తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం | voter attacks a YSRCP MLA Sivakumar in Tenali: AP | Sakshi
Sakshi News home page

తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం

Published Tue, May 14 2024 4:26 AM | Last Updated on Tue, May 14 2024 4:27 AM

voter attacks a YSRCP MLA Sivakumar in Tenali: AP

ఎమ్మెల్యే శివకుమార్‌పై దాడి చేస్తున్న గొట్టుముక్కల సుధాకర్‌

సామాజికవర్గం ముసుగులో అన్నాబత్తునిపై దుర్భాషలు 

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై సామాజికవర్గం ముసుగులో కూటమికి చెందిన ఓ యువకుడు ఆయన భార్య సమక్షంలోనే అవమానించి... రెచ్చగొట్టే ధోరణితో వ్యవ­హరించారు. ఆగ్రహించిన ఆయన చేయి చేసుకోవడంతో సోషల్‌ మీడియాలో దు్రష్పచారానికి తెగబడ్డారు. అంతేగాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన్ను తిర గనీయకుండా గృహనిర్బంధం చేశారు. అయితానగర్‌లో సోమవారం ఉద­యం ఓటు వేసేందుకు భార్యతో సహా వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్‌ను అప్పటికే క్యూలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గొట్టిముక్కల సుధాకర్‌ అడ్డుకున్నాడు.

క్యూలో వెళ్లకుండా నేరుగా లోపలకు వెళ్లడమేంటన్న మిషతో దుర్భాషలాడాడు. అయినా మౌనంగా లోపలకు వెళ్లి ఓటేసి వస్తుంటే, మళ్లీ అదే వ్యక్తి అడ్డుకున్నాడు. కులాల పేర్లు ప్రస్తావిస్తూ ‘ఆ పార్టీలో ఉండటమేమిటి’ ను వ్వు కమ్మోడివి కావా?’ అని రెచ్చగొట్టాడు. ఇంకా కవి్వంపు చర్యలకు పాల్పడటమే గాకుండా భార్య ముందే అసభ్యంగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయిన శివకుమార్‌ అతడి చెంపపై కొట్టాడు.

సుధాకర్‌ కూడా తిరిగి చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే పక్కనే ఉన్న కార్యకర్తలు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.  దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదుచేసి,  పోలింగ్‌ సరళిని పర్యవేక్షించే అవకాశం లేకుండా గృహనిర్బంధం విధించేలా చేశారు. ఈ ఘటనపై పోలీస్‌ కేసు నమోదు చేశారు.  

మనోహర్‌తో కలిసి చేసిన కుట్ర 
తనను రెచ్చగొట్టి ఏదోలా గొడవ సృష్టించి పోలింగ్‌ రోజున డ్యామేజ్‌ చేయాలని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గొట్టిముక్కల సుధాకర్‌ కుట్ర పన్నారని ఎమ్మెల్యే శివకుమార్‌ ఆరోపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement