ఎఫెక్ట్..
సాక్షి, హైదరాబాద్: ‘ఊళ్లకు ఊళ్లు మాయం’శీర్షికన ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనంపై కదలిక వచి్చంది. జిల్లాల పునరి్వభజనలో ఏకంగా కొన్ని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల వివరాలు గెజిట్ నోటిఫికేషన్‌లో మాయం కావడాన్ని కేంద్ర జనాభా గణాంక శాఖ ఎత్తి చూపింది. 2021 జనాభా లెక్కల సేకరణకు సన్నద్ధమవుతున్న సెన్సెస్ విభాగం.. 2011 జనాభా లెక్కల్లో ఉన్న గ్రామాలు, ప్రస్తుతం కనిపించకపోవడాన్ని తప్పుబట్టింది. 58 మండలాల్లో 460 గ్రామాలు గల్లంతు కావడంపై ఆరా తీసింది. రెండు జిల్లా కేంద్రాలు వనపర్తి, గద్వాల కూడా రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో లేకపోవడమేమిటనీ ప్రశ్నించింది.
ఈ మేరకు కేంద్ర జనగణన శాఖ జాయింట్ డైరెక్టర్ హెలెన్ ప్రేమకుమారి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ అంశంపై స్పష్టతనివ్వాలని కోరారు. దీనిపై సీఎం కార్యాలయం జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం స్పందించింది. తక్షణమే రెవెన్యూ డివిజన్లు, మండలాలు (ఏజెన్సీ మండలాలు కూడా), గ్రామాలు, అనుబంధ గ్రామాల వివరాలను పంపాలని కలెక్టర్లకు లేఖ రాశారు. ఈ వివరాలకు అనుగుణంగా జిల్లాల పునరి్వభజన గెజిట్‌లో కనిపించకుండా పోయిన గ్రామాలను గుర్తించి.. మరోసారి జీఓ జారీ చేసే అవకాశముంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా 2021 జనాభా లెక్కలకు సెన్సెస్ విభాగం నడుంబిగించే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment