Pepper spray
-
సిద్ధిఖీ హత్య కేసులో కొత్త కోణం.. హంతకుల దగ్గర పెప్పర్ స్ప్రే!
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పరారైన మూడవ నిందితుని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాల్పులకు ముందు నిందితులు పెప్పర్ స్ప్రే వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ కేసులో పట్టుబడిన నిందితులిద్దరినీ అక్టోబర్ 24 వరకు పోలీసు కస్టడీకి పంపారు.ముంబై క్రైమ్ బ్రాంచ్ నిందితులిద్దరి నుంచి రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకుంది. నిందితులు తమ వెంట పెప్పర్ స్ప్రే కూడా తీసుకొచ్చారు. ఒక నిందితుడు గాలిలోకి పెప్పర్ స్ప్రే వెదజల్లి కాల్పులు జరపబోతుండగా, మూడో నిందితుడు(పరారీలో ఉన్న) శివకుమార్ నేరుగా కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో బాబా సిద్ధిఖీ వెంట ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. ఆకస్మిక దాడిలో వారు ఏమీ చేయలేకపోయారు.ఈ కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ తరపున హత్యకు బాధ్యత వహించినట్లు ప్రకటించిన షుబు లోంకర్ సోదరుడు ప్రవీణ్ లోంకర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షుబు లోంకర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులకు ప్రవీణ్ లోంకర్ ఆశ్రయం కల్పించాడు. బాబా సిద్ధిఖీతో పాటు అతని కుమారుడు జీషన్ సిద్ధిఖీని కూడా చంపాలని ఆదేశాలు అందాయని పోలీసులకు పట్టుబడిన నిందితులు విచారణలో తెలిపారు. డీసీపీ క్రైమ్ బ్రాంచ్ దత్తా నలవాడే తెలిపిన వివరాల ప్రకారం అరెస్టయిన నిందితులిద్దరి నుంచి 28 లైవ్ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య? -
వైరల్ వీడియో.. ఉబర్ డ్రైవర్‌పై పెప్పర్ స్ప్రేతో యువతి దాడి
ఉబర్ డ్రైవర్‌పై ఓ యువతి పెప్పర్ స్ప్రేతో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని మన్హట్టన్లో అర్ధరాత్రి సమయంలో పెప్పర్ స్ప్రేతో డ్రైవర్‌పై దాడికి దిగింది. కారులో నుంచి తప్పించుకుని పారిపోదామని ప్రయత్నించినా వదలకుండా ఆ మహిళ పెప్పర్ స్ప్రే కొట్టింది. దాడి చేయొద్దంటూ బాధితుడు వేడుకున్న కానీ ఆ మహిళ వినలేదు. చివరికి అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. దాడి సమయంలో యువతితో పాటు మరో మహిళ కూడా కారులో ఉంది.నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణించి కేసు నమోదు చేశారు. అయితే.. డ్రైవర్‌పై ఎందుకు దాడి చేసిందన్నది మాత్రం తెలియలేదు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.అయితే ఈ దాడి ఘటన తర్వాత ఉబర్ ఆ యువతిపై నిషేధం విధించింది. భవిష్యత్‌లో ఎప్పుడూ మళ్లీ తమ సర్వీస్‌లను వినియోగించుకోడానికి వీల్లేకుండా బ్యాన్ చేసింది. డ్రైవర్‌పై దాడి చేసిన తీరు ఆందోళనకరం.. ఇది సరికాదు. హింసను సహించం. ఉబర్ ప్లాట్‌ఫామ్ నుంచి ఆ యువతిని బ్యాన్ చేస్తున్నట్లు ఉబర్ వెల్లడించింది.NYCWoman randomly maces Uber driver ‘because he's brown’ pic.twitter.com/GKHBkBvESr— The Daily Sneed™ (@Tr00peRR) August 2, 2024 -
కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి.. కత్తులతో పొడిచి హత్య
హైదరాబాద్: జిమ్‌లో వ్యాయామం చేసి సెల్ఫోన్లో మాట్లాడుతూ సెల్లార్లో ఉన్న బైక్ తీసుకునేందుకు వచ్చిన ఓ యువకుడి కళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు పెప్పర్ స్ప్రే కొట్టి కత్తులతో పొడిచి చంపిన ఘటన మంగళవారం సాయంత్రం రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెలబ్రిటీ జిమ్ సెల్లార్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడ అలీజీపూర్ ప్రాంతానికి చెందిన రాహుల్‌సింగ్ (26) ప్రతిరోజూ ద్విచక్ర వాహనంపై సెలబ్రిటీ జిమ్‌లో వ్యాయామం కోసం వస్తుంటాడు. మంగళవారం సాయంత్రం జిమ్‌కు వచ్చి వ్యాయామం పూర్తి చేశాడు. అనంతరం ఫోన్లో మాట్లాడుతూ సెల్లార్ పార్కింగ్‌లో ఉన్న బైక్‌ను తీసుకునేందుకు కిందకు వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న నలుగురు యువకులు రాహుల్‌సింగ్ కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి.. కత్తులు, పంచ్‌లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రాహుల్‌సింగ్ కుప్పకూలిపోయాడు. ఈ ఘటన చూసి అడ్డుకునేందుకు వెళ్లిన సెక్యూరిటీ గార్డుకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న రాహుల్ సింగ్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దాడి చేసిన యువకులు అనంతరం ద్విచక్ర వాహనాలపై పారిపోయినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాడికి సంబంధించిన పూర్తి దృశ్యాలు సెల్లార్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు కత్తులు, పెప్పర్ స్ప్రే బాటిల్, ఒక పంచ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ డివిజన్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను విచారిస్తే హత్యకు గల కారణాలు తెలుస్తాయని డీసీపీ వెల్లడించారు. -
మహిళను రోడ్డుపై పడేసి.. పెప్పర్ స్ప్రే చల్లి..
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నల్లజాతీయురాలిని పోలీసు నడిరోడ్డుపై పడేశాడు. అనంతరం ఆమెను కాలితో అదుముతూ పెప్పర్ స్ప్రే చల్లాడు. ఊపిరాడటం లేదని మహిళ చెబుతున్నా.. వినకుండా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. లాంకాస్టర్‌లోని వింకో కిరాణా దుకాణంలో దొంగతనానికి సంబంధించిన కేసులో ఓ వ్యక్తి, మహిళ నిందితులుగా ఉన్నారు. వీరివురు రోడ్డుపై కనిపించగా.. పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. మొదట ఆ వ్యక్తిని పట్టుకుని సంకేళ్లు వేశారు. ఆ దృశ్యాలను మహిళ వీడియో తీస్తుంది. దీనిని గమనించిన పోలీసు కోపంతో ఆమె వైపు దూసుకొచ్చాడు. అనంతరం మహిళను పట్టుకుని రోడ్డుపైనే లాగి పడేశాడు. ఆ తర్వాత ఆమెను కాలుతో అదుముతూ పెప్పర్ స్ప్రే చల్లాడు. బాధిత మహిళ ఇప్పటికే క్యాన్సర్‌తో పోరాడుతోంది. This is Lancaster, California. A Los Angeles county sheriffs deputy throws a Black woman to the ground and brutalized her for filming them arresting her husband. Filming the police is not illegal. This is brutality. Arrest this pig. pic.twitter.com/BKg9dnZX7M — Bishop Talbert Swan (@TalbertSwan) July 4, 2023 ఈ మొత్తం సన్నివేశాన్ని పక్కనే కారులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్త నెట్టింట తెగ వైరల్ అయింది. పోలీసుల దురుసు ప్రవర్తనపై నెటిజన్లు ఫైరయ్యారు. ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై స్బందించిన పోలీసు విభాగం.. సదరు పోలీసులను విధుల నుంచి తప్పించినట్లు చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇదీ చదవండి: ఆకాశంలో తలకిందులుగా ఆగిపోయిన రోలర్ కోస్టర్.. -
ఢిల్లీ మెట్రో మరో వీడియో వైరల్.. తోటి మహిళపై పెప్పర్ స్ప్రే కొట్టిన ప్యాసెంజర్..
-
నేలమీద పడేసి చేతులు విరగ్గొట్టి
టెన్నెసీ: అమెరికాలో పోలీసుల క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగర పోలీసులు 29 ఏళ్ల నల్లజాతీయుడ్ని దారుణంగా హింసించడంతో ఆ దెబ్బలకు తాళలేక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల మొదట్లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 2020 మేలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి గొంతుపై బూటు కాలుతో తొక్కి చంపిన ఘటనని తలపించేలా ఈ దౌర్జన్య కాండ కూడా సాగింది. కాకపోతే తాజా ఘటనకు పాల్పడ్డ పోలీసులు కూడా నల్లజాతీయులే! ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడెక్స్‌లో పనిచేసే 29 ఏళ్ల టైర్ నికోల్స్‌ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మెంఫిస్ పోలీసులు జనవరి 7న ఆపారు. వాహనంలోంచి లాగి నేలమీద పడేసి దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆరుగురు పోలీసులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి, ఎలక్ట్రిక్ పరికరాలతో షాకిచ్చి కిండపడేశారు. ముఖంపై ఇష్టారాజ్యంగా కొట్టారు. వికృతానందంతో నవ్వుతూ భుజం విరిగేలా కొట్టారు. ‘మామ్ , మామ్’ అంటూ నికోల్స్ దీనంగా రోదిస్తున్నా రెండు నిమిషాల పాటు ఆపకుండా చితక్కొట్టారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 10న మరణించాడు. పోలీసులు కొడుతున్న వీడియో చూసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్లంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. పోలీసులపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు. నికోల్స్‌కు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. నికోల్స్ తన భుజంపై తల్లి వెల్స్ పేరును టాటూగా వేసుకున్నాడు. తన కొడుకు దారుణ హింసకు గురై మరణించాడంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. బైడెన్ దిగ్భ్రాంతి టైర్ నికోల్స్పై పోలీసుల హింసాకాండపై బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే మనసు కలచివేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయులకు దేశంలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలకి ఇది మరొక ఉదాహరణన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. నికోల్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. -
మహిళలు పెప్పర్ స్ప్రే తెచ్చుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్ : మెట్రోలో ప్రయాణించే మహిళలు ఆత్మరక్షణ కోసం తమ వెంట పెప్పర్ స్ప్రే తెచ్చుకునే వెసులుబాటును హైదరాబాద్ మెట్రో కల్పిస్తోంది. బెంగళూరు మెట్రోలో అమలులో ఉన్న ఈ విధానాన్ని హైదరాబాద్ మెట్రోలో పరిచయం చేస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే మెట్రోలో భద్రతా కార్యకలాపాలు పర్యవేక్షించే అధికా రులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. దిశ హత్యాచారం తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
దిశ కేసు: హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్‌లో జరిగిన దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో మహిళల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులో ప్రయాణం సందర్భంగా మహిళలు తమ వెంట పెప్పర్ స్పే తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఇప్పటికే బెంగళూరు మెట్రో మహిళలు ప్రెప్పెర్ స్ప్రేలతో ప్రయాణించేందుకు అనుమతించగా.. హైదరాబాద్ మెట్రో కూడా అదే దారిలో సాగుతూ నిర్ణయం తీసుకుంది. షాద్‌నగర్ సమీపంలో అత్యంత అమానుషంగా జరిగిన దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ఇకనుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్లోకి అనుమతిస్తామని బెంగళూరు మెట్రో ప్రకటించగా. తాజాగా హైదరాబాద్ మెట్రో కూడా అదే నిర్ణయం తీసుకుంది. మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. మెట్రోరైలులో సాంకేతిక కారణాలతో సాధారణంగా పెప్పర్ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఎవరైనా వీటిని తీసుకొస్తే చెకింగ్ పాయింట్ల వద్దే వాటిని పడేయాల్సి వచ్చేది. దీన్ని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు అలాంటివి మహిళల వద్ద అవి దొరికితే సీజ్ చేసేవారు. కానీ ఇకనుంచి మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేశారు. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
షాద్‌నగర్ ఘటన ఎఫెక్ట్: మెట్రో కీలక నిర్ణయం
బెంగళూరు: షాద్‌నగర్‌లో జరిగిన దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. మహిళల రక్షణ కోసం నిబంధనలు మార్పు చేస్తూ బెంగళూరు మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా బెంగళూరు మెట్రో చేసిన ఆ ప్రకటన గురించి దేశం అంతా చర్చించుకుంటోంది. మహిళల రక్షణ కోసం ఇక నుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్లోకి అనుమతిస్తామని ప్రకటించింది. లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఉన్నతాధికారులు వెల్లడించారు. సాధారణంగా రైళ్లలో చెకింగ్ పాయింట్ దగ్గర గతంలో వీటిని పక్కన పడేసేవారు, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సాధారణంగా మెట్రోలో టెక్నికల్ అంశాలు పరిశీలిస్తే ఎప్పుడూ పెప్పర్ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. దీన్ని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు అలాంటివి మహిళల వద్ద గుర్తిస్తే ఇది వరకు వాటిని సీజ్ చేసేవారు. కానీ ఇక నుంచి మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రతిక్షణం నిఘా ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. -
కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.30లక్షలు దోపిడీ
రాంగోపాల్‌పేట్: ఓ బంగారం షాపు నుంచి మరో దుకాణానికి నగదు తీసుకుని వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.30లక్షలు దోపిడీకి పాల్పడిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ జనరల్ బజార్లో శ్రీనివాస వర్మ అనే వ్యక్తి రోహిత్ జ్యువెలర్స్ పేరుతో బంగారు నగలను ఆర్డర్‌పై తయారు చేసి షాపులకు అందజేసేవాడు. అతడి దుకాణానికి ఎదురుగానే అనిల్ అనే వ్యక్తి నవ్కార్ జూవెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే అనిల్ నుంచి శ్రీనివాసవర్మకు నగల తయారీకి సంబంధించి కొంత నగదు రావాల్సి ఉంది. దీనికితోడు మరి కొంత మొత్తాన్ని బదులు ఇవ్వాలని శ్రీనివాస వర్మ అతడిని కోరాడు. నగదు సిద్ధం చేసిన అనిల్, శ్రీనివాస వర్మకు సమాచారం అందించడంతో అతను షాపులో పనిచేసే రూపారామ్ అనే వ్యక్తిని నవ్కార్ జూవెలర్స్కు పంపించాడు. మంగళవారం రాత్రి 8గంటల ప్రాంతంలో రూపారామ్ రూ.30లక్షల నగదు తీసుకుని మొదటి అంతస్తు నుంచి కిందికి వస్తుండగా మెట్లపై గుర్తు తెలియని వ్యక్తి అతడిని అడ్డగించి కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి చేతిలో బ్యాగు లాక్కుని పరారయ్యాడు. అప్పటికే రోడ్డుపై ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్ది సేపటికి తేరుకున్న రూపా రామ్ యజమానికి ఈ విషయం చెప్పడంతో అతను మహంకాళి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల అదుపులో అనుమానితులు మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. రెండు షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందిని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలతో గాలింపు చోరీపై సమాచారం అందడంతో ఉత్తర మండలం పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల అధికారులు, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. నిందితులు జనరల్‌బజార్ నుంచి కళాసిగూడ, మంజు థియేటర్ మీదుగా వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. డీసీపీ పరిశీలన బుధవారం ఉదయం ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని త్వరలోనే కేసును చేధిస్తామని డీసీపీ పేర్కొన్నారు. తెలిసిన వారి పనేనా? ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కదలికలు, దొంగతనం జరిగిన తీరును బట్టి తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు బైక్‌పై బట్టర్ ఫ్లై బేకరి గల్లీ నుంచి బయటికి వచ్చి అక్కడే దాదాపు అరగంట పాటు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. అనంతరం వీరు మహంకాళి దేవాలయం ముందు నుంచి నవకార్ జ్యువెలరీ షాప్ వరకు వెళ్లారు. వారిలో ఒకరు బైక్‌పై కూర్చుని ఉండగా మరొకరు పైకి వెళ్లి మొదటి అంతస్తులో బయటి నుంచి చూసి కిందికి వచ్చాడు. ఆ తర్వాత రూపారామ్ నగదు తీసుకుని కిందకు దిగుతుండగా మెట్లపైనే అడ్డుకుని బ్యాగ్ లాక్కుని పరారయ్యారు. డబ్బు ఏ సమయానికి, ఎవరు, ఎలా తీసుకుని వస్తారనేదానిపై నిందితులకు పక్కా సమాచారం ఉన్నందునే నేరుగా రూపారామ్‌ను అడ్డుకుని దోపిడీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే రూపారామ్ కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టినా అతను కేకలు వేయకపోవడంతో అతడి పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అతను గట్టిగా అరిస్తే ఆ సమయంలో రోడ్డుపై వెళుతున్న ప్రజలు, వ్యాపారులు అక్కడికి చేరుకుని దొంగలను పట్టుకునే అవకాశం ఉండేది. దీనికితోడు నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 రోజుల క్రితమే చోరీకి గురైనట్లు పోలీసు రికార్డులు పేర్కొంటున్నాయి. రెండు జ్యువెలరీ సంస్థల యజమానులు పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహిస్తుండటంతో పథకం ప్రకారమే దొంగతనానికి స్కెచ్ వేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మహిళలపై పెప్పర్ స్ప్రే దాడి..!
సాక్షి, హైదరాబాద్: నగరంలో సోమవారం తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆరుగురు మహిళలపై దాడికి యత్నించాడు. ఈ ఘటన పాతబస్తీలోని కాలాపత్తర్‌లో జరిగింది. మహ్మద్ యాసిన్ అనే యువకుడు కారులో వెళ్తున్న ఆరుగురు మహిళలపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. పారిపోతున్న నిందితున్ని కారు డ్రైవర్ స్థానికుల సాయంతో పట్టుకున్నాడు. దేహశుద్ధి చేసిన స్థానికులు యాసిన్‌ను పోలీసులకు అప్పగించారు. స్ప్రే కారణంగా అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
మహిళలపై పెప్పర్ స్ర్పేతో దాడి..
-
వారిపై చర్యలకు ఆదేశించలేం
‘పెప్పర్ స్ప్రే బాధ్యులపై’ పొన్నం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో లోక్‌సభలో జరిగిన పెప్పర్ స్ప్రే ఉదంతంపై దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారికి పెన్షన్, ఇతర భత్యాలు తదితర ప్రయోజనాలన్నింటినీ ఉపసంహరించేలా ఆదేశించాలని, కేంద్రం, లోక్‌సభ సెక్రటరీ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ ల ను ప్రతివాదులుగా చేర్చుతూ పొన్నం పిటిషన్ వేశారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాగా.. 2014 lనాటి ఘటనపై ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు గతంలో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలపగా..ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. -
నటి కోపంతో పెప్పర్ స్ప్రే తీసింది!
లండన్: హాలీవుడ్ నటి వియోలా డెవిస్ కాస్తయితే తన పెప్పర్ స్ప్రేకు పని చెప్పేదట. అది కూడా తను నటిస్తున్న సినిమాలోనే జోకర్ పాత్ర చేస్తున్న జారెడ్ లిటో మీద చల్లడానికి. 'ఒక్కసారిగా కోపంతో అతిడి మీద పెప్పర్ స్ప్రే చల్లాలనుకున్నాను' అని వియోలా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించింది. వియోలాకు అంతలా ఎందుకు కోపం వచ్చిందంటే.. ఇటీవల ఆమె నటించిన 'సూసైడ్ స్క్వాడ్' చిత్రంలో జారెడ్ లిటో జోకర్ పాత్రలో నటించాడు. షూటింగ్ సమయంలో జారెడ్ తన సహనటులకు 'సరదా'గా కొన్ని గిఫ్ట్‌లు పంపించాడు. ఆ గిఫ్ట్‌లు ఎలాంటివంటే ఒకరికి ప్రాణంతో ఉన్న ఎలుక, మరొకరికి అడల్ట్ మేగజైన్, టీం మొత్తానికి కలిపేమో చనిపోయిన పంది. అందులో భాగంగా వియోలాకు ఓ బుల్లెట్ బాక్స్‌ను అతడు పంపాడు. అది చూసి ఆమె భయపడిందట. అయితే 'సూసైడ్ స్క్వాడ్' షూటింగ్ పూర్తయిన తరువాత మొదటిసారి జారెడ్ను కలిసినప్పుడు 'కోపంతో అతడిపై చల్లడానికి పెప్పర్ స్ప్రే తీశాను' అంటూ అతడు పంపిన సరదా గిఫ్ట్‌లను గురించి వియోలా వెల్లడించింది. విల్ స్మిత్ నటించిన సూసైడ్ స్క్వాడ్ ఆగస్టు 5న విడుదలకానుంది. -
షాకింగ్ ఘటన... పోలీసుల మైండ్ బ్లాంక్!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ చిన్నారి కిరాతకానికి ఒడిగట్టింది. లూటీ చేయడంలో భాగంగా ఓ వృద్ధురాలిని బాలిక చితకబాదిన ఘటన న్యూఢిల్లీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై ముక్కుమీద వేలేసుకుంటున్నారట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ బాలిక(11) నిన్న సాయంత్రం తల్లి పనిచేసే చోటుకు బయలుదేరింది. రాజౌరి గార్డెన్ ప్రాంతానికి రాగానే ఏం జరిగిందో తెలీదు కానీ, ఆ దారిలో వెళ్తోన్న 71 ఏళ్ల వృద్ధురాలు మదాన్ పై దాడికి పాల్పడింది. మొదటగా బ్లాక్ పెప్పర్ స్ప్రేని పెద్దావిడ కళ్లల్లో కొట్టింది. ఆ వెంటనే పూలకుండీతో ఆమెపై దాడికి దిగి ఆమెను చితకబాదింది. దీంతో దెబ్బలకు తట్టుకోలేక ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. మదాన్ అరుపులు విన్న కొందరు వెంటనే అక్కడికి వచ్చి ఆమెను కాపాడి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకోగానే ఆ బాలికను స్థానికులు వారికి అప్పగించారు. వారు ఆ బాలికను చిన్నారుల కేర్ హౌస్ కు తరలించారు. బాలిక ఎందుకు ఈ దారుణానికి పాల్పడిందో స్పష్టతరాలేదని చెప్పారు. వృద్ధురాలి వద్ద ఉన్న విలువైన వస్తువులు చోరీ చేయడానికి ఉద్దేశపూర్వకంగానే బాలిక ఈ పని చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పెప్పర్ స్ప్రేతో సంచరించాల్సిన అవసరం ఏంటన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వృద్ధురాలిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు వివరించారు. -
ఏపీ మంత్రి ఎదుట పెప్పర్ స్ప్రేలతో కొట్లాట!
తిరుపతి: మంత్రి ఎదురుగానే అధికార టీడీపీ నేతలు కొట్టుకున్నారు. పెప్పర్ స్ప్రేతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన తిరుపతిలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో జరిగింది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి సాక్షిగా శుక్రవారం ఈ ఘటన జరిగింది. పీలేరు టీడీపీ నేతలు రెండు వర్గాలుగా వీడిపోయి పెప్పర్ స్ప్రేలతో దాడులు చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పరం పోలీసు స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. -
పెప్పర్ స్ప్రే అమ్మకాలు పెరిగాయి
మెయింజ్: జర్మనీలోని కోలోగ్నిలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా స్థానికులపై మూకుమ్మడి రేపులు జరిగిన నాటి నుంచి దేశంలో పెప్పర్ స్ప్రేలు, ఆత్మరక్షణ ఆయుధాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని జర్మనీ అధికారులు, పారిశ్రామిక వర్గాలు వెల్లడించాయి. సీఎస్ గ్యాస్ స్ప్రే, స్టన్ గన్లకు కూడా యమ గిరాకీ ఉందని, ఆ రోజు నుంచి సాధారణ అమ్మకాలకన్నా వీటి అమ్మకాలు రెండింతలు పెరిగాయని ఆ వర్గాలు వివరించాయి. ఆ రోజు జరిగిన మూకుమ్మడి రేప్‌లు, దోపిడీలకు సంబంధించి మొత్తం 670 కేసులు నమోదుకాగా వాటిలో రేప్ కేసులో 350 ఉన్నాయి. -
ఆ రెండూ నా బ్యాగులో ఉండాల్సిందే!
అమ్మాయిలు రోడ్డు మీదకొస్తే చాలు.. ఆకతాయిలు అల్లరిపెట్టడానికి ట్రై చేస్తుంటారు. రోజులు మారుతున్నా ఈ విషయంలో మాత్రం మార్పు లేదు. అందుకే ఆడవాళ్లకు ఆత్మరక్షణ తెలిసి ఉండాలని నమిత అంటున్నారు. మలేసియాలో జరిగిన ‘తర్కాప్పు’ అనే తమిళ చిత్రం ఆడియో వేడుకలో ఆమె అతిథిగా పాల్గొన్నారు. తర్కాప్పు అంటే ఆత్మరక్షణ అని అర్థం. సందర్భోచితంగా ఈ వేదికపై ఆత్మరక్షణ గురించి నమిత మాట్లాడుతూ - ‘‘నా స్కూల్ డేస్‌లో కొంతమంది అబ్బాయిలు నా వెంటపడేవాళ్లు. బస్సులో వెళ్లేటప్పుడు తాకడానికి ట్రై చేసేవాళ్లు. అలాంటివాళ్లకు బుద్ధి చెప్పాలంటే బ్యాగులో సేఫ్టీ పిన్ను పెట్టుకోవాల్సిందే అనుకున్నాను. ఆ మర్నాడు గుర్తుగా బ్యాగులో పెట్టుకుని వెళ్లాను. నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించాలని చూసినవాణ్ణి పిన్నీసుతో గుచ్చాను. అతను పైకి చెప్పలేక బాధను దింగమింగుకోవడం చూసి, చాలా ఆనందపడిపోయాను. పెప్పర్ స్ప్రే గురించి ఇప్పుడిప్పుడే జనాల్లో అవగాహన వస్తోంది. కానీ, టీనేజ్ దాటినప్పుడే నాకు దాని గురించి తెలుసు. పిన్నీసులతో పాటు పెప్పర్ స్ప్రే కూడా బ్యాగులో ఉంచుకోవడం మొదలుపెట్టాను. ఆడవాళ్లు బయటికెళ్లేటప్పుడు పిన్నీసులు, పెప్పర్ స్ప్రే కచ్చితంగా బ్యాగులో ఉండేలా చూసుకోవాలి. ఎవరో వచ్చి కాపాడతారు? అని ఎదురు చూసే బదులు మనల్ని మనం రక్షించుకోవాలి. పిరికివాళ్లను వేధిస్తారు. ధైర్యవంతుల జోలికి రావడానికి సాహసించరు. అందుకే ఆడవాళ్లు ధైర్యంగా ఉండాలి’’ అని చెప్పారు. -
శరణార్థులపై పెప్పర్ స్ప్రే ప్రయోగం
తమ దేశంలోకి వెల్లువలా తరలివస్తున్న శరణార్థులను నియంత్రించేందుకు పలు ప్రాంతాల్లో తాము పెప్పర్ స్ప్రే ఉపయోగించినట్లు క్రొయేషియా పోలీసులు వెల్లడించారు. ఒపటోవా, తూర్పు క్రొయేషియా ప్రాంతాల్లో ఇలా చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధఙ జెలెనా బికిక్ తెలిపారు. శరణార్థులు బస్సులో ఎక్కేందుకు ఒకరిని ఒకరు విపరీతంగా తోసుకుంటున్నారని, ఈ తోపులాటను ఆపేందుకు పోలీసులకు మరో ప్రత్యామ్నాయం లేక పెప్పర్ స్ప్రే ఉపయోగించారని చెప్పారు. ఈ తొక్కిసలాటలో పిల్లలు ఇరుక్కుపోకుండా ఉండాలనే అలా చేశామంటున్నారు. అయితే, ఇద్దరు పిల్లల మీద కూడా పొరపాటున ఈ స్ప్రే పడిందని ఆమె చెప్పారు. వెంటనే రెడ్ క్రాస్ వలంటీర్లు ఆ పిల్లలను ఆస్పత్రికి తరలించారు. గడిచిన వారంలో దాదాపు 44 వేల మంది శరణార్థులు క్రొయేషియాకు వచ్చారని క్రొయేషియా హోంశాఖ మంత్రి తెలిపారు. -
లక్నో పోలీసుల చేతికి ‘పెప్పర్-డ్రోన్’!
లక్నో: అల్లరిమూకలపై నిఘా పెట్టడంతో పాటు అవసరమైతే వారిపై పెప్పర్ స్ప్రేను చల్లేందుకు ఉపయోగపడే పెప్పర్-డ్రోన్ (మానవ రహిత విమానం)ను లక్నో పోలీసులు సమకూర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదివారం దీన్ని ఆవిష్కరించారు. ప్రజా సీసీటీవీ ప్రాజెక్టు, నగరంపై నిఘా ప్రాజెక్టు డ్రోన్లను యాదవ్ ప్రారంభించారు. -
గోరంత ఆయుధం
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను గోటితో అరికట్ట వచ్చు. హాకథాన్‌లో డిజైన్ అయిన ఈ గోరంత ఆయుధం వ నితలకు కొండంత ధైర్యాన్నిస్తుంది. సోమవారం హైటెక్స్‌లో ప్రారంభమైన మెట్రోపొలిస్‌లో ఈ బుల్లి బాడీగార్డ్ టాక్ ఆఫ్ ద ఈవెంట్‌గా మారింది. ‘మెట్రొపొలిస్’ ప్రదర్శనలో బెస్ట్ ఫైవ్ హాకథాన్ థాట్స్‌లో ఒకటిగా నిలిచింది. చూడటానికి రిస్ట్ వాచ్‌లా కనిపించే ఈ సేఫ్టీ డివైస్ ఆపదలో ఉన్న మహిళను అన్నిరకాలుగా ఆదుకుంటుంది. ఒకటిన్నర అంగుళం పొడవులో ఉండే ఈ డివైజ్‌లో పెప్పర్ స్ప్రే ఉంటుంది. బటన్ నొక్కితే చాలు కామాంధుల కళ్లు మండిపోతాయి. ఎప్పుడైతే పెప్పర్ స్ప్రే బటన్ ప్రెస్ చేస్తామో.. వెంటనే అలారమ్ మోగుతుంది. బాధితురాలున్న ప్రదేశం వివరాలు సర్వర్‌కు చేరుకుంటాయి. ఆ వివరాలన్నీ అక్కడి నుంచి నేరుగా బాధితురాలికి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు చేరిపోతాయి. తక్కువ ధరలో లభించే ఈ డివైజ్ వాటర్‌ప్రూఫ్ కూడా కావడం విశేషం. ఒకసారి చార్జింగ్ పెడితే 36 గంటలు పనిచేస్తుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కుర్రాడు సిద్ధార్థ్ దాస్, గ్రాడ్యుయేట్ బీరేంద్రశేఖర్తో కలసి ఈ డివైజ్‌ను రూపొందించాడు. ఒడిశాకు చెందిన సిద్ధార్థ్ ఎస్ఆర్నగర్లోని శ్రీచైతన్య కాలేజ్‌లో గతేడాది ఇంటర్ పూర్తి చేశాడు. సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాల తయూరీపై ఆసక్తి ఉన్న సిద్ధార్థ్.. యువతుల రక్షణ కోసం దీనిని రూపొందించానని చెబుతున్నాడు. - సరస్వతి రమ -
కదలండి ముందుకు.. నిర్భయంగా..
ఢిల్లీలో నిర్భయ.. హైదరాబాద్‌లో అభయ.. ఆడపిల్ల బయటకు వెళ్లిందంటే చాలు ఇంటికొచ్చేవరకూ తల్లిదండ్రులకు టెన్షన్. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో.. ? ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో..? అన్న భయం వారిని అనునిత్యం వెంటాడుతుంది. కారణం.. నిత్యం ఎక్కడో ఒకచోట యువతులపై లైంగికదాడులు జరుగుతుండడం. కామాంధులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. ఏదో ఏ మూల ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులను బాధిస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో యువతులు స్వీయరక్షణపై దృష్టి సారిస్తున్నారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరి ఆసక్తిని గమనిస్తున్న వివిధ కంపెనీలు రక్షణ కోసం వివిధ రకాల ఉత్పత్తులు చేస్తూ.. మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ వస్తువులన్నీ ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్‌తోపాటు నగరంలోని వివిధ షాపుల్లో లభిస్తున్నాయి. వాటిలో కొన్ని... - కరీంనగర్ క్రైం * మహిళల రక్షణకు మార్గాలనేకం.. * లైంగిక దాడులు ఎదుర్కొనేందుకు కొత్త ఉత్పత్తులు * ఇప్పటికే వినియోగంలో పెప్పర్ స్ప్రే, మొబైల్ యాప్స్ * అందుబాటులోకి రానున్న బ్రాస్లెట్లు, నెక్లెస్‌లు, జాకెట్లు బజ్జింగ్ యాంటీ రేప్ డివైస్ ఈ అత్యాచార వ్యతిరేక పరికరాన్ని మొబైల్గానీ.. బ్యాగ్కుగానీ.. చేతికిగానీ.. వేలాడదీసుకోవచ్చు. ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే తప్పించుకునే క్రమంలో ఈ పరికరానికి ఉన్న రాడ్ లాంటిది లాగితే చాలు పెద్ద శబ్దంతో సుమారు 90 డెసిబుల్స్‌తో అలారం మోగుతుంది. ఈ శబ్దంతో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమవుతారు. దుండగులు పారిపోయే అవకాశాలుంటాయి. ఈ డివైస్ చిన్నగా.. అందంగా ఉండడంతోపాటు చూడడానికి అలంకార వస్తువుగా కనిపిస్తుంది. తీసుకెళ్లడం కూడా చాలా సులభం. బరువు తక్కువగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్... స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్లో పలు రకాల మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అనుకోని ప్రమాదం ఏర్పడినప్పుడు స్పందించే విధానం, కాపాడుకోవడానికి ప్రత్యేకంగా పలు కంపెనీలు యాప్స్ రూపొందించాయి. మీ మొబైల్లో ‘విత్ యూ, మైపానిక్ అలారం, ఏఓఎస్ ఎమర్జెన్సీ, గ్లోబల్ ఎస్ఓఎస్, అటాక్ అలారం, ఎస్ఎంఎస్ వంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెప్పర్ స్ప్రే స్వయరక్షణ కోసం మహిళలు, యువతులు ఎక్కువగా వినియోగిస్తున్న ఉత్పత్తులో పెప్పర్ స్ప్రే ప్రధానమైంది. నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా యువతులు వారి వెంట పుప్పర్ స్ప్రే ఉంచుకోవడం పరిపాటిగా మారింది. దాడి చేయడానికి వచ్చిన వారిపై దీనిని స్ప్రే చేస్తే వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. కళ్లు మంటలు లేస్తాయి. ఆ సమయంలో మహిళలు తప్పించుకోవచ్చు. అన్ని సమయాల్లో దీనిని వెంట తీసుకెళ్లడం సులభం. అందుకే దీనిని చాలామంది వెంట ఉంచుకుంటున్నారు. యాంటీ రేప్ అండర్వేర్.. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ రేప్ ఇన్నర్‌వేర్ ఇది. దీనిని గతేడాది చెన్నైకి చెందిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎస్హెచ్ఈ (సొసైటీ హర్నెసింగ్ ఎక్విప్మెంట్)ను రూపొందించారు. సాధారణ నైటీ మాదిరిగా కనిపిం చే దీని లో దుస్తుల్లో 3800 కిలో వోల్టుల విద్యుత్‌షాక్ ఇచ్చే సామర్థ్యం ఉంటుంది. వీటికి అమర్చిన జీపీఎస్ పరికరం సహాయంతో బాధితులు ఎక్కడ ఉన్నా.. వెంటనే బంధువులు, పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది. ‘సాక్షి‘ అభయ దాడులకు గురవుతున్న మహిళలు, యువతుల కోసం ‘సాక్షి’ యాజమాన్యం అత్యంత ఆధునిక టెక్నాలజీతో అందుబాటులో ఉండేలా ‘సాక్షి అభయ’ పేరుతో యాప్స్‌ను రూపొందించింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిని వినియోగించడం కూడా చాలా సులభం. ఒక్క క్లిక్‌తో యాప్స్‌లో ముందే ఉంచిన నంబర్లకు సెకన్లలో సమాచారం వెళ్లిపోతుంది. దీనికి పోలీస్ నంబర్లను ఫీడ్ చేసినా వారికి కూడా మెసేజ్ వెళ్తుంది. ఇది నెట్‌తో పని లేకుండానే పనిచేయడం గమనార్హం. యాంటీ మోల్స్టేషన్ జాకెట్ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులివి. ఏదైన అవాంఛనీయం పరిణామం ఎదురైతే ఈ జాకెట్ మహిళలపై దాడికి చేయడానికి వచ్చిన వ్యక్తులకు విద్యుత్‌షాక్ ఇస్తుంది. రెగ్యులర్ జాకెట్ మాదిరిగా కనిపించే ఈ దుస్తుల బటన్స్ 110 వోల్టుల విద్యుత్‌శక్తిని కలిగి ఉంటాయి. దీని ప్రభావంతో 10 నుంచి 15 నిమిషాల పాటు తేరుకోలేరు. దీంతో అక్కడి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఈ జాకెట్‌ను నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్) విద్యార్థులు రూపొందించారు. డెనిమ్, యాక్రలిన్ రంగుల్లో లభిస్తుంది. యాంటీ రేప్ నెక్లెస్.. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల యాంటీ రేప్ నెక్లెస్‌లు, బ్రాస్లెట్లు అందుబాటులో ఉన్నాయి. అనూహ్య పరిణామాలు ఎదురైతే ఈ బ్రాస్లేట్కు ఉన్న బటన్ నొక్కితే చాలు.. అందులో ఫీడ్ చేసిన నంబర్లకు ఫోన్‌కాల్ వెళ్తుంది. బటన్ అలాగే నొక్కి పట్టుకుంటే బాధితులు ఏ ప్రాంతంలో ఉన్నారో.. పూర్తి వివరాలతో మెసేజ్ వెళ్తుంది. దాన్ని బట్టి అవతలి వ్యక్తి మీరు ప్రమాదంతో ఉందని గుర్తించి చేరుకునే అవకాశం ఉంది. కొన్ని నెక్లెస్ డివైస్‌లో విద్యుత్ షాక్ ఇచ్చే వాటితో పాటు పెద్ద శబ్దంతో సౌండ్ చేసేవి కూడా ఉన్నాయి. చిన్నగా అందంగా మెడలో వేసుకుని తీసుకెళ్లవచ్చు. -
యూఎస్ లో మరోసారి కాల్పులు, ఒకరి మృతి!
