Complaint
-
రాహుల్ గాంధీపై పాలవ్యాపారి కేసు
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్‌గాంధీపై బీహార్‌లో ఓ కేసు నమోదు అయ్యింది. ఓ పాలవ్యాపారి తనకు రూ.250 నష్టం వాటిల్లిందని, అందుకే రాహుల్ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి.. తన చేతిలో ఉన్న పాలబకెట్ను వదిలేశాడట. దీంతో పాలన్నీ నేలపాలై.. అతనికి నష్టం వాటిల్లిందట!.ఈ షాక్ నుంచి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్(Samastipur) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాహుల్‌గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాహుల్ మాటలతో నేను షాక్‌కి లోనయ్యా. నా చేతిలో ఉన్న బకెట్‌ను వదిలేశా. లీటర్ పాలు రూ.50.. మొత్తం రూ.250 నష్టం కలిగింది. రాహుల్ అలా మాట్లాడతారని అనుకోలేదు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను. దీంతో ఈసారి షాక్ తినడం పోలీసుల వంతు అయ్యింది. చేసేదిలేక.. బీఎన్ఎస్లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్‌పై కేసు నమోదు చేశారు.జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రతీ సంస్థలను బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS)లు స్వాధీనం చేసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు దేశంతో పోరాడాల్సి వస్తోంది’’ అని అన్నారు. అయితే..‘దేశంతో పోరాటం’ అని వ్యాఖ్యపై దేశం నలుమూలల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా.. ఆయన దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ సమర్థించింది.ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం(Assam) రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. -
యూపీఐ రాంగ్ పేమెంట్.. ఇలా చేయండి కంప్లయింట్..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వచ్చాక ఆర్థిక లావాదేవీలు అత్యంత సులభతరం అయ్యాయి. విస్తృతమైన బ్యాంకింగ్ ఆధారాల అవసరం లేకుండా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి, బిల్లులు చెల్లించడానికి, వివిధ లావాదేవీలను నిర్వహించడానికి యూపీఐ వినియోగదారులకు వెసులుబాటు కలిగింది. ఓ వైపు సౌలభ్యం ఉన్నప్పటికీ, కొన్నిసార్లు స్లో బ్యాంక్ సర్వర్లు, సాంకేతిక లోపాలు లేదా అనధికార లావాదేవీలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలపై ఫిర్యాదు ఎలా చేయాలో ఇక్కడ అందిస్తున్నాం..యూపీఐ సమస్యల రకాలుఫిర్యాదును ఫైల్ చేసే ముందు మీరు ఎదుర్కొనే వివిధ రకాల యూఏఐ సమస్యలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.» పిన్ సమస్యలు: యూపీఐ పిన్ బ్లాక్ అవడం లేదా ఎర్రర్ రావడం వంటి సమస్యలు మిమ్మల్ని లావాదేవీలను పూర్తి చేయకుండా నిరోధించవచ్చు.» ప్రాసెసింగ్ సమస్యలు: లావాదేవీలు జరగకుండానే డబ్బు కట్ అవడం, తప్పు ఖాతాలకు డబ్బు వెళ్లడం, లావాదేవీలు పెండింగ్‌లో పడిపోవడం లేదా తిరస్కరణకు గురికావడం, లావాదేవీల పరిమితులను అధిగమించడం లేదా లావాదేవీల సమయం ముగియడం వంటి సమస్యలు ఉంటాయి.» ఖాతా సమస్యలు: ఖాతా వివరాల లింక్, ఫెచ్చింగ్, ఖాతాను మార్చడం లేదా తొలగించడం లేదా నమోదు రద్దు చేయడం వంటి సమస్యలు.» ఇతర సమస్యలు: వీటిలో లాగిన్ వైఫల్యాలు, నమోదు సమస్యలు లేదా ఓటీపీ (OTP) లోపాలు ఉండవచ్చు.తప్పు లావాదేవీపై ఫిర్యాదుయూపీఐ లావాదేవీ సమయంలో సమస్యలను ఎదుర్కొంటే, మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి ఫిర్యాదు చేయవచ్చు. తప్పుడు లావాదేవీపై ఫిర్యాదు చేయడానికి ఈ దశలను అనుసరించండి..» ఎన్పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.» 'Incorrectly transferred to another account' ఎంచుకుని, మీ సమస్య క్లుప్త వివరణను అందించండి.» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి.» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్‌పై ఫిర్యాదుయూపీఐ లావాదేవీ విఫలమైతే ఈ దశల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.» ఎన్పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.» 'Transaction failed but amount debited' ఎంచుకుని సమస్య క్లుప్త వివరణను అందించండి.» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి.» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. -
స్నేహంగా మెలిగితే.. పెళ్లి చేసుకోవాలని వేధింపులు
వెంగళరావునగర్: స్నేహంగా మెలిగినందుకు యువతిని ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలంటూ వేధించిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... జగిత్యాల ప్రాంతానికి చెందిన యువతి స్థానిక మధురానగర్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ క్రమంలో బోరబండలో ఉండే రఘువంశీతో పరిచయం ఏర్పడింది. ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో చనువుగా ఉండటంతోపాటు పలు దేవాలయాలకు కలిసి వెళ్లారు. ఆ సమయంలో కొన్ని ఫొటోలను సైతం కలిసి దిగారు. అయితే కొన్ని రోజుల తరువాత రఘువంశీ సదరు యువతిని పెళ్లిచేసుకోవాలని కోరాడు. అందుకు యువతి నేను స్నేహితురాలిని మాత్రమేనని పెళ్లిచేసుకోవడం కుదరదని తేలి్చచెప్పింది. దీంతో ఇరువురూ కలిసి దిగిన ఫొటోలను బంధువులకు పంపడంతోపాటు యువతి గురించి చెడు ప్రచారం చేస్తానని బెదిరించసాగాడు. వేధింపులు తట్టుకోలేక యువతి మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ చాంబర్ లో మాధవీలత ఫిర్యాదు
-
పొన్నాల ఇంట భారీ చోరీ
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఫిలిం నగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR)పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB)కి మరో ఫిర్యాదు వెళ్లింది. అవుటర్ రింగ్‌రోడ్‌లో భారీ అవినీతి జరిగిందని చెబుతూ.. బీసీ పొలిటికల్ జేఏసీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఓఆర్ఆర్(ORR)లో రూ.7,380 కోట్ల అవినీతి జరిగిందని, ఆ అక్రమాలపై దర్యాప్తు జరపాలని పేర్కొంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు వెళ్లింది. ‘‘ఫార్ములా ఈ రేస్ కేసుతోపాటు ఓఆర్ఆర్ అక్రమాల పై కూడా దర్యాప్తు జరపాలి. సీఎం, సీఎస్, ఈడీలతో పాటు ఇవాళ ఏసీబీకి ఫిర్యాదు చేశాం. ఓఆర్ఆర్ చుట్టూ మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంది. ఆదయం వచ్చే రోడ్డును మాత్రం కంపెనీలకు ఇచ్చారు. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 2023 ఏప్రిల్ నుండి ముపై ఏళ్ళ పాటు లీజ్‌కు ఇచ్చారు. అయితే.. ఆ కంపెనీ రూ. 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. కైటెక్స్ గార్మెన్స్ సైతం ఎక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది. కైటెక్స్ కు సైతం హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి లో భూకెటాయింపులు జరిగాయి. క్విడ్ ప్రోకో(quid pro quo) ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది. హెచ్ఎండీఏ నిధుల పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. నిధులు దుర్వినియోగంలో అధికారుల పాత్ర పై దర్యాప్తు జరపాలి’’ అని బీసీ పోలిటికల్ జేఏసీ నేత యుగంధర్ గౌడ్ చెప్తున్నారు.ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లు.. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?: కేటీఆర్ఏసీబీ నోటీసుల్లో ఏముందంటే.. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అందులో ఏసీబీ కీలకాంశాలకు ప్రస్తావించింది..‘‘విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ నెల 6వ తేదీన విచారణకు వచ్చినప్పుడు మీ లాయర్‌ను అనుమతించాలని మీరు కోరారు. కానీ, చట్ట ప్రకారం అది సాధ్యం కాదని మీకు తెలియజేశాం. కాబట్టి, 9వ తేదీన మీ విచారణకు కూడా లాయర్‌ను అనుమతించడం కుదరదు. మీరు విచారణకు హాజరుకండి. మీరిచ్చిన సమాచారం ప్రకారం ఏం డాక్యుమెంట్లు కావాలో అడుగుతాం’’ అని ఏసీబీ పేర్కొంది. మరోవైపు విచారణకు తన లాయర్‌ను అనుమతించేలా కోర్టు నుంచి అనుమతి కోసం కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. -
బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: బిగ్ టీవీ, మహాటీవీ కథనాలపై వైఎస్సార్సీపీ మండిపడింది. సబ్ రిజిస్టార్ సింగ్, శ్రీకాంత్ వ్యవహారాలను వైఎస్సార్సీపీ నేతలకు అంటగట్టడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.700 కోట్ల విలువైన భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి.తప్పుడు కథనాలను ప్రసారం చేసిన సదరు చిల్లర ఛానళ్లపై చర్యలకు వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఇప్పటికే న్యాయ నిపుణులతో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చర్చించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పీఎస్‌లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు -
ఆ మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
అనకాపల్లి: నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించిన నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్రపై చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బి.సుబ్బలక్ష్మి డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా.. మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా పనిచేశారని మండిపడ్డారు. ఈమేరకు సుబ్బలక్ష్మి పలువురు కౌన్సిలర్లతో కలిసి అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో సత్యనారాయణకు గురువారం ఫిర్యాదు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప దినాల్లో కౌన్సిల్ సమావేశం నిర్వహిచడం సరికాదన్న ఉద్దేశంతో డిసెంబర్ 31న జరగాల్సిన సమావేశాన్ని జనవరి 2కు వాయిదా వేస్తున్నట్లు కమిషనర్‌కు చెప్పానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన నిర్ణయం, డిప్యూటీ చైర్మన్ నిర్ణయాన్ని కాదని స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో కౌన్సిల్ సమావేశం నిర్వహించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఆ సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దళిత మహిళనైన తనపై కమిషనర్ వివక్ష చూపుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని, మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ పరిధి దాటి విధులు నిర్వర్తిస్తున్నారని, త్వరలోనే ఆయన అక్రమాలను బయటపెడతానని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు ఏకా శివ డిమాండ్ చేశారు. -
యువకుడిని చితకబాదిన SIపై జక్కంపూడి రాజా పిర్యాదు
-
పుష్ప–2 దర్శకుడు,హీరో, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలి
మేడిపల్లి: పోలీసులను కించపరిచేలా పుష్ప–2 చలన చిత్రంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని అందుకు బాధ్యులైన సినిమా దర్శకుడు, హీరో, నిర్మాతలపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప–2 చిత్రంలో పోలీసులను అవమానించేలా కొన్ని దృశ్యాలను చిత్రీకరించడం దారుణమని ఇందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి తెలిపారు. -
రాహుల్ అనుచితంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై నాగాలాండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్నాన్ కొన్యాక్ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ బయట గురువారం(డిసెంబర్19) జరిగిన నిరసనల్లో తనకు రాహుల్ అత్యంత దగ్గరగా వచ్చి అసౌకర్యానికి కారణమయ్యారని ఆరోపించారు. గట్టిగా అరుస్తూ తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించారని, ఇది తనను అసౌకర్యానికి గురి చేసిందని ఫిర్యాదు అనంతరం ఎంపీ కొన్యాక్ చెప్పారు. కాగా,పార్లమెంట్లో గురువారం గందరగోళం నెలకొంది. అంబేద్కర్‌ను అవమానించి కాంగ్రేస్సేనని బీజేపీ.. కాదు..కాదు బీజేపీ నేతలే రాజ్యాంగ నిర్మాతను అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేట్టిన నిరసనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో గందరగోళం.. రేపటికి వాయిదా -
ప్రేమికురాలికి ఫోన్ కొనిచ్చేందుకు తల్లినే చంపాడు..!
ఖమ్మంఅర్బన్: ప్రేమికురాలికి ఫోన్ కొనివ్వడానికి అవసరమైన డబ్బు కోసం కన్నతల్లినే కడతేర్చాడో కొడుకు. హత్యానంతరం ఆమె ఒంటిపై ఆభరణాలు లాక్కొని పరారయ్యాడు. తమ చిన్న కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి లక్ష్మీనారాయణ, బంధువుల కథనం ప్రకారం.. ఖమ్మం 7వ డివిజన్ ఖానాపురానికి చెందిన కొప్పెర లక్ష్మీనారాయణ– వాణి(45) దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు గోపి మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం తల్లి మాత్రమే ఉన్న సమయాన డబ్బు కావాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది.ఆమె డబ్బులు లేవని చెప్పడంతో ఒంటిపై ఆభరణాలైనా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. దీనికి ఆమె ససేమిరా అనగా ఇద్దరి మధ్య పెనుగులాట జరగ్గా, గోపి తన తల్లి గొంతునులిమి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఆపై తల్లి ఒంటిపై ఉన్న బంగారు చెవిదిద్దులు, నాన్ తాడు తీసుకొని పరారయ్యాడు. కాసేపటికి ఇంటి పక్కనవారు వచ్చే చూసేసరికి వాణి విగతజీవిగా పడి ఉండడంతో పోలీసులు, ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు.ఈ మేరకు పోలీసులు చేరుకొని డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టగా, ఓ కర్చీప్ వద్ద ఆగిపోయింది. దీనిపై ఆరా తీయగా, గోపీదని తేలినట్టు సమాచారం. దీంతో ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా వైరాలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. -
రియల్ఎస్టేట్ పడిపోతే పోయేదేం లేదు: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి
సాక్షి,హైదరాబాద్: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మంగళవారం(డిసెంబర్10) ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. హైడ్రాతో పాటు రెరా,టీజీఐఐసీ,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏల్లో కాటిపల్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఐదు కంపెనీలు చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై రెండు నెలల క్రితమే నేను ప్రెస్ మీట్ పెట్టాను. సరిగా నేను మాట్లాడిన 10 రోజుల తర్వాత పర్మిషన్ ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం, డిప్యూటీ సీఎం ప్రకటించారు. వీటికి పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలేందుకు లేవు ? ఈ ఐదు కంపెనీల మీద హైడ్రా రంగనాథ్‌కు ఫిర్యాదు చేశా.దీనిపై అసెంబ్లీలో మాట్లాడతాం.తప్పు చేసిన మంత్రులు అధికారులు ఎవరైనా శిక్షకు అర్హులే. ఈ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవాలి.ఈ యాక్ట్‌తో కబ్జాల నివారణ వీలవుతుంది.దీనిపై అసెంబ్లీలో చర్చకు పట్టు పడతాం.ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకి వెళ్తాం. ల్యాండ్ గ్రాభింగ్ పై రిఫార్మ్స్ తీసుకురాకుంటే నాయకులను ప్రజలు తరిమి కొడతారు. రియల్ ఎస్టేట్ పడిపోతే నష్టం ఏమి లేదు’అని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. -
