పట్టణాభివృద్ధి సంస్థలుగా జిల్లా కేంద్రాలు
• కొత్తగా 24 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు
• డిసెంబర్ 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపు
• సంగారెడ్డిలో మంత్రి కేటీఆర్ వెల్లడి
సాక్షి, సంగారెడ్డి: నూతనంగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలను కలుపుకొని రాష్ట్రంలో 24 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తామని మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలతో కలిసి బుధవారం సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20 శాతం అదనపు ఫీజు చెల్లించి భూ క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నామన్నారు.
మార్గదర్శకాలను గురువారం విడుదల చేస్తామని తెలిపారు. క్రమబద్ధీకరణకు ముందుకు రాని వారిపై జనవరి ఒకటో తేదీ నుంచి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తం గా మున్సిపాలిటీల పరిధిని విస్తరించేందు కు ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీలు, ప్రైవే టు వ్యక్తులు, వివిధ సంస్థలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా నిషేధం విధిస్తున్నామన్నారు. మున్సిపల్ విభాగంలో ఇప్పటికే 520 మంది ఏఈలు, 126 మంది టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించామని, మున్సిపల్ కమిషనర్లకు పరిమితులతో కూడిన మెజిస్టీరియల్ అధికారాలు ఇచ్చేం దుకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
హస్తకళలకు పన్ను రాయితీ...
చేనేత, హస్త కళాకారులు తయారు చేసిన వస్తువులకు కర్ణాటకతోపాటు మరో ఐదు రాష్ట్రాలు పన్ను రారుుతీలు ఇస్తున్నాయని, అదే తరహాలో రాష్ట్రంలోనూ చేనేత, హస్తకళలపై పన్ను రారుుతీ ఇవ్వడంతోపాటు వ్యాట్‌ను రద్దు చేసే యోచనలో ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డిలో గోల్కొండ షోరూంను మంత్రి కేటీఆర్ మరో మంత్రి హరీశ్‌రావుతో కలసి ప్రారంభించారు.