ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం | IPL 2025: Royal Challengers Bengaluru vs Delhi Capitals Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2025: ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం

Published Thu, Apr 10 2025 7:02 PM | Last Updated on Thu, Apr 10 2025 11:10 PM

IPL 2025: Royal Challengers Bengaluru vs Delhi Capitals Live Updates

PC: BCCI/IPL.com

IPL 2025 DC vs RCB Live Updates: ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం
ఐపీఎల్‌-2025లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ జైత్రయాత్రను కొన‌సాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. 164 ప‌రుగుల టార్గెట్‌ను ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 18 ఓవ‌ర్ల‌లో చేధించింది. 

ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.    53 బంతులు ఎదుర్కొన్న రాహుల్‌..7 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 93 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాహుల్‌తో పాటు స్ట‌బ్స్‌(38 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ రెండు, య‌శ్‌ద‌యాల్‌, సుయాష్ శ‌ర్మ త‌లా వికెట్ సాధించారు.

కేఎల్ రాహుల్ ఫిప్టీ..
ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీని అందుకున్నాడు. 73 ప‌రుగులతో రాహుల్ త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 15 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ 4 వికెట్ల న‌ష్టానికి 121 ప‌రుగులు చేసింది. క్రీజులో రాహుల్‌తో పాటు స్ట‌బ్స్‌(15) ఉన్నారు.
ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్‌..
అక్ష‌ర్ ప‌టేల్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ప‌రుగులు చేసిన అక్ష‌ర్ ప‌టేల్‌.. సుయాష్ శ‌ర్మ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఢిల్లీ విజ‌యానికి 68 బంతుల్లో 106 ప‌రుగులు కావాలి.

8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 52/3
8 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్‌(25), అక్షర్ పటేల్‌(9) ఉన్నారు.

ఢిల్లీకి ఆదిలోనే భారీ షాక్‌..
164 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. ఓపెన‌ర్లు ఫాఫ్ డుప్లెసిస్‌(2), మెక్‌గ‌ర్క్‌(7) వికెట్లను ఢిల్లీ కోల్పోయింది. డుప్లెసిస్‌ను య‌శ్‌ద‌యాల్ ఔట్ చేయ‌గా.. మెక్‌గ‌ర్క్‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ పెవిలియ‌న్‌కు పంపాడు.

టిమ్ డేవిడ్ మెరుపులు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. తొలుత దూకుడుగా ఆడిన ఆర్సీబీ బ్యాట‌ర్లు.. మిడిల్ ఓవ‌ర్లలో చెతులేత్తేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేసింది. 

ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ఫిల్ సాల్ట్‌(37) ప‌రుగులతో మెరుపు ఆరంభం ఇవ్వ‌గా..టిమ్ డేవిడ్‌(18 బంతుల్లో 32, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖ‌రిలో మెరుపు మెరిపించాడు. వీరిద్ద‌రితో పాటు పాటిదార్(25), కోహ్లి(22) ప‌ర్వాలేద‌న్పించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో విప్ర‌జ్ నిగ‌మ్‌, కుల్దీప్ యాద‌వ్ త‌లా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ముఖేష్ కుమార్‌, మోహిత్ శ‌ర్మ త‌లా వికెట్ సాధించారు.

16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 121/6
ఆర్సీబీ బ్యాటర్లు తడబడుతున్నారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. ఐదో వికెట్‌గా జితేష్ శర్మ(3), రజిత్ పాటిదార్‌(25) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు కూడా కుల్దీప్ యాదవ్ తీశాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 121/6

నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
లివింగ్ స్టోన్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన లివింగ్‌స్టోన్‌.. మోహిత్ శ‌ర్మ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ నాలుగు వికెట్ల న‌ష్టానికి 91 ప‌రుగులు చేసింది.
ఆర్సీబీ మూడో వికెట్ డౌన్‌..
విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 22 ప‌రుగులు చేసిన కోహ్లి.. విప్ర‌జ్ నిగ‌మ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి లివింగ్ స్టోన్ వ‌చ్చాడు. 8 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌: 83/3

ఆర్సీబీ రెండో వికెట్ డౌన్‌..
దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన ప‌డిక్క‌ల్‌.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.
ఆర్సీబీ తొలి వికెట్ డౌన్‌..
ఫిల్ సాల్ట్ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 17 బంతుల్లో 37 ప‌రుగులు చేసిన సాల్ట్‌.. ర‌నౌట్ రూపంలో పెవిలియ‌న్‌కు చేరాడు. 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్టానికి 64 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(14), ప‌డిక్క‌ల్‌(1) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న ఫిల్ సాల్ట్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఓపెన‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి బెంగ‌ళూరు వికెట్ న‌ష్ట‌పోకుండా 53 ప‌రుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్‌(36), విరాట్ కోహ్లి(6) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో ర‌స‌వ‌త్త‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ ఓపెన‌ర్ ఫాఫ్ డుప్లెసిస్ తిరిగొచ్చాడు. మ‌రోవైపు ఆర్సీబీ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగింది. 
తుది జ‌ట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), అక్షర్ పటేల్ (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement