ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఉక్రెయిన్ పర్యటనకు ముందు, తర్వాత అయినా ప్రధాని మోదీ మణిపూర్ సందర్శించాలని అన్నారు.
‘మణిపూర్ సీఎం శనివారం ఢిల్లీ మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన బీజేపీ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో జరిగిన భేటీకి సైతం మణిపూర్ సీఎం హాజరయ్యారు. సీఎం బీరేన్ సింగ్.. ప్రధాని మోదీతో విడిగా సమావేశమై మణిపూర్‌లో మే 3,2023 నుంచి చెలరేగిన ఘర్షణల పరిస్థితిని చర్చించారా?. మోదీని ఉక్రెయిన్ పర్యటనకు ముందు లేదా తర్వాత మణిపూర్ సందర్శించాల్సిందిగా సీఎం బీరేన్ సింగ్ ఆహ్వానించారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’అని జైరాం రమేష్ అన్నారు.
The Chief Minister of Manipur attends the NITI Aayog meeting in New Delhi presided over by the self-anointed non-biological PM.
Then the Manipur CM attends a meeting of BJP CMs and Deputy CMs presided over by the same deity.
The simple question that the people of Manipur are…— Jairam Ramesh (@Jairam_Ramesh) July 28, 2024
బీజేపీ పాలిత రాష్ట్రమైన మణిపూర్‌లో గతేడాది నుంచి కుకీ, మైతేయ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్న విసయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు ప్రధాని మోదీ మణిపూర్ సందర్శించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆయన మణిపూర్ వెళ్లకూడా విదేశీ పర్యటనలు చేయటంపై కాంగ్రెస్ ఇప్పటికే పలుసార్లు తీవ్రంగా విమర్శలు గుప్పించింది.
ఉక్రెయిన్‌పై రష్యా 2022లో యుద్దాయానికి దిగిన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. ఉక్రెయిన్ జాతీయ దీనోత్సవం ఆగస్టు 24న జరుగనున్న నేపథ్యంలో ఆ సమయానికి కాస్త అటూఇటూగా మోదీ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ ప్రధాని మోదీతో టెలిఫోన్‌లో సంభాషిస్తూ, తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా కూడా ఈ ఇరువురు నేతలు సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment