ఉబర్ డ్రైవర్‌పై ఓ యువతి పెప్పర్ స్ప్రేతో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని మన్‌హట్టన్‌లో అర్ధరాత్రి సమయంలో పెప్పర్ స్ప్రేతో డ్రైవర్‌పై దాడికి దిగింది. కారులో నుంచి తప్పించుకుని పారిపోదామని ప్రయత్నించినా వదలకుండా ఆ మహిళ పెప్పర్ స్ప్రే కొట్టింది. దాడి చేయొద్దంటూ బాధితుడు వేడుకున్న కానీ ఆ మహిళ వినలేదు. చివరికి అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. దాడి సమయంలో యువతితో పాటు మరో మహిళ కూడా కారులో ఉంది.
నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణించి కేసు నమోదు చేశారు. అయితే.. డ్రైవర్‌పై ఎందుకు దాడి చేసిందన్నది మాత్రం తెలియలేదు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
అయితే ఈ దాడి ఘటన తర్వాత ఉబర్ ఆ యువతిపై నిషేధం విధించింది. భవిష్యత్‌లో ఎప్పుడూ మళ్లీ తమ సర్వీస్‌లను వినియోగించుకోడానికి వీల్లేకుండా బ్యాన్ చేసింది. డ్రైవర్‌పై దాడి చేసిన తీరు ఆందోళనకరం.. ఇది సరికాదు. హింసను సహించం. ఉబర్ ప్లాట్‌ఫామ్ నుంచి ఆ యువతిని బ్యాన్ చేస్తున్నట్లు ఉబర్ వెల్లడించింది.
NYC
Woman randomly maces Uber driver ‘because he's brown’ pic.twitter.com/GKHBkBvESr— The Daily Sneed™ (@Tr00peRR) August 2, 2024
Comments
Please login to add a commentAdd a comment