిప్రాయాలను రూపొందించి వాటిని ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లలో పోస్ట్ చేసినట్టు పేర్కొంది. ఈ ఆపరేషన్‌కు ‘జీరో జెనో’ అని పేరు పెట్టింది. ఏఐని సురక్షిత అవసరాలకే వినియోగించాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ఆపరేషన్‌ను విచి్ఛన్నం చేసినట్టు తెలిపింది. -
Lok Sabha Election 2024: నేడే తుదిపోరు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం జరుగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ నిర్వహిస్తారు. అంతేకాకుండా బిహార్ ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, పశి్చమబెంగాల్లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆఖరి దశలో పోలింగ్ జరిగే స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అభిõÙక్ బెనర్జీ, మీసా భారతి, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు బరిలో నిలిచారు. చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. -
ఎగ్జిట్‌పోల్స్.. ఏం చెబుతాయో!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారంతో ముగియనుండటంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. శనివారం చివరి దశలో ఎన్నికలు జరుగుతున్న 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే పోలింగ్ ఏజెన్సీలు, న్యూస్ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయనున్నాయి. జూన్ ఒకటి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రచురించకుండా న్యూస్ ఛానెల్‌లను ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. దేశంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏ కూటమి ఏర్పాటు చేస్తుందన్న దానిపై అంచనాలను వెల్లడించనున్నాయి. రాజకీయ పండితులు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) విజయం సాధిస్తుందని అంచనా వేస్తుండగా, ఇండియా కూటమి చివరివరకు గట్టిగా పోరాడటంతో ఎగ్జిట్ పోల్స్‌పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ సొంతంగా 303 స్థానాలు, ఎన్డీఏ కూటమితో కలిసి 352 స్థానాలు గెలుచుకున్నాయి. -
Lok Sabha Election 2024: ఫరీద్కోట్...బహుముఖ పోటీ
పంజాబ్‌లోని ఫరీద్కోట్ లోక్‌సభ స్థానంలో బహుముఖ పోటీ నెలకొంది. బీజేపీ నుంచి ప్రముఖ గాయకుడు హన్స్‌రాజ్ హన్స్, ఆప్ నుంచి నట గాయకుడు కరంజీత్ అన్మోల్ బరిలో ఉన్నారు. అకాలీదళ్, కాంగ్రెస్‌లకు తోడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్‌సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగి గట్టి పోటీయే ఇస్తున్నారు. దాంతో శనివారం చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరిగే స్థానాల్లో ఫరీద్కోట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.కాంగ్రెస్‌కు కష్టాలు.. ఫరీద్కోట్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. పంజాబీ జానపద గాయకుడు మహ్మద్ సాదిక్ 2019లో గెలుపొందారు. ఈసారి ఆయన్ను కాదని అమర్జీత్ కౌర్ సాహోక్కు టికెటిచి్చంది. స్థానికురాలైన సాహోక్ దాన్నే ప్రధాన బలంగా మార్చుకుని ప్రచారం చేశారు. కానీ పారీ్టలోనే తీవ్రమైన వ్యతిరేకత ఉండటం ఆమెకు మైనస్‌గా మారింది. సీనియర్ నేతలు ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. దాంతో సాహోక్కు మద్దతుగా కాంగ్రెస్ ఒక్క పెద్ద ర్యాలీ కూడా నిర్వహించలేకపోయింది! ఆప్ అభ్యర్థి అన్మోల్ సీఎం భగవంత్ మాన్కు సన్నిహితుడు. తన స్టార్డమ్, మాన్ ప్రభుత్వ పనితీరు తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. పంజాబీ నటులు, గాయకులు అన్మోల్కు మద్దతుగా జోరుగా ప్రచారం చేశారు. ఇక 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయానికి కారణమైన సిక్కు సంస్థలు ఈసారి ఇండిపెండెంట్ సరబ్జీత్ సింగ్ ఖల్సాకు దన్నుగా నిలిచాయి.సూఫీల ఇలాకా... రాజ నగరంగా ప్రసిద్ధి చెందిన ఫరీద్కోట్ సూఫీ సాధువుల అడ్డా. బాబా ఫరీద్ నగరం అని కూడా అంటారు. ఈ లోక్‌సభ స్థానం 1977లో ఏర్పాటైంది. ఒకప్పుడు అకాలీదళ్‌కి కంచుకోట. 2014లో ఆప్, 2019 కాంగ్రెస్ గెలిచాయి. దీని పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లూ ఆప్ చేతిలోనే ఉండటం ఆ పారీ్టకి కాస్త కలిసొచ్చే అంశం. ఒక్క అభ్యర్థి కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడలేదన్నది స్థానికుల ఆరోపణ. డ్రగ్స్, అభివృద్ధి లేమి ఇక్కడి ప్రధాన సమస్యలు. దీనికి తోడు రైతు ఆందోళనల ప్రకంపనలు ఈసారి అందరు అభ్యర్థులనూ తాకాయి!బీజేపీకి చుక్కలు... గత ఎన్నికల్లో ఢిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన బీజేపీ అభ్యర్థి హన్స్‌రాజ్ హన్స్ ఫరీద్కోట్కు పూర్తిగా కొత్త. ప్రచారం పొడవునా రైతు సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దానికి తోడు రైతులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీని మరింత ఇరుకున పెట్టాయి. ప్రచారంలో పాటలు పాడుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అకాలీదళ్ కూడా ఈసారి ఎలాగైనా నెగ్గాలని పట్టుదలగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థి రాజి్వందర్ సింగ్ మాజీ ఎమ్మెల్యే శీతల్ సింగ్ కుమారుడు, మాజీ మంత్రి గురుదేవ్ బాదల్ మనవడు. 2015లో ఆప్‌లో చేరిన ఆయన 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ అకాలీదళ్‌కు తిరిగొచ్చారు. తన కుటుంబ రాజకీయ వారసత్వాన్నే నమ్ముకున్నారు. ఫరీద్కోట్కు తన కుటుంబం ఎంతో సేవ చేసిందంటూ ప్రచారం చేశారు. దళిత ప్రాబల్యమున్న ఫరీద్‌కోట్‌లో బీఎస్పీ పోటీ ప్రధాన పారీ్టల అవకాశాలను దెబ్బ తీసేలా ఉంది.– సాక్షి, న్యూఢిల్లీ -
Lok Sabha Election 2024: ఏడో విడతలో 5 హాట్ సీట్లు
సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. చివరిదైన ఏడో విడతలో శనివారం పోలింగ్ జరుగుతున్న 57 లోక్‌సభ స్థానాల్లో ఐదు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆ హాట్ సీట్లపై ఫోకస్... వారణాసి... మోదీ మేజిక్ కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించిన ఆయన ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేశారు. 2014లో తొలిసారి ప్రధాని అభ్యరి్థగా ఇక్కడ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై 3.7 లక్షలకు పైగా ఓట్లతో నెగ్గిన ఆయన 2019లో మెజారిటీని 4.8 లక్షల ఓట్లకు పెంచుకున్నారు. ఈసారి దాన్ని రికార్డు స్థాయికి పెంచడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ ప్రధానిని ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. రాయ్ ఒకప్పుడు బీజేపీ నేతే కావడం విశేషం. బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన వారణాసిలో 1991 నుంచి బీజేపీ పాతుకుపోయింది. 2004లో కాంగ్రెస్ గెలిచినా మళ్లీ 2009లో బీజేపీ దిగ్గజ నేత మురళీ మనోహర్ జోషి ఇక్కడ విజయం సాధించారు.హమీర్పూర్.. అనురాగ్ విన్నింగ్ షాట్!ఇది బీజేపీ కంచుకోట. 1989 నుంచి ఏకంగా 10సార్లు కాషాయ జెండా ఎగిరింది. రెండుసార్లు సీఎంగా పనిచేసిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ ఇక్కడ మూడుసార్లు గెలిచారు. ఆ విజయ పరంపరను ధుమాల్ కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కొనసాగిస్తున్నారు. రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన ఠాకూర్ 2019లో ఏకంగా 4 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అది ఆయనకు వరుసగా నాలుగో విజయం. కాంగ్రెస్ నుంచి సత్పాల్ రైజాదా రంగంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. వాటిలో 4 స్థానాలు హమీర్పూర్ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉన్నాయి.మండీ... కింగ్ వర్సెస్ క్వీన్ ఆరుసార్లు సీఎంగా చేసిన దివంగత కాంగ్రెస్ నేత వీరభద్రసింగ్ రాజ కుటుంబానికి ఈ స్థానం కంచుకోట. ఆయన, భార్య ప్రతిభా సింగ్ ఇద్దరూ ఇక్కడి నుంచి మూడేసిసార్లు గెలవడం విశేషం! 2014, 2019ల్లో బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ గెలిచి కాంగ్రెస్ హవాకు అడ్డుకట్ట వేశారు. 2021లో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభా సింగ్ స్వల్ప మెజారిటీతో నెగ్గారు. ఈసారి బీజేపీ నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ప్రతిభకు బదులు ఆమె కుమారుడు విక్రమాదిత్యసింగ్ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన ఆయన ఈసారి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కంగన, విక్రమాదిత్య పోటాపోటీ ప్రచారంతో హోరెత్తించారు. కంగనా నాన్ లోకల్ అని, వరదలప్పుడు రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదని కాంగ్రెస్ చేసిన ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది.డైమండ్ హార్బర్... అభిషేక్ హవా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 నుంచి తృణమూల్ అడ్డాగా మారింది. గత రెండు ఎన్నికల్లోనూ పార్టీ వారసునిగా చెబుతున్న సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విజయం సాధించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన అభిషేక్‌కు బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ (బాబీ) గట్టి పోటీ నేపథ్యంలో ఈసారి విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. అభిషేక్ హ్యాట్రిక్ కొడతారా, డైమండ్ హార్బర్‌పై కాషాయ జెండా ఎగురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సీపీఎం కూడా బరిలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.పట్నా సాహిబ్... రవిశంకర్‌కు సవాల్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన పటా్నసాహిబ్ పేరుతో 2008లో ఏర్పాటైన లోక్‌సభ స్థానం. 2009, 2014ల్లో బీజేపీ నుంచి నెగ్గిన బాలీవుడ్ షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేశారు. దాంతో ఆయన్ను ఢీకొనేందుకు బీజేపీ సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో శత్రుఘ్నపై భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి అన్షుల్ అవిజిత్ నుంచి రవిశంకర్ ప్రసాద్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. అన్షుల్ లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు. కాంగ్రెస్‌తో పాటు దాని భాగస్వామి ఆర్జేడీకి కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకుంది. దాంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కఠిన పరీక్షగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: మూడు సీట్లు... ముచ్చెమటలు!
