Jairam Ramesh
-
అవమానిస్తున్నా నోరు మెదపరా?
న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా కోట్ల రూపాయల నగదు విరాళాలు ఇచ్చిందని డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌లు పదేపదే చెబుతుంటే మోదీ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(ఇన్చార్జ్) జైరాం రమేశ్ ఆదివారం ‘ఎక్స్’లో పలు పోస్ట్‌లుచేశారు. ‘‘అబద్దాలకోరులు, నిరక్షరాస్యుల ఊరేగింపు మందగా బీజేపీ తయారైంది. 2.1 కోట్ల డాలర్లు ఇచ్చామని అమెరికా ప్రకటించినప్పటి నుంచీ బీజేపీ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. 2022లో భారత్‌కు అన్ని కోట్ల డాలర్లు వచ్చాయనేది అబద్ధం. ఆ డబ్బు బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఎలాన్ మస్క్ తప్పు చెప్పారు. ఢాకా అనిబోయి ట్రంప్ ఢిల్లీ అన్నారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ అబద్ధాలు ప్రచారంచేస్తున్నారు. దీనికి బీజేపీ వాళ్లు వంతపాడుతున్నారు’’అని జైరాంరమేశ్ అన్నారు. సీఈపీపీఎస్కు 48 కోట్ల డాలర్లు ‘‘డోజ్ జాబితా ప్రకారం అమెరికా నుంచి రెండు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్) గ్రాంట్లు రావాల్సి ఉంది. ఆ 48.6 కోట్ల డాలర్లు కన్షార్సియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్(సీఈపీపీఎస్)కు రావాల్సిఉంది. ఇందులో 2.2 కోట్లు మాల్దోవా కోసం, మరో 2.1 కోట్లు భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఉద్దేశించినవి. ఇందులో తొలిగ్రాంట్ ఏఐడీ117ఎల్ఏ1600001 ఐడీతో మాల్దోవాకు ఇచ్చారు. 2.1 కోట్ల గ్రాంట్‌కు భారత్‌కు వెళ్లాల్సి ఉందని మస్క్ చెప్పింది అబద్ధం. ఈ గ్రాంట్ వాస్తవానికి బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సింది. నా ఓటు నాదే అనే కార్యక్రమం కోసం ఈ గ్రాంట్‌ను వినియోగించాలని బంగ్లాదేశ్‌లో నిర్ణయించారు. కానీ తర్వాత ఈ నిధులను నాగరిక్ కార్యక్రమం కోసం వినియోగించాలని నిర్ణయం మార్చుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్ఎయిడ్ అధికారి స్పష్టం చేశారు’’అని జైరాం వెల్లడించారు. -
భారత్‌కు అమెరికా సాయం.. బంగ్లాకు మళ్లిందా?
న్యూఢిల్లీ: అమెరికా 21 మిలియన్ డాలర్ల సాయం వ్యవహారం.. కొత్త మలుపు తిరిగింది. ఆ సాయం భారత సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేందుకేనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ-కాంగ్రెస్‌లు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లోపు ఆ సాయాన్ని బంగ్లాదేశ్‌కు మళ్లించారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ నుంచి కథనం వెలువడంది. దాని ఆధారంగా బీజేపీ-కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలతో మండిపడుతున్నాయి.భారత్‌లో ఓటింగ్ శాతం పెంపు కోసం ఇచ్చిన ఆ నిధులను బంగ్లాదేశ్‌లో ఓ ప్రాజెక్టు వినియోగించారన్నది ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్(Jairam Ramesh) దీనిని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి.. బీజేపీ, ఆ పార్టీ అనుకూల మీడియాపై విరుచుకుపడ్డారు. దానిని షేర్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీపై నిప్పులు చెరుగుతోంది. అయితే.. ఆ కథనాన్ని ఫేక్ అంటూ బీజేపీ ఖండించింది. Lies first mouthed in Washington. Lies then amplified by BJP's Jhoot Sena.Lies made to be debated on Godi media.Lies now thoroughly exposed. Will the Liars apologise? pic.twitter.com/nY7iP4jmnN— Jairam Ramesh (@Jairam_Ramesh) February 21, 2025 FAKE NEWS ALERT 🚨‼️The Indian Express story discusses $21 million in funding to Bangladesh in 2022. However, the article misrepresents the reference to a $21 million funding tranche intended to ‘promote’ voter turnout in India.What Indian Express conveniently sidesteps is… pic.twitter.com/niOaWXivm5— Amit Malviya (@amitmalviya) February 21, 2025భారత్‌లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్ 21 మిలియన్ డాలర్ల(రూ.182 కోట్ల నిధులు) కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓటింగ్‌ను పెంచడంద్వారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారని ట్రంప్ విమర్శించారు. అందుకే డోజ్ దానిని రద్దు చేసిందని సమర్థించుకున్నారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌లో దుమారం రేగింది.విదేశీ సంస్థల చేతుల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలుబొమ్మలా మారారని బీజేపీ ధ్వజమెత్తగా.. ట్రంప్‌వి అర్థం లేని ఆరోపణలని కాంగ్రెస్ తిప్పికొట్టింది. ట్రంప్ వ్యాఖ్యలతో 2024 ఎన్నికల్లో విదేశీ శక్తులు పని చేస్తున్నాయని అప్పట్లో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు నిజమని తేలిందని బీజేపీ పేర్కొంది. విదేశీ శక్తులతో కలిసి రాహుల్ గాంధీ.. భారత్ వ్యూహాత్మక, భౌగోళిక ప్రయోజనాలను దెబ్బతీయాలని చూశారని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విమర్శించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు అర్థం లేని ఆరోపణలేనని కాంగ్రెస్ కొట్టిపారేసింది. యూఎస్ ఎయిడ్ ద్వారా దశాబ్దాలుగా భారత్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేత పత్రాన్ని కేంద్రం విడుదల చేయాలని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ డిమాండు చేశారు.ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను రద్దు చేసినట్లు ప్రకటించింది. డోజ్ నిర్ణయం.. భారత్‌లో రాజకీయ వివాదానికి దారి తీసింది. -
ఆ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం: జైరాం రమేష్
న్యూఢిల్లీ: భారత్ కు చైనా శత్రువు కాదంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా(sam pitroda) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమకేమీ సంబంధం లేదని అంటోంది ఈ వ్యవహారంపై జాతీయ కాంగ్రెస్ పార్టీ. దీనిపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జై రాం రమేష్(Jairam Ramesh స్పందించారు. అది శామ్ పిట్రోడో వ్యక్తిగత అభిప్రాయమని, దానితో పార్టీకి సంబంధం లేదన్నారు. శామ్ పిట్రోడో చేసిన వ్యాఖ్యలు పార్టీపై ఎటువంటి ప్రభావం చూపదని జై రాం రమేష్ క్లారిటీ ఇచ్చారు.చైనా(China)పై శామ్ పిట్రోడా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఖచ్చితంగా భారత జాతీయ కాంగ్రెస్ అభిప్రాయాలు కావన్నారు. చైనా అతిపెద్ద విదేశాంగ, భద్రత విధానంతో పాటు మనకు ఆర్థిక సవాలుగా మిగిలిపోయింది అని జైరాం రమేష్ పేర్కొన్నారు. దీనికి తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు జై రాం రమేష్కాగా, పొరుగు దేశం చైనాను శత్రువులా చూడొద్దని సంచలన వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడో.. లేదంటే చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు.భారత్ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని సూచించారు. తొలినుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శామ్ పిట్రోడా తాజాగా ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చైనా నుంచి భారత్‌కు ఏం ముప్పుందో తనకు అర్థం కావడం లేదన్నారు.చైనా పట్ల మన దేశ వైఖరి మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉందన్నారు. ఇప్పటికైనా భారత్ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.ఇది కేవలం చైనా విషయంలోనే కాదని, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అమెరికా కూడా చైనాను శత్రువులా చూస్తూ భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోందని విమర్శించారు.గతంలో కూడా పలు అంశాలపై పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాను ఇరకాటంలో పడి కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలో పడేశారు. కాగా, భారత్,చైనా సంబంధాలు అంతంత మాత్రమే ఉన్న వేళ పిట్రోడా చైనాను ఎక్కువ చేసి చూపిస్తూ మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు పిట్రోడాపై ఫైర్ అవుతున్నారు. దాంతో కాంగ్రెస్ దిగివచ్చింది. తమ పార్టీకి శామ్ పిట్రోడో వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదంటూ జై రాం రమేష్ వ్యాఖ్యానించడం అందుకు ఉదాహరణ. -
‘నిర్మలమ్మ బడ్జెట్ ఓ పెద్ద జోక్’
ఢిల్లీ: ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ తమ ప్రయోజనాల కోసమే బీహార్‌కు వరాలు ఇచ్చిందన్నారు. బీహార్ కోసమే బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. హర్యానా రైతులకు కనీస మద్దతు ధర కూడా ప్రకటించలేదన్నారు. ఉద్యోగం, ఆదాయం గురించి కాదు.. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావనే లేదన్నారు.కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మనకు జీతం లేకపోతే ఏం జరుగుతుంది? ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఆదాయపు పన్ను ఉపశమనం నుండి ప్రయోజనం పొందాలంటే, మీకు నిజంగా ఉద్యోగాలు అవసరం. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించలేదు. మీకు జీతం ఉంటే మీరు తక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు అనిపించవచ్చు. అలాగే, ఒక దేశం, ఒక ఎన్నిక కోరుకునే పార్టీ వాస్తవానికి ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఎన్నికలను ఉపయోగించి మరిన్ని ఉచితాలను అందిస్తుందని చెప్పడం హాస్యాస్పదం.#WATCH | On #UnionBudget2025, Congress MP Shashi Tharoor says, "I think frankly the applause you heard from the BGP benches was for the middle-class tax cut. We look at the details and that may be a good thing. So if you have a salary you may be paying less tax. But the important… pic.twitter.com/vbOJHyMMMy— ANI (@ANI) February 1, 2025కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ..‘వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు.. అనే నాలుగు ఇంజిన్ల గురించి ఆర్థికశాఖ మంత్రి మాట్లాడారు. అభివృద్ధికి ఇది శక్తి యంత్రాలుగా పని చేస్తాయన్నారు. కానీ, చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పింది. త్వరలో బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రయోజనాల కోసమే కేంద్రం ఆ రాష్ట్రంలో బొనాంజా ప్రకటించింది’ అని ఎద్దేవా చేశారు.The FM spoke of 4 engines: Agriculture, MSMEs, Investment, and Exports. So many engines that the Budget has been completely derailed.— Jairam Ramesh (@Jairam_Ramesh) February 1, 2025కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ..‘రైతులకు కనీస మద్దతు ధర లభించలేదు. అణు విద్యుత్ గురించి మాట్లాడారు కానీ హర్యానాలో ఉన్న గోరఖ్‌పూర్‌లోని అణు విద్యుత్ కేంద్రం చాలా కాలంగా ఉంది. దీని గురించి మాట్లడలేదు. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. MGNREGA వంటి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ, ఈ విషయంలో ఏమీ ప్రకటించలేదు. ప్రకటించినదంతా ప్రధానంగా బీహార్ గురించే ఉందన్నారు. #WATCH | #UnionBudget2025 | Congress MP Kumari Selja says, "Farmers didn't get MSP. They talked about nuclear but our nuclear power plant in Haryana's Gorakhpur (Gorakhpur Haryana Anu Vidyut Pariyojana) has been there for a long and both are happening there. Many such issues are… pic.twitter.com/fanSTExEzs— ANI (@ANI) February 1, 2025 -
కులగణన.. మహిళలకు 33% రిజర్వేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జైరాం రమేష్, జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరాలు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక అంశాల్లో తోడ్పాటును అందించేలా వివిధ సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ హామీలు గుప్పించింది. పూర్వాంచల్ వాసుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం సహా చదువుకున్న నిరుద్యోగ యువతకు ఏడాదిపాటు నెలకు రూ.8,500 ఆర్థిక సహాయం వంటి వాగ్ధానాలను ప్రకటించింది. యమునా కాలుష్య పాపం రెండు పార్టీలదే: జైరాం రమేశ్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన జైరాం రమేశ్, యమునా నదీ కాలుష్య పాపం పూర్తిగా, ఆప్, బీజేపీలదేనని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత వల్లే కాలుష్యం ఢిల్లీ ప్రజలకు పెనుశాపంగా మారిందని ధ్వజమెత్తారు. షీలాదీక్షిత్ హాయంలో యమునా కాలుష్యాన్ని నియంత్రించేందుకు జపాన్ ప్రభుత్వంతో కలిసి పనిచేశామని, కాలుష్యాన్ని అరికట్టేలా 7 వేలకు పైగా సీఎన్జీ, మెట్రో సరీ్వసులను ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేసిన మాదిరే ఢిల్లీలోనే పథకాల అమలు జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు→ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు. → పింఛను రూ.2,500 నుంచి రూ.5,000కు పెంపు. → వితంతువుల కూతుళ్ల పెళ్లికి రూ.1.1 లక్షల సాయం → ఢిల్లీ వ్యాప్తంగా 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు. ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం → పూర్వాంచల్‌కు కొత్త మంత్రిత్వ శాఖ. → ప్రతి వార్డులో 24 గంటల డిస్పెన్సరీ, 10 మలీ్టస్పెషాలిటీ ఆసుపత్రులు → రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ → విద్యార్థుల కోసం 700 పబ్లిక్ లైబ్రరీల ఏర్పాటు. → మురుగునీటి మౌలిక సదుపాయాల పునరుద్ధరణ ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే యమునా నదిలో విడుదల చేసేలా ప్రణాళిక → పునరావాస కాలనీలు, అనధికార కాలనీలలో నివసించే ప్రజలకు యాజమాన్య హక్కులు → 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు → సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.5,000 పెన్షన్ → 15,000 మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల పునరి్నయామకం. → జైన్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు → ‘ప్యారీ దీదీ యోజన’కింద మహిళలకు నెలకు రూ.2,500 → నిరుద్యోగ యువతకు నెలవారీ రూ.8,500 సాయం → రూ.500లకే ఎల్పీజీ సిలిండర్ → కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ → ట్రాన్స్జెండర్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు -
‘తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నెహ్రూ పేరును వాడుకుంటున్నారు: జైరాం
సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ నిన్న(శనివారం) లోక్‌సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నెహ్రూ పేరును ప్రధాని మోదీ వాడుకుంటున్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలన ఉండేదన్న జైరాం.. ఎన్డీఏ పాలనలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. 2014కు ముందు కాంగ్రెస్ పాలనలో భారత్ సాధించిన విజయాలను మోదీ గుర్తుచేసుకోవాలంటూ జైరాం హితవు పలికారు.కాగా, కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ లోక్‌సభ సాక్షిగా నిప్పులు చెరిగారు. ‘‘గాంధీ–నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగం రక్తాన్ని కళ్లజూసింది. ఇప్పటికీ ఆ ఆనవాయితీని కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని పదేపదే గాయపరుస్తూనే ఉంది’’ అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు మోదీ శనివారం సమాధానమిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ గత ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు.ఇదీ చదవండి: జమిలి ఎన్నికల బిల్లు వాయిదా?‘‘అవి దేశ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు వంటి విషపు విత్తనాలు నాటాయి. దేశ ఐక్యతనే దెబ్బతీశాయి. ముఖ్యంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి స్థాయిలోనూ రాజ్యాంగాన్ని ఆ కుటుంబం సవాలు చేసింది. అందుకే 55 ఏళ్లు అధికారం వెలగబెట్టిన నెహ్రూ–కుటుంబాన్ని ఓడించి ఇంటిబాట పట్టించాం’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. -
కుటుంబ నియంత్రణలో దక్షిణాది సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ: కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల విజయం పార్లమెంటులో వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించేదిలా ఉండకూడదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణలో సాధించిన విజయం ఆయా రాష్ట్రాలకు దండనగా మారకుండా తగు నిబంధనలను రూపొందించాలని కేంద్రానికి సూచించారు. సోమవారం ‘ఎక్స్’లో ఆయన... ‘కుటుంబ నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నాయి. పరిమిత సంతానం విషయంలో 1988లో కేరళ, 1993లో తమిళనాడు, 2001లో ఆంధ్రప్రదే శ్, 2005లో కర్ణాటక ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఈ విజయాలు పార్లమెంట్లో ఆయా రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించగలవని కొంతకాలంగా ఆందోళనలు వినిపిస్తున్నాయి. అందుకే 2001 లో వాజ్‌పేయి ప్రభు త్వం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 82ను సవరించింది. లోక్‌సభ నియోజకవర్గాల పునరి్వభజన 2026 తర్వాత సేకరించే మొదటి జనాభా లెక్కలపై ఆధారపడి ఉంటుందని అందులో పేర్కొన్నా రు. సాధారణంగా, 2026 తర్వాత మొదటి జన గణన అంటే 2031 అని అర్థం. కానీ ప్రస్తుతం మొత్తం జన గణన షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడింది. 2021లో చేపట్టాల్సిన జనగణన మొదలే కాలేదు. ఇలా ఆలస్యం చేస్తూ వస్తున్న జన గణనను లోక్‌సభ సీట్ల కేటాయింపునకు ఉపయోగిస్తారా?’అని ఆయన ప్రశ్నించారు. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల విజయానికి ఇది విఘాతం కలిగిస్తుందనడంలో సందేహం లేదని, అలా జరగకుండా తగిన మార్గదర్శకాలను రూపొందించాలని జైరాం రమేశ్ సూచించారు. -
99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలిస్తే.. 70 శాతంతో కాంగ్రెస్ గెల్చింది
న్యూఢిల్లీ: ప్రతికూల ఫలితాలిచి్చన హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పద్ధతి, ఈవీఎంల పనితీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ‘‘ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం(లోక్తంత్ర) ఓడిపోయింది. మరో వ్యవస్థ(తంత్ర) అక్రమంగా గెలిచింది’’ అంటూ బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కుట్రకు పాల్పడిందని పరోక్షంగా విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలిస్తే.. 70 శాతంతో కాంగ్రెస్ గెల్చింది ‘‘ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వెల్లడైన ఫలితాలివి. వీటిని మేం ఒప్పుకోం. పారదర్శకమైన, ప్రజాస్వామ్యయుత పద్ధతి ఓటమిపాలైంది. హరియాణా అంకం ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది ఇంకా కొనసాగుతుంది. బ్యాటరీ 99 శాతం నిండిన ఈవీఎంలలో బీజేపీ గెలిస్తే, 70 శాతం బ్యాటరీ ఉన్న ఈవీఎంలలో కాంగ్రెస్ గెలిచింది. ఇందులో కుట్ర దాగుంది. 12 నుంచి 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరిగితే మొదట ఆశ్రయించేది ఎన్నికల సంఘాన్నే.పారదర్శకంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అది. అందుకే తీవ్రమైన ఈ అంశంపై లిఖితపూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. నిరీ్ణత గడుపులోగా చర్యలు తీసుకోవాలని పట్టుబడతాం. ఓట్ల లెక్కింపు, ఈవీఎంల పనితీరుపై చాలా నియోజకవర్గాల్లో సందేహాలు పెరిగాయి. ప్రతి ఒక్కరితో మాట్లాడాం. ఇది విశ్లేషణల సమయం కాదు. మా నుంచి విజయాన్ని లాక్కున్నారు. వ్యవస్థను అధికార పార్టీ దుర్వినియోగం చేసింది. క్షేత్రస్థాయిలో మార్పు కోరుకుంటున్నారనే వాస్తవం ప్రతి ఒక్కరికీ తెలుసు. దీనికి ఫలితాలు దర్పణం పట్టట్లేవు.ఫలితాలను కాంగ్రెస్ అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం కౌంటింగ్, ఈవీఎంల పనితీరు, సమగ్రత ప్రశ్నార్థకంలో పడటమే. దాదాపు 3–4 జిల్లాల్లోని 12–14 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు విధానం, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానిక యంత్రాంగంపై తీవ్రమైన ఒత్తిడి మోపారు. ఇదంతా కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఒత్తిడే’’ అని జైరాం రమేశ్ అన్నారు. 200 ఓట్ల తేడాతో ఓడారు : ‘‘ 200 ఓట్లు, 300 ఓట్లు, 50 ఓట్లు.. ఇలా అత్యల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడారు. చక్కని ఆధిక్యత కనబరిచిన అభ్యర్థులు హఠాత్తుగా 100–200 ఓట్ల తేడాతో ఓడిపోవడమేంటి?. అవకతవకలు, అక్రమాల వల్లే ఇది సాధ్యం. అనూహ్య, దిగ్భ్రాంతికర పరిణామమిది. మార్పును కోరుకుంటూ హరియాణా ప్రజలు ఆశించిన దానికి, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వెల్లడైన ఫలితమిది’’ అని జైరాం ఆరోపించారు. ఎందుకంత నెమ్మది? : అంతకుముందు మధ్యాహ్నం వేళ జైరాం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. ‘‘ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల దాకా ఈసీఐ వెబ్సైట్లో అప్డేట్స్ అనూహ్యంగా నెమ్మదించాయి. దీనికి కారణమేంటి? అదమ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి చందర్ ప్రకాశ్ 1,268 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ ఆయనకు గెలుపు సరి్టఫికేట్ ఇవ్వట్లేదు. ఈసీ వెబ్సైట్లో కూడా ఆయన గెలిచినట్లుగా చూపించట్లేదు. చివరి మూడు రౌండ్ల అప్డేట్స్ ఇవ్వట్లేదు. అనవసర ఆలస్యానికి కారణమేంటి?’ అని జైరాం ప్రశ్నించారు. ఆలస్యం జరగలేదు: ఈసీ : ఈసీ అప్డేట్స్ ఆలస్యమయ్యాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ ఆరోపణల్లో నిజం లేదు. బాధ్యతారాహిత్యంతో, తప్పుడు ఉద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల రూల్ నంబర్ 60 ప్రకారం ఆయా కౌంటింగ్ కేంద్రాల అధికారులు నడుచుకున్నారు. హరియాణా, జమ్మూకశీ్మర్‌లో లెక్కింపుపై అప్డేట్స్ ఆలస్యమయ్యాయన్న మీ మెమొరాండంలో ఎలాంటి వాస్తవాలు లేవు. ప్రతి ఐదు నిమిషాలకు అన్ని నియోజకవర్గాల నుంచి 25 రౌండ్ల ఫలితాలు అప్డేట్ అవుతూనే ఉంటాయి’ అని ఈసీ వివరణ ఇచి్చంది. ఈసీ వివరణపై కాంగ్రెస్ అసహనం వ్యక్తంచేసింది. ‘‘ తటస్థ వైఖరిని అవలంబించాల్సిన ఈసీ ఏకపక్షంగా విపక్ష పార్టీ విన్నపాలను తోసిపుచ్చడం సహేతుకం కాదు. ఫిర్యాదుపై సంప్రదింపుల స్థాయిని ఈసీ దిగజార్చింది’’ అని జైరాం అన్నారు. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలు అవమానకరం: జైరాం రమేశ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 78వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ గురువారం ‘ఎక్స్’ వేదికగా మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘యూసీసీ గురించి మోదీ మాట్లాడుతూ ఇప్పటివరకు మనకు కమ్యూనల్ సివిల్ కోడ్ ఉందనటం చాలా అవమానకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మోదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానపరిచారు. చరిత్రను కించపర్చటంలో ప్రధాని మోదీకి ఎటువంటి హద్దు లేకుండా పోయింది. 1950లో అంబేద్కర్ హిందూ చట్టాల్లో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. అప్పుడు ఆ సంస్కరణలను ఆర్ఎస్ఎస్, జన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించాయి’అని అన్నారు. మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసగంలో.. ‘దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. తనం మతపరమైన సివిల్ కోడ్‌తో 75 ఏళ్లు జీవించాం. ఇప్పుడు మనం సెక్యులర్ సివిల్ కోడ్ వైపు వెళ్లాలి. అప్పుడే దేశంలో మతపరమైన వివక్ష అంతం అవుతుంది. దీంతో సామాన్య ప్రజల మధ్య విభజన పరిస్థితులు దూరం అవుతాయి’అని అన్నారు.మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం మీడియాతో మట్లాడారు. బీజేపీ ప్రభుత్వం విభజన ఆలోచనలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం మన దేశ బలమే తప్ప బలహీనత కాదు. మనకు స్వాతంత్య్రం తేలికగా వచ్చిందని కొందరు ప్రచారం చేస్తారు. కానీ, లక్షల మంది త్యాగాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది’’అని అన్నారు. -
మోదీ ఉక్రెయిన్ పర్యటన!.. జైరాం రమేష్ ఏమన్నారంటే?
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఉక్రెయిన్ పర్యటనకు ముందు, తర్వాత అయినా ప్రధాని మోదీ మణిపూర్ సందర్శించాలని అన్నారు.‘మణిపూర్ సీఎం శనివారం ఢిల్లీ మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన బీజేపీ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో జరిగిన భేటీకి సైతం మణిపూర్ సీఎం హాజరయ్యారు. సీఎం బీరేన్ సింగ్.. ప్రధాని మోదీతో విడిగా సమావేశమై మణిపూర్‌లో మే 3,2023 నుంచి చెలరేగిన ఘర్షణల పరిస్థితిని చర్చించారా?. మోదీని ఉక్రెయిన్ పర్యటనకు ముందు లేదా తర్వాత మణిపూర్ సందర్శించాల్సిందిగా సీఎం బీరేన్ సింగ్ ఆహ్వానించారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’అని జైరాం రమేష్ అన్నారు.The Chief Minister of Manipur attends the NITI Aayog meeting in New Delhi presided over by the self-anointed non-biological PM.Then the Manipur CM attends a meeting of BJP CMs and Deputy CMs presided over by the same deity.The simple question that the people of Manipur are…— Jairam Ramesh (@Jairam_Ramesh) July 28, 2024 బీజేపీ పాలిత రాష్ట్రమైన మణిపూర్‌లో గతేడాది నుంచి కుకీ, మైతేయ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్న విసయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు ప్రధాని మోదీ మణిపూర్ సందర్శించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆయన మణిపూర్ వెళ్లకూడా విదేశీ పర్యటనలు చేయటంపై కాంగ్రెస్ ఇప్పటికే పలుసార్లు తీవ్రంగా విమర్శలు గుప్పించింది.ఉక్రెయిన్‌పై రష్యా 2022లో యుద్దాయానికి దిగిన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. ఉక్రెయిన్ జాతీయ దీనోత్సవం ఆగస్టు 24న జరుగనున్న నేపథ్యంలో ఆ సమయానికి కాస్త అటూఇటూగా మోదీ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ ప్రధాని మోదీతో టెలిఫోన్లో సంభాషిస్తూ, తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా కూడా ఈ ఇరువురు నేతలు సమావేశమయ్యారు. -
కిరణ్ రిజిజు V/s జైరాం రమేష్.. ఎక్స్ వార్
న్యూ ఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు నేడు(సోమవారం) ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ శాసనసభ్యుడు భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీతో సహా కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతోంది. జూన్ 26న స్పీకర్ ఎన్నికల జరగనుంది.కాగాసమావేశాల్లో తొలి రోజే నీట్-యూజీ, యూజీసీ-నెట్లో అవకతవకలు, ప్రొటెం నియామకంపై వివాదం, స్పీకర్ ఎన్నికల వంటి అంశాలపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడనున్నట్లు తెలుస్తోంది.అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీల మధ్య మాటల యుద్ధం నెలకొంది.పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిరణ్ రిజుజు సోమవారం ఉదయం18వ లోక్‌సభ సభ్యులకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కొత్తగా ఎంపికైన ఎంపీలకు స్వాగతం. నేడు(జూన్ 24) లోక్‌సభ మొదటి సమావేశం జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా సభ్యులకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. సభను సమర్ధవంతంగా నడిపేందుకు సభ్యుల నుంచి సమన్వయం కోసం ఎదురుచూస్తున్నారుఈ పోస్ట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాటల కంటే చర్యలు ముఖ్యమని, చెప్పిన మాటలను ఆచరణలో పెట్టాలని కౌంటర్ ఇచ్చారు.జైరాం రమేష్ ట్వీట్‌పై కేంద్రమంత్రి రిజిజు బదులిచ్చారు. మీరు సానుకూలంగా సహకరించడమే సభకు గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. "ఖచ్చితంగా. జైరాం రమేష్ జీ. మీరు తెలివైన సభ్యులు. మీరు సానుకూలంగా సహకరిస్తే సభకు విలువైన ఆస్తి అవుతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు అలాగే ఉంటాయి. కానీ మనమంతా దేశానికి మాసేవ చేసేందుకు ఐక్యంగా ఉన్నాం. భారతదేశపు గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాలను కొనసాగించడంలో మీ సహకారం ఓసం ఎదురుచూస్తున్నాం." అని తెలిపారు.అయితే ఈ సంభాషణ ఇక్కడితో ఆగలేదు. కేంద్రమంత్రి ట్వీట్‌కు మరోసారి జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు. నీట్ పరీక్షను నిర్వహించడంలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంశాన్ని ప్రస్తావిస్తూ... "ధన్యవాదాలు మంత్రి. నా తెలివితేటలకు మీ సర్టిఫికేట్.. ఎన్టీయే గ్రేడింగ్ కాదని నేను భావిస్తున్నాను. దీనికేమైనా గ్రేస్ మార్కుల ఉన్నాయా?" అంటూ పంచ్‌లు విసిరారు. -
మోడీ కి ఐదు ప్రశ్నలు చంద్రబాబు హామీ..?
-
‘జన గణన ఎప్పుడు?.. 14 కోట్ల మంది నష్టపోయారు’
ఢిల్లీ: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఎప్పుడు చేపడతారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో జన గణన చేయకపోవటం వల్ల ఇప్పటివరకు 14 కోట్లమంది నష్టపోయారని మండిప్డడారు. ఇప్పటికైనా జన గణన ఎప్పుడు చేపడతారో దేశానికి తెలియజేయాలన్నారు. జన గణన విషయంపై ఆయన సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు.A comprehensive Census essential for socioeconomic development is carried out by the Union Govt every ten years. The last one was to be completed in 2021. But Mr. Modi didnt get it done.One immediate consequence of not having Census 2021 conducted is that at least 14 crore…— Jairam Ramesh (@Jairam_Ramesh) June 10, 2024‘దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా లెక్కల డేటా పదేళ్ళపాటు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగడుతంది. జనాభా లెక్కలు 2021లో నిర్వహించాల్సింది. కానీ, ప్రధాని మోదీ అప్పుడు నిర్వహించలేదు. 2021లో జనాభా లెక్కలు చేపట్టకపోవటం వల్ల సుమారు 14 కోట్ల మంది భారతీయులకు జాతీయ ఆహార భద్రత చట్టం (2013) కింద ప్రయోజనాలు కోల్పోతున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అందకుండా పోతోంది...1/3 వంతు ప్రధాని మోదీ జనాభా లెక్కల కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారో త్వరలో దేశానికి తెలియజేయాలి. 1951 నుంచి పదేళ్లకొకసారి నిర్వహించే జనాభా లెక్కల వల్ల ఎస్సీ, ఎస్టీల జనాభా డేటా తెలుస్తోంది. అయితే కొత్తగా నిర్వహించే జనాభా లెక్కల డేటాలో ఓబీసీలోని అన్ని కులాల జానాభా వివరాలు ఉండాలి. అప్పుడే రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక న్యాయానికి నిజమైన అర్థం ఇచ్చినట్లు అవుతుంది’ అని జైరాం రమేశ్ అన్నారు. ఇక.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
అమిత్ షాపై ఆరోపణలు.. జైరాంరమేష్‌కు ఈసీ లేఖ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం(జూన్2) కోరింది. ఈ మేరకు ఆయనకు ఈసీ ఒక లేఖ రాసింది. ఎన్నికల కౌంటింగ్‌పై అమిత్ షా 150 మంది జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేశారని జైరాం రమేష్ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది.మీరు చేసే ఆరోపణలు ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తాయని, వాటిపై విచారణ జరిపేందుకు ఆధారాలుంటే సమర్పించండని ఈసీ జైరామ్‌రమేశ్‌ను కోరింది. ఆధారాలు చూపితే తగిన చర్యలు తీసుకుంటామని రమేష్‌కు ఈసీ లేఖలో తెలిపింది. హోంమంత్రి ఇప్పటివరకు 150 మంది కలెక్టర్లతో మాట్లాడారు. వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. విజయం పట్ల బీజేపీ ఎంత నిరాశలో ఉందో దీని ద్వారా తెలుస్తోంది. ఇండియా కూటమి విజయం సాధిస్తుందని జైరాం రమేష్ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
మరోసారి మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్
ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యార్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. ఆయన మంగళవారం ఫారన్ కారెస్పండెంట్స్ క్లబ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘1962 అక్టోబర్‌లో చైనా భారత్‌పై దండయాత్ర చేసింది’’ అని అన్నారు. ఆ సమయంలో తాను ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు తిరస్కరించబడిన విషయాన్ని కూడా పంచుకున్నారు.‘‘ఐఎఫ్ఎస్ పరీక్షలు లండన్‌లో ప్రారంభమయ్యాయి. అందులోనే పాస్ అయ్యాను. కానీ అడ్మిషన్ లేటర్ అందలేదు. దాంతో నేను నాకు జాయినింగ్ లెటర్ అందలేదని విదేశీ వ్యవహారాల శాఖకు తెలియజేశా. నేను అన్ని సర్వీసులకు తిరస్కరించబడినట్లు నాకు టెలిగ్రామ్ అందింది. అయితే నేను చైనా కోసం నిధులు సేకరించానని కొందరు నాపై ఆరోపణలు చేశారు. నాకు డిన్నర్ చేయడానికే ఆ రోజుల్లో డబ్బు లేదు. నేను ఎలా చైనాకు నిధులు సేకరిస్తాను?’’ అని అయ్యర్ వివరించారు.Mani Shankar Aiyar, speaking at the FCC, during launch of a book called Nehru’s First Recruits, refers to Chinese invasion in 1962 as ‘alleged’. This is a brazen attempt at revisionism.Nehru gave up India’s claim on permanent seat at the UNSC in favour of the Chinese, Rahul… pic.twitter.com/Z7T0tUgJiD— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) May 28, 2024 అయితే.. భారత్‌పై చైనా దండయాత్ర చేసిందని అయ్యర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేయటంపై మండిపడ్డారు. మణిశంకర్ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా తీవ్రంగా ఖండిచారు. 1962లో చైనా భారత దండెత్తినట్లు వ్యాఖ్యలు చేయటం.. ఈ సమయంలో రెచ్చగొట్టే ప్రయత్నమేనని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ చైనా అనుకూలంగా వ్యవహరించిందని ఘాటుగా విమర్శలు చేశారు. చైనా కాంగ్రెస్‌ను ప్రేమిస్తుందా? అని ప్రశ్నించారు.Mr. Mani Shankar Aiyar has subequently apologised unreservedly for using the term "alleged invasion" mistakenkly. Allowances must be made for his age. The INC distances itself from his original phraseology.The Chinese invasion of India that began on October 20 1962 was for… https://t.co/74oXfL1Ur2— Jairam Ramesh (@Jairam_Ramesh) May 28, 2024 అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావటంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ‘ఎక్స్’లో తెలిపారు. ‘‘భారత్‌పై చైనా దండయాత్ర అనే మాట పొరపాటు అన్నానని అయ్యర్ క్షమాపణలు చెప్పారు. ఆయన వయసును బట్టి మనం స్వాగతించాలి. ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అక్టోబరు20, 1962న ప్రారంభమైన భారతదేశంపై చైనా దండయాత్ర నిజమే. మే, 2020లో లడాఖ్‌లో చైనా చొరబాట్లు కూడా జరిగాయి. ఇందులో 20 మంది భారత సైనికులు కూడా అమరులయ్యారు. భారత్ చర్చలను చైనా బలహీనపరుస్తోందని జూన్ 19, 2020న ప్రధాని మోదీనే బహిరంగంగా తెలిపారు. దేప్సాంగ్, డెమ్చోక్లో పాటు 2000 చదరపు కిలో మీటర్ల భూభాగం సైతం భారత సైన్యానికి అధీనంలో లేదు’ అని జైరాం రమేష్ మండిపడ్డారు. -
ఇండియా కూటమి 272 సీట్లలో గెలిచేసింది: జైరామ్‌రమేశ్
న్యూఢిల్లీ: ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి టార్గెట్ 350 సీట్లలో ఇప్పటికే 272 సీట్ల మార్క్ దాటామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ అన్నారు. ఈ మేరకు శనివారం(మే25) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పరిస్థితి సౌత్ మే సాఫ్, నార్త్ మే హాఫ్ అన్నట్లుగా తయారైందన్నారు. దక్షిణాదిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో పాటు ఉత్తరాదిలో బీజేపీ సీట్లు గతంతో పోలిస్తే సగానికి తగ్గనున్నాయన్నారు. హర్యానా, పంజాబ్‌లలో అయితే బీజేపీ లీడర్లను ప్రచారానికి రాకుండా ప్రజలు తరిమి కొడుతున్నారని చెప్పారు. బీజేపీ ప్రచారం గడువు కంటే ముందే ముగిసినందున ప్రధాని మోదీ తన రిటైర్మెంట్ను ప్లాన్ చేసుకునేందుకు కావల్సిన సమయం దొరుకుతుందని సెటైర్ వేశారు. -
‘ముందు రాయ్‌బరేలీ నుంచి గెలవండి’
లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ కంచుకోట స్థానాలైన రాయ్‌బరేలీ, అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆ పార్టీ తమ అభ్యర్థులు ప్రకటించింది. రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అమేథీలో కిషోర్ లాల్ శర్మను బరిలోకి దించింది. రాహుల్ గాంధీ తాను మూడు సార్లు గెలిచిన అమెథీని వదిలి రాయ్‌బరేలీ బరిలో దిగటంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. బీజేపీ నేతలే కాకుండా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ సైతం రాహుల్‌గాంధీపై విమర్శలు చేశాడు. ‘గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథ్ ఆనంద్ వంటి చెస్ ఆటగాళ్లు.. త్వరగా రిటైర్ అవటం మంచిదైంది. వారు.. ఒక చెస్ మెథావిని ఎదుర్కొవల్సిన అవసరం లేదు’ అని ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు.. ‘అగ్రస్థానం కోసం సవాల్ చేసే ముందు ముందు రాయ్‌బరేలీ నుంచి గెలివాలి’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి గ్యారీ కాస్పరోవ్ సెటైర్ వేశారు.Traditional dictates that you should first win from Raebareli before challenging for the top! 😂— Garry Kasparov (@Kasparov63) May 3, 2024మరోవైపు.. నటుడు రన్వీర్ షోరే స్పందిస్తూ.. ఈ పరిణామాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారని రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియోతో గ్యారీ కాస్పరోవ్‌ను ట్యాగ్ చేశారు. ‘భారత రాజకీయాల్లో నా చిన్న జోక్ ప్రభావితం చేయదని ఆశిస్తున్నా. అయితే నాకు నచ్చిన చెస్ ఆటలో మాత్రం రాజకీయ నాయకుడు (రాహల్ గాంధీ) ఆడటం చూడకుండా ఉండలేను!’ అని గ్యారీ కాస్పరోవ్ అన్నారు.Nice one, @Kasparov63, but can you handle this move? https://t.co/xrWFf3zLK9 pic.twitter.com/quuw4JGB43— Ranvir Shorey (@RanvirShorey) May 3, 2024రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేయటంపై కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. ‘రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయటంపై చాలా మందికి పలు అభిప్రాయాలు ఉంటాయి. అయితే అందరూ.. రాహుల్ గాంధీకి రాజకియాలతో పాటు చెస్ ఆట మీద చాలా పట్టుందని మర్చిపోవద్దు’ అని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. దీంతో ఆయన ట్వీట్‌పై బీజేపీ నేతలు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.Many people have many opinions on the news of @RahulGandhi contesting elections from Rae Bareli.Remember, he is an experienced player of politics and chess. The party leadership takes its decisions after much discussion, and as part of a larger strategy. This single decision…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 3, 2024చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వ విధానాలను కాస్పరోవ్ వ్యతిరేకించడం వల్లే అధికారులు ఆయన్ను ఉగ్రవాదులు, తీవ్రవాదులు జాబితాలోకి చేర్చారు. చెస్‌లో పలుమార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన 60 ఏళ్ల గ్యారీ కాస్పరోవ్ చాలా కాలంగా పుతిన్ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. -
‘ఐర్లాండ్‌లో భారత రాయబారిని వెంటనే తొలగించాలి’
ఐర్లాండ్‌లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అఖిలేష్ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైం రమేష్ స్పందించారు. అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు చేయటం వృతిపరంగా ఆయన అవమానకరమైన ప్రవర్తనకు నిదర్శనం అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘భారత ప్రభుత్వాన్ని సమర్థించటం ఊహించినదే. కానీ, ఒక రాయబారి ప్రతిపక్ష పార్టీలపై బహిరంగంగా ఇలా విమర్శలు చేయటం సరికాదు. ఆయనది వృత్తిపరంగా చాలా అవమానకరమై ప్రవర్తన. రాయబారిగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా సిగ్గుచేటు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదించదగినవి కాదు. ఆయన సర్వీసు నియమాలను ఉల్లంఘించారు. వెంటనే రాయబారి పదవి నుంచి తొలగించాలి’ అని జైరాం రమేష్ మండిపడ్డారు. అఖిలేష్ మిశ్రా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఐర్లాండ్‌లోని ఓ దినపత్రికలో ప్రచురితమైన సంపాదకీయంలో ‘మోదీకి అపూర్వమైన ప్రజాదరణ ఉంది’ అనే శీర్షికపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన ప్రజాదరణ పొందారు. దానికి మోదీ వ్యక్తిగత స్వాభావంతో పాటు పరిపాలనలో చూపించే సమగ్రత, స్థిరమైన అభివృద్ధిపై నాయకత్వమే కారణం. మోదీ రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని లక్షలాది ప్రజలకు మోదీ వ్యక్తిగత జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకే కుటుంబానికి చెందిన అవినీతి పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయటమే మోదీకి పెరుగుతన్న ప్రజాదరణ వెనక ఉన్న ప్రధానమైన అంశం’ అని అఖిలేష్ మిశ్రా అన్నారు. ‘సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకొని ప్రధాని మోదీ ప్రభుత్వం భారత్‌లో అవినీతిని అంతం చేయటంలో విజయం సాధించింది. భారతదేశ ప్రజాస్వామ్యం చాలా దృఢమైనది. 80 శాతం హిందూ మెజార్టీ ఉన్న భారతదేశాన్ని కొందరు మూస పద్దతులతో తప్పదారి పట్టిస్తున్నారు’ అని అఖిలేష్ మిశ్రా తెలిపారు. ఇక.. ‘అత్యంత పక్షపాతంతో ప్రధాని మోదీ, భారత ప్రజాస్వామ్యం, చట్టం అమలు చేస్తున్న సంస్థలపై విమర్శలు చేస్తున్నారు’ అని డబ్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. Ambassador @AkhileshIFS’s rejoinder to @IrishTimes' highly biased & prejudiced editorial [Modi tightens his grip” April 11, 2024)], casting aspersion on Prime Minister of India, Shri @narendramodi, Indian democracy, law enforcement institutions & “Hindu-majority” people of India. pic.twitter.com/Oh5rFly92Z — India in Ireland (Embassy of India, Dublin) (@IndiainIreland) April 15, 2024 -
తమిళనాడును అవే తీవ్రంగా దెబ్బతీశాయి.. జైరాం రమేష్
కోయంబత్తూర్‌లో జరిగిన ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి 'జైరాం రమేష్' బీజేపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) భారతదేశంలో ఉద్యోగ సృష్టికర్తలని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అభివృద్ధి చెందిందని.. 10 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండేవని జైరాం రమేష్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నోట్ల రద్దు, జీఎస్టీ, సరైన ప్రణాళిక లేని కోవిడ్ లాక్డౌన్ వంటివి రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని అన్నారు. తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక దాదాపు 1,000 చిన్న ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వస్త్ర ఎగుమతులు రూ.30000 కోట్ల నుంచి రూ.26000 కోట్లకు పడిపోయాయని ఆయన అన్నారు. ఎంఎస్ఎంఈలకు ఎన్డీఏ ప్రభుత్వం వేసిన రెండో దెబ్బ జీఎస్టీ అని రమేష్ అన్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత వాణిజ్య పరిమాణం బాగా తగ్గింది. 2017-18లో తిరుప్పూర్ నుంచి రూ. 16,000 కోట్ల మేరకు వస్త్ర ఎగుమతులు తగ్గాయి. మూడు లక్షల మంది కార్మికులకు ఆసరాగా నిలుస్తున్న శివకాశి బాణాసంచా పరిశ్రమలో ఉత్పత్తి 20 నుంచి 25 శాతం తగ్గిందని జైరాం రమేష్ పేర్కొన్నారు. -
అస్సాం సీఎం పచ్చి అవకాశవాది
డిస్పూర్ : మేనిఫెస్టో భారత్‌లో ఎన్నికల కోసం కాదని పాకిస్థాన్‌కు సంబంధించిన మేనిఫెస్టో అంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అస్సాం సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమంత బిశ్వకు రాజకీయబిక్ష పెట్టింది కాంగ్రెసేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో హిమంత్ బిశ్వకు గుర్తింపు, హోదా తమ పార్టీ ఇచ్చిందని అన్నారు. జై రాం రమేష్ పీటీఐ ఇంటర్వ్యూలో అధికారం కోల్పోయిన మరుక్షణం హిమంత్ బిశ్వ బీజేపీలో చేరారని అన్నారు. అస్సాం సీఎం తరుణ్ గోగోయ్ బాధ్యతలు చేపట్టినంత కాలం దాదాపూ 15ఏళ్ల పాటు హిమంత్ బిశ్వకు గుర్తింపు, సముచిత స్థానం కల్పించడంతో పాటు అధికారం ఇచ్చిందని గుర్తు చేసిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ఆయన పార్టీకి ద్రోహం చేశారన్నారు. ఇలాంటి వారికి బాధ్యతలు అప్పగించడం చాలా బాధాకరం. పదవులు అవకాశవాదంగా మారాయి. కానీ అవి మా ఆత్మవిశ్వాసాన్ని ఛిన్నాభిన్నం చేయలేదు అని అన్నారు. అవకాశవాదులు కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం వల్ల మంచే జరిగిందని, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన యువకులకు అవకాశం కల్పించినట్లువుతుందని జై రామ్ రమేష్ వ్యాఖ్యానించారు. -
‘ఖర్గే పొరపాటున మాట్లాడినా.. అది నిజమే!’: జైరాం రమేష్
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని 371వ ఆర్టికల్‌ను మార్చాలన్న మోదీ-షా గేమ్ ప్లాన్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనుకోకుండా బయటపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. అయితే ఖర్గే 370 ఆర్టికల్ అనాల్సింది.. పొరపాటున ఆర్టికల్ 371 అన్నారని తెలిపారు.అయినప్పటికీ మోదీ- షా అసలు గేమ్ ప్లాన్ బయటపడిందని జైరాం రమేష్ అన్నారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే విరుచుకుపడ్డారు. కానీ నిజం ఏమిటంటే.. నాగాలాండ్‌కు సంబంధించిన ఆర్టికల్ 371-ఎ, అస్సాంకు చెందిన ఆర్టికల్ 371-బి, మణిపూర్‌కు సంబంధించిన ఆర్టికల్ 371-సి, సిక్కింకు చెందిన ఆర్టికల్ 371-ఎఫ్, మిజోరామ్‌కు సంబంధించిన ఆర్టికల్ 371-జిని మోదీ-షా మార్చాలనుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఆర్టికల్ 371-హెచ్ అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించిందని జైరాం రమేష్ అన్నారు. ఆర్టికల్ 371జే పూర్వపు హైరాబాద్-కర్ణాటక ప్రాంతానికి సంబంధించిందని ఆయన గుర్తు చేశారు. Today by a slip of the tongue in his speech in Jaipur, @INCIndia President Mallikarjun Kharge ji mistakenly said that Modi claims credit for abolishing Article 371. Kharge ji clearly meant Article 370. Amit Shah immediately pounced on the Congress President. But the truth is… — Jairam Ramesh (@Jairam_Ramesh) April 6, 2024 అనుకోకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 371పై మోదీ-షా ప్లాన్‌ను బయటపెట్టడంతో ఆయన వ్యాఖ్యలపై ఒక్కసారిగా అమిత్ షా ఆందోళన పడ్డారని అన్నారు. అందుకే అమిత్ షా.. ఖర్గే మాటలను ఆర్టికల్ 370కి ముడిపెడుతున్నారని జైరాం రమేష్ మండిపడ్డారు. It is shameful to hear that the Congress party is asking, "Kashmir se kya waasta hai?" I would like to remind the Congress party that J&K is an integral part of India, and every state and citizen has the right over J&K, just as the people of J&K have the right over the rest of… pic.twitter.com/cFeO80XBxl — Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 6, 2024 మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా స్పందించి కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ నేతలు చేస్తున్న పొరపాట్లు దశాబ్దాలుగా మన దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటాలియన్ సంస్కృతి కారణంగా ప్రతిపక్ష పార్టీ.. భరత దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేదు’ అని అమిత్ షా మండిపడ్డారు. ఖర్గే ఏమన్నారంటే... మల్లికార్జున్ ఖర్గే రాజస్థాన్‌లోని జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించి సభలో మోదీ-షాపై విరుచుకుపడ్డారు. ‘బీజేపీ వాళ్లు రాజస్తాన్ వచ్చి ఆర్టికల్ 371ను రద్దు చేశామని చెబుతున్నారు. ఇక్కడి ప్రజలకు అసలు దానితో సంబంధం ఏమిటీ?. జమ్ము కశ్మీర్‌కు వెళ్లి అక్కడి ప్రజలకు దానికి గురించి మాట్లాడితే బాగుంటుంది’ అని ఖర్గే అన్నారు. -
మోదీ ప్రభుత్వంపై జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి ముందు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2021లో బీజేపీని తిరస్కరించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రజలపై మోదీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఓట్లు అడిగేందుకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రధాని పశ్చిమ బెంగాల్‌కు వస్తారు. గతంలో జరిగిన ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలో మాత్రమే మోదీ రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల తరువాత దేశమంతా పలుమార్లు పర్యటించారు, కానీ పశ్చిమ బెంగాల్‌కి ఎప్పుడూ మోదీకి రావాలనిపించలేదని జైరాం రమేష్ అన్నారు.మోదీ ప్రభుత్వం బెంగాల్ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటోంది. కేంద్రం నుంచి రావాల్సిన ఎన్నో నిధులు ఆగిపోయాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్, జల్ జీవన్ మిషన్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులను ఇవ్వడం ఆపేసింది.తన పార్టీ సమగ్రతకు ప్రతిరూపమని మనం విశ్వసించాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. కానీ పశ్చిమ బెంగాల్లో జరిగిన అనేక సంఘటనలు వారి అసమర్ధతను తెలియజేస్తున్నాయి. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి టీఎంసీ నేత తపస్ రాయ్‌పై ఈ ఏడాది జనవరిలో ఈడీ దాడులు చేసింది. కేవలం 3 నెలల తర్వాత, మార్చిలో.. రాయ్ బీజేపీలో చేరారు. ఇప్పుడు కోల్‌కతా ఉత్తర లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈడీ ప్రోబ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానమంత్రి 'భ్రష్టాచార్ హటావో' నినాదం సిగ్గులేకుండా దేశవ్యాప్తంగా మార్మోగిందని జైరాం రమేష్ అన్నారు.గూర్ఖాలాండ్ సమస్యకు పరిష్కారం కోసం గూర్ఖాలు తమ దీర్ఘకాల డిమాండ్లను పునరుద్ధరించినప్పుడు గత సంవత్సరం డార్జిలింగ్‌లో విస్తృత నిరసనలు చెలరేగాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలలో, బీజేపీ డార్జిలింగ్ హిల్స్, సిలిగురి తెరాయ్, డోర్స్ ప్రాంత సమస్యకు శాశ్వత రాజకీయ పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ నెరవేర్చలేదని జైరాం రమేష్ అన్నారు. -
మోదీ ప్రభుత్వంపై జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి ముందు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2021లో బీజేపీని తిరస్కరించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రజలపై మోదీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓట్లు అడిగేందుకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రధాని పశ్చిమ బెంగాల్‌కు వస్తారు. గతంలో జరిగిన ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలో మాత్రమే మోదీ రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల తరువాత దేశమంతా పలుమార్లు పర్యటించారు, కానీ పశ్చిమ బెంగాల్‌కి ఎప్పుడూ మోదీకి రావాలనిపించలేదని జైరాం రమేష్ అన్నారు. మోదీ ప్రభుత్వం బెంగాల్ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటోంది. కేంద్రం నుంచి రావాల్సిన ఎన్నో నిధులు ఆగిపోయాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్, జల్ జీవన్ మిషన్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులను ఇవ్వడం ఆపేసింది. తన పార్టీ సమగ్రతకు ప్రతిరూపమని మనం విశ్వసించాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. కానీ పశ్చిమ బెంగాల్లో జరిగిన అనేక సంఘటనలు వారి అసమర్ధతను తెలియజేస్తున్నాయి. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి టీఎంసీ నేత తపస్ రాయ్‌పై ఈ ఏడాది జనవరిలో ఈడీ దాడులు చేసింది. కేవలం 3 నెలల తర్వాత, మార్చిలో.. రాయ్ బీజేపీలో చేరారు. ఇప్పుడు కోల్‌కతా ఉత్తర లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈడీ ప్రోబ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానమంత్రి 'భ్రష్టాచార్ హటావో' నినాదం సిగ్గులేకుండా దేశవ్యాప్తంగా మార్మోగిందని జైరాం రమేష్ అన్నారు. గూర్ఖాలాండ్ సమస్యకు పరిష్కారం కోసం గూర్ఖాలు తమ దీర్ఘకాల డిమాండ్లను పునరుద్ధరించినప్పుడు గత సంవత్సరం డార్జిలింగ్‌లో విస్తృత నిరసనలు చెలరేగాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలలో, బీజేపీ డార్జిలింగ్ హిల్స్, సిలిగురి తెరాయ్, డోర్స్ ప్రాంత సమస్యకు శాశ్వత రాజకీయ పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ నెరవేర్చలేదని జైరాం రమేష్ అన్నారు. Today, the Prime Minister is on his way to Cooch Behar in West Bengal. There is perhaps no state whose people have suffered more at the hands of the Modi Sarkar. The PM should use this opportunity to answer for all his government’s failings in West Bengal: 1. It seems like the… — Jairam Ramesh (@Jairam_Ramesh) April 4, 2024 -
హస్తినలో విపక్షాల ర్యాలీ నేడే
న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఆదివారం తలపెట్టిన భారీ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీతో పాటు కూటమికి చెందిన పలువురు నేతలు ప్రసంగిస్తారన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొనే అవకాశముందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని, ర్యాలీలో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తామని తెలిపారు. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. ఇండియా కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ సారథి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. -
కాంగ్రెస్‌కు మరో రెండు ‘ఐటీ’ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ఆదాయపన్ను శాఖ(ఐటీ) వెంటాడుతోంది. శుక్రవారమే(మార్చ్ 29)రూ.1800 కోట్ల మేర ఆదాయపన్ను రికవరీ నోటీసులు అందుకున్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరో రెండు నోటీసులను ఐటీ శాఖ పంపిందని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ చెప్పారు. ఈ నోటీసులు శనివారం రాత్రి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ట్యాక్స్ టెర్రరిజానికి కాంగ్రెస్ టార్గెట్‌గా మారిందని జైరామ్ ఫైర్ అయ్యారు. కాగా, 2017-18 నుంచి 2020-21 ఆదాయపన్ను అసెస్మెంట్ సంవత్సరాలకుగాను పెనాల్టీ, వడ్డీని కలిపి రూ.1800 కోట్ల పన్ను కట్టాలని శుక్రవారం ఇచ్చిన నోటీసులో ఐటీ శాఖ పేర్కొంది. నాలుగేళ్ల రిటర్న్స్‌పై రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్ను శాఖ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఐటీ రికవరీ నోటీసులు పంపింది. 2014-15, 2015-16,2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆదాయ పన్ను రిటర్నులను కూడా రీ అసెస్మెంట్ చేసే చర్యలు ఐటీ ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ. 135 కోట్ల మేర నగదును ఫ్రీజ్ చేసింది. ఇదీ చదవండి.. రూ.1823 కోట్లు చెల్లించండి -
సమాన అవకాశాలతో కూడిన భారత్ కోసం ఇది అవసరం: జైరాం రమేష్
భారతదేశంలో అందరికి సమానమైన అవకాశాలు కల్పించడానికి కుల గణన ఒక్కటే మార్గమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. 1951 జనాభా లెక్కలతో ప్రారంభమైన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినవి మినహా జనాభా గణనలో కుల వర్గాన్ని తొలగించారని ఆయన పేర్కొన్నారు. 2021లో జరగాల్సిన చివరి జనాభా గణనను మోడీ ప్రభుత్వం పదేపదే వాయిదా వేసింది. స్వతంత్ర దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఇది అవసరమని జైరాం రమేష్ అన్నారు. గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వం, ప్రభుత్వ రంగంలోని విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకే కాకుండా వెనుకబడిన తరగతులకు, ఆర్థికంగా బలహీనవర్గాలకు వర్తించాయి. అయితే కేటగిరీల కింద ఉన్న సమూహాలు, వారికి సంబంధించి డేటా అందుబాటులో లేదు. అన్ని వర్గాల కింద ఉన్నవారికి సామజిక న్యాయం చేకూర్చడానికి ప్రతి సమూహానికి సంబంధించిన డేటా అవసరం. రిజర్వ్డ్ కేటగిరీలలో రిజర్వేషన్ ప్రయోజనాల మరింత సమానమైన పంపిణీని నిర్ధారించడానికి కూడా కుల గణన ఉపయోగపడుతుందని జైరాం రమేష్ పేర్కొన్నారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిలో ఎవరు ప్రయోజనం పొందుతున్నారు, దాని ఖర్చులను ఎవరు భరిస్తారనేది మేము సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. కులగణన లేకుంటే ప్రయోజనాలు సమానంగా పంపిణీ చేయడంలో లోపాలు తలెత్తుతాయి. కుల సమూహాలు, జాతీయ ఆస్తులు అన్నీ కూడా పాలనా వ్యవస్థలలో భాగం. సమగ్ర సామాజిక ఆర్థిక కుల గణన అని పిలవబడే ఈ సర్వే అందరికీ సమాన అవకాశాలతో కూడిన భారతదేశాన్ని నిర్ధారించడానికి ఏకైక పరిష్కారం అని జైరాం రమేష్ స్పష్టం చేశారు. Why is the Caste Census a necessity? 1. Caste is a socioeconomic reality of Indian society and has been for centuries. We cannot deny caste-based discrimination in India and the disadvantages imposed by caste at birth. 2. The caste category in the Census was done away with,… https://t.co/Xl13kBTHnd — Jairam Ramesh (@Jairam_Ramesh) March 24, 2024 -
ఇండియా కూటమి చెదరలేదు: జైరామ్ రమేశ్
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి చెక్కుచెదరలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉంటున్నప్పటికీ తమ కూటమికి స్థిరంగా, బలంగా ఉందని అన్నారు. అవినీతిని వ్యతిరేకిస్తున్నాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తడొల్లేనని కొట్టిపారేశారు. జైరామ్ రమేశ్ ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని తేల్చిచెప్పారు. విపక్షాలు 272కి పైగా సీట్లు సాధిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందినవారు పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి, బీజేపీకి సమర్పించుకున్నారని తెలిపారు. రూ.4,000 కోట్ల విలువైన బాండ్లకు రూ.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులతో ప్రత్యక్షంగా సంబంధం ఉందన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నవారు కూడా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీజేపీకి అందజేశారని వెల్లడించారు. ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రో కో అని తేలి్చచెప్పారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన కాంట్రాక్టులను దక్కించుకున్న ఓ బీజేపీ ఎంపీ కూడా ఎలక్టోరల్ బాండ్లు కొన్నాడని వెల్లడించారు అవినీతిపై పోరాటం అంటూ ప్రధాని మోదీ చెబుతున్న మాటల్లో ఏమాత్రం పస లేదని జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ 25 గ్యారంటీలు
రానున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన హామీలను ప్రకటించింది. 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతోపాటు యువత, మహిళలు, రైతులు, కార్మికులకు 25 గ్యారంటీలను ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత జైరాం రమేష్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు, అప్రెంటిస్‌షిప్ అవకాశం కల్పిస్తామని పేర్కొంది. మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామంది. రైతులకు ఎంఎస్పీకి చట్టపరమైన హామీని ఇస్తామని, స్టాండింగ్ లోన్ మాఫీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. కార్మికులకు ఉచితంగా రోగ నిర్ధారణలు, మందులు, చికిత్స, ఆపరేషన్లు వంటివి కల్పిస్తామంది. ఉపాధి హామీ, అసంఘటిత కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ గ్యారంటీల్లో పేర్కొంది. #YuvaNYAY 1. #BhartiBharosa : 30 lakh new central government jobs, according to a jobs calendar 2. #PehliNaukriPakki : One year apprenticeship for all educated youth, at Rs. 1 lakh/year (Rs. 8,500/month) 3. Paper Leak se Mukti: Law to completely end all paper leaks… pic.twitter.com/Pc4OvYgFdG — Jairam Ramesh (@Jairam_Ramesh) March 18, 2024 -
మోదీ సర్కార్ ఎందుకు నిరాకరించింది!.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (సోమవారం) కర్ణాటక శివమొగ్గలో పర్యటిస్తున్నారు. మోదీ తన పర్యటనలో రాష్ట్రంలోని కీలక సమస్యలను ప్రస్తావిస్తారని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని 236 తాలూకాలలో 223 కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చాలా ప్రాంతాలలో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా కర్ణాటక తీవ్ర నీటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కరువు సాయం కోసం రూ.18,172 కోట్ల నిధులు విడుదల చేయాలని మోదీ సర్కార్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కర్ణాటక ప్రజలకు సాయం చేసేందుకు మోదీ సర్కార్ ఎందుకు నిరాకరించింది? గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కరువు సంబంధిత ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడాలని విన్నవించింది. దీనికోసం కర్ణాటక ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) క్రింద పనిదినాల సంఖ్యను 100 నుండి 150కి పెంచాలని కోరింది. అయితే, మోదీ సర్కార్ పథకం పొడిగింపును ఆమోదించడమే కాకుండా.. దీనికోసం MGNREGS కింద పనిచేస్తున్న వారికి వేతనాల చెల్లింపు కోసం రూ. 1600 కోట్లు చెల్లించాలి. ఈ వేతనాలను మోదీ ప్రభుత్వం ఎప్పుడు చెల్లించబోతోంది? 2023లో అధికారం చేపట్టినప్పటి నుంచి కర్ణాటక ప్రభుత్వం అన్న భాగ్య పథకం ద్వారా పేద కుటుంబాలకు అదనంగా 5 కిలోల బియ్యాన్ని అందించడానికి చేస్తున్న ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం భగ్నం చేసింది. పథకం డిమాండ్లను తీర్చేందుకు అవసరమైన 2.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కర్ణాటక ప్రభుత్వానికి విక్రయించేందుకు నిరాకరించింది. ఇదంతా కేవలం రాజకీయ ప్రతీకారామేనా? శివమొగ్గ, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సెగ్మెంట్. కర్ణాటక రాష్ట్ర వంశ రాజకీయాలపైన బీజేపీ వైఖరి ఏమిటి? ప్రధాని స్పష్టం చేయాలని అన్నారు. The Prime Minister is in Shivamogga, Karnataka today. We hope he addresses some of the key issues in the state in his address: 1.Karnataka is reeling under an acute water crisis due to severe drought situation in most parts of the state, with 223 of the state’s 236 Talukas… — Jairam Ramesh (@Jairam_Ramesh) March 18, 2024 -
ఎలక్టోరల్ బాండ్ల డేటాపై 'జైరాం రమేష్' కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాడాలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి 'జైరాం రమేష్' ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. దీనిపై ఎన్నికల సంఘం (EC) పంచుకున్న డేటా అసంపూర్ణమైనదని వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. కానీ ఓటర్ తన ఓటును సరిగ్గా వేసినట్లు తెలుసుకోవడానికి పోలింగ్ ప్రక్రియలో ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)ని ప్రవేశపెట్టాలని జైరాం రమేష్ అన్నారు. తమ పార్టీ గత సంవత్సరం నుంచి ఈసీతో అపాయింట్మెంట్ కోరుతూనే ఉందని, కానీ వారు ఇవ్వలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను కలవడానికి ఈసీ ఎందుకు, ఎవరికి భయపడుతోంది అని కేంద్ర మాజీ మంత్రి ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ప్రచురించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాలో.. ''ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారు, దర్యాప్తు సంస్థల బెదిరింపుల కారణంగా బాండ్లు కొనుగోలు చేసిన వారు, కాంట్రాక్టులు పొందడానికి లంచంగా బాండ్లను కొనుగోలు చేసిన వారు, షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసినవారు'' మాత్రమే నాలుగు కేటగిరీలుగా ఉన్నారని జైరాం రమేష్ పేర్కొన్నారు. స్వతంత్ర భారతావనిలో ఇదే అతిపెద్ద కుంభకోణమని, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని.. ప్రజాకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీ తమ అధికారిక వెబ్సైట్లో ఉంచిన ఒక రోజు తర్వాత జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
మోదీ వారంటీ ఎక్స్పైర్ అవుతుంది..: జైరాం రమేష్
'మోదీ కి గ్యారెంటీ' అనే బీజేపీ నినాదంపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట 'గ్యారెంటీ' అనే పదాన్ని వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఉపయోగించారని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వారెంటీ గడువు ముగియబోతోందని జైరాం రమేష్ అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కర్ణాటక, తెలంగాణలలో అమలవుతున్నాయి. గ్యారెంటీ అనే మాట కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఉపయోగించారని ఆయన అన్నారు. మోదీ కి గ్యారెంటీ అనే పదం జూలై 26న ఢిల్లీలో భారత మండపాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రధాని మొదట ఉపయోగించారు. ఇదే నేడు బీజేపీ వారంటీగా మారిపోయింది. ఇప్పటికే మోదీ గ్యారెంటీలకు జీరో వారంటీ ఉందని 'జన గర్జన్ సభ' ర్యాలీ సందర్భంగా టీఎంసీ నాయకుడు 'అభిషేక్ బెనర్జీ' పేర్కొన్న విషయాన్ని జైరాం రమేష్ ప్రస్తావించారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 'జన గర్జన్ సభ' ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, 'మోదీ కి గ్యారెంటీ' జీరో వారెంటీ అని, మమతా బెనర్జీ, టీఎంసీ మాత్రమే హామీలను నిలబెట్టుకుంటాయని అభిషేక్ అన్నారు. బీజేపీ నాయకులు బయటి వ్యక్తులని, బెంగాల్ వ్యతిరేకులని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రాన్ని సందర్శిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. -
సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ చట్టం విధివిధానాలు నోటీఫై చేయటానికి నాలుగేళ్ల మూడు నెలలు పట్టింది. అయినా మోదీ మాత్రం తన ప్రభుత్వం సమయానుకూలంగా పని చేస్తుందని చెప్పుకుంటారు. సీఏఏ నియమాలను నోటీపై చేయటానికి తీసుకున్న సమయం మోదీ చెప్పే అబద్ధాలకు మరో నిదర్శనం’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసిన విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇవాళ సీఏఏ అమలు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. दिसंबर 2019 में संसद द्वारा पारित नागरिकता संशोधन अधिनियम के नियमों को अधिसूचित करने में मोदी सरकार को चार साल और तीन महीने लग गए। प्रधानमंत्री दावा करते हैं कि उनकी सरकार बिल्कुल प्रोफेशनल ढंग से और समयबद्ध तरीक़े से काम करती है। सीएए के नियमों को अधिसूचित करने में लिया गया इतना… — Jairam Ramesh (@Jairam_Ramesh) March 11, 2024 ‘దేశంలోని పౌరులు జీవనోపాధి కోసం బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు.. ఇతరుల కోసం ‘పౌరసత్వ చట్టం’ తీసుకురావడం వల్ల ఏమి జరుగుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ ఆటకట్టించే రాజకీయం ఇప్పుడు ప్రజలకు అర్థమైందని అన్నారు. తమ పదేళ్ల పాలనలో లక్షలాది మంది పౌరులు దేశ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో బీజేపీ ప్రభుత్వం వివరించాలని నిలదీశారు. जब देश के नागरिक रोज़ी-रोटी के लिए बाहर जाने पर मजबूर हैं तो दूसरों के लिए ‘नागरिकता क़ानून’ लाने से क्या होगा? जनता अब भटकावे की राजनीति का भाजपाई खेल समझ चुकी है। भाजपा सरकार ये बताए कि उनके 10 सालों के राज में लाखों नागरिक देश की नागरिकता छोड़ कर क्यों चले गये। चाहे कुछ हो… — Akhilesh Yadav (@yadavakhilesh) March 11, 2024 ‘మీరు ఆరు నెలల ముందు సీఏఏ చట్టం నియమాలు నోటీఫై చేసి ఉండాల్సింది. దేశానికి మంచి జరిగితే.. మేము ఎల్లప్పుడూ మద్దతిస్తాం, అభినందిస్తాం.. కానీ, దేశానికి కీడు జరిగితే మాత్రం టీఎంసీ వ్యతిరేకిస్తుంది. రంజాన్ నెల ప్రారంభమయ్యే ముందు రోజే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. Aap chronology samajhiye, pehle election season aayega phir CAA rules aayenge. Our objections to CAA remain the same. CAA is divisive & based on Godse’s thought that wanted to reduce Muslims to second-class citizens. Give asylum to anyone who is persecuted but citizenship must… — Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2024 సీఏఏ అమలు నిర్ణయంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘ఎన్నికల సీజన్ వస్తున్న సమయంలో సీఏఏ నియమాలు అమల్లోకి వచ్చాయి. సీఏఏపై తమ అభ్యంతరాలు ఇంకా అలాగే ఉన్నాయి. సీఏఏ అనేది విభజన, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలని కోరుకునే గాడ్సే ఆలోచన విధానం. హింసించబడిన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి. కానీ పౌరసత్వం అనేది మతం లేదా జాతీయతపై ఆధారపడి ఉండకూడదు. ఈ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉంచారో? ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఎన్పీఆర్-ఎన్ఆర్సీతో పాటు.. సీఏఏ కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది మరే ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడదు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన భారతీయులు.. మళ్లీ వ్యతిరేకించడం తప్ప మరో మార్గం లేదు’ అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ‘ఎక్స్’ వేదికగా అన్నారు. -
ప్రధాని బిహార్ పర్యటన.. ‘ఆ ధైర్యం మోదీకి ఉందా?’
భారత ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో మోదీపై విపక్ష కాంగ్రెస్ పార్టీ మాటల దాడిని ప్రారంభించింది. బిహార్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అక్కడి కుల ఆధారిత జనాభా గణన గురించి మాట్లాడే ధైర్యం చేస్తారా అని సవాలు విసురుతోంది. ఈ మేరకు కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘ఆయన (మోదీ) అక్కడ కూడా అపద్ధాలు, ప్రకటన వర్షం కురిపిస్తాడు. వీటితోపాటు కుల జనాభా గణన అనే ముఖ్యమైన సామాజిక -ఆర్థిక సమస్యపై కూడా ఆయన ధైర్యంగా మాట్లాడతాడని ఆశిస్తున్నాం’ అంటూ హిందీలో రాసుకొచ్చారు. అలాగే ఈ పోస్టులో ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి నాలుగు ప్రశ్నలను సంధించారు. మోదీ ప్రభుత్వం ఎందుకు సాధారణ జనాభా గణను నిర్వహించడం లేదు? 2011లో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల గణనలో సేకరించిన కుల సంబంధిత డేటాను మోదీ ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ‘బిహార్‌లో ‘ఇండియా’ సంకీర్ణ ప్రభుత్వం కుల గణనను చేపట్టి గణాంకాలను విడుదల చేసింది. జనాభా గణనలో వెల్లడైన వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక న్యాయం కోసం ఇప్పుడు బిహార్‌లోని ‘కొత్త’ ఎన్డీఏ ప్రభుత్వం విజన్ ఏమిటి? దేశవ్యాప్త సామాజిక-ఆర్థిక కుల గణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఈ అంశం బీజేపీ స్టాండ్ ఏమిటి?’ అని జైరాం రమేష్ ప్రశ్నించారు. -
టీఎంసీతో పొత్తుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి - జైరాం రమేష్
పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించుకున్నప్పటికీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో పొత్తుకు ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. పాట్నాలో ప్రతిపక్షాల ర్యాలీకి ముందు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి & కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ఏకపక్షంగా 42 స్థానాలకు (పశ్చిమ బెంగాల్లో) పోటీ చేస్తానని ప్రకటించింది, కానీ మాకు సంబంధించినంతవరకు, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి, వారి కోసం తలుపులు తెరిచి ఉన్నాయని.. ఆఖరి మాట చెప్పేంత ఈ అవకాశం ఉంటుందని అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రదానం చేసిన వారం రోజుల తర్వాత రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) NDA కూటమిలో చేరింది. అలీఘర్‌లో యాత్రలో రాహుల్ గాంధీకి లోక్ దళ్ స్వాగతం పలికిందని రమేష్ అన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం (కేరళలోని) నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్నకు జవాబిస్తూ.. ఆ విషయం ప్రస్తుతం చర్చలో ఉందని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు. -
కాంగ్రెస్ నేతలకు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసు
ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కాంగ్రెస్‌నేతలకు చట్టపరమైన నోటీసులు పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ నేతలు వక్రీకరించారని ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. ‘కేంద్ర మంత్రి గడ్కరీ కాంగ్రెస్ పోస్ట్ చేసిన 19 సెకండ్ల వీడియో క్లిప్‌ను చూసి షాక్ అయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు, వాటి అసలు అర్థాన్ని కాంగ్రెస్ నేతలు వక్రీకరించారు’ అని న్యాయవాది బాలేందు శేఖర్ తెలిపారు. గందరగోళాన్ని, అపకీర్తిని సృష్టించడానికి నితిన్ గడ్కరీ మాటాలను వక్రీకరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు పోస్ట్ చేసిన ఆ వీడియో క్లిప్‌ను తొలగించాలని లిగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. మూడు రోజుల్లో తన క్లైంట్కు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని లాయర్ బాలేందు శేఖర్ తెలిపారు. వీడియో క్లిప్‌లో ఏం ఉంది? జాతీయ మీడియా చానెల్‌కు నితిన్ గడ్కరీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఓ అంశాన్ని వివరించే క్రమంలో.. ‘గ్రామీణ ప్రజలు, కూలీలు, రైతులు సంతోషంగా లేరు. గ్రామాలకు సరైన రోడ్లు లేవు. తాగడానికి కనీసం తాగునీరు లేదు. నాణ్యమైన ఆస్పత్రులు, పాఠశాలలు లేవు’ అని అన్నారు. అయితే కేవలం ఈ మాటలను మాత్రమే ఉన్న ఓ క్లిప్‌ను కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 19 సెకండ్ల వీడియో క్లిప్‌పై కేంద్రమంత్రి గడ్కరీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన మాటలను కాంగ్రెస్ పార్టీ నేతలు కావాలనే వక్రీకరించారని గడ్కరీ అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. తన వీడియో క్లిప్‌ను 24 గంటల్లో డిలీట్ చేసీ.. కాంగ్రెస్ నేతలైన మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌లు మూడు రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణలు తెలిపాలని ఆయన డిమాండ్ చేశారు. -
రాహుల్ యాత్రకు ఆహ్వానం లేదు: అఖిలేశ్ యాదవ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌జోడో న్యాయ యాత్రపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే యాత్రకు రావాల్సిందిగా తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అఖిలేశ్ స్పష్టం చేశారు. ఎన్నో పెద్ద ఈవెంట్లు జరుగుతుంటాయని, అన్నిటికి తమను పిలవరని అన్నారు. వెంటనే దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాంరమేష్ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ న్యాయ యాత్ర షెడ్యూల్ ఇంకా ఖరారవలేదు. ఒకట్రెండు రోజుల్లో టూర్ షెడ్యూల్ ఫైనల్ అవుతుంది. న్యాయ యాత్రకు అఖిలేశ్ హాజరైతే ఇండియా కూటమి ఇంకా బలోపేతం అవుతుంది’ జైరాం రమేష్ అన్నారు. రెండవ విడత మణిపూర్ నుంచి వరకు ప్రారంభమైన రాహుల్‌గాంధీ న్యాయ యాత్ర ఐదు రాష్ట్రాల్లో టూర్ పూర్తి చేసుకుంది. యాత్రలో ఈసారి ఎక్కువ భాగం రాహుల్‌గాంధీ బస్సులోనే పర్యటించారు. ఈ నెల 16న న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘అద్వానీ, మోదీని చూస్తే.. ఆ రెండు సంఘటనలు గుర్తుకొస్తాయి’
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. అయితే ఎల్కే అద్వానీకి భారత రత్న ప్రకటించడంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ స్పందించారు. బీజేపీ అగ్రనేత ఎల్.కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన సందర్భంగా.. అద్వానీ, ప్రధాని మోదీకి సంబంధించి తనకు రెండు సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. అందులో మొదటి సంఘటన.. 2002లో ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్‌కు సీఎం ఉన్న సమయంలో.. మోదీని అద్వానీ కాపాడారని తెలిపారు. ఆనాటి ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజపేయి.. గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని ఆ పదని నుంచి తొలగించి రాజధర్మను గుర్తుచేయాలనుకున్నారని తెలిపారు.కానీ, ఆ సమంయలో మోదీని సీఎం పదవి నుంచి తొలగించబడకుండా అద్వానీ రక్షించారని అన్నారు. రెండో సంఘటన.. 5 ఏప్రిల్, 2014 నాటి సమయంలో నరేంద్ర మోదీ.. గుజరాత్‌లోని గాంధీ లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్ వేశారు. అప్పడు అద్వానీ.. నరేంద్రమోదీపై అసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ తన శిష్యుడు కాదని.. మంచి ఈవెంట్ మేనేజర్ అని అన్నారని తెలిపారు. ఈ మాటలు తాను అంటున్నని కాదని.. స్వయంగా అద్వానీ అన్న మాటలేనని తెలిపారు. వారిద్దరినీ (అద్వానీ, మోదీ) చూసినప్పుడు ఈ సందర్భాలు గుర్తుకువస్తాయని జైరాం రమేష్ అన్నారు. ఇక.. 2002లో మోదీని రక్షించిన అద్వానీ.. 2014లో మాత్రం మోదీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారని అన్నారు. आज दोपहर मोहनपुर, देवघर में हुई प्रेस कॉन्फ्रेंस में LK अडवाणी को भारत रत्न दिए जाने को लेकर एक पत्रकार साथी के सवाल पर मेरा जवाब। In my press meet this afternoon at Mohanpur in Deoghar district of Jharkhand I was asked about the Bharat Ratna to Mr. L.K. Advani. This was my… pic.twitter.com/IjnGIgDZoL — Jairam Ramesh (@Jairam_Ramesh) February 3, 2024 -
‘నితీష్, బీజేపీకి బిహార్ ప్రజలు బుద్ధి చెబుతారు’
జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ మహాకుటమి నుంచి బయటకు వచ్చి సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీతో జట్టు కట్టి ఆదివారం మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లీకార్జును స్పందిస్తూ.. బిహార్‌లో ఇటువంటి పరిస్థితి వస్తుందని.. జేడీ(యా) చీఫ్ నితీష్ కుమార్ మహాకూటమి నుంచి వైదొలుగుతారని ముందే ఊహించినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేష్ మాత్రం నితీష్.. బీజేపీలో చేరటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’పై నితీష్ వైదొలటం ఎలాంటి ప్రభావాన్ని చూపదని అన్నారు. 2024 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ ప్రజలు నితీష్ కుమార్, ఢిల్లీలో(బీజేపీ) వారికి ఖచ్చితంగా తమదైన శైలిలో బుద్ధి చెబుతారని తెలిపారు. నితీష్ కుమార్ వంటి పచ్చి రాజకీయ అవకాశవాదిని తానెప్పుడూ చూడలేదని తీవ్రంగా మండిపడ్డారు. #WATCH | On Nitish Kumar joining NDA, Congress MP Jairam Ramesh says, "This will not affect the INDIA alliance. The people of Bihar will give the right answer to Nitish Kumar and those who are sitting in Delhi in the 2024 elections. I have not seen any opportunistic leader like… pic.twitter.com/w1IYot6jCc — ANI (@ANI) January 28, 2024 అవకాశవాదంలో ఊసరవెల్లితోనే ఆయన పోటీ పడ్డారని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారం అంతా ప్రధాని మోదీ డైరెక్షన్లో నడుస్తోందని మండిపడ్డారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సాధిస్తున్న విజయం పట్ల బీజేపీకి భయం కలుగుతోందని అన్నారు. అందుకే కూటమిని చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇక.. నితీష్ కుమార్ నేడు సాయంత్రం 4 గంటలకు మరోసారి బిహార్ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతుతో సీఎం కానున్న నితీష్.. బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు , స్పీకర్ పదవిని కేటాయిస్తారని తెలుస్తోంది. చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ -
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. సీనియర్ నేత గుడ్‌బై
Milind Deora.. ముంబయి: మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు చేరిపోనున్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. Congress leader Milind Deora resigns from the primary membership of Congress "Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH — ANI (@ANI) January 14, 2024 ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ మండిపాటు మిలింద్ దేవరా పార్టీ నుండి వైదొలగడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మండిపడ్డాడు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరాతో ఉన్న సుధీర్ఘ బంధాన్ని పంచుకున్నారు. "మురళీ దేవరాతో నాకు సుదీర్ఘ కాలంపాటు అనుబంధం ఉంది. మేము ఎంతో అభిమానంతో ఉండేవాళ్లం. ఆయనకు అన్ని రాజకీయ పార్టీలలో సన్నిహిత మిత్రులు ఉన్నారు. కానీ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే ధృడమైన కాంగ్రెస్‌వాది.తథాస్తు..!" అని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇదీ చదవండి: ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి అవసరం లేదు: శరద్ పవార్ -
Ram Mandir: ‘కాంగ్రెస్ పశ్చాత్తాపడటం తప్పదు’
అయోధ్యలో జనవరి 22న జగిగే రామ మందిర ప్రారంభోత్సవానికి తాము హాజరు కావొద్దని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గొప్పగా మాట్లాడటంలో కూరుకుపోయిందని అన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని వాళ్లు ఎందుకు సీరియస్‌కు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మందిర ప్రారంభోత్సవానికి వెళ్లకపోతే కాంగ్రెస్ పార్టీవాళ్లే తీవ్రంగా పశ్చాత్తాపపడతారని అన్నారు. రామ మందిర ప్రారంభ కార్యక్రమం విషయంలో కాంగ్రెస్ తీరుపై మరో బీజేపీ నేత నలిన్ కోహ్లి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఊహించిందేనని అన్నారు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికిని కూడా తిరస్కరిస్తోందని మండిపడ్డారు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అయోధ్య ఆలయం కోసం ఎటువంటి సానుకూలమైన అడుగులు వేయలేదని అన్నారు. రాముడి ఉనికిని కూడా తిరస్కరిస్తూ.. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసును సైతం జాప్యం చేసిందని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా హాజరుకామని ప్రకటించటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని అన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మజీందర్ సింగ్ సిర్సా కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాకపోతే తమకు ఏ ఇబ్బంది లేదని అన్నారు. కానీ, రామ మందిర ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమం అనడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు. ఇక.. అయోధ్య రామ మందిర కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ సోనియా గాంధీ,లోక్‌సభ ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం తమ నిర్ణయంపై ఆలోచిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. బుధవారం హాజరు కావటంలేదని ప్రకటించింది. ఆయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమం ఆర్ఎస్ఎస్, బీజేపీ చెందిన కార్యక్రమమని మండిపడింది. ఈ కార్యక్రమాన్నిమోదీ ప్రభుత్వం రాజకీయ ప్రాజెక్టుగా మలుచుకుంటోందని కాంగ్రెస్ విమర్శలు చేసింది. చదవండి: భారీ స్థాయిలో కమలం ఆపరేషన్.. 1984 తర్వాత సాధించని ఫీట్ కోసం..! -
రాహుల్ రెండో యాత్ర పేరులో స్వల్ప మార్పు..
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీమరో యాత్రతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీగతేడాది చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌కు సరికొత్త జోష్‌ను అందించింది. భారత్ జోడో యాత్ర తరహాలో రాహుల్ గాంధీ మరోసారి జాతీయ యాత్రకు బయల్దేరనున్నారు. ముందుగా దీనికి భారత్ ‘న్యాయ్ యాత్ర’ అని నామకరణం చేశారు. అయితే, ఇప్పుడు యాత్ర పేరులో స్పల్ప మార్పులు చేశారు. . రాహుల్ చేపట్టే ఈ రెండో విడత యాత్రకు 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'గా పేరు మార్చారు. ఈ మేరకు యాత్ర వివరాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. Here is the route map of the Bharat Jodo Nyay Yatra being launched by the Indian National Congress from Manipur to Mumbai on January 14, 2024. @RahulGandhi will cover over 6700 kms in 66 days going through 110 districts. It will prove as impactful and transformative as the… pic.twitter.com/ZPxA5daZEb — Jairam Ramesh (@Jairam_Ramesh) January 4, 2024 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలోనే యాత్ర పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు జైరాం రమేశ్ వెల్లడించారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం? కాగా దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి భారత్ జోడో యాత్ర చేపట్టగా.. ఇప్పుడు తూర్పు నుంచి పడమరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. . ఈ నెల 14వ తేదీన రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం అవుతుండగా, మార్చి 30న ముగియనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు 15 రాష్ట్రాలు, 66 రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. 6700 కిలోమీటర్ల మేర రాహుల్ పర్యటిస్తారు. దాదాపు 100 లోక్‌సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ గాంధీ మాట్లాడతారని జైరాం రమేశ్ వెల్లడించారు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో సాగనుంది. అయితే, తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. -
ఇండియా కూటమి భేటి మళ్లీ వాయిదా
ఢిల్లీ: ఇండియా కూటమి భేటీ మళ్లీ వాయిదా పడింది. డిసెంబర్ 17న నిర్ణయించిన సమావేశాన్ని డిసెంబర్ 19కి వాయిదా వేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన బయటకు వెళ్లడించలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో వెంటనే డిసెంబర్ 6న ఇండియా కూటమి భేటీకి పిలుపునిచ్చింది. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అగ్రనేతలు రాలేమని స్పష్టం చేశారు. దీంతో సమావేశాన్ని డిసెంబర్ 17కి వాయిదా వేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ప్రస్తుతం ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. ప్రాంతీయ పార్టీల పొత్తుతో భాగస్వామిగా బీహార్, జార్ఖండ్‌లలో అధికారంలో ఉంది. దేశం మొత్తంలో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌లో మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉంది. బీజేపీని గద్దే దించే ధ్యేయంతో దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. పాట్నాలో మొదటిసారి సమావేశమయ్యారు. అనంతరం బెంగళూరు, ముంబయితో కలిపి ఇప్పటికి మూడు సమావేశాలు జరిగాయి. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
పదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది: జైరాం రమేష్
సాక్షి, ఖమ్మం: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. రైతులు, మహిళలు, యువత కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని నిర్ణయించారని పేర్కొన్నారు. తెలంగాణలో గతేడాది అక్టోబర్‌లో రాహుల్ జోడోయాత్ర చేశారని, 12 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించారని చెప్పారు. తెలంగాణలో సుమారు 405 కిలోమీటర్ల జోడోయాత్ర ద్వారా కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు. ఈ మేరకు ఖమ్మంలోని సంజీవరెడ్డి భవన్లో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావుతో కలిసి జైరాం రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సామాజిక న్యాయం అమలు చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే సోనియా తెలంగాణను ఇచ్చారన్నారు. బ్రాండ్ హైదరాబాద్ ఒక్కటే కాదు.. బ్రాండ్ తెలంగాణ సృష్టించడమే సోనియా లక్ష్యమని తెలిపారు. కానీ తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కడ కనిపించట్లేదని దుయ్యబట్టారు. అయితే పదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని విమర్శించారు. అప్పుడు హైదరాబాద్‌కే పెట్టుబడులు వచ్చేవని ఇప్పుడు కూడా అక్కడికే వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పెట్టుబడులు విస్తరించలేదని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర అయ్యాక తెలంగాణ ప్రజలు మేలు జరిగిందా అని ప్రశ్నించారు. ఎందుకు తెలంగాణ ఏర్పాటు చేశామో పదేళ్ల తర్వాత కూడా ఆ లక్ష్యాలు సాధించలేదని మండిపడ్డారు. చదవండి: హైదరాబాద్‌లో ఒలింపిక్ జరిగేలా ఏర్పాట్లు చేస్తాం: కేటీఆర్ ‘నిరుద్యోగుల శాతం అధికంగా ఉంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అవతున్నాయి. ఉద్యోగాలు లభించక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉన్నత పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే వెళ్లాయి. బీసీ, మైనార్టీ, దళితులకు ఎన్ని పదవులు వచ్చాయి?. తండ్రి, కోడుకు, కూతురు, అల్లుడు పాలన తెలంగాణలో నడుస్తుంది. ఈ నలుగురికే అవకాశాలు వచ్చాయి. సబ్బండ వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. బీఆర్ఎస్కు, బీ టీమ్ బీజేపీ, సీ టీమ్ ఎంఐటెం. కాంగ్రెస్‌కు సీపీఐ, టీజేఎస్ వెంట ఉన్నాయి. గ్యారంటీలే కాంగ్రెస్‌కు అధికారం తెచ్చిపెడుతాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ళ లో యువతకు ఏం లాభం జరగలేదు. తొమ్మిది ఏళ్లలో కేసీఆర్ ఒకసారి కూడా సచివాలయానికి రాలేదు. బీఆర్ఎస్కు బైబై చెప్పే రోజు వచ్చింది. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతుంది’ అని తెలిపారు. -
రాహుల్ గాంధీపై బీజేపీ వివాదాస్పద ఫొటో.. రావణుడితో పోల్చి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే మొదలైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. లంకాధిపతి రావణుడి అవతారంలో ఉన్న ఒక ఫొటోను బీజేపీ ట్విట్టర్లో షేర్ చేయడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. రావణుడి అవతారంలో రాహుల్ గాంధీ ఫొటోను బీజేపీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇక, రాహుల్ ఫొటోకు మరింత వివాదాస్పదంగా టైటిల్‌ను పెట్టింది. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్, జార్జ్ సోరోస్ దర్శకత్వం వహించారని ఆ పోస్టర్లో పేర్కొంది. ఈ వివాదాస్పద ఫొటోపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. The new age Ravan is here. He is Evil. Anti Dharma. Anti Ram. His aim is to destroy Bharat. pic.twitter.com/AwDKxJpDHB — BJP (@BJP4India) October 5, 2023 ఈ ఫొటోపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీని రావణుడిగా చిత్రీకరిస్తూ గ్రాఫిక్ ఫోటోలు విడుదల చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడిపై హింసను ప్రేరేపించడం, రెచ్చగొట్టడం కోసమే ఈ పోస్ట్ చేశారని మండిపడ్డారు. దేశాన్ని విభజించాలని చూసిన కొన్ని శక్తులు.. రాహుల్ గాంధీ తండ్రి, అమ్మమ్మలను హత్య చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక అబద్ధాల కోరు అని ఆరోపించారు. తన పార్టీని ఇలాంటి అసహ్యకరమైన పోస్టులు చేయాలని కోరడం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని.. ఇలాంటివి చాలా ప్రమాదకరమైనవని మండిపడ్డారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదని గట్టి సమాధానం ఇచ్చారు. What is the real intent of an atrocious graphic portraying @RahulGandhi as Ravan by the BJP’s official handle? It is clearly intended to incite and provoke violence against a Congress MP and a former President of the party, whose father and grandmother were assassinated by forces… — Jairam Ramesh (@Jairam_Ramesh) October 5, 2023 ఇదిలా ఉండగా.. జార్జ్ సోరోస్ ఒక హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. అతను దేశాన్ని అస్థిరపరిచేందుకు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని ఆరోపణలున్నాయి. అతను అనేక భారతదేశ వ్యతిరేక ప్రచారాలను నడుపుతున్నాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనలో హంగేరియన్-అమెరికన్ వ్యాపారి నిధులు సమకూర్చుకున్న వ్యక్తులను కలిశారని బీజేపీ ఆరోపించింది. జార్జ్ సోరోస్‌తో అనుబంధం ఉన్న సునీతా విశ్వనాథ్‌ను రాహుల్ అమెరికా పర్యటనలో కలిశారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ను బీజేపీ కోరింది. यह कार्टून 1945 में अग्रणी पत्रिका में छपा था, जिसका सम्पादक नाथूराम गोडसे था। तीर चलाने वालों में एक सावरकर है। गांधी और कांग्रेस हमेशा से इनके निशाने पर रहे हैं, लेकिन न तब डरे थे, न आज डरे हैं और न ही आगे डरने वाले हैं। https://t.co/fyfiX2JtBz pic.twitter.com/HkuyYTrWke — Jairam Ramesh (@Jairam_Ramesh) October 5, 2023 ఇది కూడా చదవండి: సిసోడియా అరెస్ట్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం.. సాక్ష్యం ఎక్కడ? -
పార్లమెంట్ కొత్త భవనం.. మోదీ మల్టీప్లెక్స్
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం సౌకర్యవంతంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నూతన భవన నిర్మాణ శైలి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లుగా ఉందని ఆరోపించారు. ఈ భవనాన్ని ‘మోదీ మలీ్టప్లెక్స్’ లేదా ‘మోదీ మారియెట్’ అని పిలిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ నూతన భవనం పట్ల జైరామ్ రమేశ్ అభ్యంతరాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను జైరామ్ రమేశ్ కించపర్చారని మండిపడ్డారు. పార్లమెంట్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. అవయవదాతలకు -
చైనా దురాక్రమణ పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: దేశ ఉత్తర సరిహద్దులోని భూభాగాన్ని చైనా దురాక్రమణ చేస్తోందని, దీన్ని ఆపడానికి భారత్ చర్యలు తీసుకోవట్లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. 2020లో జూన్ 19న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని చెప్పిన మాటలే చైనా దురాక్రమణకు కారణమవుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో జైరాం రమేశ్, పవన్ఖేరాలతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, భద్రతా వైఫల్యం గురించి సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. దేశంలో రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి సవాల్ ఏర్పడిందని, ఓ పద్ధతి ప్రకారం వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని ధ్వజమెత్తారు. అంశాల వారీగా చిదంబరం ఏం చెప్పారంటే.. ♦ దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోంది. రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ... ఇవ్వాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వట్లేదు. ఉదాహరణకు కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీని అమలు చేయడంలో భాగంగా డబ్బులు చెల్లిస్తామని చెప్పినా ఎఫ్‌సీఐ బియ్యం ఇవ్వడం లేదు. బియ్యం ఇవ్వొద్దని పైనుంచి ఆదేశాలిచ్చారు. హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా తీవ్ర నష్టం జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, విపత్తు సహాయం కింద కూడా కేంద్రం ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదు. దీనికి కారణం అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే. ♦ మే 5 నుంచి మణిపూర్ తగలబడుతోంది. అప్పటి నుంచి దాదాపు 157 రోజులుగా ప్రధాన మంత్రి చాలాసార్లు చాలా దేశాలకు వెళ్లివచ్చారు. ఏషియా సమిట్, జీ8 దేశాల సమావేశాలకు హాజరయ్యారు. కానీ, ఢిల్లీ నుంచి మణిపూర్ వెళ్లేందుకు రెండు గంటలు మాత్రమే పడుతుంది. అయినా అక్కడకు వెళ్లేందుకు సమయం దొరక్కపోవడం బాధ కలిగిస్తోంది. ♦ ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో అసత్యాలు చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేవు. తాజాగా ఉగ్రవాదులు అక్కడ సైన్యంపై దాడి చేసి కల్నల్, మేజర్, డీఎస్పీ, రైఫిల్‌మెన్‌ను హత్య చేశారు. ఆ సమయంలో కేబినెట్ సమావేశం నిర్వహించి జీ20 సమావేశాలు విజయవంతం చేశామని సంబురాలు చేసుకున్నారు. ♦ మణిపూర్, కశ్మీర్లో అంతర్గత భద్రతకు భంగం ఒకవైపు, చైనా ఆక్రమణ మరోవైపు. భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు చర్చలు జరిపినా ఉపయోగం లేదు. చైనా ఇంచు కూడా వెనక్కు తగ్గలేదు. చైనా పూర్వ స్థితిలోనే ఉందని మొన్నటివరకు అనుకున్నాం. కానీ నానాటికీ చైనా ఆక్రమణ ప్రమాదకర స్థాయికి వెళుతోంది. మనం భూభాగాన్ని కోల్పోతున్నాం. ♦ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే రాజ్యాంగంపై దాడి చేయడమే. మేం దాన్ని తిరస్కరిస్తున్నాం. ఇది జరగాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు జరగాలి. ఇలా చేసేందుకు తగిన సంఖ్యాబలం కావాలని బీజేపీకి కూడా తెలుసు. కానీ, ప్రజల దృష్టిని సమస్యల నుంచి మరల్చేందుకే ఇలాంటి చర్చను కేంద్రం తెరపైకి తెస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక బిల్లుకు సవరణను ఈ సమావేశాల్లో పెడుతున్నారని తెలిసింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీసే ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తాం. ♦ రెండో విడత భారత్ జోడో యాత్ర తూర్పు నుంచి పశ్చిమ దిశగా జరగాలని సీడబ్ల్యూసీ సభ్యులు అడిగారు. దీన్ని సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంటుంది. ♦ సీడబ్ల్యూసీ సభ్యులందరూ ఇండియా కూటమి ఏర్పాటును స్వాగతించారు. సీట్ల సర్దుబాటు త్వరగా చేయాలని ఒకరిద్దరు సభ్యులు చెప్పారు. కానీ, ఆ సర్దుబాటు పని సీడబ్ల్యూసీది కాదు. 14 మంది సభ్యుల ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీది. ♦ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇక్కడ సమావేశాలు నిర్వహించడం వెనుక కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నాయకులందరూ సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడారు. వారి రాష్ట్రాల పరిస్థితుల గురించి చెప్పారు. ♦ సనాతన ధర్మంపై సీడబ్ల్యూసీలో ఎలాంటి చర్చ జరగలేదు. మేము సర్వధర్మ సంభావ్ను నమ్ముతాం. తాము మాట్లాడింది మతాల గురించి కాదని, కుల వ్యవస్థ, కులాల పేరుతో అణచివేత, మహిళలు, దళితుల అణచివేత గురించి మాట్లాడామని డీఎంకే వర్గాలు చెప్పాయి. మేం ఆ వివాదంలోకి వెళ్లం. ♦ ఇండియా అంటేనే భారత్. ఇండియా భారత్‌గా మారినందుకు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో, మీ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఇవన్నీ తప్పుడు వివాదాలు. అంబేడ్కర్ చెప్పినట్టు ఇండియా అంటేనే భారత్. మేం దాన్నే నమ్ముతాం. ♦ గ్యాస్ ధరలు తగ్గించవచ్చు. క్రూడ్ ఆయిల్, అసోసియేటెడ్ గ్యాస్ ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించవచ్చు. కానీ ఈ ధరలు పెంచడం ద్వారా కేంద్రం లబ్ధిపొందింది. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. అందుకే ఆ వాగ్దానాన్ని మేము ప్రజలకు ఇస్తున్నాం. -
‘రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టండి’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా మారిందని ఏఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలు ధ్వజమెత్తారు. కేంద్రంలో ప్రధాని మోదీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలను ఇరిటేట్ చేస్తున్నారని విమర్శించారు. ఇండియా మొత్తం ఇండియా కూటమివైపు చేస్తోందని తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్నాయకులను కలిసిందని, నిర్ణయం త్వరలో తెలుస్తుందని తెలిపారు. ఈమేరకు 17న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తుక్కుగూడలో విజయభేరి సభాస్థలిని కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఇంఛార్జి మణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పరిశీలించారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ విమర్శించారు. రిజర్వేషన్ బిల్లు తెచ్చింది సోనియా గాంధేనని తెలిపారు. రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. భారత్ జోడో యాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తామని చెప్పారు. చదవండి: మంత్రి కేటీఆర్ మెడిసిన్ ఎందుకు చదవలేకపోయారంటే..? కాంగ్రెస్ అగ్రనేతంతా హైదరాబాద్‌కే.. సీడబ్ల్యూసీ, విజయభేరి సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ రానున్నారు. వీరితోపాటు ప్రియాంక గాంధీ, నాలుగు రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, 29 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ముఖ్యనేతలు తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ఆగ్ర నేతలంతా ఈ హోటల్లోనే బస చేస్తుండడంతో కేంద్ర బలగాలు హోటల్ మొత్తాన్ని, పరిసరాలను నియంత్రణలోకి తీసుకున్నాయి. -
ఇండియా Vs భారత్.. సెహ్వాగ్, బిగ్ బీ, ప్రముఖుల స్పందన ఇదే..
ఇండియా పేరు మార్పుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. మన దేశం పేరు ‘భారత్’ లేక ‘ఇండియా’ అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇండియా పేరు మార్పుపై ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది ‘భారత్’ పేరును సమర్ధిస్తుంటే.. ఇండియాను భారత్‌గా మార్చడాన్ని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పేరు మార్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమికి భయపడి, కేవలం ఎన్నికల స్టంట్ కోసమే కేంద్రలోని బీజేపీపేరు మార్చేందకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. తాజాగా ఇండియా పేరు మార్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ‘ఇండియా పేరును భారత్‌గా మార్చబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జీ 20 సదస్సు కోసం ప్రెసిడెంట్ డిన్నర్ ఆహ్వాన పత్రికపై భారత్ అని ముద్రించారు. ఇందులో కొత్త ఏముంది. మనం తరుచుగా భారత్ అనే పదాన్ని ఉచ్చరిస్తుంటాం. భారత రాజ్యంగం లేదా భారత్ కా సంవిధాన్ అనే పదాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. ప్రపంచానికి దేశం పేరు ఇండియాగానే తెలుసు. ఇంత అత్యవసరంగా దేశం పేరు మార్చాలని అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. సంబంధిత వార్త: ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్పు దిశగా కేంద్రం West Bengal CM @MamataOfficial reacts on ‘Bharat’ replacing ‘India’. “I heard they are now changing the name of #India. The President’s dinner invite for #G20 mentions #Bharat. What is new here? We always use Bharat. We say India’s constitution or Bharat ka Sanvidhan.… pic.twitter.com/Pq3Z3ZBvbJ — Mahua Moitra Fans (@MahuaMoitraFans) September 5, 2023 కాంగ్రెస్ నేత జయరామ్ రమేశ్ స్పందింస్తూ.. ఈ పరిణామం వెనుక కొంతైనా నిజం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి భవన్ సెప్టెంబరు 9న విందుకు ఆహ్వానాన్ని పంపిందని, అందులో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అని కాకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది. కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే పదం కూడా ఇప్పుడు దాడికి గురవుతోంది" అని ఆయన ఆరోపించారు. Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred. After all, what is the objective of INDIA parties? It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust. Judega BHARAT Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరిస్తూ, దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని జైరామ్ రమేశ్ విమర్శించారు. ఇది భారతదేశం. రాష్ట్రాల యూనియన్. ఇండియా పార్టీల లక్ష్యం కూడా( Bharat- Bring Harmony, Amity, Reconciliation And Trust) సామరస్యం, స్నేహం, సయోధ్య , నమ్మకాన్ని తీసుకురావడమే. జూడేగా భారత్.. జీతేగా ఇండియా! అని పేర్కొన్నారు. మరోవైపు విపక్షాల కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. I have always believed a name should be one which instills pride in us. We are Bhartiyas ,India is a name given by the British & it has been long overdue to get our original name ‘Bharat’ back officially. I urge the @BCCI @JayShah to ensure that this World Cup our players have… https://t.co/R4Tbi9AQgA — Virender Sehwag (@virendersehwag) September 5, 2023 ఇక బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చాన్ దేశం పేరు మార్పును సమర్ధించారు. ఈ మేరకు ‘ భారత్ మాతాకీ జై’ అంటూ ట్వీట్ చేశారు. ఇండియాను భారత్‌గా మార్చాడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్వీట్ చేశారు. జెర్సీపై కూడా భారత్ అని ముంద్రించాలని కోరారు. T 4759 - 🇮🇳 भारत माता की जय 🚩 — Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023 కాగా సార్వత్రిక ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది. త్వరలో మనదేశం పేరు మారనుంది. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్రం యోచిస్తోంది. దేశానికి భారత్ పేరు పెట్టే కీలక బిల్లులకు సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు.. ఆహ్వాన పత్రాల్లోప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా కేంద్రం ముద్రించింది. REPUBLIC OF BHARAT - happy and proud that our civilisation is marching ahead boldly towards AMRIT KAAL — Himanta Biswa Sarma (@himantabiswa) September 5, 2023 మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంకేతాలిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిపబ్లిక్ అఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. కాగా ఇండియా పేరును మార్చాలని కొన్ని రోజులుగా ఓ వర్గం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దేశం పేరును ఇండియానుంచి భారత్‌గా మార్చాలని తక్షణమే భారత రాజ్యాంగంల నుంచి దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియా అనే పదాన్ని బ్రిటిష్ వారు ఉపయోగించేవారని,.. ‘భారత్’ అనే పదం మన దేశ సంస్కృతికి ప్రతీక అని వాదిస్తున్నారు. అంతేగాక దేశం పేరును ఇండియా అని కూకుండా భారత్ అని పిలవాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు. అదే విధంగా ఇటీవల ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో తలపడాలని యోచిస్తున్న 28 పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. -
బెంగుళూరు పర్యటన.. సీఎం రాకపోవడంపై స్పందించిన మోదీ
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నేడు నేరుగా బెంగుళూరు చేరుకొని భారత్ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయానికి కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందించారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్‌గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జాబిల్లిపై ల్యాండర్ తీసిన తొలి ఫోటోను ఇస్రో చైర్మన్ సోమనాథ్ మోదీకి బహుమతిగా అందించారు. అనంతరం ప్రధాని ఢిల్లీకి పయనమయ్యారు. తాజాగా ప్రధాని బెంగళూరు పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. అయితే బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎవరూ హాజరుకాలేదు. ప్రధాని మోదీ సీఎంను ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచి, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. The Prime Minister is scheduled to directly land in Bengaluru tomorrow at 6 am after his latest foreign jaunt to congratulate ISRO. He is apparently so irritated with the CM and Deputy CM of Karnataka for felicitating the scientists of ISRO before him, that he has purportedly… pic.twitter.com/6EvN68A4oT — Jairam Ramesh (@Jairam_Ramesh) August 25, 2023 దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం తనకంటే ముందు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంతో ప్రధాని చాలా చిరాకుగా ఉన్నారు. అందుకే ప్రోటోకాల్‌కు విరుద్ధంగా వాళ్లను విమానాశ్రయంలో ఆహ్వానించకుండా దూరం పెట్టారు. ఇది చిల్లర రాజకీయం తప్ప మరొకటి కాదు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రయాన్-1 ను విజయవంతంగా ప్రయోగించిన వేళ.. 2008 అక్టోబర్ 22న అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌ను నాడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ మోదీ సందర్శించారు. ఈ విషయం ఇప్పటి ప్రధాని మర్చిపోయారా?’’ అంటూ జైరామ్ రమేష్ ప్రశ్నించారు. చదవండి: చంద్రయాన్ 3 విజయోత్సవాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం.. అయితే కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించారు. బెంగళూరుకు తాను సరిగ్గా ఏ సమయానికి చేరుకుంటారో స్పష్టత లేని కారణంగా మంత్రులకు ఇబ్బంది కలిగించకూడదని భావించినట్లు తెలిపారు. బెంగుళూరు ఎయిర్నపోర్టుకు చేరుకున్న తర్వాత ప్రజలను ఉద్ధేశించి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘నేను శాస్త్రవేత్తలతో సమావేశమైన తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళతాను. బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటానన్నది నాకు తెలియదు. కాబట్టి వారు రావద్దని నేనే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, గవర్నర్‌కు చెప్పాను. నాకు స్వాగతం పలికేందుకు ముందుగా వచ్చి ఇబ్బంది పడొద్దని కోరాను. ప్రోటోకాల్ పాటించకుండా ఉండమని నేనే వారిని అడిగాను.’’ ప్రధాని పేర్కొన్నారు. #WATCH | Bengaluru: On PM Modi's visit, Karnataka Deputy CM DK Shivakumar says, "I fully agree with whatever the Prime Minister has said. We were supposed to go and receive him but since we had the information from the Prime Minister's Office officially, we wanted to respect… pic.twitter.com/jWYq5Ne6c0 — ANI (@ANI) August 26, 2023 ఈ వివాదంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రధానిని స్వీకరించేందుకు తానును, సీఎం సిద్ధరామయ్య సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తనకు అధికారిక సమాచారం వచ్చిందని, దానిని గౌరవించాలని పేర్కొన్నారు. -
ప్రచారం కోసం జీ20ని వాడుకుంటోంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: దేశంలో త్వరలో జరిగే జీ20 సమావేశాన్ని కేంద్రప్రభుత్వం ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలా చేస్తోందని విమర్శించింది. 1999లో అవతరించిన జీ20లో 19 దేశాలు, ఈయూ సభ్యులుగా ఉన్నాయి. ఇప్పటి వరకు 17 దేశాల్లో సమావేశాలు జరిగాయి. ఈసారి భారత్ వంతు వచ్చింది. కానీ, ఇప్పటి వరకు ఏదేశంలోనూ లేని విధంగా కేంద్రం దీనిని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటోంది’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సమావేశాలు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి. -
నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ
న్యూడిల్లి: దేశ రాజధానిలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీని ప్రధానమంత్రి మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ్యూజియం పేరు మార్పుపై స్పందిస్తూ నెహ్రుగారి గుర్తింపు ఆయన పేరులో కాదు ఆయన పనిలో ఉందని అన్నారు. లేహ్ వెళ్లబోయే ముందు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మ్యూజియం పేరు మార్పుపై మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ నెహ్రూ గారు ఆయన చేసిన పనికి ప్రసిద్ధి చెందారు తప్ప ఆయన పేరు వలన కాదని అన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇదే విషయంపై 'X' సోషల్ మీడియా వేదికగా రాస్తూ ప్రధాన మంత్రి ఎంత ప్రయత్నించినా స్వాతంత్రం సమయంలో నెహ్రూ సాధించిన ఘనతలను సాధించలేరని విమర్శలు చేశారు. జైరాం రమేష్ తన X ఖాతాలో రాస్తూ.. ఈరోజు నుంచి ఒక దిగ్గజ సంస్థకు కొత్త పేరొచ్చింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇకపై ప్రధానమంత్రి మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా పిలవబడుతుంది. అత్యధిక కాలం దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన నెహ్రూ ప్రస్తావన వచ్చేసరికి ప్రధానికి ఎందుకో అనేక భయాలతోపాటు అభద్రతాభావం పెరుగుతూ ఉంటుంది. ప్రధానిది ఒక్కటే అజెండా నెహ్రూ ప్రతిష్టను మసక బారేలా చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చి ఆ మహానేత ప్రస్థానాన్ని తెరమరుగయ్యేలా చెయ్యడమేనని రాశారు. జైరాం రమేష్ వ్యాఖ్యలకు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, జైరాం రమేష్ ఆలోచనలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకి చాలా వ్యత్యాసముంది. వాళ్ళ వరకు నెహ్రూ ఆయన కుటుంబం మాత్రమే పట్టింపు, కానీ ప్రధాని నరేంద్ర మోదీకి అలా కాదు.. అందుకే దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన అందరు ప్రధానమంత్రులకు ఆయన ఈ మ్యూజియంలో సమున్నత స్థానాన్ని కల్పించారన్నారు. From today, an iconic institution gets a new name. The world renowned Nehru Memorial Museum and Library (NMML) becomes PMML—Prime Ministers’ Memorial Museum and Library. Mr. Modi possesses a huge bundle of fears, complexes and insecurities, especially when it comes to our first… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 16, 2023 ఇది కూడా చదవండి: వసుంధర రాజేకు షాకిచ్చిన బీజేపీ -
దుమ్ముంటే ఆ వివరాలు బయటపెట్టు.. రిజిజుకు కాంగ్రెస్ ఎంపీ సవాల్
న్యూఢిల్లీ: ప్రతి 15 రోజులకోసారి ఈశాన్య రాష్ట్రాలను సందర్శించాలంటూ ప్రధాని మోదీ తమను ఆదేశించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలో కేంద్ర మంత్రులతో మోదీ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారని, ఇందులో ఐదుగురు కేబినెట్ మంత్రులు, ఏడుగురు సహాయ మంత్రులు ఉన్నారని తెలిపారు. ప్రతి 15 రోజులకోసారి ఈశాన్యంలో పర్యటించాలంటూ ఈ బృందాన్ని ఆదేశించారని పేర్కొన్నారు. ప్రధాని ఆదేశాల ప్రకారం ఈశాన్యంలో పర్యటిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ నుంచి పాలించడం కాదు, నేరుగా ప్రజలకు వద్దకు వెళ్లాలని అధికారులను సైతం మోదీ ఆదేశించారని పేర్కొన్నారు. కిరణ్ రిజిజు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో గత 97 రోజుల్లో కేంద్ర మంత్రులు ఎవరెవరు ఎప్పుడు పర్యటించారో చెప్పాలని, దమ్ముంటే వివరాలు బయటపెట్టాలని రిజిజుకు సవాలు విసిరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. During the No Confidence Motion in Lok Sabha, Union Minister Kiren Rijiju has boasted about the Prime Minister’s directions to Cabinet Ministers and Ministers of State to visit Northeast every 15 days. Yes, we all know about the frequency of visits of Union Ministers before any… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 8, 2023 -
పొలిటికల్ సెటైర్: మోదీ వాషింగ్ పౌడర్.. మరకలు చిటికెలో మాయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఎన్సీపీ నాయకులు అవినీతిపరులంటూ ఆరోపించిన మోదీ ఇప్పుడు ఆదే నాయకులను ప్రభుత్వంలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. బీజేపీ వాషింగ్ మెషీన్ మళ్లీ పని చేస్తోందని, ఇన్‌కంట్యాక్స్, సీబీఐ, ఈడీ(ఐసీఈ) అనే సబ్బుతో అవినీతిపరులను పరిశుద్ధులను చేస్తోందని ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అన్ని మరకలను చిటికెలో తొలగిస్తుంది అనే ట్యాగ్‌లైన్‌తో ‘మోదీ వాషింగ్ పౌడర్’ చిత్రాన్ని జైరామ్ రమేశ్ షేర్ చేశారు. విపక్షాల కూటమి ఏర్పాటు కాకూడదని కోరుకుంటున్న బీజేపీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. Yesterday when the BJP Washing Machine restarted in Mumbai with its ICE (Incometax, CBI, ED) detergent, BJP-inspired obituaries on Opposition unity were being planted. The obit writers will be disappointed. The next meeting of the parties that met at Patna on June 23rd will be… pic.twitter.com/LqdwRSg7CO — Jairam Ramesh (@Jairam_Ramesh) July 3, 2023 -
'ప్రతీకార చర్య..' నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై జైరాం రమేశ్ ఫైర్..
ఢిల్లీ:నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ విమర్శించారు. నెహ్రూ మ్యూజియం ప్రపంచ మేధోసంపత్తికి నిలయంగా ఉందని అన్నారు. అనేక పుస్తకాలకు,59 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉందని చెప్పారు. ఈ చర్య ప్రతీకారంతో కూడినదని ఆరోపించారు. 'భారతదేశ రూపశిల్పి పేరును, వారసత్వాన్ని రూపుమాపడానికి కావాల్సినవన్నీ ప్రధాని చేస్తున్నారు. సామాన్యుడు అభద్రతా భావంతో బతికేలా చేయడమే విశ్వగురువుగా అనాలా?' అని ప్రశ్నించారు. గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ సొసైటీగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో పేరు మార్చారు. తొలి ప్రధాని నెహ్రూ అధికారిక భవనాన్నే మ్యూజియంగా మార్చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు కాగా.. రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇదీ చదవండి:మత మార్పిడి నిరోధక చట్టాన్ని వెనక్కి తీసుకోనున్న కర్ణాటక ప్రభుత్వం -
బడుగు వర్గాలపై ప్రధాని మోదీ కక్ష సాధింపు
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్ఎస్) కింద రాష్ట్రాలకు ఇచ్చే బియ్యం, గోధుమలను ఇకపై ఇవ్వకుండా కేంద్రం నిలిపివేయడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గురువారం తప్పుపట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ప్రధాని మోదీ మనోవేదనకు గురవుతున్నారని, అందుకే బడుగు వర్గాల ప్రజలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం బియ్యం ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడాన్ని మోదీ సహించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి బియ్యం, గోధుమల పంపిణీని కేంద్రం నిలిపివేసింది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం దీనివల్ల నష్టపోనుంది. -
మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే..
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ పరాయి దేశాల్లో భారత ప్రతిష్ట దిగజార్చడం ఆయనకు అలవాటని చేసిన విమర్శలకి గట్టి కౌంటర్ ఇస్తూ.. ఆ ట్రెండ్ మొదలు పెట్టింది ఎవరో తెలుసుకుని మాట్లాడమని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జైరాం రమేష్ అన్నారు. ముందు తెలుసుకో.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కాస్త ఘాటుగానే స్పదించారు. భారత దేశ రాజకీయ వ్యవహారాల గురించి ప్రపంచ వేదికల మీద మాట్లాడింది నీకు మంత్రి పదవినిచ్చిన పెద్దమనిషే. ఆ విషయం నీకు తెలిసినా కూడా ధైర్యంగా ఒప్పుకోలేవని ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు. మీరేం చేసినా అధికారం మాదే.. రాహుల్ గాంధీ ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ దేశ రాజకీయాల గురించి ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. ప్రపంచమంతా మనవైపు చూస్తున్నప్పుడు వారేమి చూస్తున్నారనేది ముఖ్యం? ఎలక్షన్లు జరుగుతాయి, ఒకసారి ఒక పార్టీ గెలిస్తే మరోసారి మరో పార్టీ గెలుస్తుంది. ప్రజాస్వామ్యం లేకుంటే అటువంటి మార్పు జరగదు. 2024లో కూడా ఫలితమేమీ మారదు. దేశంలో ఆయన ఏమైనా చేయనీయండి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము. దేశ అంతర్గత వ్యవహారాలను దేశాంతరాలకు తీసుకెళ్లడాన్ని ప్రజలు సహించరని అన్నారు. The man who started the practice of taking national politics outside the country is none other than the man who gave you your ministerial position. You know it but you cannot acknowledge it Dr. Minister. https://t.co/FE6nZAujM1 — Jairam Ramesh (@Jairam_Ramesh) June 8, 2023 ఇది కూడా చదవండి: మిస్‌వరల్డ్ పోటీలకు వేదికగా భారత్.. ఎంపిక జరుగుతుందిలా.. -
మోదీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది
న్యూఢిల్లీ: గత వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పెరుగుతున్న ధరలను అదుపు చేశామని దురహంకారపూరిత వాదనలు చేస్తూనే తీవ్రమైన ద్రవ్యోల్బణం ద్వారా ప్రజలు సంపాదించిందంతా దోచుకుంటోందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ తొమ్మిదేళ్లలో పేదరికం అంచున జీవిస్తున్న ప్రజల జీవితాలను మోదీ ప్రభుత్వం ఏమాత్రం మార్చలేకపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రతి వస్తువుపైనా జీఎస్టీ భారం పడుతోందని, సామాన్యుడి జీవితం కష్టతరంగా మారిందన్నారు. కేంద్ర మంత్రులు, ఆ పార్టీ నేతలు మాత్రం తాము ఘనకార్యాలు సాధించామంటూ ప్రచారం మొదలుపెడతారంటూ జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ‘మోదీ ప్రభుత్వం వాస్తవంగా సాధించినవి ఇవే..2014 నుంచి వాస్తవ ఆదాయాల్లో వృద్ధిరేటు– వ్యవసాయ కార్మికులకు: 0.8%, వ్యవసాయేతర కార్మికులకు: 0.2%, నిర్మాణ కార్మికులకు:–0.02%మాత్రమే. అయినప్పటికీ, 2014 నుంచి నిత్యావసర వస్తువుల ధరలు– ఎల్పీజీ:169%, పెట్రోల్:57%, డీజిల్:78%, ఆవనూనె:58%, గోధుమపిండి:56%, పాలు:51% పెరిగాయి’’అంటూ ఆయన ట్వీట్ చేశారు. అసంఘటిత రంగంలో వాస్తవ వేతనాల పెరుగుదల దాదాపు నిలిచిపోయిందంటూ వచ్చిన కథనాన్ని కూడా జైరాం రమేశ్ షేర్ చేశారు. అన్ని రంగాల ఆదాయాల్లో స్తబ్ధత నెలకొనగా గౌతమ్ ఆదానీ సంపద మాత్రం 2014 నుంచి 1,225% పెరిగిందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మే 26వ తేదీతో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. -
మోదీ తొమ్మిదేళ్ల పాలనపై... కాంగ్రెస్ 9 ప్రశ్నలు
న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనపై కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది. మోదీ తొలిసారిగా ప్రధాని పదవి స్వీకరించి శుక్రవారానికి తొమ్మిదేళ్లయ్యాయి. తప్పుడు హామీలతో జాతిని దగా చేసినందుకు ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘నౌ సాల్, నౌ సవాల్ (తొమ్మిదేళ్లు, తొమ్మిది ప్రశ్నలు)’ పేరుతో మోదీకి 9 ప్రశ్నలు సంధిస్తూ బుక్లెట్ విడుదల చేశారు. కోట్లాది మంది నిరుద్యోగ యువత నుంచి తొమ్మిదేళ్లుగా మోదీ పారిపోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, విద్వేషం, నిరుద్యోగానికి మోదీయే బాధ్యత వహించాలని రాహుల్ అన్నారు. మోదీకి కాంగ్రెస్ సంధించిన 9 ప్రశ్నలు... 1. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎందుకు పెరుగుతున్నాయి? ప్రజా ఆస్తుల్ని మోదీ స్నేహితులకి ఎందుకు విక్రయిస్తున్నారు? 2. సాగు చట్టాల రద్దు ఒప్పందాలను ఎందుకు గౌరవించడం లేదు? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లేదేం? 3. మీ స్నేహితుడు అదానీ లబ్ధి కోసం ఎల్ఐసీ, ఎస్బీఐలలో ప్రజలు కష్టించి దాచి పెట్టుకున్న డబ్బుని ఎందుకు ప్రమాదంలో పడేశారు? 4. మీరు క్లీన్చిట్ ఇచ్చిన చైనా భారత భూభాగాలను ఆక్రమించుకుంటోందేం? 5. ఎన్నికల ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలతో సమాజంలో భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు ? 6. సామాజిక న్యాయ పునాదుల్ని ధ్వంసం చేస్తున్నారెందుకు? అణగారిన వర్గాలపై అరాచకాలపై మౌనమెందుకు? 7. ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామ్య సంస్థల్ని ఎందుకు బలహీనపరుస్తున్నారు? విపక్ష నేతలపై కక్ష సాధింపు రాజకీయాలెందుకు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని ధనబలంతో ఎందుకు కూలదోస్తున్నారు? 8. పేదల సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ను తగ్గించి ఎందుకు బలహీనపరుస్తున్నారు? 9. కోవిడ్‌తో 40 లక్షల మంది పై చిలుకు మరణించినా వారి కుటుంబసభ్యులకు ఇప్పటికీ నష్టపరిహారం ఎందుకు చెల్లించడం లేదు? -
సెంగోల్పైరగడ
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనంలోని లోక్‌సభ సభామందిరంలో ప్రతిష్టంచనున్న సెంగోల్ (రాజదండం)పై వివాదం ముదురుతోంది. బ్రిటిష్ పాలకుల నుంచి అధికార మార్పిడికి గుర్తుగా సెంగోల్‌ను ఉపయోగించినట్లు ఆధారాలు లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన భజనపరులు కేవలం తమిళనాడులో రాజకీయ లబ్ధి కోసమే సెంగోల్‌ను తెరపైకి తెచ్చారంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘నిజానికి సెంగోల్‌ను మద్రాసు ప్రావిన్స్‌లోని ఓ మత సంస్థ మద్రాసు లో తయారు చేయించి 1947 ఆగస్టులో నెహ్రూకు బహుమతిగా ఇచ్చింది. తర్వాత దాన్ని అలహాబాద్ మ్యూజియానికి తరలించారు. దాన్ని నెహ్రూ రాజదండంగా వాడినట్లు ఆధారాల్లేవు. మోదీ ప్రభుత్వ వాదన బోగస్. సెంగోల్‌పై మోదీ భజనపరులు సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు’’ అన్నారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించడం లేదని నిలదీశారు. ప్రజాస్వామ్యంపై మోదీ సర్కారు దాడి చేస్తోందన్నారు. సెంగోల్‌ను అవమానించడం దారుణం: షా సెంగోల్‌పై కాంగ్రెస్ నేతల విమర్శలను కేంద్ర మంత్రి అమిత్ షా ఖండించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై కాంగ్రెస్‌కు ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ‘‘అధికార మార్పిడికి ప్రతీకగా తమిళనాడు మఠం నిర్వాహకులు పవిత్ర సెంగోల్‌ను నెహ్రూకు అందజేశారు. దాన్ని ‘చేతికర్ర’గా పేర్కొంటూ కాంగ్రెస్ పాలకులు మ్యూజియంలో పడేశారు’’ అంటూ తప్పుపట్టారు. ఇప్పుడేమో అదే కాగ్రెస్ నేతలు సెంగోల్‌ను దారుణంగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు మఠం చరిత్ర బోగస్ అంటూ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయం దురదృష్టకరమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. రాజకీయాలకూ ఓ పరిమితి ఉండాలన్నారు. నూతన భవన ప్రారంభోత్సవాన్ని ప్రజలంతా పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బహిష్కరణ పిలుపుతో మన స్వాతంత్య్ర సమరయోధులను విపక్ష నేతలు అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి విమర్శించారు. తప్పుడు ప్రచారం! తిరువావదుత్తురై పీఠం చెన్నై: సెంగోల్ రాజదండంపై తప్పుడు ప్రచారం సాగుతుండడం చాలా విచారకరమని తమిళనాడులోని తిరువావదుత్తురై అధీనం పీఠాధిపతి అంబలావన దేశిక పరమాచార్య స్వామి శుక్రవారం అన్నారు. అధికార మార్పిడికి గుర్తుగా ఈ రాజదండాన్ని లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టులో నెహ్రూకు అందజేశారని చెప్పారు. దీనిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఫొటోలతోపాటు అప్పట్లో పత్రికల్లో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయని గుర్తుచేశారు. ‘‘సెంగోల్‌ను రాజదండంగా వాడలేదన్నది కొందరి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారమే. సెంగోల్ తమిళనాడుకు గర్వకారణం. తిరుక్కురళ్తో పాటు తమిళ ప్రాచీన సాహిత్యంలో సెంగోల్ ప్రస్తావన ఉంది’’ అని తెలిపారు. ప్రారంభోత్సవంపై పిల్... కొట్టేసిన సుప్రీం పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం రాష్ట్రపతి జరిపేలా ఆదేశించాలన్న పిల్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీన్ని ఎందుకు, ఎలా దాఖలు చేశారో అర్థమవుతోందని న్యాయమూర్తులు జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్. నరసింహలు అన్నారు. విచారణకు స్వీకరించకపోతే పిల్ వెనక్కి తీసుకోవడానికి అనుమతినివ్వాలని కోరినా దాన్ని కొట్టేస్తున్నట్టుగా తెలిపారు. ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయడం రాష్టపతిని అవమానించడమేనని విమర్శిస్తూ ఇప్పటికే 20కి పైగా రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీ రోడ్ షో, ట్రాఫిక్‌లో ఇరుక్కున్న అంబులెన్స్? కాంగ్రెస్ విమర్శలు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ఆకర్షించడానికి నేతలు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం మెగా రోడ్‌షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ రోడ్డు షో ఏకంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 26 కిలోమీటర్ల మేర సాగింది. మోదీ ప్రచారానికి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో రోడ్లన్నీ కాషాయమయంగా మారిపోయాయి. బెంగళూరు సౌత్‌లోని సోమేశ్వర్ భవన్ ఆర్బీఐ గ్రౌండ్ నుంచి మల్లేశ్వరం సాంకీ ట్యాంక్ వరకు రోడ్‌షో కొనసాగింది. ఓపెన్ వాహనంలో కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాగా ప్రధాని రోడ్డు షో సందర్భంగా బెంగుళూరు ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ చిక్కుంది. ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఇరుక్కున్న ఫోటోలను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బెంగుళూరులో ప్రధాని మోదీ రోడ్ షో ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా ఈ కార్యక్రమానికి మోస్తరు స్పందన వచ్చినట్లు కనిపిస్తోందని సెటైర్లు వేశారు. రోడ్ షో కారణంగా రహదారిపై గందరగోళం నెలకొందని, రోడ్డుపై అంబులెన్స్ చిక్కుకుపోయిందని తెలిపారు. బెంగళూరు ప్రజల పట్ల ప్రధానమంత్రికి కొంచెమైనా బాధ్యత ఉంటే ఆదివారం నిర్వహించబోయే రెండో రోడ్ షోను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, అంతకుముందు మే 6న 10 కిలోమీటర్లు, 7న 26 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. అయితే ఆదివారం నీట్ పరీక్ష ఉన్నందున మోదీ రోడ్ షో షెడ్యూల్లో పలు మార్పులు చేశారు. శనివారమే 26 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహిస్తుండగా.. ఆదివారం తిప్పసంద్రలోని కెంపె గౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటలకు పూర్తి చెయ్యనున్నారు. మరోవైపు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బెంగళూరు దక్షిణ ప్రాంతాలు, శివాజీనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. చదవండి: అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం Ambulances stuck, chaos on road! If the PM has any shame left or even an iota of concern for the people of Bengaluru, he would immediately cancel part 2 of the #40km40percent roadshow tomorrow. But we all know that all he cares for is his Grand Tamasha! pic.twitter.com/XjUi2VK8yA — Jairam Ramesh (@Jairam_Ramesh) May 6, 2023 -
Pulwama attack 2019: ‘పుల్వామా’పై అనుమానాలెన్నో
న్యూఢిల్లీ: 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న 2019 పుల్వామా ఉగ్ర దాడిపై అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఉగ్రదాడి ముప్పుందని తెలిసి కూడా జవాన్లను విమానంలో కాకుండా రోడ్డు మార్గాన ఎందుకు పంపాల్సి వచ్చిందో మోదీ సర్కారు చెప్పి తీరాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘‘పుల్వామా దాడిపై నాటి జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బయట పెట్టిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. జైషే ముప్పును, ఏకంగా 11 నిఘా హెచ్చరికలను ఎందుకు విస్మరించారు? ఉగ్రవాదులకు 300 కిలోల ఆర్డీఎక్స్ ఎలా వచ్చింది? ఉగ్ర దాడిపై విచారణ ఎంతదాకా వచ్చింది? బాధ్యులను గుర్తించారా?’’ అని ప్రశ్నించారు. -
‘డోక్లాం’ దేశ భద్రతకు పెనుముప్పు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారత సరిహద్దు ప్రాంతం డోక్లాం పీఠభూమి దగ్గర చైనా నిర్మాణాలు కొనసాగిస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘డోక్లాం పీఠభూమికి అత్యంత సమీపంలో చైనా మిలటరీ నిర్మాణాలపై భారత సైన్యం తాజాగా మరింత ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరికో వదులుకునే ప్రసక్తి లేదని అమిత్ ప్రకటించారు. కానీ 2020 మే తర్వాత 2,000 కిలోమీటర్ల భారతభూభాగాన్ని గస్తీకాసే అవకాశాన్ని చైనా బలగాలు పోగొట్టాయి. మన డెప్సాంగ్, డెమ్చోక్, హాట్‌స్ప్రింగ్(కున్‌గ్రాంగ్ నళా), గోగ్రా పోస్టు వంటి పెట్రోలింగ్ పాయింట్లకు మన బలగాలు వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుతగులుతోంది. దీనిపై మోదీ మౌనం వీడాలి’’ అని డిమాండ్ చేశారు. -
అదానీ గ్రూప్‌కు చైనాతో లింకులు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై కాంగ్రెస్ పార్టీ మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించింది. అదానీ సంస్థలకు చైనాతో లింకులున్నాయని ఆరోపించింది. దేశంలోని పోర్టుల నిర్వహణను ఇప్పటికీ ఆ ఒక్క గ్రూపే ఎందుకు నిర్వహిస్తోందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీడియా కథనాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చైనా సంస్థలు, అనుబంధ సంస్థలకు దేశంలోని పోర్టులు, టెర్మినళ్ల నిర్వహణ బాధ్యత అప్పగించరాదనేది ప్రభుత్వం విధానంగా వస్తోంది. అయితే, చైనాకు చెందిన చాంగ్‌చుంగ్–లింగ్‌తో సన్నిహిత సంబంధాలున్న అదానీ గ్రూప్‌కు పోర్టుల నిర్వహణను ఎందుకు అప్పగించారో తెలపాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు. అదానీ కొడుకు వినోద్ సారథ్యంలోని పీఎంసీ ప్రాజెక్ట్స్, అదానీ గ్రూప్‌కు రూ.5,500 కోట్ల విద్యుత్ సామగ్రి కుంభకోణంతో సంబంధాలున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ ఆరోపిస్తున్న విషయం ఆయన గుర్తు చేశారు. చైనాకు సన్నిహిత దేశం ఉత్తరకొరియాకు దొంగచాటుగా పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించే షాంఘైకు చెందిన కనీసం రెండు షిప్పింగ్ కంపెనీలు అదానీ గ్రూప్వేనని తెలిపారు. చైనాతో సంబంధాలున్నట్లు రుజువులున్నా దేశంలోని పోర్టుల నిర్వహణ బాధ్యతల్లో అదానీ గ్రూప్‌ను ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రభుత్వాన్ని రమేశ్ నిలదీశారు. ఇవన్నీ దేశ భద్రతకు ప్రమాదకరం కావా అని ప్రశ్నించారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు జేపీసీ వేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
జోడో యాత్రతో కొత్త జాతీయ ఒరవడి
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఒక బలమైన నూతన జాతీయ ఒరవడిని సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణం పెరుగుదలను యాత్ర సందర్భంగా రాహుల్ ప్రముఖంగా లేవనెత్తారని గుర్తుచేశారు. 2013తో పోలిస్తే 2023లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయానని వెల్లడించారు. గత పదేళ్లలో ఇంటి బడ్జెట్ తీవ్రంగా ప్రభావితమైందని తెలిపారు. ఈ మేరకు పట్టికను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ పట్టికను గమనించాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, నిర్వాకాలను రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అధికార బీజేపీ బెంబేలెత్తిపోతోందని వెల్లడించారు. అందుకే రాహుల్‌పై బురద చల్లుతోందని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. రాహుల్ సృష్టించిన నూతన ఒరవడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. -
సభలు నడవాలని బీజేపీకి లేదు
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సాగాలనే ఉద్దేశం మోదీ సర్కారుకు లేనే లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందుకే ప్రతిష్టంభనను తొలగించేందుకు విపక్షాలతో రాజీ ప్రయత్నాలేవీ చేయడం లేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. దాంతో చరిత్రలోనే తొలిసారిగా బడ్జెట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తోందన్నారు. కీలకమైన బిల్లులను ఎలాంటి చర్చా లేకుండానే ప్రభుత్వం ఆమోదముద్ర వేయించుకుంటోందని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం స్టాండింగ్ కమిటీలకు పంపాల్సిన బిల్లులను వ్యతిరేకత భయంతో తమ పార్టీ నేతల సారథ్యంలోని సెలెక్ట్ కమిటీలకు పంపుకుంటోందని ఆరోపించారు. మార్చి 13న మొదలైన రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఒక్క రోజు కూడా ఉభయ సభలు సజావుగా జరగని విషయం తెలిసిందే. అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం విచారణకు విపక్షాలు, భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణకు అధికార బీజేపీ పట్టుబడుతుండటంతో రోజూ వాయిదాల పర్వమే కొనసాగుతోంది. -
'రాహుల్‌కు 19 రాజకీయ పార్టీల మద్దతు..దాని గురించి బాధ లేదు..'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నెల రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. జై భారత్ సత్యాగ్రహ పేరుతో మంగళవారం సాయంత్రం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇక నెల రోజుల పాటు కాంగ్రెస్ శ్రేణులు బ్లాక్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమం కేవలం రాహుల్ గాంధీ కోసమే కాదని, ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఢిల్లీలో 'సేవ్ డెమొక్రసీ' పేరుతో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు మొదలవుతున్నట్లు చెప్పారు. అలాగే రాహుల్ గాంధీకి 19 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినట్లు జైరాం వివరించారు. అనర్హత వేటు, బంగ్లా ఖాళీ చేయాలని ఇచ్చిన నోటీసులపై ఆయనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. ఉద్దవ్ బాలాసాహెబ్ థాక్రే సేన కూడా రాహుల్‌కు ఈ విషయంలో మద్దతుగానే ఉందని పేర్కొన్నారు. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా ప్రకటించిన 24 గంటల్లోనే ఆయను ఎంపీ పదవి నుంచి తొలగించారని, ఆ తర్వాత ఆయన ప్రెస్‌మీట్ పెట్టిన 24 గంటల్లోనే ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని జైరాం గుర్తు చేశారు. లోక్‌సభ సెక్రెటేరియెట్ జెట్ స్పీడు చూసి తమకు ఆశ్చర్యం వేసిందని సెటైర్లు వేశారు. కానీ రాహుల్ గాంధీకి వీటి గురించి ఎలాంటి ఆందోళన లేదని వాళ్లకు తెలియదన్నారు. అలాగే సూరత్ కోర్టు తీర్పును రాహుల్ సవాల్ చేసే విషయంపైనా జైరాం రమేశ్ వివరణ ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ అప్పీల్ చేయాలో తమకు తెలుసునని, న్యాయ నిపుణులతో దీనిపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేసేందుకు రాహుల్‌కు 30 రోజుల వరకు గడువుంది. దేశంలో దొంగల ఇంటి పేరు మోదీనే అని ఎందుకు ఉందని 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే దీనిపై పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత 24 గంటల్లోనే రాహల్‌పై ఎంపీగా అనర్హత వేటు పడటం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. చదవండి: రాహుల్ గాంధీకి మరో షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు.. -
అది ‘క్లీన్ చిట్’ కమిటీ: జైరామ్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తేల్చిచెప్పారు. అది ప్రభుత్వానికి క్లీన్ చిట్ కమిటీగా మాత్రమే తోడ్పడుతుందని అన్నారు. అదానీ విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపే అధికారం చట్టపరంగా నిపుణుల కమిటీకి లేదన్నారు. కేవలం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తోనే నిజాలు వెలుగులోకి వస్తాయని తేల్చిచెప్పారు. జైరామ్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దర్యాప్తు సంస్థలను దేశ ప్రయోజనాల కోసమా? వ్యక్తిగత అవసరాల కోసమా? దేని కోసం వాడుకుంటారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. 1992లో హర్షద్ మెహతా, 2001లో కేతన్ పరేఖ్ స్కామ్‌లపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదానీ అక్రమాలపై జేపీసీని నియమించాలని చెప్పారు. సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వండి లోక్‌సభలో మాట్లాడేందుకు, వివరణ ఇచ్చేందుకు రాహుల్‌కు అవకాశం కల్పించాలని స్పీకర్‌కు జైరామ్ రమేశ్ విజ్ఞప్తి చేశారు. రూల్ 357 కింద సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్‌కు రాహుల్ లేఖ రాశారని, దానిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కాలమే సమాధానం చెబుతుందన్నారు. -
బరాబర్ ధరణిని రద్దు చేస్తాం
సాక్షి, పెద్దపల్లి/జగిత్యాల రూరల్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌ను బరాబర్ రద్దుచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్‌లో భూసమస్యలు ఎదుర్కొంటున్న గ్రామస్తులతో మీభూమి– మీహక్కు నినాదంతో కాంగ్రెస్ పార్టీ ‘ధరణి అదాలత్’గ్రామసభను నిర్వహించింది. ధరణి పోర్టల్‌లో పేర్లు నమోదుకాక, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల సమస్యలను కాంగ్రెస్ నేతలు తెలుసుకున్నారు. తర్వాత వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున గ్యారంటీ కార్డులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కొప్పుల రాజు తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. భూస్వాములు, కేసీఆర్ కుటుంబీకుల కోసమే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని.. అందువల్లే గతంలో కాంగ్రెస్ పార్టీ పేదలకు పంచిన 22 లక్షల ఎకరాల భూమి భూస్వాముల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. సీసీఎల్ఏ చేతిలో ధరణి పోర్టల్ లేదని.. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి, వెనక నుంచి కేసీఆర్ కుటుంబీకులు వేలకోట్లు కాజేస్తున్నారని విమర్శించారు. అన్ని గ్రామాల్లో ‘ధరణి అదాలత్’ ధరణి పేరుతో కేసీఆర్ సర్కారు పేదల భూములను కబళిస్తోందని.. పేదలకు తిరిగి భూహక్కులు కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఏఐసీ సీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే చెప్పారు. రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి తీసుకురావడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. దివంగత సీ ఎం వైఎస్సార్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే పేదలకు భూయాజ మాన్య హక్కులు కల్పించారని.. బీఆర్ఎస్ సర్కారు ఆ భూములను లాక్కుంటోందని జాతీయ నేత కొప్పుల రాజు ఆరోపించారు. కాంగ్రెస్ పంచ సూత్రాలివీ.. ♦ ధరణి పోర్టల్‌లో 60 లక్షల మంది పేర్లు ఉంటే.. అందులో దాదాపు 20 లక్షల ఖాతాల్లో పేరు, స ర్వే నంబర్‌తోపాటు చాలా తప్పులున్నాయి. అ న్నీ దిద్ది ఎవరి భూమిపై వారికి హక్కులివ్వాలి. ♦ మేమొచ్చాక రెండేళ్లలో భూముల రీసర్వే. ♦ రాష్ట్రంలోని 125 భూచట్టాలు, 3 వేల జీవోలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకే చట్టంగా తీసుకొస్తాం ♦ బలవంతపు భూసేకరణ పూర్తిగా నిషేధిస్తాం. భూయజమాని అనుమతి లేకుండా సేకరించవద్దంటూ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచి్చన చట్టాన్ని కచి్చతంగా అమలు చేస్తాం. ♦ తెలంగాణలోని 15 లక్షల మంది కౌలు రైతులకు పథకాలు అందిస్తాం. కవితను బహిష్కరించలేదేం: రేవంత్‌రెడ్డి అవినీతికి పాల్పడితే కొడుకైనా, బిడ్డ అయినా జైలులో పెడతానని కొన్నిరోజుల కింద సీఎం కేసీఆర్ చెప్పారని, మరి మద్యం కుంభకోణానికి పా ల్పడిన ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఆరోపణలు వస్తేనే పద వి నుంచి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు. ఇద్దరూ ఆడపిల్లలే..పట్టా పాస్‌బుక్ ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమిని కేటాయించి లావణి పట్టా ఇచ్చారు. ఇప్పుడు ధర ణి తెచ్చాక భూమిని ఆ న్లైన్లో నమోదు చేయకపోవడంతో పట్టా దారు పాస్‌బుక్ ఇవ్వలేదు. నాకు ఇద్దరు ఆడ పిల్లలే. పనిచేస్తేనే పూటగడిచేది. సర్కార్ ఇప్పటికైనా పాస్‌బుక్ ఇవ్వాలి. – కవ్వంపల్లి జ్యోతి -
కాంగ్రెస్ ‘హామీ కార్డు’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు న్న వేళ రాష్ట్ర రైతాంగాన్ని ఆకట్టుకొనే ప్రయత్నా లను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. రైతులకు చుక్కలు చూపుతున్న ధరణి పోర్టల్ సమస్యలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పరిష్కారం చూపుతామంటూ ఏకంగా ‘హామీ కార్డులు’ జారీ చేస్తోంది. పెద్దపల్లి నియోజకవర్గంలో పైలట్ ప్రా జెక్టు కింద ఈ ‘హామీ కార్డుల’జారీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్య వహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో ప్రారంభించిన టీపీసీసీ.. కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతోంది. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఫొటోతో కార్డు..: ధరణి పోర్టల్ లావాదేవీల ద్వారా రాష్ట్రంలోని 20 లక్షల మంది రైతుల ఖాతాల్లో సమస్యలున్నాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. దీనికి పరిష్కారంలో భాగంగా రైతుల ఫొటోలు, వివరాలతోపాటు ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలను కార్డు ముందు భాగంలో ముద్రిస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఈ కార్డులను తహసీల్దార్ లేదా రెవెన్యూ అధికారులకు చూపిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచిస్తోంది. ఈ కార్డుల జారీ కంటే ముందు రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఐదుగురు ‘భూరక్షక్’లను నియమించాలని పార్టీ నిర్ణయించింది. భూరక్షక్‌లకు ధరణి పోర్టల్‌పై అవగాహన కల్పించి సమస్యల పరిష్కారంపై శిక్షణ ఇప్పించనుంది. వారు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ‘ధరణి అదాలత్’లు నిర్వహించనున్నారు. ఆయా గ్రామ పరిధిలో ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులు పడుతున్న రైతుల వివరాలు నమోదు చేసుకొని వారికి కార్డులు అందించనున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ నేతృత్వంలోని ఓ బృందం ఈ కార్యాచరణ కోసం కొన్ని నెలలుగా అధ్యయనం చేస్తోందని, ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు, అభిప్రాయాల మేరకు ముందుకెళుతున్నామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. మన భూమి–మన హక్కు: జైరాం రమేశ్ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధరణి అదాలత్‌లు నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ వెల్లడించారు. ధరణి పోర్టల్ అంటే ఒకరి స్థానంలో మరొకరి ఫొటో పెట్ట డం కాదని, ఎవరి భూమిపై వారికి హక్కులు కల్పించాలని, మన భూమి–మన హక్కు పేరుతో ఇందుకోసం కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్ర భూసర్వే చేపడతామని, రైతుల పక్షపాతిగా వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని జైరాం రమేశ్ హామీ ఇచ్చారు. -
లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్ లేరు.. ఇది రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: లోక్‌సభకు గత నాలుగేళ్లుగా డిప్యూటీ స్పీకర్ లేరని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల శాసనసభలకు డిప్యూటీ స్పీకర్లు లేకపోవడంపై దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు గత నెలలో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ప్రతిపక్ష నేతకు దక్కరాదనే ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. ‘1956లో ప్రధాని నెహ్రూ ప్రతిపక్ష నేత, తన విధానాలను తీవ్రంగా విమర్శించే అకాలీదళ్ ఎంపీని సర్దార్ హుకుం సింగ్ పేరును డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రతిపాదించారు’అని అప్పటి ఘటనను జైరాం రమేశ్ ఉదహరించారు. -
అధికారం ఖర్గేకు
నవా రాయ్‌పూర్: కాంగ్రెస్ లో అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఎన్నిక నిర్వహించరాదని పారీ నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేయాలని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తీర్మానించింది. ఈ అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ ఇందుకు వేదికగా నిలిచింది. సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక/ఎన్నిక విధానంపై మూడు రోజుల సదస్సులో తొలి రోజు స్టీరింగ్ కమిటీ విస్తృతంగా చర్చించిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. వారిని అధ్యక్షుడే నామినేట్ చేయాలని 45 మంది సభ్యుల్లో దాదాపు అందరూ అభిప్రాయపడ్డట్టు చెప్పారు. ఈ నిర్ణయాన్ని ప్లీనరీలో ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. కాంగ్రెస్ మాజీ ప్రధానులు, మాజీ అధ్యక్షులందరికీ ఇకపై సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వం ఉండనుంది. లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ పక్ష నేతలు సీడబ్ల్యూసీ సభ్యులుగా కూడా వ్యవహరిస్తారు. అంతేగాక సీడబ్ల్యూసీ స్థానాల్లో 50 శాతం ఇకపై ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనారిటీలు, యువతకు చెందుతాయి. వీటితో పాటు పార్టీ నియమావళికి ప్రతిపాదించిన 16 సవరణలకు స్టీరింగ్ కమిటీ ఆమోదముద్ర వేసినట్టు జైరాం ప్రకటించారు. సీడబ్ల్యూసీలో 25 మంది సభ్యులుంటారు. పార్టీ చీఫ్, పార్లమెంటరీ పార్టీ నేత పోను మిగతా 23 మందిలో 12 మందిని ఎన్నుకుంటారు. 11 మంది నామినేట్ అవుతారు. ఈ ప్రక్రియను ఏకగ్రీవంగా నిర్వహించడం కాంగ్రెస్‌లో ఆనవాయితీ. అందుకు వీలుగా నిర్ణయాధికారాన్ని అధ్యక్షునికి స్టీరింగ్ కమిటీ కట్టబెడుతూ ఉంటుంది. సంక్షోభంలో వ్యవస్థలు: ఖర్గే కాంగ్రెస్ 85వ ప్లీనరీ రాయ్‌పూర్‌లో అట్టహాసంగా మొదలైంది. అధ్యక్షుని హోదాలో ఖర్గే ప్రారం¿ోపన్యాసం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పెను ప్రమాదంలో పడ్డాయంటూ ఆందోళన వెలిబుచ్చారు. పార్లమెంటరీ వ్యవస్థలన్నీ సంక్షోభంలో చిక్కడమే గాక రాజకీయ పార్టీల కార్యకలాపాలన్నింటిపైనా రాక్షస నిఘా పెరిగిపోయిందంటూ మండిపడ్డారు. ‘‘ఇలాంటి తరుణంలో పార్టీ ప్లీనరీ జరుపుకుంటున్నాం. గత ప్లీనరీలు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు, మైలురాళ్లకు వేదికలయ్యాయి. ఈ ప్లీనరీని కూడా అలా పార్టీ చరిత్రలోనే చిరస్మరణీయంగా మలచుకుందాం’’ అంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘‘భారత్ జోడో యాత్ర ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్దాం. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మనకు పెద్ద సవాలు. గొప్ప అవకాశం కూడా’’ అన్నారు. అంతకుముందు ఖర్గే సారథ్యంలో స్టీరింగ్ కమిటీ భేటీలో మూడు రోజుల సమావేశాల అజెండాను ఖరారు చేశారు. తొలి రోజు సమావేశాలకు సోనియాగాందీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ వద్రా గైర్హాజరయ్యారు. సోనియా, రాహుల్ శుక్రవారం సాయంత్రానికి రాయ్‌పూర్ చేరుకున్నారు. నాలుగు అంశాలపై నిర్ణయాలు ప్లీనరీ అజెండా ఖరారుతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు ఎంపిక విధానాన్ని, పార్టీ నియమావళికి ప్రతిపాదించిన సవరణలను ఆమోదిస్తూ తొలి రోజు నిర్ణయాలు తీసుకున్నారు. వీటితో ఆరు కీలక తీర్మానాలకు ఆమోదముద్ర వేయడంపైనా ప్లీనరీలో నిర్ణయం జరగనుంది. కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఆమోదించిన ముఖ్య సవరణలు... ► మండలం నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని పార్టీ కమిటీల్లోనూ 50 ఏళ్ల లోపువారికి 50 శాతం రిజర్వేషన్. ► ఏఐసీసీలోని అన్ని విభాగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, మైనారిటీ, యువతకు 50 శాతం రిజర్వేషన్. -
'దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ.. ఆయన చెప్పిందే వేదం..'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ నడుస్తోందని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి చెప్పిందే వేదమని, నియంతృత్వ పాలన సాగుతోందని ఫైర్ అయ్యారు. మోదీ పాలనలో దేశ న్యాయవ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు. జ్యుడీషియరీని కూడా ప్రధాని కార్యాలయంలో ఓ భాగం చేశారని మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని విభజిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంతృత్వ రాజకీయాల గురించి ప్రజలకు తెలియజేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని జైరాం రమేశ్ మీడియా సమావేశంలో తెలిపారు. 'దేశంలో అనధికారిక ఎమెర్జెన్సీ ఉంది. ఒక వ్యక్తే శాసిస్తున్నారు. పార్లమెంటుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సభలో చర్చలు జరగనివ్వడం లేదు. రెండున్నరేళ్లుగా సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడమే ఇందుకు ఉదాహరణ. రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను బలహీనం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత -
మోదీ సర్కారు మెతక వైఖరి వల్లే చైనా ఆగడాలు!
న్యూఢిల్లీ: సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ ఆరోపించారు. మన ప్రభుత్వ వైఖరి వల్లే చైనా రెచ్చిపోతుందని అన్నారు. మోదీ సర్కారు మెతక వైఖరిని డ్రాగన్ ఉపయోగించుకుంటోందని చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎల్ఏసీ వద్ద భారత్, చైనా జవాన్ల ఘర్షణ నేపథ్యంలో ఆయన సోమవారం ట్వీట్ చేశారు. చైనా నుంచి దాడులు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని, మేల్కొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాజకీయ ప్రతిష్టను కాపాడుకొనేందుకు చైనాపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. సరిహద్దుల్లో మన సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను చూసి గర్వపడుతున్నామని జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. చైనా చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం కంటే ఎవరూ ఎక్కువ కాదని, నరేంద్ర మోదీ మాత్రం తన వ్యక్తిగత ప్రతిష్టం కోసం దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు. సరిహద్దుల్లో ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడించారు. సరిహద్దులో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాలకు స్వల్ప గాయాలు! -
భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలా?
భోపాల్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు విన్పించాయని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందకు సంబంధించిన ఓ వీడియోనూ ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ఈ వీడియోను మొదట మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్వీట్ చేసిందని, కానీ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు గమనించాక వెంటనే దాన్ని డిలీట్ చేసిందని మాలవీయ ఆరోపించారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది అని విమర్శలు గుప్పించారు. After Richa Chaddha’s public application to join Rahul Gandhi’s Bharat “Jodo” Yatra, “Pakistan Zindabad” (listen towards the end of the video) slogans raised in Khargon. INC MP posted the video and then deleted it after the faux pas came to light. This is Congress’s truth… pic.twitter.com/ZkVEkd4pCf — Amit Malviya (@amitmalviya) November 25, 2022 అయితే మాలవీయ ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఖండించారు. బీజేపీ ఎడిట్ చేసిన వీడియోనూ షేర్ చేసి తమపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భారత్ జోడో యాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి తప్పుడు వీడియోలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. A video doctored by the Dirty Tricks Department of the BJP is doing the rounds to discredit the highly successful #BharatJodoYatra. We are taking the necessary legal action immediately. We are prepared for such tactics, and there will be payback. — Jairam Ramesh (@Jairam_Ramesh) November 25, 2022 ఈ విషయంపై తాము అధికారులకు ఫిర్యాదు చేస్తామని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. బీజేపీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర డిసెంబర్ 4న మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. చదవండి: 'గే' వివాహాలకు చట్టబద్దతపై పిల్.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం.. -
మునుగోడు ఎన్నిక నోట్ల ఎలక్షన్..
సాక్షి, కామారెడ్డి: మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలు పోటీపడి డబ్బులు ఖర్చు చేయడంతో పాటు మద్యాన్ని ఏరుల్లా పారించాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని విమర్శించారు. భారత్ జోడో పాదయాత్రలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా శేకాపూర్ గేట్ వద్ద రాహల్ గాంధీ బస చేసిన చోట ఆయన విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఓట్ల ఎన్నిక కాదని.. అది నోట్ల ఎన్నిక అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సాహసవంతమైన మహిళ అని, ఆమె డబ్బు, అధికారం ఉన్న వారితో పోరాడిందని ప్రశంసించారు. తనతో ప్రజా గాయకుడు గద్దర్ ఒక సారి ‘వన్ సీఆర్, టూ సీఆర్, త్రీ సీఆర్, ఫోర్ సీఆర్.. కేసీఆర్ ’అని చెప్పారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఉప ఎన్నికలో ఎన్నడూ 93 శాతం పోలింగ్ జరగలేదని, అది మునుగోడులో మాత్రమే సాధ్యమైందని అన్నారు. మునుగోడు ఓటమితో కాంగ్రెస్ పార్టీ కుంగిపోదని, మరింత బలంగా కొట్లాడుతుందని స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఎన్నికల యాత్ర కాదని, ప్రజల సమస్యలు తెలుసుకుని, వారిని సంఘటితం చేయడమే భారత్ జోడో యాత్ర ఉద్దేశమని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ ఓట్ కట్టర్ పార్టీ అని విమర్శించారు. పార్టీకి నష్టం చేసిన వారిపై చర్యలుంటాయి.. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవారు ఏ స్థాయివారైనా వారిపై చర్యలుంటాయని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషయంలో పార్టీ క్రమశిక్షణా సంఘం నోటీసు ఇచ్చిందని, ఆయన సమాధానం వచ్చిన తరువాత పరిశీలించి, తప్పు జరిగినట్టయితే తప్పకుండా చర్యలుంటాయని తెలిపారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. -
భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు బూస్టర్‌డోస్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి బూస్టర్ డోస్‌లా పనిచేస్తుందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త మార్గాన్ని చూపుతుందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ వెంట యాత్రలో పాల్గొన్న ఆయన శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో విజయవంతం అవుతోందని, అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన వస్తోందని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఎంతో అవసరమని రమేశ్ అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, ఈ రెండు ప్రభుత్వాల పాలనలో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎంఐఎం, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, బీజేపీని గద్దెదించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాహుల్ చేపట్టిన ఈ భారత్ జోడో యాత్ర ఎన్నికల యాత్ర కాదని రమేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్ ఎనిమిదో నిజాం! కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ఎనిమిదో నిజాం ప్రభువుగా గద్దెనెక్కి కూర్చున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ గ్లోబల్ రాష్ట్ర సమితిగా మారినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ పార్టీ చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 2007లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాస్‌పోర్టు కుంభకోణంలో ఇరుక్కున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జైరామ్ రమేశ్ మంగళవారం జోడోయాత్ర సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రోడ్లు చూస్తేనే పరిస్థితేంటో అర్థమవుతుందన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. ఎంఐఎంకు ఆక్సిజన్ అవసరం హైదరాబాద్ పార్టీ ఎంఐఎం రాజకీయంగా బతికుండేందుకు ఆక్సిజన్ అవసరమని, గతంలో కాంగ్రెస్ ఆక్సిజన్‌తో ఎంఐఎం రాజకీయ జీవనం సాగించిందని జైరామ్ రమేశ్ చెప్పారు. ఎంఐఎం ప్రస్తుతం బీజేపీ ఆక్సిజన్‌తో ముందుకు సాగుతూ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయ బూస్టర్ డోస్ అందిస్తోందని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకు ముందుకొచ్చి బీజేపీకి సహకరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎంఐఎంకు విడాకులు ఇచ్చిందని, మళ్లీ కలిసే సమస్యే లేదని స్పష్టంచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పుట్టిందని, బీజేపీ, ఆప్ భావజాలంలో తేడా లేదని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఎంఐఎం మాదిరిగా ఆప్ కూడా బీజేపీకి బీ టీమ్ అని ఆరోపించారు. షోకాజ్ నోటీసుకు ఇచ్చే వివరణ ఆధారంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు ఉంటాయన్నారు. రాహుల్ వెళ్లని రాష్ట్రాల్లోనూ యాత్ర భారత్ జోడో రాహుల్ యాత్ర వెళ్లని రాష్ట్రాల్లో సైతం స్థానిక నాయకులతో జోడోయాత్ర కొనసాగుతుందని జైరామ్ రమేశ్ వెల్లడించారు. ఇప్పటికే ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఈవిధంగా ప్రారంభమైందని.. పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ భారత్ జోడో యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ యాత్రకు ఏఐసీసీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. -
ఇక్కడ నిజాం.. అక్కడ తుగ్లక్ పాలన
(భారత్ జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రాన్ని ఓ ప్రైవేటు కంపెనీలాగా హైదరాబాద్‌లో ఎనిమిదో నిజాం పాలిస్తుంటే... పెద్ద నోట్ల రద్దు లాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఢిల్లీలో సుల్తాన్బిన్ తుగ్లక్ పాలిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ దుయ్యబట్టారు. గురువారం మక్తల్ మండలంలోని బొందలకుంట వద్ద భారత్‌జోడో యాత్ర విరామం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు ఉత్తమ్, భట్టి, మధుయాష్కీ, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, బలరాం నాయక్, జెట్టి కుసుమకుమార్, గాలి అనిల్‌కుమార్, అయోధ్యరెడ్డి తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ పంథాలోనే టీఆర్ఎస్, ఎంఐఎంలు కూడా వెళ్తున్నాయని విమర్శించారు. ఈ పార్టీలు బీజేపీకి ఆక్సిజన్ ఇస్తే అప్పుడప్పుడూ బీజేపీ ఆ పార్టీలకు బూస్టర్‌డోస్ ఇస్తుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తమకు రెండు కళ్లే ఉన్నా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల రూపంలో మూడు లక్ష్యా లున్నాయని చెప్పారు. అయితే రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో మాత్రం తమకు, టీఆర్ ఎస్‌కు మధ్యనే పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ లేకుండానే దేశంలోని ప్రతి పక్షాలను ఏకం చేస్తామంటూ కొందరు కలలు కంటున్నారని... అవి కలలుగానే మిగిలిపోతాయని జైరాం ఎద్దేవా చేశారు. బలమైన కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. యాత్రకు మంచి స్పందన.. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, రాహుల్ యాత్ర పూర్తయ్యాక దేశంలో కొత్త కాంగ్రెస్ కనిపిస్తుందని జైరాం రమేశ్ చెప్పారు. యాత్ర ఫలితాలు ఓట్ల రూపంలోనూ లబ్ధి చేకూరుస్తాయని శిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణలపై జైరాం స్పందిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో వన్ పార్టీ–వన్ మ్యాన్ రూల్ నడుస్తోందని జైరాం విమర్శించారు. -
రాష్ట్రంలో ‘భారత్ జోడో’ రూట్ మ్యాప్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణ రూట్ మ్యాప్ ఖరారైంది. టీపీసీసీ ఆధ్వర్యంలో రూపొందించిన పాదయాత్ర రూట్ మ్యాప్‌కు ఏఐసీసీ ఆమోదం లభించింది. ఈ రూట్ మ్యాప్ ప్రకారం రాహుల్ గాంధీ.. కర్ణాటక నుంచి నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తారు. అక్కడినుంచి మక్తల్, మహబూబ్‌నగర్ టౌన్, జడ్చర్ల, షాద్‌నగర్‌ల మీదుగా యాత్ర శంషాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి బార్కస్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బేగంబజార్, గాంధీభవన్, నాంపల్లి, విజయనగర్ కాలనీ, మాసాబ్‌ట్యాంక్, పంజగుట్ట, అమీర్‌పేట, మూసాపేట, కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు, ముత్తంగిల మీదుగా యాత్ర సంగారెడ్డి నియోజకవర్గంలోకి వెళ్లనుంది. అనంతరం సంగారెడ్డి నుంచి జోగిపేట, పెద్దశంకరంపేట, మద్నూరుల మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో రూట్ మ్యాప్‌కు ఏఐసీసీ అనుమతి లభించడంతో టీపీసీసీ నేతలు రాహుల్ యాత్రకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, చార్మినార్ ప్రాంతంలో పర్యటించి యాత్ర మార్గాన్ని పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 24న భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించాల్సి ఉంది. అయితే, ఒకట్రెండు రోజులు షెడ్యూల్లో మార్పు ఉండవచ్చని, అక్టోబర్ 26 నుంచి ఏ రోజైనా రాహుల్ తెలంగాణలోకి వస్తారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. కీలక సమావేశం..: భారత్ జోడో యాత్ర షెడ్యూల్‌పై చర్చించేందుకు మంగళవారం కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి పార్టీ అగ్రనేతలు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్, కొప్పుల రాజు సోమవారమే హైదరాబాద్‌కు వచ్చారు. తొలుత ఈ నాయకులు మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లి ఏపీలో రాహుల్ యాత్రపై అక్కడి నేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుని టీపీసీసీ ముఖ్యులతో భేటీ కానున్నారు. భారత్ జోడో యాత్రతో పాటు యాత్ర తర్వాత నిర్వహించనున్న ‘సంవిధాన్ బచావో మార్చ్’పై కూడా కాంగ్రెస్ నాయకులు చర్చించనున్నట్లు తెలిసింది. చదవండి: మునుగోడు దంగల్: కమలదళ కదనోత్సాహం.. ఫుల్‌జోష్‌తో బీజేపీ రెడీ -
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే!
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నాన్-గాంధీ కుటుంబం వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే సంకేతాలు అందుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ నిర్ణయించుకున్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని ఆమె ముందుంచారు. ‘మీ ఇష్టం. అధ్యక్ష పదవి కోసం ఎవరైనా పోటీ పడవచ్చు’ అంటూ సోనియా కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. అధ్యక్ష బరిలో ఎవరు నిల్చున్నా సరే.. తాను వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటానని చెప్పారంటున్నారు. భేటీ వివరాలను మీడియాకు వెల్లడించేందుకు థరూర్ నిరాకరించారు. ‘‘పోటీ చేయాలనుకునే నేతలందరికీ స్వాగతం. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరిగే ప్రజాస్వామిక ప్రక్రియ. అందులో పాల్గొనేందుకు ఎవరి అనుమతీ అవసరం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా అన్నారు. పోటీకి తాను సన్నద్ధమవుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే థరూర్ ప్రకటించడం తెలిసిందే. పార్టీలో అంతర్గత సంస్కరణల దిశగా ఆయన కొంతకాలంగా గట్టిగా గళం వినిపస్తున్నారు. వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బాగా డీలా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి అత్యవసరమైన పలు విప్లవాత్మక మార్పులకు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ శ్రీకారం చుడుతుందని మలయాళ దినపత్రిక మాతృభూమికి రాసిన వ్యాసంలో థరూర్ అభిప్రాయపడ్డారు. పార్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడంతో పాటు ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేస్తామని అధ్యక్ష అభ్యర్థులు ప్రమాణం చేయాలంటూ పలువురు యువ నేతలు, కార్యకర్తల చేసిన విజ్ఞాపనను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘దీనిపై 650 మందికి పైగా సంతకం చేశారు. ఈ విజ్ఞాపనను స్వాగతిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళించాలంటూ లేఖ రాసి జీ–23గా పేరుపడ్డ కాంగ్రెస్ అసంతృప్త నేతల్లో థరూర్ కూడా ఉన్నారు. రాజస్తాన్ పగ్గాలు పైలట్‌కు? మరోవైపు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఇప్పటికే ఖాయమైంది. దేవీ నవరాత్రులు మొదలయ్యాక సెపె్టంబర్ 26న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. నామినేషన్ల దాఖలుకు 30వ తేదీ తుది గడువు. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలు వెల్లడవుతాయి. గెహ్లాట్ నెగ్గి పార్టీ పగ్గాలు చేపడితే సచిన్ పైలట్‌ను రాజస్తాన్ సీఎంగా నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాహుల్‌గాంధీయే మళ్లీ అధ్యక్షుడు కావాలంటూ ఆరు పీసీసీ కమిటీలు తీర్మానం చేశాయి. ఇదీ చదవండి: నగదు విరాళాలు రూ.2,000 మించొద్దు -
డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్య
సాక్షి,న్యూఢిల్లీ: ఓ వైపు భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుంటే.. మరోవైపు గోవాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. 11 మందిలో 8 మంది బుధవారం బీజేపీలో చేరారు. దీంతో హస్తం పార్టీ సీనియర్ నేతలు కమలం పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్యను ఆపరేషన్ కీచఢ్(బురద)గా అభివర్ణించారు. డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. 'భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం చూసి బీజేపీ ఆపరేషన్ కీచఢ్(బురద)ను వేగవంతం చేసింది. యాత్రకు లభిస్తున్న స్పందన చూసి కమలం పార్టీ నిరాశ చెందుతోంది. యాత్రను తక్కువ చేసి చూపేందుకు రోజూ ప్రజల దృష్టి మళ్లించే పనులు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. మేం నిరాడంబరంగానే ఉంటాం. బీజేపీ డర్టీ ట్రిక్స్‌ను అధిగమిస్తాం' అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. Operation Kichad of BJP in Goa has been fast tracked because of the visible success of the #BharatJodoYatra. BJP is nervous. A daily dose of diversion & disinformation is handed out to undermine the Yatra. We remain undeterred. We will overcome these dirty tricks of the BJP. — Jairam Ramesh (@Jairam_Ramesh) September 14, 2022 మరో సీనియర్ నేత, ఏఐసీసీ గోవా ఇంఛార్జ్ దినేశ్ గుండూరావు బీజేపీ చర్య ప్రజాస్వామ్య విలువలను నిర్వీర్వం చేసేలా ఉందని మండిపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ధనం, పదవి ఆశలుజూపి ప్రతిపక్షమే లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. ఇది డబ్బు, అధికార మదంతో కూడిన సిగ్గుచేటు చర్య అని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే బీజేపీలోకి వెళ్లి దింగబర్ కామత్, మైకేల్ లోబోలు నమ్మక ద్రోహం చేశారని, పాతాళానికి దిగజారారని గుండూరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్‌లోనే ఉంటాం, బీజేపీలో చేరం' అని దైవ సాక్షిగా, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు ఇప్పుడు పార్టీ మారడం దురదృష్టకరమన్నారు. The destruction of democratic principles is in full display in #Goa. Offering huge monies, ministries and inducements the #BJP is trying to uproot the opposition. Shameful exercise of power and money by an authoritarian establishment. — Dinesh Gundu Rao/ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ (@dineshgrao) September 14, 2022 చదవండి: పంజాబ్‌లో 'ఆపరేషన్ లోటస్'.. 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఆఫర్ -
విపక్షాల ఐక్యత అంటే కాంగ్రెస్‌ను బలహీనం చేయడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాల ఐక్యత అంటే కాంగ్రెస్‌ను బలహీనం చేయడం కాదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చే విషయంపై స్పందించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఉద్దేశంలో విపక్ష పార్టీలన్నీ కలవడం అంటే కాంగ్రెస్‌ను బలహీనపర్చడం కాదని జైరాం రమేశ్ అన్నారు. బలమైన కాంగ్రెసే విపక్ష కూటమికి మూలస్తంభం అన్నారు. తమను ఇంకా బలహీనపర్చాలని చూస్తే అనుమతించే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని మిత్రపక్షాలు అర్థం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ తనను తాను పటిష్ఠం చేసుకోగలదని స్పష్టం చేశారు. ఏనుగు నిద్రలేచింది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి బీజేపీ కంగుతింటోందని జైరాం రమేశ్ అన్నారు. ఇది ప్రధాని మన్ కీ బాత్లా కాదు ప్రజా సమస్యలను లేవనెత్తే యాత్ర అన్నారు. ఈ యాత్రతో ఏనుగు మేల్కొందని అందరికీ అర్థమయ్యిందని, ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతోందన్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుందో అన్ని పార్టీలు చూస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకే భారత్ జోడో యాత్ర చేపడుతున్నట్లు జైరాం రమేశ్ స్పష్టం చేశారు. అయితే ఈ యాత్ర వల్ల విపక్షాల్లో ఐక్యత వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. చదవండి: కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం -
భారత్ జోడో యాత్ర: రాహుల్ ఓకే అంటే పెళ్లికి రెడీ!
చెన్నై: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. మూడో రోజు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ శనివారం తమిళనాడు కన్యాకుమారిలోని మార్తాండం చేరుకున్నారు. ఇక్కడ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం మహిళా కార్యకర్తలు ఆయనతో ముచ్చటించారు. ఈ సమయంలో రాహుల్ పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. ఓ మహిళ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి తమిళనాడు అంటే ఎంత ప్రేమో మాకు తెలుసు. అందుకే ఆయన పెళ్లి చేసుకునేందుకు ఓ తమిళ అమ్మాయిని చూసిపెడతాం అని అంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత్ జోడో యాత్రలో ఇది వినోదాత్మకమైన క్షణం అన్నారు. పెళ్లి ప్రస్తావన రాగానే రాహుల్ గాంధీ ఎలా నవ్వుతున్నారో చూడండి అని ఓ ఫోటో కూడా షేర్ చేశారు. A hilarious moment from day 3 of #BharatJodoYatra During @RahulGandhi’s interaction with women MGNREGA workers in Marthandam this afternoon, one lady said they know RG loved Tamil Nadu & they’re ready to get him married to a Tamil girl! RG looks most amused & the photo shows it! pic.twitter.com/0buo0gv7KH — Jairam Ramesh (@Jairam_Ramesh) September 10, 2022 దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా ఇతర సమస్యలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను బుధవారం కన్యాకుమారిలో ప్రారంభించారు. ఈ యాత్ర 150 రోజుల పాటు 3వేలకు పైగా కీలోమీటర్లు సాగనుంది. కశ్మీర్లో ముగుస్తుంది. ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సోనియాకు షాకిచ్చిన ఐదుగురు ఎంపీలు! -
భారత రాజకీయాల్లో వైఎస్సార్ గొప్ప నేత
సాక్షి, హైదరాబాద్: ఆధునిక భారత రాజకీయాల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప నాయకుడని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ కొనియాడారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు చాలా చరిత్ర ఉందని, కానీ వైఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని చెప్పారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రచించిన ‘జలయజ్ఞం–పోలవరం.. ఒక సాహసి ప్రయాణం’ అనే పుస్తకాన్ని వైఎస్సార్ 13వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రధానమంత్రి మాజీ సలహాదారు, సీనియర్ జర్నలిస్టు సంజయ్ బారుకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో జైరాం రమేశ్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి మూలకు నీరందించే లక్ష్యంతో పని చేశారని రమేశ్ చెప్పారు. ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, విద్య, సాగునీటి రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టారని తెలిపారు. జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ ఖ్యాతిలో సింహభాగం వైఎస్‌కే దక్కుతుందన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఓట్ల పండుగ మాత్రమే కాదని, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయడమని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ప్రజాస్వామ్యం మిగులుతుందో లేదో అర్థం కావడంలేదని అన్నారు. 2004లో యూపీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఆర్కిటెక్ట్ వైఎస్సార్ అని సంజయ్ బారు అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని సూచించారు. ఎమెస్కో విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేవీపీతోపాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి, సీఎంవో మాజీ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, ఆనం రామనారాయణరెడ్డి, కొణతాల రామకృష్ణ, గీతారెడ్డి, కాంగ్రెస్ నేత కొప్పుల రాజుతోపాటు పలువురు మాజీ ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే వీటిపై ఆయన స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. మూడు వారాల్లో దీనిపై స్పష్టత ఇస్తానని తెలిపారు. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్నారు. తాను పోటీ చేసేది లేనిదీ చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలనని థరూర్ అన్నారు. ప్రజాస్వామ్య పార్టీలో ఎన్నికలు నిర్వహించడం ఎప్పుడైనా శుభపరిణామమే అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గాంధీ కుటుంబం ఇప్పటికే స్పష్టం చేసిందని థరూర్ పేర్కొన్నారు. గాంధీయేతరులు కాంగ్రెస్ అధ్యక్షులైతే మంచిదన్నారు. అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుంటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా, వాళ్ల తరఫున రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లేత్ నిలబడినా శశి థరూర్ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. ఇటీవల ఓ వార్తా పత్రికకు రాసిన సంపాదకీయంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలని థరూర్ పేర్కొనడం వీటికి బలం చేకూర్చింది. అంతేకాదు నామినేషన్లు కాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు కూడా ఎన్నికలు జరగాలని థరూర్ సూచించారు. ఎవరైనా పోటీ చేయొచ్చు.. భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటిస్తున్న ఏఐసీసీ నేత జైరాం రమేశ్ థరూర్ వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించామని, ఎవరైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోతుందని చెప్పారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల -
స్వతంత్ర మీడియాని అణచివేసేందుకు యత్నాలు
న్యూఢిల్లీ: దేశంలో స్వతంత్ర మీడియాని అణచివేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రముఖ మీడియా కంపెనీ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)ను పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బలవంతపు కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రధాని మోదీ ‘‘ఖాస్ దోస్త్’’ (ఆప్త మిత్రుడు) స్వతంత్ర మీడియాని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు జైరామ్ రమేష్, కపిల్ సిబల్ ఈ కొనుగోలు వ్యవహారాన్ని తప్పు పట్టారు. ‘అదానీ గ్రూప్ ఎన్డీటీవీని బలవంతంగా కొనుగోలు చేయడం అంటే వారి రాజకీయ, ఆర్థిక అధికారాలను కేంద్రీకరించుకోవడం, స్వతంత్ర మీడియా గొంతు అణిచివేయడమే’ అని జైరామ్ దుయ్యబట్టారు. స్వతంత్ర జర్నలిజంను పారిశ్రామికవేత్తలు తమ గుప్పిట్లోకి తీసుకోవడం ఆందోళనకరమని సిబల్ అన్నారు. ఎన్డీటీవీ షేర్లు 29.18% ఇప్పటికే పరోక్ష పద్ధతిలో దక్కించుకున్న అదానీ గ్రూపు అదనంగా మరో 26% కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో ఈ విషయం బయటకి వచ్చింది. ఇదీ చదవండి: మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం -
వైద్య పరీక్షల కోసం విదేశాలకు సోనియా.. తోడుగా రాహుల్, ప్రియాంక
న్యూఢిల్లీ: వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తోడుగా వెళ్లనున్నారని కాంగ్రెస్ పార్టీ మంగళవారం వెల్లడించింది. అయితే, సోనియా ఏ దేశం వెళుతున్నారు, ఎప్పుడు వేళ్తున్నారనే వివరాలను మాత్రం తెలపలేదు. మరోవైపు.. సెప్టెంబర్ 4న నిర్వహించే మెహంగాయ్ పార్ హల్లా బోల్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. ‘వైద్య పరీక్షల కోసం సోనియా గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు. తిరిగి ఢిల్లీకి వచ్చే ముందు ఆమె తన తల్లిని కలవనున్నారు.’ అని జైరాం రమేశ్ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 7 ప్రారంభం కానున్న కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో విదేశాలకు వేళ్తున్నట్లు ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. పార్టీ అధ్యక్ష ఎన్నికలు సైతం దగ్గరపడుతుండటం గమనార్హం. ఇదీ చదవండి: కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల -
కాంగ్రెస్ మెగా ర్యాలీ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యకు నిరసనగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28వ తేదీన తలపెట్టిన తలపెట్టిన మెగా ర్యాలీ వాయిదా పడింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సెప్టెంబర్ 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ గురువారం తెలిపారు. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని మెగా ర్యాలీని వాయిదా వేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల 4న నిర్వహించబోయే భారీ ర్యాలీతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బలమైన సందేశం పంపిస్తామని అన్నారు. ప్రజా సమస్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 22న రాష్ట్ర స్థాయిలో, 25న జిల్లా స్థాయిలో, 27న బ్లాక్ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలాగే సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రకు సిద్ధమవుతోంది. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ దాకా ఆ యాత్ర సాగనుంది. -
జైరాం రమేశ్‌కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెటా డిసౌజాకు లీగల్ నోటీసులు పంపారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. గోవాలో తన కూతురు అక్రమంగా బార్ నడుపుతోందని నిరాధార ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను మసకబార్చేందుకే కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. 18 ఏళ్ల తన కూతురు గోవాలో రెస్టారెంట్ కోసం, బార్ కోసం ఎలాంటి దరఖాస్తులు చేయలేదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. తన కూతురుకు ఎక్సైజ్ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు కూడా రాలేదని చెప్పారు. కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందన్నారు. స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీకి గోవాలో రెస్టారెంట్ ఉందని, అందులో అక్రమంగా బార్ కూడా నడుస్తోందని కాంగ్రెస్ నేతలు శనివారం ఆరోపించడం తీవ్ర దుమారం రేపింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన స్మృతి ఇరానీ వీటిని కొట్టిపారేశారు. తాను గాంధీలను విమర్శిస్తున్నందుకే తన కూతుర్ని లక్ష్యంగా చేసుకున్నారని ఎమోషనల్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం జోయిష్ ఇరానీపై చేసిన ఆరోపణలను సమర్థించుకుంది. సాక్ష్యంగా చూపుతూ ట్విట్టర్లో వీడియో కూడా షేర్ చేసింది. అంతేకాదు ఆదివారం గోవాలోని జోయిష్ ఇరానీదే అని ఆరోపిస్తున్న రెస్టారెంట్ ముందు నిరసన కూడా చేపట్టింది. చదవండి: 'ఆ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం' -
సోనియా గాంధీపై పరుష పదజాలం.. జేపీ నడ్డాకు జైరాం రమేశ్ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్. బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా.. శనివారం ఓ జాతీయ ఛానల్లో మాట్లాడుతూ సోనియా గాంధీపై పరుషపదజాలన్ని ఉపయోగించడంపై మండిపడ్డారు. మరోసారి ఇలా మాట్లాడితే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈమేరకు జైరాం రమేశ్.. జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఎప్పుడు సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడే బీజేపీ అధికార ప్రతినిధులు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలైన 75 ఏళ్ల సోనియా గాంధీ గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని జైరాం రమేశ్ ఆరోపించారు. ఆ పార్టీ మహిళలకు వ్యతిరేకం అనేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఇలాంటి మాటలవల్ల దేశంలో రాజకీయాలు దిగుజారుతున్నాయని ధ్వజమెత్తారు. మోదీ సహా ఎంతో మంది బీజేపీ నేతలు మహిళల పట్ల పలుమార్లు అగౌరవంగా మాట్లాడిన విషయం దేశం మొత్తానికి తెలుసన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి అనుచిత వ్యాఖ్యలకు బాధ్యతగా దేశంలోని మహిళలందరికీ ప్రధాని మోదీ, జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. . కానీ ఇప్పటివరకు బీజేపీ నేతలు మహిళలకు క్షమాపణలు చెప్పిన దాఖలాలు లేవని అన్నారు. చదవండి: అగ్నిపథ్‌తో దేశ భద్రత, యువత భవిష్యత్తు అంధకారం -
అందుకే నా కూతుర్ని టార్గెట్ చేశారు: స్మృతి ఇరానీ
సాక్షి,న్యూఢిల్లీ: గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందువల్లే అభం శుభం తెలియని తన కూతురిని కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను తరచూ విమర్శిస్తున్నందుకు 18 ఏళ్ల తన కూతురు గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కూతురు కావడమే ఆమె శాపమా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమోషనల్ అయ్యారు. '18 ఏళ్ల నా కూతురి వ్యక్తిత్వాన్ని కూనీ చేయాలని ఇద్దరు కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. నా కూతురు కాలేజీలో చదువుకుంటోంది. ఎలాంటి బార్ నడపటం లేదు. కావాలంటే పేపర్లు చూసుకోండి. ఆమె పేరు ఎక్కడుంది? నేను రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శిస్తున్నందు వల్లే నా కూతురిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా కుమార్తె రాజకీయ నాయకురాలు కాదు. సాధారణ విద్యార్థిని.' అని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ విషయంపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. వారికి ఈరోజే నోటీసులు పంపిస్తానని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని అమెథీకి పంపాలని, మరోసారి ఓడిస్తానని సవాల్ విసిరారు. కాగా అంతకుముందు స్మృతీ ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ గోవాలో రెస్టారెంట్ నడుపుతున్నారని, అందులో ఫేక్ లైసెన్స్‌తో బార్ కూడా ఉందని కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా ఆరోపించారు. మోదీ ప్రభుత్వం స్మృతి ఇరానీని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను జోయిష్ ఇరానీ తరఫు న్యాయవాది కొట్టిపారేశారు. అవి నిరాధారమైనవని, స్మృతి ఇరానీ కూతురు అయినందువల్లే ఆమెపై రాజకీయ దురుద్దేశంతో లేని పోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. చదవండి: ఎన్డీఏకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాహుల్.. కేంద్రంపై ఫైర్ -
అన్సారీది దేశద్రోహం.. మాజీ ఉపరాష్ట్రపతిపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఐఎస్ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలు బుధవారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి. సదరు జర్నలిస్టును అన్సారీ స్వయంగా భారత్‌కు ఆహ్వానించారంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. వీటిని అన్సారీ తోసిపుచ్చారు. సదరు జర్నలిస్టును తానెన్నడూ కలవడం గానీ, భారత్‌కు ఆహ్వానించడం గానీ చేయలేదన్నారు. నుస్రత్ మీర్జా అనే పాకిస్తాన్ జర్నలిస్టు తాను పలుమార్లు భారత్‌లో పర్యటించి అత్యంత రహస్యమైన సున్నిత సమాచారాన్ని సేకరించి పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి అందించానంటూ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉగ్రవాదంపై భారత్‌లో జరిగిన ఓ సెమినార్లో కూడా తాను పాల్గొన్నానని, అన్సారీ అందులో ప్రసంగించారని మీర్జా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మీర్జా వ్యాఖ్యలను ఉటంకిస్తూ అన్సారీపై భాటియా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘2005–11 మధ్య అన్సారీ తనను కనీసం ఐదుసార్లు భారత్‌కు ఆహ్వానించినట్టు మీర్జా చెప్పాడు. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని కూడా మీర్జా ఆయన నుంచి రాబట్టి ఐఎస్ఐతో పంచుకున్నట్టుగా కన్పిస్తోంది. అన్సారీ ఇరాన్లో భారత రాయబారిగా కూడా దేశ ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరించారు. ఇదంతా దేశద్రోహం కాక మరేమిటి? దేశ ప్రజలు ఆయన్ను ఎంతగానో గౌరవిస్తుంటే ఆయనేమో దేశానికే ద్రోహం తలపెట్టారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ మొత్తం ఉదంతంలో అన్సారీతో పాటు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ బదులివ్వాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాళ్లు తక్షణం నిర్దోషిత్వం నిరూపించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. శత్రు గూఢచారులను భారత్‌కు అధికారికంగా ఆహ్వానించడమే ఉగ్రవాదంపై కాంగ్రెస్ వైఖరా అని ప్రశ్నించారు. అన్సారీని ఉద్దేశించి పాక్ జర్నలిస్టు బయటపెట్టిన విషయాలు చాలా తీవ్రమైనవని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పండా అన్నారు. ‘‘అన్సారీ వంటి వ్యక్తిని యూపీఏ రెండుసార్లు ఉపరాష్ట్రపతిని చేసింది. దీన్నిబట్టి యూపీఏ హయాంలో దేశ అత్యున్నత పదవుల్లో నియామకాల విషయంలో గోల్మాల్ జరిగిందా అన్న తీవ్రమైన అనుమానాలు తలెత్తుతున్నాయి’’ అంటూ ట్వీట్ చేశారు. 2007లో యూపీఏ హయాంలో ఉపరాష్ట్రపతి అయిన అన్సారీ 2017 దాకా పదవిలో కొనసాగారు. మోదీ అండ్ కో దిగజారుడుతనం: జైరాం బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఇది అన్సారీ, సోనియా వ్యక్తిత్వాలను కించపరిచే నీచ ప్రయత్నమంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ దుయ్యబట్టారు. వ్యక్తిత్వ హననానికి ఇది పరాకాష్ట అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అనుయాయుల దిగజారుడుతనానికి అంతులేకుండా పోతోందని విమర్శించారు. వాళ్ల మనసులు ఎంత రోగగ్రస్తంగా మారాయో ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. నాది మచ్చలేని పనితీరు: అన్సారీ బీజేపీ ఆరోపణలను ఖండిస్తూ అన్సారీ ప్రకటన విడుదల చేశారు. ‘‘2010 డిసెంబర్ 10న ఉగ్రవాదంపై సదస్సును నేను ప్రారంభించి ప్రసంగించాను. నిర్వాహకులు ఎవరిని ఆహ్వానించిందీ నాకు తెలియదు. నేనెవరినీ ఆహ్వానించలేదు’’ అని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ రాయబారిగా నేను చేసిన ప్రతి పనీ నాటి కేంద్ర ప్రభుత్వ ఎరుకలో ఉంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ విషయాలపై ఇంతకంటే ఏమీ వ్యాఖ్యానించలేను. ఇరాన్ విధుల అనంతరం ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా నియుక్తుడినయ్యా. నా పనితీరును భారత్‌తో పాటు ప్రపంచమంతా గుర్తించింది’’ అని చెప్పారు. అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఉండగా ఆయన ఓఎస్డీగా పని చేసిన గుర్‌ప్రీత్‌సింగ్ సప్పల్ కూడా బీజేపీ ఆరోపణలను ఖండించారు. ‘‘మీర్జా ఎక్కడా తనను అన్సారీ ఆహ్వానించారని చెప్పలేదు. ఆయన ప్రసంగించిన సెమినార్లో మిగతా జర్నలిస్టులతో పాటు మీర్జా కూడా ఉన్నాడంతే’’ అంటూ ట్వీట్ చేశారు. -
నూపుర్ వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్.. కాంగ్రెస్ స్పందన.. ‘సిగ్గుతో ఉరేసుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇంతటి అవమానకర పరిస్థితుల్లో కాషాయ పార్టీ సిగ్గుతో ఉరేసుకోవాలని వ్యాఖ్యానించింది. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగడానికి నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని సుప్రీం చెప్పడం సరైంది. జరిగిన ఘటనలకు ఆమెదే పూర్తి బాధ్యత అని, జాతి మొత్తానికి క్షమాపణలు చెప్పాలని చెప్పడం ఆహ్వానించదగ్గది. అధికారం ఉందని విర్రవీగేవారికి సుప్రీం వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివి’ అని కాంగ్రెస్ పేర్కొంది. చదవండి👉సోమవారమే ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి బల పరీక్ష ‘ఇందులో రహస్యమేమీ లేదు.. మత విద్వేషాలను రెచ్చగొట్టి కమళం పార్టీ లబ్ది పొందాలనుకుంటోంది. విధ్వంసపు విభజన భావజాలాలపై పోరాడే ప్రతి ఒక్కరికి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ఎత్తుగడలు వేసే జాతీ విద్రోహ శక్తులపై పోరాటాన్ని కాంగ్రెస్ ఎప్పటికీ ఆపదని తేల్చి చెప్పారు. అలాంటివారి వికృత చర్యలను భరత జాతి ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కాగా, మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఇంటా బయటా బీజేపీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్తూ నూపుర్ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, తదనంతరం కూడా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈక్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక వాఖ్యలు చేసింది. చదవండి👉కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన Our statement on the Supreme Court's observations on the BJP Spokesperson's case pic.twitter.com/kCkxITGHVU — Jairam Ramesh (@Jairam_Ramesh) July 1, 2022 -
నా అంత్యక్రియలు అయిపోయాక మెసేజ్ చేస్తా!
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ఇవేనా స్ట్రోకులు? ఉక్రెయిన్ స్థానాన్ని భర్తీ చేసేలా భారీ గోధుమ ఎగుమతులు అంటూ ముందు పతాక శీర్షికలకు ఎక్కాలి. తర్వాత దేశీయ ధరల పరిస్థితిని బట్టి గోధుమ ఎగుమతులను నిషేధించాలి. మళ్లీ అమెరికా ఆ నిర్ణయంతో సంతోషంగా లేదు కాబట్టి, నిషేధాన్ని సడలించాలి. ఇదంతా కూడా ఐదు రోజుల వ్యవధిలో! అయినా మాస్టర్ స్ట్రోకుల్లో విశ్వగురువు కాబట్టి ఏ ఆశ్చర్యమూ కలగడం లేదు. – జైరామ్ రమేశ్, రాజ్యసభ ఎంపీ దానిక్కూడా రారా మరి! నా అంతిమ క్రియలు జరిగిన తర్వాత, నా స్నేహితుల్లో ఎవరైనా నా ఫోన్‌ను తీసుకుని, వాటికి హాజరు కానివారికి ఇలా సందేశం పంపాలని కోరుకుంటాను: ‘మిమ్మల్ని ఇవ్వాళ చాలా మిస్సయ్యాను. అయినా ఫర్లేదు, త్వరలోనే కలుసుకుంటాను’. – అంజలి, వ్యంగ్య రచయిత లేవాలి... నడవాలి... డెస్కు దగ్గర రోజంతా అలా కదలకుండా కూర్చోవడానికి మన శరీరం డిజైన్ కాలేదు. అది మన దేహ దారుఢ్యానికీ, భంగిమకూ, మానసిక ఆరోగ్యానికీ కూడా భయంకరమైనది. కాబట్టి, గంటలో అది కొద్ది నిమిషాలే అయినా సరే ఒకసారి లేచి నడవాలి. అలాగే లంచ్ వేళల్లో ఫోన్ మీద పడొద్దు– చిన్న నడక అయినా సాగించాలి. ఎంత సాధ్యమైతే అంత! – కరోలా సైకోరా, డబ్ల్యూహెచ్ఓ క్యాన్సర్ ప్రోగ్రామ్ మాజీ డైరెక్టర్ అదుపు అవసరం విపాసన, జిక్ర్, యోగా, ధ్యానం తరగతుల వల్ల ఏం ప్రయోజనం, ఇంకొకరిని ట్రోల్ చేయాలన్న అమితమైన కోరికను అవి నియంత్రించలేకపోతే? – ఖాలిద్ అనీస్ అన్సారీ, సోషియాలజీ ప్రొఫెసర్ రుచి అద్భుతం నా జీవితంలో మొదటిసారి మామిడిపండు తిన్నాను. అది ఎంత బాగుందో చెప్పలేను. – జో వాల్ష్, యూఎస్ మాజీ అధ్యక్ష అభ్యర్థి క్షేమంగా ఉండాలి అస్సాం వరదల దృశ్యాలు చూస్తుంటేనే గుండె తరుక్కుపోతోంది. ఈ విపత్తు వల్ల ప్రభావితులైన జనాలందరికీ నా ప్రార్థన. – అభినవ్ ఎ.బింద్రా, ఒలింపియన్ లేదు వయసు ‘స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్’ పత్రిక వారి ‘స్విమ్‌సూట్ 2022’ కవర్ పేజీ మీద 74 ఏళ్ల వయసులో మోడల్‌గా ఉండటం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇలాంటివి చేయడానికి ఇదే సమయం. – మాయే మస్క్, యూఎస్ రచయిత్రి నామకరణం ఇలా... మారుతీ సుజుకీ హాచ్బాక్ కార్లలో ‘జెన్’ అనేది ఒక ఆక్రోనిమ్ అని మీకు తెలుసా? జెడ్.ఈ.ఎన్. అంటే, జీరో ఇంజిన్ నాయిస్. – మీర్జా ఆరిఫ్ బేగ్, పాత్రికేయుడు -
గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్.. ‘ఆయన గులాంగా ఉండాలనుకోవడం లేదు’
న్యూఢిల్లీ: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సహచరుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మేరకు లోక్‌సభ ఎంపీ శశిథరూర్ మాత్రం అజాద్‌కు అభినందనలు తెలిపారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ మాత్రం బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య పద్మ అవార్డును తిరస్కరించారనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అతను అజాద్‌గా ఉండాలనుకుంటున్నాడు గులాం అవ్వాలను కోవట్లేదంటూ గులాం నబీ ఆజాద్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. అంతేకాదు మాజీ బ్యూరోక్రాట్ పీఎన్ హస్కర్ పద్మ అవార్డును తిరస్కరించడం గురించి ఒక పుస్తకంలో వివరించిన భాగాన్ని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ మేరకు 1973లో మన దేశంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వోద్యోగి హస్కర్ పీఎంఓ నుండి నిష్క్రమించినప్పుడు అతనికి పద్మవిభూషణ్‌ను అందజేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దానిని ఆయన తిరస్కరించారు. హస్కర్ పుస్తకంలోని ఆ భాగం అత్యత్తుమమైనది, అనుకరణ అర్హమైనది అనే క్యాప్షన్ జోడించి మరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అయితే పద్మ అవార్డులను బహిరంగంగా తిరస్కరించడం చాలా అరుదు. ఎందుకంటే అవార్డు గ్రహీతలకు అవార్డు గురించి ముందుగానే తెలియజేయడమే కాక వారు అంగీకరించిన తర్వాత మాత్రమే జాబితాను ప్రకటిస్తారు. అయితే పద్మభూషణ్‌పై నిర్ణయాన్ని భట్టాచార్య భార్యకు తెలియజేసినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కానీ, బుద్ధదేవ్ మాత్రం తనకు పద్మభూషణ్ గురించి ఏమి తెలియదని ఒకవేళ వారు పద్మభూషణ్ ఇచ్చినట్లయితే తిరస్కరిస్తున్నాను అని అన్నారు. In Jan 1973, the most powerful civil servant of our country was told he was being offered the Padma Vibhushan on his leaving the PMO. Here is PN Haksar's response to it. It is a classic, and worthy of emulation. pic.twitter.com/H1JVTvTyxe — Jairam Ramesh (@Jairam_Ramesh) January 25, 2022 (చదవండి: యువతను ఆకట్టుకునేలా హాలీవుడ్ సినిమా రేంజ్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్) -
పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ విధానంపై బుధవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో హైడ్రామా చోటు చేసుకుంది. వ్యాక్సిన్ విధానంపై చర్చించడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొంటూ పలువురు బీజేపీ ఎంపీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారు విజయ రాఘవన్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ వీకే భార్గవ, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయిసంఘం ముందు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ అధ్యక్షత వహించారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం, జినోమ్ సీక్వెన్సింగ్ (వైరస్ వేరియంట్ల జన్యుక్రమ విశ్లేషణ నమోదు)పై సమావేశంలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై, రెండు టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచాలన్న నిర్ణయంపై పలువురు విపక్ష ఎంపీలు ప్రశ్నించాలనుకోగా, అధికార బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. దేశంలో టీకా కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో అనవసర అనుమానాలు రేకెత్తించడం సరికాదన్నారు. సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వాయిదా వేయాలన్న డిమాండ్‌పై ఓటింగ్ జరపాలని బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ పలువురు బీజేపీ ఎంపీలు వాకౌట్ చేశారు. దాదాపు అరగంట పాటు ఈ డ్రామా కొనసాగింది. మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో వైద్య, శాస్త్ర, పరిశోధన రంగం చేసిన కృషిని కమిటీ ఈ సందర్భంగా ఘనంగా కొనియాడింది. చదవండి: వైరల్: నెటిజన్లు మెచ్చిన పసి హృదయం -
డెడ్లైన్లతో కాదు..హెడ్లైన్ల కోసమే పనిచేస్తోంది!
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ డిసెంబర్ నాటికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై కేంద్రం తన విధానాన్ని, రోడ్ మ్యాప్‌ను పార్లమెంట్లో ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాల పరిమితితో కూడిన కార్యాచరణ(డెడ్ లైన్ల) ఆధారంగా కాకుండా ప్రచారం (హెడ్ లైన్ల) కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆక్షేపించారు. వ్యాక్సినేషన్ విధానంపై సుప్రీంకోర్టు మందలించినందున ఇకనైనా ప్రధాని మోదీ కుంభకర్ణుడి నిద్రను వీడాలని ఎద్దేవా చేశారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి అహంభావం, వైఫల్యాల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ప్రధానిపై ఆయన మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవాలనుకునే వారు డబ్బులు ఎందుకు చెల్లించాలని నిలదీశారు. దేశ ప్రజలందరికీ కోవిడ్ టీకా ఉచితంగా ఇవ్వాలనీ, అందరికీ ఆన్లైన్ అందు బాటులో లేనందున వ్యాక్సినేషన్ కోసం కోవిన్ యాప్‌లో నమోదు తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరారు. వ్యాక్సినేషన్ విధానం, అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం ప్రత్యేకంగా పార్లమెంట్‌ను సమావేశపర్చాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల కేటాయింపు లో కేంద్రం పారదర్శకత పాటించాలన్నారు. సమాఖ్య సహకార సూత్రాన్ని అనుసరిస్తూ వివక్షను వదలి, వ్యాక్సిన్లను రాష్ట్రాలకు అందజేయాలని సూచించారు. చదవండి: ఉచిత వ్యాక్సినేషన్, రేషన్.. కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల భారం -
Vaccination: దుమారం రేపిన గడ్కరీ వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికి.. టీకాల కొరత వల్ల అది సాఫీగా సాగడం లేదు. ప్రస్తుతం దేశంలో రెండు కంపెనీలు మాత్రమే టీకాలను ఉత్పత్తి చేస్తుండటంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో విపక్ష నేతలు ఇతర కంపెనీలకు టీకా తయారి బాధ్యతను అప్పగించాలని.. అప్పుడే భారీ ఎత్తున టీకాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వానికి సూచించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే సూచించారు. వైస్-చాన్స్‌లర్స్‌తో మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘ఎక్కువ కంపెనీలకు టీకా తయారీ లైసెన్స్ ఇవ్వాలి. అలాగే ఆమేరకు రాయల్టీ కూడా చెల్లించాలి. ప్రతి రాష్ట్రంలో రెండు, మూడు ల్యాబ్‌లున్నాయి. వాటిని వినియోగించుకున్నట్లైతే కేవలం 15-20 రోజుల్లోనే అవి వ్యాక్సిన్లను సరఫరా చేయగలవు. సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది’’ అన్నారు. గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. దీనిపై విపక్ష కాంగ్రెస్, బీజేపీకి చురకలు అంటించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ “ఏప్రిల్ 18న మజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు మీరే ఇదే చెప్తున్నారు. ఇంతకు మీ బాస్ వింటున్నారా’’ అంటూ ఎద్దేవా చేశారు. తన వ్యాఖ్యలు ఇలా వివాదాన్ని రాజేయడంతో గడ్కరీ దిద్దుబాటు చర్యలకు దిగారు. ‘‘వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి మంగళవారం నేను ఓ ప్రకటన చేశాను. కానీ నా ప్రసంగానికి ముందు రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండ్వియా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారని నాకు తెలియదు. సరైన దిశలో ఈ సమయానుకూల జోక్యానికి నేను అతని బృందాన్ని అభినందిస్తున్నాను’’ అంటూ గడ్కరీ ట్వీట్ చేశారు. Yesterday while participating at the conference organised by Swadeshi Jagaran Manch, I had made a suggestion to ramp up vaccine production. I was unaware that before my speech Minister for Chemical & Fertilizers Shri @mansukhmandviya had explained government’s efforts to ramp up — Nitin Gadkari (@nitin_gadkari) May 19, 2021 చదవండి: ‘పీఎంఓతో ఉపయోగం ఉండదు.. గడ్కరీకి ఇవ్వండి’ -
రైల్వే సదుపాయాలను ప్రైవేటీకరించేది లేదు
న్యూఢిల్లీ: రైల్వే మౌలిక సదుపాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధి కోసం ఆస్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించి నిధులు రాబట్టుకునే (మానిటైజేషన్) ప్రణాళికలతో ఉన్నట్టు రైల్వే మంత్రీ పీయూష్ గోయల్ రాజ్యసభకు శుక్రవారం తెలియజేశారు. ప్రయాణికుల రైళ్ల కార్యకలాపాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన చేపట్టనున్నామని.. తద్వారా రూ.30,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను తీసుకురానున్నట్టు తెలిపారు. ఈస్టర్న్, వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను ప్రారంభించిన తర్వాత మానిటైజేషన్ ప్రణాళికతో రైల్వే శాఖ ఉన్నట్టు చెప్పారు. అలాగే, పీపీపీ నమూనాలో స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికుల రైళ్లు, రైల్వే భూములు, బహుళ వినియోగ భవనాలు, రైల్వే కాలనీలు, రైల్వే స్టేడియమ్‌ల రూపంలో నిధులు రాబట్టుకోనున్నట్టు వివరించారు. ఆస్తుల నగదీకరణ వల్ల రైల్వేల అభివృద్ధికి కావాల్సిన నిధు లు సమకూరతాయన్నారు. సభ్యుల నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణ/మానిటైజేషన్ వేర్వేరు కాంగ్రెస్ సభ్యుడు జైరామ్‌రమేశ్ వేసిన ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రైవేటీకరణ, ఆస్తుల నగదీకరణ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ‘‘ప్రైవేటీకరణ చేయడం అంటే ఆస్తులను శాశ్వతంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించేయడం. అందులో ఇక ఏ మాత్రం ప్రభుత్వ యాజమాన్యం ఉండదు. కానీ, రైల్వే అమలు చేయనున్న ప్రణాళిక ఏమిటంటే.. ఆస్తులను ఉపయోగించి నిధులను సమకూర్చుకోవడం (మానిటైజేషన్) ఎలాగన్నదే. ఇలా సమకూర్చుకునే నిధులు తిరిగి పెట్టుబడులు పెట్టి, వృద్ధి చెందేందుకే. రైల్వే మౌలిక ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేవేటీకరించము’’ అని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్లు (డీఎఫ్సీ) ప్రత్యేక కార్పొరేట్ విభాగాలని.. రైల్వే మద్దతు వాటికి ఉంటుందన్నారు. డీఎఫ్సీ వేసే ట్రాక్‌లకు రైల్వే యజమానిగా లేదన్నారు. పెట్టుబడి ఆధారిత వృద్ధికి రైల్వే కీలకమైనదిగా మంత్రి పేర్కొన్నారు. ‘‘ఒక్క రోడ్డును నిర్మిస్తే ప్రతీ ఒక్కరూ దానిని వినియోగించుకుంటారు. అలాగే, ఒక నూతన రైల్వే ట్రాక్‌ను నిర్మించి వాటి నిర్వహణకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించి ప్రోత్సహిస్తే.. అది కొత్త ఉపాధి అవకాశాలను తీసుకొస్తుందే కానీ, ఉన్న ఉద్యోగాలకు నష్టం చేయదు’’ అని మంత్రి చెప్పారు. -
పరువు నష్టం: సారీ చెప్పిన సీనియర్ నేత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడికి క్షమాపణలు చెప్పారు. దోవల్ కుమారుడు వివేక్ దోవల్‌పై జైరాం రమేశ్ 2019 జనవరిలో ఓ మేగజైన్లో వచ్చిన ఆర్టికల్‌ను అనుసరించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు పత్రికా ప్రకటనల్లోనూ అదే తరహా విమర్శలు గుప్పించారు. దీంతో తమపై నిరాధార ఆరోపణలు చేసిన జైరాం రమేశ్‌పైనా, సదరు మేగజైన్ నిర్వాహకులపైనా వివేక్ పరువు నష్టం దావా వేశారు. ఉన్నత స్థానంలో ఉన్న తన తండ్రిని అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారని కోర్టుకు విన్నవించారు. తాజాగా దావాకు సంబంధించి జైరాం రమేశ్ స్పందించారు. ఎన్నికల ప్రచార వేడిలో అప్రయత్నంగా వివేక్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా భంగపరిచి ఉంటే దానికి చింతిస్తున్నానని ప్రకటనలో పేర్కొన్నారు. వివేద్ దోవల్‌కు, అతని కుటుంబ సభ్యులకు సారీ చెబుతున్నానని అన్నారు. గతంలో వివేక్‌పై తన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రకటనలు ఏవైనా ఉంటే అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ను కోరారు. కాగా, రమేశ్ క్షమాపణల్ని అంగీకరిస్తున్నామని వివేక్ దోవల్ ఓ జాతీయ మీడియాతో అన్నారు. రమేశ్‌పై వేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. అయితే, తప్పుడు వార్తలు రాసిన కారవాన్ మేగజైన్‌పై మాత్రం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
తొలిసారి విడతలవారీగా..
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్దమైంది. నేటి(సోమవారం) నుంచి 18 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. అన్ని జాగ్రత్తలతో, కోవిడ్ –19 నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, కొత్త విధి, విధానాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. విజృంభిస్తున్న కరోనా, కుదేలైన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దుల్లో చైనా దుస్సాహసాలు.. తదితర వైఫల్యాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం సిద్ధమవుతోంది. ఉభయ సభలు తొలిసారి విడతలవారీగా సమావేశం కావడం ఈ సమావేశాల ప్రత్యేకత. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. కోవిడ్–19 నెగెటివ్ ఉన్నవారికే సభలోనికి అనుమతించడంతో పాటు, మాస్క్ కచ్చితంగా ధరించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే ఎంపీలు, సిబ్బంది సహా 4 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చాలా కార్యకలాపాలను డిజిటలైజ్ చేశారు. భౌతిక దూరం ఉండేలా ఎంపీల సీట్లలో మార్పులు చేశారు. గ్యాలరీల్లోనూ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం పార్లమెంటు ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. అలాగే, సమావేశాల ప్రారంభానికి గరిష్టంగా 3 రోజుల ముందు కరోనా పరీక్ష జరిపించుకుని, నెగెటివ్ రిపోర్ట్ తీసుకుని సభకు రావాల్సి ఉంటుంది. రోజులో పలుమార్లు పార్లమెంటు ప్రాంగణాన్ని, వాహనాలను శానిటైజ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. భద్రత నియమాల్లోనూ మార్పులు చేశారు. భౌతికంగా ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా సెక్యూరిటీ స్కానింగ్ చేయనున్నారు. పార్లమెంటు సమావేశాలను రిపోర్ట్ చేసేందుకు వచ్చే మీడియా ప్రతినిధులను కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రధాన భవనంలోనికి మంత్రులు, ఎంపీలను మాత్రమే అనుమతిస్తారు. సభలోనూ సభ్యుడు మాస్క్ ధరించి, కూర్చోని ఉండే ప్రసంగించే వెసులుబాటు క ల్పించారు. ఎంపీలందరికీ ప్రత్యేక కోవిడ్–19 కిట్స్‌ను డీఆర్డీఓ అందజేయనుంది. అందు లో 40 డిస్పోజబుల్ మాస్క్‌లు, 5 ఎన్ 95 మాస్క్‌లు, 50 ఎంఎల్ శానిటైజర్ సీసాలు 20, ఫేస్ షీల్డ్, 40 జతల గ్లవ్స్, ముట్టుకోకుండా ద్వారాలను తెరిచేందుకు, మూసేందుకు వినియోగించే హుక్, గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి. కీలక అంశాలపై చర్చకు విపక్షం పట్టు ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిరుద్యోగం, చైనాతో ఉద్రిక్తత.. అంశాలపై సభలో చర్చ జరగాలని వర్షాకాల సమావేశాల ఎజెండాపై చర్చించేందుకు సమావేశమైన పార్టీల ఫ్లోర్ లీడర్ల భేటీలో విపక్ష పార్టీలు కోరాయని డీఎంకే నేత టీఆర్ బాలు తెలిపారు. ఈ లోక్‌సభ బీఏసీ(బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని పార్టీల ప్రతినిధులు హామీ ఇచ్చారని స్పీకర్ తెలిపారు. బీఏసీ నిర్ణయించే అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సమావేశాల అజెండాను నిర్ణయించేందుకు పార్టీల ఫ్లోర్ లీడర్లు మంగళవారం కూడా భేటీ అవుతారన్నారు. కోవిడ్‌పై మంగళవారం చర్చ జరిగే అవకాశముందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 11 ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులు సహా 23 బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. తొలి రోజు మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ఇటీవల మరణించిన సభ్యులు, మాజీ సభ్యులకు నివాళులర్పించిన అనంతరం ఉభయ సభలు గంట పాటు వాయిదా పడతాయి. ఆ తరువాత రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. లోక్‌సభలో హోమియోపతిక్ సెంట్రల్ కౌన్సిల్, ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ సవరణ బిల్లులపై చర్చ జరుగుతుంది. ఆ బిల్లులను అడ్డుకుంటాం ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 11 ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లుల్లో నాలుగింటిని గట్టిగా వ్యతిరేకించాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన 3 ఆర్డినెన్స్‌లను, బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సంబంధించిన మరో ఆర్డినెన్స్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఉభయసభల్లో ఉమ్మడిగా పోరాడేందుకు ఇతర విపక్షాలతో చర్చిస్తున్నామన్నారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, కరోనా విజృంభణ, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ తదితర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించనున్నామని, ఇందుకు ఇతర విపక్షాలతో కలిసి ఒక ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. విపక్షం వ్యక్తం చేసే ఆందోళనలకు సభలో ప్రధానే స్వయంగా సమాధానమివ్వాలని డిమాండ్ చేస్తామన్నారు. సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై సానుకూల పక్షాలతో తాను, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ చర్చలు జరుపుతున్నామన్నారు. -
‘కాంగ్రెస్‌కి కరోనా వైరస్.. భారీ నష్టం’
కొచ్చి: మైనార్టీ మతవాదంపై కాంగ్రెస్ పార్టీ సామరస్య ధోరణితో ఉంటుందన్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), షహీన్‌బాగ్ నిరసనల్ని ప్రచార అస్త్రంగా చేసుకొని బీజేపీ ఓట్లను చీల్చడం వల్ల ఆ పార్టీ గెలవలేదు కానీ, ఎక్కువ నష్టం జరిగింది కాంగ్రెస్‌కేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్ సోకినట్టుగా భారీగా నష్టం జరిగిందన్నారు. మెజార్టీ ప్రజల మనోభావాల పట్ల కూడా సున్నితంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోని చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముస్లిం మతవాదంపై తాము చూసీ చూడనట్టు వ్యవహరిస్తామన్న దుష్ప్రచారం సాగుతోందని జైరామ్ రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: అలాంటి మాటలు వాడకుంటే బావుండేది) -
ప్లూట్ వాయిద్యంతో అదరగొట్టిన ఇస్రో డైరెక్టర్
బెంగుళూరు : ఇస్రో అధికారులు ఎల్లప్పుడు అంతరిక్షంలోకి శాటిలైట్లను, రాకెట్లను పంపే పనిలో బిజీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశ ముగింపు కార్యక్రమాన్ని ఒక సీనియర్ అధికారి తన ప్లూట్ పరికరంతో సంగీతం వినిపించి ముగించారు. వివరాల్లోకి వెళితే.. ప్రతి ఏడాది చివరలో బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వహిస్తుంటారు. ఇస్రో చైర్మన్ కె. శివన్ ఆధ్వర్యంలో ఈసారి కూడా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కార్యక్రమం చివర్లో ఇస్రో డైరెక్టర్, సీనియర్ సైంటిస్ట్ పి. కున్హికృష్ణన్ తన వెంట తెచ్చుకున్న ప్లూట్ పరికరంతో 'వాతాపి గణపతిం భజే' పాటను అందరికి వినిపించారు. .అయితే ఈ వీడియోనూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ' స్వతహాగా ప్రొఫెషనల్ ప్లూట్ వాయిద్యకారుడైన ఇస్రో డైరక్టర్ పి. కున్హికృష్ణన్ ఈరోజు తన ప్లూట్‌తో మ్యాజిక్ చేశారు. ఆయన 'వాతాపి గణపతిం భజే' పాటను వినిపించి ఇస్రో పార్లమెంటరీ సమావేశాన్ని ముగించడం నాకు ఆనందం కలిగించింది. ఆ సమయంలో పార్లమెంటరీ సమావేశం కాస్తా ఒక సంగీత విభావిరి కేంద్రంగా మారిందంటూ' ట్వీట్ చేశారు. The Parliamentary Standing Committee ended it's last meeting at ISRO with a flute performance by the Director of its Satellite Centre in Bengaluru, P. Kunhikrishnan, who is also a professional flute player! He played the evergreen Vatapi Ganapatim Bhaje. Sharing a snippet. pic.twitter.com/AkwwPh9oZY — Jairam Ramesh (@Jairam_Ramesh) December 29, 2019 -
జాతీయ ఎజెండా కావాలి
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తూర్పు కనుమలను కాపాడుకోవడమన్నది అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ అన్నారు. దీనిని జాతీయ ఎజెండాగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఇక్కడ తూర్పుకనుమల పరిరక్షణ వేదిక (గ్రేస్), కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పు తీరానికి ఎక్కువగా తుపానులు సంభవించడం, దానిని ఆనుకుని ఉన్న కనుమల లో పలు రకాల మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడం వంటి అంశాలను ప్రస్తావించారు. తూర్పుకనుమలను కాపాడుకున్నప్పుడే తీరప్రాంతాన్ని కూడా రక్షించుకోగలుగుతామని, దానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణానికి సంబంధించి కేంద్రం ఏమైనా ప్రతిపాదనలు చేస్తే రాష్ట్రాలు సహకరించాలని అప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. తూర్పు కనుమల పరిరక్షణ ప్రాధాన్యత దృష్ట్యా త్వరలో పర్యావరణంపై జరిగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి ‘గ్రేస్’ ప్రతినిధులకు ఆహ్వానం పంపుతామన్నారు. పర్యావరణ సమతూకం లేని ఆర్థికాభివృద్ధికి అర్థం లేదంటూ రెండింటినీ సమతూకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తూర్పుకనుమల పరిరక్షణ కు ‘గ్రేస్’ ప్రచురించిన పుస్తకంలోని వివరాల ఆధారంగా పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. తూర్పుకనుమలను కాపాడాలన్న శ్రద్ధ ఎవరికీ లేకపోవ డం దురదృష్టకరమని పాలసీ నిపుణుడు మెహన్ గురుస్వామి అన్నారు. పర్యావరణ నిపుణుడు తులసీదాసు ‘గ్రేస్’ రూపొందించిన పుస్తకంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్‌రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వ్యవస్థాపకుడు కె.లక్ష్మారెడ్డి, సీజీఆర్ అధ్యక్షురాలు కె.లీలా లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. -
రాయని డైరీ : జైరామ్ రమేశ్ (కాంగ్రెస్)
‘‘పీ చిదంబరం, రాహుల్ గాంధీ కూడా మన మధ్య ఉంటే బాగుండేది’’ అన్నారు అభిషేక్ సింఘ్వీ! ఆయన అలా ఎందుకన్నారో అర్థం కాలేదు. చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారు. రాహుల్ శ్రీనగర్ పర్యటనలో ఉన్నారు. సింఘ్వీ, శశి థరూర్, శర్మిష్ట ముఖర్జీ, నేను.. అనుకోకుండా ఒకచోట కలుసుకున్నాం. అనుకోకుండా కలుసుకున్నాం కాబట్టి మంచి విషయాలేవైనా మాట్లాడుకుందామని నలుగురం అనుకున్నాం. నాకైతే మోదీజీ తప్ప మరే మంచి విషయమూ కనిపించడం లేదు ప్రస్తుతం దేశంలో. వెంటనే ఆ మాట అంటే బాగుండదని ముందు మంచిచెడుల గురించి మాట్లాడ్డం మొదలు పెట్టాను. ‘‘చెడ్డవాడు మంచి చేసినా మంచి అనాలి. మంచివాడు చెడు చేసినా చెడు అనాలి. మంచిని కూడా మనం చెడు అంటుంటే, రేపు మనం మంచి చెప్పినా అది చెడే అవుతుంది’’ అన్నాను. ఆ మాట అంటున్నప్పుడే సింఘ్వీ ఈ మాట అన్నారు.. ‘పీ చిదంబరం, రాహుల్ గాంధీ కూడా మన మధ్య ఉంటే బాగుండేది’ అని! వెంటనే శర్మిష్ట ‘వహ్వా.. వహ్వా’ అన్నారు. ‘‘శర్మిష్టాజీ మీరెందుకు వహ్వా వహ్వా అని అన్నారు? చిదంబరం, రాహుల్ కూడా మనతో ఉంటే బాగుండేదని సింఘ్వీ అన్నందుకా?!’’ అని అడిగాను. ‘‘కాదు జైరామ్‌జీ, మంచిచెడులపై మీ అబ్జర్వేషన్ బాగుంది. విమర్శ.. విధానాల మీద ఉండాలి కానీ, వ్యక్తుల మీద ఉండకూడదని చక్కగా చెప్పారు. మోదీ గురించే కదా’’ అని నవ్వారు ఆవిడ. ‘‘మీరూ చక్కగానే అర్థం చేసుకున్నారు శర్మిష్టాజీ. మోదీని అదేపనిగా దెయ్యం దెయ్యం అంటుంటే మోదీ దేవుడైపోయి మనం దెయ్యాలమైపోతాం. ఇంట్లో ఎవరైనా దేవుడి పటం పెట్టుకుంటారు కానీ, దెయ్యం పటం పెట్టుకుంటారా?!’’ అన్నాను. థరూర్ నవ్వుతూ నా వైపు చూశారు. కాంగ్రెస్‌లో నాకు నచ్చే నవ్వు అది. ‘‘నేనూ ఆరేళ్లుగా ఇదే చెబుతున్నాను జైరామ్‌జీ. మంచి చేసినప్పుడు మోదీని మనం మంచివాడు అనకపోతే, చెడు చేసినప్పుడు మోదీని మనం చెడ్డవాడు అనలేం. మన చెడు నుంచి మనం తప్పించుకోగలం కానీ, అవతలి వ్యక్తి మంచి నుంచి మనం తప్పించుకోలేం’’ అన్నారు థరూర్. బాగా చెప్పాడనిపించింది. శర్మిష్ట కూడా ‘బాగా చెప్పారు’ అన్నట్లు థరూర్ వైపు మెచ్చుకోలుగా చూశారు. ‘‘నేనూ అదే చెప్పబోతున్నా’’ అన్నారు సింఘ్వీ. ‘‘మీరేం చెప్పబోతున్నారు సింఘ్వీ?’’ అని అడిగాను. ‘‘మోదీ ఏం చేసినా మనం విమర్శిస్తూ ఉంటే మనం ఏం విమర్శించినా మోదీ ఏదో చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఉజ్వల స్కీమ్‌ని మనం గ్యాస్ అన్నాం. ‘అవును గ్యాసే. కాంగ్రెస్ గ్యాస్ కొట్టింది. మోదీ గ్యాస్ ఇచ్చాడు’ అన్నారు జనం. చేస్తున్న వంటను ఆపేసి మరీ మోదీకి ఓటేసి వచ్చారు. నా అనుమానం చిదంబరం ఇంట్లో పనిచేసే వంట మనిషి కూడా మోదీకే ఓటు వేసుంటుందని..’’ అన్నారు సింఘ్వీ. చిదంబరం మాట రాగానే సింఘ్వీ అన్నమాట గుర్తొచ్చింది. ‘‘చిదంబరం, రాహుల్ కూడా మన మధ్య ఉంటే బాగుండేదని అన్నారు కదా! మీకెందుకలా అనిపించింది సింఘ్వీ?’’ అని అడిగాను. ‘‘చిదంబరం కూడా మోదీలో మంచిని చూశారు జైరామ్‌జీ. మోదీ పాలసీలు బాగున్నాయని ఈమధ్యనే కదా అన్నారు.. అరెస్ట్ అవడానికి ముందు..’’ అన్నారు సింఘ్వీ. ‘‘మరి రాహుల్‌గాంధీ ఏం మంచి చూశారు మోదీలో?’’ అన్నాను. ‘‘చూడలేదు.. మన మధ్య ఉంటే, శ్రీనగర్ పర్యటనలో రాహుల్‌కి మంచేమైనా కనిపించేదేమోనని’’ అన్నారు సింఘ్వీ! -
నోట్ల రద్దుపై ఆర్బీఐ అభ్యంతరాలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టొచ్చన్న కేంద్ర ప్రభుత్వ వాదనపై ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసిందని కాంగ్రెస్ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దును ప్రకటించడానికి ముందు అంటే 2016 నవంబర్ 8న సాయంత్రం 5.30 నిమిషాలకు ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశానికి సంబంధించిన (మినిట్స్) వివరాలను సోమవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ మీడియాకు విడుదల చేశారు. ‘నల్లధనం చాలా వరకు కరెన్సీ రూపంలో లేదు. రియల్ రంగంలోని ఆస్తులు, బంగారం రూపంలో ఉన్నాయి. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు’అని ఆర్బీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పేర్కొన్నట్లు రమేశ్ తెలిపారు. ‘ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల మాత్రమే అసలైన పెరుగుదల. అంతేకానీ చెలామణి అవుతున్న కరెన్సీ పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపదు. నల్ల ధనం తగ్గుతుందన్న వాదన నోట్ల రద్దు నిర్ణయాన్ని పెద్దగా సమర్థించదు’అని ఆర్బీఐ వ్యాఖ్యలను ఉటంకించారు. దేశంలో చెలామణీ అవుతున్న మొత్తం కరెన్సీలో నకిలీ నోట్లు కేవలం రూ.400 కోట్లు ఉంటుందని, అది చాలా తక్కువ ప్రాముఖ్యం ఉన్న విషయమని ఆర్బీఐ తెలిపినట్లు చెప్పారు. -
‘ఆయనకు ఇష్టం లేకున్నా నిమ్మరసం ఇప్పించారు’
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. కులపిచ్చి, బంధుప్రీతి, నయవంచన, నీతిమాలిన పనులు చేయడంలో చంద్రబాబు ప్రపంచ రికార్డులన్నీ సొంతం చేసుకున్నాడని విమర్శించారు. అవినీతికి ఒక రూపం ఉంటే అది ‘యూ టర్న్ నిప్పు నాయుడు’ అని వర్ణించారు. మహాత్మాగాంధీతో పోల్చుకుంటున్న బాబుకు ఆయన నీడను కూడా తాకే అర్హత లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును మించిన అవకాశవాది దేశం మొత్తంమీద ఎక్కడా ఉండరని ఆయన ధ్వజమెత్తారు. ‘దోచుకోవడానికే చంద్రబాబు కేంద్ర ప్రాజెక్టు పోలవరాన్ని నిర్మిస్తానని తీసుకున్నారని ఏడాది క్రితం జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేసి తిట్టిపోశారు. ఇవాళ ఇద్దరూ ఒక్కటై ఆలింగనాలు చేసుకుంటున్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అనిపిస్తుంది’ అని విజయసాయిరెడ్డి అన్నారు. (ఏపీ ప్రభుత్వం కోరినట్లే ప్యాకేజీలో మార్పులు చేశాం) రిచ్‌గా ఉండేందుకు మాజీ ప్రధానితో నిమ్మరసం.. ‘చంద్రబాబు ఎలాంటి వ్యక్తో మాజీ ప్రధాని దేవెగౌడకు బాగా తెలుసు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు లైసెన్సులు ఇప్పించి చంద్రబాబు ఎంత దోచుకున్నది అనేకమార్లు స్వయంగా ఆయనే చెప్పారు. ఇప్పుడు బాబు చేపట్టిన దీక్ష ముగింపు రిచ్‌గా ఉండాలని చెప్పి దేవెగౌడను బతిమాలిఅక్కడకు తీసుకొచ్చారు. ఇష్టం లేకున్నా ఆయన చేత బాబుకు నిమ్మరసం తాగించారు’ అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘10 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ఢిల్లీలో మీరు చేసిన దీక్ష ఫొటోలు దిగడానికేనా’ అని ప్రశ్నించారు. -
‘కారు’ పనైపోయింది : జైరాం రమేష్
సాక్షి, హన్మకొండ: తెలంగాణలో ‘కారు’ పనైపోయింది.. కేసీఆర్ ఇక ఫాం హౌస్‌కే పరిమతమవుతారని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. ఆదివారం హన్మకొం డలోని పోచమ్మకుంట, సగర కాలనీ, ప్రేమ్‌నగర్ కాలనీ, హనుమాన్ నగర్, నయింనగర్, లష్కర్‌సింగారం, రాజాజీనగర్, రాంనగర్లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రజా కూటమి అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నయింనగర్‌లో జైరాం రమేష్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా, రాహుల్‌గాంధీ ఇచ్చారని, బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ కుటుంబ తెలంగాణగా మార్చారని విమర్శించారు. ప్రజలను మాయమాటలతో మోసం చేస్తూ నాలుగున్నర ఏళ్లు పాలన సాగించాడని, కేసీఆర్ పతనానికి వరంగల్ నుంచి నాందీ పలకాలని కోరారు. సైకిల్‌ను నడపాలంటే చేయి సహకారం అవసరమని అందుకే టీడీపీకి కాంగ్రెస్ సహకిస్తోందని చెప్పారు. హనుమాన్ నగర్లో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు మాట్లాడుతూ బీజేపీకి కొమ్ము కాస్తున్న కేసీఆర్ వరంగల్ అభివృద్ధిపై ఎందుకు ఒత్తిడి తేలేదని ప్రశ్నించారు. కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ కేంద్రం వచ్చిందా అని ప్రశ్నించారు. రైతులకు, దళితులు, యువకులకు కేసీఆర్ ఒరుగబెట్టింది ఏమీ లేదని, ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రచారం కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ప్రజాకూటమి నాయకులు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డితోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేసీఆర్ ఒక మాయల మరాఠీ...
సాక్షి, మల్దకల్ (గద్వాల): తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని, నిరుపేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్ మాయమాటలను తెలంగాణ ప్రజలు మరోసారి నమ్మే స్థితిలో లేరని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్, నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గురువారం మండలంలోని మేకలసోంపల్లి, బిజ్వారం, దాసర్పల్లి, ఉలిగేపల్లి, నేతువానిపల్లి, అడివిరావుల్చెర్వు, మంగంపేట, సద్దలోనిపల్లి, పెద్దొడ్డి, మద్దలబండ, మద్దలబండ పెద్దతండా, మద్దలబండ చిన్నతండా, మల్దకల్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొని మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు హామీలు గుప్పిస్తున్నారని, ప్రజలు ఆయన మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రమసింహారెడ్డి, డాక్టర్ రఘనాథ్‌రెడ్డి జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అరుణ, నాయకులు నారాయణరెడ్డి, సత్యారెడ్డి, రాముడు, మురళీధర్‌రెడ్డి, సూర్యగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నరేందర్, గోపాల్, తిమ్మప్ప, రాజశేఖర్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు రెబెల్స్ బెడద
-
సెంటిమెంటే అస్త్రం.. అతిరథ మహారథుల ప్రచారం!
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోన్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయే కారణమనే సెంటిమెంటును అస్త్రంగా ప్రయోగించి ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. దీని అమలు కోసం అతిరథ మహారథులు రాష్ట్రానికి వస్తున్నారు.కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, ఏఐసీసీ ట్రెజరర్ అహ్మద్ పటేల్ రంగప్రవేశం చేశారు. శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడిన బిక్షపతి యాదవ్ ఇంటికి అహ్మద్‌పటేల్ బుధవారం వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ట్రబుల్ షూటర్‌గా వెళ్లే కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జైరాంరమేశ్ వరకు అందరూ క్యూ కట్టి హైదరాబాద్ వస్తున్నారు.వీరప్పమొయిలీ, జైపాల్లాంటి నేతలు దౌత్యం చేస్తుండగా, కుష్బూ, చిదంబరం, పృథ్వీరాజ్‌చౌహాన్, నారాయణస్వామిలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికల రంగంలో వేడి పెంచుతున్నారు. సర్దుకు పోండి.. మేం అండగా ఉంటాం ‘మహాకూటమి’కారణంగా కుదుర్చుకున్న పొత్తుల వల్ల నష్టపోతున్న స్థానాలు, పార్టీలో టికెట్లు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించేందుకు ఏఐసీసీ పెద్ద కసరత్తే చేసింది.అభ్యర్థుల ఖరారుకు ముందే రాష్ట్రానికి చెందిన 15 మంది వరకు నేతలను ఢిల్లీకి పిలిపించి వార్‌రూంలో చర్చించిన పార్టీ అధిష్టానం... అభ్యర్థిత్వాల ఖరారు కోసం మరోమారు బృందాలను పంపింది. మొదటి దఫాలో కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావులు హైదరాబాద్‌కు వచ్చి అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. దాదాపు 25 మంది నేతలతో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమై వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత బెట్టుగా ఉన్న మరికొందరిని దారిలోకి తెచ్చుకునేందుకు ఇద్దరు సీనియర్లకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పజెప్పింది. కేంద్ర మాజీ మంత్రులు వీరప్పమొయిలీ, ఎస్.జైపాల్‌రెడ్డిలు గత రెండురోజులుగా ఇదే పనిలో ఉన్నారు. ఇక బుధవారమే హైదరాబాద్ నగరానికి చేరుకున్న జైరాంరమేశ్ కూడా ఇదే పనిలో ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గ టికెట్ ఆశించిన తోటకూర జంగయ్యయాదవ్ వద్దకు కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, జెట్టి కుసుమకుమార్‌లతో కలపి బోడుప్పల్‌కు వెళ్లి మరీ జంగయ్యకు సర్దిచెప్పారు. ఈ చర్యలతో రెబెల్స్ బెడద అంతగా లేకుండా నివారించుకోగలిగారు. మరోవైపు శివకుమార్ గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు.ప్రచారం, వ్యూహాలు, అంతర్గత సమస్యలపై ఆయన టీపీసీసీ ముఖ్యులతో సమన్వయం చేస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ఈనెల 23న జరగనున్న సోనియా, రాహుల్‌ల సభను జయప్రదం చేసేందుకు జైరాంరమేశ్ కూడా ఆయనకు తోడయ్యారు. ఇచ్చామన్న సెంటిమెంటుతో... పోయిన చోటే వెతుక్కోవాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సెంటిమెంట్‌ను మరోసారి తెలంగాణ ప్రజలకు గుర్తుకు తేవాలనే వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియాగాంధీతో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పాల్గొననున్నారు. ఈ సభలోనే తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా సోనియాకు సన్మానం చేసేందుకు టీపీసీసీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరాన్నీ రంగంలోకి దింపారు. బుధవారమే హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తెలంగాణ రాష్ట్రానికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని సెంటిమెంట్‌తో కొట్టే ప్రయత్నం చేశారు. చిదంబరంతో పాటుగా తెలంగాణ బిల్లును రూపొందించిన కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేశ్ కూడా హైదరాబాద్ వచ్చారు. వీరిద్దరితో ఎన్నికల ప్రచారం చేయించడం ద్వారా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేసే ప్రయత్నానికి వ్యూహాత్మకంగా శ్రీకారం చుట్టడం గమనార్హం. బిక్షపతి యాదవ్ ఇంటికి అహ్మద్ పటేల్ శేరిలింగం పల్లి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతియాదవ్‌ను ఆయన ఇంటికి వెళ్లి ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్ అనునయించారు. ఆయనకు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఏమిస్తామన్నది ఇప్పుడు చెప్పడం ధర్మం కాదని అయితే బిక్షపతి యాదవ్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనేందుకు అంగీకరించారని అహ్మద్ పటేల్ విలేకరులకు తెలిపారు.పటేల్ వెంట పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్ రెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, మధుయాష్కి తదితరులు ఉన్నారు. మహిళా నేతలతో.. ప్రచారం కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా నేతలనూ రంగంలోకి దింపింది. రాష్ట్రానికి చెందిన స్టార్‌క్యాంపెయినర్ విజయశాంతికి తోడు తమిళనాడుకు చెందిన ఖుష్బూ సుందర్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జడ్చర్లలో రోడ్‌షో చేసిన ఖుష్బూ వచ్చే వారంలో మరిన్ని చోట్ల ప్రచారం చేయనున్నారు. ఈమెతో పాటు ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాదేవ్ కూడా ఈసారి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. -
బ్యాంకుల జాతీయీకరణకు కారణం ‘నీలం’
సాక్షి, హైదరాబాద్: దేశంలో బ్యాంకుల జాతీయీకరణకు.. మాజీ రాష్ట్రపతి, తెలుగువాడు నీలం సంజీవరెడ్డి కారణమా? అప్పటి ప్రధాని ఇందిరాగాం«ధీ ఇష్టాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించడం పరోక్షంగా బ్యాంకుల జాతీయీకరణ వేగంగా జరిగేలా చేసిందా? దీనికి అవుననే సమాధానం చెపుతున్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్. రాష్ట్రపతిగా బాబూ జగ్జీవన్‌రామ్‌ను చూడాలని ఇందిర అనుకున్నారని, అయితే పార్టీ ఆమె అభీష్టానికి విరద్ధంగా నీలం పేరును ప్రతిపాదించడంతో ఇందిర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లండన్‌లో తన క్లాస్మేట్ అయిన పీఎన్ హక్సర్ సలహా మేరకు బ్యాంకుల జాతీయీకరణ ప్రక్రియను వేగవంతం చేశారని చెప్పారు. 1967–73 మధ్య అప్పటి ప్రధాని ఇందిరకు ‘ఆత్మ’గా వ్యవహరించినట్టు చెప్పే పీఎన్ హక్సర్ జీవిత చరిత్రను ‘ఇంటర్‌ట్వైన్డ్ లైవ్స్’పేరుతో జైరాం పుస్తకంగా రాశారు. ఈ పుస్తకం ఇటీవల విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో చర్చా వేదిక మంథన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన జైరాం ఈ పుస్తకం వెనక దాగున్న అనేక ఆసక్తికరమైన అంశాలను వివరించారు. ఇందిర హయాంలో అత్యంత శక్తివంతుడైన అధికారిగా హక్సర్ ఎన్నో సేవలు అందించారని, బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, అణ్వస్త్ర ప్రయోగాలు, అంతరిక్ష కార్యక్రమాల రూపకల్పన వంటి అనేక కీలకమైన విధానాల వెనుక ఉన్నది ఆయనేనని జైరాం తెలిపారు. దేశం బాగోగుల కోసం ప్రభుత్వ విధానాల రూపకల్పన చేసే వ్యవస్థగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని (అప్పట్లో ప్రధానమంతి సెక్రటేరియట్)ను ఏర్పాటు చేసింది కూడా హక్సర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడేనని వివరించారు. సర్వం తానై.. జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని పగ్గాలు చేపట్టిన ఇందిర తన చిన్ననాటి మిత్రుడైన హక్సర్‌ను లండన్ నుంచి రప్పించుకుని మరీ కార్యదర్శిగా చేర్చుకున్నారని జైరాం తెలిపారు. 1967–73 మధ్య హక్సర్ సర్వం తానై అటు ప్రభుత్వాన్ని, ఇటు రాజకీయంగానూ ఇందిరకు సహరించారని, 1967 ఎన్నికల్లో 282 స్థానాలు మాత్రమే కలిగిన కాంగ్రెస్.. తర్వాత ఎన్నికలు వచ్చేనాటికి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించే స్థాయికి చేరడం వెనుక హక్సర్ మంత్రాంగం, ఇందిరకు ఆయన ఇచ్చిన సలహాలు కీలకమయ్యాయన్నారు. నెహ్రూ స్మారక గ్రంథాలయంతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో ఉన్న హక్సర్ లేఖలు, కార్యదర్శిగా ఆయన జారీ చేసిన మెమోలు, ఫైల్ నోటింగ్స్ అన్నింటినీ ఏడాది పాటు క్షుణ్ణంగా పరిశీలించి తాను ఈ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. 1971లోనే ఎమర్జెన్సీ పెట్టమన్నాడు.. దేశ రాజకీయాల్లో చీకటి అధ్యాయంగా చెప్పుకునే ఎమర్జెన్సీని హక్సర్ సూచనల ప్రకారం 1971లోనే విధించి ఉంటే దేశం పరిస్థితి ఇంకోలా ఉండేదేమోనని జైరాం అభిప్రాయపడ్డారు. యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించి బంగ్లా దేశ్‌ను విముక్తం చేసిన తర్వాత కొన్ని లక్షల మంది శరణార్థులు దేశంలో ఉండేవారని.. ఆ నేపథ్యంలో విదేశీ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నెపంతో ఎమర్జెన్సీ విధించి ఉంటే రాజకీయంగా ఇందిరకు లాభం కలిగేదని హక్సర్ భావించారని, అయితే ఇందిర ఆ సలహాను తోసిపుచ్చి.. ఆరేళ్ల తర్వాత రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు అత్యవసర పరిస్థితిని ప్రకటించారని వివరించారు. 1972లో జుల్ఫికర్ అలీ భుట్టోతో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందం కశ్మీర్ సమస్యకు కారణమన్న కొందరి వాదనను తాను అంగీకరించబోనన్న జైరాం.. ఆ ఒప్పందం ద్వారా భారత్‌కు మేలే జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు, మంథన్ నిర్వాహకులు అజయ్, విక్రం గాంధీ పాల్గొన్నారు. -
మోదీనే మా టార్గెట్..
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవడమే ప్రధాన అంశం అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ స్పష్టం చేశారు. మోదీ సర్కార్ అవాస్తవాలను కప్పిపుచ్చుతున్న తీరును విపక్షాలు ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల సందర్భంగా మోదీ చేసిన వాగ్ధానాలు ఎంతమేర అమలయ్యాయనే దానిపైనే 2019 లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమ పనితీరుపై జరిగిన తరహాలోనే తదుపరి ఎన్నికలు మోదీ పనితీరుకు రెఫరెండంలా ఉంటాయన్నారు. నరేంద్ర మోదీ సర్కార్ చెబుతున్న అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం విపక్షాలుగా తమ బాధ్యతని జైరాం రమేష్ పేర్కొన్నారు. పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ చేపట్టిన అనంతరం కాంగ్రెస్‌లో చోటుచేసకుంటున్న మార్పులను ఆయన ప్రస్తావిస్తూ ప్రధాన కార్యదర్శులు సహా ఇతర కీలక పదవుల్లో పార్టీ నాయకత్వం యువ నేతలను నియమిస్తోందని చెప్పారు. మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్లలో మాదిరిగా కాకుండా కర్ణాటకలో బీజేపీయేతర సర్కార్ ఏర్పాటుకు పార్టీ వేగంగా పావులు కదిపిందని అన్నారు. కర్ణాటకలో జేడీఎస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వడంతో పాటు బీజేపీని నిలువరించేందుకు పార్టీ వేగంగా స్పందించిందని చెప్పుకొచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలతో జతకడుతుందని, బిహార్‌లో ఆర్జేడీతో, జార్ఖండ్‌లో జార్ఖండ్ వికాస్ మోర్చాతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో పొత్తు ఉంటుందన్నారు. అవసరమైతే ఎన్నికల అనంతర పొత్తులకూ అవకాశం ఉంటుందని చెప్పారు. -
ప్రత్యేక సమావేశాల ప్రతిపాదన.. బీజేపీ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : పట్టుమని గంటల లెక్కన్న కూడా బడ్జెట్ సమావేశాలు జరగకుండా.. 23 రోజులు వాయిదాల పర్వంతోనే సరిపోయింది. కాలయాపనతోపాటు సుమారు రూ.200 కోట్ల ప్రజా ధనం సభ నిర్వహణ పేరిట వృధా అయ్యింది. ఈ క్రమంలో అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలతో నిరసనలకు పిలుపునిచ్చాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశాల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ ఈ మేరకు రాజ్యసభ చైర్పర్సన్ వెంకయ్యనాయుడికి శుక్రవారం ఓ లేఖ రాశారు. మే లేదా జూన్ నెలలో రెండు వారాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్ణయించాలని లేఖలో కోరారు. ‘ముఖ్యమైన బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. దీనికి తోడు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై సభలో చర్చించాల్సిన అవసరం ఉంది. వాయిదాల పర్వంతో పార్లమెంట్ ప్రతిష్ఠ ఇప్పటికే దెబ్బతింది. ప్రత్యేక సమావేశాలను నిర్వహించటం ద్వారా కాస్తైనా ఊరట కలిగే అవకాశం ఉంటుంది’ అని జైరామ్ లేఖలో వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సమావేశాలు ఇలా అర్థరహితంగా ముగియటానికి అన్ని పార్టీలు కారణమన్న వెంకయ్య అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తానని.. కానీ, సభను సజావుగా నిర్వహించగలిగే మార్గాలు ఉన్నప్పటికీ.. బీజేపీ ఆ పని చేయలేదన్న విషయాన్ని గమనించాలని జైరామ్ తెలిపారు. జైరామ్‌కు బీజేపీ కౌంటర్... ఇక ఈ లేఖపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కేంద్ర మంత్రి విజయ్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ... జైరామ్‌పై మండిపడ్డారు. ‘సభ సజావుగా సాగకుండా అడ్డుపడ్డారు. ఇప్పుడు మరో సెషన్స్ నిర్వహించాలని కోరుతున్నారు. వాళ్లు మళ్లీ జీతాలు, అలవెన్సులు కావాలనుకుంటున్నారా?’ అంటూ విజయ్ గోయల్ తెలిపారు. కాగా, సభ సజావుగా సాగకపోవటంతో బీజేపీ ఎంపీలు ఈ 23 రోజుల తమ జీతాలను స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
పలు విచిత్రమైన రాజకీయ దృశ్యాలు..
-
సోనియా పక్కన సీఎం రమేశ్.. జైరాంతో సుజనా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో గురువారం పలు విచిత్రమైన రాజకీయ దృశ్యాలు దర్శనమిచ్చాయి. టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలతో చెట్టపట్టాల్ వేసుకొని తిరగడం కనిపించింది. పార్లమెంటు ఆవరణలో గురువారం ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్, ఎస్పీ సభ్యులతోపాటు టీడీపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పక్కన నిలబడి టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ప్లకార్డు ప్రదర్శించారు. మరో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వగా.. తోట నర్సింహం చేతిలో చెయ్యేసి జైరాం సన్నిహితంగా ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన పాపం కాంగ్రెస్ పార్టీదేనని పైకి టీడీపీ ఆరోపిస్తున్నా.. అంతర్గతంగా ఆ రెండు పార్టీలు సన్నిహితంగా మెసులుతున్నట్టు తాజా పరిణామాలు చాటుతున్నాయి. తాజా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోనూ కాంగ్రెస్-టీడీపీ అనుబంధం బయటపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో చంద్రబాబు భేటీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కాంగ్రెస్‌తో కలవనని చెబుతూనే ఆ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కావడం గమనార్హం. పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌తో చంద్రబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే. -
వామపక్షాల అంతర్థానం దేశానికి తీవ్ర విపత్తు!
న్యూఢిల్లీ : తాజాగా జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మాణిక్ సర్కారు నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం ఓడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. వామపక్షాలు అంతర్థానం అవుతుండటం దేశానికి తీవ్ర విపత్తు అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో వామపక్షాలు బలంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. నిజానికి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ప్రత్యర్థులు అయినప్పటికీ, వామపక్షాలు లేని లోటును దేశంలో భరించలేదని ఆయన పేర్కొన్నారు. అయితే, సమాజంలో, ప్రజల ఆకాంక్షల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా వామపక్షాలు తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరముందని సూచించారు. త్రిపురలో పాతికేళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష కూటమి సర్కారును కూల్చి.. బీజేపీ కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోండి
-
‘కమీషన్ల కోసం చంద్రబాబు పోలవరం చేపట్టారు’
సాక్షి, తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లొచ్చినా సాధించింది మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఆదివారం జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. పోలవరం విషయంలో సెక్షన్ 90ని ఏపీ అమలు చేయడం లేదని తెలిపారు. ఏపీ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టకును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని ఉందని స్పష్టం చేశారు.. కమీషన్ల కోసం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టారని మండిపడ్డారు. నాలుగేళ్లలో ఏపీ సీఎం చంద్రబాబు 29సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారు.. కానీ ఆయన సాధించింది మాత్రం శూన్యమని జైరాం రమేష్ విరుచుకుపడ్డారు. కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు పోరాడలేకపోతున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఒక అవినీతి ప్రాజెక్టుగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీతో తాడోపెడో తేల్చుకోవాలని జైరాం రమేష్ సూచించారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని ఇటీవల విమర్శించిన జైరాం రమేష్.. రాష్ట్ర విభజన సమయంలో కడపలోని స్టీల్ ప్లాంట్, వైజాగ్‌లో పెట్రోలియం యునివర్శిటీ, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నట్లు మరోసారి గుర్తుచేశారు. -
‘టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ..!’
-
‘టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ..!’
సాక్షి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఒక అంశాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని జైరాం విమర్శించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు పోరాడలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరు కలిసి డ్రామాలాడుతున్నారని జైరాం రమేష్ అన్నారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో.. కడపలోని స్టీల్ ప్లాంట్, వైజాగ్‌లో పెట్రోలియం యునివర్శిటీ, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో పెట్టామని జైరాం తెలిపారు. అంతేకాక పోలవరం ప్రాజెక్టు ఒక అవినీతి ప్రాజెక్టుగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే బీజేపీతో తాడోపెడో తేల్చుకోవాలని జైరాం రమేష్ సూచించారు. -
ఈ సంక్షోభం స్వయంకృతాపరాధం
విశ్లేషణ నరేంద్రమోదీ, అమిత్ షాలు కాంగ్రెస్ ముక్తి భారత్ గురించి ఎంత గట్టిగా చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయాలని వారు కోరుకోవడం లేదు. కాంగ్రెస్ అలా నామమాత్రపు జవజీవాలతో కొనసాగితేనే, బీజేపీకి వ్యతిరేకంగా నిజమైన ప్రత్యామ్నాయం ఏర్పడకుండా ఉంటుంది. చేదు వాస్తవం మాట్లాడితే కలిగే ప్రభావం ఏదంటే... అలా మాట్లాడినవారు చాలా బాధపడాల్సి వస్తుంది. నిజాన్ని ఎంత గట్టిగా చెప్పితే అంత ఎక్కువ నొప్పి కలుగుతుంది కూడా. జైరాం రమేష్ విషయంలో ఇలాంటిదే జరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, కాంగ్రెస్ మనుగడకు సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జైరాం అంగీకరించారు. ఈ సంక్షోభం 1977లో లేదా 1989లో లేదా 1998లో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఎన్నికల్లో పరాజయానికి సంబంధించిన సంక్షోభం లాంటిది కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేతిలో రాజ్యాధికారం లేదుకానీ, కాంగ్రెస్ వాదుల్లో రాచరిక పోకడలు ఏమాత్రం తొలగిపోలేదని కూడా జైరాం అన్నారు. ఏ జర్నలిస్టుతోనైనా, రాజకీయవాదితోనైనా లేక ఏ కాంగ్రెస్ కార్యకర్తతో అయినా మాట్లాడండి.. ఇదే విషయాన్ని వీరంతా మాట్లాడటం మీరు చూస్తారు. జైరాం రమేష్ చేసిన తప్పు ఏదంటే.. తన అభిప్రాయాన్ని నాలుగ్గోడల మధ్య చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆయన బహిరంగంగా చెప్పారు. ఆయన మాట్లాడింది నిజమే కాబట్టి ఇరుకున పడ్డారు. అందుకే ప్రతి ఛోటా మోటా కాంగ్రెస్ నేత కూడా ఇప్పుడు జైరాంపై దాడి చేస్తున్నారు. వాస్తవానికి జైరాం రమేషే అసలు సిసలు సుల్తాన్ అంటూ కొంతమంది చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచి కాకుండా దొడ్డి తోవ ద్వారా అధికారంలోకి వచ్చాడు కాబట్టే జైరాం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, తనపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని కొంతమంది వ్యాఖ్యానించారు. కానీ జైరాం రమేష్ చెప్పింది నిజం కాదని ఏ ఒక్కరూ ఇంతవరకు పేర్కొనలేదు. కాంగ్రెస్ ఈ ప్రశ్నను ఎదుర్కోవడానికి ముందుకు రాకపోవచ్చు కానీ కాంగ్రెస్ మినహా తక్కిన దేశం ఈ ప్రశ్నను తృణీకరించలేదు. ఈ దేశ భవిష్యత్తులో కాంగ్రెస్ పాత్ర ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఇకపై ఈ దేశ రాజకీయాల్లో ఒక అర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఉండగలుగుతుందా? తన పునాదులపై జరుగుతున్న దాడులనుంచి ఈ దేశాన్ని కాపాడటంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందా? ఇది కాంగ్రెస్‌కు సంబంధించిన ప్రశ్నే కాదు. ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేముందు ఎవరైనా సరే దురవగాహనల నుంచి బయటపడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సమస్య దాని నాయకత్వమే అని చాలామంది భావిస్తున్నారు. రాహుల్ గాంధీని విమర్శించే కాంగ్రెస్ కార్యకర్తలకు కొదవ లేదు. సోషల్ మీడియాకేసి చూస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు మూల కారణం రాహుల్ గాంధీయే అని వ్యాఖ్యలు కనబడతాయి. కానీ ఇలాంటి వాదనల్లో వివేచన కనిపించదు. రాహుల్ గాంధీ.. మీడియా చిత్రిస్తున్నంత అపరిణిత, నిజాయితీ రహిత వ్యక్తి కాదు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అవసరమైన రాజకీయ అవగాహన రాహుల్‌లో లోపించిందనడంలో సందేహమే లేదు. రాహుల్ గాంధీ వంటి నేత కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థానంలో ఉండటంలో సంక్షోభం లేదు. కానీ నిజమైన సంక్షోభం ఏమిటంటే, రాహుల్ వంటి నేత మాత్రమే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానంలో ఉండటమే. ప్రజల్లో పలుకుబడి కలిగిన నేతలు కానీ, సైద్ధాంతిక విశ్వాసం కలిగిన వ్యక్తులుకానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నత స్థానాలను అలంకరించలేరు. కాంగ్రెస్ సంక్షోభం వెనుక ఉన్న కారణం రాహుల్ కాదు. తాను ఆ సంక్షోభపు ప్రతిఫలనం మాత్రమే. వాస్తవం ఏమిటంటే పైనుంచి కింది స్థాయి వరకు కాంగ్రెస్ నేడు సంక్షోభంలో ఉంది. అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి వలంటీర్ల వరకు పార్టీ పట్ల అంకితభావం లోపించింది. కాంగ్రెస్ పార్టీలోని సంక్షోభం భవిష్యత్తుపై దాని దార్శనికతకు సంబంధించిన సంక్షోభం. ఈరోజు ఏ అంశంలోనైనా పార్టీ వైఖరి ఏమిటన్నది కాంగ్రెస్‌కే తెలీడం లేదు. మోదీ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను వ్యతిరేకించడం చాలా సులభం. కానీ ఎమర్జెన్సీకి కారకురాలైన, గాంధీ కుటుంబానికి పరిమితమైపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి నిజంగా దోహదపడుతుందా? పెద్ద నోట్ల రద్దు లేదా జీఎస్టీపై బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ఒక అంశం మాత్రమే. కానీ బీజేపీ విధానాలకు ఒక ప్రత్యామ్నాయమైనా కాంగ్రెస్ పార్టీలో ఉందా? మన్మోహన్, మోదీ ఇద్దరి ఆర్థిక విధానాలను తీర్చిదిద్దిన ఆర్థిక చింతననుంచి బయటకు రావడానికి కాంగ్రెస్ నిజంగా సిద్ధంగా ఉందా? నేడు బీజేపీకి కాంగ్రెస్‌కు మధ్య ఒకే ఒక్క వ్యత్యాసం ఉంది. బీజేపీ ముస్లిం వ్యతిరేక వైఖరిని బహిరంగంగా ప్రదర్శిస్తూ, అన్ని మైనారిటీ వర్గాల పట్ల ద్వేషాన్ని బహిరంగంగా ప్రోత్సహిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనస్తత్వం దీనికి భిన్నంగా లేదు కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం మైనారిటీలకు అనుకూలంగా ఉంటూ తమను లౌకికవాదులుగా పిలవాలని కోరుకుంటున్నారు. ఈ లౌకిక వైఖరి ముసుగు వెనుక సైద్ధాంతిక విశ్వాసం కంటే ఓట్లకోసం నిస్సహాయతే ఎక్కువగా కనిపిస్తుంటుంది. లౌకిక భారతం కోసం హిందువులలో స్పందనను కాంగ్రెస్ ఇప్పుడు కూడగట్టలేదు. అదే సమయంలో మైనారిటీలలో భద్రతా భావాన్ని పెంపొందించలేదు. లౌకిక భారత స్వప్నాన్ని కాపాడటం కంటే ఈ భావనకే అప్రదిష్ట తెచ్చే సాధనంగా కాంగ్రెస్ మారిపోయింది. ఏం చేయాలనే దానిపై దార్శనికతే లేనప్పుడు ఏ పార్టీకయినా ఒక పంథా ఎలా ఉంటుంది? బిహార్ సంకీర్ణంలో కానీ లేదా 2019 ఎన్నికల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక వ్యూహం లాంటిది కూడా లేదు. గుజరాత్లో తన సొంత పార్టీ సభ్యులను తమ నాయకుడికి ఓట్లు వేసేలా చేయడమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద విజయమైపోయింది. బీజేపీ అధికారంలో కొనసాగడానికి నేటి కాంగ్రెస్ పార్టీ ఒక ఉత్తమ హామీదారుగా ఉంటోంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మారలేదు. అదేసమయంలో ఏ ఇతర ప్రత్యామ్నాయాన్ని అది తయారు చేయలేదు. ఈరోజు దేశం నలుమూలలా రైతులు, యువత, దళితులు, ఆదివాసీలు, విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. ఈ ఆందోళనల్లోంచి కొత్త రాజకీయ ఉద్యమం ఆవిర్భవించడానికి కాంగ్రెస్ అనుమ తించలేదు. మోదీ, అమిత్ షాలు కాంగ్రెస్ ముక్తి భారత్ గురించి ఎంత గట్టిగా చెబుతున్నప్పటికీ కాంగ్రెస్‌నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయాలని వారిద్దరూ కోరుకోవడం లేదు. కాంగ్రెస్ నామమాత్రపు జవజీవాలతో కొనసాగడాన్నే వారు ఇష్టపడుతున్నారు. అప్పుడు మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా నిజమైన ప్రత్యామ్నాయం ఏర్పడకుండా ఉంటుంది మరి. జాతి హితం కోసం కాంగ్రెస్ పార్టీని రద్దుపర్చాలంటూ స్వాతంత్య్రానికి ముందు గాంధీ ఇచ్చిన సూచననే నేటి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సి ఉంది. నేటి కాంగ్రెస్ పార్టీని రద్దు చేయడమే దేశానికి ఉత్తమ ప్రయోజనకారి. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 Twitter: @_YogendraYadav -
అస్తిత్వ సంక్షోభంలో కాంగ్రెస్
పార్టీ నాయకుడు జైరాం రమేశ్ వ్యాఖ్య ► మోదీ, అమిత్‌షాలను కలసికట్టుగా ఎదుర్కోవాలి ►వీరిని ఎదుర్కొనేందుకు సాధారణ వ్యూహాలు సరిపోవు ► దేశం మారుతోంది.. కాంగ్రెస్ పార్టీ కూడా మారాలి కొచ్చి: కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్రమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ప్రధానిమోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షా నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే పార్టీ సీనియర్లంతా కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ, షాలను ఎదుర్కొనేందుకు సాధారణమైన వ్యూహాలు సరిపోవని, కాంగ్రెస్ సరైన విధానాలను అవలంబించాలని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1996 నుంచి 2004 వరకూ కాంగ్రెస్ అధికారంలో లేనికాలంలో కాంగ్రెస్ ఎన్నికల సంక్షోభాన్ని ఎదుర్కొందని, ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లో కూడా పార్టీ ఎన్నికల సంక్షోభాన్ని ఎదుర్కొందని చెప్పారు. అయితే ప్రస్తుతం పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇది ఎన్నికల సంక్షోభం కాదని, ఇప్పుడు పార్టీ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని స్పష్టం చేశారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికలో అహ్మద్æపటేల్‌ను గెలిపించేందుకు, బీజేపీ బెదిరింపులు, ఫిరాయింపులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించడంపై ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. ఈ నిర్ణయం సరైనదేనన్నారు. గతంలో బీజేపీ కూడా ఇలా ఎమ్మెల్యేలను తరలించిందని గుర్తుచేశారు. మార్పును గుర్తించాలి.. ప్రస్తుతం భారత్ మారిందనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తించాలని, పాత నినాదాలు, ఫార్మూలాలు పనిచేయవని, మారిన భారత్‌లాగే పార్టీ కూడా మారాలని సూచించారు. కొందరు పార్టీ నేతలు తామింకా అధికారంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని, ఇది మారాలని అన్నారు. 2018లో జరిగే కీలక అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల కంటే ముందే పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించే విషయంపై అస్పష్టతను తొలగించాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉందని, ఈ ఏడాది చివరి నాటికి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఇది తన అంచనా మాత్రమే అని పేర్కొన్నారు. -
వ్యక్తిగత దూషణలకు దిగితే ఖబడ్దార్
♦ కాంగ్రెస్ నేతలకు కర్నె ప్రభాకర్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ నాయకుడు జైరాం రమేశ్ మొదలు గల్లీ లీడర్ల దాకా రాష్ట్ర ప్రభుత్వంపై పదే పదే అనవసర విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు, మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, భానుప్రసాద్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. గాంధీ భవన్లో గాలి సామ్రాట్లు ప్రెస్మీట్లు పెడుతూ గాలి కూతల్లో డాక్టరేట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలను పదే పదే మాట్లాడితే నిజం అవుతాయనే భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, వారిని మించిన ఇసుక డాన్లు ఎవరూ లేరన్నారు. డ్రగ్స్‌ను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలే: జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లో డ్రగ్స్ సంస్కృతిని పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలేనని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ విమర్శలు చేయడం అంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. టీడీపీ హయాంలో హైదరాబాద్‌లో 3 పబ్‌లే ఉన్నాయన్న రేవంత్ దానిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. -
జైరాం రమేశ్‌వి దివాలాకోరు విమర్శలు
-
జైరాం రమేశ్‌వి దివాలాకోరు విమర్శలు
డాక్టర్ కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంక య్యనాయుడుపై కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్య లు దివాలాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వెంకయ్యపై నిరాధార ఆరో పణలు చేయడం బాధాకరమని అన్నారు. వెంకయ్య జీవితం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం పరిపాటేనని తెలి పారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకు పోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటువంటి మాటలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
పోలీసు వాహనాల కొనుగోలులో కుంభకోణం
-
కంపెనీ ఉందని నిరూపిస్తే రాసిస్తా: కేటీఆర్
హైదరాబాద్: తనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని తమపై ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. జైరాం రమేశ్ ఎప్పుడైనా ప్రజల ఓట్లతో గెలిచారా అని ప్రశ్నించారు. తనకు కంపెనీ ఉందని నిరూపిస్తే కాంగ్రెస్ నేతలకు రాసిస్తానని ప్రకటించారు. జైరాం రమేశ్‌కు సిగ్గు శరం ఉంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇసుకాసుర పాలన జరిగిందని విమర్శించారు. ఇసుకపై ఈ ఏడాది రూ.600 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ‘మీలా కుంభకోణాల్లో ఇరుక్కుపోయే అలవాటు మాకు లేద’ని వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. దిగ్విజయ్ సింగ్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. సిరిసిల్లకు పోయి ఏం చెబుతారు, ఉరిసిల్లగా మార్చామని చెబుతారా అని ప్రశ్నించారు. ఉనికి ఉండదేమోనన్న భయంతో విపక్షాలు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాయని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
కంపెనీ ఉందని నిరూపిస్తే రాసిస్తా
-
జైరాం ప్రశ్న.. వెంకయ్య జవాబు
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి 4 అంశాలను ఆధారాలతో పాటు బయట పెడుతున్నానని, వీటికి వెంకయ్య తక్షణం బదులివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారిపై అవినీతి ఆరోపణలుండరాదని చెప్పిన ప్రధాని మోదీ దీనిపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. జైరాం ఆరోపణలన్నీ అవాస్తవాలని వెంకయ్య కొట్టిపారేశారు. ‘‘ఇదంతా రాజకీయ కక్ష సాధింపే. ఈ ప్రశ్నలకు నేనెప్పుడో బదులిచ్చాను. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు రాజకీయ దురుద్దేశంతోనే మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఇది కాంగ్రెస్ రాజకీయ దివాళాకోరుతనానికి ఉదాహరణ’’ అంటూ విమర్శించారు. ప్రజలు వాస్తవం తెలుసుకోవాల్సి ఉందంటూ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ 1 జైరాం: వెంకయ్య కూతురు దీప ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ భారత్ ట్రస్టుకు 2017 జూన్ 20న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ రూ.2 కోట్ల పన్ను మినహాయింపు ఇవ్వడం నిజం కాదా? వెంకయ్య: సమాజసేవను ప్రోత్సహించేందుకే తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. మా ట్రస్టుకే కాకుండా చాలా స్వచ్ఛంద సంస్థలకు మినహాయింపు ఇచ్చామంటూ స్పష్టత ఇచ్చింది. ఓ స్వచ్ఛంద సంస్థగా నైపుణ్యాభివృద్ధి తదితరాలకు శిక్షణ ఇస్తున్నందుకే మినహాయింపు ఇచ్చామని చెప్పింది. 2 జైరాం: వెంకయ్య కుమారుడు యజమానిగా ఉన్న హర్ష టొయోటా, కేసీఆర్ కుమారుడు యజమానిగా ఉన్న హిమాన్షు మోటార్స్‌తో పోలీసు వాహనాల కోసం 2014 జూలైలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు వేయకుండానే రూ.271 కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడం నిజం కాదా? వెంకయ్య: మా పిల్లల వ్యాపారానికి నేను చాలా దూరంగా ఉంటాను. తెలంగాణ ప్రభుత్వం హర్ష టొయోటాతో నేరుగా ఒప్పందం కుదుర్చుకోలేదు. టొయోటా కిర్లోస్కర్ (తయారీదారు)తోనే కుదుర్చుకుంది. చెల్లింపు కూడా టయోటా కిర్లోస్కర్‌కే జరిగింది. దీనితోనూ, సరఫరాతోనూ హర్ష టొయోటాకు సంబంధమే లేదు. 3 జైరాం: భోపాల్‌లోని షాపురాలో వందల కోట్ల విలువైన 20 ఎకరాలను 2004 సెప్టెంబర్ 25న వెంకయ్య చైర్మన్‌గా ఉన్న కుశభావ్ ఠాక్రే మెమోరియల్ ట్రస్టుకు కట్టబెట్టడం అబద్ధమా? మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం రూ.25 లక్షల ప్రీమియం, అదీ ఒకసారి మాత్రమే చెల్లించేలా, ఏడాదికి రూ.1 అద్దె చెల్లించేలా భూమి కట్టబెట్టలేదా? ఈ ఒప్పందాన్ని 2011 ఏప్రిల్ 6న సుప్రీంకోర్టు తిరస్కరించడం నిజం కాదా? వెంకయ్య: అప్పట్లో నేను బీజేపీ జాతీయాధ్యక్షుడి హోదాలో మాత్రమే ఆ ట్రస్టుకు చైర్మన్‌గా ఉన్నా. భూ కేటాయింపులో నాకు సంబం ధమే లేదు. ట్రస్టులకు ఈ పద్ధతిలోనే భూములు కేటాయిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాలున్న చోటా ఇలాంటి నిబంధనలే ఉంటాయి. 4 జైరాం: వెంకయ్య బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉండగా నెల్లూరులో నిరుపేదలకు కేటాయించిన 4.95 ఎకరాలను లాక్కున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రజలు ఆగ్రహించటంతో 2002 ఆగస్టు 17న ఆ భూమిని పేదలకే తిరిగి అప్పగించడం నిజం కాదా? వెంకయ్య: దీన్ని 2002లోనే స్థానిక కాంగ్రెస్ నేత లేవనెత్తారు. కోర్టుకెళ్లారు. భూమిని లాక్కున్నారనే ఆరోపణలను కోర్టులు కొట్టేశాయి. -
‘ఆధార్’ తప్పనిసరేం కాదు
సబ్సిడీలు కొనసాగుతాయని రాజ్యసభలో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ: సంక్షేమ పథకాల పరిధి నుంచి లబ్ధిదారుల్ని తప్పించేందుకే ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శల్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆధార్ అనుసంధానంతో ఏ పేద వ్యక్తి సబ్సిడీ లబ్ధి కోల్పేయే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఆధార్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ప్రతిపక్షాల అభ్యంతరాలకు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ సమాధానమిస్తూ... ‘పేదలకున్న సబ్సిడీ హక్కును నిరాకరించం. మధ్యాహ్న భోజనం, ఇతర పథకాల లబ్ధికి ఆధార్‌తో రమ్మని చెపుతున్నాం. పథకాల లబ్ధిని తిరస్కరించడం లేదు’ అని అన్నారు. సబ్సిడీ పథకాల నుంచి లబ్ధిదారుల్ని తొలగించేందుకు ఆధార్ వ్యవస్థను వాడుకుంటున్నారని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ ఆరోపించారు. సీబీఐ, ఈడీల దుర్వినియోగం: ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, సీబీఐల్ని ప్రయోగిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సభ కార్యక్రమాల్ని పక్కనపెట్టి... ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేయడంతో రాజ్యసభ రెండు సార్లు వాయిదాపడింది. బీజేపీ సీఎంల మనీ ల్యాండరింగ్ విషయంలో సీబీఐ, ఈడీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. దక్షిణాది ప్రజలు భారతీయులు కాదా?: ఖర్గే బీజేపీ నేత తరుణ్ విజయ్ జాతి వివక్ష వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. విజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నాయి. దీంతో సభ మూడు సార్లు వాయిదా పడింది. -
నాడు మోదీది ఎంత చక్కటి నవ్వో
న్యూఢిల్లీ: దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు పరస్పరం జోకులేసుకోవడం, వాటికి పగలబడి నవ్వడం చాలా అరుదు. ఇక ప్రసంగాల విషయానికొస్తే అరవీర భయంకరుల్లా గంభీరోపన్యాసాలిస్తారు. అప్పడప్పుడు మాత్రమే భావోద్వేగంతో ప్రసంగాన్ని రక్తికట్టిస్తారు. హాస్యానికి అవకాశం ఇవ్వరు. ఇక మన ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంభీరంగా ప్రసంగించడంలో మొదటి నుంచి ఆరితేరిన వారు. ‘మీ ఉపన్యాసాలన్నీ హాస్యం లేకుండా ఎందుకంత గాంభీర్యంగా సాగుతాయి?’ అని ఓ దశాబ్దం క్రితం ఓ టీవీషోకు హాజరైన నరేంద్ర మోదీని ప్రశ్నించగా, ‘రాజకీయ నాయకుల ప్రజా జీవితంలో హాస్యం చోటులేదన్న భయం నాకుంది. చాలా మందికి అలాంటి భయం ఉంటుంది. అలాగే నాకు అలాంటి భయం ఉంది’ అని సమాధానమిచ్చారు. ప్రసంగాల్లో తన గాంభీర్యానికి కారణం చెప్పిన మోదీ అదే టీవీ షోలో చాలా ఉల్లాసంగా, చాలా చక్కగా నవ్వుతూ తనలో కూడా హాస్యం ఉందని చాటి చెప్పారు. ‘మీరు బీజేపీ పార్టీని వదిలిపెట్టాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఖాళీ వుంటే వచ్చి చేరుతారా?’ అని అదే షోలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ప్రశ్నించగా, ‘నేను సంఘ్ పరివార్ నుంచి వచ్చాను. నా వల్ల మీకు ఎన్నో సమస్యలు వస్తాయి’ అంటూ ఆయన నవ్వారు. ఈ షోలో పాల్గొన్నప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా లేరు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అప్పుడు జైరామ్ రమేష్, మోదీలు యువకులుగానే ఉన్నారు. వారిద్దరితో జర్నలిస్ట్ వీర్ సాంఘ్వీ నిర్వహించిన టీవీ షోకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టీవీ షోలో మోదీ ఇచ్చిన సమాధానాలు చారిత్రాత్మకం అంటూ సోషల్ మీడియాలో కొంత మంది మోదీని ప్రశంసిస్తున్నారు. అప్పటి టీవీ చర్చాగోష్టుల్లో వివిధ పార్టీల రాజకీయ నాయకుల మధ్య వ్యంగ్యాస్త్రాలు, చలోక్తులు ఉన్నప్పటికీ ఇప్పటిలాగా అరుపులు, కేకలు, తిట్లు ఉండేటివి కావు. -
నాడు మోదీది ఎంత చక్కటి నవ్వో
-
పోలవరం నిర్మాణాన్ని రాష్ట్రానికెలా ఇస్తారు?
ప్యాకేజీ కంటి తుడుపే: జైరాం రమేశ్ సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేయాలంటే ఏపీ పునర్విభజన చట్టానికి సవరణ చేయాల్సిందేనని, ఆ సవరణ ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆప్తులైన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికే పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తోందని, దీని వల్ల ఓ టీడీపీ ఎంపీ లబ్ధిదారుడవుతారని ఆరోపించారు. మాజీ ఎంపీ జేడీ శీలంతో కలిసి ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రమే పోలవరం ప్రాజెక్టును అమలు చేయాలని విభజన చట్టం స్పష్టంగా పేర్కొందని, అందువల్ల రాష్ట్రానికి పోలవరం అమలు బాధ్యతలను బదిలీ చేయాలంటే చట్టాన్ని సవరించాలని చెప్పారు. ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదని, ఇది కంటితుడుపు చర్యగా జైరాం అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఏడాదికి రూ.60 వేల కోట్ల మేరకు లాభం ఉండేదని మాజీ ఎంపీ జేడీ శీలం చెప్పారు. -
జైరాం రమేశ్ పై చర్యలు తీసుకోవాలి: వీహెచ్
ఆదిలాబాద్: సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్ మోసం చేశారని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు విమర్శించారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ను వదిలివెళ్లినవారు పార్టీలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనపై జైరాం రమేశ్ ను ఎవరు పుస్తకం రాయమన్నారని ఆయన ప్రశ్నించారు. జైరాం రమేశ్ పై హైకమాండ్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీకే అరుణ మాట్లాడుతూ.. ఒకేసారి రైతు రుణాలు మాఫీ చేయకుండా విడతలవారీగా చేస్తూ అన్నదాతలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి తప్పుడు హామీలవల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చివుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని పేర్కొన్నారు. -
'జైట్లీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై సభను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై రాజ్యసభ ఛైర్మన్ కురియన్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో జైరాం రమేష్ విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు లింకు పెట్టడం ఆయన సరికాదన్నారు. -
'జైట్లీపై హక్కుల ఉల్లంఘన నోటీసు'
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ సోమవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నారు. రాజ్యసభలో శుక్రవారం కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత ఈ విషయాన్ని జైరాం రమేశ్ విలేకరులకు చెప్పారు. వాస్తవానికి ఈ విషయాన్ని జైరాం రమేశ్ రాజ్యసభలో ప్రస్తావించారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14 వ ఆర్థి సంఘం చెప్పిందంటూ జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని జైరాం రమేశ్ పేర్కొన్నారు. అందుకు స్పందించిన డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభా హక్కుల తీర్మానం ప్రతిపాదించాల్సిందిగా సూచించారు. -
కేవీపీ బిల్లుపై ప్రభుత్వం అభ్యంతరం
≈ ద్రవ్యబిల్లుపై ఓటింగ్‌కు రాజ్యసభకు అధికారం లేదన్న జైట్లీ ≈ నిర్ణయం కోసం లోక్‌సభ స్పీకర్‌కు పంపిన రాజ్యసభ ≈ తానిచ్చిన హామీని గౌరవించాలన్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ≈ వెల్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు.. సభ సోమవారానికి వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణించాలా? లేదా? అనే విషయాన్ని తేల్చడానికి లోక్‌సభ స్పీకర్ వద్దకు బిల్లును పంపుతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ప్రకటించారు. అప్పటివరకూ దీన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. శుక్రవారం రాజ్యసభలో కేవీపీ బిల్లుపై ఓటింగ్ చేపట్టాల్సిన సమయంలో బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవీపీ బిల్లు ద్రవ్యబిల్లుగా పేర్కొంటూ..రాజ్యసభలో ఓటింగ్ చేపట్టలేమన్నారు. రాజ్యాంగంలోని అర్టికల్ 117 ను ఉటంకిస్తూ, ఆ బిల్లును లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలన్నారు. ద్రవ్య బిల్లు అవునా, కాదా అనే వివాదం ఏర్పడినప్పుడు లోక్‌సభ స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర పథకాలలో 90 శాతం నిధులు కేంద్రం అందిస్తుందని, అదే విధంగా ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలకు సంబంధించి నిధుల వినియోగం ముడిపడి ఉందన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నామని, రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. ఈ అభ్యంతరాలపై సభ్యుల అభిప్రాయాలను కురియన్ కోరారు. నాటి ప్రధాని హామీల మాటేమిటి? రాజ్యసభలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తారా లేదా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేవీపీ బిల్లు ద్రవ్య బిల్లు అవునా, కాదా అన్నది సమస్య కాదని, రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను గౌరవిస్తారా లేదా? తేల్చాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14 వ ఆర్థిక సంఘం చెప్పిందని ఆర్థిక మంత్రి జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని జైరాం రమేశ్ చెప్పారు. ద్రవ్య బిల్లుగా పేర్కొనడాన్ని కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్ తప్పుబట్టారు. చర్చ ముగిసిన తర్వాత ద్రవ్య బిల్లు అనడం సరికాదని సమాజ్‌వాది పార్టీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ చెప్పారు. జీఎస్టీ బిల్లును అడ్డుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని టీడీపీ సభ్యుడు సీఎం రమేశ్ చెప్పారు. ఉభయ పక్షాల వాదన విన్న తర్వాత బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు పంపిస్తున్నట్లు కురియన్ ప్రకటించడంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటించారు. బిల్లుపై అనవసర రాద్ధాంతం: కేవీపీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్రపతి అనుమతి ఉందని, చర్చ పూర్తయిన సమయంలో ద్రవ్య బిల్లు అనడంలో అర్థం లేదని కేవీపీ విమర్శించారు. గతంలో కూడా ఈ విధమైన రెండు బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపిందన్నారు. కేంద్రం హామీలను అమలు చేయకపోవడం వల్లే బిల్లు ప్రవేశపెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదాను కేంద్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో ఇవ్వవచ్చన్నారు. హామీలను అమలు చేయాలి ఏపీ విభజన సమయంలో ప్రధానిగా రాజ్యసభలో తాను ఆరు హామీలు ఇచ్చానని,వాటిని అమలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. అప్పట్లో విపక్షంలో ఉన్న జైట్లీ ఆ హామీలపై సంతృప్తి చెందారని, విభజన బిల్లుకు ప్రతిపాదించిన సవరణలను ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు.కేబినెట్లో తీర్మానించి, రాష్ట్రపతికి పంపించామని, ఎన్నికల షెడ్యూల్ వల్ల ఆర్డినెన్స్ జారీ కాలేదని తెలిపారు. అప్పటి హామీలను గౌరవించి అమలు చేయాలని ఆయన కోరారు. -
జైరాం రమేష్, కురియన్ మధ్య వాగ్వాదం
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టి ప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్, డిప్యూటీ చైర్మన్ కురియన్ మధ్య రాజ్యసభలో తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బిల్లు చర్చ ముగిసిందని కురియన్ ప్రకటించడంతో జైరాం రమేష్ అభ్యంతరం తెలిపారు. పునర్ వ్యవస్థీకరణ అంశాలపై మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించగా, కేవీపీ ప్రైవేట్ బిల్లుపైనే మాట్లాడాలని డిప్యూటీ చైర్మన్ సూచించారు. పునర్ వ్యవస్థీకరణపై బిల్లుపై ఇప్పటికే చాలాసార్లు చర్చించామన్నారు. కేవీపీ బిల్లు ద్రవ్యబిల్లా కాదా అన్నదానిపైనే ప్రస్తుతం చర్చ అని కురియన్ పేర్కొన్నారు. అయితే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ జైరాం రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత మాట్లాడిన కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్ విభజన హామీలు నెరవేర్చాలని..మనీ బిల్లు అనడం సమంజసం కాదన్నారు. అయితే కేవీపీ బిల్లు మనీబిల్లా కాదా అనేది లోక్‌సభ స్పీకర్‌ను అడుగుతామంటూ కురియన్ మరో చర్చలోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. తరువాత సభ సోమవారానికి వాయిదా పడింది. అంతకు ముందు కపిల్ సిబల్ మాట్లాడుతూ దేశ చట్టసభల్లో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క బిల్లు ద్రవ్య బిల్లేనన్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణిస్తూ...ఓటింగ్ జరగకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కపిల్ సిబల్ విమర్శించారు. అలాగే ఏపీ విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు..... విలువుందో లేదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని సీపీఐ ఎంపీ సీతారం ఏచూరి డిమాండ్ చేశారు. ఏపీకి సంబంధించి రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఏచూరి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కాగా ప్రైవేట్ బిల్లును ద్రవ్య బిల్లుగా కేంద్రం పరిగణించడం సరికాదని కేవీపీ రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ బిల్లు ప్రతి ఒక్క సభ్యుడి హక్కు అని తెలిపారు. ఆనాడు పార్లమెంట్లో ప్రధాని ఇచ్చిన హామీలే అమలు చేయమంటున్నామని, ప్రత్యేక హోదా అమలు చేయడానికి చట్టం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి అశలు వమ్ము చేయొద్దని అన్నారు. తన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యుడికి, ప్రతి ఒక్కపార్టీకి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
14వ ఆర్థిక సంఘం ఆ సిఫారసు చేయలేదు
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: జైరాం న్యూఢిల్లీ: టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఆయన బుధవారం ఢిల్లీలో ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఏపీకి ఇచ్చిన హామీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. హోదా విషయంలో ఏపీ ప్రజలను, పార్లమెంట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. హోదా ఇవ్వకపోవడానికి రాజ్యాంగాన్ని, 14వ ఆర్థిక సంఘాన్ని కారణాలుగా చూపడం సబబు కాదన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ సిఫారసు చేయలేదని గుర్తుచేశారు. ‘‘గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అప్పటి ఆర్థిక సంఘం సిఫారసులను వ్యతిరేకిస్తూ ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి వాజ్‌పేయిని కలిశారు.అలాంటిది ఇప్పుడెందుకు స్పందించడం లేదు.హోదాపై టీడీపీ ద్వంద్వ ైవె ఖరికి ఇదే నిదర్శనం. విభజన చట్టంలోని హామీలను అమలులో బీజేపీ-టీడీపీ విఫలమయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. తప్పుకో బాబూ: ఎన్.రఘువీరారెడ్డి ప్రత్యేక హోదా సాధించడం చేతకాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు పదవి నుంచి తప్పుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఆరుణ్ జైట్లీ ప్రకటనతో తన ర క్తం మరిగిపోతోందంటూ నాటకాలు ఆడడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. -
'అది తెలుగు డ్రామా పార్టీ'
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ.. తెలుగు డ్రామా పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఆయన బుధవారం ఢిల్లీలో ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఏపీకి ఇచ్చిన హామీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. హోదా విషయంలో ఏపీ ప్రజలను, పార్లమెంట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. హోదా ఇవ్వకపోవడానికి రాజ్యాంగాన్ని, 14వ ఆర్థిక సంఘాన్ని కారణాలుగా చూపడం సబబు కాదన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ సిఫారసు చేయలేదని గుర్తుచేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అప్పటి ఆర్థిక సంఘం సిఫారసులను వ్యతిరేకిస్తూ ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి వాజ్‌పేయిని కలిశారు. అలాంటిది ఇప్పుడెందుకు స్పందించడం లేదు. ప్రత్యేక హోదాపై టీడీపీ ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనం. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో బీజేపీ-టీడీపీ విఫలమయ్యాయి. ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. -
'జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు'
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక సంఘం అనేక సిఫార్సులు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. వాటిని అంగీకరించాలా? లేదా ? అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కె.వి.పి.రామచంద్రరావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన జైరాం రమేష్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయాలు, పంపకాలపైనే అధికంగా ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. సహజంగానే కొన్ని రాష్ట్రాలు వీటిని అంగీకరిస్తాయని చెప్పారు. కానీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని జైరాం రమేష్ ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఆర్థిక సంఘం రద్దు చేయలేదన్నారు. అందుకు సంబంధించిన మేయిల్ను జైరాం రమేష్ బయటపెట్టారు. అలాగే 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రద్దుకు సంబంధించి ఎలాంటి సిఫార్సు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఆ ఆర్థిక సంఘంలోని కీలక సభ్యుడు అభిజిత్ సేన్ నిన్ననే తనకు ఈ మెయిల్ చేశారని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల ఆదాయాన్ని 32 శాతం నుంచి 42 శాతానికి మాత్రమే పెంచిందని తెలిపారు. అందులో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, లేని రాష్ట్రాలు అంటూ ఏమీ విడదీయలేదని వెల్లడించారు. అన్నింటికీ అదే సూత్రాన్ని వర్తింప చేసిందన్నారు. కానీ, ప్రత్యేక హోదా అంశం రద్దుకు ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. కానీ ఆర్థిక మంత్రి సభనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వాలా? లేదా? అన్నది మోదీ ప్రభత్వం ఇష్టం అని చెప్పారు. కానీ 14వ ఆర్థిక సంఘం మీద నెడుతూ... అబద్దాలు చెప్తున్నారని బీజేపీ నేతలను విమర్శించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం తనకు తానుగానే ప్రత్యేక హోదాను రద్దు చేసిందన్నారు. దేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని జైరాం రమేష్ గుర్తు చేశారు. వాటిలో ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందన్నారు. ప్రత్యేక హోదా రద్దు అన్నది రాజకీయంతో తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీల మధ్య సంబంధాలు నామమాత్రమైనవి కావని... ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. ఏపీ పునర్ విభజన చట్టంలో హామీలు అమలు చేయడంలో మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. తిరుపతి ఐఐటీ ప్రారంభానికి , తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ మొదలుపెట్టడానికి రెండేళ్ల సమయం తీసుకున్నారన్నారు. ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘానికి సంబంధమే లేదని.. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రమే అని జైరాం రమేష్ స్పష్టం చేశారు. -
గడచిన చరిత్ర- తెరచిన అధ్యాయం పుస్తకావిష్కరణ
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ రచించిన పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. 'గడచిన చరిత్ర- తెరచిన అధ్యాయం' పేరుతో రచించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టీస్ సుదర్శన్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రొఫెసర్ కోదండరామ్, 'సాక్షి' ఈడీ కే రామచంద్రమూర్తి, ఎమెస్కో విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే విభజనకు అర్థముంటుందన్నారు. హైకోర్టు విభజన బాధ్యత కేంద్రానిదే అన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్‌కు ఆత్మహత్యాసదృశమే అని జైరాం రమేష్ పేర్కొన్నారు. అయితే.. డిసెంబర్ 9 ప్రకటన తరువాత తెలంగాణపై కాంగ్రెస్ ఎందుకు వెనక్కిపోయిందో జైరాం రమేష్ రాయలేదని కే రామచంద్రమూర్తి అన్నారు. ఇకపోతే.. అదిష్టానాన్ని కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించినప్పటికీ అతణ్ని సీఎం పదవి నుంచి ఎందుకు తొలగించలేదో కూడా జైరాం రమేష్ చెప్పలేదన్నారు. -
హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటుకే మొగ్గిన నెహ్రూ
‘ది నిజాం బిట్వీన్ మొఘల్స్ అండ్ బ్రిటిష్’ పుస్తకావిష్కరణలో జైరాంరమేశ్ సాక్షి, హైదరాబాద్ : నాటి హైదరాబాద్ సంస్థానాన్నే హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలుత మొగ్గు చూపారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ చెప్పారు. ఆ తర్వాత మూడేళ్లకు ఆంధ్ర, తెలంగాణలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారన్నారు. నిజాం పాలన చివరి రోజుల్లో తప్పిదాలు జరిగాయని, అయితే హిందూ-ముస్లిం సమైక్యత, పరమత సహనం, విశ్వజన సంస్కృతి విషయంలో లౌకికత్వానికి హైదరాబాద్ సంస్థానం ప్రతిరూపంగా ఉండేదని జైరాం అన్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ వసంత్‌కుమార్ బవా రచించిన ‘ది నిజాం బిట్వీన్ మొఘల్స్ అండ్ బ్రిటిష్’ పుస్తకాన్ని శనివారం ఇక్కడ జైరాం ఆవిష్కరించి మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును నెహ్రూ, అంబేడ్కర్, రాజాజీ తదితరులు వ్యతిరేకించారని, హైదరాబాద్ ప్రాంత వైవిధ్యాన్ని, సంస్కృతిని పరిరక్షించాలని వారు భావించేవారని ఆయన తెలిపారు. అయితే 1956లో నాటి కేంద్ర హోం మంత్రి.. పార్లమెంట్లో రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని ప్రవేశపెట్టారని, అందులో హైదరాబాద్, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉండటం కొందరికే తెలుసని అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ పేరుతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర ప్రాంత నేతలు ఒత్తిడి తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్ పేరుతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. నిజాంల వల్లే తెలంగాణలో భద్రాచలం నిజాంల వల్లే భద్రాచలం పట్టణం తెలంగాణకు వచ్చిందని జైరాం రమేశ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురికానున్న భద్రాచలం ప్రాంతాన్ని రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఏ రాష్ట్రానికి కేటాయించాలన్న అంశంపై తీవ్ర చర్చ జరిగినప్పుడు నిజాం సంస్థాన భౌగోళిక స్వరూపాన్ని అనుసరించే సమస్యను పరిష్కరించామన్నారు. అప్పట్లో భద్రాచలం పట్టణం నిజాంల ఆధీనంలో ఉండేదని, రామాలయ కస్టోడియన్‌గా నిజాం పాలకులు ఉండేవారని తెలిపారు. అయితే, భద్రాచలం డివిజన్ మాత్రం ఆంధ్ర ప్రాంత పరిధిలో ఉండేదన్నారు. దీనిని అనుసరించే భద్రాచలం పట్టణాన్ని తెలంగాణకు, రెవెన్యూ డివిజన్‌ను ఏపీకి కేటాయించామన్నారు. కాగా, ఆంగ్లేయుల పాలనతోనే భారతదేశానికి పరమత సహనం అలవడిందని, అస్పృశ్యత దూరమైందన్న వాదనలో వాస్తవం లేదని పుస్తక రచయిత బవా తెలిపారు. హిందూ-ముస్లింల ఐక్యతకు హైదరాబాద్ లాంటి సంస్థానాలే నిదర్శనమన్నారు. -
నిప్పులు చెరిగిన జైరాం రమేష్
న్యూఢిల్లీ. బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జై రాం రమేష్ నిప్పులు చెరిగారు. వేలకోట్లరుణాలను ఎగవేసిన విజయ్ మాల్యాను, కుంభకోణానికి పాల్పడిన లలిత్ మోడీని భారతదేశానికి రప్పించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. మాల్య ఫంక్షన్ లకు హాజరవుతూంటే.. ప్రభుత్వం ఆయన్ని వెనక్కి రప్పించడంపై ఆసక్తి చూపడంలేదని విమర్శించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై స్పందించిన ఆయన ఎఫ్‌డీఐలకు 100 శాతం అనుమతిలిస్తూ చేసిన ప్రకటన ఆందోళన కలిగించేదిగా ఉందన్నారు. భారతదేశం యొక్క పర్యావరణ సమస్యలకు సమాధానంగా ఎఫ్‌డీఐ విధానాన్ని చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అటు చేతన్ చౌహాన్ నియామకంపై కూడా విమర్శించిన జైరాం రమేష్ ..ఇలా ఆర్బీఐ గవర్నర్ గా రఘురాజన్ కి ఇలా ఉద్వాసన పలుకుతూ..అలా ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) ఛైర్మన్‌గా భాజపా మాజీ ఎంపీ చేతన్ కు ఆహ్వానం పలికారని ఆరోపించారు. -
వారు ఆంధ్రులను మోసగించారు
కాంగ్రెస్ నేత, రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరామ్ రమేశ్ రచన ‘ఓల్డ్ హిస్టరీ, న్యూ జాగ్రఫీ’ ఈ నెల 15న విడుదల కాబోతోంది. అందులోని విభజన అంశం గురించి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైరామ్ వివరించారు. ముఖ్యాంశాలు... ప్ర: త్వరలో విడుదలవుతున్న మీ పుస్తకం ‘ఓల్డ్ హిస్టరీ, న్యూ జాగ్రఫీ’ (పాత చరిత్ర, కొత్త భూగోళ శాస్త్రం)లో ఆంధ్రప్రదేశ్ విభజనకు దారితీసిన చారిత్రక కారణాలు చర్చించారా? జ: ఔను. 1950 నుంచి, వైఎస్ఆర్గారు మరణించేవరకు ఉన్న సుదీర్ఘ చరిత్ర గురించి ఇందులో చర్చించాను. విభజన ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. దానిని చాలామంది విభజన వ్యతిరేకులు సౌకర్యంగా మరచిపోతున్నారు. 1960లలో జై తెలంగాణ ఉద్యమం జరిగినట్టే, 1970లలో జై ఆంధ్ర ఉద్యమం జరిగిందన్న సంగతిని కూడా విస్మరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం సరైనదేనని భావిస్తున్నారా? అది అనివార్యమేనా? ఆ నిర్ణయం తప్పో ఒప్పో నేను చెప్పలేను గానీ, విభజన అనివార్యమనే నేనను కుంటున్నాను. ఒక్క సీపీఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు విభజన కోసం గట్టిగానే అడిగాయి. టీడీపీ, వైఎస్ఆర్సీపీ లిఖితపూర్వకంగా కూడా కోరాయి. వాస్తవానికి టీడీపీ రెండుసార్లు కోరింది. కాలం గడిచే కొద్దీ విభజన ఫలితాలు అనుభవానికి వస్తాయని నా భావన. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ నగర చరిత్ర, సంస్కృతి, అక్కడ సాధిం చిన విజయాలు, దానికి ఉన్న బలం అన్నీ నాకు ఎంతో ఇష్టం. జరిగిందేమిటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి సాగింది. మీకు ఇంకొంత సమయం ఇచ్చి ఉంటే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును మరింత మెరుగ్గా తయారు చేయ గలిగి ఉండేవారన్న వాదనతో ఏకీభవిస్తారా? 2014 బిల్లు ప్రాథమికంగా తీవ్రమైన లోపాలు ఉన్నదేమీ కాదని నా అభిప్రాయం. సున్నితమైన సమతౌల్య ప్రక్రియ ఫలితం ఈ బిల్లు. దీనితో తెలంగాణ ఏర్పాటు కావడమే కాకుండా, మిగిలిన సీమాంధ్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందిం చినది. ఈ చట్టం రాజీతో జరిగిన కూర్పు. ఇందుకు నేను క్షమాపణలేమీ కోరడం లేదు. ఆ బిల్లులో ఎన్నో కొత్త అంశాలు చేరాయి. ఇవన్నీ నా పుస్తకంలో విస్తృతంగా చర్చించాను. ఎన్నికలకు ముందు విభజన విషయంలో సోనియాగాంధీ అడ్డదిడ్డమైన సల హాలు తీసుకుని నిరాశా పూరితమైన నిర్ణయం తీసుకున్నారా? ఆ నిర్ణయమే పార్టీ ఘోర వైఫల్యానికి దారి తీసిందని కూడా రుజువైంది. తెలంగాణ ఏర్పాటు విషయంలో జరిగిన రాజకీయ చర్చల గురించి నాకు తెలియదు. నా ప్రమేయం ఎక్కడి నుంచి అంటే, అక్టోబర్ 8, 2013న సాధారణ అవగాహన ఒప్పం దంలో నేను సభ్యుడినైన తరువాత నుంచి మాత్రమే. ఇది కచ్చితంగా రాజకీయ నిర్ణ యమే. కానీ చరిత్రతో సహా, చాలా అంశాలను దృష్టిలో ఉంచుకుని చేసిన నిర్ణయం. విభజన ప్రక్రియకు అడ్డంకులు సృష్టించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దుర్విని యోగం చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానవర్గం ఎందుకు అనుమతించింది? అదొక వ్యూహమా? అదే కదా వికటించింది! ఈ విషయం కూడా ప్రస్తావించాను. సోనియాగాంధీనీ, మన్మోహన్సింగ్నూ కూడా అలక్ష్యం చేసినప్పటికీ, పార్టీనీ, కేంద్ర ప్రభుత్వాన్నీ కూడా ఖాతరు చేయక పోయి నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎందుకు కొనసాగిస్తున్నారోనని నేను ఆశ్చర్య పోయిన సంగతిని కూడా అందులో వివరించాను. అయితే అప్పుడు అంతకు మించి ప్రత్యామ్నాయం లేదని తరువాత ఒక సీనియర్ నేత నాతో అన్నారు. పార్టీ రాష్ట్రాన్ని విభ జించాలనే నిర్ణయం తీసుకున్నాక, దానిని అమలు చేయడానికి ముఖ్యమంత్రి నిరాకరిం చినప్పుడు ఆయనను మార్చి ఉండవలసిందని నేను స్పష్టంగా భావించాను. నాయకురాలిని గందరగోళ పరుస్తూ దిగ్విజయ్‌సింగ్ వంటి నాయకులు విశ్వసించడానికి వీలులేని రీతిలో పోషించిన పాత్రను గురించి ఏమంటారు? వారికి ఇష్టం లేని, వారు వ్యతి రేకించే విధానాన్ని అర్థమనస్కంగా అమలు చేయడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. విశ్వసించదగని పాత్ర అంటూ ఎవరైనా పోషించారని నేను అనుకోను. ప్రతివారు తమకు పార్టీ లేదా ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను నిర్వర్తించారు. ఛత్తీస్‌గఢ్‌ను మధ్య ప్రదేశ్ నుంచి విభజించినప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దిగ్విజయ్‌సింగ్ ఉన్నారన్న సంగతిని విస్మరించరాదు. మీరు దిగ్విజయ్‌సింగ్ నిర్వహించిన బాధ్యతను విశ్వసించదగి నది కాదు అనడం అన్యాయమని నేను అనుకుంటున్నాను కూడా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు మూలం విభజన చట్టమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణ న్యాయమైనదేనా? ఎంతమాత్రం కాదు. చంద్రబాబునాయుడు తన వ్యక్తిగత వైఫల్యాలను, ముఖ్యంగా ప్రధాని మోదీ చేత విభజన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయించుకోవడంలో విఫలమై వాటిని కప్పిపుచ్చుకోవడానికే విభజన చట్టాన్ని తప్పుపడుతున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిపత్తి హోదాను ఐదేళ్లు ఇస్తామని అంటే, ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు తమ ప్రభుత్వం వస్తే పదేళ్లు ఇస్తామని ప్రకటించారు. ఆ హామీ ఇంతవరకు ఎందుకు అమలు కాలేదు? వెంకయ్య ఇచ్చిన హామీని మోదీ చేత చంద్రబాబు ఇంతవరకు ఎందుకు అమలు చేయించుకోలేక పోయారు? ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలన్నీ విభజన చట్టం మేరకు ఏర్పాటు చేస్తున్నవే. విభజన విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం విపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణ నలోనికి తీసుకుని ఉంటే మరింత సున్నితంగా సాగి ఉండేదని మీరు భావిస్తున్నారా? ప్రతివారి అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకున్నాం. పదేళ్ల పాటు చర్చలు జరి గాయి. సమస్య అంతా హైదరాబాద్ గురించే. దానితోనే విభేదాలు పెరిగాయి. జీహెచ్ ఎంసీని తెలంగాణకు ఇచ్చినప్పటికీ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఎందుకు ఉంచడం జరిగిందో కూడా పుస్తకంలో వివరించాను. ప్రత్యేక హోదా అంశం విభజన బిల్లులో ఎందుకు చోటు చేసుకోలేదు? 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌ను చట్టబద్ధంగా విభజించారు. అదే విధంగా తెలంగాణను కూడా విభజించడం జరిగింది. 2002లో ఆ రాష్ట్రానికి నాటి వాజ్‌పేయి ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది. అప్పుడు కేంద్రమంత్రి మండలిలో తెలుగుదేశం భాగస్వామి కూడా. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా మేం సరిగ్గా అదే బాటలో వెళ్లాం. ఈ అంశం కూడా నా పుస్తకంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోదీ, వెంకయ్యనాయుడు దగా చేశారు. -
నిజానికి మా పార్టీ చీఫ్ ఆయనే!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై జరగుతున్న చర్చ విషయమై ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీయేనని, ఆయన అధికారికంగా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చేవరకు మీనమేషాలు లెక్కించడం కంటే ఇప్పుడే ఎన్నికలకు పార్టీ సిద్ధం చేయాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉందని జైరాం అభిప్రాయపడ్డారు. భారత్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా మారాల్సిన తరుణం ఆసన్నమైందని, కమ్యూనికేషన్ విషయంలో పార్టీ పటిష్టంగా లేదని, వరుస ఎన్నికల ఓటమి నేపథ్యంలో మరింత దూకుడుగా ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ అధినాయకత్వం కృషి చేయాల్సిన అవసరముందని జైరాం సూచించారు. -
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు అందలం
న్యూఢిల్లీ: వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియర్లకు ప్రాధన్యం ఇచ్చింది. పార్టీకి నమ్మకంగా ఉంటున్న సీనియర్ నాయకులకు అవకాశం ఇచ్చింది. కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, కపిల్ సిబల్, జైరాం రమేష్, అంబికా సోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. తమిళనాడుకు చెందిన పి చిదంబరం మహారాష్ట్ర నుంచి, జైరాం రమేష్ సొంతరాష్ట్రం కర్ణాటక నుంచి పోటీ చేయనున్నారు. కపిల్ సిబల్ ఉత్తరప్రదేశ్ నుంచి బరిలో దిగనున్నారు. అంబికా సోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో పాటు వివేక్ ఠంకా, ఛాయ వర్మలను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపాలైన సంగతి తెలిసిందే. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రం అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు కాస్త ఊరట కలిగించే విషయం. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకుగాను రాజ్యసభ ఎన్నికల్లో సీనియర్లకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. -
'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'
ఢిల్లీ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రైవేట్ మెంబర్ బిల్లు అడ్డుకోవడంపై కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, కేవీపీ, రఘువీరా ఢిల్లీలో గురువారం మాట్లాడారు. కేవీపీ మాట్లాడుతూ..ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్‌కు రాకుండా బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. యూపీఏ మిత్రపక్షాలన్నీ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు తెలిపాయని చెప్పారు. ఇప్పుడు అడ్డుకున్న వచ్చే వర్షాకాల సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్నారు. ఆంధ్రుల ప్రయోజనాల కోసం శక్తి ఉన్నంత వరకు పోరాడుతామని కేవీపీ తెలిపారు. ప్రత్యేక హోదా లేదని చెబుతున్నా కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ కొనసాగడం సిగ్గుచేటని దిగ్విజయ్ సింగ్ అన్నారు. శుక్రవారం ప్రైవేట్ బిల్లు ఓటింగ్‌కు రాకుండా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అడ్డుకున్నారన్నారు. ప్రత్యేక హోదాకు చట్టం అవసరం లేదు, కేబినేట్ నిర్ణయమే సరిపోతుందని దిగ్విజయ్ అన్నారు. జైరాం రమేష్ మాట్లాడుతూ...ఏపీ, తెలంగాణలో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. సీట్ల సంఖ్య పెంపును ఫిరాయింపుల కోసం ఉపయోగించకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు సీట్ల పెంపుపైనే ఉన్నంతా ధ్యాస ప్రత్యేక హోదాపై లేదన్నారు. టీడీపీ, బీజేపీ రాజద్రోహానికి, ప్రజాద్రోహానికి పాల్పడుతున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్‌కు రాకుండా వెంకయ్యనాయుడు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని విమర్శించారు. -
2026 వరకూ సాధ్యం కాదు!
నియోజకవర్గాల పునర్విభజనపై జైరాం రమేష్ ► 2026 వరకూ సీల్ చేస్తూ పార్లమెంట్ చట్టం చేసింది ► అందుకే జార్ఖండ్ కోసం మేం రెండేళ్లు కృషి చేసినా కాలేదు ► ఆర్టికల్-170కి లోబడే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్-26 ఉంది ► ఒక్క రాష్ట్రం కోసం డీలిమిటేషన్ సాధ్యం కాదు ► డీలిమిటేషన్‌ను చూపి ఫిరాయింపుల పోత్సాహం సరికాదు సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన అంత సులువు కాదని విభజన బిల్లు రూపకర్త, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. విభజన చట్టం రూపకల్పన సమయంలోనే ఈ విషయంపై చర్చ జరిగిందన్నారు. 2026 వరకూ ఇది సాధ్యం కాదని, తాను జార్ఖండ్ కోసం రెండేళ్లు కృషి చేసినా ఫలితం దక్కలేదని తెలిపారు. అసెంబ్లీ స్ధానాల పెంపు కోసం పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, వాటన్నింటినీ పక్కన పెట్టి సీట్ల పెంపును తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయడం కుదరకపోవచ్చని చెప్పారు. ఏపీ విభజన బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘డీలిమిటేషన్‌ను 2026 వరకూ సీల్ చేస్తూ పార్టమెంట్ చట్టాన్ని ఆమోదించింది. అందువల్ల ప్రస్తుతానికి రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ సాధ్యం కాదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-26 లో చిన్న సవరణ ద్వారా అసెంబ్లీ స్థానాల పెంపుకు అవకాశం ఉందంటున్నారు. కానీ అది ఆర్టికల్-170కి లోబడి మాత్రమే ఉంది’’అని తెలిపారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టత ఇవ్వాలన్నారు. 2026కంటే ముందు సాధ్యంకాదు డీలిమిటేషన్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి పలు డిమాండ్లు వస్తున్నాయని జైరాం రమేష్ తెలిపారు. జనాభా ఆధారంగా అయితే 2026 కంటే ముందుగా అది సాధ్యం కాదన్నారు. ‘‘ఉదాహరణకి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటయినప్పుడు శాసనసభ సంఖ్యా బలం 81గా ఖరారు చేశారు. జార్ఖండ్ జనాభా, కేరళ జనాభా సమానంగా ఉన్నాయి. కేరళ శాసన సభ సంఖ్యా బలం 140. ఆ మేరకు జార్ఖండ్ శాసనసభ సంఖ్యా బలం పెంచాలని మేం రెండేళ్లు ప్రయత్నించి విఫలమయ్యాం. అయితే తాను ఆమోదించిన ఏ చట్టాన్నైనా, ఎప్పుడైనా పార్లమెంట్ సవరించవచ్చు. దీనికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుందో, కేంద్రం ఏం చేస్తుందో వేచి చూడాలి. పార్లమెంట్ ఆమోదంతోనే మొత్తం సంఖ్యాబలంలో మార్పులు సాధ్యమవుతాయి. అది కేవలం ఒక్క రాష్ట్రం కోసం సాధ్యం కాదు’’ అని వివరించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే దీనిపై చర్చ జరిగిందని చెప్పారు. అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తన పని తాను చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.