మనోజ్ ఆధీనంలోకి ‘మంచు టౌన్’!
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో రేగిన కలకలానికి సంబంధించి సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్ ‘మంచు టౌన్’ను ఆయన కుమారుడు మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నా రు. మనోజ్‌పై దాడి జరిగిందనే వార్తల నేపథ్యంలో ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన మనోజ్.. సోమవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. వెంటనే బౌన్సర్లతో కలిసి వెళ్లి ఫామ్‌హౌస్‌ను స్వాధీనం చేసు కున్నారు.ఆపై సోమవారం రాత్రి.. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్‌బాబు వాట్సాప్ ద్వారా రాచ కొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు పంపారు. అందులో తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులకు వైద్య పరీక్షల రికార్డులుబంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు వైద్యులు సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే తది తర పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రికార్డులు డిశ్చార్జి సమయంలో మనోజ్‌కు ఇచ్చారు. వాటిని మనోజ్ వెంటనే వాట్సాప్ ద్వారా పహాడీషరీఫ్ పోలీసులకు పంపారు. తొలుత తన ఇంటికి వెళ్లారు. తర్వాత కొందరు బౌన్సర్లతో కలిసి జల్పల్లిలోని మంచు టౌన్‌కు వెళ్లారు. వీరి వెంట కర్నూలు నుంచి వచ్చిన కొందరు భూమా మౌనిక అనుచరులు కూ డా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దుబాయ్‌లో ఉ న్న మంచు విష్ణు సైతం కొందరు బౌన్సర్లను ఫామ్ హౌస్ వద్దకు పంపారు.ఇలా మనోజ్, విష్ణులకు సంబంధించిన దాదాపు 70 మంది బౌన్సర్లు అక్కడకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం ఈ ఫామ్‌హౌస్ చుట్టూ, గేట్ వద్ద కొందరు మహిళ బౌన్సర్లు కూడా పహారా కాస్తున్నారు. అయితే పహాడీషరీఫ్ పోలీసులతో ఫోన్లో మాట్లాడిన మనోజ్.. వారిలో బౌన్సర్లు లేరని చెప్పి నట్లు తెలిసింది. కాగా మనోజ్ ఇంట్లో ఉండగానే మధ్యాహ్నం మంచు టౌన్‌కు వచ్చిన మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి గంటకు పైగా మనోజ్‌తో చర్చలు జరిపి వెళ్లారు. సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్ మాయం: మనోజ్తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో మనోజ్ హఠాత్తుగా పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం తనపై పది మంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశా రని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. సీసీ కెమె రాల హార్డ్‌డిస్క్ మాయం అయిందని, దీని వెనుక కిరణ్, విజయ్ రెడ్డి అనేవారి పాత్ర ఉన్నట్లు అను మానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ.. మనోజ్ తనపై ఎవరు, ఎందుకు దాడి చేశారో తెలియదని, తనకు, తన భార్యకు, పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా మనోజ్ ఫిర్యాదుపై పహడీషరీఫ్ పోలీసులు 329, 351, 115 సెక్షన్ల కింద మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. మనోజ్ నా ఇంటిని ఆక్రమించుకున్నాడు: మోహన్బాబుమోహన్బాబు సైతం మనోజ్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ‘జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నా. నాలుగు నెలల క్రితం చిన్న కుమారుడు మనోజ్ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు. మనోజ్, మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నా.నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ని. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికలను బయటకు పంపండి. వారు, వారి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి..’ అని ఫిర్యాదులో మోహన్‌బాబు కోరారు. మోహన్‌బాబు లెటర్ హెడ్‌పై, ఆయన సంతకంతో ఉన్న ఈ ఫిర్యాదు లేఖ వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీసు కమిషనర్‌కు అందింది. ఆయన దాన్ని పహాడీషరీఫ్ పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. కమిషనర్ సుధీర్‌బాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ...‘మనోజ్ నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు ఫిర్యాదు వాట్సాప్ ద్వారా వచ్చింది. రెండింటి పూర్వాపరాలు పరిశీలించి, కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తాం..’ అని తెలిపారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారుల ఫిర్యాదు
-
తల్లి ఆవేదన.. పట్టించుకోని కొడుకులు
-
కోచింగ్ సెంటర్లపై కేంద్రం కొరడా!
‘వంద శాతం జాబ్ గ్యారెంటీ’, ‘100 శాతం సెలెక్షన్’ వంటి అసత్య ప్రకటనలతో, అబద్ధాలతో అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచి్చంది. ఇలాంటి మోసపూరిత, తప్పుడు ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. ఈ మేరకు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ కేంద్రాలు తప్పుడు హామీలు ఇవ్వకుండా చర్యలు చేపట్టింది. మోసపూరిత హామీలతో అభ్యర్థులను ఏమార్చవద్దని వాటిని హెచ్చరించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. – సాక్షి, ఏపీ,సెంట్రల్ డెస్క్ఈ ఏడాది 6,980 ఫిర్యాదులు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ)కు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఫ్యాకల్టీ లేకపోయినా ఉన్నట్లు మభ్యపెట్టడం, తక్కువే సీట్లే ఉన్నాయని.. త్వరపడకపోతే సీట్లు అయిపోతాయని అభ్యర్థులపై ఒత్తిడి తేవడం, గతంలో వచి్చన ర్యాంకుల ఆధారంగా ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, తప్పుడు, మోసపూరిత హామీలు ఇవ్వడం వంటి ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఇలా 2021–22లో 4,815, 2022–23లో 5,351, 2023–24లో 16,276, ఈ ఏడాది ఇప్పటివరకు 6,980 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కోచింగ్ సంస్థలకు సీసీపీఏ 54 నోటీసులు పంపింది. వీటికి రూ.54.60 లక్షలు జరిమానా కింద విధించింది. 2023 సెపె్టంబర్ 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రూ.1.15 కోట్లను విద్యార్థులకు పరిహారంగా ఇప్పించింది.తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థలపై కఠిన చర్యలు ఉండాలితప్పుడు ర్యాంకుల ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాటికి జరిమానాలు విధించడం వల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరదు. యావజ్జీవ శిక్షకు తగ్గకుండా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై చర్యలు ఉండాలి. అలాగే తమ సంస్థల్లో శిక్షణ తీసుకున్నట్టు చెప్పాలని ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు డబ్బులు ఇస్తాయి. క్లాస్ రూం కోచింగ్ ఒకరి వద్ద, ఆన్లైన్ కోచింగ్ ఇంకొకరి వద్ద, మెటీరియల్/బుక్స్ మరొకరి వద్ద తీసుకున్నామంటూ ఆయా సంస్థల డబ్బులకు ఆశపడి అబద్ధాలు చెప్పే విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాల డబ్బులకు ఆశపడి అనేక కో చింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకున్నామని చెబితే వా రిపై చర్యలు తీసుకోవాలి.మీడియా కూడా తప్పు డు ప్రకటనల పట్ల జాగరూకతతో ఉండాలి. గతంలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల హా ల్టికెట్లను పరిశీలించాకే వారి గురించి ప్రచురించేవి. ఇప్పుడు కూడా ఇలాగే వ్యవహరించాలి. తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటే అసలు నిజాలు తెలుస్తాయి. – కె.లలిత్ కుమార్, జేఈఈ కోచింగ్ నిపుణులు, ఎడ్యుగ్రామ్360.కామ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట.. కోచింగ్ కేంద్రాలు ఉద్దేశపూర్వకంగా అభ్యర్థుల వద్ద కొంత సమాచారాన్ని దాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. శిక్షణా కేంద్రాలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. అయితే వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నష్టపోకుండా తాజా మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్రం వెల్లడించింది. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. తమ మార్గదర్శకాలు అభ్యర్థులకు గైడెన్స్, విద్యాపరమైన మద్దతు, ట్యూటరింగ్, స్టడీ ప్రోగ్రామ్స్, విద్యకు సంబంధించిన ప్రకటనలకు వర్తిస్తాయని స్పష్టతనిచి్చంది. కౌన్సెలింగ్, థియేటర్ ఆర్ట్స్, క్రీడలు, డ్యాన్స్, ఇతర సృజనాత్మక కార్యక్రమాలకు వర్తించవని తెలిపింది. కోచింగ్ సంస్థలకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ మార్గదర్శకాలను జారీ చేస్తున్నామని వివరించింది. కోచింగ్ సెంటర్లు ఖచ్చితత్వంలో వ్యవహరించడం ద్వారా అభ్యర్థుల హక్కులను గౌరవించాలని పేర్కొంది. 50 మంది కంటే ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేసంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని వెల్లడించింది.కేంద్రం మార్గదర్శకాలు ఇవి..» కోర్సు–వ్యవధి, అధ్యాపకుల వివరాలు, ఫీజులు–వాపసు (రిఫండ్) విధానాలు, ఎంపిక, పరీక్ష ఫలితాలు లేదా ఉద్యోగ నియామకం లేదా జీతం పెరుగుదలకు సంబంధించి మోసపూరిత హామీలను, ప్రకటనలను కోచింగ్ సంస్థలు ఇవ్వకూడదు.» ఉద్యోగాలకు ఎంపికైన లేదా ర్యాంకులు సాధించిన అభ్యర్థుల రాతపూర్వక అనుమతి లేకుండా వారి పేర్లు, ఫొటోలు లేదా ఇతర సమాచారాన్ని శిక్షణ సంస్థలు ఉపయోగించకూడదు. అలాగే వారి సమాచారాన్ని సురక్షితంగా ఉంచాలి.» సివిల్స్ రాసే అభ్యర్థుల్లో కొందరు ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వారే సొంతంగా సిద్ధమవుతారు. ఇంటర్వ్యూకు మాత్రమే శిక్షణ తీసుకుంటారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు ముందుగానే స్పష్టతనివ్వాలి. » అభ్యర్థులకు వారి కోర్సుల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించాలి. వారి అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. » అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా తమ సేవలు, వనరులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి వివరించాలి.» తాము అందిస్తున్న కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వంటి సంస్థల గుర్తింపు ఉందని నిర్ధారించాలి. » చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే శిక్షణ కేంద్రాలను నడపాలి. » విద్యార్థులు లేదా అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను, ఇతర సౌకర్యాలను శిక్షణ కేంద్రాలు కల్పించాలి. » కోర్సులు, కాలపరిమితి, అధ్యాపకుల అర్హతలు, ఫీజు, రిఫండ్ విధానాలు, ఫలితాలు, జాబ్ గ్యారెంటీ వంటి అంశాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదు. » విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ‘కొన్ని సీట్లే మిగిలి ఉన్నాయి’ వంటి ప్రకటనలు ఇవ్వడం నిషిద్ధం. » కోచింగ్ సెంటర్లకు ప్రచారం కల్పించే ముందు ఎండార్సర్లు వాటి ప్రకటనలను ధ్రువీకరించుకోవాలి. » కోచింగ్ సెంటర్ల తరఫున ప్రచారం చేసే సినీ నటులు, ఇతర సెలబ్రిటీలు వారు చేసే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. » తప్పుడు ప్రకటనలు చేసినా, తప్పుదోవ పట్టించేలా ప్రకటనల్లో నటించినా కోచింగ్ సెంటర్లతోపాటు ప్రచారకర్తలూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. » ఇప్పటిదాకా.. ఏవైనా షరతులు ఉంటే చిన్నగా ‘‘స్టార్’’ గుర్తు పెట్టి.. ప్రకటన చివర్లో కనిపించీ, కనిపించకుండా వాటిని చూపించేవారు. ఇకపై ఇలా కుదరదు. ఏవైనా షరతులు ఉంటే ప్రకటన ఏ ఫాంట్ సైజులో ఉంటే అదే సైజులో షరతులను కూడా ప్రచురించాలి. » తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కోచింగ్ సెంటర్లు కచి్చతంగా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
ఇసుక దోపిడీ దారుణంగా ఉంది
మహారాణిపేట (విశాఖ): శ్రీకాకుళంలోని ఇసుక రీచ్‌లలో దళారుల దోపిడీ దారుణంగా ఉందని, వారి నుంచి తమను కాపాడాలని విశాఖ కలెక్టర్‌కు క్వారీ లారీ ఓనర్స్ మొరపెట్టుకున్నారు. విశాఖ జిల్లా క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనే ఇసుక విధానం పారదర్శకంగా ఉండేదని చెప్పారు. కూటమి నాయకులు ఇసుక రీచ్‌ల వద్ద ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.టన్ను ఇసుకకు అదనంగా రూ.300 వసూలు చేస్తున్నారని, ఎందుకు అదనంగా ఇవ్వాలని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే ఉచితంగా వస్తుందనుకున్నామని, కానీ డబ్బులు చెల్లించాలనడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. శ్రీకాకుళంలోని 11 ఇసుక రీచ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విశాఖలో ఇసుక అమ్మాలంటే టన్ను రూ.వెయ్యి కంటే తక్కువకు విక్రయించలేని పరిస్థితి ఉందన్నారు.సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే మీరు ఇంత ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ తెలిపారు. గత ప్రభుత్వ ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి వెళుతోందని ఆరోపించారు. -
రూ.5 వసూలు చేసినందుకు రూ.లక్ష జరిమానా!
రైలులో వాటర్ బాటిల్, టిఫిన్, మీల్స్, టీ, కాపీ.. వంటివి ఏదైనా కొనుగోలు చేస్తే కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తుంటారు. ఇటీవల అలా అసలు ధర కంటే అధికంగా వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది.పూజా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు వాటర్ బాటిల్ కొనాలని నిర్ణయించుకున్నాడు. క్యాటరింగ్ సర్వీస్ ద్వారా వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అందుకు సేల్స్‌మ్యాన్ రూ.20 డిమాండ్ చేశాడు. కానీ దాని ఎంఆర్పీ రూ.15 ఉంది. ఆ ప్రయాణికుడు రూ.5 తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు సేల్స్‌మ్యాన్ ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రయాణికుడు ఈ వ్యవహారం అంతా వీడియో తీసి ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేశాడు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించాడు. కొద్దిసేపటికి క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన రూ.5 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే కోచ్‌లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం తిరిగి చెల్లించాలని అభ్యర్థించాడు. అధిక ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించింది. సదరు క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.ఒక లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.139 पर आई ओवरचार्जिंग की शिकायत, रेलवे ने लिया फटाफट एक्शन, कैटरिंग कंपनी पर लगा एक लाख का जुर्माना।यात्रियों को ओवर चार्जिंग की राशि की गई रिटर्न! pic.twitter.com/8ZaomlEWml— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024అధిక ఛార్జీలు, అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా భారతీయ రైల్వే కఠినమైన జీరో టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉందని తెలిపింది. ధరల నిబంధనలను అందరు విక్రేతలు కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురుభారతీయ రైల్వేకు ఫిర్యాదు చేయడానికి మార్గాలుకాల్ 139: ఇది ఇంటిగ్రేటెడ్ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్.ఆన్లైన్: భారతీయ రైల్వే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు గురించి పూర్తి వివరాలను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. సంఘటన తేదీ, పాల్గొన్న సిబ్బంది, ప్రాంతం వంటి వివరాలతో కూడిన ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.రైల్‌మదద్: రైల్‌మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నంబర్, ఓటీపీ, ప్రయాణ సమాచారం, రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్ వంటి వివరాలను అందించి కంప్లైంట్ చేయవచ్చు.ఎస్ఎంఎస్: ఫిర్యాదును ఫైల్ చేయడానికి 91-9717680982కి ఎస్ఎంఎస్ చేయవచ్చు. -
పోలీసులకు మహిళ బెదిరింపులు
లింగోజిగూడ: తన భర్త వద్ద ఉన్న కారు బంగారు, నగదును ఇప్పించాలని పోలీసులను కోరిన మహిళ అందుకు వారు నిరాకరించడంతో పోలీసులపైనే బెదిరింపుకు పాల్పడిన సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే హయత్‌నగర్, మునగనూర్‌లో నివాసం ఉంటున్న కాటమోని పావని తన మొదటి భర్త గోపీతో విడాకులు తీసుకుని ఐదేళ్ల క్రితం కర్నూలుకు చెందిన గోరుకంటి శ్రీకాంత్‌ను రెండో వివాహం చేసుకుంది. శ్రీకాంత్ స్థానికంగా పురోహితం చేస్తుండగా, పావని జూనియర్ లాయర్‌గా పని చేసేది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత నెలలో శ్రీకాంత్ ఇంటి నుంచి వెళ్లి పోయాడు. దీంతో పావనీ మీర్‌పేట పోలీస్టేషన్లో తన భర్త తన నుంచి దూరంగా వెళ్లిపోయాడని అతడి తల్లి పద్మ పేరున ఉన్న కారుతో పాటు బంగారం, నగదు తనకు ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. సివిల్ కేసు కావడంతో తమ పరిధిలోకి రాదని పోలీసులు తేల్చి చెప్పారు.దీంతో ఆమె గత నెల 16న తన భర్త కనిపించడం లేదంటూ హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీకాంత్ కర్నూలులో ఉన్నట్లు గుర్తించి అతడిని పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు. అతను పావనీతో ఉండడం ఇష్టం లేదని చెప్పడంతో వదిలేశారు. దీంతో ఆమె అతడి వద్ద ఉన్న కారు, బంగారం, నగదు ఇప్పించాలని కోరడంతో వారు కారు, కొంత నగదును ఇప్పించారు. అయినా సంతృప్తి చెందని పావని బంగారం మరింత నగదు కోసం డిమాండ్ చేయడంతో అది తమ పని కాదని సివిల్ తగదాలు కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. దీంతో ఆమె ఈ నెల 23న హయత్‌నగర్ పోలీస్టేషన్లో తన భర్త శ్రీకాంత్, అతని సోదరుడు దుర్గప్రసాద్‌తో కలిసి వేధింపులకు గురి చేస్తున్నారని, దుర్గప్రసాద్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఎస్ఐపై ఆరోపణలు పావనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఎస్ సైదులు కేసు వివరాలు తెలుసుకునేందుకు తన ఫోన్ నెంబర్ తీసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆరోపణలు చేయడంతో పాటు సీపీకి ఫిర్యాదు చేసినట్లు సామాజిక మధ్యమాల్లో వార్త సంచలనమైంది. మా పరిధి కాదన్నందుకే.. సివిల్ తగదాలు తాము పరిష్కరించమని, కోర్టులో తేల్చుకోవాలని చెప్పడంతోనే పావనీ ఎస్ఐ సైదులుతో పాటు తమపై అసత్య ఆరోపణలు చేస్తుందని హయత్‌నగర్ సీఐ నాగరాజ్‌గౌడ్ అన్నారు. పావని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. -
జగన్ పై అనుచిత పోస్టులు... పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు కంప్లైంట్
-
YSRCP నేతలపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
-
YSRCP నేతలపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
-
కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర
సాక్షి నెట్వర్క్: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పలువురిపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలవారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఫిర్యాదుల పరంపర గురువారం కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్‌పై పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవుగా పోలీసులు కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతున్నారు. సినీనటుడు పోసాని కృష్ణమురళిపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రెండుచోట్ల కేసు నమోదు చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నటి శ్రీరెడ్డిపై రెండు పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేశారు. బుధవారం అరెస్టు చేసిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. సజ్జల భార్గవ్‌రెడ్డి, మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నటుడు పోసానిపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రామోజీరావు, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడులను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. టీటీడీ, టీవీ–5లపై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొన్ని ఫిర్యాదుల్లో పార్టీల నేతలు, విలేకరులు ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, అనకాపల్లి జిల్లా మునగపాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల జిల్లా డోన్, బనగానపల్లె, బాపట్ల జిల్లా చీరాల, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదు చేశారు. పోసానిపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ వన్‌టౌన్, కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నటి శ్రీరెడ్డిపై.. సినీనటి శ్రీరెడ్డిపై విశాఖపట్నం టూ టౌన్, విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇద్దరికి రిమాండ్ తిరుపతి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రకాశం జిల్లా సీఎస్ పురం తనికెళ్లపల్లె గ్రామానికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసులు బుధవారం పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడిని గురువారం రాజమహేంద్రవరంలోని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. గుంటూరులో బుధవారం అరెస్టు చేసిన పి.రాజశేఖర్‌రెడ్డిని గురువారం ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంలో అతడిని జైలుకు తరలించారు. ఇద్దరి అరెస్టు కాకినాడ జిల్లా తొండంగి మండల ఉపాధ్యక్షుడు నాగం గంగబాబు, సోషల్ మీడియా కన్వీనర్ అడపా సురేష్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.సజ్జల భార్గవ్, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసుజనసేన నేత ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో సోషల్‌మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత డిసెంబర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, లోకేశ్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లపై అనుచిత పోస్టులు పెట్టారని, ఈ విషయమై అడిగితే తనను కులం పేరుతో దూషించారని సిద్ధవటానికి చెందిన జనసేన నాయకుడు వాకమల్ల వెంకటాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి, సిరిగిరి అర్జున్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి పులివెందులకు బదిలీ చేసినట్లు సిద్ధవటం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.