Indian National Developmental Inclusive Alliance(INDIA)
-
ON-OP: అదే జరిగితే మళ్లీ కథ మొదటికే!
దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక నిర్వహించాలన్న ‘జమిలి బిల్లు’ తొలి గండం గట్టెక్కింది. ఇవాళ లోక్‌సభలో బిల్లుల కోసం 269-198తో ఆమోదం లభించింది. దీంతో విస్తృత సంప్రదింపులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లులు వెళ్లనున్నాయి. అయితే అంతకంటే ముందే నిర్దిష్ట గడువులోగా జేపీసీ ఏర్పాటు కావాల్సి ఉంది.శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. అంటే ఈలోపే జేపీసీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఆయనకు ఎంతో కీలకం. ఆయన కమిటీని ఏర్పాటు చేసి.. త్వరగతిన పనిని అప్పగించాల్సి ఉంటుంది. జేపీసీలో రాజ్యసభ ఎంపీలు కూడా ఉంటారు. అధికార సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు. ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. మళ్లీ వచ్చే సెషన్లో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.కాంగ్రెస్ తిరస్కరణమంగళవారం మధ్యాహ్నాం లోక్‌సభ ముందు జమిలి ఎన్నికల బిల్లులు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లు (ఆర్టికల్ 129), కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టడానికి అవసరమైన డివిజన్ ఓటింగ్ కంటే ముందు.. సభలో వాడివేడిగా చర్చ నడిచింది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎన్డీయే సభ్య పార్టీలు మాత్రం మద్దతు ప్రకటించాయి. ఆపై విపకక్షాల అభ్యంతరాల నడుమ.. డివిజన్ ఓటింగ్ అనివార్యమైంది. ఈ ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికే ఆమోదం లభించింది. అయితే ఈ పరిణామం తర్వాత కాంగగ్రెస్ మరోసారి స్పందించింది. ‘ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. ఈ బిల్లును మేము ఏ మాత్రం ఆమోదించం’’ అని స్పష్టం చేసింది.జేపీసీకి డెడ్‌లైన్ ఉంటుందా?జమిలి ఎన్నికల నిర్వహణపై జేపీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. కేవలం విస్తృత సంప్రదింపుల ద్వారా నివేదికను మాత్రమే రూపొందిస్తుంది. ఇందుకోసం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతుంది. కమిటీలో సభ్యులుకానీ ఎంపీలతో అలాగే రాజ్యాంగపరమైన మేధావులు, న్యాయ కోవిదులతో చర్చిస్తుంది. ఎన్నికల సంఘంలో మాజీ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతుంది. అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ మాత్రం చేపడుతుంది. ఆపై తుది నివేదికను సమర్పిస్తుంది.జేపీసీకి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. ఆపై అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్లో బిల్లులపై చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356లకు సవరణ తప్పనిసరిగా జరగాలి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. వచ్చే ఏడాదే ఓటింగ్ !! -
రాజ్యాంగం కన్నా... అధికారమే మీకు మిన్న
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మధ్య వాడీవేడి చర్చకు శుక్రవారం లోక్‌సభ వేదికైంది. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభ చేపట్టిన రెండు రోజుల చర్చను ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. జడ్జి బి.హెచ్.లోయా మృతిపై తృణమూల్ సభ్యురాలు మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సభలో ఆద్యంతం ఇరుపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. నినాదాలు, అరుపులు, కేకల నడుమ రెండుసార్లు సభ వాయిదా పడింది. జేబులో పెట్టుకోవడమే నైజం రాజ్యాంగాన్ని దేశానికి తానిచి్చన కానుకగా కాంగ్రెస్ భ్రమ పడుతోందని రాజ్‌నాథ్ అన్నారు. రాజ్యాంగ కూర్పులో, అది ప్రవచించిన విలువల పరిరక్షణలో విపక్షాలు, కాంగ్రెసేతర నేతల పాత్రను నిరంతరం తక్కువ చేసి చూపేందుకే ప్రయతి్నంచిందని ఆరోపించారు. 1944లోనే పలువురు దేశభక్త నేతలు స్వతంత్ర హిందూస్తాన్ రాజ్యాంగాన్ని రూపొందించారని నాటి హిందూ మహాసభ ప్రయత్నాలను ఉద్దేశించి రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘పండిట్ మదన్మోహన్ మాలవీయ, లాలా లజపతిరాయ్, భగత్‌సింగ్, వీర సావర్కార్ వంటి నాయకులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాకపోయినా వారి భావజాలాలు రాజ్యాంగంలో అడుగడుగునా ప్రతిఫలిస్తున్నాయి. వారంతా నిత్య స్మరణీయులు. అలాంటి మహా నాయకులపైనా మతవాద ముద్ర వేసిన చరిత్ర కాంగ్రెస్‌ది! రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు, దాని రూపురేఖలనే మార్చేసేందుకు దుస్సాహసం చేసి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. ఆ లక్ష్యంతోనే తన దశాబ్దాల పాలనలో రాజ్యాంగాన్ని చీటికీమాటికీ సవరిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీ విధింపు మొదలుకుని విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, ఇందిర సర్కారు నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే పక్కకు తప్పించడం దాకా ఇందుకు ఉదాహరణలన్నో! భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్‌కు చెందిన తొలి ప్రధాని నెహ్రూ కూడా ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు! అలాంటి పారీ్టకి చెందిన వాళ్లు నేడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘పైగా విపక్ష నేతలు కొందరు కొద్ది రోజులుగా రాజ్యాంగ ప్రతిని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. చిన్నతనం నుంచీ వారు నేర్చుకున్నది అదే. ఎందుకంటే వారి కుటుంబ పెద్దలు కొన్ని తరాలుగా రాజ్యాంగాన్ని తమ జేబుల్లో పెట్టుకున్న వైనాన్ని చూస్తూ పెరిగారు మరి!’’ అంటూ రాహుల్‌గాంధీ తదితరులను ఉద్దేశించి రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎన్డీఏ సభ్యులు చప్పట్లతో అభినందించగా విపక్ష సభ్యులు ‘సిగ్గు, సిగ్గు’ అంటూ నిరసించారు. -
అసమ్మతి... అనైక్యత...
ఆరు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అనతికాలంలోనే నాలుగు రోడ్ల కూడలిలో దిక్కుతోచని పరిస్థితిలో పడినట్టు కనిపిస్తోంది. జార్ఖండ్, జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుబాటలో పయనించినా, హర్యానా, మహారాష్ట్రల్లో ఎదురైన దిగ్భ్రాంతికరమైన పరాజయాలు ఇప్పుడు కూటమి భాగస్వామ్యపక్షాల మధ్య విభేదాల కుంపటిని రాజేస్తున్నాయి. హర్యానా ఎన్నికల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేజేతులా కాంగ్రెస్ ఓటమి కొనితెచ్చుకుంటే, మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) సోదిలో లేకుండా పోవడమూ స్వయంకృతమేనన్న భావన అసమ్మతిని పెంచింది. ఖర్గే సారథ్యంలోని ‘ఇండియా’ కూటమిలో ప్రధానపాత్ర కాంగ్రెస్‌దే గనక మహారాష్ట్రలో దెబ్బతో అనూహ్యంగా నాయకత్వ మార్పు అంశం తెర మీదకొచ్చింది. సారథ్యానికి సిద్ధమంటూ మమత ముందుకు రావడంతో కథ మలుపు తిరిగింది.కూటమి ఆశించిన ఫలితాలు రావడం లేదన్న అసంతృప్తి పెరుగుతున్న పరిస్థితుల్లో అసలీ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించినదే మమతా బెనర్జీ గనక ఇప్పుడీ కూటమికి ఆమే సారథ్యం వహించాలనీ, అందుకామె సిద్ధంగా ఉన్నారనీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ ముందుగా గళం విప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే దీదీ ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, ‘కూటమిని వారు నడిపించ లేకపోతే, నేనే నడిపిస్తాను’ అని కుండబద్దలు కొట్టేశారు. బెంగాల్‌ను వీడకుండా,అక్కడ నుంచే కూటమి సాఫీగా నడిచేలా చేస్తాననీ వ్యాఖ్యానించారు. దానికి కొనసాగింపుగా జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అగ్రనేత శరద్ పవార్ సైతం జాతీయ నేతగా మమత సమర్థురాలనడంతో తేనెతుట్టె కదిలింది. కూటమిలోని లుకలుకలు, కాంగ్రెస్ పట్ల ఇతర భాగస్వామ్య పక్షాల అసంతృప్తి, అసమ్మతి స్వరాలు బయటపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అలాగే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ సహా పలువురు కోరస్ కలపడంతో విషయం వీథికెక్కింది. సీపీఐ సైతం సీట్ల సర్దు బాటులో వామపక్షాలకు కూటమి చోటివ్వడం లేదంటూ, కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకోవాలనేశారు.నిజానికి, ఈ ఏటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి కొంత ఊపు వచ్చినా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలతో అంతా నీరుగారింది. ఆ మధ్య హర్యానాలో దెబ్బ తినడమే కాక, తాజా మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి తుడిచిపెట్టుకుపోవడం అశనిపాతమైంది. ఆశలు క్షీణించడంతో హస్తం పార్టీ సారథ్యంపై అసమ్మతి స్వరం పెరిగింది. ఆ మాటకొస్తే తృణ మూల్ చాన్నాళ్ళుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటోంది. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు సరికదా పార్లమెంట్ సమావేశాల్లోనూ అంటీముట్టని వైఖరి. ఇటీవల ఎస్పీది సైతం అదే ధోరణి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో హస్తం పార్టీతో కలవడానికి ఇష్టపడకపోగా, పార్లమెంట్లో రాహుల్ ముందుండి నడుపుతున్న అదానీ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లోనూ తృణమూల్ లానే పాలు పంచు కోవట్లేదు. ఇది చాలదన్నట్టు రానున్న ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ఆప్ ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు విడతల వారీగా విడుదల చేసేస్తూ, చర్చలకు తావు లేకుండా చేసేసింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలనీ, ప్రతిపక్ష ఐక్యతకు చర్యలు ఆలోచించాలనీ శివ సేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) పేర్కొన్నదంటే వ్యవహారం ఎందాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలోని కాంగ్రెస్ శైలిపై అసంతృప్తి బాహాటమవుతున్న వేళ... ప్రతిపక్ష కూటమి భవిష్యత్ నేత ఎవరు, భవిష్యత్ దిశ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమిని దీదీ నడిపితే అభ్యంతరం లేదంటూనే, ఈ బీజేపీ వ్యతిరేక కూటమిలో పలువురు సీని యర్ నేతలు ఉన్నందున కూర్చొని చర్చించి, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కారు. అసలు బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ కలసి ‘ఇండియా’ కూటమిగా జట్టు కట్టినా, వాటికి సరైన సైద్ధాంతిక భూమికే కాదు... నేటికీ సమ న్వయ సంఘం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, భవిష్యత్ మార్గదర్శనం లాంటివేమీ లేవు. అందు కోసం గడచిన ఏణ్ణర్ధం పైగా ప్రత్యేకించి కసరత్తులు చేసిన దాఖలాలూ లేవు. నిన్నగాక మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ గొడుగు కింద అందరూ కలసి పోటీ చేసినా... బాబ్రీ మసీదు కూల్చివేతను శివసేన (యుబీటీ) నేత ఒకరు సమర్థించడంతో యూపీలో ముస్లిమ్ ఓట్లపై ఆధార పడ్డ ఎస్పీ తాజాగా ఎంవీఏ నుంచి బయటకొచ్చేసింది. దీన్నిబట్టి ఎన్నికల కోసం కలవడమే తప్ప ‘ఇండియా’ పక్షాల మధ్య సహాయ సహకారాలే కాదు సమన్వయం కూడా లేదన్నది స్పష్టం.కాంగ్రెస్‌కు కానీ, కూటమికి కానీ సారథ్య బాధ్యతలు తీసుకోకున్నా చక్రం తిప్పడంలో ముందున్న రాహుల్ పరివారానికి ఇప్పుడిది కొత్త పరీక్ష. పార్లమెంట్లో సోనియా, రాహుల్, తాజాగా గెలిచొచ్చిన ప్రియాంక – ముగ్గురున్నా కూటమికి బలిమి చేకూరుతున్న దాఖలాలు లేవు. పెద్దన్న పాత్రలో అత్యుత్సాహం చూపుతున్న హస్తం పార్టీ కార్యకర్తలకు కానీ, ఇతర పార్టీలకు కానీ స్ఫూర్తినివ్వడంలో పదే పదే విఫలమవుతోంది. ఇకనైనా సాటిపక్షాల మాటలకు అది చెవి ఒగ్గాలి. పరస్పర గౌరవంతో అందరినీ కలుపుకొనిపోవాలి. తాజా గందరగోళంతో త్వరలోనే ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని బీజేపీ జోస్యం చెబుతోంది. కాషాయపార్టీపై సమైక్యంగా పోరు సాగించడమే ధ్యేయంగా పురుడు పోసుకున్న ప్రతిపక్ష కూటమి ఇలా అనైక్యతా రాగం ఆలపిస్తూ పోతే చివరకు అదే జరుగుతుంది. నాయకత్వచర్చ చివరకు కూటమి ఎన్నికల అజెండాపై కారుమబ్బుల్ని కమ్మేస్తేనే కష్టం. అధికారపక్ష అంచనా తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రతిపక్షాలదే! -
ఇండియా కూటమికి ‘దీదీ’ సరైన నాయకురాలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సరైన నాయకురాలు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీయేనని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం(డిసెంబర్ 9) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు అవసరమైన రాజకీయ, ఎన్నికల అనుభవం ‘దీదీ’కి కావల్సినంత ఉంది. 42 లోక్‌సభ సీట్లున్న అతిపెద్ద పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి దీదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆమె నాయకత్వ పటిమ రుజువవుతూనే ఉంది’అని విజయసాయిరెడ్డి కొనియాడారు.Hon’ble West Bengal Chief Minister Didi Mamta Ji is an ideal candidate to lead the INDIA alliance as she has the required political and electoral experience to head an alliance. Didi is also the CM of a large state with 42 Lok Sabha seats and has proven herself time and again.…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 9, 2024ఇదీ చదవండి: టార్గెట్ కాంగ్రెస్..మమత రాజకీయం ఫలించేనా..? -
ఇండియా కూటమిలో లుకలుకలు!, ఈసారి..
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికలు మరోసారి బయటపడ్డాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దరంగా ఉండటమే కారణం. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టగా.. నేడు కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు టీఎంసీతోపాటుసమాజ్వాదీ పార్టీ కూడా గైర్హాజరవ్వడం గమనార్హం.మంగళవారం ఉదయం ఉభ సభలు ప్రారంభమయ్యాక.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశం, సంభాల్ హింసపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ(శరద్చంద్ర) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.అనంతరం అదానీ అంశంలో జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ మిత్రపక్షాలు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మిస్సయ్యాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడంచర్చనీయాంశంగా మారింది.చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలుఇక సోమవారం జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్ దాటవేసింది. కాంగ్రెస్‌కు ఒకే ఎజెండా ఉందని, అది తమది కాదని సూచించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని, అయితే కాంగ్రెస్ అదానీ అంశాన్ని మాత్రమే ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారని వారు తెలిపారు.ఇదిలా ఉండగా అదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా, మణిపూర్ హింస సహా పలు అంశాలపై పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సమావేశాలు ప్రారంభ రోజు నుంచి ఉభయ సభలు కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడుతున్నాయి.దీనికి తెరదించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష బేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించినట్లు సమాచారం. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది -
జార్ఖండ్ ప్రజలు విశ్వసించి పట్టం కట్టారు
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు సమష్టి విజయమని, అక్కడి ప్రజలు తమను విశ్వసించి పట్టం కట్టారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, జార్ఖండ్ వనరుల పరిరక్షణ గురించి తాము ప్రజలకు చేసిన విజ్ఞప్తిని మన్నించారని, అందుకే ఇండియా కూటమికి ఘన విజయం చేకూర్చారని అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీనియర్ పరిశీలకుడి హోదాలో శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాంచీకి వెళ్లారు. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంతో పాటు జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నివాసంలో జరిగిన విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జేఎంఎం నేతృత్వంలో కూటమి గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతోపాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పగలిగామని, అందుకే భారీ విజయం సాధ్యమైందన్నారు. జార్ఖండ్ ప్రజలకు బీజేపీపై భ్రమలు లేవని, అందుకే ఇండియా కూటమి వైపు నిలిచారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రజలిచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెడతామని భట్టి స్పష్టం చేశారు. కాగా, జార్ఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భట్టి కీలకపాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు, పార్టీ మేనిఫెస్టో తయారీ, వ్యూహాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. పలు దఫాలుగా ప్రచారానికి వెళ్లారు. -
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’ ఒంటరి పోటీ
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) నిర్ణయించుకుంది. రాజధాని ముంబయి నగరంలోని మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత ప్రీతిశర్మ మీనన్ సోమవారం(ఆగస్టు5) మీడియాకు తెలిపారు.‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. అయితే జాతీయస్థాయిలో ఇండియా కూటమితో స్నేహం కొనసాగుతుంది. ముంబైలోని మొత్తం 36 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తాం. ఢిల్లీ, పంజాబ్ పాలన మోడల్‌ను చూపించే ఎన్నికలకు వెళతాం. మహారాష్ట్రలో ప్రస్తుతమున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమంపై అసలు పట్టింపే లేదు.మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం వాళ్లకు లేదు. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లు గుజరాత్ కోసమే పనిచేస్తున్నారు. మహారాష్ట్ర ప్రయోజనాలు వారికి అవసరం లేదు’అని మీనన్ విమర్శించారు. -
బడ్జెట్‌పై ‘వివక్ష’ లేబుల్ : నిర్మలా సీతారామన్
Live Updatesకేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్డీయే కూటమి బలవంతం స్పష్టంగా కనిపిస్తోందని ఇండియా కూటమి నేతల ఆరోపణలు"Compulsion of government visible in Budget" say opposition leaders as INDIA bloc protests BudgetRead @ANI Story | https://t.co/G6jlOrJVKj#Budget2024 #INDIAbloc #Protest pic.twitter.com/2gbdRZ0sDN— ANI Digital (@ani_digital) July 24, 2024 బడ్జెట్‌పై విపక్షాల ఆరోపణపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. ‘‘ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్షాలు చేసేవి చాలా విపరీతమైన ఆరోపణలు. బడ్జెట్‌పై విపక్షాలు వివక్ష అనే లేబుల్ వేశారు’’ అని ఆమె అన్నారు."Outrageous allegation," says Nirmala Sitharaman as opposition protest budget and labels it 'discriminatory'Read @ANI Story | https://t.co/w1LhIzXyRl#NirmalaSitharaman #Budget2024 #Opposition pic.twitter.com/Ua6CoO4n5K— ANI Digital (@ani_digital) July 24, 2024 విపక్షాల వాకౌట్కు ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. కుర్చీని కాపాడుకునే బడ్జెట్. మేము ఈ బడ్జెట్‌ను తీవ్రంగా ఖండింస్తున్నాం. ఇండియా కూటమి పార్టీలు నిరసన చేపడతాము. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడకపోతే.. దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?#WATCH | Before the Opposition walked out of Rajya Sabha over 'discriminatory' Budget, LoP Rajya Sabha Mallikarjun Kharge said, "...Yeh kursi bachane ke liye yeh sab hua hai...We will condemn it and protest against it. All INDIA alliance parties will protest...How will… pic.twitter.com/i00BsjXuhL— ANI (@ANI) July 24, 2024రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.పార్లమెంట్ సెంట్రల్ హాల్ల కేంద్రమంతులతో మోదీ భేటీఉభయ సభల్లో ఇండియా కూటమిని ఎదుర్కొవటంపై చర్చ పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు.బడ్జెట్ కేటాయింపులపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయిబడ్జెట్లో రాష్ట్రాల పట్ల వివక్షకు నిరసనగా ఇండియా కూటమి ఆందోళన నిరసనలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్లో లబ్ది జరిగిందని ఆరోపణ #WATCH | Delhi | Leaders of INDIA bloc protest against 'discriminatory' Union Budget 2024, demand equal treatment to all States, in Parliament pic.twitter.com/c6uOyF1TQr— ANI (@ANI) July 24, 2024 రాజ్యసభలో కేంద్ర బడ్జెట్, జమ్ము కశ్మీర్ బడ్జెట్‌పై చర్చ జరగనుంది.Rajya Sabha to hold general discussion on Union Budget, Jammu and Kashmir BudgetRead @ANI Story | https://t.co/kowyM0f1u7#RajyaSabha #Budget #KirenRijiju #NirmalaSitharaman pic.twitter.com/JABAVoeIAa— ANI Digital (@ani_digital) July 24, 2024 ఈరోజు నుంచి పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25పై చర్చ20 గంటల పాటు బడ్జెట్‌పై చర్చ జరగనుంది.పార్లమెంట్లో నిరసనలకు సిద్ధమైన ఇండియా కూటమి.ఉభయ సభల్లో నిరసన తెలపాలని ఇండియా కూటమి నిర్ణయంకుర్చి బచావో బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీపై విపక్షాల విమర్శలు బడ్జెట్లో బీజేపీయేతర రాష్ట్రాలను విస్మరించారని ఆరోపణలుకేంద్రం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో బీజేపీయేతర రాష్ట్రాలపై చూపిన వివక్షకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఇవాళ పార్లమెంట్ లోపల, బయట నిరసన చేపట్టనుంది. మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో సహా కూటమి మిత్రపక్ష నేతలు సమావేశం అయ్యారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ చూపిన వివక్షకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని నిర్ణయించారు.ఇండియా కూటమి మీటింగ్ అనంతరం కాంగ్రెస్ నేత కేసీవేణుగోపాల్ మీడియాతో మాట్లడారు. ‘‘కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీజేపీయేతర రాష్ట్రాలపై తీవ్రమైన వివక్ష చూపింది. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపేట్టిన కేంద్రం బడ్జెట్.. బడ్జెట్ అనే భావనను నాశనం చేసింది. ఇది చాలా వివక్ష, ప్రమాదకరమైన బడ్జెట్. సమాఖ్యావాదానికి, న్యాయానికి సంబంధించిన నియమాలకు విరుద్ధంగా ఉంది’’ అని అన్నారు.తమ నిరసనలో భాగంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూలై 27 జరిగే నీతి ఆయోగ్ మిటింగ్ను బాయ్‌కాట్ చేయనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించిందని కేసీ వేణగోపాల్ అన్నారు. -
స్పీకర్ ఎన్నిక.. ‘ఇండియా’ కూటమిలో చిచ్చు !
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ప్రతిపక్షాల తరపున స్పీకర్ పదవికి కె.సురేష్‌ను కాంగ్రెస్ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపిస్తోంది. స్పీకర్ పదవికి కె.సురేష్‌ను పోటీపెట్టేముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌బెనర్జీ పార్లమెంటు బయట మంగళవారం(జూన్25) మీడియాకు తెలిపారు. ‘మమల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చ జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏకపక్షంగా కె.సురేష్‌ను స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టింది’అని అభిషేక్ బెనర్జీ మీడియాకు చెప్పారు. ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.కాగా, 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బుధవారం(జూన్26) జరగనుంది. స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను బీజేపీ కోరినప్పటికీ అవి అంగీకరించలేదు. సాంప్రదాయానికి విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రతిపక్షానికి ఆఫర్ చేయకపోవడంతో స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టాయి. -
ఎన్డీయే కూటమిపై బెంగాల్ సీఎం మమత సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: ఎన్డీయే కూటమి పక్ష నేతగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమంలో తామ పార్టీ పాల్గొనటం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆమె శనివారం టీఎంసీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోంది. అందుకే ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీఎంసీ పాల్గొనటం లేదు. 400 సీట్లు గెలుస్తామన్న వారు(బీజేపీ) కనీస మెజార్టి మార్క్ కూడా సాధించుకోలేకపోయింది. వెంటనే ఇండియా కూటమి ప్రభుత్వాని ఏర్పాటు చేస్తుందని చెప్పటం లేదు. ... కానీ, పరిస్థితులు మారటాన్ని మేము ఆసక్తిగా చూస్తూ ఉంటాం. కొన్ని రోజులకు ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది. కొన్ని సార్లు ప్రభుత్వాలు ఒకరోజు మాత్రమే ఉంటాయి. ఏదైనా జరిగితే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజులు మాత్రమే ఉండొచ్చు?’’ అని మమత అన్నారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు అయింది.మరోవైపు.. గురువారం జరిగిన ఇండియా కూటమి సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖేర్గే మాట్లాడుతూ.. బీజేపీ తమను పాలించవద్దని ప్రజలు సైతం గ్రహిస్తారని అన్నారు. ఇక.. ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించగా.. టీఎంసీ బెంగాల్లో 29 స్థానాల్లో గెలుపొందింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన నాలుగో పార్టీగా టీఎంసీ నిలిచింది. రేపు (ఆదివారం) ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇండియా కూటమిలో బలమైన నేతగా ఉన్న సీఎం మమత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
నితీశ్‌కు ప్రధాని పదవి ఆఫర్ చేసిన ఇండియా కూటమి!
పట్నా: ఎన్డీయే సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బిహార్‌లోని నితీష్‌కుమార్ జేడీ(యూ) కీలకంగా మారింది. బీజేపీ సొంతంగా మెజార్టి సీట్లు దక్కించుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నితీష్ కుమార్‌కి డిప్యూటీ పీఎం పదవి ఆఫర్ చేసి.. తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జేడి(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్‌కి ఇండియా కూటమి నుంచి ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆఫర్ వచ్చింది. ఇండియా కూటమికి కన్వీనర్‌గా అంగీకరించని వాళ్లు.. ఏకంగా నితీష్‌కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేశారు. అందుకే నితీష్ వాళ్ల ఆఫర్‌ను తిరస్కరిచారు. తాము ఎన్డీయేతోనే ఉన్నాం. మళ్లీ ఇండియా కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మా మద్దలు ఎన్డీయే ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టి సొంతంగా బీజేపీ, కాంగ్రెస్ కూటమికి లేకపోవటంతో నితీష్ కుమార్‌పై మద్దతును కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఆయన మద్దతు కోరినట్లు త్యాగి తెలిపారు. తరచూ కూటములు మారుతారనే పేరు నితీష్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్ కుమారే కీలకంగా వ్యవహరించారు. పట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వహించారు. అయితే.. ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీ(యూ) 12 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉంది. శుక్రవారం భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోలువుదీరనుంది. రేపు (ఆదివారం) 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.స్పందించిన కాంగ్రెస్‌తమ పార్టీ చీఫ్‌కు నితీశ్‌కుమార్‌కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి అఫర్ చేసిందని జేడీ(యూ) నేత త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘ జేడీ(యూ) నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు’’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. -
Bihar: ఒకే విమానంలో ఢిల్లీకి నితీశ్, తేజస్వి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(జూన్5) సాయంత్రం జరిగే ఎన్డీఏ,కూటమిల సమావేశాల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి నేతలు బయలుదేరారు. ఎవరి కూటమి సమావేశంలో ఆ కూటమికి చెందిన నేతలు పాల్గొంటారు. ఇదే విషయమై అయితే బిహార్‌లో మాత్రం ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి భేటీలో పాల్గొనేందుకు సీఎం నితీశ్‌కుమార్, ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామంతో ఎవరు ఎవరిని ఏ కూటమి వైపు తీసుకెళ్తారనే చర్చ మొదలైంది. అయితే తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని జేడీయూ నేత కేసీ త్యాగి ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరానని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ క్లారిటీ ఇచ్చారు. -
నేడు ఇండియా కూటమి సమావేశం.. కీలక వ్యూహాలపై చర్చ!
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి 232 సీట్లను గెలుచుకుంది. 400 సీట్లలో విజయం సాధిస్తామనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్ దాటి 294 సీట్లకు పరిమితమైంది.#WATCH | Maharashtra: NCP-SCP chief Sharad Pawar and party MP from Baramati, Supriya Sule leaves from Mumbai for Delhi for the INDIA bloc meeting, scheduled for later today. NCP-SCP won 8 Lok Sabha seats in Maharashtra and Supriya Sule retained Baramati by a margin of 1,58,333… pic.twitter.com/oNClFFQBqj— ANI (@ANI) June 5, 2024 ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం భారీగా లేకపోవడంతో ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చలు ప్రారంభించాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఎటువంటి వ్యూహాలు అమలు పర్చాలనేదానిపై ఇండియా కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం.#WATCH | Tamil Nadu CM and DMK chief MK Stalin arrives in Delhi ahead of the INDIA bloc meeting scheduled for later today. His party won 22 seats in #LokSabhaElections2024 pic.twitter.com/I1onVWnrmF— NewsMobile (@NewsMobileIndia) June 5, 2024కూటమి గెల్చుకున్న సీట్ల సంఖ్య గతంతో కంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో రాజకీయ మార్పులు జరగనున్నాయని ఎన్సిపీ (శరద్ చంద్ర పవార్) పార్టీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం పేర్కొన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి తీసుకునే నిర్ణయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఇక.. ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, చంపయి సొరేన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, డి.రాజా తదితర నేతలు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలు బీజేపీ గెలువకపోటంతో ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలు పార్టీల కీలక నేతలు ఢిల్లీకి పయణమై చేరకుంటున్నారు. -
Lok Sabha Elections: లక్ష్యాన్ని చేరుకోని ఇరు పార్టీలు!
దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. అబ్ కి బార్... 400 పార్’ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ కూటమి (ఎన్డీయే) ఆ లక్ష్యాన్ని అందుకునే లక్షణాలు దాదాపుగా కనిపించకపోగా... అధికార పక్షాన్ని గద్దె దింపుతాం... 295 స్థానాలతో పగ్గాలు చేపడతాం అని బీరాలకు పోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి (ఇండియా) కూడా తన లక్ష్యానికి దగ్గరలోనే నిలిచిపోయింది. కాకపోతే గత ఎన్నికల్లో కేవలం 52 స్థానాలు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కోల్పోయిన కాంగ్రెస్ ఈ సారి వంద సీట్ల వరకూ సాధించడం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతానికి ఎన్డీయే, ఇండియా కూటమి భాగస్వాముల్లో ఫిరాయింపుల్లాంటివేవీ కనిపించడం లేదు కానీ.. ఫలితాలన్నీ వెలువడిన తరువాత అసలు రాజకీయం మొదలకానుంది. సరే.. రెండు ప్రధాన కూటములు తమ తమ లక్ష్యాలను సాధించలేక పోయాయి? ఎందుకు? అతి విశ్వాసమా? లేక వ్యూహ రచన లోపమా?ఎన్డీయేలో ఏం కొరవడింది?ముందుగా ఎన్డీయే కూటమి విషయం చూద్దాం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఎన్నికల రణనీతిని సమర్థంగా అమలు చేయడంలో మోడీ చాలా దిట్ట అన్న పేరు ఉంది. మోడీ-అమిత్ షాల ద్వయం అప్పట్లో కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితం కాగా.. తరువాతి కాలంలో బీజేపీ వెనకుండి నడిపించే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల బలాన్ని, క్రమశిక్షణను ఆసరాగా చేసుకుని జాతీయ స్థాయి ఎన్నికల్లోనూ తమ సత్తా చాటగలిగారు. ప్రతి నియోజకవర్గాంలోని ఒక్కో పోలింగ్ బూత్‌కు బాధ్యులుగా కొందరు కార్యకర్తలను నియమించడం... ప్రణాళికాబద్ధంగా ప్రచారం సాగించడం... తమకుతాము ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం మోడీ-అమిత్ షాల శైలి రాజకీయాలని అర్థమవుతుంది. ఈ శైలితోనే మోడీ ప్రధానిగా రెండుసార్లు గెలవగలిగారనడం అతిశయోక్తి కాదు. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303కుపైగా సీట్లు సాధించి రికార్డు సృష్టించింది కూడా. అయితే ఈ విజయంలో భాగమైన చాలామంది భాగస్వామ్య పక్షాలను నిలబెట్టుకోలేకపోయిందన్నది కూడా నిష్టూర సత్యం. భాగస్వామ్య పక్షాలు చాలావరకూ తప్పుకున్న నేపథ్యంలో బీజేపీ కొత్త మిత్రులను వెతుక్కునే ప్రయత్నాలు చేసింది. కాకపోతే ఈ మిత్రత్వం ప్రభావం తక్కువే అన్నది తాజా ఫలితాల నేపథ్యంలో స్పష్టమవుతోంది.కాంగ్రెస్ మాటేమిటి?ఒకప్పుడు దేశంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలు (రాజీవ్ గాంధీ హయాంలో 425) సాధించిన... దశాబ్దాల పాటు దేశ రాజకీయాలను ఏకపక్షంగా శాంసిన కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో గణనీయంగా బలహీన పడిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. పార్టీ రాజకీయాలన్నింటికీ ఢిల్లీని కేంద్రం చేసుకోవడం.. నమ్మకంగా పనిచేసిన సీనియర్ నేతలను నిరాదరించడం, సమయానకూలంగా వ్యూహాలను, కార్యాచరణను మార్చుకోకపోవడం వంటివన్నీ కాంగ్రెస్ పతనానికి కారణాలుగా చెప్పవచ్చు. అయితే 2019 ఎన్నికల్లో అతి స్వల్ప స్థానాలకు పరిమితమైన తరువాత గానీ ఈ పార్టీ తగిన పాఠలు నేర్చుకోలేకపోయింది. ఎన్డీయే దెబ్బకు కుదేలు కాగా మిగిలిన జవసత్వాలు కొన్నింటినైనా ఒక్కటి చేసుకుని మళ్లీ పైకి ఎదిగే ప్రయత్నాలు మొదలుపెట్టంది. పార్టీ అధ్యక్షుడిగా వైఫల్యాలు మూటకట్టుకున్న రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన భారత్ జోడో యాత్ర కానీ.. భారత్ న్యాయ యాత్ర కానీ రాహుల్ గాంధీపై అప్పటివరకూ ఉన్న ‘పప్పు’ ముద్రను తొలగించడంలో ఎంతో ఉపకరించిందనడంలో సందేహం లేదు. గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ దశ తిరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. నేతలందరూ ఐకమత్యంగా నిలబడి పోరాడితే విజయావకాశాలు పెరుగుతాయని తెలంగాణ విజయంతో అర్థమయింది. ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది మొదలు కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త జోష్‌తో పనిచేసిందని చెప్పాలి. బీజేపీ ప్రచారానికి మాటకు మాట రీతిలో జవాబివ్వడంతోపాటు ప్రచారంలోనూ కొత్త పుంతలు తొక్కింది ఈ పార్టీ. అదే సమయంలో ప్రతిపక్షాలన్నింటినీ ఒక దగ్గర చేర్చేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించాయని చెప్పాలి. దళిత నేత మల్లికార్జున ఖర్గేను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించడం, ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించబోమన్న హామీల నేపథ్యంలో ఆప్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ వంటివి ఇండియా కూటమిలో భాగంగా నిలిచాయి. ఎన్నికల్లోనూ ఐకమత్యంతో పోరాడాయి. అంతిమ ఫలితాలేమైనప్పటికీ కాంగ్రెస్, ఇండియా కూటముల ప్రదర్శన మునుపటి కంటే మెరుగుపడటం ఎన్నో రాజకీయ పాఠాలు నేర్పుతుంది. -
కీలక రాష్ట్రాల్లో ’ఇండియా‘కు అనూహ్య లీడ్
న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రస్తుత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మంగళవారం 12 గంటల వరకు వెలువడ్డ ఫలితాలు బీజేపీకి కొంత మేర నిరాశ కలిగించినట్లు కనిపిస్తోంది. భారీ విజయం సాధిస్తామనుకున్న వారి ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఈసారి సొంతగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటడం బీజేపీకి అంత సులువుకాదని ఫలితాల సరళిని పరిశీలిస్తే తెలుస్తోంది. ఇప్పటివరకు ఫలితాల్లో బీజేపీ సొంతగా 238 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ సొంతగా 95 స్థానాల్లో, ఇండియా కూటమి 230 సీట్లలో లీడ్‌లో కొనసాగుతోంది. ఇతరులు 21 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఎన్డీఏ,ఇండియా కూటముల వారిగా చూసుకుంటే ఎన్డీఏ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 272 దాటేసింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీలు బీజేపీ దూకుడుకు కళ్లెం వేశాయి. యూపీలో ఇండియా కూటమి 42, మహారాష్ట్రలో 28, తమిళనాడు 37, కేరళ 17 సీట్లలో లీడ్‌లో కొనసాగుతూ ఎన్డీఏ కూటమిపై ఆధిక్యాన్ని ప్రదిర్శిస్తోంది. పశ్చిమబెంగాల్లో టీఎంసీ బీజేపీపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక్కడ బీజేపీకి ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదు. కాగా, జాతీయ స్థాయిలో బీజేపీ, ఎన్డీఏలకు భారీ మెజారిటీ వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాస్త తప్పినట్లు తెలుస్తోంది. -
ఢిల్లీ పీఠం ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ సంచలనం..
సాక్షి,న్యూఢిల్లీ: సుదీర్ఘంగా నలభై రోజులకుపైగా జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ శనివారం(జూన్1) సాయంత్రం 6 గంటలకు ముగిసింది.అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న2024 పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తుది, ఏడవ విడత పోలింగ్ ముగిసిన వెంటనే టీవీ ఛానళ్లు, ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు రిలీజ్ చేశాయి. రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ఎన్డీఏ-354ఇండియా-153ఇతరులు-30మొత్తం -543ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఇప్పటికి ప్రకటించినవి -463ఎన్డీఏ -294-329ఇండియా- 123-154ఇతరులు- 8-20మొత్తం సీట్లు-543ఎన్డీటీవీఎన్డీఏ-365ఇండియా-142ఇతరులు -36జన్‌కీ బాత్ ఎన్డీఏ-362-392ఇండియా-141-161ఇతరులు -10-20న్యూస్ నేషన్ ఎన్డీఏ-340-378ఇండియా-153-169ఇతరులు -21-23దైనిక్ భాస్కర్ఎన్డీఏ-281-350ఇండియా-145-201ఇతరులు -33-49 -
జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ పూర్తి అయింది. ఏడో విడత పోలింగ్ జూన్1న జరగనుంది. ఏడో విడత పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి ఆల్ పార్టీ మీటింగ్ జూన్ 1(శనివారం)న జరగనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఏడో విడత పోలింగ్ కూడా ఉంది. కూటిమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలకు ఫలితాలకు నాలుగు రోజుల ముందు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలుకు వేళ్లే ఒక రోజు ముందు ఇండియా కూటమి మీటింగ్ జరగనుంది. సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అదే రోజు సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో విపక్ష కూటమి తీసుకోవల్సిన చర్యలు, లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు కనబర్చిన పనితీరుపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సామాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఇతర కీలక నేతలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.ఇక.. ఎన్డీయే కూటమిని ప్రతిపక్షాల ఇండియా కూటమి స్వీప్ చేస్తుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘ఆరు విడుతల పోలింగ్ పూర్తి అయింది. 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. పదవి నుంచి దిగిపోయే ప్రధాని రిటైర్మెంట్ ప్రణాళికలు రచించుకుంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విధి పూర్తిగా మూసివేయబడింది. దక్షిణంలో పూర్తిగా, ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతంలో సంగానికి బీజేపీ పడిపోయింది’’ అని జైరాం రమేష్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దించడానికి లక్ష్యంగా 28 విపక్ష పార్టీలతో కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్‌క్లూషన్ అలియన్స్ (INDIA) పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. -
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరు విడతల్లో పోలింగ్ పూర్తి అయింది. అయితే.. విపక్షాల ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరితే.. ప్రధానమంత్రి ఎవరూ అని అడిగిన మీడియా ప్రశ్నకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున చమత్కారంగా స్పందించారు. ఈ ప్రశ్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి?’లా ఉందని అన్నారు. ఆయన శనివారం సిమ్లాలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇండియా కూటమి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా ప్రధాని మంత్రి ఎవరూ అనేవిషయంపై నాయకులమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. 2004 నుంచి 2014 వరకు యూపీఏ కూటమి పదేళ్లు పాలన చేసింది. ప్రధాని అభ్యర్థి ప్రకటన లేకుండా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే 2004లో కాంగ్రెస్‌లో కొంతమంది నాయకులకు సోనియా గాంధీ ప్రధాని కావాలని ఉండేది. కానీ ఆమె తిరస్కంచారు. అప్పుడు మాకు మేజార్టీ(140 సీట్లు) లేదు. 2009లో మేము 209 సీట్లను గెలిచాం. అలా యూపీఏ కూటమిగా పదేళ్లు పాలన అందించాం. కొన్నిసార్లు తెలివైనవాళ్లు కూడా చరిత్ర మర్చిపోతారు( బీజేపీ నేతలను ఉద్దేశించి). 2014లో బీజేపీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం తగ్గింపు ఏమి జరగలేదు. ప్రధాని మోదీ, 2014, 2019లో ఇచ్చిన పెద్దపెద్ద హామీలను పక్కన పడేశారు. ప్రకృతి విపత్తులతో తల్లిడిల్లిన హిమాచల్ ప్రదేశ్ ప్రధాని మోదీ చిన్న సాయం కూడా చేయలేదు. దేశంలో బీజేపీ ప్రభుత్వాలను కూలగొట్టింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు పన్నింది’’ అని ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ఫిబ్రవరి 27 జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటు వేశారు. అనంతరం వారు బీజేపీలో చేరారు. ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లో ఏడో విడతలో జూన్ 1 నాలుగు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడదల కానున్నాయి. -
ఇండియా కూటమి ఎఫెక్ట్..! కన్ప్యూజన్లో ఎగ్జిట్ పోల్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. దీంతో జూన్ ఒకటిన జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ప్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ నినాదంతో.. ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు ప్రారంభమయ్యాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో.. ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు.400సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగిన బీజేపీ.. నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్‌గా 303సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధి మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తరువాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్‌గా 300మార్కు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డునే తానే తిరగరాస్తానంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్‌లో పడిపోయిన ఇండియా కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్‌ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న ఇండియా కూటమి నాయకులు తరువాతి కాలంలో అసలు బీజేపి అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు, నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్‌సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్‌లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్‌లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. యూపీలో అఖిలేష్ మీటింగ్‌లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడునాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండి కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40 సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని.. కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం… విదేశీవిధానం, ఆర్ధిక పురోగతిలాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. నాలుగు వందల సీట్లు సాధ్యమే అని… ఒకవేళ 400సాధ్యం కాకపోయినా… గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని వీరు వాదిస్తున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ అంటున్నారు.అయితే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతారని దీంతో నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని సంజీవ్ అంచనా వేస్తున్నారు. రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ… ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రుచిర్ శర్మ గత పాతికేళ్లుగా భారత ఎన్నికల సరళిపై అధ్యయనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్రయాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీదాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమిత అవుతుందని యోగేంద్రయాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు.. ఎగ్జిట్ పోల్స్‌పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిగ్ పోల్స్ ఇవ్వడం అంత ఆశామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్ పోల్స్ ఈసారి మాత్రం కత్తిమీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు.:::: ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి -
కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ
ఢిల్లీ, సాక్షి: దేశం కోసం పని చేసే ఎన్డీయే, దేశంలో అస్థిరత్వం పెంచే ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని.. ఈ పోరులో ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ కొట్టబోతోందని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని మమత(మమతా బెనర్జీ) చెప్పారు. రాయ్‌బరేలీ ప్రజలు దేశ ప్రధానిని ఎదుర్కొంటారని కొందరు అంటున్నారు. ఇలాంటి కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?. ఓటేసి ఎవరైనా ఓటు వృథా చేసుకుంటారా?. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లకు మోదీని తిట్టడమే పనిగా ఇస్తారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?. అలాంటి వాళ్ల వల్ల మీకు పనులు జరుగుతాయా?. మనకు పనులు చేసే వ్యక్తి కావాలి. ఎన్డీయే హ్యాట్రిక్ విజయం తప్పక సాధిస్తుంది. గెలిచాక.. పేదల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. .. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారమైంది. ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగింది. రామ్‌లల్లాను టెంట్‌కింద చూసి ఎందరో బాధపడ్డారు. మీ ఓటు వల్లే రామ మందిర నిర్మాణం జరిగింది. బలమైన ప్రబుత్వం ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది అని మోదీ అన్నారు. .. ఒకవైపు రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ల కడుపు మండిపోయింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని వాళ్లు బహిష్కరించారు. రాముడితో వాళ్ల శత్రుత్వం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రామ మందిరంపై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలనుకుంది. కాంగ్రెస్ వస్తే రామ్ లల్లాను మళ్లీ టెంట్ కిందకే మారుస్తారు. వాళ్లు ఎంతటికైనా దిగజారుతారు. వాళ్లకు పరివార్, పవార్.. ఇవే ముఖ్యం’’ అని మోదీ విపక్ష కూటమిపై మండిపడ్డారు. .. బుల్డోజర్ను ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఎక్కడకు తీసుకెళ్లొద్దు అనేది యోగి దగ్గర ట్యూషన్ తీసుకోండి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్ అన్నారు. మత నిర్జవ్స్త్రన్లకు ల్యాబ్‌గా కర్ణాటకను మార్చాలనుకున్నారు. ఓబీసీల నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు కాలరాస్తే సహిస్తారా?. హిందూ ముస్లిం అంటూ రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి నాపై ఆరోపనలు చేస్తున్నారు. ఆ కుట్రలను గమనించి.. తిప్పి కొట్టి బీజేపీని గెలిపించాలి’’అని యూపీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు. -
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమిపై కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తాము బయటినుంచి మద్దతిస్తానని ప్రకటించారు. సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తడం వల్లే ఇండియా కూటమికి మమత దూరంగా ఉన్నారు. బుధవారం(మే15) కోల్‌కతాలో మమత మీడియాతో మాట్లాడారు. ‘మేము ఇండియా కూటమికి బయటినుంచి మద్దతిస్తాం. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని తెలిపారు. కాగా, బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ మద్దతిచ్చి తృణమూల్‌ను ఓడించాలని చూస్తున్నాయని మమత ఇటీవల విమర్శలు గుప్పించడం గమనార్హం. -
అది ఎదురుదెబ్బ ఎలా అవుతుంది?: ప్రధాని మోదీ
ఢిల్లీ: ఎన్నికల బాండ్ల వ్యవస్థ ఉండడం వల్ల విరాళాలను ఎవరు, ఎవరికి ఇస్తున్నారో తెలిసే అవకాశం ఉందని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదని ప్రధాని నరేంద్రమోదీ అంటున్నారు. ఆదివారం ఒక తమిళ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఎన్నికల బాండ్ల రద్దు అంశంపై స్పందించారు. పంచెకట్టులో ప్రధాని మోదీ ఈ ఇంటర్వ్యూకి హాజరు కావడం విశేషం. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందన్న అభిప్రాయంపై ప్రధాని స్పందిస్తూ... ‘‘లోపం లేకుండా ఏ వ్యవస్థా ఉండదు. బాండ్ల విషయంలో ఎదురుదెబ్బ తిన్నామని చెప్పేలా మేం ఏం చేశామో చెప్పండి. వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి అనేది బాండ్ల వల్లే తెలుస్తోంది. 2014కి ముందు ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వచ్చాయో ఏ దర్యాప్తు సంస్థలు కూడా చెప్పలేవు.. .. అలాంటిది ఎన్నికల బాండ్ల పథకం ద్వారా విప్లవాత్మక మార్పు కోసం మేం ముందడుగు వేశాం. ఈ వ్యవహారంలో ఇప్పుడు గంతులేస్తూ గర్వపడుతున్నవారు(ఇండియా కూటమిని ఉద్దేశించి..) తర్వాత పశ్చాత్తాపపడతారు. నేను చేసే ప్రతి పనిలో రాజకీయాలను చూడకూడదు. నేను దేశం కోసం పనిచేస్తాను. ఓట్లే ప్రామాణికమైతే ఈశాన్య రాష్ట్రాలకు అన్ని పనులు చేసి ఉండకూడదు కదా. ఇతర ప్రధానులంతా కలిసి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లారో నేనొక్కడినే అంతకంటే ఎక్కువసార్లు వెళ్లాను.. .. నేను రాజకీయ నాయకుడినైనంత మాత్రాన ఎన్నికల్లో గెలుపుకోసమే పనిచేయాలనేం లేదు. తమిళనాడులో మాకు లభించే ఓట్లు డీఎంకేకు వ్యతిరేకమైనవి కాదు.. అవి బీజేపీకి అనుకూలమైనవి. తమిళ ఓటర్లు ఈసారి మాకు పట్టం కడతారు’’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. .. తమిళనాడులో అపారమైన సామర్థ్యం ఉంది, దానిని వృధా చేయకూడదు. వికసిత్ భారత్ అంటే దేశంలోని ప్రతి మూల అభివృద్ధి చెందాలి. తమిళనాడు కూడా ఇందుకు ఓ కేంద్రంగా మారుతుందని నేను భావిస్తున్నా. ఇక్కడి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అద్భుతంగా పని చేస్తున్నారు’’ అని ప్రధాని మోదీ కితాబిచ్చారు. అలాగే.. తమిళ భాషపై జరిగిన రాజకీయాలపై స్పందిస్తూ.. దాని వల్ల తమిళనాడుకే కాకుండా దేశానికి కూడా నష్టం వాటిల్లిందన్నారు. -
అవినీతిపరుల కూటమి: ప్రధాని మోదీ
మీరట్/ లక్నో: సార్వత్రిక సమరానికి షెడ్యూల్ మొదలయ్యాక ఉత్తరప్రదేశ్ వేదికగా ప్రధాని మోదీ తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని విపక్షాల ‘ఇండియా’కూటమిపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ఆదివారం మీరట్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈడీ అరెస్ట్‌తో కేజ్రీవాల్, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కటకటాల వెనక్కి వెళ్లిన వేళ ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం విపక్ష ‘ఇండియా’ కూటమి ‘లోక్తంత్ర బచావో’ ర్యాలీ చేపట్టిన కొద్దిసేపటికే మోదీ విపక్షాల కూటమిపై విమర్శల జడివాన కురిపించారు. ‘‘అవినీతిపై నేను పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించగానే విపక్ష నేతలంతా కలిసి ఇండియా కూటమిగా పోగయ్యారు. నన్ను భయపెట్టొచ్చని భావించారు. కానీ నా భారతదేశమే నా సొంత కుటుంబం. అవినీతి నుంచి దేశాన్ని రక్షించేందుకు యుద్ధం మొదలుపెట్టా. అందుకే వాళ్లంతా ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. వాళ్లకు సుప్రీంకోర్టు నుంచి కూడా కనీసం బెయిల్ దొరకడం లేదు. ఈసారి రెండు శిబిరాల మధ్యనే సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగబోతోంది. నా మంత్రం ‘భ్రష్టాచార్ హటావో’ (అవినీతి అంతం). వాళ్ల తంత్రం ‘భ్రష్టాచార్ బచావో’ (అవినీతిని కాపాడుకోవడం). పేదల కోసం ఉద్దేశించిన డబ్బు అవినీతిపరులకు దక్కకుండా పదేళ్లుగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తున్న ఎన్డీఏ ఒకవైపు ఉంటే, అదే అవినీతి నేతలను కాపాడేందుకు అలుపెరగక కష్టపడుతున్న ‘ఇండియా’ కూటమి నేతలు మరోవైపు ఉన్నారు. అవినీతికి అంతం పలకాలో వద్దో మీరే నిర్ణయించుకోండి’ అన్నారు. ‘‘అవినీతిపరులకు చెప్పేదొక్కటే. కుటుంబం లేదంటూ నన్నెంతగా అవమానించినా, ఎన్ని ఆరోపణలు గుప్పించినా, బీజేపీ నేతలపై దాడులు చేసినా అవినీతిపై నేను పోరాటం ఆపబోను. అవినీతికి పాల్పడింది ఎంత పెద్ద నేతలైనా సరే కఠిన చర్యలు ఖాయం. దేశాన్ని లూటీ చేసిన వారు తిరిగి ఆ సొమ్ము కక్కాల్సిందే. ఇదే మోదీ గ్యారెంటీ’’ అని అన్నారు. ప్రజల కోసం ఆశల పల్లకీని మోసుకొచ్చామంటూ సభకు ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘పదేళ్లలో దేశవ్యాప్తంగా నా కుటుంబసభ్యులందరి ఆకాంక్షలూ తీర్చాం. కొంగొత్త కోరికలను తీర్చేందుకు మళ్లీ మీ ముందుకొచ్చాం. ఆశలు నెరవేర్చిన ఎన్డీఏఏ కూటమికే ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’’ అన్నారు. పదేళ్ల అభివృద్ధి ట్రైలరే ‘‘ఈసారి లోక్‌సభ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని మాత్రమే ఎన్నుకోవు. ఈ ఎన్నికలు వికసిత భారత్‌కు పునాది వేయనున్నాయి. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మేం ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. మా ప్రభుత్వం వచ్చే ఐదేళ్లకు మార్గసూచీని రూపొందిస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి 100 రోజుల్లో అమలుజరపాల్సిన పనులపై ఆలోచిస్తున్నాం. గత పదేళ్లకాలంలో మీరు చూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు దేశాన్ని మరింత శరవేగంతో అభివృద్ధి పథంలో ఉరకలెత్తిస్తాం. నేను పేదరికంలో జీవించా కాబట్టే పేదల గురించి తెల్సు నాకు. ప్రతి ఒక్క పేదవాడి బాధలు, కష్టాలను అర్ధంచేసుకోగలను. అందుకే పేదలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేశాం. ఈ పథకాలు పేదల సాధికారతకు మాత్రమే బాటలు వేయవు. అవి పేదలకు ఆత్మగౌరవాన్ని తిరిగి తెచ్చి ఇచ్చాయి’’ అని మోదీ అన్నారు. ‘‘అయోధ్యలో రామాలయం అసాధ్యమ ని చాలామంది అ న్నారు. నేడు రోజూ లక్షలాది మంది అయోధ్య రామాలయాన్ని దర్శించుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్‌పై కఠిన చట్టం, ఆరి్టల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం అసాధ్యమన్నారు. మేం చేసి చూపాం’ అని మోదీ అన్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని విపక్ష ఇండియా కూటమి ఆరోపించింది. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్షాలను, నేతలను వేధిస్తున్నారని మండిపడింది. ఢిల్లీ సీఎం, ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును తీవ్రంగా ఖండించింది. వారికి అండగా నిలుస్తామని ప్రకటించింది. నియంతృత్వ పాలనను తరిమికొట్టి దేశాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ కూటమి మహా ర్యాలీ నిర్వహించింది. ‘తానాషాహీ హటావో, లోక్తంత్ర్ బచావో (నియంతృత్వాన్ని రూపుమాపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి)’ పేరుతో జరిగిన ఈ ర్యాలీ విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మారింది. ఇండియా కూటమిలోని 28 పారీ్టల నేతలు ఇందులో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలను మోదీ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివరి్ణంచారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఎన్నికల్లో విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు అధికార బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్‌గాం«దీ, ప్రియాంక గాం«దీ, పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్‌మాన్ సింగ్, అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాదీ), డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), శరద్ పవార్ (ఎన్సీపీ–పవార్), ఉద్దవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ) తదితరులు వీరిలో ఉన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీత, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ రాజకీయాల్లోకి రావచ్చనే చర్చ ఊపందుకుంది. వారితో సోనియా వేదికపై చేతిలో చేయి కలిపి మాట్లాడారు. తన పక్కనే కూచోబెట్టుకున్నారు. విపక్షాలన్నీ ఒక్కటై బీజేపీని ఓడించాలని స్టాలిన్, ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. స్టాలిన్ తరఫున ఆయన సందేశాన్ని డీఎంకే నేత తిరుచ్చి శివ చదివి విని్పంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పోరాడదామని శరద్ పవార్ అన్నారు. దేశం పెను సంక్షోభంలో ఉందని డి.రాజా అన్నారు. ఈ ర్యాలీతో రాజకీయాల్లో కొత్త శక్తి పుట్టిందని ఏచూరి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. తృణమూల్ విపక్ష ఇండియా కూటమిలోనే ఉందని ఓబ్రియాన్ చెప్పారు. కూటమి డిమాండ్లు... కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, విపక్ష నేతల అరెస్టులు, ఎన్నికల బాండ్ల పేరుతో బలవంతపు వసూళ్లు, విపక్షాలే లక్ష్యంగా ఆదాయ పన్ను నోటీసులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరోద్యగం, రైతులకు అన్యాయం వంటి ఏడు అంశాలపై కూటమి డిమాండ్లను ప్రియాంక చదివి ప్రస్తావించారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థల చర్యలను నిలిపేయాలని కోరారు. బీజేపీ ఎన్నికల బాండ్ల క్విడ్ ప్రో కో వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ఆరెస్సెస్, బీజేపీ విషతుల్యం ‘‘ఆరెస్సెస్, బీజేపీ విషం వంటివి. పొరపాటున కూడా వాటిని రుచి చూడొద్దు. ఇప్పటికే దేశాన్ని ఎంతో నాశనం చేసిన విచి్ఛన్న శక్తులవి. మరింత సర్వనాశనం చేయకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలదే. పరస్పరం కుమ్ములాడుకోకుండా ఏకమైతేనే బీజేపీని ఓడించడం సాధ్యం. ప్రజాస్వామ్యం, నియంతృత్వాల్లో ఏది కొనసాగాలో నిర్ణయించే కీలక ఎన్నికలివి. ప్రజాస్వామ్యంపై మోదీకి నమ్మకం లేదు. అధికార వ్యవస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పి బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలను పడదోస్తున్నారు. హేమంత్ సోరెన్‌ను బీజేపీలో చేరనందుకే అరెస్టు చేయించారు. తనకు లొంగడం లేదనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌నూ జైలుపాలు చేశారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇలా ప్రతిపక్షాలకు బీజేపీతో సమానంగా ఎన్నికల్లో తలపడే అవకాశం లేకుండా చేస్తున్నారు. రూ.14 లక్షల నగదు డిపాజిట్లకు సంబంధించి కాంగ్రెస్‌కు ఏకంగా రూ.135 కోట్ల జరిమానా విధించారు. రూ.42 కోట్ల నగదు డిపాజిట్లు అందుకున్న బీజేపీకి అదే సూత్రం ప్రకారం రూ.4,600 కోట్ల జరిమానా విధించాలి’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేజ్రీవాల్ సింహం: సునీత ‘‘కేజ్రీవాల్ సింహం. ఆయనను ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేరు. దేశ ప్రజలంతా ఆయన వెంట ఉన్నారు’’ అని ఆయన భార్య సునీత అన్నారు. మోదీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. లోక్‌సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. మా రక్తంలోనే పోరాటం: కల్పన రాజ్యాంగ హక్కులన్నింటినీ మోదీ సర్కారు కాలరాస్తోందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన మండిపడ్డారు. ‘‘అధికారాన్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్నామని కొన్ని పార్టీలు అపోహ పడుతున్నాయి. కానీ నిజమైన అధికారం ప్రజలదే. మేం గిరిజనులం. త్యాగం, పోరాటం మా రక్తంలోనే ఉన్నాయి. మా సుదీర్ఘ చరిత్రను తలచుకుని గర్వపడతాం’’ అన్నారు. నిర్ణాయక ఎన్నికలివి... ‘‘అంపైర్లపై ఒత్తిడి పెట్టి, కెపె్టన్‌ను, ఆటగాళ్లను కొనేస్తే మ్యాచ్ గెలిచినట్టే. క్రికెట్లో దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. లోక్‌సభ ఎన్నికల వేళ అంపైర్లను (కేంద్ర ఎన్నికల కమిషనర్లను) ఎంపిక చేసిందెవరు? మ్యాచ్ మొదలైనా కాకముందే ఇద్దరు ఆటగాళ్లను (సీఎంలను) అరెస్టు చేయించిందెవరు? ఇవ్నీ చేసింది ఒక్కే ఒక్క శక్తి. ప్రధాని మోదీ! ముగ్గురు నలుగురు బిలియనీర్ల సాయంతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా లోక్‌సభ ఎన్నికలను మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను దేశమంతా గమనిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్, ఈవీఎంల సాయంతోనే 400 సీట్లు నెగ్గుతామని బీజేపీ ధీమాగా అంటోంది. అదే జరిగితే దేశమే సర్వనాశనమవుతుంది. దేశ గుండె చప్పుడైన రాజ్యాంగం కనుమరుగవుతుంది. తద్వారా దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ లక్ష్యం. మ్యాచ్‌ఫిక్సింగ్, ఈవీఎంలు, మీడియాను బెదిరించడం, కొనేయడం జరగకుంటే బీజేపీకి 180 సీట్లు కూడా రావు. కానీ ఇవేం ఎన్నికలు? విపక్షాలను నిరీ్వర్యం చేసి నెగ్గజూస్తున్నారు. ప్రచార వేళ అతి పెద్ద విపక్షమైన కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ బెదిరింపులు, బల ప్రయోగాలతో దేశాన్ని పాలించలేరు. కానీ దేశం గొంతును అణచలేరు. ప్రజల గళాన్ని అణచే శక్తి ప్రపంచంలోనే లేదు. మోదీ అసమర్థ పాలనలో దేశంలో నిరుద్యోగం 40 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరింది. దేశ సంపదంతా ఒక్క శాతం సంపన్నుల చేతిలో పోగుపడింది. ఈ నిరంకుశత్వాన్ని పారదోలేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలివి’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అహంకారానికి అంతం తప్పదు ‘‘సత్యం కోసం చేసిన యుద్ధంలో రామునికి అధికారం లేదు, వన రుల్లేవు. అయినా అవన్నీ ఉన్న రావణుడిపై గెలిచాడు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం వీడాలని రాముని జీవి తం నేర్పుతోంది. రాముని భక్తులమని ప్రకటించుకునే వారికి ఇది చెప్పాలనుకుంటు న్నా. అహంకారం అణగక తప్పదు’’ – కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా -
ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి 5 డిమాండ్లు
న్యూఢిల్లీ: ఇటీవల అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్లను వెంటనే విడుదల చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఢిల్లీలో ఆదివారం(మార్చ్ 31) భారీ సభ నిర్వహించిన ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేసింది. ఈ డిమాండ్లను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ చదివి వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ని కూటమి డిమాండ్ చేసింది. ఎన్నికల్లో సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలి. సీఎం కేజ్రీవాల్, మాజీ సీఎం హేమంత్ సొరేన్‌లను వెంటనే విడుదల చేయాలి. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలను వెంటనే ఆపాలి. బీజేపీ చేస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అక్రమ వసూళ్లు, ఎన్నికల బాండ్ల ద్వారా చేస్తున్న మనీలాండరింగ్‌పై విచారించడానికి సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలి’ అని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, హేమంత్‌సోరేన్ భార్య కల్పన సోరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ అవి గుర్తు చేసుకోవాలి