district centers
-
ఉద్యమ స్ఫూర్తి రగిలించేలా ‘దీక్షా దివస్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో తిరిగి రగిలించడమే లక్ష్యంగా ‘దీక్షా దివస్’ నిర్వహిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్.. దానిని విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. తెలంగాణ సాధన కోసం 2009 నవంబర్ 29న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో ‘దీక్షా దివస్’నిర్వహించనుంది. కేడర్‌ను సమీకరించేందుకు ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు, కీలక నేతలను జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం జరిగే దీక్షాదివస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తోపాటు ఇతర కీలక నేతలు పాల్గొంటారు.ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ విరామం తర్వాత దీక్షాదివస్‌లో పాల్గొనేందుకు తెలంగాణభవన్‌కు రానున్నారు. కేటీఆర్ కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో, హరీశ్‌రావు సిద్దిపేటలో, కవిత నిజామాబాద్‌లో ఉదయం జరిగే దీక్షాదివస్‌లో, మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు తమ తమ జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీక్షాదివస్ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్‌కు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. కేసీఆర్ దీక్ష విరమించిన రోజును గుర్తు చేస్తూ డిసెంబర్ 9న మేడ్చల్‌లో కేటీఆర్ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.జాతీయ పార్టీలే లక్ష్యంగా...బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి కేడర్ ను సమీకరించి దీక్షాదివస్ నిర్వహించనుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా శుక్రవారం జరిగే సమావేశాల్లో విమర్శలు సంధించి పార్టీ కేడర్‌లో జోష్ నింపాలని భావిస్తోంది. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా దీక్షాదివస్ సమావేశాలు ఉంటాయని పార్టీవర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ వైఫల్యాలపై కేంద్ర ప్రభు త్వం మౌనంగా ఉంటున్న తీరును కేడర్‌కు విడమరిచి చెప్పాలని పార్టీ ఆదేశించింది.రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధాన్యం బోనస్, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం తదితరాలపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించిన బీఆర్ఎస్.. వాటిని మరింత బలంగా దీక్షాదివస్ వేదికగా ప్రశ్నించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయడంలో దీక్షాదివస్ తొలిఅంకమని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిస్తేజంగా మారిన పార్టీ కేడర్‌లో కదలిక తెచ్చేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడుతాయని భావిస్తున్నారు. -
శరవేగంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ
-
పేర్లు, జిల్లా కేంద్రాలపైనే ప్రధానంగా సూచనలు
సాక్షి, అమరావతి: నూతన జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు 7,500 ప్రజాభిప్రాయాలు అందగా జిల్లా కేంద్రాలు, జిల్లాల పేర్లపైనే ఎక్కువ సూచనలు వచ్చాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా నుంచి 4,500కిపైగా అభిప్రాయాలు వచ్చాయి. అందులో ఒక అంశంపైనే 4 వేలకుపైగా ఉండడం గమనార్హం. సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలం ప్రస్తుతం విజయనగరంలో ఉండగా పునర్వ్యవస్థీకరణలో దాన్ని పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో ప్రతిపాదించారు. పార్వతీపురం తమకు బాగా దూరమవుతుంది కాబట్టి విజయనగరంలోనే ఉంచాలనే అభిప్రాయాలు పెద్దఎత్తున వచ్చాయి. ఎస్ కోట నియోజకవర్గం కొత్తవలస మండలాన్ని విజయనగరంలో కాకుండా విశాఖలో కలపాలని కొన్ని సూచనలు వచ్చాయి. పార్వతీపురం జిల్లాకు మన్యం జిల్లాగా పేరు పెట్టడంపైనా ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. మన్యం అంటే ఏజెన్సీ ప్రాంతంగా మారుతుందని, దానివల్ల 1/77 చట్టం పరిధిలోకి వెళ్లిపోయి భూముల క్రయ విక్రయాలకు ఇబ్బందికరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మన్యం అని కాకుండా పార్వతీపురం పేరుతో కొనసాగించాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లాలో పేర్లు అటు ఇటు మార్చాలని.. కృష్ణా జిల్లాలో 2,900 అభ్యంతరాలు రాగా జిల్లా కేంద్రాల పేర్లు మార్చాలనే సూచనలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాను వంగవీటి జిల్లా, కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా చేయాలని సూచనలు అందాయి. మైలవరం డివిజన్ ఏర్పాటు చేయాలని 2 వేల వరకు సూచనలు వచ్చాయి. టీడీపీ నేత దేవినేని ఉమా నేతృత్వంలో రాజకీయ కోణంలో వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలను కోనసీమ జిల్లాలో కలపవద్దని, రాజమండ్రి లేదా కాకినాడలో కలపాలనే సూచనలు వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, ఎటపాకలను పాడేరులో కాకుండా రాజమండ్రిలోనే ఉంచాలని, లేదంటే ప్రత్యేక జిల్లాగా చేయాలని పలు అభిప్రాయాలు అందాయి. విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కాకుండా విశాఖలోనే ఉంచాలనే సూచనలు ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. విజయనగరంలో జామి, శ్రీకాకుళంలో పాతపట్నం మండలాలను ఇప్పుడున్న డివిజన్లో కాకుండా వేరే డివిజన్‌లోకి మార్చాలనే సూచనలు వచ్చాయి. జిల్లా కేంద్రాలపై మూడు చోట్ల అభ్యంతరాలు.. జిల్లా కేంద్రాలుగా అనంతపురం జిల్లాలో హిందూపురం, వైఎస్సార్ కడపలో రాజంపేట, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పట్టణాలను చేయాలని సూచనలు వచ్చాయి. భీమవరం, రాయచోటి, పుట్టపర్తిని వ్యతిరేకిస్తూ అభ్యంతరాలు అందాయి. ద్వారకా తిరుమల మండలాన్ని రాజమండ్రిలో కాకుండా ఏలూరు జిల్లాలో కలపాలని భారీగా సూచనలు వచ్చాయి. కోనసీమకు అంబేడ్కర్, కర్నూలుకు దామోదరం సంజీవయ్య, కృష్ణాకు పింగళి వెంకయ్య, ఏలూరుకు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేర్లు పెట్టాలనే సూచనలూ అందాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చిరంజీవి జిల్లాగా పేరు పెట్టాలని కొన్ని సూచనలు అందడం విశేషం. ఐదు కేటగిరీలుగా.. సూచనలు, అభ్యంతరాలను ఐదు కేటగిరీలుగా విభజించి పరిశీలిస్తున్నారు. డివిజన్ కేంద్రం మార్పు, జిల్లా కేంద్రం మార్పు, కొత్త డివిజన్ ఏర్పాటు, ఆ డివిజన్లో కాకుండా మరో డివిజన్‌లోకి మార్చడం, నియోజకవర్గాల్లోని మండలాలను విభజించడం... ఇలా 5 విభాగాలుగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను విభజించారు. 9 జిల్లాల్లో ముగిసిన గడువు.. సూచనలు, అభ్యంతరాల స్వీకరణ గడువు దాదాపు ముగింపు దశకు వచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి 30 రోజులు అభ్యంతరాలకు గడువు ఇవ్వగా ఫిబ్రవరి 24వ తేదీకే 9 జిల్లాల్లో గడువు ముగిసింది. ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ నెల 3వ తేదీ వరకు, అనంతపురం జిల్లాలో 5వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికే సూచనలు, అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ల కమిటీ ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి అధ్యయనం జరిపి ఒక అభిప్రాయానికి వచ్చింది. వచ్చిన వినతులన్నింటినీ క్రోడీకరించి తమ సిఫారసులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి గడువు ముగిసిన వారం రోజుల్లో సమర్పించనుంది. అనంతరం ప్రభుత్వ స్థాయిలో వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త జిల్లాలకు ప్రజామోదం ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ కొత్త జిల్లాల ప్రతిపాదనలను ప్రజలు ఆమోదించినట్లు తమ అధ్యయనంలో కనిపించిందని ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ చెప్పారు. విజయవాడలోని ప్రణాళికా శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలపై అధ్యయనం జరిపి క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించామని తెలిపారు. అభ్యంతరాలు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నా కేవలం 60 అంశాలకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు అందినట్లు గుర్తించామన్నారు. జనాభా, ఏరియా సైజును బట్టి కొన్ని కలపడం, మార్చడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అని ముందే తాము ఆలోచించామని, అలాంటి చోట్లే అభ్యంతరాలు, సూచనలు వచ్చాయన్నారు. పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా ఉండాలనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకోగా దాని చుట్టూ ఉన్న నియోజకవర్గాలను రెండో లెవల్‌గా, ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా అలాగే ఉంచాలని, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండాలనే నియమాల ఆధారంగా చేసిన పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. సూచనలపై కలెక్టర్ల నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మార్చి ఆఖరి వారంలో తుది నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి ఆర్డర్ టు సర్వ్ ఇస్తారని చెప్పారు. కొత్తగా నియమించే కలెక్టర్లను ముందుగా ఓఎస్డీలుగా నియమించి ఆ తర్వాత నోటిఫైడ్ తేదీ నాటికి కలెక్టర్లుగా మారేలా ఆదేశాలు ఇస్తారని తెలిపారు. -
ఆ గ్రామాల వివరాలు పంపండి
ఎఫెక్ట్.. సాక్షి, హైదరాబాద్: ‘ఊళ్లకు ఊళ్లు మాయం’శీర్షికన ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనంపై కదలిక వచి్చంది. జిల్లాల పునరి్వభజనలో ఏకంగా కొన్ని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల వివరాలు గెజిట్ నోటిఫికేషన్లో మాయం కావడాన్ని కేంద్ర జనాభా గణాంక శాఖ ఎత్తి చూపింది. 2021 జనాభా లెక్కల సేకరణకు సన్నద్ధమవుతున్న సెన్సెస్ విభాగం.. 2011 జనాభా లెక్కల్లో ఉన్న గ్రామాలు, ప్రస్తుతం కనిపించకపోవడాన్ని తప్పుబట్టింది. 58 మండలాల్లో 460 గ్రామాలు గల్లంతు కావడంపై ఆరా తీసింది. రెండు జిల్లా కేంద్రాలు వనపర్తి, గద్వాల కూడా రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో లేకపోవడమేమిటనీ ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర జనగణన శాఖ జాయింట్ డైరెక్టర్ హెలెన్ ప్రేమకుమారి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ అంశంపై స్పష్టతనివ్వాలని కోరారు. దీనిపై సీఎం కార్యాలయం జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం స్పందించింది. తక్షణమే రెవెన్యూ డివిజన్లు, మండలాలు (ఏజెన్సీ మండలాలు కూడా), గ్రామాలు, అనుబంధ గ్రామాల వివరాలను పంపాలని కలెక్టర్లకు లేఖ రాశారు. ఈ వివరాలకు అనుగుణంగా జిల్లాల పునరి్వభజన గెజిట్‌లో కనిపించకుండా పోయిన గ్రామాలను గుర్తించి.. మరోసారి జీఓ జారీ చేసే అవకాశముంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా 2021 జనాభా లెక్కలకు సెన్సెస్ విభాగం నడుంబిగించే వీలుంది. -
పట్టణాభివృద్ధి సంస్థలుగా జిల్లా కేంద్రాలు
• కొత్తగా 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు • డిసెంబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ గడువు పెంపు • సంగారెడ్డిలో మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, సంగారెడ్డి: నూతనంగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలను కలుపుకొని రాష్ట్రంలో 24 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తామని మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలతో కలిసి బుధవారం సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20 శాతం అదనపు ఫీజు చెల్లించి భూ క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నామన్నారు. మార్గదర్శకాలను గురువారం విడుదల చేస్తామని తెలిపారు. క్రమబద్ధీకరణకు ముందుకు రాని వారిపై జనవరి ఒకటో తేదీ నుంచి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తం గా మున్సిపాలిటీల పరిధిని విస్తరించేందు కు ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీలు, ప్రైవే టు వ్యక్తులు, వివిధ సంస్థలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా నిషేధం విధిస్తున్నామన్నారు. మున్సిపల్ విభాగంలో ఇప్పటికే 520 మంది ఏఈలు, 126 మంది టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించామని, మున్సిపల్ కమిషనర్లకు పరిమితులతో కూడిన మెజిస్టీరియల్ అధికారాలు ఇచ్చేం దుకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. హస్తకళలకు పన్ను రాయితీ... చేనేత, హస్త కళాకారులు తయారు చేసిన వస్తువులకు కర్ణాటకతోపాటు మరో ఐదు రాష్ట్రాలు పన్ను రారుుతీలు ఇస్తున్నాయని, అదే తరహాలో రాష్ట్రంలోనూ చేనేత, హస్తకళలపై పన్ను రారుుతీ ఇవ్వడంతోపాటు వ్యాట్‌ను రద్దు చేసే యోచనలో ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డిలో గోల్కొండ షోరూంను మంత్రి కేటీఆర్ మరో మంత్రి హరీశ్‌రావుతో కలసి ప్రారంభించారు.