Census Report
-
‘జన గణన ఎప్పుడు?.. 14 కోట్ల మంది నష్టపోయారు’
ఢిల్లీ: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఎప్పుడు చేపడతారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో జన గణన చేయకపోవటం వల్ల ఇప్పటివరకు 14 కోట్లమంది నష్టపోయారని మండిప్డడారు. ఇప్పటికైనా జన గణన ఎప్పుడు చేపడతారో దేశానికి తెలియజేయాలన్నారు. జన గణన విషయంపై ఆయన సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు.A comprehensive Census essential for socioeconomic development is carried out by the Union Govt every ten years. The last one was to be completed in 2021. But Mr. Modi didnt get it done.One immediate consequence of not having Census 2021 conducted is that at least 14 crore…— Jairam Ramesh (@Jairam_Ramesh) June 10, 2024‘దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా లెక్కల డేటా పదేళ్ళపాటు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగడుతంది. జనాభా లెక్కలు 2021లో నిర్వహించాల్సింది. కానీ, ప్రధాని మోదీ అప్పుడు నిర్వహించలేదు. 2021లో జనాభా లెక్కలు చేపట్టకపోవటం వల్ల సుమారు 14 కోట్ల మంది భారతీయులకు జాతీయ ఆహార భద్రత చట్టం (2013) కింద ప్రయోజనాలు కోల్పోతున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అందకుండా పోతోంది...1/3 వంతు ప్రధాని మోదీ జనాభా లెక్కల కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారో త్వరలో దేశానికి తెలియజేయాలి. 1951 నుంచి పదేళ్లకొకసారి నిర్వహించే జనాభా లెక్కల వల్ల ఎస్సీ, ఎస్టీల జనాభా డేటా తెలుస్తోంది. అయితే కొత్తగా నిర్వహించే జనాభా లెక్కల డేటాలో ఓబీసీలోని అన్ని కులాల జానాభా వివరాలు ఉండాలి. అప్పుడే రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక న్యాయానికి నిజమైన అర్థం ఇచ్చినట్లు అవుతుంది’ అని జైరాం రమేశ్ అన్నారు. ఇక.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
అధికారంలోకి రాగానే కుల గణన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పేద వర్గాల, దళిత, బీసీల సాధికారత కోసం కుల గణన చేపట్టాలని పేర్కొంది. కుల గణన కోసం అధికార బీజేపీపై ఒత్తిడి పెంచుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే కుల గణన నిర్వహిస్తామని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ భేటీలో తీర్మానం చేశారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం కలి్పస్తామని వెల్లడించింది. కుల గణనకు మద్దతు ఇస్తూ సీడబ్ల్యూసీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాహుల్ గాంధీ అన్నా రు. కుల గణన అనేది ఇండియాకు ఎక్స్–రే అని అభివరి్ణంచారు. బిహార్‌లో నిర్వహించిన కుల గణనను సీడబ్ల్యూసీ స్వాగతించింది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చర్చించారు. ప్రభావవంతమైన వ్యూహం కావాలి: ఖర్గే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే ప్రభావవంతమైన వ్యూహం అవసరమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా, క్రమశిక్షణతో పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు సీడబ్ల్యూసీ భేటీలో పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసలైన లబి్ధదారులకు అందాలంటే కేంద్ర ప్రభుత్వం కుల గణన ప్రారంభించాలని అన్నారు. కుల గణనకు తాను వంద శాతం మద్దతు ఇస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సోనియా గాంధీ చెప్పారు. దానికోసం పోరాడుదామని సూచించారు. కులాల వారీగా జనాభా లెక్కలకు తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. -
బిహార్‌లో కుల గణనపై స్టే
పట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కులగణనకు ఎదురు దెబ్బ తగిలింది. వెంటనే ఈ సర్వేని నిలిపివేయాలని పట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు సేకరించిన డేటాని తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎవరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కులాల ఆధారంగా జనాభా లెక్కలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినోద్ చంద్రన్ ఆధ్వర్యంలో హైకోర్టు బెంచ్ పిటిషన్‌దారులు డేటా సమగ్రత, భద్రతపై వెలిబుచ్చిన ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదంటూ పిటిషన్‌దారులు పేర్కొనడాన్ని కూడా ప్రస్తావించింది. కులాల గణాంకాలు ఇతరుల చేతుల్లో పడితే దాని వల్ల రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను జులై 7కి వాయిదా వేసింది. నితీశ్ ప్రభుత్వం జనవరి 7 నుంచి 21 వరకు తొలి విడత కులగణన నిర్వహించింది. రెండో విడత ఏప్రిల్ 15 నుంచి మే 15వరకు జరగాల్సి ఉంది. ప్రభుత్వం ఇది కులగణన కాదని, ఆర్థికంగా వెనుకబడిన వారు ఏయే కులాల్లో ఉన్నారో తెలిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్న ఉద్దేశంతోనే దీనిని చేపట్టినట్టుగా వాదిస్తోంది. -
నెల్లూరు జిల్లా మినహా.. 'పునర్విభజన' అభ్యంతరాల స్వీకరణ పూర్తి
సాక్షి, విశాఖపట్నం: పునర్విభజనకు సంబంధించి నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను పూర్తిచేశామని జిల్లాల పునర్విభజన కమిటీ చైర్మన్, రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్ తెలిపారు. మార్చి 3న ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేసి అదే రోజు మొత్తం నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విశాఖ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరితో కలిపి నాలుగు జిల్లాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఆయన పరిశీలించారు. ఈ జిల్లాల కలెక్టర్లతో పాటు రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్ధ్ జైన్‌తో కలిసి వాటిని స్క్రూటినీ చేశారు. అనంతరం విజయకుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు, అభీష్టం మేరకే జిల్లాల విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరుగుతోందని స్పష్టంచేశారు. ఈ ప్రక్రియ తర్వాత రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో సగటున 18 నుంచి 20 లక్షల జనాభా ఉంటుందన్నారు. దీంతో పరిపాలన సౌలభ్యం కలగడంతోపాటు మారుమూల గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలపై చర్చించామని ఆయన చెప్పారు. వీటి నుంచి మొత్తం 4,590 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచే 4,000 వచ్చాయన్నారు. విజయనగరం 40, విశాఖపట్నం 250, తూర్పు గోదావరి జిల్లా నుంచి 300 అభ్యంతరాలు వచ్చాయని విజయకుమార్ చెప్పారు. ఇక కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో 90 శాతం కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటుచేసేలా చర్యలు చేపడుతున్నామని.. అవిలేని చోట ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. నాలుగు జిల్లాల్లో ప్రధాన అభ్యంతరాలివే.. ఇక ఈ 4 జిల్లాల్లో గుర్తించిన ప్రధాన అభ్యంతరాలను విజయకుమార్ వివరించారు. అవేమిటంటే.. ► తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాకుండా రాజమండ్రి జిల్లాలోనే చేర్చాలి. ► అమలాపురం జిల్లాలో ఉండే మండపేట, జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలాన్ని రాజమండ్రిలోనే కొనసాగించాలి. ► అలాగే, విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలి. ► పార్వతీపురం పేరును జిల్లాగా ఉంచాలి. ► పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలి. ► అనకాపల్లి జిల్లాకు నర్సీపట్నం కేంద్రం చేయాలి. ఈ కార్యక్రమంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు డాక్టర్ మల్లికార్జున, సి. హరికిరణ్, ఎ. సూర్యకుమారి, శ్రీకేష్ లాఠకర్‌లు పాల్గొన్నారు. జనగణనకు ఇబ్బంది ఉండదు 2020–21లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా జరగలేదని విజయకుమార్ తెలిపారు. కేంద్రం ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ నెలాఖరు నాటికి జిల్లా సరిహద్దులను మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చని చెప్పారని.. కానీ, అంతకన్నా ముందే ఏప్రిల్ 2 నాటికే ఏపీలో జిల్లాల పునర్విభజన పూర్తికానుందన్నారు. కాబట్టి జనగణనకు ఎలాంటి ఇబ్బంది కలగదన్నారు. -
జనగణన ఆచూకీ ఏదీ?
ఈసారి కుల ప్రాతిపదికన జనగణన జరపాలని వివిధ రాజకీయ పార్టీలతోపాటు బీసీ కులాలు సైతం గట్టిగా డిమాండ్ చేస్తున్న తరుణంలో మొత్తంగా జనగణన ప్రక్రియకే గండికొడుతున్నారన్న కథనాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వాస్తవానికి జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ పద్ధతి ప్రకారం 2019 మార్చిలో విడుదలైంది. 2020 ఏప్రిల్– సెప్టెంబర్ల మధ్య తొలి దశలో ఇళ్లు, కట్టడాలు, కుటుంబాలకు సంబంధించిన లెక్కల సమీకరణ... నిరుడు ఫిబ్రవరి 9నుంచి రెండో దశ లో జనాభా లెక్కింపు, భాష, మత, విద్య, ఆర్థిక అంశాలతోపాటు వలసలు, సంతాన సాఫల్యత, విడాకులు, సహజీవనాలు వగైరా వివరాల సేకరణ ప్రారంభం కావాలని అందులో నిర్దే శించారు. కానీ ఈలోగా కరోనా విరుచుకుపడటంతో ఇదంతా వాయిదా పడింది. 2020 నవంబర్ మొదలుకొని క్రమేపీ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డం మొదలైంది. ఎన్నికలు, మతపరమైన ఉత్స వాలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలన్నీ నిరుడు యధావిధిగానే జరిగాయి. కానీ జనగణనను మాత్రం ఆపేశారు. 2021–22 మధ్య జనగణన తొలి దశ ఉంటుందనీ, 2023–24 మధ్య రెండో దశ ఉంటుందనీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం చెప్పింది. ఫోన్ ద్వారా వివరాలు సేకరించే ఆలోచన చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ మళ్లీ దానిపై ఉలుకూ పలుకూ లేదు. ప్రభుత్వాలు వేసే ప్రతి అడుగుకూ జనగణనలో వెలువడే డేటా ఎంత ప్రాణప్రదమో చెప్పన వసరం లేదు. పేదరిక నిర్మూలన పథకాల అమలుకూ, మౌలిక వసతుల పరికల్పనకూ, విద్య, ఆరోగ్య రంగాల పటిష్టతకూ, ఆహారభద్రతకూ ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోవాలన్నా జనగణన కీలకం. అందులో వెలువడే డేటా లేకుండా అవి పకడ్బందీ వ్యూహాలను రూపొందించడం, వాటిని పట్టాలెక్కించడం అసాధ్యం. జనాభా లెక్కల స్థూల వివరాలు వెనువెంటనే వెల్లడైనా వివిధ రంగాలకు సంబంధించిన సమస్త గణాంకాలూ అనంతరకాలంలో అంచెలంచెలుగా బయటి కొస్తుంటాయి. సాధారణ ప్రజానీకం జీవనం ఎలావుందో తెలియలన్నా... వారి మౌలిక అవసరాలు తీర్చడానికి అమలవుతున్న చర్యల ఫలితాలు అవగాహన కావాలన్నా... మత, భాషా ప్రాతిపదికన మైనారిటీలుగా ఉన్నవారి స్థితిగతులు అర్థం కావాలన్నా... లోటుపాట్ల సవరణకు ఏం చేయాలో ప్రభుత్వాలు సమీక్షించాలన్నా జనగణనే దిక్కు. విధాన రూపకల్పనకూ, బడ్జెట్ కేటాయింపులకూ, పాలనా వ్యవస్థ పటిష్టతకూ జనగణనలో వెల్లడయ్యే డేటా ఉపయోగపడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన, ఎస్సీ, ఎస్టీ స్థానాల ఖరారు తదితర అంశాలు సరేసరి. మన దేశంలో 1881లో ప్రారంభించాక ఎప్పుడూ జనగణన ఆగలేదు. ఎన్ని అవాంత రాలొచ్చినా పదేళ్లకోసారి అది క్రమం తప్పకుండా సాగుతూనే ఉంది. అలాగని దానిపై వివాదాలు లేకపోలేదు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ఎన్యూమరేటర్లు నిర్దుష్టమైన సమాచారాన్ని సేకరించడంలో విఫలమవుతున్నారని నిపుణుల వాదన. ఎన్యూమరేటర్లకు తగిన శిక్షణ లేకుండా, డేటా సేకరణ వెనకుండే పరమార్థాన్ని వివరించకుండా రంగంలోకి దించడం వల్ల వారు ఇష్టాను సారం కాగితాలు నింపడం మినహా మరేమీ చేయటంలేదని 2011 జనాభా లెక్కల సేకరణ సమయంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతక్రితం దశాబ్దాల్లోనూ ఇదే వరస. కొన్ని చోట్లయితే ఎన్యూమరేటర్ల జాడలేదంటూ జనమే ఫిర్యాదులు చేశారు. వీటన్నిటినీ సరిచేసి పకడ్బందీ జనగణనకు చర్యలు తీసుకోవాల్సిందిపోయి, మొత్తంగా ఆ ప్రక్రియనే అనిశ్చితిలో పడేయటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రజలకు సంబంధించిన డేటా లేనప్పుడు ఏమవుతుందో చెప్పడానికి ఇటీవల ఆర్థికవేత్తలు జీన్ డ్రీజ్, రీతికా ఖేరాలు లేవనెత్తిన అంశాలే రుజువు. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. దాని ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా 80 కోట్లమంది నిరుపేదలకు ప్రభుత్వాలు సబ్సిడీ బియ్యం, ఇతర సరుకులు అందిస్తున్నాయి. దేశ జనాభా దాదాపు 137 కోట్లకు చేరివుండొచ్చని 2020లో అంచనావేశారు. ఆ లెక్కన మొత్తంగా 92 కోట్ల మందికి పీడీఎస్ అమలు కావాలి. కానీ ఇప్పటికీ 2011 జనాభా లెక్కలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడంవల్ల 12 కోట్లమందికి పీడీఎస్ సరుకులు అందుబాటులోకి రావడంలేదని వారిద్దరూ తేల్చారు. కరోనా కారణంగా ప్రబలిన నిరుద్యోగిత ఈ సంఖ్యను మరింత పెంచివుండొచ్చు. దానికి తగినట్టు తమ రాష్ట్రాలకు అదనపు కోటా కావాలని రాష్ట్రాలు అడగాలన్నా, కేంద్రం ఇవ్వాలన్నా జనగణన డేటా ఉంటే తప్ప అసాధ్యం. ఆమధ్య కేంద్ర ఆహార శాఖ కార్యదర్శే ఈ మాటన్నారు. మనకు ఆధార్ డేటా ఎటూ ఉంది కదా అని కొందరు వాదిస్తున్నారు. అలాగే అంగన్వాడీ వంటిచోట్ల గర్భిణుల, శిశువుల వివరాలు నమోదు చేస్తారు. కానీ ఆ గణాంకాలు సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరించే అవకాశం ఎంతమాత్రమూ లేదు. కరోనా విరుచుకుపడటం, అది ఒమిక్రాన్ రూపంలో శరవేగంగా విస్తరిస్తుండటం వాస్తవమే. కానీ మన పొరుగునున్న చైనా 2020 న వంబర్–డిసెంబర్ మధ్య జనగణన పూర్తి చేసుకుంది. స్థూల వివరాలను నిరుడు మే నెలలో ప్రకటించింది. అమెరికా సైతం ఆన్లైన్, ఫోన్–ఇన్ మార్గాల్లో 2020లో ఈ క్రతువు పూర్తిచేసింది. నిరుడు ఆగస్టులో అది డేటా కూడా విడుదల చేసింది. కానీ మనం మాత్రం ఇతరత్రా కార్యకలాపాలన్నీ యధావిధిగా సాగించుకుంటూ జనగణనను మాత్రం నిర్లక్ష్యం చేశాం. ఈ విషయంలో కేంద్రం వివరణనివ్వడం, సాధ్యమైనంత త్వరగా దాన్ని ప్రారంభించటం అత్యవసరం. -
జనగణన మరింత ఆలస్యం!
న్యూఢిల్లీ: దేశీయంగా కరోనా ఉధృతి పెరుగుతున్నందున, దశాబ్దానికి ఒకమారు జరిపే సార్వత్రిక జనగణన కార్యక్రమం ఇప్పట్లో జరగకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ గణన 2020–21లో జరగాల్సిఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా శాంతించనందున ఇప్పట్లో గణన ఉండకపోవచ్చంటున్నారు. జిల్లాల సరిహద్దులను, సివిల్ మరియు పోలీసు యూనిట్ల హద్దులను 2022 జూన్ వరకు మార్చవద్దని కేంద్రం ఇటీవలే రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు సెన్సస్ రిజిస్టార్ జనరల్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. జనగణనకు మూడు నెలల ముందు ఇలా హద్దుల మార్పుపై నిషేధం విధిస్తారు. ఇప్పటికే జూన్ వరకు నిషేధం ఉన్నందున ఇది తొలగిన అనంతరమే జనగణనకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే జూన్‌లో నిషేధం తొలగిన అనంతరం జనగణన నోటిఫికేషన్ జారీ చేయదలిస్తే మరోమారు సరిహద్దుల మార్పును నిలిపివేస్తూ ఆదేశాలిస్తారు. తర్వాత 3నెలలకు గణన ఆరంభమవుతుంది. అంటే ఎంత కాదన్నా, వచ్చే అక్టోబర్ వరకు జనగణన జరిగే అవకాశం లేదని నిపుణుల విశ్లేషణ. జిల్లాల, ఇతర యూనిట్ల హద్దుల మార్పుపై నిషేధాన్ని కేంద్రం తొలుత 2020 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు విధించింది. ప్రస్తుత నిషేధం ఈ జూన్ 30 వరకు ఉంటుంది. -
అమెరికాలో పెరుగుతున్న ఆసియన్ల జనాభా
వాషింగ్టన్: అమెరికాలో ఆసియన్ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. మరే ఇతర మైనార్టీల కంటే ఆసియన్ల సంఖ్య గత దశాబ్ద కాలంలో చాలా పెరిగిందని ఆ దేశ జనాభా లెక్కల్లో వెల్లడైంది. 2020 సంవత్సరం నాటికి ఆసియన్ అమెరికన్ల సంఖ్య 2.4 కోట్లకు చేరుకున్నట్టు తేలింది. అమెరికా జనాభా గణన బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికాలో మైనార్టీ కమ్యూనిటీల ప్రాబల్యమే ప్రస్తుతం అధికంగా ఉంది. అందులోనూ ఆసియన్లు 7.2 శాతం మంది ఉన్నారు. 1776 అమెరికా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా వైట్ అమెరికన్ల సంఖ్య తగ్గడం విశేషంగా చెప్పుకోవాలి. అమెరికాలో తెల్లజాతీయులు సంఖ్య తొలిసారిగా 60శాతానికి దిగువకి పడింది. 2000ఏడాదిలో వారి జనాభా 69 శాతం ఉంటే 2010 నాటికి 63.7శాతానికి తగ్గింది. 2020లో ఇది 58 శాతానికి తగ్గినట్టుగా జనగణనలో వెల్లడైంది. అమెరికాలో గత దశాబ్దకాలంలో మొత్తంగా జనాభా 7.4% పెరిగి 33.1 కోట్లకు చేరుకుంది. 1930 తర్వాత జనాభా అతి తక్కువగా పెరగడం గత దశాబ్దంలోనే జరిగింది. -
ఇక మొబైల్‌యాప్‌తో.. జనాభా లెక్కలు
న్యూఢిల్లీ: ఈ సారి జనభా లెక్కలను గణించడం కోసం మొబైల్ యాప్‌ను వినియోగించబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2021లో గణించబోయే జనాభాలెక్కల కోసం మొబైల్ యాప్‌ను వినియోగించబోతున్నాం. పేపర్ సెన్సస్ నుంచి డిజిటల్ సెన్సెస్ వైపు ప్రయాణించబోతున్నాం’ అన్నారు. చివరిసారిగా 2011లో జనాభా లెక్కలని గణించిన సంగతి తెలిసిందే. అప్పటికి మన దేశ జనాభా 121 కోట్లు. ఈ క్రమంలో 2021, మార్చి 1 నుంచి నూతన జనాభా లెక్కలను గణించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంచు కురిసే ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2020 అక్టోబర్ నుంచే జనాభాను గణించన్నుట్లు తెలిపారు. -
ఆ గ్రామాల వివరాలు పంపండి
ఎఫెక్ట్.. సాక్షి, హైదరాబాద్: ‘ఊళ్లకు ఊళ్లు మాయం’శీర్షికన ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనంపై కదలిక వచి్చంది. జిల్లాల పునరి్వభజనలో ఏకంగా కొన్ని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల వివరాలు గెజిట్ నోటిఫికేషన్లో మాయం కావడాన్ని కేంద్ర జనాభా గణాంక శాఖ ఎత్తి చూపింది. 2021 జనాభా లెక్కల సేకరణకు సన్నద్ధమవుతున్న సెన్సెస్ విభాగం.. 2011 జనాభా లెక్కల్లో ఉన్న గ్రామాలు, ప్రస్తుతం కనిపించకపోవడాన్ని తప్పుబట్టింది. 58 మండలాల్లో 460 గ్రామాలు గల్లంతు కావడంపై ఆరా తీసింది. రెండు జిల్లా కేంద్రాలు వనపర్తి, గద్వాల కూడా రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో లేకపోవడమేమిటనీ ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర జనగణన శాఖ జాయింట్ డైరెక్టర్ హెలెన్ ప్రేమకుమారి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ అంశంపై స్పష్టతనివ్వాలని కోరారు. దీనిపై సీఎం కార్యాలయం జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం స్పందించింది. తక్షణమే రెవెన్యూ డివిజన్లు, మండలాలు (ఏజెన్సీ మండలాలు కూడా), గ్రామాలు, అనుబంధ గ్రామాల వివరాలను పంపాలని కలెక్టర్లకు లేఖ రాశారు. ఈ వివరాలకు అనుగుణంగా జిల్లాల పునరి్వభజన గెజిట్‌లో కనిపించకుండా పోయిన గ్రామాలను గుర్తించి.. మరోసారి జీఓ జారీ చేసే అవకాశముంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా 2021 జనాభా లెక్కలకు సెన్సెస్ విభాగం నడుంబిగించే వీలుంది. -
జననాల జోరుకు బ్రేక్..
జననం లెక్క తప్పింది. జనాభా లెక్క తగ్గింది. రాష్ట్రంలో ఇప్పుడు జననాల సంఖ్య తగ్గింది. 2017లో జననాలరేటు తగ్గుముఖం పట్టింది. 2016లో 6,24,581 జననాలు నమోదుకాగా, 2017లో 6,17,620 జననాలు ఉన్నట్లు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సీఆర్ఎస్) 2017 జనగణన లెక్కలు చెబు తున్నాయి. జననాల్లో హైదరాబాద్‌దే అగ్రస్థానం. రాష్ట్రంలో మరణాల్లోనూ తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం రాష్ట్ర జనాభా 3.694 కోట్లు. జనాభా సగటున ఒక శాతం మాత్రమే పెరుగుతోంది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జననాల వేగానికి బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి రాష్ట్రంలో ఏటా జననాల సంఖ్య పెరుగుతూ వస్తుండగా 2017లో మాత్రం ఈ జోరు కాస్త తగ్గింది. జనగణనశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. 2017 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సీఆర్ఎస్) 2017 గణాంకాలను విడుదల చేసింది. 2017లో దేశవ్యాప్తంగా 2.210 కోట్ల జననాలు నమోదవగా ఇందులో రాష్ట్రంలో 6.17 లక్షల జననాలు నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో జననాలను పరిశీలిస్తే 2.79 శాతం జననాలు రాష్ట్రంలో రికార్డయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో సంభవించిన మరణాల్లోనూ తగ్గుదల కనిపించింది. 2016లో రాష్ట్రంలో మరణాల నమోదు 2,04,917గా ఉండగా 2017లో 1,78,345గా నమోదైంది. అలాగే నవజాత శిశువుల మరణాల్లోనూ కాస్త తగ్గుదల నమోదైంది. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడంతో రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గాయని చెప్పొచ్చు. రాష్ట్ర జనాభా 3.69 కోట్లు జనన, మరణాల అంచనాలను పరిశీలించిన జనగణనశాఖ.. ఏటా జనాభా గణాంకాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన జనాభా గణాంకాల ప్రకారం దేశ జనాభా 128.85 కోట్లుకాగా తెలంగాణ జనాభా 3.694 కోట్లుగా, ఆంధ్రప్రదేశ్ జనాభా 5.232 కోట్లుగా నమోదైంది. తెలంగాణలో లింగనిష్పత్తి 915గా ఉంది. నమోదులో పురోగతి... జనన, మరణాల నమోదు అంశంలో దేశవ్యాప్తంగా పురోగతి నమోదవుతోంది. గతంలో ఇంటి వద్ద ప్రసవాలతో జననాల నమోదులో స్పష్టత కరువయ్యేది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగడంతో ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేస్తున్నారు. దీంతో గణాంకాలు సైతం స్పష్టంగా తెలుస్తున్నాయి. మరణాల నమోదులోనూ ఇదే పురోగతి ఉంది. రాష్ట్రంలో జననాల నమోదు 91.7 శాతం ఉండగా, మరణాల నమోదు 73.2 శాతంగా ఉంది. పిల్లలకు ఆధార్ నమోదుకు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడంతో వాటి నమోదులో భారీ పెరుగుదల ఉంది. అదేవిధంగా మరణ ధ్రువీకరణ పత్రాలతో పలు పథకాలు అనుసంధానం కావడంతో వాటి నమోదు అనివార్యమైంది. హైదరాబాద్ టాప్.. జనన, మరణాల్లో హైదరాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. అత్యాధునిక ఆస్పత్రులుండడంతో ఇక్కడ వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. 2017 సంవత్సరంలో హైదరాబాద్ జిల్లాలో 188457 జననాలు, 60730 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కేసీఆర్ కిట్ పథకానికి ఆస్పత్రి ప్రసవాలతో అనుసంధానం కావడంతో గ్రామీణ ప్రజలు సైతం పట్టణ ఆస్పత్రులకు తరలివస్తున్నారు. ఇక్కడే వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు ప్రసవాలకు సైతం పట్టణ ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇవ్వడంతో జననాల నమోదు పెరుగుతోంది. జననాల సంఖ్యలో నిజామాబాద్, వరంగల్ అర్భన్, సంగారెడ్డి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో జనన, మరణాల స్థితి ఇలా.... 2017లో రాష్ట్రవ్యాప్తంగా 6.17 లక్షల జననాలు నమోదవగా ఇందులో మగ శిశువులు 3.22 లక్షలు, ఆడ శిశువులు 2.95 లక్షలు ఉన్నారు. అదేవిధంగా ఆ ఏడాది 1.78 లక్షల మరణాలు సంభవించగా ఇందులో లక్ష (1.007 లక్షలు) మంది మగవారు, 77.6 వేల మంది ఆడవారున్నారు. జననాల నమోదులో 20వ స్థానంలో, మరణాల నమోదులో 17వ స్థానంలో తెలంగాణ ఉన్నట్లు జనగనణశాఖ గణాంకాలు చెబుతున్నాయి. నిర్ధిష్ట గడువులోగా 4,48,861 (72.7 శాతం) జననాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. 21 రోజుల నుంచి నెలలోగా నమోదైనవి 1,19,562, ఏడాదిలోగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 31,815, ఏడాది తర్వాత రిజిస్టర్ అయినవి 17,380. రాష్ట్రంలో జననాల నమోదుతో పోలిస్తే మరణాల నమోదులో ముందున్నట్లు కనిపిస్తోంది. నిర్దిష్ట గడువులోగా మరణాల రిజిస్ట్రేషన్ 82 శాతం ఉంది. 1.78 లక్షల మరణాల్లో 1.46 లక్షల మరణాలకు సంబంధించి 21 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ జరిగింది. అలాగే 21 రోజుల నుంచి నెలలోపు రిజిస్ట్రేషన్ అయిన మరణాలు 21,401, ఏడాదిలోపు నమోదైనవి 8,917, ఏడాది తర్వాత రిజిస్ట్రేషన్ అయినవి 1,783. మరణాల కేటగిరీలో రిజిస్ట్రేషన్ల పెరుగుదలను పరిశీలిస్తే మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందాలంటే మరణ ధ్రువీకరణ తప్పనిసరి కావడంతో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. -
పశుగణనలో మనమే టాప్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అఖిల భారత పశు గణనలో మన జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఐదేళ్లకోసారి నిర్వహించే పశు గణనను వంద శాతం పూర్తి చేసి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలబడింది. గతేడాది అక్టోబర్ ఒకటిన ప్రారంభమైన పశుగణన ప్రక్రియ వాస్తవంగా అదే ఏడాది డిసెంబర్ 31తో ముగియాలి. వరుసగా వచ్చిన శాసనసభ, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గడువును జనవరి నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగతా జిల్లాలతో పోల్చితే మన జిల్లా ఇప్పటికే వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది. చివరిసారిగా 2012లో నిర్వహించిన సమయంలో.. జిల్లాలో 5.36 ఇళ్లను క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలించి వివరాలు నమోదు చేశారు. ఈ లక్ష్యాన్ని ప్రామాణికంగా తీసుకున్న జిల్లా పశుసంవర్ధక శాఖ యంత్రాంగం ఇప్పటికే 5.77 లక్షల ఇళ్ల నుంచి వివరాలు సేకరించారు. గత ఐదేళ్ల నుంచి నివాసాల సంఖ్య పెరగడంతో.. ఇంటింటికి వెళ్లడం పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలు మిగిలాయని, ప్రస్తుతం వివరాల సేకరణ కొనసాగుతుందని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కేవీఎల్ నర్సింహారావు తెలిపారు. ఫిబ్రవరి 15 నాటికి జిల్లాలో పశుగణన సంపూర్ణంగా ముగుస్తుందని చెప్పారు. 126 మంది ఎన్యుమరేటర్లు, 39 మంది సూపర్వైజర్లతో కూడిన బృందాలు ప్రతి ఇంటికి వెళ్తూ పశువులు, పెంపుడు జంతువులు, పక్షుల వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ నెలకు గ్రామీణ ప్రాంతంలో 1,500 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 2 వేల ఇళ్లకు వెళ్లి సమాచారం రాబడుతున్నారు. తొలిసారిగా గణనలో ట్యాబ్‌లను వినియోగిస్తున్నారు. సేకరించిన వివరాలను క్షేత్రస్థాయి నుంచే డేటా సెంటర్‌కు చేరవేస్తున్నారు. -
అయోమయం.. గిరి‘జనం’
- జిల్లాలో గిరిజనుల జనాభాపై కొరవడిన స్పష్టత - జనాభా అధికంగా ఉన్నా తక్కువగా చూపుతున్నార నే ఆరోపణలు - సంక్షేమ నిధుల కేటాయింపుల్లో కోత కడప రూరల్ : సాధారణంగా ఎక్కడైనా జనాభా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ లెక్కల ప్రకారమే సంక్షేమ ఫలాలు అందుతుంటాయి. అయితే, జిల్లాలో గిరిజనుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువగా చూపుతున్నారనే వాదన వినిపిస్తూనే ఉంది. 2011 లెక్కల ప్రకారం... 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 65 వేల మంది వరకు గిరిజనులు ఉన్నారు. 2011కు వచ్చేసరికి జిల్లా జనాభా మొత్తం 28 లక్షల 84 వేల 524మంది. అందులో గిరిజనుల జనాభా 75 వేల 886 మంది ఉన్నారు. అందులో పురుషులు 38 వేల 571 మంది, మహిళలు 37 వేల 315 మంది ఉన్నట్లు లెక్కలు తెలుపుతున్నాయి. కేవలం కడప నగర పరిధిలోనే పురుషులు 13 వేల 390 మంది, స్త్రీలు 13 వేల 292 మంది కలిపి మొత్తం 26 వేల 672 మంది గిరిజనులు ఉన్నట్లు లెక్కలు తెలుపుతున్నాయ. తాజాగా జిల్లాలో 1.20 లక్షల నుంచి 1.50 లక్షల వరకు గిరిజన జనాభా ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓ అంచనా ప్రకారం జిల్లాలో 1లక్షా 3వేల 631 మంది గిరిజన జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలపై ప్రభావం జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు తదితర ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో సుగాలి, ఎరుకల, యానాది వర్గాలకు చెందిన వారు ఈ తెగ కిందికి వస్తారు. అలాగే అక్కడక్కడా చెంచులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సంక్షేమ ఫలాలు జనాభా ప్రాతిపదికన అందుతాయి. జనాభా తక్కువగా ఉంటే అదే పరిమాణంలో బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి. ఆ ప్రభావం ఆయా వర్గాలపై పడనుంది. నిర్దిష్టంగా జనాభా ఉంటే సంక్షేమ ఫలాలు అందరికీ దక్కుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శాశ్వత కార్యాలయానికి మోక్షం లేదా? జిల్లాలో గిరిజన సంక్షేమ, కార్పొరేషన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు, ముగ్గురు మినహా ఆ శాఖకు సంబంధించిన అధికారులు లేరు. మిగతా సిబ్బంది డిప్యుటేషన్‌పై వచ్చి వెళ్లే వారే. దీంతో శాఖ పరిపాలనపై పట్టు లేకపోవడమో, జవాబు దారితనం లేకపోవడమో జరుగుతోంది. గతంలో ఈ శాఖలోని సిబ్బంది పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అదే శాశ్వత కార్యాలయంతోపాటు ఆ శాఖ సిబ్బందిని నియమిస్తే ఎలాంటి అక్రమాలకు, సమస్యలకు చోటు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివరాలు సేకరిస్తున్నాం జిల్లాలో గిరిజన వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏయే వృత్తులు చేపడుతున్నారనే వివరాలు సేకరిస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో గిరిజనుల సంఖ్య 75,886 మంది ఉన్నారు. కొందరి అభిప్రాయం మేరకు జనాభా ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా వివరాలను సేకరిస్తున్నాం. ఒకవేళ జనాభా ఎక్కువగా ఉంటే సంక్షేమ ఫలాల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉంటుంది. - లలితాబాయి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి