న్యూఢిల్లీ: ఇండియా కూటమికి తొలిపోరులోనే ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలోని పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు కలిసి తొలిసారి చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. పరోక్షంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎక్కువ కార్పొరేటర్ సీట్లున్నప్పటికీ అనూహ్యంగా బీజేపీకి చెందిన మనోజ్ సొంకార్ మేయర్‌గా విజయం సాధించారు.
కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలబడ్డ ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై మనోజ్ సొంకార్ గెలుపొందారు. మొత్తం 35 ఓట్లున్న కౌన్సిల్‌లో బీజేపీకి 14 మంది, ఆప్‌కు 13, కాంగ్రెస్‌కు 7, శిరోమణి అకాలీదల్‌కు ఒక సభ్యుడి బలం ఉంది. అయితే 8 మంది సభ్యులను ఓటింగ్‌లో పాల్గొనకుండా ప్రిసైడింగ్ అధికారి డిస్‌క్వాలిఫై చేయడంతో బీజేపీకి అభ్యర్థికి 15 ఓట్లు, ఇండియా కూటమి అభ్యర్థి 12 ఓట్లు వచ్చాయి. రిజల్ట్ ప్రకటించిన వెంటనే కాంగ్రెస్, ఆప్ సభ్యులు నిరసనకు దిగారు.
ఛండీగఢ్ మేయర్‌గా బీజేపీకి చెందిన అభ్యర్థి విజయం సాధించడంపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. బీజేపీ పట్టపగలు మోసం చేసి మేయర్ సీటు గెలిచిందన్నారు. మేయర్ ఎన్నిక కోసమే బీజేపీ ఇంత దిగజారితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ఇంకెంతకైనా తెగిస్తుందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment