‘జన గణన ఎప్పుడు?.. 14 కోట్ల మంది నష్టపోయారు’ | Congress Leader Jairam Ramesh Demands PM Modi To Conducts Census, More Details Inside | Sakshi
Sakshi News home page

‘జన గణన ఎప్పుడు?.. 14 కోట్ల మంది నష్టపోయారు’

Published Mon, Jun 10 2024 1:02 PM | Last Updated on Mon, Jun 10 2024 5:40 PM

Congress leader Jairam Ramesh demands PM Modi To conducts census

ఢిల్లీ: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఎప్పుడు చేపడతారో చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ నేత జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. పూర్తిస్థాయిలో జన గణన చేయకపోవటం వల్ల ఇప్పటివరకు 14 కోట్లమంది నష్టపో​యారని మండిప్డడారు. ఇప్పటికైనా జన గణన  ఎప్పుడు చేపడతారో దేశానికి తెలియజేయాలన్నారు. జన గణన విషయంపై ఆయన సోమవారం ఎక్స్‌ వేదికగా స్పందించారు.

‘దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా లెక్కల డేటా పదేళ్ళపాటు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగడుతంది. జనాభా  లెక్కలు 2021లో నిర్వహించాల్సింది. కానీ, ప్రధాని మోదీ అప్పుడు నిర్వహించలేదు. 2021లో  జనాభా  లెక్కలు చేపట్టకపోవటం వల్ల సుమారు 14 కోట్ల మంది భారతీయులకు జాతీయ ఆహార భద్రత చట్టం (2013) కింద  ప్రయోజనాలు కోల్పోతున్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన అందకుండా పోతోంది.

..1/3 వంతు ప్రధాని మోదీ జనాభా లెక్కల కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారో త్వరలో  దేశానికి తెలియజేయాలి. 1951 నుంచి పదేళ్లకొకసారి  నిర్వహించే జనాభా లెక్కల వల్ల ఎస్సీ, ఎస్టీల జనాభా డేటా తెలుస్తోంది. అయితే కొత్తగా నిర్వహించే జనాభా లెక్కల డేటాలో ఓబీసీలోని అన్ని కులాల జానాభా వివరాలు ఉండాలి. అప్పుడే రాజ్యాంగంలో పొందుపర్చిన  సామాజిక న్యాయానికి నిజమైన అర్థం ఇచ్చినట్లు అవుతుంది’ అని జైరాం రమేశ్‌ అన్నారు. ఇక.. లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement