'పార్లమెంట్ నుంచి లగడపాటిని డిబార్ చేయాలి'
న్యూఢిల్లీ: లోకసభలో పెప్పర్ స్పే చేసి దుమారం సృష్టించిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ నుంచి లగడపాటిని డిబార్ చేయాలని జైరాం వ్యాఖ్యానించారు. లగడపాటి ప్రవర్తన పార్లమెంట్ సభ్యులందరి ప్రతిష్టను దిగజార్చిందన్నారు. పార్లమెంట్ ప్రతిష్టను మంటగలిపిన లగడపాటిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరణ వేటు వేయాలని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి రాజగోపాల్ హక్కు ఉంది. అతని హక్కును గౌరవిస్తాను.. అతను నిరసన తెలిపే హక్కుంది. కాని ఆయన ప్రవర్తించిన తీరు పార్లమెంట్ విలువలను దిగజార్చేలా ఉన్నాయని అన్నారు. లోకసభలో పెప్పర్ స్పే ఘటన జరగడానికి 10 నిమిషాల ముందు రాజగోపాల్ తో మాట్లాడాను అని జైరాం తెలిపారు. చట్టాలను అనుసరించి అతనిపై ఏ స్థాయిలో కఠిన చర్య తీసుకోవాలో నిర్ణయిస్తాం అని ఆయన అన్నారు.