
యశవంతపుర: భార్య వేధిస్తోందని ఆత్మహత్య చేసుకున్న భర్తల గురించి బెంగళూరులో వార్తలు వస్తుంటాయి. అదే రీతిలో భార్య సతాయిస్తోందని గోడు వెళ్లబోసుకున్నాడు ఓ భర్త. దగ్గరకు పిలిస్తే, రోజుకు రూ. 5 వేలు ఇస్తేనే వస్తానంటోందని వాపోయాడు. ఆమె వేధింపులను తట్టుకోలేక టెక్కీ భర్త పోలీసులను ఆశ్రయించాడు.
వివరాలు.. టెక్కీ శ్రీకాంత్‌కు 2022లో సదరు యువతితో వివాహమైంది. పెళ్లి రోజు నుంచి ఒక్కరోజు కూడా సంసారం చేయలేదు. పిల్లలు కావాలని శ్రీకాంత్ భార్యను అడగ్గా, 60 ఏళ్లు వయస్సు వచ్చినప్పుడు ఆ సంగతి చూద్దాం, ఇప్పుడైతే ఎవరినైనా దత్తతకు తీసుకొందామని ఉచిత సలహాలిచ్చేది. భార్య కదా అని ఆమెను ముట్టుకోబోతే భగ్గుమనేది. డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించేది.
పాటలు పెట్టి డ్యాన్సులు
భర్త వర్క్ ఫ్రం హోంలో డ్యూటీ చేసుకుంటుంటే చాలు, ఆమె గట్టిగా పాటలు పెట్టి డ్యాన్స్ చేసేది. ఒక వేళ విడాకులు తీసుకోవాలని అనుకుంటే తనకు రూ.45 లక్షలు పరిహారం ఇవ్వాలని, ప్రతినెలా భరణం కింద పెద్దమొత్తం ముట్టజెప్పాలని తేల్చిచెప్పింది. ఇంత డబ్బును తానెక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని బాధితుడు వాపోయాడు. ఇదే కాకుండా వీరిద్దరూ మాట్లాడిన ఆడియో సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారింది. భార్యకు ఆమె తల్లిదండ్రులు వంత పాడుతున్నారని తెలిపాడు. ఈ మేరకు వయ్యలికావల్ ఠాణాలో అతడు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment