Lok Sabha Election Results 2024
-
Association of Democratic Reforms: ఈ వ్యత్యాసాలు ఎందుకు?
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఎందుకుందో చెప్పాలని భారత ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) గురువారం డిమాండ్ చేసింది. ఓట్లలో వ్యత్యాసానికి కారణాలను వివరించాలని కోరింది. సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని ఏడీఆర్ సోమవారం తమ నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించారని తెలిపింది. మరో 176 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకంటే 35,093 ఓట్లను అదనంగా లెక్కించారని పేర్కొంది. ఏడీఆర్ సోమవారం నివేదిక వెలువరించినప్పటికీ ఈసీ ఇప్పటిదాకా ఓట్లలో వ్యత్యాసంపై స్పందించలేదు. ఏపీలోనే అత్యధికం పోలైన, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉంది. ఏపీలో 21 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం పోలైన ఓట్ల కంటే 85,777 ఓట్లను తక్కువగా లెక్కించారు. అలాగే మరో నాలుగు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 3,722 ఓట్లను అధికంగా లెక్కించారు. ఇది అనుమానాలకు తావిస్తోంది. ఓట్లలో తేడా ఎలా వచి్చందో చెప్పాలని.. ఏడీఆర్ గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధూలకు లేఖ రాసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపులో వ్యత్యాసాలపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ వ్యత్యాసాలపై ఈసీ తక్షణం వివరణ ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియలో ప్రజా విశ్వాసం సడలకుండా చూడాలని కోరింది. -
ఈవీఎలం భద్రత.. వెరిఫికేషన్ కోసం ఈసీకి ఎనిమిది దరఖాస్తులు
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రతపై చర్చ తారా స్థాయికి చేరింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంల అంశం దేశ వ్యాప్తంగా మరోసారి దుమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించి మొత్తం ఈవీఎంల తనిఖీ, వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పదకొండు దరఖాస్తులు అందాయి.ఇందులో లోక్‌సభ ఈవీఎంల కోసం ఎనిమిది, అసెంబ్లీ ఈవీఎంల కోసం మూడు దరఖాస్తులు వచ్చాయి. వైఎస్సార్సీపీ నుంచి విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్లలోని ఒక పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు వచ్చింది. అలాగే వైఎస్సార్సీపీ తరపున గజపతినగరం అసెంబ్లీలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు అందాయయి.తెలంగాణలో జహీరాబాద్ పార్లమెంట్లో 23 పోలింగ్ కేంద్రాలలో బీజేపీ వెరిఫికేషన్ కోరింది. ఒడిశాలో 12 పోలింగ్ కేంద్రాలలో బీజేడీ వెరిఫికేషన్ కోరింది. అయితే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసిన నాలుగు వారాలలో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. -
‘అహం పెరిగింది.. అందుకే రాముడు అలా చేశాడు’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు పెట్టుకుంది. కానీ, గురి తప్పింది. అయితే ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అహం పెరిగిపోవడం వల్లే ఎన్నికల్లో అలాంటి ఫలితం వచ్చిందంటూ వ్యాఖ్యానించారాయన.జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారాయన. అలాగే.. ప్రతిపక్ష ఇండియాకూటమిని కూడా ఆయన వదల్లేదు. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారాయన. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని కామెంట్ చేశారు.#Breaking: RSS slams Narendra Modi & the BJP for their arrogance.Taking a jibe at the Loksabha election results, RSS leader Indresh Kumar said that those who became arrogant didn’t get as much power as they were expecting, Prabhu Ram reduced their numbers.It’s open fight now! pic.twitter.com/mr7pnJtAFI— Shantanu (@shaandelhite) June 14, 2024ఇదిలా ఉంటే.. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా మెజారిటీ(272) కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో మాత్రం విఫలమైంది. కేవలం 241 సీట్లతో మిత్రపక్షాల మీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇదిలా ఉంటే.. మొన్నీమధ్యే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు. -
సీట్లు తగ్గడానికి బాధ్యులెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన స్థానాలపై వారం రోజుల్లోగా ఏఐసీసీ నాయకత్వం పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావడంపై ఒకింత అసహనంగా ఉన్న హైకమాండ్ దీనికి బాధ్యులెవరని గుర్తించడంతో పాటు ఓటమికి కారణాలను సూక్ష్మ స్థాయిలో పరీశీలన చేయనుంది.దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికలతో రావాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ కబురు పంపినట్లు తెలిసింది. నిజానికి రాష్ట్రంలో కనీసంగా 14 సీట్లు గెలవాలని ఏఐసీసీ లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఎనిమిది స్థానాల్లోనే గెలిచింది. ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీకి సైతం 8 స్థానాలు దక్కాయి. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఈ స్థాయి వైఫల్యాలపై ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు.గెలవాల్సిన రాష్ట్రాల్లోనూ పార్టీ మెరుగైన సీట్లు సాధించలేకపోయిందని తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఫలితాలను ప్రస్తావించారు. ఈ రాష్ట్రాలపై విడిగా సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కర్ణాటక ఫలితాలను ఖర్గే, రాహుల్‌గాంధీ సమీక్షించారు. కేబినెట్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీకి తక్కువ ఓట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించారు. ఇదే మాదిరి సమీక్ష తెలంగాణలోని ఓటమి చెందిన నియోజకవర్గాలకు సంబంధించి ఉంటుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. -
శరద్ పవార్‌కు ధన్యవాదాలు: అజిత్ పవార్
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డప్యూటీ సీఎం అజిత్ పవార్.. తన అంకుల్ శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీని.. 24ఏళ్ల పాటు సుధీర్ఘంగా నడిపించిన శరద్ పవార్‌కు అజిత్ పవార్ ధన్యవాదాలు తెలిపారు.1999లో ఎన్సీపీ ఆవిర్భావించింది. ఈ ఏడాదితో 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. మేరకు సోమవారం ముంబైలో అజిత్ కుమార్ మాట్లాడుతూ.. గత 24 సంవత్సరాలుగా పార్టీని నడిపించినందుకు శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారితోపాటు పార్టీని స్థాపించినప్పటి నుంచి కొనసాగుతున్న వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.శివాజీ మహారాజ్, షాహూ మహారాజ్, మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలపైనే మా సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయని నేను అందరికీ హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా పార్టీ నాయకుడు సునీల్ తట్కరే ఎన్సీపీ ప్రతిష్టను కాపాడారని ఆయన పేర్కొన్నారు. ఎన్సీపీలో అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ బెర్త్ కంటే తక్కువ స్థాయిలో ఏ పదవిలో ఉండకూడదని ఎన్సీపీ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. `కేబినెట్ పోర్ట్‌ఫోలియో కంటే తక్కువ పదవిని మేము అంగీకరించబోమని బీజేపీకి స్పష్టం చేస్తున్నాం. వారు చాలా మంది సభ్యులకు కేబినెట్ పదవులు ఇవ్వాలని మాతో చెప్పారు. మేము ఇప్పటికీ ఎన్డీయేలో భాగమే` అని ఆయన అన్నారు. స్తుతం 284 సీట్లు ఉన్న ఎన్డీయ బలం రాబోయే నెలల్లో 300 మార్కును దాటుతుందని పేర్కొన్నారు.కాగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నాలుగు చోట్ల పోటీ చేయగా.. కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పోటీ చేసిన పది నియోజకవర్గాలలో ఎనిమిదింటిని గెలుచుకుంది. ముఖ్యంగా, అజిత్ భార్య సునేత్రా పవార్.. సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే చేతిలో బారామతిలో ఓడిపోయారు. -
లోక్‌సభ ఫలితాలు కాంగ్రెస్‌కు వార్నింగ్ బెల్స్: డీకే శివకుమార్
బెంగళూరు: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. కర్ణాటకలో లోక్‌సభ ఫలితాలు కాంగ్రెస్‌కు వార్నింగ్ బెల్గా అభివర్ణించారు. కుమారకృపాలోని తన అధికారిక నివాసంలో శివకుమార్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకొని అవసరమైన దిద్దుబాట్లు చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. లోక్‌సభ ఫలితాలు కాంగ్రెస్‌కు ఓ వార్నింగ్ బెల్ లాంటివని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉనన నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాల నిర్వహణ చేస్తామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తిగా ఉన్నాడని విలేఖరులు ప్రశ్నించగా.. రాష్ట్రంలో 14, 15 సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నామని అయితే ఆ సంఖ్యను సాధించడంలో విఫలమయ్యామని తెలిపారు. ప్రజల తీర్పును తాము అంగీకరిస్తున్నామని అన్నారు. పార్టీ నేతలు చాలా వరకు వారి స్వంత గ్రామాలు,పట్టణాల నుంచి ఓట్లు రాబట్టుకోలేదని తెలిపారు.కొంతమంది మంత్రుల ఓటమికి ఎమ్మెల్యేలపై నిందలు వేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంలో ప్రయోజనం లేదు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకులు పార్టీ కార్యకర్తలతో మాట్లాడాలి. ఓటమికి గల కారణాలను విశ్లేషించాలి. దానిని అధిగమించాలన్నారు. ఎమ్మెల్యేలు అనవసరంగా బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగ చేసిన ప్రకటనను శివకుమార్ ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కూర్చుని సమస్యపై చర్చించుకోవాలని ఆయన సూచించారు.కాగా 28 లోక్‌సభ స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. బీజేపీ 17 చోట్ల విజయం సాధించింది. జేడీయూ రెండు స్థానాలను గెలుచుకుంది. అటు దేశ వ్యాప్తంగానూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారధ్యంలోని విపక్ష ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంలోనే ఆగిపోయింది. బీజేపీ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సొంతంగా సాధించలేకపోవడంతో ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. -
Raksha Khadse: సర్పంచ్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకూ
తాజా ఎన్.డి.ఏ. మంత్రి వర్గంలో 71 మంది ప్రమాణ స్వీకారం చేస్తే ఏడుగురే స్త్రీలు. వారిలో అందరి కంటే చిన్నది రక్ష ఖడ్సే. 37 సంవత్సరాల రక్ష భర్తను కోల్పోయాక రాజకీయాల్లోకి వచ్చింది. సింగిల్ పేరెంట్‌గా ఉంటూనే సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకూ ఎదిగింది. మహారాష్ట్ర ఎం.పి. అయిన రక్షకి ప్రజాభిమానం మెండుగా ఉంది. ఆమె స్ఫూర్తిదాయక కథనం.రాజకీయ కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టిన అమ్మాయికి రాజకీయాలు ఎంత నాటకీయంగా ఉంటాయో, పదవి విషయంలోనే కాదు జీవితంలో కూడా గెలుపు ఓటములు ఎంత ఖేద మోదాలు కలిగిస్తాయో మెల్లగా తెలిసి వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని రావెర్ స్థానం నుంచి మూడోసారి బి.జె.పి. తరఫున గెలిచి, కేంద్రమంత్రిగా మొదటిసారి ప్రమాణం చేసిన రక్ష ఖడ్సే ఆ ఎత్తుకు చేరడానికి తీవ్ర సవాళ్లనే ఎదుర్కొంది. కాని ఓడిపోలేదు. ఆగిపోలేదు. ధైర్యం కూడగట్టుకుని చేసిన ప్రయాణమే గెలుపు తీరానికి చేర్చింది.భర్త ఆత్మహత్యతో...మహారాష్ట్రలోని నాసిక్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న రక్ష ఖడ్సే జలగావ్‌కు చెందిన రాజకీయ కుటుంబంలో కోడలిగా వచ్చింది. ఆమె మామగారు ఏక్నాథ్ ఖడ్సే బి.జె.పి.లో ప్రముఖ నాయకుడు. మంత్రిగా కూడా పని చేశాడు. అతని కుమారుడు నిఖిల్‌తో రక్ష వివాహం జరిగింది. రక్షకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా 2010లో జనం ‘కొథాలి’ అనే ఊరికి సర్పంచ్‌ను చేశారు. ఆ తర్వాత ఆమె జిల్లా పరిషత్ స్థాయి నాయకురాలైంది. కాని 2013లో జీవితం తల్లకిందులైంది. 2013 శాసనమండలి ఎన్నికలలో కేవలం 500 ఓట్ల తేడాతో ఓడిపోయినందుకు మనస్తాపం చెందిన రక్ష భర్త నిఖిల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి తండ్రి ఏక్నాథ్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఇద్దరు చిన్న పిల్లలతో రక్ష మొత్తం కుటుంబానికే ఊతంగా నిలబడాల్సి వచ్చింది.అత్తింటి ఆదరణతో...భర్త చనిపోయినా అత్తింటిని రక్ష వీడలేదు. అత్తింటి వారు ముఖ్యంగా మామగారు ఆమెను కన్నకూతురిలా ఆదరించి రాజకీయాలలో ్రపోత్సహించాడు. 2014 ఎన్నికలలో రావేర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె ఘన విజయం సాధించింది. భర్త చనిపోయిన సంవత్సరానికే ఇద్దరు చిన్న పిల్లలను తీసుకుని ఆమె సాగించిన ప్రచారం ఆ రోజుల్లో పెద్ద ఆసక్తిని రేపింది. జనం ఆమెకు మద్దతుగా నిలిచి గెలిపించారు. ఐదేళ్ల కాలంలో వ్యవసాయం, విద్యావ్యవస్థ కోసం రక్ష చేసిన కృషి జనానికి నచ్చడంతో 2019లో కూడా రావేర్ నుంచి ఎం.పి.గా ఘనంగా గెలిపించారు.ప్రత్యర్థిగా మామగారురక్ష మామగారైన ఏక్‌నాథ్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో వచ్చిన విభేదాలు బి.జె.పి.ని వీడేలా చేశాయి. ఆయన ఎన్‌సిపి (శరద్‌పవార్) వర్గంలో చేరి ఎం.ఎల్.సి. అయ్యాడు. కాని రక్ష బి.జె.పి.లోనే కొనసాగింది. 2024 ఎన్నికలలో రావేర్ నుంచి రక్ష నిలబడుతున్నప్పుడు శరద్ పవార్ వర్గం ఏక్నాథ్ను ప్రత్యర్థిగా నిలపాలనుకున్నాయి. కాని కోడలి విజయం కోరిన ఏక్నాథ్ తాను పోటీలో నిలవనని దూరంగా ఉండిపోయాడు. దాంతో ఎన్.సి.పి. అభ్యర్థి శ్రీరామ్ పాటిల్ పై రక్షా ఖడ్సే రెండు లక్షల డెబ్బయి వేల మెజారిటీతో గెలిచింది. పిల్లల కోసం...పిల్లలను ముంబైలో చదివిస్తున్న రక్షా ఖడ్సే ప్రతి శని, ఆదివారాలు వారి దగ్గరకు వెళ్లి సమయం గడుపుతుంది. ‘పిల్లలను ముంబైలో ఉంటున్న మా ఆడపడుచులు బాగా చూసుకుంటారు. కాబట్టి నాకు టెన్షన్ లేదు. ప్రజలకు మేలు చేయాలన్నదే నా లక్ష్యం. మా ్రపాంతంలో ఇంకా సాగునీటి వసతి చాలా చోట్ల లేదు. దేశానికి అవసరమైన అరటిలో 35 శాతం మా దగ్గరే పండుతుంది. వ్యవసాయాన్ని ఇంకా వృద్ధి చేయడంలో నేను కృషి చేస్తాను. కేంద్ర మంత్రిగా ఇప్పుడు నా బాధ్యత పెరిగింది. ఏ శాఖ ఇచ్చినా సమర్థంగా పని చేసి నిరూపించుకుంటాను’ అని తెలిపింది రక్షా ఖడ్సే. -
డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా.. ఫడ్నవీస్ యూటర్న్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్రలో బీజేపీ కూటమికి తక్కువ సీట్లు రావడంపై నైతిక బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎంగా వైదొలగాలని ఫడ్నవీస్ నిర్ణయించుకున్నారు. అయితే తాజాగా తన నిర్ణయంపై ఫడ్నవీస్ యూటర్న్ తీసుకున్నారు.రాజీనామా విషయంలో తన ఆలోచన మార్చుకున్నట్లు చెప్పారు. పారిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే ఫడ్నవీస్ రాజీనామా విషయం తెలుసుకున్న అమిత్ షా.. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని కోరిన మరుసటి రోజే ఫడ్నవీస్ నుంచి తాజా ప్రకటన వచ్చింది.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అందరి ముఖాల్లో సంతక్షషం కనిపిస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు మార్పోగుతోందన్నారు. మూడో సారి ప్రధానిగా ఎన్డీయే మోదీ పేరును ఏకగ్రీవంగా అంగీకరించిందని తెలిపారు. ఈసారి మహారాష్ట్రలో తాము ఆశించిన సీట్లు గెలుచుకోలేకపోయినట్లు చెప్పారు. కానీ నేటి సమావేశంతో భవిష్యత్తు వ్యూహాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీకి నేనే నాయకత్వం వహించాను, కాబట్టి ఈ ఓటమికి నేనే కారణమని భావిస్తున్నాను. అందుకే నన్ను పదవి నుంచి తప్పించాలని కోరాను. దీనివల్ల త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం క్షేత్ర స్థాయి నుంచి పని చేయొచ్చు. కానీ కొందరు నాపై విశ్వాసం చూపించారు. ఫలితాలతో నేను నిరాశ చెందాను అని కొందరు అనుకున్నారు, కానీ నేను పారిపోను. మా స్ఫూర్తి ఛత్రపతి శివాజీ. నేను ఎలాంటి భావోద్వేగ నిర్ణయం తీసుకోలేదు, నా దృష్టిలో వ్యూహం ఉంది.కాగా శుక్రవారం హోం మంత్రి అమిత్ షాతో ఫడ్నవిస్ సమావేశమయ్యారు. అక్టోబరులో జరిగే అవకాశం ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించి, పార్టీ గెలుపు కోసం పనిచేయాలనిి ఫడ్నవీస్‌ను షా కోరినట్లు తెలిసింది. -
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. సీడబ్ల్యూసీ తీర్మానం
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీని నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత ఎంపికపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శనివారం సమావేశమమైంది. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోవాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, అలప్పుజా నుంచి ఎంపీగా ఎన్నికైన కేసీ కెసి వేణుగోపాల్ తెలిపారు. అలాగే ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. ‘రాహుల్ నడిపించిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర ఎంతో చురుకుగా సాగింది. ఈ రెండు యాత్రలకు ప్రజల్లో విశేష ఆదరణ లభించాయి. ఆయన ఆలోచన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు మన దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు, ఆశలను రేకెత్తించాయి. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లపై కాంగ్రెస్‌పై విశ్వాసం కల్పించాయి. పంచన్యాయ్-పచ్చీస్ హామీ కార్యక్రమం ఎన్నికల ప్రచారంలో అత్యంత శక్తివంతంగా మారింది’ అని తెలిపిందికాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. -
లోక్ సభ ఫలితాలపై ఖర్గే అసంతృప్తి..
-
నేడు కాంగ్రెస్ కీలక భేటీలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) కీలక సమావేశం శనివారం ఢిల్లీలోని అశోక హోటల్లో జరుగనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ అగ్రనేతలు చర్చించనున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సంప్రదింపులు జరుపుతారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ వాద్రాతోపాటు వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. సమావేశం తర్వాత విందు ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అలాగే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం సాయంత్రం 5.30 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించనున్నారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలతోపాటు రాజ్యసభ సభ్యులు సైతం ఈ భేటీలో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తెలిపారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాం«దీని ఎన్నుకోవాలని పలువురు నాయకులు కోరుతున్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. -
రేపే మోదీ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను ఆహా్వనించారు. ఆదివారం రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ దిశగా శుక్రవారం హస్తినలో ఒకదాని వెంట ఒకటి పలు పరిణామాలు జరిగాయి. తొలుత ఉదయం 11.30కు నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలన్నీ సమావేశమై తమ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. పార్లమెంటు పాత భవనం ‘సంవిధాన్ సదన్’ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు టీడీపీ, జేడీ(యూ), ఎల్జేపీ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పారీ్టల అధినేతలు, ఎంపీలు పాల్గొన్నారు. ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్‌సింగ్ ప్రతిపాదించగా కూటమి ఎంపీలంతా ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. అనంతరం ఎంపీలందరినీ ఉద్దేశించి మోదీ, ఆయన నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ భాగస్వామ్య పక్షాల నేతలు ప్రసంగించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, లోక్‌సభలో బీజేపీ పక్ష నేతగా కూడా మోదీ ఎన్నికయ్యారు. తర్వాత ఆయన రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. ఎన్డీఏ ఎంపీల నిర్ణయాన్ని ఆమెకు తెలియజేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ముర్ము ఆహా్వనించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నట్టు భాగస్వామ్య పక్షాలన్నీ రాష్ట్రపతికి తెలిపాయి. దాంతో ఆమె నన్ను ప్రధానిగా నియమించారు. ఆ మేరకు నాకు లేఖ అందజేశారు. ప్రమాణస్వీకారానికి అనువైన సమయం, నాతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే నేతల వివరాలు కోరారు. ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేస్తామని తెలిపాను. కాబోయే మంత్రుల జాబితాను ఆదివారానికల్లా రాష్ట్రపతి భవన్‌కు అందజేస్తా’’ అని వివరించారు. 2047లో వందేళ్ల స్వాతంత్య్రోత్సవాల నాటికి జాతి కలలను సంపూర్ణంగా సాకారం చేసే ప్రస్థానంలో 18వ లోక్‌సభ కీలక మైలురాయిగా నిలవనుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ‘‘ఇది నవ, యువ శక్తితో అలరారుతున్న సభ. దేశ ప్రజలు ఎన్డీఏకు మరోసారి అవకాశమిచ్చారు’’ అని చెప్పారు. ఎన్డీఏ పక్షాలన్నీ మోదీకి మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నమే రాష్ట్రపతికి లేఖలు అందజేశాయి. జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య... సమతూకంగా పాలన: బాబు, నితీశ్ జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగాలని భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) ఆకాంక్షించాయి. ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును రాజ్‌నాథ్ ప్రతిపాదించగా చంద్రబాబు (టీడీపీ), నితీశ్‌కుమార్ జేడీ(యూ), ఏక్నాథ్ షిండే (శివసేన), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ–ఆర్వీ), హెచ్.డి.కుమారస్వామి జేడీ(ఎస్), అజిత్ పవార్ (ఎన్సీపీ), జితిన్‌రాం మాంఝీ తదితరులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు సారథ్యం వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘‘ప్రపంచ సారథిగా ఎదిగేందుకు భారత్‌కు ఇదో అద్భుతమైన అవకాశం. సమాజంలోని అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పాలన సాగాలి’’ అని ఆకాంక్షించారు. రాష్ట్రాల అభివృద్ధిని చిన్నచూపు చూడొద్దని నితీశ్ సూచించారు. దేశాన్ని అద్భుతంగా వృద్ధి పథంలో నడిపించడంతో పాటు బిహార్‌పైనా మోదీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ విపక్షాలకు ఓటమి తప్పదు. వాళ్లు పనికిరాని కబుర్లు చెప్పి అక్కడా, ఇక్కడా గెలిచారు. వచ్చేసారి వారంతా ఓడటం ఖాయం’’ అన్నారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం దేశం ఎవరి ముందూ తలొంచబోదని పవన్ కల్యాణ్ అన్నారు.విరిసిన నవ్వులు... ఎన్డీఏ భేటీ పలు ఆహ్లాదకర సన్నివేశాలకు వేదికైంది. తమ కూటమిది పటిష్టమైన ఫెవికాల్ బంధం అని షిండే అభివరి్ణంచగా నవ్వులు విరిశాయి. తనకు పాదాభివందనం చేసేందుకు నితీశ్ ప్రయత్నించగా మోదీ వారిస్తూ ఆలింగనం చేసుకున్నారు. చిరాగ్నూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను భుజం తట్టారు. పవన్ కల్యాణ్ ‘పవనం కాదు, సుడిగాలి’ అంటూ మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రశంసించారు.రాజ్యాంగ ప్రతికి నమస్సులు ఎన్డీఏ భేటీ కోసం సెంట్రల్ హాల్లోకి ప్రవేశించగానే మోదీ ముందుగా రాజ్యాంగ ప్రతిని తన నుదిటికి తాకించుకుని వందనం చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పెట్టి భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. ‘‘తన జీవితంలో ప్రతి క్షణమూ రాజ్యాంగం ప్రవచించిన గొప్ప విలువల పరిరక్షణకే అంకితం. నా వంటి వెనకబడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నాడంటే అది కేవలం మన రాజ్యాంగం గొప్పదనమే. అది కోట్లాది ప్రజలకు ఆశ, శక్తియుక్తులు, గౌరవాదరాలు కలి్పస్తోంది’’ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పదేళ్లుగా అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తూ వచి్చన మోదీ నేడిలా అదే రాజ్యాంగానికి ప్రణామాలు చేయడం విడ్డూరమంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ దుయ్యబట్టారు. -
పదేళ్ల పాలన ట్రెయిలరే...: నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏను స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత బలీయమైన, విజయవంతమైన సంకీర్ణంగా నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. ‘‘మా సంకీర్ణం మూడుసార్లు పూర్తికాలం అధికారంలో కొనసాగింది. నాలుగోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్డీఏ కేవలం అధికారం కోసం పుట్టుకొచ్చిన కొన్ని పార్టీల కలయిక కాదు. జాతి హితమే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన కూటమి. మేమెన్నడూ ఓడిపోలేదు. నిన్నా మేమే గెలిచాం. నేడూ మేమే గెలిచాం. భవిష్యత్తులోనూ మేమే గెలుస్తాం. విజయాన్ని ఎలా జీర్ణించుకోవాలో మాకు బాగా తెలుసు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించినా జూన్ 4 (లోక్‌సభ ఎన్నికల ఫలితాల) తర్వాత మేం వినమ్రంగా ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనం’’ అన్నారు. మరోవైపు విపక్షాలు కేవలం అధికార దాహంతోనే ఒక్కటయ్యాయంటూ ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే కలిశామని అవి స్వయంగా పేర్కొన్నాయని గుర్తు చేశారు. ‘‘ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్నే దెబ్బ తీసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ఎన్డీఏ ఎన్నికల విజయాన్ని కూడా ఓటమిగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాయి. ఫలితాలు వాటికి అనుకూలంగా రాలేదనే అక్కసుతో దేశవ్యాప్తంగా కల్లోలం రేపేందుకు కుట్ర చేశాయి’’ అంటూ మండిపడ్డారు. శుక్రవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి ఎంపీలను, అనంతరం భాగస్వామ్య పక్షాల అధినేతలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరం. దేశాన్ని నడిపేందుకు అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం మరింత అవసరం. పదేళ్లుగా పార్లమెంటులో నాణ్యమైన చర్చలను ఎంతగానో మిస్సయ్యా. విపక్ష నేతలు ఈసారైనా జాతి ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటులో అడుగు పెడతారని, అర్థవంతమైన చర్చలు చేస్తారని ఆశాభావంతో ఉన్నా’’ అన్నారు. ‘‘మన మధ్య పరస్పర వ్యతిరేకత ఉండొచ్చు. కానీ జాతి పట్ల వ్యతిరేకత ఉండకూడదు’’ అని విపక్షాలకు సూచించారు. ఎన్డీఏకు కొత్త నిర్వచనం లోక్‌సభ ఎన్నికల విజయం పట్ల ఎన్డీఏ నేతలను మోదీ అభినందించారు. ఇందుకు కారకులైన లక్షలాది మంది కార్యకర్తలకు తాను అభివాదం చేసి తీరాలన్నారు. కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ భాగస్వామ్య పక్షాలన్నింటి ఏకాభిప్రాయంతో, జాతి హితమే లక్ష్యంగా సాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. తద్వారా ప్రభుత్వాన్ని నడిపే సదవకాశమిచ్చారు. దీన్ని సది్వనియోగం చేసుకుంటామని, దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పథంలో నడుపుతామని మాటిస్తున్నా’’ అని చెప్పారు. ‘‘పదేళ్ల పాలనలో వృద్ధి పథంలో దేశాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశాం. అదంతా కేవలం ట్రయిలర్ మాత్రమే. ఈ టర్ములో దేశాభివృద్ధి కోసం మరింతగా పాటుపడతాం. మేం కార్య సాధకులమని ప్రజలకు తెలుసు’’ అన్నారు. ‘‘సుపరిపాలనే మా కూటమికి పునాది. ఎన్డీఏ అంటే సరికొత్త (న్యూ), అభివృద్ధి చెందిన (డెవలప్డ్) , ఆకాంక్షల (ఆస్పిరేషనల్) ఇండియా’’ అని కొత్త నిర్వచనమిచ్చారు.కాంగ్రెస్‌పై చెణుకులు కాంగ్రెస్ పార్టీపై ఈ సందర్భంగా మోదీ చెణుకులు విసిరారు. ఆ పార్టీకి గత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిపి కూడా బీజేపీకి తాజా ఎన్నికల్లో వచ్చినన్ని స్థానాలు రాలేదంటూ ఎద్దేవా చేశారు. ఈసారి ఆ పార్టీ కనీసం వంద సీట్లు కూడా నెగ్గలేకపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుత ప్రదర్శన చేసిందంటూ కొనియాడారు. ‘‘దక్షిణాదిన ఎన్డీఏ జెండా ఎగిరింది. కేరళలో తొలిసారి ఖాతా తెరిచాం. ఏపీలో చరిత్రాత్మక విజయం సాధించాం. తమిళనాడులో కూడా ఎన్డీఏ గణనీయమైన ఓట్ల శాతం సాధించాం. కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అతి తక్కువ సమయంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి భారీగా సీట్లు కట్టబెట్టారు. ఇటు ఒడిశాలోనూ దుమ్ము రేపాం. అటు అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ క్లీన్‌స్వీప్ చేశాం’’ అన్నారు. మంత్రి పదవులు ఇప్పిస్తామంటూ వచ్చేవారిని, ఫేక్ న్యూస్‌ను అస్సలు నమ్మొద్దని ఎన్డీఏ ఎంపీలకు మోదీ సూచించారు.ఈవీఎంలపై ఇప్పుడేమంటారు? విపక్షాలకు మోదీ చురకఇండియా కూటమి ప్రగతికి, ఆధునికతకు, టెక్నాలజీకి బద్ధ వ్యతిరేకి అని మోదీ ఆరోపించారు. విపక్షాలన్నీ గత శతాబ్దపు భావజాలంతో కొట్టుమిట్టాడుతున్నాయని, శరవేగంగా అగాథపు లోతుల్లోకి దిగజారుతున్నాయని దుయ్యబట్టారు. ఈవీఎంలపై చేసిన నిరాధార విమర్శలకు ఏం సమాధానమిస్తాయని ఎన్నికల్లో వాటి మెరుగైన ప్రదర్శనను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించేందుకు ఎన్నికల ప్రక్రియ పొడవునా విపక్షాలు శక్తివంచన లేకుండా కృషి చేశాయి. సుప్రీంకోర్టులో కేసుల ద్వారా ఈసీ పనితీరును అడ్డుకోజూశాయి. వాటి తీరు చూసి ఫలితాలొచ్చాక ఏకంగా ఈవీఎంల శవయాత్ర చేస్తాయేమో అనుకున్నా! తీరా ఫలితాలు చూశాక విపక్షాల నోళ్లన్నీ మూతబడ్డాయి! ఈవీఎంలు ఇంకా బతికే ఉన్నాయా, చనిపోయాయా అని ఫలితాలొస్తున్న క్రమంలో ఒకరిని నేనడిగాను’’ అంటూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. దేశాన్ని అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయతి్నంచినందుకు విపక్షాలను జాతి ఎన్నటికీ క్షమించబోదన్నారు. -
ఫలితాలపై BRSలో అంతర్మధనం
-
ఫలితాలపై BRSలో అంతర్మధనం..
-
Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
న్యూఢిల్లీ: లోక్‌సభకు తాజాగా ఎన్నికైన 543 మందిలో 46 శాతం అంటే 251 మంది నేరచరితులు ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) నివేదించింది. ఈ 251 మందిలో 27 మంది దోషులుగా తేలారు. నేర చరితులు ఇంత భారీ సంఖ్యలో దిగువసభకు ఎన్నికవడం ఇదే మొదటిసారి అని ఏడీఆర్ పేర్కొంది. 2014 ఎన్నికల్లో 34 శాతం అంటే 185 మంది, 2009లో 30 శాతం అంటే 162 మంది, 2004లో 23 శాతం అంటే 125 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. -
కేంద్ర కేబినెట్ లో ఇద్దరికి ఛాన్స్ ?
-
కేంద్ర మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఆ శాఖలన్నీ బీజేపీ వద్దనే!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. ఎన్డీయే కూటమిలో భాగాస్వామ్యమైన, టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), శివసేన(ఏక్నాథ్ షిండే) సహాకారంతో మూడోసారి ప్రధానిగా మోదీ జూన్ 9 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి వర్గం కూడా కొలువుదీరనుంది.ప్రమాణ స్వీకారానికి తేదీ దగ్గరపడుతుండటంతో కేంద్ర మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై కసరత్తు ప్రారంభమైంది. బీజేపీ నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్ర పదవుల కోసం ఎన్డీయే మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ బేరసారాలు ప్రారంభించాయి ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్లుగా అవతరించిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కేంద్ర మంత్రి పదవుల్లో కీలక శాఖలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దనే ఉండే అవకాశం ఉంది. మిత్రపక్షమైన టీడీపీ లోక్‌సభ స్పీకర్ పదవిని కోరగా..దీనిని ఇచ్చే ప్రస్తకే లేదని కాషాయ పార్టీ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు జేడీయూకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవులు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక హోంశాఖ, రక్షణ, విదేశాంగ ,ఆర్ధిక,రోడ్లు , రైల్వే.. వంటి నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీ తమ వద్దనే ఉంచుకోనుంది. వీటిని మిత్ర పక్షాలకు ఇచ్చేందుకు కాషాయపార్టీ విముఖత వ్యక్తం చేస్తోంది. అంతేగాక రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలపై పట్టు వదులుకోకూడదని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణాభివృద్ధి శాఖ, పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి దక్కే అవకాశం ఉంది.గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖలు జేడీయూకి ఇచ్చే అవకాశం ఉంది. భారీ పరిశ్రమల శాఖ శివసేనకు, వ్యవసాయ శాఖ జేడీఎస్‌కు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, జనసేన నుంచి బాలశౌరి, ఏపీ బీజేపీ నుంచి పురందేశ్వరికి మంత్రి పదవులు వరించనున్నట్లు సమాచారం. ఆహార ప్రాసెసింగ్, భారీ పరిశ్రమలు, టూరిజం, స్కిల్ డెవెలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ వంటి తక్కు ప్రాధాన్యత కలిగిన పోర్ట్‌ఫోలియోలను మిత్రపక్షాలకు అప్పగించేందుకు బీజేపీ యోచిస్తోంది. వీటితోపాటు ఆర్థిక, రక్షణ వంటి పెద్ద- మంత్రిత్వ శాఖలలో రాష్ట్ర మంత్రి పదవులు కట్టబెట్టాలని చూస్తోంది. -
మారిన మోదీ ప్రమాణ స్వీకార తేదీ? ఈ దేశాల అగ్రనేతలకు ఆహ్వానం!
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం మోదీ జూన్ 9న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత జూన్ 8న మోదీ ప్రమాణ స్వీకార ఉంటుందని వార్తలు వెలువడగా.. తాజాగా ఆ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రానికి మార్చినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.కాగా దేశంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి మోదీనే కావడం విశేషం. మోదీ ప్రమాణ స్వీకారానికి దక్షణాసియా దేశాలకు చెందిన అగ్ర నేతలు తరలిరానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరు అయ్యే విషయం ఖరారైంది. ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా రణిల్ విక్రమసింఘేను ప్రధాని మోదీ ఆహ్వానించారని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రధాని సైతం శనివారం నాటి కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈవెంట్ కోసం ఆమె ఒకరోజు ముందే అంటే శుక్రవారమే ఢిల్లీకి చేరుకోనున్నారు. వీరితోపాటు భూటాన్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ, భూటాన్ షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌లకు కూడా ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలను గెలుచుకుంది. 2014లో 282 సీట్లు, 2019లో 303 చోట్ల విజయ కేతనం ఎగరవేసి సొంతంగా మేజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈసారి ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. కూటమి నేతల మద్దతుతోే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. -
తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ లోక్ సభ ఎన్నికలో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ బీజేపీని నమ్మి తెలంగాణ ప్రజలు 8 సీట్లలో గెలిపించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతుండటం సంతోషకరం. కాంగ్రెస్, బీఆర్ఎస్ను కాదని బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసం చూపించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారు. తెలంగాణలో బీజేపీ బలపడటం ఒక ఆరంభం మాత్రమే. తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది. ఇకపై భవిష్యత్తు మాదే. తెలంగాణలో పదేళ్లలో పది లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కాంగ్రెస్ విష ప్రచారం చేసింది. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి పోలింగ్ శాతం తగ్గింది.సీఎం రేవంత్‌రెడ్డి గతంలో గెలిచిన మల్కాజిగిలో మాకు 4 లక్షల మెజార్టీ వచ్చింది. కంచుకోట మెదక్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీనే గెలిచింది. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పేరుతో మజ్లిస్ పోటీ చేసింది. 8 చోట్ల మేం గెలిచాం. ఆరేడు స్థానాలో రెండో స్థానంలో నిలిచాం. బీఆర్ఎస్ 14 చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది ’’అని కిషన్‌రెడ్డి అన్నారు. -
లోక్‌సభ ఎన్నికలు: ప్రత్యేకతను చాటారు.. వార్తల్లో నిలిచారు!
హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల్లో పలు అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. కొన్ని చోట్ల ప్రత్యర్థులు.. సీనియర్టీ, డబ్బు, పలుకుబడి, కుల సమీకరణాల అనుకూలతలతో బరిలో నిలిచారు. అయితే వాటన్నింటికి భయపడకుండా.. తీవ్రమైన ప్రతికూలతలను సైతం ఎదుర్కొని కొందరు ఈ లోక్ సభ ఎన్నికల్లో గెలిచి వార్తల్లో నిలిచారు. ఇలా గెలిచిన వారిలో తక్కువ, అధిక వయసు ఉన్న అభ్యర్థులు, తక్కువ మెజార్టితో గెలుపొందినవారున్నారు. అదీకాక జైలులో ఉండి మరీ విజయం సాధించిన అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ మైనార్టీ ముస్లిం మహిళ గెలుపొందింది. ఇలా ఓ ముస్లిం మహిళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఒడిశా చరిత్రలో తొలిసారి కావటం గమనార్హం.అతి తక్కువ మెజార్టీతో గెలుపుఎన్నికల్లో కొన్నిసార్లు ఒక్క ఓటు కూడా అభ్యర్థి గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్సెస్ శివసేన (సీఎం ఏక్నాథ్ షిండే) నేతృత్వంలోని పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇద్దరి మధ్య గెలుపు దోబూచులాడింది. చివరికి 48 ఓట్ల అతితక్కువ మెజారిటీతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయ్‌కర్ తన సమీప ప్రత్యర్థి అమోల్ కీర్తికర్‌పై గెలుపొందారు. వాయ్‌కర్‌కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్‌కు 4,52,596 ఓట్లు లభించాయి. ఇక.. కేరళలోని అత్తింగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ కేవలం 684 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. రాజస్తాన్‌లోని జైపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్ 1,615 ఓట్ల తేడాతో గెలిచారు.అత్యంత పిన్న వయసు, అత్యంత వృద్ధుడు గెలుపుఉత్తరప్రదేశ్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులుగా కౌశంబీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పుష్పేంద్ర సరోజ్, మచిలీషహర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రియా సరోజ్ విజయం సాధించారు. వారిద్దరి వయసు 25 ఏళ్లే కావడం విశేషం. వీరిద్దరే ఈసారి అత్యంత పిన్నవయస్కులైన ఎంపీలుగా రికార్డు సృష్టించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి టి.ఆర్.బాలు సులువుగా నెగ్గారు. 82 ఏళ్ల టి.ఆర్.బాలు ఈ ఎన్నికల్లో అత్యంత వృద్ధుడైన ఎంపీగా రికార్డుకెక్కారు.దాతల సాయంతో గెలుపులోక్సభ ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాభిమానం, పార్టీ మద్దతుతో పాటు డబ్బు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యర్థులకు ధీటుగా కాకపోయిన ఎన్నికల ప్రచారానికైనా లక్షల్లో డబ్బులు ఖర్చు చేయాల్సిందే. అయితే గుజురాత్లో మాత్రం ఓ అభ్యర్థికి దాతలు ముందుకువచ్చి క్రౌడ్ సోర్సింగ్ ద్వారా నిధులను సేకరించారు. గుజరాత్ బనస్కాంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెనిబెన్ థాకూర్ గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే.జైలులో నుంచే గెలుపులోక్ సభ ఎన్నికల్లో ఓ ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఏకంగా జైలులో ఉండి మరీ.. ప్రజల మద్దతు, అభిమానంలో విజయం సాధించారు. అందులో సిక్కు వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని కాదూర్ సాహిబ్ స్థానం నుంచి గెలుపొందారు. ఉగ్రవాదలకు నిధులు సమకూరుస్తున్నారనే కేసులో ఆయన అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక.. మరో అభ్యర్థి జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లాలో ఇంజనీర్ రషీద్ కూడా జైలులో ఉండి ఎన్నకల్లో ఎంపీగా విజయం సాధించారు. ఇంజనీర్ రషీద్ 2019 నుంచి తిహార్ జైలులో ఉన్నారు. ఆయనపై ఉగ్రవాదులకు నిధలు సేకరిస్తున్నరనే ఆరోపణలపై కేసు నమోందైంది. ఇక.. వీరి ప్రమాణస్వీకారంపై చర్చ జరుగుతోంది.ఒడిశా చరిత్రలో తొలి ముస్లిం మహిళ గెలుపుఒడిశాలో బీజేపీ 78 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీ 51 స్థానాల్లో గెలుపొంది అధికారం కోల్పోయింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలిచి మూడో స్థానానికి పరిమిమైంది. అయితే కాంగ్రె పార్టీ తరఫున బారాబతి-కటక్ అసెంబ్లీ సెగ్మెంట్లో సోఫియా ఫిర్దౌస్ అనే ముస్లిం మహిళా అభ్యర్థి విజయం సాధించారు. ఒడిశాలో చరిత్రలో ఓ ముస్లిం మహిళ ఎమ్యెల్యేగా విజయం సాధించటం ఇదే తొలిసారి. -
సంకీర్ణ ప్రభుత్వం.. తగ్గనున్న సంస్కరణల వేగం..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తుండటం వంటి పరిణామాలు భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కారణంగా సంస్కరణల వేగం తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల భూ, కారి్మక సంస్కరణలకు కళ్లెం పడవచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని ఆందోళన వ్యక్తపర్చాయి. 2014 తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ మెజారిటీని కోల్పోవడానికి సంబంధించిన ప్రభావాలపై ఫిచ్ రేటింగ్స్, మూడీస్ రేటింగ్స్ వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి.ఆర్థిక క్రమశిక్షణకు బ్రేక్.. పటిష్టమైన ఆర్థిక వృద్ధి సాధించే దిశగా మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచడం, దేశీయంగా తయారీ రంగానికి తోడ్పాటునివ్వడం వంటి పాలసీపరమైన విధానాలు ఇకపైనా కొనసాగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. అయితే, బీజేపీకి మెజారిటీ తగ్గడం వల్ల కీలకమైన ఆర్థిక, ద్రవ్యపరమైన సంస్కరణల అమల్లో జాప్యం జరగొచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని పేర్కొంది. 2025–26లో జీ20 కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అత్యధిక వృద్ధి సాధించగలదని భావిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలకు రిసు్కలు ఉన్నాయని తెలిపింది. ‘వివిధ రంగాల్లో నిరుద్యోగ యువత సంఖ్య భారీ స్థాయిలో ఉండటం, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత వృద్ధి బలహీనంగా ఉండటం వంటి అంశాలు ప్రతికూల ప్రభావాలు చూపడాన్ని కొనసాగించవ చ్చు’అని మూడీస్ వివరించింది. ఇక ద్రవ్యలోటు విషయానికొస్తే 2024–25లో నిర్దేశించుకున్న విధంగా దీన్ని 5 శాతానికి తగ్గించుకోగలిగితే, 2025– 26లో 4.5% స్థాయిని సాధించవచ్చని పేర్కొంది. కాగా, ద్రవ్య, రుణపరమైన కొలమానాల విషయంలో ఇండొనేíÙయా, ఫిలిప్పీన్స్, థాయ్‌ల్యాండ్‌తో పోలిస్తే భారత్ బలహీనంగానే ఉన్నట్లు పేర్కొంది.ల్యాండ్, లేబర్ సంస్కరణల అమలు కష్టమే‘బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రధానిగా మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టినప్పటికీ మెజారిటీ తగ్గిపోవడమనేది, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న సంస్కరణల అజెండాకు సవాలుగా పరిణమించవచ్చు’ అని ఫిచ్ పేర్కొంది. పూర్తి మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం వల్ల ‘వివాదాస్పద సంస్కరణలను, ముఖ్యంగా ల్యాండ్, లేబర్ సంస్కరణలను అమలు చేయడం కష్టంగా మారొచ్చు. దేశీ తయారీ రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు ఇవే తమకు అత్యంత ప్రాధాన్య అంశాలంటూ బీజేపీ ఇటీవలే పేర్కొంది’ అని ఫిచ్ తెలిపింది. మరోవైపు, ప్రభుత్వం తమ జీవనోపాధిని మెరుగుపర్చాలని సూచించేలా ప్రజలు తీర్పునిచి్చన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాదాన్ని పక్కన పెట్టి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని ఫిచ్ గ్రూప్‌లో భాగమైన బీఎంఐ పేర్కొంది. అయితే, మధ్యకాలికంగా చూస్తే భారత్‌పై సానుకూల అంచనాలు పటిష్టంగానే ఉన్నాయని, ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించగలదని బీఎంఐ ఏషియా హెడ్ (కంట్రీ రిస్క్) డారెన్ టే తెలిపారు. బీజేపీ ఎక్కడెక్కడైతే హిందుత్వ జాతీయవాదంపై గట్టిగా ప్రచారం చేసిందో ఆయా రాష్ట్రాలన్నీ దానికి ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు ఇందుకు నిదర్శనమని చెప్పారు. -
Priyanka Gandhi: మీ చెల్లెల్ని అయినందుకు గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: తన సోదరుడు రాహుల్ గాంధీ ఎప్పటికీ వెనక్కి తగ్గరని, సత్యం కోసం పోరాటాన్ని ఆపబోరని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ప్రశంసించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్‌కు బుధవారం ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. ‘‘మీరు ఎప్పుడూ తలెత్తుకొని ఉంటారు. ఎవరేం చెప్పినా, ఏం చేసినా, ఎన్నిక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీరు వెనక్కి తగ్గరు. మీ అంకితభావాన్ని ఎవరెంతగా సందేహించినా మీరు మీపై విశ్వాసం కోల్పోరు. కోపం, విద్వేషం వంటివి మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. మీరు చాలా ధైర్యవంతులు. మీ చెల్లెల్ని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని ప్రియాంక పోస్టు చేశారు. -
Lok Sabha Election Results 2024: ఏకంగా 280 కొత్త ముఖాలు
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభలో ఏకంగా 280 మంది ఎంపీలు మొదటిసారిగా దిగువసభకు ఎన్నికైన వారున్నారు. ఇందులో మాజీ సీఎంలు, సినీ తారలు, వారసులు, హైకోర్టు మాజీ జడ్డి తదితరులున్నారు. అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా 45 కొత్తముఖాలు కనిపించునున్నాయి. వీరిలో టీవీ రాముడు అరుణ్ గోవిల్, జెయింట్ కిల్లర్ కిశోరీలాల్ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ తదితరులున్నారు. మహారాష్ట్రలో 48 స్థానాలుండగా 33 మంది తొలిసారిగా ఎంపీలుగా గెలిచారు. స్కూల్ టీచర్ భాస్కర్ భాగ్రే ఎన్సీపీ (పవార్) తరఫున ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం డిండోరి నుంచి గెలుపొందారు. పీయూష్ గోయల్ కూడా లోక్‌సభకు రావడం ఇదే తొలిసారి. మాజీ ముఖ్యమంత్రులు నారాయణ్ రాణే (మహారాష్ట్ర), త్రివేంద్ర సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా), బిప్లవ్‌కుమార్ దేవ్ (త్రిపుర), జితిన్‌రామ్ మాంఝి (బిహార్), బస్వరాజ బొమ్మై (కర్నాటక), జగదీశ్ షెట్టర్ (కర్నాటక), చరణ్‌జిత్ సింగ్ చన్నీ (పంజాబ్)లు తొలిసారిగా దిగువసభలో అడుగుపెట్టనున్నారు. సినీ తారల్లో సురేష్ గోపి (త్రిసూర్), కంగనా రనౌత్ (మండి)లు తొలిసారి నెగ్గినవారే. రాజకుటుంబీకుల్లో ఛత్రపతి సాహు (కొల్హాపూర్), యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ (మైసూర్), కీర్తి దేవి దేవ్బర్మన్ (త్రిపుర ఈస్ట్)లు, ఎన్నికలకు ముందు హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై పశి్చమబెంగాల్‌లోని తమ్లుక్ నుంచి పోటీ చేసిన గెలిచిన అభిజిత్ గంగోపాధ్యాయ్లు మొదటిసారి ఎంపీలుగా గెలిచిన వారే. ముస్లిం ఎంపీలు 24 మంది నూతన లోక్‌సభకు 24 మంది ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (టీఎంసీ), అసదుద్దీన్ ఓవైసీ, అస్సాంలో 10 లక్షల పైచిలుకు మెజారిటీతో నెగ్గిన కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్‌లు ఉన్నారు. ఈసారి మొత్తం 78 మంది ముస్లిం అభ్యర్థులు పోటీచేయగా 24 మంది గెలిచారు. కిందటి లోక్‌సభలో 26 మంది ముస్లిం ఎంపీలు ఉండగా.. ఈసారి వారి సంఖ్య రెండు తగ్గింది. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా ఏడుగురు ముస్లిం ఎంపీలు ఎన్నికకాగా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు, సమాజ్‌వాది నుంచి నలుగురు, ఇండియన్ ముస్లిం లీగ్ నుంచి ముగ్గురు ముస్లింలు ఎంపీలుగా గెలిచారు. -
Akhilesh Yadav: బీజేపీని అడ్డుకున్నాం
కన్నౌజ్/ఎటావా: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని అడ్డుకోవడంలో తాము విజయవంతం అయ్యామని సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడమే లక్ష్యంగా పని చేశామని అన్నారు. అనుకున్న లక్ష్యం సాధించామని ఉద్ఘాటించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ చూపిన బాటలో నడుస్తూ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేశామన్నారు. యూపీలో లోక్‌సభల్లో ఎస్పీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎస్పీ సొంతంగా 37 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్ 1.70 లక్షల ఓట్ల మెజారీ్టతో బీజేపీ అభ్యర్థి సుబ్రతా పాఠక్‌పై విజయం సాధించారు. -
Lok Sabha Election Results 2024: నవీన్ పట్నాయక్ రాజీనామా
భువనేశ్వర్: ఒడిశాలో బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ పరిపాలనకు తెరపడింది. 24 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నవీన్ పటా్నయక్ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ రఘువర్ దాస్‌కు సమరి్పంచారు. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైంది. 147 స్థానాలకు గాను కేవలం 51 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఏకంగా 78 సీట్లు సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం మార్చి 5న తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో పదవి నుంచి తప్పుకున్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నారు. -
Lok Sabha Election Results 2024: మహిళా ఎంపీలు @ 74
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభకు మొత్తం 74 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. 543 మంది సభ్యులు గల లోక్‌సభలో మహిళా ఎంపీలు 13.62 శాతం మాత్రమే. ఈ 74 మందిలో 30 మంది గత లోక్‌సభలోనూ సభ్యులు కాగా, ఒకరు రాజ్యసభ సభ్యురాలు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళలు పోటీచేయగా... బీజేపీ అత్యధికంగా 69 మందిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ 41 మంది మహిళలకు టికెట్లిచి్చంది. చట్టసభల్లో 33 శాతం సీట్లను రిజర్వు చేసే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పోందాక జరిగిన తొలి ఎన్నికలివి. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా అమల్లోకి రాలేదు. బీజేపీ నుంచి హేమమాలిని, టీఎంసీ నుంచి మహువా మొయిత్రా, ఎన్సీపీ (ఎస్పీ) నుంచి సుప్రియా సూలే, ఎప్సీ నుంచి డింపుల్ యాదవ్‌లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, లాలూ కూతురు మీసా భారతి తొలిసారిగా నెగ్గి దేశం దృష్టిని ఆకర్షించారు. సమాజ్‌వాది పార్టీ నుంచి 25 ఏళ్ల ప్రియా సరోజ్ (మచిలీషహర్), 29 ఏళ్ల ఇర్కా చౌదరి (కైరానా)లు లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయసు మహిళా ఎంపీలు. దేశంలో అత్యధిక మంది మహిళా ఎంపీలను లోక్‌సభకు పంపిన రాష్ట్రంగా పశి్చమబెంగాల్ నిలిచింది. బెంగాల్ నుంచి గెలిచిన 11 మంది మహిళా ఎంపీలూ టీఎంసీ వారే కావడం విశేషం. భారత లోక్‌సభ చర్రితలో అత్యధికంగా 17వ లోక్‌సభలో 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. దక్షిణాఫ్రికాలో 46 శాతం, యునైటెడ్ కింగ్డమ్లో 35 శాతం, అమెరికాలో 29 శాతం మంది మహిళా ఎంపీలు ఉన్నారు. -
లోక్‌సభ ఎన్నికల్లో లెక్కలు తారుమారు
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన కొన్ని స్థానాల్లో, బీఆర్ఎస్ గెలిచిన చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు బీజేపీ పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 17 పార్ల మెంటు స్థానాలకు గాను హైదరాబాద్‌లో ఎంఐఎం విజయం సాధించగా, మిగతా 16 సీట్లను బీజేపీ, కాంగ్రెస్ సమానంగా పంచుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ గెలి చిన 8 పార్లమెంటు స్థానాల్లోని 56 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కొన్నిచోట్ల మినహా కాంగ్రెస్సే ఆధిక్యతను కనబరిచింది. కాగా బీజేపీ గెలిచిన 8 లోక్‌సభ నియోజకవర్గాల్లోని 56 సెగ్మెంట్లలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. మూడు చోట్ల బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. అయి తే చివరికి స్వల్ప తేడాతోనైనా బీజేపీనే విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 39స్థానాల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక మినహా మిగతా 36 సెగ్మెంట్లలో ఆపార్టీ ఓట్లను కాంగ్రెస్, బీజేపీ పంచుకొన్నాయి. దీంతో బీఆర్ఎస్ 2,3 స్థానాలకే పరిమితమైంది. బీఆర్ఎస్కు 2 స్థానాల్లోనే రెండో స్థానం లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కచోట కూడా గెలవలేకపోయిన బీఆర్ఎస్ కేవలం మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ తరువాత రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఎంపీ స్థానంలో నాలుగో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ మిగతా 14 చోట్ల మూడో స్థానం దక్కించుకుంది. మెదక్ పార్లమెంటు పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ కన్నా అధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కాగా, సిద్దిపేట స్థానం మాజీ మంత్రి హరీశ్‌రావు కంచుకోట. అయితే బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన రఘునందన్ రావు సొంత నియోజకవర్గం అయిన దుబ్బాకలో కూడా బీఆర్ఎస్కే మెజారిటీ రావడం గమనార్హం. బీజేపీ వైపు బీఆర్ఎస్ ఓటర్ల మొగ్గు బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లలో చాలాచోట్ల కాంగ్రెస్ రెండోస్థానంలో నిలవగా, బీఆర్ఎస్ మూడోస్థానానికి పరిమితమైంది. 2023లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో కూడా ఈసారి బీజేపీకి మెజారిటీ వచ్చింది. అంటే జాతీయ స్థాయి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ఓటర్లు కూడా ఈసారి బీజేపీ వైపే మొగ్గు చూపారన్న మాట. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ బీజేపీకి మెజారిటీ ఓట్లు రావడం గమనార్హం. కరీంనగర్ లోక్‌సభ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కరీంనగర్, హుజూరాబాద్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ మూడోస్థానంలో నిలిచింది. కరీంనగర్ పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ, బీఆర్ఎస్ రెండు, మూడుస్థానాలు దక్కించుకున్నాయి. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో బీజేపీ విజయం సాధించగా, ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించిన బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో సైతం మూడో స్థానానికే పరిమితమైంది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించగా, 2023 నవంబర్‌లో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ గెలిచిన 18 సీట్లలోనూ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమవడం గమనార్హం. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో బీజేపీకే రెండో స్థానం కాంగ్రెస్ గెలిచిన 8 ఎంపీ స్థానాల పరిధిలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సీన్ మారింది. బీజేపీ బలం ఏమ్రాతం లేని ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలలో మాత్రమే బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యరి్థగా ఉంది. దాదాపు 50 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండి భారీగా ఓట్లు సాధించడం గమనార్హం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ధర్మపురిలో మాత్రమే కాంగ్రెస్ కన్నా బీజేపీ స్వల్ప ఆధిక్యత సాధించగా, మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది. జహీరాబాద్ ఎంపీ పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, కాంగ్రెస్‌కు రెండో స్థానం దక్కింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యత సాధించగా, గద్వాలలో మాత్రం కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలవడం గమనార్హం. ఇక వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, పార్లమెంటు స్థానాల్లో దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మొదటి స్థానంలోనే నిలవగా, రెండోస్థానంలో బీజేపీ, మూడోస్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. -
Lok Sabha Election Results 2024: 8 లేదా 9న ప్రమాణం!
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్లాల్ నెహ్రూ నెలకొలి్పన రికార్డును మోదీ సమం చేయబోతున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని సహా నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, బుధవారం మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎన్డీయే–2 ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు నూతన ప్రభుత్వ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత 17వ లోక్‌సభను రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేసింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఉదయం 11.30 గంటలకు జరిగిన కేబినెట్ భేటీలో మోదీ మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు ఒక భాగమేనని అన్నారు. నెంబర్ గేమ్ కొనసాగుతుందని చెప్పారు. గత పదేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులు చేశామని, భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటామని వెల్లడించారు. పదేళ్లలో మంత్రులంతా కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరుల రాజీనామా లేఖలను సమరి్పంచారు. మోదీతోపాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించాలని మోదీని కోరారు. 17వ లోక్‌సభను రద్దు చేయాలని కోరుతూ కేబినెట్ చేసిన సిఫార్సు లేఖను రాష్ట్రపతి అందజేశారు. దీంతో 17వ లోక్‌సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌తో మోదీ భేటీ ప్రధాని మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మూడు కమలం పువ్వులున్న పుష్పగుచ్ఛాన్ని మోదీకి అందజేసి అభినందనలు తెలియజేశారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించినందుకు గుర్తుగా మూడు కమలం పువ్వులను ఇచి్చనట్లు తెలుస్తోంది. అలాగే మోదీ కూడా కొన్ని రకాల మిఠాయిలను ఉప రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ, దిగిపోతున్న మంత్రివర్గానికి రాష్ట్రపతి భవన్లో విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దీనికి హాజరయ్యారు. టీడీపీ, జేడీ(యూ) మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మిత్రపక్షాల సహాయంతో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం బీజేపీకి లభించలేదు. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో హస్తినలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్డీయే నుంచి కొన్ని భాగస్వామ్య పక్షాలు ప్రతిపక్ష కూటమిలో చేరబోతున్నాయంటూ ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి. -
బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ..: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 37.5 శాతం ఓట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు 16 శాతానికి పడిపోయింది. 22 శాతం బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేశారు. 2023 ఎన్నికల్లో 13 శాతం ఓట్లు వచ్చిన బీజేపీకి ఇప్పుడు 35 శాతం వచ్చాయి. సరిగ్గా బీజేపీకి పెరిగిన ఓట్ల శాతమే బీఆర్ఎస్కు తగ్గింది. కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లు కలిసి బీఆర్ఎస్ నేతల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు. తనంతట తాను అంతర్థానమై బీజేపీని గెలిపించే దురాగతానికి కేసీఆర్ పూనుకున్నాడు..’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. బుధవారం జూబ్లీహిల్స్ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బూడిదైన బీఆర్ఎస్ మళ్లీ పుట్టేది లేదు ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీకి కూడా ఓట్లు, సీట్లు పెరిగాయి. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నేతలు ఆత్మ బలిదానం చేసుకుని, అవయవ దానం చేశారు. బీజేపీ గెలిచిన 8 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయింది. సిద్దిపేటలో ఎప్పుడూ బీఆర్ఎస్కు భారీ మెజారిటీ వచ్చేది. కానీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో హరీశ్‌రావు తన ఓట్లను బీజేపీకి బదిలీ చేశాడు. అక్కడ రఘునందన్‌రావుకు 63 వేలు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 65 వేలు మాత్రమే వచ్చాయి. కేసీఆర్, హరీశ్‌లిద్దరూ బీఆర్ఎస్ ఓట్లను పూర్తిగా రఘునందన్ రావుకు బదిలీ చేయించి మెదక్‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బలహీన వర్గాల అభ్యర్ధింని ఓడించారు. నమ్మి బీఆర్ఎస్ తరఫున నిలబడిన వెంకట్రామిరెడ్డిని మోసం చేశారు. సిద్దిపేటలో జరిగిన నష్టం కారణంగానే కాంగ్రెస్ మెదక్‌లో ఓడిపోయింది. మా ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేసీఆర్ నిరంతరం ప్రయతి్నస్తూనే ఉంటాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నంత కాలం కుట్రలు కొనసాగుతాయి. ఆయన రాజకీయ జూదగాడు. బూడిద అయిన బీఆర్ఎస్ మళ్లీ పుట్టేది లేదు.’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. మాకివి ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు ‘లోక్‌సభ ఎన్నికల్లో మాకు ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు వచ్చాయి. కొంత తీయగా, కొంత చేదుగా, కొంత పుల్లగా ఉంది. కానీ పచ్చడి మంచిది. ఇప్పుడొచ్చిన ఫలితాలను పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉగాది పచ్చడిలా స్వీకరిస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లతో 65 ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐలు విజయం సాధించాయి. ఇప్పుడు 41 శాతం ఓట్లతో 64 స్థానాల్లో ఆధిక్యతను నిలబెట్టుకోవడంతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను గెలుచుకున్నాం. అయితే ఫలితాలు మేము, అభిమానులు ఆశించిన స్థాయిలో మాత్రం లేవు. ఇప్పటివరకు 18 గంటలు పనిచేశాం. ఇంకా రెండు గంటలు అదనంగా పనిచేస్తాం..’ అని సీఎం చెప్పారు. మా పాలనను ప్రజలు సమర్థించారు ‘ఈ ఎన్నికలు మా పాలనకు రిఫరెండం అని చెప్పాం. మా పాలనను మెచ్చుకున్న ప్రజలు ఓట్లు, సీట్లను పెంచి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు. వారి శ్రమ, కష్టం, ప్రయత్నం వల్లనే ఓట్ల శాతం, పార్లమెంటు సీట్లు, ఎమ్మెల్యే స్థానాల్లో మెజార్టీ వచ్చింది. మా గౌరవాన్ని, రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని పార్టీ శ్రేణులు నిలబెట్టాయి. రాహుల్‌గాంధీ చేపట్టిన దేశవ్యాప్త యాత్రలు, ఇండియా కూటమి ఏర్పాటు, నేతల మధ్య సమన్వయంతో పాటు మోదీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, పరిపాలనా వైఫల్యాలకు దేశ స్థాయిలో ప్రచారం కల్పించడం ద్వారా ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాం..’ అని రేవంత్ అన్నారు. గెలుపోటములకు నాదే బాధ్యత ‘మల్కాజిగిరి సిట్టింగ్ ఎంపీ సీటు కోల్పోయినా కంటోన్మెంట్ అసెంబ్లీని గెలుచుకున్నాం. మహబూబ్‌నగర్‌లో కూడా ఓడిపోయాం. ఇవన్నీ ప్రజాతీర్పులో భాగం. ప్రజలు ఏ తీర్పునిచ్చినా శిరసావహిస్తాం. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని..జిల్లాకు కాదు. అలాగే పీసీసీ అధ్యక్షుడిని కూడా రాష్ట్రానికే. ఈ రాష్ట్రంలో ఏ సీటు ఓడినా, గెలిచినా నాదే బాధ్యత. రాష్ట్ర సమస్యలను పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యత..’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదు ‘2024లో మోదీ గ్యారంటీ అంటూ ఏకవ్యక్తి నాయకత్వంతో ప్రజల దగ్గరికెళితే బీజేపీని దేశ ప్రజలు తిరస్కరించారు. ఆ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని, మోదీకి కాలం చెల్లిందని తీర్పిచ్చారు. ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీని చీల్చడం ద్వారా కుట్రలు, కుతంత్రలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ప్రజలు తిరస్కరించారు. అక్కడ తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో బీజేపీ ఇదే రకమైన ప్రయోగం చేస్తుందో లేదో చూడాలి. ప్రపంచంలోనే కేసీఆర్ అత్యంత అవినీతిపరుడని, అవినీతి కుటుంబమని ఆరోపణలు చేసిన బీజేపీ వారితోనే ఎలా జట్టు కడుతోందో, ఎలా సమర్ధింస్తోందో ఆ పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలి. మోదీ తక్షణమే ప్రధాని పదవికి రాజీనామా చేసి మళ్లీ ఆ పదవిని చేపట్టకూడదు..’ అని సీఎం అన్నారు. ఏపీతో సమస్యలు చర్చలతో పరిష్కరించుకుంటాం ‘ఏపీ ప్రజల తీర్పును జగన్మోహన్రెడ్డి, చంద్రబాబులు స్వాగతించిన తర్వాత మాదేముంటుంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా స్నేహపూర్వక వాతావరణంలో చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటామని ముందే చెప్పా. ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నా. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకి కట్టుబడి ఉన్నాం..’ అని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మల్లురవి, చామల కిరణ్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
Lok Sabha Election Result 2024: ఎన్డీఏ నేతగా మోదీ
బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడ్డ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజారిటీ స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల అగ్ర నేతలంతా పాల్గొన్నారు. న్యూఢిల్లీ/బెంగళూరు: బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడ్డ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజారిటీ స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు. తొలి ప్రధాని నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించనున్న నాయకునిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల అగ్ర నేతలంతా పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జేడీ(యూ) చీఫ్ నితీశ్‌కుమార్, శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, ఎల్జేపీ (ఆర్వీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, జేడీ(ఎస్) నేత హెచ్.డి.కుమారస్వామి, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సహా 16 పారీ్టలకు చెందిన 21 మంది నాయకులు భేటీలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్ర నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు హాజరయ్యారు. భేటీనుద్దేశించి తొలుత మోదీ మాట్లాడారు. ఎన్నికల విజయానికి కూటమి పక్షాలను అభినందించారు. కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి మెజారిటీ సాధించడం చరిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు. ఇది గత 60 ఏళ్లలో ఎవరికీ సాధ్యపడని ఘనత అన్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నితీశ్ సూచించారు. ఇండియా కూటమిలో చేరాలంటూ ఎన్డీఏ పారీ్టలకు కాంగ్రెస్ బాహాటంగానే పిలుపులిస్తున్న నేపథ్యంలో అనిశ్చితికి తావు లేకుండా తక్షణం ప్రభుత్వం కొలువుదీరాలని నేతలన్నారు. అందుకు వీలుగా శాఖల పంపకం తదితర మంతనాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ కూర్పుపైనా భేటీలో నేతలు చర్చించారు. శుక్రవారం ఎన్డీఏ ఎంపీలంతా సమావేశమై మోదీని తమ నాయకునిగా లాంఛనంగా ఎన్నుకుంటారని హెచ్ఏఎం(ఎస్) జితిన్‌రాం మాంఝీ వెల్లడించారు. అనంతరం రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ కూటమికి మద్దతు లేఖలు సమరి్పస్తామని భేటీ అనంతరం మీడియాకు వెల్లడించారు. మోదీపై నేతల ప్రశంసలు దేశ ఘన వారసత్వాన్ని ప్రగతికి, సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం పాటుపడుతుందంటూ ఎన్డీఏ భేటీలో నేతలంతా తీర్మానం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ సారథ్యంలో గత పదేళ్లలో పలు ప్రజానుకూల నిర్ణయాలతో దేశం అన్ని రంగాల్లోనూ వృద్ధి బాటన సాగుతోంది. ఆయన నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి గొప్ప విజయం సాధించడం మాకందరికీ గర్వకారణం. మోదీని మా నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం’’ అంటూ నేతలు తీర్మానించారు. ఎన్డీఏతోనే ఉంటాం తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని బాబు, నితీశ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకూ తావు లేదన్నారు. దేశ నిర్మాణం కోసం పదేళ్లుగా మోదీ చేసిన కృషిని ప్రస్తుతిస్తూ నేతలంతా ఆయన్ను అభినందించారని తెలిపారు. ‘‘అంతర్జాతీయంగా భారత్ స్థాయిని మోదీ పెంచారు. ఆయన లక్ష్యాల సాధనకు సహకరిస్తాం’’ అన్నారు.కీలక శాఖలు, స్పీకర్ ఎన్డీఏ పక్షాల డిమాండ్లు 2014, 2019ల్లోనూ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటైనా ఆ రెండుసార్లూ బీజేపీకి ఒంటరిగానే సంపూర్ణ మెజారిటీ వచి్చంది. ఈసారి మాత్రం ఆ పార్టీ 240 లోక్‌సభ స్థానాలకు పరిమితమై మెజారిటీకి 32 సీట్ల దూరంలో నిలిచింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాల మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ 3.0 సర్కారు పనితీరు గత రెండుసార్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది. ఎన్డీఏ భాగస్వాములంతా కీలక శాఖలు డిమాండ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాలతో పాటు జాతీయ మీడియా పేర్కొంటున్న మేరకు ఎవరేం కోరుతున్నారంటే... టీడీపీ: ఏకంగా 7 నుంచి 8 కేబినెట్ బెర్తులు, ఒక సహాయ మంత్రి పదవి కోరుతోంది! వ్యవసాయ, రవాణా, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, ఐటీ–వాణిజ్య, విద్య, గృహ నిర్మాణ, జల శక్తి, ఆర్థిక (సహాయ) శాఖలతో కూడిన జాబితాను బీజేపీ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. లోక్‌సభ స్పీకర్ పదవి కూడా అడుగుతోంది. జేడీ(యూ): జేడీ(యూ) పార్టీ కనీసం మూడు కేబినెట్ పదవులు డిమాండ్ చేస్తోంది. ఒకట్రెండు సహాయ మంత్రి పదవులు కూడా కోరవచ్చంటున్నారు. మరోవైపు విపక్షాల ‘ఇండియా’ కూటమి కూడా ఇప్పటికే తమను ఆకర్షించేందుకు ప్రయతి్నస్తోందని జేడీ(యూ) సీనియర్ నేత, బిహార్ మంత్రి విజయ్‌కుమార్ చౌదరి మీడియాకు చెప్పడం విశేషం. ఆయన వ్యాఖ్యలను బీజేపీపై ఒత్తిడి పెంచే వ్యూహంగా భావిస్తున్నారు. ఎల్జేపీ (ఆర్వీ): ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి కోసం పట్టుబడుతోంది. బిహార్‌లో పోటీ చేసిన ఐదు లోక్‌సభ స్థానాల్లోనూ పార్టీ ఘనవిజయం సాధించడం తెలిసిందే. హెచ్ఏఎం(ఎస్) నేత జితిన్‌రాం మాంఝీ కూడా కేబినెట్ పదవి ఆశిస్తున్నారు. శివసేన: ఒక కేబినెట్, మరో సహాయ మంత్రి పదవి కోరుతోంది. వ్యవసాయ శాఖపై జేడీ(ఎస్) కన్ను: తనకు వ్యవసాయ శాఖ కావాలంటూ జేడీ(ఎస్) నేత కుమారస్వామి స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఆయన పార్టీ జేడీ(ఎస్) రెండు లోక్‌సభ స్థానాలు గెలిచింది. ‘‘కేంద్ర వ్యవసాయ శాఖపై మా పారీ్టకి ఆసక్తి ఉంది. అయితే మేమేమీ డిమాండ్లు చేయడం లేదు. మాకు కర్నాటక ప్రయోజనాలే ప్రధానం. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి ఎలాంటి ప్రాతినిధ్యం కలి్పంచాలో మోదీ నిర్ణయిస్తారు. అయినా దానిపై సరైన సమయంలో మాట్లాడుకుందాం’’ అని చెప్పుకొచ్చారు. -
ఇండియా కూటమి కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ ముగిసింది. మిత్రపక్షాలతో కలిసి సుధీర్ఘ చర్చలు జరిపిన అనంతరం.. ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి తీర్మానం చేసుకుంది. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఇండియా భాగస్వామ్యం ఏకతాటిపై పోరాటం చేస్తాయని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్షానికి మద్దతిచ్చిన దేశ ప్రజలందరికీ కూటమి తరపున ధన్యవాదాలు తెలిపారు.లోక్‌సభ ఫలితాల అనంతరం ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, డీ రాజా, ఏచూరి హాజరయ్యారు. ఇండియా కూటమి సంయుక్త ప్రకటననరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాంబీజేపీని గద్దె దింపేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాంఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయి. నైతికంగా ప్రధాని ఓడిపోయారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా పోరాడింది. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావొచ్చు. ఈ ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. మోదీ ప్రజల అభీష్టాన్ని మార్చాలని చూస్తున్నారు. :::ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే #WATCH | Delhi: Congress president Mallikarjun Kharge says "...The INDIA bloc will continue will fight against the fascist rule of the BJP led by PM Modi. We will take the appropriate steps at the appropriate time to realise the people's desire not to be ruled by the BJP's… pic.twitter.com/NhdnHYbbfI— ANI (@ANI) June 5, 2024ప్రతిపక్ష నేతలంతా కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్(272) దాటకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కసరత్తు లేదా ప్రతిపక్ష హోదా కొనసాగింపు వంటి వివిధ అంశాలపై లోతుగా చర్చించారు. చివరికి ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి నిర్ణయించింది.కాగా జూన్ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి 291, ఇండియా కూటమికి 232 స్థానాలు దక్కాయి. బీజేపీ స్వతహాగా 240 సీట్లు గెలుచుకుంది. అయితే ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో ప్రధాని మోదీ ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతికి సమర్పించారు. జేడీయూ, టీడీపీ వంటి మిత్ర పక్షాలతో కలిసి జూన్ 8న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష నేతలు భేటీ ముగిసింది. ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, డీ రాజా, ఏచూరి హాజరయ్యారు. ప్రతిపక్ష నేతలంతా కలిసి చర్చించి ప్రతిపక్షంలో కొనసాగాలని నిర్ణయించారు.ఇండియా కూటమి సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కూటమిలోని స్నేహితులందరికీ స్వాగతం పలికారు. లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా, సమన్వయంతో, పూర్తి శక్తితో పోరాడి మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రజాభిప్రాయం ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా ఉందన్నారు.ఎన్నికలకు బీజేపీ మోదీ పేరు, మోదీ ముఖంతో వెళ్ళారని, బీజేపీకి మెజారిటీ ఇవ్వకుండా ప్రజలు అతని నాయకత్వం గురించి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. మోదీజికి వ్యక్తిగతంగా ఇది రాజకీయ ఓటమి మాత్రమే కాదు, నైతిక పరాజయం కూడా అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై విశ్వాసం, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయ లక్ష్యాలకు కట్టుబడి ఉన్న అన్ని రాజకీయ పార్టీలను భారతదేశ కూటమి స్వాగతిస్తున్నామని చెప్పారు.కాగా లోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజార్టీకి కావాల్సిన సీట్లు మాత్రం గెలుచుకోలేకపోయింది. ఎన్టీయే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సిద్ధమైంది. అయితే బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్(272) దాటకపోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఆశలు చిగురించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కసరత్తు, వివిధ అంశాలపై చర్చించేందుకు నేడు సమావేశమైంది.#WATCH | Delhi | Jharkhand CM & JMM leader Champai Soren will attend INDIA alliance meeting at Congress President Mallikarjun Kharge's residence pic.twitter.com/loJ2sgzQXn— ANI (@ANI) June 5, 2024#WATCH | Delhi | DMK President MK Stalin reaches Congress President Mallikarjun Kharge's residence for meeting of the INDIA alliance pic.twitter.com/ozw2vXbtVB— ANI (@ANI) June 5, 2024#WATCH | NCP-SCP leaders Sharad Pawar and Supriya Sule will take part in INDIA alliance meeting at the residence of Congress president Mallikarjun Kharge in Delhi pic.twitter.com/bHZuuynBl7— ANI (@ANI) June 5, 2024 -
బీఆర్ఎస్ది తప్పుడు వ్యూహం: ఒవైసీ
హైదరాబాద్, సాక్షి: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణ ఓటమిపై తెలంగాణవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం బీఆర్ఎస్ జీరో ఫలితంపై స్పందించారు. బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ 8 చోట్ల డిపాజిట్ కోల్పోవడానికి క్రాస్ ఓటింగే కారణమైంది. బీఆర్ఎస్ ఇలా ఎందుకు చేసిందో నాకైతే తెలియదు. రాజకీయ వ్యూహంలో భాగం అనుకున్నా.. అది తప్పుడు వ్యూహం అని ఒవైసీ అభిప్రాయపడ్డారు. -
బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నేతల ఆత్మబలిదానం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచినవారికి సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని అన్నారు. లోక్‌సభ ఫలితాలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ లోక్ ఎన్నికల ఫలితాలు మా 100 రోజుల పాలనకు రెఫరెండం. దేశవ్యాప్తంగా రాహుల్ జోడోయాత్ర పరిస్థితి మారిపోయింది. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుంది. 2019లో 3 సీట్లు గెలిస్తే.. ఇప్పుడు 8 సీట్లు గెలిచాం. సిద్దిపేటలో కూడా బీజేపీకి మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుండుసున్నా ఇచ్చారు. బీజేపీ అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీ కూడా ఓట్లు, సీట్లు పెరిగాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతల తీరు మార్చుకోవాలి. మోదీ గ్యారంటీకి ఉన్న వారంటీ ముగిసింది. మోదీ వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలి. తెలంగాణ లోక్‌సభ ఫలితాలు ఉగాది పచ్చడిలాగా సగం తియ్యగా, సగం పులుపుగా ఉన్నాయి. మల్కాజిగిరిలో ఓడినా.. కంటోన్మెంట్లో విజయం సాధించాం. కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. ఎప్పటికప్పుడుతెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. -
భారత ఎన్నికల ప్రక్రియపై అమెరికా ప్రశంసలు
వాషింగ్టన్: భారత్‌లో మంగళవారంవ వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత దేశ పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదని అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు.‘‘ భారత ప్రభుత్వం, దేశంలోని ఓటర్లు అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచారు?. ఎవరు ఓడిపోయారు? అనే అంశంపై మాకు ప్రాధాన్యం కాదు. వాటి మేము వ్యాఖ్యలు చేయటం లేదు. గత ఆరు వారాలను నుంచి ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదైన ఎన్నికలు ప్రక్రియ భారత్‌లో జరగటం చూశాం. అదే మాకు చాలా ముఖ్యం’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు. ఇక.. ఏడు విడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫతితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ 242 స్థానాలు గెలుపొందింది. ఇక.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేటమి 294 స్థానాలు విజయం సాధించింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో మూడోసారి అధికారం చేపట్టనుంది. మరోవైపు.. ప్రతిపక్షాల ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
నీ సోదరిగా గర్విస్తున్నా..నువ్వెంత ధీశాలివో మాకు తెలుసు!
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మిత్ర పక్షాలతో ఇండియా కూటమిగా ఏర్పడి ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అంటూ నినదించిన బీజేపీకి భారీ షాకిచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 328 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు ఎక్కువ సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఎక్స్‌వేదికపై స్పందించారు. తన సోదరుడు రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు.You kept standing, no matter what they said and did to you…you never backed down whatever the odds, never stopped believing however much they doubted your conviction, you never stopped fighting for the truth despite the overwhelming propaganda of lies they spread, and you never… pic.twitter.com/ev7QYFI1PR— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 5, 2024 ‘వారు (బీజేపీ నేతలు) ఎంతఅవమానించినా, అవహేళన చేసినా, దూషించినా చాలా దృఢంగా నిలబడ్డావు. అవహేళనలు, కష్టాలను చూసి ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. నీ నమ్మకాన్ని ఎంతగా అనుమానించినా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎంతగా నీపై అవాస్తవాలు, అబద్ధాలతో విపరీతమైన ప్రచారం చేసినా సత్యం కోసం నీ పోరు ఆగలేదు. కోపం ద్వేసం, నీ దరి చేరనీయలేదు. సంయమనం కోల్పోలేదు. ప్రతిరోజూ నీపై ద్వేషాన్ని కుమ్మరించినా నీ గుండెల్లోని ప్రేమ, దయతోనే, నిజం కోసం పోరాడావు. ఇది వాళ్లందరికీ ఇపుడు అర్థం అవుతుంది. కానీ నువ్వెంత ధీశాలివో ఎల్లపుడూ మాలో కొందరికి తెలుసు. నేను సోదరిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. ఈసందర్భంగా ఒక కార్టూన్‌ను కూడా షేర్ చేశారు. కాగా బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ఇప్పటికీ సగం సీట్లతో సరిపెట్టుకోవచ్చు, కానీ రాహుల్, ప్రియాంకా ద్వయం మాత్రం స్టార్ క్యాంపెయినర్లుగా నిలిచి బీజేపీ ఆశలకు భారీగా గండి కొట్టారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ తమ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని యావద్దేశానికి చాటి చెప్పారు రాహుల్‌గాంధీ. అంతేకాదు తల్లి, చెల్లి పట్ల బాధ్యతగా, ప్రేమగా ఉంటూ అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాగే ప్రియాంకా 2024 ఎన్నికలలో ప్రసంగాల్లో బాగా రాణించారు. తన తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ప్రసంగాలాతో ఓటర్లను ఆకర్షించారు. కాంగ్రెస్‌విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోటలైన, అమేథీ ,రాయ్‌బరేలీలలో కాంగ్రెస్ ప్రచారాన్ని లీడ్ చేశారు. అంతేకాదు గాంధీ కుటుంబ విధేయుడు కిషోరి లాల్ శర్మ విజయం కోసం శ్రమించారు. తద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడించి 2019లో రాహుల్ గాంధీ ఓటమికి స్వీట్ రివెంజ్ తీర్చుకున్నారు. -
లోక్‌సభ ఎన్నికలు 2024: చివరిదాకా ఉత్కంఠ, సత్తా చాటిన వర్షాతాయి
2024 లోక్‌సభ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో జరిగిన పోరులో మహారాష్ట్ర ఉద్ధవ్ సేన ఎట్టకేలకు తన ఆధిపత్యాన్ని నిరూపించుంది. ముంబై మహా వికాస్ అఘాడి (MVA) కీలక విజయాలను సాధించింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ పోరు తీవ్ర ఉత్కంఠగా నిలిచింది. ముంబై నార్త్‌లో కాంగ్రెస్ మళ్లీ ఘోర పరాజయాన్ని చవిచూస్తున్న క్రమంలో ఆ పార్టీ ముంబై అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ తన సత్తా చాటారు. ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిపై దాదాపు 16 వేల 514 ఓట్ల తేడాతో గెలుపొందారు.పాకిస్థాన్‌కు చెందిన అజ్మల్ కసబ్‌ను ఉరితీసిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఓట్ల లెక్కింపులో తొలి ట్రెండ్స్‌లో ఉజ్వల్ నికమ్ ఆధిక్యంలో ఉన్నారు. చివరి రౌండ్లలో తన ఆధిక్యాన్ని చాటుకుని వర్ష గైక్వాడ్ (49)విజయం సాధించారు.శివసేన ముంబై సౌత్, సౌత్ సెంట్రల్ , నార్త్ ఈస్ట్ మూడు చోట్ల పోరాడింది. హోరాహోరీగా సాగిన పోరులో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి అమోల్ కీర్తికర్ విజయం సాధించారు. నార్త్ ముంబై లోక్‌సభ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయం సాధించారు. ముంబై సౌత్ నియోజకవర్గంలో ఉద్ధవ్ వర్గానికి చెందిన అరవింద్ సావంత్ షిండేసేనకు చెందిన యామినీ జాదవ్‌పై 52 వేల 673 ఓట్ల తేడాతో గెలుపొందగా, ఉద్ధవ్ థాకరే విశ్వసనీయ సహచరుడు అనిల్ దేశాయ్ షిండేసేనకు చెందిన రాహుల్ షెవాలేపై 53 వేల 384 ఓట్లతో విజయం సాధించారు.ఎవరీ వర్షా గైక్వాడ్ధారవి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత మహిళ. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన ఆమె 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో మహారాష్ట్ర 11వ శాసనసభకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
బీజేపీకి ఎనిమిది సీట్లు ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న లక్ష్యాలకు పూర్తి భిన్నంగా ఫలితాలు రావడంపై ఆ పార్టీ హైకమాండ్ విస్మయం వ్యక్తం చేసింది. ఆరు నెలల కిందటే అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మొత్తం 17 సీట్లకు గానూ 14 సీట్లు వస్తాయని భావించినా, కేవలం 8 సీట్లు రావడం, అంతగా క్షేత్రస్థాయి బలం లేని బీజేపీ ఏకంగా 8 స్థానాలను గెలవడం పార్టీ పెద్దలను కలవరానికి గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ ఫలితాల ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు రాష్ట్ర నేతలతో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సీఎం సొంత జిల్లాలోనూ ఓటమా?తెలంగాణలో ప్రస్తుత ఎన్నికల్లో కనీసంగా 14 సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలను కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సూచించింది. హైకమాండ్ సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణను రూపొందించుకొని అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం, బూత్, పోల్ మేనేజ్మెంట్ బాధ్యతలకు మంత్రులకు కట్టబెట్టింది. ఇందులో భాగంగా సీఎం స్వయంగా తన సొంత జిల్లా మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఇంచార్జిగా వ్యవహరించారు. ఆ జిల్లాలోనే పకడ్భందీగా వ్యవహరించినప్పటికీ ఏఐసీసీ కార్యదర్శి, అభ్యర్ధి వంశీచంద్‌రెడ్డి ఓటమి పాలవ్వడంపై హైకమాండ్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లోక్‌సభ పరిధిలో ఏడుకు ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ అభ్యర్ధి ఓడటంపై వారు స్వయంగా ముఖ్యమంత్రినే ఆరా తీసినట్లు తెలసింది.మల్కాజిగిరిలో బీజేపీకి 3లక్షలు మెజారిటీనా?ఇక గతంలో సీఎం రేవంత్ స్వయంగా గెలిచిన మల్కాజ్గిరి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ ఓడటం,, బీజేపీ అభ్యర్ధికి ఏకంగా 3 లక్షల పైచిలుకు మెజార్టీ రావడంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. కేవలం ఆరు నెలల వ్యవధిలో ఇంతమార్పు ఎందుకు జరిగింది?, పార్టీ నేతల మధ్య సమన్వయం లేదా?,మరే ఇతర కారాణాలున్నాయా? అని ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. చాలామంది రాష్ట్ర నేతలు బీజేపీ గాలి వీచిందని చెప్పగా, అభ్యర్థుల ఎంపికలో తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయని మరికొందమంది చెప్పినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా చేవెళ్ల, మల్కాజ్గిరి, కరీంనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల ఎంపిక పూర్తి ఏకపక్షంగా జరిగిందనే వాదనను కొందరు తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. -
Big Question: వైఎస్ జగన్ భావోద్వేగ స్పీచ్.. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ
-
నేడు ఇండియా కూటమి సమావేశం.. కీలక వ్యూహాలపై చర్చ!
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి 232 సీట్లను గెలుచుకుంది. 400 సీట్లలో విజయం సాధిస్తామనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్ దాటి 294 సీట్లకు పరిమితమైంది.#WATCH | Maharashtra: NCP-SCP chief Sharad Pawar and party MP from Baramati, Supriya Sule leaves from Mumbai for Delhi for the INDIA bloc meeting, scheduled for later today. NCP-SCP won 8 Lok Sabha seats in Maharashtra and Supriya Sule retained Baramati by a margin of 1,58,333… pic.twitter.com/oNClFFQBqj— ANI (@ANI) June 5, 2024 ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం భారీగా లేకపోవడంతో ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చలు ప్రారంభించాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఎటువంటి వ్యూహాలు అమలు పర్చాలనేదానిపై ఇండియా కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం.#WATCH | Tamil Nadu CM and DMK chief MK Stalin arrives in Delhi ahead of the INDIA bloc meeting scheduled for later today. His party won 22 seats in #LokSabhaElections2024 pic.twitter.com/I1onVWnrmF— NewsMobile (@NewsMobileIndia) June 5, 2024కూటమి గెల్చుకున్న సీట్ల సంఖ్య గతంతో కంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో రాజకీయ మార్పులు జరగనున్నాయని ఎన్సిపీ (శరద్ చంద్ర పవార్) పార్టీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం పేర్కొన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి తీసుకునే నిర్ణయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఇక.. ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, చంపయి సొరేన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, డి.రాజా తదితర నేతలు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలు బీజేపీ గెలువకపోటంతో ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలు పార్టీల కీలక నేతలు ఢిల్లీకి పయణమై చేరకుంటున్నారు. -
లోక్ సభ ఎన్నికల్లో జీరోకు పడిపోయిన బీఆర్ఎస్
-
11.75 లక్షల ఓట్ల తేడాతో నెగ్గిన శంకర్ లాల్వానీ
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ సీటును బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ 11,75,092 ఓట్ల భారీ తేడాతో గెలుచుకున్నారు. దేశ ఎన్నికల చరిత్రలోనే ఇంతటి భారీ విజయం ఇక్కడ తొలిసారిగా నమోదైందని లాల్వానీ చెప్పుకున్నారు. అదేవిధంగా, నోటాకు సైతం రికార్డు స్థాయిలో 2.18 లక్షల ఓట్లు పడ్డాయి. మొత్తం ఓట్లలో ఇవి 14.01శాతంగా ఉన్నాయి. ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తమ నేత అక్షయ్ కాంతి బామ్‌కు టికెట్టిచి్చంది. అయితే, ఆయన నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి పారీ్టకి షాకిచ్చారు. అనంతరం అక్షయ్ కాంతి బామ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో, కాంగ్రెస్ పారీ్టకి అభ్యర్థుల్లేకుండా పోయారు. తమ అభ్యర్థికి బదులుగా నోటాకు ఓటేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది. దీంతో రికార్డు స్థాయిలో నోటాకు రూ.2.18 లక్షల ఓట్లు పోలయ్యాయి. -
25 ఏళ్లకే ఎంపీలుగా రికార్డుకెక్కిన పుష్పేంద్ర, ప్రియా
న్యూఢిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిన అత్యంత పిన్నవయసు్కలు, అత్యంత వృద్ధుడు ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులుగా కౌశంబీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పుష్పేంద్ర సరోజ్, మచిలీషహర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రియా సరోజ్ విజయం సాధించారు. వారిద్దరి వయసు 25 ఏళ్లే కావడం విశేషం. వీరిద్దరే ఈసారి అత్యంత పిన్నవయసు్కలైన ఎంపీలుగా రికార్డు సృష్టించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి టి.ఆర్.బాలు సులువుగా నెగ్గారు. 82 ఏళ్ల టి.ఆర్.బాలు ఈ ఎన్నికల్లో అత్యంత వృద్ధుడైన ఎంపీగా రికార్డుకెక్కారు. -
Lok Sabha Election 2024: బీజేపీ.. కాంగ్రెస్‌కు చెరో '8'
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎంఐఎం నిలుపుకొంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున మొత్తం 9 మంది సిట్టింగ్ ఎంపీలు పోటీచేయగా.. వారిలో ఐదుగురు ఓటమి పాలయ్యారు. ఓడినవారిలో నామా నాగేశ్వర్రావు, మాలోతు కవిత, రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్ ఉన్నారు. అసదుద్దీన్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అరవింద్ మాత్రమే తమ సీట్లను నిలుపుకొన్నారు. ఇక ఈసారి 8 మంది తొలిసారి ఎంపీగా గెలిచి రాష్ట్రం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పట్టు.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తన పట్టును నిలుపుకోగా.. ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న మొత్తం 5 లోక్‌సభ సీట్లనూ కాంగ్రెస్ గెలుచుకుంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ మూడింటిని గెలుచుకుని ఆ ప్రాంతాల్లో ఆధిపత్యం చాటింది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించడంతో పాత నగరంపై ఆ పార్టీ పట్టు నిలుపుకొంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు లోక్‌సభ సీట్లు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ చెరో మూడు సీట్లను దక్కించుకున్నాయి. అదీ ప్రతి జిల్లాలో చెరో సీటు సాధించడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని రెండు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. పట్టుపెంచుకున్న ఇరు పార్టీలు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 స్థానాలను గెలిచిన బీజేపీ.. ఈసారి తన బలాన్ని 8 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్ కూడా 3 సీట్ల నుంర్టీచి 8 సీట్లకు బలాన్ని పెంచుకుంది. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. ఆ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలే గెలిచిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి సమ ఉజ్జీగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఒక్క లోక్‌సభ సీటు గెలవలేదు. గత, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లివీ.. పార్టీ 2014 2019 2024 కాంగ్రెస్ 2 3 8 బీజేపీ 1 4 8 ఎంఐఎం 1 1 1 బీఆర్ఎస్ 11 9 0 నల్లగొండ: రికార్డు స్థాయి మెజారిటీ నల్లగొండ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తమ పట్టు నిలుపుకొంది. కౌంటింగ్ ఆద్యంతం ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత చూపారు. చివరికి ఏకంగా రికార్డు స్థాయిలో 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. భువనగిరి: అంతా తొలిసారి ఎంపీలే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో తమకు ఉన్న పట్టును కాంగ్రెస్ పార్టీ మరోసారి నిలుపుకొంది. భువనగిరి లోక్‌సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సెగ్మెంట్లో ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తొలిసారిగా ఎంపీలు అయినవారే కావడం విశేషం. నాగర్ కర్నూల్: మళ్లీ ‘చేతి’కి.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో సమీప బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్‌పై గెలుపొందారు. మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా గెలవడం గమనార్హం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. పెద్దపల్లి: మళ్లీ కాంగ్రెస్ ఖాతాలోకి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌పై విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) మనవడు, చెన్నూర్ ఎమ్మెల్యే జి.వివేక్ తనయుడే గడ్డం వంశీకృష్ణ. ఈయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మూడోస్థానానికి పరిమితం అయ్యారు. వరంగల్: పార్టీ మారి పోటీచేసినా.. 2009లో జరిగిన పునర్విభజనలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ గెలవగా తర్వాత వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య గెలిచారు. ఆమె బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‌పై 2,20,339 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కావ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఆమె కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అరూరి రమేష్ కూడా ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి పోటీ చేయడం గమనార్హం. మహబూబాబాద్: సెగ్మెంట్ చరిత్రలో అధిక మెజారిటీ మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాంనాయక్ 3,49,165 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితపై విజయం సాధించారు. 1957 నుంచీ కొనసాగిన మానుకోట పాత పార్లమెంట్ స్థానంలోగానీ, 2009 తర్వాత కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలోగానీ.. ఇదే అత్యధిక మెజారిటీ కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ తరఫున ఇదే లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన బలరాంనాయక్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2019 ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. ఈసారి మళ్లీ గెలిచారు. ఖమ్మం: ఆద్యంతం కాంగ్రెస్ ఆధిక్యమే.. తొలి రౌండ్ నుంచి చివరిదాకా కాంగ్రెస్ ఆధిక్యమే కొనసాగింది. చివరికి 4,67,847 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయం సాధించారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు కావడం గమనార్హం. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్రావు రెండో స్థానంలో నిలిచారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన 18 ఎన్నికల్లో.. ప్రస్తుతం రామసహాయం రఘురాంరెడ్డి సాధించిన మెజారిటీయే రికార్డు. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 20,488 ఓట్లే రాగా.. ఈసారి ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు 1,18,636 ఓట్లు సాధించారు. జహీరాబాద్: ఇక్కడా హస్తం హవా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 46,174 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి/సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌పై విజయం సాధించారు. సురేశ్ షెట్కార్ ఇదే సెగ్మెంట్ నుంచి 2009లో ఎంపీగా గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన బీబీ పాటిల్ ఎన్నికల ముందే బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల మధ్య గట్టిపోటీనే జరిగింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ మూడో స్థానంలో నిలిచారు. నిజామాబాద్: పోటాపోటీ మధ్య కమలానికి.. ఇందూరు గడ్డపై మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కొనసాగిన నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను.. అరవింద్‌కు బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, నిజామాబాద్ రూరల్‌లలో ఆధిక్యత వచ్చింది. జీవన్‌రెడ్డికి జగిత్యాల, నిజామాబాద్ అర్బన్, బోధన్ సెగ్మెంట్లలో ఆధిక్యత వచ్చింది. కరీంనగర్: పట్టు పెంచుకున్న జాతీయ పార్టీలు తొలి నుంచీ బీఆర్ఎస్కు ఆయువుపట్టుగా ఉన్న కరీంనగర్ లోక్‌సభ స్థానంలో జాతీయ పార్టీలు పట్టుపెంచుకున్నాయి. ఇక్కడ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 4,98,276 ఓట్లు, బీఆర్ఎస్కు 4,08,768 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,79,258 ఓట్లు రాగా.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 5,85,116 ఓట్లతో విజయం సాధించారు. క్రితంసారితో పోలిస్తే 86,840 ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు 3,59,907 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే కాంగ్రెస్‌కు 1,80,649 ఓట్లు అదనంగా వచ్చాయి. ఈసారి బీఆర్ఎస్కు 2,82,163 ఓట్లు వచ్చాయి. 1.25 లక్షలకుపైగా ఓట్లు తగ్గాయి. మహబూబ్‌నగర్: కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి మధ్య విజయం దోబూచులాడింది. చివరికి డీకే అరుణ 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. గతంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన డీకే అరుణ లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అయితే ఈ లోక్‌సభ ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ స్థానం పరిధిలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజిగిరి: దేశంలోనే పెద్ద సెగ్మెంట్.. తొలిసారి బీజేపీ విజయం దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్‌సభ సెగ్మెంట్ మల్కాజిగిరిలో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్లో ప్రముఖ నేతగా కొనసాగి, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన ఈటల తొలిసారి ఎంపీ అయ్యారు. చేవెళ్ల: కొండా వశం చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన 2014లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచారు. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. చేవెళ్ల సెగ్మెంట్లో ఏకంగా 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మెదక్: గులాబీ కంచుకోటలో కమలం బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచీ కంచుకోటగా ఉన్న మెదక్‌లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 39,139 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌పై గెలిచారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్‌రావు తొలిసారిగా ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే సుమారు 35 వేల ఓట్లు తక్కువగా వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆదిలాబాద్: మళ్లీ కమలమే! ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో కమలం పార్టీ మళ్లీ వికసించింది. ఆ పార్టీ అభ్యర్థి గొడం నగేశ్.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,652 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచిన ఆయన.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ ఇక్కడ కూడా మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ కౌంటింగ్ తొలుత ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి తొలి నుంచీ ఆధిక్యంలో ఉన్నా.. కొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత సాధించారు. చివరికి నగేశ్ గెలిచారు. హైదరాబాద్: ఐదోసారి లోక్‌సభకు అసదుద్దీన్ హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆయన సమీప బీజేపీ అభ్యర్థి కె.మాధవీలతపై 3,38,087 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్నికల్లో తన ప్రచార, వ్యవహార శైలితో జాతీయ మీడియాను కూడా ఆకర్షించిన మాధవీలత ఊహించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయ్యారు. 2019లో 2.82 లక్షల ఓట్ల మెజారిటీతో అసదుద్దీన్ గెలవగా.. మెజారిటీ మరో 50వేలకుపైగా పెరిగింది. సికింద్రాబాద్: ఓట్లు మరింత పెంచుకున్న బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో బీజేపీ తన ఓట్లశాతాన్ని మరింత పెంచుకుంది. బీజేపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో బీజేపీకి 42.05 శాతం ఓట్లురాగా.. ఈసారి 45.15శాతం వచ్చాయి. -
తగ్గిన ఎన్డీఏ బలం.. పవర్ ఖాయం! హ్యాట్రిక్!
న్యూఢిల్లీ: పాలక ఎన్డీఏ కూటమి పదేళ్ల జోరుకు బ్రేకులు ఎన్డీఏ సారథి బీజేపీ దూకుడుకు ముకుతాడు విపక్ష ఇండియా కూటమికి నైతిక విజయం కూటమి సారథి కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు వెలువరించారు. గత రెండు ఎన్నికల ఆనవాయితీకి భిన్నంగా బీజేపీని ఈసారి మెజారిటీకి ఓ 32 స్థానాల దూరంలోనే ఉంచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతగానే 303 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఏకంగా 63 స్థానాలు తగ్గి 240కే పరిమితమైంది. దాంతో నరేంద్ర మోదీ శకం మొదలయ్యాక తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితిలో పడింది. ఎన్డీఏ కూటమి కూడా కనాకష్టంగా మెజారిటీ మార్కు 272ను దాటింది. 2019లో 353 సీట్లు రాగా ఈసారి 293కే పరిమితమైంది. మరోవైపు 2019లో కేవలం 52 సీట్లతో కుదేలైన కాంగ్రెస్ బలం ఈసారి దాదాపు రెట్టింపైంది. 99 సీట్లలో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి కూడా అంచనాలకూ మించి రాణించింది. 233 సీట్లు కైవసం చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో నిలిచింది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి అనూహ్యంగా కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 2019లో 62 సీట్లు నెగ్గిన పార్టీ ఈసారి ఏకంగా సగానికి సగం సీట్లు కోల్పోయి 33కే పరిమితమైంది. గత ఎన్నికల్లో చతికిలపడ్డ అఖిలేశ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ అక్కడ 38 స్థానాలతో దుమ్ము రేపింది. పశ్చిమబెంగాల్లో కూడా బీజేపీ అంచనాలను అందుకోలేక 12 స్థానాలతో సరిపెట్టుకుంది. మమతా సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లతో సత్తా చాటింది. స్మృతీ ఇరానీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఓటమి చవిచూశారు. ఈసారి లోక్‌సభ ఫలితాలను ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా ప్రతిఫలించలేకపోవడం విశేషం. మొత్తమ్మీద కేంద్రంలో పదేళ్ల ఏక పార్టీ పాలనకు కాలం చెల్లి తిరిగి నిజమైన సంకీర్ణ శకానికి తెర లేచింది. విపక్ష కూటమి కూడా పదేళ్ల తర్వాత గణనీయ శక్తిగా రూపుదిద్దుకుంది. అంతటితో ఆగకుండా కేంద్రంలో అధికారంపైనా కన్నేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి...! ఆకట్టుకున్న ఇండియా కూటమి ఏడు విడతల్లో సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగియడం తెలిసిందే. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఎన్డీఏ కూటమి ఆధిపత్యం 300లోపు స్థానాలకు పరిమితం కాగా ఇండియా కూటమి తొలి రౌండ్ నుంచే అనూహ్య రీతిలో ముందంజ వేసింది. క్రమంగా పుంజుకుంటూ 200 స్థానాలు దాటేసింది. చూస్తుండగానే 233కు చేరి పరిశీలకులను కూడా ఆశ్చర్యపరిచింది. ప్రధాని మోదీ వారణాసిలో తొలి రౌండ్లో వెనకబడ్డారు! చివరికి ఆయన నెగ్గినా మెజారిటీ మాత్రం బాగా తగ్గింది. 2019లో 4.79 లక్షల మెజారిటీ రాగా ఈసారి లక్షన్నర పై చిలుకుతో సరిపెట్టుకున్నారు. బీజేపీలో మోదీ కంటే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఎక్కువ మెజారిటీ రావడం విశేషం. మరోవైపు రాహుల్‌గాంధీ మాత్రం పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ భారీ విజయం సాధించారు. ఆయనకు కేరళలోని వాయనాడ్‌లో 3.64 లక్షలు, యూపీలోని రాయ్‌బరేలీలో 3.9 లక్షల మెజారిటీ రావడం విశేషం. కీలక రాష్ట్రాల్లో బీజేపీ కుదేలు కీలకమైన యూపీలో ఈసారి బీజేపీకి ఏకంగా 29 సీట్లకు కోత పడింది! మహారాష్ట్రలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి 48 స్థానాల్లో 2019లో 43 సీట్లు ఒడిసిపట్టిన ఎన్డీఏ ఈసారి కేవలం 17కు పరిమితమైంది! బీజేపీ బలం 23 నుంచి ఏకంగా 10కి తగ్గింది. అక్కడ కాంగ్రెస్ సీట్ల సంఖ్య 1 నుంచి ఏకంగా 13కు పెరిగింది. దాని భాగస్వాములైన శివసేన (యూబీటీ) 9, ఎన్సీపీ (ఎస్పీ) 7 సీట్లు గెలుచుకున్నాయి! బిహార్‌లోనూ ఎన్డీఏకు 9 సీట్లకు కోతపడింది. బీజేపీ 12, భాగస్వాములు జేడీ(యూ) 12, ఎల్జేపీ(ఆర్వీ) 5 సీట్లలో నెగ్గాయి. 2019లో క్లీన్‌స్వీప్ చేసిన రాజస్తాన్ (25)లో కూడా బీజేపీకి ఈసారి 11 సీట్లకు కోత పడింది. కర్నాటకలోనూ పార్టీ బలం 25 నుంచి 17కు తగ్గింది. బెంగాల్లో 6 స్థానాలు తగ్గాయి. మరో క్లీన్‌స్వీప్ రాష్ట్రం హరియాణా (10)లోనూ ఈసారి బీజేపీ ఐదే గెలిచింది. మధ్యప్రదేశ్‌లో మాత్రం మొత్తం 29 సీట్లూ నెగ్గి క్లీన్‌స్వీప్ చేసింది. గుజరాత్లో ఒక్కటి మినహా 24 సీట్లు గెలుచుకుంది. తూర్పు రాష్ట్రం ఒడిశా బీజేపీ నెత్తిన పాలు పోసింది. అక్కడి 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 20 దక్కాయి! ఏపీలో కూడా ఎన్డీఏ కూటమికి 21 సీట్లు దక్కాయి. తెలంగాణలోనూ 2019లో 4 సీట్లలో నెగ్గిన బీజేపీ ఈసారి 8 స్థానాలు గెలుచుకుంది. అయితే కేరళలో తొలిసారి బోణీ కొట్టినా తమిళనాట మాత్రం సున్నా చుట్టింది. మరోవైపు ఇండియా కూటమి కీలక రాష్ట్రాల్లో దుమ్ము రేపింది. తమిళనాట మొత్తం 39 స్థానాలూ కూటమి ఖాతాలోనే పడ్డాయి! యూపీలో 2019లో కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకున్న ఎస్పీ ఈసారి ఏకంగా 37 సీట్లు ఒడిసిపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం కూడా 1 నుంచి 7కు పెరిగింది. బెంగాల్లో టీఎంసీకి 7 సీట్లు, బిహార్‌లో కూటమికి 9 స్థానాలు పెరిగాయి. రాజస్తాన్‌లో 2019లో సున్నా చుట్టిన కాంగ్రెస్ ఈసారి 8 సీట్లు నెగ్గింది. హరియాణాలోనూ 5 స్థానాలు దక్కించుకుంది. కర్నాటకలో పార్టీ స్థానాలు ఒకటి నుంచి 8కి పెరిగాయి. ఓట్ల శాతం ఇలా... బీజేపీ ఈసారి 36.58 శాతం ఓట్లు సాధించింది. ఇది 2019తో పోలిస్తే 0.72 శాతం తక్కువ. 2019 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా పార్టీ ఓట్ల శాతం తగ్గిపోవడం విశేషం. కాంగ్రెస్ ఓట్ల శాతం మాత్రం 19.46 నుంచి 21.22కు పెరిగింది. యూపీలో దుమ్ము రేపిన సమాజ్‌వాదీ పార్టీ ఓట్ల శాతం 2.55 నుంచి 4.59కు పెరిగింది. మాయావతి సారథ్యంలోని బీఎస్పీ ఓట్లు మాత్రం 2.04 నుంచి 1.58కు తగ్గిపోయింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల శాతం 4.06 నుంచి 4.38కు పెరిగింది. జేడీ(యూ) ఓట్ల శాతం 1.45 నుంచి 1.25కి తగ్గింది. ఆప్ ఓట్ల శాతం 0.44 నుంచి 1.11కు పెరిగింది. దక్షిణాదిన తమిళనాడులో పాలక డీఎంకే ఓట్ల శాతం 2.34 నుంచి 1.82కు తగ్గింది. హస్తినలో నంబర్‌గేమ్! మోదీ కాళ్ల కిందకు నీళ్లు? ఆయనపై ఎన్డీఏలో అభ్యంతరాలు జాతీయ మీడియాలో వార్తలు దేశవ్యాప్తంగా సాధించిన అనూహ్య ఫలితాలతో జోష్‌లో ఉన్న ఇండియా కూటమి ఏకంగా కేంద్రంలో అధికారంపై కన్నేసినట్టు వార్తలొస్తున్నాయి! ఈ దిశగా జేడీ(యూ)తో పాటు పలు ఇతర ఎన్డీఏ భాగస్వాములతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. బీజేపీ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని సమాచారం. ఎన్డీఏ కూటమి సుస్థిరత కోసం పలు ఇండియా కూటమిలోని పక్షాలతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీలతోనూ బీజేపీ పెద్దలు ఇప్పటికే జోరుగా సంప్రదింపులకు సాగిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద హస్తినలో జోరుగా నంబర్‌గేమ్ సాగుతోందంటూ వస్తున్న వార్తలతో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా రంజుగా మారాయి. ఎన్డీఏనే వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ప్రధానిగా మోదీ అభ్యర్ధిత్వానికి జేడీ(యూ) వంటి భాగస్వామ్య పక్షాలు సుతరామూ అంగీకరించకపోవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి! ఈ నేపథ్యంలో హస్తినలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. 18వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 543) ఎన్డీఏ 291 (రంగు మార్చాలి. లేదంటే ఎన్డీఏ, ఇండియా కూటమి పక్కపక్కన విడిగా పెట్టుకోవాలి) బీజేపీ 241 టీడీపీ 16 జేడీ(యూ) 12 శివసేన 7 ఎల్జేపీ (ఆర్వీ) 5 జనసేన 2 జేడీ(ఎస్) 2 ఆరెల్డీ 2 ఎన్సీపీ 1 అప్నాదళ్ 1 ఏజీపీ 1 యూపీపీఎల్ 1 ఏజేఎస్‌యూపీ 1 హెచ్ఏఎం(ఎస్) 1 ఇండియా కూటమి 233 కాంగ్రెస్ 99 ఎస్పీ 37 టీఎంసీ 29 డీఎంకే 22 శివసేన (యూబీటీ) 9 ఎన్సీపీ (ఎస్పీ) 7 ఆర్జేడీ 4 సీపీఎం 4 ఆప్ 3 జేఎంఎం 3 ఐయూఎంఎల్ 3 సీపీఐ 2 సీపీఐ(ఎంఎల్)(ఎల్) 2 ఎన్సీ 2 వీసీకే 2 ఆరెస్పీ 1 కేసీ 1 ఆరెలీ్టపీ 1 బీఏడీవీపీ 1 ఎండీఎంకే 1 ఇతరులు 17 వైఎస్సార్సీపీ 4 మజ్లిస్ 1 అకాలీదళ్ 1 ఏఎస్‌పీకేఆర్ 1 వీఓటీపీపీ 1 జెడ్పీఎం 1 ఎస్కేఎం 1 స్వతంత్రులు 7 -
మార్కెట్ అల్లకల్లోలం
లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్‌యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్‌టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ రియాక్షన్
-
కిశోరీ భయ్యా మీరు గెలుస్తారని తెలుసు: ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ.. రెండు నియోజర్గాలో పార్టీ విజయ ఢంకా మోగించింది. రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడున్నర లక్షల మేజార్టీతో గెలుపొందారు. ఇటు అమేథీలోనూ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఈసారి బొల్తా కొట్టారు. దాదాపు 1.50 లక్షల ఓట్ల తేడాతో కిషోర్ లాల్ శర్మ చేతిలో చిత్తుగా ఓడారు. దీంతో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీని తిరిగి చేజిక్కించుకుంది.కిషోరీ లాల్ గెలుపుతో తరఫున విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. పార్టీ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘కిశోరీ లాల్ భయ్యా మీరు గెలుస్తారని నాకు తెలుసు. మీ గెలుపు విషయంలో నేనెప్పుడూ సందేహించలేదు. మీకు, అమేథీ నియోజకవర్గంలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు అభినందనలు’ అని రాసుకొచ్చారు.किशोरी भैया, मुझे कभी कोई शक नहीं था, मुझे शुरू से यक़ीन था कि आप जीतोगे। आपको और अमेठी के मेरे प्यारे भाइयों और बहनों को हार्दिक बधाई ! pic.twitter.com/JzH5Gr3z30— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 4, 2024 -
రాజ్యాంగాన్ని కాపాడటంలో తొలి విజయం సాధించాం: రాహుల్
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రాజ్యసభ సభ్యుడు జైరాం ఇతర నేతలతో మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ వర్సెస్ ప్రజలు అన్న రీతిలో ఎన్నికలు జరిగాయన మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇది మోదీ వ్యతిరేక తీర్పు అని తాము భావిస్తున్నట్లు చెప్పారు.ఈసారి ప్రజలు ఏ ఒక్క పార్టీకి మెజార్టీ ఇవ్వలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పోరాటం చేసిందన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని, ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని అన్నారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే యుద్ధం చేశామని, తమ పోరాటాన్ని ప్రజలు స్వాగతించారని తెలిపారు రాహుల్ గాంధీ. ఎన్నికలకు ముందు తమ పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారని, సీఎంలను జైలుకు పంపారని ప్రస్తావించారు. అన్ని వ్యవస్థలు తమకు వ్యతిరేకంగానే పనిచేశాయని అనఆరు. కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని తెలిపారు.లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుతంగా పోరాడిందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో తొలి విజయం సాధించామని పేర్కొన్నారు. మోదీని దేశ ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఇండియా కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యవస్థలపై, నిఘా సంస్థలపై చేసిన యుద్ధంగా భావిస్తామని చెప్పారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చార్యానికి గురిచేశాయి. 400పైగా సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చిన బీజేపీ.. 300 లోపు స్థానాలతోనే సర్ధిపెట్టుకుంది. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రతిపక్ష కూటమి పుంజుకుంది. 232 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు వెలువడాల్సి ఉంది. -
మైసూరు మహారాజు వడయార్ ఘన విజయం
లోక్‌సభ ఎన్నికల్లో మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఘన విజయం సాధిచించారు. మైసూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వడయార్ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై 1,39,262 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.ఈ ఎన్నికల్లో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ మొత్తం 7,95,503 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణకు 6,56,241 ఓట్లు వచ్చాయి. మైసూరు రాజ్యాన్ని వడయార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్ర్యం అనంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడయార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1974లో శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ రాజు అయ్యారు.1984-1999 లో కాంగ్రెస్ తరఫున మైసూరు ఎంపీగా గెలుపొందిన ఆయన 2013లో కన్నుమూశారు.శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ మరణం తర్వాత మైసూరు 27వ రాజుగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ పట్టాభిషిక్తుడయ్యారు. మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2016లో దుంగార్పుర్ యువరాణి త్రిషికను వివాహం చేసుకున్నారు. -
Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్
-
బీజేపీ దూకుడుకు దీదీ కళ్లెం
-
మల్కాజిగిరిలో ఈటల ఘన విజయం
మల్కాజిగిరి: మల్కాజిగిరిలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కాంగ్రెస్ అభ్యర్థి సునితా మహేందర్‌రెడ్డిపై 3.86 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఈటల స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింంది. గత ఎన్నికల్లో స్థానంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. -
మహబూబ్‌నగర్: హోరా హోరీ లెక్కింపులో డీకే అరుణ విజయం
మహబూబ్‌నగర్: హోరా హోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. అధికారికంగా ఫలితాలు వెలువడవలసి ఉంది. ఇక్కడ గెలుపునకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకుని చల్లా వంశీచంద్‌రెడ్డిని కాంగ్రెస్ తరఫున బరిలో దించారు. అయితే లెక్కింపు సమయంలో డీకే. అరుణ, వంశీచంద్ మధ్య విజయం దోబూచులాడింది. ఈవీఎం లెక్కింపుల్లో ఆమె కేవలం 1800 ఓట్ల ముందంజలో ఉన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 8000 లెక్కింపునకు ఉండేసరికి బీజేపీ శ్రేణుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఎట్టకేలకు హోరాహోరీగా సాగిన లెక్కింపులో 3636 ఓట్ల మెజార్టీతో డీకే అరుణను విజయం వరించింది. -
జీరో బీఆర్ఎస్.. ఆ మూడు అంశాలే దెబ్బ కొట్టినయా?
మూడు ఎనిమిది అయ్యింది. నాలుగు రెట్టింపయ్యింది. తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో 8 సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ సత్తా చాటింది. మరోవైపు బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఏకంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితాల్లో ఆద్యంతం అధికార కాంగ్రెస్‌తోనే కాషాయం పార్టీకి పోటీ నడిచింది. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది.తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది ఘోరమైన పరిస్థితి. మెదక్ సీటులో.. అదీ కొద్దిసేపు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోయినట్లు కనిపించినా ఓటమి తప్పలేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయం స్ఫూర్తితో.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో మూడు స్థానాలను మాత్రమే గెల్చుకున్న హస్తం పార్టీ.. ఈసారి ఏకంగా ఎనిమిది స్థానాల్లో, అదీ భారీ మెజారిటీతో అభ్యర్థుల్ని గెలిపించుకోలిగింది. ఇక గులాబీ పార్టీ తొమ్మిది నుంచి జీరోకి పడిపోయి ఘోరమైన ఫలితం చవిచూసింది. బీఆర్ఎస్ నుంచి ఐదు స్థానాలను కాంగ్రెస్ గెల్చుకోగా.. మిగిలిన నాలిగింటిని బీజేపీ దక్కించుకుంది. ఎంఐఎం హైదరాబాద్ సీటును నిలబెట్టుకుంది.👉 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో గులాబీ పార్టీలో నాయకత్వ లోపం కనిపించింది. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుని విమర్శల పర్వమే కొనసాగింది తప్ప కేడర్‌ను బలపర్చుకోవాలనే ప్రయత్నమూ కనిపించలేదు.👉 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పైనే బీఆర్ఎస్ విమర్శలు కనిపించాయి. బీజేపీపై అసలు విమర్శలు గుప్పించకపోవడం కూడా మైనస్ అయ్యింది. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్.. తదనంతర పరిణామాల నడుమ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ ఇలా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. అంతేకాదు దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది.👉 సరిగ్గా ఎన్నికల ముందే బీఆర్ఎస్కు జంప్ జిలానీలు తలపోటుగా పరిణమించారు. దీంతో.. బీఆర్ఎస్కు సరైన అభ్యర్థితత్వమే లేకుండా పోయింది. ఇటు కాంగ్రెస్‌కు, అటు బీజేపీకి ఈ అంశం బాగా కలిసొచ్చాయి.లోక్‌సభ ఎన్నికల్లో పడిపోయిన బీఆర్ఎస్ ఓట్ల శాతంబీఆర్ఎస్కు 16.70 శాతం ఓట్లుకాంగ్రెస్కు 40.11 శాతం ఓట్లుబీజేపీకి 35.01 శాతం ఓట్లుబీజేపీ కన్నా ఐదు శాతం ఎక్కువ ఓట్లు సాధించిన కాంగ్రెస్ -
ఒడిశాలో 24 ఏళ్ల తర్వాత మారనున్న ప్రభుత్వం
ఒడిశాలో అధికార బీజూ జనతాదళ్ (బీజేడీ)కి ఎదురు దెబ్బ తగిలింది. 24 ఏళ్ల తర్వాత తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తాజాగా విడుదలైన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది. మధ్నాహ్యం 4.50 గంటల సమయానికి ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 80 స్థానాల్లో, బీజూ జనతదాళ్ 52, కాంగ్రెస్ 15 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. తాజా అసెంబ్లీ ఫలితాలతో బీజేపీ అధికారం చేపట్టడం అనివార్యమైంది.లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ 137 స్థానాల్లో గెలుపొందగా 158 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతుండగా.. ఒడిశా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఊహించని ఫలితాల్ని రాబట్టింది. 21 లోక్‌సభ స్థానాలకు బీజేపీ 19 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుండగా.. బీజూ జనతాదళ్, కాంగ్రెస్‌లు చెరోస్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి.ఒడిశా బీజేపీ సీఎం ఎవరంటే?ఒడిశా బీజేపీ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తుందనే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్.. పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల ఆధారంగా.. ఒడిశా సీఎం రేసులో నలుగురు అభ్యర్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో బీజేపీ కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ జువల్ ఓరం, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బైజయంత్ పాండా,బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్‌లు ఉన్నారు. అయితే ఈ నలుగురు ఒడిశా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో లీడింగ్‌లో ఉన్నారు. పట్నాయక్ ఆశలు అడియాశలుతాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో 24 ఏళ్లగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఆశలు అడియాశలయ్యాయి. ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ 23 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. అయితే ఐదోసారి అధికార పీఠాన్ని అధిష్టించి.. సిక్కిం మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న (సీఎంగా 24 ఏళ్ల 165 రోజుల) రికార్డును అధిగమించాలన్న నవీన్ పట్నాయక్ ఆకాంక్ష కలగానే మిగిలింది. -
భారీ మెజారిటీతో వికసించిన కమలం
-
Lok Sabha Elections: లక్ష్యాన్ని చేరుకోని ఇరు పార్టీలు!
దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. అబ్ కి బార్... 400 పార్’ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ కూటమి (ఎన్డీయే) ఆ లక్ష్యాన్ని అందుకునే లక్షణాలు దాదాపుగా కనిపించకపోగా... అధికార పక్షాన్ని గద్దె దింపుతాం... 295 స్థానాలతో పగ్గాలు చేపడతాం అని బీరాలకు పోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి (ఇండియా) కూడా తన లక్ష్యానికి దగ్గరలోనే నిలిచిపోయింది. కాకపోతే గత ఎన్నికల్లో కేవలం 52 స్థానాలు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కోల్పోయిన కాంగ్రెస్ ఈ సారి వంద సీట్ల వరకూ సాధించడం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతానికి ఎన్డీయే, ఇండియా కూటమి భాగస్వాముల్లో ఫిరాయింపుల్లాంటివేవీ కనిపించడం లేదు కానీ.. ఫలితాలన్నీ వెలువడిన తరువాత అసలు రాజకీయం మొదలకానుంది. సరే.. రెండు ప్రధాన కూటములు తమ తమ లక్ష్యాలను సాధించలేక పోయాయి? ఎందుకు? అతి విశ్వాసమా? లేక వ్యూహ రచన లోపమా?ఎన్డీయేలో ఏం కొరవడింది?ముందుగా ఎన్డీయే కూటమి విషయం చూద్దాం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఎన్నికల రణనీతిని సమర్థంగా అమలు చేయడంలో మోడీ చాలా దిట్ట అన్న పేరు ఉంది. మోడీ-అమిత్ షాల ద్వయం అప్పట్లో కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితం కాగా.. తరువాతి కాలంలో బీజేపీ వెనకుండి నడిపించే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల బలాన్ని, క్రమశిక్షణను ఆసరాగా చేసుకుని జాతీయ స్థాయి ఎన్నికల్లోనూ తమ సత్తా చాటగలిగారు. ప్రతి నియోజకవర్గాంలోని ఒక్కో పోలింగ్ బూత్‌కు బాధ్యులుగా కొందరు కార్యకర్తలను నియమించడం... ప్రణాళికాబద్ధంగా ప్రచారం సాగించడం... తమకుతాము ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం మోడీ-అమిత్ షాల శైలి రాజకీయాలని అర్థమవుతుంది. ఈ శైలితోనే మోడీ ప్రధానిగా రెండుసార్లు గెలవగలిగారనడం అతిశయోక్తి కాదు. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303కుపైగా సీట్లు సాధించి రికార్డు సృష్టించింది కూడా. అయితే ఈ విజయంలో భాగమైన చాలామంది భాగస్వామ్య పక్షాలను నిలబెట్టుకోలేకపోయిందన్నది కూడా నిష్టూర సత్యం. భాగస్వామ్య పక్షాలు చాలావరకూ తప్పుకున్న నేపథ్యంలో బీజేపీ కొత్త మిత్రులను వెతుక్కునే ప్రయత్నాలు చేసింది. కాకపోతే ఈ మిత్రత్వం ప్రభావం తక్కువే అన్నది తాజా ఫలితాల నేపథ్యంలో స్పష్టమవుతోంది.కాంగ్రెస్ మాటేమిటి?ఒకప్పుడు దేశంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలు (రాజీవ్ గాంధీ హయాంలో 425) సాధించిన... దశాబ్దాల పాటు దేశ రాజకీయాలను ఏకపక్షంగా శాంసిన కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో గణనీయంగా బలహీన పడిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. పార్టీ రాజకీయాలన్నింటికీ ఢిల్లీని కేంద్రం చేసుకోవడం.. నమ్మకంగా పనిచేసిన సీనియర్ నేతలను నిరాదరించడం, సమయానకూలంగా వ్యూహాలను, కార్యాచరణను మార్చుకోకపోవడం వంటివన్నీ కాంగ్రెస్ పతనానికి కారణాలుగా చెప్పవచ్చు. అయితే 2019 ఎన్నికల్లో అతి స్వల్ప స్థానాలకు పరిమితమైన తరువాత గానీ ఈ పార్టీ తగిన పాఠలు నేర్చుకోలేకపోయింది. ఎన్డీయే దెబ్బకు కుదేలు కాగా మిగిలిన జవసత్వాలు కొన్నింటినైనా ఒక్కటి చేసుకుని మళ్లీ పైకి ఎదిగే ప్రయత్నాలు మొదలుపెట్టంది. పార్టీ అధ్యక్షుడిగా వైఫల్యాలు మూటకట్టుకున్న రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన భారత్ జోడో యాత్ర కానీ.. భారత్ న్యాయ యాత్ర కానీ రాహుల్ గాంధీపై అప్పటివరకూ ఉన్న ‘పప్పు’ ముద్రను తొలగించడంలో ఎంతో ఉపకరించిందనడంలో సందేహం లేదు. గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ దశ తిరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. నేతలందరూ ఐకమత్యంగా నిలబడి పోరాడితే విజయావకాశాలు పెరుగుతాయని తెలంగాణ విజయంతో అర్థమయింది. ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది మొదలు కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త జోష్‌తో పనిచేసిందని చెప్పాలి. బీజేపీ ప్రచారానికి మాటకు మాట రీతిలో జవాబివ్వడంతోపాటు ప్రచారంలోనూ కొత్త పుంతలు తొక్కింది ఈ పార్టీ. అదే సమయంలో ప్రతిపక్షాలన్నింటినీ ఒక దగ్గర చేర్చేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించాయని చెప్పాలి. దళిత నేత మల్లికార్జున ఖర్గేను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించడం, ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించబోమన్న హామీల నేపథ్యంలో ఆప్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ వంటివి ఇండియా కూటమిలో భాగంగా నిలిచాయి. ఎన్నికల్లోనూ ఐకమత్యంతో పోరాడాయి. అంతిమ ఫలితాలేమైనప్పటికీ కాంగ్రెస్, ఇండియా కూటముల ప్రదర్శన మునుపటి కంటే మెరుగుపడటం ఎన్నో రాజకీయ పాఠాలు నేర్పుతుంది. -
భారీ మెజారిటీతో వికసించిన కమలం
-
లోక్‌సభ ఫలితాలపై కేటీఆర్ రియాక్షన్.. ‘ఎదురుదెబ్బ ఖచ్చితంగా నిరాశే’
హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. తెలంగాణలోని 17 స్థానాలో ఒక్కస్థానంలో కూడా ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో విజయం సాధించలేదు. ఫలితాల్లో బీజేపీ-కాంగ్రెస్ నువ్వా- నేనా అని పోటీపడుతుంటే బీఆర్ఎస్ చాలా చోట్ల మూడో స్థానానికి పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘ టీఆర్ఎస్ స్థాపించిన 24 ఏళ్లలో అన్నీ చూశాం. విజయాలు, అనేక ఎదురుదెబ్బలు ఎన్నో చూశాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మన అతిపెద్ద విజయంగా మిగిలిపోతుంది. ప్రాంతీయ పార్టీ కావడంతో వరుసగా రెండు రాష్ట్ర ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించింది. 2014లో 63/119 స్థానాలు, 2018లో 88/119 స్థానాలు, ప్రస్తుతం, ప్రధాన ప్రతిపక్షం 1/3వ స్థానాలతో 39/119 ( 2023లో అసెంబ్లీ ఎన్నికలు) నేటి ఎన్నికల ఎదురుదెబ్బ ఖచ్చితంగా చాలా నిరాశపరిచింది. కానీ మేము శ్రమిస్తూనే ఉంటాము. ఫీనిక్స్ లాగా మళ్ళీ పైకి లేస్తాము’’ అని కేటీఆర్ అన్నారు. -
రేపు NDA మిత్రపక్షాల భేటీ
-
ఎన్టీయే మిత్రపక్షాలకు గాలం.. ఇండియా కూటమి మాస్టర్‌ప్లాన్!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బోల్తా పడ్డాయి. జాతీయ సర్వే సంస్థలు ఏకపక్షంగా ఎన్డీయేకు మెజారిటీ కట్టబెడితే.. ఫలితాల్లో మాత్రం ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఇక.. ఫలితాల లెక్కింపు ముగింపు దశకు చేరుకుంటున్న వేళ పార్టీల సరళిలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కూడా ఒక మాస్టర్‌ప్లాన్ రూపొందించుకుని దాన్నే అనుసరించే ప్ర యత్నాల్లో ఉన్నట్లు సమాచారం.లోక్‌సభ ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారవుతున్నాయి. '400 సీట్లకు పైనే' అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే జస్ట్ మెజారిటీకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలో ఈసారి చతికిలపడింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఆధిక్య స్థానాల్లో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. నేటి సాయంత్రం మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం కానుండగా.. రేపు ఎన్డీయే మిత్రపక్షాలు భేటీ కానున్నాయి. ఎన్టీయే కూటమి తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నాయి.ఇక.. ఇండియా కూటమి మరో అడుగు ముందుకు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పుంజుకోవడంతో ఎన్డీయే కూటమిలోని బీజేపీ భాగస్వామ్య పక్షాలకు గాలం వేయడాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఇండియా కూటమి కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్డీయే కూటమిలో ఉన్న నితిష్‌ను ఇండియా కూటమి తమ వైపు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. నితీష్‌కు ఉప ప్రధాని పదవిని కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అదే విధంగా ఏపీలో చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించినట్లు భోగట్టా. బాబు తమ కూటమిలో చేరితో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆశచూపెట్టబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడితో మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతోనూ ఇండియా కూటమి ప్రతినిధులు సంప్రదింపులు జరపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల ముందే జేడీయూ, టీడీపీలు ఎన్డీయే కూటమితో కలిశాయికాగా బిహార్‌లో 16 లోక్‌సభ స్థానాలకు గానూ నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 14 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇటు టీడీపీ కూడా 14 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీయూ, టీడీపీ దాదాపు 28 లోక్‌సభ స్థానాలను కలిగి ఉండటంతో.. వీరు ఇండియా కూటమికి మారితే కింగ్మేకర్లుగా మారే అవకాశం ఉంది. ఈ లెక్కన మున్ముందు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. -
మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘన విజయం
మెదక్: మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పరిపాటి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలోకి దిగిన ఓటమిపాలయ్యారు. -
లోక్‌సభ ఎన్నికలు 2024 : విమెన్ పవర్ ట్రెండ్
2024 సార్వత్రిక ఎన్నికల పోరులో దేశవ్యాప్తంగా తాజా ట్రెండ్ ప్రకారం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 74 మంది మహిళా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు.భారత లోక్‌సభ ఎన్నికలలో మహిళా ఓటర్లు, పాత్ర గణనీయంగా పెరిగినప్పటికీ ఈస్థాయిలో వారికి ప్రాతినిధ్య మాత్రం పెరగడం లేదు. ఈ ఏడాది ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. 2019 ఎన్నికలలో 726 మంది మహిళలు పోటీ చేశారు. వీరిలో 78 మంది మాత్రమే పార్లమెంటు సభ్యులు (ఎంపీ) గా ఎన్నికయ్యారు.లోక్‌సభ , రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని లక్ష్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాత ఆమోదించుకున్నప్పటికీ ఇది అమలుకు నోచుకోలేదు అనడానికి ఈ ఏడాది ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యమే పెద్ద ఉదాహరణ. 2019 ఎన్నికలతో పోలిస్తే మహిళల కేటాయింపు స్వల్పంగా మాత్రమే పెరిగింది. మొత్తం 8,337 మంది అభ్యర్థుల్లో కేవలం 797 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే మహిళల సంఖ్య 1957లో 3 శాతం ఉండగా, 2024 నాటికి దాదాపు 10 శాతానికి పెరిగింది. కానీ విజేతల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది.థింక్ ట్యాంక్ PRS విశ్లేషణ ప్రకారం గత 15 ఏళ్లలో ఈ ట్రెండ్‌లో పెరుగుదల చాలా స్వల్పం. 2009లో మొత్తం అభ్యర్థులల 7 శాతం మహిళలు ఉండగా, 2024లో 9.6 శాతానికి పెరిగింది. 2014లో 8 శాతంగా ఉన్న మహిళా ప్రాతినిధ్యం 2019లో 9 శాతానికి చేరింది. 1962లో, 74 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 36 మంది విజయం సాధించారు. అత్యధిక స్ట్రైక్ రేట్ 48.6శాతంగా ఉండటం గమనార్హం. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇపుడు 2024లో పొలిటిక్ క్వీన్‌గా అవతరించింది. బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానం విజయం సాధించారు.పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ, జాదవ్‌పూర్ , మేదినిపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో తృణమూల్ కాంగ్రెస్‌కు ముగ్గరు యాక్టర్ కం పొలిటీషియన్స్ రచనా బెనర్జీ, సయానీ ఘోష్ , జూన్ మలియా గెలుపు దిశగా ఉన్నారు.బాన్సూరి స్వరాజ్: దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 23000 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి వెనుకంజలో ఉన్నారు.సుప్రియా సూలే: బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్సీపీ నేత సుప్రియా సూలే 20 వేల ఆధిక్యంతో గెలుపు.హేమమాలిని: మధుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ హేమమాలిని 1,70,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధన్గర్ వెనుకంజలో ఉన్నారు.మహువా మొయిత్రా: కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా 50,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్ వెనుకంజలో ఉన్నారు. హర్యాలోని సిరీ ఎంపీ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ 4500ఓట్ల మెజార్టీతో గెలుపు -
హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం మరోసారి ఘన విజయం సాధించింది. 3.38 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో మాధవీ లతపై గెలుపొందారు. దీంతో ఆయన ఈ స్థానంలో 5వసారి విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ నుంచి పోటీచేసిన కొంపెల్లి మాధవీలత, బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ మహ్మద్ వలీవుల్లా సమీర్ ఓటమిపాలు అయ్యారు. -
నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ విజయం
నిజామాబాద్: నిజామాబాద్‌లో బీజేపీ విజయం సాధించించింది. బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలుపుకుంది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 1,25,369 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీ. జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజీరెడ్డి గోవర్థన్ ఓటమిపాలయ్యారు. -
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ
-
ఉత్తరాది రాష్ట్రల్లో తగ్గిన BJP, మోదీ చరిష్మా
-
బ్యాగ్ సర్దుకోవాలన్నారు.. కంగనా గెలిచి చూపించింది
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన నటి 'కంగనా రనౌత్' విజయం సాధించింది.కంగనా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై తప్పకుండా విజయం సాధిస్తానని చెబుతూనే ఉంది. అన్నట్టుగానే ఇప్పుడు ఈమె సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో కంగనాను బ్యాగ్ సర్దుకుని బయలుదేరాలి అని ఎగతాళి చేశారు. ఈ వ్యాఖ్యలను కంగనా తీవ్రంగా విమర్శించారు.ఒక మహిళ గురించి ఇంత తక్కువ మాట్లాడటం వల్ల కలిగే పరిణామాలను వారు తప్పకుండా చవిచూడాల్సి వస్తుంది. ఈ రోజు రాబోయే ఫలితాలే దానికి నిదర్శనం అని కంగనా అన్నారు. ప్రారంభం నుంచి బీజేపీ ప్రభుత్వం గెలుస్తుందని, మరోమారు మోదీ ప్రధాని అవుతారని కంగనా చెబుతూనే ఉంది. -
భార్య కోసం పొర్లుదండాలు.. ప్చ్, ఫలించని పూజలు!
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రకారం ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉంది. మరోసారి నరేంద్రమంత్రి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటూ సినీ నటుడు శరత్‌కుమార్ సోమవారం నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.తమిళనాడులోని విరుదునగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న తన సతీమణి, నటి రాధిక విజయం సాధించాలని, అలాగే వారణాసిలో నరేంద్రమోదీ గెలవాలని ఆలయంలో పొర్లుదండాలు పెట్టారు. అనంతరం భార్యతో కలిసి గుడిలో విశేష పూజలు నిర్వహించారు.ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌లో విరుదునగర్‌లో రాధిక మూడోస్థానానికి పడిపోయారు. విజయప్రభాకరన్ (డీఎండీకే), మాణిక్యం ఠాగూర్ (కాంగ్రెస్)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి మధ్య ఓట్ల తేడా 32గా ఉంది. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరికి గెలుపు తథ్యమని తెలుస్తోంది. రాధిక ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. Actor Sarathkumar visited the Sri Parasakthi Mariamman temple in Virudhunagar to pray for his wife and NDA candidate Radhika's success, as the counting of votes will be held on June 4.#actor #sarathkumar #visited #srioarasakthitemplE #wifesuccess @radhikasarath pic.twitter.com/eLJ5KbXEB8— Pradeep (@PRADEEPDEE2) June 3, 2024చదవండి: 100 మార్క్ దాటనున్న కాంగ్రెస్ : 2014 తరువాత ఇదే తొలిసారి -
తెలంగాణలో తొలి విజయం: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి భారీ గెలుపు
ఖమ్మం: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి విజయం నమోదైంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ విజయం సాధించారు. సుమారు 4,67,847 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. రఘురాంరెడ్డి గెలుపు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు బాధ్యతలు తీసుకొని ప్రచారం చేశారు. ఈ స్థానం ఇన్చార్జీ పొంగులేటి శ్రీనివాస్ అన్నీ తానై వ్యహరించి రఘురాంరెడ్డి గెలుపులో కీలకం అయ్యారు. సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే రఘురాంరెడ్డి. మంత్రి పొంగులేటికి వియ్యంకుడు అవుతారు.కాంగ్రెస్: 759603బీఆర్ఎస్: 297592బీజేపీ: 117075పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...కాంగ్రెస్: 7326బీఆర్ఎస్: 1490బీజేపీ: 1561 -
భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న త్రిపుర మాజీ సీఎం..
ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ముందంజలో ఉన్నారు. దిగ్గజ నేతలైన మోదీ, రాహుల్ గాంధీ వారి వారి నియోజక వర్గాల్లో దూసుకెళ్తున్నారు. త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది .2018 నుంచి 2022 వరకు త్రిపుర ముఖ్యమంత్రిగా పని చేసిన బిప్లబ్ కుమార్ దేబ్.. త్రిపుర పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నిలిచారు. ఈయన ఇప్పటికే తన సమీప ప్రత్యర్థి ఆశిష్ కుమార్ సాహా కంటే.. 5,70,071 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.అదే సమయంలో త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానంలో, బీజేపీ అభ్యర్థి కృతి దేవి డెబ్బర్మన్ తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ(ఎం)) రాజేంద్ర రియాంగ్‌పై 2,92,164 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.Former Tripura CM and BJP candidate from West Tripura Lok Sabha constituency, Biplab Kumar Deb leading from this seat with a margin of 5,70,071 votes(file pic) #LokSabhaElections2024 pic.twitter.com/CBVyvLRMa5— ANI (@ANI) June 4, 2024 -
లోక్‌సభ ఎన్నికల్లో నోటా సంచలనం
ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకునే హక్కు ప్రతీ ఓటర్‌కు ఉంది. అలాగే.. ఏ అభ్యర్థి నచ్చకుంటే నోటా(None Of The Above)కు ఓటేయొచ్చు. ఇందుకోసమే 2013లో నోటాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో నోటా సరికొత్త రికార్డు సృష్టించింది.మధ్యప్రదేశ్ ఇండోర్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఏకంగా నోటాకు లక్షన్నరకు పైగా ఓట్లు పడ్డాయి. విశేషం ఏంటంటే.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ 9,90,698 ఓట్లు పోల్‌కాగా, రెండో స్థానంలో నోటా ఓట్లు(1,72,798) ఉన్నాయి. మూడో స్థానంలో బీఎస్సీ అభ్యర్థి సంజయ్ సోలంకీ 20,104 ఓట్లతో నిలిచారు.విచిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ తమ ఓట్లను నోటాకే ఓటేయాలని ప్రచారం చేయడం. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఇక్కడ నామినేషన్ వేసిన అక్షయ్ కంటీ బామ్.. చివరి నిమిషంలో తన నామినేషన్ విత్‌డ్రా చేసుకుని బీజేపీలో చేరారు. ఇది కాంగ్రెస్‌కు పెద్ద షాకే ఇచ్చింది. ఈ పరిణామంపై ఇక్కడి నుంచి ఏడుసార్లు నెగ్గిన అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక్కడి నుంచి ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావించినా.. అందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అంగీకరించలేదు. దీంతో అనివార్యంగా పోటీ నుంచి వైదొలగింది. అయితే బరిలో నిలిచిన వాళ్లకు మద్దతు ఇవ్వకుండా.. నోటాకు ఓటేయాలని ప్రచారం చేసింది కాంగ్రెస్. తద్వారా తమ పార్టీ అభ్యర్థిని లాక్కెల్లిన బీజేపీకి నోటా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రయత్నించింది.నోటా చరిత్ర తిరగేస్తే..2019లో బీహార్ గోపాల్‌గంజ్(ఎస్సీ)లో 51,660 నోటా ఓట్లు పడ్డాయి. ఇది నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో 5 శాతంఅక్కడ జేడీయూ అభ్యర్థి డాక్టర్ అలోక్ కుమార్ సుమన్ 5,68,160 ఓట్లతో గెలుపొందారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నీలగిరిలో 46, 559 నోటా ఓట్లు పడ్డాయి. -
నల్గొండ: కాంగ్రెస్ అభ్యర్తి రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం
సాక్షి,నల్గొండ: నల్లగొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కందూరు రఘవీర్‌రెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్ పూర్తి కాగా.. 5,52,659 ఓట్లతో భారీ ఆధిక్యంతో రఘువీర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డికి ఇప్పటివరకు 1,59,864 పైగా ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.మరో పార్టీ బీఆర్ఎస్ అభ్యర్తి కంచర్ల కృష్ణారెడ్డికి 219605 ఓట్లు వచ్చాయి. తండ్రి జానా రెడ్డి అండదండలతో బరిలో దిగిన రఘువీర్ రెడ్డి తొలి ఎన్నికల పోటీలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీతో భారి గెలుపును నమోదు చేయటం గమనార్హం. -
ఓటమి దిశగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
కాంగ్రెస్ కంచుకోట అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2024 ఎన్నికల్లో ప్రతిష్టాత్మక పోరుగా భావిస్తున్న అమేధీ నుంచి ఆమె వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిదిశగా పయనిస్తున్నారు.. కి కాంగ్రెస్ అభ్యర్థి, గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్ శర్మ 28వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నువ్వే నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో ఉత్కంఠగా మారింది.శర్మకు గత 40 సంవత్సరాలుగా అమేథీతో అనుబంధం ఉంది. అమేథీలో ప్రియాంక గాంధీ వాద్రా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమేథీకి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన రాహుల్ 2019లో ఇరానీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇండియా కూటమి దాదాపు226పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు 2019లో భారీ మెజార్జీసాధించిన బీజేపీ గతంతో పోలిస్తే 61 సీట్లతో నష్టంతో కేవలం 291 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారం పీఠం ఎవరికి దక్కనుంది అనేదానిపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమేథీ చరిత్ర ఇదీ1980లో సంజయ్ గాంధీ విజయంతో వారసత్వం ప్రారంభమైంది. అతని ఆకస్మిక మరణం తరువాత, అతని సోదరుడు రాజీవ్ గాంధీ 1981 ఉప ఎన్నికలలో విజయం సాధించారు మరియు 1984, 1989 , 1991లో విజయం సాధించారు. రాజీవ్ హత్య తర్వాత, కుటుంబ విధేయుడైన సతీష్ శర్మ 1991 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో సోనియాగాంధీ, 2004, 2009, 2014లో రాహుల్‌గాంధీ అమేథీ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నారు. -
దూసుకెళ్తున్న స్వతంత్య్ర అభ్యర్థి 'అమృత్‌పాల్ సింగ్'
ఎలక్షన్ కౌటింగ్ జరుగుతూ ఉంది. జాతీయ పార్టీల నాయకులు మాత్రమే కాకుండా స్వతంత్య్ర అభ్యర్థులు కూడా తమదైన రీతిలో దూసుకెళ్తున్నారు. ఈ జాబితాలో ఖలిస్థానీ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ డి చీఫ్ 'అమృత్‌పాల్ సింగ్' ఉన్నారు.పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి పోటీ చేసిన 'అమృత్‌పాల్ సింగ్' 50,405 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత కుల్బీర్ సింగ్ జిరా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కూడా వెనుకంజలో ఉన్నారు. 2019లో ఖాదూర్ సాహిబ్ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన జస్బీర్ సింగ్ గిల్ గెలుచుకున్నారు.Lok Sabha polls: Jailed pro-Khalistani separatist Amritpal Singh leads from Khadoor Sahib seat with over 50,000 votesRead @ANI Story | https://t.co/Ss7uSG3mZg#LokSabhaPolls #AmritpalSingh #Elections pic.twitter.com/rdUudrkviY— ANI Digital (@ani_digital) June 4, 2024 -
కేసీఆర్ రికార్డు బ్రేక్.. కరీంనగర్లో బండి సంజయ్ భారీ మెజార్టీ
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ ఆల్ టైం రికార్డ్ మెజారిటీతో విజయం సాధించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరిట ఉన్న అత్యధిక రికార్డును బ్రేక్ చేశారు. 2006 ఉపఎన్నికలో 2 లక్షల 1వేయి 582 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ విజయం సాధించారు. 2014లో వినోద్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంకా తుది ఫలితం వెలువడకముందే 2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో బండి సంజయ్ రికార్డు కొల్లగొట్టారు.ఇక.. మంగళవారం లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి బీజేపీ స్పష్టమైన మెజార్టీ కనబరుస్తోంది. ఇక.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి బి. వినోద్ కుమార్ వెనకంజలో ఉన్నారు. ఈ ట్రెండ్ చూస్తే.. బండి సంజయ్ రెండోసారి కరీంనగర్ పార్లమెంట్ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది. -
పదేళ్ల తర్వాత సెంచరీ కొట్టిన కాంగ్రెస్
2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి, అప్కీబార్ 400 పార్అంటూ బరిలోకి దిగిన బీజేపీకి భారీ షాకిస్తోంది. 2024 ఎన్నిల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 100 మార్క్‌ను దాటే దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 227కు పైగా సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎన్డీఏ 292 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు పోటీచేసిన రెండు స్థానాల్లో రాహుల్‌గాంధీ (వాయనాడ్ , రాయబరేలీ) గెలుపుదిశగా పయనిస్తున్నారు. ఒకదశలో వారణాసిలో ప్రధాని మోదీ, తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కంటే 6223 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అలాగే యూపీలో లోక్ సభ, మహారాష్ట్ర ఫలితాలు సంచలనంగా మారబోతున్నాయి.2014లో కేవలం 44, 2019 ఎన్నికల్లో 52 సీట్లు గెలుచుకున్నకాంగ్రెస్ 2024లో 100కు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2009లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లీడ్‌గా 206 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.2014లో ఏం జరిగింది?2014లో కాంగ్రెస్ - అప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో 'మోడీ వేవ్' నేపథ్యంలో భారీ పరాజయాన్ని చవిచూసింది, 162 సీట్లు కోల్పోయింది దాదాపు 9.3 శాతం ఓట్లు పడిపోయాయి.పశ్చిమాన గుజరాత్ , రాజస్థాన్ నుండి తూర్పున బిహార్ , జార్ఖండ్ , మధ్యప్రదేశ్ వరకు హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోబీజేపీ క్లీన్ స్విప్ చేసింది. దేశంలోని 543 సీట్లలో 336 సీట్లు గెలుచుకునే మార్గంలో పదేళ్ల క్రితం బీజేపీ ఈ రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ సొంతంగా 282 సీట్లు గెలుచుకుంది.ఎన్డీయే యూపీలో 73, మహారాష్ట్రలో 41, బీహార్‌లో 31, మధ్యప్రదేశ్‌లో 27 సీట్లు గెలుచుకుంది. గుజరాత్‌లోని 26, రాజస్థాన్‌లో 25, ఢిల్లీలో ఏడు, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు, ఉత్తరాఖండ్‌లో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది జార్ఖండ్‌లోని 14లో 12, ఛత్తీస్‌గఢ్‌లోని 11లో 10, హర్యానాలోని 10 సీట్లలో ఏడు గెలుచుకుంది.2019లో ఏం జరిగింది?బీజేపీ సొంతంగా 303 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి 353 సీట్లు గెలుచుకుంది. యూపీలో 74, బీహార్‌లో 39, మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలు కైవసం చేసుకోవడంతో మరోసారి హిందీ బెల్ట్ కాంగ్రెస్ ఆశలను దెబ్బతీసింది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ,ఢిల్లీలో కూడా 77 స్థానాలను గెలుచుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొమ్మిది, జార్ఖండ్‌లో 11 స్థానాలను కలుపుకుంటే బీజేపీ ఈ బెల్ట్‌లో 238 సీట్లు సాధించింది. 2019లో అమేథీ నియోజకవర్గం బీజేపీ స్మృతి ఇరానీ చేతిలో ఘోరంగా ఓటమిని చవిచూశారు రాహుల్‌గాంధీ. -
#ElectionsResults: సెకనుకు 2లక్షల మంది వీక్షణ
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లెక్కింపులో పారదర్శకత పాటిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకోసం అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లను అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపింది. ఓట్ల లెక్కింపుపై మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. ఈ సందర్భంగా.. ఈసీ వెబ్‌సైట్‌ను సెకనుకు 2లక్షల మంది చూస్తున్నారని తెలిపారాయన. అలాగే.. కౌంటింగ్‌ను ఈసీ బృందాలు వర్చువల్‌గా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.