సార్వత్రిక ఎన్నికల జాతర చివరి అంకానికొచ్చింది. జార్ఖండ్‌లో 14 లోక్‌సభ స్థానాలకు గాను 11 చోట్ల పోలింగ్ ముగిసింది. మిగతా మూడింటికి నేడు ఏడో విడతలో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీతో సహా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా సుడిగాలి ప్రచారాలతో హోరెత్తించారు. ఈ మూడు సీట్లలో రెండు ఎస్టీ నియోజకవర్గాలు. వీటిలో 2 బీజేపీ, ఒకటి జేఎంఎం ఖాతాలో ఉన్నాయి. ఈ స్థానాలపై ఫోకస్...గొడ్డా.. బీజేపీ అడ్డా ఇది కమలనాథుల కంచుకోట. 1991లో మాత్రం జేఎంఎం నుంచి సూరజ్ మండల్ విజయం సాధించారు. కేంద్రంలో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వానికి అనుకూలంగా పార్లమెంటులో ఓటేసేందుకు జేఎంఎం ఎంపీలు ముడుపులు తీసుకున్న వివాదంలో సూరజ్ మండల్ పేరు మార్మోగింది. కాంగ్రెస్ కూడా ఒక్క 2004లో మాత్రమే గెలిచింది. గత మూడు ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం. హ్యాట్రిక్ కొట్టిన ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 4.5 లక్షల ఓట్లు సాధించిన జార్ఖండ్ వికాశ్ మోర్చా (ప్రజాతాంత్రిక్) నేత ప్రదీప్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నారు. బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఈ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ స్థానాల్లో 3 కాంగ్రెస్, 2 బీజేపీ, ఒకటి జేఎంఎం చేతిలో ఉన్నాయి. ఈసారి బీజేపీ హవాకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని ఇండియా కూటమి గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. దుమ్కా... సోరెన్ ఫ్యామిలీ వార్ఈ ఎస్టీ రిజర్వుడ్ స్థానం జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ శిబు సోరెన్ కంచుకోట. ఆయన 1980లో జేఎంఎం తరఫున ఇక్కడ తొలిసారి పాగా వేశారు. 1989 నుంచి మూడుసార్లు గెలిచినా, తర్వాత రెండు సార్లు బీజేపీ నేత బాబూలాల్ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు. మళ్లీ వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ సోరెన్‌దే హవా. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నళిన్ సోరెన్ ఈసారి జేఎంఎం తరఫున బరిలోకి దిగారు. బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీని కాదని శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్‌కు టికెటిచి్చంది. ఆమె సోరెన్ పెద్ద కుమారుడు దివంగత దుర్గా సోరెన్ భార్య. మామ కంచుకోటలో కోడలే జేఎంఎంకు సవాలు విసురుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. దుమ్కాలో 40 శాతం గిరిజనులు, 40 శాతం వెనకబడిన వర్గాలు, 20 శాతం ముస్లింలు ఉంటారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 జేఎంఎం, 2 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. రాజ్‌మహల్... హోరాహోరీ ఈ స్థానంపై కాంగ్రెస్ క్రమంగా పట్టు కోల్పోయింది. 1989లో తొలిసారి జేఎంఎం నెగ్గింది. అప్పట్నుంచి కాంగ్రెస్, బీజేపీ, జేఎంఎం మధ్య చేతులు మారుతూ వస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ విజయం జేఎంఎంనే వరిచింది. 2019లో విజయ్‌కుమార్ హన్స్డా లక్ష ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి హేమ్లాల్ ముర్ముపై వరుసగా రెండోసారి గెలిచారు. ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. బీజేపీ ఈసారి రాజ్‌మహల్ లోక్‌సభ స్థానం పరిధిలోని బోరియో సిట్టింగ్ ఎమ్మెల్యే తాలా మరాండీని రంగంలోకి దించింది. సీపీఎం నుంచి గోపెన్ సోరెన్ కూడా తలపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా రేపు వెలువడబోయే ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటితో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. దీంతో రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడాల్సి ఉంది. అయితే.. నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ఇవ్వకూడదని ఈసీ తాజాగా ఆదేశాలు విడుదల చేసింది. రేపు అంటే జూన్ 1వ తేదీ శనివారం సాయంత్రం 6:30 తరువాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాల్సిందేనని తాజా ఆదేశాల్లో ఈసీ పేర్కొంది.లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు,అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే వీటన్నింటికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఈసీ బ్యాన్ చేసింది. పూర్తి స్థాయిలో అంతటా పోలింగ్ ముగిసిన తర్వాతే వెల్లడించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు మార్చి 28వ తేదీ జారీ చేసిన నోటిఫికేషన్లో ఈసీ స్పష్టం గా పేర్కొంది. -
PM Modi: మోదీ ప్రచార సునామీ.. ఒక్క నెలలోనే 96 ప్రచార సభలు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మారథాన్ ఇన్నింగ్స్ ఆడారు ప్రధాని మోదీ. 400 ప్లస్ స్థానాలే లక్ష్యంగా.. సుడిగాలిలా రాష్ట్రాలను చుట్టేశారు. 75 రోజుల్లో 206 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో అత్యధిక ర్యాలీలు నిర్వహించారు ప్రధాని మోదీ. బహిరంగ సభలు, రోడ్‌షోలతోపాటు వివిధ మీడియా సంస్థలకు 80 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. జూన్ 1న జరిగే చివరి విడత పోలింగ్ కౌంట్‌డౌన్ మొదలైంది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. ప్రచారంలోనూ అదే దూకుడు ప్రదర్శించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలను చుట్టేశారు. ఒక్కో రోజు మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి ఈ రెండున్నర నెలల్లో దాదాపు 180 ర్యాలీలు నిర్వహించారు ప్రధాని.ప్రధాని చేపట్టిన ప్రచారాల్లో దాదాపు సగం ర్యాలీలు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 80 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 31 సభలు నిర్వహించారు. దీదీ ఇలాకా పశ్చిమ బెంగాల్లో రికార్డుస్థాయిలో 22 ర్యాలీల్లో పాల్గొన్నారు. బుధవారం కూడా ఆయన బెంగాల్లో ప్రచారం చేపట్టారు. ఆ తర్వాత బిహార్‌పై దృష్టిపెట్టిన ప్రధాని.. ఆ రాష్ట్రంలో 20 ర్యాలీల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలో 19 ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 2019తో పోలిస్తే మహరాష్ట్రలో ఈసారి రెట్టింపు స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు మోదీ. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీలు చేపట్టినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.2024 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిపైగా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు ప్రధాని మోదీ. సౌత్‌లో బలం పెంచుకోవాలన్న లక్ష్యంతో.. ప్రచారంలోనూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది. దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు. కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. అందుకే మోదీ సభలు పెంచింది.ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్‌తో పొత్తు కుదరకపోవడంతో.. ఆ రాష్ట్రంపైనా బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. అక్కడ మోదీ 10 సభలు నిర్వహించారు. జగన్నాథ సన్నిధి పూరీలో ఆయన చేపట్టిన భారీ రోడ్ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇక సొంత రాష్ట్రం గుజరాత్లో మోదీ 5 సభల్లో పాల్గొనగా.. మధ్యప్రదేశ్‌లో 10, జర్ఖండ్‌లో 7, రాజస్థాన్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 4, హరియాణాలో 3 ర్యాలీలు నిర్వహించారు ప్రధాని. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రచారాల్లో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లోనూ ఓసారి పర్యటించిన ప్రధాని.. పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిచ్చారు. 2024 ఎలక్షన్ సీజన్లో తన చివరి ప్రచారాన్ని పంజాబ్‌లో నిర్వహించారు ప్రధాని మోదీ. హోషియార్‌పుర్ బహిరంగ సభతో సార్వత్రిక ప్రచార పర్వానికి ముగింపు పలికి.. ధ్యాన ముద్రలోకి వెళ్లారు. -
రేపే చివరి విడత పోలింగ్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రేపు(శనివారం) చివరి(ఏడో)విడత పోలింగ్ జరగనుంది. ఈమేరకు ఏడో విడత పోలింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడో విడతలో భాగంగా 57 లోక్ సభ స్థానలకు పోలింగ్ జరగనుంది. దీంతోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 స్థానాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తారు. రేపు(శనివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 10.06కోట్ల మంది ఓటర్లలో 5.24 కోట్లమంది పురుషులు, 4.82కోట్ల మంది మహిళ ఓటర్లు, 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రముఖుల స్థానాలుప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( వారణాసి), బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ (మండి) స్థానాల్లో పోలింగ్ జరగనుంది. వీరితో పాటు పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. -
Lok Sabha Election 2024: 1100 కోట్లు సీజ్ చేసిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు-2024 షెడ్యూల్లో భాగంగా రేపు చివరి దశలో పోలింగ్ జరుగనుంది. నిన్నటితో ప్రచారానిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి మే 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐటీ సోదాల్లో రూ.1100 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. భారీ మొత్తంలో బంగారం కూడా సీజ్ అయ్యింది.వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో సుమారు రూ. 1100 కోట్ల నగదును సీజ్ చేశారు. మే 30వ తేదీ వరకు ఆదాయపన్ను శాఖ మొత్తం 1100 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కూడా చేసింది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే సీజ్ నగదు విలువ దాదాపు 182 శాతం అధికంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల వేళ 390 కోట్ల నగదును సీజ్ చేశారు.ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఐటీ శాఖ అన్ని రాష్ట్రాల్లోనూ దాడులు, సోదాలు, తనిఖీలను పెంచేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుతున్న డబ్బును సీజ్ చేశారు. ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక మొత్తంలో నగదును సీజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వందల కోట్లకు పైగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో ఏకంగా రూ.150 కోట్ల వరకు నగదును సీజ్ చేశారు. ఇక, తెలంగాణ, ఒడిషా, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కలిసి దాదాపు రూ.100 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. -
ఒడిశాలొ ‘పాండియన్’ పాలిటిక్స్.. నవీన్ పట్నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
భువనేశ్వర్: బీజేడీ నేత వీకే పాండియన్ వ్యవహారం ఒడిశా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒడిశా సీఎంను పాండియన్ నియంత్రిస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు సీఎం నవీన్ పట్నాయక్‌కు పాండియన్ రాజకీయ వారసుడంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గురువారం స్పందించారు.ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా నవీన్ పట్నాయక్.. ‘‘ నా వారసుడి విషయంలో ఇదివరకే చాలా క్లారిటీగా చెప్పాను. నా వారసుడిని ఒడిశా రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ఇలాంటివి చాలా సహజంగా ప్రజల ద్వారానే జరిగిపోయే విషయాలు. ప్రజస్వామ్యంలో పార్టీల్లో నేతలు వివిధ పదువుల్లో ఉంటారు. మంత్రులుగా ప్రజల ప్రతినిధులు ఉంటారు. అదేవిధంగా అధికారాలను కలిగి ఉంటారు. పాండియన్ ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.#WATCH | On being asked about "putting VK Pandian above other BJD leaders", Odisha CM Naveen Patnaik says "I find all of this quite nonsensical..."On VK Pandian, he further says "Party members have a great say, they have high positions, they are ministers, they are the people's… pic.twitter.com/XigUlX4wS1— ANI (@ANI) May 30, 2024 ఇక.. వీకే పాండియన్ నన్ను కంట్రోల్ చేస్తున్నారన్న ఆరోపణలు చాలా హాసాస్పదం.. వాటికి అసలు ఎటువంటి ప్రాధాన్యతా లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రాష్ట్రంలో తిరిగి బీజేడీ ప్రభుత్వ ఏర్పడుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో సైతం 21 స్థానాల్లో గెలుస్తాం. ఒడిశా ప్రజలకు సంక్షేమం అందించడమే నా తొలి ప్రాధాన్యం’’ అని అన్నారు.ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతుండగా వణుకుతున్న ఆయన చేతులను పాండియన్ సరిచేసిన విషయం తెలిసిందే. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ సీఎం పట్నాయక్‌పై విమర్శలు గుప్పించారు. వీకే పాండియన్ మాత్రమే నవీన్ పట్నాయక్‌తో ఎందుకు ఉంటారో సమాధానం చెప్పాలి. పట్నాయక్‌తో పాటు పాండియన్ మైక్ పట్టుకొని, వణుకుతున్న చేతులను కంట్రోల్ చేస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. ఎవరీ వీకే పాండియన్..?తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ 2000 సంవత్సరంలో ఒడిశా ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌గా చేరారు. మొదట్లో ధరమ్‌ఘర్, కలహండి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఒడిశాలోని అతిపెద్ద జిల్లా మయూర్‌భంజ్‌లో కలెక్టర్‌గా మారుమూల గ్రామాలను అభివృద్ధి చేశారు. హెచ్ఐవీ సోకిన వ్యక్తులకు పునరావాసం కల్పించిన కృషికి వీకే పాండియన్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు. 5T కార్యక్రమాల వల్ల దాదాపు తొంభై శాతానికి పైగా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలో పాండియన్ కీలకమైన బ్యూరోక్రాట్‌గా పేరు సంపాధించారు. 2011 సంవత్సరంలో వీకే పాండియన్ ప్రతిభను గమనించి సీఎం నవీన్ అతన్ని సీఎం కార్యాలయానికి తీసుకున్నారు. సీఎంకు ప్రైవేట్ సెక్రటరీగా కూడా పని చేశారు. ఇక.. 2023లో వీకే పాండియన్ తన బ్యూరోక్రాట్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం 2023, నవంబర్ 27న సీఎం నవీన్ పట్నయక్ సమక్షంలో బిజు జనతా దళ్‌లో చేరి సీఎంకు సన్నిహితంగా ఉంటూ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. -
Lok Sabha Election 2024: మోదీ @ 200 సభలు, రోడ్‌షోలు
సాక్షి, న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఒక్కో రోజు మూడు నుంచి ఐదు సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. మార్చి 16న ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మొత్తంగా మోదీ 206 సభలు, సమావేశాలు, రోడ్‌షో, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఒక్క మేలో 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని ఏకంగా 31 సభల్లో పాల్గొన్నారు. బిహార్‌లో 20, మహారాష్ట్రలో 19, పశి్చమబెంగాల్లో 16 సభలకు హాజరయ్యారు. కేవలం ఈ 4 రాష్ట్రాల్లోనే 86 సభల్లో మోదీ పాల్గొనడం గమనార్హం. దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణల్లో 11, తమిళనాడులో 7 ప్రచార కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో మోదీ 145 సభలు, సమావేశాలు, రోడ్‌షో, ర్యాలీల్లో పాల్గొన్నారు. 2019లో 68 రోజులు ప్రచారంచేయగా ఈసారి 76 రోజులపాటు ప్రచారంచేశారు. ఈసారి ఆయన మొత్తం 80 మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కువ. -
Lok Sabha Election 2024: జవాన్లను కార్మికులుగా మార్చేశారు
బాలాసోర్(ఒడిశా): అగ్నివీర్ పథకం ద్వారా ప్రధాని మోదీ జవాన్లను కార్మికులుగా మార్చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశాలోని భద్రక్ లోక్‌సభ నియోజకవర్గంలోని సిమూలియా పట్టణంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ విపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీచేస్తాం. అగ్నివీర్ పథకం తెచ్చి ప్రధాని మోదీ జవాన్లను కార్మికులుగా మార్చేశారు. మేం అగ్నివీర్‌ను రద్దుచేసి ఆ కార్మికులను మళ్లీ జవాన్లుగా మారుస్తాం. వారికి పెన్షన్, క్యాంటీన్ సౌకర్యాలు కలి్పస్తాం. విధి నిర్వహణలో మరణిస్తే గౌరవప్రద ‘అమ రుడు’ హోదా దక్కేలా చేస్తాం . పంటకు కనీస మ ద్దతు ధరకు చట్టబద్దత కలి్పస్తాం’ అని అన్నారు. నవీన్ బాబుపై కేసులేవి?: ‘‘ఒడిశాలో బీజేడీ పార్టీ బీజేపీ కోసం పనిచేస్తోంది. నాపై మోపిన 24 పరువునష్టం, క్రిమినల్ కేసులను న్యాయంగా ఎదుర్కొంటున్నా. ఈడీ నన్ను 50 గంటలు విచారించింది. బీజేపీ నా లోక్‌సభ సభ్యత్వాన్ని, నాకు కేటాయించిన అధికారిక ఎంపీ బంగ్లానూ లాగేసుకుంది. నవీన్ బాబు(పట్నాయక్) నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే ఆయన మీద కూడా ఇలాగే కేసులు ఉండాలికదా. మరి లేవెందుకు?’ అని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్లకు అంతకుమించి తెలీదు హాలీవుడ్ ‘గాంధీ’ సినిమా తర్వాతే గాం«దీజీ విశేషాలు ప్రపంచానికి తెలిశాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. ‘‘ ఆర్ఎస్ఎస్ వాళ్లకు గాం«దీజీ గురించి అంతకుమించి ఏం తెలీదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ‘శాఖ’లో శిక్షణపొందిన వాళ్లు గాడ్సేను ఆరాధిస్తారు. గాం«దీజీ గురించి వాళ్లకు తెలిసింది శూన్యం. హిందుస్తాన్, సత్యం, అహింసా మార్గం వంటి చరిత్ర వాళ్లకు బొత్తిగా తెలీదు. మోదీ అలా మాట్లాడతారని ఊహించిందే’ అని అన్నారు. -
Lok Sabha Election 2024: ఎమర్జెన్సీలో రాజ్యాంగం గొంతు నొక్కారు
హోషియార్పూర్: ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగం గొంతు పిసికిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అంటూ గొంతు చించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. 1984 నాటి అల్లర్లలో సిక్కుల మెడలకు టైర్లు బిగించి, నిప్పంటించి కాల్చి చంపుతుంటే కాంగ్రెస్‌కు రాజ్యాంగం గుర్తుకు రాలేదని ధ్వజమెత్తారు. గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో మోదీకి ఇదే చివరి సభ. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ఉద్దేశాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో కోత విధించి, బడుగు బలహీనవర్గాలకు అన్యాయం చేసిన చరిత్ర ప్రతిపక్షాలకు ఉందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు విపక్షాలు ప్రయతి్నస్తున్నాయని దుయ్యబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తిని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనోభావాలను ప్రతిపక్షాలు కించపరుస్తున్నాయని ఆక్షేపించారు. అవినీతిలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్డీ కాంగ్రెస్ పార్టీ అవినీతికి తల్లిలాంటిదని ప్రధానమంత్రి నిప్పులు చెరిగారు. అవినీతిలో ఆ పార్టీ డబుల్ పీహెచ్డీ చేసిందని ఎద్దేవా చేశారు. మరో అవినీతి పారీ్ట(ఆమ్ ఆద్మీ పార్టీ) కాంగ్రెస్‌తో చేతులు కలిపిందన్నారు. ఢిల్లీలో కలిసికట్టుగా, పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేస్తూ ఆ రెండు పారీ్టలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ గర్భంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఊపిరి పోసుకుందని అన్నారు. కాంగ్రెస్ నుంచే అవినీతి పాఠాలు చేర్చుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో మునిగి తేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సైనిక దళాలను బలహీనపర్చిందని ఆరోపించారు. సైన్యంలో సంస్కరణలు చేపట్టడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు. ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలి వారణాసి ప్రజలకు ప్రధాని పిలుపు లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. వారణాసిలో శనివారం పోలింగ్ జరుగనుంది. తన నియోజకవర్గ ప్రజలకు మోదీ గురువారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. భారతదేశ అభివృద్ధి కోసం వారణాసి ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు. కాశీ విశ్వనాథుడితోపాటు అక్కడి ప్రజల ఆశీర్వచనాలతోనే పార్లమెంట్లో వారణాసికి ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. పవిత్ర గంగామాత తనను దత్తత తీసుకుందన్నారు. నవకాశీతోపాటు ‘అభివృద్ధి చెందిన భారత్’ను సాకారం చేసుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలకమని వివరించారు. జూన్ 1న జరిగే ఓటింగ్‌లో వారణాసి ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని, ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. కాశీని ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని మోదీ హామీ ఇచ్చారు. కన్యాకుమారిలో మోదీ ధ్యానముద్ర సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్లోని ధ్యాన మండపంలో ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ధ్యానం ప్రారంభించారు. దాదాపు 45 గంటపాటు ఆయన ధ్యానం కొనసాగించనున్నారు. మోదీ తొలుత కేరళలోని తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లో కన్యాకుమారికి చేరుకున్నారు. సంప్రదాయ ధోతీ, తెల్ల రంగు కండువా ధరించి భగవతి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మోదీ సముద్ర తీరం నుంచి పడవలో రాక్ మెమోరియల్‌కు చేరుకున్నారు. ధ్యాన మండపం మెట్లపై కాసేపు కూర్చుకున్నారు. తర్వాత ధ్యాన మండపంలో సుదీర్ఘ ధ్యానానికి శ్రీకారం చుట్టారు. -
Lok Sabha Election 2024: హిమాచల్‌ప్రదేశ్‌లో.. బీజేపీకి పరీక్ష!
హిమాచల్‌ప్రదేశ్‌లోని 4 లోక్‌సభ స్థానాలనూ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. కానీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలన్న కమలనాథుల యత్నాలకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కచి్చతంగా ఖాతా తెరవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. కాంగ్రా, మండి, సిమ్లా, హమీర్పూర్ స్థానాలకు శనివారం తుది విడతలో పోలింగ్ జరగనుంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అయినా బీఎస్పీ కూడా అన్నిచోట్లా బరిలో ఉంది. ప్రముఖ అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మాజీ మంత్రి ఆనంద్ శర్మ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితరులున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు ఫలితంగా 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటి ఫలితాలు సుఖి్వందర్ సింగ్ సుఖు సర్కారు భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి... కాంగ్రా ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని బీజేపీ ఈసారి కూడా కొనసాగించింది. సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు రాజీవ్ భరద్వాజ్‌కు టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ఆనంద్ శర్మ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 11 కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. తన ఏడాదిన్నర పాలన చూసి శర్మను గెలిపించాలని ఓటర్లను సీఎం సుఖు కోరుతున్నారు. ఇక్కడ 10 మంది పోటీలో ఉన్నారు.సిమ్లా 2009 నుంచీ బీజేపీయే గెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ సురేశ్ కుమార్ కాశ్యప్‌కే టికెటిచ్చింది. 15 ఏళ్ల క్రితం చేజారిన ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలనికాంగ్రెస్ పట్టుదలతో ఉంది. కసౌలి ఎమ్మెల్యే వినోద్ సుల్తాన్‌పురికి టికెటిచ్చింది. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 13 కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఇక్కడ యాపిల్ రైతులు కీలకం. హట్టి సామాజికవర్గానికి కేంద్రం ఎస్టీ హోదా కలి్పంచడాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసుకుంది.మండి 2021 ఉప ఎన్నికలో నెగ్గిన పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్ ఈసారి పోటీకి అనాసక్తి చూపారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ పోటీకి పెట్టింది. దాంతో ప్రతిభాసింగ్ కుమారుడు, మంత్రి విక్రమాదిత్య సింగ్‌కు కాంగ్రెస్ టికెటిచి్చంది. అభ్యర్థులిద్దరూ హోరాహోరీ ప్రచారం చేశారు. మండిలో విజయం బీజేపీ, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతూ ఉంటుంది. మొత్తమ్మీద కాంగ్రెస్‌దే పై చేయి.హమీర్పూర్ కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మళ్లీ బీజేపీ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ సింగ్ రజ్దా పోటీ చేస్తున్నారు. ఇది బీజేపీ కంచుకోట. ఎనిమిదిసార్లుగా గెలుస్తూ వస్తోంది. ఈసారి బీజేపీ ఫోర్, సిక్స్ కొడుతుందని అనురాగ్ ఠాకూర్ ప్రచారం చేశారు. అంటే మొత్తం 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాలనూ కైవసం చేసుకుంటుందన్నది ఆయన ధీమా. ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాల్లో 4 ఈ లోక్‌సభ సీటు పరిధిలోనే ఉన్నాయి.ప్రధానాంశాలు→ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని, జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్ 370 రద్దును బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసింది. → పాత పింఛను విధానం పునరుద్ధరణ, 2023 భారీ వరదల అనంతరం చేపట్టిన సహాయక చర్యలను కాంగ్రెస్ గుర్తు చేసింది. → బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దేనంటూ ప్రచారం చేసింది. కేంద్రంలో అధికారంలోకొస్తే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. → కాంగ్రా, హమీర్పూర్ వాసులు ఆర్మీలో ఎక్కువగా చేరుతుంటారు. అగి్నపథ్ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ హామీ వారిపై ప్రభావం చూపొచ్చు. → వరదలు ఇక్కడి ప్రజల ప్రధాన సమస్యల్లో ఒకటి. → రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయడమే గాక అసెంబ్లీలో బడ్జెట్‌పై ఓటింగ్‌కు హాజరు కాకుండా విప్‌ను ధిక్కరించినందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నికల్లో ఆ ఆరుగురికి బీజేపీ టికెటిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: కటాకట్ ఫటాఫట్
నేతల నినాదాలు ఓట్ల వర్షం కురిపించిన సందర్భాలు దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో! గరీబీ హటావో అంటూ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇచి్చన నినాదం అప్పట్లో దుమ్ము రేపింది. ఈసారి మాత్రం నినాదాల కంటే కూడా ముఖ్య నేతల నోటి నుంచి వెలువడ్డ వింత పదబంధాలు అందరినీ ఆకర్షించాయి. వాటి అర్థం ఏమై ఉంటుందా అని ఓటర్లలో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీ, సోదరి ప్రియాంక తమ ప్రసంగాల్లో ‘కటాకట్’ అని విరివిగా వాడారు. అదే పదాన్ని ప్రధాని మోదీ తిరిగి కాంగ్రెస్‌పైకి సంధించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజíస్వీ యాదవ్ కూడా వెరైటీ హిందీ పదాలను ప్రయోగించారు. రాహుల్ ఆద్యుడు కటాకట్ అనే హిందీ పదాన్ని తొలుత ప్రయోగించింది రాహులే. మిగతా వారు దాన్ని అందిపుచ్చుకున్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు ఏటా రూ.లక్ష ఇస్తామని, ధనవంతుల సంపదను పేదలకు పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడం తెలిసిందే. రాహుల్ తన ప్రచారంలో ఈ హామీలను తరచూ ప్రస్తావించారు. పేదల బ్యాంకు ఖాతాలకు డబ్బులు ‘కటాకట్ కటాకట్’ బదిలీ చేస్తామని ప్రకటించారు. చకచకా అనే అర్థంలో కటాకట్ పదాన్ని ప్రయోగించారు. దీనిపై ప్రజల్లో బాగా స్పందన రావడంతో ప్రియాంక కూడా అందిపుచ్చుకున్నారు. దాంతో కటాకట్ అంటే ఏమై ఉంటుందా అని గూగుల్‌లో శోధన కూడా పెరిగింది. మోదీ కూడా అదే పదాన్ని తనదైన శైలిలో కాంగ్రెస్‌పైకి తిరిగి ప్రయోగించారు. ‘‘ఈ యువరాజులు ప్యాలెసుల్లో పుట్టారు. కష్టపడిందీ లేదు, ఫలితాలు సాధించిందీ లేదు. అందుకే దేశం తనంతట తానే అభివృద్ధి చెందుతుందని వారు అలవోకగా చెబుతుంటారు. ఎలా? ‘కటాకట్, కటాకట్’’ అని చెప్పుకొచ్చారు. రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు వారిని ‘కటాకట్, కటాకట్’ ఇంటిదారి పట్టిస్తారంటూ రాహుల్‌పై చెణుకులు విసిరారు. తేజస్వి ‘ఫటాఫట్’ తేజస్వీ యాదవ్ కూడా రాహుల్‌తో కలసి ఓ సభలో మాట్లాడుతూ నిరుద్యోగులను ఉద్దేశించి.. ‘‘మీకు ఉద్యోగాలు ఫటాఫట్ వచ్చేస్తాయి. ఫటాఫట్. బీజేపీ సఫాచట్, సఫాచట్ (తుడిచి పెట్టుకుపోతుంది). కాంగ్రెస్, లాంతర్‌కు ఓట్లు తకాతక్ పడిపోతాయి’’ అని చెప్పుకొచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా గమ్మత్తైన పదాలను ప్రయోగించారు. ‘‘తాము అవినీతి చేసేది లేదు, ఎవరినీ చేయనిచ్చేది లేదని గొప్పలు చెప్పేవారు టీకాల తయారీదారుల నుంచి విరాళాలు, ఎన్నికల బాండ్ల రూపంలో భారీ మొత్తాలు అందుకుంటారు. అలాంటి వారు గటాగట్, గటాగట్, అని చెబుతుంటారు. కానీ ప్రజలు ఓటు ద్వారా వారిని ఫటాఫట్ ఫటాపట్ ఇంటికి పంపించేస్తారు’’ అని బీజేపీపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఖాతా తెరిస్తే రూ.లక్ష!
అది బెంగళూరులోని జనరల్ పోస్టాఫీస్. సాధారణంగా ఓ మోస్తరు రద్దీయే ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా జనం ఇసుకేస్తే రాలనంతగా వస్తున్నారు! ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు చాంతాడంత క్యూలు కడుతున్నారు. ఆశ్చర్యపోయిన సిబ్బంది సంగతేమిటని ఆరా తీస్తే, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకొస్తే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష అందిస్తామన్న హామీ ప్రభావమని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.8,500 జమ చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం తెలిసిందే. దాంతో కేంద్రంలో ఇండియా కూటమి వస్తే తమకు ప్రయోజనం దక్కుతుందని భావించిన స్థానికులు బెంగళూరు జనరల్ పోస్టాఫీస్ వద్ద బారులు తీరుతున్నారు. తాను పొద్దున ఎప్పుడో వచ్చానని క్యూలో నిల్చున్న ఓ మహిళ చెప్పడం గమనార్హం. ఖాతా తెరిచిన తొలి రోజు నుంచే డబ్బులు జమవుతాయని పొరుగింటావిడ చెప్పడంతో వచ్చానని మరో మహిళ వెల్లడించింది. శివాజీనగర్, చామరాజపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇలా వస్తున్నారు! నిజం కాదు... తపాలా శాఖ ఒక్కో ఖాతాలో రూ.2,000 నుంచి రూ.8,500 వరకు జమ చేస్తుందన్న నమ్మకంతో ఎక్కువ మంది ఖాతా తెరిచేందుకు వస్తున్నట్టు బెంగళూరు జీపీవో చీఫ్ పోస్ట్‌మాస్టర్ హెచ్ఎం మంజేశ్ చెప్పారు. ‘‘నిజానికి ఇదో వదంతి. తపాలా శాఖ ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. కాకపోతే ఆన్లైన్ నగదు బదిలీ ప్రయోజనానికి ఈ ఖాతా ఉపకరిస్తుంది’’ అని వెల్లడించారు. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో, అందులో వెంటనే డబ్బులు జమవడం మొదలవుతుందన్న వార్తలు వదంతులేనంటూ కార్యాలయం ఆవరణలో పోస్టర్లు కూడా అంటించారు. అయినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. దీంతో చేసేది లేక అదనపు కౌంటర్లు తెరిచారు. గతంలో రోజుకు కనాకష్టంగా 50 నుంచి 60 కొత్త ఖాతాలే తెరిచేవారు. ఇప్పుడు రోజుకు కనీసం 1,000 ఖాతాలకు పైగా తెరుస్తున్నట్టు మంజేశ్ తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకొస్తే ప్రతి నెలా రూ.8,500 ఖాతాలో జమ చేస్తామని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పడమే ఈ రద్దీకి కారణమని అక్కడి సిబ్బంది అంటున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఏడో విడతలో టఫ్ ఫైట్
లోక్‌సభ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుతోంది. ఇప్పటిదాకా ఆరు విడతల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మిగతా 57 సీట్లకు ఆఖరిదైన ఏడో విడతలో శనివారం పోలింగ్ జరగనుంది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిధిలో 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం సీట్లకూ ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశి్చమ బెంగాల్‌లోని మిగిలిన సీట్లలో ఎన్నికల క్రతువు ముగియనుంది. చివరి విడత నియోజకవర్గాలను విశ్లేషిస్తే గత ఫలితాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు తెరపైకొచ్చాయి...చివరి విడతలో పోలింగ్ జరగనున్న 57 స్థానాల్లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీయే చక్రం తిప్పింది. ఈ 57 స్థానాల్లో రెండుసార్లూ 25 సీట్ల చొప్పున కొల్లగొట్టింది. కాంగ్రెస్ 2014లో కేవలం 3, 2019లో 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఓట్లపరంగానూ బీజేపీదే పైచేయి. బీజేపీకి 28 సీట్లలో 40 శాతం ఓట్లు రాగా 12 సీట్లలో 30 నుంచి 40 శాతం దక్కాయి. కాంగ్రెస్‌కు 18 సీట్లలో 10 శాతం ఓట్లు కూడా రాలేదు. మొత్తమ్మీద ఈ 57 సీట్లలో 24 చోట్ల పలు పారీ్టలు పటిష్టంగా ఉన్నాయి. తృణమూల్, బీజేపీలకు చెరో 8 సీట్లు కంచుకోటలు. మూడింట బిజూ జనతాదళ్, రెండేసి చోట్ల కాంగ్రెస్, అకాలీదళ్, ఒక చోట జేడీ(యూ) పటిష్టంగా ఉన్నాయి. ఈ స్థానాల్లో గత మూడు ఎన్నికల్లోనూ ఆ పారీ్టలే గెలిచాయి. మరో 14 సీట్లలో ప్రత్యర్థులకు బీజేపీ గట్టి సవాలు విసురుతోంది. వాటిలో 2009 నుంచి కనీసం రెండుసార్లు బీజేపీ గెలిచింది. ఆ లెక్కన 22 చోట్ల బీజేపీదే జోరు. కాంగ్రెస్ బలంగా ఉన్న సీట్లు 6 మాత్రమే. క్లీన్స్వీప్లన్నీ కమలానివే... ఏడో విడత పోలింగ్ జరిగే స్థానాల్లో గత ఎన్నికల్లో ఐదు చోట్ల క్లీన్‌స్వీప్‌లు నమోదయ్యాయి. అంటే గెలిచిన, ఓడిన పార్టీ మధ్య ఓట్ల తేడా 35 శాతం పైగా నమోదైంది. వీటిలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, హమీర్పూర్, సిమ్లా, కాంగ్రా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ ఖాతాలోనే పడటం విశేషం. ప్రధాని మోదీ గత ఎన్నికల్లో వారణాసిలో 45.2 శాతం ఓట్ల మెజారిటీ సాధించారు!ఆ స్థానాల్లో హోరాహోరీ... ఏడో విడత స్థానాల్లో గత ఎన్నికల్లో పలు స్థానాల్లో నువ్వానేనా అనేలా టఫ్ ఫైట్ జరిగింది. అవి జలంధర్ (పంజాబ్), బలియా, చందౌలీ (యూపీ), బాలాసోర్ (ఒడిశా), జహానాబాద్ (బిహార్). ఈ స్థానాల్లో గెలుపు మార్జిన్ 2 శాతం లోపే! వీటితో పాటు ఏ పారీ్టకీ స్పష్టమైన మొగ్గు లేని స్వింగ్ సీట్లు 11 ఉన్నాయి. గడచిన మూడు ఎన్నికల్లో వీటిలో ఏ పార్టీ కూడా రెండోసారి గెలవకపోవడం విశేషం. గాజీపూర్, ఘోసి, రాబర్ట్స్‌గంజ్, మీర్జాపూర్ (యూపీ), ఆనంద్‌పూర్ సాహిబ్, ఫరీద్కోట్, ఫతేగఢ్ సాహిబ్, పటియాలా (పంజాబ్), బాలాసోర్ (ఒడిశా), జహానాబాద్, కరాకట్ (బిహార్) ఈ స్వింగ్ సీట్ల జాబితాలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముగిసిన లోక్‌సభ 2024 ఎన్నికల ప్రచారం
న్యూఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఎనిమిది రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. చివరి విడతలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. బీహార్ లో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు 134 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. చండీగఢ్ 1 లోక్ సభ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ నాలుగు లోక్‌సభ స్థానాలకు 37 మంది పోటీ పడుతున్నారు. జార్ఖండ్ 3 లోక్‌సభ స్థానాల్లో 52 మంది, ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలకు 66 మంది, పంజాబ్ 13 లోక్‌సభ స్థానాలకు 328 మంది, ఉత్తర ప్రదేశ్ 13 లోక్‌సభ స్థానాల్లో 144 మంది బరిలో నిలిచారు. వెస్ట్ బెంగాల్ 9 స్థానాలకు ,124 మంది బరిలో ఉన్నారు. చివరి విడతలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ, మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, హామిపూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గోరక్‌పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు.18వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొత్తం ఏడు దశల్లో 44 రోజులపాటు సాగనుంది. 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్న ఎన్నికలు ఇవే. -
‘ప్రసంగాలతో గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ’
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండిచారు. ప్రతిపక్షాలు, ఓ వర్గం ప్రజలపై ప్రధాని మోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని ఆఫీసు గౌరవాన్ని దిగజార్చాయి. ఇలా గౌరవాన్ని దిగజార్చిన తొలి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్ ప్రజలకు లేఖ రాశారు.‘‘ ప్రధాని మోదీ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి దేశ ప్రజల్లో విభజన తీసుకువచ్చే విద్వేశ వ్యాఖ్యలు. 2022 వరకు మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. మోదీ విధానాల వల్ల గత పదేళ్లలో రైతులు ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. రోజుకు జాతీయ సగటు రైతు ఆదాయం రూ. 27 ఉంటే, సగటు అప్పు మాత్రం రూ. 27 వేలు ఉంది. ఇందనం, ఎరువులు అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో రైతుల ఆదాయం తగ్గిపోయింది. పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. జీఎస్టీ, నోట్ల రద్దు, కరోనాను సరిగా ఎదుర్కొకపోవటం వల్ల దేశం దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లింది. గ్రోత్ రేట్ కూడా పడిపోయింది. సుమారు 750 మంది రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో మృతి చెందారు. లాఠీలు, రబ్బరు బుల్లెట్లతోనే కాకుండా ప్రధాని మోదీ తన మాటలతో రైతులపై దాడి చేశారు. రైతులను ‘‘ఆందోళన జీవులు’’ అని అవమానించారు. తమను సంప్రదించకుండా చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కోరారు. గడిచిన పదేళ్లలో పంజాబ్, పంజాబ్ ప్రజలను బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా దూషించింది’’ అని మన్మోహన్ సింగ్ తెలిపారు.ఏప్రిల్‌లో మోదీ రాజస్థాన్‌లోని ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలు కనేవారికి పంచిపెడతారని అన్నారు. ముస్లీంలకు తొలి ప్రాధాన్యమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించినట్లు కూడా మోదీ ఆరోపణులు చేసిన విషయం తెలిసిందే. -
నేటితో చివరి అంకం..ప్రచారం ముగింపు
-
బిహార్ లో కీలక పోరు
-
ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
2024 సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడవ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. జరిగిన ఆరు దశల్లో నమోదైన అత్యల్ప ఓటింగ్ శాతం ఓటర్లలోని నిరుత్సాహాన్ని తెలియజేస్తోంది. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యాలను మార్చుకోవడం కూడా మిశ్రమ సందేశాన్ని అందిస్తోంది. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ‘మోదీ హవా’ కనిపించింది. కానీ అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాన్ని ఉదాసీనత భర్తీ చేసింది. ‘ఈసారి 400 సీట్లు దాటుదాం’ అన్న నినాదం ఎత్తుకోవడంతో కూడా కాషాయపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా ప్రతిపక్షాలను, ప్రధానంగా సమాజ్‌వాదీ పార్టీని అదుపులో ఉంచడంలో మాత్రం బీజేపీ విజయం సాధించింది.చాలామంది రాజకీయ పండితులతోపాటు, మేము మాట్లాడిన అత్యధిక సాధారణ ఓటర్ల ప్రకారం... 2014, 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఏమంత ఉత్సాహంగా లేవు. బీజేపీ సంపూర్ణ ఆధిపత్యం, ఎటువంటి బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం దీనికి కారణాలు. బీజేపీ ప్రధాన మద్దతుదారుల్లో ఉన్న అసంతృప్తి కూడా ఎన్నికల ఉత్సాహాన్ని తగ్గించింది. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యాలను మార్చుకోవడం కూడా మిశ్రమ సందేశాన్ని అందిస్తోంది. ఎన్నికల తొలి దశల్లో ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టింది. అన్ని వైపులా పేలవమైన ప్రచారం, విజేత ముందుగానే తెలిసిపోవడం లాంటివి వీటికి కారణాలు. వీటన్నింటికీ మించి, ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికలలో మరో రెండు అంశాలు గమనించదగినవి: ఒకటి, బీజేపీ తన తిరుగులేని స్థితిని సాధించిన విధానం. దీనిని మనం గుజరాత్ నమూనా ఎన్నికల ఆధిపత్యం అని పిలవొచ్చు. రెండు, ‘శాంతి భద్రతల’ ప్రాముఖ్యత. అందువల్లే, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఎప్పటిలాగే, బీజేపీ ఎన్నికల ప్రచార ఒరవడిని జాగ్రత్తగా ప్లాన్ చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ స్పష్టంగా ఈ ప్రణాళికలో భాగమే. ఇది నిజంగానే ఉత్కంఠకు దారితీసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలలు... బీజేపీ నాయకుడొకరు చెప్పినట్లుగా, ‘ఇది గర్భధారణకు సంబంధించిన చివరి త్రైమాసికం. బూత్ స్థాయి కార్యకర్తలను ప్రసవానికి సిద్ధం చేయడంలో ఇది చాలా కీలకం’. ఈ మూడు నెలల్లో స్పష్టంగా ‘మోదీ హవా’ కనిపించింది. కానీ ఉత్సాహం ఒక్కసారి శిఖర స్థాయికి వెళ్లాక, అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాన్ని ఉదాసీనత భర్తీ చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా గణనీయంగా 40–50 శాతం వరకు కూడా ఉంది. అందుకే పశ్చిమ యూపీలోని కీలకమైన యుద్ధభూమిలో ఓటింగ్ మొదటి కొన్ని దశల్లో బీజేపీ కీలక కర్తవ్యం, దాని ప్రధాన ఓటు పునాదిని ఏకీకృతం చేయడంగానే ఉండింది. 2013 అల్లర్ల నుండి స్థానికంగా ఉన్న హిందూ, ముస్లిం తగాదాల కారణంగా ఇది బీజేపీకి సులభమైన పనిగా కనిపించింది. అలాగే ముఖ్యమంత్రి కూడా బలమైన సానుకూల అంశంగా కొనసాగుతున్నారు. జాతీయ సమస్యల విషయంలో మోదీ రికార్డుపై ఓటర్లు ఆధారపడుతున్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం శాంతిభద్రతల నిర్వహణ విషయంలో యోగీ అందించిన తోడ్పాటునే ఎక్కువ పరిగణనలోకి తీసుకుంటున్నారు.ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఓటర్ల ఉత్సాహం ఉధృతంగా ఉంది. అయినప్పటికీ స్పష్టమైన ప్రభంజనం మాత్రం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే అప్పటికి సిట్టింగ్ ఎంపీలపై ఆగ్రహం రూపంలో అనేక వ్యతిరేకతలు గూడుకట్టుకుని ఉన్నాయి. ద్రవ్యోల్బణం, సంచరించే పశువుల బెడద, తప్పుడు అభ్యర్థుల ఎంపిక కారణంగా బీజేపీ మీద విసుగు చెందిన అనేక మందిని మేము చూశాము. అయినప్పటికీ ఓటు విషయానికి వస్తే, ఎక్కువ మంది తాము బీజేపీకే ఓటు వేస్తామని అంగీకరించారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుందన్న ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ, యూపీలో బీజేపీ గుజరాతీకరణకు ప్రయత్నిస్తోంది. అంటే కుల ఇంజినీరింగ్ ద్వారా తమ ఓటు పునాదిని నిర్మించడం, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయడం. బూత్, జిల్లా స్థాయుల్లో ఎంతోమంది విపక్ష నేతలు పార్టీలు మారి బీజేపీలో చేరారనేది ఆశ్చర్యం కలిగించే అంశం. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా ప్రతిపక్షాలను, ప్రధానంగా సమాజ్‌వాదీ పార్టీని తగ్గించడంలో బీజేపీ విజయం సాధించింది. ఇటావా, మైన్‌పురీ, కన్నౌజ్‌లలో తప్ప ఎక్కడా సమాజ్ వాదీ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నట్లు కనిపించదు. ఇది తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి నుండి కూడా స్పష్టమైన మార్పును సూచిస్తోంది.గత కొన్ని నెలల్లో ఒక్క గోరఖ్‌పూర్ ప్రాంతంలోనే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 11,000 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారని ఒక హిందీ వార్తాపత్రిక పేర్కొంది. చెప్పాలంటే, రెండు నెలల్లో యూపీలోని 10 మంది బీఎస్పీ ఎంపీల్లో ఐదుగురు బీజేపీలో చేరారు. బీజేపీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను– టికెట్ రానివారు లేదా ఏ కారణం చేతనైనా ఆయా పార్టీలలో పక్కన పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కుశీనగర్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన ఎస్పీ మాజీ ఎమ్మెల్యే నాథుని ప్రసాద్ కుశ్వాహా ఇటీవలే బీజేపీలో చేరారు. అదేవిధంగా, 2019 గోరఖ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రోజునే బీజేపీలో చేరారు.ఒక పార్టీగా, కొత్తగా ప్రతిపక్ష నాయకులను చేర్చుకోవడం, అదే సమయంలో సొంత కార్యకర్తలను సంతోషంగా ఉంచడం వంటి భారీ సవాళ్లను బీజేపీ ఎదుర్కొంటోంది. దీనివల్ల అనివార్యంగా బీజేపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అలాంటి ఆగ్రహానికి గురైన ఒక కార్యకర్త ‘భారతదేశంలో కాంగ్రెస్‌ను లేకుండా చేసే ప్రయత్నంలో, బీజేపీయే కాంగ్రెస్ అవుతోంది’ అని వ్యాఖ్యానించారు. బలహీనమైన ప్రారంభం ఉన్నప్పటికీ, ఈ సంస్థాగతమైన తికమక బీజేపీ కంటే సమాజ్ వాదీ పార్టీనే ఎక్కువగా దెబ్బతీస్తోంది. ఎస్పీ బలహీనతను పసిగట్టిన బీజేపీ, మధ్యప్రదేశ్‌కు చెందిన యాదవ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను వ్యూహాత్మకంగా రంగంలోకి దింపింది. ఎస్పీ, ఆర్జేడీల యాదవుల ఓట్లను లాక్కోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి యూపీ, బిహార్లలో మోహన్ యాదవ్ పోస్టర్ బాయ్‌గా మారారు.యూపీలోని ప్రత్యర్థి పార్టీల ఓటర్లు, మద్దతుదారుల విషయానికి వస్తే, తమ అభ్యర్థుల గెలుపు సాధ్యం కాదని గ్రహించడంతో వారిలో ఉదాసీనత మొదలైంది. మేం సర్వే చేసిన ఒక వ్యక్తి ఇలా చెప్పారు: యోగీజీ వల్ల ముస్లింలు, యాదవుల పరిస్థితి 1990లలో బిహార్, యూపీల్లోని బ్రాహ్మణులు, క్షత్రియుల మాదిరిగా తయారైంది. బయటకు వెళ్లి ఓటు వేయడానికి వారికి ఎటువంటి ప్రేరేపకమూ లేదు. ఎందుకంటే ఇది వారికి ఎటువంటి లాభమూ చేకూర్చదు. వాస్తవానికి యూపీలో బీజేపీని రెండు సవాళ్లు ఇబ్బంది పెడుతున్నాయి. మొదటిది, యూపీలో మొదటి రెండు దశల్లో ఓటింగ్ శాతం దాదాపు 5 శాతం తగ్గింది. డజను కంటే కొంచెం ఎక్కువ నియోజకవర్గాల్లో దాదాపు 8.9 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రతి బూత్‌లోని ఒక్కో ఓటునూ విలువైనదిగా భావించి పనిచేసే పార్టీకి ఇది ఆందోళనకరం. రెండవది, ‘అబ్ కీ బార్, 400 పార్’ (ఈసారి 400 సీట్లు దాటుదాం) అంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీని కొంతైనా అది వెనక్కి నెట్టింది. రిజర్వేషన్లను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికే బీజేపీ ఇంత భారీ మెజారిటీని కోరుతోందనే అత్యంత తీవ్రమైన అభియోగాన్ని ఆ పార్టీ ఎదుర్కొంటోంది (ఈ ప్రచారం 2015 బిహార్ రాష్ట్ర ఎన్నికలలో వారికి వ్యతిరేకంగా అత్యంత ప్రభావం చూపింది). ఆ సంక్షోభ తీవ్రతను తగ్గించడానికి చాలాకాలంగా ఉన్న హిందూ–ముస్లిం రగడతో సహా అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలనూ బీజేపీ సమీకరించింది. వ్యాసకర్తలు శశాంక్ చతుర్వేది ‘ నిర్మా విశ్వవిద్యాలయం, అహ్మదాబాద్; డేవిడ్ ఎన్ గెలినర్ ‘ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్; సంజయ్ కుమార్ పాండే ‘ జేఎన్‌యూ, ఢిల్లీ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ
బీజేపీ, అధికార బీజేడీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతున్న ఒడిశాలో ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుతోంది. 15 లోక్‌సభ, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇప్పటికే ముగిసింది. చివరి దశలో భాగంగా మిగతా 6 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. వీటిలో 4 బీజేడీ, 2 బీజేపీ సిట్టింగ్ స్థానాలు. వాటిపై ఫోకస్...జగత్సింగ్పూర్ ఇక్కడ రెండు దశాబ్దాలుగా బీజేడీ చక్రం తిప్పుతోంది. బీజేపీ ఖాతా తెరవలేదు. 2019లో భారీ మెజారిటీతో నెగ్గిన రాజశ్రీ మల్లిక్ బీజేడీ నుంచి, ఆయన చేతిలో ఓడిన బిబూ ప్రసాద్ తరాయ్ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. తరాయ్ 2009లో ïసీపీఐ నుంచి, 2014లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. ఆయన ఓటు బ్యాంకును చూసి బీజేపీ మరోసారి చాన్సిచి్చనట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రవీంద్ర కుమార్ సేథీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేడీలోకి చేరడం ఆ పారీ్టకి అనుకూలించే అంశం.కేంద్రపర ఇదీ బీజేడీ కంచుకోటే. ఈసారి మాత్రం బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. 2009, 2014ల్లో బీజేడీ నుంచి గెలిచిన బైజయంత్ పాండా గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి బీజేడీ నేత, సినీ నటుడు అనుభవ్ మహంతి చేతిలో ఓటమి చవిచూశారు. ఒకప్పుడు సీఎం నవీన్ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడైన బైజయంత్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుని హోదాలో మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అనుభవ్ మహంతి కూడా బీజేపీలో చేరడంతో బీజేడీ సంకట స్థితిలో పడింది. అన్షుమన్ మహంతిని పోటీకి దింపింది. మయూర్భంజ్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్థానంలో ఎమ్మెల్యే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సన్నిహితుడు నాబా చరణ్ మఝికి ఈసారి బీజేపీ టికెటిచ్చింది. ద్రౌపది ముర్ము 2009లో ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన విద్యా శాఖ మంత్రి సుదమ్ మరాండీని బీజేడీ బరిలో దింపింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరి అంజని సోరెన్ జేఎంఎం తరఫున పోటీలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.భద్రక్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ భద్రక్ లోక్‌సభ స్థానం పరిధిలోని చాంద్‌బలి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు. దాంతో భద్రక్‌లో గెలుపు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ చరణ్ సేథీ కుమారుడు అవిమన్యు సేథీ పోటీ చేస్తున్నారు. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ మంజులతా మండల్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ అనంత ప్రసాద్ సేథీ బరిలో ఉన్నారు.జజ్పూర్ బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ శరి్మష్ఠ సేథీ మళ్లీ బరిలో ఉన్నారు. రవీంద్ర నారాయణ బెహరాకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ ఆంచల్ దాస్ పోటీ చేస్తున్నారు. ఆయన 1996లో ఇక్కడ జనతాదళ్ నుంచి గెలిచారు. గత ఐదేళ్లలో బీజేపీ ఓటు బ్యాంక్ బాగా పెరిగిందన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే పార్టీ అభ్యర్థి బెహరా స్థానికులకు పరిచయస్తుడే అయినా రాజకీయాలకు కొత్త.బాలాసోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మాజీ బీజేపీ నేత లేఖశ్రీ సమంత సింగార్ పోటీ చేస్తున్నారు. పార్టీని అస్తమానం విమర్శించే లేఖశ్రీకి టికెటివ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి కందమాల్ నుంచి బీజేపీ తరఫున పోటీకి లేఖశ్రీ ఆసక్తి చూపారు. నీలగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్టానం సూచించడంతో బీజేడీలో చేరారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ కుమార్ జెనా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన కరబేల స్వైన్ స్వతంత్ర అభ్యర్థిగా రెండు పారీ్టలకూ సవాలు విసురుతున్నారు.బరిలో కోటీశ్వరులు ఒడిశాలో తుది విడత బరిలో ఉన్న 66 మంది అభ్యర్థుల్లో 20 మంది కోటీశ్వరులే. కేంద్రపర బీజేపీ అభ్యర్థి బైజయంత్ పాండాకు అత్యధికంగా రూ.148 కోట్లున్నాయి. తర్వాత స్వతంత్ర అభ్యర్థి శ్రీరామ్ పాండే రూ.18.23 కోట్లు, భద్రక్ బీజేపీ ఎంపీ మంజులత మండల్‌కు రూ.14.86 కోట్ల ఆస్తులున్నాయి. 15 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 10 మంది తీవ్ర కేసుల్లో నిందితులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) పేర్కొంది. -
Lok Sabha Election 2024: మహిళలకు బీజేడీ సముచిత స్థానం!
లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) ఆదర్శంగా నిలిచింది. టికెట్ల కేటాయింపులో మహిళలకు సముచిత స్థానమిచ్చి గౌరవించింది. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలుంటే ఏడు చోట్ల మహిళలకు అవకాశం ఇచి్చంది. అంటే వారికి 33 శాతం సీట్లు కేటాయించింది. లేఖశ్రీ సమంత్ సింగార్ (బాలాసోర్), శర్మిష్ట సేథీ (జజ్పూర్), మంజులా మండల్ (భద్రక్), రాజశ్రీ మల్లిక్ (జగత్సింగ్పూర్), పరిణీతి మిశ్రా (బార్గఢ్), కౌసల్యా హికాక (కోరాపుట్), రంజితా సాహూ (ఆస్క)కు టికెట్లిచ్చింది. అదే సమయంలో టికెట్ల కేటాయింపులో ఫిరాయింపుదారులకు కూడా పెద్ద పీట వేసి విమర్శకుల నోళ్లకు పని చెప్పింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఏడుగురు మహిళలకు బీజేడీ చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ టికెట్లివ్వడం గమనార్హం. ఈసారి బీజేడీ నుంచి బరిలోకి దిగిన ఏడుగురు మహిళా అభ్యర్థుల్లో బీజేపీ నుంచి వచి్చన లేఖశ్రీ సమంత్ సింగార్ కూడా ఉన్నారు. ఆమె బాలాసోర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఏడుగురు బీజేడీ మహిళా అభ్యర్థుల్లో ఇద్దరు పార్టీ ఫిరాయింపుదారులున్నారు! ఈ విడత ఇద్దరు సిట్టింగ్ మహిళా ఎంపీలు చంద్రాణి ముర్ము (కియోంజర్), ప్రమీలా బిసోయ్ (ఆస్క)లకు నవీన్ టికెట్లివ్వలేదు. ఫిరాయింపుదారులకూ 33 శాతం ఒకరిద్దరు కాదు.. బీజేడీ ఈ విడత ఏకంగా 38 శాతం మంది ఫిరాయింపుదారులను లోక్‌సభ బరిలో దింపడం ఆశ్చర్యకరం. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇతర పారీ్టల నుంచి వచి్చచేరిన వారే! లేఖశ్రీ సమంత్ సింగార్ (బాలాసోర్), భృగు బాక్సిపాత్ర (బెర్హాంపూర్), ప్రదీప్ మాంఝి (నబరంగ్‌పూర్), సురేంద్ర సింగ్ భోయ్ (బోలంగీర్), పరిణీత మిశ్రా (బార్గఢ్), ధనర్జయ్ సిధు (కియోంఝర్), అన్షుమన్ మహంతి (కేంద్రపర), మన్మోత్ రూట్రే (భువనేశ్వర్) ఇతర పారీ్టల నుంచి వచ్చి బీజేడీ టికెట్ సంపాదించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: పాటలీపుత్ర లాలుకు లిట్మస్ టెస్టు
పాటలీపుత్ర లోక్‌సభ స్థానం బీజేపీ, ఆర్జేడీ మధ్య హోరాహోరీ పోరుకు వేదికైంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్ హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. ఆయన చేతిలో రెండుసార్లు ఓడిన ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కూతురిని ఎలాగైనా గెలిపించుకోవాలని లాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు... బిహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ స్థానం 2008లో డీలిమిటేషన్ తర్వాత ఏర్పాటైంది. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూడటం విశేషం. అది కూడా ఒకప్పటి తన శిష్యుడు జేడీ(యూ) నేత రంజన్ ప్రసాద్ యాదవ్ చేతిలో! తర్వాత మీసా భారతిని బరిలో దింపారు. తనను కాదని కూతురికి టికెటివ్వడంతో లాలుతో విభేదించిన రామ్‌కృపాల్ 2014లో ఆర్జేడీని వీడి బీజేపీలో చేరారు. 2014, 2019ల్లో రెండుసార్లు మీసా భారతిని ఓడించారు. విద్యార్థి సంఘాల నుంచి ఎదిగిన రామ్ కృపాల్ 1993లో ఆర్జేడీ టికెట్‌పై తొలిసారి ఎంపీగా గెలిచారు. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 1996లో, 2004లో కూడా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఐదుసార్లు ఎంపీగా చేసిన ఆయనకు బిహార్‌లో గట్టి రాజకీయ బలం ఉంది. పాటలీపుత్ర నియోజకవర్గ ప్రజలతో మంచి అనుబంధముంది. పిలిస్తే పలికే నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గమంతా కలియదిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. రామమందిర నిర్మాణ ప్రభావం కూడా ఇక్కడి ఓటర్లపై బాగా ఉండటం ఆయనకు మరింత కలిసి రానుంది.మీసా... మూడోసారిపాటలీపుత్రలో ఆర్జేడీ ఓటమి పరంపరకు ఈసారి ఎలాగైనా బ్రేక్ వేయడానికి మీసా ప్రయతి్నస్తున్నారు. లాలు, భార్య రబ్రీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌తో సహా కుటుంబమంతా ఆమె గెలుపు కోసం పని చేస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం 2019లో మీసాకు బాగా మైనస్‌గా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండరన్న అపప్రథను కూడగట్టుకున్నారు. ఈసారి కూడా ఎన్నికలవగానే మాయమవుతారా, గెలుపోటములతో నిమిత్తం లేకుండా నియోజకవర్గంలో ఉండి పని చేస్తారా అంటూ ప్రచారం పొడవునా ప్రజలు ఆమెను నిలదీస్తున్న పరిస్థితి! అయితే ఇక్కడ మోదీ ఫ్యాక్టర్ 2019లో ఉన్నంత బలంగా లేకపోవడం మీసాకు కాస్త ఊరట. పైగా పాటలీపుత్ర లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలూ ఆర్జేడీ, దాని మిత్రపక్షాల చేతిలోనే ఉన్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రచారా్రస్తాలుగా సంధిస్తున్నారామె.కుల సమీకరణాలు... బీజేపీకి మద్దతిచ్చే బ్రాహ్మణులతో సహా అగ్రవర్ణాల ఓట్లు పాటలీపుత్రలో లక్షకు పైగా ఉన్నాయి. దాదాపు 4 లక్షల ఓట్లున్న భూమిహార్ ఓటర్లలోనూ ఆ పార్టీకి బలముంది. 5 లక్షల యాదవ, 1.7 లక్షల కుర్మీ, 3 లక్షల దళిత ఓట్లు రామ్ కృపాల్, మీసా మధ్య చీలనున్నాయి. యాదవులతో పాటు 1.5 లక్షల ముస్లిం ఓట్లను మీసా నమ్ముకున్నారు. కాకపోతే మజ్లిస్ బరిలో ఉండటంతో ముస్లిం ఓట్లు చీలి ఆర్జేడీకి గట్టి నష్టమే చేసేలా కన్పిస్తోంది. హోరాహోరీ పోరు లో ఈసారి పాటలీపుత్రలో లాంతరు వెలుగుతుందో, ముచ్చటగా మూడోసారీ కమలమే వికసిస్తుందో చూడాలి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
లోక్‌సభ అభ్యర్థుల్లో31% సంపన్నులు... 20% నేరచరితులు
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 30.8 శాతం మంది కోటీశ్వరులే. అలాగే 20 శాతం (1,643) మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 1,190 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాల వంటి తీవ్రమైన కేసులున్నాయి. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను విశ్లేíÙంచిన మీదట అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు బుధవారం నివేదిక విడుదల చేశాయి. మొత్తం అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పారీ్టల తరఫున, 532 మంది రాష్ట్ర పారీ్టల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ పారీ్టల నుంచి బరిలో ఉన్నారు. 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు. మొత్తం 751 పారీ్టలు పోటీలో ఉన్నాయి. 2019లో 677 పార్టీలు, 2014లో 464, 2009 ఎన్నికల్లో 368 పారీ్టలు పోటీ చేశాయి. 2009 నుంచి∙2024 వరకు ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పారీ్టల సంఖ్య 104% పెరిగింది. కాగా మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 324 మంది సిట్టింగ్ ఎంపీల సంపద గత ఐదేళ్లలో సగటున 43% పెరిగింది. పెరుగుతున్న మహిళాæ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య ఈసారీ స్వల్పంగానే ఉంది. కేవలం 797 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే గత మూడు లోక్‌సభ ఎన్నికల నుంచి వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2009లో 7 శాతం, 2014లో 8 శాతం, 2019లో 9 శాతం మహిళలు లోక్‌సభ బరిలో నిలవగా ఈసారి 10 శాతానికి చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 69 మంది మహిళలకు, కాంగ్రెస్ 41 మందికి టికెట్లిచ్చాయి.సగానికి పైగా రెడ్ అలర్ట్ స్థానాలే...క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1,500 కాగా ఈసారి 1,643కు పెరిగింది. మొత్తం 440 మంది అభ్యర్థులలో 191 మంది నేర చరితులతో ఈ జాబితాలో బీజేపీ టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (327 మందిలో 143), బీఎస్పీ (487 మందిలో 63), సీపీఎం (52 మందిలో 33) ఉన్నాయి. 3903 మంది స్వతంత్ర అభ్యర్థులలో 550 (14%) మంది నేర చరితులు. ఈ జాబితాలో టాప్ 5లో కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, పశి్చమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరున్నారు. ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది నేర చరితులున్న (రెడ్ అలర్ట్) స్థానాలు 2019లో 36 శాతం కాగా ఈసారి ఏకంగా 53 శాతానికి పెరిగాయి. ఈ జాబితాలో 288 నియోజకవర్గాలు చేరాయి. అంటే దేశవ్యాప్తంగా ప్రతి రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి రెడ్ అలర్ట్ స్థానమే!సంపన్నుల్లో తెలుగు అభ్యర్థులే టాప్–2అభ్యర్థుల్లో కోటీశ్వరులు 2019లో 16 శాతం కాగా ఈసారి 27 శాతానికి పెరిగారు. మొత్తం అభ్యర్థులలో 2,572 మంది కోటీశ్వరులే! ఈ జాబితాలో కూడా బీజేపీయే టాప్‌లో నిలిచింది. 440 మంది బీజేపీ అభ్యర్థుల్లో 403 కోటీశ్వరులే. అంటే 91.6 శాతం! 2019లో ఇది 41.8 శాతమే. 327 మంది కాంగ్రెస్ అభ్యర్థులలో 292 మంది (89%), 487 మంది బీఎస్పీ అభ్యర్థులలో 163 మంది (33%), 52 మంది సీపీఎం అభ్యర్థులలో 27 మంది (52%) ), 3,903 మంది ఇండిపెండెంట్లలో 673 మంది (17%) మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో తొలి, రెండో స్థానంలో తెలుగు అభ్యర్థులే ఉండటం విశేషం. ఏపీలోని గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏకంగా రూ.5,705 కోట్లతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4568.22 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ కౌంటర్..
బిహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం నవీన్ పట్నాయక్, ప్రధాని నరేంద్ర మోదీ పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం చుట్టూ చేరాయి. సీఎం ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మోదీ స్పందిస్తూ.... రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఆరోగ్యం క్షీణించడం వెనక గల కారణాలపై ఓ కమిటీ వేసి విచారణ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.తాజాగా మోదీ వ్యాఖ్యలపై సీఎం నవీన్ పట్నాయక్ కౌంటరిచ్చారు. : తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. తీవ్ర ఎండలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. తన ఆరోగ్యంపై ప్రధాని మోదీకి అంత ఆందోళన ఉంటే.. తనకు ఫోన్ చేసి ఉండాల్సిందని పట్నాయక్ అన్నారు. గత పదేళ్లుగా తన ఆరోగ్యంపై బీజేపీ పుకార్లు పుట్టిస్తోందని విమర్శించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, గత నెల రోజులుగా రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నానని, ఈ విషయంలో ప్రధానికి హామీ ఇస్తున్నానని ఎద్దేవా చేశారు. తన ఆరోగ్యం బాగా లేకపోతే ఈ ఎండ వేడిమి మధ్య నేను ప్రచారం చేయలేనని అన్నారు.కాగా ఒడిశాలో బారపదాలో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుడూ..సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘నవీన్ ఆరోగ్యం విషయంలో ఏదో కుట్ర జరుగుతోందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. సీఎం అనారోగ్యం వెనుక ఎవరున్నారని తెలుసుకోవడం ఒడిషా ప్రజల హక్కు.ఆయన తరఫున ప్రభుత్వాన్ని నడుపుతోన్న వ్యక్తినే ముఖ్యమంత్రి ఆరోగ్యం క్షీణించడానికి కారణమా? ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను అన్వేషించేందుకు కమిటీని ఏర్పాటుచేస్తాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి కదలికలను కూడా సీఎం సన్నిహితుడు పాండియన్ నియంత్రిస్తున్నాడంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించిన మరుసటిరోజే ప్రధాని ఈవిధంగా స్పందించారు. -
కాంగ్రెస్‌తో పొత్తు శాశ్వతం కాదు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఆప్, కాంగ్రెస్ భాగమైన విషయం తెలిసిందే. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు పార్టీలో కలిసే పోరుకు వెళ్తున్నాయి. అయితే కాంగ్రెస్‌తో పొత్తు శాశ్వతం కాదని తాజాగా కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ మాట్లాడుతూ. జూన్ 4న అందరిని ఆశ్చర్యపరిచే ఫలితాలు రానున్నాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌తో పొత్తు శాశ్వతం కాదని, బీజేపీని ఓడించడమే తమ ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. ‘దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యం, బీజేపీని ఓడించేందుకు ఎక్కడ పొత్తు అవసరం అయినా ఆప్, కాంగ్రెస్ కలిసి వస్తాయి. పంజాబ్‌లో బీజేపీకి ఉనికి లేదు’ అని అన్నారు. కాగా ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కూటమిగా ఉండగా, పొరుగున ఉన్న పంజాబ్‌లో ఆ పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయి.ఇదిలా ఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాను తిరిగి జైలుకు వెళ్లడం సమస్యేం కాదని అన్నారు. ఈ దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, వారు(కేంద్రంలోని బీజేపీ) కోరుకున్నంత కాలం నన్ను జైల్లో పెట్టనివ్వండి. నేను దేనికి భయపడను. వెనకడుగు వేయను.కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం మద్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ తరపున ప్రచారం చేసేందుకు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తిరిగి ఎన్నికలు పూర్తయిన తర్వాత జూన్ 2న ఆయన జైల్లో అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంటుంది.మరోవైపు ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసు కోర్టులో ఉన్నందున దానిపై స్పందించేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితానికి ప్రధాని త్వరలో ముగింపు పలుకుతారని కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్రలో బీజేపీ అధికారంలో వస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షానే తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని, ఆదిత్యనాథ్‌ను ఆయన పదవి నుంచి తొలగిస్తారని కేజ్రీవాల్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. -
దేశానికి ప్రధానిగా మోదీ అవసరం లేదు: సీఎం మమత
కోల్‌కతా: తనను దేవుడు గొప్ప ఉద్దేశమే కోసం భూమిపైకి పంపించాడని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. కోల్‌కతాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలు పాల్గొని మమత మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు తాను ఒక దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటున్నారు. అలా అయితే మోదీ తనకోసం ఒక దేవాలయం కట్టించుకొని అందులో కూర్చోవాలి. అంతేగాని దేశాన్ని ఇబ్బందుల పాలుచేయటం మానుకోవాలని సీఎం మమత ఎద్దేవా చేశారు.‘‘ఒక నేత మోదీని దేవుళ్లకే దేవుడు అంటారు.. మరో నేత పూరీ జగన్నాథ్ స్వామినే మోదీ భక్తుడు అంటారు. ఒకవేళ మోదీ దేవుడు అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లో రాజకీయాలు చేయకూడదు. దేవుడు ఎప్పడు అల్లర్లను ప్రేరేపంచడు’’ అని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘‘అటల్ బిహారీ వాజ్పయి వంటి ఎంతోమంది ప్రధాన మంత్రులతో నేను కలిసి పనిచేశాను. వాళ్లు అందరూ నాతో ప్రేమగా మెలిగేవారు. మన్మోహన్సింగ్, రాజీవ్ గాందీ, పీవీ, దేవేగౌడ వంటి ప్రధానులతో పని చేశాను కానీ, మోదీ వంటి ప్రధానిని నేను చూడలేదు. ఇటువంటి ప్రధాని భరతదేశానికి అవసరం లేదు’’ అని మోదీపై సీఎం మమత ధ్వజమెత్తారు.ఇటీవల ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను భౌతికంగా జన్మించలేదు. తనను భూమిపైకి దేవుడే పంపాడన్న విషయం తెలిసిందే. అదేవిధంగా బీజేపీ పూరీ పార్లమెంగ్ నియోజకవర్గ అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ స్వామి ప్రధాని మోదీకి భక్తుడని వ్యాఖ్యానించిన సంగతి విధితమే. -
ఓటింగ్ పెంచేందుకు ఈసీ మీమ్స్
సార్వత్రిక ఎన్నికల సమరం చివరాఖరి దశకు చేరుకుంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నిస్తున్నా ఇప్పటిదాకా జరిగిన ఆరు విడతల్లో పెద్ద మార్పేమీ కనిపించలేదు. దాంతో చివరిదైన ఏడో విడతలోనైనా ఓటింగ్ శాతాన్ని వీలైనంత పెంచేందుకు ఈసీ పలు ప్రయత్నాలు చేస్తోంది. యువ ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు వారికి బాగా కనెక్టయ్యే మీమ్స్‌ను ఎంచుకుంది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత హిట్టయిందో, అందులోని మున్నా భయ్యా పాత్ర కూడా అంతే ఫేమస్ అయింది! ఈసీ రిలీజ్ చేసిన కొత్త మీమ్‌లో మున్నా భయ్యా డైలాగ్‌ను ఓటింగ్‌కు అన్వయించింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నా భయ్యా క్లాస్ రూమ్‌లో చెప్పే ‘పడాయీ లిఖాయీ కరో, ఐఏఎస్ వయ్యేఎస్ బనో’ (చదువుసంధ్యలపై దృష్టి పెట్టు, కలెక్టరో మరోటో అవ్వు) అనే ఒరిజినల్ డైలాగ్ ఇప్పటికీ రీల్స్, షార్ట్ వీడియోల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈసీ ఇప్పుడు దీనికి ఓటింగ్ ట్విస్ట్ ఇచి్చంది. ‘యే క్యా రీల్స్ మే టైమ్ బర్బాద్ కర్ రహే? జావో వోట్ దో, లోక్తంత్ర్ కో మజ్బూత్ కరో (రీల్స్ వెంటపడి ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకుంటారు? వెళ్లి ఓటేయండి... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి) అని ఓటర్లకు మున్నా భయ్యా చెబుతున్నట్లుగా మీమ్ రూపొందించింది. ‘యువతను మున్నా భయ్యా ఓటేయాలని కోరుతున్నాడు’ అంటూ క్యాప్షన్‌ను కూడా జోడించింది! ఏడు విడతల సుదీర్ఘ షెడ్యూల్లో ఇప్పటికి ఆరు విడతలు పూర్తయ్యాయి. 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న చివరి విడతలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఆఖరి దశలో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో సహా బిహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్లో పోలింగ్ జరగనుంది. దాంతో అక్కడ ప్రచారం దుమ్మురేగిపోతోంది. చివరి దశలో ప్రధాని మోదీ సహా మొత్తం 904 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ మున్నా భాయ్ మీమ్ ప్రయోగం యూత్‌ను ఏ మేరకు పోలింగ్ బూత్‌లకు రప్పిస్తుందో చూడాలి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
400 బక్వాస్.. 200 సీట్లు రావడం కూడా కష్టమే: ఖర్గే ఎద్దేవా
లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయం సాధిండం ఖాయమని బీజేపీ చెప్పుకుంటున్న ప్రచారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొట్టిపారేశారు. కొన్ని రాష్ట్రాల్లో అసలు ఉనికిలోనే లేని బీజేపీకి 400 సీట్లు రావడం బక్వాస్(అబద్ధమని) అని అన్నారు. 400 కాదు కదా కనీసం 200 సీట్లు కూడా దాటవని అన్నారు.అమృత్‌సర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయని అన్నారు. అదే విధంగా, కాంగ్రెస్, ఇండియా కూటమి పుంజుకుంటుందని పేర్కొన్నారు.కాగా లోక్‌సభ ఎన్నికల్లో తమకు 400 సీట్లు వస్తాయని బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ చెబుతూ వస్తోంది. దీనిపై ఖర్గే స్పందిస్తూ... బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను ఆధారమేమిటని ప్రశ్నించారు. మీ(బీజేపీ) సీట్లు తగ్గుతున్నప్పుడు మావి(కూటమి) పెరుగుతున్నప్పుడు. 400 సీట్లు ఎలా వస్తాయి. అది పూర్తిగా అబద్దమని అన్నారు. అసలు బీజేపీ కేంద్రంలో ప్రభుత్వమే ఏర్పాటు చేయదని, ఎన్డీయే కూటమికి 200 సీట్లకు మించి రావని అన్నారు.తమిళనాడు, కేరళ, తెలంగాణలో బీజేపీ ఉనికిలో లేదని, కర్ణాటకలో అంత బలంగా లేదని మండిపడ్డారు. మహారాష్ట్రలోనూ కాషాయం బలహీనంగా ఉందన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ఒడిశాలో గట్టి పోటీ ఉందన్న ఖర్గే.. ఆ పార్టీకి 400 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాటన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. యువత డ్రగ్స్‌కు బానిసవ్వడంపై స్పందిస్తూ..దీనిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందన్న బీజేపీ ఆరోపణలను ఖర్గే ఖండించారు. 'మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టో చూడడు, చదవడు.. మందు చెప్పినం.. ఇందులో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తే కాంగ్రెస్ కార్యాలయం నుండి ఒక వ్యక్తిని పంపింస్తాం.. ఆయనకు అది వివరించడానికి సహాయం చేస్తాడు. పార్టీ మేనిఫెస్టో యువత, రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల కోసమే’నని అన్నారు. -
Lok sabha elections 2024: మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో
బక్తియార్పూర్/పాలీగంజ్/జగదీశ్‌పూర్(బిహార్): తాను సామాన్య వ్యక్తినికాదని, దేవుడు పంపించాడని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సోమవారం బిహార్‌లో బక్తియార్పూర్, పాలీగంజ్, జగదీశ్పూర్ల్లో ఆయన ప్రచార ర్యాలీల్లో మాట్లాడారు. ‘‘ఎన్నికల ఫలితాలొచ్చాక బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై మోదీని ఈడీ ప్రశ్నించొచ్చు. అప్పుడాయన ‘నాకేమీ తెలీదు. దేవుడు పంపిస్తే వచ్చా. ఆయన చెప్పినట్లే చేశా’’ అని చెబుతారేమో’’ అంటూ ఎద్దేవా చేశారు. బిలియనీర్లకు సేవ చేయడానికే దేవుడు ఆయన్ను పంపాడా అంటూ మండిపడ్డారు. పాలీగంజ్‌లో రాహుల్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మీసా భారతి సహా డజనుకు పైగా నేతలు కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుంగింది. దాంతో రాహుల్ కాస్త పక్కకు నడవగా అక్కడా కుంగింది. వారంతా కింద పడబోయి తమాయించుకున్నారు.మోదీవి కూలదోసే కుట్రలు: ప్రియాంకసిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ వద్రా ఆరోపించారు. కాంగ్రా సమీపంలోని చంబాలో ఆమె కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. -
లోక్‌సభ పోరు.. ఫైనల్ పంచ్ ఎవరిదో!
బిహార్‌లో లోక్‌సభ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. 40 సీట్లకు గాను ఆరు విడతల్లో 32 చోట్ల ఎన్నికలు ముగిశాయి. చివరిదైన ఏడో దశలో 8 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. వీటిలో బీజేపీ 5 సిట్టింగ్ స్థానాలు. 2 జేడీ(యూ), 1 రాష్ట్రీయ లోక్ మోర్చా చేతిలో ఉన్నాయి. ఎన్డీఏకు ఈసారి రెబల్స్‌తో పాటు ఇండియా కూటమి నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కీలక స్థానాలపై ఫోకస్... నలంద... జేడీయూ కంచుకోట అలనాటి విఖ్యాత నలంద విశ్వవిద్యాలయ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే నియోజకవర్గం. సారవంతమైన గంగా పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. ఇది జేడీయూ కంచుకోట. బీజేపీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు. గత ఎన్నికల్లో కౌసలేంద్ర కుమార్ జేడీ(యూ) నుంచి హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్) నుంచి సందీప్ సౌరవ్ పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టులు గతంలో ఇక్కడ మూడుసార్లు గెలిచారు.ఆరా... రైట్ వర్సెస్ లెఫ్ట్ మొదట్లో దీని పేరు షాబాద్. 1977లో ఆరాగా మారింది. ఆర్కే సింగ్ 2014లో తొలిసారి ఇక్కడ కాషాయ జెండా ఎగరేశారు. 2019లోనూ నెగ్గిన ఆయన ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవి్వళ్లూరుతున్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఎం (ఎంఎల్) అభ్యర్థి సుధామా ప్రసాద్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్)కు ఇక్కడ 4 లక్షల పైగా ఓట్లొచ్చాయి! రైట్, లెఫ్ట్ పారీ్టల వార్ ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది.పట్నా సాహిబ్... రవిశంకర్‌కు సవాల్ సిక్కుల మత గురువు గురు గోవింద్‌సింగ్ జన్మస్థలం. 2008లో ఏర్పాటైంది. 2009, 2014ల్లో బాలీవుడ్ షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా బీజేపీ తరఫున గెలిచారు. 2019లో ఎన్నికల ముందు శత్రుఘ్న బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగారు. దాంతో 20 ఏళ్లుగా రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్‌ను బీజేపీ బరిలో దించింది. శత్రుఘ్నను ఆయన 2.8 లక్షల పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ తరఫున లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్షుల్ అవిజిత్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలకు మంచి ఓటు బ్యాంకు ఉండటంతో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. పాటలీపుత్ర... లాలుకు ప్రతిష్టాత్మకం గత రెండు ఎన్నికల్లోనూ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతిని బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ ఓడించారు. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూశారు. లాలుకు ఒకప్పటి నమ్మినబంటు రాంకృపాల్ బీజేపీ అభ్యరి్థగా ఉన్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు వరుసగా గెలిచిన ఆయన 2004లో ఇక్కడ ఆర్జేడీ అభ్యరి్థగా బీజేపీని ఓడించడం విశేషం. ఆర్జేడీ నుంచి మీసా భారతి మళ్లీ పోటీ చేస్తున్నారు. కుమార్తెను ఎలాగైనా లోక్‌సభకు పంపాలని కలలుగంటున్న లాలుకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ దన్ను ఆర్జేడీకి కలిసొచ్చే అంశం. కరాకట్.. బీజేపీకి పవన్ గండం ఇక్కడ కుష్వాహా (కోయెరి) సామాజికవర్గానిదే ఆధిపత్యం. గత మూడు ఎన్నికల్లోనూ ఆ వర్గం నేతలే గెలుస్తున్నారు. కుషా్వహాలు, రాజ్‌పుత్‌లు, యాదవులు ఇక్కడ రెండేసి లక్షల చొప్పున ఉంటారు. గతేడాది బీజేపీలో చేరిన భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ఇప్పుడు పారీ్టకి కొరకరాని కొయ్యగా మారారు. ఇక్కడ టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్) నుంచి రాజారాం సింగ్ కుషా్వహా బరిలో ఉన్నారు. ఎన్డీయే నుంచి రా్రïÙ్టయ లోక్ మోర్చా వ్యవస్థాపకుడు ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. పవన్ సింగ్ నామినేషన్‌కు జనం భారీగా వచ్చారు. త్రిముఖ పోటీలో ఎన్డీఏ ఎదురీదుతోంది.జహానాబాద్... జేడీయూ వర్సెస్ ఆర్జేడీ ‘రెడ్ కారిడార్’లో అత్యంత సున్నితమైన నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గం. కమ్యూనిస్టులకు కంచుకోట. 1998 నుంచీ ఆర్జేడీ, జేడీయూ మధ్య చేతులు మారుతోంది. 2014లో రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ నెగ్గింది. 2019లో జేడీ(యూ) నేత చందేశ్వర్ ప్రసాద్ కేవలం 1,751 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థి సురేంద్ర ప్రసాద్ యాదవ్‌ను ఓడించారు. ఈసారి కూడా వారిద్దరే బరిలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok shabha Elections 2024: ఎవరిని ఎన్నుకుందాం?!
400కు పైగా అని ఒక కూటమి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని మరో కూటమి. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. జూన్ 1న చివరిదైన ఏడో విడతతో దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. చివరి విడతలో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ ఒకటి. అక్కడి తొలి ఓటర్లు పలు అంశాలపై చురుగ్గా స్పందిస్తున్నారు. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు, మహిళా భద్రత తదితరాలకే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. అయితే అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల్లో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేని డైలమాలో ఉన్నామని ఈ యంగ్ ఓటర్స్‌లో పలువురు అంటున్నారు. నోటాకే తమ ఓటని పలువురు చెబుతుండటం విశేషం. రాష్ట్రంలో 4 లోక్‌సభ సీట్లతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.ఉచితాలు అనుచితాలే...! కొన్నేళ్లుగా పారీ్టలన్నీ పోటాపోటీగా ప్రకటిస్తున్న పలు ఉచిత హామీలపై, అమలు చేస్తున్న ఉచిత పథకాలపై యువ ఓటర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండటం విశేషం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల భారమంతా అంతిమంగా పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ప్రజానీకంపైనే పడుతోందని వారంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా హిమాచల్‌లో ఉచితాలను నిలిపివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘‘అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సిన నిధులు ఉచితాల కారణంగా పక్కదారి పడుతున్నాయన్నది నిస్సందేహం’’ అంటున్నారు సోలన్‌కు చెందిన రియా. ఆమె ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా యువత నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పదేళ్ల బీజేపీ పాలనను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు. ‘‘బీజేపీ సారథ్యంలోని నియంతృత్వమా? విపక్ష ఇండియా కూటమి సంకీర్ణమా? కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేకపోతున్నా. ఏమైనా రాజకీయాల్లో సానుకూల మార్పు మాత్రం కోరుకుంటున్నా’’ అంటున్నాడు మరో ఓటరు నితీశ్. బీజేపీ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ దురి్వనియోగం చేస్తోందని డిగ్రీ ఫస్టియర్ విద్యార్థి రోహిత్ విమర్శిస్తున్నారు. ‘‘మోదీకి ఓటేయడమంటే నియంతృత్వాన్ని సమర్థించడమే. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు కూడా దేశానికి మంచివి కావు. కనుక ఇండియా కూటమికి ఓటేయడం కూడా సరికాదు’’ అంటున్నాడతను! ఔత్సాహిక జర్నలిస్టు...సంజౌలీ ప్రభుత్వ పీజీ కాలేజీలో జర్నలిజం చదువుతున్న అన్షుల్ ఠాకూర్ ఈసారి ఓటేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కలి్పంచి, మహిళలకు భద్రతను పెంచేవారికే తన ఓటని స్పష్టంగా చెబుతున్నాడు. పారిశ్రామికవేత్త కావాలన్నది తన కల అని మరో పీజీ విద్యార్థి పరీక్షిత్ అంటున్నాడు. ఆధునిక సాంకేతికతను, స్టార్టప్ సంస్కృతిని, యువతను ప్రోత్సహించే వారికే తన ఓటని చెబుతున్నాడు. ‘‘ఏ పార్టీ అధికారంలోకి వచి్చనా ఉమ్మడి పౌరస్మృతి, నూతన విద్యా విధానాలను సమర్థంగా అమలు చేయాలి. ఈశాన్య ప్రాంతాలతోపాటు లద్దాఖ్ వంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. భారత సంస్కృతిని పరిరక్షించాలి. తొలిసారి ఓటరుగా ఇది నా ఆకాంక్ష’’ అని సంజౌలీ పీజీ కాలేజీకి చెందిన మరో విద్యార్థి వశి‹Ù్ట శర్మ చెప్పాడు. అభ్యర్థులెవరూ నా అంచనాలకు తగ్గట్టుగా లేరు. అందుకే నా తొలి ఓటు నోటాకే’’ అని మంచీకి చెందిన అదితి ఠాకూర్ చెప్పుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: ఎన్నికల ఎఫెక్ట్... టూ వీలర్లు, ఫ్రిజ్ సేల్స్ రయ్!
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటోమొబైల్, గృహోపకరణాల మార్కెట్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ టూ వీలర్లు, గృహోపకరణాలకు ఒక్కసారిగా డిమాండ్ పుంజుకుంది. ఇదంతా ఎన్నికల చలవేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి వీటి కొనుగోళ్లు కొద్ది నెలలుగా తీవ్రంగా మందగించాయి. ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఏప్రిల్, మే నెలల్లో వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, రూ.లక్ష వరకు ధర ఉన్న చిన్న టూ వీలర్ల విక్రయాల్లో 33 శాతం వృద్ధి నమోదైందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా వెల్లడించారు. కరోనా విలయం తర్వాత ప్రీమియం టూ వీలర్లకు డిమాండ్ పుంజుకుంటున్నా ఎంట్రీ లెవెల్ విభాగంలో మాత్రం అమ్మకాలు నత్తనడకన వచ్చాయి. ‘‘కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలకు తోడు పారీ్టలు సైతం భారీగా ఖర్చుకు తెరతీయడంతో అల్పాదాయ కుటుంబాల చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. దాంతో చిన్న టూ వీలర్లు, ఫ్రిజ్‌ల వంటివాటిని భారీగా కొంటున్నారు’ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మండుటెండల దెబ్బకు రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఎంట్రీ లెవెల్ సింగిల్ డోర్ ఫ్రిజ్‌లు శరవేగంగా అమ్ముడవుతున్నాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. ‘‘చాలాకాలంగా ఈ విభాగంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం ప్రీమియం సెగ్మెంట్‌తో సమానంగా వీటి సేల్స్ నమోదవుతున్నాయి’’ అని వివరించారు. ఎన్నికల ఖర్చు రికార్డ్... రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం 2024లో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టనుంది. ఈ ఏడాది ఎన్నికల సీజన్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు దాటొచ్చని స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)కు చెందిన ఎన్. భాస్కరరావు అంచనా వేశారు. -
ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: సీఈసీ
అమరావతి: వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, ఆయా నియెజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందు తో కలసి సోమవారం ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా దేశవ్యాప్తంగా జరుగుచున్న సార్వత్రిక ఎన్నికలను అందరి సమిష్టి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుచున్నదని అభినందించారు. అదే స్పూర్తితో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద క్రౌడ్ మేనేజ్మంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత పాస్ లేకుండా ఎవరినీ అనుమతించవద్దన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పవర్ బ్యాక్అప్, ఫైర్ సేప్టీ పరికరాలను సిద్దంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్సులను కూడా సిద్దంగా ఉంచుకోవాలన్నారు.ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపుకు సంబందించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ నివ్వాలన్నారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐ.టి. పరికాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల సిద్దంగా ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమ పద్దతిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తదుపరి “లెక్కింపు పూర్తి అయినట్లుగా” ఆయా ఈవీఎంలపై మార్కుచేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమపద్దతిలో సురక్షితంగా భద్రపర్చాలన్నారు. అనవసరంగా ఈవీఎం లను అటూ ఇటూ మువ్ చేయవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్సుఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్ట్‌మ్‌ను (ETPBMS) చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపుకు సంబందించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రము ఆలస్యం చేయవద్దని, డిప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎమ్ ఎన్ హరేంధిర ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అదే విధంగా ఐదు దశలో ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా మరియు సిక్కిం అసెంబ్లీలతోపాటు 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్వోలు / డీఈవో, ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలెక్టోరల్ అధికారులు వారి ప్రాంతాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ పూర్తి అయింది. ఏడో విడత పోలింగ్ జూన్1న జరగనుంది. ఏడో విడత పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి ఆల్ పార్టీ మీటింగ్ జూన్ 1(శనివారం)న జరగనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఏడో విడత పోలింగ్ కూడా ఉంది. కూటిమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలకు ఫలితాలకు నాలుగు రోజుల ముందు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలుకు వేళ్లే ఒక రోజు ముందు ఇండియా కూటమి మీటింగ్ జరగనుంది. సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అదే రోజు సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో విపక్ష కూటమి తీసుకోవల్సిన చర్యలు, లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు కనబర్చిన పనితీరుపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సామాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఇతర కీలక నేతలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.ఇక.. ఎన్డీయే కూటమిని ప్రతిపక్షాల ఇండియా కూటమి స్వీప్ చేస్తుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘ఆరు విడుతల పోలింగ్ పూర్తి అయింది. 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. పదవి నుంచి దిగిపోయే ప్రధాని రిటైర్మెంట్ ప్రణాళికలు రచించుకుంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విధి పూర్తిగా మూసివేయబడింది. దక్షిణంలో పూర్తిగా, ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతంలో సంగానికి బీజేపీ పడిపోయింది’’ అని జైరాం రమేష్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దించడానికి లక్ష్యంగా 28 విపక్ష పార్టీలతో కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్‌క్లూషన్ అలియన్స్ (INDIA) పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. -
Lok Sabha Election 2024: ఆరో విడతలో 63.36 శాతం
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, యూటీల్లో శనివారం 58 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తాజా గణాంకాల ప్రకారం పోలింగ్ 63.36 శాతానికి పెరిగింది. పశ్చిమబెంగాల్ పరిధిలోని ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో 82.71 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి ఆదివారం వెల్లడించారు. ఇప్పటివరకు ముగిసిన ఆరు దశలను పరిశీలిస్తే అన్నింటికన్నా తక్కువగా ఐదో దశలో 62.2 శాతం పోలింగ్ నమోదైంది. ఆరో దశ కింద 2019లో 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 64.4 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి దశలోని తుది పోలింగ్ శాతాలు ఓట్ల లెక్కింపు తర్వాతే అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించడం వల్లే పోలింగ్ శాతాలు పెరుగుతాయని గుర్తుచేసింది. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: సార్వత్రిక ఎన్నికలు, కార్పొరేట్ మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకోవడంతో స్టాక్ మార్కెట్లో లాభాలు కొనసాగే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల సరళి ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మే డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులకు అవకాశం ఉంది. ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ సోమవారం ముగిస్తుంది. ఎక్సే్చంజీల్లో షేర్లు గురువారం లిస్టవుతాయి. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1,404 పాయింట్లు, నిఫ్టీ 455 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ ఇన్వెస్టర్ల సిర్థమైన కొనుగోళ్లు, ఆర్బీఐ కేంద్రానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, ఆయా కంపెనీల మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర పరిణామాలు కలిసొచ్చాయి. చివరి దశకు కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దలాల్ స్ట్రీట్ ముందుగా దివీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మాలతో పాటు గతవారాంతపు రోజుల్లో విడుదలైన ఇతర కార్పొరేట్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్ చివరి దశ(ఎనిమిదో వారం)కు చేరుకుంది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఈ వారంలో దాదాపు 2,100 కి పైగా కంపెనీలు తమ మార్చి క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్నాయి. టాటా స్టీల్, ఎల్ఐసీ, ఐఆర్టీసీ, ఆ్రస్టాజెనికా, నాట్కో ఫార్మా, ఎన్ఎండీసీ, జీఐసీలు కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఎన్నికల ఓటింగ్ శాతంపై దృష్టి దేశంలో లోక్ సభ ఆరో విడత ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం 61.20 శాతంగా నమోదైంది. ఇది ఇప్పటి వరకు జరిగిన అన్ని దశల కంటే అత్యల్పం. చివరి (ఏడో) విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇదే రోజున రాత్రి ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎన్నికల పోలింగ్ నమోదు శాతం, సంబంధిత వార్తల పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం జపాన్ మే కన్జూమర్ కన్ఫిడెన్స్ డేటా బుధవారం, అమెరికా క్యూ1 జీడీపీ వృద్ధి, ఉద్యోగ గణాంకాల గురువారం వెల్లడి కానున్నాయి. అదేరోజున యూరోజోన్ ఏప్రిల్ నిరుద్యోగ రేటు, పారిశ్రామిక సరీ్వసుల సెంటిమెంట్, మే వినియోగదారుల విశ్వాస గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. ఇక శుక్రవారం(మే 31న) చైనా ఏప్రిల్ నిరుద్యోగ రేటు, రిటైల్ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్ల డేటా, యూరోజోన్ మే ద్రవ్యల్బోణ గణాంకాలతో భారత నాల్గవ త్రైమాసికానికి (జనవరి–మార్చి 2024) అలాగే మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి అధికారిక గణాంకాలు విడుదల అవుతాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడడంతో భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో (మే 24 వరకు) దాదాపు రూ.22,000 కోట్లు ఉపసంహరించుకున్నట్లు ఎన్ఎస్డీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, సమీక్షా కాలంలో ఎఫ్‌పీఐలు రూ.178 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్‌లో రూ.2,009 కోట్ల ఉపసంహరణతో పోలిస్తే ఈ నెల ఎక్కువగా ఉంది. అంతకుముందు ఎఫ్‌పీఐలు మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల నికర పెట్టుబడులు పెట్టడం విశేషం.గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుఈ గురువారం(మే 30న) నిఫ్టీకి చెందిన మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 22,800 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే 23,250–23,350 శ్రేణిని పరీక్షిస్తుంది’’ అని ఆప్షన్ డేటా సూచిస్తోంది. -
Lok Sabha Election 2024: డమ్ డమ్‌లో... విజయఢంకా మోగించేదెవరో!
డమ్ డమ్ లోక్‌సభ స్థానం. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్‌తో కలిసి లెఫ్ట్ విజయం సాధించగలిగే సీట్లలో ఒకటి. ఒకప్పుడు సీపీఎం కంచుకోట. దాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని సీపీఎం పోరాడుతోంది. ఇది తృణమూల్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ తమ ఓటు బ్యాంకుకు గండి పడకుండా కాపాడుకోవడానికి టీఎంసీ తిప్పలు పడుతోంది. ఒకసారి గెలుపొందిన ఈ స్థానంలో మళ్లీ పాగా వేయాలని బీజేపీ ప్రయతి్నస్తోంది. దాంతో డమ్ డమ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది... కోల్‌కతా సమీపంలో ఉండే డమ్ డమ్ లోక్‌సభ స్థానానికి పశి్చమ బెంగాల్లో చారిత్రక ప్రాధాన్యముంది. 1783లో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ సైనిక కంటోన్మెంట్, మిలిటరీ బ్యారక్‌లు నిర్మించింది. 1846లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్థాపించింది. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు చేసిన మంగళ్ పాండేకు మరణశిక్ష విధించింది కూడా డమ్ డమ్ కంటోన్మెంట్‌లోనే. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని డమ్ డమ్ బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు, బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో హిందూ శరణార్థులు ఇక్కడ భారీగా స్థిరపడ్డారు. పట్టణ జనాభా అధికం... డమ్ డమ్ లోక్‌సభ స్థానానికి 1977లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 20 ఏళ్ల పాటు ఈ స్థానం సీపీఎం గుప్పెట్లోనే కొనసాగింది. 1998లో తొలిసారిగా బీజేపీకి చెందిన తపన్ సిక్దర్ విజయం సాధించారు. 1999లో ఈ స్థానాన్ని నిలుపుకున్నారు. అనంతరం మూడుసార్లు టీఎంసీ నుంచి సౌగతా రాయ్ విజయం సాధించారు. డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం మొత్తం జనాభా 21,84,460. ఇందులో 98.43 శాతం పట్టణ జనాభాయే. దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలూ టీఎంసీ ఖాతాలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.ప్రతి ఐదు ఓట్లలో ఒకటి... డమ్ డమ్‌లో తృణమూల్ నుంచి సిట్టింగ్ ఎంపీ సౌగతా రాయ్, సీపీఎం నుంచి సుజన్ చక్రవర్తి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పద్రా దత్తా బరిలో ఉన్నారు. శిల్పద్రా 2020లో తృణమూల్‌కు రాజీనామా చేసి కాషాయ పారీ్టలో చేరారు. మమతా వ్యతిరేక ఓటర్లు వామపక్షాల వైపు మొగ్గితే కాంగ్రెస్ మద్దతుతో సుజన్ గెలవడం సాధ్యమని విశ్లేషకులు అంటున్నారు. అయితే సీపీఎం కేవలం బీజేపీకి ఓట్లను ఆకర్షించగలదే తప్ప తమనేమీ చేయలేదని టీఎంసీ ధీమాతో ఉంది. సీపీఎం ఓట్లు గతం కంటే పెరిగే అవకాశముందని, ఇది బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.‘వలస’ ఓట్లపై సీఏఏ ప్రభావం... బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన వారు డమ్ డమ్‌లో అధిక సంఖ్యలో ఉంటున్నారు. పౌరసత్వ (సవరణ) చట్టం అమలు వివాదం వారిపై ప్రభావం చూపేలా ఉంది. ‘‘దీంతోపాటు అయోధ్య రామమందిర నిర్మాణం కూడా హిందూ ఓట్లను ఏకీకృతం చేస్తుంది. కనుక బీజేపీ గెలుపు ఖాయం’’ అని శిల్పద్రా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రంలో ప్రధానంగా కని్పంచే డమ్ డమ్ ఇప్పుడు ఆ ప్రత్యేకతను కోల్పోయిందని స్థానికులు వాపోతున్నారు. తాగునీటి సంక్షోభం అధికార తృణమూల్‌కు నష్టం చేయడం ఖాయమని చెబుతున్నారు. ఇక్కడ జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఓటింగ్... ప్చ్!
సార్వత్రిక ఎన్నికల సమరంలో పారీ్టలన్నీ హోరాహోరీగా తలపడుతున్నా ఓటర్లలో మాత్రం అంత ఆసక్తి కనబడటం లేదు. మండుటెండలు ఇతరత్రా కారణాలు ఎన్నున్నా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఓటింగ్ తగ్గుముఖం పట్టడం పార్టీలు, అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏడు విడతల సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్లో ఏప్రిల్ 19 నుంచి మే 25 దాకా ఆరు విడతలు పూర్తయ్యాయి. తొలి ఐదు విడతలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కచి్చతమైన ఓటింగ్ గణాంకాలను విడుదల చేసిన నేపథ్యంలో ఓటింగ్ ట్రెండ్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి...ఓటర్లు పెరిగినా ఓట్లు తగ్గాయి తొలి ఐదు విడతల పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 428 లోక్‌సభ స్థానాల పరిధిలో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆ స్థానాల్లో 50.7 కోట్ల ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. గత ఎన్నికల్లో తొలి ఐదు విడతల్లో 426 స్థానాల్లో ఏకంగా 70.1 కోట్ల మంది ఓటేయడం విశేషం. అప్పుడు 68 శాతం ఓటింగ్ నమోదైతే ఈసారి 66.4 శాతానికి పరిమితమైంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో దేశంలో మొత్తం ఓటర్లు 89.6 కోట్లుండగా ఈసారి 96.8 కోట్లకు పెరిగారు. 7.2 కోట్ల మంది కొత్త ఓటర్లు జతైనా ఓటింగ్ మాత్రం పడిపోవడం గమనార్హం. ఈసారి తొలి విడత నుంచే ఓటింగ్‌లో తగ్గుదల ధోరణి కొనసాగుతోంది. చివరి రెండు విడతల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటే మొత్తం ఓటింగ్ గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నమోదైన 67.4 శాతానికి చాలాదూరంలో నిలిచిపోయేలా కనిపిస్తోంది. (ప్రాథమిక డేటా ప్రకారం ఆరో విడతలో 63.36 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఇది 64.73 శాతం). 20 రాష్ట్రాలు, యూటీల్లో డౌన్... ఐదు విడతల పోలింగ్‌ను పరిశీలిస్తే ఏకంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గింది. నాగాలాండ్‌లో పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ పిలుపుల నేపథ్యంలో ఓటింగ్ బాగా తగ్గింది. గత ఎన్నికల్లో 82.9 శాతం నమోదు కాగా ఈసారి ఏకంగా 57.7 శాతానికి పడిపోయింది. మిజోరం, కేరళల్లో పోలింగ్ 6 శాతం మేర తగ్గింది. మణిపూర్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ల్లో 4 శాతం పైగా తగ్గింది. షాదోల్, రేవా, ఖజురహో, సిద్ధి (మధ్యప్రదేశ్), పథనంతిట్ట (కేరళ), మథుర (యూపీ) లోక్‌సభ స్థానాల్లోనైతే 10 శాతానికి పైగా పడిపోయింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లో 2019తో పోలిస్తే 6.76 శాతం తగ్గింది! కశీ్మర్లో పోటెత్తారు... దేశవ్యాప్తంగా ట్రెండ్‌కు భిన్నంగా కొన్ని రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, మేఘాలయ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్నాటకల్లో ఓటింగ్ బాగా పెరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా, శ్రీనగర్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే ఏకంగా 24 శాతం అధిక ఓటింగ్ నమోదైంది. మేఘాలయలోని షిల్లాంగ్‌లో 8.31 శాతం పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్