
ఏఐ... అదేనండీ అర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వైపే ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. కానీ వాంఖెడే స్టేడియంలో మాత్రం మరో ఏఐ... అదే భయ్యా అభిషేక్ ఇంటలిజెంట్ బ్యాటింగ్ వైపే ఓ గంటసేపు కన్నార్పకుండా చూసేలా చేసింది.

ఇది కదా ఫన్... ధన్ ధనాధన్! ఇదే కదా ఈ టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ మిస్సయ్యింది. అయితేనే ఆఖరి పోరులో ఆవిష్కృతమైంది

అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్స్‌లు) ఆమోఘ శతకం, అదేపనిగా విధ్వంసం ముంబై వాసుల్ని మురిపించింది

ఆదివారం అసలైన టి20 వినోదాన్ని పంచిన చివరి టి20లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది



























