Delhi Capitals
-
నితీష్ రాణా అవుట్ చుట్టూ రచ్చ? రూల్స్ ఏమి చెబుతున్నాయి?
ఐపీఎల్-2026 సీజన్లో మరో వివాదం చెలరేగింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీష్ రాణా ఔటైన తీరు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్లు పాథుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన లోకల్ బాయ్ నితీష్ రాణా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ట్రిక్కీ వికెట్‌పై రాణా ఆచితూచి ఆడుతూ క్రీజులో పాతుకుపోయేలా కన్పించాడు. ఈ క్రమంలో ఢిల్లీ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్‌లో మూడో బంతికి స్వీప్ షాట్ ఆడబోయి డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్‌కు రానా చిక్కాడు. అయితే రాణా బంతిని షాట్ ఆడే క్రమంలో ఒక్కసారిగా వికెట్లపై ఉన్న బెయిల్స్ కింద పడిపోయాయి. దీంతో నితీష్ క్యాచ్ అవుట్ కాదు హిట్ వికెట్ అయ్యాడని అంతా భావించారు. కానీ రిప్లేలో చూస్తే బలమైన గాలులు కారణంగా బెయిల్స్ కింద పడిపోయినట్లు స్పష్టమైంది. అయితే స్టంప్స్ కింద పడిపోయాయి కాబట్టి బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించాల్సిందని పలువురు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నాయి. ఇంతకి రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓసారి పరిశీలిద్దాం.హిట్ వికెట్ కాదు..బ్యాటర్ షాట్ ఆడే క్రమంలో గానీ, పరుగు తీసే సమయంలో గానీ తన బ్యాట్‌తో లేదా శరీరంతో బెయిల్స్‌ను పడగొడితే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో రాణా వికెట్లను తాకలేదు కాబట్టి ఇది హిట్ వికెట్ కాదు. మరోవైపు వికెట్ కీపర్ సంజూ శాంసన్ కారణంగా కూడా స్టంప్స్ పడలేదు. కేవలం గాలులు వల్లే స్టంప్స్ కిందపడిపోయాయి.డెడ్ బాల్ ఎప్పుడు ప్రకటిస్తారు?బ్యాటర్ దృష్టి మరల్చే విధంగా ఏదైనా అవాంతరం ఏర్పడినప్పుడు డెడ్‌బాల్‌గా అంపైర్‌గా ప్రకటిస్తారు. ఉదహరణకు బౌలర్ బంతిని వేసే క్రమంలో తన కర్చీఫ్ కింద పడటం లేదా తన చేతితో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో బెయిల్స్‌ను పడగొడితే డెడ్ బాల్‌గా పరిగిణిస్తారు.అంతేకాకుండా బంతి డెలివరీ అయ్యే ఆఖరి క్షణంలో బ్యాటర్ పక్కకు తప్పుకొన్న డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. కానీ రాణా మాత్రం ఎలాంటి ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా షాట్ ఆడాడు. అంతేకాకుండా బౌలర్ బంతిని విసిరిన తర్వాత బెయిల్స్ పడిపోయాయి. అందుకే అంపైర్లు దాన్ని డెడ్ బాల్‌గా పరిగణించలేదు.When Nitish got Out,Sanju Disturbed The Wicket and bail fell offAny expert please tell will it be Out or not? pic.twitter.com/wUF9r0cODA— Stubbsy³⁰ (@sinha7605) May 5, 2026 -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.156 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ బౌలర్లను సంజూ ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గాను అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ సీజన్లో ఢిల్లీపై శాంసన్‌కు ఇది రెండో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కావడం విశేషం.ఇక ఈ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సంజూ సాధించిన రికార్డులు ఇవే👉19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒకే సీజన్లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా శాంసన్ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో ఢిల్లీపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కలిపి అతడు 202 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌లలోనూ సంజూ అజేయంగా నిలవడం గమానార్హం.👉అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో ఒకే జట్టుపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పిన తొలి బ్యాటర్‌గా సంజూ నిలిచాడు. ఈ ఏడాది ఐసీజన్ ఫస్ట్ హాఫ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్,ఆయుశ్ మాత్రేతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.👉ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ శర్మ (31 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి 3వ వికెట్‌కు 66 బంతుల్లో 114 పరుగులు అజేయ భాగస్వామ్యాన్ని జోడించాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఢిల్లీపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కానీ అతడు రెండు సీజన్లలో ఈ ఫీట్ సాధించాడు.👉ఒకే సీజన్లో ఒకే ప్రత్యర్థిపై 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి వికెట్ కీపర్ సంజూనే కావడం విశేషం.చదవండి: హెచ్‌సీఏ ‘క్రికెట్ ఆపరేషన్స్ హెడ్’గా రాయుడు -
సంజూ విధ్వంసం.. సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సంజూ శాంసన్ (87 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. స్టబ్స్ (38), సమీర్ రిజ్వీ (40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్‌లు తలా ఒక వికెట్ తీశారు. కాగా టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.సీఎస్కే ఆడుతూ పాడుతూ..156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగింది. కెప్టెన్ రుతురాజ్, వన్‌డౌన్‌లో వచ్చిన ఉర్విల్ పటేల్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కానీ మరో ఎండ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు శాంసన్‌కు జత కలిసిన కార్తిక్ శర్మ తోడయ్యాడు. ఈ ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లు బాది సీఎస్కేకు విజయాన్ని కట్టబెట్టారు. శాంసన్ సునామీ ఇన్నింగ్స్‌తో అలరిస్తే.. కార్తిక్ తన హిట్టింగ్‌ను ఢిల్లీ బౌలర్లకు రుచి చూపించాడు. ఈ సీజన్లో సీఎస్కేకు ఇది ఐదో విజయం కాగా పట్టికలో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, ఆరు ఓటములతో పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. -
ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఫీట్ సాధించింది. సీఎస్కేతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఢిల్లీ టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. ఏ ఒక్కరు కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌లో టాప్-4 బ్యాటర్లు రెండంకెల స్కోరు అందుకున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరు 20 పరుగుల మార్క్‌ను దాటకపోవడం గమనార్హం.నిస్సాంక (19), రాహుల్ (12), నితీశ్‌రానా (15), కరుణ్ నాయర్ (13).. ఈ నలుగురు 20 పరుగుల్లోపే ఔటయ్యారు. ఇలా ఒక మ్యాచ్‌లో టాప్ నలుగురు బ్యాటర్లు డబుల్ డిజిట్ మార్క్‌ను అందుకున్నప్పటికీ 20 పరుగులు దాటకపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. మొదటిసారి కూడా ఈ ఫీట్‌ను సాధించింది ఢిల్లీ జట్టే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. 2011లో కొచ్చి టస్కర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున టాప్ నలుగుల బ్యాటర్లు సెహ్వాగ్ (15), వార్నర్ (13), నమన్ ఓజా (13), యోగేశ్ నగర్ (18) 20 పరుగుల మార్క్ దాటకుండానే ఔటయ్యారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (40 నాటౌట్), స్టబ్స్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్‌లు తలా ఒక వికెట్ తీశారు. అయితే టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. చదవండి: తృణముల్ చాప్టర్ ముగిసింది: మాజీ క్రికెటర్ -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ శాంసన్ (87 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విజయం దిశగా సీఎస్కేఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే విజయం దిశగా కొనసాగుతోంది. 16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. శాంసన్ (84), కార్తిక్ శర్మ (23) పరుగులతో క్రీజులో ఉన్నారు. శాంసన్ హాఫ్ సెంచరీ.. సీఎస్కే 96/2ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 32 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న శాంసన్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్కే 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే8 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. శాంసన్ (22), కార్తిక్ శర్మ (5) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 17 పరుగులు చేసిన ఉర్విల్ పటేల్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది.రుతురాజ్ ఔట్..ఆరు పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎన్గిడి బౌలింగ్‌లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సీఎస్కే 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. శాంసన్ (10), గైక్వాడ్ (6) పరుగులతో ఆడుతున్నారు.సీఎస్కే టార్గెట్ 156 పరుగులుసీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (40 నాటౌట్), స్టబ్స్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్‌లు తలా ఒక వికెట్ తీశారు. అయితే టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (30), సమీర్ రిజ్వీ (16) పరుగులతో ఆడుతున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీసీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ల పరంపర కొనసాగుతోంది. 2 పరుగులు చేసిన కెప్టెన్ అక్షర్ పటేల్ గుర్జ్ప్నీత్ సింగ్ బౌలింగ్‌లో అకిల్ హొసేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (4), ట్రిస్టన్ స్టబ్స్ (12) పరుగులతో ఆడుతున్నారు.4 వికెట్లు డౌన్‌నితీశ్ రాణా, కరుణ్ నాయర్ ఔటయ్యారు. నితీశ్ రాణా 15 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో కార్తీక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కరుణ్ నాయర్ 13 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో గుర్జప్నీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.కేఎల్ రాహుల్ ఔట్..12 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ అకిల్ హొసేన్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది.తొలి వికెట్ డౌన్సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన పాతుమ్ నిస్సాంక ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రాహుల్ (10) క్రీజులో ఉన్నాడు.టాస్ నెగ్గిన ఢిల్లీ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కైల్ జేమీసన్ స్థానంలో లుంగి ఎన్గిడి జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్కే రెండు మార్పులు చేసింది. అకిల్ హొసేన్, గుర్జప్నీత్ సింగ్ జట్టులోకి వచ్చారు. సీజన్ తొలి అంచె పోటీలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయాన్ని అందుకుంది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంతగడ్డపై చెన్నైని ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో మాత్రం చెన్నై సూపర్‌కింగ్స్‌దే పైచేయి. 32 మ్యాచ్‌ల్లో 20 సార్లు సీఎస్కే, 12 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. 2022 నుంచి చూసుకుంటే సీఎస్కే నాలుగుసార్లు నెగ్గితే, ఢిల్లీ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, లుంగీ ఎంగిడి, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్.చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్. -
బీసీసీఐపై కేఎల్ రాహుల్ ఆగ్రహం!
ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బాంబు పేల్చాడు. టీ20 క్రికెట్లో తనకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండేవి కావని తెలిపాడు. బీసీసీఐ తనను టీ20 క్రికెట్లో ఎప్పుడూ ఆటగాడిగా పరిగణించలేదని, కేవలం ఒక టెస్టు ప్లేయర్‌గానే తనపై ముద్ర వేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్‌స్టార్‌కు చెందిన సూపర్‌స్టార్స్ షోలో కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ‘పదేళ్ల క్రితం టీ20 జట్టులో భాగం కావడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ నన్ను ఎప్పుడూ ఒక టీ20 ఆటగాడిగా పరిగణించలేదు. కనీసం ఒక మంచి వైట్‌బాల్ ఆటగాడిగా కూడా చూడలేదు. కేవలం ఒక టెస్టు ప్లేయర్‌గానే నాపై ముద్రను వేశారు. అయితే ఐపీఎల్ ద్వారా టెస్టు ప్లేయర్ అనే ముద్ర నుంచి బయటపడి వైట్‌బాల్ క్రికెట్లో నా ఆటను మరింత మెరుగుపరుచుకొని ఇవాళ ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉంది.అయితే ఈ ప్రయాణంలో ఎన్నో తప్పులు చేసినప్పటికీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశాను. జట్టుకు ఆడినప్పుడల్లా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఫలితంతో సంబంధం లేకుండా నా ఆటను నేను ఆడుకుంటూ సమతుల్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. అయితే ఆటగాడిగా నాకు ఇంకా సమయం మిగిలి ఉంది. కాబట్టి నేను నా వంతుగా జట్టుకు తరఫున మ్యాచ్‌లు ఆడుతూ స్కోర్లు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక గతేడాది నేను తండ్రి కావడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ కొత్త పాత్ర నా క్రికెట్ కెరీర్‌కు కూడా ఎంతో సహాయపడింది. నా కూతురు నవ్వినప్పుడు అప్పటివరకు నేను బాధపడిన క్షణాలన్నీ మాయమౌతాయి.’ అని చెప్పుకొచ్చాడు.ఇక కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. సూపర్‌ఫామ్‌లో ఉన్న రాహుల్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ 64 బంతుల్లోనే 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో రికార్డు సృష్టించాడు. అంతేకాదు సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ 9 మ్యాచ్‌ల్లో 433 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2022లో టీమిండియా తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ అప్పటినుంచి కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు.చదవండి: మాట తప్పిన రిషబ్ పంత్! -
భారీ వర్షం.. ఢిల్లీ-సీఎస్కే మ్యాచ్‌పై అనిశ్చితి
ఐపీఎల్ 2026లో ఇవాళ (మే 5) కీలక సమరం జరగాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే పరిస్థితి ఉంది. మ్యాచ్‌కు కొన్ని గంటలకు ముందు (సాయంత్రం 4 గంటల ప్రాంతంలో) ఢిల్లీలో భారీ వడగండ్ల వాన కురిసింది.మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మొదలైన వర్షం తీవ్రరూపం దాల్సింది. దీంతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనిశ్చితి నెలకొంది. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు కూడా వాతావరణం ప్రతికూలంగానే ఉండటంతో వాష్ ఔట్ అయ్యే ప్రమాదం ఉందని అంచనా. It's delhi at 3.15 pm not Manali #weather pic.twitter.com/kB9JwzVkeJ— vipul kashyap (@kashyapvipul) May 5, 2026ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైతే ప్లే ఆఫ్స్ బెర్త్‌పై భారీ ఆశలు పెట్టుకున్న ఇరు జట్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రస్తుతం సీఎస్కే, ఢిల్లీ తలో 9 మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలతో 8 పాయింట్లతో పట్టికలో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఢిల్లీతో పోలిస్తే సీఎస్కే రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించబడుతుంది. అప్పుడు ఇరు జట్లకు అది సంకటంగా మారే ప్రమాదం ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు రంజుగా సాగుతుంది. 13 పాయింట్లతో పంజాబ్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్, గుజరాత్ తలో 12 పాయింట్లతో వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నాయి. సీఎస్కే, ఢిల్లీ తలో 8 పాయింట్లతో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న కేకేఆర్, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్ సైతం తాజాగా ఓ విజయం సాధించి అధికారికంగా రేసులో కొనసాగుతుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా వదులుకున్న జట్టు ఏదైనా ఉందా అంటే, అది లక్నో మాత్రమే. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. అధికారికంగా రేసులో ఉన్నప్పటికీ.. అది జరిగే పని కాదు. -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఊదిపడేసింది. ఢిల్లీకి ఛేజింగ్ పరంగా ఇదే అతి పెద్ద విజయం. ఈ రికార్డు విజయంలో కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), పతుమ్ నిసాంక (33 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు)లది కీలక పాత్ర. వీరిద్దరూ తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు.ఆ తర్వాత నిస్సాంక ఔటైనప్పటికి రాహుల్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఆ తర్వాత ఆశుతోష్, స్టబ్స్ మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక హాఫ్ సెంచరీతో సత్తాచాటిన రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ ఓపెనర్‌గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఓపెనర్‌గా రాహుల్ ఖాతాలో 202 సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి(192) ఉన్నారు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఓపెనర్లుకేఎల్ రాహుల్ - 202* సిక్సర్లువిరాట్ కోహ్లీ - 192 సిక్సర్లురోహిత్ శర్మ - 148 సిక్సర్లుశిఖర్ ధావన్ - 143 సిక్సర్లుశుభమాన్ గిల్ - 129 సిక్సర్లుఅదేవిధంగా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న జాబితాలో రాహుల్ నాలుగో స్ధానంలో జడేజా సరసన నిలిచాడు. ఈ లిస్ట్‌లో రోహిత్ శర్మ(21) అగ్రస్ధానంలో ఉన్నాడు.అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఇండియన్స్ వీరే21 - రోహిత్ శర్మ20 - విరాట్ కోహ్లీ18 - ఎంఎస్ ధోని17 - రవీంద్ర జడేజా17 - KL రాహుల్* -
చెలరేగిన రాహుల్.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ
264 పరుగులు చేసినా ఓడిపోయె... ఆపై 75 పరుగులకు కుప్పకూలె... అటు బ్యాటర్లు, ఇటు బౌలర్ల పేలవ ప్రదర్శన... టీమ్‌లో గందరగోళ స్థితిలో వరుసగా మూడు ఓటములు... ఇలాంటి స్థితిలో స్థైర్యం కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎట్టకేలకు ఒక విజయంతో ఊరట లభించింది. సమష్టి ప్రదర్శనతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించడంలో సఫలమైంది. మరోవైపు గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 223 పరుగుల లక్ష్యాన్ని అందుకొని సత్తా చాటిన రాజస్తాన్ ఈసారి 225 పరుగుల స్కోరును నిలబెట్టుకోలేకపోయింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలక విజయం దక్కింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కెపె్టన్ రియాన్ పరాగ్ (50 బంతుల్లో 90; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ అవకాశం కోల్పోగా... ధ్రువ్ జురేల్ (30 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 59 బంతుల్లో 102 పరుగులు జోడించారు. చివర్లో డొనొవాన్ ఫెరీరా (14 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరు సాధించింది. అనంతరం ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 226 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), పతుమ్ నిసాంక (33 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 110 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. ఫెరీరా దూకుడు... ఆసీస్ దిగ్గజ బౌలర్ స్టార్క్ ఈ సీజన్లో తొలిసారి ఐపీఎల్లో బరిలోకి దిగాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే యశస్వి జైస్వాల్ (6) సిక్స్ కొట్టినా... మూడో బంతికే వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో జేమీసన్ పదునైన యార్కర్‌తో వైభవ్ సూర్యవంశీ (4) ఆట ముగించాడు. ఈ దశలో జురేల్, పరాగ్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జేమీసన్ ఓవర్లో పరాగ్ వరుసగా 6, 4, 6 కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. అక్షర్ ఓవర్లోనూ రెండు వరుస సిక్స్‌లు బాదిన అతను 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. జురేల్‌ను అక్షర్ వెనక్కి పంపగా, రవీంద్ర జడేజా (20) ప్రభావం చూపలేదు. జేమీసన్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన పరాగ్ 90కి చేరుకున్నాడు. అయితే తర్వాతి ఓవర్ వేసిన స్టార్క్... జడేజా, పరాగ్‌లను వెనక్కి పంపించాడు. 17 ఓవర్లలో జట్టు స్కోరు 173/5. అయితే చివరి 3 ఓవర్లలో ఫెరీరా చెలరేగిపోవడంతో రాజస్తాన్ 52 పరుగులు రాబట్టింది. కుల్దీప్ ఓవర్లో 3 సిక్సర్లు బాదిన అతను, స్టార్క్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టాడు. నటరాజన్ వేసిన ఆఖరి ఓవర్లోనూ 2 సిక్స్‌లు, ఫోర్‌తో సత్తా చాటాడు. మెరుపు ఆరంభం... ఛేదనలో ఢిల్లీకి నిసాంక, రాహుల్ సరైన ఆరంభాన్ని అందించారు. ఆర్చర్ తొలి 2 ఓవర్లలో వీరిద్దరు కలిసి 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 పరుగులు రాబట్టారు. బర్గర్ తొలి ఓవర్లో రాహుల్ 2 ఫోర్లు కొట్టగా, తర్వాతి ఓవర్లో నిసాంక 2 సిక్స్‌లు బాదాడు. పవర్‌ప్లేలో జట్టు 70 పరుగులు చేయగా, 23 బంతుల్లో నిసాంక అర్ధసెంచరీ సాధించాడు. ఆ తర్వాత బిష్ణోయ్ ఓవర్లోనూ రాహుల్ ఫోర్, 2 సిక్స్‌లతో చెలరేగాడు. శతక భాగస్వామ్యం తర్వాత నిసాంకను అవుట్ చేసి జడేజా ఈ జోడీని విడదీయగా, 27 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు నితీశ్ రాణా (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించాడు. రాహుల్, రాణా ఆరు పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది. అయితే అశుతోష్ శర్మ (15 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (11 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 24 బంతుల్లో అభేద్యంగా 49 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. -
రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు
రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు226 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ తొలి బంతి నుంచే గెలుపుపై కసితో ఆడింది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (62), కేఎల్ రాహుల్ (75) అద్భుతమైన అర్ద సెంచరీలతో జట్టు గెలుపుకు గట్టి పునాది వేశారు. అనంతరం నితీశ్ రాణా (33), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్), అశుతోష్ శర్మ (26 నాటౌట్) తమవంతు పాత్రలు పోషించి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. 19.1 ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. నిస్సంక హాఫ్ సెంచరీ6 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 70-0గా ఉంది. నిస్సంక (50), కేఎల్ రాహుల్ (19) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ భారీ స్కోర్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ తమ నిర్ణయానికి న్యాయం చేస్తూ భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. రియాన్‌కు కాసేపు జురెల్ (42) సహకరించారు. ఆఖర్లో డొనొవన్ ఫెరియెరా గత మ్యాచ్ తరహాలో చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4), షుభమ్ దూబే (6) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (20) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో రాణించగా.. జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలో వికెట్ తీశారు. రియాన్ పరాగ్ (90) ఔట్16.4వ ఓవర్- సెంచరీకి చేరువైన తరుణంలో భారీ షాట్ ఆడబోయి రియాన్ పరాగ్ (90) ఔటయ్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 173-5గా ఉంది.జురెల్ (42) ఔట్11.4వ ఓవర్- 114 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి జురెల్ (42) ఔటయ్యాడు.సూర్యవంశీ (4) ఔట్1.5వ ఓవర్- జేమీసన్ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో బంతికే వికెట్ కోల్పోయిన రాజస్థాన్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ మూడో బంతికే వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో యశస్వి జైస్వాల్‌ను (6) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే జైస్వాల్ సిక్సర్ బాదాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరుగుతున్న 43వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. జైపూర్‌లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు..ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ -
రూ.30 లక్షలు పెట్టి కొన్నారు.. ఒక్క చాన్స్ ఇవ్వట్లేదు!
శ్రీకాకుళం: జిల్లాకు చెందిన స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్లో అడుగుపెట్టినప్పటికీ.. మైదానంలో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) తరఫున విజయ్ వరుసగా రెండో ఏడాది ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. ఒకే ఒక్క ఛాన్స్..! అన్నట్టుగా ఒక్క మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యువ ఆల్‌రౌండర్.. అవకాశం లభించిన మ్యాచ్‌లో ఆకట్టుకునేందుకు నిరీక్షిస్తున్నాడు. డీసీ ఆడే తన తదుపరి మ్యాచ్‌లో అవకాశం లభించవచ్చని భావిస్తున్నాడు. రూ.30 లక్షలకు కొనుగోలు.. పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతునప్పటికీ.. గత మూడేళ్లగా నిలకడైన ఆటతీరుతో ఆల్‌రౌండర్‌గా రాణింపుతో అందరి దృష్టిని ఆకర్షించిన త్రిపురాన విజయ్.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సెలక్షన్స్ ట్రయల్స్‌లో పాల్గొని రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేయడం విజయ్‌లోని అదనపు క్వాలిటీ. వీటికి ముందు కుచ్‌బిహార్ ట్రోఫీ, విజయ్‌హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ క్రికెట్ టోరీ్నలు, ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)లు, రంజీల్లో రాణించడంతో బీసీసీఐ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో ఐపీఎల్లో ఛాన్స్ వచ్చింది. ఇటీవల ముగిసిన టోర్నీల్లో రాణించడంతో డీసీ విజయ్ను అట్టిపెట్టుకుంది. నిరూపించుకుంటాడు: జెడ్‌సీఎస్ ఒక్క అవకాశం వస్తే.. విజయ్ నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని జిల్లా క్రికెట్ సంఘం (జెడ్‌సీఎస్) ప్రతినిధులు, జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షులు పెద్దలు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, డాక్టర్ రవికుమార్, కోచ్‌లు, సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు. విజయ్‌ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాదికి మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లు ఐపీఎల్ రేసులో నిలిచేందుకు ఉవి్వల్లూరుతున్నారని అంటున్నారు. జిల్లా నుంచి ఒకే ఒక్కడు.. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొదటి క్రికెటర్‌గా త్రిపురాన విజయ్ ఇప్పటికే గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాణ వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. నిరూపించుకుంటా.. ఐపీఎల్‌కు ఎంపిక కావడం గర్వకారణంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా రెండో ఏడాది ఆడుతుండటం, కేఎల్, అక్షర్, కుల్దీప్, వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లతో కలిసి ట్రావెల్ చేస్తుండటం కొత్తగా ఉంది. ఐపీఎల్‌కు ఇప్పటి వరకు డీసీ 8 మ్యాచ్‌లు ఆడింది. ఫైనల్ లెవన్ ఛాన్స్ రాలేదు. డీసీ మ్యాచ్‌లు ఇంకా చాలా ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది. మున్ముందు మ్యాచ్‌ల్లో రిజర్వ్బెంచ్లను కూడా పరీక్షించాలనే ఆలోచన మేనేజ్మెంట్, కోచ్‌లు ఆలోచన చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో కఠోర సాధన చేస్తున్నాను. అవకాశం వచ్చిన మ్యాచ్‌ల్లో నన్ను నేను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. – త్రిపురాణ విజయ్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, ఆంధ్రా రంజీ ఆటగాడు -
‘కేఎల్ రాహుల్‌పై విషం చిమ్మడం ఆపండి!’
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్ విధ్వసంకర సెంచరీతో పంజాబ్‌పై భారీ స్కోరు చేసినప్పటికీ, ఆ మ్యాచ్‌ను కూడా కాపాడుకోవడంలో ఢిల్లీ క్యాపిటల్స్ విఫలమైంది. అయితే పంజాబ్‌తో మ్యాచ్‌లో 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే కేఎల్ రాహుల్ స్ట్రైకింగ్ తీసుకోకుండా డెబ్యు ఆటగాడు సాహిల్ పరాక్కు చాన్స్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయితే కేఎల్ రాహుల్‌కు భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ అండగా నిలబడ్డాడు. ‘ఆర్సీబీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్.. డెబ్యూ ఆటగాడు సాహిల్ పరాక్కు స్ట్రైక్ ఇవ్వడంపై కొంతమంది జర్నలిస్టులు విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. అయితే సాహిల్ పరాక్ టెయిలెండర్ కాదు, అతడొక బ్యాటర్. అందుకే అతడిని ఓపెనర్‌గా ఎంచుకున్నారు. ఈ విషయం తెలియక రాహుల్‌ను అకారణంగా తిడుతున్నారు. పిచ్ పరిస్థితులపై అవగాహనలేమి ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరుకు కారణమయ్యింది. కానీ కేఎల్ రాహుల్ ఏదో తప్పు చేసినట్లు అందరూ అతడిపై క్రూరత్వం ప్రదర్శించడమేంటనేది నాకు అర్థం కావడం లేదు. అతడిపై విషం చిమ్మడం ఆపండి’ అని చెప్పు కొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను మే1న రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఇక దొడ్డ గణేశ్ టీమిండియా తరఫున ఒక వన్డే, నాలుగు టెస్టులు ఆడాడు.Saw a couple of journalists’ tweet yesterday where they blamed KL Rahul for exposing the debutant from ball one.FYI guys, that kid is no tail ender; he’s a proper batter and that’s why he was chosen to open. Can’t understand this toxicity around KL Rahul #IPL2026— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) April 28, 2026చదవండి: భారత్‌కు తప్పని చైనా గండం! -
ధోని వల్లేనా?.. నోర్ముయ్.. ముందు నీ సంగతి చూసుకో!
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 265 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది ఢిల్లీ. తాజాగా సోమవారం నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఘోర పరాభవం పాలైంది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీకి ఐపీఎల్లో ఇది మూడో అత్యల్ప స్కోరు. అభిషేక్ పొరేల్ (33 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఒక్కడే పోరాడగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.బ్యాటర్లకు చుక్కలు‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజల్‌వుడ్ (4/12), భువనేశ్వర్ కుమార్ (3/5) అద్భుత బౌలింగ్‌తో క్యాపిటల్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అనంతరం బెంగళూరు 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో పాతుమ్ నిస్సాంక స్థానంలో ఢిల్లీ ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన సాహిల్ పరేఖ్‌కు చేదు అనుభవమే మిగిలింది.ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఢిల్లీ హెడ్‌కోచ్ హేమంగ్ బదానీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గురించి మాట్లాడిన బదానీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడో చూడాలని ఉందన్నాడు.నోర్ముయ్.. నీ సంగతి చూసుకో ముందు!‘‘హేయ్ హేమంగ్.. ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నీ జట్టు ఎలా ఆడుతుందో చూడు. ఆ తర్వాత వేరేవాళ్ల గురించి మాట్లాడు. ఎక్కువగా మాట్లాడేవాళ్లు పెద్ద గొప్పేమీ కాదని నేను తరచూ చెబుతూ ఉంటాను.ఎంఎస్ ధోని వల్లే అతడు గెలిచాడా?అయితే, బదానీ చాలా ఎక్కువగా మాట్లాడేస్తాడు. కానీ ఇప్పుడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు అతడిని విమర్శిస్తున్నారు. నిజానికి నువ్వు ఇతరుల గురించి మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటే బాగుండేది. ఆరోజు స్టీఫెన్ ఫ్లెమింగ్ గురించి ఏమన్నావో గుర్తుందా? ఎంఎస్ ధోని వల్లే అతడు గెలిచాడా?మరి నువ్వేం చేశావు? ఏమీ లేదు కదా!.. అయినా పృథ్వీ షా ఉండగా.. కేఎల్ రాహుల్‌కు ఓపెనింగ్ జోడీగా సాహిల్‌ను తీసుకువస్తావా?’’ అంటూ చిక్కా మండిపడ్డాడు. కాగా క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రస్తావన ప్రకారం.. గతంలో హేమంగ్ బదానీ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను ఉద్దేశించి..ఫ్లెమింగ్ మంచి కోచ్ కాదు‘‘ఫ్లెమింగ్ అంత పెద్ద కోచా? అలా అయితే, ఐపీఎల్ కాకుండా ఇతర టీ20 లీగ్‌లలో అతడు ఎందుకు విజయవంతం కావడం లేదు? ధోని వల్లే చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తోంది. ఆ జట్టులో అంతా ధోనినే. ఫ్లెమింగ్ మంచి కోచ్ అని ఎవరైనా అంటే నేను మాత్రం అందుకు అస్సలు అంగీకరించను’’ అని అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిక్కా బదానీకి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.చదవండి: PSL: డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు! -
‘తుదిజట్టులో దండుగ.. అదృష్టం కోసమే అతడిని ఆడిస్తున్నారు’
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి అదరగొట్టింది. ఐపీఎల్-2026లో భాగంగా సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించింది. ఆతిథ్య జట్టును 75 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ.. వికెట్ నష్టపోయి కేవలం 39 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.భువీ, హాజిల్‌వుడ్ విశ్వరూపంతద్వారా ఈ సీజన్లో ఆర్సీబీ ఎనిమిదింట ఆరో విజయం నమోదు చేసింది. ఢిల్లీతో మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భువీ మూడు ఓవర్లలో కేవలం ఐదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చగా.. హాజిల్‌వుడ్ 3.3 ఓవర్లలో 12 రన్స్ ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.రొమారియో షెఫర్డ్ మాత్రంమిగిలిన వారిలో రసిఖ్ సలామ్ ధర్, సూయశ్ శర్మ, కృనాల్ పాండ్యా (Krunal Pandya) తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఓవైపు వీళ్లంతా అదరగొడితే.. ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ మాత్రం రెండు ఓవర్లలోనే 21 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.జట్టుకు భారంగాగతేడాది ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంలో రొమారియో షెఫర్డ్ తన వంతు పాత్ర పోషించాడు. బ్యాట్, బంతితో రాణించి జట్టు తొలిసారి ట్రోఫీ గెలిచేందుకు సాయపడ్డాడు. కానీ ఈ సీజన్లో మాత్రం షెఫర్డ్ తేలిపోతున్నాడు. ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్ ఆడి కేవలం 39 పరుగులు చేసిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. కేవలం మూడు వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ రొమారియో షెఫర్డ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అతడు దండుగ అని.. కేవలం అదృష్టంగా భావించి మాత్రమే తుదిజట్టులో చోటు ఇస్తున్నారని చిక్కా అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో చోటు దండుగఈ మేరకు.. ‘‘ఆర్సీబీ బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉంది. అయితే, అందరిలోకెళ్లా రొమారియో షెఫర్డ్ ఒక్కడే వీక్ లింక్. అసలు ఆర్సీబీ అతడిని తుదిజట్టులో ఎందుకు ఆడిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు.బహుశా అతడిని లక్కీ చార్మ్‌గా భావిస్తున్నట్లున్నారు. గతేడాది.. తొలిసారిగా ట్రోఫీ గెలిచినపుడు అతడు జట్టులోనే ఉన్నాడు కదా!.. కాబట్టి కేవలం అదృష్టం కోసం మాత్రమే అతడిని ఆడిస్తున్నారు. లేదంటే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడికి చోటే దండుగ’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. కాగా వెస్టిండీస్ స్టార్ రొమారియో షెఫర్డ్‌ను ఆర్సీబీ రూ. 1.5 కోట్లకు రిటైన్ చేసుకుంది.చదవండి: PSL: డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు! -
IPLల్లో ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం
-
‘కనీసం ఒక్క బ్యాటర్ ఆడినా కథ వేరుగా ఉండేది’
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్‌లో ఘోర పరాభవంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. అసలేం జరిగిందో తనకు ఇంకా అర్థం కావడం లేదని.. ఇంకా షాక్ నుంచి కోలుకోలేదని తెలిపాడు. ఐపీఎల్-2026లో భాగంగా సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ సోమవారం ఆర్సీబీతో తలపడింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అక్షర్ సేన.. 75 పరుగులకే కుప్పకూలింది. 1/0, 2/2, 3/2, 4/7, 5/7, 6/8... ఒక్కో వికెట్ పడుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లు ఇవి. టాప్–6 బ్యాటర్లంతా వరుసగా 0, 1, 1, 0, 5, 0 పరుగులతో చేతులెత్తేశారు... భువనేశ్వర్, హాజల్‌వుడ్ నిప్పులు చిమ్ముతుండగా సొంతగడ్డపై ఢిల్లీ విలవిల్లాడింది. టెస్టు మ్యాచ్‌ను తలపించేలాటెస్టు మ్యాచ్‌ను తలపించేలా బంతి అద్భుతంగా స్వింగ్ అవుతుండగా ఇద్దరు పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ఆడుకున్నాడు. తొలి 23 బంతుల్లో ఢిల్లీ 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా, ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు (49) నమోదు కావడం ఖాయమనిపించింది. అయితే, అభిషేక్ పొరేల్ పట్టుదలతో ఎలాగోలా ఆ మార్క్‌ను అధిగమించినా ఢిల్లీ చివరకు 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్సీబీకి కేవలం 39 బంతులు సరిపోయాయి. ఒక వికెట్ కోల్పోయి పని పూర్తి చేసిన ఆర్సీబీ ఢిల్లీపై తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఇప్పటికీ అర్థం కావడం లేదుఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ స్పందిస్తూ.. ‘‘అసలేం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందుకే టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము అంటారు. ఏదేమైనా మేమే ఈ పరాభవం నుంచి కోలుకుని ముందుకు సాగాల్సి ఉంది.ఐపీఎల్ చాలా కఠినమైన టోర్నమెంట్. ఒక్కరోజులోనే అంతా తారుమారై పోవచ్చు. ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగ్గా రాణిస్తేనే రేసులో ఉంటాము. అయితే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేము. ప్రతికూల ఆలోచనలతో ఉంటే తదుపరి మ్యాచ్‌పై కూడా ఆ ప్రభావం పడుతుంది.మా బ్యాటర్లను తప్పు పట్టాల్సిన పనిలేదుఈరోజు మాది కాదు. మా జట్టుతో కూడా ఇదే మాట చెబుతాను. ఈరోజు మా బ్యాటర్ల వైపు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి జట్టులో వరల్డ్‌క్లాస్ బౌలర్లు ఉన్నారు. వాళ్లు ఎక్కడైనా బంతిని స్వింగ్ చేయగలరు. కాబట్టి మా పవర్‌ప్లేలో వాళ్లు వికెట్లు తీసిన తీరు నన్ను పెద్దగా ఆశ్చర్యపరచలేదు.Done in style, Done with conviction ✅✅@rcbtweets claim 2️⃣ points registering a record chase in New Delhi 🔥Scorecard ▶️ https://t.co/HIiNNEutP0#TATAIPL | #KhelBindaas | #DCvRCB pic.twitter.com/IWcxJ3PLkV— IndianPremierLeague (@IPL) April 27, 2026 ఏదేమైనా మా ఓపెనర్లు, లేదంటే టాపార్డర్‌లో కనీసం ఒక్క బ్యాటర్ అయినా క్రీజులో కుదురుకుని ఉంటే కథ కాస్త వేరుగా ఉండేది. ఏదేమైనా క్రెడిట్ ఆర్సీబీ బౌలర్లకు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాడు. ఈ అవమానకర ఓటమి నుంచి కోలుకుని తాము ముందుకు సాగుతామని అక్షర్ పటేల్ ఈ సందర్భంగా తెలిపాడు.చదవండి: అటు కోహ్లి... ఇటు అజితేశ్... ప్లేయర్, అంపైర్‌గా నాటి సహచరులు -
చెలరేగిన బౌలర్లు.. ఢిల్లీని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) జరిగిన 39వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3-0-5-3), హాజిల్‌వుడ్ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్‌కు రసిక్ (2-0-21-1), సుయాశ్ (4-1-7-1), కృనాల్ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది.ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్ పోరెల్ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్ మిల్లర్ (19), జేమీసన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, నితీశ్ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్ 5, కుల్దీప్ 3 పరుగులు చేశారు.అనంతరం ఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్ బేతెల్ ఔట్ కాగా.. పడిక్కల్ (34 నాటౌట్), విరాట్ కోహ్లి (23 నాటౌట్) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్ వికెట్ జేమీసన్‌కు దక్కింది. -
చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పిచ్ ఆది నుంచి పేసర్లకు అనుకూలంగా మారడంతో ఆర్సీబీ బౌలర్లు హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్‌లు చెలరేగిపోయారు. చెరో మూడు ఓవర్లు వేసిన ఈ ఇద్దరు చెరో మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకోవడం విశేషం. బంతి అనూహ్యంగా బౌన్స్, స్వింగ్ అవ్వడంతో 10 పరుగుల్లోపే ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. ఇంత చెత్త ఆటలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో సౌతాఫ్రికా క్రికెటర్‌గా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. 11 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు మిల్లర్ ఈ ఘనత సాధించాడు. మిల్లర్ టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేయడానికి 565 మ్యాచ్‌లు (513 ఇన్నింగ్స్‌లు) తీసుకున్నాడు. మిల్లర్ కంటే ముందు క్వింటన్ డికాక్ (12,454 పరుగులు), పాఫ్ డుప్లెసిస్ (12,041 పరుగులు) ఈ ఫీట్ అందుకున్నారు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న 13వ బ్యాటర్‌గా మిల్లర్ నిలిచాడు. ఇక టీ20ల్లో మిల్లర్ 56 సార్లు ఫిఫ్టీ మార్క్ సాధించాడు. నాలుగుసార్లు సెంచరీలు బాదాడు. ఇక 2012లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మిల్లర్ ఇప్పటివరకు 149 మ్యాచ్‌లాడి 3,100 పరుగులు చేశాడు. సెంచరీ సహా 14 అర్థశతకాలు చేశాడు. అయితే ఈ పద్నాలుగింటిలో 13 హాఫ్ సెంచరీలను మిల్లర్ లక్ష్యఛేదనలో సాధించడం మరో విశేషం. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ 3 వికెట్లు తీశారు.𝐀 𝐟𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐫. 𝐀 𝐟𝐢𝐠𝐡𝐭𝐞𝐫. 𝐀 𝐓𝟐𝟎 𝐠𝐫𝐞𝐚𝐭 💪🔥1️⃣2️⃣0️⃣0️⃣0️⃣ runs of pure impact 💣🏏David Miller continues to deliver in crunch moments, cementing his legacy as one of the finest finishers in T20 cricket 👏👑#IPL2026 I #DavidMiller pic.twitter.com/pgKR8OEuGn— CricTracker (@Cricketracker) April 27, 2026చదవండి: అమ్మాయి చేసిన పనికి అభిషేక్ శర్మ షాక్! -
ఆర్సీబీ ఘన విజయం
ఆర్సీబీ ఘన విజయంఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్ బేతెల్ ఔట్ కాగా.. పడిక్కల్ (34 నాటౌట్), విరాట్ కోహ్లి (23 నాటౌట్) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్ వికెట్ జేమీసన్‌కు దక్కింది. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ2.5వ ఓవర్- 76 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్‌లో నటరాజన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జేకబ్ బేతెల్ (20) ఔటయ్యాడు. 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3-0-5-3), హాజిల్‌వుడ్ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్‌కు రసిక్ (2-0-21-1), సుయాశ్ (4-1-7-1), కృనాల్ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్ పోరెల్ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్ మిల్లర్ (19), జేమీసన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, నితీశ్ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్ 5, కుల్దీప్ 3 పరుగులు చేశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ12.3వ ఓవర్- 62 పరుగుల వద్ద ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో జేమీసన్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఏడో వికెట్ డౌన్8.6వ ఓవర్- 43 పరుగుల వద్ద ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. రసిక్ సలాం బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (19) ఔటయ్యాడు.ఆరో వికెట్ డౌన్3.5వ ఓవర్- ఆర్సీబీ పేసర్లు చెలరేగిపోతున్నారు. 8 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో నితీశ్ రాణా (1) ఔటయ్యాడు. 7 పరుగులకే సగం వికెట్లు డౌన్2.4వ ఓవర్- 7 పరుగుల వద్దే ఢిల్లీ ఐదో వికెట్ కూడా కోల్పోయింది. భువీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ () ఔటయ్యాడు. 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ2.1వ ఓవర్- ఢిల్లీ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భువీ బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (5) ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 7 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే భారీ షాక్‌లు తగిలాయి. రెండో బంతికే భువీ సాహిల్ పారఖ్ (0), రెండో ఓవర్ తొలి బంతికే కేఎల్ రాహుల్‌ను (1), రెండో బంతికి సమీర్ రిజ్విని (0) హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) జరుగుతున్న 39వ మ్యాచ్‌లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ రెండో స్థానంలో, ఢిల్లీ ఏడో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఢిల్లీకి ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే. తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): సాహిల్ పరాఖ్, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(సి), దుష్మంత చమీరా, కైల్ జామీసన్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్ -
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. సారీ చెప్పిన స్టొయినిస్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు గిరి ప్రసాద్‌కు గాయమైంది. న్యూఢిల్లీలో శనివారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ కొట్టిన షాట్ నెట్స్ వద్ద ఉన్న గిరి ప్రసాద్ ముఖానికి బలంగా తాకింది. పరామర్శఫలితంగా తీవ్రంగా గాయపడ్డ గిరి ప్రసాద్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేయించింది. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ ఆస్పత్రికి వచ్చి గిరి ప్రసాద్‌ను పరామర్శించారు. సారీ చెప్పిన స్టొయినిస్తన షాట్‌తో గాయపడ్డ గిరి ప్రసాద్‌ను పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ స్టొయినిస్ కూడా వచ్చి పరామర్శించాడు. పొరపాటుగా జరిగిన దానికి క్షమించాలని కోరాడు. యువ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. అనంతరం గిరి ప్రసాద్‌తో సెల్ఫీ దిగిన స్టొయినిస్ టోపీపై తన ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన గిరి ప్రసాద్ గత సీజన్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా ఉన్నాడు.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం -
పంజాబ్ చేతిలో ఓటమిని సహచరులపైకి నెట్టిన అక్షర్ పటేల్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఓటమిని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తన ఫీల్డర్ల ఖాతాలోకి వేశాడు.మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందిస్తూ.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు."మేము మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తున్నాం. ఇలాంటి పిచ్‌పై బౌలర్లకు ఫీల్డర్లు సహకరించకపోతే, ఓడిపోవడమే సరైన ఫలితం" అంటూ కఠినంగా వ్యాఖ్యానించాడు.ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యమే మ్యాచ్‌ను చేజార్చిందని స్పష్టం చేశాడు. కరుణ్ నాయర్ శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు కీలక క్యాచ్‌లను వదిలేయడం జట్టుకు భారీ మూల్యం చెల్లింపజేసిందని అన్నాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అయ్యర్ 36 బంతుల్లో అజేయమైన 71 పరుగులు చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడని తెలిపాడు.అక్షర్ తన బౌలర్లపైనా అసహనం వ్యక్తం చేశాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి పరుగుల వేగాన్ని నియంత్రించడంలో బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నాడు. ఢిల్లీ బౌలర్లందరూ ఓవరుకు 11కి పైగా పరుగులు సమర్పించడం జట్టు పరిస్థితిని మరింత దయనీయంగా మార్చిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.కుల్దీప్ రెండు వికెట్లు తీసినా 46 పరుగులు ఇచ్చాడు. తాను, నటరాజన్, ముకేశ్ కుమార్, ఆకిబ్ నబీ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నామని అన్నాడు. ఈ వికెట్‌పై 264 పరుగుల స్కోర్ చాలా మంచిదని అభిప్రాయపడ్డాడు. లక్ మా పక్షాన ఉండి, క్యాచ్‌లు పట్టుంటే ఈజీగా గెలిచేవాళ్లమని తెలిపాడు. ఈ సీజన్లో మేం ఓడిన మ్యాచ్‌లు చూస్తే చాలా వరకు క్లోజ్ మ్యాచ్‌లు. వాటిలో కొన్ని అవకాశాలను ఓడిసి పట్టుకుని ఉంటే, రెండు-మూడు అదనపు విజయాలు మా ఖాతాలో ఉండేవని అని అభిప్రాయపడ్డాడు. తప్పులు పదేపదే రిపీట్ చేస్తుంటే, అవకాశాలు మళ్లీమళ్లీ రావని అసహనం వ్యక్తం చేశాడు.కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి కేఎల్ రాహుల్ (152 నాటౌట్), నితీశ్ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (43), ప్రభ్‌సిమ్రన్ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్ ఈ సీజన్లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. -
ప్రపంచ రికార్డుపై ‘పంజా’బ్
ఆహా ఏమా మ్యాచ్... ఏమా కొట్టుడు! ఒకరిని మించి ఒకరు వంతులు వేసుకున్నట్లు... ప్రత్యర్థి బౌలర్లపై ఏదో పగ పట్టినట్లు... బంతిమీద ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లు... ఫోర్లు, సిక్స్‌లు ఒకటే మోత! మొదట కేఎల్ రాహుల్, నితీశ్ రాణా దంచి కొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసుకుంటే... పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలుండగానే దాన్నిఊదేసింది.ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టిస్తే... మేమేం తక్కువా అన్నట్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ విశ్వరూపం చూపారు. దీంతో ఐపీఎల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ తమ పేరిటే ఉన్న రికార్డును మరింత మెరుగు పరుచుకుంది. రెండు జట్లు కలిపి 49 ఫోర్లు, 33 సిక్స్‌లు బాదిన ఈ మ్యాచ్‌లో మొత్తం 529 పరుగులు నమోదు కాగా... శనివారం అభిమానులు పైసా వసూల్ పరుగుల పండగను వీక్షించారు.న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ ఖాతాలో ఆరో విజయం చేరింది. శనివారం జరిగిన పోరులో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (67 బంతుల్లో 152 నాటౌట్; 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదం తొక్కగా... నితీశ్ రాణా (44 బంతుల్లో 91; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు.వీరిద్దరు రెండో వికెట్‌కు 220 పరుగులు జోడించడంతో... ఢిల్లీ కొండంత స్కోరు చేయగలిగింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు. ఈ క్రమంలో ఐపీఎల్లో మూడో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 265 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26 బంతుల్లో 76; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 71 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో విజృంభించగా... ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టాడు. రాహుల్ రాక్స్... ఈ సీజన్లో తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆరంభం నుంచే... దూకుడుగా ఆడింది. మూడో ఓవర్లో నిసాంక (11) వెనుదిరగగా... అక్కడి నుంచి రాహుల్, రాణా మోత మొదలైంది. ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ 68/1తో నిలిచింది. ఈ క్రమంలో రాహుల్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... బార్ట్లెట్ వేసిన 12వ ఓవర్లో రాణా వరుసగా 6, 4, 4, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. అర్‡్షదీప్ ఓవర్లో 4, 6, 4, 4 కొట్టిన రాహుల్ యాన్సెన్ ఓవర్లో మరో రెండు ఫోర్లతో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వైశాక్ వేసిన 16వ ఓవర్లో రాహుల్ 6, 6, 6, 4తో విజృంభించాడు. సెంచరీకి సమీపించిన నితీశ్ రాణా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కాగా... రాహుల్ ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 6 ఓవర్లలో 116 పరుగులు కొండంత లక్ష్యం ముందున్నా పంజాబ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ , ప్రభ్‌సిమ్రన్ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించింది. అక్షర్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్స్‌లు ఒక ఫోర్‌తో ఆర్య 20 పరుగులు రాబట్టుకోగా... అఖీబ్ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 3 సిక్స్‌లు బాదాడు. ఐదో ఓవర్లో నటరాజన్ 9 పరుగులే ఇవ్వగా... ముకేశ్ వేసిన ఆరో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 6 ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ 116 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా... శ్రేయస్ మిగిలిన పని పూర్తిచేశాడు. శ్రేయస్ క్యాచ్ మిస్ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఫీల్డింగ్ పేలవంగా సాగింది. విప్రాజ్ నిగమ్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ ఇచ్చిన క్యాచ్‌ను కరుణ్ నాయర్ వదిలేశాడు. అదే ఓవర్లో నేహల్ వధేరా (25; 3 ఫోర్లు, 1 సిక్స్) క్యాచ్‌ను ఒడిసి పట్టిన కరుణ్... శ్రేయస్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటికి పంజాబ్ విజయానికి 31 బంతుల్లో 63 పరుగులు అవసరం కాగా... శ్రేయస్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. తదుపరి ఓవర్ రెండో బంతికి సైతం శ్రేయస్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మరోసారి కరుణ్ నాయర్ జారవిడిచాడు. దీన్ని సది్వనియోగ పరుచుకున్న అయ్యర్... అదే ఓవర్లో 6, 4, 6, 6 కొట్టి సమీకరణాన్ని సులభతరం చేశాడు. నటరాజన్ ఓవర్లోనూ 6, 4 బాదిన శ్రేయస్ 26 బంతుల్లో పిఫ్టీ మార్క్ దాటడంతో పాటు... శశాంక్ సింగ్ (19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.152 ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ చేసిన స్కోరు. ఐపీఎల్లో ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. అభిõÙక్ శర్మ (141) రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా క్రిస్ గేల్ (175; 2013లో), మెక్కల్లమ్ (158; 2008లో) తర్వాత లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ రాహుల్.ఎన్గిడికి గాయం... పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఢిల్లీ ప్లేయర్ ఎన్గిడి గాయపడ్డాడు. మిడాఫ్ ప్రాంతంలో బంతిని క్యాచ్ పట్టే క్రమంలో ఎన్గిడి కిందపడ్డాడు. దీంతో తల బలంగా నేలకు తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య బృందం అతడిని పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో విప్రాజ్ నిగమ్ ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా మైదానంలోకి వచ్చాడు. కాగా మ్యాచ్ అనంతరం ఎన్గిడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది.⇒ 1 ఐపీఎల్లో ఇదే (265) అత్యధిక పరుగుల ఛేదన. 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని చేధించిన పంజాబ్ కింగ్స్... ఇప్పుడు దానికంటే కాస్త ఎక్కువ స్కోరును ఛేదించింది.⇒ 220 రెండో వికెట్‌కు రాహుల్, నితీశ్ రాణా జోడించిన పరుగులు. ఐపీఎల్లో ఏ వికెట్‌కైనా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. 2016లో విరాట్ కోహ్లి–ఏబీ డివిలియర్స్ జోడీంచిన 229 పరుగుల భాగస్వామ్యం ‘టాప్’లో ఉంది.⇒ 2 ఈ మ్యాచ్‌లో పంజాబ్ 5.2 ఓవర్లలో 100 పరుగుల మార్క్ అందుకుంది. ఐపీఎల్లో ఇది రెండో వేగవంతమైంది. 2024లో ఢిల్లీపైనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది. ఓవరాల్‌గా పవర్‌ప్లే (6 ఓవర్లలో) పంజాబ్ 116 పరుగులు చేసి రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ 125తో అగ్ర స్థానంలో ఉంది.స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) అర్‡్షదీప్ 11; రాహుల్ (నాటౌట్) 152; నితీశ్ (సి) శ్రేయస్ (బి) బార్ట్లెట్ 91; మిల్లర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1–28, 2–248. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–49–1; బార్ట్లెట్ 4–0–69–1; యాన్సెన్ 4–0–45–0; వైశాక్ 3–0–48–0; చాహల్ 4–0–42–0; స్టొయినిస్ 1–0–11–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) రిజ్వీ 43; ప్రభ్‌సిమ్రన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 76; కూపర్ (బి) కుల్దీప్ 17; శ్రేయస్ (నాటౌట్) 71; నేహల్ (సి) (సబ్) కరుణ్ (బి) విప్రాజ్ 25; శశాంక్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–126, 2–132, 3–145, 4–201. బౌలింగ్: అఖీబ్ 2–0–41–0; ముకేశ్ 3–0–55–0; అక్షర్ 4–0–44–1; నటరాజన్ 3.5–0–54–0; కుల్దీప్ 4–0–46–2; విప్రాజ్ నిగమ్ 2–0–24–1. -
ఒకే మ్యాచ్‌లో 529 పరుగులు.. 33 సిక్స్‌లు, 49 ఫోర్లతో
ఐపీఎల్-2026లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఎప్పటికీ మర్చిపోలేరు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో మైదానంలో సంతోషం, ఉత్కంఠ, భయం అన్నీ కన్పించాయి.తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్లో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోర్. దీంతో ఢిల్లీ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ యువ ఆటగాళ్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడుతూ ఢిల్లీపై ఒత్తిడి పెంచారు. అయితే ఓ వైపు పంజాబ్ ఓపెనర్లు విధ్వంసం కొనసాగుతుండగా.. మరోవైపు మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ లుంగి ఎంగిడీ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో ఎంగిడీ తలకు బలమైన గాయమైంది. అంబులెన్స్‌లో అతడిని ఆస్పత్రికి తరలించారు.దీంతో మైదానంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. మళ్లీ మ్యాచ్ ప్రారంభమయ్యాక పంజాబ్ విధ్వంసం కొనసాగింది. ఓపెనర్లు ఔటయ్యాక శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఢిల్లీ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది. టీ20 క్రికెట్లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ తమ రికార్డును తామే బ్రేక్ చేసింది.49 ఫోర్లు.. 33 సిక్సర్లు.. 529 రన్స్మొత్తంగా ఈ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. ఇరు జట్లు కలిపి మొత్తంగా 529 పరుగులు చేశాయి. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ బ్యాటర్లు కలిసి 49 ఫోర్లు, 33 సిక్సర్లు బాదారు. కాగా లెక్కలేనన్ని డ్రాప్ క్యాచ్‌లు ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాయి. తొలుత కేఎల్ రాహుల్ క్యాచ్‌ను 12 పరుగుల వద్ద శశాంక్ సింగ్ విడిచిపెట్టాడు.ఫలితంగా రాహుల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు ఈజీ క్యాచ్‌లను కరుణ్ నాయర్ జారవిడిచాడు. దీంతో అయ్యర్ అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.చదవండి: IPL 2026: లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్ అప్డేట్ -
లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్ అప్డేట్
ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పీడ్ స్టార్ లుంగీ ఎంగిడీ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తలకు బలమైన గాయం కావడంతో అతడిని వెంటనే అంబులెన్స్‌లో పూసా రోడ్డులోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎంగిడీ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు ఢిల్లీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, ఆర్సీబీ వంటి ఫ్రాంచైజీలు కూడా ఎంగిడీ త్వరంగా కోలుకోవాలని పోస్ట్‌లు పెట్టారు.అసలేమి జరిగిందంటే?ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన మూడో బంతిని ప్రియాన్ష్ ఆర్య మిడాఫ్ భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతికి గాల్లోకి లేచింది. మిడాఫ్‌లో ఉన్న ఎంగిడీ బంతిని అందుకునేందుకు వెనుకకు పరిగెత్తాడు. బంతిని అందుకు క్రమంలో ఎంగిడీ బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి తల వెనుక భాగం మైదానంకు బలంగా తాకింది. మెడ నొప్పి, తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడికి ఏ మాత్రం రీలీఫ్ రాలేదు. దీంతో మైదానం నుంచి నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. పంజాబ్ రికార్డు ఛేజింగ్ చేసింది. -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతం చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ రికార్డు విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది.తద్వారా టీ20 క్రికెట్లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ తమ రికార్డును తామే బ్రేక్ చేసింది. అంతకముందు ఐపీఎల్-2024 సీజన్లో కేకేఆర్ నిర్ధేశించిన 262 రన్స్ టార్గెట్‌ని పంజాబ్ ఛేజ్ చేసింది.దంచి కొట్టిన పంజాబ్ ఓపెనర్లు265 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్‌ప్లేలోనే ఏకంగా 116 పరుగులు చేసింది.అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. నేహల్ వధేరా (25), శశాంక్ సింగ్ (19 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఫలితంగా ఈ చారిత్రత్మక విజయాన్ని పంజాబ్ విజయాన్ని అందించాడు. అయితే ఈమ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను ఢిల్లీ ఫీల్డర్ కరుణ్ నాయర్ విడిచిపెట్టాడు. దీంతో ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.రాహుల్ సూపర్ సెంచరీతొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు నితీష్ రాణా(44 బంతుల్లో 91) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవేపంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్‌పంజాబ్ కింగ్స్-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్‌సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్‌బ్రిస్బేన్ హీట్-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్ -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ విశ్వరూపం ప్రదర్శించాడు. పంజాబ్ బౌలర్లను కేఎల్ రఫ్పాడించాడు. అరుణ్ జైట్లీ మైదానంలో రాహుల్ బౌండరీల వర్షం కురిపించాడు.అతడు బ్యాటింగ్ ధాటికి పంజాబ్ ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించాల్సి వచ్చింది. రాహుల్‌ను ఔట్ చేయడం ఎవరి తరం కాలేదు. ఈ క్రమంలో రాహుల్ కేవలం 47 బంతుల్లోనే తన ఆరువ ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా కేవలం 67 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ విధ్వంసకర సెంచరీతో రాహుల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రాహుల్ సాధించిన రికార్డులు ఇవే👉ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత క్రికెటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రాహుల్ కంటే ముందు ఏ ఒక్క భారత ఆటగాడు కూడా 150 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఇంతకుముందు వరకు సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ సాధించిన 141 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండేది.👉ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఇది మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోర్. తొలి రెండు స్ధానాల్లో క్రిస్ గేల్ (175*), బ్రెండన్ మెకల్లమ్ (158*) ఉన్నారు.👉ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రాహుల్(47) నిలిచాడు. గతంలో ఈ రికార్డు క్వింటన్ డికాక్(48) పేరిట ఉండేది.👉ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో క్రిస్ గేల్‌తో కలిసి మూడో స్ధానంలో రాహుల్ నిలిచాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లి(8), జోస్ బట్లర్ (7) ఉన్నారు.- 2 HUNDREDS FOR PBKS.- 2 HUNDREDS FOR LSG.- 2 HUNDREDS FOR DC.ONE & ONLY, KL RAHUL 🥶🔥 pic.twitter.com/hCX2PVJfLp— Johns. (@CricCrazyJohns) April 25, 2026 -
లుంగీ ఎంగిడీకి తీవ్ర గాయం.. గ్రౌండ్లోకి అంబులెన్స్
ఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ లుంగీ ఎంగిడీ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో ఎంగిడీ తలకు బలమైన గాయమైంది. పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మూడో బంతిని ప్రియాన్ష్ ఆర్య.. మిడాఫ్ దిశగా షాట్ ఆడాడు.అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. దీంతో మిడాఫ్‌లో ఉన్న ఎంగిడీ వెనుకకు వెళ్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి అతడు వెల్లకిలా పడిపోయాడు. తల వెనుక భాగం మైదానంకు బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ కదలకుండా అలా ఉండిపోయాడు. వెంటనే ఫిజియోలు మైదానంలోకి ప్రాథమిక చికిత్స అందించారు. కానీ గాయం తీవ్రమైనది కావడంతో మైదానంలోకి అంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి తరలించారు. ఎంగిడి మెడకు కూడా తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది.దీంతో అతడు మెడకు 'నెక్ బ్రేస్' అమర్చి జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మైదానం మొత్తం ఒక్కసారి సైలెంట్ అయిపోయింది. ఎంగిడీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.Lungi Ngidi has suffered a serious injury, and for the first time in IPL history, an ambulance has come onto the ground. This looks very serious—possibly a neck fracture, but hopefully it’s nothing that severe. 😱It is also quite shameful for the Arun Jaitley Stadium DJ to play… pic.twitter.com/CrFFc3grvB— Sonu (@Cricket_live247) April 25, 2026 -
ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఘనత
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఘనత సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేసింది. ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.ఆరింట మూడు గెలిచి..వీటిలో మూడు గెలిచిన ఢిల్లీ.. మూడు ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించిన అక్షర్ సేన.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌నూ ఓడించింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఢిల్లీ.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలోనూ ఓటమి పాలైంది.ఆ తర్వాత ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ చివరగా సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ టాస్ గెలిచాడు. తద్వారా ఐపీఎల్లో వరుసగా తొమ్మిదిసార్లు టాస్ గెలిచిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్.. సీఎస్కే, సన్‌రైజర్స్ రికార్డును సమం చేసింది.ఐపీఎల్లో వరుసగా అత్యధికసార్లు టాస్ గెలిచిన జట్లు ఇవేసన్రైజర్స్ హైదరాబాద్- 9 సార్లు (2015-16 సీజన్) చెన్నై సూపర్ కింగ్స్- 9 సార్లు (2019)ఢిల్లీ క్యాపిటల్స్- 9 సార్లు (2025-26 సీజన్)చెన్నై సూపర్ కింగ్స్- 8 సార్లు (2018-19)రాజస్తాన్ రాయల్స్- 8 సార్లు (2023).🚨 TOSS 🚨@DelhiCapitals have won the toss & will bat first against @PunjabKingsIPL in New Delhi.Updates ▶️ https://t.co/0oSkMZgNAV#TATAIPL | #KhelBindaas | #DCvPBKS pic.twitter.com/jKNpfCh1lo— IndianPremierLeague (@IPL) April 25, 2026 -
కేఎల్ రాహుల్ విధ్వంసం.. 47 బంతుల్లో సెంచరీ
ఐపీఎల్-2026లో అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శతక్కొట్టాడు. 12 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పంజాబ్ బౌలర్లను ఉతికారేశాడు.అతడు బ్యాటింగ్ ధాటికి బౌండరీలు చిన్నబోయాయి. ఈ క్రమంలో రాహుల్ కేవలం 47 బంతుల్లోనే తన ఆరువ ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రాహుల్‌కు తన ఐపీఎల్ కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా కేవలం 67 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.రాహుల్‌కు ఇదే ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో రాహుల్‌తో పాటు నితీష్ రాణా (44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది.- 2 HUNDREDS FOR PBKS.- 2 HUNDREDS FOR LSG.- 2 HUNDREDS FOR DC.ONE & ONLY, KL RAHUL 🥶🔥 pic.twitter.com/hCX2PVJfLp— Johns. (@CricCrazyJohns) April 25, 2026 -
DC vs PBKS: ఢిల్లీపై పంజాబ్ కింగ్స్ రికార్డు విజయం
Delhi Capitals vs Punjab kings Updates: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ తమ రికార్డును తామే తిరగరాసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(76), శ్రేయస్ అయ్యర్(71), ప్రియాన్ష్ ఆర్య(43) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(51), శశాంక్ సింగ్(1) ఉన్నారు. పంజాబ్ విజయానికి 34 బంతుల్లో 65 పరుగులు కావాలి.పంజాబ్ మూడో వికెట్ డౌన్పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కూపర్ కానలీ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 147/3పంజాబ్ రెండో వికెట్ డౌన్పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 26 బంతుల్లో 76 పరుగులు చేసిన ప్రబ్సిమ్రాన్ సింగ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.పంజాబ్ తొలి వికెట్ డౌన్126 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.6 ఓవర్లకు పంజాబ్ స్కోరు ఎంతంటే?265 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (38 నాటౌట్), ప్రభ్ సిమ్రన్ (71 నాటౌట్) అద్బుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి పంజాబ్ స్కోర్ కేవలం 6 ఓవర్లలో ఏకంగా 116 పరుగులు దాటేసింది.ఢిల్లీ రికార్డు స్కోరుఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక స్కోరును ఢిల్లీ నమోదు చేసింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 264 పరుగులు సాధించింది. సెంచరీ మిస్18.3: బార్ట్లెట్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన నితీశ్ రాణా. 44 బంతుల్లో 91 పరుగులు చేసిన రాణా. స్కోరు: 248-2(18.3). క్రీజులోకి మిల్లర్. సూపర్ ట్విస్టు16.6: చహల్ బౌలింగ్‌లో మార్కస్ స్టొయినిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన నితీశ్ రాణా. 39 బంతుల్లో 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగిన వన్‌డౌన్ బ్యాటర్. అయితే, ఇక్కడ ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ రివ్యూకు వెళ్లగా అది సిక్సర్‌గా తేలింది. దీంతో నితీశ్ రాణాకు లైఫ్ లభించింది. అయితే, స్కోరు: 226-1(17). కేఎల్ రాహుల్ 129 పరుగులతో ఉన్నాడు.కేఎల్ రాహుల్ సెంచరీ47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో వంద పరుగులు మార్కు అందుకున్న ఓపెనింగ్ బ్యాటర్. స్కోరు: 189-1(15). నితీశ్ రాణా 36 బంతుల్లో 72 పరుగులతో రాహుల్‌కు తోడుగా ఉన్నాడు.దుమ్ములేపిన నితీశ్ రాణా11.3: జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్‌లో ఫోర్ బాది యాభై పరుగులు పూర్తి చేసుకున్న నితీశ్ రాణా. బార్ట్లెట్ ఓవర్లో 6,4,4,4,4,6 బాదిన నితీశ్. ఢిల్లీ స్కోరు: 142-1(12)పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 102-1రాహుల్ 56, నితీశ్ రాణా 35 పరుగులతో ఉన్నారు.రాహుల్ హాఫ్ సెంచరీ9.1: విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. 26 బంతుల్లో రాహుల్ ఫిఫ్టీ.A loud cheer at Arun Jaitley Stadium as #KLRahul completes a fine fifty off 26 balls! 🤌Will he keep going & guide #DC to a huge total? 💙#TATAIPL 2026 | #DCvPBKS | LIVE NOW 👉https://t.co/iY4R1ZY1Yn pic.twitter.com/IsGMZ1NN4g— Star Sports (@StarSportsIndia) April 25, 2026పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 68-1(6)కేఎల్ రాహుల్ 16 బంతుల్లో 35 పరుగులతో, నితీశ్ రాణా 13 బంతుల్లో 22 పరుగులతో ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్28 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన నిస్సాంక.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.2 ఓవర్లకు ఢిల్లీ స్కోరెంతంటే?2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(12), నిస్సాంక(11) ఉన్నారు.బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఆడిన జట్లునే కొనసాగించాయి.తుది జట్లుపంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఢిల్లీ క్యాపిటల్స్ : కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్ -
ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్
ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే వైదొలిగిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ స్ధానాన్ని మరో ఇంగ్లీష్ ప్లేయర్ రెహాన్ అహ్మద్‌తో ఢిల్లీ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనెజ్మెంట్ గురువారం అధికారంగా ప్రకటించింది.ప్రస్తుతం ఢిల్లీ జట్టులో సరైన ఆల్‌రౌండర్లు లేరు. కెప్టెన్ అక్షర్ పటేల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ అయిన రెహాన్‌తో ఢిల్లీ ఒప్పందం కుదర్చుకుంది. రెహాన్ అహ్మద్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్‌కు ఢిల్లీ జట్టులో చేరనున్నాడు. అతడు లెగ్ స్పిన్‌తో పాటు లోయార్డర్‌లో దూకుడుగా బ్యాటింగ్ కూడా చేయగలడు.కాగా రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్ 'ది హండ్రెడ్' టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టు తరపున ఆడనున్నాడు. సదర్ బ్రేవ్.. ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం గమానార్హం. అతడికి వైట్‌బాల్ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. ఇంగ్లాండ్ తరపున 5 టెస్టులు, 9 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 49 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ అంతంతమాత్రంగానే రాణిస్తోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడింట గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఐదో స్ధానంలో ఉంది.చదవండి: IND vs IRE: టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచలనం! -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇకపై మంచి రోజులు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 3 విజయాలు, 3 అపజయాలతో నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నట్లుగా సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇకపై మంచి రోజులు రానున్నాయి. స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ టోర్నీలో పాల్గొనేందుకు తన జాతీయ బోర్డు (క్రికెట్ ఆస్ట్రేలియా) నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాడు. స్టార్క్ మే 1 నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.స్టార్క్ గాయాలు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను గాయాల నుంచి పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. స్టార్క్ పూర్తిగా కోలుకొని, ఫిట్నెస్ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది.స్టార్క్ రాక ఢిల్లీ బౌలింగ్ విభాగానికి మరింత బూస్టప్ ఇస్తుంది. ఆ జట్టు ఇప్పటికే ఎంగిడి, ముకేశ్ కుమార్, నటరాజన్ వంటి పేసర్లతో కలకలలాడుతుంది. స్పిన్ విభాగంలోనూ ఢిల్లీ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి అత్యుత్తమ స్పిన్నర్లు ఈ జట్టులోనే ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీకి బౌలింగ్ విభాగంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. బౌలర్లు సమిష్టిగా రాణిస్తూ జట్టు విజయాలకు దోహదపడ్డారు. బ్యాటింగ్‌లోనే ఢిల్లీ కాస్త తడబడుతుంది. కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్, సమీర్ రిజ్వి పర్వాలేదనిపిస్తున్నా.. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శలను ఇవ్వలేకపోతున్నారు. ఈ జట్టు తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 25న మధ్యాహ్నం జరుగనుంది. -
అభిషేక్ విధ్వంసం.. సెంచరీతో ఉప్పల్‌లో ఉప్పెన!
ఐపీఎల్లో అభిషేక్ మళ్లీ విధ్వంసం సృష్టించాడు. తనకే సాధ్యమైన రీతిలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన అతను సెంచరీతో ఉప్పల్ మైదానంలో ఉప్పెన సృష్టించాడు. బౌండరీలతోనే సరిగ్గా 100 పరుగులు రాబట్టిన అభిషేక్‌కు క్లాసెన్, ఇషాన్ కిషన్, హెడ్ కూడా అండగా నిలవడంతో హైదరాబాద్ భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. అయితే ఢిల్లీ బ్యాటింగ్ ఏమాత్రం రైజర్స్‌కు సరితూగలేకపోయింది. ఏ దశలోనూ కావాల్సిన దూకుడును ప్రదర్శించని క్యాపిటల్స్ లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. సమష్టి బౌలింగ్‌తో రైజర్స్ ఢిల్లీని పడగొట్టి వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్ 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఐపీఎల్లో తన రెండో సెంచరీతో చెలరేగగా... హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (26 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు సాధించింది. నితీశ్ రాణా (30 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... సమీర్ రిజ్వీ (28 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (23 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ బౌలర్ ఇషాన్ మలింగకు 4 వికెట్లు దక్కాయి. THE HUNDRED CELEBRATION BY ABHISHEK SHARMA. 🔥- Proud father and Kavya Maran cheering. ❤️ pic.twitter.com/pbBYLZViiL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2026భారీ భాగస్వామ్యాలు... తొలి నాలుగు ఓవర్లలో 6 ఫోర్లతో 36 పరుగులు రాబట్టిన రైజర్స్ ఇన్నింగ్స్ నితీశ్ రాణా వేసిన ఐదో ఓవర్‌తో ఊపందుకుంది. ఈ ఓవర్లో అభిషేక్, హెడ్ కలిసి 3 సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో టీమ్ 67 పరుగులు సాధించింది. అనంతరం 25 బంతుల్లో అభిõÙక్ అర్ధసెంచరీ పూర్తి కాగా, అక్షర్ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి హెడ్ వెనుదిరిగాడు. అయితే మరోవైపు అభిషేక్ దూకుడు కొనసాగగా, ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తన ధాటిని ప్రదర్శించాడు. వీరిద్దరు కలిసి కుల్దీప్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 పరుగులు రాబట్టారు. 86 పరుగుల వద్ద డీప్ బ్యాక్వర్డ్లెగ్లో రాణా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్ శర్మ... రాణా ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. అయితే అదే ఓవర్లో దురదృష్టవశాత్తూ రిటర్న్‌లో బౌలర్ చేతికి తగిలిన బంతి నాన్‌స్ట్రయికింగ్ స్టంప్స్‌ను పడగొట్టడంతో కిషన్ రనౌటయ్యాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో అభిషేక్ ను ఆపడంలో ఢిల్లీ సఫలం అయింది. ఈ 30 బంతుల్లో 17 బంతులు ఆడిన అభిషేక్ 2 ఫోర్లతో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు ఉన్న క్లాసెన్ మాత్రం తనదైన శైలిలో చెలరేగడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఎన్గిడి ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు కొట్టిన అతను... ముకేశ్ వేసిన చివరి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మిల్లర్ విఫలం... ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అడుగు పెట్టిన పేసర్ మదుషంక చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. తన 3 ఓవర్ల తొలి స్పెల్‌లో 24 పరుగులే ఇచి్చన అతను నిసాంక (8) వికెట్ తీశాడు. మరోవైపు నితీశ్ రెడ్డి వేసిన రెండు ఓవర్లలో రాణా, రాహుల్ కలిసి 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 29 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 59 పరుగులకు చేరింది. శివాంగ్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన రాణా 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రాహుల్‌ను సాకిబ్ వెనక్కి పంపించగా, తర్వాతి ఓవర్లో మలింగ వరుస బంతుల్లో రాణా, మిల్లర్ (0)లను అవుట్ చేయడంతో రైజర్స్ పైచేయి సాధించింది. ఆ తర్వాత రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి పోరాడినా లాభం లేకపోయింది. 26 బంతుల్లో 77 పరుగులు చేయాల్సిన దశలో స్టబ్స్ అవుట్ కావడంతో ఢిల్లీ గెలుపు దారులు మూసుకుపోయాయి. స్కోరు వివరాలుసన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (నాటౌట్) 135; హెడ్ (సి) రిజ్వీ (బి) అక్షర్ 37; ఇషాన్ కిషన్ (రనౌట్) 25; క్లాసెన్ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–97, 2–176. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–53–0, నితీశ్ రాణా 4–0–55–0, ఎన్గిడి 4–0–41–0, అక్షర్ పటేల్ 2–0–23–1, కుల్దీప్ 2–0–30–0, నటరాజన్ 4–0–40–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) (సబ్) లివింగ్‌స్టోన్ (బి) మదుషంక 8; రాహుల్ (సి) అభిషేక్ (బి) సాకిబ్ 37; నితీశ్ రాణా (సి) అభిషేక్ (బి) మలింగ 57; రిజ్వీ (సి) మదుషంక (బి) దూబే 41; మిల్లర్ (బి) మలింగ 0; స్టబ్స్ (సి) సాకిబ్ (బి) మలింగ 27; అశుతోష్ (సి) అనికేత్ (బి) మలింగ 14; అక్షర్ (సి) నితీశ్ (బి) దూబే 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎన్గిడి (సి) మదుషంక (బి) దూబే 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–21, 2–107, 3–107, 4–107, 5–166, 6–186, 7–192, 8–195, 9–195. బౌలింగ్: మదుషంక 4–0–36–1, నితీశ్ రెడ్డి 4–0–57–0, ఇషాన్ మలింగ 4–0–32–4, సాకిబ్ 4–0–29–1, శివాంగ్ 2–0–28–0, హర్‡్ష దూబే 2–0–12–3. -
అభిషేక్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సమీర్ రిజ్వీ 41 పరుగులు సాధించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్‌దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో తొలిసారి 240 పరుగుల ప్లస్ మార్కును దాటింది. చివర్లో క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. హెడ్ 37, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. అజేయ సెంచరీతో ఢిల్లీ పని పట్టిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.242లో సగం స్కోరు అభిషేక్‌దే..టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాలు మొదలయ్యాయి. ఆరంభం నుంచే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. అభిషేక్ శర్మ, హెడ్లు పోటీపడి బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత జట్టు స్కోరు 97 పరుగుల వద్ద హెడ్ వెనుదిరగడంతో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఎండ్‌లో మాత్రం అభిషేక్ శర్మ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో అర్థశతకాలు సాధించినప్పటికీ వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు. కానీ ఈసారి మాత్రం ఆది నుంచే ధాటిగా ఆడిన అభిషేక్ ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివరి వరకు నిలిచిన అభిషేక్ క్లాసెన్, ఇషాన్‌లతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అయితే జట్టు సాధించిన 242 పరుగుల్లో అభిషేక్ ఒక్కడివే 135 పరుగులు ఉండడం గమనార్హం. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండడం విశేషం.తడబడిన ఢిల్లీ..భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్ (37), నితీశ్ రానా (57) రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు వెనుదిరగడం ఢిల్లీని కష్టాల్లోకి నెట్టేసింది. ఆ తర్వాత వచ్చిన మిల్లర్ గోల్డెన్ డకౌట్ కావడంతో మరింత కష్టాల్లో పడింది. ఈ దశలో సమీర్ రిజ్వీ, స్టబ్స్ (27) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఇది నాలుగో విజయం కాగా, సొంతగడ్డపై మాత్రం హ్యాట్రిక్ విక్టరీ. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఇది మూడో పరాజయం. దీంతో ఆ జట్టు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026 -
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
-
సన్‌రైజర్స్‌ను ఢిల్లీ ఆపగలదా!
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై గత రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘హ్యాట్రిక్’ విజయంపై గురి పెట్టింది. ఐపీఎల్లో భాగంగా నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రైజర్స్ తలపడుతుంది. మరోవైపు రెండు వరుస పరాజయాల అనంతరం డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును బెంగళూరులోనే ఓడించడంతో ఢిల్లీ టీమ్‌లో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. పాయింట్ల పట్టికలో పెద్ద తేడా లేకుండా దాదాపు సమానంగా ఉన్న ఈ రెండు టీమ్‌లలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం. గత రెండు మ్యాచ్‌ల ఫలితాలను బట్టి చూస్తే సన్‌రైజర్స్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అభిõÙక్ శర్మ, క్లాసెన్ మెరుపు బ్యాటింగ్‌తో పాటు టాప్–5లో హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి కూడా చెలరేగితే బ్యాటింగ్‌లో తిరుగుండదు. బౌలింగ్‌లో యువ ఆటగాళ్లంతా సమష్టింగా రాణిస్తుండటం జట్టు బలం. ప్రఫుల్ హింగే, సాకిబ్, శివాంగ్‌లతో పాటు ఇషాన్ మలింగ కూడా గత మ్యాచ్‌లో సత్తా చూపించాడు. ఢిల్లీ జట్టులో కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా... స్టబ్స్, డేవిడ్ మిల్లర్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ముకేశ్, ఎన్గిడి, కుల్దీప్లతో పాటు అక్షర్ పటేల్, నటరాజన్ బౌలింగ్ భారం మోస్తారు. గత మ్యాచ్‌లో విఫలమైనా... పేసర్ ఆకిబ్ నబీకి మరో అవకాశం దక్కవచ్చు. -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. శనివారం (ఏప్రిల్ 18) చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ది కీలక పాత్ర. తన 34వ పుట్టినరోజున రాహుల్ అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు తన పుట్టినరోజున హాఫ్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు.గతంలో 2021 సీజన్లో (29వ పుట్టినరోజున) పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ ఢిల్లీపై హాఫ్ సెంచరీతో మెరిశాడు. మళ్లీ ఇప్పుడు తన బర్త్‌డే రోజున హాఫ్ సెంచరీ సాధించడంతో ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 168 పరుగులు సాధించాడు.ఐపీఎల్లో పుట్టిన రోజున అర్ద సెంచరీ చేసిన ఆటగాళ్లుమైక్ హస్పీడేవిడ్ వార్నర్కేఎల్ రాహుల్(రెండు సార్లు) -
కలిసిరాని గ్రీన్ జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
-
ఢిల్లీ ధమాకా
బెంగళూరు: సొంతగడ్డపై ఈ ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలి ఓటమి చవిచూసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు జట్టును బోల్తా కొట్టించింది. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని సాధారణ స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ... ఛేదనలో చివరి వరకు పోరాడి విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళురు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (38 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా... విరాట్ కోహ్లి (13 బంతుల్లో 19; 3 ఫోర్లు) సహా తక్కినవాళ్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి, కుల్దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రిస్టన్ స్టబ్స్ (47 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. భువనేశ్వర్ (3/26) ధాటికి 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ఈ జోడీ నిలబడి ఢిల్లీని ఆదుకుంది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (10 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మిల్లర్ 6, 6, 4 ఛేదనలో ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ నాలుగో బంతికి నిసాంక (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న భువనేశ్వర్... ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. కరుణ్ నాయర్ (5) సమీర్ రిజ్వీ (2)లను పెవిలియన్ బాటపట్టించి ఢిల్లీని ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఈ దశలో స్టబ్స్‌తో కలిసి ‘బర్త్‌డే బాయ్’ రాహుల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అనంతరం రాహుల్ అవుట్ కాగా... అక్షర్ పటేల్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు) కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా... షెఫర్డ్ తొలి రెండు బంతులకు రెండు పరుగులే ఇచ్చాడు. ఉత్కంఠ పెరుగుతున్న సమయంలో మిల్లర్ 6, 6, 4 కొట్టి జట్టును గెలిపించాడు. సాల్ట్ ఒక్కడే... అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరుకు... ముగిసిన విధానానికి పొంతనే లేదు. ఓపెనర్లు సాల్ట్, కోహ్లి ధాటిగా ఆడటంతో... 5 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఆ తర్వాత కోహ్లి అవుట్ కాగా... దేవదత్ పడిక్కల్ (18), కెపె్టన్ రజత్ పాటీదార్ (8), టిమ్ డేవిడ్ (26), జితేశ్ శర్మ (14), షెఫర్డ్ (1), కృనాల్ పాండ్యా (12) పెవిలియన్‌కు క్యూ కట్టారు. పేస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఆర్సీబీ బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడ్డారు. అక్షర్ పటేల్, కుల్దీప్ కట్టిపడేయడంతో పరుగుల రాక గగనమైంది. దీంతో ఒత్తిడికి గురైన ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఆకుపచ్చ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) స్టబ్స్ (బి) కుల్దీప్ 63; కోహ్లి (సి) నిసాంక (బి) ఎన్గిడి 19; పడిక్కల్ (సి) మిల్లర్ (బి) అక్షర్ 18; పాటీదార్ (సి) రాహుల్ (బి) ముకేశ్ 8; డేవిడ్ (సి) నటరాజన్ (బి) అక్షర్ 26; జితేశ్ (సి) మిల్లర్ (బి) ఎన్గిడి 14; షెఫర్డ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; కృనాల్ పాండ్యా (రనౌట్) 12; రసిక్ సలామ్ (నాటౌట్) 0; భువనేశ్వర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–52, 2–99, 3–105, 4–131, 5–146, 6–149, 7–172, 8–172. బౌలింగ్: అఖీబ్ నబీ 3–0–36–0; ముకేశ్ 4–0–32–1; ఎన్గిడి 4–0–39–2; కుల్దీప్ 4–0–32–2; నటరాజన్ 2–0–16–0; అక్షర్ 3–0–18–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిసాంక (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 1; కేఎల్ రాహుల్ (సి) కోహ్లి (బి) కృనాల్ 57; కరుణ్ నాయర్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 5; సమీర్ రిజ్వీ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 2; స్టబ్స్ (నాటౌట్) 60; అక్షర్ (రిటైర్డ్ హర్ట్) 26; మిల్లర్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–2, 2–16, 3–18, 4–87. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–3; హాజల్‌వుడ్ 4–0–38–0; రసిక్ 4–0–40–0; కృనాల్ 4–0–24–1; సుయాశ్ 3–0–31–0; షెఫర్డ్ 0.5–0–17–0.100హోం గ్రౌండ్లో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఐపీఎల్ జట్టుగా ఆర్సీబీ గుర్తింపు పొందింది. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఏప్రిల్ 18న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ మొదలైంది. ఈ వేదికపై మొదటి మ్యాచ్, 50వ మ్యాచ్, 100వ మ్యాచ్‌లోనూ ఆర్సీబీ జట్టుకు ఓటమి ఎదురుకావడం గమనార్హం. హోం గ్రౌండ్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (ఈడెన్ గార్డెన్స్‌లో 98 మ్యాచ్‌లు), ముంబై ఇండియన్స్ (వాంఖడే స్టేడియంలో 95 మ్యాచ్‌లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. -
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్యావరణ పరిరక్షణ హితం కోసం ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది. అయితే గ్రీన్ జెర్సీ ఆర్సీబీకి కలసిరాదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఈ సంగతి పక్కనబెడితే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ఆర్సీబీకి వందోది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తాము ఆడిన తొలి మ్యాచ్‌తో పాటు 50వ మ్యాచ్, తాజాగా వందో మ్యాచ్‌లోనూ ఓటమిపాలవ్వడం గమనార్హం. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనే మెక్కల్లమ్ సెంచరీ బాదాడు. ఇక 2016లో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆర్సీబీ 50వ మ్యాచ్ ఆడింది. తాజాగా యాదృశ్చికంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో తన వందో మ్యాచ్ ఆడిన ఆర్సీబీకి మరోసారి ఓటమే ఎదురయ్యింది. ఇక 2011 నుంచి ప్రతీ సీజన్లో ఒక మ్యాచ్‌కు ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగడం ఆనవాయితీగా చేసుకుంది. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు గ్రీన్ జెర్సీలో 15 మ్యాచ్‌లు ఆడితే అందులో తొమ్మిదింట ఓడి కేవలం ఐదింట మాత్రమే నెగ్గింది. -
వారెవ్వా మిల్లర్.. ఆరోజు ఏడ్చి.. ఈరోజు నవ్వి!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్ అది. కేవలం ఒక్క పరుగుతో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడానికి డేవిడ్ మిల్లర్ ప్రధాన కారణమయ్యాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో అనవసర ఒత్తిడికి పోయిన మిల్లర్ ఢిల్లీకి చేజేతులా ఓటమిని అందించాడు. ఈ చర్య మిల్లర్‌ను కంటతడి పెట్టేలా చేసింది. మరో అవకాశం వస్తే ఢిల్లీకి విజయాన్ని అందించి తన తప్పును సరిదిద్దుకుంటానని మిల్లర్ పేర్కొన్నాడు. అయితే తన తప్పు సరిదిద్దుకునే రోజు ఇంత తొందరగా వస్తుందని బహుశా మిల్లర్ కూడా ఊహించి ఉండడు. ఇవాళ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్ మరోసారి ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో మిల్లర్‌తో పాటు స్టబ్స్ ఉన్నాడు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీశాడు. రెండో బంతికి స్టబ్స్ సింగిల్ తీశాడు. ఇక 4 బంతుల్లో 13 పరుగులు అవసరం. స్ట్రైక్‌లో ఉన్న మిల్లర్ ఈసారి ఢిల్లీని గెలిపించాలని కంకణం కట్టుకున్నాడు. షెపర్డ్ వేసిన మూడో బంతిని మిల్లర్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. ఇక మరుసటి బంతిని ఈసారి మిల్లర్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా మరో సిక్సర్ సంధించాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో ఒక పరుగుకు మారిపోయింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో చేసిన పొరపాటును మళ్లీ చేయకుండా షెపర్డ్ వేసిన ఐదో బంతిని డీప్ మిడ్‌వికెట్ దిశగా బౌండరీ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. మొత్తం మీద గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమికి తానే కారణమని ఏడ్చిన మిల్లర్ ఇవాళ మాత్రం తన జట్టును గెలిపించి లెక్క సరిచేశాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 63, టిమ్ డేవిడ్ 26 పరుగులు చేశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 6,6,4 BY DAVID MILLER WHEN DELHI NEEDED 13 FROM 4 🥶- DC got David Miller for Base Price. pic.twitter.com/9HVbfezmuI— Johns. (@CricCrazyJohns) April 18, 2026చదవండి: సీఎస్కే కొత్త కెప్టెన్ సంజూ శాంసన్! -
ఉత్కంఠ పోరు.. ఢిల్లీని గెలిపించిన డేవిడ్ మిల్లర్
ఐపీఎల్-2026 వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఫిల్ సాల్ట్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ పడగొట్టాడు.మిల్లర్.. కిల్లర్అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే భారీ షాకిచ్చాడు. భువీ ధాటికి ఢిల్లీ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్(57), ట్రిస్టన్ స్టబ్స్(60 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే రాహుల్ ఔటయ్యాక ఆర్సీబీ తిరిగి గేమ్‌లోకి వచ్చింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(26 రిటైర్డ్ హార్ట్) భారీ షాట్ల ఆడడంలో విఫలమయ్యాడు.అతడితో పాటు స్టబ్స్ కూడా కాస్త నెమ్మదించాడు. దీంతో ఢిల్లీ కావాల్సిన రన్‌రేట్ పెరుగుతూ వచ్చింది. అయితే అక్షర్ పటేల్ తొడ కండరాలు పట్టేయంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన మిల్లర్ కూడా బంతిని స్ట్రైక్ చేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. రషీక్ ధార్ సలాం వేసిన 19 ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 6 బంతుల్లో 15 పరుగులగా మారింది.ఆర్సీబీ కెప్టెన్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను రొమోరియా షెఫర్డ్‌కు అప్పగించాడు. తొలి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి నాలుగు బంతుల్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. వరుసగా మూడు, నాలుగు బంతులను భారీ సిక్సర్లగా మిల్లర్ మలిచాడు. ఐదో బంతిని బౌండరీ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఫలితంగా 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. మిల్లర్ 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ సాధించాడు. ట్రిస్టన్ స్టబ్స్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఢిల్లీ విజయం
IPL 2026 RCB vs DC Live updates: చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. డేవిడ్ మిల్లర్ వరుసగా సిక్సర్లు బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఫలితంగా 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో మిల్లర్(10 బంతుల్లో 22)తో పాటు కేఎల్ రాహుల్(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), ట్రిస్టన్ స్టబ్స్(47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 60) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ సాధించాడు.👉ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్, మిల్లర్ ఉన్నారు. 16 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 135/416 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. అక్షర్‌పటేల్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు.కేఎల్ రాహుల్ ఔట్..దూకుడుగా ఆడుతున్న కేఎల్ రాహుల్ (57) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 74/38 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(45), స్టబ్స్(12) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న కేఎల్ రాహుల్5 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(30), స్టబ్స్(5) ఉన్నారు.నిప్పులు చెరుగుతున్న భువనేశ్వర్భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరుగుతున్నాడు. 3 ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. కరుణ్ నాయర్(5), సమీర్ రిజ్వీ(2) వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఫాథుమ్ నిస్సాంక..భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఆర్సీబీ స్కోరెంతంటే?చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ పడగొట్టాడు.ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్ఆర్సీబీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రోమారియో షెపర్డ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.ఆర్సీబీ ఐదో వికెట్ డౌన్ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన డేవిడ్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15.2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 146-5ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన పాటిదార్.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 131-4ఆర్సీబీ మూడో వికెట్ డౌన్ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 63 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రజత్ పాటిదార్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 99/2దూకుడుగా ఆడుతున్న సాల్ట్8 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(45), పడిక్కల్(11) ఉన్నారు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్52 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ఎంగిడీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.3 ఓవర్లకు ఆర్సీబీ స్కోరెంతంటే?3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుంగా 29 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(14), సాల్ట్(10) ఉన్నాడు.ఐపీఎల్-2026 సీజన్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గ్రీన్ జెర్సీ ధరించి బరిలోకి దిగింది. సమాజంలో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకే ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో ఆడుతోంది.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ దార్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్స్: విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, దుష్మంత చమీర, నితీష్ రాణారాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్వుడ్ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలాం దార్, వెంకటేష్ అయ్యర్, జోర్డాన్ కాక్స్, , మంగేష్ యాదవ్, విక్కీ ఓస్ట్వాల్ -
అచ్చిరాని జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2011 సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఒక మ్యాచ్‌లో గ్రీన్జెర్సీలో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ఆర్సీబీ దీనిని పాటిస్తూ వస్తోంది. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది. ఈ సంప్రదాయాన్ని ఆర్సీబీ 2026 సీజన్లోనూ కంటిన్యూ చేయనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న పోరులో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీలతో దర్శనమివ్వనున్నారు. ఈ సీజన్లో మంచి జోష్ మీదున్న ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో4 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.అచ్చిరాని జెర్సీ..అయితే ఆర్సీబీకి ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్‌లు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పటివరకు 15మ్యాచ్‌ల్లో ఆర్సీబీ గ్రీన్జెర్సీతో బరిలోకి దిగింది. కానీ ఇందులో ఐదు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి.. మరో 9 మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యింది. మరొక మ్యాచ్ మాత్రం రద్దయ్యింది. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గ్రీన్ డే మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.2011 నుంచి 'గ్రీన్ జెర్సీ' మ్యాచ్‌లను ఆడడం ప్రారంభించిన ఆర్సీబీకి పెద్దగా కలిసిరాలేదు. గత సీజన్లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్ వరకు 15 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ గెలిచినప్పటికీ విరాట్ కోహ్లి రెండుసార్లు డకౌట్ కాగా, ఒక మ్యాచ్‌లో సెంచరీ, మరో మ్యాచ్‌లో కీలకమైన 27 పరుగులు చేశాడు.గ్రీన్జెర్సీతో ఆర్సీబీ విజయాలు..ఐపీఎల్ 2011లో కొచ్చి టస్కర్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి 125/9 స్కోరుకే పరిమితం కాగా.. ఆర్సీబీ 13.1 ఓవర్లలోనే 128/1 స్కోరు చేసి గెలుపొందింది. విరాట్ (27*) నాటౌట్‌గా నిలిచాడు.2016 సీజన్లో గుజరాత్ లయన్స్‌పై 144 పరుగుల భారీ తేడాతో ఆర్ సీబీ గెలిచింది. ఈ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లి (109) సెంచరీ బాదాడు. ఏబీ డివిలియర్స్ (129*) కూడా శతకం చేయడంతో ఆర్సీబీ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 248 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ లయన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 67 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్ (73*), రజత్ పటీదార్ (48) రాణించడంతో 192 పరుగుల చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 125 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.2023 సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లి గోల్డెన్ డక్ అవ్వడం విశేషం. అయితే మ్యాక్స్‌వెల్ (77*), డుప్లెసిస్ (62) విజృంభణతో రాజస్తాన్ ముందు 190 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. అయితే ఛేదనలో రాజస్తాన్ పోరాడినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులకు పరిమితమైంది.గత సీజన్లోనూ రాజస్తాన్ రాయల్స్‌తోనే గ్రీన్ జెర్సీలో ఆర్సీబీతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లి (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించి ఆర్సీబీని గెలిపించాడు.𝗜𝘁’𝘀 𝘁𝗵𝗮𝘁 𝘁𝗶𝗺𝗲 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘆𝗲𝗮𝗿 𝗮𝗴𝗮𝗶𝗻 - 𝗹𝗲𝘁’𝘀 𝗚𝗼 𝗚𝗿𝗲𝗲𝗻! 😍💚More than a tradition. A purpose we wear with pride. 🙌Tomorrow, our boys take the field donning the Green Jersey against Delhi, to raise awareness by pledging to protect the… pic.twitter.com/UzvgUdXllf— Royal Challengers Bengaluru (@RCBTweets) April 17, 2026 చదవండి: వైభవ్ సేఫ్.. రోమి భిందర్‌కు బీసీసీఐ షాక్! -
అతడి కోసం ఢిల్లీ విరాట్ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంత వరకు టైటిల్ గెలవని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ సీజన్ (2008)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుంది.తప్పటడుగు వేసి ఉండకపోతే..అయినా సరే ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో భారత విధ్వంసకర ఓపెనర్, ఢిల్లీ మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ ఫ్రాంఛైజీ గనుక ఆరోజు తప్పటడుగు వేసి ఉండకపోతే.. ఆ జట్టుకు మంచి క్రేజ్ అయినా దక్కి ఉండేదని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ వీరూ భాయ్ ఏం చెప్పాడంటే.. టాపార్డర్ కిక్కిరిసిపోయి ఉండేది‘‘ఐపీఎల్ ఆరంభ సీజన్ అంటే.. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో శిఖర్ ధావన్, తిలక్‌రత్నె దిల్షాన్ కూడా ఉన్నట్లు నాకు గుర్తు. వీరిద్దరు ఓపెనింగ్ బ్యాటర్లే. అయితే, నేను, గౌతమ్ ఇన్నింగ్స్ ఆరంభించేవాళ్లం.కాబట్టి ధావన్, దిల్షాన్ ఆలస్యంగా వచ్చేవాళ్లు. మనోజ్ తివారి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. అప్పుడ మా టాపార్డర్.. ఇలా కిక్కిరిసిపోయి ఉండేది. కాబట్టి కొత్తగా బ్యాటర్‌ను తీసుకునే అవకాశం లేకుండా పోయింది.కోహ్లికి బదులు జట్టులోకి అతడుఆ సమయంలో విరాట్ కోహ్లి వన్‌డౌన్ లేదంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. కాబట్టి అతడిని జట్టులోకి తీసుకోలేకపోయారు. అప్పుడు మాకు బౌలర్ అవసరం ఉంది. అందుకే కోహ్లికి బదులు ఢిల్లీ ప్రదీప్ సాంగ్వాన్‌ను జట్టులోకి తీసుకుంది’’ అని చాంపియన్స్ వాలీ కామెంట్రీలో జియోస్టార్ ఎక్స్పర్ట్ వీరేందర్ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.కాగా ఆరోజు అలా ఢిల్లీ కోహ్లిని కెరీర్ తొలినాళ్లలో వదిలేసుకోగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజంగా ఎదిగినా.. కోహ్లి మాత్రం ఇప్పటికీ ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా ట్రోఫీ గెలవలేకపోయినా.. గతేడాది రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ తరఫున కోహ్లి తొలిసారి కప్పును ముద్దాడాడు. మరోవైపు.. ఢిల్లీ టైటిల్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.చదవండి: T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ -
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో పెద్ద బాంబు పేల్చాడు. కోచ్‌గా గంభీర్‌ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదంటూ బీసీసీఐని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌కు టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ సారథ్యంలో భారత జట్టు మిశ్రమ ఫలితాలను అందుకుంది. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లు భారత్ గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలోనే వచ్చాయి. అయితే ఇదే సమయంలో జట్టులో సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం వెనుక గంభీర్ పాత్ర ఉందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వన్డే, టీ20 ఫార్మాట్లో గంభీర్ కోచ్‌గా పర్వాలేదనిపించినప్పటికీ టెస్టు ఫార్మాట్లో దారుణంగా విఫలమవ్వడంతో అతన్ని కోచ్‌గా తప్పించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మునాఫ్ పటేల్ గంభీర్‌కు అండగా నిలిచాడు. మునాఫ్ పటేల్ మాట్లాడుతూ.. ‘గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే అతని తత్వాన్ని అందరూ ఇష్టపడరు. కానీ జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీరకు ఉంది. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు 'నో' చెప్పడం అంత తేలికైన విషయం కాదు. తన కఠిన నిర్ణయాలతో శత్రువులను కూడా పెంచుకున్నాడు. అయితే కోచ్‌గా తన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని మాత్రం బలంగా చెప్పగలను.’ అని మునాఫ్ వెల్లడించాడు. ఎన్సీఏ క్రికెట్ అకాడమీలో సౌకర్యాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోందని మునాఫ్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రాక్టీస్, రీహాబిలిటేషన్ సెంటర్ సహా ఇతర కార్యక్రమాలకు వినియోగించే ఎన్సీఏ అకాడమీలో ప్రస్తుతం బలమైన వ్యవస్థ కనిపించడం లేదని తెలిపాడు. వెంటనే ఎన్సీఏ అకాడమీని పటిష్టపరిచేందుకు బీసీసీఐ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెరపిస్టులు, కోచ్‌లు, సరైన శిక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని మునాఫ్ వెల్లడించాడు. కాగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో బీసీసీఐ 2000 సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా ఎన్సీఏ అకాడమీని స్థాపించింది. ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్! -
ట్విస్ట్ అదుర్స్.. అరుదైన జాబితాలో ఆయుశ్ మాత్రే!
ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయుశ్ రిటైర్డ్ ఔట్ వెనుక సీఎస్కే మేనేజ్మెంట్ హస్తం ఉంది. మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేస్తున్న ఆయుశ్ మాత్రేను అర్థంతరంగా రిటైర్డ్ ఔట్‌గా వెళ్లిపోవడం వెనుక విమర్శలు వచ్చాయి. కానీ సీఎస్కే నిర్ణయం సరైనదే అని కాసేపటికే తెలిసొచ్చింది. ఆయుశ్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్డ్ హిట్టర్ శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తూ వేగంగా పరుగులు రాబట్టాడు. ఫలితంగా సీఎస్కే భారీ స్కోరు సాధించింది. ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్ వెనుక కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ పాత్ర కీలకం. అందుకే మాత్రే పెవిలియన్ చేరుకున్న సమయంలో అతడికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ నేపథ్యంలో ఆయుశ్ మాత్రే ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్లు చాలా తక్కువగా జరుగుతుంటాయి. గతంలో రవిచంద్రన్ అశ్విన్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, డెవాన్ కాన్వే వంటి క్రికెటర్లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. తాజాగా ఈ జాబితాలో ఆయుశ్ మాత్రే కూడా చేరిపోయాడు. కాగా ఐపీఎల్ 2026 సీజన్లో ఆయుశ్ మాత్రేదే తొలి రిటైర్డ్ ఔట్.సాధారణంగా క్రికెట్లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ వేర్వేరు. రిటైర్డ్ హర్ట్' అంటే గాయం కారణంగా ఆటగాడు మైదానం విడిచిపెట్టడం. అదే రిటైర్డ్ ఔట్ అనేది జట్టు ప్రయోజనాల కోసం స్వచ్చందంగా మైదానం విడిచిపెట్టడం. రిటైర్డ్ హర్ట్ అయితే సదరు మ్యాచ్‌లో మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రిటైర్డ్ ఔట్ అలా కాదు. ఒక్కసారి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగితే మళ్లీ క్రీజులోకి వచ్చేందుకు అవకాశం ఉండదు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. View this post on Instagram A post shared by IPL (@iplt20) చదవండి: అంపైర్‌తో వాదన.. కోపంతో ఊగిపోయిన స్టబ్స్! -
అంపైర్‌తో వాదన.. కోపంతో ఊగిపోయిన స్టబ్స్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో ఊగిపోతూ హెల్మెట్‌ను నేలకేసి కొట్టడంతో పాటు గ్లోవ్స్‌ను విసిరేయడం కెమెరాలకు చిక్కింది. మరి స్టబ్స్ కోపానికి కారణమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో స్టబ్స్ తన గ్లోవ్స్‌ను మార్చుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే గ్లోవ్స్ మొత్తం చెమటతో తడిసిపోవడంతో స్టబ్స్ పదే పదే బ్యాట్ గ్రిప్‌ను కోల్పోయాడు. దీంతో గ్లోవ్స్‌ను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని అంపైర్‌ను కోరాడు. కానీ అంపైర్ ససేమీరా అనడంతో చేసేదేం లేక స్టబ్స్ అదే గ్లోవ్స్‌తో కంటిన్యూ అయ్యాడు. అయితే 19వ ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడే యత్నంలో మిడాఫ్‌లో నూర్ అహ్మద్ చేతికి చిక్కాడు. దీంతో పెవిలియన్ చేరిన స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా కోపంతో ఊగిపోతూ బ్యాట్‌ను, హెల్మెట్‌ను విసిరేయడంతో పాటు గ్లోవ్స్‌ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టబ్స్ ఔటైన తర్వాత డగౌట్లో ఉన్న ఢిల్లీ ఆటగాడు నితీశ్ రానా స్టబ్స్‌ను సమర్థించాడు. తడిగా ఉన్న గ్లోవ్స్‌తో ఆడడం వల్ల బ్యాటింగ్‌కు ఆటంకం కలుగుతుందని, స్టబ్స్‌కు గ్లోవ్స్ మార్చుకునేందుకు అవకాశమెందుకు ఇవ్వలేదంటూ థర్డ్ అంపైర్‌తో వాదనకు దిగాడు. కోచ్ హేమంగ్ బదాని కూడా అంపైర్‌తో ఇదే విషయమై వాదనకు దిగడం కనిపించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.Stubbs asked to change his gloves just before the wicket ball and Umpire didn't allow it, now DC management is furious and ofcourse CSK is involved in another spooky decision. pic.twitter.com/jkkImLB5Bq— Avay Sha (@avay_69) April 11, 2026🚨 DC Camp Angry on Umpire Decision 🚨DC coach Hemang Badani and Nitish Rana were angry on umpire after Tristan Stubbs was not allowed to change his gloves during the over.The decision upset the DC camp, and on the very next ball, Stubbs got out. pic.twitter.com/qGHdCe6tQL— Cricket Vaira (@ramgaming242) April 11, 2026Stubs wanted to change his gloves, but the umpire did not allow it, and he got out on the very next ball.#CSKvsDC pic.twitter.com/BAHX9zhURM— Vivek Gupta (@VIVEK1888) April 12, 2026చదవండి: ‘విజయానికి వాళ్లే కారణం.. సంజూ కాదు’ -
శతక్కొట్టిన సంజూ.. బోణీ కొట్టిన సీఎస్కే
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్ నిస్సాంక(41), అశుతోష్ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ మూడు, నూర్ అహ్మద్, ఖలీల్ తలా వికెట్ సాధించారు.సంజూ సూపర్ సెంచరీఅంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 52 బంతుల్లోనే తన నాలుగో ఐపీఎల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా సంజూ 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆయూశ్ మాత్రే(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.చదవండి: IPL 2026: చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్ సెంచరీ -
ఢిల్లీపై సీఎస్కే గ్రాండ్ విక్టరీ
Chennai super kings vs delhi capitals live Updates: ఢిల్లీపై సీఎస్కే గ్రాండ్ విక్టరీఐపీఎల్-2026లో సీఎస్కే తొలి విజయాన్ని నమోదు చేసింది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్ నిస్సాంక(41), అశుతోష్ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ మూడు, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.ఓటమి దిశగా ఢిల్లీఢిల్లీ విజయానికి చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్(60), కుల్దీప్ యాదవ్(3) ఉన్నారు.ఢిల్లీ ఆరో వికెట్ డౌన్అశుతోష్ రూపంలో ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన అశుతోష్.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 60 పరుగులు కావాలి.ఢిల్లీ ఐదో వికెట్ డౌన్డేవిడ్ మిల్లర్ రూపంలో ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన మిల్లర్.. ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో స్టబ్స్(34), అశుతోష్ శర్మ(9)ఉన్నారు.10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 91/410 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్(11), డేవిడ్ మిల్లర్(6) ఉన్నారు. ఢిల్లీ విజయానికి 57 బంతుల్లో 121 పరుగులు కావాలి.ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అక్షర్ పటేల్.. గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు స్కోర్: 73/3ఢిల్లీ రెండో వికెట్ డౌన్పాథుమ్ నిస్సాంక రూపంలో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన నిస్సాంక.. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్61 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో నిస్సాంక(41), రిజ్వీ ఉన్నారు.సంజూ సూపర్ సెంచరీ.. సీఎస్కే భారీ స్కోర్చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 55 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేశాడు. అతడితో పాటు అయూశ్ మాత్రే(59), దూబే(10 బంతుల్లో 20) రాణించారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు. అయూశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.సంజూ శాంసన్ సెంచరీ17వ ఓవర్లో సంజూ శాంసన్ ఫోర్ బాది సెంచరీ నమోదు చేశాడుఈ సీజన్లో 52 బంతుల్లో తొలిసెంచరీ చేశాడుఢిల్లీపై 3సిక్స్‌లు,14 ఫోర్లతో సంజూ సెంచరీ పూర్తి చేశాడు ఆయూష్ ఔట్ 17వ ఓవర్లో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది17వ ఓవర్ నటరాజన్ బౌలింగ్‌లో సీఎస్కే బ్యాట్స్‌మెన్ ఆయూష్ ఔటయ్యాడు 55 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం సంజు, ఆయుష్ రెండో వికెట్‌కు 55 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు క్రీజులో సంజు 95, ఆయుష్ 55 17 ఓవర్లకు చెన్నై స్కోర్ 174/1 12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 119-1, క్రీజులో సంజూ శాంసన్(77), ఆయూష్ మాత్రే(25) ఉన్నారు.శాంసన్ హాఫ్ సెంచరీఐపీఎల్-2026 సీజన్లో సీఎస్కే సూపర్ స్టార్ సంజూ శాంసన్ తొలి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 52 పరుగులతో సంజూ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 8.5 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 77/1సీఎస్కే తొలి వికెట్ డౌన్సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6.2 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 62/. క్రీజులో సంజూ శాంసన్(46), అయూశ్ మాత్రే ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న సంజూసంజూ శాంసన్ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. 22 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 3 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 27/1టాస్ గెలిచిన ఢిల్లీ..ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి అకిబ్ నబీ, అశుతోష్ శర్మ తుది జట్టులోకి వచ్చారు.జమ్మూ కాశ్మీర్ పేసర్ అకిబ్ నబీకి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. సీఎస్కే కూడా రెండు మార్పులు చేసింది. విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ తిరిగి పునరాగమనం చేశాడు. అదేవిధంగా గుర్జప్నీత్ సింగ్ సీఎస్కే తరపున ఐపీఎల్ డెబ్యూ చేశాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్ -
‘నేనైతే మిల్లర్‌ను తోసేసేవాడిని’
న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చివరి ఓవర్ ఐదో బంతికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సింగిల్ నిరాకరించడం తీవ్ర చర్చకు దారి తీసింది. మిల్లర్ తప్పు చేశాడని, జట్టు ఓటమికి కారణమయ్యాడని ఎక్కువ భాగం విమర్శలు వచ్చాయి. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అసలు మిల్లర్ ఏం ఆలోచించాడో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తనకు అర్థం కావడం లేదని, మ్యాచ్ ఫలితాన్ని అసలు నమ్మలేకపోతున్నానని అతను వ్యాఖ్యానించాడు.‘ఆఖరి బంతికి ఫోర్ లేదా సిక్స్ కొట్టాల్సి ఉందంటే మిల్లర్ నిర్ణయం సరైంది అనుకోవచ్చు. కానీ 2 బంతుల్లో 2 పరుగులు అంటే మహా అయితే ఏం జరిగే అవకాశం ఉంటుంది. ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే స్కోరు సమమయ్యేది. చివరి బంతికి కుల్దీప్ సింగిల్ తీసేవాడు. అలా కాకున్నా అతను అవుటయ్యేవాడు. అలాంటిది 10 మ్యాచ్‌లలో ఒకసారి జరగవచ్చంతే. భారీ స్కోర్ల మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లడంలో నష్టం ఏముంది. ఆ ఐదో బంతికి కుల్దీప్ స్థానంలో నేను ఉండి ఉంటే సింగిల్ కోసం దూసుకుపోయి అక్కడి నుంచి మిల్లర్‌ను పరుగెత్తమని తోసేసేవాడిని’ అని అశ్విన్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు కొత్త తరహా దారులు వెతుకుతున్నట్లు అనిపిస్తుందని కూడా అశ్విన్ విశ్లేషించాడు. ‘ఈ తరహాలో ఓడిపోవడం వల్ల ముందుగా మీ జట్టులో ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. పైగా వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడితే తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్న గుజరాత్ కోలుకొని మళ్లీ బరిలోకి నిలిచేందుకు మీరు అవకాశం కల్పించి మీరు నాలుగు పాయింట్ల వద్దే ఆగిపోయారు’ అని అశ్విన్ విమర్శించాడు. మిల్లర్ ఆలోచన తప్పు కాదు: గావస్కర్ మరోవైపు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మాత్రం మిల్లర్ నిర్ణయాన్ని సమర్థించాడు. జట్టును గెలిపించాలనే అతని ఉద్దేశంలో తప్పేమీ లేదని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘మిల్లర్ అప్పటికి చాలా బాగా ఆడుతున్నాడు. గెలిపించగలనని తనపై తాను నమ్మకం ఉంచాడు. అతaని ఉద్దేశాన్ని మనం తప్పు పట్టవద్దు. చివరకు అతని ఆలోచన సరిగా అమలు చేయలేకపోయాడు. ప్రసిధ్ కృష్ణ చక్కటి స్లో బౌన్సర్‌తో మిల్లర్‌ను కట్టిపడేశాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఈ స్థితిలోనే మన బుర్రను వాడాలి. నా ఉద్దేశం ప్రకారం కూడా ఐదో బంతికి సింగిల్ తీస్తే బాగుండేది. అంతకు ముందు కుల్దీప్ సింగిల్ రాబట్టగలిగాడనే విషయం మర్చిపోవద్దు’ అని గావస్కర్ అన్నాడు. -
డేవిడ్ మిల్లర్ కాదు.. ఢిల్లీ ఓటమికి అసలు కారణమిదే?
ఐపీఎల్-2026లో బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థిల్లర్ సినిమాను తలపించిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.అద్భుతమైన ఇన్నింగ్స్‌తో హీరోగా మారుతాడు అనుకున్న డేవిడ్ మిల్లర్ ఒక్క తప్పిదంతో విలన్‌గా మారిపోయాడు. ప్రసిద్ద్ కృష్ణ చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని విప్రజ్ నిగమ్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతికి విప్రజ్ ఔటయ్యాడు.మూడో బంతికి కుల్దీప్ మిల్లర్‌కు సింగిల్ తీసి ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ భారీ సిక్స్‌గా మలిచాడు. దీంతో ఢిల్లీ విజయానికి ఆఖరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరయ్యాయి. అయితే ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశమున్నప్పటికి మిల్లర్ తిరస్కరించాడు. మిల్లర్ స్ట్రైక్ తన వద్ద అంటిపెట్టుకుని మ్యాచ్ ఫినిష్ చేయాలనుకున్నాడు. కానీ మిల్లర్ అనుకున్నది జరగలేదు. ఆఖరి బంతి ప్రసిద్ద్ బౌన్సర్‌గా సంధించడంతో మిల్లర్ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. బై కోసం పరిగెత్తగా.. జోస్ బట్లర్ స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి చవిచూడాల్సింది. ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ టై ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్‌నే కోల్పోవల్సింది. ఓటమి అనంతరం మిల్లర్ కన్నీటి పర్యంతమయ్యాడు. సహచర ఆటగాళ్లు మిల్లర్‌ను ఓదార్చారు.అయితే ఢిల్లీ డేవిడ్ మిల్లర్ వల్ల కాదని, ఓ ఐసీసీ రూల్ వల్ల ఓడిపోయిందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అసలేంటి ఆ రూల్? ఢిల్లీ ఓటమికి ఎలా కారణమైందో ఓసారి పరిశీలిద్దాం.ఏమి జరిగిందంటే?ఢిల్లీ ఇన్నింగ్స్ 9 ఓవర్లో నిస్సాంక ఔటయ్యక నితీశ్ రాణా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 10వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రెండో బంతి నితీష్ రాణా ప్యాడ్లకు తగిలింది. అప్పీల్ చేయగా అంపైర్ వెంటనే వేలెత్తి అవుట్ అని ప్రకటించాడు. అప్పటికే రాహుల్, నితీశ్ పరుగు పూర్తి చేశాడు. నితీష్ రాహుల్‌తో చర్చించి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి క్లియర్‌గా బ్యాట్ ఎడ్జ్ తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే నితీశ్ తీసిన రన్‌ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు.ఐసీసీ లా 20.1.1.3 ప్రకారం.. అంపైర్ ఒక బ్యాటర్‌ను అవుట్ అని ప్రకటించిన మరుక్షణమే ఆ బంతి 'డెడ్ బాల్' అవుతుంది. ఆ తర్వాత బంతి బౌండరీకి వెళ్లినా లెక్కలోకి తీసుకోరు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో అదే జరిగింది. నిర్ణయం మారినప్పటికీ అప్పటికే బాల్ డెడ్ కావడంతో బ్యాటర్లు తీసిన ఆ ఒక్క పరుగును అంపైర్లు నిరాకరించారు. ఆఖరికి ఢిల్లీ జట్టు కేవలం 1 పరుగు తేడాతోనే ఓడిపోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆ పరుగు ఇచ్చి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లేది.చదవండి: PSL 2026: డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఆ జట్టుకు కొత్త కెప్టెన్? -
మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?
-
కన్నీళ్లు పెట్టుకున్న డేవిడ్ మిల్లర్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 8) జరిగిన ఉత్కంఠ సమరంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీని గెలిపించేందుకు డేవిడ్ మిల్లర్ చివరి బంతి వరకు పోరాడి విఫలమయ్యాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన తరుణంలో మిల్లర్ సింగిల్‌కు నిరాకరించడం కీలక తప్పిదంగా మారింది. Backing our Tiger, always 🫂💙 pic.twitter.com/pAFouiVmVH— Delhi Capitals (@DelhiCapitals) April 9, 2026ఆఖరి బంతిని మిస్ చేయడంతో కుల్దీప్ యాదవ్ రనౌటయ్యాడు. దీంతో ఢిల్లీ పరుగు తేడాతో పరాజయంపాలైంది. అంతకుముందు ఓవర్లో (19) 23 పరుగులు బాది ఢిల్లీని గెలుపుకు చేరువ చేసింది కూడా మిల్లరే. ఇంత చేసి చివరికి మ్యాచ్ గెలిపించలేకపోవడంతో అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. బాధపడుతున్న మిల్లర్‌ను కెప్టెన్ అక్షర్ పటేల్, హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ ఓదార్చారు. మిల్లర్ భావోద్వేగ క్షణాలను డీసీ తమ సోషల్‌మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసింది. “Backing our Tiger, always 💙” అంటూ మిల్లర్‌కు మద్దతు తెలిపింది. ఇది నాణేనికి ఒకవైపు.. మరోవైపు, కొందరు సొంత అభిమానులే మిల్లర్‌ను తిట్టిపోశారు. 19వ ఓవర్ ఐదో బంతిలో సింగిల్ తీసుంటే కనీసం సూపర్ ఓవర్‌కి అవకాశం ఉండేది. తప్పంతా మిల్లర్‌దే అంటూ సోషల్‌మీడియాలో దుమ్మెత్తిపోశారు. అంత అతి విశ్వాసం పనికి రాదంటూ మిల్లర్‌కు చీవాట్లు పెట్టారు.నాణేనికి అటు ఇటు ఉన్న విషయాలను పక్కన పెడితే, మిల్లర్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఆ సందర్భంలో అనుభవమున్న ఏ బ్యాటర్ అయినా అలాగే చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇలా మిస్ ఫైర్ అవడం సహజమే. ఇందులో మిల్లర్‌ను నిందించాల్సిన అవసరం లేదు.ఎవరు ఔనన్నా, కాదన్నా ఈ సీజన్లో ఢిల్లీ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. తాజాగా గుజరాత్ చేతిలో ఓటమి మినహా, ఈ సీజన్లో ఆ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. వరుసగా లక్నో, ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా ఓటమి తర్వాత కూడా మెరుగైన రన్‌రేట్ కలిగి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ హైలైట్స్ - GT 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.- గిల్ (70), బట్లర్ (52), సుందర్ (55) అర్ద సెంచరీలతో రాణించారు. - ఛేదనలో DC ఓపెనర్లు కేఎల్ రాహుల్ (92), నిస్సంక (41) చెలరేగి ఆడారు. - గాయపడిన చేతితో డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్) చివరి బంతి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీని గెలిపించలేకపోయాడు. - రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 3/17తో DC మిడిలార్డర్‌ను కుదిపేశాడు. -
‘మిల్లర్ తప్పేమీ లేదు.. కుల్దీప్ స్ట్రైక్ తీసుకుంటే బాగుండేది’
టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మిల్లర్ తప్పేమీ లేదంటూ అతడికి మద్దతుగా నిలిచాడు. ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం మంచిదే అయినా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తప్పవని.. మిల్లర్ విషయంలోనూ ఇదే జరిగిందన్నాడు.ఐపీఎల్-2026లో భాగంగా ఢిల్లీ- గుజరాత్ బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడ్డా.. డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41*) విజయంపై ఆశలు పెంచాడు.ఒక్క పరుగు తేడాతోఈ ఐదో నంబర్ బ్యాటర్ ధనాధన్ దంచికొడుతూ ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకువచ్చాడు. అయితే, చివరి ఓవర్లో గుజరాత్ బౌలర్ ప్రసిద్ కృష్ణ రంగంలోకి దిగగా.. విప్రాజ్ నిగమ్ తొలి బంతికి సిక్స్ బాది మరుసటి బంతికి అవుటయ్యాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైక్ మిల్లర్‌కు ఇవ్వగా.. నాలుగో బంతికి అతడు సిక్సర్ బాదాడు.చివరి రెండు బంతుల్లో విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. మిల్లర్ సింగిల్‌కు నిరాకరించాడు. ఆఖరి బంతికి తానే హిట్టింగ్ ఆడాలని భావించగా.. ప్రసిద్ షార్ట్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో సింగిల్ తీసేందుకు మిల్లర్ ప్రయత్నించగా.. కుల్దీప్ స్ట్రైకర్ వైపునకు వచ్చే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.అతడి తప్పేమీ లేదుఈ నేపథ్యంలో మిల్లర్‌పై విమర్శలు వస్తుండగా.. భారత దిగ్గజ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాత్రం మద్దతుగా నిలిచాడు. "నిజానికి మిల్లర్ విన్నింగ్ రన్స్ తానే తీయాలని భావించాడు. అయితే, ఆఖరి ఓవర్లో కుల్దీప్ తాను ఎదుర్కొన్న తొలి బంతి ద్వారా సింగిల్ తీసిన తీరును మిల్లర్ గుర్తుంచుకోవాల్సింది.కుల్దీప్‌నకు స్ట్రైక్ ఇచ్చి ఉంటే బాగుండేది. అయితే, గత ఓవర్లో తాను సిక్సర్ బాదిన విషయాన్ని మనసులో పెట్టుకుని.. ఈసారి కూడా అదే పునరావృతం చేయగలనని మిల్లర్ విశ్వసించాడు. ఇందులో అతడి తప్పేమీ లేదు. కానీ ప్రసిద్ కృష్ణ అద్భుత బంతి సంధించి మిల్లర్ ఆశలపై నీళ్లు చల్లాడు’’ అని గావస్కర్ పేర్కొన్నాడు. చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026 -
శుబ్‌మన్ గిల్‌కు ‘ఊహించని’ షాక్!
గుజరాత్ టైటాన్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2026 టోర్నీలో బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఢిల్లీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్) చేసిన పొరపాటు టైటాన్స్ నెత్తిన పాలు పోసింది. ఫలితంగా ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో టైటాన్స్‌ను విజయం వరించింది.ధనాధన్సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన ఢిల్లీ.. గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్లు నష్టపోయి 210 పరుగులు సాధించింది. శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 70) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. జోస్ బట్లర్ (27 బంతుల్లో 52), వాషింగ్టన్ సుందర్ (32 బంతుల్లో 55) ధనాధన్ దంచికొట్టారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగుల వద్ద నిలిచిపోయింది. పాతుమ్ నిస్సాంక (24 బంతుల్లో 41), కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92), మిల్లర్ ఇన్నింగ్స్ వృథా అయ్యాయి. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ రెండు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.శుబ్‌మన్ గిల్‌కు ఊహించని షాక్అయితే, గెలుపు జోష్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీతో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఐపీఎల్ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.‘‘ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు జరిమానా విధించడమైనది. ఈ సీజన్లో ఇదే అతడి తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షల జరిమానాతో సరిపెడుతున్నాము’’ అని ఐపీఎల్ పాలక మండలి ప్రకటనలో పేర్కొంది. చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026 -
ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. కెప్టెన్ రియాక్షన్ ఇదే!
ఐపీఎల్-2026లో వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో అక్షర్ సేన ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్లో తొలి పరాజయాన్ని చవిచూసింది.ఆఖరి ఓవర్లో హైడ్రామాకాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ- గుజరాత్ (DC vs GT) మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తమ పేసర్ ప్రసిద్ కృష్ణను బరిలోకి దించాడు. అతడి ఓవర్లో తొలి బంతికే విప్రాజ్ నిగమ్ ఫోర్ బాదాడు.అయితే, మరుసటి బంతికే ప్రసిద్ విప్రాజ్‌ను అవుట్ చేసి ఢిల్లీ ఉత్సాహాన్ని నీరు గార్చాడు. దీంతో విజయ సమీకరణం మూడు బంతుల్లో 8 పరుగులుగా మారింది. ఆఖరి ఓవర్ మూడో బంతికి కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైక్ డేవిడ్ మిల్లర్‌కు ఇచ్చాడు.ఢిల్లీ కొంపముంచిన మిల్లర్ఈ క్రమంలో నాలుగో బంతికి మిల్లర్ తనదైన శైలిలో సిక్సర్ బాదాడు. దీంతో ఢిల్లీ గెలుపు దాదాపు ఖరారైనట్లేనని అంతా భావించారు. కానీ ఆఖరి రెండు బంతుల్లో మిల్లర్ చేసిన తపు ఢిల్లీ కొంపముంచింది. రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమైన సమయంలో.. ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీసేందుకు నిరాకరించాడు.కుల్దీప్ బదులు తానే స్ట్రైక్‌లో ఉండాలని భావించాడు. అయితే, ఆఖర్లో ప్రసిద్ షార్ట్ బాల్ సంధించగా.. మిల్లర్ షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. దీంతో సింగిల్‌కు యత్నించగా.. వికెట్ కీపర్ బట్లర్ బంతిని అందుకుని వికెట్లకు గిరాటేశాడు. ఒక్క పరుగు తేడాతోఅయితే, అప్పటికి కుల్దీప్ క్రీజులోకి రాకపోవడంతో రనౌట్ అయ్యాడు. ఆ సమయంలో ఢిల్లీ వైడ్ కోసం రివ్యూ తీసుకోగా ప్రతికూల ఫలితం వచ్చింది. దీంతో ఒక్క పరుగు తేడాతో గెలిచిన గుజరాత్ సంబరాలు అంబరాన్నంటగా.. ఢిల్లీకి భంగపాటు ఎదురైంది.ఈ నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఓటమి అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఎంతో సంయమనం పాటించాడు. మిల్లర్‌ను హత్తుకుని అతడిని ఓదార్చాడు. దీంతో అక్షర్ తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి స్థానంలో వేరే కెప్టెన్ ఉండి ఉంటే గనుక పరిస్థితి వేరుగా ఉండేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమంటూ ఢిల్లీ జట్టును కొనియాడుతున్నారు. కాగా ఇప్పటికి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఢిల్లీ రెండు గెలిచింది.చదవండి: అతడు లేనిలోటు తీరనిది.. బ్యాటర్లే మా ఓటములకు కారణం: క్లాసెన్Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026 -
‘సింగిల్’తో ఢిల్లీ డీలా
ఢిల్లీ విజయానికి చివరి 18 బంతుల్లో 45 పరుగులు కావాలి. రిటైర్డ్హర్ట్గాతప్పుకొని మళ్లీ క్రీజ్‌లోకి వచ్చిన మిల్లర్‌పైనే ఆశలు ఉన్నాయి. 18వ ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. అయితే సిరాజ్ వేసిన 19వ ఓవర్లో మిల్లర్ చెలరేగి 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 23 పరుగులు లభించాయి. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి 4 బంతుల్లో 11 పరుగులు లభించాయి. ఇక చేయాల్సింది 2 బంతుల్లో 2 పరుగులే! అయితే డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ వరకు బంతి వెళ్లినా సునాయాస సింగిల్ తీయకుండా కుల్దీప్ను మిల్లర్ వెనక్కి పంపించాడు. ఈ అనూహ్య నిర్ణయం ఢిల్లీని దెబ్బ తీసింది. ప్రసిధ్ కృష్ణ వేసిన షార్ట్ బంతిని మిల్లర్ ఆడలేకపోగా, సింగిల్ తీసే ప్రయత్నంలో కుల్దీప్ రనౌటయ్యాడు. వైడ్ కోసం అంపైర్లు పరిశీలించగా అది సరైందేనని తేలింది. దాంతో గుజరాత్ సంబరాలు చేసుకోగా... ఢిల్లీ బృందం నిరాశలో మునిగింది. అంతకుముందు గిల్, బట్లర్, సుందర్ అర్ధసెంచరీలతో గుజరాత్ భారీ స్కోరు చేసి ప్రత్యర్థికి సవాల్ విసిరింది. న్యూఢిల్లీ: మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో గెలుపు బోణీ చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన గుజరాత్ బుధవారం జరిగిన పోరులో ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), వాషింగ్టన్ సుందర్ (32 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (27 బంతుల్లో 52; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. రెండో వికెట్‌కు బట్లర్‌తో 32 బంతుల్లో 60 పరుగులు జోడించిన గిల్... మూడో వికెట్‌కు సుందర్‌తో 61 బంతుల్లో 104 పరుగులు జత చేశాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసి ఓడిపోయింది. కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేజార్చుకోగా, డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడాడు. భారీ భాగస్వామ్యం... ఓపెనర్ సాయి సుదర్శన్ (12) ఎక్కువ సేపు నిలవలేకపోయినా... చాలా కాలం తర్వాత బట్లర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడటంతో టైటాన్స్ భారీ స్కోరుకు పునాది పడింది. సిక్స్‌తో పరుగుల ఖాతా తెరిచిన బట్లర్...అక్షర్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. అనంతరం ముకేశ్ వేసిన మూడో ఓవర్లో అతను చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన అతను ఆ తర్వాత మరో సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులు చేయగా, 24 బంతుల్లోనే బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే కుల్దీప్ చక్కటి బంతితో అతని ఆటను ముగించాడు. ఈ దశలో గిల్, సుందర్ కలిసి ధాటిని ప్రదర్శించారు. విప్రాజ్ వేసిన 12వ ఓవర్ గుజరాత్‌కు కలిసొచ్చింది. ఈ ఓవర్లో సుందర్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, గిల్ మరో సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు లభించాయి. 33 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న గిల్... కుల్దీప్ ఓవర్లో మరో రెండు సిక్స్‌లతో చెలరేగాడు. గుజరాత్ ఆఖరి 4 ఓవర్లలో 42 పరుగులు రాబట్టగా... 30 బంతుల్లో సుందర్ అర్ధసెంచరీ పూర్తయింది. అనారోగ్యంతో గత మ్యాచ్‌లో ఆడని గిల్ కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు. ఒక్క కుల్దీప్ బౌలింగ్‌లోనే అతను నాలుగు సిక్సర్లు బాదడం విశేషం. రిజ్వీ విఫలం... సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది నిసాంక జోరుగా ఛేదనను మొదలు పెట్టాడు. ఆ తర్వాత అశోక్ ఓవర్లోనూ అతను వరుసగా 4, 6, 4, 4తో దూకుడు ప్రదర్శించాడు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన రాహుల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 63 పరుగులకు చేరింది. అశోక్ ఓవర్లోనే ఢిల్లీ 23 పరుగులు రాబట్టింది. తొలి వికెట్‌కు 76 పరుగుల (49 బంతుల్లో) తర్వాత నిసాంకను ప్రసిధ్ అవుట్ చేయగా...అదే ఓవర్ చివరి నాలుగు బంతుల్లో రాహుల్ వరుసగా 4, 6, 6, 4తో చెలరేగి 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీశ్ రాణా (5) మళ్లీ విఫలం కాగా, గత రెండు మ్యాచ్‌ల హీరో సమీర్ రిజ్వీ (0) ఈసారి తొలి బంతికే బౌల్డయ్యాడు. అక్షర్ పటేల్ (2) కూడా నిలబడలేకపోగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో రాహుల్ అవుటయ్యాడు. 12 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా బయటకు వెళ్లిన మిల్లర్ ఈ దశలో తిరిగొచ్చి చివరి వరకు పోరాడినా లాభం లేకపోయింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (బి) ముకేశ్ 12; గిల్ (సి) రాణా (బి) ఎన్గిడి 70; బట్లర్ (బి) కుల్దీప్ 52; సుందర్ (సి) రాణా (బి) ముకేశ్ 55; ఫిలిప్స్ (నాటౌట్) 14; తెవాటియా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–19, 2–79, 3–183, 4–205. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–55–2, ఎన్గిడి 4–0–24–1, అక్షర్ 3–0–32–0, కుల్దీప్ 4–0–42–1, నటరాజన్ 4–0–34–0, విప్రాజ్ 1–0–23–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) తెవాటియా (బి) ప్రసిధ్ 41; రాహుల్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 92; రాణా (సి) సుదర్శన్ (బి) రషీద్ 5; రిజ్వీ (బి) రషీద్ 0; మిల్లర్ (నాటౌట్) 41; అక్షర్ (సి) ఫిలిప్స్ (బి) రషీద్ 2; స్టబ్స్ (రనౌట్) 7; విప్రాజ్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 12; కుల్దీప్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–101, 3–101, 4–134, 5–160, 6–166, 7–202, 8–209. బౌలింగ్: సిరాజ్ 4–0–52–1, రబాడ 4–0–32–0, రషీద్ ఖాన్ 4–0–17–3, అశోక్ శర్మ 3–0–45–0, ప్రసిధ్ కృష్ణ 4–0–52–2, సుందర్ 1–0–11–0.ఐపీఎల్లో నేడుకోల్‌కతా X లక్నో వేదిక: కోల్‌కతారాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్,జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
జోస్ బట్లర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 23 పరుగులు! వీడియో
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. ఈ ధనధాన్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బట్లర్ మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు.ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్‌కు బట్లర్ చుక్కలు చూపించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బట్లర్ ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఓవర్ మొదటి బంతికే తన ఫేవరెట్ 'ర్యాంప్ షాట్'తో సిక్సర్ కొట్టి బౌలర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. బట్లర్ మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్ -
ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ విజయం
Gujarat titans vs Delhi capitals live Updates: ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమిఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. ప్రసిద్ద్ కృష్ణ పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి బంతికి కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడం మ్యాచ్ గుజరాత్ వశమైంది. ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) చివరి వరకు పోరాడనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు నిస్సాంక(41) కూడా రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ రెండు, సిరాజ్ ఓ వికెట్ సాధించాడు.మిల్లర్.. కిల్లర్అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ డేవిడ్ మిల్లర్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 12 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన సమయంలో మిల్లర్ వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 92 పరుగులు చేసిన రాహుల్.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 16 బంతుల్లో 42 పరుగులు కావాలి.ఢిల్లీ ఐదో వికెట్ డౌన్160 పరుగుల వద్ద ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన స్టబ్స్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. డిల్లీ విజయానికి 20 బంతుల్లో 50 పరుగులు కావాలిఢిల్లీ నాలుగో వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అక్షర్ పటేల్ కేవలం రెండు పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 36 బంతుల్లో 77 పరుగులు కావాలి. క్రీజులో కేఎల్ రాహుల్(71) ఉన్నాడు.డేవిడ్ మిల్లర్ రిటైర్డ్ హార్ట్డేవిడ్ మిల్లర్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఎడమ చేతి వేలి గాయం కారణంగా మిల్లర్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు.రషీద్ ఖాన్ మ్యాజిక్రషీద్ ఖాన్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ ఐదో బంతికి నితీష్ రాణా ఔట్ కాగా.. ఆరో బంతికి సమీర్ రిజ్వీ క్లీన్ బౌల్డయ్యాడు.కేఎల్ రాహుల్ ఫిప్టీతొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కేఎల్ రాహుల్.. గుజరాత్‌తో మ్యాచ్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 24 బంతుల్లో 41 పరుగులు చేసిన నిస్సాంక.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లు6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(26), నిస్సాంక(35) ఉన్నారు.4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 36/04 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(19), నిస్సాంక(15) ఉన్నారు.గిల్ విధ్వంసం.. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు, ఎంగిడి, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.శుభ్‌మన్ గిల్ ఔట్శుభ్మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన గిల్.. లుంగి ఎంగిడీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.భారీ స్కోర్ దిశగా గుజరాత్గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(51), వాషింగ్టన్ సుందర్(41) ఉన్నారు.గుజరాత్ రెండో వికెట్ డౌన్జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన బట్లర్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 85/2దూకుడుగా ఆడుతున్న గుజరాత్జోస్ బట్లర్(22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది.గుజరాత్ తొలి వికెట్ డౌన్19 పరుగుల గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 2.1 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 19/1టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. శుభ్‌మన్ తిరిగి రావడంతో కుమార్ కుశాగ్ర బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఢిల్లీ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్Innovative 🤝 Powerful Jos Buttler looks in the 𝙈.𝙊.𝙊.𝘿 tonight 😎#GT 68/1 after the powerplay. Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT | @josbuttler | @gujarat_titans pic.twitter.com/mLBuDqyQWl— IndianPremierLeague (@IPL) April 8, 2026 -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్
ఐపీఎల్-2026లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. భుజం, మోచేయి గాయాలతో బాధపడుతున్న స్టార్క్, కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.దీంతో అతడు ఢిల్లీ ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఏప్రిల్ 20 తర్వాతే ఢిల్లీ క్యాంప్‌లో చేరే సూచనలు కన్పిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లలో ఏప్రిల్ 8న గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 11న చెన్నై సూపర్ కింగ్స్‌తో, ఏప్రిల్ 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.అయితే స్టార్క్ గైర్హజరీలో ఢిల్లీ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ను లుంగి ఎంగిడీ, ముఖేష్ కుమార్, టి.నటరాజన్‌లు సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. అయినప్పటికీ స్టార్క్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ ఉంట జట్టు మరింత పటిష్టంగా మారుతుంది. స్టార్క్ ఇటీవల తన గైర్హాజరీపై భారత మీడియాలో వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించాడు.భారత మీడియాలో నా గైర్హాజరీపై రకరకాల కథనాలు ప్రచురిస్తున్నారు. కానీ అవన్నీ ఆ వాస్తవం. ఆస్ట్రేలియా సమ్మర్ సీజన్లో భుజం, మోచేయికి గాయాలయ్యాయి. వాటి తీవ్రత అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు వాటికి చికిత్స తీసుకుంటున్నాను అని స్టార్క్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా స్టార్క్‌ను ఐపీఎల్-2026కు ముందు రూ.11.75 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో అతడు 11 వికెట్లు పడగొట్టాడు.చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ అరెస్టు -
అతడిని వదిలి సీఎస్కే తప్పు చేసిందా?
ఐపీఎల్ 2026 సీజన్లో సమీర్ రిజ్వీ సంచలన ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించడమే గాక రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో రిజ్వీ (47 బంతుల్లోనే 70 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి లక్నో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. తాజాగా శనివారం ముంబై ఇండియన్స్‌పై అదే తరహాలో రెచ్చిపోయాడు. ఈసారి కాస్త డోసు పెంచిన సమీర్ రిజ్వీ (Sameer Rizvi) 51 బంతుల్లోనే 90 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ హీరోగా నిలిచాడు. నిజానికి సమీర్ రిజ్వీ క్రీజులోకి వచ్చే సమయానికి ఢిల్లీ 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ సమయంలో క్రీజులో అడుగుపెట్టిన రిజ్వీ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. రెండు మ్యాచ్‌లు కలిపి 160 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు సమీర్ రిజ్వీని చెన్నై సూపర్‌కింగ్స్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో రిజ్వీకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. అయితే 2025 సీజన్‌కు ముందు రిజ్వీని విడుదల చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రిజ్వీని కేవలం రూ. 95 లక్షలకే దక్కించుకుంది. కానీ ఇప్పుడు రిజ్వీ మాత్రం తక్కువ ధరకే ఎక్కువ లాభాలు చూపిస్తున్నాడు. దీంతో సీఎస్కే అభిమానులు ఆ జట్టు యాజమాన్యాన్ని ట్రోల్స్‌తో ముంచెత్తారు. ‘చెన్నై జట్టులో ఉన్నప్పుడు అవకాశాలు ఇవ్వలేదు.. ఇప్పుడేమో ఢిల్లీ తరఫున విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ అవార్డులు కొల్లగొడుతున్నాడు’.. ‘సమీర్ రిజ్వీని వదిలేసి సీఎస్కే దిద్దుకోలేని తప్పు చేసింది’ అని కామెంట్లు పెట్టారు. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్ లోనూ 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను సమీర్ రిజ్వీ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గెలిపించడం విశేషం.Sameer Rizvi's last 3 knocks for Delhi Capitals:vs PBKS - 58(25)vs LSG - 70(47)vs MI - 90(51)& u know what? CSK let him go to DC for just 95 lakhs when he showed glimpses of his unlimited potential in very 1st game. CSK is worse team for youngsters!pic.twitter.com/zmDEOe9SMB— Rajiv (@Rajiv1841) April 4, 2026🚨 BIG BLUNDER FROM CSK> CSK bought Sameer Rizvi in 2024 for 8.40 CR> Played him mostly at No.6> Didn't give him chances> Released him in 2025> Delhi Capitals bought him for just ₹95 lakh> Backed him at No. 4 and now he’s winning matches for thempic.twitter.com/bjZBi0KipG— Tejash (@Tejashyyyyy) April 4, 2026చదవండి: కార్ల్సన్ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్‌కు అవమానం! -
రోహిత్ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మైండ్ బ్లాక్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ చేసిన ఒక తుంటరి పనికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ మైండ్ బ్లాక్ అయింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇన్నింగ్స్ 9వ ఓవర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. కాగా కుల్దీప్ వేసిన బంతిని రోహిత్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్సయ్యి రోహిత్ పక్కనుంచి వెళ్లి కీపర్ కేఎల్ రాహుల్ చేతుల్లో పడింది. అయితే కుల్దీప్ రోహిత్ చేతిని తాకి కీపర్ చేతుల్లోకి పడిందన్న అనుమానం కలిగి అంపైర్‌కు అప్పీల్ చేశాడు. ఇక్కడే రోహిత్ తనలోని తుంటరి చేష్టలను బయటకు తీశాడు. తాను ఔటయ్యానంటూ రోహిత్ డగౌట్ వెళుతున్నట్లు అంపైర్‌కు సైగలు చేశాడు. కానీ అంపైర్ మాత్రం రోహిత్ ఔట్ అంటూ వేలు పైకి ఎత్తలేదు. అయితే రోహిత్ తాను ఔట్ అంటూ పెవిలియన్ వైపు నడవడం చూసి కుల్దీప్, రాహుల్ డీఆర్ ఎస్ రివ్యూ కోరారు. దీంతో థర్డ్ అంపైర్ రివ్యూను పరిశీలిస్తున్న సమయంలోనే రోహిత్ పగలబడి నవ్వాడు. ఎందుకంటే బంతి తనకు చాలా దూరంగా వెళ్లిందన్న విషయం రోహిత్‌కు తెలుసు. రిప్లేలో కూడా అదే కనిపించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తన రివ్యూను వృథా చేసుకున్నట్లయింది. ఆ తర్వాత రోహిత్ కుల్దీప్, రాహుల్ వైపు చూడగా వారు చిరునవ్వుతో కనిపించారు. ముంబై ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం రోహిత్ మట్లాడుతూ.. ‘కుల్దీప్ రివ్యూకు వెళతాడని ముందే ఊహించాను. బంతి నాకు తగల్లేదని నేను క్లియర్‌గా ఉన్నప్పటికీ.. కుల్దీప్ 50-50 చాన్స్‌తో రివ్యూకు వెళ్లొచ్చని ఊహించాను. నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అలా చేశాను. అందుకే పెవిలియన్‌కు వెనుదిరుగుతున్నట్లు నటించాను. నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాను. మరుసటి ఓవర్లోనే నా ఇన్నింగ్స్‌కు తెరపడింది. కానీ కుల్దీప్, రాహుల్‌తో జరిగిన ఫన్నీ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను మంచి ఈజ్‌తోనే ప్రారంభించాడు. 26 బంతుల్లో 35 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (51) అర్థసెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. సమీర్ రిజ్వీ (90) సంచలన ఇన్నింగ్స్‌తో ఢిల్లీకి విజయాన్ని అందించాడు.Mind games, ft. Rohit Sharma and Kuldeep Yadav 😉🎥 Hear Rohit's take on the eventful DRS call involving the duo 😄#TATAIPL | #KhelBindaas | #DCvMI | @ImRo45 | @imkuldeep18 | @DelhiCapitals | @mipaltan pic.twitter.com/vUw7eAZhwX— IndianPremierLeague (@IPL) April 4, 2026చదవండి: మొదట్లో చితక్కొట్టినా చివర్లో వణికించాడు! -
'సూపర్' సమీర్
గత మ్యాచ్‌లో లక్నోపై తన మెరుపు బ్యాటింగ్ ట్రైలర్‌తో సరిపెట్టిన సమీర్ రిజ్వీ... ఈ సారి ముంబై బౌలర్లకు సినిమా చూపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రిజ్వీ... కుదురుకున్నాక మైదానం నలువైపులా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్నట్లు చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం చేరింది. బ్యాటింగ్‌లో ముంబై ఇండియన్స్ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోగా...ఆపై సమీర్ ధాటికి బౌలర్లు నిలువలేకపోవడంతో పరాజయం మూటగట్టుకుంది.న్యూఢిల్లీ: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ఐపీఎల్ 19వ సీజన్లో వరుసగా రెండో విజయం తమ ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో లక్నోను చిత్తుచేసిన అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్... శనివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన మొదటి పోరులో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. 13 ఏళ్ల తర్వాత విజయంతో సీజన్‌ను ఆరంభించిన ముంబై తమ రెండో మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో కనీస ప్రదర్శన కనబర్చలేక వెనుకబడి పోయింది. ఏకపక్షంగా సాగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరం కావడంతో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించగా...రోహిత్ శర్మ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సమీర్ రిజ్వీ (51 బంతుల్లో 90; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి పతుమ్ నిసాంక (30 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. 2025 సీజన్ ఢిల్లీ ఆఖరి మ్యాచ్‌నుంచి చూస్తే రిజ్వీ వరుసగా మూడో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకోవడం విశేషం. నాలుగే సిక్స్‌లు... గత మ్యాచ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మైదానంలో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో చెలరేగారు. ముకేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (9), హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (0) పెవిలియన్ బాటపట్టారు. దీంతో ముంబై 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్‌తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఇద్దరు విధ్వంసకర వీరులు క్రీజులో ఉన్నా... ఆశించినంత వేగంగా ఆడలేకపోయారు. మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ వెనుదిరగగా... షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (5) విఫలమయ్యాడు. ఆఖర్లో నమన్ ధీర్ (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), సాంట్నర్ (18 నాటౌట్; 2 ఫోర్లు) కాస్త పోరాడటంతో ముంబై ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో నాలుగు సిక్స్‌లు మాత్రమే నమోదయ్యాయి. పవర్‌ప్లేలో ఒక్క సిక్స్ కూడా లేకుండా ముంబై ముగించడం 2023 తర్వాత ఇదే తొలిసారి. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్... గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్... ఈ పోరులో ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అస్వస్థతకు గురవడంతో... అతడి స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్నాడు. బ్యాటింగ్‌లో హాఫ్‌సెంచరీ చేసిన సూర్య... జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.సమీర్ సెంచరీ మిస్... గత మ్యాచ్‌లో లక్నో బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న సమీర్ రిజ్వీ... ముంబైపై అదే దూకుడు కొనసాగించాడు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (1) మరోసారి విఫలం కాగా... నితీశ్ రాణా (0) డకౌటయ్యాడు. దీంతో ఢిల్లీ జట్టు 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించగా... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సమీర్ రిజ్వీతో కలిసి నిసాంక పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆరంభంలో నిసాంక వేగంగా ఆడగా... అతడికి రిజ్వీ అండగా నిలిచాడు. సాంట్నర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన నిసాంక... శార్దుల్ ఠాకూర్ ఓవర్లో 6, 4, 4తో చెలరేగాడు. మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం నిసాంక అవుట్ కాగా... అక్కడి నుంచి రిజ్వీ దంచుడు ప్రారంభమైంది. అప్పటి వరకు 23 బంతుల్లో 25 పరుగులే చేసిన రిజ్వీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బాష్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో 4, 4, 6, 6తో 20 పరుగులు రాబట్టిన సమీర్... మయాంక్ మార్కండేకు రెండు సిక్స్‌లు రుచి చూపించాడు. ఈక్రమంలో 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న రిజ్వీ... దీపక్ చాహర్ ఓవర్లో 4, 6... శార్దుల్ ఓవర్లో 4, 4, 6తో సెంచరీకి సమీపించాడు. అయితే మరో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో బాష్ బౌలింగ్‌లో అతడు వెనుదిరగగా... మిల్లర్ (21 నాటౌట్; 4 ఫోర్లు), స్టబ్స్ (3 నాటౌట్) మిగిలిన పనిపూర్తి చేశారు. 17 ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సాధించిన విజయాలు. ముంబైపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (18) అగ్రస్థానంలో ఉంది.స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) అక్షర్ (బి) ముకేశ్ 9; రోహిత్ (సి) నితీశ్ రాణా (బి) అక్షర్ 35; తిలక్ (సి అండ్ బి) ముకేశ్ 0; సూర్యకుమార్ (ఎల్బీ) ఎన్గిడి 51; రూథర్‌ఫోర్డ్ (సి) ముకేశ్ (బి) విప్రాజ్ 5; నమన్ (సి) స్టబ్స్ (బి) నటరాజన్ 28; సాంట్నర్ (నాటౌట్) 18; బాష్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–71, 4–85, 5–122, 6–146. బౌలింగ్: ముకేశ్ 3–0–26–2; ఎన్గిడి 4–0–34–1; అక్షర్ 4–0–22–1; విప్రాజ్ 3–0–24–1; కుల్దీప్ 3–0–31–0; నటరాజన్ 3–0–24–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) రికెల్టన్ (బి) దీపక్ 1; నిసాంక (సి) మార్కండే (బి) సాంట్నర్ 44; నితీశ్ రాణా (రనౌట్) 0; సమీర్ రిజ్వీ (సి) తిలక్ (బి) బాష్ 90; మిల్లర్ (నాటౌట్) 21; స్టబ్స్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–2, 2–7, 3–73, 4–151. బౌలింగ్: దీపక్ చాహర్ 3–0–20–1; బుమ్రా 4–0–21–0; సాంట్నర్ 3–0–22–1; శార్దుల్ 3–0–41–0; మార్కండే 2–0–20–0; కార్బిన్ బాష్ 3.1–0–39–1. -
ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) మధ్యాహ్నం (3:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడగా.. ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. ఢిల్లీ మరో 11 బంతులు మిగిలుండగానే (18.1 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సమీర్ రిజ్వి (90) వరుసగా రెండో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని గెలిపించాడు.అంతకుముందు లక్నోపై కూడా రిజ్వి (70 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ముంబైపై తాజా హాఫ్ సెంచరీ రిజ్వికి ఐపీఎల్లో వరుసగా మూడవది. గత ఎడిషన్ చివరి మ్యాచ్‌లోనూ (పంజాబ్) అతను అజేయ హాఫ్ సెంచరీ (58) సాధించాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ఓ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఢిల్లీ లక్ష్యానికి చేరువైన తరుణంలో (16.4వ ఓవర్) స్ట్రయికర్ (మిల్లర్), నాన్ స్ట్రయికర్ (ట్రిస్టన్ స్టబ్స్), బౌలర్ (కార్బిన్ బాష్), వికెట్‌కీపర్ (ర్యాన్ రికెల్టన్, ముంబై) నలుగురూ సౌతాఫ్రికన్లే ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది.గతంలో ఒకే దేశానికి చెందిన నలుగురు ఇలా వేర్వేరు పోజిషన్లలో ఆడిన దాఖలాలు ఇప్పటివరకు రికార్డు కాలేదు. ఒకవేళ ఇలాంటి ఘట్టాలు ఎక్కడైనా నమోదైనా, సౌతాఫ్రికన్లు ఆ నాలుగు పోజిషన్లలో ఉండి ఉండే అవకాశం మాత్రం లేదు. ఫ్రాంచైజీ లీగ్ పుణ్యమా అని ఇలాంటి సిత్రాలన్నీ జరుగుతూ ఉంటాయి. -
సమీర్ రిజ్వీ సంచలనం.. ముంబైకి షాకిచ్చిన ఢిల్లీ
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ యువ సంచలనం సమీర్ రిజ్వీ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రిజ్వీ.. ముంబై బౌలర్లను ఉతికారేశాడు. ఓ దశలో తొలి ఐపీఎల్ సెంచరీ చేసేలా కన్పించిన రిజ్వీ.. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. మొత్తంగా 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి రిజ్వీ ఔటయ్యాడు. అతడితో పాటు పాటు ఫాథుమ్ నిస్సాంక 44 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శాంట్నర్, బాష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(35), నమన్ధీర్(28) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, అక్షర్ పటేల్, నిగమ్, నటరాజన్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. సమీర్ రిజ్వీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2026: అర్జున్ సంచలన బౌలింగ్.. స్టంప్స్ ఎగిరిపోయాయి! వీడియో -
రాహుల్ మరోసారి..!
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్‌లో తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటైన ఇతను.. ముంబై ఇండియన్స్‌తో ఇవాల్టి (ఏప్రిల్ 4) మ్యాచ్‌లో ఖాతా తెరిచిన వెంటనే ఇన్నింగ్స్‌ను ముగించాడు.రాహుల్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆందోళన మొదలైంది. ఆ జట్టు ఫ్యాన్స్ రాహుల్‌ను బహిరంగంగా టార్గెట్ చేస్తున్నారు. జట్టులో అందరి కంటే సీనియర్వి.. మిగతా ఆటగాళ్లను ఆదర్శంగా ఉండాలంటూ చురకలంటిస్తున్నారు. మరోపక్క టీమిండియా సీనియర్లతో కంపేర్ చేస్తూ నిందిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ రాణించారు. రాహుల్ మాత్రమే ఎందుకు విఫలమవుతున్నాడని ఫీలవుతున్నారు.ఇదిలా ఉంటే, రాహుల్ విఫలమైన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గట్టెక్కిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రాహుల్ సహా నిస్సంక, నితీశ్ రాణా, అక్షర్ పటేల్ విఫలమైనా, సమీర్ రిజ్వి (70 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) సహకరించాడు.ముంబై ఇండియన్స్‌తో నేటి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతుంది. 7 పరుగులకే రాహుల్, నితీశ్ రాణా (0) వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. నిస్సంక (39), సమీర్ రిజ్వి (7) ఢిల్లీని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముకేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీశారు. కుల్దీప్ యాదవ్ (3-0-31-0) మినహా ఢిల్లీ బౌలర్లంతా పొదుపుగా కూడా బౌలింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ (35) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. -
IPL 2026: ధోనిని అధిగమించిన రోహిత్
ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 4) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై తన సిక్సర్ల సంఖ్యను 51కి పెంచుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన విభాగంలో ఎంఎస్ ధోనిని అధిగమించాడు. ధోని ఆర్సీబీపై 50 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో రోహిత్, ధోని తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. విరాట్ సీఎస్కేపై 48 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్ ఖాతాలో ఉంది. గేల్ పంజాబ్ కింగ్స్‌పై 61, కేకేఆర్‌పై 54 సిక్సర్లతో తొలి స్థానాలను ఆక్రమించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై మెరుపు అర్ద సెంచరీ (38 బంతుల్లో 78 పరుగులు; సిక్స్‌లు, 7 ఫోర్లు) చేసిన అతను.. ఇవాళ ఢిల్లీతో మ్యాచ్‌లో 26 బంతుల్లో 35 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు.ఢిల్లీ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 19 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముకేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీశారు. కుల్దీప్ యాదవ్ (3-0-31-0) మినహా ఢిల్లీ బౌలర్లంతా పొదుపుగా కూడా బౌలింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ (35) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. -
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!
ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌కు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాడు.ఐపీఎల్-2026 సీజన్లో శనివారం తొలి డబుల్ హెడర్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్.. సాయంత్రం మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్- రాజస్తాన్ రాయల్స్ అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి.ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, టాస్ సమయంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బదులు సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి వచ్చాడు. దీంతో హార్దిక్ జట్టుకు దూరమైన విషయం తెలిసింది.ఈ విషయం గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. స్వల్ప అనారోగ్యం కారణంగా హార్దిక్ పాండ్యా మ్యాచ్‌కు అందుబాటులో ఉండలేకపోయాడని తెలిపాడు. అదే విధంగా... తమ తుదిజట్టులో మూడు మార్పులు జరిగినట్లు వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా స్థానంలో దీపక్ చహర్ వచ్చినట్లు సూర్య తెలిపాడు.ఇక ట్రెంట్ బౌల్ట్ స్థానంలో దీపక్ చహర్, అల్లా ఘజన్ఫర్ స్థానంలో మిచెల్ సాంట్నర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడుతున్నట్లు సూర్య వెల్లడించాడు. మరోవైపు.. తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తుదిజట్లుఢిల్లీ క్యాపిటల్స్కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీశ్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి. నటరాజన్, ముకేశ్ కుమార్.ముంబై ఇండియన్స్రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: ‘ధోని ఎక్కడి నుంచో వచ్చాడు.. రో-కోలకు ముఖం మీదే చెప్పేయండి’ -
సమీర్ రిజ్వీ విధ్వంసం.. ముంబైను చిత్తు చేసిన ఢిల్లీ
ముంబైను చిత్తు చేసిన ఢిల్లీఅరుణ్ జైట్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది. యువ సంచలనం సమీర్ రిజ్వీ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. అతడితో పాటు ఫాథుమ్ నిస్సాంక 44 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శాంట్నర్, బాష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది.రిజ్వీ ఔట్సమీర్ రిజ్వీ తొలి ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి రిజ్వీ ఔటయ్యాడు. సెంచరీకి చేరువలో సమీర్👉సమీర్ రిజ్వీ దుమ్ములేపుతున్నాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు.సమీర్ రిజ్వీ హాఫ్ సెంచరీసమీర్ రిజ్వీ మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి సత్తాచాటాడు. కేవలం 31 బంతుల్లోనే తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 58 పరుగులతో సమీర్ క్రీజ్‌లో ఉన్నాడు.నిస్సాంక ఔట్👉నిస్సాంక(44) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది.దూకుడుగా ఆడుతున్న నిస్సాంక9 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. పాథుమ్ నిస్సాంక(43) దూకుడుగా ఆడుతుండగా.. సమీర్ రిజ్వీ(19) ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ విజయానికి 66 బంతుల్లో 97 పరుగులు కావాలి.ఢిల్లీ రెండో వికెట్ డౌన్7 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. నితీష్ రాణా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.కేఎల్ రాహుల్ ఔట్ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్‌కు చేరాడు.సూర్యకుమార్ హాఫ్ సెంచరీ.. ముంబై స్కోరెంతంటే?అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితమైంది.ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్, నటరాజన్, లుంగి ఎంగిడి, విప్రజ్ నిగమ్ తలా వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(35), నమన్ ధీర్(28) రాణించాడు. తిలక్ వర్మ(0),ర్యాన్ రికెల్టన్(9), రూథర్ ఫర్డ్(5) విఫలమయ్యారు.👉ముంబై ఇండియన్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన నమన్ ధీర్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఐదో వికెట్ డౌన్15.3: లుంగి ఎంగిడి బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51). ముంబై స్కోరు: 122-5(15.3). నమన్ ధిర్ 18 పరుగులతో ఉన్నాడు. సాంట్నర్ క్రీజులోకి వచ్చాడు.ముంబై నాలుగో వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన షెర్ఫెన్ రూథర్ ఫర్డ్ విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ముంబై స్కోర్: 92-4రోహిత్ ఔట్71 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి షెర్ఫెన్ రూథర్ ఫర్డ్ వచ్చాడు.👉9 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(25), రోహిత్ శర్మ(34) ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ముంబై 2.5: రికెల్టన్ను అవుట్ చేసిన ముకేశ్ కుమార్ తిలక్ వర్మ (2 బంతుల్లో 0)ను డకౌట్ చేశాడు. సూర్యకుమార్ క్రీజులోకి రాగా.. రోహిత్ 9 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 22-2(3)తొలి వికెట్ డౌన్2.3: ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (11 బంతుల్లో 9). ముంబై స్కోరు: 18-1(2.4). తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 9 పరుగులతో ఉన్నాడు.హార్దిక్ పాండ్యాకు అనారోగ్యంఢిల్లీతో మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ మ్యాచ్‌లో ముంబై మొత్తంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. కార్బిన్ బాష్, దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్ తుది జట్టులోకి వచ్చారు. ట్రెంట్ బౌల్ట్, ఘజన్ఫర్లకు విశ్రాంతి ఇచ్చారు. ఢిల్లీ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రాఢిల్లీ క్యాపిటల్స్ : కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్చదవండి: PSL 2026: ఐపీఎల్ పొమ్మంది.. కట్ చేస్తే! అక్కడ వరల్డ్ రికార్డు -
రోహిత్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై రోహిత్ శర్మ ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో 1057 పరుగులు సాధించాడు. కాగా రోహిత్ కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. ఈ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ 30 ఇన్నింగ్స్‌ల్లో 1,130 పరుగులు సాధించాడు. కోహ్లీ కంటే 73 పరుగులు వెనుకబడి ఉన్న రోహిత్ ఢిల్లీతో మ్యాచ్‌లోనే ఆ ఫీట్‌ను సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సీజన్‌ను రోహిత్ శర్మ మంచి ఈజ్‌తో ప్రారంభించాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే రోహిత్ 38 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై 21-16 విజయాలతో ఢిల్లీపై ఆధిక్యతను కలిగి ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీపై ముంబై నాలుగు విజయాలు సాధించడం విశేషం.చదవండి: ‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’ -
ఐపీఎల్లో నేడు ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్లో తొలి ‘డబుల్ హెడర్’కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో జరిగే పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా... అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఎదుర్కొంటుంది. తమ తొలి మ్యాచ్‌ల్లో నెగ్గి ముంబై, ఢిల్లీ జోరు మీదుండగా ... సొంత మైదానంలో లీగ్‌లో బోణీ చేయాలని గుజరాత్ పట్టుదలగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అదృష్టవశాత్తూ ఓటమి నుంచి తప్పించుకుంది. 142 పరుగుల ఛేదనలో 26/4తో కష్టాల్లో ఉన్న సమయంలో రిజ్వీ, స్టబ్స్ పట్టుదలగా ఆడి గెలిపించారు. ఈ నేపథ్యంలో టాపార్డర్ నుంచి జట్టు మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మరోవైపు కోల్‌కతాపై 221 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించిన ముంబై అదే దూకుడును కొనసాగించాలని భావిస్తోంది. రికెల్టన్, రోహిత్, సూర్య, తిలక్, పాండ్యాలతో టాప్–5 బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గుజరాత్ బోణీ చేసేనా! తొలి మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేసిన ఉత్సాహంతో రాజస్తాన్ రెండో పోరుకు సై అంటోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని అడ్డుకోవడమే గుజరాత్‌కు కీలకం కానుంది. సొంత మైదానంలో విజయంతో ఖాతా తెరవాలని ఆశిస్తున్న టైటాన్స్ తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయకపోవచ్చు. గత పోరులో ఫలితం ప్రతికూలంగా వచి్చనా...టాప్–4 బ్యాటర్లు గిల్, సుదర్శన్, బట్లర్, ఫిలిప్స్‌పైనే జట్టు ఆధారపడి ఉంది. -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కీలక అడుగు
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ నిఖిల్ చౌధరి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరినట్లు తెలుస్తుంది. తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అతను డీసీ ఆటగాళ్లతో కలిసి కనిపించాడు. దీంతో నిఖిల్‌ను జట్టు నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారన్న టాక్ నడుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన లేనప్పటికీ.. డీసీ మాత్రం నిఖిల్‌ను లాక్ చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. నిఖిల్ భారత మూలాలున్న ఆస్ట్రేలియా ఆటగాడు. ఇతను ఢిల్లీలో జన్మించాడు. కుటుంబంతో సహా చిన్నతనంలోనే ఆస్ట్రేలియాకి వెళ్లిన నిఖిల్.. టాస్మానియా తరఫున క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. 29 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ ఐపీఎల్ 2026 వేలంలో విదేశీ ఆటగాడిగా నమోదు చేసుకున్నప్పటికీ ఎవరూ కొనుగోలు చేయలేదు.నిఖిల్ తాజాగా ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లో హోబార్ట్ హరికేన్స్ తరఫున రాణించాడు. ఈ సీజన్లో అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 153.50 స్ట్రైక్ రేట్‌తో 307 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే నిఖిల్ ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. లెగ్ స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉన్న నిఖిల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిడిలార్డర్లో ఉపయోగకరమైన ఆటగాడిగా మారవచ్చు.ఇదిలా ఉంటే, ఢిల్లీ ఈ సీజన్‌ను గెలుపుతో బోణీ కొట్టింది. తాజాగా ముగిసిన మ్యాచ్‌లో ఈ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమీర్ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకరించాడు.ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రేపు ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. -
ముంబై ఇండియన్స్‌కు శుభవార్త
ఐపీఎల్-2026లో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ ఆరంభ మ్యాచ్ ఆడిన హార్దిక్ సేన.. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సత్తా చాటింది.ఓ శుభవార్త ఈ క్రమంలో తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి ఈ మ్యాచ్‌కు అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు ఓ శుభవార్త అందింది.న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ గురువారం ముంబై జట్టుతో చేరాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండనున్నాడు. కాగా భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సాంట్నర్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియాతో ఫైనల్లో కివీస్ ఓడిపోవడంతో అతడు రన్నరప్ జట్టు కెప్టెన్‌గా మిగిలిపోయాడు.ఐదు సీజన్ల పాటుఇదిలా ఉంటే.. 2019లో ఐపీఎల్లో అడుగుపెట్టిన మిచెల్ సాంట్నర్.. ఐదు సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగాడు. అయితే, 2025 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలించుకోగా.. ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఇక తుదిజట్టులో సాంట్నర్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో చోటు దక్కడం కష్టమే అయినా.. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మంచి బ్యాకప్ ఆప్షన్‌గా పనిచేస్తాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో సాంట్నర్ 31 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు చెందిన దాదాపు అందరు ప్లేయర్లు జట్టుతో చేరారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్‌జాక్స్ ఒక్కడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు.ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ జట్టుఅల్లా ఘజన్ఫర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ (లక్నో నుంచి ట్రేడింగ్), అశ్వనీ కుమార్, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (ట్రేడింగ్), కార్బిన్ బాష్, రఘు శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్, రాజ్ అంగద్‌బవా, తిలక్ వర్మ, హార్దిక్‌పాండ్యా, రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, మయాంక్ మార్కండే (ట్రేడింగ్), రియాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ , మయాంక్ రావత్, అథర్వ అంకోలేకర్, మొహమ్మద్ ఇజ్హార్ , డానిశ్ మాలేవర్.చదవండి: IPL 2026: ‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం! -
ఇంపాక్ట్‌గా వచ్చి ఇరగదీశాడు.. ఎవరీ సమీర్ రిజ్వీ?
'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నాకు నచ్చదు.. అందుకు నేను బిగ్ ఫ్యాన్ కాదు'.. ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే యాదృచ్చికంగా అదే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఢిల్లీకి తొలి విజయాన్ని అందించింది. ఐపీఎల్-19వ సీజన్లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అయితే ఈ విజయంలో యువ ఆటగాడు సమీర్ రిజ్వీది కీలక పాత్ర. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.సమీర్ సంచలనం..ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో కేవలం 141 పరుగులకే కుప్పకూలింది. లుంగీ ఎంగిడీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, టి. నటరాజన్ తమ బౌలింగ్‌తో లక్నో పతనాన్ని శాసించారు. అయితే 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ సులువుగా సాధిస్తుందని అంతా భావించారు. కానీ లక్నో తరపున అరంగేట్రం చేసిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ.. ఢిల్లీ ఇన్నింగ్స్ మొదటి బంతికే కేఎల్ రాహుల్‌ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత దాదాపు 15 నెలల తర్వాత బరిలోకి దిగిన మొహ్సిన్ ఖాన్.. తన మొదటి ఓవర్లోనే నితీష్ రాణాను ఔట్ చేసి ఢిల్లీని బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. ఆ ఓవర్లో కనీసం ఒక్క పరుగు కూడా అతడు ఇవ్వలేదు. అనంతరం యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో ఒకే ఓవర్లో పాతుమ్ నిస్సంకను, అక్షర్ పటేల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఢిల్లీ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఢిల్లీ మేనెజ్మెంట్ సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపింది. వాస్తవానికి ఆరంభంలో వికెట్లు పడకపోయింటే గత సీజన్లో రాణించిన అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేవాడు. కానీ త్వరగా వికెట్లు పడిపోవడంతో రిజ్వీని ఇంపాక్ట్ సబ్‌గా పంపాల్సి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన రిజ్వీ.. లక్నో పేసర్లను ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించాడు. అతడు తను ఎదుర్కొన్న తొలి 13 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపి ఢిల్లీ తప్పు చేసిందా? అన్న భావన అందరిలోనూ కలిగింది. కానీ ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఆఖరి బంతికి నోకియా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన సమీర్ రిజ్వీ.. ఆ తర్వాత మరి ఆగలేదు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి స్కోర్ బోర్డులో వేగం పెంచాడు. స్పిన్నర్లను ఓ ఆట ఆడుకున్నాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో 3 ఫోర్లు బాదిన సమీర్ రిజ్వీ.. ఐడైన్ మార్క్రమ్ బౌలింగ్‌లో 6,4 బాది 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి అజేయంగా 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొన్న రిజ్వీ.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో ఎవరీ సమీర్ రిజ్వీ అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.ఎవరీ సమీర్ రిజ్వీ?ఐపీఎల్-2024 మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీని రూ. 8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఒక అన్-క్యాప్డ్ ప్లేయర్ కోసం సీఎస్కే ఇంత భారీ మొత్తం వెచ్చించడం అప్పటిలో సంచలనంగా మారింది. ఐపీఎల్లో తను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన రిజ్వీ.. తర్వాత తన జోరును కొనసాగించలేకపోయాడు. ఆ ఏడాది 8 మ్యాచ్‌లు ఆడిన రిజ్వీ కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు సీఎస్కే అతడిని విడిచిపెట్టింది. ఈ మెగా వేలంలో రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ. 95 లక్షలకే సొంతం చేసుకుంది. గత సీజన్లో అతడు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం 121 పరుగులు చేశాడు. అయినప్పటికి అతడిపై నమ్మకం ఉంచిన ఢిల్లీ యాజమాన్యం తిరిగి రిటైన్ చేసుకుంది. ఇప్పుడు మేనెజ్మెంట్ నమ్మకాన్ని రిజ్వీ నిలబెట్టుకున్నాడు.22 ఏళ్ల సమీర్ రిజ్వీ ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. యూపీ టీ20 లీగ్ అరంగేట్ర సీజన్(2024)లో రిజ్వీ దుమ్ములేపాడు. కాన్పూర్ సూపర్‌స్టార్స్ తరపున ఆడిన రిజ్వీ.. కేవలం 49 బంతుల్లోనే 104 అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే అతడిని సీఎస్కే అంత భారీ ధరకు సొంతం చేసుకుంది. అతడిని అందరూ "రైట్ హ్యాండెడ్ సురేష్ రైనా" అని పిలుస్తారు.రైనా లాగే మిడిల్ ఓవర్లలో వచ్చి వేగంగా పరుగులు రాబట్టడం, భారీ షాట్లు ఆడడం సమీర్ స్పెషాలిటీ. రైనా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఒక స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో రిజ్వీ కూడా నడుస్తున్నాడు. సమీర్ రిజ్వీ ఫస్ట్ క్రికెట్లో యూపీ తరపున ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడాడు. కానీ రెడ్‌బాల్ క్రికెట్లో అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ లిస్ట్-ఎ, టీ20 క్రికెట్లో మాత్రం తన హవాను కొనసాగిస్తున్నాడు.చదవండి: KKR vs SRH: సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్? -
ఢిల్లీ గెలుపు సమీరం
ఐపీఎల్లో మరో మ్యాచ్ స్వల్ప స్కోర్లతో ఉత్కంఠభరితంగా ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో 142 పరుగుల లక్ష్య ఛేదనలో ఒకదశలో 26/4తో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరకు గట్టెక్కింది. యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ముందుండి నడిపించగా, ట్రిస్టన్ స్టబ్స్ అతనికి అండగా నిలిచాడు. అంతకుముందు ఢిల్లీ బౌలర్ల ముందు నిలవలేక టాప్–5లో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో లక్నో ఇన్నింగ్స్ స్వల్ప స్కోరుకే ముగిసింది. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌ల తర్వాత ఒక టీమ్‌కు ‘హోం గ్రౌండ్’లో ఓటమి ఎదురైంది. లక్నో: అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. అబ్దుల్ సమద్ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ఎన్గిడి, నటరాజన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సమీర్ రిజ్వీ (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, ట్రిస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 76 బంతుల్లో అభేద్యంగా 119 పరుగులు జోడించారు. టపటపా... మార్ష్ కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టినా... రిషభ్ పంత్ (7), మార్క్రమ్ (11) విఫలం కావడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 48/2కు చేరింది. ఆ తర్వాత బదోని (0), పూరన్ (8) కూడా విఫలమయ్యారు. కుల్దీప్ చక్కటి బంతితో మార్ష్ ను బోల్తా కొట్టించడంతో సగం ఓవర్ల లోపే లక్నో సగం వికెట్లు చేజార్చుకుంది. 23 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకుంది. ముకుల్ (14) ప్రభావం చూపలేకపోగా, ఈ స్థితిలో సమద్ ఒక్కడే కాస్త పట్టుదలగా నిలబడి కొన్ని పరుగులు సాధించాడు. అయితే నటరాజన్ ఒకే ఓవర్లో సమద్, షమీ (1)లను అవుట్ చేయగా, ఎన్గిడి తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో ఢిల్లీ తడబడింది. మొదటి బంతికే కేఎల్ రాహుల్ (0) వెనుదిరగ్గా... ఐదు పరుగుల వ్యవధిలో నితీశ్ రాణా (15), నిసాంక (1), అక్షర్ పటేల్ (0) అవుటయ్యారు. 4.3 ఓవర్లకే స్కోరు 26/4 కావడంతో క్యాపిటల్స్ కష్టాలు పెరిగాయి. అయితే రిజ్వీ, స్టబ్స్ పట్టుదలగా నిలబడి 17 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. లక్నో ఏకంగా 16 వైడ్లు సహా 20 అదనపు పరుగులిచ్చి ప్రత్యర్థికి ఇతోధిక సహకారం అందించింది. రెండు సిక్సర్లతో మొదలు పెట్టి... 2024 ఐపీఎల్లో రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.8.40 కోట్లకు ఎంచుకుంది. ఈ యూపీ ఆటగాడు దూకుడైన బ్యాటింగ్‌తో ‘కుడిచేతి వాటం సురేశ్ రైనా’గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్లో తాను ఆడిన తొలి 4 బంతుల్లో రెండు సిక్సర్లు బాది ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించినా... ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి 51 పరుగులే చేయగలిగాడు. దాంతో చెన్నై వదులుకోగా, గత సీజన్లో ఢిల్లీ రూ.95 లక్షలకు తీసుకుంది. చివరి మ్యాచ్‌లో 25 బంతుల్లో 58 పరుగులతో జట్టును గెలిపించగా... ఈసారి అదే మొత్తానికి ఫ్రాంచైజీ అతడిని తమతో కొనసాగించింది. ఎట్టకేలకు జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో హీరోలా కీలకమైన హాఫ్ సెంచరీతో తన స్థాయిని పెంచుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌ను కూడా రిజ్వీ తడబడుతూనే ప్రారంభించాడు. తొలి 8 బంతుల్లో అతను సింగిల్ కూడా తీయలేకపోయాడు. తొలి 13 బంతుల్లో చేసినవి 5 పరుగులే! అయితే నోర్జే బౌలింగ్‌లో డీప్ థర్డ్‌మాన్ దిశగా కొట్టిన సిక్స్‌తో అతని జోరు మొదలైంది. షహబాజ్ ఓవర్లో 3 ఫోర్లు బాదిన తర్వాత పరిస్థితికి తగినట్లుగా ఆటను మార్చుకున్నాడు. మార్క్రమ్ ఓవర్లో 6, 4 కొట్టి 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. షమీ తొలి బంతికే... ఐపీఎల్లో తొలిసారి లక్నో జట్టు తరఫున బరిలోకి దిగిన సీనియర్ పేసర్ షమీ వచ్చీ రాగానే ప్రభావం చూపించాడు. మొదటి బంతికే రాహుల్‌ను అతను అవుట్ చేశాడు. ఐపీఎల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే షమీ వికెట్ తీయడం ఇది ఐదోసారి కావడం విశేషం. గతంలో ఏ బౌలర్ మూడుసార్లకు మించి ఈ ఫీట్‌ను నమోదు చేయలేదు.స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) స్టబ్స్ (బి) కుల్దీప్ 35; పంత్ (రనౌట్) 7; మార్క్రమ్ (బి) అక్షర్ 11; బదోని (సి) రాహుల్ (బి) నటరాజన్ 0; పూరన్ (బి) ఎన్గిడి 8; సమద్ (సి) మిల్లర్ (బి) నటరాజన్ 36; ముకుల్ (సి అండ్ బి) కుల్దీప్ 14; షహబాజ్ (నాటౌట్) 15; షమీ (సి) కుల్దీప్ (బి) నటరాజన్ 1; నోర్జే (సి) స్టబ్స్ (బి) ఎన్గిడి 0; మొహసిన్ (సి) ముకేశ్ (బి) ఎన్గిడి 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 141. వికెట్ల పతనం: 1–19, 2–48, 3–49, 4–65, 5–71, 6–105, 7–138, 8–140, 9–141, 10–141. బౌలింగ్: ముకేశ్ కుమార్ 3–0–17–0, ఎన్గిడి 3.4–0–27–3, అక్షర్ 3–0–17–1, నటరాజన్ 4–0–29–3, కుల్దీప్ 4–0–31–1, విప్రాజ్ 1–0–8–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మొహసిన్ (బి) షమీ 0; నిసాంక (సి) పంత్ (బి) ప్రిన్స్ 1; నితీశ్ (సి) సమద్ (బి) మొహసిన్ 15; రిజ్వీ (నాటౌట్) 70; అక్షర్ (బి) ప్రిన్స్ 0; స్టబ్స్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (17.1 ఓవర్లలో 4 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–25, 4–26. బౌలింగ్: షమీ 4–0–28–1, ప్రిన్స్ 3–0–20–2, మొహసిన్ 4–1–19–1, నోర్జే 4–0–39–0, షహబాజ్ 1–0–16–0, మార్క్రమ్ 1–0–13–0, సమద్ 0.1–0–6–0. -
లక్నో బౌలర్ల పోరాటం వృథా.. ఢిల్లీని గెలిపించిన రిజ్వి, స్టబ్స్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.బ్యాటింగ్‌కు పెద్దగా సహకరించని పిచ్‌పై సమీర్ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ (4-0-28-1), మొహిసిన్ ఖాన్ (4-1-19-1), ప్రిన్స్ యాదవ్ (3-0-20-2) అద్బుతంగా బౌలింగ్ చేశారు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు దాన్ని కాపాడుకోలేకపోయారు. అంతకుముందు ఢిల్లీ బౌలర్లు కూడా చెలరేగిపోయి లక్నోను తక్కుక స్కోర్‌కే పరిమితం చేశారు. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు. -
లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపులక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌కు సహకరించని పిచ్‌పై సమీర్ రిజ్వి (70 నాటౌట్) అద్బుతంగా ఆది ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) సహకరించాడు. లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసిన ప్రిన్స్4.3వ ఓవర్- ప్రిన్స్ యాదవ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. తొలుత నిస్సంకను ఔట్ చేసిన అతను.. ఆతర్వాత అక్షర్ పటేల్‌ను (0) కూడా పెవిలియన్‌కు పంపాడు. మూడో వికెట్ డౌన్4.2వ ఓవర్-25 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (1) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ3.3వ ఓవర్- 21 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది.మొహిసిన్ ఖాన్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (15) ఔటయ్యాడు.తొలి బంతికే వికెట్ తీసిన షమీ142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. లక్నో తరఫున తొలి బంతికే షమీ వికెట్ తీశాడు. చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నోటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు. ఆరో వికెట్ కోల్పోయిన లక్నో13.1వ ఓవర్- 105 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. ముకుల్ ఛౌదరిని (14) కుల్దీప్ యాదవ్ క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు.పీకల్లోతు కష్టాల్లో లక్నో9.3వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ట్రస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (35) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో.. పూరన్ (8) ఔట్8.5వ ఓవర్- 65 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. బదోని డకౌట్6.3వ ఓవర్- 49 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ బదోని డకౌటయ్యాడు.రెండో వికెట్ డౌన్.. మార్క్రమ్ (11) ఔట్5.5వ ఓవర్- 48 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. పంత్ (7) ఔట్2.6వ ఓవర్- ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. స్ట్రయికర్ మిచెల్ మార్ష్ కొట్టిన బంతి బౌలర్ చేతికి తాకి నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను తాకడంతో పంత్ ఔటయ్యాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 1) జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. లక్నోలోని ఎఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్‌లు: దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, అక్షత్ రఘువంశీఢిల్లీ: KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్‌లు: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్ -
LSG vs DC: స్పిన్ X పేస్
లక్నో: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. గతేడాది ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయిన ఈ రెండు జట్లు బుధవారం తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో పేపర్‌పై భీకరంగా కనిపిస్తోంది. మార్‡్ష, మార్క్రమ్ ఓపెనింగ్ చేయనుండగా... పంత్, పూరన్, బదోనీ, షహబాజ్ మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నారు.గత సీజన్లో ఆకట్టుకున్న స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ మరోసారి కీలకం కానుండగా... పేస్ బౌలింగ్‌లో షమీ, నోర్జే, అవేశ్ ఖాన్, మొహసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ రూపంలో లెక్కకు మిక్కిలి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మరోవైపు అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు కూర్పును సరిచేసుకునే పనిలో ఉంది. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేదెవరో చూడాలి.మిల్లర్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మతో బ్యాటింగ్ బలంగానే ఉండగా... ఆసీస్ స్టార్ పేసర్ స్టార్క్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దేశవాళీల్లో దుమ్మురేపుతున్న అఖీబ్ నబీపై అందరి దృష్టి నిలవనుంది. అక్షర్, కుల్దీప్ స్పిన్ భారం మోయనున్నారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా... అందులో ఢిల్లీ నాలుగు మ్యాచ్‌లు నెగ్గగా... లక్నో మూడింట విజయం సాధించింది. -
బెన్ డకెట్‌కు శిక్ష
ఐపీఎల్ 2026 నుంచి అకారణంగా తప్పుకొని చిక్కుల్లో పడిన ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్, తాజాగా ఓ పాత కేసులో శిక్షను ఎదుర్కొన్నాడు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు అతనికి కోర్టు భారీ జరిమానా విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2025 ఆగస్టులో స్టోక్ సమీపంలోని A50 రహదారిపై డకెట్ 70 mph పరిమితి ఉన్న చోట 93 mph వేగంతో డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు. స్టాఫోర్డ్‌షైర్ పోలీసులు స్పీడ్ గన్‌తో దాన్ని గుర్తించారు. వేగం పరిమితి చాలా ఎక్కువగా ఉండటంతో కేసు పరిధి జరిమానా దాటి కోర్టుకు వెళ్లింది. కానాక్ మేజిస్ట్రేట్స్ కోర్డులో డకెట్ నేరాన్ని అంగీకరించడంతో 700 పౌండ్ల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్‌పై 4 పెనాల్టీ పాయింట్లు, 120 పౌండ్ల కోర్టు ఖర్చులు, 280 పౌండ్ల బాధితుల సర్‌చార్జ్ విధించారు. మొత్తం ఆయన చెల్లించాల్సిన మొత్తం 1,100 పౌండ్లకు చేరింది. కొత్తేమీ కాదు..!డకెట్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. 2015లో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు. 2017లో యాషెస్ సిరీస్‌లో సహచరుడు జేమ్స్ ఆండర్సన్ పట్ల దురుసగా ప్రవర్తించి జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఇటీవలి యాషెస్ సిరీస్ సమయంలో మద్యం మత్తులో రోడ్డుపై హల్చల్ చేశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో డకెట్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాల్సి ఉంది. ఈ సీజన్ వేలంలో ఆ ఫ్రాంచైజీ డకెట్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే చివరి నిమిషంలో కౌంటీలు, జాతీయ జట్టు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ నియమాల ప్రకారం, చివరి నిమిషంలో తప్పుకున్న ఆటగాళ్లకు 2–3 సంవత్సరాల నిషేధం విధించే అవకాశం ఉంది. దీంతో అతను ఐపీఎల్ కాంట్రాక్ట్ డబ్బును కూడా కోల్పోతారు. మరోవైపు ఢిల్లీ ఇంకా డకెట్‌కి ప్రత్యామ్నాయం ప్రకటించలేదు. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్ డకెట్ స్థానంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సీజన్లో ఢిల్లీ ఏప్రిల్ 1న ఎల్ఎస్జీతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
ప్రధాని మోదీ నోట సాధారణ క్రికెటర్ మాట
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఓ సాధారణ క్రికెటర్ మాట వినిపించింది. ఇవాళ (మార్చి 29) జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ఆ క్రికెటర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ క్రికెటర్ పేరు ఆకిబ్ నబీ. జమ్మూ అండ్ కశ్మీర్‌కు చెందిన ఈ 29 ఏళ్ల కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్, ఇటీవల తన జట్టు తొలి రంజీ ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. సీజన్ మొత్తంలో 60 వికెట్లు తీసి, తన జట్టు 70 ఏళ్ల కలను సాకారం చేశాడు. ఈ కారణంగానే మోదీ నబీ పేరును మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. నబీ కారణంగా జమ్మూ అండ్ కశ్మీర్ సాధించిన విజయం అక్కడి యువతలో క్రీడలపై ఉత్సాహం పెంచిందని అన్నారు. నబీ స్పూర్తితో రాబోయే రోజుల్లో మరెందరో ఆ ప్రాంతం నుంచి క్రీడల్లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ సాధారణ క్రికెటర్ మాట ప్రధాని నోట రావడంతో అతని పేరు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది.దేశవాలీ క్రికెట్లో ఇప్పటికే పేరు గడించిన నబీ, త్వరలో ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్ (2026) వేలంలో నబీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్ల భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి ఫ్రాంచైజీలు పోటీపడినా, చివరికి అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఈ డీల్‌తో నబీ జీవితమే మారిపోనుంది. ఐపీఎల్లో అతను సత్తా చాటగలిగితే, టీమిండియా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించి మిచెల్ స్టార్క్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానం ఖాళీగా ఉంది. పవర్‌ప్లేలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నబీ ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పేసర్లు లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా మధ్య ఓవర్లలో బౌలింగ్ చేయడం ఇష్టపడతారు కాబట్టి, నబీ పవర్‌ప్లేలో కీలకంగా మారవచ్చు. ఢిల్లీ ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 ప్రయాణం మొదలుపెడుతుంది. -
'రెండేళ్ల నిషేధం సరిపోదు'.. బెన్ డకెట్పై గవాస్కర్ ఫైర్
ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ ఐపీఎల్-2026 సీజన్ నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకొన్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో రూ. 2 కోట్లకు డకెట్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ ఇన్నింగ్స్ రాహుల్‌తో కలిసి డకెట్ ప్రారంభిస్తాడని అంతా భావించారు. కానీ డకెట్ మాత్రం అనుహ్యంగా ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలిగి ఢిల్లీకి గట్టి షాకిచ్చాడు. ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డకెట్ తెలిపాడు.ఈ ఇంగ్లీష్ ఓపెనర్ ఐపీఎల్‌కు బదులుగా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడనున్నాడు. కాగా బీసీసీఐ గతేడాది తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ఏ విదేశీ ఆటగాడైనా, సరైన వైద్య కారణాలు లేకుండా టోర్నీ ప్రారంభానికి ముందు తప్పుకుంటే వారిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు. దీంతో డకెట్ రెండేళ్ల ఐపీఎల్ బ్యాన్‌ను ఎదుర్కోనున్నాడు.తాజాగా ఇదే విషయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. చివరి నిమిషంలో వైదొలగే విదేశీ ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం పెద్దగా ప్రభావం చూపడం లేదని గవాస్కర్ అన్నారు."బెన్ డకెట్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురు దెబ్బే. ఎందుకంటే అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే ది హండ్రెడ్ లీగ్ వేలంలో అతడికి మంచి ధర దక్కడంతో ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను వదులుకోవడానికి సిద్దమయ్యాడు. ఒకవేళ అతడికి నామమాత్రపు ధర దక్కి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. వేలంలో ఒక ఆటగాడిని నమ్మి కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, సదరు ఆటగాడు ఆకస్మికంగా తప్పుకుంటే జట్టు ప్రణాళికలపై కచ్చితంగా ప్రభావం చూపుతోంది. అందుకే ఆటగాళ్లకు భయం కలిగేలా మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం బీసీసీఐ విధిస్తున్న రెండేళ్ల బ్యాన్ సరిపోదు. అది పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఈ విషయంపై బీసీసీఐ మరోసారి ఆలోచించాలి" అని గవాస్కర్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించనున్న ముంబై ఇండియన్స్ -
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
-
IPL 2026: భారత మీడియాపై ధ్వజమెత్తిన స్టార్క్
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భారత మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఇండియన్ మీడియాపై చిందులేశాడు. తాను ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి హాజరు కాకపోవడానికి కారణాలు వెల్లడిస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.అసలేం జరిగిందంటే.. స్టార్క్ ఐపీఎల్ 2026 ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి హాజరుకాలేదు. ఈ గైర్హాజరు వెనుక కారణాలపై గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వినిపించాయి. కొందరు క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి NOC ఇవ్వలేదని.. వర్క్‌లోడ్ కారణంగా ఐపీఎల్ ఆడకూడదన్న కండీషన్ పెట్టిందని వార్తలు వచ్చాయి. అయితే, స్టార్క్ స్వయంగా ఈ ఊహాగానాలకు తెరదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. తనకు భుజం మరియు మోచేతి గాయాలు ఉన్నాయని, వాటి తీవ్రతను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నానని వెల్లడించాడు. భారత మీడియాలోని కొన్ని వర్గాలకు నా శరీరం గురించి నాకన్నా ఎక్కువ తెలిసినట్లు ప్రచారం చేస్తున్నాయని చురకలంటించాడు. నిజానికి నేను ప్రస్తుతం రిహాబ్‌లో ఉన్నాను. ఈ గాయం ఢిల్లీ జట్టుకు, అభిమానులకు అసౌకర్యం కలిగించి ఉండవచ్చు. దీనికి నేను క్షమాపణ చెబుతున్నానని వివరణ ఇచ్చాడు. మేనేజ్మెంట్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, వీలైనంత త్వరగా జట్టులో చేరేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు.కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో స్టార్క్ లేని లోటు జట్టుకు పెద్ద సవాలుగా మారనుంది. కైల్ జేమీసన్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా వంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. స్టార్క్ లేని లోటు భర్తీ చేయలేనిదని మేనేజ్మెంట్ భావిస్తుంది. -
IPL 2026: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇవాళ టీమిండియా స్టార్లుగా చెలామణి అవుతున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సహా ఎందరో క్రికెటర్లకు లైఫ్ ఇచ్చింది కూడా ఐపీఎల్లే అనడంలో సందేహం లేదు. 2008 నుంచి 18 సీజన్ల పాటు నిరంతరాయంగా సాగుతూ వస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. గత సీజన్లో బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రె రూపంలో కొత్తనీరు భారత క్రికెట్లోకి వచ్చి చేరింది. ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న 19వ సీజన్లోనూ అలా రాణించగల సమర్థులెవరన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.జూనియర్ మిల్లర్ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్ తరహా బ్యాటింగ్ శైలిని పోలి ఉండే 20 ఏళ్ల అమేథీ కుర్రాడు ప్రశాంత్ వీర్‌పై ఈ సీజన్లో భారీ అంచనాలున్నాయి. గత రెండేళ్లుగా ఆశించినంతంగా ఫలితాలు రాకపోవడంతో జట్టులో యువ ఆటగాళ్లను నింపేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే వేలంలో ప్రశాంత్ వీర్‌ను ఏకంగా రూ. 14.20 కోట్లు పెట్టి దక్కించుకోవడం ఆశ్చర్యపరిచింది. దేశవాలీ క్రికెట్లో సంచలన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన ప్రశాంత్ వీర్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు. ఆ టోర్నీలో 320 పరుగులు చేయడంతో 8 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మాదిరిగానే స్లో లెఫ్టార్మ్ స్పిన్, ఎడమచేతివాటం బ్యాటింగ్ కావడంతో జడ్డూ స్థానాన్ని ప్రశాంత్ భర్తీ చేస్తాడని సీఎస్కే భారీ ఆశలు పెట్టుకుంది. ‘జూనియర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ప్రశాంత్ అంచనాలను అందుకుంటాడా అన్నది చూడాలి.సిక్సర్లకు పెట్టింది పేరు..చెన్నై సూపర్‌కింగ్స్‌కే ఆడనున్న మరో విధ్వంసక వీరుడు కార్తిక్ శర్మ. రాజస్థాన్‌కు చెందిన కార్తిక్ శర్మ అవలీలగా సిక్సర్లు కొట్టగలడు. అందుకే వేలంలో సీఎస్కే ఇతడిని రూ. 14.2 కోట్లు పెట్టి దక్కించుకుంది. విజయ్‌హజారే ట్రోఫీతో పాటు 2025-26 రంజీ సీజన్లో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో కార్తిక్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు.ఇక వేలంలో కార్తిక్ శర్మ కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటాపోటీగా బిడ్ వేశాయంటేనే మనోడి టాలెంట్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 11 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 28 సిక్స్‌లు కొట్టిన కార్తీక్ చెన్నై జట్టుకు కీలక బ్యాటర్‌గా మారే అవకాశముంది.ఢిల్లీ ఆశాకిరణం..ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్లో బాగా వినిపిస్తున్న పేరు అకిబ్ నబీ. ఈ జమ్మూకశ్మీర్ పేసర్ కొద్దిరోజుల క్రితం ముగిసిన రంజీ సీజన్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి తన జట్టు చరిత్రాత్మక రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నబీని వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆకిబ్ నబీ టైటిల్ అందిస్తాడేమో చూడాలి. ఒకవేళ నబీ ఆ ఫీట్‌ను సాధిస్తే మాత్రం టీమిండియాలోకి పిలుపు రావడం లాంఛనమే అవుతుంది.ఆ కొరత తీరినట్లే!భారత జట్టుకు లెఫ్టార్మ్ పేసర్ల కొరత ఎప్పట్నుంచో ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత చాలా రోజులకు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. అతడి మార్గంలోనే యువ పేసర్ నమన్ తివారి అదరగొడుతున్నాడు. 2024 అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన నమన్.. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. యూపీ టీ20 లీగ్‌లో అతడు పది మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. 145 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అందుకే వేలంలో లక్నో జట్టు అతడికి కోటి రూపాయల ధరకు దక్కించుకుంది. నమన్ సత్తాచాటితే టీమ్ఇండియాకు మరో లెఫ్టార్మ్ పేసర్ దొరికేసినట్లే.దంచుడే లక్ష్యంగా..ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడబోతున్న తేజస్వీ దహియా కూడా విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన ఈ ఢిల్లీ కుర్రాడు బరిలోకి దిగిందే తడవు దంచుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం అతడి నైజం. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ గత ఎడిషన్‌లో తేజస్వీ దహియా 10 ఇన్నింగ్స్‌ల్లో 190 సగటుతో 339 రన్స్ సాధించాడు. ఆ సీజన్లో దహియా 29 సిక్స్‌లు బాది టోర్నీలో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. కీపర్‌గాను అద రగొడుతున్నాడు. వీళ్లే కాదు ఇంకా చాలా మంది యువ క్రికెటర్లు ఈసారి ఐపీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.చదవండి: ధోనికి గాయం.. ఐపీఎల్‌కు దూరం! -
'ఐపీఎల్ కాదు.. టీమిండియాకు ఆడడమే నా టార్గెట్'
జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ ధార్ ఐపీఎల్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నబీ ప్రాతినిథ్యం వహించనున్నాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుండడంతో గతేడాది జరిగిన మినీ వేలంలో నబీని రూ.8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.కేవలం రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీనీ ఇతరు ఫ్రాంచైజీలతో పోటీపడి మరి ఢిల్లీ సొంతం చేసుకుంది. అయితే తాజాగా విలేకరుల సమావేశంలో నబీ పలు విషయాలను పంచుకున్నాడు. వేలం రోజు తన ఇంట్లో జరిగిన సందడిని నబీ గుర్తు చేసుకున్నాడు. అయితే ఐపీఎల్ ఎంపిక కావడం సంతోషంగా ఉన్నప్పటికి, భారత్ తరపున ఆడడమే తన అంతిమ లక్ష్యమని నబీ తెలిపాడు."నాకు డబ్బు ముఖ్యం కాదు. కనీసం ఒక్కసారైనా ఐపీఎల్ వంటి మెగా టోర్నమెంట్లో ఆడాలనుకున్నాను. నాకు కనీస ధర రూ.30 లక్షలు వచ్చి ఉన్నా కూడా నేను సంతోషంగా ఉండేవాడిని. ఏదేమైనప్పటికి ఢిల్లీ ఇంత భారీ మొత్తం వెచ్చించి తీసుకోవడం నాకు ఆనందం కలిగించింది. వేలం రోజున నేను ఇంట్లోనే ఉన్నాను. వేలంలో నేను అమ్ముడుపోగానే బయట నం డ్యాన్స్‌లు చేస్తూ, బాణసంచా కాలుస్తూ హంగామా చేశారు. నా కటుంబ సభ్యులు చాలా సంతోషపడ్డారు. ఆ సమయంలో నేను కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యాను. కానీ నేను ఇంట్లో ఉన్నానని వారికి తెలియదు. అయినప్పటికి నా విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్ నా కెరీర్‌ను మరింత ముందుకు తెసుకువెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయి టోర్నమెంట్. దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణిస్తానే ఇక్కడ ఆడే అవకాశం లభిస్తోంది. నేను రెడ్ బాల్ క్రికెట్లో బాగా రాణించానని అన్పిస్తోంది. అందుకే నాకు ఆడే అవకాశం దక్కింది. ఇక్కడ కూడా బాగా రాణించి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా అంతిమ లక్ష్యమని" నబీ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఆర్సీబీకి భారీ షాక్ -
డకెట్ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందన!
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బెన్ డకెట్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ డకెట్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే టెస్టు కెరీర్‌పై దృష్టి సారించడంతో పాటు కుటుంబసభ్యులతో గడిపేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు డకెట్ పేర్కొన్నాడు. తాజాగా డకెట్ వైదొలగడంపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం బుధవారం తొలిసారి స్పందించింది. ‘బెడ్ డకెట్ తాను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండడం లేదని మాకు ముందే చెప్పాడు. బెన్ డకెట్ స్థానంలో మరొకరి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాం. డకెట్ స్థానంలో ఎవరిని తీసుకుంటామనేది త్వరలోనే పేర్కొంటాం.’ అని చెప్పుకొచ్చింది. అయితే డకెట్ తాను వైదొలిగే విషయమై ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముందే చెప్పినప్పటికీ ఐపీఎల్ నియమావళి ప్రకారం అతడిపై నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే లీగ్ నిబంధనల ప్రకారం ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో పాల్గొని, ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్న తర్వాత సరైన కారణం లేకుండా ఆడనని చెబితే కుదరదు. గాయం, ఫిట్నెస్ సమస్యలు, పితృత్వ సెలవులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. కానీ డకెట్ విషయంలో ఫిట్నెస్, గాయం లాంటి అంశాలు లేవు. టెస్టు కెరీర్‌పై ఫోకస్ పెట్టడంతో పాటు ఫ్యామిలీతో సమయం గడపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టుతో పాటే ఉన్నప్పటికీ డకెట్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని డకెట్ అది ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హండ్రెడ్ టోర్నీ ఆడేందుకు వెళ్లాడు. అంతకముందు ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టులు కలిపి కేవలం 202 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్న బెన్ డకెట్ తాజాగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో టెస్టులపై దృష్టి సారించేందుకు డకెట్ కౌంటీల్లో నాటింగ్హమ్షైర్ తరఫున మ్యాచ్‌లు ఆడనున్నాడు.చదవండి: కివీస్ కెప్టెన్ శతకం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా -
ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన ప్రకటన.. వేటు తప్పదు!
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ సంచలన ప్రకటన చేశాడు. తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు మంగళవారం వెల్లడించాడు.రూ. 2 కోట్లుకాగా గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ డకెట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ ఆప్షన్‌గా పనికివస్తాడనే కారణంతో అతడి కోసం రూ. 2 కోట్లు వెచ్చించింది. ఈ సీజన్లో కేఎల్ రాహుల్‌తో కలిసి డకెట్ ఓపెనింగ్ చేస్తాడనే వార్తలు కూడా వచ్చాయి.ఢిల్లీ క్యాపిటల్స్ నెత్తిన పిడుగుఅయితే, తాజాగా బెన్ డకెట్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నెత్తిన పిడుగు వేశాడు. తాను ఈ సీజన్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు.. ‘‘ఢిల్లీ ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరునా క్షమాపణలు చెబుతున్నా. ఈసారి ఢిల్లీ ఫ్రాంఛైజీ తరఫున ఆడాలని ఎంతో ఆతురతగా ఎదురుచూశాను.క్షమించండిఅందుకు తగ్గట్లుగానే ఫ్రాంఛైజీ కూడా తమ జట్టు కూర్పు విషయంలో ప్రణాళికలు రచించుకుంది. కానీ నా నిర్ణయం వల్ల వారి ప్రణాళికల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకు నేను ఎంతగానో చింతిస్తున్నా.ఢిల్లీ జట్టు అభిమానులకు కూడా క్షమాపణలు చెబుతున్నాను. ఐపీఎల్ నుంచి వైదొలగాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నా. ఈ విషయాన్ని చెప్పడం ఎంతో బాధగా ఉంది. అయితే, చిన్ననాటి నుంచి ఇంగ్లండ్ తరఫున ఆడాలని ఎన్నో కలలు కన్నాను.నా సర్వస్వం ఇంగ్లండ్ క్రికెట్‌కే అంకితంనా సర్వస్వం ఇంగ్లండ్ క్రికెట్‌కే ధారబోయాలని అనుకున్నాను. అందుకోసం నేను శారీకరంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలి. సమ్మర్ షెడ్యూల్ కోసం నేను సన్నద్ధం కావాల్సి ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని డకెట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.కాగా డకెట్ ఇలా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఐపీఎల్లో ఆడకుండా అతడిపై రెండేళ్ల నిషేధం పడనుంది. పాలక మండలి ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం.. గాయం లేదంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉంటుంది. రెండేళ్ల నిషేధంఅలాకాని పక్షంలో ఇష్టానికి టోర్నీ నుంచి తప్పుకొంటే నిషేధం పడుతుంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇప్పటికే ఈ మేరకు నిషేధం ఎదుర్కొంటుండగా.. తాజాగా మరో ఇంగ్లిష్ ప్లేయర్ డకెట్ ఈ జాబితాలో చేరనున్నాడు.కాగా డకెట్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో యాషెస్ టెస్టు సిరీస్‌లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కేవలం 221 పరుగులే చేయగలిగాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో సమ్మర్ షెడ్యూల్లో భాగంగా సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లు డకెట్ ఇటీవల పేర్కొన్నాడు.చదవండి: PSL: బంగ్లాదేశ్ కీలక నిర్ణయంఆ విదేశీ ఆటగాళ్లపై వేటు వేయండి: గావస్కర్ ఫైర్ -
మరో 4 రోజుల్లో ఐపీఎల్.. ఇంకా భారత్‌కు రాని స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2026 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన పేస్ అస్త్రం మిచెల్ స్టార్క్ మాత్రం జట్టుతో చేరలేదు. క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) నుంచి లీగ్‌లో ఆడేందుకు స్టార్ సీమర్‌కు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయలేదని తెలిసింది.ఈ శనివారం లీగ్ ప్రారంభమవుతున్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 1న జరుగనుంది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మొదటి మ్యాచ్‌కల్లా అతను అందుబాటులో ఉంటాడని ప్రాంచైజీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.సోమవారం మీడియా సమావేశంలో క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. "ఆసీస్ బోర్డు నుంచి ఎన్వోసీ కోసం మేం ఎదురుచూస్తున్నాం. అది వస్తే స్టార్క్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉండేది చెప్పగలం. ఈ మేరకు సీఏతో సంప్రదింపులు జరుపుతున్నాం" అని అన్నాడు. ఫిట్నెస్ సమస్యలేమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు బదులిస్తూ అలాంటిదేమీ లేదని, నెట్స్‌లో అతను బౌలింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారముందని చెప్పాడు. క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల రావు మాట్లాడుతూ అతను వస్తున్నాడని, ఎన్ఓసీ ఆలస్యమే అసలు సమస్యని పేర్కొన్నాడు.ఎన్ఓసీ జారీ చేస్తే తొలి మ్యాచ్ నుంచే స్టార్క్ అందుబాటులో ఉంటాడని చెప్పాడు. పేసర్ నటరాజన్ వందశాతం ఫిట్నెస్తో ఉన్నాడని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. గత సీజన్లో భుజం గాయం వల్ల నట్టు కేవలం రెండే మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌కు భారీ శుభవార్త.. ఇక దబిడి దిబిడే -
‘ఆ రూల్‌కు నేనెప్పుడూ వ్యతిరేకమే’!
ఐపీఎల్లో అమలు చేసే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు నచ్చదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. ఒక ఆల్‌రౌండర్‌గా తాను ఎప్పటికీ ఇంపాక్ట్ రూల్‌ను వ్యతిరేకిస్తూనే ఉంటానని తెలిపాడు. ఈ నిబంధన ద్వారా ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందన్న వాదనల్లో నిజముందని అక్షర్ వ్యాఖ్యానించాడు. అక్షర్ మాట్లాడుతూ.. ‘ఆ నిబంధన నాకు నచ్చదు. స్వతహాగా నేను ఆల్‌రౌండర్‌ను. గతంలో మేం ఈ రోల్ (బ్యాటింగ్, బౌలింగ్ చేసేవారు) కోసం ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అవసరాన్ని బట్టి బ్యాటర్, బౌలర్‌ను వాడుకుంటున్నది. అదే సమయంలో మనకు ఆల్‌రౌండర్ అవసరమా? అన్న చర్చ తలెత్తుతున్నది. నేను దీనికి మొదటి నుంచి వ్యతిరేకినే. కానీ రూల్స్ అంటే రూల్సే కదా. మనం వాటిని పాటించాలి తప్పదు’ అని అన్నాడు. గతంలోనూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ముంబై ఇండియన్స్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2018 నుంచి చూసుకుంటే అక్షర్ పటేల్ గత సీజన్లో కేవలం 34 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశాడు. ఇదే విషయమై అక్షర్ స్పందిస్తూ.. ‘18వ సీజన్లో నేను ఎక్కువగా బౌలింగ్ చేయకపోవడానికి చేతి వేలి గాయమే. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో బంతిని తిప్పేందుకు ఉపయోగపడే నా వేలికి గాయమైంది. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ గాయం మరింత పెద్దదైంది. దాంతో ఐపీఎల్లో జట్టుకు అవసరమైనప్పుడే బౌలింగ్ చేసి నా వేలిని కాపాడుకున్నా. ఏడు మ్యాచ్‌ల తర్వాత నా వేలి గాయం పూర్తిగా తగ్గిపోయింది.’ అని చెప్పుకొచ్చాడు. అక్షర్‌పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్లో లీగ్ దశకే పరిమితమైంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడనుంది. -
Delhi Capitals: ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 18 సీజన్లు ముగిసినప్పటికీ టైటిల్ గెలవాలన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆకలి మాత్రం తీరడం లేదు. జట్టు పేరు మార్చినా, ఆటగాళ్లను మార్చినా, దిగ్గజ ఆటగాళ్లు జట్టును నడిపించినా ఢిల్లీ తలరాత మాత్రం మారలేదు. ఐపీఎల్ ప్రారంభమైన 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలో సెమీఫైనల్ చేరింది. తర్వాతి సీజన్లో కూడా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక మధ్యలో 2012లో మరోసారి ప్లేఆఫ్స్ చేరినప్పటికీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. ఆ తర్వాత వరుసగా ఆరు సీజన్ల పాటు లీగ్ దశకే పరిమితమైంది. అయితే 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను జేఎస్‌డబ్ల్యూ సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చారు. పేరు మార్చిన తర్వాత వరుసగా మూడు సీజన్లు (2019, 2020, 2021) అదరగొట్టింది. పుష్కర కాలానికి..ఐపీఎల్ ప్రారంభమైన పుష్కరకాలం తర్వాత 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌కే పరిమితమైంది. 2021లో మరోసారి ప్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ కథ 2022 నుంచి మళ్లీ మొదటికే వచ్చింది. గత సీజన్లోనూ ఢిల్లీ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.బ్యాటింగే బలం..ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేపర్‌పైన బలంగానే కనిపిస్తుంది. పేపర్‌పై ఉన్న బలాన్ని మైదానంలోనూ ప్రదర్శిస్తుందా లేక గత సీజన్ల మాదిరే చతికిలపడుతుందా అన్నది చూడాలి. జట్టుకు కేఎల్ రాహుల్ పెద్ద బలం అని చెప్పొచ్చు. గత సీజన్లో కేఎల్ రాహుల్ 539 పరుగులతో జట్టు టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. మరోసారి రాహులే జట్టుకు కీలకమవ్వనున్నాడు. కేఎల్ రాహుల్‌తో పాటు బెన్ డకెట్, పాతుమ్ నిసాంక, పృథ్వీ షా, అభిషేక్ పొరేల్, నితీశ్ రాణా, డేవిడ్ మిల్లర్, సమీర్ రజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ వంటి హిట్టర్లు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం.ఇక కెప్టెన్ అక్షర్ పటేల్ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించగల సమర్థుడు.మిచెల్ స్టార్క్ఆడేనా?బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ కూడా పటిష్టంగా ఉన్నప్పటికీ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడతాడా లేదా అన్న సంశయం ఉండడంతో కాస్త ఆందోళన నెలకొంది. నటరాజన్, ముకేశ్ కుమార్‌కు తోడు దేశవాళీల్లో సంచలన ప్రదర్శనతో వేలంలో రూ. 8.4 కోట్ల ధరతో ఢిల్లీ దక్కించుకున్న కశ్మీర్ పేసర్ అకిబ్ నబీపై కూడా జట్టు భారీ అంచనాలే పెట్టుకుంది. స్పిన్ విభాగంలో అక్షర్, కుల్దీప్, విప్రజ్ నిగమ్‌లతో బలంగానే కనిపిస్తోంది. మొత్తం మీద ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ అన్నట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి తయారైంది. ఐపీఎల్ 19వ సీజన్లోనైనా మెరిసి కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతోంది. ఢిల్లీ కల నెరవేరాలని ఆశిద్దాం.ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు అంచనా: అక్షర్‌పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిసాంక, నితీశ్ రానా, డేవిడ్ మిల్లర్, సమీర్ రిజ్వీ/కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, కుల్దీప్యాదవ్, అకిబ్ నబీ, స్టార్క్, ముకేశ్ కుమార్/నటరాజన్.ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బెస్ట్: 2020 (రన్నరప్); 2019, 2021 (ప్లే ఆఫ్స్); 2008, 2009 (సెమీఫైనల్స్)చదవండి: భారత స్టార్‌కు మొండిచేయి.. అశ్విన్ తుది జట్టు ఇదే! -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్
ఐపీఎల్-2026 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది సీజన్ ఫస్ట్ హాఫ్‌కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడు సెకెండ్ హాఫ్‌లో ఢిల్లీ జట్టుతో చేరనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియా రాబోయే 12 నెలల్లో దాదాపు 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అదేవిధంగా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరగనుంది.దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రధాన పేసర్లను లీగ్ క్రికెట్లో ఎక్కువగా ఆడించి రిస్క్ తీసుకూడదని భావిస్తుందంట. ఈ కారణంతో అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది సీజన్‌కు ముందు స్టార్క్‌ను రూ.11.75 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.కానీ అతడు ఇప్పుడు అందుబాటులో లేకపోవడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే ఢిల్లీ జట్టులో లుంగి ఎంగిడీ, కైల్ జేమీసన్, దుష్మంత చమీర వంటి స్టార్ పేసర్లు ఉండడం కాస్త ఉపశమనం కలిగించే ఆంశంగా చెప్పుకోవాలి. కాగా స్టార్క్ ఏప్రిల్ మూడో వారం నాటికి జట్టుతో చేరే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు.మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ జట్టును నడిపించనున్నాడు. ఆర్సీబీ స్పీడ్ స్టార్ జోష్ హాజిల్‌వుడ్ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుబ్యాటర్లు: కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతుమ్ నిస్సాంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఔకిబ్ దార్, నితీష్ రాణాబౌలర్లు: మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, లుంగి ఎన్గిడి, కైల్ జేమీసన్, కుల్దీప్ యాదవ్చదవండి: IPL 2026: 'సెహ్వాగ్‌ను చూసి నేర్చుకో'.. అభిషేక్‌కు కుంబ్లే వార్నింగ్ -
తొలి టైటిల్ వేటలో...
పేర్లు మారినా... ప్లేయర్లు మారినా.. ఆ రెండు జట్ల రాత మాత్రం మారడం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి పోటీ పడుతున్నా... ఇప్పటి వరకు ఆ రెండు జట్లకు ట్రోఫీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. అందులో ఒకటి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్... మరొకటి అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్. గత సీజన్లో జట్లను ప్రక్షాళన చేసుకొని కొత్తగా దర్శనమిచ్చిన ఈ రెండు టీమ్‌లు మెరుగైన ప్రదర్శనే చేశాయి. బెంగళూరుతో జరిగిన ఫైనల్లో తడబడిన పంజాబ్ కింగ్స్ రన్నరప్‌తో సరిపెట్టుకోగా... ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానానికి పరిమితమైంది. చరిత్రను పక్కనపెట్టి ఇరు జట్లు ఈసారి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాయో చూడాలి!సాక్షి, క్రీడావిభాగం : ఏళ్లకు ఏళ్లుగా తొలి టైటిల్ సాధించాలనే తపనతో సాగుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు గత ఏడాది మెరుగైన ఆటతీరు కనబర్చింది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యానికి సహచరుల సహకారం తోడవడంతో... పంజాబ్ తొలి టైటిల్ గెలిచేలా కనిపించింది. అయితే బెంగళూరుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సారథి విఫలమవడం ఫలితంపై ప్రభావం చూపింది. గత సీజన్లో ఆడిన జట్టులో పెద్దగా మార్పులు చేయని పంజాబ్... ఈసారి ఎలాగైనా తమ చిరకాల కోరిక తీర్చుకోవాలని భావిస్తోంది. గత సీజన్‌లాగే బలంగా కనిపిస్తున్న కింగ్స్... మైదానంలో మళ్లీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్‌కు ప్రధాన బలం కాగా... జట్టు ఆల్‌రౌండర్లతో కిక్కిరిసి ఉంది. ప్రియాన్‡్ష ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తేనున్నాడు. విదేశీ ప్లేయర్ల కోటాలో... స్టొయినిస్, యాన్సెన్, అజ్మతుల్లా, ఫెర్గూసన్ కీలకం కానున్నారు. సీజన్ మొత్తం ఈ నలుగురినే కొనసాగించే అవకాశాలున్నాయి. నేహల్ వధేరా, శశాంక్ సింగ్, ముషీర్ ఖాన్ రూపంలో మిడిలార్డర్లో ధాటిగా ఆడగల భారత ఆటగాళ్లు అందుబాటులో ఉండటం పంజాబ్‌కు కలిసి రానుంది. బౌలింగ్‌లో అర్‡్షదీప్ సింగ్ జట్టు ప్రధాన బలం కాగా... యుజ్వేంద్ర చహల్, స్టొయినిస్, యాన్సెన్, అజ్మతుల్లా మిగతా భారం మోయనున్నారు. ఆంధ్ర ఆటగాడు పైలా అవినాశ్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా చూడాలి. పంజాబ్ కింగ్స్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), నేహల్ వధేరా, విష్ణు వినోద్, హర్నూర్ పన్ను, పైల అవినాశ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, స్టొయినిస్, హర్‌ప్రీత్ బ్రార్, యాన్సెన్, అజ్మతుల్లా, ప్రియాన్ష్ ఆర్య, ముషీర్ ఖాన్, సూర్యాన్ష్, ఓవెన్, కొనొల్లీ, డ్వార్షుయ్, అర్ష్ దీప్, చహల్, వైశాక్, యశ్ ఠాకూర్, జేవియర్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్, ఫెర్గూసన్.అత్యుత్తమ ప్రదర్శన: రన్నరప్ (2014, 2025)‘మద్యం మానేశా’ప్రస్తుతం నా వయసు 35 ఏళ్లు. సీనియర్ ఆటగాడిగా చహల్‌ను చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలని అనుకోవాలి. మైదానంలో మరింత చురుగ్గా ఉంటూ జట్టు కోసం 150 శాతం శ్రమించాలని పట్టుదలగా ఉన్నా. అందుకే నా శరీరంపై మరింత దృష్టి పెట్టా. గత ఆరు నెలలుగా మద్యం మానేశాననే శుభవార్త మీతో పంచుకుంటున్నా. – చహల్, పంజాబ్ఢిల్లీ రాత మారేనా! ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కసారి (2020 సీజన్లో) ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... గతేడాది టీమ్‌లో సమూల మార్పులు చేసింది. టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ సారథ్యానికి మొగ్గు చూపకపోవడంతో... అక్షర్ పటేల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. అందుకు తగ్గట్లే అక్షర్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. అయితే లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లో గెలిచిన క్యాపిటల్స్.. ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి ప్రత్యర్థులను భయపెట్టిన ఢిల్లీ... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, పృథ్వీ షా వంటి ప్లేయర్లతో టాపార్డర్ బలంగా ఉండగా... మిడిలార్డర్లో అశుతోష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్ కీలకం కానున్నారు. పేరున్న స్టార్లకన్నా... సమయానుకూలంగా రెచ్చిపోగల ప్లేయర్లు ఉండటం క్యాపిటల్స్‌కు అదనపు బలం కానుంది. ఆంధ్ర ప్లేయర్ త్రిపురాన విజయ్ను ఆడిస్తారా అనేది ఆసక్తికరం. విదేశీ ప్లేయర్ల కోటాలో మిచెల్ స్టార్క్, మిల్లర్, స్టబ్స్, డకెట్, ఎంగిడి, జెమీసన్ అందుబాటులో ఉన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడం కాస్త లోటే. బౌలింగ్‌లో ముకేశ్ కుమార్, నటరాజన్, కుల్దీప్ యాదవ్ కీలకం కానున్నారు. దేశవాళీ సెన్సేషన్ పేసర్ ఆఖిబ్ నబీ ఈ సారి అదనపు బలం కానున్నాడు. గత సీజన్ మాదిరిగానే సమష్టి ప్రదర్శనను నమ్ముకుంటే ఈ సారి క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరొచ్చు. హేమాంగ్ బదానీ కోచింగ్, అక్షర్ పటేల్ కెప్టెన్సీ జట్టును ఎలా నడిపిస్తాయనేది కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మిల్లర్, డకెట్, నిశాంక, సాహిల్, పృథ్వీ షా, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ రాణా, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారి, ఆఖిబ్ నబీ, నితీశ్ రాణా, స్టార్క్, నటరాజన్, ముకేశ్ కుమార్, చమీర, ఎంగిడి. జెమీసన్, కుల్దీప్ యాదవ్. అత్యుత్తమ ప్రదర్శన: రన్నరప్ (2020) -
ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాహుల్‌కు విభేదాలు?
ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మరో జట్టుకు ట్రేడ్ కానున్నాడని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం రాహుల్‌ను తమతోనే అంటిపెట్టుకుని ట్రేడ్ ఊహాగానాలకు చెక్ పెట్టింది. అతడి అనుభవాన్ని మరోసారి ఉపయోగించుకోవాలని ఢిల్లీ నిర్ణయించింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బ్యాటింగ్ పొజిషన్ విషయంలో రాహుల్‌కు ఢిల్లీ మేనేజ్మెంట్కు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. తన బ్యాటింగ్ స్ధానాన్ని పదే పదే మార్చడంపై కేఎల్ రాహుల్ ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు అతడు తెలిపాడు.కాగా గత సీజన్లో రాహుల్ కొన్ని మ్యాచ్‌లలో మిడిలార్డర్లోనూ, మరి కొన్ని మ్యాచ్‌లలో టాపార్డర్‌లోనూ బ్యాటింగ్‌కు వచ్చాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ అతడి స్ధానం మరిపోయేది. అయినప్పటికి ఈ కర్ణాటక బ్యాటర్ దుమ్ములేపాడు. రాహుల్ గత సీజన్లో 150 స్ట్రైక్ రేట్‌తో 539 పరుగులు చేసి ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.'ప్రతీ సంవత్సరం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తలనొప్పిగా మారింది. అతడిని ఏ స్ధానంలో ఆడించాలో ఆ జట్టు సరిగా తేల్చుకోలేకపోతోంది. రాహుల్ ఓపెనింగ్ చేయడం ఇష్టం. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడించాలని చూస్తోంది. ఈ విషయంలో టీమ్ మెనెజ్‌మెంట్, రాహుల్ మధ్య విభేదాలు ఉన్నట్లు కన్పిస్తోంది. కచ్చితంగా ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించుకోవాలి. అసలు ఢిల్లీ జట్టులో కేఎల్ సంతోషంగా ఉన్నాడో, లేదో స్పష్టత లేదు' అని తన యూట్యూబ్ ఛానల్లో బద్రీనాథ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఏడాది సీజన్లో రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.చదవండి: T20 WC: డీఎస్పీగా సంజూ శాంసన్!? -
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడా? అంటే అవునానే సమాధానమిస్తోంది. రాహుల్ గత సీజన్లలో చాలా మ్యాచ్‌లలో మిడిలార్డర్లోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్లు అందుబాటులో ఉండటంతో రాహుల్‌కు ఓపెనర్‌గా పెద్దగా అవకాశం దక్కలేదు.అయితే జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ఓపెనర్‌గా విఫలం కావడంతో ఆఖరి మ్యాచ్‌లలో రాహుల్‌కు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం దక్కింది. కేఎల్ ఓపెనర్‌గా మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టాడు.దీంతో ఈ ఏడాది సీజన్లో రాహుల్‌ను ఫుల్ టైమ్ ఓపెనర్‌గా ఢిల్లీ టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. రాహుల్ గత సీజన్లో 150 స్ట్రైక్ రేట్‌తో 539 పరుగులు చేసి ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.రాహుల్ పార్టనర్ ఎవరు?అయితే రాహుల్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఇన్నింగ్స్ ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుత ఢిల్లీ జట్టులో ఓపెనింగ్ స్లాట్ కోపం నలుగురు పోటీలో ఉన్నారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్, శ్రీలంక స్టార్ పాథుమ్ నిస్సాంక ఉన్నారు. వీరిద్దరూ తమ తమ జట్ల ఇన్నింగ్స్‌లను ప్రారంభిస్తుంటారు. మరోవైపు భారత ఆటగాళ్లు పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ కూడా ఉన్నారు. వీరిద్దరికి ఢిల్లీ తరపున ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉంది. కాగా అభిషేక్‌కు ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఉంది. కాబట్టి ప్రధానంగా డకెట్, నిస్సాంక, పృథ్వీషా మధ్యనే పోటీ నెలకొంది.ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026 జట్టుబ్యాటర్లు: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతుమ్ నిస్సాంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఔకిబ్ దార్, నితీష్ రాణాబౌలర్లు: మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, లుంగి ఎన్గిడి, కైల్ జేమీసన్, కుల్దీప్ యాదవ్చదవండి: 'అఫ్గాన్ చరిత్ర అందరికి తెలుసు.. రిపీటైతే పాక్‌కు చుక్కలే' -
సన్‌రైజర్స్, సీఎస్కే, ముంబై కాదు.. ఆ జట్టే ఐపీఎల్ విజేత!
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ పండగకు సమయం అసన్నమవుతోంది. ఐపీఎల్-2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుతాయో, టైటిల్ విజేత ఎవరన్నదానిపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన అంచనాలను వెల్లడించాడు. ఆకాష్ చోప్రా ఇటీవల క్రిక్స్ యాప్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో పలు ప్రశ్నలు చోప్రాకు ఎదురయ్యాయి.హోస్ట్: ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు) ఎవరు గెలుస్తారు?ఆకాష్ చోప్రా: సంజూ శాంసన్. (ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సీఎస్కే తరపున ఆడనున్నాడు.)హోస్ట్: పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) ఎవరు గెలుస్తారు?చోప్రా: జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్)హోస్ట్: ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఎవరికి దక్కుతుంది?చోప్రా: వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం).హోస్ట్: ఏ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుతాయి?చోప్రా: ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు చేరుతాయి.హోస్ట్: ఐపీఎల్ ట్రోఫీని ఎవరు సొంతం చేసుకుంటారు?చోప్రా: ఈసారి మనం సరికొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నాము. ఆ జట్టే ఢిల్లీ క్యాపిటల్స్కాగా చోప్రా ప్లే ఆఫ్స్‌కు చేరే జట్ల జాబితాలో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌కు చోటు ఇవ్వకపోవడం గమనార్హం. -
IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వడానికి మరో రెండు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. త్వరలో ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా పీటర్సన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ పదవి నుంచి వైదొలగడానికి కారణం కూడా ఇదే కావొచ్చు. ‘నేను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గా ఉండటం లేదు. ఆ బాధ్యతలకు కావాల్సినంత సమయం కేటాయిం చలేకపోతున్నా. అయితే ఈ సీజన్లో ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మిమ్మల్ని (ఫ్యాన్స్) కామెంట్రీ బాక్స్‌లో నుంచి చూస్తా. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ ఐపీఎల్. కొత్త సీజన్ కోసం వేచి చూడలేకపోతున్నా’ అని పీటర్సన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపాడు. బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ సత్ఫలితాలు సాధించలేకపోతోంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ వరకు చేరుకున్న ఇంగ్లండ్ నాకౌట్లో భారత్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మెక్కల్లమ్ కోచ్‌గా వచ్చిన కొత్తలో బజ్‌బాల్ ఆటతో ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శించింది. కానీ క్రమంగా బజ్‌బాల్ ఆటే ఇంగ్లండ్ కొంపముంచింది. దీంతో మెక్‌కల్లమ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ పీటర్సన్ ఇంగ్లండ్‌కు కోచ్‌గా ఎంపికైతే ఇతర బాధ్యతలు చూడడం కష్టతరమవుతుందనే ఉద్దేశంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ స్టేజీకే పరిమితమైన సంగతి తెలిసిందే.చదవండి: రోహిత్ బాటలో రిషబ్ పంత్! -
IPL 2026: ‘ప్రపంచం అతడిని మర్చిపోయింది’
ఒకప్పుడు సచిన్ టెండుల్కర్ వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు ముంబై క్రికెటర్ పృథ్వీ షా. చిన్న వయసులోనే అద్భుతమైన ఆట తీరుతో అభిమానులను ఆకర్షించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కెప్టెన్‌గా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ ట్రోఫీ అందించాడు.ఈ క్రమంలోనే టీమిండియా ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన పృథ్వీ షా (Prithvi Shaw) తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆ తర్వాత వరుస వైఫల్యాలతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ముంబై జట్టులోనూ అతడి స్థానం గల్లంతైంది. దీంతో పొరపాట్లు సరిచేసుకున్న పృథ్వీ షా.. తిరిగి గాడిలో పడ్డాడు.రూ. 75 లక్షల కనీస ధరదేశీ క్రికెట్లో మరోసారి బ్యాట్‌తో మెరిసి తనను తాను నిరూపించుకున్నాడు. ముంబైని వీడి మహారాష్ట్ర జట్టులో చేరి సత్తా చాటాడు పృథ్వీ షా. ఈ క్రమంలో ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 75 లక్షల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది.ఒకప్పుడు ఐపీఎల్లో కోట్లు పలికిన పృథ్వీని.. అదే జట్టు ఇలా బేస్ ప్రైస్‌కు దక్కించుకోవడం విశేషం. నిజానికి ముందు రౌండ్లలో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోగా ఆఖర్లో ఢిల్లీ కనికరించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పృథ్వీ షాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.ప్రపంచం అతడిని మర్చిపోయింది. ఈసారి‘‘పృథ్వీ షాకు ఇదొక గొప్ప అవకాశం. ఇప్పటికే ప్రపంచం అతడిని మర్చిపోయింది. ఇప్పుడతడు మునుపటి ఆటగాడే. కఠిన శ్రమతో తనను తాను సరిదిద్దుకుని పరుగులు రాబడుతున్నాడు.అందుకే ఇక్కడిదాకా చేరుకోగలిగాడు. ఒకవేళ తుదిజట్టులో ఆడే అవకాశం వస్తే అతడు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా పృథ్వీకి సూచించాడు. కాగా పృథ్వీ షా ఇటీవలే తన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన విషయం తెలిసిందే. మోడల్, నటి ఆకృతి అగర్వాల్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మార్చి 28 నుంచి మొదలుకానుంది. కాగా అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది ఏడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది.చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్!? -
ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌కు మరో కీలక పదవి
ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హేమంగ్ బదానీకి మరో కీలక పదవి దక్కింది. హండ్రెడ్ లీగ్‌లోని సదరన్ బ్రేవ్ పురుషుల ఫ్రాంచైజీ కూడా అతన్నే హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ రెండు ఫ్రాంచైజీలకు GMR గ్రూప్ సహ యజమానిగా ఉంది. బ్రేవ్ యాజమాన్యం బదానీకి డిప్యూటీగా (అసిస్టెంట్ కోచ్) ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ బెల్‌ను ఎంపిక చేసింది.GMR గ్రూప్‌కు ఐపీఎల్ హండ్రెడ్ లీగ్‌తో పాటు మేజర్ లీగ్ క్రికెట్ (Seattle Orcas), ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (Dubai Capitals) కూడా ఫ్రాంచైజీలు ఉన్నాయి.సదరన్ బ్రేవ్ గత ప్రదర్శనలుసదరన్ బ్రేవ్ ఫ్రాంచైజీ హండ్రెడ్ లీగ్ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. ఆతర్వాత 2024 ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత ఎడిషన్‌లో మాత్రం సగం మ్యాచ్‌లు ఓడి, నాకౌట్స్‌కు కూడా చేరలేకపోయింది.కాగా, హండ్రెడ్ లీగ్ 2026 ఎడిషన్ జులై 21 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఎంఐ లండన్, సన్‌రైజర్స్ లీడ్స్ పోటీపడనున్నాయి. జులై 22న జరిగే మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ వెల్ష్ ఫైర్‌తో తలపడుతుంది.తొలిసారి వేలంహండ్రెడ్ లీగ్‌లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్ల ఎంపిక జరుగనుంది. ఈ వేలం మార్చి 11, 12 తేదీల్లో జరుగనుంది. 18 దేశాలకు చెందిన 400 మంది ఆటగాళ్లు వేలానికి షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు పోటీపడతాయి. -
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)
-
బెంగళూరుకే పట్టం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి అందరికంటే ముందే ‘ప్లేఆఫ్స్’ చేరి నేరుగా ఫైనల్‌కూ అర్హత పొందింది. ఫైనల్లో ఢిల్లీని ఓడించి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రెండు ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్ సరసన నిలిచింది. వడోదర: అయ్యో... ఢిల్లీ! నాలుగోసారి ఫైనల్ చేరినా... మళ్లీ రన్నరప్ గానే ముగించింది. ముంబై (2023, 2025), బెంగళూరు (2024, 2026) జట్లకు రెండేసి సార్లు టైటిల్‌ను అప్పగించింది. గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై జయభేరి మోగించింది. విజేత ఆర్సీబీ జట్టుకు రూ. 6 కోట్లు... రన్నరప్ ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 57; 8 ఫోర్లు), లౌరా వోల్వార్ట్ (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు రాణించారు. ఆఖర్లో షినెల్ హెన్రీ (15 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగింది. తర్వాత బెంగళూరు కఠినమైన లక్ష్యాన్ని సైతం 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులతో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ స్మృతి మంధాన (41 బంతుల్లో 87; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), జార్జియా (54 బంతుల్లో 79; 14 ఫోర్లు) దంచేశారు. రెండు ఓవర్లలో 39 పరుగులు...ఢిల్లీ టాప్–4 బ్యాటర్లు లిజెల్లీ లీ (30 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), షఫాలీ వర్మ (13 బంతుల్లో 20; 3 ఫోర్లు), వోల్వార్ట్, జెమీమా సమష్టిగా పరుగులు సాధించారు. దీంతో 18 ఓవర్లలో 164/3 స్కోరు చేసింది. డిక్లెర్క్ వేసిన 19వ ఓవర్లో షినెల్ హెన్రీ 4, వైడ్, 4, 4, 4, 6, 1 ఇలా బంతిని పదేపదే బౌండరీ లైన్ దాటించడంతో 24 పరుగులు వచ్చాయి. తర్వాత ఆఖరి ఓవర్ వేసిన సయాలీ 6, 4తో కలిసి 15 పరుగులు సమర్పించుకుంది. ఈ రెండు ఓవర్లలోనే 39 పరుగులతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది. శుభారంభం దక్కకున్నా... ఆరంభంలోనే హిట్టర్ గ్రేస్ హారిస్ (9) వికెట్‌ను కోల్పోయినా... స్మృతి, వోల్ల ధనాధన్ షో ఢిల్లీ ఆశల సౌధాన్ని కూల్చేసింది. 37 బంతుల్లో వోల్, 23 బంతుల్లో కెపె్టన్ స్మృతి పూర్తి చేసుకున్న ఫిఫ్టీలు బెంగళూరును సాఫీగా లక్ష్యంవైపు నడిపించాయి. ఆఖర్లో వీళ్లిద్దరితో పాటు రిచా (6) అవుటైనా... ఎలాంటి డ్రామా లేకుండా, రాధ యాదవ్ (12 నాటౌట్; 2 ఫోర్లు) బౌండరీలతో ముగించింది. 243 పరుగులు సాధించిన స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లిజెల్లీ (సి) హ్యారిస్ (బి) డిక్లెర్క్ 37; షఫాలీ (సి) రిచా ఘోష్ (బి) అరుంధతి 20; వోల్వార్ట్ (రనౌట్) 44; జెమీమా (సి) డిక్లెర్క్ (బి) సయాలీ 57; షినెల్ హెన్రీ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–49, 2–72, 3–148, 4–203. బౌలింగ్: బెల్ 4–0–19–0, సయాలీ 4–0–46–1, అరుంధతి 4–0–40–1, శ్రేయాంక 2–0–32–0, డిక్లెర్క్ 4–0–48–1, రాధ 2–0–18–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: హారిస్ (బి) హెన్రీ 9; స్మృతి (బి) హెన్రీ 87; జార్జియా వోల్ (సి) షఫాలీ (బి) మిన్ను మణి 79; రిచా ఘోష్ (సి) మిన్ను మణి (బి) నందిని 6; డిక్లెర్క్ (నాటౌట్) 7; రాధ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–9, 2–174, 3–181, 4–191. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–38–0, షినెల్ హెన్రీ 4–0–34–2, నందిని 4–0–41–1, శ్రీచరణి 3.4–0–46–0, షఫాలీ 1–0–9–0, మిన్ను మణి 2–0–19–1, స్నేహ్ రాణా 1–0–15–0. -
డబ్ల్యూపీఎల్-2026 ఛాంపియన్స్‌గా ఆర్సీబీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవతరించింది. గురువారం వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కేవలం 37 బంతుల్లో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆమెతో పాటు లారా వోల్వార్డ్(25 బంతుల్లో 44 పరుగులు), చినెల్ హెన్రీ(15 బంతుల్లోనే 35) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో అరుంధతి, సత్ఘరే, నడైన్ డిక్లార్క్ తలా వికెట్ సాధించారు.మంధాన మెరుపులు, వోల్ విధ్వంసంఅనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగా ఔటైనప్పటికి కెప్టెన్ స్మృతి మంధాన(41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87),జార్జియా వోల్ (53 బంతుల్లో 79) విధ్వంసం సృష్టించారు.వారిద్దరూ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశారు. వడోదర మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. స్మృతి-వాల్ జోడీ రెండో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి తమ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే వరుస క్రమంలో వాల్, రిచా ఘోష్, మంధాన వికెట్లు తీయడంతో ఢిల్లీ తిరిగి గేమ్‌లోకి వచ్చింది.కానీ 19 ఓవర్లో రాదా యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను మిన్ను మణి జారవిడిచింది. ఇందుకు ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 9 పరుగుల అవసరమవ్వగా రాదా యాదవ్ వరుసగా రెండు ఫోర్లు బాది తన జట్టును ఛాంపియన్‌గా నిలిపింది. కాగా ఢిల్లీ ఫైనల్లో ఓడిపోవడం ఇది వరుసగా నాలుగో సారి కావడం గమనార్హం. -
ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
-
ఢిల్లీ... ఈసారైనా?
వడోదర: ఒకటి కాదు రెండు కాదు...వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు... గత మూడు ప్రయత్నాల్లోనూ తుది మెట్టుపై చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారైనా తమ తొలి కప్ కలను నెరవేర్చుకోవాలని ఒకవైపు పట్టుదలగా ఉంది. మరోవైపు అద్భుత ఫామ్‌తో అగ్రస్థానంలో నిలిచి తుది పోరుకు నేరుగా అర్హత సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే టైటిల్ పోరులో 2024 చాంపియన్ ఆర్సీబీతో ఢిల్లీ తలపడనుంది. జోరు మీదున్న స్మృతి బృందం అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఆర్సీబీ లీగ్ చరిత్రలో వరుసగా ఐదు విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. కెప్టెన్ స్మృతి మంధాన 290, గ్రేస్ హారిస్ 228 పరుగులు నమోదు చేశారు. రిచా ఘోష్ 150కి పైగా స్ట్రయిక్ రేట్‌తో దూకుడును ప్రదర్శించింది. ఆల్‌రౌండర్‌గా డిక్లెర్క్ అంచనాలకు మించి రాణించింది. 15 వికెట్లు తీసిన డిక్లెర్క్ బ్యాటింగ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. ప్రధాన పేసర్ లారెన్ బెల్ ప్రత్యర్థిని ఆరంభంలోనే కట్టిపడేస్తోంది. ఈ సీజన్లో ఆమె ఏకంగా 116 డాట్ బాల్స్ వేయడం విశేషం. స్పిన్నర్ శ్రేయాంక కూడా 11 వికెట్లతో రాణించగా, ఎలైస్ పెరీ స్థానంలో అనూహ్యంగా జట్టులోకి వచి్చన సయాలీ కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇదే జోరును అందరూ కొనసాగిస్తే బెంగళూరుకు మరో విజయం దక్కవచ్చు. బ్యాటర్లదే బాధ్యత... ఢిల్లీ ఈ సీజన్లో సాధించిన ఐదు విజయాలు కూడా ఛేదనలోనే వచ్చాయి. తొలుత బ్యాటింగ్‌కంటే టీమ్ ఛేదనకే ఆసక్తి చూపిస్తోంది. అయితే ఫైనల్ ఒత్తిడిని ఏమేరకు అధిగమిస్తుందనేది ఆసక్తికరం. గత సీజన్ ఫైనల్లో ఢిల్లీ ఛేదనలోనే ఓడిపోయింది. తాజా సీజన్లో కొత్త కెపె్టన్ జెమీమా రోడ్రిగ్స్ నేతృత్వంలో జట్టు మెరుగైన ప్రదర్శనే కనబర్చింది. వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న జెమీమా నాయకురాలిగా తొలి అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకుంది. ఓపెనర్లు షఫాలీ, లిజెల్ లీ తొలి వికెట్‌కు కనీసం అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన మూడు మ్యాచ్‌ల్లో కూడా ఢిల్లీ గెలిచింది. మూడో స్థానంలో వోల్వార్ట్ నిలకడగా ఆడుతుండగా, జెమీమా కూడా ఎలిమినేటర్‌లో చక్కటి ఇన్నింగ్స్ ఆడింది. బౌలింగ్‌లో మరోసారి శ్రీచరణి (14 వికెట్లు), నందిని శర్మ (16 వికెట్లు), స్నేహ్ రాణాలపై జట్టు ఆధారపడుతోంది. పేసర్ షినెల్ హెన్రీ కూడా ప్రభావం చూపించగలదు. -
వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు!
టీ20 ఫార్మాట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటి.. భారత జట్టులోకి వచ్చిన ఈ పంజాబీ ఆటగాడు.. అనతికాలంలోనే ఓపెనర్‌గా పాతుకుపోయాడు.విధ్వంసకర ఇన్నింగ్స్‌కు మారుపేరుగా మారి ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma). ఇప్పటికే తన ధనాధన్ ఆటతో ఎన్నో రికార్డులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టీ20 ప్రపంచకప్-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.మొదటి ఐపీఎల్ కోచ్‌ను నేనేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ (Ricky Ponting) అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ విధ్వంసకర బ్యాటర్‌కు మొదటి ఐపీఎల్ కోచ్‌ను తానేనని.. అతడు భవిష్యత్తు సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడని నాడే అంచనా వేశానని పేర్కొన్నాడు.కాగా అభిషేక్ శర్మ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అప్పుడు పాంటింగ్ ఢిల్లీ కోచ్‌గా ఉన్నాడు. ఇక ఆర్సీబీతో తన తొలి మ్యాచ్‌లోనే అభిషేక్ శర్మ.. ఆరో స్థానంలో వచ్చి 19 బంతుల్లోనే 46 పరుగులతో అజేయంగా నిలిచాడు.టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో తాజాగా నాటి విషయాలు గుర్తు చేసుకున్న రిక్కీ పాంటింగ్.. అభిషేక్ శర్మను దూరం చేసుకోవద్దని తాను ఢిల్లీ యాజమాన్యానికి ఎంతగానో చెప్పిచూశానని తెలిపాడు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం 2019 వేలానికి ముందు అతడిని ట్రేడ్ చేసిందని వెల్లడించాడు.భవిష్య సూపర్‌స్టార్.. వద్దని మొత్తుకున్నా వినలేదు"అతడికి మొదటి ఐపీఎల్ కోచ్ నేనే. నా మార్గదర్శనంలోనే అతడు అరంగేట్రం చేశాడు. పదిహేడేళ్ల వయసులో ఢిల్లీ తరఫున రంగంలోకి దిగి.. ఆరంభంలోనే అదరగొట్టాడు. తొలి బంతినే బౌలర్ మీదుగా స్ట్రెయిట్‌గా బౌండరీకి తరలించాడు. క్లాసీ షాట్లతో అలరించాడు.అప్పుడే అతడు ఓ ప్రత్యేకమైన ఆటగాడని నాకు అర్థమైంది. కానీ ఢిల్లీ యాజమాన్యం మాత్రం అతడిని ట్రేడ్ చేయాలని ఫిక్సైంది. అప్పుడు నేను అలా చేయవద్దని మొత్తుకున్నా వినలేదు. భవిష్య సూపర్‌స్టార్ ఇతడేనని బలంగా నమ్మాను. అదే విషయం వాళ్లకి చెప్పాను. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండేవి’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూతో పేర్కొన్నాడు.ధావన్ కోసం ట్రేడ్ చేసిన ఢిల్లీకాగా శిఖర్ ధావన్ కోసం ఒప్పందం చేసుకునే క్రమంలో ఢిల్లీ అభిషేక్ శర్మను సన్‌రైజర్స్‌కు ట్రేడ్ చేసింది. ఇక సన్‌రైజర్స్‌కు మారిన తర్వాత అభిషేక్ సృష్టించిన పరుగుల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి 71 ఇన్నింగ్స్‌లో 162కు పైగా స్ట్రైక్‌రేటుతో 1753 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టీమిండియా తరఫున ఇప్పటికి 38 మ్యాచ్‌లు ఆడి 1297 రన్స్ రాబట్టిన అభిషేక్ శర్మ ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి.చదవండి: భారత్-పాక్ టీ20 ప్రపంచకప్ వార్.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా -
ఎలిమినేటర్ లో ఢిల్లీ సత్తా.. సెమీస్ లో గుజరాత్ ఔట్
-
చరిత్ర తిరగరాసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్
మహిళల ఐపీఎల్లో (WPL) ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ నందిని శర్మ చరిత్ర తిరగరాసింది. లీగ్ చరిత్రలో (సింగిల్ ఎడిషన్‌లో) అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరించింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ బౌలర్ సైకా ఇషాఖీ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టింది. ఇషాఖీ 2023 ఎడిషన్‌లో 15 వికెట్లు తీయగా.. ప్రస్తుత ఎడిషన్‌లో (2026) నందిని 16 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 3) గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో నందిని శర్మ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె 2 వికెట్లు తీసింది.డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు (టాప్-4)నందిని శర్మ (ఢిల్లీ క్యాపిటల్స్)- 16 వికెట్లు (2026)సైకా ఇషాఖీ (ముంబై ఇండియన్స్)- 15 (2023)శ్రీచరణి (ఢిల్లీ క్యాపిటల్స్)- 14 (2026)శ్రేయాంక పాటిల్ (ఆర్సీబీ)- 13 (2024)హ్యాట్రిక్ఈ సీజన్లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో నందిని హ్యాట్రిక్‌తో మెరిసింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడినా నందిని హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి సత్తా చాటింది. ఈ సీజన్లో ఢిల్లీ సాధించిన విజయాల్లో నందినిది కీలకపాత్ర. 24 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌ను ఢిల్లీ ఈ సీజన్ వేలంలో 20 లక్షలకు సొంతం చేసుకుంది.నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ గుజరాత్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా నాలుగో ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. బెత్ మూనీ (62 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో చినెల్ హెన్రీ 3, నందిని శర్మ 2, మిన్ను మణి ఓ వికెట్ తీశారు.అనంతరం 169 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది. లిజెల్ లీ (43), జెమీమా రోడ్రిగ్స్ (41) ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. రేపు (ఫిబ్రవరి 5) వడోదరలో జరుగబోయే ఫైనల్లో ఢిల్లీ ఆర్సీబీతో తలపడనుంది. -
ఎవరిదో ‘ఫైనల్’ బెర్త్?
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఇప్పటి వరకు మూడు సీజన్లు జరగ్గా ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సార్లూ ఫైనల్‌కు చేరింది. అయితే దురదృష్టవశాత్తూ ప్రతీసారి ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ తొలి రెండు సీజన్లలో ఆఖరి స్థానానికే పరిమితం కాగా... గత ఏడాది మాత్రం రెండో స్థానంతో ఎలిమినేటర్‌కు అర్హత సాధించినా ... అదే మ్యాచ్‌లో ఓడి ని్రష్కమించింది. ఈసారైనా ఆ దశను దాటి తొలిసారి తుది పోరుకు చేరాలని జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ, గుజరాత్ జట్ల మధ్య ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. స్పిన్నర్లు కీలకం... గత మూడు సీజన్లలో గ్రూప్ దశలో అగ్రస్థానంతో ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. ఈసారి కాస్త తడబాటును ప్రదర్శించిన జట్టు ఇప్పుడు ఫైనల్ కోసం ఎలిమినేటర్‌లో ఆడుతోంది. బ్యాటింగ్ పరంగా చూస్తే టాప్–5తో జట్టు మెరుగ్గా కనిపిస్తోంది. ఓపెనర్లు లిజెల్ లీ, షఫాలీ వర్మ శుభారంభం అందిస్తే జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉంటాయి. తర్వాతి బ్యాటర్లలో లారా వోల్వార్ట్, కెప్టెన్ జెమీమా, మరిజాన్ కాప్ చకచకా పరుగులు రాబట్టగలరు. అయితే టీమ్ ప్రధానంగా స్పిన్నర్లపై ఆధారపడుతోంది. శ్రీచరణి, స్నేహ్ రాణా, నందిని శర్మ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించగల సమర్థులు సమష్టి ప్రదర్శనపై భారం... విదేశీ క్రికెటర్ల ప్రదర్శనతోనే తాజా సీజన్లో గుజరాత్ జెయింట్స్ ముందంజ వేసిందనడంలో సందేహం లేదు. ముగ్గురు ఆ్రస్టేలియన్లు కెపె్టన్ యాష్లీ గార్డ్నర్, బెత్ మూనీ, జార్జియా వేర్హామ్ తమ ఆటతో ప్రతీసారి ప్రభావం చూపించగా, న్యూజిలాండ్ సీనియర్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటింది. మరోసారి జెయింట్స్ ఈ ప్లేయర్లపైనే ఆధారపడుతోంది. భారత ఆటగాళ్లలో అనుష్క శర్మ మాత్రమే మూడో స్థానంలో చెప్పుకోదగ్గ రీతిలో రాణించింది. గుజరాత్ ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లు గెలవగా... ఐదుసార్లు తొలుత బ్యాటింగ్ చేసి విజయాన్నందుకోవడం విశేషం. -
‘ఎలిమినేటర్’కు ఢిల్లీ క్యాపిటల్స్
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ‘ఎలిమినేటర్’ పోరుకు అర్హత పొందింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలోని ఢిల్లీ 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. దీప్తి శర్మ (24; 4 ఫోర్లు, 1సిక్స్), సిమ్రన్ షేక్ (22; 3 ఫోర్లు), శిఖా పాండే (23; 3 ఫోర్లు) రెండు పదులు స్కోర్లు చేశారు. మరిజాన్ కాప్ 3, హెన్రీ, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. వోల్వార్డ్ (47; 7 ఫోర్లు) రాణించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం జరిగే గుజరాత్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఇప్పటికే బెంగళూరు నేరుగా ఫైనల్ చేరింది. చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై విజయం -
ఢిల్లీ గెలిస్తే ‘ఎలిమినేటర్’కు అర్హత
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశాల్ని మెరుగుపరిచాయి. టోర్నీలో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్‌కే ‘ఎలిమినేటర్’ చాన్స్ ఉంది. నేడు యూపీ వారియర్స్‌తో జరిగే చివరి లీగ్ పోరులో ఢిల్లీ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా గుజరాత్ జెయింట్స్‌తో ఎలిమినేటర్ ఆడే అర్హత సాధిస్తుంది. అయితే ఓడినా ముందంజ వేసేందుకు స్వల్ప అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో ముంబై, ఢిల్లీకి ప్రస్తుతం సమానంగా 6 పాయింట్లు ఉన్నాయి. అయితే ముంబైకంటే ఢిల్లీ రన్‌రేట్ చాలా తక్కువగా ఉంది. రన్‌రేట్ మైనస్‌లో ఉంది. అయితే నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటే ఢిల్లీ ముందుకెళుతుంది. షఫాలీ, లిజెల్లీ, లారా వోల్వార్డ్‌లతో కూడిన టాపార్డర్ ధాటిగా పరుగులు చక్కబెడితే యూపీపై భారీస్కోరును సునాయాసంగానే సాధించవచ్చు. కెపె్టన్ జెమీమా, మరిజాన్, నికీ ప్రసాద్‌లు కూడా ధనాధన్ ఆట ఆడేయగలరు. బౌలింగ్‌లో షినెల్ హెన్రీ, మరిజాన్, నందిని, శ్రీచరణిలు ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు అట్టడుగున ఉన్న యూపీ కేవలం రెండే మ్యాచ్‌ల్లో గెలిచింది. -
ఫైనల్లో ఆర్సీబీ.. మరి ఆ రెండు బెర్తులు దక్కేదెవరికి?
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్లో ఇంకా కేవలం రెండు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ టోర్నీలో భాగంగా గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు మరో రెండు స్ధానాల కోసం నాలుగు జట్లు పోటీ పడతున్నాయి. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.పాయింట్ల పట్టికలో ఆర్సీబీ(12) అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్దానంలో గుజరాత్ జెయింట్స్(8 పాయింట్లు), ముంబై ఇండియన్స్(6), ఢిల్లీ క్యాపిటల్స్(6), యూపీ వారియర్స్(4) ఉన్నాయి.గుజరాత్ జెయింట్స్గుజరాత్ జట్టు శక్రవారం వడోదర వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే మిగితా జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫలితం వరకు ఎదురు చూడాలి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోతే గుజరాత్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది.ముంబై ఇండియన్స్గుజరాత్తో జరిగే మ్యాచ్ ముంబై జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే పాయింట్ల పరంగా గుజరాత్‌తో సమంగా నిలుస్తోంది. అయితే గుజరాత్(-0.271) కంటే ముంబై(+0.146) రన్‌రేట్ మెరుగ్గా ఉన్నుందన హర్మన్ సేన ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.ఢిల్లీ క్యాపిటల్స్జేమీమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ భారీ విజయం సాధించాలి. అదేవిధంగా ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఫలితం కూడా ఢిల్లీ ప్లే ఆఫ్ రేసును ప్రభావితం చేస్తుంది. ఢిల్లీ రన్‌రేట్ ప్రస్తుతం -0.164 ఉంది. భారీ విజయం సాధిస్తేనే 2 పాయింట్లతో పాటు రన్‌రేట్ కూడా గణనీయంగా మెరుగపడుతోంది.యూపీ వారియర్స్ఇక యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్ చేరే దారులు దాదాపు మూసుకుపోయినట్లే. యూపీ ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లే ఉన్నాయి. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో యూపీ భారీ విజయం సాధించాలి. అలాగే ముంబై ఇండియన్స్ గుజరాత్‌తో మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోవాలి. అప్పుడు 6 పాయింట్లతో ముంబై, యూపీ, ఢిల్లీ సమంగా నిలుస్తాయి. ఆ సమయంలో రన్‌రేట్ ఆధారంగా మూడింటిలో ఓ జట్టు ఫ్లేప్స్లో అడుగుపెడుతోంది -
గుజరాత్‌ను గెలిపించిన సోఫీ డివైన్
వడోదర: అప్పుడు ముంబైలో... ఇప్పుడు వడోదరలో... ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్‌ల మధ్య ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన పోరులో గుజరాతే పైచేయి సాధించింది. ఈ రెండు సందర్భాల్లోనూ సోఫీ డివైన్ చివరి ఓవరే గెలవాల్సిన ఢిల్లీని ఓడించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జెయింట్స్ 3 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ముందుగా గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (58; 7 ఫోర్లు) రాణించింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి (4/31) తిప్పేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడింది. ఢిల్లీ విజయానికి ఆఖరి 24 బంతుల్లో 60 పరుగులు కావాల్సిన దశలో నికీ ప్రసాద్ (24 బంతుల్లో 47; 9 ఫోర్లు), స్నేహ్ రాణా (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. డివైన్ 17వ ఓవర్లో 23 పరుగులు, గార్డ్నర్ 19వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. దాంతో ఢిల్లీ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాలి. కానీ సోఫీ డివైన్ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి నికీ, స్నేహ్‌లను అవుట్ చేయడంతో గుజరాత్ ఓటమి కోరల్లోంచి బయటపడి గెలిచింది. నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు జట్టుతో యూపీ వారియర్స్ ఆడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) జెమీమా (బి) నందిని 58; సోఫీ డివైన్ (బి) కాప్ 13; అనుష్క (సి) మిన్నుమణి (బి) శ్రీచరణి 39; గార్డ్నర్ (సి) స్నేహ్ రాణా (బి) మిన్నుమణి 2; వేర్హమ్ (బి) శ్రీచరణి 11; భారతి (బి) చినెల్లి హెన్రీ 3; కనిక (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీచరణి 4; కాశ్వీ (బి) శ్రీచరణి 2; తనూజ (సి) శ్రీచరణి (బి) చినెల్లి హెన్రీ 21; రేణుక (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–19, 2–73, 3–96, 4–128, 5–131, 6–135, 7–139, 8–151, 9–174. బౌలింగ్: కాప్ 4–0–34–1, చినెల్లి 4–0–38–2, నందిని 4–0– 26–1, శ్రీచరణి 4–0–31–4, స్నేహ్ రాణా 1–0– 11–0, మిన్ను మణి 3–0–23–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) గార్డ్నర్ (బి) రాజేశ్వరి 14; లిజెల్లీ (సి) గార్డ్నర్ (బి) సోఫీ 11; వోల్వార్డ్ (బి) రాజేశ్వరి 24; జెమీమా (బి) సోఫీ 16; కాప్ (బి) గార్డ్నర్ 0; చినెల్లి (సి) గార్డ్నర్ (బి) రాజేశ్వరి 9; నికీ ప్రసాద్ (సి) గార్డ్నర్ (బి) డివైన్ 47; స్నేహ్ రాణా (సి) వేర్హమ్ (బి) సోఫీ 29; మిన్ను మణి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–26, 2–51, 3–82, 4–83, 5–85, 6–100, 7–170, 8–171. బౌలింగ్: రేణుక 1–0–16–0, కాశ్వీ గౌతమ్ 2–0–18–0, రాజేశ్వరి 4–0–20–3, సోఫీ డివైన్ 4–0–37–4, తనూజ 4–0–26–0, ఆష్లే గార్డ్నర్ 4–0–37–1, వేర్హమ్ 1–0–12–0. -
ఆర్సీబీకి తొలి ఓటమి.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది.ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని నామమాత్రపు స్కోరే పరిమితం చేశారు. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, కాప్, మిన్ను మని తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధాన(38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో లారా వోల్వడర్ట్(42), కాప్(19) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సత్ఘరే రెండు, రాధా యాదవ్ ఓ వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
ఢిల్లీని గెలిపించిన జెమీమా
వడోదర: జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కెప్టేన్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించింది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ ఖాతాలో రెండో విజయం చేరింది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ (45 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టేన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 41; 7 ఫోర్లు) రాణించారు.21 పరుగుల వద్దే ఓపెనర్లు సజన (9), హేలీ మాథ్యూస్ (12) నిష్క్రమించగా... హర్మన్, బ్రంట్ మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. క్యాపిటల్స్ బౌలర్లలో తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు లీజెల్లి లీ (28 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (29; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 63 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. ముంబైకిది ‘హ్యాట్రిక్’ పరాజయం. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన హర్మన్ బృందం కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. డబ్ల్యూపీఎల్‌లో నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సజన (బి) నందిని 9; హేలీ మాథ్యూస్ (బి) మరిజాన్ కాప్ 12; నాట్ సీవర్ (నాటౌట్) 65; హర్మన్‌ప్రీత్ (సి) హామిల్టన్ (బి) శ్రీచరణి 41; నికోలా కేరీ (సి) స్నేహ్ రాణా (బి) శ్రీచరణి 12; అమన్‌జోత్ (సి) లీజెల్లి (బి) శ్రీచరణి 3; సంస్కృతి (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–21, 2–21, 3–99, 4–130, 5–134.బౌలింగ్: మరిజాన్ 4–0–8–1, హామిల్టన్ 4–0– 36–0, నందిని శర్మ 4–0–36–1, శ్రీచరణి 4–0– 33–3, స్నేహ్ రాణా 3–0–27–0, షఫాలీ వర్మ 1–0–14–0ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (బి) వైష్ణవి 29; లీజెల్లి లీ (స్టంప్డ్) రహిలా (బి) అమన్‌జోత్ 46; వోల్వార్డ్ (రనౌట్) 17; జెమీమా (నాటౌట్) 51; మరిజాన్ కాప్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–63, 2–84, 3–118.బౌలింగ్: షబి్నమ్ 4–0–26–0, నికోలా 1–0–13–0, నాట్ సీవర్ 4–0–42–0, సంస్కృతి 1–0–13–0, అమన్‌జోత్ 3–0–21–1, వైష్ణవి 4–0–20–1, హేలీ 2–0–19–0. -
చెలరేగిన బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ 2026లో (WPL) ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ మారిజాన్ కాప్ (4-0-8-1) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. కాప్‌తో పాటు శ్రీ చరణి (4-0-33-3), నందిని శర్మ (4-0-36-1) కూడా సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లూసీ హ్యామిల్టన్ (4-0-36-0), స్నేహ్ రాణా (3-0-27-0) ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. షఫాలీ వర్మ ఓ ఓవర్ వేసి 14 పరుగులు సమర్పించుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో నాట్ సీవర్ బ్రంట్ (65 నాటౌట్) అజేయ అర్ద శతకంతో రాణించింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41) సహకరించింది. వీరిద్దరు సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో సంజీవన్ సజనా (9), హేలీ మాథ్యూస్ (12), నికోలా కేరీ (12), అమన్‌జోత్ కౌర్ (3) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆఖర్లో సంస్కృతి గుప్త (10 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది.కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి, ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.పేరుకు రెండో స్థానంలో ఉన్నా, ముంబైకి ఈ స్థానం గ్యారెంటీ కాదు. ఎందుకంటే మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉన్నాయి. యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో తలా రెండేసి విజయాలు సాధించి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది. -
స్మృతి చేజారిన సెంచరీ
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అజేయంగా దూసుకెళుతోంది. జోరు మీదున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగింది. 10 పరుగులకే జట్టు 4 వికెట్లు కోల్పోయిన దశలో లూసీ హామిల్టన్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్నేహ్ రాణా (22; 3 ఫోర్లు)లతో కలిసి క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. బెల్, సయాలీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (61 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేసింది. త్రుటిలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్న ఆమె... జార్జియా వోల్ (42 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి రెండో వికెట్‌కు 142 పరుగుల్ని జోడించింది.స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) రావత్ (బి) బెల్ 62; లిజెల్లీ (బి) బెల్ 4; వోల్వార్ట్ (బి) బెల్ 0; జెమీమా (బి) సయాలీ 4; మరిజాన్ (బి) సయాలీ 0; నికీ (ఎల్బీ) (బి) రావత్ 12; మిన్ను మణి (సి) మంధాన (బి) డిక్లెర్క్ 5; స్నేహ్ రాణా (బి) రావత్ 22; హామిల్టన్ (సి) రాధ (బి) సయాలీ 36; శ్రీచరణి నాటౌట్ 11; నందిని రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–5, 2–5, 3–10, 4–10, 5–69, 6–74, 7–108, 8–130, 9–164, 10–166. బౌలింగ్: బెల్ 4–0–26–3, సయాలీ 3–0–27–3, శ్రేయాంక 3–0–44–0, డిక్లెర్క్ 4–0–31–1, ప్రేమ రావత్ 3–0–16–2, రాధా యాదవ్ 3–0–21–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ (సి) షఫాలీ (బి) మరిజాన్ 1; స్మృతి (సి) హామిల్టన్ (బి) నందిని 96; జార్జియా వోల్ నాటౌట్ 54; రిచా ఘోష్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–14, 2–156. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–21–1, లూసీ హామిల్టన్ 3.2–0–37–0, నందిని శర్మ 4–0–34–1, శ్రీచరణి 3–0–26–0, స్నేహ్ రాణా 1–0–13–0, షఫాలీ 1–0–14–0, మిన్ను మణి 2–0–20–0. -
ఢిల్లీ తొలి గెలుపు
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు బోణీ కొట్టింది. బుధవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట యూపీ వారియర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెపె్టన్ మెగ్‌లానింగ్ (38 బంతుల్లో 54; 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీతో సత్తా చాటగా... హర్లీన్ డియోల్ (36 బంతుల్లో 47; 7 ఫోర్లు), లిచ్‌ఫీల్డ్ (20 బంతుల్లో 27; 5 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షఫాలీ వర్మ, మరిజానే కాప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ్ రాణా, నందిని శర్మ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (44 బంతుల్లో 67; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (32 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 11.3 ఓవర్లలో 93 పరుగులు జోడించి జట్టుకు గట్టి పునాది వేయగా... వోల్వార్ట్ (25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా (21; 3 ఫోర్లు) మిగిలిన పని పూర్తిచేశారు. ఇన్నింగ్స్ చివరి బంతికి వోల్వార్ట్ ఫోర్ కొట్టి గెలిపించింది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబైతో యూపీ వారియర్స్ ఆడుతుంది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: కిరణ్ నవగిరె (సి) షఫాలీ (బి) కాప్ 0; లానింగ్ (సి) హెన్రీ (బి) నందిని 54; లిచ్‌ఫీల్డ్ (స్టంప్డ్) లిజెల్లి (బి)స్నేహ్ రాణా 27; హర్లీన్ (రిటైర్డ్ అవుట్) 47; శ్వేత (సి) శ్రీచరణి (బి) షఫాలీ 11; ట్రియాన్ (సి) నికీ (బి) శ్రీచరణి 1; ఎకిల్‌స్టోన్ (ఎల్బీ) (బి) కాప్ 3; శోభన (నాటౌట్) 1; దీప్తి (సి) స్నేహ్ రాణా (బి) షఫాలీ 2; శిఖా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–0, 2–47, 3–132, 4–141, 5–143, 6–148, 7–150, 8–152. బౌలింగ్: కాప్ 4–1–24–2; మిన్ను మణి 1–0–16–0; చినెల్లి 2–0–20–0; నందిని 3–0–29–1; స్నేహ్ రాణా 2–0–20–1; శ్రీచరణి 4–0–29–1; షఫాలీ 4–0–16–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) దీప్తి (బి) శోభన 36; లిజెల్లీ (సి) కిరణ్ (బి) దీప్తి 67; వోల్వార్ట్ (నాటౌట్) 25; జెమీమా (సి) హర్లీన్ (బి) దీప్తి 21; కాప్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–94, 2–114, 3–148. బౌలింగ్: క్రాంతి 2–0–10–0; శిఖ 4–0–22–0; ఎకిల్‌స్టోన్ 4–0– 44–0; ట్రియాన్ 3–0–35–0; శోభన 4–0–20–1; దీప్తి 3–0–26–2. -
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
-
సూపర్ సోఫీ
ముంబై: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను విజయం వరించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం పరుగుల వరద పారిన పోరులో గుజరాత్ 4 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ (42 బంతుల్లో 95; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్ ఆష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా దంచికొట్టింది. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ (5/33) ‘హ్యాట్రిక్’తో సహా 5 వికెట్లుపడగొట్టగా... తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (2/42), చినెల్లి హెన్రీ (2/43) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులకు పరిమితమై వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లిజెల్లి లీ (54 బంతుల్లో 86; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), లారా వోల్వార్ట్ (38 బంతుల్లో 77; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఆరంభంలో లిజెల్లి చెలరేగిపోగా... విజయానికి 24 బంతుల్లో 60 పరుగులు అవసరమైన దశలో వోల్వార్ట్ కదంతొక్కింది. వోల్వార్ట్ 17వ ఓవర్లో 2 ఫోర్లు... 18వ ఓవర్లో 4, 4, 4, 6 కొట్టింది. దీంతో సమీకరణం 12 బంతుల్లో 29కి చేరింది. 19వ ఓవర్లో వోల్వార్ట్ 6, 4, జెమీమా ఫోర్‌తో 22 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 7 పరుగులు అవసరం కాగా... 2 పరుగులే ఇచి్చన సోఫీ డివైన్ 2 వికెట్లు తీసి గుజరాత్‌కు వరుసగా రెండో విజయం కట్టబెట్టింది. ఒకే ఓవర్లో 4,4,6,6,6,6 గుజరాత్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సోఫీ డివైన్ విజృంభించింది. స్నేహ్ రాణా వేసిన ఆ ఓవర్ తొలి రెండు బంతులకు ఫోర్లు బాదిన డివైన్... ఆ తర్వాత వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టింది. దీంతో ఒక్క ఓవర్లోనే 32 పరుగులు వచ్చాయి. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో లభించిన అత్యధిక పరుగులు ఇవే. క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన డివైన్... శ్రీచరణి ఓవర్లో సైతం మూడు సిక్స్‌లు బాదింది. మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో సెంచరీకి ఐదు పరుగుల దూరంలో అవుటైంది. నందిని ‘హ్యాట్రిక్’ ఫుల్‌ఫామ్‌లో ఉన్న డివైన్‌ను అవుట్ చేసిన నందిని శర్మ... ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ‘హ్యాట్రిక్’తో సహా నాలుగు వికెట్లు పడగొట్టింది. రెండో బంతికి కాశ్వీ గౌతమ్ (14) అవుట్ కాగా... నాలుగో బంతికి కనిక (4) స్టంపౌటైంది. చివరి రెండు బంతులకు రాజేశ్వరి (0), రేణుక (0) క్లీన్»ౌల్డ్ అయ్యారు. తద్వారా ఇసీ వాంగ్(2023), దీప్తి శర్మ (2024), గ్రేస్ హారిస్ (2025) తర్వాత డబ్ల్యూపీఎల్‌లో ‘హ్యాట్రిక్’ తీసిన నాలుగో బౌలర్‌గా నందిని నిలిచింది. -
డబ్ల్యూపీఎల్‌లో బోణి కొట్టిన ముంబయి.. ఢిల్లీపై ఘన విజయం
ఇవాళ జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బోణి కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ముంబయి ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.ముంబయి నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబయి ఇండియన్స్ 50 పరుగుల తేడాతో నెగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో చినెల్లీ హెన్రీ(33 బంతుల్లో 56) పరుగులతో మాత్రమే రాణించింది. మిగిలిన బ్యాటర్లు అంతా విఫలం కావడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. స్కీవర్ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది. -
హర్మన్ ప్రీత్ విధ్వంసం.. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్
డబ్ల్యూపీఎల్-2026లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. స్కీవర్ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: షఫాలీ వర్మ, లిజెల్ లీ(వికెట్‌కీపర్), లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్(కెప్టెన్), మారిజాన్ కాప్, నికి ప్రసాద్, చినెల్లే హెన్రీ, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మముంబై ఇండియన్స్: అమేలియా కెర్, జి కమలిని(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నికోలా కారీ, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, పూనమ్ ఖేమ్నార్, త్రివేణి వశిష్ట, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా జెమీమా
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఎంపికైంది. భారత జట్టు తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమాకు ఢిల్లీ జట్టు పగ్గాలు అప్పగిస్తన్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో జెమీమా వీరోచిత సెంచరీ సాధించడంతో టీమిండియా ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. ‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండటం గౌరవంగా భావిస్తున్నా. నా మీద నమ్మకముంచిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ ఏడాది నాకు ఎంతో బాగా సాగింది. వరల్డ్‌కప్ గెలిచిన ఆనందంలో ఉన్న సమయంలోనే ఈ వార్త నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. మూడేళ్లుగా ఇదే జట్టుతో సాగుతున్నా. ఎంతో నేర్చుకున్నా. గత మూడు సార్లు ఫైనల్ చేరినా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయాం. ఈ సారి ఆ గెలుపు గీత దాటుతాం’అని జెమీమా పేర్కొంది. డబ్ల్యూపీఎల్ ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా... 27 మ్యాచ్‌లాడి 139.67 స్ట్రయిక్ రేట్‌తో 507 పరుగులు చేసింది. లీగ్‌లో ఇప్పటి వరకు మూడుసార్లు ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరగా... మూడింట్లోనూ జెమీమా ఆడింది. గతంలో ఢిల్లీ జట్టుకు మెగ్ లానింగ్ కెప్టెన్‌గా వ్యవహరించింది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూపీఎల్‌లో తమ తొలి మ్యాచ్‌లో జనవరి 10న ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు..?
ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్లను మార్చనుందని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఐపీఎల్లో అక్షర్ పటేల్ స్థానంలో కేఎల్ రాహుల్.. డబ్ల్యూపీఎల్‌లో మెగ్ లాన్నింగ్ స్థానంలో జెమీమా రోడ్రిగ్స్ డీసీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. 2026 సీజన్ ప్రారంభం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. కెప్టెన్ల మార్పు విషయాన్ని డీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఐపీఎల్ వర్గాల్లో సైతం జోరుగా ప్రచారం జరుగుతుంది.గత ఐపీఎల్ సీజన్లో డీసీ అక్షర్ పటేల్ నేతృత్వంలో ఆశించిన స్థాయి ప్రదర్శనలు చేయలేకపోయింది. వాస్తవానికి గత సీజన్లోనే కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పటికీ.. అతను సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరిగింది. ఈసారి ఎలాగైనా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని మేనేజ్మెంట్ రాహుల్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అక్షర్ పటేల్ నేతృత్వంలో డీసీ గత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో సగం గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలను తృటిలో (ఐదో స్థానం) కోల్పోయింది. రానున్న సీజన్లో ఎలాగైనా ప్లే ఆఫ్స్‌కు చేరాలనే ఉద్దేశంలో భాగంగా కెప్టెన్ మార్పు జరిగినట్లు సమాచారం.డబ్ల్యూపీఎల్ విషయానికొస్తే.. గత సీజన్లో డీసీ అద్బుతమైన ప్రదర్శనలు కనబర్చి ఫైనల్‌కు చేరినా, తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో స్వల్ప తేడాతో ఓడి, మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్ మార్పు అవసరం లేకపోయినా.. స్వదేశీ ప్లేయర్ కెప్టెన్‌గా ఉండాలనే ఉద్దేశంతో డీసీ మేనేజ్మెంట్ జెమీమా రోడ్రిగ్స్‌కు కెప్టెన్సీ అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత కెప్టెన్ మెగ్ లాన్నింగ్‌ను తప్పిస్తారని సమాచారం. జెమీమా ఎంపికకు ఆమె ప్రపంచకప్ ప్రదర్శనలను కూడా కొలమానంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. జెమీమా తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేసి టీమిండియా టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించింది. ముఖ్యంగా ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో జెమీమా చేసిన సూపర్ సెంచరీ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంది. -
చవక ధరకే బెస్ట్ ప్లేయర్లు.. వేలంలో సూపర్ హిట్!
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ స్పందించాడు. ఈసారి వేలంపాటలో అందరి కంటే ఢిల్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఎక్కువగా ఖర్చు పెట్టకుండానే మెరుగైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నారని కొనియాడాడు.రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతోఅబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతో ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆఖిబ్ నబీ కోసం రూ. 8.40 కోట్లు ఖర్చు చేసిన యాజమాన్యం.. అతి తక్కువగా సాహిల్ పరాఖ్ కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.చవక ధరకే బెస్ట్ ప్లేయర్లుఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ ఎస్. బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి వేలంలో సింగిల్ డిజిట్ స్కోర్ (కోట్లలో)తోనే వాళ్లు ఆటగాళ్లందరినీ కొనుగోలు చేశారు. ఒక్కరి కోసం అంతకుమించి ఖర్చుపెట్టలేదు. అంటే.. వారు ఈసారి వేలంపాటలో మంచి ప్రదర్శన ఇచ్చారని అర్థం.వేలంలో చవక ధరకే డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, ఆఖిబ్ నబీ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన తీరు నిజంగా అద్భుతం. దీనిని బట్టే వారు వేలం కోసం ఏ స్థాయిలో సన్నద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పేపర్ మీదైతే వాళ్ల జట్టు సమతూకంగా ఉంది.ఇక మైదానంలో దిగిన తర్వాత ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. 13-14 మంది ప్లేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని.. వారికే తరచూ అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాలి. ఈ జట్టుతో ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఢిల్లీ ఈసారి టాప్-4లో ఉండటం ఖాయం’’ అని పేర్కొన్నాడు. కాగా ఆఖరి నిమిషంలో ఢిల్లీ తమ మాజీ ఆటగాడు పృథ్వీ షాను రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయడం విశేషం.వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు- ధరఆఖిబ్ నబీ (రూ.8.40 కోట్లు), పాతుమ్ నిసాంక (రూ.4 కోట్లు), కైలీ జేమీసన్ (రూ.2 కోట్లు), లుంగీ ఎన్గిడి (రూ.2 కోట్లు), బెన్ డకెట్ (రూ. 2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్ పరాఖ్ (రూ.30 లక్షలు)వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
మరోసారి ఐపీఎల్లో.. సర్ఫరాజ్ స్పందన ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్ ఆడిన ఈ ముంబైకర్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ క్యాష్ రిచ్లో పునరాగమనం చేయనున్నాడు.ఐదుసార్లు చాంపియన్ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్.. సర్ఫరాజ్ ఖాన్‌ను కొనుక్కుంది. అబుదాబి వేదికగా మంగళవారం నాటి మినీ వేలంలో కనీస ధర రూ. 75 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.సర్ఫరాజ్ స్పందన ఇదేసోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకుంటూ.. ‘‘కొత్త జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎస్కే’’ అంటూ సర్ఫరాజ్ ఖాన్ చెన్నై యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో నాని ‘జెర్సీ’ సినిమాలోని ఎమోషనల్ సీన్‌కు సంబంధించిన దృశ్యాలను జతచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో తిరిగి అమ్ముడుపోవడంపై స్పందించిన తీరు వైరల్‌గా మారింది.కాగా దేశవాళీ క్రికెట్లో రన్ మెషీన్‌గా గుర్తింపు పొందినా కూడా భారత టెస్టు జట్టుకు కూడా దూరమయ్యాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు భాగమయ్యాడు. ఇక ఇప్పటికి.. సర్ఫరాజ్ 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 203.08 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ వేలంలో ముందుగా రూ.75 లక్షల కనీస ధరకు అతడిని ఎవరూ తీసుకోలేదు. మళ్లీ అతడి పేరు వచ్చినప్పుడు ఇదే మొత్తానికి చెన్నై ఎంచుకుంది. కాగా సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటి వరకు ఐపీఎల్లో యాభై మ్యాచ్‌లు ఆడి.. 585 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. మరోవైపు.. సర్ఫరాజ్ మిత్రుడు పృథ్వీ షాను కూడా ఢిల్లీ తీసుకోవడం విశేషం. అతడిని ఢిల్లీ కనీస ధర రూ. 75 లక్షలకే కొనుక్కుంది.అమ్ముడుపోని స్టార్లు వీరేఐపీఎల్లో గతంలో ఆడిన లేదా అంతర్జాతీయ క్రికెట్లో గుర్తింపు ఉన్న పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఈ జాబితాలో ఉన్న ప్రముఖ విదేశీ క్రికెటర్లలో డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, గెరాల్డ్ కొయెట్జీ, ముజీబుర్ రహమాన్, మహీశ్ తీక్షణ, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, షాయీ హోప్... టామ్ కరన్, అల్జారీ జోసెఫ్, నవీన్ ఉల్ హక్, రహ్మనుల్లా గుర్బాజ్, వియాన్ ముల్డర్, జానీ బెయిర్‌స్టో, ఫజల్హఖ్ తదితరులు ఉన్నారు. భారత క్రికెటర్లలో ఉమేశ్ యాదవ్, దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్, కరణ్ శర్మ, మనన్ వోహ్రాను ఎవరూ పట్టించుకోలేదు. Sarfaraz Khan’s emotional Instagram story after being sold for ₹75 lakh to Chennai Super Kings in the auction for IPL 2026.🥹❤️This shows that if you work hard, you will definitely get the reward for it. God never disappoints those who work hard. pic.twitter.com/X3Z81AmB0g— Mention Cricket (@MentionCricket) December 16, 2025 -
'డేల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా'.. ఢిల్లీ జట్టులోకి పేస్ సంచలనం
'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది' అని అంటుంటారు. ఈ మాట సరిగ్గా జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్కి సరిపోతుంది. ఒకప్పుడు ట్రయల్స్ కోసం తన స్నేహితుడి బూట్లు అడిగి తెచ్చుకున్న ఆకిబ్.. ఇప్పుడు నిమిషాల వ్యవధిలో కోటీశ్వరుడుగా మారిపోయాడు. ఎన్నో ఏళ్ల తన శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఐపీఎల్-2026 మినీ వేలంలో రూ. 8.40 కోట్లకు అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆకిబ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ జట్లు పోటీపడ్డాయి. చివరికి ఢిల్లీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి.. అతడిని బేస్ ప్రైస్ కంటే 28 రెట్లు ఎక్కువ ధర వెచ్చించి టీమ్‌లోకి తీసుకుంది. ఉమ్రాన్ మాలిక్, యుద్వీర్ సింగ్ చారక్ తర్వాత ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన మూడవ కాశ్మీర్ పేసర్‌గా నబీ నిలిచాడు. ఈ క్రమంలో ఎవరీ ఆకిబ్ నబీ ధార్ అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.ఎవరీ ఆకిబ్ నబీ..?29 ఏళ్ల ఆకిబ్ నబీ.. బారముల్లా జిల్లాలోని క్రేరీ గ్రామంలో జన్మించాడు. అతడి తండ్రి ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. దీంతో నబీని డాక్టర్ చేయాలని తన తండ్రి కలలు కన్నాడు. ఆకిబ్ మాత్రం తన తన తండ్రి ఆశయానికి భిన్నంగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. సరైన క్రీడా మైదానాలు, శిక్షణ సౌకర్యాలు లేని ప్రాంతం నుండి వచ్చిన నబీ.. తన కఠోర సాధన, పట్టుదలతోనే ఈ స్ధాయికి చేరుకున్నాడు.జమ్మూ కాశ్మీర్లో చలికాలంలో క్రికెట్ ఆడటం చాలా కష్టం. అయినప్పటికి సిమెంట్ వికెట్లపై ప్రాక్టీస్ చేస్తూనే తన బౌలింగ్‌ను మెరుగు పరుచుకున్నాడు. నబీకి అద్భుతమైన పేస్‌తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా ఆకిబ్‌కు ఉంది. ఆకిబ్ బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డెయిల్ స్టెయిన్‌ను పోలి ఉంటుంది. అందుకే అతన్ని 'బారాముల్లా డెయిల్ స్టెయిన్' అని పిలుస్తుంటారు.రంజీల్లో అదుర్స్..నబీ 2020-21 రంజీ సీజన్లో జమ్ము కాశ్మీర్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సీజన్లో నబీ పెద్దగా రాణించికపోయినప్పటికి.. గత రెండేళ్లగా మాత్రం దేశవాళీ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నాడు. 2024 రంజీ సీజన్లో 13.93 సగటుతో 44 వికెట్లు పడగొట్టాడు. రంజీ సీజన్ 2025-26లో ఆకిబ్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. లీడింగ్ వికెట్ టేకర్‌గా దార్ కొనసాగుతున్నాడు.నబీకి బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. నబీ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లతో పాటు 870 పరుగులు చేశాడు. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా నబీ రికార్డులెక్కాడు.దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో ఆకిబ్ సత్తాచాటుతున్నాడు. 7 మ్యాచ్‌లలో 15 వికెట్లు పడగొట్టాడు. బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు నాలుగు వికెట్లు సాధించాడు. ఇప్పుడు ఐపీఎల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. మిచెల్ స్టార్క్, నోర్జే వంటి స్పీడ్ స్టార్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను ఆకిబ్ షేర్ చేసుకోనున్నాడు. -
ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో టీమిండియా ఆటగాడు, మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా తిరిగి తన సొంత గూటికి చేరాడు. ఐపీఎల్-2026 మినీ వేలంలో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ ఓపెనర్ బ్యాటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కనీస ధర రూ.75 లక్షలకే సొంతం చేసుకుంది. వేలం తొలి సెట్లో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత సెకెండ్ యాక్సిలరేటెడ్ రౌండ్లో కూడా పృథ్వీ షాను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రెండు రౌండ్లలో తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో పృథ్వీ షా నిరాశచెందాడు. వెంటనే పృథ్వీ షా..తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేస్తూ ఇట్స్ ఒకే అని రాసుకొచ్చాడు. కానీ ఆఖరిలో ఢిల్లీ క్యాపిటల్స్ కనికరించింది. చివరి రౌండ్లో అతడిని ఢిల్లీ కొనుగోలు చేసింది. యాక్సిలరేటెడ్ ప్రాసెస్‌లో ఎంపికైన 11 మంది ఆటగాళ్లలో షా కూడా ఉన్నాడు. దీంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. ముందు పెట్టిన పోస్ట్‌ను డిలీట్ చేసి.. కొత్తగా మరో పోస్ట్ పెట్టాడు. బ్యాక్ టూ మై ఫ్యామిలీ అంటూ అతడు రాసుకొచ్చాడు.కాగా 2018లో కెప్టెన్‌గా భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌ను అందించిన పృథ్వీ షాను.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతడు ఢిల్లీ జట్టులో కీలక సభ్యునిగా మారాడు. పృథ్వీ డీసీకి ఏడు సీజన్ల పాటు ఆడాడు. ఐపీఎల్-2021 వరకు కేవలం రూ. 1.20 అందుకున్న పృథ్వీ షా జీతం ఒక్కసారిగా 525 శాతం పెరిగింది. ఐపీఎల్-2022 సీజన్లో అతడిని రూ.7.50 కోట్లకు ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అనంతరం ఐపీఎల్-2023, 2024 సీజన్లలో ఈ మహరాష్ట్ర ఆటగాడు రూ.8 కోట్లు అందుకున్నాడు. కానీ పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యల వల్ల అతడిని ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ వేలంలోకి విడిచిపెట్టింది. వేలంలోకి వచ్చిన పృథ్వీ షాను ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఏడాది తర్వాత ఢిల్లీ మరోసారి అతడికి అవకాశమిచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర తరపున ఆడుతున్న షా.. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఆ ఫామ్‌ను ఐపీఎల్లో కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి.చదవండి: ఐపీఎల్‌కు కరీంనగర్ కుర్రాడు -
డబ్ల్యూపీఎల్‌లో మరో రెండు జట్లు!.. బీసీసీఐ ప్లాన్ ఏంటి?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2023లో మొదలైన మహిళా ప్రీమియర్ లీగ్ విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అరంగేట్ర సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవగా.. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీని ముద్దాడింది.ఇక ఈ ఏడాది మరోసారి ముంబై చాంపియన్‌గా అవతరించగా.. 2026లోనైనా టైటిల్ గెలవాలని యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుదలగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే వేలానికి ముందు తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. వద్దనుకున్న క్రికెటర్లను వదిలించుకున్నాయి.బీసీసీఐ సుముఖంగా ఉందిఈ నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మెగా వేలంలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఐదు ఫ్రాంఛైజీలు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక వేలం సందర్భంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ (Parth Jindal) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత మహిళా క్రికెట్ రాత మారనుందని.. డబ్ల్యూపీఎల్‌ను విస్తరించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఆదరణకు ఇదే నిదర్శనంఈ మేరకు.. ‘‘1983లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత పురుషుల క్రికెట్ పరిస్థితి ఎంతలా మెరుగుపడిందో మనం చూశాం. వన్డే వరల్డ్‌కప్-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు రాత కూడా మారనుంది. 446 మిలియన్ల మంది భారతీయులు మనోళ్లు ఆడిన ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు.పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్ కంటే కూడా ఈ మ్యాచ్‌కే అత్యధిక వీక్షణలు వచ్చాయి. నిజానికి ఇంతకు ముందు మహిళా వేలం గురించి ఎవరూ మాట్లాడేవారే కాదు. అయితే, ‘నవంబరు 27న వేలంలో మీరు ఏం చేయబోతున్నారు?మెగ్ లానింగ్‌ను తీసుకుంటారా? మీరెందుకు ఆమెను వదిలిపెట్టారు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. మూడేళ్లుగా లీగ్ జరుగుతున్నా ఎవరూ మరీ ఇంతగా ఆసక్తి చూపించలేదు. వరల్డ్‌కప్ తర్వాత మన మహిళల లీగ్‌కు ఆదరణ పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.ఒకటి లేదంటే రెండు జట్లు..డబ్ల్యూపీఎల్ విస్తరించబోతోంది. బీసీసీఐ ఇందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ లీగ్‌లో మరొకటి.. లేదంటే మరో రెండు ఫ్రాంఛైజీలు చేరే అవకాశం ఉంది’’ అని పార్థ్ జిందాల్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి వచ్చే డబ్ల్యూపీఎల్ సీజన్లో మరో రెండు కొత్త జట్లను చూసే అవకాశం లేకపోలేదంటూ మహిళా క్రికెట్‌ను ఆదరించే అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో భారత క్రికెటర్లు దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి సత్తా చాటారు. వన్డే వరల్డ్‌కప్-2025లో వీరిద్దరు అదరగొట్టిన విషయం తెలిసిందే. దీప్తి ఈ మెగా టోర్నీలో 215 పరుగులు సాధించడంతో పాటు.. 22 వికెట్లు కూల్చింది.మరోవైపు.. లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి (Shree Charani) పద్నాలుగు వికెట్లతో దుమ్ములేపింది. ఈ క్రమంలో అంచనాలకు అనుగుణంగా దీప్తి శర్మ ఈసారి వేలంపాటలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలవగా.. శ్రీచరణి సైతం జాక్‌పాట్ అందుకుంది.మరి డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో వీరితో పాటు అత్యధిక ధర పలికిన ప్లేయర్లు ఎవరో చూసేద్దామా!దీప్తి శర్మ (భారత్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌అమెలియా కెర్ (న్యూజిలాండ్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్శిఖా పాండే (భారత్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 20 లక్షలు- రూ. 2.4 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్సోఫీ డివైన్ (న్యూజిలాండ్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 2 కోట్లకు కొనుక్కున్న గుజరాత్ జెయింట్స్‌మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్‌శ్రీచరణి (భారత్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.3 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌చినెలె హెన్రి (వెస్టిండీస్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.30 కోట్లకు కొనుక్కున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఫోబే లిచిఫీల్డ్ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌లారా వొల్వర్ట్ (సౌతాఫ్రికా)👉బ్యాటర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఆశా శోభన (భారత్)👉బౌలర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్‌లారెన్ బెల్ (ఇంగ్లండ్)👉బౌలర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 90 లక్షలకు కొనుక్కున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.చదవండి: WPL 2026 Auction Updates: ఎవరికి ఎంత ధర? -
అయ్యో పాపం!.. దీప్తి శర్మకే ఎందుకిలా?
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు భారీ ధర దక్కింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి వేలంపాటలో యూపీ వారియర్స్ ఆమెను ఏకంగా రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆదిలో దీప్తి కోసం ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.కాగా డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్ (2023) నుంచి దీప్తి శర్మ యూపీ వారియర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తోంది. అలిసా హేలీ గాయం వల్ల దూరం కావడంతో 2025లో యూపీ కెప్టెన్‌గానూ దీప్తి వ్యవహరించింది. అయితే, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆమె సారథ్యంలో యూపీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ఇదిలా ఉంటే.. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో దీప్తి శర్మదే ముఖ్య పాత్ర. ఈ ఆల్‌రౌండర్ మూడు అర్ధ శతకాల సాయంతో 215 పరుగులు చేయడంతో పాటు.. మొత్తంగా 22 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు కూల్చడం హైలైట్‌గా నిలిచింది.ఢిల్లీ క్యాపిటల్స్ తప్పఈ నేపథ్యంలో యూపీ దీప్తిని రిటైన్ చేసుకుంటుందని భావించగా.. అనూహ్యంగా ఆమెను వేలంలోకి వదిలింది. వేలంలో దీప్తి కోసం ఫ్రాంఛైజీలు ఎగబడతాయని భావించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప ఎవరూ కనీసం ఆమె వైపు చూడలేదు.ఈ క్రమంలో కనీస ధర రూ. 50 లక్షలకు దీప్తి వేలంలోకి రాగా ఢిల్లీ అదే ధరకు దీప్తిని కొనుగోలు చేయాలనుకుంది. ఇంతలో రంగంలోకి దిగిన యూపీ.. రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు ద్వారా అదే ధర చెల్లించి దీప్తిని సొంతం చేసుకోవాలని భావించింది. అయితే, ఢిల్లీ ఒక్కసారిగా దీప్తి ధరను రూ. 3.2 కోట్లకు పెంచింది.ఢిల్లీ వదిలేలా లేదని భావించిన యూపీ రూ. 3.2 కోట్ల వద్ద తమ RTM కార్డును ఉపయోగించి దీప్తిని తిరిగి సొంతం చేసుకుంది. ఫలితంగా డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా.. ఆష్లే గార్డ్నర్ (గుజరాత్- 2023- రూ. 3.2 కోట్లు) రికార్డు సమం చేసింది. కాగా ఆర్సీబీ 2023లో స్మృతి మంధానను రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేయగా.. ఆమె లీగ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కొనసాగుతోంది. చదవండి: WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర -
WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర
భారత క్రికెటర్, కడప ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి (Shree Charani)కి జాక్‌పాట్ తగిలింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఆమె కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో శ్రీచరణికి భారీ ధర దక్కింది.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో శ్రీచరణిది ముఖ్య భూమిక. ఈ మెగా ఈవెంట్లో శ్రీచరణి ఏకంగా పద్నాలుగు వికెట్లు పడగొట్టింది. తద్వారా భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నిలిచింది. రూ. 30 లక్షల కనీస ధరఈ నేపథ్యంలో ప్రపంచకప్ విజేత శ్రీచరణికి భారీ ధర దక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె అదరగొట్టింది. రూ. 30 లక్షల కనీస ధరతో శ్రీచరణి వేలంలోకి రాగా.. యూపీ వారియర్స్ తొలి బిడ్ వేసింది. ఆ వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగి.. ధరను ఏకంగా రూ. 75 లక్షలకు పెంచింది.దీంతో యూవీ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఆ వెంటనే మళ్లీ రూ. 90 లక్షలకు ధరను పెంచింది. ఈ క్రమంలో శ్రీచరణిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్ ధరను ఏకంగా రూ. 1.3 కోట్లకు పెంచగా.. యూపీ వెనక్కి తగ్గింది. ఫలితంగా శ్రీచరణి రూ. 1.3 కోట్లకు మళ్లీ సొంతగూటి (ఢిల్లీ)కి చేరుకుంది.ఎదురులేని చరణికాగా గతంలో శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడింది. 2024 సీజన్లో రూ. 55 లక్షలకు ఆమెను ఢిల్లీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దీంతో అత్యధిక ధర దక్కించుకున్న నాటి అన్క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో శ్రీచరణి చేరింది. అరంగేట్రంలోనే ఎలిస్ పెర్రీని అవుట్ చేసి ఆగమనాన్ని ఘనంగా చాటింది ఈ స్పిన్ బౌలర్.ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన శ్రీచరణి 2025 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. శ్రీలంకతో ముక్కోణపు వన్డే సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అదే ఏడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీ20లలోనూ అడుగుపెట్టింది. 4/12 గణాంకాలతో సత్తా చాటి తొలి అంతర్జాతీయ టీ20లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది.ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున 18 వన్డేలు, ఐదు టీ20లు ఆడిన 21 ఏళ్ల శ్రీచరణి.. వరల్డ్‌కప్‌లో ఏకంగా పదకొండు వికెట్లు కూల్చి సత్తా చాటింది. ప్రపంచకప్ విజేతగా డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చిన ఆమె కనీస ధర.. దాదాపుగా 333 శాతం పెరగడం విశేషం. -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ విధ్వంసకర శతకం
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో (WBBL 2025) మెల్బోర్న్ స్టార్స్ ఓపెనర్, మహిళల ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన మెగ్ లాన్నింగ్ (Meg Lanning) చెలరేగిపోయింది. సిడ్నీ సిక్సర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. 74 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. WBBL HUNDRED FOR THE GOAT, MEG LANNING....!!!! 🐐 pic.twitter.com/0mc50pUij9— Johns. (@CricCrazyJohns) November 20, 2025ఆమెకు తోడు మరో ఓపెనర్ మెక్కెన్నా (34 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.స్టార్స్ ఇన్నింగ్స్‌లో లాన్నింగ్, మెక్కెన్నా మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 12, మారిజన్ కాప్ 6 పరుగులు చేసి ఔట్ కాగా.. డానియెలా గిబ్సన్ 7, యామీ జోన్స్ 0 పరుగులతో అజేయంగా నిలిచారు. సిక్సర్స్ బౌలర్లలో లారెన్ చీటిల్, ఆష్లే గార్డ్నర్, మ్యాడీ విలియర్స్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో స్టార్స్ చేసిన 219 పరుగుల స్కోర్ మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో మూడో అత్యధికం. ఈ లీగ్‌లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సిడ్నీ సిక్సర్స్ (242) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానంలో బ్రిస్బేన్ హీట్ (229) ఉంది.ఈ మ్యాచ్‌లో లాన్నింగ్ చేసిన స్కోర్ (135) కూడా లీగ్ చరిత్రలో మూడో అత్యధికం. మొదటి రెండు స్థానాల్లో లిజెల్ లీ (150 నాటౌట్), గ్రేస్ హ్యారిస్ (136 నాటౌట్) ఉన్నారు. ఈ సెంచరీతో లాన్నింగ్ WBBLలో అత్యధి ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ప్లేయర్ల జాబితాలో ఎల్లిస్ పెర్రీని (34) వెనక్కు నెట్టి రెండో స్థానానికి (35) ఎగబాకింది. టాప్ ప్లేస్‌లో బెత్ మూనీ (48) ఉంది. ఈ సెంచరీ లాన్నింగ్‌కు మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో రెండవది. చదవండి: నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్ -
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్‌కు బెదిరింపులు
ఐపీఎల్లో (IPL) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున మెరిసిన యువ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్ (Vipraj Nigam) బెదిరింపులకు గురయ్యాడు. నవంబర్ 9న అతడికి ఓ అంతర్జాతీయ ఫోన్ నంబర్ నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓ మహిళ అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ, ఓ వీడియోను లీక్ చేస్తానని బెదిరించింది.తొలుత విప్రాజ్ దీన్ని ఫేక్ కాల్‌గా భావించి, నంబర్‌ను బ్లాక్ చేశాడు. అయినా సదరు మహిళ వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి విప్రాజ్‌ను పదేపదే ఇబ్బంది పెట్టింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన విప్రాజ్ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పరువుకు భంగం కలిగించడం, మానసికంగా వేధించడం ద్వారా తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేయాలనే కుట్ర జరుగుతోందని అతను ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు కాల్ వివరాలు, ఫోన్ నంబర్ల మూలాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై విప్రాజ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న తమ కుమారుడిని బద్నాం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.21 ఏళ్ల విప్రాజ్ గత సీజన్లోనే (2025) ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన విప్రాజ్ అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టాడు. 14 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి, 142 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి పలు మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు.గతేడాదే విప్రాజ్ ఉత్తరప్రదేశ్ తరఫున దేశవాలీ అరంగేట్రం చేశాడు. 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 5 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 15 టీ20లు ఆడి మొత్తంగా 32 వికెట్లు తీశాడు. చదవండి: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌కు తీవ్ర అస్వస్థత -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంజూ శాంసన్..!
ఐపీఎల్ 2026 వేలానికి ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీని వీడనున్నాడా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. రాజస్తాన్ నుంచి శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్ నుంచి రాయల్స్, సంజు శాంసన్ మధ్య విభేదాలు తలెత్తాయి.దీంతో సంజూను రాజస్తాన్ మెనెజ్‌మెంట్ విడిచిపెట్టేందుకు ఆసక్తిగా ఉందంట. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న శాంసన్ సైతం రాజస్తాన్ నుంచి బయటకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. వచ్చే సీజన్లో శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నట్లు సమాచారం.రాజస్తాన్‌లోకి స్టబ్స్..రాజస్తాన్ ఫ్రాంచైజీ శాంసన్‌కు బదులుగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఇవ్వాలని ఢిల్లీని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు ఢిల్లీ యాజమాన్యం ఒప్పుకోలేదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కానీ రాహుల్‌కు బదులుగా దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిన ట్రిస్టన్ స్టబ్స్‌ను ఇచ్చేందుకు తాము సిద్దమని ఢిల్లీ తెలిపినట్లు తెలుస్తోంది. అందుకు రాజస్తాన్ అంగీకరించినట్లు వినికిడి. స్టబ్స్‌తో పాటు ఓ అన్క్యాప్డ్ భారత ఆటగాడిని పంపమని ఆర్ఆర్ కోరిందంట.ఎందుంకంటే సంజు శాంసన్ ధర రూ.18 కోట్లు కాగా, స్టబ్స్ విలువ రూ.10 కోట్లు. ఎనిమిది కోట్లు వ్యత్యాసం రావడంతో ఓ అన్క్యాప్డ్ ఆటగాడిని తీసుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఆర్ఆర్కు మంచి ఫినిషర్ లేని లోటును స్టబ్స్ తీర్చగలడు. ఒకవేళ అన్క్యాప్డ్ ఆటగాడిని ఢిల్లీ ట్రేడ్ చేయకపోతే, మిగిలిన మొత్తాన్ని (సుమారు రూ.8 కోట్లు) రాజస్తాన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఐపీఎల్-2026 వేలంలో రాజస్తాన్ పర్స్ విలువ పెరుగుతుంది. కాగా సంజూ శాంసన్ తన ఐపీఎల్ అరంగేట్రం ఢిల్లీ క్యాపిటల్స్(అప్పటిలో ఢిల్లీ డేర్‌డేవిల్స్) తరపునే చేశాడు. -
అక్షర్ పటేల్‌పై వేటు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్!?
ఐపీఎల్-2026కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ అక్షర్ పటేల్‌పై వేటు వేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు సమాచారం. న్యూస్ 24 నివేదిక ప్రకారం.. అక్షర్ స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని క్యాపిటల్స్ యాజమాన్యం భావిస్తుందంట.వచ్చే ఏడాది సీజన్లో అక్షర్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడని సదరు రిపోర్ట్ పేర్కొంది. అయితే ఇప్పటివరకు ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్-2026కు ముందు ఆయా ఫ్రాంచైజీలకు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి.అందులో ఇది ఒకటి. కాగా రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లడంతో ఐపీఎల్-2025లో ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. అందరూ కేఎల్ రాహుల్ డీసీ కెప్టెన్ అవుతాడని భావించినప్పటికి అనూహ్యంగా అక్షర్‌కు తమ జట్టు పగ్గాలను ఢిల్లీ అప్పగించింది.అయితే రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు మొగ్గు చూపకపోవడంతోనే అక్షర్‌ను సారథిగా నియమించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం కెప్టెన్‌గా జట్టును నడిపించేందుకు రాహుల్ ఆసక్తిగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించలేకపోయింది. 14 మ్యాచ్‌లలో ఐదింట విజయంతో 5వ స్దానంతో ఢిల్లీ సరిపెట్టుకుంది. రాహుల్ కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉంది. మూడు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరించాడు -
చెలరేగిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ చిచ్చరపిడుగు
ఉత్తర్‌ప్రదేశ్ టీ20 లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు సమీర్ రిజ్వి (21) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో కాన్పూర్ సూపర్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు.. వరుస విధ్వంసాలతో హోరెత్తిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 93 పరుగులు చేసిన రిజ్వి.. ఇవాళ మీరట్ మెవెరిక్స్పై అజేయమైన మెరుపు అర్ద శతకంతో (48 బంతుల్లో 78) మెరిశాడు.ఈ మ్యాచ్‌లో రిజ్వి మెరుపు ఇన్నింగ్స్‌కు లక్ కూడా తోడవ్వడంతో కాన్పూర్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాన్పూర్.. మీరట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాన్పూర్ ఇన్నింగ్స్‌లో రిజ్వి ఒక్కడే రాణించాడు.సహచరులు ఒక్కో పరుగు సాధించేందుకు ఇబ్బంది పడుతుండగా.. రిజ్వి భారీ షాట్లతో చెలరేగాడు. 7 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జట్టు స్కోర్‌లో రిజ్వి ఒక్కడే సగానికి పైగా చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన మీరట్‌ను వరుణుడి రూపంలో దురదృష్టం వెంటాడింది. ఆ జట్టు స్కోర్ 41/2 వద్ద (8 ఓవర్ల తర్వాత) ఉండగా భారీ వర్షం మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోగా డక్ వర్త్ లూయిస్ పద్దతిన కాన్పూర్ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి మీరట్ గెలుపుకు 14 పరుగుల దూరంలో (డక్ వర్త్ లూయిస్ పద్దతిలో) ఉండింది. ఆర్సీబీ యువ ఆటగాడు స్వస్తిక్ చికారా (29), మాధవ్ కౌశిక్ (4) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, సమీర్ రిజ్వి గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతడు పెద్దగా రాణించకపోయినా, చివరి మ్యాచ్‌లో ఒత్తిడిలో అజేయమైన అర్ద సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. యూపీ లీగ్‌లో తాజా ప్రదర్శనలతో రిజ్వి మరోసారి డీసీ మేనేజ్మెంట్ దృష్టిలో పడి ఉంటాడు. ఈ ప్రదర్శనలు అతడికి మరిన్ని ఐపీఎల్ అవకాశాలు తెచ్చిపెట్టవచ్చు. -
ఉత్కంఠ పోరులో వికెట్ తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ
పురుషుల హండ్రెడ్ కాంపిటీషన్ 2025లో నిన్న ఓ ఉత్కంఠ పోరు జరిగింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సథరన్ బ్రేవ్ వికెట్ తేడాతో గెలుపొందింది. 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన తరుణంలో రీస్ టాప్లే బౌండరీ బాది బ్రేవ్‌ను గెలిపించాడు. అప్పటికే బ్రేవ్ 9 వికెట్లు కోల్పోయి ఉండింది. ఏమాత్రం అటు ఇటైనా బ్రేవ్ మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చేది. టాప్లే సాహసోపేతంగా భారీ షాట్ ఆడి బౌండరీ బాదడంతో మ్యాచ్ బ్రేవ్ వశమైంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ (కెప్టెన్) ఫిల్ సాల్ట్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 18 బంతుల్లో 22, క్లాసెన్ 16 బంతుల్లో 15, చాప్మన్ 12 బంతుల్లో అజేయమైన 22 పరుగులు చేశారు. బ్రేవ్ బౌలర్లలో తైమాల్ మిల్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. క్రెయిగ్ ఓవర్టన్కు ఓ వికెట్ దక్కింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో బ్రేవ్ ఆది నుంచి తడబడుతూ వచ్చింది. జట్టులో ఏ ఒక్క ఆటగాడూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అయితే ఆఖర్లో ఓవర్టన్ (8 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) అనూహ్యంగా బ్యాట్ ఝులిపించి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. చివరి ఓవర్లో (5 బంతులు) బ్రేవ్ మరోసారి తడబడింది. గ్రెగరీ తొలి రెండు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చి మూడో బంతికి వికెట్ తీశాడు. తద్వారా బ్రేవ్ 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ తరుణంలో రీస్ టాప్లే బౌండరీ బాది బ్రేవ్‌ను గెలిపించాడు.కాగా, ఈ మ్యాచ్‌లో గెలుపొందిన సథరన్ బ్రేవ్‌ను ఈ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్ ఫ్రాంచైజీ) యాజమాన్యమైన జీఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. ఇందులో 49 శాతం వాటాను డీసీ మేనేజ్మెంట్ సొంతం చేసుకుంది. మిగతా 51 శాతం వాటాను హ్యాంప్‌షైర్ కౌంటీ క్లబ్ రీటైన్ చేసుకుంది. ఈ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా జేమ్స్ విన్స్ వ్యవహరిస్తున్నాడు. -
హండ్రెడ్ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇవే..!
ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రైవేట్ క్రికెట్ లీగ్ ప్రారంభమైన ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు అక్కడ వాలిపోతారు. ప్రస్తుతం వరల్డ్‌లో సూపర్ హిట్ అయిన ప్రతి లీగ్‌లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు పాతుకుపోయారు. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్, యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికాలో జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్, అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్.. ఇలా మెజార్టీ శాతం క్రికెట్ లీగ్‌ల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్ల హవా నడుస్తుంది.తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్ లీగ్‌లోనూ కాలు మోపారు. ఈ లీగ్‌లో వారు ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 5) హండ్రెడ్ లీగ్ ఐదో ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఏ ఫ్రాంచైజీలను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు కొనుగోలు చేశారో ఓ లుక్కేద్దాం.ఓవల్ ఇన్విన్సిబుల్స్: ఈ ఫ్రాంచైజీని ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇన్విన్సిబుల్స్లోని 49 శాతం వాటాను ముకేశ్ అంబానీ సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. మిగతా 51 శాతం వాటాను సర్రే కౌంటీ క్లబ్ తమ వద్దనే ఉంచుకుంది. ఈ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇన్విన్సిబుల్స్‌కు సామ్ కర్రన్ నాయకత్వం వహించనున్నాడు.సథరన్ బ్రేవ్: ఈ ఫ్రాంచైజీని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యమైన జీఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. ఇందులో 49 శాతం వాటాను డీసీ మేనేజ్మెంట్ సొంతం చేసుకుంది. మిగతా 51 శాతం వాటాను హ్యాంప్‌షైర్ కౌంటీ క్లబ్ రీటైన్ చేసుకుంది. ఈ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా జేమ్స్ విన్స్ వ్యవహరిస్తాడు.నార్త్రన్ సూపర్ ఛార్జర్స్: ఈ ఫ్రాంచైజీని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అయిన సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వాటాను కావ్యా మారన్ సంస్థ రూ. 1,094 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ జట్టుకు ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో డేవిడ్ మిల్లర్, డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.మాంచెస్టర్ ఒరిజినల్స్: ఈ ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా కొనుగోలు చేశాడు. అతని నేతృత్వంలోని ఆర్పీఎస్జీ గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్లోని 70 శాతం వాటాను దక్కించుకుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ వ్యవహరిస్తాడు. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన భారత యువ కెరటం
ఇటీవలికాలంలో భారత అండర్-19 క్రికెట్ హీరోలు చెలరేగిపోతున్నారు. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే లాంటి వారు ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగగా.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో భారత అండర్-19 జట్టు మాజీ సారధి యశ్ ధుల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. డీపీఎల్ 2025 రెండో మ్యాచ్‌లో ధుల్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు ఆడుతూ నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్పై 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు. ఫలితంగా సెంట్రల్ ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ప్రస్తుత డీపీఎల్ సీజన్లో ధుల్ సెంచరీనే మొదటిది. గత సీజన్ మొత్తంలో 93 పరుగులే చేసిన ధుల్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. రెడ్ బాల్ బ్యాటర్‌గా ముద్రపడిన ధుల్ ఈ ఇన్నింగ్స్‌తో ఆ ముద్రను చెరిపేసి ఆల్ ఫార్మాట్ బ్యాటర్ అనిపించుకున్నాడు. అండర్-19 క్రికెట్ ప్రదర్శనల ఆధారంగా 2023 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన ధుల్.. ఆ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 16 పరుగులే చేశాడు. ఆ సీజన్లో పేలవ ప్రదర్శన తర్వాత ధుల్‌ను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. తాజాగా ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ధుల్‌ను మరోసారి దక్కించుకనే ప్రయత్నం చేయవచ్చు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర ఢిల్లీ.. సర్తక్ రంజన్ (82), అర్నవ్ బుగ్గా (67) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో గవిన్ష్ ఖురానా, మనీ గ్రేవాల్ తలో 2 వికెట్లు తీయగా.. సిమర్జీత్ సింగ్, తేజస్ బరోకా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సెంట్రల్ ఢిల్లీ.. ఓపెనర్ యశ్ ధుల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 17.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (2 వికెట్లు కోల్పోయి). సెంట్రల్ ఢిల్లీని విజయతీరాలకు చేర్చడంలో ధుల్‌కు యుగల్ సైనీ (36), జాంటి సిద్దూ (23 నాటౌట్) సహకరించారు. ఉత్తర ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. -
గైక్వాడ్‌పై వేటు.. సీఎస్కే కెప్టెన్‌గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను?
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ టి నటరాజన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడా? అంటే అవునానే అంటున్నారు క్రికెట్ నిపుణులు. వచ్చే ఏడాది సీజన్ ముందు నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సీఎస్కే ట్రేడ్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ తమిళనాడు ఫాస్ట్ బౌలర్ సీఎస్కే క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతుండడం ట్రేడ్ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సీఎస్కే ట్రైనింగ్ జెర్సీని నటరాజన్ ధరించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్-2025 వేలంలో నటరాజన్‌ను రూ. 10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది.దీంతో అతడికి కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. మిచెల్ స్టార్క్, చమీరా, ముఖేష్ కుమార్ వంటి స్టార్ పేసర్లు ఉండడంతో అతడు ఎక్కువ భాగం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ఢిల్లీ కూడా వదులుకోవడానికి సిద్దంగా ఉంది.2017లో అరంగేట్రం..ఈ తమిళనాడు పేసర్ 2017లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా 2018, 2019 సీజన్లకు నట్టు దూరమయ్యాడు. తిరిగి మళ్లీ ఐపీఎల్-2020 ఎస్ఆర్హెచ్తో జతకట్టాడు. ఆరెంజ్ ఆర్మీతో ఐదేళ్ల పాటు తన ప్రయణాన్ని కొనసాగించాడు.అయితే గత సీజన్ మెగా వేలానికి ముందు అతడిని సన్‌రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో అతడు ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు 63 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 67 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నటరాజన్ గత నాలుగేళ్లగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టీమిండియా తరపున 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయాల కారణంగా అతడు భారత జట్టులో చోటు కోల్పోవల్సి వచ్చింది.కేఎల్ రాహుల్‌పై కన్ను..?అదేవిధంగా మరో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై కూడా సీఎస్కే కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాహుల్‌ను సీఎస్కే ట్రేడ్ చేసుకోవాలని భావిస్తుందంట. రుతురాజ్‌పై వేటు వేసి రాహుల్‌కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని సీఎస్కే యాజమాన్యం యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాహుల్ రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 539 పరుగులతో ఢిల్లీ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్ -
IPL 2026: రహానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్!
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుందన్నది ఆ వార్త సారాంశం. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ కర్ణాటక ఆటగాడిని రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 539 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.కేకేఆర్ అట్టర్ ప్లాప్..అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో నైట్‌రైడర్స్ నిలిచింది.ఈ క్రమంలోనే రాహుల్‌ను ఎలాగైనా ట్రేడ్ చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని కేకేఆర్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేకేఆర్ ప్రస్తుత జట్టులో భారత వికెట్ కీపర్ ఒక్కరు కూడా లేరు. జట్టులోని ఇద్దరు కీపర్లు(క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్భాజ్) విదేశాలకు చెందినవారే.అయినా వీరిద్దరూ తమ స్ధాయికి తగ్గప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. అందుకే రాహుల్‌ను తీసుకుంటే కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా ఉపయోగపడతాడని కేకేఆర్ యోచిస్తోంది. కానీ రాహుల్ వంటి అద్బుతమైన ఆటగాడిని ట్రేడ్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పుకొంటుందో లేది వేచి చూడాలి. మరోవైపు చంద్రకాంత్ పండిత్ కేకేఆర్ హెడ్‌కోచ్‌కు రాజీనామా చేశాడు. అతడి స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను ప్రధాన కోచ్‌గా నియమించేందుకు కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఐపీఎల్-2026 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరిగే అవకాశముంది.చదవండి: టీమిండియా అద్భుత పోరాటం.. కానీ ఓ చెత్త రికార్డు.. ప్రపంచంలోని తొలి జట్టుగా.. -
ఐపీఎల్లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! అక్కడ 11 సిక్స్‌లతో విధ్వంసం
మేజర్ లీగ్ క్రికెట్-2025 సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కాలిఫోర్నియా వేదికగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో గెలుపొందింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది.శాన్ ఫ్రాన్సిస్కో స్టార్ పేసర్లు బార్ట్లెట్, హ్యారీస్ రౌఫ్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ను దెబ్బ తీశారు. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో ఉన్ముక్త్ చంద్(53), మాథ్యూ ట్రంప్(41) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.మెక్‌గుర్క్ తుపాన్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యునికార్న్స్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన మెక్‌గర్క్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. మెక్‌గర్క్ కేవలం 38 బంతుల్లోనే 2 ఫోర్లు,11 సిక్స్‌లతో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(52)హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక లాస్ ఏంజిల్స్ బౌలర్లలో వాన్ షాల్క్విక్ మూడు వికెట్లు పడగొట్టగా.. అలీఖాన్ రెండు, రస్సెల్, నరైన్ తలా వికెట్ సాధించారు.ఐపీఎల్లో ఫెయిల్..కాగా జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ఐపీఎల్-2025 సీజన్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 6 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గర్క్.. 9.17 సగటుతో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌లకు అతడిని జట్టు నుంచి తప్పించారు.Jake Fraser-McGurk's 88 runs earned him the title of Stake Player of the Match today in Oakland. 🔥@stakenewsindia x @StakeIND pic.twitter.com/jP44Of6wrH— Cognizant Major League Cricket (@MLCricket) June 15, 2025 -
పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. కేవలం 23 బంతుల్లోనే..!
ముంబై టీ20 లీగ్‌లో నార్త్ ముంబై పాంథర్స్ ఆటగాడు పృథ్వీ షా ఇరగదీశాడు. లీగ్‌లో భాగంగా ట్రయంప్ నైట్స్‌తో నిన్న (జూన్ 8) జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో షా కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. షా సునామీ హాఫ్ సెంచరీతో పాటు హర్షల్ జాదవ్ (30 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), గౌరవ్ జాథర్ (10 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, సిక్స్), రాహుల్ సావంత్ (9 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. నైట్స్ బౌలర్లలో శ్రేయస్ గౌరవ్ 2, మినాద్ మంజ్రేకర్, పరిక్షిత్, సుర్యాంశ్ షేడ్గే తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్స్.. ప్రతిక్ మిశ్రా (3.5-0-30-4) రెచ్చిపోవడంతో 19.5 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటై 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. పాంథర్స్ బౌలర్లలో రాహుల్ సావంత్ 2, ముజమ్మిల్ ఖాద్రి, గౌరవ్ జాథర్ తలో వికెట్ తీశారు. నైట్స్ ఇన్నింగ్స్‌లో సిద్దాంత్ ఆధత్రావ్ (76) ఒంటరిపోరాటం చేసి 45 బంతుల్లో 76 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29), పరిక్షిత్ (20), శిఖర్ ఠాకూర్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా పాంథర్స్, నైట్స్ ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించాయి.ఇదిలా ఉంటే, పృథ్వీ షా ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025లో ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించలేదు. ఈ సీజన్ మెగా వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత కొంతకాలంగా షా ఓవర్ వెయిట్ కారణంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటూ తన దేశవాలీ జట్టు ముంబైలో కూడా స్థానం కోల్పోయాడు. తాజా ప్రదర్శన తర్వాత షా తిరిగి ముంబై జట్టులో చోటు ఆశిస్తున్నాడు. 2024-25 సీజన్లో షా రెండు సార్లు ముంబై జట్టులో స్థానం కోల్పోయాడు. రంజీ జట్టుతో పాటు విజయ్ హజారే టీమ్ నుంచి డ్రాప్ అయ్యాడు. 2018లో టీమిండియా తరఫున ఘనంగా (తొలి టెస్ట్‌లోనే సెంచరీ) అరంగేట్రం చేసిన షా.. అతి కొద్ది కాలంలోనే ఫిట్నెస్ సమస్యలు, వ్యక్తిగత ప్రవర్తన కారణంగా కనుమరుగయ్యాడు. షా చివరిగా 2021లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. -
నిశ్చితార్థం చేసుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఇవాళ (జూన్ 4) నిశ్చితార్థం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్-వన్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తుంది. కుల్దీప్-వన్షిక ఎంగేజ్మెంట్కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ హాజరయ్యారు. వివాహా తేదీని కుల్దీప్ త్వరలో ప్రకటించనున్నాడు.Kuldeep Yadav gets engaged to his childhood friend Vanshika. (Abhishek Tripathi).- Many congratulations to them. ❤️ pic.twitter.com/fdTncdtYa4— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025కుల్దీప్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో ఢిల్లీ ఆరంభంలో అద్బుత విజయాలు సాధించినా, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 30 ఏళ్ల కుల్దీప్ ఈ ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడి 7.07 సగటున 15 వికెట్లు తీశాడు. కుల్దీప్ తర్వలో ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ ఒక్కడే. అశ్విన్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక కుల్దీప్ భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో రాణిస్తే అతనికి తిరుగే ఉండదు. కుల్దీప్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇదివరకే తనను తాను నిరూపించుకున్నాడు. టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కుల్దీప్ కీలకంగా వ్యవహరించాడు. -
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి ఎట్టకేలకు భారత జట్టులో చోటు సంపాదించిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ పర్యటనలో తన తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్, భారత్-ఏ మధ్య ఇవాళ (మే 30) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్ అర్ద సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కరుణ్ 85 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు. జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. 44 ఓవర్ల అనంతరం భారత జట్టు స్కోర్ 158/2గా ఉంది. కరుణ్ 66, సర్ఫరాజ్ 48 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు.కాగా, కరుణ్ నాయర్‌కు ఇంగ్లండ్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ కౌంటీలు ఆడిన కరుణ్.. 21 ఇన్నింగ్స్‌ల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 1025 పరుగులు చేశాడు.2024 అక్టోబర్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కరుణ్ స్కోర్లు.. 66* (ప్రస్తుత మ్యాచ్), 135, 86, 6, 45, 29, 122, 105, 3, 4, 39, 123, 85ఇదిలా ఉంటే, 33 ఏళ్ల కరుణ్ నాయర్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఈ లీగ్‌లో తన తొలి మ్యాచ్‌లోనే కరుణ్ ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. ఈ మ్యాచ్ మినహా కరుణ్ ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినా దేశవాలీ క్రికెట్లో ట్రాక్ రికార్డు కారణంగా కరుణ్‌కు ఇంగ్లండ్ టూర్‌కు పిలుపు అందింది. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లకు, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌లకు కరుణ్ ఎంపికయ్యాడు.గతేడాది కాలంగా భారత క్రికెట్ సర్కిల్స్‌లో కరుణ్ పేరు మార్మోగిపోతుంది. ఈ మధ్యకాలంలో అతను ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు.ఈ ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి నమ్మశక్యంకాని సగటుతో (389.50) 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి.ఈ ఏడాది రంజీ ట్రోఫీలోనూ కరుణ్ అదే జోష్‌ను కొనసాగించాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఇవే కాక కరుణ్ గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాడు. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్ దేశవాలీ సీజన్లో కరుణ్ 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
విజయంతో ముగించిన ఢిల్లీ
జైపూర్: ఈ ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చెరిన జట్లను ఇంటికెళ్లే జట్లు గట్టి దెబ్బే కొడుతున్నాయి. తాజాగా పట్టికలో ‘టాప్’పై గురిపెట్టిన పంజాబ్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లతో గెలిచి షాకిచ్చింది. తద్వారా ఢిల్లీ ఘన విజయంతో ఈ సీజన్‌ను ముగించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ఆరంభంలో ఇన్‌గ్లిస్ (12 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆఖర్లో స్టొయినిస్ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసి గెలిచింది. కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెరిపిస్తే... సమీర్ రిజ్వీ (25 బంతుల్లో 58 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) గెలిచేదాకా నిలిచాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ఆర్య (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 6; ప్రభ్‌సిమ్రన్ (బి) విప్రాజ్ 28; ఇన్‌గ్లిస్ (స్టంప్డ్) స్టబ్స్ (బి) విప్రాజ్ 32; శ్రేయస్ (సి) మోహిత్ (బి) కుల్దీప్ 53; నేహల్ (సి) డుప్లెసిస్ (బి) ముకేశ్ 16; శశాంక్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 11; స్టొయినిస్ నాటౌట్ 44; అజ్మతుల్లా (సి) సమీర్ (బి) కుల్దీప్ 1; యాన్సెన్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 0; హర్‌ప్రీత్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–8, 2–55, 3–77, 4–118, 5–144, 6–172, 7–174, 8–197. బౌలింగ్: ముకేశ్ 4–0–49–1, ముస్తాఫిజుర్ 4–0–33–3, మోహిత్ శర్మ 4–0–47–0, విప్రాజ్ నిగమ్ 4–0–38–2, కుల్దీప్ 4–0–39–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) శశాంక్ (బి) యాన్సెన్ 35; డుప్లెసిస్ (సి) ప్రియాన్ష్(బి) హర్‌ప్రీత్ 23; కరుణ్ (బి) హర్‌ప్రీత్ 44; సాదికుల్లా (సి) అర్‡్షదీప్ (బి) ప్రవీణ్ 22; రిజ్వీ నాటౌట్ 58; స్టబ్స్ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–55, 2–65, 3–93, 4–155. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–0, అజ్మతుల్లా 4–0–46–0, హర్‌ప్రీత్ 4–0–41–2, యాన్సెన్ 4–0–41–1, ప్రవీణ్ 2–0–20–1, స్టొయినిస్ 1.3–0–21–0. ఐపీఎల్లో నేడుగుజరాత్ X చెన్నైవేదిక: అహ్మదాబాద్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి కోల్‌కతా X హైదరాబాద్ వేదిక: ఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: పంజాబ్‌ను ఓడించిన ఢిల్లీ
Punjab Kings vs Delhi Capitals- Jaipur Updates: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. శ్రేయస్ అయ్యర్ సేనను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 53 పరుగులు) రాణించాడు. మార్కస్ స్టొయినిస్ ( 16 బంతుల్లో 44 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఇక 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో పని పూర్తి చేసింది. కేఎల్ రాహుల్ (35), ఫాఫ్ డుప్లెసిస్ (23)లు మెరుగ్గా ఆడగా.. కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) దంచికొట్టాడు. సమీర్ రిజ్వీ మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 58) సాధించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (18) అతడికి సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. సమీర్ రిజ్వీ తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ18.2: ఐపీఎల్లో తొలి అర్ధ శతకం బాదిన సమీర్ రిజ్వీ . 22 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.రిజ్వీ ధనాధన్18 ఓవర్లలో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విజయానికి ఇంకో రెండు ఓవర్లలో 22 పరుగులు కావాలి.16 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 159/4కరుణ్ నాయర్ అవుట్ధనాధన్ ఇన్నింగ్స్‌తో దూకుడు మీదున్న కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44)ను హర్‌ప్రీత్ బ్రార్ బౌల్డ్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి రాగా.. సమీర్ రిజ్వీ 24 పరుగులతో ఉన్నాడు. ఢిల్లీ స్కోరు: 155/4 (15)14 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 146/3 యాభై రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ. కరుణ్ 38, సమీర్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 36 బంతుల్లో 61 పరుగులు కావాలి.ఫోర్ల వర్షంప్రవీణ్ దూబే బౌలింగ్‌లో కరుణ్ నాయర్ వరుసగా నాలుగు బౌండరీలు బాదాడు. 11 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 110-3. కరుణ్ 27, సమీర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ డౌన్10:1: సెదీకుల్లా (22) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ప్రవీణ్ దూబే బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. సమీర్ రిజ్వీ క్రీజులలోకి రాగా.. కరుణ్ 15 పరుగులతో ఉన్నాడు.పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 93/2 (10)సెదీకుల్లా 22, కరుణ్ నాయర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.డుప్లెసిస్ అవుట్6.4: హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో డుప్లెసిస్ (23)రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. సెదీకుల్లా అటల్ క్రీజులోకి వచ్చాడు. ఏడు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 66-2. కరుణ్ నాయర్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ5.3: కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో శశాంక్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ పెవిలియన్ చేరాడు. కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చాడు.5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 50-0శ్రేయస్ ఫిఫ్టీ, స్టొయినిస్ మెరుపులుఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మెరుగైన స్కోరు చేసింది.. జైపూర్ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. మిగతా వారిలో మార్కస్ స్టొయినిస్ ( 16 బంతుల్లో 44 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్19.3: ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన యాన్సెన్(0). పంజాబ్ స్కోరు: 197-8ఏడో వికెట్ డౌన్17.6: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి ఒమర్జాయ్ (1) పెవిలియన్ చేరాడు. పంజాబ్ స్కోరు: 174-7. మార్కో యాన్సెన్ క్రీజులోకి రాగా.. స్టొయినిస్ 20 పరుగులతో ఉన్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్17.1: కుల్దీప్ బౌలింగ్‌లో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (53) అవుటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి వచ్చాడు.శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం17 ఓవర్లలో పంజాబ్ స్కోరు 171/5 (17). శ్రేయస్ అయ్యర్ 53, స్టొయినిస్ 18 పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్15.4: శశాంక్ సింగ్ (11) రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి శశాంక్ పెవిలియన్ చేరాడు. మార్కస్ స్టొయినిస్ క్రీజులోకి వచ్చాడు. శ్రేయస్ 48 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 146-5(16)హాఫ్ సెంచరీకి చేరువలో శ్రేయస్15 ఓవర్లు ముగిసే సరికి శ్రేయస్ 46 పరుగులతో ఉండగా.. శశాంక్ సింగ్ 9 పరుగులతో ఆడుతున్నారు. పంజాబ్ స్కోరు: 142/4 (15)12.3: నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన నేహాల్ వధేరా(16). శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 118-412 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 116/3 (12)శ్రేయస్ అయ్యర్ 33 పరుగులతో, నేహాల్ వధేరా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 97/3 (10)శ్రేయస్ అయ్యర్ 18 పరుగులతో, నేహాల్ వధేరా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్7.5: విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ బౌల్డ్ (28). మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్. శ్రేయస్ 8 పరుగులతో ఉండగ.. నేహాల్ వధేరా క్రీజులోకి వచ్చాడు.ఏడు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోరు: 71/2 (7)ప్రభ్‌సిమ్రన్ సింగ్ 23, శ్రేయస్ అయ్యర్ ఏడు పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్5.3: విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్(32) షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు: 60-2ఐదు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోరు: 44/1 (5)ప్రభ్‌సిమ్రన్ సింగ్ 15, జోష్ ఇంగ్లిస్ 22 పరుగులతో ఆడుతున్నారు. పంజాబ్‌కు భారీ షాక్.. ఆర్య ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య.. ముస్తఫిజుర్ రెహ్మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతడి స్దానంలో ఫాఫ్ డుప్లెసిస్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ జట్టులోకి జోష్ ఇంగ్లిష్, మార్కస్ స్టోయినిష్ తిరిగి రాగా.. సెడిఖుల్లా అటల్ ఢిల్లీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టాప్-2 స్ధానాన్ని సుస్థిరం చేసుకోవాలని పంజాబ్ భావిస్తుంటే.. ఢిల్లీ మాత్రం కింగ్స్‌ను ఓడించి తమ పరువు నిలబెట్టుకోవాలని యోచిస్తోంది,తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్ -
జోరు కొనసాగించాలని...
జైపూర్: సుదీర్ఘ విరామం అనంతరం ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడంపై దృష్టి పెట్టింది. 2014లో చివరిసారి ‘ప్లే ఆఫ్స్’కు చేరి రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్... ఆ తర్వాత 11 ఏళ్లకు మళ్లీ ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ‘టాప్–4’లో చోటు దక్కించుకుంది. ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ శిక్షణలో తొలి టైటిల్ వేట దిశగా సాగుతున్న పంజాబ్ కింగ్స్... ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 8న ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో... పాకిస్తాన్ క్షిపణి దాడులు చేయడంతో ఆ మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు దాన్నే తాజాగా తటస్థ వేదిక జైపూర్‌లో నిర్వహించనున్నారు. ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడిన పంజాబ్ 8 విజయాలు, 3 పరాజయాలు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో... 17 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ నెగ్గితే... పాయింట్ల పట్టికలో టాప్–2లో నిలవడం ద్వారా ఫైనల్‌కు చేరేందుకు అదనంగా మరో అవకాశం పొందనుంది. మరోవైపు గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడి ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు లీగ్‌లో ఇదే చివరి మ్యాచ్. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరి పంజాబ్ జోరు కొనసాగిస్తుందా... లేక ఢిల్లీ సత్తా చాటుతుందా చూడాలి! టాపార్డర్ ఫుల్ జోష్‌లో... ఇప్పటి వరకు రెండు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్‌పై పంజాబ్ కింగ్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. 2019, 20లో ఢిల్లీ జట్టును ‘ప్లే ఆఫ్స్’ చేర్చిన శ్రేయస్... 2024లో కోల్‌కతాకు మూడోసారి కప్పు అందించాడు. తాజా సీజన్లో అతడు 174.69 స్ట్రయిక్‌రేట్‌తో 435 పరుగులు చేశాడు. గతేడాదితో పోల్చుకుంటే అతడి బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. ఈ సీజన్లో పవర్‌ప్లే ముగిసిన తర్వాత అత్యధిక స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేసిన రెండో ఆటగాడు శ్రేయస్ అయ్యరే. నికోలస్ పూరన్ 211.51 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు రాబడితే... శ్రేయస్ 182.19 స్ట్రయిక్‌రేట్‌తో దంచి కొట్టాడు. ఓపెనర్లు ప్రియాన్‡్ష ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ జట్టుకు వరంగా మారారు. నిలకడ కొనసాగిస్తున్న ఈ జోడీ... ఢిల్లీతో ఈ నెలారంభంలో జరిగిన పోరులోనూ అదిరిపోయే ఆరంభం అందించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు కేవలం 10 ఓవర్లలోనే 122 పరుగులు జోడించారు. ఈ సమయంలో అనివార్య కారణాల వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఈ సీజన్లో ప్రభ్‌సిమ్రన్ 38.17 సగటుతో 458 పరుగులు చేయగా... ప్రియాన్‡్ష ఆర్య 356 పరుగులు సాధించాడు.ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, యాన్సెస్ రూపంలో కింగ్స్‌కు మెరుగైన బ్యాటింగ్ దళం ఉంది. బౌలింగ్‌లో అర్‡్షదీప్, యుజువేంద్ర చాహల్, యాన్సెన్, జేమీసన్ కీలకం కానున్నారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... లీగ్ నుంచి తిరుగుపయనమైన విదేశీ ఆటగాళ్లంతా తిరిగి అందుబాటులోకి రావడంతో పంజాబ్ కింగ్స్ మరింత బలంగా తయారైంది. అక్షర్ పటేల్ అనుమానమే! సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో ఒకదశలో సునాయాసంగా ‘ప్లే ఆఫ్స్’ చేరుతుందనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ముంబై చేతిలో ఓటమితో రేసు నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన ఏకైక మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరు కనబర్చి గౌరవంగా సీజన్‌కు గుడబై చెప్పాలని చూస్తోంది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 56.00 సగటు, 148.67 స్ట్రయిక్‌రేట్‌తో 504 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా ఉండగా... అభిషేక్ పోరెల్ 301 పరుగులు చేశాడు. జ్వరం కారణంగా గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో ఆడతాడో లేదో చూడాలి. అతడు అందుబాటులో లేకపోతే మరోసారి డు ప్లెసిస్ ఢిల్లీ జట్టును నడిపించనున్నాడు. డు ప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్‌తో జట్టుకు మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.అయితే ఢిల్లీ అసలు సమస్య మాత్రం నిలకడగా వికెట్లు తీయగల ప్రధాన బౌలర్ లేకపోవడమే. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరమవడంతో ఢిల్లీ బౌలింగ్ డీలా పడింది. ముకేశ్ కుమార్, ముస్తఫిజుర్, చమీరా, కుల్దీప్ యాదవ్ ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరం. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జోష్ ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సెన్, జేమీసన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్ దీప్ సింగ్, యుజువేంద్ర చహల్. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, డు ప్లెసిస్, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, చమీరా, ముస్తఫిజుర్, ముకేశ్ కుమార్. -
'ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. లేదంటే విజయం మాదే'
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. బుధవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు ఓడి పోయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నిష్కమ్రించింది.181 పరుగుల లక్ష్యాన్ని అక్షర్ సేన ఛేదించిలేక చతికల పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై ఢిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ స్పందించాడు. ఆఖరి రెండు ఓవర్లే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని అతడు అభిప్రాయడ్డాడు."ఈ మ్యాచ్‌లో మేము 18 ఓవర్ల వరకు అద్బుతంగా బౌలింగ్ చేశాము. కానీ ఆఖరి రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. చివరిలో మా ప్రణాళికలను సరిగ్గా ఆమలు చేయలేకపోయాము. 12 బంతుల్లో ఏకంగా 48 పరుగులు ఇచ్చాము. ఆఖరి రెండు ఓవర్లలో పిచ్ కండీషన్స్ తగ్గట్టు మా బౌలర్లు బౌలింగ్ చేయలేకపోయారు. వికెట్ స్లోగా ఉన్నందున కట్టర్లు కానీ వైడ్ యార్కర్లు గానీ ప్రయత్నించుంటే బాగుండేది.కానీ మా బౌలర్లు అది చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి ఆటగాడో మనందరికి తెలుసు. అటువంటి బ్యాటర్‌కు స్లాట్‌లో బంతులు వేస్తే శిక్షించుకుండా ఎలా వదులుతాడని" పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బదానీ పేర్కొన్నాడు.అదేవిధంగా ఈ ఏడాది సీజన్లో తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది సీజన్‌ను నేను ఒక మారథన్గా భావించాము. మొదటిలో మాకు అద్బుతమైన ఆరంభం లభించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించాము.అయితే కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌లలో మేము ఓడిపోయాము. ఫ్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కొన్ని మ్యాచ్‌లను టార్గెట్‌గా పెట్టుకోవాలి. ఆ మ్యాచ్‌లలో గెలవకపోతే తప్పు మనదే అవుతుంది. అందుకు ఎవరిని బాధ్యులు చేయలేము. ఏదేమైనప్పటికి ఒక జట్టుగా మేము బాగా రాణించాము" అని బదానీ చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఆరు విజయాలు, మరో ఆరింట ఓటములను చవిచూసింది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే? -
ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
ఐపీఎల్-2025 (IPL 2025)ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశే మిగిలింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టాప్-4 నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. ముంబై ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది.గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో పాటు ముంబై టైటిల్ పోరులో నిలిచింది. మరోవైపు.. ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ సీజన్లో తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలిచి కూడా.. ప్లే ఆఫ్స్ చేరని ఏకైక జట్టుగా నిలిచింది.వరుసగా నాలుగు విజయాలుకాగా ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ (Axar Patel) పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో తొలుత లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడ్డ ఢిల్లీ.. ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. మరుసటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టిన అక్షర్ సేన.. చెపాక్‌లో సీఎస్కేను 25 పరుగుల తేడాతో ఓడించింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇలా సీజన్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయింది.ముంబై చేతిలో అపుడూ ఓడిన ఢిల్లీముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన(ఏప్రిల్ 13) ఢిల్లీ సీజన్లో తొలి పరాజయం చవిచూసింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ ఢిల్లీ అదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన అక్షర్ సేన.. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌పై సీజన్లో రెండో విజయం సాధించింది.అయితే, ఆర్సీబీ మాత్రం ప్రతీకారం తీర్చుకుని ఢిల్లీలోనే ఢిల్లీ జట్టును ఓడించింది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనూ అక్షర్ సేన ఓడిపోయింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గట్టెక్కింది. అనంతరం పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ మ్యాచ్ సాంకేతిక కారణాల (ఆపరేషన్ సిందూర్) వల్ల ఆగిపోయింది.ఆ తర్వాత గుజరాత్‌ను ఢీకొట్టిన ఢిల్లీ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో మరోసారి ఓటమిని చవిచూసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వాంఖడే వేదికగా ఢిల్లీ జట్టు.. హార్దిక్ సేనతో తలపడింది.సూర్య, నమన్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్), నమన్ ధీర్ (24 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు కూల్చగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.లక్ష్య ఛేదనలో ఢిల్లీ విలవిలఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ చేతులెత్తేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6).. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్(6) దారుణంగా విఫలమయ్యారు. సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ ఆలౌట్ అయింది. దీంతో ముంబై చేతిలో 59 పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇలా ఐపీఎల్ సీజన్ ఆరంభంలో వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ.. ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిబాట పట్టిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అపవాదును మూటగట్టుకుంది. కాగా లీగ్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ పంజాబ్‌తో తలపడనుంది.చదవండి: వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025


