PC: IPL
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌కు కోపమొచ్చింది. తన గురించి అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలని.. మరీ ఇంత చెత్తగా ఎలా తయ్యారంటూ గాసిప్ రాయుళ్లకు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడం దుర్మార్గమని పేర్కొన్నాడు.
ఆర్సీబీని అడిగితే నో చెప్పింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ పంత్‌ను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టాడు. ‘‘రిషభ్ పంత్ తన మేనేజర్ ద్వారా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని సంప్రదించాడు.
అక్కడ కెప్టెన్సీ పదవి ఖాళీగా ఉంటే.. తనకు ఇవ్వమని కోరాడు. కానీ ఆర్సీబీ మేనేజ్‌మెంట్ అతడి అభ్యర్థనను తిరస్కరించింది. విరాట్‌కు పంత్ అక్కడికి రావడం ఇష్టం లేదు.
ఎందుకంటే.. భారత క్రికెట్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌లో మాదిరి ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తాడని విరాట్ భయపడ్డాడు. ఆర్సీబీ వర్గాల ద్వారా ఈ విషయం తెలిసింది’’ అని సదరు యూజర్ పేర్కొన్నారు. ఇందుకు పంత్ ఘాటుగా స్పందించాడు.
మీ ఇంగితానికే అంతా వదిలేస్తా..
‘‘నకిలీ వార్తలు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు ప్రచారం చేస్తున్నారు. కాస్త పద్ధతిగా ప్రవర్తించండి గయ్స్. కారణం లేకుండా ఇలాంటివి రాసి.. ఎందుకు ప్రశాంతంగా ఉండేవాళ్ల మనసులను చెడగొడతారు.
అయినా... ఇలాంటి వదంతులు ఇదే మొదటిసారి కాదు.. ఇదే ఆఖరూ కాదు. కానీ పరిస్థితి రోజురోజుకీ మరింత చెత్తగా మారుతోంది. ఇక మీ ఇంగితానికే అంతా వదిలేస్తా. ఇది కేవలం మీ ఒక్కరికే కాదు.. మీలా అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్లందరికీ వర్తిస్తుంది’’ అని రిషభ్ పంత్ ఎక్స్ వేదికగా చురకలు అంటించాడు.
కాగా ఐపీఎల్‌లో పంత్ చాలా కాలంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. రోడ్డు ప్రమాదం అనంతరం.. ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చిన.. ఈ లెఫ్టాండర్ 446 పరుగులు చేశాడు. అయితే, కెప్టెన్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. జట్టును ఆరో స్థానంలో నిలిపాడు.
చదవండి: షకీబ్ అల్ హసన్ సంచలన ప్రకటన.. టెస్టులకు గుడ్‌బై
Fake news . Why do you guys spread so much fake news on social media. Be sensible guys so bad . Don’t create untrustworthy environment for no reason. It’s not the first time and won’t be last but I had to put this out .please always re check with your so called sources. Everyday…
— Rishabh Pant (@RishabhPant17) September 26, 2024
Comments
Please login to add a commentAdd a comment