
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025ను లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవంగా ఆరంభించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. తొలి మ్యాచ్‌లోనే తీవ్ర నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంత్ డకౌటయ్యాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. ఆరు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పంత్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకేనా రూ. 27 కోట్లు అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా గతేడాది జరిగిన మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు పంత్‌ను లక్నో కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో పంత్ విఫలమైనప్పటికి మిగితా బ్యాటర్లు మాత్రం విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్( 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72), నికోలస్ పూరన్( 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 75 పరుగులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఓ దశలో ఈజీగా 250 పైగా లక్నో స్కోర్ దాటుతుందని భావించారు. కానీ 15 ఓవర్ల తర్వాత ఢిల్లీ బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా.. విప్రాజ్ నిగమ్, ముఖేష్ కుమార్ తలా వికెట్ సాధించారు.
Blind slogger sympathy merchant Rishabh Pant gone for 6 balls duck.
He had created a ecosystem which presented him as a big match winner and a great clutch player, media people & commentators even hyped him in T2OIs & ODIs.
Can't believe Goenka paid 27 crores for him & shame on… pic.twitter.com/PJMzI07FzF— Rajiv (@Rajiv1841) March 24, 2025