అమెరికాలో కాల్పుల సంఘటన మరోసారి కలకలం సృష్టించింది. సియాటెల్ లోని పసిఫిక్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడిన ఓ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపిన దుండగుడ్ని పెప్పర్ స్పేను చల్లి అదుపులోకి తీసుకున్నారు. మానసిక స్థితి సరిగ్గాలేని ఓ యువకుడు కాల్పులకు పాల్పడినట్టు సమాచారం. ఈ కాల్పుల ఘటనతో అమెరికా వాసులు తీవ్ర దిగ్బాంతి గురయ్యారు. -
15వ లోక్‌సభకు తెర
రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫార్సు రచ్చకు మారుపేరుగా నిలిచిన సభ చరిత్రాత్మక బిల్లుల ఆమోదమే ఊరట త్వరలో కొలువుదీరనున్న 16వ లోక్‌సభ న్యూఢిల్లీ: పెప్పర్ స్ప్రేలతో చెరగని మరకలు అంటించుకోవడమే గాక స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత గందరగోళం, ప్రతిష్టంభనలమయంగా సాగిన 15వ లోక్‌సభ ప్రస్థానానికి తెరపడింది. శనివారం ఉదయం మన్మోహన్సింగ్ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం శనివారం చివరిసారిగా సమావేశమైంది. లోక్‌సభను రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. మన్మోహన్ పాత్రను శ్లాఘిస్తూ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. శుక్రవారం 16వ లోక్‌సభ ఫలితాల వెల్లడితో సుదీర్ఘ ఎన్నికల క్రతువు ముగియడం బీజేపీ సొంతంగానే మెజారిటీ కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలతోవిజయం సాధించడం తెలిసిందే. కొత్త లోక్‌సభ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో 16వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. కొత్త సభ్యుల జాబితా రాష్ట్రపతికి అందాక ఆయన తగిన చర్యలు చేపడతారన్నారు. 15వ లోక్‌సభ నిత్యం మూడు గందరగోళాలు, ఆరు ప్రతిష్టంభనలు అన్నట్టుగా సాగింది. కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపై అంతులేని రచ్చకు వేదికైంది. ముఖ్యంగా చివరి సమావేశాల్లో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తోటి సభ్యులపై నిండు సభలో పెప్పర్ స్ప్రేకు తెగబడిన ఉదంతం లోక్‌సభ ఔన్నత్యాన్ని అథఃపాతాళానికి దిగజార్చింది. తెలంగాణ బిల్లుపై చర్చ కనీవినీ ఎరగని రచ్చ. ఇరు ప్రాంతాల ఎంపీల బాహాబాహీకి, 16 మంది సీమాంధ్ర సభ్యుల సస్పెన్షన్‌కు దారితీసింది. గందరగోళం మధ్యే విభజన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. 2జీ స్కాంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలన్న బీజేపీ డిమాండ్ దెబ్బకు రెండేళ్ల క్రితం లోక్‌సభ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. బొగ్గు స్కాంకు బాధ్యతగా మన్మోహన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో పార్లమెంటు దద్దరిల్లింది. దాణా స్కాంలో దోషులుగా తేలిన లాలూప్రసాద్ జేడీయూ ఎంపీ జగదీశ్ శర్మలు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఇన్ని గందరగోళాల మధ్యా ఆహార భద్రత, లోక్‌పాల్ వంటి చరిత్రాత్మక చట్టాలు చేసిన ఘనతా 15వ సభకు దక్కింది. అయితే మహిళా కోటా బిల్లు లోక్‌సభలో గట్టెక్కలేకపోయింది. -
‘నిర్భీక్’తో నిర్భయంగా..!
కాన్పూర్: ఆత్మరక్షణ కోసం మహిళలు ఇకపై పెప్పర్ స్ప్రేను ఉపయోగించాల్సిన అవసరం లేదు... మహిళ కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఈ తుపాకీని తీసుకెళితే సరిపోతుంది... ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టొచ్చు...ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగి ఏడాది దాటిన నేపథ్యంలో ఇండియన్ ఆర్టినెన్స్ ఫ్యాక్టరీ మహిళ రక్షణ కోసం తేలికైన ఈ తుపాకీని రూపొందించింది. నిర్భీక్గా పిలిచే ఈ తేలికైన తుపాకీ కేవలం 500 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. మహిళలు పర్సుల్లో, హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకునేందుకు వీలుగా రూపొందించిన .32 బోర్ రివాల్వర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. నిర్భయకు నివాళిగా తాము రూపొందించిన తుపాకీకి నిర్భీక్ అని పేరు పెట్టినట్లు ఫీల్డ్ గన్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అబ్దుల్ హమీద్ తెలిపారు. టైటానియం లోహంతో తయారు చేసిన ఈ నిర్భీక్ ధర రూ. 1,22,360గా నిర్ణయించినట్లు చెప్పారు. ఆర్డర్ మీద బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. -
పెప్పర్ స్ప్రే చల్లి.. రూ.10 లక్షల ఆభరణాల చోరీ
తిరువూరు, న్యూస్‌లైన్: పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు అగంతకులు మహిళ కంట్లో పెప్పర్ స్ప్రే చల్లి రూ.10 లక్షల విలువైన ఆభరణాలు దోచుకున్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తిరువూరులోని కూరగాయల మార్కెట్ పక్కన నివసిస్తున్న వ్యాపారి రాయల ప్రభాకరరావు ఇంట్లోకి ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు యువకులు ప్రవేశించి ఆయన భార్య శకుంతలను మంచినీళ్లు అడిగారు. నీరిచ్చేలోపు ఆ ఇద్దరూ తమతో తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను ఆమె కళ్లల్లో చల్లి అరవకుండా నోట్లో దుస్తులు కుక్కారు. ఇంట్లోని బీరువాలో దాచిన బంగారు ఆభరణాలను అపహరించి క్షణాల్లో పరారయ్యారు. స్ప్రే ప్రభావంతో శకుంతలకు ఊపిరాడని పరిస్థితితో పాటు ముక్కునుంచి రక్తస్రావమైంది. ఈ ఘటనపై ప్రభాకరరావు ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు మచిలీపట్నం నుంచి క్లూస్ టీంను రప్పించి నిందితుల ఆచూకీ కోసం గాలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ట్విటర్ లో వర్మ కితకితలు!
సంచలన దర్శకుడిగా సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, వ్యంగ్యం, వివాదస్పద వ్యాఖ్యలతో సెన్సేషనల్ గా మారారు. సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ గమ్మత్తైన సెటైర్లతోనే కాకుండా, వ్యక్తులపై వ్యంగ్యస్థాలను విసరడంలో వర్మ డిఫెరెంట్ స్టైల్ ను ఫాలోఅవుతుంటారు. ఇటీవల కాలంలో దయ్యాల కథలతో తెరపై హారర్ సృష్టిస్తున్న వర్మ సోషల్ మీడియాలో హాస్యాన్ని పంచుతూ తనలో మరో కోణం ఉందనిపించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ , లగడపాటి రాజగోపాల్, లోకసభ స్పీకర్ మీరా కుమార్ పై చేసిన చాలా ఆసక్తిని రేకెత్తించాయి. "@sirasri: For the 1st time I am eagerly waiting for hot summer; just to see Mr.Arvind Kejriwal without Muffler."— Ram Gopal Varma (@RGVzoomin) February 6, 2014 ఎప్పుడూ తలచుట్టూ మఫ్లర్ కట్టుకుని కనిపించే కేజ్రివాల్ పై గమ్మత్తైన ట్వీట్ చేశారు వర్మ. 'రానున్న వేసవి కాలం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే తలకు మఫ్లర్ లేని కేజ్రివాల్ ను చూడాలని ఉంది' అని ట్వీట్ చేశారు. అంతేకాక ఇక కేజ్రివాల్ కాదు.. కేజ్రిఫాల్ అంటూ సెటైర్ వేశారు. పెప్పర్ స్ప్రే ఘటన తర్వాత లగడపాటిని టార్గెట్ చేశారు. భగత్ సింగ్ తర్వాత పార్లమెంట్ ను కుదిపేసిన రెండవ వ్యక్తి లగడపాటి. పార్లమెంట్ లో ఏం జరిగిందో పక్కన పెడితే.. ప్పెప్పర్ స్పే ను ఆత్మరక్షణ ఆయుధంగా ఉపయోగించుకోవచ్చని లగడపాటి పబ్లిసిటీ ఇచ్చారు. భవిష్యత్ ఉద్యమకారులకు పెప్పర్ స్పే ఓ మంచి ఆయుధంగా మారే అవకాశం ఉంది. త్వరలోనే క్లాస్ రూమ్, సినిమా హాళ్లలో, షాపింగ్ మాల్స్ లో పెప్పర్ స్పే వినియోగించడం త్వరలోనే చూస్తాం అని ట్వీట్ చేశారు. One thing the pepper spray has achieved is that for the first time evr I saw Meira kumar without a smile— Ram Gopal Varma (@RGVzoomin) February 15, 2014 అంతేకాక కాకుండా మిర్చి పౌడర్ కంటే పెప్పర్ స్పే ఘాటుగా ఉంటుందా అనే కుతుహలం మొదలైందన్నారు వర్మ. ఇంకా ఓ అడుగు ముందేసి .. ఎప్పుడూ చిరునవ్వుతో దర్శనమిచ్చే స్పీకర్ మీరా కుమార్ ..పెప్పర్ స్పే ఘటన తర్వాత ఆమె ముఖంలో నవ్వు మాయమైంది అని ట్విటిచ్చారు. "@sirasri: BREAKING News announced BREAKING Andhra Pradesh"— Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు లోకసభ ఆమోదం లభించిన తర్వాత.. బ్రేకింగ్ న్యూస్ అనౌన్స్ డ్... బ్రేకింగ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వర్మ ట్విట్ చేశారు. దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలపై స్పందిస్తూ.. సెటైర్లతో నెటిజన్లకు ఆనందాన్ని పంచుతున్న రాంగోపాల్ ట్విటర్ అకౌంట్ లో 8 లక్షల 17 వేల మంది వర్మను ఫాలో అవుతున్నారు. -
ఇద్దరు ఎంపీలపై ఎంపీ పొన్నం కేసు నమోదు
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే, కత్తి పట్టుకుని సభలో గందరగోళం సృష్టించారనే ఘటనలో ఇద్దరు ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇద్దరు ఎంపీలపై ఫిర్యాదు చేశారనే విషయాన్ని సంబంధిత పోలీస్ అధికారి ధృవీకరించారు. అయితే పార్లమెంట్ లోపల జరిగిన ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చా అనే కోణంలో న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్పెప్పర్ స్పే చేసిన లగడపాటి రాజగోపాల్, కత్తితో సభలోకి ప్రవేశించిన టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ పై గతవారం క్రిమినల్ కేసు నమోదు చేశామని వార్తా ఏజెన్సీకి ఎంపీ పొన్నం తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని 325, 326 సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. -
అనైక్య పార్టీ.. పెప్పర్ స్ప్రే గుర్గు
అనైక్య పార్టీ.. పెప్పర్ స్ప్రే గుర్తు న్నాపురం(కొయ్యలగూడెం), ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ పేరు అనైక్య పార్టీ అని, గుర్తుగా ‘పెప్పర్స్ స్ప్రే’ పెడితే బాగుంటుందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎద్దేవా చేశారు. వైసీపీ కన్నాపురం గ్రామ కన్వీనర్ గాడిచర్ల సోమేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ నేతలతో బాలరాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య ఉద్యమాన్ని పక్కదారి పట్టించటానికే సీఎం రాజీనామా డ్రామా ఆడుతున్నారని, ఇందుకు లగడపాటి, ఎన్జీవో అసోసియేషన్ నేత అశోక్‌బాబు సహకరిస్తున్నారన్నారు. పదవిలో ఉండి పోరాటం చేయాల్సిన సమయంలో చేయక.. విభజన అంశం పీకల మీదకు వచ్చిన తర్వాత రాజీనామా చేస్తే ఏం ప్రయోజనమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం మహానేత వైఎస్ పాలన వంటి సువర్ణ యుగం అందించడంతోపాటు ఆడపడుచులకు కోట్లాది రూపాయలు డ్వాక్రా రుణాలు రద్దు చేయడం ఖాయమన్నారు. సోనియాను చూసి ఇందిర, రాజీవ్‌ల ఆత్మలు ఘోషిస్తుంటాయని, భారతదేశ రాజకీయాల్లో మహిళా నియంతగా ఆమె శాశ్వత అపకీర్తిని మూటకట్టుకుందని పేర్కొన్నారు. సమైక్యవాదులు గడ్డం అబ్బులు, శీలం శ్రీను, వల్లూరి మాధవరావు, కె.సురేష్, అల్లూరి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
పెప్పర్ స్ప్రే.. కాంగ్రెస్ డ్రామానే: వైఎస్ జగన్
‘ఎకనమిక్ టైమ్స్’ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం సమైక్యవాదుల ఆగ్రహం పోలీసులతో వాగ్వాదం.. తోపులాట.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు గంట తర్వాత జగన్ విడుదల.. శాంతించిన కార్యకర్తలు సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో గురువారం నాడు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడే పెప్పర్ స్ప్రే చల్లటం ప్రణాళికలో భాగమేనని, సభలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవటానికి తిరుగుబాటు చేసిన ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయటం వంటివన్నీ కాంగ్రెస్ అధిష్టానం నాటకంలో అంతర్భాగమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో సోమవారం ఢిల్లీలో సమైక్య దీక్ష చేపట్టటానికి ముందు ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘ఎకనమిక్ టైమ్స్’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు వెళుతున్న బీజేపీ.. సాధారణ ఎన్నికల అనంతరం తమ పార్టీ మద్దతుపై ఏ మాత్రమైనా ఆశలు పెట్టుకోవాలనుకుంటే.. ముందు పార్లమెంటులో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని స్పష్టంచేశారు. జగన్ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు... ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కేంద్రం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మీ స్పందనేమిటి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను యూపీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించినా, తెలుగు ప్రజలు విభజనకు ఇష్టపడకపోయినా.. వారిని విడగొట్టాలని ప్రయత్నిస్తోంది. గతంలో రాష్ట్రాలను విభజించినపుడు ఒక పద్ధతిని పాటించారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరించాలని ఎస్ఆర్సీ సిఫారసు చేసినపుడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. లేదా సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవంగా విభజనను ఆమోదిస్తూ తీర్మానాలు చేసి పంపినపుడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ ఇపుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమే ఉత్తమమని సిఫారసు చేసినా దాన్ని పక్కన పెట్టేశారు. 3వ అధికరణను నిరంకుశంగా, నియంతృత్వంగా దుర్వినియోగం చేస్తున్నారు. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన తీరు కూడా చాలా ప్రమాదకరమైనది. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో యూపీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ బిల్లును ప్రవేశపెట్టిన తీరు దిగ్భ్రాంతికరం.. కుట్రపూరితం. కుట్రపూరితం ఎలా..? విభజన బిల్లును ప్రవేశపెట్టిన తీరును పరిశీలిస్తే తెలుస్తుంది. లోక్‌సభ స్పీకర్ సభలోకి అప్పుడే వచ్చారు.. పది సెకన్లలోనే బిల్లు ప్రవేశపెట్టినట్లు ప్రకటించేశారు. గతంలో ఉన్న ఎలాంటి సంప్రదాయాలనూ పాటించలేదు. బిల్లు ప్రతిపాదించేందుకు సంబంధిత మంత్రి లేచి నిలబడాలి. బిల్లు ప్రతిపాదనకు అనుమతిని కోరుతూ ‘ఎస్’ అని ఎవరంటారో.. ‘నో’ అని ఎవరంటారో.. స్పీకర్ అడగాలి. మెజారిటీ సభ్యులు ‘ఎస్’ అన్నపుడే బిల్లును సభలో ప్రతిపాదించాలి. అలాంటివేవీ ఇక్కడ జరగలేదు. దీనిపై తర్వాత ఎల్.కె.అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటి నేతలు, నేను, జేడీయూ, బీజేడీ, ఏఐఏడీఎంకె లోక్‌సభా పక్షాల నాయకులందరం స్పీకర్‌ను, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని కలిసి మా నిరసనను నమోదు చేయాలని కోరాం. కానీ వారు తిరస్కరించారు. మేం స్పీకర్ చాంబర్ నుంచి వాకౌట్ చేయాల్సి వచ్చింది. ఇదంతా కాంగ్రెస్ పన్నిన పథకంలో భాగమే! ‘పెప్పర్ స్ప్రే’ దాడి జరిగిందనే సంఘటనతో సహా. విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ఎంపీలను సభలో లేకుండా చేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ఒక దుష్ట పన్నాగంతో కాంగ్రెస్ ఇలా చేసింది. కాంగ్రెస్ నుంచి సస్పెండైన ఎంపీ లగడపాటి రాజగోపాల్ ‘పెప్పర్ స్ప్రే’తో దాడి చేసిన సంఘటన కూడా ఆ పార్టీ నాటకంలో భాగమే నంటారా? కచ్చితంగా. ల గడపాటి రాజగోపాల్ గతమేంటో మీకు బాగా తెలుసు. లగడపాటికి చెందిన కంపెనీకి 9,000 కోట్ల రూపాయల మేరకు మళ్లీ రుణం ఇస్తూ ప్రయోజనం చేకూర్చిన వైనం ఎకనామిక్ టైమ్స్ పత్రికలోనే మొదట ప్రచురితమైంది. కార్పొరేట్ సంస్థల రుణ పునర్వ్యవస్థీకరణ పథకం (సీడీఆర్) కింద ఈ రుణం ఆయన కంపెనీకి వచ్చింది. దివాళా తీసిన లగడపాటి కంపెనీని గట్టెక్కించడానికి రూ. 3,500 కోట్ల రుణాన్ని కేవలం 239 కోట్ల రూపాయల ఈక్విటీతో 27 బ్యాంకులు ఎలా ఇచ్చాయన్న విషయం కూడా ఎకనమిక్ టైమ్స్ రాసింది. కాంగ్రెస్ అధినాయకత్వం, యూపీఏ ప్రభుత్వం ఆయనకు సహకరించకుండానే ఇంత పెద్ద మొత్తంలో రుణం వచ్చిందా? ఇప్పుడు చెప్పండి.. రాజగోపాల్ వంటి కాంగ్రెస్‌కు విధేయమైన వ్యక్తి అధిష్టానాన్ని ధిక్కరిస్తారని కలలో కూడా ఎవరైనా ఊహించగలరా! రాజగోపాల్ పెప్పర్ స్ప్రే దాడి చేశారనే పేరుతో, టీడీపీ ఎంపీ తన సొంత పార్టీ సభ్యుడితోనే కొట్లాటకు దిగారని, మాతో సహా విభజనను వ్యతిరేకిస్తున్న వారందరినీ సభలో లేకుండా చేసి తెలంగాణ బిల్లును ఆమోదింప జేసుకోవాలని చూశారు. నేను సభలో ఎలాంటి హింసకైనా దిగటం ఎవరైనా చూశారా? లేదు. కనుకనే ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకం. తెలంగాణ ఇవ్వాలన్న కేంద్రం, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిఘటిస్తున్నారు కదా! ఆయన కొత్త పార్టీ పెడతారని కూడా చెప్తున్నారు? మనందరికీ తెలుసు కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతటి సమర్థుడో. విమానాశ్రయాల లాంజ్ల్లో ముఖ్యమంత్రులను బహిష్కరించేస్తుందనే పేరున్న కాంగ్రెస్ పార్టీలో.. ఒక బలహీనుడైన కాంగ్రెస్ సీఎం పార్టీలో తిరుగుబాటు చేస్తున్నట్లుగా నటిస్తున్న జోక్‌ను చూడండని నేను తరచుగా చెప్తూనే ఉన్నా. కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానాన్ని ధిక్కరించేంత రాజకీయ సత్తా లేదు. తెలంగాణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వోద్యోగుల చేత కిరణ్ సమ్మె విరమింపజేసి అధిష్టానానికి సహకరించలేదా? రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజున కిరణ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉంటే అభినందించేవాడిని. కిరణ్ అధిష్టానానికి ఎప్పుడేం కావాలంటే అది చేస్తూ పూర్తిగా సహకరిస్తూనే.. తిరుగుబాటు చేస్తున్నట్లుగా నటిస్తున్నారు. అయినా మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ, శాసనసభకు ఎన్నికలు ప్రకటించనుండగా కిరణ్ పదవిలో ఉంటే ఏమిటి? వైదొలిగితే ఏమిటి? విభజనకు అనుకూలంగా తెలంగాణలోనూ, వ్యతిరేకంగా సీమాంధ్రలోనూ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎలాగైతే ద్వంద్వ ప్రమాణాలకు ప్రతీకగా నిలిచారో.. అలాగే కిరణ్ కూడా అధిష్టానం చేతిలో కీలుబొమ్మగా మారారనేది తేటతెల్లమవుతోంది. ఆంధ్రప్రదేశ్ సమైక్యతను పరిరక్షించేందుకు చిత్తశుద్ధితో ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే పోరాడి గెలుస్తుంది. నన్ను లోకసభ నుంచి బయటకు గెంటేసినందున.. తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు అన్ని ప్రతిపక్షాల నుంచీ సాధ్యమైనంత ఎక్కువ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలా ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిశాను. బిల్లును అడ్డుకోవటంలో, రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా నిరోధించటంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ పాత్ర కీలకమైనదని నేను భావిస్తున్నా. తెలంగాణ బిల్లును అడ్డుకున్నట్లయితే నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తారా? నాకు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆంధ్రప్రదేశ్ సమైక్యత చాలా ముఖ్యం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు, పాలనానుభవం ఉన్న మోడీ.. ప్రజాస్వామ్యంలో సమాఖ్య సిద్ధాంతం ప్రాధాన్యత ఏమిటో, ఆ సమాఖ్య సూత్రాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారో అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నా. అందుకే నేను మోడీతో సహా బీజేపీ నేతలందరికీ చెప్తున్నా.. పూర్తి స్పష్టతతో నిలవాలని, పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని కోరుతున్నా. ఇప్పుడు మాకు కావాల్సింది.. బీజేపీ ముందున్న పరీక్ష అదే. తదుపరి విషయాలు ఎలా ఉంటాయో చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి కూడా మీపై ఆశలున్నాయి. వైఎస్సార్ సీపీ ఎన్నికల తరువాత తమకు మద్దతు నిస్తుందని. మీరిప్పటికీ మనసులో కాంగ్రెస్ వాదేనని వారు భావిస్తున్నారు? కాంగ్రెస్‌వాది అంటే ఏమిటో నిర్వచనం వాళ్లనే (కాంగ్రెస్ వారినే) చెప్పమనండి. తెలంగాణపై రెండో ఎస్సార్సీ (రాష్ట్రాల పున ర్వవస్థీకరణ కమిటీ)ని నియమిస్తామని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ వాగ్దానం చేసింది. 2009 ఎన్నికల ప్రణాళికలో రోశయ్య కమిటీ నివేదికతో పరిష్కరిస్తామని పేర్కొంది. ఇపుడు ఏ కమిషన్ నివేదిక లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ వాది అంటే నిర్వచనమిదేనా? అలా అయితే, నన్ను చెప్పనివ్వండి.. నేను ైవె ఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిని. నేను మా నాన్నలాగే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేసి తీరతాను. సోనియాగాంధీకి మీ నాన్న సన్నిహితుడు. ఆయన నేతృత్వంతో రెండుసార్లు కాంగ్రెస్ ఘన విజయాలను సాధించింది. మిమ్మల్ని ఆ పార్టీ నుంచి వీడేలా చేశారు. జైల్లో పెట్టారు. ఇదంతా ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది! నిజానికి.. ఆ బాధాకరమైన అంకాన్ని నేను వెనుదిరిగి చూడాలనుకోవటం లేదు. దేవుడు అన్నీ చూస్తున్నాడని నాకు తెలుసు. ఆయనకు తెలుసు ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో.. అది ఆయనకే వదలేస్తున్నా. నేను పట్టించుకోను. తప్పులు ఎవరు చేశారో వారిని క్షమించాల్సింది ఆయనే. అవును, నేను 16 నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. బెయిల్ పొందడమనే నా ప్రాథమిక హక్కును కూడా.. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాననే అతిబలహీనమైన సాకుతో నిరాకరించారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఉన్న సాక్షులను ఒక ప్రతిపక్షంలో ఉన్న నేతగా ఎలా ప్రభావితం చేస్తాను! ప్రజల మద్దతుతో, దేవుడి దయతో ఇప్పటికీ నేను పోరాడుతూనే ఉన్నాను. మీకూ సోనియాకు మధ్య మనస్పర్థలకు, కాంగ్రెస్‌ను వీడిపోవడానికి కారణం కొన్ని కుట్రలేనన్న వదంతులు ఉన్నాయి... ఒక్కటే చెప్పగలను. మా నాన్నగారు చనిపోయిన కొద్ది రోజులకు ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించిన ప్రదేశానికి వెళ్లాను. మా తండ్రిగారి మరణాన్ని తట్టుకోలేక సుమారు 800 మంది మరణించారు. మరణించిన ప్రతి ఒక్కరి ఇళ్లకూ వెళ్లి పరామర్శిస్తాన నే మాటను అపుడే చెప్పాను. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో నేను వారి ఇళ్లకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకత్వం అనుమతిని ఆరు నెలల పాటు నిరాకరించింది. నేను సోనియాగాంధీని, అహ్మద్‌పటేల్‌ను మరికొందరు నేతలను కొన్నిసార్లు కలిశాను. వారి కుటుంబాలను ఎందుకు సందర్శించాలనుకుంటున్నానో కూడా వారికి చెప్పాను. నేను, మా అమ్మ కలిసి సోనియాగాంధీ వద్దకు వెళ్లి మళ్లీ అంతా చెప్పాం కూడా. -
సుష్మాస్వరాజ్ కళ్ల వెంట నీళ్లువచ్చాయి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ ఆరోపించారు. తెలంగాణ అంశం వల్లే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు సందర్భంగా గురువారం పార్లమెంట్లో చోటు చేసుకున్న ఘటనలు పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చాయని అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రులే లోక్‌సభ వెల్‌లోకి దూసుకురావడం తమను తీవ్ర దిగ్భ్రాంతిని కలగించిందన్నారు. ఆ రోజు జరిగిన ఘటనలో ఎంపీల ప్రవర్తన మరింత శృతిమించిందని ఎల్ కె అద్వానీ పేర్కొన్నారు. పెప్పర్ స్ప్రే వల్ల తమ పార్టీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ కళ్ల వెంట నీళ్లు వచ్చాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశామని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ సమయంలో మూడు రాష్ట్రాల ప్రజలు ఎక్కడ ఎటువంటి గొడవలు పడ లేదన్నారు. దాంతో ఆ రాష్ట్రాలను సామరస్య పూర్వకంగా విభజించామని తెలిపారు. అందుకు అయా రాష్ట్రాల ప్రజలు సహకరించడమే కాకుండా ఎంతో సంతోషించారని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల మధ్య గొడవలు సృష్టించి విభజిస్తుందని ఎల్ కె అద్వానీ పేర్కొన్నారు. -
అధిష్ఠానమే మాపై దాడి చేయించింది: లగడపాటి
-
పెప్పర్ ప్రభావం ఏ‘పాటి’
సాక్షి, విజయవాడ : గత ఏడాది ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో మహిళా ఉద్యోగులు తమ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే ఉపయోగించడం మొదలు పెట్టారు. మెట్రో నగరాల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగులకు మాత్రమే పరిమితమయిన పెప్పర్ స్ప్రే గురువారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. లోక్‌సభలో తనపై దాడి చేస్తున్న తెలంగాణా ఎంపీల నుంచి తప్పించుకునేందుకు లగడపాటి పెప్పర్ స్ప్రే వాడారు. దీంతో లోక్‌సభలో కలకలం చెలరేగింది. దాని ఘాటుకు తట్టుకోలేక కొందరు ఆస్పత్రి పాలవ్వగా, ఎంపీలందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. ఏంటీ పెప్పర్‌స్ప్రే... పెప్పర్ స్ప్రే ప్రాణాంతకమైంది కాదు. దీన్ని స్ప్రే చేయగానే వెంటనే కళ్లు మండుతాయి. కొద్ది సేపటి వరకూ కళ్లు తెరవలేము. శ్వాస ఇబ్బంది అవుతుంది. దాని ఘాటుకు తుమ్ములొస్తాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. దగ్గు వస్తుంది. స్ప్రే ఎంత దగ్గర నుంచి ఎంత మోతాదులో వాడతామనే దానిపై ప్రభావం ఆదార పడి ఉంటుంది. దీని పూర్తి ప్రభావం తగ్గడానికి ఆరగంట నుంచి గంట వరకూ సమయం పడుతుంది. ఒకసారి స్ప్రే చేయడం వల్ల కళ్లకు ఎటువంటి హాని ఉండదు. ఆస్తమా ఉన్న రోగులకు మాత్రమే కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది. ఈ పెప్పర్ స్ప్రే చేతిలో ఇమిడిపోయే బాటిల్స్‌లో మార్కెట్ అందుబాటులో ఉంది. మహిళలు ఆకతాయిల నుంచి అత్మరక్షణ కోసం మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. -
అధిష్ఠానమే మాపై దాడి చేయించింది: లగడపాటి
పార్లమెంటులో జరిగిన సంఘటనపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానమే దీనికి కారణమన్నారు. వేరే పార్టీకి చెందిన ఎంపీని కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు.. వేరే రాష్ట్రానికి చెందినవాళ్లు దాడిచేసి కొడుతుంటే ఆయనను కాపాడేందుకే తాను వెల్ లోకి వెళ్లానని, అంతేతప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం పురమాయింపుతో కొంతమంది ఎంపీలు తమపై దాడికి దిగారని, పిడిగుద్దులు గుద్దారని లగడపాటి చెప్పారు. ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం, ఒకేచోట గుమిగూడినవారిని అక్కడి నుంచి చెదరగొట్టి, శాంతియుత పరిస్థితి నెలకొల్పేందుకే తాను పెప్పర్ స్ప్రే ఉపయోగించానని, అది కూడా ఆత్మరక్షణ కోసం తప్ప ఎవరినీ ఇబ్బందిపెట్టేందుకు కాదని ఆయన తెలిపారు. అయినా.. జరిగిన సంఘటనకు తాను ఆవేదన చెందుతున్నానని గురువారం నాడు మీడియాతో చెప్పారు. -
'పార్లమెంట్ నుంచి లగడపాటిని డిబార్ చేయాలి'
న్యూఢిల్లీ: లోకసభలో పెప్పర్ స్పే చేసి దుమారం సృష్టించిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ నుంచి లగడపాటిని డిబార్ చేయాలని జైరాం వ్యాఖ్యానించారు. లగడపాటి ప్రవర్తన పార్లమెంట్ సభ్యులందరి ప్రతిష్టను దిగజార్చిందన్నారు. పార్లమెంట్ ప్రతిష్టను మంటగలిపిన లగడపాటిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరణ వేటు వేయాలని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి రాజగోపాల్ హక్కు ఉంది. అతని హక్కును గౌరవిస్తాను.. అతను నిరసన తెలిపే హక్కుంది. కాని ఆయన ప్రవర్తించిన తీరు పార్లమెంట్ విలువలను దిగజార్చేలా ఉన్నాయని అన్నారు. లోకసభలో పెప్పర్ స్పే ఘటన జరగడానికి 10 నిమిషాల ముందు రాజగోపాల్ తో మాట్లాడాను అని జైరాం తెలిపారు. చట్టాలను అనుసరించి అతనిపై ఏ స్థాయిలో కఠిన చర్య తీసుకోవాలో నిర్ణయిస్తాం అని ఆయన అన్నారు. -
ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే వాడా: రాజగోపాల్
తాను ఆత్మరక్షణ కోసం మాత్రమే పెప్పర్ స్ప్రేను ఉపయోగించానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ ఎంపీపై సొంత పార్టీ వాళ్లతో పాటు ఇతరులు కూడా దాడి చేశారని, అప్పుడు మాత్రమే తాను వెల్ లోకి దూసుకెళ్లానని ఆయన తెలిపారు. మార్షల్స్ అదుపులోకి తీసుకుని, తిరిగి వదిలసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా తమపై పాశవికంగా దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణరక్షణ కోసం మాత్రమే తాను పెప్పర్ స్ప్రే ఉపయోగించానని, అంతేతప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాదని రాజగోపాల్ చెప్పారు. -
మార్షల్ ఆధీనంలో లగడపాటి
న్యూఢిల్లీ: లోకసభలో 'లగడపాటి రాజగోపాల్' పెప్పర్ స్పే ఘటనలో గాయపడిన ముగ్గురు ఎంపీలకు చికిత్స అందిస్తున్నామని రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంసీ) ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముగ్గురు ఎంపీలను మాత్రమే ఆస్పత్రికి తీసుకువచ్చారు అని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో స్వల్ప అస్వస్థతకు గురైన మరికొంత మంది ఎంపీలకు పార్లమెంట్ ఆవరణలోనే వైద్యులు చికిత్స చేస్తున్నట్టు సమాచారం. పెప్పర్ స్పే చేసిన లగడపాటి రాజగోపాల్ భద్రతా సిబ్బంది ఆధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆరుగురు ఎంపీలలో లగడపాటి రాజగోపాల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. -
సభలో అసలేం జరిగింది?
లోక్‌సభలో యుద్ధవాతావరణం మధ్య మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం బిల్లు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ మూజువాణి పద్ధతిలో అనుమతి తీసుకున్నారు. సభ్యుల ఆందోళనల మధ్యే షిండే పొడిపొడిగా బిల్లును చదివారు. ఆ తతంగం క్షణాల్లోనే ముగిసింది. ఇంతలో స్పీకర్ పోడియం వద్ద ఒక్కసారిగా యుద్ధవాతావరణం వాతావరణం నెలకొంది. స్పీకర్ వద్ద మైకులను తొలగించేందుకు సీమాంధ్ర ఎంపీలు ప్రయత్నించగా, వారిని అడ్డుకునేందుకు తెలంగాణ ఎంపీలు కలబడ్డారు. ఇరు ప్రాంత ఎంపీల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ నెలకొంది. ఈలోగా లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లారు. ఎంపీలు, మీడియా ప్రతినిధులు ఉక్కిరి బిక్కిరై దగ్గుతూ పరుగులు తీశారు. లోక్‌సభ సెక్రటరీ బల్లపై ఉన్న ఫైళ్లను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చిందరవందరగా చేశారు. తెలంగాణ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలపై పిడిగుద్దులు కురిపించారు. వెంటనే స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినట్టేనని లోక్‌సభ అధికారులు తెలిపారు. లోక్‌సభలో ఘర్షణకు దిగిన ఎంపీలపై చర్యలు ఉంటాయని ఆ తర్వాత హోం మంత్రి షిండే తెలిపారు. తప్పులు చేసిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కపిల్ సిబల్ అన్నారు. -
ఎంపీలను చంపేందుకు లగడపాటి కుట్ర: రాథోడ్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. సభలో చర్చించకుండా దాడులకు దిగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా పార్లమెంట్లో చర్చిద్దామంటూ సూచించారు. పెప్పర్ స్ప్రే చేసి సభ్యులను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎంపీలపై దాడి ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. పార్లమెంట్‌ను బజారుస్థాయి ఘర్షణకు వేదికగా కాంగ్రెస్ మార్చిందని నామా విమర్శించారు. ఎంపీలను చంపేందుకు లగడపాటి రాజగోపాల్ కుట్ర పన్నారని మరో టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆరోపించారు. మిరియాల పొడి స్ప్రే చేయడంతో సభలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. లగడపాటిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. -
దాడి చేస్తుంటే...ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే
న్యూఢిల్లీ : ఆత్మరక్షణ కోసమే లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్పే చేశారని ఎంపీ హర్షకుమార్ తెలిపారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై దాడి చేస్తూంటే తాము అడ్డుకున్నామన్నారు. ఈ సందర్భంగా లగడపాటిపౌ దాడికి యత్నించిన సమయంలో ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్పే ఉపయోగించారని హర్షకుమార్ అన్నారు. తమ దగ్గర ఉన్న ఆయుధం అదొక్కటేనని... ప్రజల కోసమే తాము అలా చేశామని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ విజువల్స్ బయటపెట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. మరోవైపు లగడపాటి పెప్పర్ స్పే చేయటంతో పలువురు ఎంపీలకు దగ్గు, కళ్ల నుంచి నీళ్ళు రావటంతో భయంతో బయటకు పరుగులు తీశారు. అస్వస్థతకు గురైన ఎంపీలను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.