2024 లోక్‌సభ బరిలో 797 మంది మహిళలు
74 మంది మహిళా అభ్యర్థులు ముందంజలో
2024 సార్వత్రిక ఎన్నికల పోరులో దేశవ్యాప్తంగా తాజా ట్రెండ్ ప్రకారం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 74 మంది మహిళా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు.
భారత లోక్‌సభ ఎన్నికలలో మహిళా ఓటర్లు, పాత్ర గణనీయంగా పెరిగినప్పటికీ ఈస్థాయిలో వారికి ప్రాతినిధ్య మాత్రం పెరగడం లేదు. ఈ ఏడాది ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. 2019 ఎన్నికలలో 726 మంది మహిళలు పోటీ చేశారు. వీరిలో 78 మంది మాత్రమే పార్లమెంటు సభ్యులు (ఎంపీ) గా ఎన్నికయ్యారు.
లోక్‌సభ , రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని లక్ష్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాత ఆమోదించుకున్నప్పటికీ ఇది అమలుకు నోచుకోలేదు అనడానికి ఈ ఏడాది ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యమే పెద్ద ఉదాహరణ. 2019 ఎన్నికలతో పోలిస్తే మహిళల కేటాయింపు స్వల్పంగా మాత్రమే పెరిగింది. మొత్తం 8,337 మంది అభ్యర్థుల్లో కేవలం 797 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే మహిళల సంఖ్య 1957లో 3 శాతం ఉండగా, 2024 నాటికి దాదాపు 10 శాతానికి పెరిగింది. కానీ విజేతల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది.
థింక్ ట్యాంక్ PRS విశ్లేషణ ప్రకారం గత 15 ఏళ్లలో ఈ ట్రెండ్‌లో పెరుగుదల చాలా స్వల్పం. 2009లో మొత్తం అభ్యర్థులల 7 శాతం మహిళలు ఉండగా, 2024లో 9.6 శాతానికి పెరిగింది. 2014లో 8 శాతంగా ఉన్న మహిళా ప్రాతినిధ్యం 2019లో 9 శాతానికి చేరింది. 1962లో, 74 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 36 మంది విజయం సాధించారు. అత్యధిక స్ట్రైక్ రేట్ 48.6శాతంగా ఉండటం గమనార్హం.
- బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇపుడు 2024లో పొలిటిక్ క్వీన్‌గా అవతరించింది. బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానం విజయం సాధించారు.
- పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ, జాదవ్‌పూర్ , మేదినిపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో తృణమూల్ కాంగ్రెస్‌కు ముగ్గరు యాక్టర్ కం పొలిటీషియన్స్ రచనా బెనర్జీ, సయానీ ఘోష్ , జూన్ మలియా గెలుపు దిశగా ఉన్నారు.
- బాన్సూరి స్వరాజ్: దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 23000 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి వెనుకంజలో ఉన్నారు.
- సుప్రియా సూలే: బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే 20 వేల ఆధిక్యంతో గెలుపు.
- హేమమాలిని: మధుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ హేమమాలిని 1,70,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధన్‌గర్ వెనుకంజలో ఉన్నారు.
- మహువా మొయిత్రా: కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా 50,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్ వెనుకంజలో ఉన్నారు.
- హర్యాలోని సిరీ ఎంపీ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ 4500ఓట్ల మెజార్టీతో గెలుపు
Comments
Please login to add a commentAdd a comment