Abhishek Sharma
-
BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు చోటు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల మహిళల సీనియర్ జట్టుకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. అయితే, పురుషుల సీనియర్ టీమ్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కాస్త జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే బీసీసీఐ ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో శనివారం సమావేశం కానున్నట్లు సమాచారం. కాగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజించి వార్షిక వేతనాలు అందచేస్తోన్న విషయం తెలిసిందే. రోహిత్, కోహ్లిల కొనసాగింపు!కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ గ్రేడ్ అయిన A+లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కేవలం వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి వీరిని A+ గ్రేడ్ నుంచి తప్పించాలని బోర్డు నిర్ణయించినట్లు గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ముగ్గురితో పాటు బుమ్రాను A+ గ్రేడ్‌లోనే కొనసాగించనున్నారు.అంతేకాదు..టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఈసారి ప్రమోషన్ దక్కనుంది. B గ్రేడ్ నుంచి అతడిని A గ్రేడ్‌కు ప్రమోట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. క్రమశిక్షణారాహిత్యం వల్ల సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి ఈ జాబితాలో చేరనున్నాడు.అంతేకాదు.. టాప్ గ్రేడ్‌లో అతడిని చేర్చేందుకు బీసీసీఐ నాయకత్వ బృందం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అతడికి ఈ మేర రిటర్న్‌గిఫ్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రేయస్ మాదిరి అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం బీసీసీఐ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.టాప్ క్లాస్‌లో అతడి పేరుఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ తిరిగి వార్షిక కాంట్రాక్టు దక్కించుకోబోతున్నాడు. అది కూడా టాప్ క్లాస్‌లో అతడి పేరు చేరనుంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’’ అని పేర్కొన్నాయి.తొలిసారి వీళ్లకు చోటుఇక ఈసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కొత్తగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకోవాలంటే.. ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరఫున మూడు టెస్టులు లేదంటే.. ఎనిమిది వన్డేలు.. లేదా పది అంతర్జాతీయ టీ20లు ఆడి ఉండాలి. తద్వారా మరుసటి ఏడాది సదరు ఆటగాళ్లకు బోర్డు వార్షిక కాంట్రాక్టు ఇస్తుంది.ఇక బీసీసీఐ A+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. కోటి వార్షిక జీతంగా ఇస్తుంది.గతేడాది కాలానికి (2023-24) గానూ బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాగ్రేడ్- A+: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాగ్రేడ్- A: రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాగ్రేడ్- B: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్గ్రేడ్- C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్,రజత్ పాటిదార్. -
రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.. ఉప్పల్ స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
ఐపీఎల్‌కు ముందే స్టార్ట్ అయిన అభిషేక్ విధ్వంసం.. సిక్సర్ల దెబ్బకు అద్దాలు ధ్వంసం
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ షో మొదలైంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లో శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. నిన్నటి ప్రాక్టీస్ సందర్భంగా శర్మ కొట్టిన ఓ బంతి అగ్నిమాపక పరికరం అద్దాలు ధ్వంసం చేసింది. సన్‌రైజర్స్ విడుదల చేసిన ఓ వీడియోలో శర్మ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. సిక్సర్లు బాదే క్రమంలో చాలా బ్యాట్లు కూడా విరిగిపోయాయని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by SunRisers Hyderabad (@sunrisershyd)ఈ వీడియోతో సన్‌రైజర్స్ ప్రత్యర్థులను బయపెట్టే పనిలో పడింది. అభిషేక్ శర్మతో జాగ్రత్తగా ఉండాలని సంకేతాలు పంపింది. గత సీజన్లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండిన అభిషేక్.. సహచర ఓపెనర్ ట్రవిస్ హెడ్‌తో కలిసి సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడాడు. సన్‌రైజర్స్ సాధించిన అతి భారీ స్కోర్లలో అభిషేక్ పాత్ర కీలకం. అభిషేక్ గత సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడి 204.22 స్ట్రయిక్‌రేట్‌తో 484 పరుగులు చేశాడు. ఇందులో 36 బౌండరీలు, 42 సిక్సర్లు ఉన్నాయి. గత సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదింది కూడా అభిషేకే. అభిషేక్ గత సీజన్లోలాగే ఈ సీజన్లోనూ పేట్రేగిపోయే అవకాశం ఉంది. గత ఐపీఎల్ తర్వాత అతను మరింత రాటు దేలాడు. టీమిండియాకు ఎంపికై అంతర్జాతీయ వేదికపై కూడా సత్తా చాటాడు. ఆ అనుభవంతో అభిషేక్ ఈ ఐపీఎల్ సీజన్లో సునామీలా విరుచుకుపడవచ్చు. అభిషేక్‌తో పాటు సహచరులు ట్రవిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి కూడా విజృంభిస్తే.. గత సీజన్లో మిస్సైన టైటిల్‌ను సన్‌రైజర్స్ ఈ సీజన్లో సాధించవచ్చు. పై పేర్కొన్న బ్యాటర్లు తమ సహజ ఆటతీరును ప్రదర్శిస్తే ఈ సీజన్లో సన్‌రైజర్స్ 300 పరుగుల మార్కును దాటేస్తుంది. ప్రాక్టీస్ సందర్భంగా సన్‌రైజర్స్ బ్యాటర్లు ఇదే టార్గెట్ పెట్టుకుని భారీ షాట్లు ఆడుతూ కనిపించారు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీలోకి కొత్తగా చేరిన ఇషాన్ కిషన్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. అభిషేక్ జోరుకు ఇషాన్ విధ్వంసం కూడా తోడైతే సన్‌రైజర్స్‌కు ఈ సీజన్లో పట్టపగ్గాలు ఉండవు. గత సీజన్లో బ్యాటర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ ఆర్సీబీపై 287 (ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోర్), ముంబై ఇండియన్స్‌పై 277, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266 పరుగులు చేసింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది.ఈ సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ బలంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి దేశీయ పేసర్లు దూరమైనా షమీ, ఉనద్కత్, హర్షల్ పటేల్ కొత్తగా జట్టులో చేరారు. స్పిన్ విభాగంలోనూ సన్‌రైజర్స్ పటిష్టంగా కనిపిస్తుంది. ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాను సన్‌రైజర్స్ ఈ సీజన్లో అక్కున చేర్చుకుంది. లోకల్ స్పిన్నర్ రాహుల్ చాహర్ తనదైన రోజున అద్భుతాలు చేయగలడు. పార్ట్ టైమ్ స్పిన్నర్లు అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, కమిందు మెండిస్ ఫుల్‌టైమ్ స్పిన్నర్లకు ఏమాత్రం తీసిపోరు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్ ఈ సీజన్లో టైటిల్ గెలుస్తుందేమో చూడాలి.కాగా, ఈ సీజన్లో సన్‌రైజర్స్ ప్రయాణం మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది.2025 ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్ -
టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ల హవా.. టాప్-5లో ముగ్గురు
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-5లో ఏకంగా ముగ్గురు చోటు దక్కించుకున్నారు. రెండో స్థానంలో అభిషేక్ శర్మ, 4, 5 స్థానాల్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ అగ్రపీఠంపై తిష్ట వేశాడు. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోగా.. శ్రీలంక ఆటగాడు పథుమ్ నిస్పంక ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు.ఇవి మినహా ఈ వారం టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. పాక్‌తో జరుగుతున్న సిరీస్‌లో చెలరేగిపోతున్న న్యూజిలాండ్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందారు. సీఫర్ట్ 20 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరగా.. అలెన్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి ఎగబాకాడు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 12, రుతురాజ్ గైక్వాడ్ 26, సంజూ శాంసన్ 36, శుభ్‌మన్ గిల్ 41, హార్దిక్ పాండ్యా 52, రింకూ సింగ్ 54, శివమ్‌దూబే 57 స్థానాల్లో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండో స్థానంలో నిలిచాడు. వరుణ్‌కు టాప్ ప్లేస్‌లో ఉన్న అకీల్ హొసేన్‌కు కేవలం ఒక్క పాయింట్ వ్యత్యాసం మాత్రమే ఉంది. టాప్-10లో వరుణ్ సహా ముగ్గురు భారత బౌలర్లు ఉన్నారు. రవి బిష్ణోయ్ 6, అర్షదీప్ సింగ్ 9 స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా పాక్‌తో జరిగిన రెండు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన న్యూజిలాండ్ బౌలర్లు ర్యాంక్‌లను భారీగా మెరుగుపర్చుకున్నారు. జేకబ్ డఫీ 23 స్థానాలు మెరుగుపర్చుకుని 12వ స్థానానికి ఎగబాకగా.. బెన్ సియర్స్ 22 స్థానాలు మెరుగుపర్చుకుని 67వ స్థానానికి.. జకరీ ఫౌల్క్స్ 41 స్థానాలు మెరుగుపర్చుకుని 90వ స్థానానికి చేరారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 38, బుమ్రా 41, హార్దిక్ పాండ్యా 48 స్థానాల్లో ఉన్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాక్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ మినహా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం లేదు. ఈ సిరీస్ ముగిశాక మరో మూడు నెలలు అస్సలు అంతర్జాతీయ మ్యాచ్‌లే జరుగవు. మార్చి 22 నుంచి ఐపీఎల్ స్టార్ట్ కానుండగా అన్ని జట్ల ఆటగాళ్లు ఆ లీగ్‌తోనే బిజీగా ఉంటారు. ఈ మూడు నెలల కాలంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉండవు. -
తారలు తరలి వెళ్లారు...
దుబాయ్: దాయాదుల దమ్మెంతో ప్రత్యక్షంగా చూసేందుకు తారలంతా దుబాయ్‌కి తరలి వెళ్లారు. ఏదో ఒక రంగమని కాకుండా... సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్ స్టేడియం ఓ తారాతీరమైంది. మైదానంలో భారత ఆటగాళ్లు, గ్యాలరీలో భారత అతిరథులతో స్టేడియం కళకళలాడింది.టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, టీమిండియా మాజీ సభ్యులు శిఖర్ ధావన్, వెంకటేశ్ ప్రసాద్... తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, ‘పుష్ప’ సీక్వెల్స్‌తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిన సుకుమార్, బాలీవుడ్ నుంచి హీరోయిన్ సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి రాగా, వివేక్ ఒబెరాయ్, ఊర్వశీ రౌతేలా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌కర్డ్ సంగ్మా, త్రిపుర వెస్ట్ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు బిప్లాబ్ కుమార్ దేబ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బ్రిటన్ పాప్ సింగర్ జాస్మిన్ వాలియా, బాలీవుడ్ చిత్ర గీతాలతో పాపులర్ అయిన పాకిస్తాన్ సింగర్ అతీఫ్ అస్లామ్ తదితరులతో వీఐపీ గ్యాలరీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, పాక్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె భక్తావర్ భుట్టో జర్దారి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీమ్ ఖాన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు మ్యాచ్‌ను తిలకించిన వారిలో ఉన్నారు. -
చాంపియన్స్ ట్రోఫీ: ‘భారత తుదిజట్టులో ఇషాన్, చహల్’!
క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) రూపంలో మెగా ఈవెంట్ సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19న ఈ ఐసీసీ టోర్నమెంట్ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇక ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొనున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... అదే విధంగా గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. బీసీసీఐ కూడా పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలు వెల్లడించింది.అయితే, టీమిండియాలో ప్రతిభ గల ఆటగాళ్లకు కొదవలేదు. కానీ కొన్ని సందర్భాల్లో తుదిజట్టు కూర్పు, పిచ్ స్వభావం, టోర్నీకి ముందు ప్రదర్శన.. తదితర అంశాల ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికకాని స్టార్లు చాలా మందే ఉన్నారు. మరి వారితో కూడిన భారత జట్టు, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూద్దామా?..ఓపెనర్లుగా ఆ ఇద్దరురుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)లను ఓపెనర్లుగా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. రుతు లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో 56.15 సగటు కలిగి ఉండి.. ఫార్మాట్ చరిత్రలోనే అత్యధిక యావరేజ్ కలిగిన ఐదో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.మరోవైపు జైస్వాల్ బ్యాటింగ్ సగటు కూడా ఇందులో 52.62గా ఉంది. 33 మ్యాచ్‌లు ఆడిన అతడి ఖాతాలో ఐదు శతకాలు, ఒక డబుల్ సెంచరీ కూడా ఉన్నాయి ఇక వీరిద్దరికి అభిషేక్ శర్మను బ్యాకప్ ప్లేయర్‌గా జట్టులోకి తీసుకోవచ్చు.వికెట్ కీపర్‌గా ఇషాన్మరో ఓపెనింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ కోటాలో ఎంపిక చేయవచ్చు. వన్డేల్లో అతడి ఖాతాలో ఏకంగా ద్విశతకం ఉంది. అంతేకాదు.. వన్డే ప్రపంచకప్-2023లోనూ ఆడిన అనుభవం కూడా పనికి వస్తుంది.శతకాల ధీరుడు లేకుంటే ఎలా?ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారా అంటే.. కరుణ్ నాయరే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో అతడు పరుగుల వరద పారించాడు. తాజా సీజన్లో ఏకంగా ఐదు శతకాలు బాది 750కి పైగా పరుగులు చేశాడు. కానీ అతడిని టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు.ఏదేమైనా మిడిలార్డర్లో తిలక్ వర్మతో కలిసి కరుణ్ నాయర్ ఉంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఇక ఆల్రౌండర్లుగా శివం దూబే, రియాన్ పరాగ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. వీరిద్దరు గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడారు.బౌలర్ల దళంచాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు దుబాయ్ వేదికగా కాబట్టి పరాగ్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లను తుదిజట్టులోకి తీసుకుంటే బెటర్. యుజువేంద్ర చహల్‌తో పాటు ఆర్. సాయికిషోర్ ఇక్కడ మన ఛాయిస్. ఈ ముగ్గురు మూడు రకాల స్పిన్నర్లు.పరాగ్ రైట్, కిషోర్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు అయితే.. చహల్ మణికట్టు స్పిన్నర్.. వీరికి బ్యాకప్‌గా రవి బిష్ణోయి ఉంటే సానుకూలంగా ఉంటుంది.ఇక పేసర్ల విషయానికొస్తే.. ముగ్గురు జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. మహ్మద్ సిరాజ్‌తో పాటు ప్రసిద్ కృష్ణ.. వీరికి బ్యాకప్‌గా ఆవేశ్ ఖాన్. ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్‌కు బ్యాకప్‌గా ధ్రువ్ జురెల్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఇక యశస్వి జైస్వాల్‌తో పాటు శివం దూబే చాంపియన్స్ ట్రోఫీ నాన్- ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో ఉన్న విషయం తెలిసిందే.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక కాని, అత్యుత్తమ భారత తుదిజట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, కరుణ్ నాయర్, శివమ్ దూబే*, రియాన్ పరాగ్, ఆర్. సాయి కిషోర్, యుజువేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్*, ప్రసిద్ కృష్ణ.బెంచ్: అభిషేక్ శర్మ, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ధృవ్ జురెల్.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
మా మధ్య అలాంటి పోటీ లేనేలేదు.. రోహిత్ భయ్యా మాత్రం: గిల్
జట్టు విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని తాను అభినందిస్తానని టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) అన్నాడు. తనకు ఎవరిపట్లా ద్వేషభావన లేదని స్పష్టం చేశాడు. దేశం కోసం ఆడేటపుడు ఆటగాళ్లంతా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారని.. తాను కూడా అంతేనని పేర్కొన్నాడు.కాగా వన్డే, టీ20, టెస్టు.. ఇలా మూడు ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా ఒకప్పుడు శుబ్‌మన్ గిల్‌కు ప్రాధాన్యం దక్కిన విషయం తెలిసిందే. అయితే, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) రాకతో టెస్టుల్లో ఓపెనర్‌గా గిల్ స్థానం గల్లంతైంది. ఇక అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన తర్వాత.. కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కొత్త ఓపెనింగ్ జోడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.టీ20లలో కొత్త జోడీకేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌తో పాటు పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ టీ20లలో భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. సౌతాఫ్రికా గడ్డపై రెండు శతకాలతో సంజూ.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో తాజా సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అభిషేక్ ఓపెనర్లుగా తమ స్థానాలను పటిష్టం చేసుకున్నారు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ విఫలమైనా అతడికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగానే ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. అభిషేక్ ఈ సిరీస్‌లో రికార్డు శతకం(54 బంతుల్లో 135)తో సత్తా చాటి ఓపెనర్‌గా పాతుకుపోయేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.‘టాక్సిక్’ కాంపిటిషన్?ఈ నేపథ్యంలో ఓపెనింగ్ స్థానం విషయంలో శుబ్‌మన్ గిల్‌కు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ పోటీగా తయారయ్యారని.. దీంతో అతడు ఇబ్బందులు పడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం గురించి మంగళవారం మీడియా గిల్‌ను ప్రశ్నించగా.. హుందాగా స్పందించాడు.‘‘అభిషేక్ నాకు చిన్ననాటి నుంచే స్నేహితుడు. అదే విధంగా జైస్వాల్ కూడా నాకు ఫ్రెండే. మా మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉందని నేను అనుకోను. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్క ఆటగాడు తాను గొప్పగా రాణించాలని కోరుకుంటాడు.అతడు బాగా ఆడకూడదనుకోనుప్రతి మ్యాచ్‌లోనూ అద్బుతంగా ఆడాలనే అనుకుంటాడు. అంతేకానీ.. ‘అతడు బాగా ఆడకూడదు. అలాగైతేనే నేను బాగుంటాను’ అనుకునే వాళ్లు ఎవరూ ఉండరు. జట్టు కోసం ఎవరైతే కష్టపడి ఆడి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటారో వారిని తప్పక అభినందించాలి’’ అని శుబ్‌మన్ గిల్ సమాధానం ఇచ్చాడు.ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వన్డేల్లో గత ఏడాదిన్నర కాలంగా రోహిత్ భాయ్ అద్భుతంగా ఆడుతున్నాడు. మాకు అదొక గేమ్ చేంజింగ్ మూమెంట్. ఇక ముందు కూడా అదే జోరును కొనసాగిస్తాడు’’ అని శుబ్‌మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ.. జట్టు ఫైనల్ చేరడంలో కీలకప్రాత పోషించాడు. అంతేకాదు.. శ్రీలంకతో గతేడాది వన్డే సిరీస్‌లోనూ రెండు అర్ధ శతకాలు బాదాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 6) నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. ఇందులో రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగనున్నారు.చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్‌బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్! -
విధ్వంసకర శతకం.. రెండో స్థానానికి దూసుకొచ్చిన అభిషేక్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో (ICC T20 Rankings) టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) దుమ్మురేపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడిన శర్మ.. ఒక్కసారిగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ప్రస్తుతం శర్మ కెరీర్లో అత్యుత్తమంగా 829 రేటింగ్ పాయింట్లు సాధించాడు. శర్మ దెబ్బకు సహచరుడు తిలక్ వర్మ మూడో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి దిగజారాడు. ఆసీస్ విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మ దెబ్బకు టాప్-10 (హెడ్ మినహా) బ్యాటర్లు తలో స్థానం కోల్పోయారు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టీ20ల్లో సత్తా చాటిన శివమ్ దూబే 38 స్థానాలు ఎగబాకి 58వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పర్వాలేదనిపించిన హార్దిక్ పాండ్యా 5 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరాడు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలింగ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో చివరి టీ20లో రెండు వికెట్లతో సత్తా చాటిన వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆదిల్ రషీద్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున టాప్-5లో ఉన్న ఏకైక బౌలర్ వరుణ్ ఒక్కడే. తాజా ర్యాంకింగ్స్‌లో విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్ తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగా.. హసరంగ, ఆడమ్ జంపా తలో స్థానం దిగజారి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్‌తో చివరి టీ20లో ఓ మోస్తరుగా రాణించిన భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరాడు. టీ20ల్లో భారత లీడింగ్ వికెట్ టేకర్ అర్షదీప్ 8 నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. ఇవి మినహా బౌలర్ల విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్ ఏ జట్టుకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. 19561 పాయింట్లతో టీమిండియా టాప్‌లో కొనసాగుతుంది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 12417 పాయింట్లు మాత్రమే కలిగి ఉంది. -
సెంచరీ హీరో అభిషేక్ శర్మ ఫ్యామిలీని చూశారా? (ఫోటోలు)
-
అదరగొడుతున్న ‘అభి’
142.3 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఒక బంతి... ఆ తర్వాత అదే ఓవర్లో 146.1 కిలోమీటర్ల వేగంతో మరో బంతి... 147.2 కిలోమీటర్ల వేగంతో తర్వాతి బంతి... మొదటిది ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీ దాటింది. తర్వాతి షార్ట్ బంతి బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా, మూడోది కవర్స్ మీదుగా సిక్సర్లుగా మారాయి! ప్రపంచంలో ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడైన జోఫ్రా ఆర్చర్‌ను ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ ఇలా చితకబాదిన తీరు అతని అసలైన బ్యాటింగ్ శైలిని చూపించాయి. ఒకదానితో మరొకటి పోటీ పడినట్లుగా అభిషేక్ బాదిన భారీ సిక్సర్లలో ఈ రెండు మరింత హైలైట్‌గా నిలిచాయి. అండర్–16 స్థాయి నుంచే దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన అభిషేక్ ఇప్పుడు 24 ఏళ్ల వయసులో భారత్ తరఫున టి20ల్లో భీకరమైన హిట్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన షాట్లతో వీరవిధ్వంసం సృష్టించిన ఇన్నింగ్స్ భారత టి20లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచిపోయింది. అతను కొట్టిన 7 ఫోర్లు, 13 సిక్స్‌లు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో కొట్టిన అసలైన క్రికెటింగ్ షాట్లే. ఒక్కటి కూడా అనుకోకుండా తగిలి లేదా ఎడ్జ్ తీసుకొని వెళ్లింది లేదు. డ్రైవ్, లాఫ్టెడ్ డ్రైవ్, ఫ్లిక్, కట్... ఇలా ఏదైనా శ్రమ లేకుండా అలవోకగా, చూడముచ్చటగా ఆడటం అభిషేక్‌కే చెల్లింది. ఇక ప్రభావాన్ని చూస్తే మాత్రం అన్ని షాట్లూ ఫలితం రాబట్టినవే. ఐపీఎల్ ద్వారానే అభిమానులకు చేరువైన అతను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా తన బ్యాటింగ్ పదును చూపించాడు. అక్కడే మొదలు... భారీ షాట్లు బాదడం, సిక్సర్లతో పండగ చేసుకోవడం అభిషేక్‌కు కొత్త కాదు. తన స్వస్థలం అమృత్‌సర్‌లోని గాంధీ స్టేడియంలో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే అతను ఇలా ఆడేవాడు. అతని దెబ్బకు ఎంతో విలువైన కొత్త ఎస్జీ, కూకూబుర్రా, డ్యూక్ బంతులు గ్రౌండ్ బయట పడేవి. చివరకు కోచ్‌లు, సిబ్బంది ఈ జోరును తగ్గించమని, లేదంటే చాలా ఖర్చు అవుతుందని అభిషేక్ తండ్రి రాజ్‌కుమార్ శర్మకు మొర పెట్టుకోవాల్సి వచ్చేది. అయితే మీకు కావాలంటే చండీగఢ్ నుంచి నేను కొత్త బంతులు కొని ఇస్తానే తప్ప శైలి మార్చుకోమని నా కొడుకుకు చెప్పను అతని ఆయన ఖరాఖండీగా తేల్చేశారు. దాంతో టీనేజ్‌లో వచ్చిన ఆ ధాటి అన్ని చోట్లా అలాగే కొనసాగింది. బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఒకే సీజన్ (2015–16)లో అతను ఇలాంటి బ్యాటింగ్‌తోనే ఏకంగా 1200కు పైగా పరుగులు సాధించి తానేంటో చూపించాడు. యువరాజ్ అండతో... దూకుడైన బ్యాటింగ్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్‌తో కీలక ఓవర్లు వేయగల అభిషేక్ పంజాబ్ జట్టులో మిడిలార్డర్ నుంచి టాపార్డర్‌కు మారడంతో అతని బ్యాటింగ్ సత్తా అందరికీ తెలిసింది. కెపె్టన్‌గా అండర్–19 ఆసియాకప్‌ను గెలిపించిన అభిషేక్ 2018 అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు కూడా. పంజాబ్ తొలిసారి 2023లో దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడంలో అతనిదే కీలక పాత్ర. ఈ టోర్నిలో ఏకంగా 192.46 స్ట్రయిక్‌రేట్‌తో అతను 485 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉండగా... ఆంధ్రపై 51 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో చేసిన 112 పరుగులు టోర్నిలో హైలైట్‌గా నిలిచాయి. అతని ఎదుగుదలలో భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో ఉంది. అభిషేక్‌కు మెంటార్‌గా యువీ ఎన్నో రకాలుగా మార్గనిర్దేశనం చేశాడు. ‘అభి’లోని హిట్టింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన యువీ సరైన దిశలో ప్రోత్సహించిన ఫలితమే ఇప్పుడు ఈ సిక్సర్ల పండగ. అందుకే యువరాజ్ ఎప్పుడు, ఎక్కడ ప్రాక్టీస్‌కు పిలిచినా అభిషేక్ వెంటనే హాజరైపోతాడు. ఐపీఎల్లో జోరు... భారత క్రికెట్ అభిమానులకు అభిషేక్ విధ్వంసం విలువ 2024లోనే కనిపించింది. 2022 సీజన్లో కూడా సన్‌రైజర్స్ తరఫున 426 పరుగులు చేసినా గత సీజన్ మాత్రమే అతని స్థాయిని అమాంతం పెంచేసింది. ట్రవిస్ హెడ్‌తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యాలు ఐపీఎల్లో అద్భుతాన్ని చూపించాయి. ఈ టోర్నిలో ఏకంగా 204.21 స్ట్రయిక్‌రేట్‌తో అభిషేక్ 484 పరుగులు చేసి టీమ్‌ను ఫైనల్ వరకు చేర్చాడు. ఇందులో 36 ఫోర్లు ఉంటే, సిక్స్‌లు 42 ఉన్నాయి! రెండు సార్లు సన్‌రైజర్స్ ఐపీఎల్లో అత్యధిక స్కోరు రికార్డులు బద్దలు కొట్టడంతో అతని పాత్రను అంతా ప్రత్యక్షంగా చూశారు. ఇదే సీజన్లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో అతను అదరగొట్టాడు. నిజానికి పంజాబ్ గెలిచిన ముస్తాక్ అలీ ట్రోఫీ నుంచే అతని స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. నాటి నుంచి ఆదివారం మ్యాచ్ వరకు అతను టి20ల్లో 199.47 స్ట్రయిక్‌రేట్‌తో 1893 పరుగులు చేశాడంటే అభి ఆట ఎలా సాగుతోందో అర్థమవుతుంది. డకౌట్‌తో మొదలై... ఐపీఎల్ మెరుపుల తర్వాత భారత్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో ‘డకౌట్’తో అభిషేక్ కెరీర్ మొదలైంది. అయితే దానిని మరచిపోయేలా తర్వాతి మ్యాచ్‌లో 46 బంతుల్లో సెంచరీతో అతను చెలరేగాడు. కానీ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో మళ్లీ తడబాటు. దక్షిణాఫ్రికాపై రెండు మ్యాచ్‌లలో రాణించినా తాజా సిరీస్‌కు ముందు కాస్త ఒత్తిడి. కానీ కోల్‌కతాలో తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 79 పరుగులతో చెలరేగి దానిని కాస్త తగ్గించుకోగలిగాడు. ఇప్పుడు చివరి మ్యాచ్‌కు వచ్చేసరికి అభిషేక్ విశ్వరూపం చూపించాడు. 17 మ్యాచ్‌ల టి20 కెరీర్లో అతను 276 బంతులు ఆడితే 46 ఫోర్లు, 41 సిక్సర్లతో 535 పరుగులు చేసి పరాక్రమించాడు. మున్ముందూ ఇదే ధాటి కొనసాగితే 2026 టి20 వరల్డ్ కప్ వరకు కూడా మనకు ఎదురుండదు. –సాక్షి క్రీడా విభాగం -
అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్! వైరల్
ఇంగ్లండ్‌తో ఐదో టీ20(India vs England)లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) సృష్టించిన పరుగుల విధ్వంసాన్ని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. సహచరులు విఫలమైన చోట.. ‘చేతికే బ్యాట్ మొలిచిందా’ అన్నట్లుగా.. పొట్టి ఫార్మాట్‌కే వన్నె తెచ్చేలా అతడి ఇన్నింగ్స్ సాగింది.మిగిలిన భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. తను మాత్రం ‘తగ్గేదేలే’ అన్నట్లు ప్రత్యర్థి బౌలింగ్‌ను చితక్కొట్టిన విధానం టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించింది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్!ఈ క్రమంలో అభిషేక్ శర్మను ఉద్దేశించి సహచర ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్మేట్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కత్తి పట్టుకుని ఉన్న ఫొటోతో పాటు.. బ్యాట్‌తో అభిషేక్ పోజులిస్తున్న ఫొటోను పంచుకున్న నితీశ్.. ‘‘మెంటల్ నా కొడుకు’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు సెల్యూట్ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జతచేశాడు. పూనకం వస్తే అతడిని ఎవరూ ఆపలేరన్న అర్థంలో అభిషేక్ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ ఇలా ఊరమాస్ కామెంట్ పెట్టాడు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం నితీశ్ వాడిన పదాన్ని తప్పుబడుతుండగా.. మరికొందరు అభిషేక్ ఆట తీరును వర్ణించేందుకే ఆ పదం వాడాడని పేర్కొంటున్నారు.150 పరుగుల తేడాతో మట్టికరిపించికాగా ఇప్పటికే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నాటి నామమాత్రపు ఐదో టీ20లోనూ సూర్యకుమార్ సేన సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో బట్లర్ బృందాన్ని 150 పరుగుల తేడాతో మట్టికరిపించి ఏకపక్ష విజయం సాధించింది. ప్రఖ్యాత వాంఖడే మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. ఇందుకు ప్రధాన కారణం అభిషేక్ శర్మ.ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ.. పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. అదే జోరులో 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, పదమూడు సిక్స్‌లు ఉన్నాయి.అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియాకు ఘన విజయం దక్కింది. దీంతో 4-1తో ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సూర్యకుమార్ సేన సొంతం చేసుకుంది.కాగా అంతర్జాతీయ టీ20లలో అభిషేక్ శర్మకు రెండో శతకం. ఇంతకు ముందు జింబాబ్వేపై అతడు సెంచరీ సాధించాడు. ఇక ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అభిషేక్ శర్మ.. గత సీజన్లో పరుగుల వరద పారించాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్‌తో కలిసి విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి.. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గాయం వల్ల దూరంఇక విశాఖపట్నం కుర్రాడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా సన్‌రైజర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాలోనూ ఇద్దరూ కలిసే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌తో స్నేహం దృష్ట్యా ఈ మేర కామెంట్ చేయడం గమనార్హం. కాగా నితీశ్ రెడ్డి కూడా ఇంగ్లండ్‌తో టీ20లకు సెలక్ట్ అయ్యాడు. కోల్‌కతా మ్యాచ్‌లో కూడా భాగమయ్యాడు. అయితే, గాయం కారణంగా అనంతరం జట్టుకు దూరమయ్యాడు. చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
'నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే'.. అభిషేక్‌పై బట్లర్ ప్రశంసల జల్లు
టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ ఘోర పరాభావంతో ముగించింది. ముంబై వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టీ20లో 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఇంగ్లండ్ తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది.భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ( 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135) మెరుపు సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(30), తిలక్ వర్మ(24) పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(55) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్(Jos Buttler) స్పందించాడు. అద్బుత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ(Abhishek Sharma)పై బట్లర్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ సిరీస్‌ను కోల్పోవడం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. . కానీ కొన్ని విభాగాల్లో మాత్రం మేము మెరుగ్గానే రాణించాము. ఈ ఓటమి నుంచి కచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకుంటాము. స్వదేశంలో భారత జట్టుకు తిరుగులేదు. వారిని ఓడించడం అంత సులువు కాదు. ఈ సిరీస్‌లో మా బౌలర్లు బాగానే రాణించారు. ఆఖరికి ఈ హైస్కోరింగ్ మ్యాచ్‌లో కూడా బ్రైడన్ కార్స్, మార్క్ వుడ్ అద్బుతంగా రాణించారు. ఇక అభిషేక్ శర్మ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ఇప్పటివరకు నా కెరీర్లో ఎంతో క్రికెట్ చూశాను. కానీ టీ20ల్లో అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌ను చూడడం ఇదే తొలిసారి. ఇక మా జట్టులోకి జో రూట్ తిరిగొచ్చాడు. అతడు ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. వన్డే సిరీస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాము. టీ20 సిరీస్ తరహాలోనే ఇది కూడా హోరా హోరీగా సాగుతోంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో బట్లర్ పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 6 నుంచి నాగ్‌పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, జైశ్వాల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇంగ్లండ్‌తో వన్డేలకు బరిలోకి దిగనున్నారు.ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.భారత్‌తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య
ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం(India Beat England)పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్పందించాడు. సమిష్టి కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైనందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారని.. అందుకు తగ్గ ఫలితాలను మైదానంలో చూస్తున్నామంటూ సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు.4-1తో కైవసంఇక ఎక్కువసార్లు తాము రిస్క్ తీసుకునేందుకే మొగ్గుచూపుతామన్న సూర్య.. అంతిమంగా జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో విజయంతో సిరీస్‌ను ఆరంభించిన సూర్యసేన.. చెన్నైలోనూ అదే ఫలితం పునరావృతం చేసింది.అనంతరం రాజ్‌కోట్‌లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు.. పుణెలో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20లోనూ అద్భుత ఆట తీరు కనబరిచింది. వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.అభిషేక్ శర్మ ఊచకోతఓపెనర్ సంజూ శాంసన్(16) మరోసారి వైఫల్యాన్ని కొనసాగించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) మాత్రం పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో తిలక వర్మ(24), శివం దూబే(13 బంతుల్లో 30) మాత్రమే రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బట్లర్ బృందానికి టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చాడు. బెన్ డకెట్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు తమ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.97 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) ఒక్కడు కాసేపు పోరాడగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఏమాత్రం సహకారం అందలేదు. ఫలితంగా 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో 150 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే రెండు, స్పిన్నర్లు వరుణ్ చక్రర్తి రెండు, అభిషేక్ శర్మ రెండు, రవి బిష్ణోయి ఒక వికెట్ తీశారు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.రిస్క్ అని తెలిసినాఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ‘‘జట్టులోని ఏ సభ్యుడైతే ఈరోజు రాణించగలడని భావిస్తానో.. అతడిపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాను. నెట్స్‌లో ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతున్నారు. నాకు ఎప్పుడైతే వారి అవసరం ఉంటుందో అప్పుడు కచ్చితంగా రాణిస్తున్నారు.మ్యాచ్‌కు ముందు రచించిన ప్రణాళికలకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఒక్కోసారి రిస్క్ అని తెలిసినా వెనకడుగు వేయడం లేదు. అంతిమంగా మా అందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యం.వాళ్లిద్దరు అద్భుతంఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఈరోజు అద్భుతంగా సాగింది. టాపార్డర్‌లో ఓ బ్యాటర్ ఇలా చెలరేగిపోతుంటే చూడటం ముచ్చటగా అనిపించింది. ఈ ఇన్నింగ్స్ చూసి అతడి కుటుంబం కూడా మాలాగే సంతోషంలో మునిగితేలుతూ ఉంటుంది.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రాక్టీస్ సెషన్లను చక్కగా వినియోగించుకుంటున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. అందుకు ఫలితమే ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శన. అతడి వల్ల జట్టుకు అదనపు శక్తి లభిస్తోంది. అతడొక అద్భుతం’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఈ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి పద్నాలుగు వికెట్లు తీశాడు.చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్An impressive way to wrap up the series 🤩#TeamIndia win the 5th and final T20I by 150 runs and win the series by 4-1 👌Scoreboard ▶️ https://t.co/B13UlBNLvn#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/aHyOY0REbX— BCCI (@BCCI) February 2, 2025 -
ఎప్పటినుంచో కలలు కంటున్నా.. గర్వంగా ఉంది అభిషేక్: యువీ
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీమిండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన అభిషేక్.. అనంతరం బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో సత్తాచాటాడు.అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. వాంఖడే స్టేడియంలో సిక్సర్ల వర్షం కుర్పించాడు. అతడి ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే తన రెండో టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా అభి నిలిచాడు. ఓవరాల్‌గా 54 బంతులు ఎదుర్కొన్న శర్మ.. 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135 పరుగులు చేశాడు. తద్వారా టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మపై తన మెంటార్, భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్(Yuvraj Singh) ప్రశంసల వర్షం కుర్పించాడు. "బాగా ఆడావు అభిషేక్ శర్మ! నిన్ను ఈ స్ధాయిలో చూడాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాను! ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉందంటూ" యువీ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.యువీ మెంటార్‌గా..కాగా అభిషేక్ శర్మ కెరీర్ ఎదుగుదలలో యువరాజ్‌ది కీలక పాత్ర. అతడి గైడెన్స్‌లోనే అభిషేక్ ఇంతలా రాటు దేలాడు. ఈ పంజాబీ బ్యాటర్‌కు యువీ దగ్గరుండి మరి మెళకువలు నేర్పాడు. కొవిడ్-19 సమయంలో యువరాజ్.. అభిషేక్‌తో ఇతర పంజాబ్ యువ క్రికెటర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్‌లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. అప్పటి నుంచి యువీతో అభిషేక్ నిరంతరం టచ్‌లో ఉంటున్నాడు. అభిషేక్ తన నెట్ ప్రాక్టీస్ వీడియోలను ఎప్పటికప్పుడు యువీకి షేర్ చేస్తూ ఉంటాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో ఏదైనా సమస్య ఉంటే గుర్తించి యువరాజ్ వెంటనే సరిదిద్దుకునేలా సలహాలు ఇస్తాడు. ఈ విషయాన్ని అభిషేక్ చాలా సందర్బాల్లో స్వయంగా వెల్లడించాడు.అయితే, బాగా ఆడినప్పుడు ప్రశంసించడమే కాదు.. అనవసర తప్పిదాలు చేసినపుడు కాస్త ఘాటుగానే యువీ విమర్శస్తుంటాడు. కాగా 'ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్' అభిషేక్ శర్మ తన మెరుపు సెంచరీపై మ్యాచ్ అనంతరం స్పందించాడు. తన ఇన్నింగ్స్‌తో మెంటార్ యువరాజ్ సింగ్ సంతోషించంటాడని అభి చెప్పుకొచ్చాడు.వారిద్దిరి కోరిక ఇదే: అభిషేక్"ఈ సెంచరీ నాకు చాలా ప్రత్యేకమైనది. దేశం కోసం ఈ తరహా ప్రదర్శన చేయడం ఎప్పుడు గొప్ప అనుభూతిని ఇస్తుంది. నాదైనా రోజున తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. మా కోచ్, కెప్టెన్ నాకు తొలి రోజు నుంచే ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. వారు ఎప్పుడూ నా నుంచి ఇటువంటి ప్రదర్శనే ఆశిస్తుంటారు. ప్రత్యర్థి బౌలర్లు 140-150కి.మీ కన్నా వేగంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు, వాటిని ఆడేందుకు వాళ్ల కన్నా ఒక్క సెకెన్ ముందే సిద్ధంగా ఉండాలి. బంతిని సరిగ్గా అంచనా వేసి షాట్లు ఆడాను. వరల్డ్‌క్లాస్ బౌలర్ అర్చర్ బౌలింగ్‌లో కవర్స్ మీదగా కొట్టిన షాట్ నాకెంతో ప్రత్యేకం. అలాగే రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టడం కూడా బాగుంది. రషీద్ బౌలింగ్‌లో కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్.. యువీ పాజీ నుంచి నేర్చుకున్నాను.కాబట్టి యువీ ఈ రోజు సంతోషంగా ఉంటాడనుకుంటున్నా. అతను ఎప్పుడూ నేను 15 నుంచి 20 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలని కోరుకునేవాడు. ఈ రోజు యువీ పాజీ కోరిక నేరవేర్చాను. గౌతీ భాయ్ కూడా ఇదే కోరుకునేవాడు. ఈ మ్యాచ్‌లో దానిని అమలు చేసి చూపించా అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో అభిషేక్ పేర్కొన్నాడు.చదవండి: వరల్డ్ రికార్డు.. వికెట్ కోల్పోకుండానే 376 కొట్టేశారు Abhishek Sharma all the shots from his spectacular innings! 🔥 pic.twitter.com/VflLAHiTRA— Keh Ke Peheno (@coolfunnytshirt) February 3, 2025 -
‘ఇలాంటి టీ20 సెంచరీ చూడనేలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు’
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma)పై హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్‌తో చివరి టీ20లో భారీ సెంచరీతో చెలరేగిన అభిషేక్ ఆటతీరు అమోఘమని కొనియాడాడు. ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ తానెప్పుడూ చూడలేదని గంభీర్ అన్నాడు. పరుగుల సునామీకాగా ఇంగ్లండ్‌తో నామమాత్రపు ఐదో టీ20(India vs England)లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. పదిహేడు బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోకుండా చేసి.. మొత్తంగా 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏకంగా పదమూడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అభిషేక్ పరుగుల వరద పారిస్తుంటే వాంఖడేలో నేరుగా ఈ అద్బుతాన్ని వీక్షించిన ప్రేక్షకులతో పాటు.. టీవీలు, ఫోన్లలో మ్యాచ్ చూస్తున్న క్రికెట్ ప్రేమికులూ ఆనందంతో మురిసిపోయారు.ప్రశంసల వర్షంఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయాడు. ‘అభిషేక్ నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. కొత్త తరం ఆటగాళ్లు భయం లేకుండా దూకుడుగా ఆడుతున్నారు. అలాంటి వాళ్లకు అండగా నిలుస్తాం.ఇలాంటి టీ20 సెంచరీ చూడనేలేదుఇంగ్లండ్ బౌలర్లు 140–150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతుంటే అభిషేక్ అలవోకగా సిక్సర్లు బాదాడు. దీనికంటే గొప్ప టీ20 శతకాన్ని చూడలేదు. ఫలితాలు అనుకూలంగా వస్తే అంత సవ్యంగా సాగుతుంది. పరాజయాలు ఎదురైనప్పుడే జట్టుపై విమర్శలు వస్తాయి. అలాంటి కష్ట కాలాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం.వన్డేల్లోనూ ఇదే దూకుడుఈ జట్టు చాలా కాలంగా కలిసి ఆడుతోంది. వారి మధ్య మంచి అనుబంధం ఉంది. 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం అంటే ఎలా ఉంటుందో మా ఆటగాళ్లకు తెలుసు. వన్డేల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తాం’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత టీ20 సిరీస్‌లో భాగంగా కోల్‌కతా, చెన్నై మ్యాచ్‌లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఓటమిపాలైంది. అయితే, పుణెలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.247 పరుగులు ఈ క్రమంలో వాంఖడే మైదానంలో ఇరుజట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావించిన ఇంగ్లండ్ ఆశలపై భారత జట్టు నీళ్లు చల్లింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. అభిషేక్ శర్మ సునామీ శతకం కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో.. తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగులు చేసింది.ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. ఫిలిప్ సాల్ట్(23 బంతుల్లో 55) మెరుపు హాఫ్ సెంచరీతో అలరించినా.. మిగతా వాళ్లలో జాకొబ్ బెతల్(10) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, వరుణ్ చక్రవర్తి, శివం దూబే, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు కూల్చగా.. రవి బిష్ణోయి ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌పై 150 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 4-1తో ముగించింది. తదుపరి ఫిబ్రవరి 6 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
ముంబై టీ20లో అభిషేక్ శర్మ సెంచరీ
-
చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కళ్లు చెదిరే షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపించాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం లెక్కచేయలేదు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 37 బంతల్లోనే తన రెండో టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అంతకుముందు తన హాఫ్ సెంచరీని శర్మ కేవలం 17 బంతుల్లోనే అందుకున్నాడు.ఓవరాల్‌గా 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. అటు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో ఈ పంజాబీ క్రికెటర్ సత్తాచాటాడు. ఇక సెంచరీతో చెలరేగిన శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..👉అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు. ఈ రికార్డు ఇప్పటివరకు మరో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ పేరిట ఉండేది. గిల్ 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 126 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 135 పరుగులు చేసిన అభిషేక్.. గిల్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉టీ20ల్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్దానంలో ఉన్నాడు. 2017లో శ్రీలంకపై హిట్‌మ్యాన్ కేవలం 35 బంతుల్లోనే శతకొట్టాడు.👉అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్‌మ్యాన్ 10 సిక్సర్లు బాదాడు. తాజా మ్యాచ్‌లో 13 సిక్స్‌లు కొట్టిన అభిషేక్.. రోహిత్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.బటీ20ల్లో ఇంగ్లండ్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉండేది. ఫించ్ ఇంగ్లండ్‌పై 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ప్రస్తుత మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే శతకం బాదిన శర్మ.. ఫించ్ రికార్డును బద్దలు కొట్టాడు.భారత్ విజయ భేరి..ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌ను భారత్ విజయంతో ముగించింది. ఆఖరి టీ20లో 150 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(135)తో పాటు.. శివమ్ దూబే(30), తిలక్ వర్మ(24) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. వుడ్ రెండు, అర్చర్,రషీద్, ఓవర్టన్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(55) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.చదవండి: తొలి కల నెరవేరింది -
అభిషేక్ శర్మ విధ్వంసం..భారత్ గెలుపు సిరీస్ కైవసం (ఫొటోలు)
-
అభిషేక్...అమోఘం
ఇన్నింగ్స్ తొలి బంతికే సామ్సన్ సిక్స్‌తో భారత్ ఆట ఆరంభం. మూడో ఓవర్లో బౌండరీతో అభిషేక్ ధాటి కాస్త ఆలస్యం! అంతే ఇక ఆ ఓవర్లోనే రెండు సిక్స్‌లతో పదునెక్కిన ప్రతాపం. ఆర్చర్, మార్క్ వుడ్, ఓవర్టన్ ఇలా పేసర్లు మారినా... లివింగ్‌స్టోన్, రషీద్‌లు స్పిన్నేసినా... బంతి గమ్యం, అభిషేక్ వీరవిహారం... ఈ రెండూ ఏమాత్రం మారలేదు. 13 సిక్సర్లతో ‘వాంఖెడే’కు అభిషేకం... 37 బంతుల్లోనే శతకం... 18వ ఓవర్ దాకా అతనొక్కడిదే విధ్వంసం!ఆఖరి పోరు గెలిచి ఆతిథ్య దేశం ఆధిక్యానికి గండి కొట్టేద్దామనుకుంటే ఇంగ్లండ్ కనీసం జట్టంతా కలిపి 100 పరుగులైనా కొట్టలేకపోయింది. ప్రత్యర్థి పేస్, స్పిన్ వైవిధ్యం అభిషేక్ శర్మ ధాటిని ఏ ఓవర్లోనూ, ఏ బౌలింగ్‌తోనూ అసలు ప్రభావమే చూపలేకపోయింది. ముంబై: ఏఐ... అదేనండీ అర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వైపే ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. కానీ వాంఖెడే స్టేడియంలో మాత్రం మరో ఏఐ... అదే భయ్యా అభిషేక్ ఇంటలిజెంట్ బ్యాటింగ్ వైపే ఓ గంటసేపు కన్నార్పకుండా చూసేలా చేసింది. ఇది కదా ఫన్... ధన్ ధనాధన్! ఇదే కదా ఈ టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ మిస్సయ్యింది. అయితేనే ఆఖరి పోరులో ఆవిష్కృతమైంది. అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్స్‌లు) ఆమోఘ శతకం, అదేపనిగా విధ్వంసం ముంబై వాసుల్ని మురిపించింది. టీవీ, మొబైల్ యాప్‌లలో యావత్ భారత అభిమానుల్ని కేరింతలతో ముంచెత్తింది. అతని ఆటలో అయ్యో ఈ షాట్‌ను చూడటం మిస్ అయ్యామే అని బహుశా ఏ ఒక్కరికీ అనిపించి ఉండకపోవచ్చు! ఎందుకంటే ప్రతి షాట్ హైలైట్స్‌నే తలదన్నేలా ఉంది. ఆదివారం అసలైన టి20 వినోదాన్ని పంచిన చివరి టి20లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 247 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్న కాసేపు మెరిపించాడు. బ్రైడన్ కార్స్ 3, మార్క్‌వుడ్ 2 వికెట్లు తీశారు. తర్వాత కష్టమైన లక్ష్యం ఛేదించేందుకు దిగిన ఇంగ్లండ్ 10.3 ఓవర్లలోనే 97 పరుగుల వద్దే ఆలౌటైంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాదిన అర్ధశతకంతో ఆ మాత్రం స్కోరు చేసింది. మిగతావారిలో జాకబ్ బెథెల్ (10; 1 సిక్స్) తప్ప అందరివి సింగిల్ డిజిట్లే! షమీ 3 వికెట్లు పడగొడితే ఒక్క ఓవర్ వేసిన అభిషేక్, దూబే, వరుణ్‌లు తలా 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను 11వ ఓవర్ ముగియక ముందే స్పిన్‌తో దున్నేశారు. ఇంగ్లండ్ పాలిట సిక్సర పిడుగల్లే... మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే మ్యాచ్ అంతటిని అభిషేక్ ఒక్కడే షేక్ చేశాడు. ఐదు పదుల బంతులు (54) ఎదుర్కొంటే ఇందులో కేవలం 5 మాత్రమే డాట్ బాల్స్. అంటే పరుగు రాలేదు. కానీ మిగతా 49 బంతుల్లో ‘రన్’రంగమే... ప్రత్యర్థి బౌలర్లేమో లబో... దిబో! ఇది అభిషేక్ సాగించిన విధ్వంసం. 17 బంతుల్లోనే అతను సాధించిన ఫిఫ్టీ భారత్ తరఫున రెండో వేగవంతమైన అర్ధశతకమైంది. అంతేనా... పవర్ ప్లే (6 ఓవర్లు)లో జట్టు స్కోరు 95/1 ఇది భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లోనే అత్యధిక స్కోరైంది. ఆ తర్వాత 37 బంతుల్లోనే దంచేసిన మెరుపు శతకం శాశ్వత దేశాల మధ్య రెండో వేగవంతమైన సెంచరీగా పుటలకెక్కింది. 2017లో మిల్లర్ (దక్షిణాఫ్రికా) బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో శతక్కొట్టాడు. 3.5 ఓవర్లో 50 పరుగులు దాటిన భారత్ స్కోరు అతనొక్కడి జోరుతో 6.3 ఓవర్లోనే వందకు చేరింది. భారత్ 12వ ఓవర్లో 150, 16వ ఓవర్లో 200 పరుగుల్ని అవలీలగా దాటేసింది. మిగతావారిలో శివమ్ దూబే కాస్త మెరిపించాడు. అయితే దూబే (2–0–11–2) బౌలింగ్ స్పెల్‌తో గత మ్యాచ్ ‘కన్కషన్’ విమర్శలకు తాజా మ్యాచ్‌లో బంతితో సమాధానమిచ్చాడు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) ఆర్చర్ (బి) వుడ్ 16; అభిషేక్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 135; తిలక్‌వర్మ (సి) సాల్ట్ (బి) కార్స్ 24; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) కార్స్ 2; దూబే (సి) రషీద్ (బి) కార్స్ 30; హార్దిక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) వుడ్ 9; రింకూసింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్ 9; అక్షర్ రనౌట్ 15; షమీ నాటౌట్ 0; రవి బిష్ణోయ్ (సి) కార్స్ (బి) ఓవర్టన్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–21, 2–136, 3–145, 4–182, 5–193, 6–202, 7–237, 8–247, 9–247. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–55–1, మార్క్‌వుడ్ 4–0–32–2, ఓవర్టన్ 3–0–48–1, లివింగ్‌స్టోన్ 2–0–29–0, అదిల్ రషీద్ 3–0–41–1, బ్రైడన్ కార్స్ 4–0–38–3. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సబ్–జురేల్ (బి) దూబే 55; డకెట్ (సి) అభిషేక్ (బి) షమీ 0; బట్లర్ (సి) తిలక్‌వర్మ (బి) వరుణ్ 7; హ్యారీ బ్రూక్ (సి) వరుణ్ (బి) రవి బిష్ణోయ్ 2; లివింగ్‌స్టోన్ (సి) రింకూ (బి) వరుణ్ 9; జాకబ్ (బి) దూబే 10; కార్స్ (సి) వరుణ్ (బి) అభిషేక్ 3; ఓవర్టన్ (సి) సూర్యకుమార్ (బి) అభిషేక్ 1; ఆర్చర్ నాటౌట్ 1; రషీద్ (సి) సబ్–జురేల్ (బి) షమీ 6; మార్క్‌వుడ్ (సి) సబ్–జురేల్ (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (10.3 ఓవర్లలో ఆలౌట్) 97. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–59, 4–68, 5–82, 6–87, 7–90, 8–90, 9–97, 10–97. బౌలింగ్: షమీ 2.3–0–25–3, హార్దిక్ పాండ్యా 2–0–23–0, వరుణ్ 2–0–25–2, రవి బిష్ణోయ్ 1–0–9–1, శివమ్ దూబే 2–0–11–2, అభిషేక్ 1–0–3–2. ఆహా... ఆదివారంభారత క్రీడాభిమానులకు ఆదివారం పండుగలా గడిచింది. మధ్యాహ్నం కౌలాలంపూర్‌లో భారత అమ్మాయిల జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుసగా రెండోసారి అండర్–19 టి20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష చిరస్మరణీయ ఆటతీరుతో అదరగొట్టింది. భారత జట్టు రెండోసారి విశ్వవిజేతగా నిలువడంలో కీలకపాత్ర పోషించింది. రాత్రి ఇటు ముంబైలో భారత పురుషుల జట్టు ఇంగ్లండ్‌పై వీరంగం సృష్టించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి టి20ల్లో రెండోసారి ‘శత’క్కొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ అందుకున్న అభిషేక్ అమోఘమైన ఆటతో భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఏకంగా 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. 1 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (135) చేసిన ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు. శుబ్‌మన్ గిల్ (126 నాటౌట్; న్యూజిలాండ్‌పై) రెండో స్థానంలో ఉన్నాడు. 2 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన సెంచరీ (37 బంతుల్లో) చేసిన రెండో ఆటగాడు అభిషేక్. రోహిత్ శర్మ (35 బంతుల్లో; శ్రీలంకపై) అగ్రస్థానంలో ఉన్నాడు. 13 ఈ మ్యాచ్‌లో అభిషేక్ కొట్టిన సిక్స్‌లు. భారత్ తరఫున అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఇదే అత్యధికం. రోహిత్ (10 సిక్స్‌లు; శ్రీలంకపై), సామ్సన్ (10 సిక్స్‌లు; దక్షిణాఫ్రికాపై), తిలక్ (10 సిక్స్‌లు; దక్షిణాఫ్రికాపై) రెండో స్థానాల్లో ఉన్నారు. -
అభిషేక్ శర్మ విధ్వంసకర శతకం.. ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు చెలరేగడంతో 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాట్‌తో విజృంభించిన అభిషేక్.. ఆతర్వాత బంతితోనూ రాణించి రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టినందుకు గానూ అభిషేక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 14 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. రికార్డులు కొల్లగొట్టిన అభిషేక్ఈ మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీ సాధించిన అభిషేక్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టీ20ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), రెండో వేగవంతమైన సెంచరీని (37) నమోదు చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. 17 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో అభిషేక్‌కు ఇది రెండో సెంచరీ.ఈ మ్యాచ్‌లో అభిషేక్ సాధించిన మరిన్ని రికార్డులు..- టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135).- టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13).- అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది.టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్ఈ మ్యాచ్‌లో భారత్ నమోదు చేసిన స్కోర్ (247/9) టీ20ల్లో నాలుగో అత్యధికం. ఈ మ్యాచ్‌లో భారత్ మరింత భారీ స్కోర్ సాధించాల్సింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. భారత బౌలర్లు ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరిని కుదురుకోనివ్వలేదు. షమీ (2.3-0-25-3), వరుణ్ చక్రవరి (2-0-25-2), శివమ్ దూబే (2-0-11-2), అభిషేక్ శర్మ (1-0-3-2), రవి బిష్ణోయ్ (1-0-9-1) తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కేవలం సాల్ట్, జేకబ్ బేతెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. టీ20ల్లో పరుగుల పరంగా (150) ఇంగ్లండ్‌కు ఇది భారీ పరాజయం.చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తిఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్‌కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. -
IND VS ENG 5th T20: అభిషేక్ శర్మ మహోగ్రరూపం.. 37 బంతుల్లోనే శతకం
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరఫున టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఓ భారీ రికార్డు సాధించింది. పవర్ ప్లేల్లో (తొలి 6 ఓవర్లలో) తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అభిషేక్ విధ్వంసం ధాటికి భారత్ తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు పవర్ ప్లేల్లో టీమిండియా అత్యధిక స్కోర్ 82/2గా ఉండింది. 2021లో స్కాట్లాండ్పై భారత్ ఈ స్కోర్ చేసింది.టీ20 పవర్ ప్లేల్లో భారత్ అత్యధిక స్కోర్లు95/1 ఇంగ్లండ్‌పై (2025)82/2 స్కాట్లాండ్పై (2021)82/1 బంగ్లాదేశ్‌పై (2024)78/2 సౌతాఫ్రికాపై (2018)కాగా, ఈ మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసం హాఫ్ సెంచరీతో ఆగలేదు. హాఫ్ సెంచరీ తర్వాత అతను మరింత చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా సూర్యకుమార్ యాదవ్ (2) క్రీజ్‌లో ఉన్నాడు. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 143/2గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 7 బంతుల్లో 16, తిలక్ వర్మ 15 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ కాస్త పర్వాలేదనిపించగా.. శాంసన్ వరుసగా ఐదో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్హాఫ్ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. గతేడాది చౌహాన్ సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 194/5. అభిషేక్ (108), రింకూ సింగ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
Ind vs Eng: బౌలర్లకు కష్టమే.. బ్యాటర్లపైనే భారం! వారు ‘ఫాస్ట్ షో’ మొదలెడితే..
ఇంకా కెప్టెన్ సూర్యకుమార్(Suryakumar Yadav) ‘360 డిగ్రీ’ బ్యాటింగ్ బాకీ ఉంది. సంజూ శాంసన్(Sanju Samson) మెరుపు జోరు కనబర్చలేదు. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) అసలు ఆట మిగిలే ఉంది. అయినాసరే భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఇప్పుడు సిరీస్‌ను కైవసం చేసుకునే పనిలో పడింది. ఒకవేళ ఈ ముగ్గురు గనక రాణిస్తే మూడో మ్యాచ్‌తోనే భారత్ ఐదు టీ20ల సిరీస్‌ను గెలుచుకునే అవకాశముంది. ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై ‘హ్యాట్రిక్’ విజయం, సిరీస్ కైవసం ఏమంత కష్టం కాకపోవచ్చు. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఇప్పుడు సిరీస్‌పైనే కన్నేసింది. రాజ్‌కోట్‌లో జరిగే మూడో టీ20లో గెలిచి ఇక్కడే సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో తమ వైఫల్యాల్ని అధిగమిస్తే ఇంగ్లండ్‌కు మూడో పరాజయం తప్పదేమో! ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమి బట్లర్ బృందాన్ని కుంగదీసింది.ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. అయితే ఇది పొట్టి ఫార్మాట్. ఏ క్షణంలోనైనా, ఏ ఓవరైనా ఉన్నపళంగా మార్చేయగలదు. కాబట్టి ఏ జట్టు తప్పక గెలుస్తుందనే గ్యారంటీ లేదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ సాల్ట్–డకెట్ విఫలమైంది. వారి ఓపెనింగ్‌లో గునక ‘పవర్ ప్లే’ కనబడితే భారత్‌కు సవాళ్లు తప్పవు. ఈ నేపథ్యంలో గత రెండో టీ20లాగే ఉత్కంఠరేపే సమరం జరిగొచ్చు.టాపార్డర్ రాణిస్తే... ఓపెనర్లలో అభిషేక్ శర్మ తొలి మ్యాచ్‌లో మెరిపించాడు. కానీ శాంసన్ నుంచే ఆ మెరుపులు కరువయ్యాయి. కెప్టెన్ సూర్యకుమార్ కూడా టీ20కి కాదుకదా... వన్డేకు సరిపడా ఆటకూడా చూపించలేకపోయాడు. ఈ ముగ్గురు మూకుమ్మడిగా రాణిస్తే మిడిలార్డర్ సంగతి చూసుకునేందుకు తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, ధ్రువ్ జురేల్ ఉన్నారు.బ్యాటింగ్‌కు అచ్చొచ్చే పిచ్‌పై లోయర్ ఆర్డర్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు కూడా దంచేసే అవకాశాన్ని పిచ్ కల్పిస్తుంది. గత మ్యాచ్‌ల్ని నిశితంగా గమనిస్తే... బ్యాటింగ్ కన్నా కూడా మన బౌలింగ్ దళం గట్టి ప్రభావమే చూపింది. ఇంగ్లండ్ టాపార్డర్‌ను తేలిగ్గా కూల్చేస్తుంది. అర్ష్‌దీప్, పాండ్యాలకు జతగా మరో సీమర్‌ను తీసుకోవాలనుకుంటే స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని పక్కన బెట్టొచ్చు.భారమంతా బ్యాటర్లపైనే... ఇంగ్లండ్ కూడా గత మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకుంది. హిట్టింగ్ ఓపెనర్లను కూల్చి, మిడిలార్డర్‌ను దెబ్బతీసి మ్యాచ్‌ను గెలిచేస్థితికి వచ్చేసింది. అయితే తిలక్ వర్మ పోరాటమే వారి శ్రమను నీరుగార్చింది. లేదంటే చెన్నైలోనే భారత్‌కు 1–1తో చెక్ పెట్టేది. కార్స్, మార్క్‌వుడ్, ఆర్చర్, రషీద్‌లతో కూడిన బౌలింగ్ దళం పటిష్టంగానే ఉంది.అయితే పరిస్థితి చక్కబెట్టాల్సింది... ఎదురుదాడికి దిగాల్సింది... బ్యాటర్లే! ఫిల్ సాల్ట్, డకెట్‌లు ఆషామాషీ ఓపెనర్లు కాదు. కానీ వారి ఫ్లాప్‌షో ముగిసి ‘ఫాస్ట్ షో’ మొదలైతే మాత్రం పరుగుల తుఫాన్ ఖాయం. బట్లర్, బ్రూక్, లివింగ్‌స్టోన్, స్మిత్, ఓవర్టన్, కార్స్, ఆర్చర్ ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదో వరుస బ్యాటింగ్ దాకా పరుగుల బాదే ఆటగాళ్లే జట్టుకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇంగ్లండ్ భారమంతా బ్యాటర్లపైనే ఉంది.పిచ్, వాతావరణం రాజ్‌కోట్ పిచ్ ఎప్పుడైనా బ్యాటింగ్‌కు స్వర్గధామం. ప్రత్యేకించి టీ20ల్లో పరుగుల వరద, మెరుపుల సరదా ఖాయం. బ్యాటర్ ఫ్రెండ్లీ వికెట్‌పై బౌలర్లకు కష్టాలు తప్పవు. గత రెండు మ్యాచ్‌ల్లో నమోదైన మోస్తరు స్కోరును సులువుగా అధిగమిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.తుది జట్లు (అంచనా) భారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జురేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్/షమీ, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ తుదిజట్టు: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్రాజ్కోట్ సూర్యకు ప్రత్యేకంరాజ్కోట్లో భారత జట్టు ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో (2013లో ఆస్ట్రేలియాపై; 2019లో బంగ్లాదేశ్‌పై; 2022లో దక్షిణాఫ్రికాపై; 2023లో శ్రీలంకపై) గెలిచిన టీమిండియా ఒక మ్యాచ్‌లో (2017లో న్యూజిలాండ్ చేతిలో) ఓడిపోయింది. ఈ మైదానంలో చివరిసారి 2023 జనవరి 7న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం విశేషం.చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: భారత మాజీ క్రికెటర్ -
Ind vs Eng: టీమిండియాకు ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం!
ఇంగ్లండ్‌తో రెండో టీ20కి టీమిండియా(India Vs England 2nd T20) పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. విజయంతో ఆరంభించిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిపత్యమే లక్ష్యంగా చెపాక్ బరిలో దిగనుంది. అయితే, చెన్నై మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) గాయపడినట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా శుక్రవారం సాయంత్రం చిదంబరం స్టేడియంలో నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు.చీలమండ నొప్పిఈ సందర్భంగానే అభిషేక్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి పాదం మెలిక పడగా.. చీలమండ నొప్పి(Ankle Injury)తో విలవిల్లాడాడు. ఈ క్రమంలో వెంటనే ఫిజియోలు వచ్చి అభిషేక్‌ను పరీక్షించారు. అనంతరం అతడు మైదానం వీడాడు. అయితే, మళ్లీ నెట్ సెషన్లో బ్యాటింగ్‌కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో టీ20కి అభిషేక్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది.సంజూకు జోడీ ఎవరు?ఒకవేళ అభిషేక్ శర్మ గనుక దూరమైతే సంజూ శాంసన్‌తో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే ప్రయోగాత్మకంగా ఇంకెవరినైనా టాపార్డర్‌కు ప్రమోట్ చేస్తాడా? అనే చర్చ జరుగుతోంది. కాగా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.తొలి టీ20లో అభిషేక్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు.. బట్లర్ బృందాన్ని 132 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం.. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ దంచికొట్టాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న 24 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 79 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.మిగతా వాళ్లలో కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.షమీ వస్తాడా?కాగా టీమిండియలో పునగామనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతాలో మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన క్రమంలో షమీకి చోటు ఇవ్వలేకపోయినట్లు మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అద్భుత గణాంకాలు కలిగి ఉన్న యువ పేసర్ అర్ష్‌దీప్ ఒక్కడికే తుదిజట్టులో దక్కగా.. షమీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.అయితే, తొలి టీ20లో ప్రభావం చూపలేకపోయినప్పటికీ రవి బిష్ణోయికి మరో అవకాశం ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లతో పాటు అతడినీ రెండో టీ20లో కొనసాగించే అవకాశం ఉంది. ఇక అభిషేక్ శర్మ గాయంతో దూరమైతే గనుక షమీని తుదిజట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయాడు. ఆరంభ ఓవర్లలో అర్ష్‌దీప్ త్వరత్వరగా వికెట్లు తీశాడు కాబట్టి సరిపోయింది. అందుకే ఈసారి అర్ష్‌దీప్‌తో పాటు షమీని కొత్త బంతితో బరిలోకి దించాలనే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చెన్నైలో చిదంబరం స్టేడియం(చెపాక్)లో శనివారం రాత్రి ఏడు గంటలకు ఇండియా- ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది.చదవండి: భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా ఇంగ్లండ్ బ్యాటర్ల అసమర్థతను బాగానే కప్పి పుచ్చుతున్నావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.దమ్ముంటే రెండో టీ20(India vs England)లో సత్తా చూపించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్చర్‌ను ట్రోల్ చేస్తున్నారు. టీమిండియా చేతిలో ఓటమిపై స్పందిస్తూ.. ఆర్చర్ ఒకింత వింత వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..టీమిండియా ఘన విజయంఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ ఆరంభం కాగా.. బుధవారం మొదటి మ్యాచ్ జరిగింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సాగిన ఈ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో బట్లర్ బృందాన్ని చిత్తు చేసింది.ఆకాశమే హద్దుగా అభిషేక్ శర్మఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్ల విజృంభణ కారణంగా ఇంగ్లండ్‌ను 132 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనలోనూ అదరగొట్టింది. మరో 43 బంతులు మిగిలి ఉండగానే 133 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సుడిగాలి ఇన్నింగ్స్‌తో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న అభిషేక్ శర్మ.. మొత్తంగా 34 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.అయితే, ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక వన్‌డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి లక్ష్యాన్ని పూర్తి చేశారు.జోఫ్రా ఆర్చర్‌కు వికెట్లుఇక టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లలో రెండు జోఫ్రా ఆర్చర్‌కు దక్కాయి. సంజూ శాంసన్‌తో పాటు.. సూర్యకుమార్ యాదవ్‌లను ఈ రైటార్మ్ పేసర్ అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ.. అదృష్టం వల్లే టీమిండియా గెలిచిందన్న అర్థంలో వ్యాఖ్యానించాడు.అదృష్టం వల్లే గెలిచారు‘‘ఈరోజు మ్యాచ్‌లో మిగతా బౌలర్లతో పోలిస్తే పరిస్థితులు నాకు కాస్త అనుకూలంగానే ఉన్నాయి. మావాళ్లలో అందరూ బాగానే బౌలింగ్ చేశారు. అయితే, టీమిండియా బ్యాటర్ల అదృష్టం వల్ల వారికి భంగపాటు ఎదురైంది.టీమిండియా బ్యాటర్లు ఆడిన చాలా బంతులు గాల్లోకి లేచాయి. కానీ.. మేము సరిగ్గా క్యాచ్‌లు పట్టలేకపోయాం. తదుపరి మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా ఇలాంటి పొరపాట్లు చేయబోము. అన్ని క్యాచ్‌లు ఒడిసిపడతాం. అప్పుడు నలభై పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయేలా చేస్తాం’’ అని జోఫ్రా ఆర్చర్ చెప్పుకొచ్చాడు.నిజానికి తొలి టీ20లో అభిషేక్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మాత్రమే ఇంగ్లండ్ ఫీల్డర్లు జారవిడిచారు. తిలక్ వర్మ కూడా ఓసారి బంతిని గాల్లోకి లేపినా.. అదేమీ అంత తేలికైన క్యాచ్ కాదు. ఈ రెండు తప్ప టీమిండియా బ్యాటర్లు క్యాచ్‌లకు ఎక్కువగా అవకాశం ఇవ్వనే లేదు.అయినప్పటికీ అదృష్టం వల్లే టీమిండియా బ్యాటర్లు తప్పించుకున్నారంటూ ఆర్చర్ వ్యాఖ్యానించడం.. అభిమానుల ఆగ్రహానికి ప్రధాన కారణం. మరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం తమ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామంటూ.. భారత బౌలర్లకు క్రెడిట్ ఇవ్వడం గమనార్హం.చదవండి: Rohit Sharma: వింటేజ్ ‘హిట్‌మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి విఫలమై! -
టీమిండియా భవిష్య కెప్టెన్‌గా తిలక్ వర్మ!
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆటంటే తనకెంతో ఇష్టమని.. టీ20లలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. పొట్టి ఫార్మాట్లో టీమిండియా భవిష్య కెప్టెన్‌గా తాను తిలక్‌నే ఎంచుకుంటానని బ్రాడ్ హాగ్ తెలిపాడు.ఐపీఎల్లో సత్తా చాటికాగా అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే అద్భుతాలు చేసిన అతడు టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023 ఆగష్టులో వెస్టిండీస్(West Indies Tour)తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.సౌతాఫ్రికా గడ్డపై వరుస సెంచరీలుఅదే పర్యటనలో వన్డేల్లోనూ తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మొత్తంగా 21 టీ20లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 635 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా రెండు శతకాలు ఉండటం విశేషం. అంతేకాదు.. ఈ రెండూ కూడా సౌతాఫ్రికా గడ్డపై.. అదీ వరుస మ్యాచ్‌లలో సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం.ఇక ఇప్పటికి నాలుగు వన్డేలు పూర్తి చేసుకున్న 22 ఏళ్ల తిలక్ వర్మ 68 పరుగులు చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల.. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో బ్యాటర్‌గా, సారథిగా సత్తా చాటి ఫైనల్‌కు చేర్చాడు.ఇక తిలక్ వర్మ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఇరుజట్ల మధ్య కోల్‌కతాలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 16 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.టీమిండియా కెప్టెన్ కావడం ఖాయంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తిలక్ వర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నాకు అత్యంత ఇష్టమైన యువ క్రికెటర్ తిలక్ వర్మ. టీ20 ఫార్మాట్లో అతడు టీమిండియాకు కెప్టెన్ కావడం ఖాయం. అతడు చాలా స్మార్ట్. అతడి క్రికెట్ బ్రెయిన్ సూపర్. అందుకే భవిష్య కెప్టెన్‌గా ఎదుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు.అభిషేక్ భేష్అదే విధంగా.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అదరగొట్టిన అభిషేక్ శర్మను కూడా బ్రాడ్ హాగ్ ఈ సందర్భంగా అభినందించాడు. ‘‘కొన్నిసార్లు అతడు విఫలమైన మాట వాస్తవం. అయితే, కోచ్‌తో పాటు కెప్టెన్ మద్దతు ఉండటం అతడికి సానుకూలాంశం. ఎందుకంటే.. టీ20 క్రికెట్లో టాపార్డర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని ఏ జట్టైనా కోరుకుంటుంది.ఓపెనింగ్ బ్యాటర్‌కు మేనేజ్మెంట్ కాస్త స్వేచ్ఛనిస్తుంది. పవర్ ప్లేలో పరుగులు రాబట్టి మంచి పునాది వేస్తే.. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుంది. అభిషేక్ శర్మ విధ్వంసకర ఓపెనర్. అతడు ఈరోజు అద్భుతంగా ఆడాడు. ఇలాగే మున్ముందూ కొనసాగాలి’’ అని బ్రాడ్ హాగ్ ఆకాంక్షించాడు.కాగా తొలి టీ20లో ఇంగ్లండ్‌ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 34 బంతుల్లోనే 79 పరుగులతో రాణించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 232.35.చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికి ఇవ్వాల్సింది.. మూడు ఓవర్లలోనే..
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో టీమిండియా(India Beat England) శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను కట్టడి చేయగా.. లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగి అభిషేక్ శర్మ విజయాన్ని నల్లేరు మీద నడకలా మార్చాడు.ఈ మ్యాచ్‌లో సత్తా చాటి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh), వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలను టీమిండియా అభిమానులు హీరోలుగా అభివర్ణిస్తున్నారు. ఈ ముగ్గురి చక్కటి ఆట తీరు వినోదాన్ని పంచిందంటూ కితాబులిస్తున్నారు. ఇక వీరిలో వరుణ్ చక్రవర్తిని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించిన విషయం తెలిసిందే.అభిషేక్ శర్మ లేదంటే వరుణ్?ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’కు అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే అర్హుడని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు?.. అభిషేక్ శర్మ లేదంటే వరుణ్?.. కానేకాదు..నా వరకైతే అర్ష్‌దీప్ మాత్రమే ఈ అవార్డుకు అర్హుడు. ఎందుకంటే.. ఇంగ్లండ్ టాపార్డర్‌ను అతడు కుప్పకూల్చాడు. ఒకరకంగా.. కేవలం మూడంటే మూడు ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశాడు’’ అని బసిత్ అలీ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్రశంసించాడు.అత్యుత్తమంగా రాణించాడుఅదే విధంగా.. ‘‘వరుణ్ చక్రవర్తి కూడా బాగా బౌలింగ్ చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. అయినా సరే.. అద్భుతంగా బౌలింగ్ చేసింది మాత్రం అర్ష్‌దీప్ అనే చెబుతాను. అతడు ఈరోజు అత్యుత్తమంగా రాణించాడు. రవి బిష్ణోయి కూడా ఫరవాలేదు. వికెట్ తీయలేకపోయినా కాస్త పొదుపుగానే బౌల్ చేశాడు’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.బౌలర్ల విజృంభణకాగా టీమిండియాతో తొలి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 132 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(0), బెన్ డకెట్(4)లను వచ్చీ రాగానే అర్ష్‌దీప్ అవుట్ చేశాడు. ఆరంభంలోనే మూడు ఓవర్లు వేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. రెండు వికెట్లతో సత్తా చాటాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే మాత్రమే ఇచ్చాడు.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు పూర్తి చేసి 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా వాళ్లలో హార్దిక్ పాండ్యా(2/42), అక్షర్ పటేల్(2/22) రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆదిల్ రషీద్ రనౌట్‌లో భాగమయ్యాడు.బ్యాటర్ల సత్తాఇక లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ శుభారంభం అందించారు. సంజూ వేగంగా(20 బంతుల్లో 26) ఆడి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. అభిషేక్ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 34 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లసాయంతో 79 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్ కాగా.. తిలక్ వర్మ(9*) , హార్దిక్ పాండ్యా(3*) అజేయంగా నిలిచి పనిపూర్తి చేశారు.చదవండి: అతడే ఎక్స్ ఫ్యాక్టర్.. జట్టులో కొనసాగించండి: భారత మాజీ క్రికెటర్ -
అతడే ఎక్స్ ఫ్యాక్టర్.. జట్టులో కొనసాగించండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా(Piyush Chawla) ప్రశంసలు కురిపించాడు. అతడు గనుక బ్యాట్ ఝులిపిస్తే అది కచ్చితంగా మ్యాచ్ విన్నింగ్సే అవుతుందని కొనియాడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సుదీర్ఘకాలం టీ20 జట్టులో కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్కు విజ్ఞప్లి చేశాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన అభిషేక్ శర్మ.. గతేడాది జూలైలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన ఈ పంజాబీ బ్యాటర్ డకౌట్ అయి విమర్శల పాలయ్యాడు. అయితే, అదే వేదికపై శతకంతో చెలరేగి తానేంటో నిరూపించుకున్నాడు.సంజూకు కెప్టెన్ మద్దతుఅయితే, ఆ తర్వాత కూడా అభిషేక్ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇక టీ20 జట్టులో ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్(Sanju Samson)తో పాటు అభిషేక్‌ను మేనేజ్మెంట్ ఆడిస్తున్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్‌గా సంజూనే కొనసాగిస్తామని ఇప్పటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. దీంతో అతడికి ఢోకా లేనట్లే.జైస్వాల్ రూపంలో ముప్పుఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో గనుక విఫలమైతే అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మరో లెఫ్టాండర్ బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) రూపంలో అతడికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బ్యాట్ ఝులిపిస్తేనే మరికొంతకాలం జట్టుతో కొనసాగగలడని అంచనా వేశాడు.ఇరవై బంతుల్లోనే అందుకు తగ్గట్లుగానే అభిషేక్ శర్మ తొలి టీ20లోనే దుమ్ములేపాడు. కేవలం ఇరవై బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్న అతడు.. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని 79 రన్స్ సాధించాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లు ఉండటం విశేషం.ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిషేక్ శర్మ ఆట తీరును ప్రశంసించాడు. ‘‘అభిషేక్ హై- రిస్క్ బ్యాటర్. ఒకవేళ అతడు పరుగుల వరద పారించాడంటే.. ఆ మ్యాచ్‌లో జట్టు గెలవాల్సిందే.ఎక్స్- ఫ్యాక్టర్ ప్లేయర్అభిషేక్ శర్మ ఎక్స్- ఫ్యాక్టర్ ప్లేయర్. 20-22 బంతుల్లోనే 60 పరుగులు చేయగలడు. ఇలాంటి వాళ్లను జట్టులో సుదీర్ఘకాలం కొనసాగించాలి. ఈరోజు అతడు కాస్త నెమ్మదిగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఉండవచ్చు. కానీ కేవలం ఇరవై బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.అతడి ఆట తీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక చక్కటి నిదర్శనం. అతడి ఆడిన షాట్లు కూడా చూడముచ్చటగా ఉన్నాయి’’ అని పీయూష్ చావ్లా కితాబులిచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ప్రత్యర్థిని 132 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం.. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. అభిషేక్ శర్మ(79) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా వేగంగా టార్గెట్‌ను ఛేదించింది. ఇక ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన మూడు వికెట్ల వీరుడు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
టీమిండియాతో తొలి టీ20లో ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) స్పందించాడు. పరుగులు రాబట్టేందుకు వీలుగా ఉన్న పిచ్ మీద సత్తా చాటలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యామన్న బట్లర్.. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపిందని తెలిపాడు. ఏదేమైనా భారత బౌలర్లు అద్భుతంగా ఆడారని.. తదుపరి మ్యాచ్‌లో తాము తిరిగి పుంజుకుంటామని పేర్కొన్నాడు.అర్ష్‌దీప్ అదరగొడితే..కాగా ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం తొలి మ్యాచ్ జరిగింది. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో జరిగిన పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(0)ను డకౌట్ చేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. అనంతరం బెన్ డకెట్(4)ను కూడా పెవిలియన్‌కు పంపాడు.వరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడుఅర్ష్దీప్తో పాటు మిస్టరీ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా విశ్వరూపం ప్రదర్శించాడు. వరుస బంతుల్లో లివింగ్‌స్టోన్(0)తో పాటు హ్యారీ బ్రూక్(17)ను అవుట్ చేశాడు. అదే విధంగా.. కొరకాని కొయ్యగా మారిన కెప్టెన్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వాళ్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచే దూకుడు కనబరిచింది. అభిషేక్ శర్మ ధనాధన్సంజూ శాంసన్ (20 బంతుల్లో 26) వేగంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. అభిషేక్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 34 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 79 పరుగులు చేశాడు.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) విఫలం కాగా.. తిలక్ వర్మ(19), హార్దిక్ పాండ్యా(3) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. అభిషేక్ ధాటికి 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 133 పరుగులు చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి.. 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఒత్తిడి పెంచలేకపోయాం.. ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో జోస్ బట్లర్ స్పందిస్తూ.. ‘‘టీమిండియాపై ఒత్తిడి పెంచలేకపోయాం. నిజంగా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక మా జట్టులోని కొంత మంది.. కొందరు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. వాస్తవానికి.. వికెట్ బాగానే ఉంది. ఫాస్ట్ స్కోరింగ్ గ్రౌండ్ ఇది.కానీ మేము ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. టీ20 క్రికెట్లో మేము మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాం. అయితే, అల్ట్రా- అగ్రెసివ్ జట్టుతో పోటీలో ఈరోజు వెనుకబడిపోయాం. ఏదేమైనా టీమిండియాతో పోరు రసవత్తరంగా ఉంటుంది. తదుపరి మ్యాచ్‌లలో కచ్చితంగా రాణిస్తాం. ప్రతీ వేదికపై విభిన్న పిచ్ పరిస్థితులు ఉంటాయి.జోఫ్రా ఆర్చర్ సూపర్స్టార్మా జట్టులో జోఫ్రా ఆర్చర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అతడొక సూపర్‌స్టార్. ప్రత్యర్థిని కచ్చితంగా భయపెట్టగలడు. ముందుగా చెప్పినట్లు మేము తిరిగి పుంజుకుంటాం’’ అని పేర్కొన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమకు ఓటమి ఎదురైనట్లు బట్లర్ చెప్పుకొచ్చాడు.కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ సంజూ, సూర్య రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ వికెట్‌ను ఆదిల్ రషీద్ దక్కించుకున్నాడు. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది.చదవండి: NADA: డోపింగ్ పరీక్షలు.. బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా..𝗔 𝗱𝗼𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗵𝗼𝘄 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗘𝗱𝗲𝗻 𝗚𝗮𝗿𝗱𝗲𝗻𝘀! 💪 💪#TeamIndia off to a flying start in the T20I series, sealing a 7⃣-wicket win! 👏 👏Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/hoUcLWCEIP— BCCI (@BCCI) January 22, 2025 -
మా బాయ్స్ అందరూ అద్బుతం.. గౌతీ భాయ్ చాలా సపోర్ట్‌గా ఉంటాడు: సూర్య
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా అద్భుతమైన విజయంతో ఆరంభించింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్‌లతో 79) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. సంజూ శాంసన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26), తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ అదిల్ రషీద్ ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) స్పందించాడు. తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేసినందుకు సంతోషంగా ఉందని సూర్య చెప్పుకొచ్చాడు."సిరీస్‌ను విజయంతో ఆరంభించినందుకు సంతోషంగా ఉంది. మా విజయంలో టాస్ కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మాకు సత్పలితాలను ఇచ్చింది. ఆరంభంలోనే అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టి మాకు ఒక ప్లాట్ ఫామ్ సెట్ చేశాడు.ఈ మ్యాచ్‌లో మా బౌలర్లందరూ తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. ఆ తర్వాత మా బ్యాటర్లు కూడా అద్బుతంగా ఆడారు. గత సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై ఇదే తరహా బ్యాటింగ్ చేశాము. ముఖ్యంగా అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడి సత్తా ఎంటో మాకు ముందే తెలుసు. ఇక కొత్త బంతితో బౌలింగ్ చేయాల్సిన బాధ్యత హార్దిక్ పాండ్యాపై ఉందని మాకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగాము. ముగ్గురు స్పిన్నర్లు కూడా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ అదనపు బాధ్యతలు తీసుకుని రాణిస్తున్నాడు. మాకు గౌతీ భాయ్(గౌతం గంభీర్) పూర్తి స్వేఛ్చను ఇచ్చాడు. మేము టీ20 వరల్డ్‌కప్-2024 కంటే కొంచెం భిన్నంగా ఆడాలనుకుంటున్నాము. ఫీల్డింగ్‌లో కూడా మేము చాలా మెరుగుపడ్డాము. అందుకోసం సెషన్లలో ఫీల్డింగ్ కోచ్‌తో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నాము. హాఫ్ ఛాన్స్‌లను కూడా క్యాచ్లగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్(Teamindia) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) అద్భుతమైన నాక్ ఆడాడు. 133 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను శర్మ ఊచకోత కోశాడు. అతడిని ఆపడం ఇంగ్లండ్ బౌలర్ల తరం కాలేదు.ఈ క్రమంలో అభిషేక్ కేవలం 20 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 34 బంతుల్లు ఎదుర్కొన్న ఈ పంజాబీ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..👉భారత గడ్డపై టీ20 మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్ (70+ పరుగులు) ఆడిన ప్లేయర్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఇంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. 2022లో గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మిల్లర్ 225.53 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 106 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో 232.35 స్ట్రైక్ రేట్‌తో 79 పరుగులు చేసిన అభిషేక్.. మిల్లర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉రన్-ఛేజ్ సమయంలో టీ20 మ్యాచ్‌లో అత్యంత వేగంగా(70+ రన్స్) పరుగులు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కూడా యువరాజ్ పేరిట ఉండేది. 2013లో ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ 35 బంతుల్లో 77 పరుగులు (220.00 స్ట్రైక్ రేట్) చేయగా.. తాజా మ్యాచ్‌లో అభిషేక్ 34 బంతుల్లో 79 (232.35 స్ట్రైక్ రేట్) పరుగులు చేశాడు. దీంతో యువీ ఆల్‌టైమ్ రికార్డు బద్దులు అయింది.👉ఇంగ్లండ్ జట్టుపై టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత్ బ్యాటర్ గా అభిషేక్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువీ 7 సిక్సర్ల బాదాడు. తాజా మ్యాచ్‌తో తన మెంటార్ యువరాజ్ ఆల్‌టైమ్ రికార్డును శర్మ బ్రేక్ చేశాడు. కాగా యువీ గైడెన్స్‌లోనే అభిషేక్ మరింత రాటుదేలాడు.👉టీ20ల్లో ఇంగ్లండ్‌పై భారత తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ రికార్డును శర్మ బ్రేక్ చేశాడు. 2018లో మాంచెస్టర్‌లో జరిగిన టీ20లో ఇంగ్లండ్‌పై రాహుల్ 27 బంతుల్లోనే అర్ధ శతకం సాధించగా.. తాజా మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో యువరాజ్ సింగ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువీ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో మెరిశాడు.ఊది పడేసిన భారత్..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్(26), తిలక్ వర్మ(19 నాటౌట్) దూకుడుగా ఆడారు.చదవండి: ENG vs IND: ఆరంభం అదిరింది.. తొలి టీ20లో ఇంగ్లండ్ చిత్తు -
చెలరేగిన అభిషేక్ శర్మ..తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
ఆరంభం అదిరింది.. తొలి టీ20లో ఇంగ్లండ్ చిత్తు
టి20 వరల్డ్ చాంపియన్ భారత్ మరోసారి తమ స్థాయికి తగ్గ ఆటతో అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఏకపక్షంగా సాగిన పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. కట్టుదిట్టమైన పేస్, స్పిన్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... ఆపై దూకుడైన బ్యాటింగ్‌తో మరో 43 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారీ బ్యాటింగ్ బలగం ఉన్న ఇంగ్లండ్ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అర్ష్ దీప్ , వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌తో పాటు అభిషేక్ శర్మ మెరుపు ప్రదర్శన భారత జట్టును ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిపాయి. రెండో టి20 మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. కోల్‌కతా: ఇంగ్లండ్‌తో మొదలైన టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు దక్కగా...అర్ష్ దీప్ , అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 12.5 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు సాధించి గెలిచింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్లతో చెలరేగి జట్టును గెలిపించాడు. భారత బౌలర్ల జోరు... లెఫ్టార్మ్ పేసర్ అర్ష్ దీప్ పదునైన బంతులతో ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. తొలి ఓవర్లో ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను, తన రెండో ఓవర్లో డకెట్ (4)ను వెనక్కి పంపించాడు. బట్లర్, బ్రూక్ (17) కలిసి కొద్దిసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పాండ్యా ఓవర్లో నాలుగు ఫోర్లతో బట్లర్ దూకుడు ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి స్పిన్‌కు ఇంగ్లండ్ కుదేలైంది. ఒకే ఓవర్లో అతను బ్రూక్, లివింగ్‌స్టోన్ (0)లను డగౌట్‌కు పంపించాడు. అనంతరం ఒక ఎండ్‌లో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోగా... బట్లర్ ఒక్కడే పోరాడగలిగాడు. 34 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆపై పాండ్యా, అక్షర్ మెరుగైన బౌలింగ్‌కు తోడు చక్కటి ఫీల్డింగ్ కారణంగా ఇంగ్లండ్ 26 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు చేజార్చుకుంది. మెరుపు బ్యాటింగ్... అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్లో సంజు సామ్సన్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 4, 4, 0, 6, 4, 4 బాదిన అతను 22 పరుగులు రాబట్టాడు. అయితే ఒకే ఓవర్లో సామ్సన్, సూర్యకుమార్ (0)లను అవుట్ చేసి ఆర్చర్ దెబ్బ తీశాడు. వుడ్ ఓవర్లో అభి షేక్ 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో పవర్‌ప్లేలో భారత్ 63 పరుగులు చేసింది. ఆ తర్వాత 29 పరుగుల వద్ద ఆదిల్ రషీద్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్ తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6 బాదాడు. ఆపై మరో సిక్స్‌తో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా దూకుడుగా ఆడిన అభిషేక్ భారత విజయానికి 8 పరుగుల దూరంలో అవుటయ్యాడు. షమీకు నో చాన్స్!ఫిట్నెస్ నిరూపించుకొని దాదాపు 14 నెలల విరామం తర్వాత భారత జట్టులోకి వచి్చన సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఇంకా మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇంగ్లండ్‌తో తొలి టి20 కోసం ప్రకటించిన టీమ్‌లో అనూహ్యంగా అతనికి చోటు దక్కలేదు. దీనికి మేనేజ్మెంట్ ఎలాంటి కారణం చెప్పలేదు. జట్టు కూర్పులో భాగంగా అతడిని పక్కన పెట్టారా లేక పూర్తిగా కోలుకోలేదా అనే విషయంపై స్పష్టత లేదు.97 అంతర్జాతీయ టి20ల్లో అర్ష్ దీప్ సింగ్ వికెట్ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా అతను నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న యుజువేంద్ర చహల్ (96)ను అర్ష్ దీప్ అధిగమించాడు. స్కోరు వివరాలుఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 0; డకెట్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 4; బట్లర్ (సి) నితీశ్ రెడ్డి (బి) వరుణ్ 68; బ్రూక్ (బి) వరుణ్ 17; లివింగ్‌స్టోన్ (బి) వరుణ్ 0; బెతెల్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 7; ఒవర్టన్ (సి) నితీశ్ రెడ్డి (బి) అక్షర్ 2; అట్కిన్సన్ (స్టంప్డ్) సామన్ (బి) అక్షర్ 2; ఆర్చర్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 12; రషీద్ (నాటౌట్) 8; వుడ్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 132. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–65, 4–65, 5–83, 6–95, 7–103, 8–109, 9–130, 10–132. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–17–2, హార్దిక్ పాండ్యా 4–0–42–2, వరుణ్ చక్రవర్తి 4–0–23–3, అక్షర్ పటేల్ 4–1–22–2, రవి బిష్ణోయ్ 4–0–22–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) అట్కిన్సన్ (బి) ఆర్చర్ 26; అభిషేక్ శర్మ (సి) బ్రూక్ (బి) రషీద్ 79; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) ఆర్చర్ 0; తిలక్‌వర్మ (నాటౌట్) 19; పాండ్యా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.5 ఓవర్లలో 3 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–125. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–21–2, అట్కిన్సన్ 2–0–38–0, మార్క్ వుడ్ 2.5–0–25–0, రషీద్ 2–0–27–1, ఒవర్టన్ 1–0–10–0, లివింగ్‌స్టోన్ 1–0–7–0. -
Ind vs Eng: అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు.. ఇదే లాస్ట్ ఛాన్స్!
అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఎంతో కీలకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ సిరీస్‌లో గనుక విఫలమైతే ఈ పంజాబీ బ్యాటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నాడు. కాబట్టి ఈసారి అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడం ఖాయమన్న ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. సవాళ్లను అధిగమిస్తే మాత్రం మరికొన్ని రోజులు టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.అరంగేట్రంలో డకౌట్.. ఆ వెంటనే సెంచరీగతేడాది జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా.. అభిషేక్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్‌లో సెంచరీ బాది సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్ ఝులిపించలేకపోయాడు.ఇక ఇప్పటి వరకు 12 టీ20లు పూర్తి చేసుకున్న అభిషేక్ వర్మ కేవలం 256 పరుగులకే పరిమితం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ అభిషేక్ తనను నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చని అభిప్రాయపడ్డాడు.అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు‘‘ఈసారి కూడా సెలక్టర్లు అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచారు. అతడిని జట్టులో కొనసాగించడం నాకూ నచ్చింది. అయితే, అతడు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) టీ20 జట్టులోకి దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.కాబట్టి అభిషేక్‌కు అతడితో పోటీ ఊపిరాడనివ్వదనడంలో సందేహం లేదు. యశస్వి జైస్వాల్ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ కావడం అభిషేక్ శర్మకు మరో మైనస్. జైసూ మూడు ఫార్మాట్లకు తగిన ఆటగాడు. టెస్టు, టీ20లలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.అలా అయితే వృథానేఇక వన్డేల్లో కూడా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు’’ అని పేర్కొన్నాడడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసమే.. టీ20లలో అతడికి విశ్రాంతినిచ్చారేమోనన్న అభిప్రాయాలు ఉన్నాయన్నాడు ఆకాశ్ చోప్రా. ఒకవేళ ఇంగ్లండ్‌తో వన్డేల్లో శుబ్‌మన్ గిల్- రోహిత్ శర్మనే ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. జైసూను ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసినందుకు ఫలితం ఉండదని పేర్కొన్నాడు.ఒకే జట్టుతో ఆడతామన్న టీమిండియా సారథిఏదేమైనా యశస్వి జైస్వాల్ మాత్రం తిరిగి టీ20 జట్టులోకి వస్తే.. అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇ దిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఒకే జట్టుతో ఆడేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే, ఆకాశ్ చోప్రా అన్నట్లు అభిషేక్ శర్మ మరోసారి విఫలమైతే అతడిపై వేటు తప్పకపోవచ్చు. కాగా బుధవారం(జనవరి 22) నుంచి ఇండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
భీకర ఫామ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్-అభిషేక్ శర్మ.. 644 పరుగులతో..
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(Prabhsimran Singh)- అభిషేక్ శర్మ(Abhishek Sharma) దుమ్ములేపుతున్నారు. అద్బుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఈ ఓపెనింగ్ జోడీ అరుదైన రికార్డు సాధించింది.సౌరాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా తొలి వికెట్‌కు 298 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అభిషేక్- ప్రభ్‌సిమ్రన్.. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare trophy)లో మొదటి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన రెండో జంటగా నిలిచారు. ఇక తాజాగా హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ ఈ జోడీ ధనాధన్ దంచికొట్టింది.మళ్లీ శతక్కొట్టాడు!అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి పంజాబ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపు శతకం బాదగా.. కెప్టెన్ అభిషేక్ శర్మ సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కాగా ప్రభ్‌సిమ్రన్ 105 బంతుల్లో ఏకంగా 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేశాడు. అభిషేక్ 72 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది 93 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి 145 బంతుల్లో 196 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.426 పరుగుల భారీ స్కోరుమిగిలిన బ్యాటర్లలో అన్మోల్ప్రీత్ సింగ్(46), రమణ్‌దీప్ సింగ్(80), నేహాల్ వధేరా(35 నాటౌట్), నమన్ ధీర్(14 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో పంజాబ్ జట్టు కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 426 పరుగుల భారీ స్కోరు సాధించింది.అత్యధిక పరుగుల వీరుడిగాహైదరాబాద్ బౌలర్లలో ముదస్సిర్, శరణు నిశాంత్, అనికేత్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో శతక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి సగటున 473 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 150 నాటౌట్. మరోవైపు.. పంజాబ్ సారథి అభిషేక్ శర్మ ఒక సెంచరీ, రెండు ఫిఫ్టీల సాయంతో 397 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 170. ఏకంగా 644 పరుగులుఇక ఈ ప్రదర్శనలతో.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు ప్రభ్‌సిమ్రన్ సింగ్- అభిషేక్ శర్మ భారత సెలక్టర్లకు గట్టి సందేశం పంపించినట్లయింది. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌తో టీ20లలో ఆడటం ఖాయంగానే అనిపిస్తున్నా.. ఈసారైనా ప్రభ్‌సిమ్రన్‌ను సెలక్టర్లు కనికరిస్తారేమో చూడాలి!కాగా విజయ్ హజారే ట్రోఫీలో గత మూడు మ్యాచ్‌లలో కలిపి ప్రభ్‌సిమ్రన్ సింగ్- అభిషేక్ శర్మ జోడీ ఏకంగా 644 పరుగులు(150, 298, 196) సాధించడం విశేషం. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న టీమిండియా తదుపరి సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది.చదవండి: కొన్‌స్టాస్ ఓవరాక్షన్.. బుమ్రా ఆన్ ఫైర్!.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది! -
అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ ఊచకోత.. విధ్వంసకర శతకాలతో రికార్డు
టీమిండియా యువ ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) విధ్వంసకర శతకంతో మెరిశాడు. సౌరాష్ట్ర బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అభిషేక్‌తో పాటు మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(Prabhsimran Singh) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగి.. శతక్కొట్టాడు. ఈ క్రమంలో అభిషేక్- ప్రభ్‌సిమ్రన్ జోడీ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25- వీహెచ్‌టీ)లో సరికొత్త రికార్డు సాధించింది.కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ వీహెచ్‌టీలో భాగంగా పంజాబ్ మంగళవారం నాటి మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుతో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ అదిరిపోయే ఆరంభం అందించారు.అరవై బంతుల్లోనేఅభిషేక్ శర్మ అరవై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 96 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 170 పరుగులు సాధించాడు. మరో ఎండ్ నుంచి అభిషేక్‌కు సహకారం అందించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్.. 95 బంతుల్లో 125 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం.అరుదైన రికార్డుఈ క్రమంలో అభిషేక్ శర్మ- ప్రభ్‌సిమ్రన్ కలిసి తొలి వికెట్‌కు 298 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు(highest first-wicket partnership) జోడించిన రెండో జంటగా నిలిచారు. బెంగాల్ బ్యాటర్లు సుదీప్ ఘరామి- అభిమన్యు ఈశ్వరన్ 2022లో సాధించిన రికార్డును సమం చేశారు.వీరిది మాత్రం ప్రపంచ రికార్డుఇక ఈ టోర్నీలో తొలి వికెట్‌కు అత్యధికంగా 416 పరుగులు జతచేసిన జోడీ తమిళనాడు స్టార్లు నారాయణ్ జగదీశన్, బి. సాయి సుదర్శన్ టాప్‌లో కొనసాగుతున్నారు. కేవలం విజయ్ హజారే ట్రోఫీలోనే కాకుండా లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో హయ్యస్ట్ పార్ట్నర్షిప్ సాధించిన జంటగా వీరు ప్రపంచ రికార్డు కూడా సాధించారు.300 పైచిలుకు స్కోరుఇదిలా ఉంటే..ప్రణవ్ కరియా బౌలింగ్‌లో జే గోహిల్‌కు క్యాచ్ ఇవ్వడంతో ప్రభ్‌సిమ్రన్ సింగ్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక మరోసారి ప్రణవ్ కరియా తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించగా.. రుచిత్ అహిర్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక అభిషేక్- ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఊచకోత కారణంగా పంజాబ్ కేవలం 34 ఓవర్లలోనే 300 పరుగుల మార్కు దాటింది.వరుస విజయాలకు కర్ణాటక బ్రేక్కాగా విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో పంజాబ్ తొలి మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. తదుపరి నాగాలాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అనంతరం కర్ణాటకతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ముంబైని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి మళ్లీ విజయాల బాట పట్టింది. తాజాగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ గెలుపొంది గ్రూప్-‘సి’లో మరింత పటిష్ట స్థితికి చేరాలని పట్టుదలగా ఉంది.చదవండి: టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం! -
అభిషేక్ శర్మ విధ్వంసం
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా టీ20 ప్లేయర్ అభిషేక్ శర్మ ఓ లోకల్ టీ20 టోర్నమెంట్లో (టైమ్స్ షీల్డ్ టోర్నీ) చెలరేగిపోయాడు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో అభిషేక్ 22 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అభిషేక్ భారీ షాట్లు అడుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలొ అభిషేక్ ఆడిన షాట్లు చూస్తుంటే ఐపీఎల్ 2025 సీజన్ కోసం గట్టిగానే కసరత్తు చేస్తున్నాడనిపిస్తుంది.ABHISHEK SHARMA SHOW IN TIMES SHIELD TOURNAMENT...!!! 🙇- While playing in the red ball, Abhishek smashed 60 runs from just 22 balls, preparing hard for the 2025 season. pic.twitter.com/smqEHcOxNl— Johns. (@CricCrazyJohns) December 10, 2024అభిషేక్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్.. చివరి రెండు మ్యాచ్‌ల్లో తన ప్రతాపం చూపించాడు. మూడో టీ20లో 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసిన అభిషేక్.. నాలుగో మ్యాచ్‌లో 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ను సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది.అభిషేక్ ఐపీఎల్ ప్రదర్శన విషయానికొస్తే.. గత సీజన్లో అభిషేక్ చెలరేగిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరడంలో అభిషేక్ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 204.22 స్ట్రయిక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ గత మూడు ఐపీఎల్ సీజన్లుగా రాణిస్తూ వస్తున్నాడు. అందుకే సన్‌రైజర్స్ అతన్ని వేలానికి వదిలి పెట్టకుండా అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 63 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 155.24 స్ట్రయిక్‌రేట్‌తో 1377 పరుగులు చేశాడు. -
సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారత టీ20 జట్టు సారధి సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు (టీ20ల్లో) బాదిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. స్కై 2022లో 41 ఇన్నింగ్స్‌ల్లో 85 సిక్సర్లు (టీ20ల్లో) బాదగా.. అభిషేక్ ఈ ఏడాది కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే 87 సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ అగ్రస్థానంలో ఉండగా.. స్కై వరుసగా రెండు, మూడు స్థానాల్లో (2023లో 71 సిక్సర్లు) ఉన్నాడు.క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్లుఅభిషేక్ శర్మ (38 ఇన్నింగ్స్‌ల్లో 87 సిక్సర్లు, 2024)సూర్యకుమార్ యాదవ్ (41 ఇన్నింగ్స్‌ల్లో 85 సిక్సర్లు, 2022)సూర్యకుమార్ యాదవ్ (33 ఇన్నింగ్స్‌ల్లో 71 సిక్సర్లు, 2023)రిషబ్ పంత్ (31 ఇన్నింగ్స్‌ల్లో 66 సిక్సర్లు, 2018)శ్రేయస్ అయ్యర్ (42 ఇన్నింగ్స్‌ల్లో 63 సిక్సర్లు, 2019)సంజూ శాంసన్ (32 ఇన్నింగ్స్‌ల్లో 60 సిక్సర్లు, 2024)సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ సూర్యకుమార్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 11 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా ఉర్విల్ పటేల్ (గుజరాత్) రికార్డును సమం చేశాడు. ఉర్విల్ కూడా ఇదే సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఫాసెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మేఘాలయ ఇన్నింగ్స్‌లో అర్పిత్ భటేవారా (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. అభిషేక్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 9.3 ఓవరల్లోనే విజయతీరాలకు చేరింది. -
అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్.. గురువారం మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.143 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 28 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా ఉర్విల్ పటేల్ రికార్డును అభిషేక్ సమం చేశాడు.ఇదే టోర్నీలో నవంబర్ 27న త్రిపురపై 28 బంతుల్లో ఉర్విల్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో ఉర్విల్ సరసన అభిషేక్ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 29 బంతులు ఎదుర్కొన్న శర్మ 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 143 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్.. 3 వికెట్లు కోల్పోయి కేవలం 9.3 ఓవర్లలోనే చేధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.మేఘాలయ బ్యాటర్లలో అర్పిత్ భతేవారా(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అభిషేక్ శర్మ, రమణ్‌దీప్ సింగ్ తలా రెండో వికెట్లు పడగొట్టగా.. అశ్విని కుమార్, ధలేవాల్ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: ఆసీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా ఓపెనర్లుగా వారే: రోహిత్ శర్మ -
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20లో సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ విధ్వంసకర శతకంతో విరుచుకుపడి జట్టుకు గెలుపు అందించాడు. ఈ క్రమంలో తన పేరిట ఓ అరుదైన రికార్డునూ లిఖించుకున్నాడు. ప్రొటిస్ జట్టుపై.. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు.మళ్లీ గెలుపు బాటకాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో సిరీస్ మొదలుపెట్టిన సూర్యసేన.. రెండో టీ20లో మాత్రం ఓడిపోయింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని.. మళ్లీ గెలుపు బాటపట్టింది.అభిషేక్ శర్మ ధనాధన్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) మరోసారి డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 50) ధనాధన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన హైదారాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఆఖరి వరకు అజేయంగా తిలక్వరుసగా వికెట్లు పడుతున్నా.. అభిషేక్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన ఈ లెఫ్టాండర్.. 107 పరుగులు సాధించాడు. ప్రొటిస్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టుకు భారీ స్కోరు(219-6)అందించాడు.ఈ క్రమంలో కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆఖరి వరకు పోరాడింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆతిథ్య జట్టు.. 208 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో పదకొండు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొంది.. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.ప్రపంచంలోనే తొలి క్రికెటర్గాఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత తిలక్ వర్మ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ఇది. కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకాన్ని ఏకంగా సఫారీ గడ్డపై బాదడం విశేషం. ఈ క్రమంలో 22 ఏళ్ల తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. సౌతాఫ్రికా జట్టుపై అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా.. చిన్న వయసులోనే టీమిండియా తరఫున టీ20 శతకం బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.సౌతాఫ్రికాపై పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లుతిలక్ వర్మ(ఇండియా)- 22 ఏళ్ల, 5 రోజుల వయసులో 2024- సెంచూరియన్ వేదికగా..సురేశ్ రైనా(ఇండియా)- 23 ఏళ్ల, 156 రోజుల వయసులో 2010- గ్రాస్ ఐస్లెట్ వేదికగామార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్)- 26 ఏళ్ల, 84 రోజుల వయసులో- 2012- ఈస్ట్ లండన్బాబర్ ఆజం(పాకిస్తాన్)- 26 ఏళ్ల, 181 రోజుల వయసులో- 2021- సెంచూరియన్క్రిస్ గేల్(వెస్టిండీస్)- 27 ఏళ్ల 355 రోజుల వయసులో- 2007- జొహన్నస్‌బర్గ్.టీమిండియా తరఫున చిన్న వయసులో టీ20 సెంచరీ సాధించిన ఆటగాళ్లుయశస్వి జైస్వాల్- 2023లో నేపాల్ మీద- 21 ఏళ్ల 279 రోజుల వయసులోతిలక్ వర్మ- 2024లొ సౌతాఫ్రికా మీద- 22 ఏళ్ల 5 రోజుల వయసులోశుబ్మన్ గిల్(126*)- 2023లో న్యూజిలాండ్ మీద- 23 ఏళ్ల 146 రోజుల వయసులోసురేశ్ రైనా(101)- 2010లో సౌతాఫ్రికా మీద- 23 ఏళ్ల 156 రోజుల వయసులో ఈ ఘనత సాధించారు.చదవండి: Asia Cup 2024: భారత జట్టు ప్రకటన.. 13 ఏళ్ల కుర్రాడికి చోటు Thunderstruck ❌Tilak-struck 💯A superb maiden century for the stylish #TeamIndia southpaw! 🙌Catch LIVE action from the 3rd #SAvIND T20I on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#JioCinemaSports #TilakVarma pic.twitter.com/L7MEfEPyY8— JioCinema (@JioCinema) November 13, 2024 -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. శతక్కొట్టిన తిలక్ వర్మ.. టీమిండియా భారీ స్కోర్
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ మెరుపు సెంచరీ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అభిషేక్ శర్మ తనవంతుగా మెరుపు అర్ద శతకం (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదాడు. తిలక్ కేవలం 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ డకౌట్ కాగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1, హార్దిక్ పాండ్యా 18, రింకూ సింగ్ 8, రమణ్‌దీప్ సింగ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖరి ఓవర్‌ను మార్కో జన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో అతను కేవలం నాలుగు పరుగులలు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, సైమ్‌లేన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జన్సెన్కు ఓ వికెట్ దక్కింది. కాగా, నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. రెండు మార్పులు చేయనున్న టీమిండియా..?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలువగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా జయభేరి మోగించింది. మూడో టీ20 సెంచూరియన్ వేదికగా రేపు (నవంబర్ 13) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది.రెండో టీ20లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చివరి నిమిషం వరకు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కొయెట్జీ చివర్లో సూపర్‌గా బ్యాటింగ్ చేసి భారత్ చేతుల నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత యూనిట్లో పలు లోపాలు స్పష్టంగా కనిపించాయి.మూడో మ్యాచ్‌లో ఈ లోపాలను సరిదిద్దుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో అతను దారుణంగా నిరాశపరిచాడు.వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ అభిషేక్‌ను పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ స్థానంలో తిలక్ వర్మ, రమన్‌దీప్ సింగ్‌లలో ఎవరో ఒకరితో ఓపెనింగ్ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. తిలక్ వర్మతో పోలిస్తే రమన్‌దీప్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.రమన్‌దీప్‌కు హార్డ్ హిట్టింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. తిలక్ వర్మ మిడిలార్డర్లో ఎలాగూ సెట్ అయ్యాడు కాబట్టి టీమిండియా యాజమాన్యం అతన్ని కదిపే సాహసం చేయకపోవచ్చు. మూడో టీ20లో అభిషేక్‌తో పాటు అర్షదీప్ సింగ్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అర్షదీప్ గత రెండు టీ20ల్లో చెప్పుకోదగ్గ ప్రదదర్శనలు చేయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ కారణంగా అతన్ని పక్కకు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అర్షదీప్‌ను తుది జట్టు నుంచి తప్పిస్తే, అతని స్థానంలో యశ్ దయాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడో టీ20లో రమన్‌దీప్, యశ్ దయాల్ ఇద్దరూ బరిలోకి దిగితే వారిద్దరికి అది అరంగేట్రం మ్యాచ్ అవుతుంది.భారత జట్టు (అంచనా): రమణ్‌దీప్ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, యష్ దయాల్, ఆవేశ్ ఖాన్. -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్
సౌతాఫ్రికాతో మొదటి టీ20లో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో అదే జోరును కొనసాగించలేకపోయింది. కీలక బ్యాటర్లంతా విఫలం కావడంతో మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ గెలవాలంటే.. మిగిలిన రెండు టీ20లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.సంజూ శాంసన్ ధనాధన్ సెంచరీ వల్లనిజానికి డర్బన్‌లో జరిగిన తొలి టీ20లోనూ ఓపెనర్ సంజూ శాంసన్(50 బంతుల్లో 107), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(33) రాణించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. మిగతా వాళ్లంతా విఫలమైనా 202 రన్స్ రాబట్టగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య ప్రొటిస్‌ను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.రెండో టీ20లో మాత్రంఅయితే, గెబెహా వేదికగా రెండో టీ20లో మాత్రం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) అనూహ్య రీతిలో డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(4) మరోసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్య సైతం నాలుగు పరుగులకే వెనుదిరగగా.. మిడిలార్డర్లో తిలక్ వర్మ(20), అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) కాసేపు క్రీజులో నిలబడ్డారు.ఇక లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్(9) నిరాశపరచగా.. టెయిలెండర్ అర్ష్‌దీప్ సింగ్(7 నాటౌట్) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా కేవలం 124 పరుగులే చేసింది. అయితే, సౌతాఫ్రికాను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు మాత్రం ఆఖరి వరకు గట్టి పోరాటం చేశాడు.అయినప్పటికీ 19 ఓవర్లలోనే ప్రొటిస్ జట్టు లక్ష్యాన్ని ఛేదించి జయభేరి మోగించింది. టీమిండియా ఆధిక్యాన్ని తగ్గిస్తూ 1-1తో సమం చేసింది. ఇలా తొలి రెండు మ్యాచ్‌లలోనూ బౌలర్లు వందశాతం పాసైనా.. బ్యాటర్లలోనే నిలకడ లోపించింది. ఆల్‌రౌండర్ అవసరం ఉందిఈ నేపథ్యంలో సౌతాఫ్రికా- టీమిండియా మధ్య సెంచూరియన్ వేదికగా మూడో టీ20పై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సూర్య సేన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలదు. ఈ క్రమంలో భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.సౌతాఫ్రికాతో మూడో టీ20లో ఆల్‌రౌండర్ రమణ్‌దీప్ సింగ్‌ను అరంగ్రేటం చేయించాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. ఈ మేరకు.. ‘‘ఎనిమిదో స్థానంలో మనకు ఓ ఆల్‌రౌండర్ అవసరం ఉంది. అతడు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేయగలగాలి.అతడిని ఆడిస్తేనే మంచిదిఅతడు స్పిన్నరా? లేదంటే ఫాస్ట్ బౌలరా అన్న అంశంతో మనకు పనిలేదు. హార్దిక్ పాండ్యా కాకుండా.. అతడిలా ఆడగలిగే మరో క్రికెటర్ కావాలి. ఇప్పుడు జట్టులో ఉన్న ప్రధాన లోటు అదే. ప్రస్తుతం రమణ్‌దీప్ సింగ్ సరైన ఆప్షన్లా కనిపిస్తున్నాడు. అందుకే అతడిని తుదిజట్టులో ఆడిస్తే మంచిది’’ అని రాబిన్ ఊతప్ప జియో సినిమా షోలో పేర్కొన్నాడు.కాగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టుతో ఉన్నాడు. అయితే, రమణ్‌దీప్ సింగ్‌కు లైన్ క్లియర్ కావాలంటే.. మిగిలిన ఆటగాళ్లలో ఎవరో ఒకరిపై వేటు తప్పదు. అలాంటి పరిస్థితిలో తొలి రెండు టీ20లలో ఘోరంగా విఫలమైన ఏకక ఆటగాడు అభిషేక్ శర్మ(7, 4)నే తప్పించే అవకాశమే ఎక్కువగా ఉంది. అదే జరిగితే ఓపెనింగ్ జోడీలోనూ మార్పు వస్తుంది. కాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సూర్యకుమార్ సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్‌పై వేటు!
సెంచూరియన్ వేదికగా బుధవారం జరగనున్న మూడో టీ20లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. రెండో టీ20లో అనూహ్య ఓటమి చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకుని తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.పోర్ట్ ఎలిజిబెత్‌లో చేసిన బ్యాటింగ్ తప్పిదాలను పునరావృతం చేయకూడదని సూర్య సేన యోచిస్తోంది. అందుకు తగ్గట్టే భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.అభిషేక్ శర్మపై వేటు..గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత జట్టు మేనెజ్మెంట్ వేటు వేయాలని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఆల్‌రౌండర్ రమణ్‌దీప్ సింగ్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అభిషేక్‌ను పక్కన పెట్టి సంజూ శాంసన్ జోడీగా తిలక్ వర్మను ప్రమోట్ చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు పేసర్ అవేష్ ఖాన్‌ను కూడా బెంచ్‌కే పరిమితం చేసే సూచనలు కన్పిస్తున్నాయి. అవేష్ స్ధానంలో కర్ణాటక పేసర్ విజయ్‌కుమార్ వైశ్యాఖ్ అరంగేట్రం చేసే అవకాశముంది.భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రమణ్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశ్యాఖ్చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా! -
ఇదేం చెత్త ఆట బ్రో.. ఐపీఎల్‌లోనే ఆడుతావా! ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన అభిషేక్.. ఇప్పుడు పోర్ట్ ఎలిజిబెత్‌లో జరిగిన రెండో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 5 బంతులు ఆడిన అభిషేక్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. సఫారీ పేసర్ కోయిట్జీ బౌలింగ్‌లో చెత్త ఆడి ఈ పంజాబీ స్టార్ బ్యాటర్ ఔటయ్యాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా అభిషేక్ శర్మపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇదేమి ఆట భయ్యా..కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతావా? అంటే ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. మరి కొంతమంది అతడి స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ అవకాశం ఇవ్వండి అంటూ భారత జట్టు మేనెజ్మెంట్ను సూచిస్తున్నారు.ఒక్క సెంచరీ మినహా.. కాగా జింబాబ్వే సిరీస్‌తో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఇప్పుడు భారత్ తరపున 9 మ్యాచ్‌లు ఆడాడు. అయితే జింబాబ్వే సిరీస్‌లో సెంచరీ మినహా ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. జైశ్వాల్‌కు బ్యాకప్‌గా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు తన మార్క్‌ను చూపించడంలో విఫలమయ్యాడు. 24 ఏళ్ల అభిషేక్ శర్మ తన తొమ్మిది టీ20 ఇన్నింగ్స్‌లలో ఎనిమిదింటిలో కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. దీంతో జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రాణిస్తానే అభిషేక్ జట్టులో కొనసాగే అవకాశముంది.ఐపీఎల్లో అదుర్స్ఐపీఎల్-2024లో మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఆ దూకుడును అభిషేక్ ప్రదర్శించలేకపోతున్నాడు.Abhishek Sharma's last 9 T20i innings:0(4), 100(47), 10(9), 14(11), 16(7), 15(11), 4(4), 7(8), 4(5)He is clearly missing IPL tracks and his partner Travis Head.#INDVSSA pic.twitter.com/rZLiTGUmxe— JassPreet (@JassPreet96) November 10, 2024చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా -
SA VS IND 2nd T20: కష్టాల్లో టీమిండియా
గెబెర్హాలోని సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఐదు పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు చేసిన సంజూ శాంసన్ మూడు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. సంజూ శాంసన్‌కు మార్కో జన్సెన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో మార్కో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ ఔటయ్యాడు.నిరాశపరిచిన స్కై..తొలి టీ20లో ఓ మోస్తరు స్కోర్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో దారుణంగా నిరుత్సాహపరిచాడు. స్కై తొమ్మిది బంతులు ఎదర్కొని కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్కై.. సైమ్‌లేన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 70/5గా ఉంది. సంజూ శాంసన్ (0), అభిషేక్ శర్మ (4, సూర్యకుమార్‌యాదవ్ (4), తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) ఔట్ కాగా.. హార్దిక్ పాండ్యా (7), రింకూ సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో జన్సెన్, కొయెట్జీ, సైమ్‌లేన్, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. తీరు మార్చుకోని అభిషేక్..టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అందివస్తున్న వరుస అవకాశాలను ఒడిసి పట్టుకోలేకపోతున్నాడు. నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల కెరీర్లో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అభిషేక్ ఆతర్వాత వరుసగా వైఫల్యాల బాట పట్టాడు. ఈ సిరీస్‌లో రాణించకపోతే అవకాశాలు రావని తెలిసినా అభిషేక్ బ్యాటింగ్ తీరులో ఏమాత్రం మార్పు లేదు. తొలి టీ20లో ఏడు పరుగులు చేసిన అభిషేక్ ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగులకు ఔటయ్యాడు.టీ20 కెరీర్లో అభిషేక్ శర్మ స్కోర్లు ఇలా ఉన్నాయి..!0, 100, 10, 14, 16, 15, 4, 7, 4తుది జట్లు.. భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, అవేష్ ఖాన్దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్ -
IND VS SA 1st T20: సౌతాఫ్రికాతో తొలి టీ-20.. చెత్త షాట్ ఆడి
Update: డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రిను భారత్ చిత్తు చేసింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్‌లో1-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది.సౌతాఫ్రికాతో తొలి టీ-20లో శాంసన్ సెంచరీ47 బంతుల్లో సెంచరీ చేసిన శాంసన్7 ఫోర్లు, 9 సిక్స్‌లతో చెలరేగిన శాంసన్10 ఓవర్ల అనంతరం టీమిండియా స్కోర్ 99/2.. సంజూ శాంసన్ (59 బ్యాటింగ్), తిలక్ వర్మ (7 బ్యాటింగ్)టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. అభిషేక్ తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక సెంచరీ చేశాడు. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. తాజాగా అభిషేక్ మరోసారి చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో అభిషేక్ 8 బంతుల్లో బౌండరీ సాయంతో 7 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ తొలి బంతి నుంచి చాలా ఇబ్బంది పడ్డాడు. బంతిని కనెక్ట్ చేసుకోలేక సతమతమయ్యాడు. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి మార్క్రమ్ చేతికి చిక్కాడు. అభిషేక్ వరుసగా అవకాశాలు ఇస్తున్నా విఫలమవుతుండటంతో భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్‌కు గేమ్ పట్ల సీరియస్‌నెస్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అభిషేక్ మరో మ్యాచ్‌లో ఫెయిల్ అయితే టీమిండియా తలుపులు తట్టలేడని అంటున్నారు.కాగా, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ చెలరేగి ఆడుతుంది. అభిషేక్ నిరాశపరిచినప్పటికీ.. సంజూ శాంసన్ దుమ్ములేపుతున్నాడు. సంజూ 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా ధాటిగానే ఆడుతున్నాడు. స్కై 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 56/1గా ఉంది. దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ -
'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే'
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌లో సఫారీలను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత జట్టు ఢీకొట్టనుంది.ప్రోటీస్ సిరీస్‌కు యశస్వీ జైశ్వాల్, గిల్, రిషబ్ పంత్, బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో సౌతాఫ్రికా పర్యటనకు రమణ్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశ్యాఖ్, యశ్ దయాల్ వంటి కొత్త ముఖాలకు భారత జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు.ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మకు ఈ సిరీస్ డూ ఆర్ డై వంటిది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా జింబాబ్వే సిరీస్‌తో టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్.. జైశ్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు.జైశ్వాల్ గైర్హాజరీ సిరీస్‌లలో అభిషేక్‌కు సెలక్టర్లు చోటిస్తున్నారు. అయితే జింబాబ్వే సిరీస్‌లో సెంచరీ మినహా ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్.. 22.71 సగటుతో కేవలం 159 పరుగులు మాత్రమే చేశాడు."అభిషేక్ శర్మ ఈ సిరీస్‌లో చావోరెవో తెల్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్‌లో అభిషేక్ రాణించికపోతే వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని కచ్చితంగా పక్కనపెట్టేస్తారు. అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. జింబాబ్వే పర్యటనలో సెంచరీ కూడా సాధించాడు. కానీ ఆ తర్వాత ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదని" చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND-A vs AUS-A: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 223 పరుగులకు ఆసీస్ ఆలౌట్ -
అభిషేక్ శర్మ ఊచకోత.. యూఏఈపై టీమిండియా ఘన విజయం
టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నీలో భాగంగా యూఏఈతో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 16.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్ రసిఖ్ సలామ్ ఐదు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి యూఏఈని చావుదెబ్బ కొట్టాడు. అనంతరం రమణ్‌దీప్ సింగ్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నేహల్ వధేరా తలో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ చోప్రా ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. రాహుల్ 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో పాటు కెప్టెన్ బాసిల్ హమీద్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), మయాంక్ రాజేశ్ కుమార్ (5 బంతుల్లో 10; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అభిషేక్ శర్మ ఊచకోత..స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (24 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో 10.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ 21, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 8, అభిషేక్ 58 పరుగులు చేసి ఔట్ కాగా.. నేహల్ వధేరా 6, ఆయుశ్ బదోని 12 పరుగులతో అజేయంగా నిలిచారు. -
Ind vs Pak: నువ్వేమైనా హీరోవా?: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
వర్దమాన ఆసియా టీ20 కప్-2024లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘటనపై పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ స్పందించాడు. యువ ఆటగాళ్లకు ప్రత్యర్థి జట్టును గౌరవించే సంస్కారం నేర్పాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు హితవు పలికాడు. అభిషేక్ శర్మ పట్ల సూఫియాన్ ముఖీమ్ ప్రవర్తన సరికాదంటూ మండిపడ్డాడు.కాగా ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఒమన్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’పై తిలక్ వర్మ సేన ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా.. భారత ఓపెనర్ అభిషేక్ శర్మను రెచ్చగొట్టేలా పాక్ యువ స్పిన్నర్ సూఫియాన్ ముఖీమ్ ప్రవర్తించాడు.అభిషేక్ ధనాధన్టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన క్రమంలో అభిషేక్.. 22 బంతులు ఎదుర్కొని 35 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, దూకుడుగా ఆడుతున్న సమయంలో ఆరో ఓవర్ ఆఖరి బంతికి సూఫియాన్ బౌలింగ్‌లో అభిషేక్.. కాసిం అక్రంకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.సూఫియాన్ ఓవరాక్షన్దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే, అభిషేక్ అవుట్ కాగానే సూఫియాన్ ఓవరాక్షన్ చేశాడు. ‘నోరు మూసుకుని.. ఇక దయచెయ్’’ అన్నట్లుగా ముక్కుమీద వేలు వేసి అభిషేక్‌కు సైగ చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన అభిషేక్ సూఫియాన్ వైపునకు సీరియస్‌గా చూశాడు. ఈ క్రమంలో అంపైర్లు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.నువ్వేమైనా హ్యాట్రిక్ హీరోవా?ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ స్పందిస్తూ.. ‘‘క్రికెట్ అంటేనే టాప్ క్లాస్. కానీ.. సూఫియాన్ ముఖీమ్- అభిషేక్ శర్మ మధ్య జరిగిన ఘటన నన్ను నిరాశకు గురిచేసింది. ఒకవేళ నేనే గనుక పాక్ జట్టు టీమ్ మేనేజర్‌గా డకౌట్లో ఉండి ఉంటే.. వెంటనే సూఫియాన్‌ను పిలిచి.. ‘‘బేటా.. ఇక బ్యాగు సర్దుకుని బయల్దేరు’ అని చెప్పేవాడిని.బుద్ధి నేర్పించాలినువ్వసలు పాకిస్తాన్ తరఫున ఇంకా పూర్తిస్థాయిలో క్రికెట్ ఆడనేలేదు. ఇప్పుడే ఇలా అసభ్యకరమైన రీతిలో ప్రత్యర్థి జట్టు ఆటగాడిని దూషిస్తావా? ఇదేం ప్రవర్తన? నువ్వేమైనా హ్యాట్రిక్ హీరోవా? ఇంకా నీ బౌలింగ్‌పై ఎవరికీ అవగాహనే లేదు. అప్పుడే ఇలాంటి ప్రవర్తనా? మేనేజ్మెంట్ యువ ఆటగాళ్లకు కాస్త బుద్ధి నేర్పించాలి.ప్రత్యర్థి జట్టును గౌరవించాలనే సంస్కారం నేర్పించండి’’ అని పీసీబీకి హితవు పలికాడు. కాగా పాకిస్తాన్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి.. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన అన్షుల్ కాంబోజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: WTC 2023-25 Points Table: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?WATCH:SUFIYAN MUQEEM ASKED ABHISHEK SHARMA TO LEAVE THE GROUND#INDvPAK #EmergingAsiaCup2024 pic.twitter.com/RJHOLCULYc— Junaid (@ccricket713) October 19, 2024 -
పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్ శర్మ
ఎమర్జింగ్ ఆసియా కప్-2024ను భారత్-ఎ జట్టు విజయంతో ఆరంభించింది. శనివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మ, పాకిస్తాన్ స్పిన్నర్ సూఫియాన్ ముఖీమ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.భారత ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన సూఫియాన్ బౌలింగ్‌లో తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ క్యాచ్ ఔటయ్యాడు. వెంటనే ముఖీమ్ సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయాడు. అయితే అతడి సంబరాలు శ్రుతిమించాయి. అభిషేక్ తిరిగి పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో అభిషేక్ వైపు చూస్తూ ముఖీమ్ ఏదో తిడుతూ, బయటకు వెళ్లాలంటూ సైగలు చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన అభిషేక్ శర్మ.. ముఖీమ్పై దూసుకెళ్లాడు. అయితే అంపైర్లు జోక్యం చేసుకోవడంతో అభిషేక్ మైదాన్ని వీడాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35 పరుగులు చేశాడు. Dear Abhishek Sharma, these are not ipl bowlers.pic.twitter.com/MlrGP5ZV2k— Maaz (@Im_MaazKhan) October 19, 2024 -
Ind vs Pak: భారత్‌దే విజయం
ఏసీసీ మెన్స్ ట్వంటీ 20 ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నీలో భారత -A. జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 184 పరుగుల లక్ష్య చేదనలో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులకే పరిమితమైంది. అంతకముందు భారత్- ‘ఎ’ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌సింగ్ శుభారంభం అందించగా.. తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌లో అలరించాడు.ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా భారత్- పాక్ యువ జట్టు ఒమన్‌లోని అల్ అమెరట్ వేదికగా శనివారం మ్యాచ్ ఆడుతున్నాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ 22 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేయగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు.ప్రభ్‌సిమ్రన్ ధనాధన్.. తిలక్ కెప్టెన్ ఇన్నింగ్స్కేవలం 19 బంతుల్లోనే 3 ఫోర్లు ,3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ 35 బంతుల్లో 44 పరుగులతో రాణించగా.. నేహల్ వధేరా(22 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లలో రమణ్‌దీప్ సింగ్(17) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోరు దాటాడు. ఆయుశ్ బదోని(2), నిషాంత్ సంధు(6), అన్షుల్ కాంబోజ్(0), రాహుల్ చహర్(4*), రసిద్ దార్ సలాం(6*) కనీసం పోరాట పటిమ ప్రదర్శించలేదు.ఇక పాక్ బౌలర్లలో ఇమ్రాన్, జమాన్ ఖాన్, మిన్హాస్, కాసిం అక్రం ఒక్కో వికెట్ తీయగా.. సూఫియాన్ ముకీమ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. కాగా భారత టాపార్డర్ రాణించిన కారణంగా పాకిస్తాన్‌కు తిలక్ సేన 184 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది.భారత్- ‘ఎ’ వర్సెస్ పాకిస్తాన్- ‘ఎ’ప్లేయింగ్ ఎలెవన్ఇండియాఅభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.పాకిస్తాన్హైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.చదవండి: Ind vs NZ: అయ్యో పంత్! .. నీకే ఎందుకిలా? -
Asia Cup: పాక్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. తుదిజట్లు ఇవే
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడుతోంది. దాయాదుల మధ్య పోరుకు ఒమన్‌లోని అల్ అమెరట్ స్టేడియం వేదికగా నిలిచింది. భారతకాలమానం ప్రకారం శనివారం రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.అభిషేక్ జోడీగా ప్రభ్సిమ్రన్సింగ్ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడే భారత తుదిజట్టులో టీమిండియా టీ20 నయా ఓపెనర్ అభిషేక్ శర్మ చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్సింగ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. కాగా ఒమన్‌లో జరుగుతున్న ఈ ఆసియా టీ20 టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ జట్లు ఇప్పటికే శుభారంభం చేశాయి.అంచనాలు రెట్టింపుహాంకాంగ్పై బంగ్లా యువ జట్టు 5 వికెట్లు, శ్రీలంక-ఎ జట్టుపై అఫ్గన్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించాయి. మరోవైపు.. మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈతో తలపడ్డ ఆతిథ్య ఒమన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో నాలుగో మ్యాచ్‌లో భారత్- పాక్ తలపడటం.. అందులోనూ టీమిండియా స్టార్లు తిలక్ వర్మ(కెప్టెన్‌గా), అభిషేక్ శర్మ ఈ జట్టులో ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి.భారత్- ‘ఎ’ వర్సెస్ పాకిస్తాన్- ‘ఎ’ తుదిజట్లుయువ భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.పాక్ యువ జట్టుహైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్! -
IND VS BAN 3rd T20: మరోసారి విఫలమైన అభిషేక్ శర్మ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్ ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 16, 15, 4 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ల గైర్హాజరీలో జట్టులో చోటు దక్కించుకున్న అభిషేక్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక ఉసూరుమనిపించాడు. ఇటీవలే జింబాబ్వేపై మెరుపు సెంచరీ చేసిన అభిషేక్‌పై భారీ అంచనాలు ఉండేవి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగలడని మేనేజ్మెంట్ అతనిపై విశ్వాసం ఉంచింది. అయితే అభిషేక్ అందరి అంచనాలను వమ్ము చేస్తూ తేలిపోయాడు. ప్రస్తుతమున్న కాంపిటీషన్లో అభిషేక్‌కు మరోసారి జట్టులో చోటు దక్కడం కష్టమే.కాగా, హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా 23 పరుగుల వద్దే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. అయితే సంజూ శాంసన్ (25 బంతుల్లో 59; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిసున్నారు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 113/1గా ఉంది. చదవండి: దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..! -
Ind vs Ban మెదడు సరిగ్గా వాడితేనే: యువీ ఘాటు విమర్శలు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి ‘చురకలు’ అంటించాడు. బ్యాటింగ్ చేసేటపుడు మెదడును కాస్త అదుపులో పెట్టుకుంటేనే రాణించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయమేమిటంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టులో అభిషేక్ తొలిసారి చోటు దక్కించుకున్నాడు.మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపుఈ క్రమంలో ఆతిథ్య జట్టుతో జరిగిన టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ పంజాబీ బ్యాటర్.. డకౌట్ అయ్యాడు. అయితే, మరుసటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తనను తాను నిరూపించుకున్నాడు. ఈ సిరీస్ ముగిసిన దాదాపు రెండు నెలల తర్వాత అభిషేక్ శర్మ మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.రనౌట్‌గా వెనుదిరిగిస్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌తో కలిసి అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, దూకుడుగా ఆడుతున్న క్రమంలో అనూహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు.టీమిండియా ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ వేసిన టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి సంజూ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు. ఈ క్రమంలో సింగిల్‌కు ఆస్కారం ఉందని భావించిన సంజూ, అభిషేక్ పరుగుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే ప్రమాదాన్ని గ్రహించిన సంజూ.. అభిషేక్‌ను వెనక్కి వెళ్లమని సూచించాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.బంతిని అందుకున్న బంగ్లాదేశ్ ఫీల్డర్ తౌహీద్ హృదోయ్..నేరుగా స్టంప్స్ వైపునకు విసిరాడు. దీంతో.. నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ముందుకు వెళ్లిపోయిన అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16 పరుగులు) పెవిలియన్‌కు చేరకతప్పలేదు. అయితే, మిగతా బ్యాటర్లు రాణించడంతో మ్యాచ్ ఫలితంపై ప్రతికూల ప్రభావం పడలేదు. సంజూ శాంసన్(29), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో టీమిండియా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే! ఈ నేపథ్యంలో విజయానంతరం అభిషేక్ శర్మ ఇన్‌స్టాలో టీమిండియా ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే! సిరీస్‌లో మాకు శుభారంభం’’ అని క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు బదులుగా ఓ నెటిజన్.. అభిషేక్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. అయితే, ఆ కామెంట్‌కు యువీ.. ‘‘కేవలం మెదడు ఉపయోగిస్తే మాత్రమే అది సాధ్యం’’ అన్న అర్థంలో జవాబు ఇచ్చాడు.కాగా అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఎదుగుదలలో యువీది కీలక పాత్ర. ఈ విషయాన్ని అభిషేక్ చాలా సందర్బాల్లో స్వయంగా వెల్లడించాడు. అయితే, బాగా ఆడినపుడు ప్రశంసించడమే కాదు.. అనవసర తప్పిదాలు చేసినపుడు కాస్త ఘాటుగానే విమర్శించడం యువీకి అలవాటు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరఫున అభి వీరబాదుడు బాది.. నిర్లక్ష్యపు షాట్‌కు అవుటైనపుడు.. ‘నీ కోసం స్లిప్పర్ ఎదురు చూస్తోంది’ అంటూ యువీ చొరవగా ట్వీట్ చేశాడు. చదవండి: Pak vs Eng: ‘హైవే రోడ్డు మీద కూడా బ్యాటింగ్ చేయలేవు’ -
Ind vs Ban: గిల్, జైస్వాల్‌లకు రెస్ట్.. వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!
టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా వచ్చే నెల 6, 9, 12వ తేదీల్లో మూడు మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలోనే జట్టును ప్రకటించనుంది.ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ పొట్టి సిరీస్‌కు శుబ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌కు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. కాగా సొంతగడ్డపై నవంబరులో టీమిండియా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే భారత్‌కు ఈ సిరీస్ కీలకం.గిల్, జైస్వాల్‌పై పనిభారం పడకుండాఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్‌పై పనిభారం పడకుండా చూసుకునేందుకు.. మేనేజ్మెంట్ ఈ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత.. గిల్- జైస్వాల్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా ప్రధాన ఓపెనింగ్ జోడీగా మారారు.వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!అయితే, కివీస్‌తో సిరీస్ కారణంగా వీరిద్దరు గనుక దూరమైతే.. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు లక్కీ ఛాన్స్ వచ్చినట్లే! వీరిద్దరు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. అయితే, రుతురాజ్ ఇరానీ కప్-2024 మ్యాచ్ కారణంగా తొలి టీ20కి దూరం కానున్నాడని.. అందుకే జైస్వాల్ ఆ ఒక్కమ్యాచ్కి అందుబాటులో ఉంటాడనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.కాగా ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘సి’ కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్.. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ మ్యాచ్ అక్టోబరు 1-5 వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపిక కానుండగా.. జితేశ్ శర్మను అతడికి బ్యాకప్‌గా సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.విధ్వంసకర సెంచరీ హీరో అభిషేక్ శర్మటీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో స్థానం దక్కించుకున్న పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తొలిటీ20 సందర్భంగా అరంగేట్రం చేశాడు.అయితే, తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయి విమర్శపాలైన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో టీ20లో శతకంతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకుని.. ఆ తర్వాత అవుటయ్యాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు అతడికి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. ఇక టీమిండియా విషయానిస్తే.. బంగ్లాతో తొలి టెస్టు గెలిచి.. శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్ -
Ind vs SL: సెంచరీలు చేసినా పట్టించుకోరా?
శ్రీలంకలో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరుపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని సెలక్టర్ల విధానాన్ని విమర్శించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో గెలిచింది.ఇక ఈ టూర్ ద్వారానే ఐపీఎల్ వీరులు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి వాళ్లు అరంగేట్రం చేశారు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే అభిషేక్ సెంచరీతో మెరవగా.. రియాన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఇదిలా ఉంటే.. జింబాబ్వే పర్యటన తర్వాత టీమిండియా శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. జూలై 27 నుంచి మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఈ నేపథ్యంలో గురువారం టీ20, వన్డే జట్లను ప్రకటించారు. ఇందులో అనూహ్యంగా రియాన్ పరాగ్ రెండు జట్లలో చోటు దక్కించుకోగా.. అభిషేక్ శర్మకు మాత్రం స్థానం దక్కలేదు.సెంచరీలు చేసినా పట్టించుకోరా?అదే విధంగా.. సంజూ శాంసన్‌కు వన్డేల్లో చోటివ్వలేదు సెలక్టర్లు. అంతేకాదు మేటి స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను కూడా పక్కనపెట్టేశారు.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘శ్రీలంకతో సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో యుజీ చహల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఎందుకు భాగం కాలేకపోయారో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ షాకింగ్ ఎమోజీ జతచేశాడు భజ్జీ.కాగా సంజూ శాంసన్ జింబాబ్వేతో సిరీస్‌లో ఆడగా.. లంకతో టీ20 జట్టులో మాత్రమే చోటు లభించింది. ఇక వన్డేల విషయానికొస్తే చివరగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడాడు.ఖేల్ ఖతమేనా?పర్ల్ వేదికగా గతేడాది డిసెంబరులో ఆడిన తన చివరి వన్డేలో సంజూ సెంచరీతో చెలరేగి టీమిండియాకు విజయం అందించాడు. అయినప్పటికీ ఈ కేరళ బ్యాటర్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపడం గమనార్హం. దీనిని బట్టి అతడిని చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి కూడా పరిగణనలోకి తీసుకోరని సంకేతాలు ఇచ్చినట్లే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌కు ముందు టీమిండియా లంక, ఇంగ్లండ్‌లతో వన్డే సిరీస్‌లు ఆడనుంది.చదవండి: Ind vs SL: టీమిండియా అసిస్టెంట్ కోచ్‌లుగా వాళ్లిద్దరు.. దిలీప్ రీఎంట్రీ! -
రుతురాజ్, అభిషేక్‌లకు మొండిచెయ్యి.. వన్డేల్లో సంజూను నో ఛాన్స్
త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్లను ఇవాళ (జులై 18) ప్రకటించారు. వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. టీ20 జట్టు నూతన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.ఇరు జట్లకు వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వ్యవహరించనుండగా.. రిషబ్ పంత్, రియాన్ పరాగ్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.వన్డే జట్టుకు హర్షిత్ రాణా కొత్తగా ఎంపిక కాగా.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20 వరల్డ్‌కప్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లి వన్డేల్లో కొనసాగనుండగా.. హార్దిక్ పాండ్యాకు వన్డే జట్టులో చోటు దక్కలేదు.రుతురాజ్, అభిషేక్‌లకు మొండిచెయ్యి.. వన్డేల్లో సంజూను నో ఛాన్స్తాజాగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీతో మెరిసిన అభిషేక్ శర్మ.. గత ఏడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో 70కి పైగా సగటుతో పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ రెండు జట్లలో (టీ20, వన్డే) చోటు దక్కించుకోలేకపోయారు. టీ20ల్లో ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఎంపికయ్యారు. తానాడిన చివరి వన్డేలో (సౌతాఫ్రికా) సెంచరీ చేసిన సంజూ శాంసన్ వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.కాగా, టీమిండియా.. మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
అభిషేక్ శర్మ ఆల్‌టైమ్ రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే
జింబాబ్వే టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సత్తాచాటుతున్నాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటకి ఆ తర్వాత మ్యాచ్‌లోనే విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.ఆ తర్వాత మూడో టీ20లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన అభిషేక్‌కు.. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బ్యాటింగ్‌లో ఛాన్స్ రానప్పటకి బౌలింగ్‌లో మాత్రం తన మార్క్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అభిషేక్ కేవలం 20 పరుగులు మాత్రమే ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓ టీ20 సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. కాగా, ఓ సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ ఘనతను భారత్ తరఫున టెస్టు ఫార్మాట్లో లాల్ అమర్నాథ్ (1933), వన్డేల్లో కపిల్ దేవ్ (1983) తొలిసారి సాధించారు. ఇక నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో సొంతం చేసుకుంది. -
జింబాబ్వేతో మూడో టీ20.. గిల్‌పై అభిమానుల ఆగ్రహం
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెరుపు అర్దసెంచరీతో (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. గిల్ చాన్నాళ్ల తర్వాత ఈ మ్యాచ్‌తోనే ఫామ్‌లోకి వచ్చినా ఓ విషయంలో మాత్రం అభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు.విషయం ఏంటంటే.. శుభ్‌మన్ గిల్.. మూడో టీ20లో తాను ఓపెనర్‌గా బరిలోకి దిగడం కోసం రెండో టీ20లో ఓపెనర్‌గా వచ్చి సెంచరీ చేసిన అభిషేక్ శర్మను డిమోట్ చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ స్థానచలనం కలగడంతో ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. ఇదే అభిమానులకు గిల్‌పై ఆగ్రహం తెప్పించింది. గిల్ తన స్వార్దం కోసం జట్టు ప్రయోజనాలను గాలికి వదిలేయడంతో పాటు అభిషేక్ లయను దెబ్బ తీశాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం గిల్ ఈ విషయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం (అభిషేక్ స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటాడని చెప్పాడు) చేసినా అభిమానులు అతన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గిల్ మరో కోహ్లిలా (వ్యక్తిగత రికార్డుల విషయంలో) ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి యశస్వి జైస్వాల్ రాకతో టీమిండియాకు కొత్త చిక్కే (ఓపెనర్ల విషయంలో) వచ్చి పడింది. టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన యశస్వి లేటుగా (మూడో టీ20) జట్టుతో జతకట్టిన విషయం తెలిసిందే.కాగా, బ్యాటింగ్‌లో గిల్, రుతురాజ్ (49).. బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-16-1) సత్తా చాటడంతో మూడో టీ20లో టీమిండియా జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఛేదనలో పోటీపడలేకపోయిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. -
టాప్ ర్యాంక్ కోల్పోయిన హార్దిక్.. ఏడో స్థానానికి ఎగబాకిన రుతురాజ్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ సత్తా చాటారు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సుడిగాలి శతకంతో ఇరగదీసిన అభిషేక్.. ఎంట్రీలోనే అదుర్స్ అనిపించుకోగా.. అదే మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో రాణించిన రుతు.. 13 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకాడు. అభిషేక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లిస్ట్ అయిన తొలిసారే 75వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్ నుంచి టాప్-10 రుతురాజ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. గత వారమే అగ్రపీఠాన్ని కోల్పోయిన స్కై.. రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్ టీ20 బ్యాటర్‌గా ట్రవిస్ హెడ్ కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, జోస్ బట్లర్, రుతురాజ్, బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్, మార్క్రమ్ వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ఆదిల్ రషీద్, అన్రిచ్ నోర్జే, హసరంగ టాప్-3 బౌలర్లుగా కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, అకీల్ హొసేన్, ఆడమ్ జంపా, ఫజల్హక్ ఫారూఖీ, అక్షర్ పటేల్, తీక్షణ నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ మినహా టాప్-10లో ఎవరూ లేరు. కుల్దీప్ 11, బుమ్రా 14, భిష్ణోయ్ 16, అర్ష్‌దీప్ 19 స్థానాల్లో ఉన్నారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. గత వారం ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండిన హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి పడిపోయాడు. హసరంగ టాప్ ప్లేస్‌కు ఎగబాకాడు. భారత ఆటగాళ్లలో అక్షర్ పటేల్ 12వ స్థానంలో ఉన్నాడు.టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా టాప్-5లో ఉన్నాయి. -
అభి"షేక్" శర్మ.. రసెల్, హెడ్ కూడా దిగదుడుపే..!
భారత యువ కెరటం అభిషేక్ శర్మ పొట్టి క్రికెట్లో సరికొత్త సంచలనంగా మారాడు. రెండ్రోజుల కిందట జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేసిన శర్మ.. ఈ ఏడాది ఆరంభం నుంచే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం మొదలుపెట్టాడు.ఈ ఏడాది ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన శర్మ.. 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 584 పరుగులు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి క్రికెట్లో ఈ ఏడాది ఇంత స్ట్రయిక్‌రేట్ ఎవ్వరికీ లేదు. అభిషేక ముందు ఆండ్రీ రసెల్ (199.47), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (194.13), ట్రవిస్ హెడ్ (176.24), ఫిలిప్ సాల్ట్ (172.67) కూడా దిగదుడుపే.ఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (2 వికెట్ల నష్టానికి 234 పరుగులు) చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది. -
‘అడవి’లోకి అభిషేక్ శర్మ.. మృగరాజును చూశారా? (ఫొటోలు)
-
‘నేను డకౌట్ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’
‘‘మొదటి మ్యాచ్ తర్వాత కూడా నేను ఆయనతో మాట్లాడాను. నేను డకౌట్ అయినా సరే ఆయన ఎందుకో చాలా సంతోషంగా కనిపించాడు. ‘మరేం పర్లేదు.. ఇది శుభారంభమే’ అని నాతో అన్నాడు. అయితే, ఇప్పుడు ఆయన నన్ను చూసి ఎంతగానో గర్విస్తున్నాడు.నా కుటుంబం ఎంతటి సంతోషంలో ఉందో పాజీ కూడా అంతే ఆనందపడుతున్నాడు. ఇదంతా కేవలం ఆయన చలవ వల్లే సాధ్యమైంది. నా కోసం ఎన్నో ఏళ్లుగా ఆయన కూడా కఠిన శ్రమకోరుస్తున్నాడు.నన్ను తీర్చిదిద్దడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. కేవలం క్రికెట్ పాఠాలు నేర్పించడమే కాదు.. మైదానం వెలుపలా నాకు ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తున్నారు’’ అని టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.డకౌట్.. వెను వెంటనే సెంచరీభారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో అదరగొట్టిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు అభిషేక్ శర్మను ఎంపిక చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలోనే అతడు డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు.కానీ ఇరవై నాలుగు గంటల్లోనే తిరిగి అద్భుతం చేశాడు. వైఫల్యాన్ని మరిపిస్తూ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో ఆదివారం నాటి రెండో టీ20లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వంద పరుగులు సాధించాడు.తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. డకౌట్ అయిన చోటే శతకంతో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నాడు.గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావుఈ క్రమంలో అభిషేక్ శర్మ తన మెంటార్ యువరాజ్ సింగ్‌కు కాల్ చేయగా.. ‘‘గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావు. ఈ ప్రశంసలకు నువ్వు అర్హుడవు. ఇలాంటివి ఇంకెన్నో సాధించాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని సంతోషం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం అతడు వరల్డ్ చాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ అభిషేక్ ఫోన్‌కు స్పందించి ఈ మేరకు అభినందించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ యువీ గొప్పతనాన్ని, తన కెరీర్లో అతడి పాత్ర గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.చదవండి: బాబర్ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!Two extremely special phone 📱 calls, one memorable bat-story 👌 & a first 💯 in international cricket! 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!A Hundred Special, ft. Abhishek Sharma 👏 👏 - By @ameyatilak WATCH 🎥 🔽 #TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/0tfBXgfru9— BCCI (@BCCI) July 8, 2024 View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
టీమిండియా తరఫున ఎవరికీ సాధ్యం కాలేదు.. అభిషేక్ శర్మ సాధించాడు
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో (7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (2 వికెట్ల నష్టానికి 234 పరుగులు) చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది.𝙃𝙖𝙫𝙤𝙘 𝙞𝙣 𝙃𝙖𝙧𝙖𝙧𝙚 🌪️🏏@IamAbhiSharma4 smashes 100 in 47 balls 🥵💪#SonySportsNetwork #ZIMvIND #TeamIndia pic.twitter.com/hHYlTopD1V— Sony Sports Network (@SonySportsNetwk) July 7, 2024ఇదిలా ఉంటే, రెండో టీ20లో సుడిగాలి శతకంతో (46 బంతుల్లో) విరుచుకుపడిన అభిషేక్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. కెరీర్లో కేవలం రెండో టీ20 ఆడుతున్న అభిషేక్.. సెంచరీ మార్కును హ్యాట్రిక్ సిక్సర్లతో (వెల్లింగ్టన్ మసకద్జ బౌలింగ్‌లో) అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కూడా అంతర్జాతీయ శతకాన్ని హ్యాట్రిక్ సిక్సర్లతో అందుకోలేదు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ తన పరుగుల ఖాతాను కూడా సిక్సర్‌తోనే ఓపెన్ చేయడం విశేషం. తన కెరీర్ తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన అభిషేక్ రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి పలు రికార్డులు కొల్లగొట్టాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్‌ల పరంగా) సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. అభిషేక్ కేవలం రెండు ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే తన మొదటి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు.అభిషేక్‌కు ముందు ఈ రికార్డు దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తన కెరీర్ మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో అత్యంత పిన్న వయస్కుడిగా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయస్సులో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ జాబితాలో యశస్వీ జైశ్వాల్ (21 ఏళ్ల 279 రోజుల వయస్సులో) టాప్‌లో ఉన్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(38 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో నిలిచారు.ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 50 సిక్స్‌లు బాదాడు. అభిషేక్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లు) పేరిట ఉండేది.ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో 65 పరుగులు సాధించిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20ల్లో స్పిన్నర్లపై అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అభిషేక్‌కు ముందు ఈ రికార్డు యువరాజ్ సింగ్ (57 పరుగులు) పేరిట ఉండేది. -
నా సెంచరీ సీక్రెట్ ఇదే.. అతడికి థ్యాంక్స్ చెప్పాలి: అభిషేక్ శర్మ
అరంగేట్రంలోనే డకౌటై విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.. 24 గంటల వ్యవధిలోనే సంచలనం సృష్టించాడు. ఎక్కడైతే డకౌటయ్యాడో అక్కడే సెంచరీతో సత్తా చాటి శెభాష్ అనిపించుకుంటున్నాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. జింబాబ్వే బౌలర్లను అభిషేక్ ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా అతి తక్కువ ఇన్నింగ్స్‌లో తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ అందుకున్న భారత ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన అభిషేక్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో ఆడలేదంట. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో ఈ అద్భుత నాక్ ఆడినట్లు అభిషేక్ తెలిపాడు."ఓ విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ మ్యాచ్‌లో నేను శుబ్‌మన్ గిల్ బ్యాట్‌తో ఆడాడను. అతడి నుంచి బ్యాట్‌ను తీసుకుని ఆడటం చాలా కష్టం. అతడు తన బ్యాట్లను ఎవరికీ అంత ఈజీగా ఇవ్వడు. కానీ నేను మాత్రం మేము అండర్-14 క్రికెట్ ఆడే రోజుల నుంచి అతడి బ్యాట్‌ను ఉపయోగిస్తునే ఉన్నాను. నేను ఒత్తిడిలో ఉన్న ప్రతీ సారి గిల్‌ను తన బ్యాట్ ఇవ్వమని అడుగుతాను. నేను అతని బ్యాట్‌తో ఆడినప్పుడల్లా అద్భుతంగా రాణించాను . ఇప్పుడు కూడా అంతే. సరైన సమయంలో గిల్ తన బ్యాట్‌ను నాకు ఇచ్చాడు. నాతో పాటు జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. థంక్యూ గిల్ అంటూ బీసీసీఐ టీవీతో అభిషేక్ పేర్కొన్నాడు. కాగా గిల్, అభిషేక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరూ పంజాబ్ నుంచి భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
వారిద్దరూ అద్భుతం.. ఎంతచెప్పుకున్న తక్కువే: టీమిండియా కెప్టెన్
జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్‌లతో 100) సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 77 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆఖరిలో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 134 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్లు ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్, సుందర్ చెరో రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు.ఈ మ్యాచ్‌లో సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అభిషేక్ శర్మ, రుతురాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో వారు ఆడిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే పవర్‌ప్లేలో ఆ విధంగా బ్యాటింగ్ చేయడం అంత ఈజీకాదు. "పవర్‌ప్లేలో కొత్త బంతి కాస్త ఎక్కువగా స్వింగ్ అవ్వడంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటారు. కానీ అభి, రుతు మాత్రం చాలా పరిపక్వతతో ఆడారు. ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపించారు. ఇది యువ భారత జట్టు. ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్లు ప్రొఫిషనల్ టీ20 క్రికెట్లో ఆడిండవచ్చు గానీ అంతర్జాతీయ అనుభవం పెద్దగా ఎవరికి లేదు. తొలి టీ20లో ఒత్తడిని తట్టుకోలేక వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. అందుకే స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక ఓడిపోయాం. కానీ ఇప్పుడు రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని సంచలన విజయం సాధించాము. ఈ సిరీస్‌లో మాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాటిలో కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో గిల్ పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన అభిషేక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సెంచరీ చేసి ఔరా అన్పించాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్‌ల పరంగా) తొలి సెంచరీ నమోదు చేసిన మొదటి భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. అభిషేక్ శర్మ కేవలం రెండు ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే తన మొదటి అంతర్జాతీయ సెంచరీని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెటర్ దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తను అరంగేట్రం నుంచి మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో కేవలం తన రెండో ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన అభిషేక్.. హుడా ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో అత్యంత పిన్న వయుష్కుడిగా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయస్సులో శర్మ తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో భారత యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఉన్నాడు. జైశ్వాల్ 21 ఏళ్ల 279 రోజుల వయస్సులో సెంచరీ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(38 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్..50 సిక్స్‌లు బాదాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ శర్మ 25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌తో హిట్‌మ్యాన్‌ను అభిషేక్ అధిగమించాడు.ఇక జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో భారత్ సమం చేసింది. -
అభిషేక్ అదరహో...
హరారే: అంతర్జాతీయ వేదికపై తన ఆగమనాన్ని అదరగొట్టే ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ చాటుకున్నాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. శనివారం జరిగిన తొలి టి20లో ‘సున్నా’కే అవుటైన ఈ పంజాబ్ బ్యాటర్ రెండో టి20లో మాత్రం ‘శత’క్కొట్టాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో చెలరేగిపోయిన అభిõÙక్ సరిగ్గా 100 పరుగులు చేసి అవుటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77; 11 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా మెరిపించడంతో భారత జట్టు 100 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. టి20ల్లో జింబాబ్వేపై ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. మధెవెరె (39 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), జోంగ్వి (26 బంతుల్లో 33; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/37), అవేశ్ ఖాన్ (3/15), రవి బిష్ణోయ్ (2/11) రాణించారు. అభిõÙక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (2) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. గిల్ అవుటయ్యాక అభిõÙక్, రుతురాజ్ భారత ఇన్నింగ్స్‌ను నడిపించారు. వ్యక్తిగత స్కోరు 27 పరుగులవద్ద అభిõÙక్ ఇచ్చిన క్యాచ్‌ను మసకద్జా వదిలేశాడు. ఆ తర్వాత అభిõÙక్ చెలరేగిపోయాడు. మైర్స్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అభిషేక్ 2,4,6,4,6,4తో 28 పరుగులు సాధించాడు. దాంతో భారత స్కోరు 100 పరుగులు దాటింది.మసకద్జా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అభిõÙక్ వరుసగా 3 సిక్స్‌లు కొట్టి 46 బంతుల్లోనే తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే మైర్స్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరుకన్నాడు. రుతురాజ్‌తో కలిసి అభిõÙక్ రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించాడు. అభిషేక్ నిష్క్రమించాక వచ్చిన రింకూ సింగ్ కూడా దూకుడుగా ఆడటంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది. భారత్ చివరి 10 ఓవర్లలో 160 పరుగులు చేయడం విశేషం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ బుధవారం జరుగుతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (సి) బెనెట్ (బి) ముజరబాని 2; అభిషేక్ శర్మ (సి) మైర్స్ (బి) మసకద్జా 100; రుతురాజ్ గైక్వాడ్ (నాటౌట్) 77; రింకూ సింగ్ (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 234. వికెట్ల పతనం: 1–10, 2–147. బౌలింగ్: బెనెట్ 2–0–22–0, ముజరబాని 4–1–30–1, చటారా 4–0–38–0, సికందర్ రజా 3–0–34–0, జోంగ్వి 4–0–53–0, మైర్స్ 1–0–28–0, మసకద్జా 2–0–29–1. జింబాబ్వే ఇన్నింగ్స్: ఇన్నోసెంట్ కాయా (బి) ముకేశ్ కుమార్ 4; మధెవెరె (బి) రవి బిష్ణోయ్ 43; బెనెట్ (బి) ముకేశ్ కుమార్ 26; మైర్స్ (సి) రింకూ సింగ్ (బి) అవేశ్ ఖాన్ 0; సికందర్ రజా (సి) ధ్రువ్ జురేల్ (బి) అవేశ్ ఖాన్ 4; క్యాంప్‌బెల్ (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 10; మదాండె (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 0; మసకద్జా (రనౌట్) 1; జోంగ్వి (సి) రుతురాజ్ (బి) ముకేశ్ కుమార్ 33; ముజరబాని (సి) సుందర్ (బి) అవేశ్ ఖాన్ 2; చటారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–4, 2–40, 3–41, 4–46, 5–72, 6–73, 7–76, 8–117, 9–123, 10–134. బౌలింగ్: ముకేశ్ 3.4–0– 37–3, అభిషేక్ శర్మ 3–0–36–0, అవేశ్ 3–0– 15–3, రవి బిష్ణోయ్ 4–0–11–2, వాషింగ్టన్ సుందర్ 4–0– 28–1, పరాగ్ 1–0–5–0. -
దెబ్బకు దెబ్బ.. టీమిండియా చేతిలో జింబాబ్వే చిత్తు
జింబాబ్వేతో రెండో టీ20లో యువ టీమిండియా అదరగొట్టింది. ఆతిథ్య జట్టును వంద పరుగుల తేడాతో మట్టికరిపించి ఘన విజయం సాధించింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.దెబ్బకు దెబ్బ కొట్టి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ గెలుపు ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఖాతాలో కెప్టెన్‌గా తొలి విజయం నమోదైంది.దుమ్ములేపిన అభిషేక్.. రాణించిన రుతురాజ్హరారే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 2 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి జింబాబ్వే బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.తొలి టీ20లో విఫలమైన ఈ పంజాబీ బ్యాటర్ తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసి తన విలువ చాటుకున్నాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.అభిషేక్ శర్మకు తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అర్థశతకం (47 బంతుల్లో 77 పరుగులు) తో అజేయంగా నిలిచాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రింకూ సింగ్ (22 బంతుల్లో 48 పరుగులు నాటౌట్, ఫోర్లు 2, సిక్సర్లు 5) రుతురాజ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో యువ భారత జట్టు కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 234 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.జోరుగా హుషారుగా వికెట్లు...ఓపెనర్ ఇన్నోసెంట్ కయా (4)ను ముకేష్‌కుమార్ ఆదిలోనే వెనక్కి పంపించాడు. అయితే, రెండో వికెట్ తీయడానికి భారత బౌలర్లు కాస్త శ్రమించాల్సి వచ్చింది. మరో ఓపెనర్ వెస్లే మెదెవెరె(43), వన్‌డౌన్ బ్యాటర్ బ్రియాన్ బ్యానెట్ (26) తేలికగా తలొగ్గలేదు.బ్యానెట్‌ను ముకేష్‌కుమార్ ఔట్ చేయగా.. రవి బిష్ణోయ్ వెస్లే పని పట్టాడు. ఇదే జోరును భారత బౌలర్లు కొనసాగించడంతో జింబాబ్వే మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఈక్రమంలో లోయర్ ఆర్డర్లో వచ్చిన ల్యూక్ జాంగ్వే 33 పరుగులు చేసి కాసేపు పోరాడాడు. ముకేష్ దెబ్బకు అతడుకూడా పెవిలియన్ చేరక తప్పలేదు.ఈక్రమంలో 18.4 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 134 పరుగులు మాత్రమే చేసి 100 పరుగుల భారీ తేడాతో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది.టీమిండియా బౌలర్లలో ముకేష్‌కుమార్, ఆవేశ్‌ఖాన్ చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. రవి బిష్ణోయ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. భారత్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. -
అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ.. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఊచకోత
హరారే వేదికగా జింబాబ్వే జరుగుతున్న రెండో టీ20ల్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 46 బంతుల్లోనే అభిషేక్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో సిక్సర్లతో తన సెంచరీని అభిషేక్ పూర్తి చేసుకున్నాడు. జింబాబ్వే బౌలర్లను మాత్రం అభిషేక్ ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ బౌండరీలు వర్షం కురిపించాడు. సరిగ్గా 100 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ అభిషేక్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. Abhishek Sharma 🚀#ZIMvINDpic.twitter.com/1VkL1DCUL9— OneCricket (@OneCricketApp) July 7, 2024 -
అభిషేక్ శర్మ డకౌట్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే చెత్త రికార్డు! వీడియో
టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అభిషేక్ శర్మ తనదైన మార్క్ చూపించలేకపోయాడు.ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్పిన్నర్ బెన్నట్ బౌలింగ్‌లో మొదటి నాలుగు బంతులను డాట్ చేసిన అభిషేక్.. ఐదో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక మ్యాచ్‌లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20 అరంగేట్రంలో డకౌటైన నాలుగో భారత ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో రజా కంటే ముందు ఎంఎస్ ధోని, కేఎల్ రాహుల్, పృథ్వీ షా ఉన్నారు. pic.twitter.com/JIFGKCtDIV— Azam Khan (@AzamKhan6653) July 6, 2024 -
జింబాబ్వేతో తొలి టీ20.. ముగ్గురు మొనగాళ్ల అరంగేట్రం
భారత తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ కల ఎట్టకేలకు నేరవేరింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20తో వీరిద్దరూ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అదే విధంగా ఇప్పటికే టెస్టు క్రికెట్లో భారత తరపున డెబ్యూ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రవ్ జురెల్.. ఇప్పుడు ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. వీరిముగ్గురూ భారత తత్కాలిక హెడ్ కోచ్ వీవీయస్ లక్ష్మణ్, సపోర్ట్ స్టాప్ చేతుల మీదగా డెబ్యూ క్యాప్‌ను అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విధ్వంసం సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. మరోవైపు పరాగ్ కూడా తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పరాగ్ నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు.ఇక జురెల్ విషయానికి వస్తే.. ఇప్పటికే టెస్టుల్లో తన ఏంటో నిరూపించుకున్న ఈ రాజస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్, ఇప్పుడు టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. టీ20ల్లో ఫినిషర్‌గా జురెల్‌కు మంచి రికార్డు ఉంది. -
IND vs ZIM 1st T20: భారత్‌కు బిగ్ షాక్.. జింబాబ్వే చేతిలో ఓటమి
India vs Zimbabwe, 1st T20 Live Updates and Highlights:భారత్‌కు బిగ్ షాక్.. జింబావ్వే చేతిలో ఓటమిటీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత్.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు.తొమ్మిదో వికెట్ డౌన్..టీమిండియా ఓటమికి చేరువైంది. ముఖేష్ కుమార్ రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్..అవేష్ ఖాన్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన అవేష్ ఖాన్.. మజకజ్డా బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ విజయానికి 22 బంతుల్లో 31 పరుగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు.టీమిండియా ఏడో వికెట్ డౌన్.. బిష్ణోయ్ ఔట్జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. రవి బిష్ణోయ్ రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి 39 బంతుల్లో 53 పరుగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్(5) పరుగులతో ఉన్నారు.టీమిండియా ఆరో వికెట్ డౌన్.. శుబ్‌మన్ గిల్ ఔట్కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన గిల్.. సికిందర్ రజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. భారత విజయానికి 53 బంతుల్లో 63 పరగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ ఉన్నారు.కష్టాల్లో టీమిండియా.. ఐదో వికెట్ డౌన్ధ్రువ్ జురెల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్.. మజకజ్డా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 43/5రింకూ సింగ్ ఔట్..టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. చతర బౌలింగ్‌లో రింకూ సింగ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 28/4. క్రీజులో శుబ్‌మన్ గిల్(19) పరుగులతో ఉన్నారు.నిరాశపరిచిన పరాగ్..భారత అరంగేట్ర ఆటగాడు రియాన్ పరాగ్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన పరాగ్.. చతరా బౌలింగ్‌లో ఔటయ్యాడు.రెండో వికెట్ డౌన్..టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. ముజబారనీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 16/2తొలి వికెట్ డౌన్.. అభిషేక్ శర్మ ఔట్116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రియన్ బెన్నట్ వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. మసకజ్డాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.4 వికెట్లతో చెలరేగిన బిష్ణోయ్.. 115 పరుగులకే జింబాబ్వే పరిమితంహరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. బిష్ణోయ్‌తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్,ముఖేష్ కుమార్ చెరో వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మదండే(29), మైర్స్(23), బెన్నట్(23), పరుగులు చేశారు.ఆలౌట్ దిశగా జింబాబ్వే.. 90 పరుగులకే 7 వికెట్లుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 15వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో జింబాబ్వే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 23 పరుగులు చేసిన డియాన్ మైర్స్ సుందర్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత బంతికే మస్కజ్డా స్టంపౌటయ్యాడు. 13 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 77/5జింబాబ్వే వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఐదో బంతికి సికిందర్ రజా ఔట్ కాగా.. ఆరో బంతికి క్యాంప్‌బెల్ రనౌటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే.. 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.మూడో వికెట్ డౌన్..జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన మాధవరే.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మైర్స్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.రెండో వికెట్ డౌన్.. 40 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన బెన్నట్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ సికిందర్ రజా, మాధవరే(17) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో కయా క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో బెన్నట్(8), మాధవరే(6) పరుగులతో ఉన్నారు.భారత్-జింబాబ్వే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. హరారే వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడతున్నాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో భారత తరపున యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్‌జురెల్ టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. కాగా సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో యువ భారత జట్టుకు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహిస్తున్నాడు.తుది జట్లుభారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
Ind vs Zim: వికెట్ కీపర్‌గా అతడే.. భారత తుది జట్టు ఇదే!
దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత యువ టీమిండియా తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ స్టార్ బ్యాటర్ల నిష్క్రమణ తర్వాత శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో తలపడేందుకు హరారేకు వెళ్లింది.ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం తొలి టీ20 ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన తుది జట్టును ఎంచుకున్నాడు.ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘టాపార్డర్‌లో శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా ఈ ముగ్గురి ఆర్డర్ మారొచ్చు కానీ.. టాప్-3లో మాత్రం వీరే ఉండాలి.ఆ తర్వాతి స్థానంలో రియాన్ పరాగ్ బ్యాటింగ్‌కు రావాలి. ఇక వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ను ఆడించాలి. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానం అతడిదే.ఆరో బ్యాటర్‌గా రింకూ సింగ్ బరిలోకి దిగాలి. లేదంటే జురెల్ కంటే ముందుగానే వచ్చినా పర్లేదు. జురెల్ కీపింగ్ చేస్తాడు కాబట్టి ఈసారి జితేశ్ శర్మకు నేనైతే అవకాశం ఇవ్వను.ఇక ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించాలి. ఆల్‌రౌండర్‌గా జట్టుకు తన సేవలు అవసరం. నలుగురు బౌలర్లను తీసుకోవాలి కాబట్టి స్పిన్నర్ కోటాలో రవి బిష్ణోయితో పాటు.. వాషింగ్టన్ కూడా అందుబాటులో ఉండటం కలిసి వస్తుంది.అభిషేక్ శర్మ కూడా పార్ట్‌టైమ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ప్రభావం చూపగలడు. ఇక పేస్ విభాగంలో ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ తమ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరు.నిజానికి హర్షిత్ రాణాను చోటివ్వాల్సింది. అయితే, బెంగాల్ ప్రొ టీ20 లీగ్‌లో ముకేశ్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇక ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ వరల్డ్‌కప్ ట్రావెలింగ్ టీమ్‌లో భాగం కాబట్టి.. ఈ ముగ్గురిని ఆడించవచ్చు. అందుకే హర్షిత్ రాణాకు ఈసారికి మొండిచేయి తప్పదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో టూర్‌కు ఎంపికైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివం దూబే తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. టీ20 ప్రపంచకప్-2024 విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వీరు భారత్‌కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.Watch out for those moves 🕺🏻 Wankhede was a vibe last night 🥳#T20WorldCup | #TeamIndia | #Champions pic.twitter.com/hRBTcu9bXc— BCCI (@BCCI) July 5, 2024 జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, రవి బిష్ణోయ్, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణా.తొలి టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న జట్టు:శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. -
IND vs ZIM: టీమిండియా ఓపెనర్‌గా అభిషేక్ శర్మ.. కన్మాఫ్ చేసిన కెప్టెన్
భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లకు సర్వం సిద్దమైంది. జూలై 5న హరారే వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆతిథ్య జింబాబ్వే పూర్తిస్ధాయి జట్టుతో బరిలోకి దిగుతుండగా.. భారత్ మాత్రం పూర్తిగా యువ జట్టుతో ఆడనుంది. ఈ పర్యటనకు టీ20 వరల్డ్‌కప్-2024లో భాగమైన భారత ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. దీంతో ఓపెనర్ శుబ్మన్గిల్కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రానాలకు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.అభిషేక్ అరంగేట్రం..ఇక తొలిసారి భారత జట్టు ఎంపికైన అభిషేక్ శర్మ.. శనివారం జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ధ్రువీకరించాడు. ఈ మ్యాచ్‌కు మీడియాతో మాట్లాడిన గిల్.. తనతో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్‌కు రానున్నాడని గిల్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో ఎస్ఆర్హెచ్కు ప్రాతనిథ్యం వహించిన అభిషేక్ శర్మ సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్‌తో కలిసి భీబత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్‌లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్లో సైతం అదరగొడుతున్నాడు. -
జింబాబ్వేతో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే? విధ్వంసకర వీరుల ఎంట్రీ
విశ్వవిజేతలగా నిలిచిన అనంతరం భారత జట్టు తొలి టీ20 సిరీస్‌కు సిద్దమైంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సాయిసుదర్శన్, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రానాలకు తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. జూలై 6న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈమ్యాచ్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే హరారేకు చేరుకుంది. తొలి పోరు కోసం తీవ్రంగా యంగ్ టీమిండియా శ్రమించింది. ఈ క్రమంలో తొలి టీ20లో ఆడే భారత తుది జట్టుపై ఓ లూక్కేద్దం.అభిషేక్, పరాగ్ ఎంట్రీ..ఈ మ్యాచ్‌తో ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశముంది. అతడు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా ఫస్ట్‌డౌన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను బ్యాటింగ్ దింపే ఆలోచనలో జట్టు మెనెజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అభిషేక్‌తో పాటు రియాన్ పరాగ్ కూడా డెబ్యూ చేయనున్నట్లు సమాచారం. అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌కు చోటు దక్కే అవకాశముంది. ఫినిషర్‌గా రింకూ సింగ్ ఎలాగో ఉంటాడు.ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బౌలర్లగా రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ల స్ధానాలు దాదాపు ఖాయమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.భారత తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్,రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే! ఐపీఎల్ హీరోలకు చోటు
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అజిత్ అగార్క్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించింది.ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ టూర్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.అదే విధంగా ఈ సిరీస్‌కు భారత జట్టులో ఐపీఎల్లో హీరోలకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్, సీఎస్కే పేసర్ తుషార్ దేశ్ పాండేలకు సెలక్టర్లు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు.నితీష్ కుమార్ ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన నితీష్ కుమార్ రెడ్డి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఈ ఆంధ్ర ఆటగాడు ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ 33.67 సగటుతో 303 పరుగులతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అద్బుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.అభిషేక్ శర్మఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ సైతం సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్‌తో కలిసి భీబత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్‌లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్లో సైతం అదరగొడుతున్నాడు.రియాన్ పరాగ్..ఇక ఆస్సాం స్టార్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ సైతం ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. ఓవరాక్షన్ స్టార్ అని అందరితో విమర్శలు ఎదుర్కొన్న పరాగ్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న పరాగ్ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అతడికి టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌కు సీనియర్లు దూరం కావడంతో సెలక్టర్లు పరాగ్‌కు అవకాశమిచ్చారు. తుషార్ దేశ్‌పాండే..ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే కూడా తన బౌలింగ్‌తో అందరని ఆకట్టుకున్నాడు. గత రెండు సీజన్ల నుంచి దేశ్‌పాండే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు.ఐపీఎల్-2024లో 13 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 17 వికెట్లు పడగొట్టాడు. కేవలం ఐపీఎల్లో మాత్రం దేశీవాళీ క్రికెట్లో కూడా ముంబై తరపున దేశ్‌పాండే రాణిస్తున్నాడు. -
శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఐపీఎల్ హీరోలు
ఐపీఎల్ 2024 విన్నింగ్ కెప్టెన్ (కేకేఆర్) శ్రేయస్ అయ్యర్ జులై, ఆగస్ట్ నెలల్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. వివిధ కారణాల చేత టీ20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాని శ్రేయస్.. లంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం.మరోవైపు ఐపీఎల్ 2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ దయాల్ జులై 6 నుంచి జింబాబ్వేతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపికయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరందరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.వీరితో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఎంపికైన శుభ్‌మన్ గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికవుతారని తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనకు హార్దిక్ పాండ్యా కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవుతారని ప్రచారం జరుగుతుంది. జింబాబ్వే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతినిస్తారని సమాచారం. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉంది. మెగా టోర్నీలో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. -
అభిషేక్ శర్మ ఊచకోత.. 26 బంతుల్లో శతకం.. 14 సిక్సర్లతో విధ్వంసం
ఐపీఎల్ 2024 సెన్సేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. గురుగ్రామ్‌లో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో అభిషేక్ 26 బంతుల్లో శతక్కొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. స్థానికంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అభిషేక్ పంటర్స్ అనే క్లబ్‌కు ప్రాతనిథ్యం వహిస్తూ.. ప్రత్యర్థి మారియో క్రికెట్ క్లబ్‌ను షేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 26 బంతులు ఎదుర్కొని 14 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో అతని జట్టు పంటర్స్.. ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో జరిగిన ఫ్రెండ్షిప్ సిరీస్‌లో నిన్న పంటర్స్-మారియో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మారియో టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కృనాల్ సింగ్ (21 బంతుల్లో 60), నదీమ్ ఖాన్ (32 బంతుల్లో 74) చెలరేగడంతో మారియో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 249 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓ ఓవర్ బౌల్ చేసిన అభిషేక్ 13 పరుగులు సమర్పించుకున్నాడు.అనంతరం 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అభిషేక్ టీమ్ (పంటర్స్) 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన అభిషేక్.. మారియో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా సిక్సర్లు బాది మారియో టీమ్ బౌలర్ల భరతం పట్టాడు. ఫలితంగా పంటర్స్ టీమ్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. పంటర్స్ తరఫున అభిషేక్‌తో పాటు పునీత్ (21 బంతుల్లో 52), లక్షయ్ (29 బంతుల్లో 44 నాటౌట్) రాణించారు.కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. యూవీ మెంటార్షిప్లో అభిషేక్ గత ఐపీఎల్ సీజన్లో అద్భుతాలు చేశాడు. గత సీజన్లో అభిషేక్ 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేసి సన్‌రైజర్స్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. -
త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
తాను త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమంటున్నాడు రియాన్ పరాగ్. సెలక్టర్లు ఏదో ఒకరోజు తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయక తప్పదని.. ఈ విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.అసోంకు చెందిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్. కుడిచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన ఈ యంగ్‌స్టర్.. రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ కూడా! ఐపీఎల్లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అయితే, ఆరంభంలో నామమాత్రపు స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరాగ్ ఈ ఏడాది మాత్రం అద్భుతంగా రాణించాడు. దేశవాళీ క్రికెట్లో సూపర్ ఫామ్ అందుకున్న అతడు .. ఐపీఎల్-2024లోనూ దానిని కొనసాగించాడు.రాజస్తాన్ తరఫున 14 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 573 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.సీజన్ ఆసాంతం మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని రాజస్తాన్‌ను ప్లే ఆఫ్స్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు రియాన్ పరాగ్. ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారిస్తున్న ఈ అసోం ఆటగాడు త్వరలోనే టీమిండియాకు ఎంపిక కానున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడిన రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏదో ఒకరోజు వాళ్లు నన్ను సెలక్ట్ చేయక తప్పదు కదా! నేను టీమిండియాకు ఆడతాననే నమ్మకం నాకుంది.ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నేను లెక్కచేయను.నేను పరుగులు సాధించని సమయంలోనూ ఇదే తరహా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నాపై నాకున్న నమ్మకం అది.ఇదేమీ నేను అహంభావంతో చెబుతున్న మాట కాదు. పదేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి మా నాన్న, నేను ఇదే అనుకున్నాం. ఏదేమైనా ఏదో ఒకరోజు కచ్చితంగా జాతీయ జట్టుకు ఆడటమే మా ధ్యేయం అని ఫిక్సైపోయాం’’ అని రియాన్ పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.వచ్చే ఆరునెలల కాలంలో కచ్చితంగా టీమిండియా తరఫున తాను అరంగేట్రం చేసే అవకాశం ఉందని రియాన్ నమ్మకంగా చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సందర్భంగా ఐపీఎల్-2024లో దుమ్ములేపిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా తదితరులు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. -
SRH: ‘హృదయం ముక్కలైంది.. బాధ పడొద్దు మామయ్యా’! ఫొటో వైరల్
ఐపీఎల్-2024 సీజన్ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్ములేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అసలు సమయం వచ్చేసరికి చేతులెత్తేసింది. ఏదైతే తమ బలం అనుకుందో అదే బలహీనతగా మారిన వేళ ప్రత్యర్థి ముందు తలవంచింది.ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌లో పెట్టనికోటగా ఉన్న ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అనూహ్య రీతిలో పూర్తిగా విఫలం కావడంతో 113 పరుగులకే కుప్పకూలింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల దెబ్బకు అభిషేక్ శర్మ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులకే నిష్క్రమించగా.. పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన హెడ్ మరీ ఘోరంగా డకౌట్ అయ్యాడు.వీరితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(13 బంతుల్లో 9) కూడా త్వరగానే పెవిలియన్ చేరగా.. మిగతా వాళ్లలో ఐడెన్ మార్క్రమ్(20), హెన్రిచ్ క్లాసెన్(17 బంతుల్లో 16), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 24) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో ఐపీఎల్ ఫైనల్లోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకుంది సన్‌రైజర్స్. ఈ సీజన్లో ఏకంగా 287 పరుగులతో లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ప్రశంసలు అందుకున్న కమిన్స్ బృందం.. ఫైనల్లో ఇలా తేలిపోయింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ హృదయం ముక్కలైంది.ఇక ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్ సన్‌రైజర్స్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. ఏకపక్ష విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో కేకేఆర్ శిబిరంలో సంతోషాలు వెల్లివిరియగా.. సన్‌రైజర్స్ క్యాంపు నిరాశలో కూరుకుపోయింది. జట్టు యజమాని కావ్యా మారన్ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకోగా.. ఆటగాళ్లు కూడా ఇంచుమించు ఇదే స్థితికి చేరుకున్నారు.ఇక ఈ సీజన్లోనే అత్యధిక సిక్సర్లు(42) బాదిన సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో అభిషేక్ చిన్నారి మేనకోడలు అమైరా చేసిన పని నెటిజన్ల మనసు దోచుకుంది.‘‘ఏం కాదులే మామయ్య’’ అన్నట్లుగా అభిషేక్‌ను హత్తుకున్న అమైరా అతడిని ఓదార్చింది. తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అభిషేక్ రెండో అక్క కోమల్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ తండ్రి రాజ్‌కుమార్ శర్మ కూడా క్రికెటర్. దేశవాళీ క్రికెట్ ఆడిన ఆయన తన కుమారుడికి మొదటి కోచ్. ఇక అభిషేక్ తల్లి పేరు మంజు శర్మ. అభిషేక్‌కు ఇద్దరు అక్కలు సానియా, కోమల్ ఉన్నారు. పెద్దక్క సానియా శర్మ కూతురే ఈ అమైరా!Tough day, Never give up 😔Win or lose part of the game!Chin up guys, you fought hard. ♥️ #KKRvsSRHFinal #IPLFinal #IPL2024 pic.twitter.com/ar96np1klB— Dr. Komal Sharma (@KomalSharma_20) May 26, 2024Such a sweet moment heartwarming hug Amayra encouraging his uncle. 🫂So proud of you bhaiya ❤️🥹#KKRvsSRH #IPL2024 pic.twitter.com/DlE62WtaZu— Dr. Komal Sharma (@KomalSharma_20) May 26, 2024 -
#SRH: లీగ్ మ్యాచ్‌ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్‌లో తుస్సుమన్పించారు
ఐపీఎల్-2024 లీగ్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కీలకమైన ప్లే ఆఫ్స్‌లో చేతులెత్తేశారు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2లో నిరాశపరిచిన ఈ విధ్వంసకర జోడీ.. ఇప్పుడు చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తస్సుమన్పించారు.ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రెండు పరుగులు చేయగా.. ట్రావిస్ హెడ్ అయితే ఏకంగా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కేకేఆర్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. అద్భుతమైన బంతితో అభిషేక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మరోవైపు హెడ్‌ను వైభవ్ ఆరోరా సంచలన బంతితో బోల్తా కొట్టించాడు.హెడ్ విషయానికి వస్తే.. ఆఖరి 4 మ్యాచ్‌ల్లో కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు సార్లు హెడ్ డకౌటయ్యాడు.అదే విధంగా అభిషేక్ కూడా ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నెటిజన్లు వీరిద్దరిని ట్రోలు చేస్తున్నారు. -
SRH: అతనే కదా..! 'అభీ రైజింగ్..'!!
ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కొన్నేళ్ల క్రితం ఒక 17 ఏళ్ల కుర్రాడిని ఎంచుకుంది. అయితే తుది జట్టు సమీకరణాల్లో భాగంగా అతనికి ఆరంభంలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వరుస పరాజయాలతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది. దాంతో చివరి మూడు మ్యాచ్‌లలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ఒక ప్రయత్నం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌తో తొలి అవకాశం దక్కించుకున్న ఆ కుర్రాడు చెలరేగిపోయాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం మరో మ్యాచ్‌లోనూ నాటౌట్ ఉన్న అతను ఇంకో పోరులో ఒక భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుటయ్యాడు.టీమ్ కోచ్ రికీ పాంటింగ్ అతని దగ్గరకు వచ్చాడు. సాధారణంగా ఇలాంటివి ఆడితే కోచ్‌లు అవసరంగా ఆ షాట్ ఆడావని, లేదా తొందరపడ్డావు, కాస్త జాగ్రత్త వహించాల్సిందని చెబుతారు. కానీ పాంటింగ్ మాత్రం ‘ఈ షాట్ మళ్లీ ఆడితే నాకు బంతి అక్కడ ప్రేక్షకుల గ్యాలరీల్లో కనిపించాలి’ అని ప్రోత్సహించాడు. ఆ కుర్రాడి మనసులో ఇది బాగా ముద్రించుకుపోయింది. ఆపై ఎప్పుడు అవకాశం వచ్చినా అతను దానిని మరచిపోలేదు. ఇప్పుడు ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున రికార్డు స్థాయిలో సిక్సర్ల పంట పండిస్తున్న ఆ కుర్రాడే అభిషేక్ శర్మ. ఢిల్లీపై చెలరేగిన మ్యాచ్ అతనికి ఐపీఎల్లో మొదటి మ్యాచ్ మాత్రమే కాదు, ఓవరాల్‌గా కూడా అతని సీనియర్ కెరీర్లో తొలి టి20 కావడం విశేషం. తన వీర దూకుడుతో హైదరాబాద్ అభిమానుల దృష్టిలో అభిషేక్ కొత్త హీరోగా మారిపోయాడు. ఓపెనర్‌గా తన విధ్వంసక ఆటతీరుతో జట్టుకు అద్భుత విజయాలు అందించి అతను రైజర్స్ రాత మార్చాడు.ఐపీఎల్ ఈ సీజన్లో మెరుపు బ్యాటింగ్ చూస్తున్నవారికి అభిషేక్ శర్మ అనూహ్యంగా దూసుకొచ్చిన ఆటగాడిలా కనిపించవచ్చు. కానీ స్కూల్ క్రికెట్ స్థాయి నుంచే అతను అసాధారణ ప్రతిభతో వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ పై స్థాయికి చేరాడు. పంజాబ్‌లోని అమృత్సర్ అతని స్వస్థలం. మాజీ క్రికెటర్ అయిన తండ్రి రాజ్‌కుమార్ శర్మ తొలి కోచ్ అయి ఆటలో ఓనమాలు నేర్పించాడు. ప్రస్తుత భారత జట్టులో కీలక ఆటగాడైన శుభ్‌మన్ గిల్, అభిషేక్ చిన్ననాటి స్నేహితులు. అండర్–12 నుంచి అండర్–19 స్థాయి వరకు, ఆపై దేశవాళీలో సీనియర్ స్థాయిలో కూడా కలసి ఆడారు. అయితే గిల్ లిఫ్ట్ అందుకున్నట్లుగా వేగంగా దూసుకుపోతే, మెట్ల ద్వారా ఒక్కో అడుగు పైకి ఎదిగేందుకు శ్రమిస్తున్న అభిషేక్‌కు గుర్తింపు దక్కడం ఆలస్యమైంది. భారత దేశవాళీ క్రికెట్లో అభిషేక్ తొలిసారి అందరి దృష్టిలో పడింది 2015–16 సీజన్లోనే. ఆ ఏడాది అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో 7 మ్యాచ్‌లలోనే అతను 1200 పరుగులు సాధించడంతో పాటు బౌలింగ్‌లో 57 వికెట్లు పడగొట్టడం విశేషం.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంటూ..అండర్–19 ప్రపంచకప్‌తో..విజయ్ మర్చంట్ ట్రోఫీ తర్వాత అభిషేక్ అడుగు సహజంగానే అండర్–19 స్థాయి వైపు పడింది. 16 ఏళ్ల వయసులోనే అతను భారత అండర్–19 జట్టులోకి ఎంపికయ్యాడు. అంతే కాకుండా కెప్టెన్‌గా కూడా అవకాశం దక్కించుకున్నాడు. 2016లోనే ఆసియా కప్‌లో జట్టును విజేతగా నిలిపి తన సారథ్య ప్రతిభను కూడా ప్రదర్శించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అండర్–19 వరల్డ్ కప్ కూడా వచ్చింది. ఈసారి పృథ్వీ షా కెప్టెన్సీలో జట్టు ఆడింది. అయితే కెప్టెన్సీ లేకపోయినా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అభిషేక్.. మన టీమ్ వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్ విజయానికి సరిగ్గా వారం రోజుల ముందే వేలంలో ఢిల్లీ టీమ్ అతడిని రూ. 55 లక్షలకు తీసుకుంది.ఆల్‌రౌండ్ ప్రతిభతో..‘క్లీన్ స్ట్రయికర్’.. అభిషేక్ ఆట గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అతని గురించి వినిపించే ఏకవాక్య ప్రశంస. బ్యాటింగ్‌లో ఎక్కడా తడబాటు కనిపించకుండా, బంతిని బలంగా బాదిన సమయంలో కూడా చూడముచ్చటగా, కళాత్మకంగా షాట్ ఆడే తీరుపై అందరూ చెప్పే మాట అది. కెరీర్ ఆరంభంలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేసే ఆటగాడిగా ఉన్న అభిషేక్ ఆ తర్వాత తన శ్రమతో, పట్టుదలతో టాప్ ఆర్డర్‌కు చేరాడు. ఓపెనర్‌గా విధ్వంసక బ్యాటింగ్ చేయడమే కాదు, కీలక సమయాల్లో జట్టుకు ఉపయోగపడే స్పిన్నర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. స్పిన్‌లో ఎంతో సాధనతో అతను బ్యాక్ స్పిన్నింగ్ లెగ్కట్టర్ అనే ప్రత్యేక తరహాలో బౌలింగ్ అస్త్రాన్ని తయారుచేసుకున్నాడు. ఇది ఎన్నోసార్లు అతనికి వికెట్‌ని తెచ్చిపెట్టింది.తండ్రి రాజ్‌కుమార్ శర్మ, యువరాజ్ సింగ్‌తో..యువరాజ్ మార్గనిర్దేశనంలో..భారత మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అంటే మొదటి నుంచి అభిషేక్‌కు వీరాభిమానం. తర్వాతి రోజుల్లో అది అభిమానంగా మాత్రమే కాకుండా మరింత పెద్ద స్థాయికి చేరింది. గత కొన్నేళ్లుగా యువీ అతనికి మెంటార్‌గా వ్యవహరిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అధికారికంగా పంజాబ్ క్రికెట్లో ఎలాంటి హోదా లేకపోయినా కేవలం అభిషేక్ కోసం అతను తన సమయాన్ని వెచ్చిస్తూ అతని ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. అభి స్టాన్స్, షార్ట్ బంతులు ఆడటంలో మెలకువలు, మానసికంగా దృఢంగా మార్చడం.. ఇలా అన్నింటిలో యువీ అండగా నిలిచాడు. ఇప్పుడు ఈ కుర్రాడు ఆడే కొన్ని దూకుడైన షాట్లు యువీ ఆటను గుర్తుకు తెస్తాయంటే ఆశ్చర్యం లేదు. గత ఏడాది అభిషేక్ తన అద్భుత ఆటతో పంజాబ్ జట్టుకు తొలిసారి దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఈ టోర్నీలో 2 సెంచరీలు, 3 సెంచరీలు సహా ఏకంగా 180 స్ట్రైక్‌రేట్‌తో అతను 485 పరుగులు చేశాడు. ఇందులో ఆంధ్రపై 51 బంతుల్లోనే 112 పరుగులు చేసిన మ్యాచ్‌లో పంజాబ్ టోర్నీ రికార్డు స్కోరు 275 పరుగులను నమోదు చేసింది.ఐపీఎల్‌తో రైజింగ్..2019లో సన్‌రైజర్స్ టీమ్ శిఖర్ ధావన్‌ను ఢిల్లీకి బదిలీ చేసి అతనికి బదులుగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంది. వారిలో అభిషేక్ శర్మ కూడా ఒకడు. అయితే వరుసగా మూడు సీజన్లలో కూడా అతడిని లోయర్ ఆర్డర్‌లోనే ఆడించడంతో పాటు పరిమిత అవకాశాలే వచ్చాయి. దాంతో అతని అసలు సామర్థ్యం వెలుగులోకి రాలేదు. అయితే మూడో ఏడాది (2021) చివరి రెండు మ్యాచ్‌లలో అతను ఆశించినట్లుగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయించారు. ముంబైతో మ్యాచ్‌లో 16 బంతుల్లో 33 పరుగులు సాధించడంతో అతని దూకుడైన శైలి మేనేజ్మెంట్కు అర్థమైంది. తాము చేసిన పొరపాటును సరిదిద్దుకుంటున్నట్లుగా 2022 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ ఏకంగా రూ.6.5 కోట్లకు అభిషేక్‌ను మళ్లీ తీసుకుంది.అమ్మ, తోబుట్టువుతో..రెండు సీజన్ల పాటు నిలకడగా రాణించిన అతను జట్టుకు విజయాలు అందించాడు. అయితే అభిషేక్ విశ్వరూపం ఈ ఏడాదే కనిపించింది. అటు పేస్, ఇటు స్పిన్ బౌలింగ్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన అతను 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్‌తో కలసి అతను అందించిన ఆరంభాలు రైజర్స్‌కు ఘన విజయాలను ఇచ్చాయి. టోర్నీలో అతను కొట్టిన ఫోర్లకంటే సిక్సర్లే ఎక్కువగా ఉండటం అతని విధ్వంసం ఎలాంటిదో చూపిస్తుంది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో టీమ్ అత్యధిక స్కోరు (277) సాధించడంలో అతనిదే కీలక పాత్ర. ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది హైదరాబాద్ టీమ్ తరఫున లీగ్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు.ఇక లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనైతే 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఇన్నింగ్స్‌ను ఐపీఎల్ అభిమానులెవరూ మరచిపోలేరు. సరిగ్గా చెప్పాలంటే గత కొన్నేళ్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించక ముందే ఐపీఎల్లో ఆడి (అన్క్యాప్డ్ ప్లేయర్) సత్తా చాటిన ఆటగాళ్లలో అభిషేక్ అగ్రస్థానంలో ఉంటాడంటే అతిశయోక్తి కాదు. అతని తాజా ప్రదర్శనతో వచ్చే టి20 వరల్డ్ కప్‌లో అభిషేక్‌కు చోటు ఇవ్వాల్సిందనే చర్చ జరిగింది. అయితే స్వయంగా మెంటార్ యువరాజ్ కూడా దానికి ఇంకా సమయం ఉందని, 23 ఏళ్ల అభిషేక్ రాబోయే ఇంకా మరిన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధమై భారత జట్టులో అరంగేట్రం చేయగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో సీనియర్ల స్థానంలో కుర్రాళ్లు చోటు దక్కించునే అవకాశాలు ఉండటంతో ఆ జాబితాలో అభిషేక్ పేరు తప్పక ఉండవచ్చనేది మాత్రం వాస్తవం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ
‘‘కీలకమైన మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో మా వాళ్లు బౌలింగ్ చేసిన విధానం పట్ల గర్వంగా ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో వారి స్పిన్ వ్యూహాలను ఎదుర్కోవడంలో మేము తడబడ్డాం.అక్కడే మ్యాచ్ మా చేజారింది. ఈ పిచ్‌పై తేమ ఉంటుందా? లేదా అన్నది ముందే ఊహించడం కష్టం. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి వికెట్ పూర్తి భిన్నంగా మారిపోయింది.బంతి కాస్త టర్న్ కావడం మొదలైంది. ఆ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. మిడిల్ ఓవర్లలో మా కుడిచేతి వాటం బ్యాటర్ల కోసం లెఫ్టార్మ్ స్పిన్నర్లను దింపి ఫలితం రాబట్టారు.అక్కడే వాళ్లు మాపై పైచేయి సాధించారు. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్లకు ఎక్కువగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు’’ అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.ఐపీఎల్-2024 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. అయితే, జట్టు ప్రదర్శన పట్ల మాత్రం తనతో పాటు ఫ్రాంఛైజీ కూడా సంతృప్తిగానే ఉందని సంజూ ఈ సందర్భంగా తెలిపాడు.బుమ్రా తర్వాత అతడేఈ మేరకు.. ‘‘మేము ఈ ఒక్క సీజన్లోనే కాదు.. గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాం. మా ఫ్రాంఛైజీ మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా భారత్‌లోని యంగ్ టాలెంట్‌ను మేము వెలికితీయగలుగుతున్నాం.రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అందుకు ఉదాహరణ. వీళ్లిద్దరు కేవలం రాజస్తాన్‌కే కాదు టీమిండియా తరఫున కూడా రాణిస్తే చూడాలని కోరుకుంటున్నా.ఇక సందీప్ శర్మ.. అతడి బౌలింగ్ తీరు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. వేలంలో తను మా జట్టులోకి రాకపోయినా వేరొకరి స్థానంలో మాతో చేరాడు. అద్భుత ఆట తీరుతో అందరినీ మెప్పించాడు.గత రెండేళ్లుగా అతడి ప్రదర్శన బాగుంది. బుమ్రా తర్వాత అతడే బెస్ట్!’’ అంటూ రాజస్తాన్ యువ ఆటగాళ్లపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించాడు. కాగా చెన్నై వేదికగా శుక్రవారం నాటి కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.విఫలమైన సంజూ శాంసన్ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఫైనల్లో అడుగుపెట్టగా.. రాజస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ పూర్తిగా విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేశాడు. యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 42), ధ్రువ్ జురెల్(56 నాటౌట్) మాత్రమే రాణించారు.తిప్పేసిన స్పిన్నర్లుఅంతకు ముందు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో రాజస్తాన్ పేసర్ సందీప్ శర్మ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్బుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్రైజర్స్చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు! Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ప్రయాణం ముగిసిపోయింది. క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైన సంజూ శాంసన్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఈసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాలన్న కల కలగానే మిగిలిపోయింది.ఇదిలా ఉంటే.. ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ ఆటగాడు షిమ్రన్ హెట్మెయిర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి జరిమానా విధించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?!..వాళ్లిద్దరు మినహా అంతా విఫలంచెన్నైలోని చెపాక్ వేదికగా సన్‌రైజర్స్‌తో తలపడ్డ రాజస్తాన్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(42), ఐదో నంబర్ బ్యాటర్(56- నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు.Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 ఆశలన్నీ వమ్ముచేసి.. వికెట్ పారేసుకునిసన్రైజర్స్ బౌలర్ల ట్రాప్‌లో చిక్కుకుని పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక పవర్ఫుల్ హిట్టర్‌గా పేరొందిన షిమ్రన్ హెట్మెయిర్ 10 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు.పద్నాలుగవ ఓవర్లో రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌లో ఊహించని రీతిలో బౌల్డ్ అయి వికెట్ పారేసుకున్నాడు. జట్టు తనపై పెట్టుకున్న ఆశలు వమ్ము చేశాడు. ఈ క్రమంలో.. అప్పటికే పరాజయం దిశగా జట్టు పయనించడం.. పార్ట్‌టైమ్ బౌలర్ చేతిలో తనకు భంగపాటు ఎదురుకావడంతో హెట్మెయిర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు.పనిష్మెంట్ ఇచ్చిన బీసీసీఐక్రీజును వీడే సమయంలో బ్యాట్‌తో వికెట్లను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతడికి జరిమానా విధించడం గమనార్హం. ‘‘షిమ్రన్ హెట్మెయిర్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ తేల్చారు. అతడు కూడా తన తప్పును అంగీకరించాడు’’ అని ప్రకటన విడుదల చేసింది. హెట్మెయిర్ మ్యాచ్ ఫీజులో 10 శాతం మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు: కమిన్స్Kavya Maran: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
RR Vs SRH Pics: ఆర్ఆర్ను చిత్తు చేసి.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఫొటోలు)
-
SRH vs RR: అతడి మీదే భారం.. సన్‌రైజర్స్ గెలవాలంటే..
ఐపీఎల్-2024 ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ జరుగనుంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తే తప్ప ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ముందంజ వేయలేదని అభిప్రాయపడ్డాడు.సన్‌రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లేఈ మేరకు.. ‘‘సన్‌రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లే. వీరిద్దరూ గనుక బ్యాట్ ఝులిపిస్తే ఆపటం ఎవరితరం కాదు. క్రీజులో ఒక్కసారి పాతుకుపోతే తొలి 8- 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చేస్తారు.ముఖ్యంగా ట్రావిస్ హెడ్ దంచికొడితే తిరుగే ఉండదు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో వరుసగా అతడు డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ తిరిగి పుంజుకోగలడనే ఆశిద్దాం.ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకుఈ సీజన్లో ట్రావిస్ హెడ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. గత మ్యాచ్‌లో అవుట్ చేసినప్పటికీ ట్రెంట్ బౌల్ట్ అతడిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రియాన్ పరాగ్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన హెడ్ బాగా ఆడాడు.అర్ధ శతకం కూడా సాధించాడు. అయితే, ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకు మరింత గట్టిగానే ప్రయత్నం చేయడం ఖాయం. ట్రావిస్ హెడ్ గనుక ఈసారి పరుగులు రాబట్టకపోతే సన్‌రైజర్స్ ముందుకు సాగలేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ట్రావిస్ హెడ్‌తో పాటు అభిషేక్ శర్మ కూడా రాణిస్తే మాత్రం రాజస్తాన్ బౌలర్లు వాళ్లను ఆపలేరని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో దుమ్ములేపుతున్న అభిషేక్ శర్మ త్వరలోనే టీమిండియాకు ఆడటం ఖాయమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా జోస్యం చెప్పాడు.వరుసగా రెండుసార్లు డకౌట్‌కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ప్రధాన బలం అన్న విషయం తెలిసిందే. అయితే, గత రెండు మ్యాచ్‌లలో హెడ్ లెఫ్టార్మ్ సీమర్ల చేతికి చిక్కి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ క్రమంలో క్వాలిఫయర్-2లో రాజస్తాన్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి అతడికి గండం పొంచి ఉంది. కాగా ఈ సీజన్లో హెడ్ ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్ ఆడి 199.62 స్ట్రైక్‌రేటుతో 533 పరుగులు సాధించాడు.చదవండి: T20: బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం -
కావ్యా మారన్‌తో ఫొటోలకు ఫోజులు.. ఈ బ్యూటీ గురించి తెలుసా? (ఫొటోలు)
-
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్‌దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
-
IPL 2024: చెల్లెలు కాదు.. అక్క! ఈమెను గుర్తుపట్టారా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ దుమ్ములేపుతున్నాడు.ఇప్పటి వరకు ఈ సీజన్లో అభిషేక్ శర్మ ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 467 పరుగులు సాధించాడు. పలు మ్యాచ్‌లలో తన అద్భుత ఇన్నింగ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అవార్డులు కూడా అందుకున్నాడు.ఇక 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సాధిస్తున్న విజయాల పట్ల అతడి తల్లిదండ్రులు రాజ్‌కుమార్ శర్మ, మంజు శర్మ ఎంతగానో మురిసిపోతున్నారు. కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో అభిషేక్ తల్లి మంజు, సోదరి కోమల్ అతడి వెంటే ప్రయాణాలు చేస్తున్నారు.ఈ క్రమంలో కోమల్ తన సోదరుడు అభిషేక్‌తో కలిసి స్టేడియంలో సందడి చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని, రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.చెల్లెలు కాదు.. అక్క! ఈ నేపథ్యంలో కోమల్ శర్మ గురించిన వివరాల కోసం అభిమానులు వెదుకుతున్నారు. కోమల్ శర్మ అభిషేక్ శర్మ చెల్లెలు అని పొరబడుతున్నారు. నిజానికి ఆమె అభిషేక్ కంటే ఏడేళ్లు పెద్దవారట. మార్చి 20, 1994లో కోమల్ శర్మ జన్మించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల గురునానక్ దేవ్ యూనివర్సిటీ నుంచి ఫిజియోథెరపీలో ఆమె బ్యాచిలర్ డిగ్రీ చేశారు. జైపూర్‌లోని నిమ్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఆమె ఒక డాక్టర్!ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా కొనసాగుతున్న డాక్టర్ కోమల్ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటొలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండున్నర లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా అభిషేక్‌కు కోమల్‌తో పాటు మరో సోదరి సానియా శర్మ కూడా ఉన్నారు.ఇక సన్‌రైజర్స్ క్వాలిఫయర్-1కు అర్హత సాధించిన నేపథ్యంలో తన తమ్ముడు అభిషేక్ శర్మతో కలిసి కోమల్ అహ్మదాబాద్‌కు వెళ్లారు. కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్‌తో తొలి ఫైనలిస్టు ఎవరో తేలనుంది. -
వరల్డ్ కప్ నే కాళ్ళ కింద పెట్టుకున్న కెప్టెనే ఇలా అంటే..
-
చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..
-
SRH Vs PBKS: చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.215 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్ బౌలర్లకు అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 209.42 స్ట్రైక్ రేటుతో 467 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ప్రస్తుత సీజన్లో అభిషేక్ 41 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2016 సీజన్లో కోహ్లి 38 సిక్స్‌లు బాదాడు. తాజా సీజన్‌తో విరాట్ ఆల్‌టైమ్ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. -
అభిషేక్ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్ .. ఫొటోలు వైరల్
-
నేను అతడికి బిగ్ ఫ్యాన్.. అది నా అదృష్టంగా భావిస్తున్నా: అభిషేక్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి ఊచకోత ఫలితంగా సన్‌రైజర్స్ ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ కేవలం 9.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 205 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 401 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సపోర్ట్ కారణంగానే ఈ తరహా ప్రదర్శన చేయగల్గుతున్నానని అభిషేక్ తెలిపాడు. "మా కోచింగ్ స్టాప్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఆటగాళ్లందరకి చాలా సపోర్ట్‌గా ఉంటారు. ఎటువంటి కెప్టెన్‌ను, సపోర్ట్ స్టాప్‌ను ఇప్పటివరకు చూడలేదు. స్వేచ్చగా ఆడి మమ్మల్ని మేము వ్యక్తిపరిచేందుకు ఫుల్ సపోర్ట్ వారి నుంచి మాకు ఉంటుంది. ఇటువంటి వాతావరణం మా జట్టులో ఉండడం చాలా సంతోషం. ఈ తరహా బ్యాటింగ్‌ను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా చేశాను. భారీ షాట్లు ఆడి బౌలర్‌ను ఒత్తడిలోకి నెట్టేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. ఇక ట్రావిస్ హెడ్‌కు నేను వీరాభిమానిని. అతడితో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ట్రావిస్ స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడు. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో అతడి ఆడిన షాట్లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే" అని జియోసినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ పేర్కొన్నాడు. -
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసం సృష్టించారు. బుధవారం ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరి తుపాన్ ఇన్నింగ్స్‌ల ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా కేవలం 9.4 ఓవర్లలో చేధించింది. అభిషేక్ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆజేయంగా నిలిచి సన్‌రైజర్స్‌కు రికార్డు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో వీరిద్దరి బ్యాటింగ్‌కు సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం సైతం ఫిదా అయిపోయాడు. ఎక్స్ వేదికగా ఈ ఓపెనింగ్ జోడీపై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఉప్పల్‌లో ఈ రోజు విధ్వంసకర ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని చూశాం. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే.. తప్పకుండా ‘300’ స్కోరు చూసేవాళ్లమే’’ అని సచిన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. ఈ విధ్వంసకర జోడీను ప్రశంసిస్తూ భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్‌లో హెడ్, అభిషేక్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఎంత చెప్పుకున్న తక్కువే. అదే జోరులో 300 పరుగులైనా ఛేజ్ చేసేవాళ్లు అని ఎక్స్‌లో మిథాలీ రాసుకొచ్చింది. -
పిచ్ స్వరూపం మారిందా లేక మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్ విధ్వంసం మాటల్లో వర్ణించలేనట్లుగా ఉంది. వీరిద్దరి ఊచకోత ధాటికి పొట్టి క్రికెట్ రికార్డులు బద్దలవుతున్నాయి. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వీరి విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. వీరిద్దరు లక్నో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యం 9.4 ఓవర్లలోనే తునాతునకలైంది. అభిషేక్ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊహకందని విధ్వంసం సృష్టించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.పిచ్ స్వరూపం మారిందా.. ఆ ఇద్దరూ మార్చేశారా..?నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్, హెడ్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందన్నదానికి ఓ విషయం అద్దం పడుతుంది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉప్పల్ మైదానంలోని పిచ్ ఆనవాయితీగా తొలుత బ్యాటింగ్ చేసే జట్లకు సహకరిస్తుంది. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు, ముఖ్యంగా భువీ చెలరేగడంతో లక్నో ఇన్నింగ్స్ నత్తనడకలా సాగింది. ఆఖర్లో పూరన్, బదోని మెరుపులు మెరిపించడంతో లక్నో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. లక్నో తొలుత బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) 2 వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. అదే సన్‌రైజర్స్ తొలి ఆరు ఓవర్లలో మాటల్లో వర్ణించలేని విధ్వంసాన్ని సృష్టించి ఏకంగా 107 పరుగులు పిండుకుంది. సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం చూశాక అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్ స్వరూపం మారిందా లేక ఆ ఇద్దరూ మార్చేశారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకే మ్యాచ్‌లో పవర్ ప్లేల్లో మరీ ఇంత వ్యత్యాసమా అని ముక్కునవేల్లేసుకుంటున్నారు. ఇరు జట్ల పవర్ ప్లే స్కోర్లలో 80 పరుగుల వ్యత్యాసం ఉంది. మొత్తానికి నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్ పవర్ ప్లేల్లో రెండో అత్యధిక స్కోర్ (107/0)ఐపీఎల్లో సన్‌రైజర్స్ మాత్రమే రెండు సందర్భాల్లో (ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో (125/0) పవర్ ప్లేల్లో 100 పరుగుల మార్కును దాటింది.ఓ మ్యాచ్ పవర్ ప్లేల్లో అత్యధిక వ్యత్యాసం (80 పరుగులు- లక్నో 27/2, సన్‌రైజర్స్ 107/0)లక్నోకు పవర్ ప్లేల్లో ఇదే అత్యల్ప స్కోర్ (27/2)ఈ సీజన్ బ్యాటింగ్ పవర్ ప్లేల్లో ట్రవిస్ హెడ్‌కు ఇది నాలుగో అర్ద సెంచరీ. ఓ సీజన్ పవర్ ప్లేల్లో ఇవే అత్యధికం.ఒకే సీజన్లో 20 బంతుల్లోపే మూడు హాఫ్ సెంచరీలు సాధించిన హెడ్. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్, హెడ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం (అభిషేక్, హెడ్ (34 బంతుల్లో). ఇదే జోడీ పేరిటే వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం రికార్డు కూడా నమోదై ఉంది. ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు 30 బంతుల్లోనే 100 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశారు.ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ (సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో 167/0)100కు పైగా లక్ష్య ఛేదనలో అత్యధిక మార్జిన్‌తో విజయం (166 పరుగుల లక్ష్యాన్ని మరో 62 బంతులు మిగిలుండగానే ఛేదించిన సన్‌రైజర్స్)మూడో వేగవంతమైన 100 పరుగులు (జట్టు స్కోర్)-5.4 ఓవర్లలో 100 పరుగులు టచ్ చేసిన సన్రైజర్స్ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సన్‌రైజర్స్. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే 146 సిక్సర్లు బాదింది. 2018 సీజన్లో సీఎస్కే 145 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది. -
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా..
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. సొంత మైదానం ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి లక్నోపై విజయం నమోదు చేసింది. అదే విధంగా ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌లలో ఏడో గెలుపు నమోదు చేసింది.విధ్వంసకర బ్యాటింగ్తద్వారా 14 పాయింట్లతో పట్టికలో మూడోస్థానానికి ఎగబాకి.. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చింది. కాగా లక్నోతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సరికొత్త ప్రపంచ రికార్డు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ వల్లే ఇది సాధ్యమైంది.ఉప్పల్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది రాహుల్ సేన.సునామీ ఇన్నింగ్స్అయితే, లక్ష్య ఛేదనకు దిగిన తర్వాత లక్నోకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు రైజర్స్ ఓపెనర్లు. ట్రావిస్ హెడ్ ఆది నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ లక్నో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అతడి ప్రోద్బలంతో అభిషేక్ శర్మ కూడా హిట్టింగ్తో మెరిశాడు.హెడ్ 30 బంతుల్లోనే 89 పరుగులతో దుమ్ములేపగా.. అభిషేక్ 28 బంతుల్లో 75 పరుగులతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 8.2 ఓవర్లలోనే 150 పరుగుల మార్కు అందుకుంది.ప్రపంచంలోనే తొలి జట్టు👉టీ20 చరిత్రలో అత్యంత తక్కువ ఓవర్లలో ఇలా 150 స్కోరు చేసిన తొలి జట్టు సన్‌రైజర్స్ కావడం విశేషం. ఇక హెడ్, అభి విధ్వంసం కారణంగా సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలోనే లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా మరో వరల్డ్ రికార్డు కూడా సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో 150కి పైగా లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా నిలిచింది. లక్నోతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సాధించిన ప్రపంచ రికార్డులు క్లుప్తంగా..టీ20 హిస్టరీలో ఫాస్టెస్ట్ 150+ ఛేజింగ్1. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మీద- 9.4 ఓవర్లలోఏ 166 పరుగుల లక్ష్య ఛేదన.2. బ్రిస్బేన్ హీట్- మెల్బోర్న్ స్టార్స్ మీద- 10 ఓవర్లలో 157 పరుగుల లక్ష్య ఛేదన.3. గయానా అమెజాన్ వారియర్స్- జమైకా తలావాస్- 10.3 ఓవర్లలో 150 పరుగుల లక్ష్య ఛేదన.ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలోపే మూడుసార్లు అత్యధిక పరుగులు సాధించిన ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్👉లక్నో సూపర్ జెయింట్స్ మీద- 167/0 (9.4)- 2024లో👉ఢిల్లీ క్యాపిటల్స్ మీద- 157/4- 2024లో👉ముంబై ఇండియన్స్ మీద- 148/2- 2024లో.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
#Abhishek Sharma: లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. గత కొన్ని రోజులుగా భారీ స్కోర్లు నమోదు చేయలేక చతికిల పడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఉప్పల్‌లో మాత్రం శివాలెత్తిపోయాడు.మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 28 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు అభిషేక్ శర్మ.హెడ్‌తో కలిసి అజేయంగా నిలిచి 9.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ టార్గెట్ పూర్తి చేసి ఉప్పల్ స్టేడియాన్నిహోరెత్తించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.That's Sunrisers Hyderabad for you 💥#IPLonJioCinema #SRHvLSG #TATAIPL pic.twitter.com/xFiuuafuXa— JioCinema (@JioCinema) May 8, 2024యువీ పాజీకి థాంక్స్ఇక మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆరంభానికి ముందు నేను చేసిన హార్డ్‌వర్క్ ఫలితాన్నిస్తోంది. యువీ పాజీ(యువరాజ్ సింగ్), బ్రియన్ లారా, నా తండ్రికి ధన్యవాదాలు. మా నాన్నే నా మొదటి కోచ్’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు 23 ఏళ్ల అభిషేక్.కాస్త ఓపికగా పట్టుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘అద్భుతంగా ఆడావు అభిషేక్ శర్మ. ఇలాగే నిలకడగా ఆడు. కాస్త ఓపికగా ఉండు! త్వరలోనే నీకూ టైమ్ వస్తుంది’’ అంటూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలని ఆకాంక్షించాడు.అదే విధంగా ట్రావిస్ హెడ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు ఏ గ్రహం నుంచి వచ్చావు ఫ్రెండ్? అస్సలు నమ్మలేకున్నాం’’ అని యువీ అతడిని ఆకాశానికెత్తాడు. కాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పంజాబ్ యువ సంచలనం అభిషేక్ శర్మకు మెంటార్!!సూపర్ అభికాగా ఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 32(19), 63(23), 29(20), 37(12), 16(11), 34(22), 46(12), 31(13), 15(9), 12(10), 11(16), 75*(28). మొత్తం 195 బంతుల్లో 35 సిక్సర్ల సాయంతో 401 పరుగులు.సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్లు👉వేదిక: ఉప్పల్ స్టేడియం.. హైదరాబాద్👉టాస్: లక్నో.. బ్యాటింగ్👉లక్నో స్కోరు: 165/4 (20)👉సన్‌రైజర్స్ స్కోరు: 167/0 (9.4)👉ఫలితం: 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసిన సన్‌రైజర్స్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 89 రన్స్- నాటౌట్). -
SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
IPL 2024 SRH vs LSG: ఉప్పల్ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారింది. మ్యాచ్‌కు వాన గండం పొంచి ఉందంటూ అభిమానులు ఆందోళన పడిన వేళ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి అసలైన టీ20 మజాను అందించారు సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.తమ బ్యాటింగ్ విధ్వంసంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కళ్లు తేలేసేలా చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. రాహుల్ సేన పరుగులు చేసేందుకు తడబడిన పిచ్‌పై.. 166 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.కనీవినీ ఎరుగని రీతిలో 62 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ విజయాన్ని పుట్టినరోజు కానుకగా అందించారు. న భూతో న భవిష్యతి అన్న చందంగా ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోశారు అభిషేక్, హెడ్.వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘బహుశా ట్రావిస్, అభిషేక్ కలిసి పిచ్‌ను మార్చేసి ఉంటారు(నవ్వుతూ). వాళ్లు ఏం చేయగలరో మాకు తెలుసు. అందుకే వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.నిజానికి నేనొక బౌలర్‌ను. కాబట్టి ఆ బ్యాటర్లకు పెద్దగా ఇన్పుట్స్ ఇవ్వలేను. ట్రావిస్ హెడ్ విషయానికొస్తే.. అతడు గత రెండేళ్లుగా ఇలాగే ఆడుతున్నాడు.అతడొక అద్భుతంకఠినమైన పిచ్‌లపై కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ.. అతడొక అద్భుతమైన ఆటగాడు. స్పిన్, పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు.పవర్ ప్లేలో వీళ్లిద్దరిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. ఈ సీజన్లో మా వాళ్లు సూపర్‌గా ఆడుతున్నారు. అయితే, పది కంటే తక్కువ ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడం నమ్మలేకపోతున్నాం’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు.10 వికెట్ల తేడాతో గెలుపుకాగా లక్నోతో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ చేసింది. భువనేశ్వర్ కుమార్(2/12)కు తోడు ఫీల్డర్లు అద్భుతంగా రాణించడంతో లక్నోను 165/4 స్కోరుకు కట్టడి చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్.. ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH Vs LSG Photos: సన్‌రైజర్స్ విధ్వంసం..లక్నోపై 10 వికెట్లతో ఘనవిజయం (ఫొటోలు)
-
IPL 2024 SRH Vs LSG: సన్‌రైజర్స్ విధ్వంసం
250 పరుగుల లక్ష్యమైనా సన్‌రైజర్స్ ఛేదించేదేమో? ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రాహుల్ వ్యాఖ్య... ప్రత్యర్థి బ్యాటర్ల వీర బాదుడుకు మైదానంలో మొదటి బాధితుడిగా అతను చెప్పిన మాట అక్షరసత్యం. తొలుత బ్యాటింగ్ చేస్తూ సీజన్లో రికార్డు స్కోర్లు సాధించిన హైదరాబాద్ ఇప్పుడు ఛేదనలోనూ వి«ధ్వంసం సృష్టించింది. వీడియోగేమ్ తరహాలో ట్రవిస్ హెడ్, అభిõÙక్ శర్మ విరుచుకుపడుతుంటే స్టేడియంలో పరుగుల ఉప్పెన వచ్చింది. 16 ఫోర్లు, 14 సిక్స్‌లంటే 148 పరుగులు బౌండరీలతోనే... లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు. కానీ 10 ఓవర్లకు ముందే కేవలం 52 నిమిషాల్లో రైజర్స్ ఛేదించిపడేసింది. రైజర్స్ ఛేజింగ్ రాత్రి 9 గంటల 23 నిమిషాలకు మొదలై 10 గంటల 15 నిమిషాలకు ముగిసింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. లక్నో పరాజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బ్యాటింగ్ పవర్‌ను మరోసారి చూపించింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుశ్ బదోని (30 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగి కేవలం 58 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించారు. లక్నో ఓటమితో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ముంబై తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గినా 12 పాయింట్లతో టాప్–4లో స్థానాన్ని దక్కించుకునే అవకాశం లేదు. రాహుల్ విఫలం... భువనేశ్వర్ చక్కటి బౌలింగ్ వల్ల లక్నో ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. భువీ తన వరుస ఓవర్లలో డికాక్ (2), స్టొయినిస్ (3)లను పెవిలియన్ పంపించాడు. ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, సన్వీర్ సింగ్ అద్భుత క్యాచ్‌లు కారణంగా నిలిచాయి. పవర్‌ప్లే ముగిసేసరికి లక్నో 27 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో రాహుల్, కృనాల్ ఆదుకునే ప్రయత్నం చేసినా వీరిద్దరూ నెమ్మదిగా ఆడటంతో పరుగులు రావడం మందగించింది. పదో ఓవర్ చివరి బంతికి రాహుల్ అవుట్ కాగా... లక్నో స్కోరు 57 పరుగులకు చేరింది. అవుటయ్యే వరకు కూడా ఏ దశలోనూ రాహుల్ స్ట్రయిక్‌రేట్ కనీసం 100 కూడా లేకపోవడం జట్టు అవకాశాలను దెబ్బ తీసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కృనాల్ రనౌట్ కావడంతో స్కోరు 66/4గా మారింది. ఇలాంటి స్థితిలో పూరన్, బదోని బ్యాటింగ్ లక్నో కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించింది. చివరి 5 ఓవర్లలో 63 పరుగులు రాగా... వీరిద్దరు 52 బంతుల్లోనే అభేద్యంగా 99 పరుగులు జోడించారు. మెరుపు వేగంతో... 8, 17, 22, 17, 23, 20, 19, 17, 14, 10... ఛేదనలో సన్‌రైజర్స్ ఒక్కో ఓవర్లో చేసిన పరుగులు ఇవి. తొలి ఓవర్ మినహాయిస్తే ఎక్కడా తగ్గకుండా హెడ్, అభిషేక్ చెలరేగిపోయారు. యశ్ ఓవర్లో అభిషేక్ 4 ఫోర్లు కొట్టగా, గౌతమ్ ఓవర్లో హెడ్ 3 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. నవీనుల్ ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 4 బాదిన హెడ్... ఈ క్రమంలో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యశ్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన అభిషేక్ హాఫ్ సెంచరీ 19 బంతులకు పూర్తయింది. పవర్‌ప్లేలో 107 పరుగులు చేసిన రైజర్స్ ఆట ముగించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. యశ్ వేసిన పదో ఓవర్ నాలుగో బంతిని అభిõÙక్ సిక్స్‌గా మలచడంతో ఉప్పల్ స్టేడియంలో సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) నటరాజన్ (బి) కమిన్స్ 29; డికాక్ (సి) నితీశ్ (బి) భువనేశ్వర్ 2; స్టొయినిస్ (సి) సన్వీర్ (బి) భువనేశ్వర్ 3; కృనాల్ పాండ్యా (రనౌట్) 24; పూరన్ (నాటౌట్) 48; బదోని (నాటౌట్) 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–13, 2–21, 3–57, 4–66. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–12–2, కమిన్స్ 4–0–47–1, షహబాజ్ 2–0–9–0, విజయకాంత్ 4–0–27–0, ఉనాద్కట్ 2–0–19–0, నటరాజన్ 4–0–50–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (నాటౌట్) 75; హెడ్ (నాటౌట్) 89; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 167. బౌలింగ్: గౌతమ్ 2–0–29–0, యశ్ ఠాకూర్ 2.4–0–47–0, బిష్ణోయ్ 2–0–34–0, నవీనుల్ హక్ 2–0–37–0, బదోని 1–0–19–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X బెంగళూరు వేదిక: ధర్మశాలరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024: నీకు ‘బడిత పూజ’ తప్పదు.. యువీ ‘ఫైర్’!
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి ‘కోపం’ ప్రదర్శించాడు. గతంలో అభిషేక్‌కు చెప్పు చూపి బెదిరించిన యువీ.. ఈసారి నీకు బడిత పూజ తప్పదన్నట్లుగా ఓ మీమ్ షేర్ చేశాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 166 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు ఈ లెఫ్టాండ్ ఓపెనర్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. సీఎస్కే బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ కేవలం 12 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లతో పాటు ఏకంగా నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్ రేటు ఏకంగా 308.33. అయితే, అతడి అభిషేక్ బ్యాటింగ్ మెరుపులు ఇంకాసేపు చూడాలని భావించిన అభిమానుల ఆశలపై దీపక్ చహర్- రవీంద్ర జడేజా నీళ్లు చల్లారు. I’m right behind you boy …well played again - but bad shot to get out on 🤨@IamAbhiSharma4 #CSKvsSRH pic.twitter.com/IF8qLZ5S9Z — Yuvraj Singh (@YUVSTRONG12) April 5, 2024 రైజర్స్ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లో చహర్ వేసిన నాలుగో బంతి అవుట్ ఆఫ్ దిశగా వైడ్ వెళ్తుండగా.. అభిషేక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా బంతిని కొట్టగా.. ఫీల్డర్ జడ్డూ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా అభిషేక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 ఏదేమైనా ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించిన అభిషేక్ శర్మను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ క్రమంలో అతడిపై ప్రశంసలు కురిపిస్తూనే చిరుకోపం ప్రదర్శించాడు యువీ. ‘‘నేను ఎల్లప్పుడూ నీకు మద్దతుగానే ఉంటాను బాబూ.. మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడావు. అయితే, ఈసారి కూడా చెత్త షాట్ సెలక్షన్‌కు అవుటయ్యావు’’ అంటూ ఓ వ్యక్తి కర్ర లాంటి వస్తువుతో మరో వ్యక్తిని తరుముతున్నట్లుగా ఉన్న హిలేరియస్ మీమ్ ఒకటి షేర్ చేశాడు. యువీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ యువీకి వీరాభిమాని. ఇక అభిషేక్‌కు యువరాజ్ మెంటార్‌గా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ.. ‘‘యువీ పాజీ.. ధన్యవాదాలు’’ అంటూ కృతజ్ఞత చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. ఐపీఎల్-2024 ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే ►టాస్- ఎస్ఆర్హెచ్- బౌలింగ్ ►సీఎస్కే స్కోరు: 165/5 (20) ►ఎస్ఆర్హెచ్: 166/4 (18.1). ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై సన్‌రైజర్స్ విజయం. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
CSK: ఆ రెండు తప్పుల వల్లే ఓడిపోయాం: రుతురాజ్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెరుగైన ఆరంభం అందుకున్నా .. దానిని నిలబెట్టుకోలేకపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఉప్పల్ పిచ్‌పై 170- 175 పరుగులు చేసి ఉంటే ఫలితం కాస్త వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా సన్‌రైజర్స్ ఆటగాళ్లు తెలివిగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024లో సీఎస్కే తమ నాలుగో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో రచిన్ రవీంద్ర(12) మరోసారి తేలిపోగా.. రుతురాజ్ గైక్వాడ్(26) కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. ఇక ఉప్పల్ పిచ్ స్లోగా ఉండటంతో రన్స్ తీయడానికి ఇబ్బంది పడ్డ రహానే 30 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేయగా.. శివం దూబే మాత్రం మెరుపులు(24 బంతుల్లో 45) మెరిపించాడు. స్పిన్నర్లను అటాక్ చేస్తూ పరుగులు రాబట్టాడు. 𝘿𝙪𝙗𝙚 𝘿𝙚𝙢𝙤𝙡𝙞𝙩𝙞𝙤𝙣 💥#SRHvCSK #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/j2pCdp0VAF — JioCinema (@JioCinema) April 5, 2024 దీంతో స్పిన్నర్లను పక్కనపెట్టి పేసర్లను దించిన రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ తన బౌలింగ్‌లో దూబేను అవుట్ చేశాడు. అనంతరం జడ్డూ(31- నాటౌట్), డారిల్ మిచెల్(13) కాసేపు బ్యాట్ ఝులిపించినా.. ఆఖరి ఐదు ఓవర్లలో సీఎస్కేకు కేవలం 38 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయఢంకా మోగించింది. ఆరంభంలో ట్రవిస్ హెడ్ క్యాచ్‌ను మొయిన్ అలీ మిస్ చేయగా అతడికి లైఫ్ లభించింది. ఇక పవర్ ప్లేలో విధ్వంసరచన చేసిన అభిషేక్ శర్మ (12 బంతుల్లోనే 37 రన్స్)రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 ఆ రెండు తప్పులే కొంపముంచాయి ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ‘‘ఈ పిచ్ చాలా స్లోగా ఉంది. వాళ్ల బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుని మమ్మల్ని దెబ్బకొట్టారు. ఆరంభంలో మేము బాగానే ఆడాం. అయితే, తర్వాత వాళ్లు పైచేయి సాధించారు. ఇది నల్లరేగడి పిచ్.. నెమ్మదిగా ఉంటుందని ముందే అంచనా వేశాం. కానీ.. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ మరింత స్లో అయిపోయింది. పవర్ ప్లేలో మేము ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం, ఓ క్యాచ్ మిస్ చేయడం తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ ప్రత్యర్థిని 19వ ఓవర్ వరకు తీసుకువచ్చాం’’ అని పేర్కొన్నాడు. ఆఖరి వరకు లక్ష్యాన్ని కాపాడుకునేందుకు తాము పోరాడమని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా పవర్ ప్లేలో రైజర్స్‌ను కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని రుతురాజ్ గైక్వాడ్ అంగీకరించాడు. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH: వావ్.. గెలిచాం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి?
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరిగి గెలుపుబాట పట్టింది. సొంత మైదానంలో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి సత్తా చాటింది. కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన కమిన్స్ బృందం.. తర్వాత సొంతగడ్డపై రికార్డు విజయం అందుకుంది. ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. అయితే, ఆ తర్వాత అహ్మదాబాద్ వెళ్లిన సన్‌రైజర్స్‌కు మళ్లీ భంగపాటు తప్పలేదు. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో నాలుగో మ్యాచ్ కోసం మళ్లీ ఉప్పల్‌కు విచ్చేసిన సన్‌రైజర్స్ హోం గ్రౌండ్లో తమకు తిరుగు లేదని నిరూపించింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి మళ్లీ విన్నింగ్స్ ట్రాక్ ఎక్కేసింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చెన్నైపై రైజర్స్ విజయం తర్వాత ఆమె ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 ‘‘అవును.. గెలిచాం.. వావ్’’ అంటూ చప్పట్లతో కావ్య తన జట్టును అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక చెన్నైతో మ్యాచ్‌లో రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న 23 ఏళ్ల ఈ యువ బ్యాటర్ 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు రాబట్టాడు. తద్వారా రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ తల్లి, సోదరి వచ్చి అభిషేక్‌తో ఫొటోలు దిగారు. ఆ అమ్మాయి ఎవరంటే? ఇక అభిషేక్ శర్మ సోదరి.. విక్టరీ సింబల్ చూపిస్తూ కావ్యా మారన్‌తో కూడా ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. కాగా కావ్యా మారన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ మ్యాచ్ అంటే చాలా మందికి ఆమె గుర్తుకువస్తారు. స్టాండ్స్‌లో ఉండి సన్‌రైజర్స్‌ను ఉత్సాహపరుస్తూ ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కావ్య ఎక్స్ప్రెషన్స్ ఒడిసిపట్టేందుకు కెమెరామెన్ చాలా మటుకు ఆమెపైనే ఫోకస్ పెడుతూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాలా?! చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ -
రైజర్స్... విన్నర్స్
ఉప్పల్ మైదానంలో ఒక్కసారిగా ఎంత మార్పు! గత మ్యాచ్‌లో రెండు జట్లు పోటీ పడి పరుగుల వరద పారించడంతో 38 సిక్సర్లతో ఏకంగా 523 పరుగులు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు చెన్నై ఒక్కో పరుగు కోసం శ్రమించింది. అసలు మెరుపులు, భారీ షాట్లే లేకుండా సాధారణ స్కోరుకే పరిమితమైంది. గత మ్యాచ్‌లో ఆడింది కాకుండా మరో పిచ్‌పై ఈ మ్యాచ్ జరిగినా... పిచ్కంటే కూడా సన్‌రైజర్స్ బౌలర్లు ప్రభావం చూపించి ప్రత్యర్థిని కట్టిపడేశారు. నియంత్రణతో కూడిన తమ చక్కటి బౌలింగ్‌తో సన్‌రైజర్స్ ఒకప్పటి తమ బలాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడంలో హైదరాబాద్‌కు ఇబ్బందీ ఎదురు కాలేదు. అభిషే శర్మ బలమైన పునాది వేశాక మార్క్రమ్ బ్యాటింగ్ జట్టును విజయం దిశగా నడిపించింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా తమ రెండో మ్యాచ్‌లోనూ విజయాన్ని నమోదు చేసింది. తొలి పోరులో మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను శాసించిన జట్టు... ఇప్పుడు బౌలింగ్ బలంతో తమ ఖాతాలో మరో గెలుపును వేసుకుంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 6 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివమ్ దూబే (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... అజింక్య రహానే (30 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (23 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. అభిషే శర్మ (12 బంతుల్లో 37; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్రమ్ (36 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో హాజరై మ్యాచ్ మొత్తాన్ని తిలకించారు. మ్యాచ్ ముగిశాక అభిషే శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును ఆయన అందజేశారు. రాణించిన దూబే... ఒక్క దూబే క్రీజ్‌లో ఉన్నంత సేపు మినహా మిగిలిన చెన్నై ఇన్నింగ్స్ మొత్తం పేలవంగా సాగింది. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌లో పరుగులు సాధించడంలో చెన్నై బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర (12) విఫలం కాగా... రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడలేకపోయాడు. పవర్‌ప్లేలో జట్టు 48 పరుగులు చేసింది. ఈ దశలో దూబే ధాటిని చూపించాడు. షహబాజ్, మర్కండే బౌలింగ్‌లలో ఒక్కో సిక్స్ బాదిన అతను నటరాజన్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టాడు. దూబే, రహానే 8 పరుగుల వ్యవధిలో వెనుదిరిగాక స్కోరు వేగం మరింత తగ్గిపోయింది. అలవోకగా... ఓపెనర్ అభిషే మెరుపు బ్యాటింగ్‌తో రైజర్స్‌కు ఘనారంభం అందించాడు. అతను చెలరేగుతుంటే హెడ్ ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడు. ముకేశ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అభిషే 3 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. చహర్ ఓవర్లోనూ వరుసగా 6, 4 కొట్టిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. అనంతరం హెడ్, మార్క్రమ్ కలిసి కొన్ని చక్కటి షాట్లతో వేగాన్ని కొనసాగించారు. 6 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 78 పరుగులకు చేరింది. హెడ్‌ను తీక్షణ వెనక్కి పంపించగా... 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే మార్క్రమ్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో 36 బంతుల్లో 34 పరుగులే చేయాల్సి ఉండటంతో హైదరాబాద్ అలవోకగా లక్ష్యం చేరింది. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (14 నాటౌట్) మరో 11 బంతులు మిగిలి ఉండగానే సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) మార్క్రమ్ (బి) భువనేశ్వర్ 12; రుతురాజ్ (సి) సమద్ (బి) షహబాజ్ 26; రహానే (సి) మార్కండే (బి) ఉనాద్కట్ 35; దూబే (సి) భువనేశ్వర్ (బి) కమిన్స్ 45; జడేజా (నాటౌట్) 31; మిచెల్ (సి) సమద్ (బి) నటరాజన్ 13; ధోని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–25, 2–54, 3–119, 4–127, 5–160. బౌలింగ్: అభిషే 1–0–7–0, భువనేశ్వర్ 4–0–28–1, నటరాజన్ 4–0–39–1, కమిన్స్ 4–0–29–1, మయాంక్ మార్కండే 2–0–21–0, షహబాజ్ అహ్మద్ 1–0–11–1, జైదేవ్ ఉనాద్కట్ 4–0–29–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) రచిన్ (బి) తీక్షణ 31; అభిషే (సి) జడేజా (బి) చహర్ 37; మార్క్రమ్ (ఎల్బీ) (బి) అలీ 50; షహబాజ్ (ఎల్బీ) (బి) అలీ 18; క్లాసెన్ (నాటౌట్) 10; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 6; æమొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–46, 2–106, 3–132, 4–141. బౌలింగ్: దీపక్ చహర్ 3.1–0– 32–1, ముకేశ్ చౌదరి 1–0–27–0, తీక్షణ 4–0–27–1, తుషార్ 2–0–20–0, రవీంద్ర జడేజా 4–0–30–0, మొయిన్ అలీ 3–0–23–2, రచిన్ రవీంద్ర 1–0–3–0. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ X బెంగళూరు వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
అదరగొట్టిన అభిషేక్ శర్మ.. ఒకే ఓవర్లో 27 పరుగులు! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు అభిషేక్ శర్మ అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్.. సీఎస్కే పేసర్లను ఊచకోత కోశాడు. క్రీజులో ఉన్నంత సేపు అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా సీఎస్కే యువ పేసర్ ముఖేష్ చౌదరికి అభిషేక్ చుక్కలు చూపించాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో అభిషేక్.. 3 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 27 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 12 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Abhishek Sharma departs for 37 but he's got @SunRisers off to a stunning start 🔥🚀 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvCSK pic.twitter.com/yHyUrnHsiO — IndianPremierLeague (@IPL) April 5, 2024 -
చెప్తే అర్థం కాదా?.. సన్‌రైజర్స్ స్టార్‌కు చెప్పు చూపించిన యువీ!
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో ‘‘నీకోసం.. ప్రత్యేకంగా ఓ చెప్పు ఎదురుచూస్తోంది’’ అంటూ ఊహించని షాకిచ్చాడు. ఇంతకీ విషయమేమిటంటే.. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(277) నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ శర్మ వీర విహారం చేశాడు. కేవలం 23 బంతుల్లోనే 63 పరుగులతో అదరగొట్టాడు. 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి.. సన్‌రైజర్స్ తరఫున వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేశాడు. Abhishek Sharma's scintillating knock comes to an end but he's put @SunRisers on 🔝 with his astonishing strokes 🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/OoHgAK6yge — IndianPremierLeague (@IPL) March 27, 2024 అయితే, ముంబై బౌలర్ పీయూష్ చావ్లా సంధించిన షార్ట్‌బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేక నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘సూపర్ సర్.. వారెవ్వా అభిషేక్.. గొప్ప ఇన్నింగ్స్. కానీ ఇలాంటి షాట్‌కు అవుటవుతావా? నీకు మంచిగా చెబితే అర్థం కాదు కదా? అందుకే ఇప్పుడు నీ కోసం ప్రత్యేకంగా ఓ స్లిప్పర్ ఎదురుచూస్తోంది. వచ్చెయ్’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. అదే విధంగా.. హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ఇన్నింగ్స్‌ను కూడా కొనియాడాడు. కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్‌కు యువీ ఆరాధ్య క్రికెటర్. అంతేకాకుండా.. అతడికి మెంటార్ కూడా! Waah sir Abhishek waah 👏🏻 great innings but what a splendid shot to get out on! Laaton ke bhoot baaton se nahi maante! Special 🩴 waiting for you now @IamAbhiSharma4 Great knock by Klassy #Klaasen! #SRHvMI #IPL2024 — Yuvraj Singh (@YUVSTRONG12) March 27, 2024 అందుకే యువరాజ్ ఈ మేరకు అభిషేక్ ఆట తీరును విశ్లేషిస్తూ.. చొరవగా ఇలా ట్వీట్ చేశాడు. కాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు ట్రవిస్ హెడ్(24 బంతుల్లో 62), మార్క్రమ్(28 బంతుల్లో 42 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్(34 బంతుల్లో 80 నాటౌట్) దుమ్ములేపారు. ఫలితంగా 277 పరుగులు స్కోరు చేసిన సన్‌రైజర్స్.. ముంబైని 246 పరుగులకు కట్టడి చేసి 31 పరుగుల తేడాతో గెలిచింది. చదవండి: #SRHvsMI: ఎగిరి గంతేసిన కావ్య.. తలపట్టుకున్న నీతా అంబానీ! వైరల్ The moment when @SunRisers created HISTORY! Final over flourish ft. Heinrich Klaasen 🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/QVERNlftkb — IndianPremierLeague (@IPL) March 27, 2024 WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 -
Kavya Maran Photos: సన్‌రైజర్స్ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప (ఫొటోలు)
-
IPL 2024 SRH Vs MI Photos: సొంతగడ్డపై సన్‌రైజర్స్ విజయగర్జన (ఫొటోలు)
-
SRH Vs MI: సన్‌రైజర్స్ ‘రన్’రంగం
సునామీ బ్యాటింగ్... విధ్వంస ప్రదర్శన... వీర విజృంభణ... అద్భుతం... అసాధారణం... అసమానం... ఎలాంటి విశేషణాలు ఉపయోగించుకుంటారో మీ ఇష్టం... ఎన్నాళ్లుగానో ఇలాంటి ఇన్నింగ్స్ ఎదురు చూస్తున్న సన్‌రైజర్స్ ఆట సగటు అభిమానికి ఫుల్ జోష్‌ను పంచింది... సంపూర్ణ ఆనందాన్ని అందించింది... బౌండరీల వర్షంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది... 19 ఫోర్లు, 18 సిక్సర్లు... ముంబై బౌలింగ్‌పై హైదరాబాద్ ఊచకోత మామూలుగా సాగలేదు... ముగ్గురు బ్యాటర్లు ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోరు నమోదైంది. ముందుగా హెడ్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే... కొద్ది క్షణాల్లోనే 16 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి అభిషేక్ శర్మ తానూ తక్కువ కాదని చూపించాడు. నన్ను ఎలా మరచిపోతారన్నట్లుగా ఆ తర్వాత క్లాసెన్ తనదైన శైలిలో చెలరేగిపోయాడు... భారీ ఛేదనలో ముంబై కొంత వరకు ప్రయత్నించినా లక్ష్యం మరీ పెద్దదైపోయింది... చివరకు సొంతగడ్డపై సన్‌రైజర్స్ విజయగర్జన చేసింది. ఓవరాల్‌గా టి20ల్లోనే అత్యధిక పరుగులు, అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో కమిన్స్ బృందం ఘన విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన పోరులో రైజర్స్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు)... ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు సాధించింది. ‘లోక్ బాయ్’ తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. వీర విధ్వంసం... 7, 11, 22, 5, 13, 23, 21, 15, 11, 20 (తొలి 10 ఓవర్లలో 148)... 13, 12, 7, 11, 11, 12, 18, 11, 13, 21 (తర్వాతి 10 ఓవర్లలో 129)... సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సాగిన తీరిది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (11) విఫలం కాగా... మిగిలిన నలుగురు బ్యాటర్లు ముంబై బౌలర్లపై విరుచుకు పడ్డారు. అండర్–19 వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచి తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న 18 ఏళ్ల క్వెనా మఫాకా వీరిలో ముందుగా బలయ్యాడు. అతని తొలి ఓవర్లో వరుసగా 6, 6, 4, 4 బాదిన హెడ్... హార్దిక్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. కొయెట్జీ ఓవర్లోనూ వరుసగా 4, 4, 6 బాదిన హెడ్ 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చావ్లా వేసిన తర్వాతి ఓవర్లో అభిషేక్ 3 భారీ సిక్సర్లతో స్వాగతం పలికాడు. హెడ్ వెనుదిరిగిన తర్వాత అభిషేక్ మరింత చెలరేగిపోయాడు. మఫాకా ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 కొట్టిన అతను 16 బంతులకే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. 11వ ఓవర్ చివరి బంతికి అభిషేక్ అవుట్ కాగా... తర్వాతి 9 ఓవర్ల బాధ్యతను క్లాసెన్ తీసుకున్నాడు. మిత్రుడు మార్క్రమ్ (28 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకారంతో అతను సిక్సర్లతోనే పరుగులు రాబడుతూ దూసుకుపోయాడు. మఫాకా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 14.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. తన తొలి 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి ఒకింత మెరుగైన ప్రదర్శన ఇచ్చిన బుమ్రా కూడా తన చివరి ఓవర్లో క్లాసెన్ జోరుకు 13 పరుగులు ఇచ్చుకున్నాడు. ములానీ వేసిన ఆఖరి ఓవర్లోనూ వరుసగా 4, 6, 6 బాదిన క్లాసెన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును తన జట్టును అందించాడు. సన్‌రైజర్స్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉమ్రాన్ మలిక్‌ను బరిలోకి దించింది. తిలక్ వర్మ పోరాటం... ఓవర్‌కు 13.9 పరుగులు... భారీ లక్ష్య ఛేదనలో ఈ రన్‌రేట్‌తో పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనింగ్, ఆ తర్వాత మూడో వికెట్ భాగస్వామ్యాలు దూకుడుగానే సాగినా... ఇది సరిపోలేదు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆరంభించి తొలి వికెట్‌కు 20 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. ఉనాద్కట్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన కిషన్... భువీ వేసిన తర్వాతి ఓవర్లో 3 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. అయితే వీరిద్దరిని 10 పరుగుల వ్యవధిలో అవుట్ చేసి రైజర్స్ పైచేయి సాధించింది. ఆ తర్వాత తిలక్, నమన్ ధీర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరింత దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరు 37 బంతుల్లోనే 84 పరుగులు జత చేశారు. నమన్ వెనుదిరిగాక, షహబాజ్ ఓవర్లో 3 భారీ సిక్సర్లు కొట్టిన తిలక్ 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. చివర్లో డేవిడ్, హార్దిక్ పాండ్యా (24) పోరాటం ఫలితమివ్వలేదు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) డేవిడ్ (బి) పాండ్యా 11; హెడ్ (సి) నమన్ (బి) కొయెట్జీ 62; అభిషేక్ శర్మ (సి) నమన్ (బి) చావ్లా 63; మార్క్రమ్ (నాటౌట్) 42; క్లాసెన్ (నాటౌట్) 80; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 277. వికెట్ల పతనం: 1–45, 2–113, 3–161. బౌలింగ్: మఫాకా 4–0–66–0, పాండ్యా 4–0–46–1, బుమ్రా 4–0–36–0, కొయెట్జీ 4–0–57–1, చావ్లా 2–0–34–1, షమ్స్ ములానీ 2–0–33–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) అభిషేక్ (బి) కమిన్స్ 26; ఇషాన్ కిషన్ (సి) మార్క్రమ్ (బి) షహబాజ్ 34; నమన్ ధీర్ (సి) కమిన్స్ (బి) ఉనాద్కట్ 30; తిలక్ వర్మ (సి) మయాంక్ (బి) కమిన్స్ 64; పాండ్యా (సి) క్లాసెన్ (బి) ఉనాద్కట్ 24; టిమ్ డేవిడ్ (నాటౌట్) 42; షెఫర్డ్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–56, 2–66, 3–150, 4–182, 5–224. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–53–0, ఉనాద్కట్ 4–0–47–2, షహబాజ్ 3–0–39–1, కమిన్స్ 4–0–35–2, ఉమ్రాన్ 1–0–15–0, మర్కండే 4–0–52–0. 523 ఓవరాల్ టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ నిలిచింది. గత ఏడాది మార్చి 26న సెంచూరియన్ పార్క్‌లో దక్షిణాఫ్రికా (18.5 ఓవర్లలో 259/4), వెస్టిండీస్ (20 ఓవర్లలో 258/5) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 517 పరుగులు నమోదయ్యాయి. ఇక ఐపీఎల్ మ్యాచ్‌ల విషయానికొస్తే 2010లో చెన్నై సూపర్ కింగ్స్ (246/5), రాజస్తాన్ రాయల్స్ (223/5) మ్యాచ్‌లో మొత్తం 469 పరుగులు వచ్చాయి. 38 హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో నమోదైన సిక్స్‌లు. ఒక టి20 మ్యాచ్‌లో ఇవే అత్యధికం. 2018లో అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా లెజెండ్స్, కాబుల్ జ్వానన్ మ్యాచ్‌లో మొత్తం 37 సిక్స్‌లు వచ్చాయి. 148 ముంబైతో మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి 10 ఓవర్లలో చేసిన పరుగులు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఇవే అత్యధికం. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ X ఢిల్లీ వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
బీభత్సం సృష్టించిన అభిషేక్ శర్మ.. నిమిషాల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 27) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఇండియన్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ వీర లెవెల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. తొలుత ఓపెనర్ ట్రవిస్ హెడ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. నిమిషాల వ్యవధిలోనే ఆ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. అభిషేక్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి హెడ్ రికార్డును బద్దలు కొట్టాడు. హెడ్, అభిషేక్ శివాలెత్తడంతో పవర్ ప్లేల్లో అత్యధిక టీమ్ స్కోర్‌ను (81/1) నమోదు చేసిన సన్‌రైజర్స్.. ఐపీఎల్లో 10 ఓవర్ల తర్వాత అత్యధిక టీమ్ స్కోర్ (148/2) రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో హెడ్ 24 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేయగా.. అభిషేక్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. 13 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 161/3గా ఉంది. అంతకుముందు మయాంక్ అగర్వాల్ 13 బంతుల్లో బౌండరీ సాయంతో 11 పరుగులు చేసి హార్దిక్ బౌలింగ్ ఔటయ్యాడు. హార్దిక్, పియుశ్ చావ్లా, కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. -
SRH: చిక్కుల్లో అభిషేక్ శర్మ.. ఆమెతో రిలేషన్?!
SRH star Abhishek Sharma summoned by Surat police: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్, పంజాబీ క్రికెటర్ అభిషేక్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. సూరత్‌కు చెందిన మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. గుజరాత్ తక్ అందించిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల తానియా సింగ్ ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్‌గా రాణిస్తున్నారు. డీజే, మెకప్ ఆర్టిస్ట్‌గానూ ఆమెకు అనుభవం ఉంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే తానియా.. అభిషేక్ శర్మతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన తానియా బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆమె ఆత్మహత్యకు పాల్పడే ముందు చివరిసారిగా అభిషేక్ శర్మకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తానియా కాంటాక్ట్ హిస్టరీ చెక్ చేసిన పోలీసులు అభిషేక్ శర్మను విచారణకు పిలిచినట్లు సమాచారం. రంజీ ట్రోఫీ ముగించుకుని.. ఐపీఎల్ కోసం పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్లో పాల్గొన్నాడు. పంజాబ్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడి 199 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు కూడా తీశాడు ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్. అయితే, పంజాబ్ గ్రూపు దశలోనే నిష్క్రమించడంతో.. ఐపీఎల్-2024కు సన్నద్ధమయ్యే పనిలో పడ్డాడు అభిషేక్ శర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్ తనను రిటైన్ చేసుకున్న క్రమంలో తాజా ఎడిషన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. ఇలా చిక్కుల్లో పడ్డాడు. ఓన్లీ ఫ్రెండ్ అయితే, అభిషేక్ విచారణలో భాగంగా పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు సమాచారం. తానియా తనకు ఫ్రెండ్ మాత్రమేనని.. అయితే, చాలా కాలంగా ఆమెతో టచ్‌లో లేని అభిషేక్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 సీజన్ ఆరంభించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనూ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే నిర్వహించాలని బోర్డు నిర్ణయించుకుంది. చదవండి: Ranji Trophy: శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్.. ముషీర్ ఖాన్ ఎంట్రీ ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. -
SMAT 2023: 42 బంతుల్లో శతక్కొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, పంజాబ్ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. రాంచీ వేదికగా ఆంధ్రప్రదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ 42 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 9 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు అన్మోల్ప్రీత్ సింగ్ కూడా శివాలెత్తాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసిన అన్మోల్.. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో అన్మోల్ స్పీడ్ చూసి టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు కావడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే అన్మోల్.. స్టీఫెన్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన అనంతరం ఔటై, టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అభిషేక్, అన్మోల్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆంధ్ర బౌలర్లలో చీపురుపల్లి స్టీఫెన్, పృథ్వీరాజ్ యర్రా, త్రిపురన విజయ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అభిషేక్, అన్మోల్ బ్యాటింగ్ విధ్వంసం ధాటికి ఆంధ్ర బౌలర్లంతా 10కిపైగా సగటుతో పరుగులు సమర్పించుకున్నారు. హరిశంకర్‌రెడ్డి, పృథ్వీరాజ్ అయితే ఏకంగా 15కుపైగా సగటుతో పరుగులు సమర్పించుకున్నారు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ 42 బంతుల్లోనే శతక్కొట్టిన అభిషేక్ అభిషేక్ శర్మ లిస్ట్-ఏ (దేశవాలీ, అంతర్జాతీయ 50 ఓవర్స్ ఫార్మాట్) క్రికెట్లోనూ 42 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. ఈ శతకం లిస్ట్-ఏ క్రికెట్లో భారత తరఫున అత్యంత వేగవంతమైన శతకం కావడం మరో విశేషం. 2021లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న అభిషేక్.. తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 47 మ్యాచ్‌లు ఆడి 137.4 స్ట్రయిక్‌రేట్‌తో 4 హాఫ్‌సెంచరీల సాయంతో 893 పరుగులు చేశాడు. -
ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్.. కోహ్లిని గుర్తు చేసుకున్న యువ క్రికెటర్లు
భారత్-పాకిస్తాన్ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది. టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చివరిసారి పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ తాము కూడా అదే స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ (87) స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్-2022లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని అన్నాడు. మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో రాణించిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ బౌలింగ్ కోహ్లి కొట్టిన ఓ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. -
'చెప్పి మరి సిక్సర్ కొట్టడం సంతోషంగా అనిపించింది'
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా సోమవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(58 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీ చేశాడు. ఐపీఎల్లో గిల్‌కు ఇదే తొలి శతకం. కాగా తన సెంచరీతో గుజరాత్ విజయంలో కీలకపాత్రో పోషించిన గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అవార్డు అందుకున్న సమయంలో తన ఇన్నింగ్స్ గురించి గిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో మ్యాచ్ ఆడితే తనకు పూనకాలు వస్తాయని తెలిపాడు. సన్ రైజర్స్ తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన తాను.. ఇప్పుడు సెంచరీ కూడా అందుకున్నాని చెప్పాడు. భవిష్యత్ లో మరిన్ని సెంచరీలు సాధిస్తానని అన్నాడు. ''అభిషేక్ శర్మబౌలింగ్లో కొట్టిన సిక్స్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అతనికి ముందే చెప్పాను. నువ్వు బౌలింగ్ వేస్తే సిక్స్ కొడతానని. అన్నట్లుగానే సిక్స్ కొట్టాను.'' అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్లో అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ పంజాబ్ కు ఓపెనర్లుగా ఆడుతారు. ఈ చనువుతోనే గిల్ ఈ కామెంట్స్ చేశాడు. తనకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి ఆరాధ్య క్రికెటర్లని చెప్పిన గిల్.. వారి వల్లే క్రికెటర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. తనకు క్రికెట్ అర్ధమైనప్పటి నుంచి కోహ్లీ నా హీరో. ఆట పట్ల అతడికి ఉన్న పిచ్చి, అంకితభావం, ఎనర్జీ నన్ను చాలా.. ప్రోత్సహించాయి. ఆటపై ఎంతో మక్కువ చూపేలా చేశాయని శుభ్‌మన్ గిల్ చెప్పాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. శుభ్‌మన్‌కు తోడుగా సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 47)రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ఫరూఖీ, నటరాజన్ తలో వికెట్ తీశారు. లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులే చేసి ఓటమిపాలైంది. చదవండి: గుజరాత్ ఇప్పటికే; పోటీలో ఏడుజట్లు.. ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు? -
అభిషేక్ తప్పేం లేదు! వాళ్ల వల్లే ఇలా: టీమిండియా మాజీ క్రికెటర్ ఘాటు విమర్శలు
IPL 2023- SRH Vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి అభిషేక్ శర్మను బాధ్యుడిని చేయడం సరికాదని టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. తప్పంతా కెప్టెన్, మేనేజ్మెంట్దేనంటూ ఘాటు విమర్శలు చేశాడు. చెత్త నిర్ణయాలే రైజర్స్ కొంపముంచాయని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం తలపడింది సన్‌రైజర్స్. ఆరంభంలో పర్లేదు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రైజర్స్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటర్ల మెరుగైన ప్రదర్శన కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ఆదిలోనే హిట్టర్ కైలీ మేయర్స్(2) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(29) తక్కువ స్కోరుకే పరిమితం కావడం రైజర్స్‌కు కలిసివచ్చింది. అయితే, 16వ ఓవర్లో కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ బంతిని అభిషేక్ శర్మకు ఇవ్వడం.. అతడి ఓవర్లో స్టొయినిస్, పూరన్ కలిసి ఏకంగా ఐదు సిక్సర్లు బాదడం తీవ్ర ప్రభావం చూపింది. ఒక్క ఓవర్ మ్యాచ్‌ను తిప్పేసింది! ఒక్క ఓవర్లోనే ఈ మేరకు 31 పరుగులు రాబట్టిన లక్నో.. నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 15 ఓవర్ల దాకా మ్యాచ్ తమ చేతిలోనే ఉందని మురిసిపోయిన సన్‌రైజర్స్ భారీ ఓటమి కారణంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. అభిషేక్ శర్మను బౌలింగ్‌కు ఎందుకు పంపించారు? ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా వస్తున్న అభిషేక్ శర్మపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆకాశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జియో సినిమా షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘అసలు అభిషేక్ శర్మను బౌలింగ్‌కు ఎందుకు పంపించారు? మయాంక్ మార్కండే అందుబాటులో ఉన్నా కూడా అభిషేక్ శర్మతో ఆ ఓవర్ వేయించడంలో మర్మమేమిటో నాకైతే అర్థం కాలేదు. అభిషేక్ తొలి రెండు బంతులను ప్రత్యర్థి బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత అవుటయ్యాడు. వారిని నిందించడం సరికాదు అయితే.. నికోలస్ పూరన్ రాగానే మూడు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి. ఆటలో ఇవన్నీ సహజమే. నిజానికి ఇందులో అభిషేక్ తప్పు లేదు. ఒక బౌలర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో కెప్టెన్‌కు, మేనేజ్మెంట్కు తెలిసి ఉండాలి. అంతేగానీ.. ఇలాంటి వాటికి సదరు బౌలర్‌నో.. ప్లేయర్‌నో బాధ్యులను చేయడం, వారిని నిందించడం సరికాదు’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్, లక్నో క్రికెటర్ ప్రేరక్ మన్కడ్ అర్ధ శతకం సాధించడం అత్యంత సానుకూల అంశమని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చాడు లక్నో బ్యాటర్ ప్రేరక్. 45 బంతుల్లో 64 పరుగులు రాబట్టి.. పూరన్(13 బంతుల్లో 44 పరుగులు)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అభిషేక్ శర్మ 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. Of playing a match-winning knock, rewarding hard work & discipline and leading from the front with the ball 🙌 Hyderabad Heroes @krunalpandya24 & @PrerakMankad46 relive @LucknowIPL's epic chase 👌🏻 - By @28anand Full Interview 🔽 #TATAIPL | #SRHvLSG https://t.co/fIb75PuQQI pic.twitter.com/XLiIWASn6a — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
'యష్ దయాల్ చివర్లో.. నువ్వు మధ్యలోనే ముంచేశావ్'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం లక్నో సూపర్‌జెయింట్స్ ఏడు వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్పై ఘన విజయాన్ని సాధించింది. అయితే ఎస్ఆర్హెచ్ ఓటమికి ప్రధాన కారణం మాత్రం అభిషేక్ శర్మ. అతను వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్. అప్పటివరకు లక్నో స్కోరు 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులతో ఉంది. కాస్త టైట్‌గా బౌలింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్కు పట్టు చిక్కేది. ఈ సమయంలో తెలివిగా ఆలోచించాల్సిన కెప్టెన్ మార్క్రమ్ అనవసర తప్పిదం చేశాడు. పార్ట్‌టైమ్ బౌలర్ అయిన అభిషేక్ శర్మను గుడ్డిగా నమ్మి బౌలింగ్ అప్పజెప్పాడు. ఈ తప్పిదం ఎస్ఆర్హెచ్ను ముంచడంతో పాటు మ్యాచ్‌ను కోల్పోయేలా చేసింది. అసలు ఏ మాత్రం పసలేని బౌలింగ్‌ను లక్నో బ్యాటర్లు చీల్చి చెండాడారు. Photo: IPL Twitter తొలుత మార్కస్ స్టోయినిస్ రెండు సిక్సర్లు బాది ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన పూరన్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. అయితే చెత్త బౌలింగ్‌తో అభిషేక్ శర్మ దారుణంగా ట్రోల్‌కు గురయ్యాడు. ''యష్ దయాల్ చివర్లో ఐదు సిక్సర్లు ఇచ్చుకుంటే.. నువ్వు మాత్రం మధ్యలోనే ఐదు సిక్సర్లు ఇచ్చుకొని మ్యాచ్‌ను ముంచావ్.. ఒక పార్ట్‌టైమ్ బౌలర్‌ని నమ్మితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి..'' అంటూ కామెంట్ చేశారు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చుకున్న అభిషేక్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో అభిషేక్ శర్మ చేరిపోయాడు. ఇంతకముందు ఇదే సీజన్లో యష్ దయాల్(గుజరాత్ టైటాన్స్).. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు సమర్పించుకోగా.. శివమ్ మావి(కేకేఆర్).. 2022లో లక్నోతో మ్యాచ్‌లో, హర్షల్ పటేల్(ఆర్సీబీ).. 2021లో సీఎస్కేతో మ్యాచ్‌లో, షెల్డన్ కాట్రెల్(పంజాబ్ కింగ్స్).. 2020లో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో, రాహుల్ శర్మ(పుణే వారియర్స్).. 2012లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్నారు. The incredible Stoinis 🔥 😤 with some Super Giant hits 🙌#SRHvLSG #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters | @LucknowIPL @MStoinis pic.twitter.com/WTCMrUyOUQ — JioCinema (@JioCinema) May 13, 2023 .@SunRisers abhi shaken by Pooran Power 🙌 #SRHvLSG #TATAIPL #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters | @LucknowIPL pic.twitter.com/wwAAqnGKVQ — JioCinema (@JioCinema) May 13, 2023 చదవండి: #SRH: ఒకప్పుడు బలం.. ఇప్పుడదే బలహీనత -
IPL 2023: పూరన్ ఊచకోత.. లక్నో గ్రాండ్ విక్టరీ.. సన్‌రైజర్స్ ఔట్
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ కథ ముగిసింది. లక్నోతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఓడటం ద్వారా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో నాలుగు బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 16 ఓవర్ల వరకు తమ వైపు ఉన్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్ బౌలర్ అభిషేక్ శర్మ పువ్వుల్లో పెట్టి ప్రత్యర్ధికి అప్పజెప్పాడు. ఆ ఓవర్లో అభిషేక్ 31 పరుగులు (స్టోయినిస్ 2 సిక్సర్లు, పూరన్ హ్యాట్రిక్ సిక్సర్లు) సమర్పించుకోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయి, లక్నో వైపు మలుపు తిరిగింది. పూరన్ (13 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు ప్రేరక్ మన్కడ్ (45 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లలో వరుసగా 14, 10, 10, 6 పరుగులు రాబట్టి లక్నోను విజయతీరాలకు చేర్చారు. లక్నో గెలుపులో స్టోయినిస్ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్‌వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేని పరిస్థితి. మరోవైపు ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించడంతో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. గుజరాత్ (16), సీఎస్కే (15), ముంబై (14) పాయింట్ల పట్టికలో టాప్ త్రీలో ఉన్నాయి. -
SRH VS LSG: పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పూరన్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు..!
లక్నో మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వచ్చీ రాగానే హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అప్పటిదాకా సన్‌రైజర్స్‌కు ఫేవర్‌గా ఉన్న మ్యాచ్‌ను పూరన్.. మూడు బంతుల్లో మలుపు తిప్పాడు. Pooran box-office 🍿pic.twitter.com/dBu4G2P2U7— CricTracker (@Cricketracker) May 13, 2023 వివరాల్లోకి వెళితే.. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ దశలో బరిలోకి దిగిన పూరన్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను లక్నోవైపు తిప్పాడు. అభిషేక్ శర్మ వేసిన ఈ ఓవర్లో మొత్తం 31 పరుగులు వచ్చాయి. పూరన్‌కు ముందు స్టోయినిస్ సైతం రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే స్టోయినిస్ అదే ఓవర్లో అభిషేక్ ఉచ్చులో చిక్కి ఔటయ్యాడు. 16 ఓవర్ తర్వాత సమీకరణలు 24 బంతుల్లో 38 పరుగులుగా మారాయి. చేతిలో మరో 7 వికెట్లు ఉండటంతో లక్నో గెలుపుపై ధీమాగా ఉంది. అంతకుముందు ఇదే సీజన్లో పూరన్ ఇదే తరహాలో రెచ్చిపోయి, చేదాటిపోయిన మ్యాచ్‌ను గెలిపించాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో పూరన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే, లక్నోతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్‌వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. -
నిమిషాల్లో అంతా తారుమారైంది.. వాళ్ల వల్లే గెలిచాం.. అయితే: మార్కరమ్
IPL 2023 RR Vs SRH: ‘‘నిమిషాల్లో అంతా తారుమారైంది. ఉత్కంఠ పోరులో విజయం మా వైపు నిలిచింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువేమీ కాదు. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో జట్టు సమష్టిగా పోరాడింది. ఊహించనదాని కంటే ఎక్కువే స్కోరు చేస్తామని అనుకున్నాం. అదే నిజమైంది. వాస్తవానికి ముందు నుంచే మేము కాస్త దూకుడు ప్రదర్శించాల్సింది’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. బ్యాటర్ల సమష్టి ప్రదర్శనతోనే గెలుపు వరించిందని సంతోషం వ్యక్తం చేశాడు. నాడు ఘోర పరాభవం ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్‌లో ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడిన సన్‌రైజర్స్‌కు చేదు అనుభవం మిగిలిన విషయం తెలిసిందే. సొంతమైదానంలో ఏకంగా 72 పరుగుల భారీ తేడాతో ఓడి ఐపీఎల్ పదహారో ఎడిష్ను ఓటమితో ఆరంభించింది. ఈ క్రమంలో ఆదివారం (మే 7) నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. మరోసారి బట్లర్ విశ్వరూరం జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైశ్వాల్ (18 బంతుల్లో 35 పరుగులు) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 59 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో ఏకంగా 95 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ సంజూ శాంసన్(38 బంతుల్లో 66 పరుగులు) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అభిషేక్, త్రిపాఠి కలిసి ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు నష్టపోయి రాజస్తాన్ 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ(55 పరుగులు)కు తోడైన రాహుల్ త్రిపాఠి అతడితో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. అయితే, 13వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన అభిషేక్.. మరోసారి భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరడంతో రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన క్లాసెన్ 12 బంతుల్లో 26 పరుగులు సాధించి 16వ ఓవర్ ఐదో బంతికి పెవిలియన్ చేరాడు. ఫిలిప్స్ అద్భుతం చేశాడు.. 6,6,6,4 ఆ తర్వాత కాసేపటికే త్రిపాఠి(29 బంతుల్లో 47 పరుగులు)ని చహల్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో క్రీజులో(18వ ఓవర్ మూడో బంతి)కి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ తొలుత రెండు పరుగులు, ఆ తర్వాత ఒక పరుగు మాత్రమే తీశాడు. ఇంతలోనే మరో ఎండ్‌లో ఉన్న మార్కరమ్(6)ను చహల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. నో బాల్ వల్ల అదృష్టం దీంతో రైజర్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న తరుణంలో ఫిలిప్స్ అద్భుతం చేశాడు. కుల్దిప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 6,6,6, 4 బాది మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఇక ఆఖరి బంతికి హైడ్రామా నెలకొనగా.. సందీప్ శర్మ నోబాల్ కారణంగా రైజర్స్‌కు అదృష్టం కలిసి వచ్చింది. రాజస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచిందన్న స్టేట్మెంట్ నిమిషాల్లో తారుమారైంది. ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టిన మ్యాచ్‌లో రైజర్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందడంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి. వాళ్ల వల్లే గెలిచాం ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్కరమ్ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ మాకు శుభారంభం అందించాడు. త్రిపాఠి అతడికి తోడుగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఫిలిప్స్, క్లాసీ అద్భుత పాత్ర పోషించారు. సమద్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఒత్తిడి పెరిగినపుడు సరైన టెక్నిక్‌ను ఉపయోగిస్తే ఇలాంటి ఫలితం వస్తుంది’’ అని తమ బ్యాటర్ల ఆట తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ ఫిలిప్స్.. బ్రూక్‌కు వదిలేసి మంచి పని చేసింది..! సాహో సాహా.. టెస్ట్ జట్టులో చోటు కన్ఫర్మ్.. రహానే లాగే..! WHAT. A. GAME 😱😱 Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets. Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz — IndianPremierLeague (@IPL) May 7, 2023 -
ఒక్కోసారి అలా జరుగుతుంది.. బాధపడాల్సిన అవసరం లేదు.. వాళ్లిద్దరి వల్లే ఇలా: మార్కరమ్
IPL 2023- SRH Won by 9 Runs On Delhi Capitals: ‘‘జట్టు సమష్టి ప్రదర్శన కారణంగానే ఈ విజయం సాధ్యమైంది. మా ఆటగాళ్ల అద్భుత నైపుణ్యాలకు తోడు గెలవాలన్న వారి పట్టుదలే ఇక్కడిదాకా తీసుకువచ్చింది. మనం సరైన వ్యూహాలు రచించినపుడు కూడా ఒక్కోసారి ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చు. అంతమాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇలాంటి ఫలితాలు దక్కుతాయి. సరైన సమయంలో రాణించి మా జట్టు విజయం అందుకుంది’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రైజర్స్ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు నువ్వా- నేనా అన్నట్లు శనివారం హోరాహొరీగా సాగిన పోరులో ఎట్టకేలకు మార్కరమ్ బృందం 9 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై ఢిల్లీని ఓడించి ఉప్పల్‌లో జరిగిన పరాభవానికి బదులు తీర్చుకుంది. అదరగొట్టిన అభిషేక్, క్లాసీ క్లాసెన్ ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (36 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 67 పరుగులు) మినహా టాపార్డర్ పూర్తిగా విఫలమైనప్పటికీ.. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 53 పరుగులు నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. దంచికొట్టిన సాల్ట్, మిచెల్ ఆఖర్లో అబ్దుల్ సమద్(28 పరుగులు), అకీల్ హొసేన్ (16 పరుగులు నాటౌట్) తమ వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 6 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి రైజర్స్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే షాకిచ్చినప్పటికీ.. ఫిలిప్ సాల్ట్(59), మిచెల్ మార్ష్(63) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత ఢిల్లీ పతనం ఆరంభమైంది. ఆఖర్లో అక్షర్ పటేల్ (14 బంతుల్లో 29 పరుగులు) మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. 9 పరుగుల తేడాతో వార్నర్ బృందానికి రైజర్స్ చేతిలో ఓటమి తప్పలేదు. ఢిల్లీపై గెలుపుతో సన్‌రైజర్స్ ఈ సీజన్లో మూడో విజయం అందుకుని పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. వాళ్లిద్దరు అద్భుతం.. మా బౌలర్లు కూడా ఈ నేపథ్యంలో విజయానంతరం రైజర్స్ కెప్టెన్ మార్కరమ్ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ ఆరంభం నుంచి అదరగొట్టాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న క్లాసీ(క్లాసెన్) అతడికి తోడయ్యాడు. ఆత్మవిశ్వాసంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మాకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవడం సంతోషంగా ఉంది. మా బౌలర్లు పట్టుదలగా నిలబడ్డారు. ప్రత్యర్థి ఆట కట్టించారు. ఈ విజయం మాలో విశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక సొంతగడ్డపై కూడా విజయపరంపర ఇలాగే కొనసాగించాలని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా మే 4న సన్‌రైజర్స్ ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తమ తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు పుజారా వార్నింగ్.. 3 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు DC VS SRH: ప్రపంచంలో ఇతనికి మించిన ఆల్‌రౌండర్ లేడు.. ఓడినా పర్లేదు..! The Delhi Capitals came close to the target but it's @SunRisers who emerge victorious in Delhi 👏🏻👏🏻#SRH register a 9-run victory over #DC 👌🏻👌🏻 Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/S5METD41pF — IndianPremierLeague (@IPL) April 29, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సన్‌రైజర్స్‌కు ఇప్పటికి జ్ఞానోదయం అయింది.. వచ్చిన వెంటనే దుమ్మురేపాడు!
ఐపీఎల్-2023లో సర్‌రైజర్స్ హైదరాబాద్ తిరిగి గాడిలో పడింది. ఈ ఏడాది సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. 23 పరుగుల తేడాతో విజయ సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట విజయం సాధించిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. ఎట్టకేలకు జ్ఞానోదయం ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ మెనెజ్‌మెంట్‌కు ఎట్టకేలకు జ్ణానోదయం అయింది. తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడని స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మను ఎస్ఆర్హెచ్ పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్ఆర్హెచ్ మెనెజ్మెంట్పై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. గతేడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున టాప్ రన్ స్కోరర్ అయిన అభిషేక్‌ను పక్కన పెట్టడం సరికాదని పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కేకేఆర్‌తో మ్యాచ్‌కు అభిషేక్‌ను ఎస్ఆర్హెచ్ తిరిగి తీసుకువచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా అభిషేక్ శర్మకు అవకాశం రాలేదు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అభిషేక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ 228 పరుగుల భారీ స్కోర్ చేయడంలో అభిషేక్ తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IPL 2023: ఆ విషయం నాకు ముందే తెలుసు.. అతడు అద్భుతం! అందుకే అన్ని ఛాన్స్‌లు: మార్క్రమ్ In Match 1️⃣9️⃣ of #TATAIPL between #KKR & #SRH Here are the Visit Saudi Beyond the Boundaries Longest 6, Upstox Most Valuable Asset, Herbalife Active Catch of the match award winners.@VisitSaudi | #VisitSaudi | #ExploreSaudi@upstox | #InvestRight with Upstox@Herbalifeindia pic.twitter.com/GwGZFUbo0T — IndianPremierLeague (@IPL) April 14, 2023 2⃣nd win on the bounce for @SunRisers! 👏 👏 The @AidzMarkram-led unit beat the spirited #KKR in a run-fest to bag 2⃣more points 👍 👍 Scorecard ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/WSOutnOOhC — IndianPremierLeague (@IPL) April 14, 2023 -
అతడు ఏం పాపం చేశాడు.. ఒక్క మ్యాచ్కేనా! అందుకే ఓడిపోయింది
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తీవ్ర నిరాశపరిచింది. వాజ్‌పేయ్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 121 పరుగులు మాత్రమే చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అన్మోల్ప్రీత్ సింగ్(31), త్రిపాఠి(35), సమద్(21)పరుగులతో రాణించారు. అనంతరం 122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ ఎక్కడ? ఇక లక్నోతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మను ఎస్ఆర్హెచ్ దూరం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతడి స్థానంలో అన్మోల్ప్రీత్ సింగ్‌కు సన్‌రైజర్స్ మెనెజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరగిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క కారణంతో అతడిని జట్టు నుంచి తప్పించడం సరికాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దేశవాళీ క్రికెట్లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాకుండా ఎన్నో మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్కు అద్భుతమైన ఆరంభాన్ని కూడా ఇచ్చాడు. అదే విధంగా గతేడాది సీజన్లో 426 పరుగులు చేసిన అభిషేక్ శర్మ..ఎస్ఆర్హెచ్ తరపున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అటువంటి విధ్వంసకర ఆటగాడిని పక్కన పెట్టి సన్‌రైజర్స్ తప్పు చేసిందని, ఇటువంటి ప్రయోగాలు చేసే ఓటములు కొని తెచ్చుకుంటుందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అన్మోల్ బాగానే ఆడాడు కాబట్టి సరిపోయిందని.. లేదంటే కనీసం ఈ మాత్రం స్కోరు వచ్చేది కాదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 9న ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: IPL 2023: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం! పిచ్ కూడా! ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు -
సెంచరీతో చెలరేగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్.. అయినా..!
VHT 2022 Quarter Finals: విజయ్ హజారే ట్రోఫీ-2022లో భాగంగా పంజాబ్-కర్ణాటక జట్ల మధ్య నిన్న (నవంబర్ 28) జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ (123 బంతుల్లో 109; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగినా, పంజాబ్ ఓటమి బారి నుంచి తప్పించుకోలేకపోయింది. ఫలితంగా ఆ జట్టు క్వార్టర్ ఫైనల్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. అభిషేక్ శర్మ సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ శర్మ మినహా జట్టులో మరే ఇతర ఆటగాడు కనీస పరుగులు కూడా చేయలేకపోవడంతో పంజాబ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కర్ణాటక బౌలర్ విధ్వథ్ కావేరప్ప 4 వికెట్లు పడగొట్టి పంజాబ్ పతనాన్ని శాశించాడు. అనంతరం 236 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 49.2 ఓవర్లలో అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకువచ్చారు. కర్ణాటక ఇన్నింగ్స్‌లో రవికుమార్ సమర్థ్ (71) అర్ధసెంచరీతో రాణించగా.. ఆఖర్లో మనోజ్ భండగే (25 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో కర్ణాటక సెమీస్‌కు అర్హత సాధించింది. రేపు (నవంబర్ 30) జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో కర్ణాటక-సౌరాష్ట్ర, మహారాష్ట్ర-అస్సాం జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు డిసెంబర్ 2న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
భువనేశ్వర్ కాదు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తదుపరి కెప్టెన్ అతడే!
ఈ ఏడాది ఐపీఎల్లో పేలవ ప్రదర్శరన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. జట్టులో కీలక మార్పులు చేపట్టేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగానే ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు విలియమ్సన్, నికోలస్ పూరన్‌ను ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. వీరితోపాటు మరో 10 మంది ఆటగాళ్లను కూడా ఎస్ఆర్హెచ్ వేలంలో పెట్టింది. ఈ మినీవేలంలో ఎస్ఆర్హెచ్ పర్స్‌లో రూ.42.25 కోట్లు ఉన్నాయి. ఈ వేలంలో యువ ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టును పటిష్టం చేసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ఇక విలియమ్సన్‌ను విడిచిపెట్టడంతో ఎస్ఆర్హెచ్ తదుపరి కెప్టెన్ ఎవరన్నది ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టు యువ ఆటగాడు అభిషేక్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని హైదరాబాద్ జట్టు మేనేజేమెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. కాగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియోను ఎస్ఆర్హెచ్ షేర్ చేయడం.. ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది. అంతే కాకుండా ఈ వీడియోకు 'వీర శూర' క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో అభిషేక్ శర్మ అదరగొట్టాడు. ఐపీఎల్-2022లో 14 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 426 పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ.,భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ వీర శూర 🔥#OrangeArmy | @IamAbhiSharma4 pic.twitter.com/0uJcFG7Su3 — SunRisers Hyderabad (@SunRisers) November 16, 2022 -
IPL 2022: సన్‌రైజర్స్ ఢమాల్
పుణే: సీజన్ తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి...ఆ తర్వాత కోలుకొని చక్కటి ప్రదర్శనతో వరుసగా ఐదు విజయాలు...ఇక ప్లే ఆఫ్స్ దారి సులువే అనుకుంటున్న తరుణంలో మళ్లీ పరాజయాల బాట...విజయాలలాగే వరుసగా ఐదో ఓటమితో అవకాశాలు సంక్లిష్టం! ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. శనివారం జరిగిన కీలక పోరులో హైదరాబాద్ 54 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడింది. తొలుత నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రీ రసెల్ (28 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. తర్వాత సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులకే పరిమితమైంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 32; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. రసెల్ మెరుపులు... ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (7) త్వరగానే అవుటైనా... నితీశ్ రాణా (16 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్సర్లు), అజింక్య రహానే (24 బంతుల్లో 28; 3 సిక్సర్లు) కోల్‌కతా ఇన్నింగ్స్‌ను దారిలో పెట్టారు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 55/1 స్కోరు చేసింది. అయితే తన తొలి ఓవర్లోనే నితీశ్, రహానేలను పెవిలియన్ చేర్చిన ఉమ్రాన్ తన తర్వాతి ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (15)ను అవుట్ చేశాడు. రింకూ సింగ్ (5) ఎల్బీగా నిష్క్రమించగా, బిల్లింగ్స్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆటలో దూకుడు కనిపించలేదు. 19వ ఓవర్లో చక్కటి బౌలింగ్‌తో భువనేశ్వర్ 6 పరుగులే ఇచ్చినా... వాషింగ్టన్ సుందర్ వేసిన చివరి ఓవర్లో రసెల్ రెచ్చిపోయాడు. అతను 3 సిక్సర్లతో చెలరేగడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. పేలవ బ్యాటింగ్... ముందంజ వేసే అవకాశాలు మెరుగుపడాలంటే తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. అభిషేక్, మార్క్రమ్ మినహా అంతా విఫలమయ్యారు. చెత్త షాట్లతో రైజర్స్ ఆశల్ని ముంచేశారు. విలియమ్సన్ (9), రాహుల్ త్రిపాఠి (9)లతో పాటు మిడిలార్డర్లో పూరన్ (2), సుందర్ (4), శశాంక్ సింగ్ (11) ప్రభావం చూపలేకపోయారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (బి) జాన్సెన్ 7; రహానె (సి) శశాంక్ (బి) ఉమ్రాన్ 28; నితీశ్ (సి) శశాంక్ (బి) ఉమ్రాన్ 26; శ్రేయస్ (సి) త్రిపాఠి (బి) ఉమ్రాన్ 15; బిల్లింగ్స్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 34; రింకూ సింగ్ (ఎల్బీ) (బి) నటరాజన్ 5; రసెల్ నాటౌట్ 49; నరైన్ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–17, 2–65, 3–72, 4–83, 5–94, 6–157. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–1, జాన్సెన్ 4–0–30–1, నటరాజన్ 4–0–43–1, సుందర్ 4–0–40–0, ఉమ్రాన్ మలిక్ 4–0–33–3. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) బిల్లింగ్స్ (బి) వరుణ్ 43; విలియమ్సన్ (బి) రసెల్ 9; త్రిపాఠి (సి) అండ్ (బి) సౌతీ 9; మార్క్రమ్ (బి) ఉమేశ్ 32; పూరన్ (సి) అండ్ (బి) నరైన్ 2; సుందర్ (సి) వెంకటేశ్ (బి) రసెల్ 4; శశాంక్ (సి) శ్రేయస్ (బి) సౌతీ 11; జాన్సెన్ (సి) బిల్లింగ్స్ (బి) రసెల్ 1; భువనేశ్వర్ నాటౌట్ 6; ఉమ్రాన్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–30, 2–54, 3–72, 4–76, 5–99, 6–107, 7–113, 8–113. బౌలింగ్: ఉమేశ్ 4–0–19–1, సౌతీ 4–0–23–2, నరైన్ 4–0–34–1, రసెల్ 4–0–22–3, వరుణ్ 4–0–25–1. ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ X గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ X రాజస్తాన్ రాయల్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
IPL 2022: ఎట్టకేలకు హైదరాబాద్ గెలుపు బోణీ
ముంబై: ఐపీఎల్–2022లో రెండు వరస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి విజయం దక్కింది. తమలాగే గెలుపు రుచి చూడని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి రైజర్స్ పాయింట్ల ఖాతా తెరిచింది. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ సూపర్ కింగ్స్‌కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మొయిన్ అలీ (35 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం హైదరాబాద్ 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాణించిన అలీ... ఓపెనర్ల వైఫల్యంతో చెన్నైకి టోర్నీలో మరోసారి చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు. ఉతప్ప (15)ను అవుట్ చేసి సుందర్ తొలి దెబ్బ కొట్టగా, నటరాజన్ తన మొదటి బంతికే రుతురాజ్ (16)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ దశలో అలీ, అంబటి రాయుడు (27 బంతుల్లో 27; 4 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు 50 బంతుల్లో 62 పరుగులు జోడించారు. ఆ తర్వాత మరో 2 పరుగుల వ్యవధిలోనే చెన్నై అలీ, దూబే (3) వికెట్లు కోల్పోయింది. ధోని (3) కూడా విఫలం కాగా, చివర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో చెన్నై కనీస స్కోరైనా చేయగలిగింది. అలవోకగా... గత మూడు సీజన్లలో హైదరాబాద్ తరఫున ఆడినా... 19 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని అభిషేక్ శర్మ ఈసారి ఓపెనర్‌గా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి రెండు మ్యాచ్‌లలో 9, 13 పరుగులే చేసిను అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌తో జట్టును విజయం దిశగా నడిపించాడు. తీక్షణ ఓవర్లో అభిషేక్ ఫోర్, సిక్స్ కొట్టగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 37 పరుగులకు చేరింది. 32 బంతుల్లో అభిషేక్ అర్ధసెంచరీ పూర్తి కాగా, మరో ఎండ్ నుంచి విలియమ్సన్ కూడా చక్కటి షాట్లతో సహకరించాడు. ఈ జోడీని విడదీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన చెన్నై ఎట్టకేలకు 13వ ఓవర్ తొలి బంతికి రైజర్స్ కెప్టెన్‌ను వెనక్కి పంపించగలిగింది. విజయం కోసం 47 బంతుల్లో 66 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన త్రిపాఠి దూకుడైన బ్యాటింగ్‌తో దూసుకుపోయాడు. జోర్డాన్ ఓవర్లో అతను ఒక సిక్స్, 2 ఫోర్లు బాదాడు. అభిషేక్, త్రిపాఠి రెండో వికెట్‌కు 31 బంతుల్లోనే 56 పరుగులు జత చేశారు. విజయానికి అతి చేరువగా వచ్చాక అభిషేక్ అవుటైనా... త్రిపాఠి మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) మార్క్రమ్ (బి) సుందర్ 15; రుతురాజ్ (బి) నటరాజన్ 16; మొయిన్ అలీ (సి) త్రిపాఠి (బి) మార్క్రమ్ 48; రాయుడు (సి) మార్క్రమ్ (బి) సుందర్ 27; దూబే (సి) ఉమ్రాన్ (బి) నటరాజన్ 3; జడేజా (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 23; ధోని (సి) ఉమ్రాన్ (బి) జాన్సెన్ 3; బ్రేవో (నాటౌట్) 8; జోర్డాన్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–25, 2–36, 3–98, 4–108, 5–110, 6–122, 7–147. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–36–1, మార్కో జాన్సెన్ 4–0–30–1, వాషింగ్టన్ సుందర్ 4–0–21–2, నటరాజన్ 4–0–30–2, ఉమ్రాన్ మలిక్ 3–0–29–0, మార్క్రమ్ 1–0–8–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) జోర్డాన్ (బి) బ్రేవో 75; విలియమ్సన్ (సి) అలీ (బి) ముకేశ్ 32; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 39; నికోలస్ పూరన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 2 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–89, 2–145. బౌలింగ్: ముకేశ్ 4–0–30–1, మహీశ్ తీక్షణ 4–0–31–0, జోర్డాన్ 3–0–34–0, జడేజా 3–0–21–0, మొయిన్ అలీ 1–0–10–0, బ్రేవో 2.4–0–29–1. ఐపీఎల్లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి రాజస్తాన్ X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. .@SunRisers win by 8 wickets to register their first win in #TATAIPL 2022.#CSKvSRH pic.twitter.com/aupL3iKv5v — IndianPremierLeague (@IPL) April 9, 2022 -
కోట్లు పెట్టి కొన్నందుకు ఎట్టకేలకు మెరిశాడు..
ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్ వైస్‌కెప్టెన్ అభిషేక్ శర్మ తొలిసారి మెరిశాడు. 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అభిషేక్ 25 మ్యాచ్‌ల తర్వాత కెరీర్లో మెయిడెన్ అర్థసెంచరీ సాధించాడు. సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 32 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఫిప్టీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మ ఐపీఎల్లో ఇప్పటివరకు ఉన్న అత్యధిక స్కోరును అధిగమించాడు. 2018లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్‌కు అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ తొలి మ్యాచ్‌లోనే 19 బంతుల్లో 46 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. విచిత్రమేంటంటే.. తొలి మ్యాచ్ మినహా మళ్లీ అభిషేక్ రాణించింది లేదు. ఆ తర్వాత ఆడిన 24 మ్యాచ్‌ల్లో 30 నుంచి 40లోపే ఎక్కువసార్లు ఔటయ్యాడు. ఇక మెగావేలంలో అభిషేక్ శర్మను ఎస్ఆర్హెచ్ రూ. 6.5 కోట్లు పెట్టి దక్కించుకుంది. అయితే సీజన్లో ఎస్ఆర్హెచ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. కోట్లు పెట్టి కొన్నందుకు ఇంత దరిద్రంగా ఆడతారా అంటూ అతనిపై విమర్శలు వచ్చాయి. అయితే అభిషేక్ శర్మ మాత్రం ఇది పట్టించుకోకుండా తన ఆటను కొనసాగించాడు. సీఎస్కేతో మ్యాచ్ ద్వారా ఎట్టకేలకు తొలిసారి తన ఆటేంటో చూపించాడు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. చదవండి: IPL 2022: నటరాజన్ సూపర్ డెలివరీ.. గైక్వాడ్‌కు ఫ్యూజ్‌లు ఔట్.. వీడియో వైరల్! Ravi Shastri: 'తమాషానా.. అలాంటి క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధించాలి' -
6.5 కోట్లు దండగ.. గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఆడుతున్నాడు!
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మారినా.. ఆట తీరు మాత్రం మారడం లేదు. ప్రస్తుత సీజన్లో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ ఇప్పటికీ ఆఖరి స్థానంలోనే ఉంది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో 61 పరుగుల తేడాతో ఓటమి చెందిన ఎస్ఆర్హెచ్.. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో వంటి స్టార్ ఆటగాళ్లను విడిచి పెట్టి అభిమానుల ఆగ్రహానికి గురైన ఎస్ఆర్హెచ్.. ప్రస్తుత ఆట తీరుతో మరిన్ని విమర్శలు మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా.. ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.6.5 కోట్లు వెచ్చించి ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిన అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరుస్తున్న సంగతి తెలిసిందే. అభిషేక్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతులు ఎదర్కొన్న అతడు.. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌పై 13 పరుగులు సాధించి పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్‌గా జట్టుకు అద్భుతమైన శుభారంభం ఇవ్వాల్సిన అభిషేక్ శర్మ.. తన ఆట తీరుతో రోజురోజుకూ జట్టుకు భారంగా మారుతున్నాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మపై ఎస్ఆర్హెచ్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "హైదరాబాద్ తీరు మారదు. రూ. 6.5 కోట్లు పెట్టి అభిషేక్ శర్మను ఎందుకు కొన్నారో.. గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్కు రూ. 6.5 కోట్లు దండగ’’ అని అభిమానులు మండిపడుతున్నారు. చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్.. ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్! Brilliant bowling performance by #LSG as they defend their total of 169/7 and win by 12 runs 👏👏 Scorecard - https://t.co/89IMzVls6f #SRHvLSG #TATAIPL pic.twitter.com/MY2ZhM3Mqe — IndianPremierLeague (@IPL) April 4, 2022 -
కళావతి సాంగ్‌కు ఎస్ఆర్హెచ్ ఆటగాడి స్టెప్పులు.. నీకంత సీన్ లేదులే! అయినా
ఐపీఎల్- 2022 సీజన్ ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఫ్రాంఛైజీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు మరింత దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాయి. ఆటగాళ్ల మ్యాచ్ ప్రాక్టీసు వీడియోలతో పాటు.. ఖాళీ సమయాల్లో వారు సరదగా గడిపిన క్షణాలను బంధించి షేర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు సన్‌రైజెర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు ఆభిషేక్ శర్మ స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సన్‌రైజెర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆభిషేక్ డ్యాన్స్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఓ యాజర్ స్పందిస్తూ.. 'మైఖేల్ జాక్సన్ లా డ్యాన్స్ చేస్తున్నా అనుకుంటున్నావా.. నీకంత లేదులే.. అయినా పర్లేదనిపించావు' అంటూ కామెంట్ చేశాడు. ఇక ఐపీఎల్ మెగా వేలంలో ఆభిషేక్ శర్మను రూ. 6.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. అదే విధంగా సన్‌రైజెర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి న రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. మా పాట.. మీ ఆట అదుర్స్ అభిషేక్ శర్మ డాన్స్ వీడియోపై సర్కారు వారి పాట టీమ్ ట్విటర్ వేదికగా స్పందించింది. ‘‘మా పాట.. మీ ఆట.. రెండూ అదిరిపోతాయి. ఆల్ ది బెస్ట్’’ అంటూ సన్‌రైజర్స్‌కు విషెస్ తెలిపింది. Sarkaru vaari paataki Abhishek vaari aata 😜@IamAbhiSharma4 #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/AE32pFTwPY — SunRisers Hyderabad (@SunRisers) March 19, 2022 Maa Paata🎵 🔔 Mee Aaata 🕺🏏 Rendu Adhiripothai 🤩⚡️ Best Wishes for #IPL2022 🧡 https://t.co/FZyK8yaErI — SarkaruVaariPaata (@SVPTheFilm) March 19, 2022 The dance, you saw. 🕺 The making, you now see 😅#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/76RHAhDXQI — SunRisers Hyderabad (@SunRisers) March 19, 2022 -
రూ. 6.5 కోట్లే దండగ.. మళ్లీ వైస్ కెప్టెన్సీనా!?
ఐపీఎల్లో ఎవరికి అర్థం కాని జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది అంతుచిక్కదు. డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించడం నుంచి మొదలుపెడితే.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగావేలం వరకు అదే తంతు ఎస్ఆర్హెచ్లో కనబడింది. వేలంలోనూ పెద్దగా పేరున్న ఆటగాళ్లను కొనుగోలు చేయని ఎస్ఆర్హెచ్.. ఫామ్‌లో లేని పూరన్‌కు రూ. 10 కోట్లకు పైగా చెల్లించడం.. అన్క్యాప్డ్ ప్లేయర్ అభిషేక్ శర్మకు రూ. 6.5 కోట్లు చెల్లించడమేంటని నోరెళ్లబెట్టారు. ఒక సుందర్ మినహా పెద్దగా చెప్పుకునే ఆటగాళ్లు ఆ జట్టులో లేకపోవడంతో సర్వత్రా విమర్శలపాలయ్యింది. చదవండి: IPL 2022: కేన్ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ.. తాజాగా వైస్‌కెప్టెన్సీ విషయంలోనూ ఎస్ఆర్హెచ్ వింత వైఖరిని ప్రదర్శిస్తోంది. కోట్లు పెట్టి కొన్న పూరన్‌ను కాదని ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మను వైఎస్ కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌కు అన్ని కోట్లు పెట్టడమే దండగ అనుకుంటే.. పైనుంచి మళ్లీ వైస్ కెప్టెన్సీ పదవి ఎందుకంటూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గరం అవుతున్నారు. ఐపీఎల్‌లోనూ అభిషేక్ శర్మ పెద్దగా రాణించింది లేదు. ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో 241 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ 14 ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు. ఇంకో విచిత్రమేమిటంటే.. వేలంలో అభిషేక్ శర్మ కోసం రూ. 10 కోట్లు పెట్టడానికైనా ఎస్ఆర్హెచ్ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అతని బేస్‌ప్రైస్ రూ.20 లక్షలు మాత్రమే. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ అతని కోసం పోటీ పడకుంటే భారీ ధర దక్కే అవకాశం ఉండేది కాదు. 2018 అండర్-19 ప్రపంచకప్ సాధించిన యంగ్ టీమిండియాలో అభిషేక్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు. శుబ్‌మన్ గిల్, పృథ్వీ షాలు మంచి పేరు సంపాదించగా..అభిషేక్ మాత్రం ఆ తర్వాత నిలకడ చూపించలేకపోయాడు. చదవండి: IPL 2022 Auction: ‘మాకు అనామకులే కావాలి’.. సన్‌రైజర్స్ తీరే వేరు IPL 2022 SRH- Simon Katich: మొన్ననే సంతోషంగా ఉందన్నాడు.. ఇంతలోనే ఏమైందో! కారణం ఆమేనా?