నేడు ఇండియా కూటమి సమావేశం.. కీలక వ్యూహాలపై చర్చ! | INDIA Bloc meeting in Delhi over discussion for next steps after favourable outcome | Sakshi
Sakshi News home page

నేడు ఇండియా కూటమి సమావేశం.. కీలక వ్యూహాలపై చర్చ!

Published Wed, Jun 5 2024 10:05 AM | Last Updated on Wed, Jun 5 2024 10:20 AM

INDIA Bloc meeting in Delhi over discussion for next steps after favourable outcome

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ  ఇండియా కూటమి 232 సీట్లను గెలుచుకుంది. 400 సీట్లలో విజయం సాధిస్తామనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్‌ దాటి 294 సీట్లకు పరిమితమైంది.

 

ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం భారీగా లేకపోవడంతో ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చలు ప్రారంభించాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఎటువంటి వ్యూహాలు అమలు పర్చాలనేదానిపై ఇండియా కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం.

కూటమి గెల్చుకున్న సీట్ల సంఖ్య గతంతో కంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో రాజకీయ మార్పులు జరగనున్నాయని ఎన్సిపీ (శరద్‌ చంద్ర పవార్‌) పార్టీ చీఫ్‌ శరద్ పవార్‌ మంగళవారం పేర్కొన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి తీసుకునే నిర్ణయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఇక.. ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్, మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, చంపయి సొరేన్, ఉద్ధవ్‌ ఠాక్రే, అఖిలేశ్‌ యాదవ్, సీతారాం ఏచూరి, డి.రాజా తదితర నేతలు హాజరుకానున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలు బీజేపీ గెలువకపోటంతో ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలు పార్టీల కీలక నేతలు ఢిల్లీకి పయణమై చేరకుంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement