IPL 2025: ఎస్ఆర్‌హెచ్ ఘోర ఓట‌మి.. | IPL 2025: SRH Vs Delhi Capitals Match Updates | Sakshi
Sakshi News home page

IPL 2025: ఎస్ఆర్‌హెచ్ ఘోర ఓట‌మి..

Published Sun, Mar 30 2025 3:24 PM | Last Updated on Sun, Mar 30 2025 6:53 PM

IPL 2025: SRH Vs Delhi Capitals Match Updates

Photo Courtesy: BCCI/IPL

SRH Vs Delhi Capitals Match Updates: 

ఎస్ఆర్‌హెచ్ ఘోర ఓట‌మి.. 
ఐపీఎల్‌-2025లో ఎస్ఆర్‌హెచ్ వ‌రుస‌గా రెండో ఓట‌మి చ‌విచూసింది. వైజాగ్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప‌రాజయం పాలైంది. 164 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో ఫాఫ్ డుప్లెసిస్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. జాక్ ఫ్రెజ‌ర్ మెక్‌గ‌ర్క్‌(38), అభిషేక్ పోరెల్‌(34) రాణించారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో జీష‌న్ అన్సారీ ఒక్కడే మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మిగితా బౌల‌ర్లంద‌రూ దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.
 

ఢిల్లీ క్యాపిట‌ల్స్ మూడో వికెట్ డౌన్‌.. 
కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 15 ప‌రుగులు చేసిన రాహుల్‌.. జీష‌న్ అన్సారీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. క్రీజులోకి ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ వ‌చ్చాడు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండో వికెట్ డౌన్‌..
ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయింది. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో తొలి బంతికి ఫాఫ్ డుప్లెసిస్‌(50) ఔట్ కాగా.. ఆఖ‌రి బంతికి జాక్ ఫ్రేజ‌ర్ మెక్‌గ‌ర్క్‌(38) ఔట‌య్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వ‌చ్చాడు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ రెండు వికెట్లు న‌ష్టానికి 96 ప‌రుగులు చేసింది.

దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ..
164 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ దూకుడుగా ఆడుతోంది. 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ వికెట్ న‌ష్ట‌పోకుండా 48 ప‌రుగులు చేసింది. క్రీజులో జేక్ ఫ్రెజర్ మెక్‌గ‌ర్క్‌(8), ఫాఫ్ డుప్లెసిస్‌(29) ఉన్నారు.

163 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్ ఆలౌట్‌
ఐపీఎల్‌-2025లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌.. 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్‌(32), హెడ్‌(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధిం‍చారు.
ఎస్‌ఆర్‌హెచ్ ఎనిమిదో వికెట్ డౌన్‌.. అనికేత్ ఔట్‌
అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అనికేత్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74).. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌
ఎస్ఆర్‌హెచ్ వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయింది. 12 ఓవ‌ర్‌లో అభిన‌వ్ మ‌నోహ‌ర్‌(4) ఔట్ కాగా.. ఆ త‌ర్వాత 14 ఓవ‌ర్‌లో కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ ఔట‌య్యాడు. ఈ ఇద్ద‌రు కూడా కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 7 వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది. క్రీజులో అనికేత్ వ‌ర్మ‌(50) ఉన్నాడు. వియాన్ ముల్డ‌ర్ ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగాడు.

ఎస్ఆర్‌హెచ్ ఐదో వికెట్ డౌన్‌.. క్లాసెన్ ఔట్‌
హెన్రిచ్ క్లాసెన్‌ రూపంలో ఎస్ఆర్‌హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 32 ప‌రుగులు చేసిన క్లాసెన్‌.. మొహిత్ శ‌ర్మ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 5 వికెట్ల న‌ష్టానికి 114 ప‌రుగులు చేసింది. క్రీజులో అనికేత్ వ‌ర్మ‌(47) ఉన్నాడు.

అనికేత్ ఆన్ ఫైర్‌.. 
ఎస్ఆర్‌హెచ్ యువ సంచ‌ల‌నం అనికేత్ వ‌ర్మ మ‌రోసారి దూకుడుగా ఆడుతున్నాడు. కేవ‌లం 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 40 ప‌రుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. అత‌డితో పాటు హెన్రిచ్ క్లాసెన్‌(24) ఉన్నాడు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల న‌ష్టానికి 98 ప‌రుగులు చేసింది.

ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ డౌన్‌..
ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 22 ప‌రుగులు చేసిన ట్రావిస్ హెడ్‌.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి క్లాసెన్ వ‌చ్చాడు.

29 ప‌రుగుల‌కే 3 వికెట్లు.. క‌ష్టాల్లో ఎస్ఆర్‌హెచ్‌
వైజాగ్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డుతున్నారు.  టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ కేవ‌లం 29 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 4 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ మూడు వికెట్లు కోల్పోయి 37 ప‌రుగులు చేసింది. క్రీజులో హెడ్‌(22), అనికేత్‌(5) ఉన్నారు.

ఐపీఎల్-25 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో విశాఖ వేదికగా డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో  జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ కు మొగ్గుచూపాడు.

ఇక ఇరుజట్ల మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ అత్యంత హోరాహోరీగా సాగే అవకాశం​ ఉంది. ఇరు జట్లలో భయంకరమైన హిట్టర్లు ఉన్నారు. విశాఖ పిచ్‌పై పరుగుల వరద పారిన చరిత్ర ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో పోలిస్తే ఢిల్లీ ఈ మ్యాచ్‌లో మరింత బలపడనుంది. పితృత్వ సెలవుపై ఉండిన ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టులో చేరాడు.

ఈ సీజన్‌లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై సంచలన విజయం సాధించి జోష్‌ మీద ఉంది. సన్‌రైజర్స్‌ తమ తొలి మ్యాచ్‌లో రాయల్స్‌పై అద్భుత విజయం సాధించి, ఆతర్వాతి మ్యాచ్‌లో లక్నో చేతిలో పరాభవం ఎదుర్కొంది. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్‌ల్లో తలపడగా.. సన్‌రైజర్స్‌ 13, ఢిల్లీ 11 ​మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.

ఎస్ఆర్ హెచ్ తుది జట్టు
ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
అక్షర్ పటేల్(కెప్టెన్), జేక్ ప్రేజర్, డుప్లిసెస్, అభిషేక్ పార్కెల్, కేఎల్ రాహుల్, ట్రిస్టాన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement