attacks
-
అధికారం మనదే.. లోడెత్తండి!
ఆళ్లగడ్డ: మట్టి మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు.. చివరకు చెరువులను సైతం వదిలి పెట్టడం లేదు. రేయింబవళ్లు ప్రొక్లెయిన్లతో యథేచ్ఛగా తవ్వేస్తూ భారీ టిప్పర్లు, లారీల్లో తరలిస్తున్నారు. ఎవరైనా అడ్డు చెబితే వారిపై దాడులకు కూడా వెనుకాడడం లేదు. ‘మేం ఎమ్మెల్యే భర్త తాలుకా.. అధికారం మాది.. మీరెవరు అడగడానికి..’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అయినా మాట వినకపోతే అక్రమ కేసులు బనాయించడానికి బరితెగించారు. ఈ దారుణాలకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం వేదికైంది. ఈ ప్రాంతంలో ఇటుకల బట్టీలు ఎక్కువ. వాటికి అవసరమయ్యే ఎర్ర మట్టిని చలి కాలంలో తోలుకుని నిల్వ చేసుకుంటారు. ఇదే అదునుగా భావించిన నియోజకవర్గం టీడీపీ కీలక నేత.. తన మనుషులను పెట్టి, కోటకొండ చెరువులో భారీగా ప్రొక్లెయినర్లు మోహరించి రాత్రిళ్లు తవ్వకాలు సాగించి తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌లో 35 టన్నుల చొప్పున రోజూ 100 టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. ఫిర్యాదులందినప్పటికీ.. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, అటవీ, మైనింగ్ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. రాత్రిళ్లు మట్టి తరలించేటప్పుడు 20 మంది గూండాలు కాపలాగా ఉంటున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాయల్టీ చెల్లించకుండా యథేచ్ఛగా దండుకుంటున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.25 వేల చొప్పున ఇటుకల బట్టి నిర్వాహకులు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క రోజులోనే రూ.25 లక్షలు వెనకేసుకుంటున్నారు. కోటకొండ నుంచి గాజులపల్లె వరకు ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువ కట్టపై నుంచి మట్టి తరలిస్తున్నారు. 35–40 టన్నుల బరువున్న వాహనాలు వెళ్తుండటం వల్ల కట్ట ధ్వంసం అవుతోంది. తమ పొలంలోకి వెళ్లేందుకు కట్టను కాస్త చదును చేస్తే మాత్రం కేసులు పెట్టి వేధించిన అధికారులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రైతుల నుంచి భూమి లీజుకు తీసుకుని మట్టి తరలించే వ్యాపారులకు మాత్రం అధికారులు సవాలక్ష నిబంధనలు విధిస్తుండటం గమనార్హం. ‘జేసీబీలు పెట్టకూడదు. మూడు అడుగులు కంటే లోతు తీయకూడదు. పెద్ద మిషన్లు, టిప్పర్లు ఉపయోగించకూడదు. దారిలో దుమ్ము లేవకుండా నీళ్లు కొట్టాలి’ అని చెబుతున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఈ దందాను మాత్రం గాలికొదిలేశారు.కట్ట ధ్వంసం చేసి.. రోడ్డేసి..ఇది కోటకొండ కల్యాణి చెరువు కట్ట. ఈ చెరువు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల పరిధిలో ఉండటంతో పాటు కట్ట పక్కనే రిజర్వు ఫారెస్ట్ ట్రెంచ్ ఉంది. అయినప్పటికీ చెరువు కట్టను చదును చేసి రోడ్డు వేసి అక్రమంగా మట్టి దందా సాగిస్తున్నారు. ఒక వేళ మళ్లీ కట్ట నిర్మించినా, అంత బలంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మట్టి దందా గురించి మైనర్ ఇరిగేషన్ ఏఈ రఘురాంను వివరణ కోరగా.. ‘చెరువులో మట్టిని తోలుకునేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. మట్టి తోలుతున్నట్లు మా దృష్టికి రాలేదు. తక్షణమే పరిశీలించి అక్రమ మట్టి తవ్వకాలు సాగించే వారిపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
ఆరు నెలల అరాచకం
రోజుకు ఒకటికి మించి హత్యలు.. రోజున్నరకు ఓ అత్యాచారం.. రోజుకు 10కిపైగా అక్రమ కేసులు.. రోజుకు 25కుపైగా దాడులు, దౌర్జన్యాలు.. ఏమిటిదంతా అనుకుంటున్నారా!.. ఆరు నెలల పాలనలో చంద్రబాబు ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. స్వయంగా చంద్రబాబు, లోకేశ్ ప్రామాణికంగా తీసుకున్న రెడ్‌బుక్ పాలన రాష్ట్రంలో అధికారికంగా బీభత్సం సృష్టిస్తోంది. 75ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఆరు నెలల్లోనే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులతో బెంబేలెత్తిపోతోంది. చంద్రబాబు పాలనలో శాంతభద్రతలు చేష్టలుడిగి చూస్తుంటే.. సామాన్యుడి బతుకు ఛిద్రమైపోతోంది. సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ గూండాలు, రౌడీమూకలు యథేచ్చగా హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి. చీనీ తోటలు నరికేస్తున్నారు. దళిత వాడలపై దండెత్తుతున్నారు. సామాన్యులను హడలెత్తించి గ్రామాల నుంచి వెళ్లగొడుతున్నారు. వరుస అత్యాచారాలు, లైంగిక దాడులతో రాష్ట్రంలో కీచకపర్వం యథేచ్చగా కొనసాగుతోంది.ఇక వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ కేసులతో అడ్డూఅదుపు లేకుండా వేధిస్తున్నారు. చంద్రబాబు మార్కు కక్షసాధింపు చర్యలతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం రెడ్‌బుక్ రాజ్యాంగ బాధితులుగా మారిపోయారు. టీడీపీ సాగిస్తున్న అరాచక యజ్ఞంలో సామాన్యుల బతుకులే సమిధులవుతున్నాయి.అరాచకాలే బ్రాండ్.. అదే బాబు పాలన ట్రెండ్ చంద్రబాబు ప్రభుత్వం దాపరికం లేకుండా అరాచకానికి బరితెగిస్తోంది. లోకేశ్ ఫొటోలతోసహా రెడ్‌బుక్ హోర్డింగులు ఏర్పాటు చేయడం ద్వారా మారణహోమంతో బీభత్సం సృష్టించడమే ప్రభుత్వ అజెండా అని అధికారికంగా ప్రకటించడం టీడీపీ కూటమికే చెల్లింది. తద్వారా టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, బాంబులతో యథేచ్ఛగా దాడుల చేయాలని ఆదేశించింది. అందుకు పోలీసులు సహకరించాలి లేదా పక్కకు తప్పుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వమే అధికారికంగా గూండాగిరీకి తెగిస్తే ఎంతటి విధ్వంసం సాగుతుందన్నది యావత్ రాష్ట్రం ఈ 6 నెలల్లో చూసింది. పచ్చ మూకల కీచకపర్వం ఆరు నెలల్లో 126 అత్యాచారాలు, లైంగిక దాడులు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో కీచకపర్వం అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. ఒకప్పటి చంబల్ లోయలోని అకృత్యాలను తలపిస్తూ రాష్ట్రంలో పచ్చమూకలు మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బాధిత మహిళల్ని హతమార్చి మరీ దర్జాగా జారుకుంటున్నారు.6 నెలల్లోనే ఏపీలో 126 మంది మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, దాడులకు తెగబడటం రాక్షస పాలనకు అద్దం పడుతోంది. వారిలో 12 మందిపై అత్యాచారం జరిపి హత్య చేయడం రౌడీ మూకల బరితెగింపునకు నిదర్శనం. ఇవన్నీ అధికారికంగా కేసులు నమోదైన ఘటనలే. కూటమి పెద్దలు, గూండాలకు భయపడి బాధితులు ఫిర్యాదులు చేయని ఉదంతాలు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయన్నది పచ్చి నిజం. 229 హత్యలు.. 750కుపైగా హత్యాయత్నాలు చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న హత్యాకాండ బెంబేలెత్తిస్తోంది. 6 నెలల్లో రాష్ట్రంలో ఏకంగా 229 మందిని హత్య చేశారు. 750కుపైగా హత్యాయత్నాలకు తెగబడ్డారు. 4 వేలకుపైగా దాడులతో విధ్వంసం సృష్టించారు. 2 వేలకుపైగా ప్రైవేటు ఆస్తులు, 5 వేలకుపైగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ గూండాల దాడులతో బెంబేలెత్తి దాదాపు 5వేల కుటుంబాలు గ్రామాలను విడిచిపెట్టి వలసపోయాయి. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. రాజ్యాంగ హక్కుల కాలరాత సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం పతాకస్థాయికి చేరింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ అక్రమ నిర్బంధాలు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతూ.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ వేధింపులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఎమర్జెన్సీ తరహా పాలనను కూటమి సర్కారు రాష్ట్రంపై రుద్దుతోంది. సెక్షన్లను మారుస్తూ.. చట్టాలను ఏమారుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. ఇప్పటివరకు 253 అక్రమ కేసులు నమోదు చేసి 822 మందికి నోటీసులిచ్చింది. 85 మందిని అక్రమంగా అరెస్ట్ చేసింది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీస్ దాసోహం పోలీస్ శాఖ లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి గులాంగిరీ చేస్తూ టీడీపీ అరాచకానికి కొమ్ముకాస్తోంది. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు, గూండాలు యథేచ్ఛగా హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నా పోలీస్ శాఖ చోద్యం చూస్తోంది. ఏకంగా అఖిల భారత సర్వీస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు కూడా రెడ్‌బుక్ రాజ్యాంగ బాధితులుగా మారిపోవడం ప్రస్తుత వైచిత్రి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించకముందే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిని బలవంతంగా సెలవుపై పంపారు. అధికారం చేపట్టిన తరువాత ఏకంగా 10 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. వలపు వల, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానీని అడ్డుపెట్టుకుని ఐపీఎస్ అధికారులు పీఏఎస్‌ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్‌గున్నీలను అక్రమంగా సస్పెండ్ చేసింది. అదనపు డీజీ సంజయ్‌ను కక్షపూరితంగా సస్పెండ్ చేసింది. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కుట్ర వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎంపీలు నందిగం సురేశ్, రెడ్డప్ప, మాజీ మంత్రులు విశ్వరూప్, పేర్ని, కొడాలి నాని, జోగి రమేశ్, మేరుగు నాగార్జున, కాకాణి, రోజా, రజినీ, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి, పెద్దారెడ్డి, చెవిరెడ్డి, వల్లభనేని వంశీ, కేతిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల, పార్టీ నేతలు దేవినేని అవినాశ్, సజ్జల భార్గవ్‌రెడ్డి, వైవీ విక్రాంత్‌రెడ్డి తదితరులతోపాటు వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. -
కొడుకును చంపితే భార్య తిరిగొస్తుందని..
తాండూరు రూరల్: అలిగి వెళ్లిపోయిన భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు కన్న కొడుకునే హత్య చేసేందుకు యత్నంచాడు ఓ తండ్రి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మల్కోడ్ గ్రామానికి చెందిన హన్మంత్‌కు తాండూరు మండలం మల్కాపూర్‌కు చెందిన శరణమ్మతో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కొడుకులు అరవింద్, ధర్మ, కార్తీక్ ఉన్నారు. ఐదు సంవత్సరాల నుంచి మల్కాపూర్‌లో నివాసముంటున్నారు. నాపరాతి గనిలో కార్మికుడిగా పనిచేస్తున్న హన్మంత్ రెండేళ్ల నుంచి శరణమ్మను వేధిస్తున్నాడు. దీంతో ఆమె రెండు నెలల క్రితం ఇద్దరు కొడుకులు ధర్మ, కార్తీక్‌లను తీసుకొని కర్ణాటక రాష్ట్రం బీదర్ సమీపంలోని బాల్కి గ్రామంలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లింది. పెద్ద కుమారుడు అరవింద్ తండ్రి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్కాపూర్‌లో ఉంటున్న శరణమ్మ సోదరుడు నాగప్ప ఆదివారం మృతి చెందాడు. విషయం తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరణమ్మ గ్రామానికి వచ్చింది. భార్య వచ్చిన విషయం తెలుసుకున్న హన్మంత్ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు కానీ ఆమె మాట్లాడలేదు. అంత్యక్రియలు ముగిశాక శరణమ్మ మళ్లీ కర్ణాటక వెళ్లిపోయింది. ఎలాగైనా భార్యను ఇంటికి రప్పించాలని, ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు అరవింద్‌ను హత్య చేస్తే భార్య వస్తుందని హన్మంత్ కుట్ర పన్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లి కత్తితో కుమారుడి మెడ, చేతులపై దాడి చేశాడు. గాయాలు భరించలేక బాలుడు గట్టిగా అరవడంతో ఇంటి పక్కనే ఉన్న అశోక్‌తోపాటు మరికొందరు వచ్చి తలుపులు పగలగొట్టి అరవింద్‌ను కాపాడారు. విషయం పోలీసులకు తెలియజేయడంతో ఎస్ఐ విఠల్‌రెడ్డి బాలుడిని తాండూరు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ప్రస్తుతం అరవింద్ ఆరోగ్యం బాగున్నట్లు తెలిపారు. హన్మంత్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
ఇస్కాన్ కేంద్రానికి నిప్పు
కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఓ ఇస్కాన్ కేంద్రానికి శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ధౌర్ గ్రామంలోని నమ్హట్టా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా కృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలపై ఈ దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహంతోపాటు అన్ని వస్తువులు పూర్తిగా కాలిపోయాయన్నారు. హిందూమత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్ బెయిలివ్వకుండా జైలులో ఉంచారంటూ...ఆయన భద్రతపై రాధారమణ్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇస్కాన్ అనుయాయులు బయట తిరిగేటప్పుడు ముందు జాగ్రత్తగా నుదుటన తిలకం ధరించవద్దని కోరారు. మైనారిటీలకు భద్రత కల్పిస్తామని యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడం లేదని రాధారమణ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బంగ్లాదేశ్‌లో దాడుల సూత్రధారి యూనస్ ప్రభుత్వమే: షేక్ హసీనా
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు కారణం ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానిదేనని ఆరోపించారు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న షేక్ హసీనా ప్రసంగిస్తూ.. బంగ్లాలో హిందూ దేవాలయాలు, చర్చీలు, ఇస్కాన్‌పై వరుస దాడుల నేపథ్యంలో యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.‘నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదు చ ఏశారు కానీ వాస్తవానికి విద్యార్ధి సంఘాలతో కలిసి పక్కా ప్రాణాళికతో సామూహిక హత్యలకు పాల్పడింది మహమ్మద యూనస్. వారే సూత్రధారులు.. దేశంలో ఇలాగే మరణాలు కొనసాగితే ప్రభుత్వం మనుగడ సాగదని లండన్‌లో ఉన్న తారిక్ రెహమాన్(బీఎన్పీ నాయకుడు, ఖలీదాజియా కుమారుడు) కూడా చెప్పాడు. దేశంలో మైనారిటీలు, ఉపాధ్యాయులు, పోలీసులు అందరిపై దాడి చేసి చంపేస్తున్నారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. చర్చిలు, అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మాస్టర్‌మైండ్ యూనసే. బంగ్లాదేశ్‌లో మైనారిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ షేక్ హసీనా ప్రశ్నించారు. ఈసందర్భంగా తాను దేశాన్ని ఎందుకు వీడాల్సివచ్చిందో ఆమె మరోసారి వివరించారు. ‘‘నా తండ్రిలాగే నన్నూ హత్య చేసేందుకు కుట్రలు జరిగాయి. వాటిని ఎదుర్కోవడం నాకు 25-30 నిమిషాలు పట్టదు. నా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ, ఊచకోతను నేను కోరుకోలేదు. నేను అధికారం కోసం అక్కడే ఉంటే మారణహోమం జరిగేది. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే దేశం విడిచివెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆందోళనకారులపై కాల్పులు జరపొద్దని నా భద్రతా సిబ్బందికి చెప్పా’’ అని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు అధికమయ్యాయి. దీనిని నిరసిస్తూ హిందువులు శాంతియుత నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ఠ్తో ఈ ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి.అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలతో అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. కాగా బంగ్లాదేశ్ పరధానిగా ఉన్న షేక్ హసీనా గత ఆగస్టులో తిరుగుబాటు, కుట్ర కారణంగా దేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం దేశ బాధ్యతలను చేపట్టింది. తిరుగుబాటు సమయంలో జరిగిన మరణాలకు సంబంధించిన నేరాభియోగాలపై విచారణ నిమిత్తం హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేస్తోంది. అమె అరెస్టుకు ఇంటర్ పోల్ సాయమూ కోరింది. -
ఇద్దరు పూజారుల అరెస్టు
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువుల నిర్బంధం, అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ముస్లిం అతివాదులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతుండటం తెలిసిందే. ఇప్పటికే హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను దేశ ద్రోహం నేరం మోపి జైలులో పెట్టిన బంగ్లా మధ్యంతర ప్రభుత్వం తాజాగా ఆయన శిష్యులిద్దరినీ అరెస్ట్ చేసింది. ఇస్కాన్ కార్యాలయంపై శనివారం గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. చిట్టోగ్రామ్‌లోని జైలులో ఉన్న చిన్మయ్ దాస్‌కు గురువారం ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఆయన శిష్యులు రుద్రకోటి కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామ సుందర్ దాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుండలినీ ధామ్ మఠానికి చెందిన ప్రొఫెసర్ కుశాల్ బరుణ్ చక్రవర్తి తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారాం దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు లేకుండానే వీరిని నిర్బంధంలోకి తీసుకున్నారని వివరించారు. అదేవిధంగా, ఢాకాలోని కిశోర్‌గంజ్ జిల్లా భైరబ్‌లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంపై దుండుగులు దాడి చేసిన దృశ్యాలను కూడా ఆయన పోస్ట్ చేశారు. బంగ్లాదేశీయులకు ఆస్పత్రుల్లో నో ఎంట్రీకోల్కతా/అగర్తలా: బంగ్లాదేశీయులకు తాము వైద్యం చేయబోమని కోల్‌కతాలోని జేఎన్ రే హాస్పిటల్, త్రిపుర రాజధాని అగర్తలాలో ఉన్న ఐఎల్ఎస్ ఆస్పత్రి ప్రకటించాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు బంగ్లాదేశ్ పౌరులను చేర్చుకోబోమని శుక్రవారం స్పష్టం చేశాయి. అఘాయిత్యాలను అడ్డుకోండి: ఆర్ఎస్ఎస్ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతు న్న అఘాయిత్యాలపై రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీ సుకోవాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా, హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళె శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. -
ఉద్యోగుల జోలికొస్తే ఖబడ్దార్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులను దూషించడం, దాడులు చేయటం, బెదిరించటం వంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉద్యోగులను ఎవరైనా లక్ష్యంగా చేసుకుంటే.. తాము కూడా వారిని టార్గెట్ చేస్తామని స్పష్టం చేశారు. శనివారం టీజీఓ భవన్లో సంఘం విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ సంఘాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి సమస్యలు ఏకరువు పెడుతున్నారని తెలిపారు. ఉద్యోగులపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు. పెండింగ్ బిల్లులు త్వరగా పరిష్కరించాలి సంఘం కార్యకవర్గ సమావేశంలో అన్ని కేటగిరీల్లో ని ఉద్యోగులకు సంబంధించి 500 సమస్యలపై చర్చ జరిగిందని, ఇందులో కీలకమైన అంశాలు 53 ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో ఆరు అత్యంత ప్రధానమైనవని చెప్పారు. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను డిసెంబర్ నెలాఖరుకల్లా పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచి్చనా.. ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వివరించారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం మనుగడలో లేకుండా పోయిందని, ప్రైవేటు అద్దె వాహనాలతోనే వ్యవస్థ నడుస్తోందని చెప్పారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో కొందరు అధికారులు.. ఉద్యోగులు, సంఘాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారి పేర్లతో సహా లిఖితపూర్వకంగా సీఎం, సీఎస్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
బంగ్లాదేశ్‌లో ఆలయాలు, దుకాణాలపై దాడులు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో శుక్రవారం హిందువుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే పలు ఆందోళనకర పరిణామాలు సంభవించాయి. హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేశారు. హిందువులపై దాడి చేయడంతోపాటు వారి దుకాణాల్లో లూటీకి పాల్పడ్డారు. ఆపైన ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ ర్యాలీ చేపట్టారు. హిందువులు అత్యధికంగా నివసించే కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ప్రార్థనల అనంతరం చోటుచేసుకున్న ఘటనలివి. జమాతె ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)కి చెందినట్లుగా భావిస్తున్న కొందరు చిట్టగాంగ్‌లోని రాధా గోవింద, సంతానేశ్వరి మాత్రి ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. మైనారిటీ వర్గం ప్రజలపై దాడులు చేశారు. హిందువులు నిర్వహించే దుకాణాలను ధ్వసం చేశారు. భయాందోళనలకు గురైన బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అనంతరం దుండగులు ఇస్కాన్‌ను నిషేధించాలంటూ ర్యాలీ చేపట్టారు. ఇన్ని జరుగుతున్నా స్థానిక పోలీస్, ఆర్మీ అధికారులు వారిని తమను కాపాడేందుకు ఏమాత్రం ప్రయతి్నంచకుండా ప్రేక్షకపాత్ర వహించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. చిన్మయ్ దాస్ అరెస్ట్‌పై హిందువులు నిరసనలు తెలపడంతో దాడులు మరింతగా పెరిగాయి. చిన్మయ్ దాస్ బ్యాంక్ అకౌంట్ నిలిపివేత హిందూ మత పెద్ద చిన్మయ్ దాస్‌కు చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లను బంగ్లాదేశ్ ఆర్థిక విభాగం స్తంభింపజేసింది. రాజద్రోహం నేరం కింద ఈ నెల 25న పోలీసులు చిన్మయ్ దాస్‌ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దాస్తోపాటు ఇస్కాన్ సంబంధిత వ్యక్తులకు చెందిన మరో 17 అకౌంట్లను కూడా నెల రోజుల పాటు సీజ్ చేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఈ బ్యాంకు అకౌంట్ల లావాదేవీలన్నిటినీ నిలిపివేయాలని, ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల వివరాల్ని అందజేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. హిందువుల రక్షణకు చర్యలు తీసుకోండి:భారత్ హిందువుల పెరిగిపోయిన దాడులు, బెదిరింపులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలకు భద్రత కల్పించాలన్న బాధ్యతను నెరవేర్చాలని బంగ్లా ప్రభుత్వాన్ని గట్టిగా కోరింది. మైనారిటీలపై దాడులను మీడియా ఎక్కువ చేసి చూపుతోందంటూ కొట్టిపారేయవద్దని విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ బంగ్లా ప్రభుత్వానికి స్పష్టం చేశారు. హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామన్నారు. హిందూ మత పెద్ద చిన్మయ్ దాస్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.మైనారిటీల భద్రత బాధ్యత బంగ్లా ప్రభుత్వానిదే: జై శంకర్ బంగ్లాదేశ్‌లోని మైనారిటీల రక్షణ కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత అక్కడి ప్రభుత్వానిదేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ శుక్రవారం లోక్‌సభలో అన్నారు. హిందువుల ఆలయాలు, దుకాణాలు, నివాసాలపై పెరిగిపోయిన దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటూ అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని కూడా చెప్పారు. దుర్గా పూజ సమయంలో మంటపాలపై దాడులు జరుగుతున్న విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి తెలపగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచి్చందని గుర్తు చేశారు. కోల్‌కతాలో ఇస్కాన్ ర్యాలీ చిన్మయ్ కృష్ణ దాస్నను బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కోల్‌కతాలోని అల్బర్ట్ రోడ్లో వరుసగా రెండో రోజు శుక్రవారం ఇస్కాన్‌కు చెందిన పలువురు ప్లకార్డులు చేబూని ‘కీర్తన్’నిర్వహించారు. దాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
మఠం నిర్వాహకుడిపై టీడీపీ వర్గీయుల దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తెలుగుదేశం నేతలు దాడులు, దౌర్జన్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నదీతీరంలో మఠం ఏర్పాటుచేసుకుని జీవిస్తున్న స్వామిపై దాడిచేశారు. దారి ఆక్రమిస్తుండటాన్ని ప్రశ్నించినందుకు రాడ్డుతో తలపగులగొట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో శనివారం ఏపీ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ నాయకుడు ఊకా విజయ్‌కుమార్ అనుచరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితుడు మహేంద్రస్వామి తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లికి చెందిన మహేంద్రస్వామి స్వర్ణముఖినది ఒడ్డున నిజరూపమఠం ఏర్పాటు చేసుకున్నారు. మఠం పక్కన నది వెంబడి ఉన్న దారిని శనివారం విజయ్‌కుమార్ అనుచరులు ఆక్రమించుకుని యంత్రాలతో పనులు చేపట్టారు. ఈ ఆక్రమణను మహేంద్రస్వామి ప్రశ్నించారు. తమ నాయకుడు ఊకా విజయ్‌కుమార్ చెబితేనే పనులు చేస్తున్నామని, అడగడానికి నువ్వు ఎవడివి అంటూ వారు దురుసుగా చెప్పారు. వెంటనే వెళ్లిపొమ్మని హెచ్చరించారు. మహేంద్రస్వామి వెళ్లకపోవడంతో రాడ్లతో దాడిచేసి తలపగులగొట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి మహేంద్రస్వామిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన తలకు కుట్లువేశారు. టీడీపీ వస్తే దాడులు చేస్తున్నారు తెలుగుదేశం అ«ధికారంలోకి వస్తే తనపై ఆ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని మహేంద్రస్వామి ఆవేదనతో చెప్పారు. గతంలోను ఊకా విజయ్‌కుమార్ పలుమార్లు తనపై దాడిచేసినట్లు తెలిపారు. గతంలో తన పళ్లు రాలగొట్టారని, పలుమార్లు రుయా ఆస్పత్రికి వెళ్లి ఎంఎల్సీ చేసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని చెప్పారు. న్యాయం చేయకపోతే తాను మరణించినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఏనాడు ఈ కబ్జాలు, దౌర్జన్యాలు జరగలేదని, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ అవి పెరిగాయని చెప్పారు. ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లి న్యాయం చేయాలని కోరతానని తెలిపారు. తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని ఆయన చెప్పారు. -
పరిశ్రమలకు 'కూటమి' కాటు
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో పరిశ్రమలు తెస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు తేకపోగా, ఉన్న వాటిని కూడా వెళ్లగొట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వారి అరాచకాలకు భయపడి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకొని కూటమి నేతలు పన్నిన కుట్రతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన ప్రముఖ జెఎస్డబ్ల్యూ జిందాల్ గ్రూప్ వెనకడుగు వేసింది. గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కృష్ణపట్నం పోర్టు దగ్గర అదానీ గ్రూపు ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. తాజాగా వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగులో అక్కడి ఎమ్మెల్యే వర్గీయులు అదానీ ప్రాజెక్టులో విధ్వంసానికి దిగారు. దీంతో దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూపే రాష్ట్రమంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. ప్రతి పనికీ కమీషన్లు ఇవ్వాలని, పనులు తమకే ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు పారిశ్రామికవేత్తల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు కూడా ఎమ్మెల్యేల దుశ్చర్యలను అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ తీరు రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలగజేస్తుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ఇదీ జరిగింది..వైఎస్సార్ జిల్లాలో గండికోట ప్రాజెక్టు ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టు అదానీ సంస్థకు దక్కింది. తొలి విడతగా రూ.1,800 కోట్లతో అదానీ సంస్థ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. టెండర్లలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు సివిల్ పనులు దక్కాయి. పనులు కూడా మొదలు పెట్టారు. ఈ పనులు తమకే ఇవ్వాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. అయినా స్పందన లేకపోవడంతో మంగళవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, మరో సోదరుడి కుమారుడు రాజేష్‌రెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యే వర్గీయులు ప్రాజెక్టు వద్ద విధ్వంసం సృష్టించారు. అక్కడి సిబ్బందిపై దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడి ఉద్యోగులు, ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇక్కడ పనులు కూడా చేసుకునే పరిస్థితి లేదంటూ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి, ఎంపీ సీఎం రమేష్ సోదరుడు రాజేష్‌నాయుడు బుధవారం సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఎటువంటిస్పందనా రాలేదు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య జరుగుతున్న ఘర్షణ మొత్తం ప్రాజెక్టు పైనే పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్టం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వర్గీయుల విధ్వంసంతో అదానీ సంస్థకు నష్టం కలిగిందని, నాయకుల మధ్య ఈ దందాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు కొనసాగుతుందో, ఆగిపోతుందోనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఆగిపోయిన జిందాల్ స్టీల్ పరిశ్రమవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ సంస్థ జేఎస్‌డబ్ల్యూ జిందాల్ గ్రూప్ ముందుకు వచ్చింది. వైఎస్సార్ జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతోపాటు మరికొన్ని భారీ పెట్టుబడులు పెట్టాలని కూడా నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటి కాదంబరి జత్వానీ పేరుతో దారుణంగా కేసులు పెట్టించి, రాష్ట్రంలో ఆ గ్రూపు పెట్టుబడులు పెట్టకుండా కూటమి పెద్దలు అడ్డుకొంటున్నారు. దీంతో ఆ గ్రూపు ఇప్పుడు రాష్ట్రం వైపు చూడటానికే జంకుతోంది. వైఎస్సార్ జిల్లాలో స్టీల్ పరిశ్రమ నిలిచిపోయింది.కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి దాడులుగత నెలలో కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే స్వయంగా దాడికి పాల్పడ్డారు. పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణపై మాట్లాడుతానంటూ తన అనుచరులతో కలిసి పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి.. అక్కడి అదానీ సంస్థ ఉద్యోగులను దూషిస్తూ దాడికి దిగారు. పోర్టు డీజీఎంపైనా దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన పారిశ్రామిక, వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగించింది.అదానీ పవర్ ప్రాజెక్టుపై దాడి ఘటనలో కేసు నమోదుకొండాపురం: అదానీ సంస్థ హైడ్రో పవర్ ప్రాజెక్టుపై మంగళవారం జరిగిన దాడి ఘటనకు సంబంధించి కొందరిపై కేసు నమోదు చేసినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్‌రెడ్డి తెలిపారు. అదానీ సంస్థకు చెందిన రామకృష్ణ, రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామన్నారు. -
ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్‌పై రష్యా దాడులు.. టార్గెట్ అదేనా..?
కీవ్:ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై ఆదివారం(నవంబర్ 17) రష్యా భారీ దాడులు చేసింది. శీతాకాలం వస్తుండడంతో ఉక్రెయిన్‌కు కీలకమైన పవర్ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌పై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో కీవ్ సహా పలు జిల్లాలు,నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశ విద్యుత్తు సరఫరా,ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ వెల్లడించారు. మరోవైపు రాజధాని కీవ్‌లో భారీగా పేలుళ్లు జరిగాయి.ఇక్కడి సిటీ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని పోలండ్ పూర్తిగా అప్రమత్తమైంది. రష్యా, ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది.ఈ సీజన్లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్తు,గ్యాస్ వంటి వాటిని వాడతారు.విద్యుత్ సరఫరాలో గనుక అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రష్యా పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలున్నాయి. -
రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై రోజుకు 48 అఘాయిత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హత్యలు , దాడులకు సంబంధించి రోజుకు సగటున 48 కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 7,393 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వమే స్వయంగా శాసనసభలో వెల్లడించిన లెక్కలివి. శాసనసభలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. నిత్యం లైంగికవేధింపులు, హత్యాచారం, హత్య ఘటనలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలే లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు సైతం వెలుగు చూశాయి. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయకుండా నిందితుల పక్షానే నిలబడుతున్న ఘటనలు అనేకం. కొన్ని సందర్భాల్లో బాధితులు రాజీ పడాలంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణే లేకుండాపోయింది. ఆ ఆరోపణలను ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు బలపరుస్తున్నాయి. బయటకిరాని కేసులు మరెన్నో ఉన్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.జూన్ నుంచి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరిగిన అఘాయిత్యాల్లో కొన్ని.. » సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలికను అపహరించి హత్యకు పాల్పడ్డారు. నాలుగు రోజుల తరువాత బాలిక ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో చిన్నారి అదృశ్యమైన రోజే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, ఆ బాలికను రక్షించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. విచారణ సరిగా చేయకపోవడంతో బాలిక ప్రాణాలే పోయాయి. సమీపంలోని అనుమానిత ప్రాంతాల్లో వెదకడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. » ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. » అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడితో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 2న పోలీసులు కేసు నమోదు చేశారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దాంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు. »కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలతో విద్యా ర్థి నుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది విద్యా ర్థి నులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. » నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ చిన్నారిని అపహరించుకునిపోయి అత్యాచారం చేసి హత్య చేసినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. నేటికీ ఆ చిన్నారి మృతదేహం ఆచూకిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. » సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం పరిధిలో కామాంధులు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. -
పేజర్ దాడులు.. యస్ మా పనే
జెరూసలేం: ఇటీవల లెబనాన్, సిరియాలపై జరిగిన పేజర్ దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ దాడిలో పలువురు హిజ్బుల్లా నేతలు హతమయ్యారు. తాజాగా ఈ దాడులకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పేజర్ల దాడుల ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.గత సెప్టెంబరులో హిజ్బుల్లాపై జరిపిన పేజర్ దాడులకు తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా బెంజమిన్ నెతన్యాహు ధృవీకరించారు. ఈ దాడుల్లో 40 మంది మృతిచెందగా, మూడు వేల మంది గాయాలపాలయ్యారు. నాడు ఈ పేజర్ల దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై లెబనాన్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. దీనిని మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొంది.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రతినిధి ఒమర్ దోస్త్రి మీడియాతో మాట్లాడుతూ లెబనాన్‌లో పేజర్ ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెతన్యాహు స్వయంగా ధృవీకరించారన్నారు. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు అందిన కొద్ది రోజులకే ఈ దాడుల వెనుక ఉన్నది తానే అనే విషయాన్ని నెతన్యాహు తొలిసారిగా బహిరంగంగా అంగీకరించారు.కాగా ఈ పేలిన పేజర్లను హంగేరీకి చెందిన బీఏసీ కన్సల్టింగ్ సంస్థ తయారు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ గతంలో తెలిపింది. గత సెప్టెంబరులో లెబనాన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా నిరసనలను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే లెబనాన్‌లోకి తమ దళాలను దింపి, దాడులకు తెగబడింది. ఇది కూడా చదవండి: ‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు -
మహిళలపై టీడీపీ నేతల మరో అరాచకం
సాక్షి టాస్‌్కఫోర్స్: ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు మరీ శ్రుతిమించాయి. ఆదివారం అర్ధరాత్రి ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. బాధితుల కథనం మేరకు.. బ్రాహ్మణ యాలేరుకు చెందిన రహమత్బీ అన్న ఇస్మాయిల్ వైఎస్సార్సీపీ తరఫున చురుగ్గా పనిచేసేవాడు. అతడిపై కొందరు టీడీపీ నాయకులు అక్కసు పెంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇస్మాయిల్ గ్రామం వదలి వేరేచోట తలదాచుకున్నాడు. పది రోజుల క్రితం గ్రామానికి తిరిగొచ్చాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన యువతిపై ఇస్మాయిల్ దాడి చేశాడంటూ అనంతపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి వేళ టీడీపీకి చెందిన దాసరి అనిల్, దాసరి ఈశ్వరయ్య, మిలటరీ ఈశ్వరయ్య, దాసరి నీరజ ద్విచక్ర వాహనాలపై వచ్చి రహమత్బీ ఇంట్లోకి చొరబడ్డారు.బూతులు తిడుతూ ఆమెతో పాటు కులసింబీ, అమనాబీలపై చెప్పులతో దాడి చేశారు. మెడలో ఉన్న నల్లపూసల దండలు తెంచేశారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని, లేకుంటే అంతు చూస్తామని బెదిరించారు. ఈ ఘటనపై సోమవారం ఉదయం ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా మాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ మరోసారి దాడి చేశారు. -
ఇంకా ఇన్కా సంబరాలు
దక్షిణ అమెరికా భూభాగంలో ఒకప్పుడు వర్ధిల్లిన ఇన్కా నాగరికత స్పానిష్ దాడుల దెబ్బకు పదహారో శతాబ్ది నాటికి దాదాపుగా కనుమరుగైంది. అయితే, ఇన్కా నాగరికత అవశేషాలు ఇక్కడి జనాల్లో ఇప్పటికీ ఇంకా మిగిలే ఉన్నాయి. ఇన్కా నాగరికత నాటి సంస్కృతీ సంప్రదాయాలు ఇప్పటికీ ఇక్కడి ప్రజల వేడుకల్లో ప్రతిఫలిస్తుంటాయి. పెరులోని ప్యూనో ప్రాంతంలో జరిగే ప్యూనో వారోత్సవాలు నేటికీ పురాతన ఇన్కా సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగుతుండటం విశేషం. ఏటా నవంబర్ మొదటివారంలో ఈ వారోత్సవాలు జరుగుతాయి. ఈ వారం రోజుల్లోనూ నవంబర్ 5వ తేదీన ప్రత్యేకంగా ‘ప్యూనో డే’ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు.పెరు ఆగ్నేయ ప్రాంతంలో ప్యూనో ప్రావిన్స్ ఉంది. దీని రాజధాని ప్యూనో నగరం. టిటికాకా సరోవర తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో స్పెయిన్ అధీనంలోకి వచ్చాక, స్పానిష్ రాజప్రతినిధి పెడ్రో ఆంటోనియో ఫెర్నాండేజ్ డి క్యాస్ట్రో 1668లో ప్యూనో నగరాన్ని నెలకొల్పాడు. అంతకు ముందు ఈ ప్రాంతలో ఇన్కా నాగరికత ఉజ్వలంగా వర్ధిల్లింది. స్పానిష్ పాలకుల ప్రభావంతో స్థానిక కెచువా ప్రజలు క్రైస్తవ మతాన్ని స్వీకరించినా, తమ పూర్వ ఆచారాలను వదులుకోలేదు. ఇన్కా సామ్రాజ్య వ్యవస్థాపకుడైన మాంకో కాపాక్ జయంతి సందర్భంగా నవంబర్ 5న ‘ప్యూనో డే’ జరుపుకొనే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఇన్కా ప్రజలు ‘ఇన్టీ’గా పిలుచుకునే సూర్యుడి కొడుకు మాంకో కాపాక్. అతడే ఇన్కా ప్రజలకు మూలపురుషుడని చెబుతారు. ఇన్కా నాగరికత కాలంలో ఈ ప్రాంతంలో కూజ్కో నగరం ఉండేది. ప్యూనో వారోత్సవాలను ఇక్కడి ప్రజలు ఇన్కా సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరుపుకొంటారు. ఇన్కా సంప్రదాయ దుస్తులు ధరించి ఊరేగింపుల్లో పాల్గొంటారు. సంప్రదాయ వాద్య పరికరాలను మోగిస్తూ, వీథుల్లో తిరుగుతూ పాటలు పాడతారు. ప్యూనో నగర కూడళ్లలో ఏర్పాటు చేసిన వేదికలపై సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. టిటికాకా సరోవరంలో సంప్రదాయ పడవల్లో నౌకా విహారాలు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో మాంకో కాపాక్ జీవిత విశేషాలను ప్రదర్శిస్తారు. పురాతన పద్ధతుల్లో జరిగే ఈ ప్యూనో వారోత్సవాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. -
ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి ఇరాన్ ప్లాన్..?
టెహ్రాన్:ఇటీవల ఇజ్రాయెల్ తమ సైనిక స్థావరాలపై చేసిన వైమానిక దాడులకు ప్రతిదాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సిద్ధం చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేని తన దళాలను ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సంబంధించి ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు తాజాగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు ఏర్పాట్లు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అలీఖమేనీ తన ముఖ్య సైనికాధికారులను ఈ చర్చల సందర్భంగా ఆదేశించినట్లు సమాచారం.ఇందులో భాగంగా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ తన అనుకూల మిలిటెంట్ గ్రూపుల ద్వారా దాడికి పాల్పడొచ్చని ఇజ్రాయెల్ నిఘావర్గాలు భావిస్తున్నాయి.కాగా, అక్టోబర్ మొదటి వారంలో తొలుత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేయగా ఈ దాడులకు ప్రతీకారంగా ఇటీవలే ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రం ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇదీ చదవండి: హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్‌లో బీభత్సం -
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 77 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని బీట్ లాహియాలో ఉన్న ఓ ఐదు అంతస్తుల నివాస భవనంపై దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 77 మంది పాలస్తీనియన్లు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది గాయపడ్డారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని ఉన్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ దాడిపై ఇంతవరకు ఇజ్రాయెల్ స్పందించకపోవటం గమనార్హం.BREAKING: The death toll has risen to 77, including 25 children, following the horrific Israeli massacre in Beit Lahiya, northern Gaza, according to local sources. The majority of the victims are from the Abu Nassr clan. pic.twitter.com/j660WyvzYK— 🇵🇸 Palestine Watermelons 🍉 (@PalestineMelons) October 29, 2024 శిథిలాల నుంచి మరింత మందిని బయటకు తీస్తున్నారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA)పై ఇజ్రాయెల్ నిషేధం విధించటంపై ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇజ్రాయెల్ చర్య.. సహించరానిది, చట్టవిరుద్ధమైదిగా పేర్కొంటున్నారు. ఈ దాడిలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది -
హత్యకు యత్నం.. స్టేషన్‌కెళ్తే అక్కడా దాడి..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కాశీబుగ్గ: కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తెలుగుదేశం నేతలు మరింత బరితెగించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వైఎస్సార్సీపీ వర్గీయులపై హత్యాయత్నం చేయడమేగాక ఫిర్యాదు చేసేందుకు వెళ్లినవారిపై పోలీస్ స్టేషన్లోనే దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వారిస్తున్న పోలీసుల్ని పక్కకు తోసేశారు. పోలీసు స్టేషన్లో కూడా బాధితులకు రక్షణ లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన అనుచరులపై దాడిని ఖండిస్తూ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులోని నిత్య ప్రైవేటు ఆస్పత్రి ఎదురుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడు, పాత్రికేయుడు అల్లు రమణ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యుడు వేణుగోపాలరెడ్డి, మరో ఇద్దరు శనివారం రాత్రి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొర్ల విష్ణుచౌదరి తన కారులో అక్కడికి వచ్చాడు. కారునుంచి దిగి వారిపై దాడిచేశాడు. వారిని కొట్టి, కారులోంచి కత్తి తెచ్చి హత్యాయత్నం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న రమణ తన స్నేహితుడు మొదలవలస మన్మథరావును తీసుకుని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసు స్టేషన్లోనే.. విష్ణుచౌదరి తమను హత్యచేయడానికి ప్రయత్నించిన కత్తిని పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ వద్ద అప్పగించిన రమణ, మన్మథరావు ఫిర్యాదు రాయసాగారు. అదేసమయంలో విష్ణుచౌదరి, టీడీపీకి చెందిన బడ్డ నాగరాజు, జోగ మల్లి, బడ్డ నాగరాజు బంధువులు ఇద్దరు, మరికొందరు పోలీసు స్టేషన్లోకి వచ్చి రమణ, మన్మథరావుపై దాడిచేశారు. వారి దుస్తులను చించేసి, పిడిగుద్దులతో రెచ్చిపోయి భయానక వాతావరణం సృష్టించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేసి, హెచ్చరించారు. మీరిలా పోలీసు స్టేషన్లో కొడుతుంటే తమ ఉద్యోగాలు పోతాయని పోలీసులు ప్రాధేయపడినా టీడీపీ రౌడీలు వెనక్కి తగ్గలేదు. టీడీపీ నాయకుల దాడిని ఒకరు సెల్ఫోన్లో రికార్డు చేయడంతో బయట ప్రపంచానికి తెలిసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పలాస ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీస్‌స్టేషన్‌లో దాడిపై కేసు నమోదు కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో శనివారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ దాడి మోహనరావు తెలిపారు. టీడీపీ నాయకులు విష్ణు చౌదరి, వంశీతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు అల్లు రమణ, మొదలవలస మన్మధ.. కానిస్టేబుల్ నారాయణ విధులకు ఆటంకం కలిగించినట్లు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎస్పీగారూ.. ఏం జరుగుతోంది? ఎస్పీగారూ.. కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఏం జరుగుతోంది. పోలీసుల సమక్షంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జరిగిన ఘటనపై ఎఫ్ఐఎర్ నమోదు చేసి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి. – విజయసాయిరెడ్డి, ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు రాష్ట్రంలో.. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు జరిగిన పలాసలో ఇప్పుడు మళ్లీ అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ నాయకుడు బాలికపై దాడి చేస్తే పోక్సో కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తమపై హత్యాయత్నం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినవారిపై టీడీపీ వర్గీయులు దాడిచేసినా పోలీసులు ఏమీ చేయలేకపోయారన్నారు. ఇక్కడి గూండాలను స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నారని మండిపడ్డారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: తమ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. జరగరానిదేదైనా ఆయనకు జరిగితే బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ప్రచార పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై శుక్రవారం బీజేపీ గూండాలు దాడికి దిగారని పేర్కొంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘దాడి ఘటనపై పోలీసుల వైఖరిని బట్టి చూస్తే దీని వెనుక కేజ్రీవాల్‌ను చంపేందుకు పెద్ద కుట్రే ఉందని స్పష్టమవుతోంది. ఆయనకు బీజేపీ శత్రువుగా మారింది’అని పేర్కొన్నారు. ఆయనకు హాని తలపెట్టాలనుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఇటువంటి వాటికి కేజ్రీవాల్ వెనుకడుగు వేయర న్నారు. వికాస్పురిలో ముందుగా ప్రకటించిన విధంగానే కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌పై మొదటిగా దాడి చేసింది బీజేపీ ఢిల్లీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు కాగా, రెండో వ్యక్తి ఢిల్లీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అని ఆప్కే చెందిన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దాడి అనంతరం వీరిద్దరూ అక్కడ డ్యాన్స్ చేశారన్నారు. ఘటనపై చట్ట పరంగా ముందుకెళ్లే విషయమై నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అటువంటిదేమీ జరగలేదంది. -
ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
జెరూసలేం: ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, సమీప స్థావరాలపై పలు పేలుళ్లు జరిగినట్లు అక్కడి మీడియా వార్తలు వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎదురుదాడులతో విరుచుకుపడుతోంది.Israel strikes ‘military targets’ in Iran, IDF says, the Capitol of Iran, and Karaj city | at least 5 to 10 loud explosions have been heard already is that #true🇮🇷💔🇵🇸 #Hizbullah"World War 3"#Netanyahu#Hamas#iran#tehran#BlockElon#Gaza pic.twitter.com/AJspXIgAWz— Hasan LaLa Meister (@KPK_chronicles) October 26, 2024‘‘ఇజ్రాయెల్‌పై ఇరాన్ తరచూ దాడులకు దిగుతోంది. ప్రతీకరంగా ఎదురు దాడులు ప్రారంభించాం. ప్రస్తుతం ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఖచ్చితమైన దాడులు నిర్వహిస్తున్నాయి’’ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.అక్టోబరు 1న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై పెద్దఎత్తున మిసైల్స్‌తో మెరుపుదాడికి దిగింగి. దాదాపు 200 మిసైల్స్‌ను ఇరాన్.. ఇజ్రాయెల్‌పై ప్రయోగియోగించింది. ఆరు నెలల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ రెండోసారి ప్రత్యక్ష దాడికి దిగింది. లెబనాన్‌లో హెజ్బొల్లా గ్రూప్ చెందిన కీలక నేతను ఇజ్రాయెల్ అంతం చేయటంతో ఇరాన్.. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసింది.అక్టోబరు 7, 2023న పాలస్తీనాకు చెందిన హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి చేసి.. ఇజ్రయెల్‌పై పౌరులను గాజాకు బంధీగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి హమాస్‌ను అంతం చేయటమే టార్గెట్‌గా గాజాపై దాడులు చేస్తోంది. మరోవైపు.. గాజాపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్‌పై పోరులో హమాస్‌కు మద్దతుగా ఇరాన్, హెజ్బొల్లా గ్రూప్ చేరాయి.దాడులపై స్పందించిన ఇరాన్ఇజ్రాయల్ చేసిన దాడులపై ఇరాన్ స్పందించింది. ‘‘శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇలామ్, ఖుజెస్తాన్, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్ లక్ష్యంగా దాడులు జరిపింది. అయితే ఈ దాడుల కారణంగా పెద్దస్థాయిలో నష్టం జరగతేదు’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.చదవండి: సంధి దిశగా ఇజ్రాయెల్, హమాస్.. యుద్ధానికి ముగిసినట్టేనా? -
తుర్కియే వైమానిక సంస్థపై ఉగ్ర దాడి
అంకారా: తుర్కియే రాజధాని అంకారా నగర శివారులోని ఒక వైమానిక, రక్షణ రంగ సంస్థపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని తుర్కియే అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. 14 మంది గాయపడ్డారు. అయితే ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు? అనే వివరాలను బయటపెట్టలేదు. టుటాస్ అనే సంస్థ ప్రాంగణంలో దాడి జరిగినట్లు మంత్రి అలీ యెర్లికాయా చెప్పారు. తుర్కియేలో గతంలో కుర్ద్ మిలిటెంట్లు, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, వామపక్ష ఉగ్రవాదులు దాడులు జరిపారు. సంస్థలో భద్రతా సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో కొందరు ఆగంతకులు హఠాత్తుగా వచ్చి బాంబులు వేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రైవేట్ ఎన్టీవీ చానెల్ తన కథనంలో పేర్కొంది. అయితే ఆగంతకులు పారిపోలేదని లోపలి సిబ్బందిని బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నారని, ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తొలుత కేవలం బాంబు పేలుడు జరిగినట్లు వార్తలొచ్చాయి. సంస్థలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని హబర్‌టర్క్ టెలివిజన్ పేర్కొంది. -
దళిత యువతి సహానాది ప్రభుత్వ హత్యే
గుంటూరు మెడికల్ : కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి దాడిలో మరణించిన దళిత యువతి మధిర సహానాది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజిని స్పష్టం చేశారు. వారు మంగళవారం రాత్రి గుంటూరు జీజీహెచ్‌లో సహానా మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం, హిందూపురం, బద్వేలు, తెనాలిలో మహిళలపై జరిగినవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు. ఇటీవలి హత్యలు, దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, చట్టాలను ప్రభుత్వ పెద్దలు చుట్టాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. దళిత యువతి సహానాపై దాడి జరిగి మూడు రోజులు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం నుంచి స్పందనే లేదని చెప్పారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, బయటకు చెప్పుకోలేని అభద్రతా భావంలో సహానా తల్లిదండ్రులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ దాడిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితుడికి కఠిన శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే తక్షణమే స్పందించేవారని చెప్పారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత చేతగాని తనం వల్లే దాడులు, హత్యలు జరుగుతున్నాయని, పోలీసులు కళ్లున్న కబోదుల్లా ఉన్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. దాడులు, హత్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా, తిరిగి తమ పార్టీ నేతలపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్ ప్రవేశపెట్టారని, దాని ద్వారా మహిళలకు భరోసా లభించి, ధైర్యంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ యాప్ పనిచేయడంలేదని, అందువల్లే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. -
సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్:సర్వేజన సుఖీనోభవ అన్నది తమ సిద్ధాంతమని,తమ సంస్థల పట్ల సీఎం రేవంత్ ద్వేషబావంతో ఉన్నారని బీజేపీ సీనియర్‌నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం(అక్టోబర్22) ఈటల మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం పేరుతో మతోన్మాదులకు షెల్టర్ ఇస్తున్నారు.కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్. సీఎంను దించడానికి మత కల్లోలాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. మర్రి చెన్నారెడ్డిని దించడానికి,కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దించడానికి మతకల్లోల్లాలు సృష్టించారు.శవాల మీద రాజకీయాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. గుడిపై దాడిచేసిన వారిని పట్టుకునే దమ్ములేక ఓట్ల రాజకీయం కోసం శాంతియుత ర్యాలీ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. స్లీపర్ సెల్స్ ఉన్నాయని,రోహింగ్యాలు ఉన్నారని కేంద్రం హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నివారించలేకపోతోంది.టెర్రరిస్టులు ఎవరు ? రెచ్చగొట్టేవారు ఎవరు ? సంఘ విద్రోహ శక్తులు ఎవరో తేల్చాలి.హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్ విఫలమయ్యారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసమే బీజేపీ పనిచేస్తోంది. హిందూ కార్యకర్తల అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్న.చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేము’అని ఈటల హెచ్చరించారు.ఇదీ చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ -
భూకబ్జాను అడ్డుకున్న దళితులపై హత్యాయత్నం
ఓబులవారిపల్లె/రాజంపేట రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెచ్చిపోతున్న టీడీపీ నేతలు సోమవారం అన్నమయ్య జిల్లాలో దళితులపై హత్యాయత్నానికి తెగబడ్డారు. భూకబ్జాను అడ్డుకున్నందుకు కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1150లో దాదాపు 221 ఎకరాల భూమిని పెరుమాళ్లపల్లె దళితవాడ గ్రామస్తులు తాతల కాలం నుంచి వినియోగించుకుంటున్నారు. చదును చేసుకుంటున్నారు. ఈ భూమిలో తమకు పట్టాలివ్వాలని గతం నుంచే అధికారుల్ని కోరుతున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవల కాకర్లవారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఆ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నారు. సోమవారం జేసీబీ యంత్రాలతో చదును చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని పెరుమాళ్లపల్లి దళితవాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కాకర్లవారిపల్లికి చెందిన కస్తూరి వెంకటేష్‌నాయుడు తన అనుచరులతో కలిసి పథకం ప్రకారం తెచ్చుకున్న కర్రలతో ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. వీళ్లు తీవ్రంగా కొట్టడంతో పంట కృష్ణయ్య, పంట నరసింహులు, మడగలం ప్రభుదాస్, జనార్దన్, మరికొందరు గాయపడ్డారు.వీరిలో కృష్ణయ్య, నరసింహులు, ప్రభుదాస్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓబులవారిపల్లె ఎస్ఐ మహేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాకర్లవారిపల్లికి చెందిన కస్తూరి వెంకటేష్‌నాయుడు, కస్తూరి ఉమా, కస్తూరి శివయ్యనాయుడు, కస్తూరి కోటయ్య తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ భూములకు సంబంధించి సమన్వయం పాటించాలని, దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని రైల్వేకోడూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.కార్యకర్తల కోసం ప్రాణమిస్తా.. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల రైల్వేకోడూరు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సమస్యలొస్తే వాటి పరిష్కారం కోసం తన ప్రాణాలను సైతం అడ్డుపెడతానని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చెప్పారు. టీడీపీ నేతల హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన రాజంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. భూ కబ్జాలు, దాడులు సర్వసాధారణం అయిపోయాయని వాపోయారు. మహిళలకు సైతం రక్షణ లేకపోవడం బాధిస్తుందన్నారు. టీడీపీ నాయకులు ఎస్సీలపై దాడి చేయటం హేయమైన చర్యగా అభిప్రాయ పడ్డారు. ఉన్నతస్థాయికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఆయన వెంట పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఓబులవారిపల్లి మండల కన్వీనర్ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి తదితరులున్నారు. -
ఉత్తర గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
డెయిర్ అల్–బలాహ్: ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీట్ లాహియా పట్టణంపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 87 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారితో ఉత్తర గాజాలోని ఆస్పత్రులు పోటెత్తాయని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ మౌనిర్ అల్–బర్‡్ష పేర్కొన్నారు.ఆస్పత్రులపై దాడులు ఆపాలి: ఎంఎస్ఎఫ్ఉత్తర గాజాలోని ఆసుపత్రులపై వారి దాడులను వెంటనే ఆపాలని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్ఎఫ్)ఇజ్రాయెల్ దళాలకు పిలుపునిచ్చింది. ఉత్తర గాజాలో రెండు వారాలుగా కొనసాగుతున్న హింస, నిర్విరామ ఇజ్రాయెల్ సైనిక చర్యలు భయానక పరిణామాలను కలిగిస్తున్నాయని ఎంఎస్ఎఫ్ ఎమర్జెన్సీ కోఆర్డినేటర్ అన్నా హాల్ఫోర్డ్ తెలిపారు. ఉత్తర గాజాలో శనివారం అర్థరాత్రి నుంచే ఇంటర్నెట్ కనెక్టివిటీ నిలిచిపోయింది. దీంతో దాడుల సమాచారమే కాదు సహాయక చర్యలు కష్టంగా మారాయని తెలిపారు. రహస్య పత్రాలపై అమెరికా దర్యాప్తుఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళికలను అంచనా వేసే రహస్య పత్రాలు లీకవడం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా దర్యాప్తు చేస్తోందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 1న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా దాడులను నిర్వహించడానికి ఇజ్రాయెల్ సైనిక ఆస్తులను తరలిస్తోందని యూఎస్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ఈ పత్రాలు సూచిస్తున్నాయి. సిన్వర్ హత్య తర్వాత గాజాలో కాల్పుల విరమించాలని అమెరికా ఇజ్రాయెల్‌ను కోరుతోంది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. తమ వాహనంపై ఇజ్రాయెల్సైన్యం చేసిన దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు లెబనాన్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్‌లో పౌరుల మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా బీరుట్‌తోపాటు చుట్టుపక్కల కొన్ని దాడులను తగ్గించాలని అమెరికా రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ను కోరారు.ఉత్తర గాజాలో భారీ ఆపరేషన్ ఉత్తర గాజాలోని జబాలియాలో ఇజ్రాయెల్ గత రెండు వారాలుగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అక్కడ తిరిగి చేరిన హమాస్ మిలిటెంట్లపై ఆపరేషన్ ప్రారంభించినట్లు సైన్యం తెలిపింది. యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ దళాలు జబాలియాకు తిరిగి వచ్చాయి. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత గత ఏడాది చివరి నుంచి ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టిన ఉత్తర గాజా యుద్ధంలో భారీ విధ్వంసాన్ని చవిచూసింది.