
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మను దురదృష్టం వెంటాడింది. తోటి బ్యాటర్ ట్రావిస్ హెడ్‌తో సమన్వయ లోపం వల్ల అభిషేక్ రనౌటయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన అభిషేక్.. ఈ మ్యాచ్‌లో కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అభిషేక్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.
అసలేం జరిగిందంటే?
ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని ట్రావిస్ హెడ్ కవర్స్ దిశగా ఆడాడు. హెడ్ షాట్ ఆడిన వెంటనే క్విక్ సింగిల్ కోసం నాన్‌స్టైకర్ ఎండ్ వైపు పరిగెత్తాడు. కానీ నాన్ స్టైక్ ఎండ్‌లో అభిషేక్ మాత్రం పరుగుకు సిద్దంగా లేడు. అతడు హెడ్‌ను ఆపడానికి చేయి పైకెత్తాడు. కానీ హెడ్ మాత్రం అభిషేక్‌ను గమనించకుండా బంతిని చూస్తూ పరుగు కోసం ముందుకు వచ్చాడు.
దీంతో అభిషేక్ కాస్త ఆలస్యంగా పరిగెత్తడం ప్రారంభించాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఢిల్లీ ఫీల్డర్ విప్రజ్ నిగమ్ అద్భుతమైన త్రోతో స్టంప్స్‌ను గిరాటేశాడు. ఫలితంగా అభిషేక్ శర్మ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఐదేసిన స్టార్క్..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు.
SRH ನ ಮೊದಲ ವಿಕೆಟ್ ಪತನ 👏
ರನ್ ಔಟ್ ಮೂಲಕ Abhishek Sharma ತಮ್ಮ ವಿಕೆಟ್ ಕೈಚೆಲ್ಲಿದ್ದಾರೆ 👀
📺 ವೀಕ್ಷಿಸಿ | TATA IPL 2025 | #DCvSRH | LIVE NOW | ನಿಮ್ಮ JioHotstar & Star Sports ಕನ್ನಡದಲ್ಲಿ.#IPLOnJioStar #IPL2025 #TATAIPL pic.twitter.com/tKwl18nYPF— Star Sports Kannada (@StarSportsKan) March 30, 2025
చదవండి: IPL 2025: హార్దిక్ పాండ్యాకు మరో షాక్