
సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవడమే ప్రధాన అంశం అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ స్పష్టం చేశారు. మోదీ సర్కార్ అవాస్తవాలను కప్పిపుచ్చుతున్న తీరును విపక్షాలు ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల సందర్భంగా మోదీ చేసిన వాగ్ధానాలు ఎంతమేర అమలయ్యాయనే దానిపైనే 2019 లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమ పనితీరుపై జరిగిన తరహాలోనే తదుపరి ఎన్నికలు మోదీ పనితీరుకు రెఫరెండంలా ఉంటాయన్నారు.
నరేంద్ర మోదీ సర్కార్ చెబుతున్న అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం విపక్షాలుగా తమ బాధ్యతని జైరాం రమేష్ పేర్కొన్నారు. పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ చేపట్టిన అనంతరం కాంగ్రెస్‌లో చోటుచేసకుంటున్న మార్పులను ఆయన ప్రస్తావిస్తూ ప్రధాన కార్యదర్శులు సహా ఇతర కీలక పదవుల్లో పార్టీ నాయకత్వం యువ నేతలను నియమిస్తోందని చెప్పారు. మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్‌లలో మాదిరిగా కాకుండా కర్ణాటకలో బీజేపీయేతర సర్కార్ ఏర్పాటుకు పార్టీ వేగంగా పావులు కదిపిందని అన్నారు.
కర్ణాటకలో జేడీఎస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వడంతో పాటు బీజేపీని నిలువరించేందుకు పార్టీ వేగంగా స్పందించిందని చెప్పుకొచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యూపీలో ఎస్‌పీ, బీఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీలతో జతకడుతుందని, బిహార్‌లో ఆర్‌జేడీతో, జార్ఖండ్‌లో జార్ఖండ్ వికాస్ మోర్చాతో, మహారాష్ట్రలో ఎన్‌సీపీతో పొత్తు ఉంటుందన్నారు. అవసరమైతే ఎన్నికల అనంతర పొత్తులకూ అవకాశం ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment