Rishab pant
-
ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత తుది జట్టు ఇదే! ఆ స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్?
క్రికెట్ మికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సమయం అసన్నమైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ మహాసంగ్రామానికి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉండగా.. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అప్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఈ ఈవెంట్లో భారత జట్టు తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కి వెళ్తే ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. తొలుత మొండి పట్టుపట్టినప్పటికి ఐసీసీ డిమాండ్లకు పీసీబీ తలొగ్గింది.ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడునుంది. ఆ తర్వాత ఈ నెల 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. అయితే భారత్‌కు జస్ప్రీత్ బుమ్రా గాయం రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగలింది. బుమ్రా గాయం కారణంగా ఈ ఐసీసీ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని హర్షిత్ రాణాతో సెలక్టర్లు భర్తీ చేశారు. అదేవిధంగా ఆఖరి నిమిషంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఎంపిక చేశాడు. పేసర్ హర్షిత్ రాణా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్‌లను పీటర్సన్ పట్టించుకోలేదు. ఓపెనర్లగా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లకు తన జట్టులో పీటర్సన్ చోటిచ్చాడు. అదేవిధంగా విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లకు ఫస్ట్ డౌన్, సెకెండ్ డౌన్లో అతడు అవకాశమిచ్చాడు.మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పీటర్సన్ సెలక్ట్ చేశాడు. ఫినిషర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను పీటర్సన్ ఎంపిక చేశాడు. కాగా ఈ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో భారత క్లీన్ స్వీప్ చేసింది. ఇదే జోరును ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.ఛాంపియన్స్ ట్రోఫీకి పీటర్సన్ ఎంపిక చేసిన భారత తుది జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: ప్లీజ్.. నన్ను కింగ్ అని పిలవకండి: బాబర్ ఆజం -
లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ ప్రకటన..
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant)ను లక్నో ఫ్రాంచైజీ నియమించింది. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ధ్రువీకరించారు. ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మాత్రమే కాకుండా, అత్యుత్తమ కెప్టెన్‌గా కూడా పంత్ ఎదుగుతాడని గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు.రికార్డు ధర.. జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025(IPL 2025) మెగా వేలంలో రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు. వేలంలో తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడిన సూపర్ జెయింట్స్.. రైట్ టూ మ్యాచ్ కార్డును ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఎదుర్కొని మరీ పంత్‌ను సొంతం చేసుకుంది.కాగా లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్-2021 సీజన్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగు పెట్టింది. గత మూడు సీజన్లలో కేఎల్ రాహుల్ సారథ్యంలో లక్నో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రెండు సార్లు ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టినప్పటికి తుది పోరుకు ఆర్హత సాధించలేకపోయింది. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాహుల్‌ను లక్నో రిటైన్ చేసుకోలేదు.దీంతో ఈ ఏడాది సీజన్లో కేఎల్ రాహుల్ స్ధానాన్ని పంత్ భర్తీ చేయనున్నాడు. కాగా తొలుత లక్నో కెప్టెన్‌గా వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ ఎంపిక అవుతాడని వార్తలు వినిపించాయి. కానీ లక్నో యాజమాన్యం మాత్రం పంత్ వైపే మొగ్గు చూపింది.రెండో జట్టుకు కెప్టెన్‌గా..కాగా ఐపీఎల్లో కెప్టెన్‌గా పంత్‌కు అనుభవం ఉంది. 2016 సీజన్‌తో ఐపీఎల్ అరంగేంట్రం చేసిన రిషబ్ పంత్.. అప్పటి నుంచి గతేడాది సీజన్‌కు అదే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2021 నుంచి 2024 వరకు ఢిల్లీ కెప్టెన్‌గా రిషబ్ పని చేశాడు. అయితే గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్‌కు మాత్రం దూరమయ్యాడు. మళ్లీ గతేడాది సీజన్‌తో పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. వ్యక్తిగత ప్రదర్శతనతో అతడు ఆకట్టుకున్నప్పటికి.. సారథిగా మాత్రం జట్టును ముందుండి నడిపించడంలో విఫలమయ్యాడు. అతడి నాయకత్వంలోని ఢిల్లీ జట్టు లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో జట్టు యాజమాన్యంతో పంత్‌కు విభేదాలు ఏర్పడినట్లు వార్తలు వినిపించాయి.ఈ కారణంగానే ఢిల్లీ ఫ్రాంచైజీతో పంత్ తెగదింపులు చేసుకున్నాడని, క్యాపిటల్స్ కూడా అతడిని రిటైన్ చేసుకోలేదని జోరుగా ప్రచారం సాగింది. ఏదమైనప్పటికి వేలంలోకి వచ్చిన పంత్‌కు మాత్రం కళ్లు చెదిరే ధర దక్కింది. పంత్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ 43 మ్యాచ్‌లు ఆడగా.. 24 విజయాలు, 19 ఓటములు చవిచూసింది. ఇక ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి.. అఫీషియల్ అప్డేట్ -
అతడి డిఫెన్స్ అద్భుతం.. 200 బంతులు కూడా ఆడగలడు: అశ్విన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూకుడైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా పంత్ బ్యాటింగ్ స్టైల్ ఒకటే. క్రీజులో వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడడం రిషబ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ ఢిల్లీ చిచ్చరపిడుగులో దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన డిఫెన్స్ స్కిల్స్‌ను కూడా టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తించాడు.ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అశ్విన్ తన సహచరుడి బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. పంత్ డిఫెన్స్ అభేద్యమని, అతను పట్టుదలగా నిలబడితే ఎన్ని బంతులైనా ఆడగలడని అశ్విన్ కొనియాడాడు.పంత్ డిఫెన్స్ అద్భుతం..‘రిషభ్ పంత్‌లో అన్ని రకాల షాట్లు ఆడే సామర్థ్యం ఉంది. అయితే అతడి నుంచి మనం ఏం ఆశిస్తున్నామో అతనికి స్పష్టంగా చెప్పాలి. అతడి డిఫెన్స్ కూడా ఎంత బాగుంటుందంటే 200 బంతులు కూడా ఆడగలడు. ప్రపంచంలోనే అద్బుతంగా డిఫెన్స్ ఆడే బ్యాటర్లలో రిషబ్ ఒకడు.తన బలమేంటో తనకే పూర్తిగా తెలీదు. మిడిల్ గేమ్‌లో పరిస్థితికి తగినట్లుగా ఆడటం అలవాటు చేసుకుంటే ప్రతీ మ్యాచ్‌లో పంత్ సెంచరీ కొట్టగలడు. డిఫెన్స్ ఆడుతూ అతను అవుట్ కావడం చాలా అరుదు. నెట్స్‌లో నేను ఎన్నోసార్లు అతనికి బౌలింగ్ చేశాను.అతడు ఎల్బీడబ్ల్యూగా లేదా బంతి ఎడ్జ్ తీసుకుంటూ ఎప్పుడూ అవుట్ కాలేదు. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో బ్యాటింగ్ చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి సమయంలో పంత్ ఆడుతున్నాడు. సిడ్నీలో అతడి ఆడిన ఇన్నింగ్స్‌లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.ఒకే ఒకే గేమ్‌లో రెండు వేర్వేరు నాక్‌లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో డిఫెన్స్ ఆడితే, రెండో ఇన్నింగ్స్‌లో తన విశ్వరూపం చూపించాడు’ అని అశ్విన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికి పంత్ మాత్రం తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులతో సూపర్ నాక్ ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం 9 ఇన్నింగ్స్‌లో పంత్.. 28.33 సగటుతో 255 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 43 టెస్టులు ఆడిన పంత్.. 42.11 సగటుతో 2948 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఆరు సెంచరీలు చేశాడు.చదవండి: క్రికెట్ ‘మనసు’ చదివింది! -
IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) బీభత్సం సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీ20ను తలపించేలా బ్యాటింగ్ చేశాడు. భారత్ 59 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్.. ఎదురుదాడికి దిగాడు.ప్రత్యర్ధి బౌలర్లను ఈ ఢిల్లీ ఆటగాడు ఉతికారేశాడు. కేవలం 33 బంతులు ఎదుర్కొన్న పంత్ 184.85 స్ట్రైక్ రేట్‌తో 61 పరుగులు సాధించి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ప్రస్తుతం టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేసిన పంత్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టమైన వికెట్‌పై రిషబ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడని సచిన్ కొనియాడు."సిడ్నీలో రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ కఠినమైన వికెట్‌పై మిగితా బ్యాటర్లు 50 కంటే తక్కువ స్ట్రైక్ రేటుతో ఆడితే.. పంత్ మాత్రం ఏకంగా 184 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఇది నిజంగా నమ్మశక్యం కానిది. తొలి బంతి నుంచే ఆస్ట్రేలియా బౌలర్లను అతడు టార్గెట్ చేశాడు. పంత్ ఎప్పుడూ తన బ్యాటింగ్‌తో అందరిని అలరిస్తూ ఉంటాడు. అతడు ఇన్నింగ్స్ ఎంతో ప్రభావం చూపుతోందని" సచిన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సహా యాజమాని పార్ధ్ జిందాల్ సైతం రిషబ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తుమ టెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అని అతడు ప్రశంసించాడు.కాగా ఐపీఎల్లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించిన పంత్.. ఈ సారి లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడనున్నాడు. రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో పంత్‌ను సొంతం చేసుకుంది. On a wicket where majority of the batters have batted at a SR of 50 or less, @RishabhPant17's knock with a SR of 184 is truly remarkable. He has rattled Australia from ball one. It is always entertaining to watch him bat. What an impactful innings!#AUSvIND pic.twitter.com/rU3L7OL1UX— Sachin Tendulkar (@sachin_rt) January 4, 2025 Introducing to you the greatest Indian test wicketkeeper batsman in our history come on @RishabhPant17 come on India!— Parth Jindal (@ParthJindal11) January 4, 2025 -
పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) తన విశ్వరూపాన్ని చూపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశాడు. అప్పటివరకు నిప్పులు చెరిగిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల దూకుడుకు పంత్ కళ్లేం వేశాడు.తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన పంత్.. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానుల అలరించాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే ఈ ఢిల్లీ డైనమెట్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా 33 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. కాగా ఈ జాబితాలో రిషబ్‌నే తొలి స్ధానంలో ఉన్నాడు. 2022లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పంత్ కేవలం 28 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన పంత్.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్‌గా రికార్డు..ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన పర్యాటక బ్యాటర్‌గా రిషబ్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రాయ్ ఫ్రెడెరిక్స్ పేరిట ఉండేది. వీరిద్దరూ ఆస్ట్రేలియాలో 33 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. తాజా మ్యాచ్‌తో ఈ దిగ్గజాల ఆల్‌టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 132 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. Aate hi RISHABH-PANTI shuru! 🔥When @RishabhPant17 steps in, the entertainment level goes 𝗨𝗽&𝗨𝗽 📈#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/tiJiuBOEDO— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
రిషబ్ పంత్ సూపర్ సిక్సర్... నిచ్చెనెక్కి బంతిని తీశారు! వీడియో
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా(India-Australia) మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రవీంద్ర జడేజా(26), జస్ప్రీత్ బుమ్రా(22) రాణించారు.భారత బౌలర్లలో ఆసీస్ బౌలర్లలో బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు, నాథన్ లియాన్ ఒక వికెట్ సొంతం చేసుకున్నారు. ఇక ఆసీస్‌కు తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే జస్ప్రీత్ బుమ్రా బిగ్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఆసీస్ స్టార్ ప్లేయర్ ఉస్మాన్ ఖావాజాను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.పంత్ భారీ సిక్సర్..ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్(Rishabh Pant) విరోచిత పోరాటం కనబరిచాడు. విరాట్ కోహ్లి ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల నుంచి బంతులు బుల్లెట్లా తన శరీరానికి తాకుతున్నప్పటకి పంత్ మాత్రం తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.ఈ క్రమంలో ఆసీస్ అరంగేట్ర ఆటగాడు వెబ్‌స్టర్ బౌలింగ్‌లో రిషబ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. అతడు కొట్టిన షాట్ పవర్ బంతి ఏకంగా సైడ్స్క్రీన్పై చిక్కుకుపోయింది. దీంతో ఆ బంతిని తీసేందుకు గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దిగారు. నిచ్చెనను తీసుకువచ్చి మరి ఆ బంతిని కిందకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: స్మిత్, లబుషేన్ మైండ్‌గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే.. A six so big the ground staff needed a ladder to retrieve it!#AUSvIND pic.twitter.com/oLUSw196l3— cricket.com.au (@cricketcomau) January 3, 2025 -
IND Vs AUS: పంత్ మోచేతికి గాయం.. అయినా సరే! వీడియో వైరల్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh pant) అద్బుతమైన పోరాటం కనబరిచాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లతో ముప్పుతిప్పులు పెడుతున్నప్పటికీ.. పంత్ మాత్రం తన విరోచిత ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దెబ్బకు మోచేతిపై కాస్త వాపు వచ్చింది. వెంటనే ఫిజియోలు వచ్చి అతడికి చికిత్స అందించారు. నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలర్లను రిషబ్ చాలాసేపు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.ఈ ఒక్కటే కాకుండా తర్వాత చాలా బంతులు పంత్ శరీరానికి బలంగా తాకాయి. అయినప్పటకి రిషబ్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 40 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్ Rishabh Pant facing some serious punishment from the Australian bowlers. Taking some heavy blows. #AUSvIND #Rishabpant #BorderGavaskarTrophy #ToughestRivalry https://t.co/QiLSnpRbYE— 𝕊𝕙𝕒𝕙𝕚𝕕 𝕌𝕝 𝕀𝕤𝕝𝕒𝕞 (@Shahid_shaban) January 3, 2025 -
IND Vs AUS: 'స్టుపిడ్.. స్టుపిడ్! నీవు భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు'
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. తొలి మూడు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన పంత్.. ఇప్పుడు మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. కీలకమైన బాక్సింగ్ డే టెస్టులో పంత్ నిరాశపరిచాడు.తొలుత మంచి టచ్‌లో కన్పించిన పంత్.. ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను పంత్ సమర్పించుకున్నాడు. ఆసీస్ స్పీడ్ స్టార్ స్కాట్ బోలాండ్ ఓవర్లో లాంగ్-లెగ్ మీదుగా ల్యాప్ షాట్ ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ షాట్ ఆడే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయిన పంత్ కింద పడిపోయాడు.అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. డీప్ థర్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్న నాథన్ లియోన్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 28 పరుగులు చేసిన పంత్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.సన్నీ ఈజ్ ఫైర్.. ఈ క్రమంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. రిషబ్ పంత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. భారత్ కు పాలో ఆన్ గండం ఉన్నప్పటికీ పంత్ నిర్లక్ష్యంగా ఆడటంపై గావస్కర్ మండిపడ్డాడు."స్టుపిడ్! స్టుపిడ్! స్టుపిడ్! ఇద్దరు ఫీల్డర్లు ఉన్నప్పటికి ఆ చెత్త షాట్ ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతకుముందే ఆ షాట్‌కు ప్రయత్నించి విఫలమయ్యావు. వెంటనే మళ్లీ అదే షాట్ ఆడి వికెట్‌ను సమర్పించుకున్నావు. ఇంతకు మించిన మూర్ఖత్వం మరొకటి లేదు. ఓ కీలక ఆటగాడిగా క్రీజులో ఉన్నప్పుడు జట్టు పరిస్థితిని ఆర్దం చేసుకుని ఆడాలి. అస్సలు ఆ సమయంలో ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. ఇది మీ నేచరల్ గేమ్ కాదు. అతడు ఆడిన స్టుపిడ్ షాట్.. టీమ్ మొత్తాన్ని తీవ్ర నిరాశపరిచింది. అతడు భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లొద్దు.ఇతర డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాలి" అంటూ సన్నీ ఫైరయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది.టీమిండియా ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టాల్లో ఉన్న జట్టును తన విరోచిత పోరాటంతో నితీశ్ అదుకున్నాడు. నితీశ్ ప్రస్తుతం 105 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మూడో రోజు ఆటలో నితీశ్ పాటు వాషింగ్టన్ సుందర్(50) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. "Stupid, stupid, stupid!" 😡🏏 Safe to say Sunny wasn't happy with Rishabh Pant after that shot.Read more: https://t.co/bEUlbXRNpm💻📝 Live blog: https://t.co/YOMQ9DL7gm🟢 Listen live: https://t.co/VP2GGbfgge #AUSvIND pic.twitter.com/Fe2hdpAtVl— ABC SPORT (@abcsport) December 28, 2024 -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..
బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అరుదైన ఘనత నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో 150 ఔట్లు సాధించిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు.ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ అందుకున్న పంత్.. ఈ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పంత్ ఇప్పటివరకు 41 టెస్టు మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా 135 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లు చేశాడు. పంత్ కంటే ముందు ఎంఎస్ ధోనీ, సయ్యద్ కిర్మాణి మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. మిస్టర్ కూల్ 256 క్యాచ్‌లు, 36 స్టంపింగ్‌లతో 294 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు.అదే విధంగా రెండో స్ధానంలో ఉన్న సయ్యద్ కిర్మాణి 160 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లతో మొత్తంగా 198 ఔట్ల్లో పాలుపంచుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు వరుణుడు కరుణించాడు. తొలిసెషన్లో ఆస్ట్రేలియాకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించాడు.28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే తొలి సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయించినప్పటకీ.. తర్వాత ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. 53 ఓవర్లకు ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: కోహ్లితో అట్లుంటది మరి.. దెబ్బకు నోరు మూసుకున్న ఆసీస్ ఫ్యాన్స్! వీడియో -
సంపాదనలో టాప్.. విరాట్ కోహ్లిని దాటేసిన రిషబ్ పంత్
ఐపీఎల్-2025 మెగా వేలం భారత క్రికెటర్లను ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులగా మార్చేసింది. ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఈ క్యాష్‌రిచ్ మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.ఈ వేలంలో రిషబ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. పంత్ తర్వాత అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు), వెంకటేష్ అయ్యర్(రూ.23.75) నిలిచారు. మరోవైపు రిటెన్షన్ జాబితాలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది.కోహ్లిని దాటేసిన పంత్.. అయితే ఆటగాళ్ల ఐపీఎల్ జీతాలు ఖారారు కావడంతో రిషబ్ పంత్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ ఒప్పందాల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న భారత ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిని పంత్ అధిగమించాడు. ఇండియన్ ప్లేయర్లకు బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల ద్వారా వార్షిక అదాయం లభిస్తోంది. పంత్ క్రికెట్ కమిట్మెంట్లతో ఇప్పుడు ఏడాదికి రూ. 32 కోట్లు అందుకోన్నాడు. పంత్ ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఎ కేటగిరీలో ఉన్నాడు.బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా రిషబ్ ఏడాదికి రూ. 5 కోట్లు అందుకుంటున్నాడు. అదేవిధంగా ఈ ఏడాది నుంచి అతడికి ఐపీఎల్ కాంట్రక్ట్ ద్వారా రూ.27 కోట్లు లభించనున్నాయి. మొత్తంగా ఏడాదికి రూ. 32 కోట్లను ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు అందుకోనున్నాడు.మరోవైపు విరాట్ కోహ్లి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఎ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు. బీసీసీఐ కాంట్రాక్ట్ వల్ల కోహ్లికి ఏడాదికి రూ. 7 కోట్లు అందుతున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ రిటెన్షన్తోతో కోహ్లికి రూ. 21 కోట్లు అందనున్నాయి. మొత్తంగా కోహ్లి ఏడాదికి రూ.28 కోట్లు తీసుకుంటున్నాడు. అంటే పంత్ కంటే రూ. 4 కోట్లు కోహ్లి వెనకబడి ఉన్నాడు.చదవండి: -
రూ.27 కోట్లలో రిషబ్ పంత్ చేతికి వచ్చేది ఎంతంటే..
ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఏకంగా రూ.27 కోట్ల ధరకు పలికాడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సొంతం చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండూ కూడా పంత్ కోసం పోటీపడి ఊరుకున్నాయి.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పొందుతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట.డిసెంబర్ 2022లో రోడ్డుప్రమాదం నుంచి బయటపడిన పంత్‌కు మోకాలి సర్జరీ జరిగింది. ఆ తరువాత పంత్ క్రికెట్ ఆడలేడేమో అని అందరూ భావించారు. కానీ పట్టువదలని విక్రమార్కునిలా మళ్ళీ బ్యాట్ చేతపట్టుకున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఐపీల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. -
వేలంలో భారత క్రికెటర్లకు కాసుల పంట.. తొలి రోజు ఎవరు ఎంత ధర పలికారంటే..?
-
ఐపీఎల్-2025 మెగా వేలం లైవ్ అప్డేట్స్..
-
రిషబ్ పంత్ కి 30 కోట్లు?
-
రిషబ్ పంత్‌కు రూ.33 కోట్లు.. సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్!?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి సర్వం సిద్దమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా వేలం జరగనుంది. ఈ మెగా వేలం కోసం మొత్తం అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే జెడ్డాకు చేరుకున్నాయి. ఈ ఆక్షన్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆయా ఫ్రాంచైజీలు సిద్దం చేసుకున్నాయి. మరోవైపు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ క్రికెటర్లు ఈ వేలంలో భాగం కావడంతో అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మెగా వేలానికి ఒక్క రోజు ముందు అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమా "మెగా వేలం వార్ రూమ్" పేరిట ఓ కార్యక్రమం నిర్వహించింది. "మెగా వేలం వార్ రూమ్‌లో క్రికెట్ ఎక్స్పర్ట్స్ సంజయ్ బంగర్, ఆకాష్ చోప్రా, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇయాన్ మోర్గాన్, దీప్ దాస్ గుప్తా, ఎస్ బద్రీనాథ్, హనుమా విహారీ, అభినవ్ ముకుంద్,మైక్ హెస్సన్‌లు మొత్తం పాల్గోనున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ఫ్రాంచైజీ ప్రతినిధులగా వ్యవహరించారు.రిషబ్ పంత్‌కు రూ.33 కోట్లు!ఇక "మెగా వేలం వార్ రూమ్"లో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ భారీ ధర పలికాడు. పంత్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.33 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. పంత్ కోసం కేకేఆర్, పంజాబ్ కింగ్స్ ఆఖరి వరకు తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ పంజాబ్‌కు ప్రతినిథిగా వ్యహరించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఏ మాత్రం వెనక్కుతగ్గలేదు. చివరికి కేకేఆర్ పోటీ నుంచి తప్పుకోవడంతో పంత్ పంజాబ్ సొంతమయ్యాడు. కాగా రియల్ వేలంలో పంత్ తన కనీస ధరను రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నాడు. అయితే పంత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉండడంతో ఈ వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది. పంత్‌కు ఐపీఎల్లో మెరుగైన రికార్డు ఉంది. ఐపీఎల్లో ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడిన ఈ ఢిల్లీ చిచ్చర పిడుగు 148.93 స్ట్రైక్ రేట్‌తో 3284 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో కూడా పంత్ సత్తాచాటాడు. 13 మ్యాచ్‌ల్లో 40 సగటుతో 446 పరుగులు చేశాడు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
వారెవ్వా పంత్.. ఆ షాట్ ఎలా కొట్టావు భయ్యా! వీడియో వైరల్
టెస్టు క్రికెట్లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లపై అదరగొట్టిన పంత్.. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై కూడా అదే దూకుడును కనబరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఓవరాల్‌గా 78 బంతులు ఎదుర్కొన్న పంత్.. 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 పరుగులు చేసి ఔటయ్యాడు.పంత్ స్టన్నింగ్ షాట్..కాగా రిషబ్ తన ఇన్నింగ్స్‌లో సంచలన షాట్‌తో మెరిశాడు. అతడు కొట్టిన షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత ఇన్నింగ్స్ 41 ఓవర్ వేసిన పాట్ కమ్మిన్స్.. చివరి బంతిని రౌండ్ ది వికెట్ నుండి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. వెంటనే పంత్ తన బ్యాటింగ్ పొజిషన్ మార్చుకుని ఎడమవైపునకు వచ్చి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా స్కూప్ షాట్ ఆడాడు.అయితే ఈ షాట్ ఆడే క్రమంలో పంత్ బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. అయినప్పటకి అతడి పవర్‌కు బంతి బౌండరీ లైన్ అవతల పడింది. పంత్ షాట్ చూసి ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు.కామెంటేర్లు కూడా రిషబ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ఎక్స్‌లో షేర్ చేసింది. రిషబ్ పంత్ ఒక్కడే ఈ షాట్ ఆడగలడు అంటూ క్యాప్షన్‌గా ఇచ్చింది.150@ భారత్..ఇక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఆసీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(19), మిచెల్ స్టార్క్(6) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, హర్షిత్ ఒక్క వికెట్ సాధించారు. As only Rishabh Pant can do! 6️⃣#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/vupPuWA8GG— cricket.com.au (@cricketcomau) November 22, 2024 -
నన్ను రిటైన్ చేసుకోకపోవడానికి అది కారణం కాదు: రిషబ్ పంత్
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంతో రిషబ్ వేలంలోకి వచ్చాడు.ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా పంత్ తన పేరును నమోదు చేసుకున్నాడు. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉండడంతో ఈ మెగా వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది.క్లారిటీ ఇచ్చిన పంత్..అయితే ఈ ఏడాది సీజన్లో పంత్ అద్బుతంగా రాణించినప్పటికి ఢిల్లీ ఎందుకు వేలంలోకి విడిచిపెట్టిందో ఎవరికి ఆర్ధం కావడం లేదు. ఢిల్లీ మేనెజ్మెంట్తో విభేదాల కారణంగానే పంత్ బయటకు వచ్చాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.అతడు ఎక్కువ డబ్బు అడిగిన కారణంగానే ఢిల్లీ విడిచిపెట్టిందని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా ఇదే విషయంపై రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనను జట్టులో ఉంచుకోకపోవడానికి డబ్బు కారణం కాదని కచ్చితంగా నేను చెప్పగలను అని ఎక్స్‌లో రిషబ్ పోస్ట్ చేశాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ సపోర్ట్ స్టాప్‌లో సమూల మార్పులు చేసింది. ఢిల్లీ తమ హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని, సౌరవ్ గంగూలీ ప్లేస్‌లో వేణుగోపాల్ రావును క్రికెట్ డైరెక్టర్‌గా నియమించింది. ఇక ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డా వేదికగా జరగనుంది.చదవండి: BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌దే పైచేయి.. ఆసీస్‌కు మరోసారి సవాల్? The curious case of Rishabh Pant & Delhi! 🧐🗣 Hear it from #SunilGavaskar as he talks about the possibility of @RishabhPant17 returning to the Delhi Capitals!📺 Watch #IPLAuction 👉 NOV 24th & 25th, 2:30 PM onwards on Star Sports Network & JioCinema! pic.twitter.com/ugrlilKj96— Star Sports (@StarSportsIndia) November 19, 2024 -
'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఇందుకు అన్నిరకాల ఏర్పాట్లు బీసీసీఐ చేస్తోంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.దీంతో ఫ్యాన్స్ కూడా ఈ వేలం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్యాష్ రిచ్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్‌పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. కానీ ఇప్పుడు అతడి రికార్డు డేంజర్లో ఉందని, పంత్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడని పఠాన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.విడిచిపెట్టిన ఢిల్లీ..ఇక ఈ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ వేలంలో తన పేరును రూ.2 కోట్ల కనీస ధరగా నమోదు చేసుకున్నాడు. పంత్ తన రీ ఎంట్రీలో అదరగొడుతుండడంతో వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసే అవకాశముంది.అతడి కోసం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పోటీ పడే ఛాన్స్ ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. 2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రిషబ్.. ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు తొలిసారి అతడిని వేలంలోకి ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో అందరి కళ్లు పంత్‌పైనే ఉన్నాయి.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం.. -
అతడు క్రీజులో ఉన్నంతవరకూ మేము భయపడ్డాము: అజాజ్ పటేల్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో టీమిండియా వైట్‌వాష్ అయినప్పటికి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అద్బుత ఇన్నింగ్స్‌లతో అందరని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో రిషబ్ విరోచిత పోరాటం కనబరిచాడు.బంతి గింగరాల తిరుగుతున్న చోట కివీస్ స్పిన్నర్లను పంత్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట పంత్ బౌండరీల వర్షం కురిపించాడు. ఓ దశలో భారత్‌ను గెలిపించేలా కన్పించిన పంత్.. ఓ వివాదస్పద నిర్ణయంతో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. దీంతో 25 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ ముగిసి రెండు రోజులు అవుతున్నప్పటికి పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. అతడి సాహసోపేత ఇన్నింగ్స్‌కు న్యూజిలాండ్ ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. పంత్ క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయంట. ఈ విషయాన్ని స్వయంగా ముంబై టెస్టు హీరో అజాజ్ పటేల్ చెప్పుకోచ్చాడు.అజాజ్ పటేల్ తాజాగా ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించినప్పుడు న్యూజిలాండ్ జట్టు భయపడిందా అన్న ప్రశ్న అజాజ్‌కు ఎదురైంది. అవును రిషబ్ క్రీజులో ఉన్నప్పుడు మేముంతా చాలా భయపడ్డాము అని అజాజ్ పటేల్ బదులిచ్చాడు.ఈ సిరీస్‌లో రిషబ్ పంత్‌ను ఎక్కువగా టార్గెట్ చేశాం. అతడు క్రీజులో ఉన్నప్పుడు ఏ బౌలర్‌కు భయపడడు. ఏది ఏమైనా తన ఆట ఆడుతుంటాడు. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు రాబట్టడానికే ప్రయత్నిస్తాడు. అతడు త్వరగా ఔట్ అయితే ఏ సమస్య లేదని అజాజ్ పటేల్ అదే ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
'బుమ్రా, గిల్ కాదు.. టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడే'
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు.ఫలితంగా తొలిసారి సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ గురైంది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. టెస్టులకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం అసన్నమైంది అని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.అయితే రోహిత్ శర్మ భవితవ్యం త్వరలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితంపై ఆధారపడి ఉంది. ఒకవేళ భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించికపోతే హిట్‌మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీజీటీ తర్వాత ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే తదుపరి భారత టెస్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్ బాధ్యతలు చేపడతాడని కైఫ్ జోస్యం చెప్పాడు."ప్రస్తుత భారత జట్టులో రిషబ్ పంత్ మాత్రమే టెస్ట్ కెప్టెన్‌గా పోటీలో ఉన్నాడు. భారత టెస్టు కెప్టెన్ అయ్యే అన్ని రకాల ఆర్హతలు పంత్‌కు ఉన్నాయి. అతడు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టుకు తన వంతు న్యాయం చేస్తున్నాడు. ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా పంత్‌కు ఉంది.ఇప్పటికే ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్‌లు ఆడాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికా వంటి విదేశీ పిచ్‌లపై కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అది స్పిన్ ట్రాక్, పేస్ ట్రాక్ అయినా పంత్ ఒకేలా బ్యాటింగ్ చేస్తాడు" అని తన ఇనాస్టా లైవ్‌లో పేర్కొన్నాడు.కాగా ప్రస్తుతం టెస్టుల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఓసారి రోహిత్ గైర్హజరీలో జట్టును కూడా బుమ్రా నడిపించాడు. ఈ క్రమంలో బుమ్రాను కాదని పంత్‌ను రోహిత్ వారసుడిగా కైఫ్ ఎంచుకోవడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది.చదవండి: Paris Olympics 2024: ఆమె మగాడే.. సంచలన విషయాలు వెలుగులోకి!.. భజ్జీ రియాక్షన్ -
ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌కు రూ. 50 కోట్లు!?
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైన విషయం విధితమే. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఓటమి చవిచూసినప్పటకి.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం తన విరోచిత పోరాటంతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకున్న విలవిల్లాడిన చోట రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ భారత్ డగౌట్లో ఆశలు రేకెత్తించాడు. కానీ అనూహ్యంగా పంత్ ఔట్ కావడంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 57 బంతులు ఎదుర్కొన్న పంత్ 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ సిరీస్ అసాంతం పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 89.38 స్ట్రైక్ రేటుతో పంత్ 261 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ బ్యాటింగ్ టెక్నిక్‌ను బాసిత్ అలీ మెచ్చుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంత్ రూ. 50 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోతాడని అలీ జోస్యం చెప్పాడు.రూ. 50 కోట్లు ఇవ్వాలి.."రిషబ్ పంత్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వికెట్‌పై మిగితా ప్లేయర్లంతా ఇబ్బంది పడితే పంత్ ఒక్కడే ప్రత్యర్ధి బౌలర్లను ఎటాక్ చేశాడు. అతడు ప్లాట్ పిచ్‌పై ఆడుతున్నట్లు బ్యాటింగ్ చేశాడు. అతడి షాట్ సెలక్షన్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే.అతడు ఎటువైపు ఆడాలనుకుంటే ఆటువైపు ఈజీగా షాట్లు ఆడాడు. మిగితా ఆటగాళ్లు పంత్‌లా ఆడలేకపోయారు. రిషబ్ తొలి ఇన్నింగ్స్‌లో 60, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేశాడు. అతడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోతాడు. పంత్ రూ.25 కోట్లకు అమ్ముడుపోతాడని అంతా అనుకుంటున్నారు.కానీ నావరకు అయితే పంత్‌కు రూ. 50 కోట్లు ఇచ్చి తీసుకున్నా తప్పులేదు అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది? -
'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025కు సంబంధించిన ఆటగాళ్ల రిటైన్షన్స్ జాబితాను సమర్పించేందుకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ 31 సాయంత్రం ఐదు గంటల లోపు ఆయా ఫ్రాంచైజీలు వాళ్లు అట్టిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకు అందజేయాల్సి ఉంది.అయితే ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు లిస్ట్‌ను ఖారారు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను మెగా వేలంలోకి విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పంత్ కూడా ఇటీవలే చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. ఐపీఎల్ వేలంలోకి వస్తే నేను అమ్ముడుపోతానా లేదా? ఒకవేళ తీసుకుంటే ఎంతకు అమ్ముడవుతాను’’ అని ఎక్స్‌లో పంత్ పోస్టు చేశాడు. దీంతో పంత్ ఢిల్లీని వీడేందుకు సిద్దమయ్యాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఇదే విషయంపై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు."రిషబ్ పంత్ వేలంలోకి వస్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. చెన్నై సూపర్ కింగ్స్ అతడి కోసం ఎన్ని కోట్లనైనా వెచ్చిస్తోంది. పంత్‌ను మనం ఎల్లో జెర్సీలో చూడబోతున్నాం. అదే విధంగా ధోని ఒక్క ఈ సీజన్లో ఆడే అవకాశముంది.ఆ తర్వాత ధోని నుంచి వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ స్వీకరిస్తాడు అని సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు. కాగా ఎప్పటి నుంచో సీఎస్కేలోకి పంత్ వెళ్లనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఏదమైనప్పటికి పంత్ ఢిల్లీలో కొనసాగుతాడా లేదా తెలియాలంటే అక్టోబర్ 31 వరకు వేచి ఉండాల్సిందే.చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు -
టీమిండియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు డేంజరస్ ప్లేయర్ దూరం!?
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 వెనకంజలో నిలిచింది. ఈ క్రమంలో ఆక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా జరగనున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. అందుకు తగ్గట్టే టీమిండియా మెనెజ్‌మెంట్ వ్యూహాలు రచిస్తోంది. రెండో టెస్టుకు భారత జట్టులో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు చేర్చారు. అంతేకాకుండా పేసర్ ఆకాష్ దీప్‌ను కూడా ఫుణే టెస్టులో ఆడించాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తుందంట.రిషబ్ పంత్ దూరం?ఇక కివీస్ రెండో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలే అవకాశముంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా పుణే టెస్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. మొదటి టెస్టులో పంత్ మోకాలికి గాయమైంది. దీంతో తొలి టెస్టు నాలుగో రోజు ఆట మొత్తానికి పంత్ దూరమయ్యాడు.ఆ తర్వాత భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్(99) అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కానీ పంత్ బ్యాటింగ్‌కు వచ్చినప్పటకి ఇంకా పూర్తి ఫిట్నెస్ మాత్రం సాధించినట్లు కన్పించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసిన పంత్ ఫీల్డింగ్‌కు మాత్రం రాలేదు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ క్రమంలోనే రెండో టెస్టుకు పంత్‌కు విశ్రాంతి ఇవ్వాలని గంభీర్ ఎండ్ కో యోచిస్తున్నట్లు సమాచారం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు అతడిని ఆడించి ఎటువంటి రిస్క్ తీసుకోడదని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: T20 WC 2024: వరల్డ్ ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే? -
వారెవ్వా పంత్.. దెబ్బకు ధోని రికార్డు బద్దలు
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఓ వైపు గాయం బాధపడుతూనే సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన 12వ టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. గాయం కారణంగా మూడో రోజు ఆటకు దూరమైన పంత్.. కీలకమైన నాలుగో రోజు ఆటలో తిరిగి మైదానంలో మళ్లీ అడుగుపెట్టాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి భారత స్కోర్ బోర్డును పంత్ పరుగులు పెట్టిస్తున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన రిషబ్.. నెమ్మదిగా తన బ్యాటింగ్‌లో స్పీడ్‌ను పెంచాడు. 54 పరుగులతో పంత్ ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.ధోని రికార్డు బద్దలుఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన పంత్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకెక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని ఈ మైలు రాయిని 69 ఇన్నింగ్స్‌లలో అందుకోగా.. రిషబ్ కేవలం 62 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! -
టీమిండియాకు గుడ్ న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా మూడో రోజు ఆటకు దూరమైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట సందర్భంగా పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి నాలుగో రోజును పంత్ ప్రారంభించాడు. నిజంగా ఇది భారత్‌కు ఆదిరిపోయే వార్త అనే చెప్పుకోవాలి. పంత్ గాయం తీవ్రమైనది కావడంతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టడని చాలా మంది భావించారు. కానీ పంత్ మాత్రం ఫిజియోల సాయంతో ఫిట్నెస్ సాధించి బ్యాటింగ్‌కు దిగాడు. ప్రస్తుతం భారత్ 53 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(88), పంత్(1) ఉన్నారు. భారత్ ఇంకా 103 పరుగుల వెనకంజలో ఉంది. -
IND vs NZ: భారత్‌కు భారీ షాక్! కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. రెండో రోజు ఆటలో గాయపడ్డ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. మూడో రోజు ఆటకు దూరమయ్యాడు.అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడో రోజు ఆటకు పంత్ మైదానంలో అడుగుపెట్టలేదు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబస్ట్యూట్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు.ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. "పంత్ ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. మూడో రోజు అతడు వికెట్ కీపింగ్‌కు దూరంగా ఉండనున్నాడని" బీసీసీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.అసలేం జరిగిందంటే?కివీస్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతిని కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వచ్చి పంత్ మెకాలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. అయితే తొలి రోజు ఆట అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ పంత్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. ఇటీవల సర్జరీ చేయించుకున్న మోకాలికే గాయం అయిందని, మేం ఎలాంటి రిస్క్ తీసుకోలేమని అన్నాడు. పంత్ ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్నాం అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా వచ్చే నెలలో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుండంతో ముందు జాగ్రత్తగా పంత్‌ను కివీస్ సిరీస్ నుంచి తప్పించే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో కూడా పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి. ఒకవేళ పంత్ దూరమైతే ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రానున్నాడు. జురెల్ ఇప్పటికే తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. UPDATE: Mr Rishabh Pant will not keep wickets on Day 3. The BCCI Medical Team is monitoring his progress.Follow the match - https://t.co/FS97Llv5uq#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank— BCCI (@BCCI) October 18, 2024 -
రిషబ్ పంత్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి పంత్‌ను తప్పించాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు తమ జట్టు పగ్గాల అప్పగించాలని సదరు ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్షర్ గత కొన్ని సీజన్లగా ఢిల్లీ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ప్రతీ సీజన్లోనూ అక్షర్ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లోనూ అక్షర్ పటేల్ అదరగొట్టాడు.14 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లతో పాటు 235 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని తమ కెప్టెన్‌గా నియమించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ ఫిక్స్ అయినట్లు పేర్కొంటున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌ను మాత్రం తమ టాప్ రిటెన్షన్ ప్లేయర్‌గా అంటిపెట్టుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడిని రూ. 18 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకోవడానికి ఢిల్లీ సిద్దంగా ఉందంట. పంత్‌తో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకున్నట్లు వినికిడి.ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ న్యూ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. పంత్‌ను ఢిల్లీ టాప్ రిటెన్షన్‌గా అంటిపెట్టుకోనుంది. అతడి కెప్టెన్సీ ఒత్తడి లేకుండా పూర్తిగా తన ఆటపై దృష్టిపెడతాడని మెనెజ్‌మెంట్ భావిస్తోంది అని ఐపీఎల్ మూలాలు వెల్లడించాయి.చదవండి: IPL 2025: డేల్ స్టెయిన్ సంచలన నిర్ణయం.. ఎస్ఆర్హెచ్కు గుడ్ బై -
రిషబ్ పంత్‌కు ఢిల్లీ షాక్ ఇవ్వనుందా? ట్వీట్ వైరల్
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడిచిపెట్టనుందా? చెన్నైసూపర్ కింగ్స్‌కు పంత్ వెళ్లనున్నాడా? అంటే అవుననే సమాధనామే ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా రిషబ్ పంత్ చేసిన ట్వీట్ కూడా ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది. ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధరకు అమ్ముడు పోతాను? అంటూ రిషబ్ ఎక్స్లోక్రిప్టిక్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో చర్చానీయంశమైంది. ఈ క్రమంలో కొంతమంది ఢిల్లీ ఫ్రాంచైజీని పంత్ వీడనున్నాడని అభిప్రాయపడుతుంటే, మరి కొంత మంది అతడు ఏదో ఫన్నీగా పోస్ట్ చేసి ఉంటాడని చెప్పుకొస్తున్నారు.ఢిల్లీ విడిచిపెట్టనుందా?కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకమైన ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని సీజన్ల నుంచి కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఈ ఏడాది సీజన్లో కూడా పంత్ అదరగొట్టాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఇటువంటి అద్భుత ఆటగాడిని ఢిల్లీ విడిచిపెట్టే సాహాసోపేత నిర్ణయం తీసకుంటుందో లేదో వేచి చూడాలి. ఒకవేళ అతడు వేలంలోకి వస్తే భారీ ధర పలకడం ఖాయం. -
కోహ్లికి సారీ చెప్పిన పంత్.. హగ్ చేసుకుని మరి(వీడియో)
బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు తన బ్యాట్‌ను ఝళిపించాడు. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు.అయితే ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లి సింగిల్ డిజిట్ స్కోర్ పరిమితమయ్యే వాడు. రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బంగ్లా బౌలర్ తెలివి తక్కువ పనికి కోహ్లి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.అసలేం జరిగిందంటే?భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ఖాలీద్ ఆహ్మద్ బౌలింగ్‌లో తొలి బంతిని కోహ్లి కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని తన ఫ్రంట్ప్యాడ్కు తాకుతూ పిచ్ దగ్గరలోనే ఉండిపోయింది. అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న పంత్ రన్‌కు కాల్ ఇవ్వడంతో విరాట్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ పంత్ మాత్రం కాస్త ముందుకు వచ్చి మధ్యలోనే ఆగిపోయాడు. ఈ క్రమంలో బంగ్లా బౌలర్ ఖాలీద్ ఆహ్మద్ వికెట్ కీపర్ ఎండ్‌కు పరిగెత్తి బంతిని అందుకుని స్టంప్స్‌కు త్రో చేశాడు. కానీ బంతి మాత్రం స్టంప్స్‌కు తాకలేదు. అయితే కోహ్లి మాత్రం తన రనౌట్ అని భావించి వెనక్కి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే బంతి స్టంప్స్‌కు తాకలేదో వెంటనే కోహ్లి సేఫ్‌గా క్రీజులోకి వచ్చేచాడు. కాగా బంగ్లా బౌలర్ ఏ మాత్రం సమయస్పూర్తి ఉపయెగించలేదు.స్టంప్స్ దగ్గరకు వెళ్లి పడగొట్టే అంతసమయం ఉన్నప్పటకి దూరం నుంచి త్రో చేసి కోహ్లికి లైఫ్ ఇచ్చేశాడు. దీంతో బంగ్లా ఆటగాళ్లు మొత్తం నిరాశలో కూరుకుపోయారు. పంత్ మాత్రం కోహ్లి దగ్గరకు వచ్చి హాగ్ చేసుకుని మరీ సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Luck favours the brave🫨Kohli survives to hug it out with Pant in the middle! 😍#IDFCFirstBankTestSeries #JioCinemaSports #INDvBAN pic.twitter.com/XVDyR0ffD3— JioCinema (@JioCinema) September 30, 2024 -
'గిల్, బుమ్రా, రాహుల్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్'
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దాదాపు 600 రోజుల తర్వాత టెస్టు క్రికెట్లో పునరాగమనం చేసిన రిషబ్.. తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.టెస్టుల్లో 6వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రిషబ్ పంత్ 2022 డిసెంబర్లో ఘోరమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. దాదాపు ప్రాణాలు పోగొట్టుకునే స్థితి నుంచి అతను కోలుకున్న తీరు నమ్మలేనిది. కేవలం రెండేళ్లలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి దుమ్ములేపుతున్న పంత్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.వసీం అక్రమ్ వంటి దిగ్గజాలు సైతం ఈ ఢిల్లీ ఆటగాడిని పొగడ్తలతో ముంచెత్తాడు. పంత్‌ను మిరాకిల్ కిడ్ అని వసీం కొనియాడాడు. తాజాగా ఈ జాబితాలోకి మరో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేరాడు. భారత జట్టులో వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారని, భవిష్యత్తులో భారత టెస్టు జట్టును పంత్ లీడ్ చేస్తాడని కనేరియా జోస్యం చెప్పాడు."ప్రస్తుత భారత జట్టును చూస్తుంటే ముచ్చటేస్తోంది. జట్టు విజయాల్లో ప్రతీ ప్లేయర్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి అద్భతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే భారత్ ప్రపంచ స్థాయి జట్టుగా నిలిచింది. రిషబ్ పంత్ భవిష్యత్తులో టెస్టుల్లో భారత జట్టుకు కచ్చితంగా సారథ్యం వహిస్తాడు. అతడు పునరాగమనం తర్వాత చాలా బాగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్‌గా అతడు ఎప్పుడూ బౌలర్లు, ఫీల్డర్లతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేయడంతో మైదానంలో అందరూ చురుగ్గా ఉంటారు. నిజంగా భారత క్రికెట్ నుంచి బుల్లెట్ వంటి చురుకైన ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు" అని ఐఎఎన్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు. -
పంత్‌కు అలా జరిగినప్పుడు.. పాక్‌లోనూ భయపడ్డాము: వసీం అక్రమ్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన టెస్టు క్రికెట్ రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్న సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పంత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తనదైన స్టైల్లో బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. టెస్టుల్లో తనొక బ్రాండ్ అని మరోసారి రిషబ్ నిరూపించుకున్నాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భయంకరమైన కారు ప్రమాదం నుంచి కోలుకుని మళ్లీ తన మార్క్ చూపించిన పంత్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ చేరాడు. పంత్ తిరిగి రావడంతో ఆస్ట్రేలియా జట్టు జాగ్రత్తగా ఉండాలని అక్రమ్ హెచ్చరించాడు."రిషబ్ పంత్ ఆటను చూస్తుంటే సూపర్ మ్యాన్‌లా అద్భుతం చేశాడన్పిస్తోంది. అంతటి ప్రమాదం నుంచి కోలుకుని అతడు రీ ఎంట్రీ ఇవ్వడం చాలా గ్రేట్. అతడి కారు ప్రమాదం జరిగిన తీరును చూసి పాకిస్తాన్లో మేమంతా ఆందోళన చెందాము. అందులో నేను కూడా ఉన్నాను.అతడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ కూడా చేశాను. టెస్టుల్లో పంత్ ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆస్ట్రేలియా గడ్డపై అతడి సెంచరీ, ఇంగ్లండ్‌పై బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ఒక అద్భుతం. ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం పంత్ రివర్స్ స్వీప్ ఆడాడు. ఇందులో అతడిని మించినవారే లేరు.రోడ్డు ప్రమాదం తర్వాత ఎవరైనా సరే కోలుకోవడానికి చాలా రోజుల సమయం పడుతోంది. మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. కానీ అందుకు భిన్నంగా పంత్ మాత్రం చాలా తక్కువ వ్యవధిలోనే తన ఫిట్నెస్ను సాధించాడు. పంత్ కథను తరతరాలు గుర్తు పెట్టుకుంటాయి. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఐపీఎల్ రీఎంట్రీలోనూ సత్తాచాటాడు. 40కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లోనూ రాణించాడు. అనంతరం తనకు ఇష్టమైన రెడ్‌బాల్ క్రికెట్లోనూ మెరిశాడు. పంత్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ మరింత రసవత్తరంగా మారడం ఖాయమనిపిస్తోంది. అతడిని ఆపేందుకు ఆసీస్ ఇప్పటి నుంచే వ్యూహాలను రచించాలని " అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
చరిత్ర సృష్టించిన పంత్.. ఎంఎస్ ధోని రికార్డు సమం
టీమిండియా కీపర్ రిషబ్ పంత్ తన టెస్టు క్రికెట్ రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్భుతమైన శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో రాణించిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సూపర్ సెంచరీతో చెలరేగాడు. టీ20 క్రికెట్‌ను తలపిస్తూ బంగ్లా బౌలర్లను ఊతికారేశాడు. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌తో కలిసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 128 బంతులు ఎదుర్కొన్న రిషబ్.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. పంత్‌కు ఇది ఆరువ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో పంత్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఎంఎస్ ధోని రికార్డు సమం..టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోని రికార్డును పంత్ సమం చేశాడు. ధోనీ 90 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరుకోగా, పంత్ కేవలం 34 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు. మరో సెంచరీ చేస్తే ధోనిని పంత్ అధిగమిస్తాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ ముందు భారత్ 515 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లా.. 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే ఇంకో 357 పరుగులు అవసరం.చదవండి: 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!WELCOME BACK TO TEST CRICKET, RISHABH PANT! 🙌🏻💯#RishabhPant #INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/C4gJuv29Y1— JioCinema (@JioCinema) September 21, 2024 -
స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడి
భారత క్రికెటర్ రిషబ్ పంత్ సాఫ్ట్వేర్ సేవలందించే కంపెనీలో రూ.7.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. టెక్‌జాకీ అనే సాఫ్ట్వేర్ విక్రేతలకు సాయం చేసే కంపెనీ రూ.370 కోట్ల మూలధనాన్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ప్రణాళికలపై ఆసక్తి ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కంపెనీ సమీకరించాలనుకునే మొత్తంలో రెండు శాతం వాటాను సమకూర్చారు.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫోర్స్పాయింట్ గ్లోబల్ సీఈఓ మానీ రివెలో కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకులు ఆకాష్ నంగియా తెలిపారు. అయితే మానీ ఎంత ఇన్వెస్ట్ చేశారోమాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా నంగియా మాట్లాడుతూ..‘కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించాం. ముందుగా రూ.410 కోట్లు సేకరించాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల 10 శాతం తగ్గించి రూ.370 కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తాజాగా సమకూరిన నిధులతో మార్కెటింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. యూఎస్‌లో కంపెనీని విస్తరించడానికి ఈ నిధులు తోడ్పడుతాయి’ అని చెప్పారు.ఆకాష్ నంగియా గతంలో జొమాటో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. మెకిన్సేలో పని చేసిన అర్జున్ మిట్టల్ సాయంతో 2017లో టెక్‌జాకీ సాఫ్ట్వేర్ అగ్రిగేటర్ స్టార్టప్ కంపెనీను స్థాపించారు. ఇది దేశంలోని చిన్న వ్యాపారాల కోసం సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు సాయపడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. టెక్‌జాకీ మైక్రోసాఫ్ట్, అడాబ్, ఏడబ్ల్యూఎస్, కెక, ఫ్రెష్‌వర్క్స్, మైబిల్ బుక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు రూ.125 కోట్లు ఆదాయాన్ని సంపాదించినట్లు అధికారులు తెలిపారు. 2024-25లో ఇది రూ.170-180 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?ఇటీవల కేఎల్ రాహుల్ మెటామ్యాన్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జులైలో భారత్‌కు చెందిన న్యూట్రిషన్ సప్లిమెంట్ బ్రాండ్ ‘సప్లై6’లో ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో శ్రేయాస్ అయ్యర్ హెల్త్‌టెక్ ప్లాట్‌ఫామ్ ‘క్యూర్లో’లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. -
అతడొక అద్భుతం.. టెస్టు క్రికెట్ లెజెండ్ అవుతాడు: గంగూలీ
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో పునరాగమానికి సిద్దమయ్యాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో పంత్‌కు చోటు దక్కింది. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత పంత్ ఆడనున్న తొలి టెస్టు సిరీస్ ఇదే. ఈ నేపథ్యంలో పంత్‌పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ ప్లేయర్లలో ఒకరిగా పంత్ నిలుస్తాడని దాదా కొనియాడాడు. ఒత్తడిలో కూడా పంత్ అద్బుతంగా ఆడుతాడని తాజాగా ఓ కార్యక్రమంలో గంగూలీ చెప్పుకొచ్చాడు."రిషబ్ పంత్‌ను భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్‌గా భావిస్తున్నాను. అతడు ఇప్పటికే రెడ్ బాల్ క్రికెట్లో ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. పంత్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. టెస్ట్ క్రికెట్లో కచ్చితంగా ఆల్ టైమ్ గ్రేట్ అవుతాడు. అయితే వైట్ బాల్ క్రికెట్లో అతడు కాస్త మెరుగవ్వాలి" సౌరవ్ పేర్కొన్నాడు. కాగా వైట్ బాల్ ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో పంత్‌కు మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా 2020-21లో ఆస్ట్రేలియా పర్యటలో పంత్ ఆడిన ఇన్నింగ్స్‌లు ఎప్పటకి చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.గబ్బాలో ఆడిన మ్యాచ్ విన్నింగ్ నాక్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇప్పుడు మళ్లీ టెస్టుల్లో పంత్ రీఎంట్రీ ఇవ్వడం భారత జట్టు కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. కాగా బంగ్లాతో సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. -
కుల్దీప్ భాయ్‌తో అంత ఈజీ కాదు.. వారిద్దరి వల్లే ఇదంతా: సెంచరీ హీరో
దేశీవాళీ క్రికెట్లో ముంబై యువ బ్యాటర్, భారత క్రికెటర్ సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా బి జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్న ముషీర్.. భారత బి జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ ‘బి’ 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ముషీర్ ఒంటరి పోరాటం చేశాడు. తన విరోచిత పోరాటంతో జట్టును అదుకున్నాడు. నవ్‌దీప్ సైనీ అండతో ముషీర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ‘బి’ జట్టు 79 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (227 బంతుల్లో 105; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు సైనీ (74 బంతుల్లో 29 ; 4 ఫోర్లు, ఒక సిక్సర్) నాటౌట్‌గా నిలిచాడు.ఇక తొలి రోజు ఆట తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముషీర్.. తన సెంచరీ క్రెడిట్‌ను భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్‌కు ఇచ్చాడు. "నేను కుల్దీప్ యాదవ్‌కు ప్రత్యర్ధిగా ఆడటం ఇదే రెండో సారి. అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్ అని మనకు తెలుసు. కుల్దీప్ భాయ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కానీ మా జట్టులో రిషబ్ పంత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. రిషబ్ భాయ్‌తో పాటు శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్ కంటే ముందు నాకు కొన్ని సూచనలు చేశారు. కుల్దీప్ భాయ్ వేసిన బంతుల్లో ఏది అత్యంత ప్రభావవంతంగా ఉంటుందో వారు నాకు చెప్పారు. అతడి బౌలింగ్‌లో ఏ బంతులను ఎటాక్ చేయాలో నాకు వారిద్దరూ వివరించారు. దీంతో నేను క్రీజులో సెట్ అయ్యాక అతడిని సులభంగా ఎదుర్కొన్నాను" అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు. -
అందుకే రిషబ్ భయ్యా పెళ్లి చేసుకోవడం లేదు.. ఊర్వశిపై దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అక్కర్లేదు. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఊర్వశి చివరిసారిగా బాలీవుడ్లో గుస్పైతియా చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చిత్రంలో కనిపించనుంది ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా.. తాను ఆస్పత్రిలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన చేతికి అయిన గాయాన్ని చూపిస్తూ తన కోసం ప్రార్థించండి అంటూ పోస్ట్ చేసింది.అయితే ఊర్వశి రౌతేలా పోస్ట్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అంత చిన్న మైనర్ గాయానికి ఆస్పత్రిలో ఎందుకు అడ్మిట్ అయ్యారని నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ వీడియోపై ఒకరు స్పందిస్తూ.. వేలికి చిన్న గాయంతో ఆసుపత్రిలో చేరిన మొదటి భారతీయ మహిళ అని ఫన్నీగా కామెంట్స్ చేశాడు. మరొకరు అంతర్జాతీయ స్థాయిలో గాయపడిన మొదటి భారతీయ మహిళ ఊర్వశి అని రాసుకొచ్చాడు. ఇంత చిన్న గాయానికి ఏకంగా ఆక్సిజన్ తీసుకుంటున్నారా? అసలేంటి నాన్సెన్స్ అంటూ కామెంట్ చేశాడు. ఇలాంటి ప్రవర్తన కారణంగానే రిషబ్ భాయ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం లేదంటూ ఓ నెటిజన్ రాశారు. అయితే నెటిజన్ల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో బాలీవుడ్ భామ ఆశ్చర్యపోయింది.అంతేకాకుండా తనపట్ల మీడియాలో వస్తున్న వార్తలపై ఊర్వశి రౌతేలా మండిపడింది. త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు చెప్పే బదులు.. తనపై అన్ని హద్దులు దాటి ప్రవర్తించడంతో నిరాశకు గురయ్యానని తెలిపింది. ఇటువంటి విపరీతమైన, అగౌరవపరిచే సంస్కృతి సమాజంలో అత్యాచారం లాంటి దారుణమైన చర్యలకు పునాదిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ వార్త ప్రచురించిన క్లిప్‌ను కూడా షేర్ చేసింది ముద్దుగుమ్మ. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
టీమిండియాకు మరో బౌలర్.. స్పిన్నర్‌గా మారిన పంత్(వీడియో)
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ స్పిన్నర్‌గా సరికొత్త అవతరమెత్తాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో పురాణి డిల్లీ 6 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పంత్.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ చేసి అందరని ఆశ్చర్చపరిచాడు. ఢిల్లీ సూపర్‌స్టార్జ్ విజయానికి ఒక్క పరుగు అవసరమైన సమయంలో పంత్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. అయితే మొదటి బంతికే ఢిల్లీ సూపర్‌స్టార్జ్ విజయం సాధించడంతో పంత్‌కు తన ఓవర్‌ను పూర్తి చేసే అవకాశం లభించలేదు.కేవలం ఒక్క బాల్ మాత్రమే రిషబ్ బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భారత క్రికెట్‌కు మరో బౌలర్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా హెడ్ కోచ్ గంభీర్ నేతృత్వంలో ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ వంటి వారు పార్ట్‌టైమ్ బౌలర్లగా మారారు. రాబోయే మ్యాచ్‌ల్లో పంత్ కూడా బౌలింగ్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పురాణి డిల్లీపై 3 వికెట్ల తేడాతో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పురాణి డిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పురాణి ఢిల్లీ బ్యాటర్లలో అర్పిత్ రాణా(59) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వన్స్ బేడి(47), పంత్(35), లలిత్ యాదవ్(34) పరుగులతో రాణించారు.అనంతరం 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఢిల్లీ.. 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సౌత్ ఢిల్లీ బ్యాటర్లలో పియూన్ష్ ఆర్య(57), ఆయూష్ బదోని(57) హాఫ్ సెంచరీలతో మెరిశారు.Rishabh pant bowling 😸🔥pic.twitter.com/QvM7tFZLcu— 𝓱 ¹⁷ 🇮🇳 (@twitfrenzy_) August 17, 2024 -
అతడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్: సౌరవ్ గంగూలీ
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భవితవ్యంపై అనేక ఊహగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో పంత్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.వచ్చే ఏడాది సీజన్లో సీఎస్కే పంత్ ఆడనున్నాడని కొంతమంది క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. తాజాగా ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరక్టర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. పంత్‌పై వస్తున్న వార్తలన్ని అవాస్తవమని దాదా కొట్టి పారేశాడు. వచ్చే ఏడాది సీజన్లో పంత్ తమ జట్టులో ఉంటాడని, అతడే తమ కెప్టెన్‌గా కొనసాగుతాడని ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన దాదా స్పష్టం చేశాడు. కాగా దాదాపు 16 నెలల పాటు రోడ్డు ప్రమాదం కారణంగా క్రికెట్‌కు దూరమైన పంత్.. ఐపీఎల్ 2024తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే పంత్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటకి.. జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 446 పరుగులతో ఢిల్లీ తరపున టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌పై వేటు వేసింది. క్రికెట్ డైరక్టర్‌గా ఉన్న గంగూలీనే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. -
లంకతో మూడో వన్డే.. రాహల్‌పై వేటు! టీమిండియాలోకి విధ్వంసకర ఆటగాడు?
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం తమ మార్క్‌ను చూపించలేకపోతుంది. తొలి వన్డేలో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా టై చేసుకున్న భారత్.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో అనుహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. బుధవారం కొలంబో వేదికగా మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఆఖరి మ్యాచ్‌లోనూ తమ జోరుని కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా భారత్‌పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచి దాదాపు 27 ఏళ్లు కావస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేల్లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయిన కేఎల్ రాహుల్, శివమ్ దూబేపై జట్టు మెనెజ్‌మెంట్ వేటు వేయనున్నట్లు సమాచారం. వారిద్దరి స్ధానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌లకు చోటు ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ల వెనక కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో వన్డేలో ఈజీగా క్యాచ్‌లు విడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్‌ను బరిలోకి దించాలని గంభీర్, రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. -
శ్రీలంకతో రెండో వన్డే.. భారత తుది జట్టు ఇదే! పరాగ్ అరంగేట్రం?
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే టై అయిన సంగతి తెలిసిందే. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను భారత్ టైగా ముగించింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన నేపథ్యంలో భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ టై అయింది. అయితే తొలి వన్డేలో చేసిన చిన్న చిన్న తప్పిదాలను రెండో వన్డేలో పునరావృతం చేయకూడదని భారత జట్టు యోచిస్తోంది. ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న రెండో వన్డేలో మాత్రం ఎలాగైనా గెలిచి సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓ కీలక మార్పుతో బరిలోకి దిగనున్నట్లుట్లు తెలుస్తోంది. కొలంబో వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు ఛాన్స్ ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్ధానంలో పరాగ్ తుది జట్టులో వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రిషబ్ పంత్‌కు మరోసారి నో ఛాన్స్..?ఇక ఈ మ్యాచ్‌కు కూడా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వన్డేల్లో పంత్ కంటే కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉండడంతో అతడి వైపే జట్టు మెనెజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు వినికిడి.వన్డేల్లో రాహుల్‌కు 50పైగా సగటు ఉంది. అయితే దాదాపు 8 నెలల తర్వాత భారత జట్టులోకి రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో రాహుల్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. టైగా ముగిసిన మ్యాచ్‌లో రాహుల్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
పంత్ కీలక నిర్ణయం.. ఆ లీగ్‌లో ఆడనున్న ఢిల్లీ చిచ్చర పిడుగు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ భాగం కానున్నాడు. ఈ లీగ్‌లో పురాణి ఢిల్లీ 6 ఫ్రాంచైజీ తరపున పంత్ ఆడనున్నాడు. అతడితో పాటు భారత వెటరన్ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా పురాణి ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ ఢిల్లీ ఆటగాళ్లు హర్షిత్ రాణా, ఆయుష్ బడోనీ, అనుజ్ రావత్, యశ్దయాల్లు కూడా డీపీఎల్‌లో ఆడనున్నారు. తాజాగా డీపీఎల్‌లో పాల్గోనే ఆటగాళ్ల డ్రాఫ్ట్ జాబితాను ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. అయితే ఈ అరంగేట్ర సీజన్‌కు ఢిల్లీ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా ఈ టోర్నీకి మయాంక్ దూరంగా ఉండనున్నాడు. మయాంక్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇక ఈ డీపీఎల్ తొట్ట తొలి ఎడిషన్ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురాణి డిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఫ్రాంచైజీలు రూ. 49.65 కోట్ల రూపాయలకు విక్రయించబడ్డాయి.సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్: ఆయుష్ బదోని, కులదీప్ యాదవ్, ప్రియాంష్ ఆర్య, సుమిత్ మాథుర్, దివిజ్ మెహ్రా, కున్వర్ బిధురి, దిగ్వేష్ రాఠీ, తేజస్వి దహియా, రాఘవ్ సింగ్, సౌరభ్ దేస్వాల్, సార్థక్ రే, లక్షయ్ సెహ్రావత్, తరుణ్ బిష్త్, శుభ్ పన్బే, శుభమ్ పన్బే, శుభమ్ పన్. సింగ్, మయాంక్ గుప్తా, అన్షుమాన్ హుడా, అనిందో నహరాయ్, దీపాంశు గులియాతూర్పు ఢిల్లీ రైడర్స్: అనుజ్ రావత్, సిమర్జీత్ సింగ్, హిమ్మత్ సింగ్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, వైభవ్ శర్మ, మయాంక్ రావత్, సమర్థ్ సేథ్, ప్రణవ్ పంత్, సుజల్ సింగ్, హార్దిక్ శర్మ, రౌనక్ వాఘేలా, అగ్రిమ్ శర్మ, శంతను సింగ్, భగవాన్, భగవాన్, భగవాన్ చౌదరి, సాగర్ ఖత్రి, శివమ్ కుమార్ త్రిపాఠి, రిషబ్ రాణా, లక్షయ సాంగ్వాన్సెంట్రల్ ఢిల్లీ కింగ్స్: యశ్ ధుల్, ప్రిన్స్ చౌదరి, హితేన్ దలాల్, జాంటీ సిద్ధు, లక్షయ్ థరేజా, యోగేష్ శర్మ, మనీ గ్రేవార్, కేశవ్ దాబాస్, శౌర్య మాలిక్, సౌరవ్ దాగర్, ఆర్యన్ రాణా, సిద్ధాంత్ బన్సల్, రజనీష్ దాదర్, సుమిత్ కుమార్, కౌశల్ సుమన్, దీప్ బల్యాన్, విశాంత్ భాటి, ధ్రువ్ కౌశిక్, అజయ్ గులియానార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్: హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, ప్రన్షు విజయరన్, వైభవ్ కంద్పాల్, క్షితిజ్ శర్మ, వైభవ్ రావల్, యష్ దాబాస్, ప్రణవ్ రాజ్‌వంశీ, మనన్ భరద్వాజ్, యశ్ భాటియా, యతీష్ సింగ్, అమన్ భారతి, యజాస్ శర్మ, సార్థక్ చోరంద్, అనిరుధ్ రంజన్, అనిరుద్ , యథార్త్ సింగ్, సిద్ధార్థ సోలంకి, ధ్రువ్ చౌహాన్, యువరాజ్ రాఠీవెస్ట్ ఢిల్లీ లయన్స్: హృతిక్ షోకీన్, నవదీప్ సైనీ, దేవ్ లక్రా, దీపక్ పునియా, శివంక్ వశిష్త్, అఖిల్ చౌదరి, ఆయుష్ దోసెజా, క్రిష్ యాదవ్, అన్మోల్ శర్మ, యుగల్ సైనీ, అంకిత్ రాజేష్ కుమార్, వివేక్ యాదవ్, ఆర్యన్ దలాల్, మసాబ్ ఆలం, ఏకాంష్ దోబల్, శివం గుప్తా, యోగేష్ కుమార్, సూర్యకాంత్ చౌహాన్, తిషాంత్ దబ్లా, అబ్రహీం అహ్మద్ మసూదిపురాణి డిల్లీ 6: లలిత్ యాదవ్, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా, శివం శర్మ, ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్, మయాంక్ గుసేన్, సనత్ సాంగ్వాన్, అంకిత్ భదానా, యుగ్ గుప్తా, కేశవ్ దలాల్, ఆయుష్ సింగ్, కుష్ నాగ్‌పాల్, సుమిత్ ఛికారా, అర్నవ్ బుగ్గారా బేడీ, మంజీత్, యష్ భరదవాజ్, సంభవ్ శర్మ, లక్ష్మణ్ -
IND vs SL: శ్రీలంకతో తొలి వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం! పంత్‌కు నో ఛాన్స్
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డేలకు సిద్దమైంది. భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ రేపటి(ఆగస్టు 2) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే కొలంబో వేదికగా శుక్రవారం జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కేవలం ఆరు వన్డేల్లో మాత్రమే పాల్గోనుంది. దీంతో ఈ సిరీస్‌ను ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలని హెడ్‌కోచ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు భావిస్తోంది.హర్షిత్ రానా అరంగేట్రం.. ఇక తొలి వన్డే విషయానికి వస్తే భారత తరపున యువ పేసర్ హర్షిత్ రానా అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. లంకతో జరిగే తొలి వన్డేకు భారత తుది జట్టులో రానాకు చోటు ఇవ్వాలని టీమిండియా మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.ఐపీఎల్-2024 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు తొలి సారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. మరోవైపు అతడితో పాటు రియాన్ పరాగ్ సైతం వన్డేల్లో డెబ్యూ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్‌రౌండ్ స్కిల్స్‌ను పరిగణలోకి తీసుకుని పరాగ్‌కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వినికిడి. మరోవైపు గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. మరోవైపు తొలి మ్యాచ్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.శ్రీలంకతో తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్. -
IPL 2025: రిషబ్ పంత్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. !?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌పై వేటు వేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు కెప్టెన్ రిషబ్ పంత్‌ను కూడా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు పంత్‌ను రిటైన్ చేసుకోడదని ఢిల్లీ భావిస్తున్నట్లు సమాచారం. పంత్‌కు ఢిల్లీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మద్దతు ఉన్నప్పటికీ.. ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం అతడిని విడిచి పెట్టే అవకాశముందని దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్లు పేర్కొంది.అదేవిధంగా పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు నుంచి విడుదల చేస్తే.. అతడిని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశముందని సదరు పత్రిక పేర్కొంది.సీఎస్కే వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని వచ్చే ఏడాది సీజన్లో ఆడుతాడాలేదన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ కావాలని సీఎస్కే ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పంత్ కెప్టెన్సీపై కూడా ఢిల్లీ ఫ్రాంచైజీ ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది సీజన్‌కు రోడ్డు ప్రమాదం కారణంగా దూరంగా ఉన్న రిషబ్. . ఈ ఏడాది సీజన్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.అయితే పంత్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటకి.. జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని విడిచిపెట్టాలని ఢిల్లీ నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రిషబ్.. ఐపీఎల్లో ఢిల్లీ తరపున లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. -
T20 World Cup 2024: పాక్ పేసర్ల విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (జూన్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. వరుణుడి అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాక్ పేసర్ల ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లు కూడా ఆడకుండానే 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 12; ఫోర్, సిక్స్), అక్షర్ పటేల్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) రెండంకెల స్కోర్ చేయగలిగారు. విరాట్ కోహ్లి (3 బంతుల్లో 4; ఫోర్), సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 7; ఫోర్), శివమ్ దూబే (9 బంతుల్లో 3), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 12; ఫోర్), రవీంద్ర జడేజా (0), అర్ష్‌దీప్ సింగ్ (13 బంతుల్లో 9; ఫోర్), బుమ్రా (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్ -
వారెవ్వా అర్ష్‌దీప్.. ఏమైనా బాల్ వేశాడా? చూస్తే మైండ్ బ్లాంక్
టీ20 వరల్డ్‌కప్-2024 ప్రధాన టోర్నీకు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా సత్తాచాటింది. న్యూయర్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 60 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా 40(నాటౌట్) పరుగులతో రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగల్గింది.సూపర్ డెలివరీ..ఇక ఈ వార్మాప్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్‌ను అర్ష్‌దీప్ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. బంగ్లా ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ తొలి బంతిని లిటన్ దాస్‌కు బ్యాకప్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆఫ్‌సైడ్ పడిన బంతి ఒక్కసారిగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అర్ష్‌దీప్ వేసిన బంతికి లిటన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది.ఇది చూసిన లిటన్ దాస్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు అర్ష్‌దీప్ ప్రధాన టోర్నీలో కూడా కొనసాగించాలని కామెంట్లు చేస్తున్నారు.pic.twitter.com/Co5twCgaJc— Reeze-bubbly fan club (@ClubReeze21946) June 1, 2024 -
క్రికెటర్ కావాలన్నది మా నాన్న కల.. చాలా సంతోషంగా ఉంది: పంత్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. దాదాపు 14 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడగుపెట్టిన రిషబ్.. ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించిన పంత్.. ఆ జట్టు తరపున లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ ఏడాది సీజన్లో ఓవరాల్‌గా 13 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. పునరాగమనంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పంత్‌కు టీ20 వరల్డ్‌కప్-2024 భారత జట్టులో సైతం సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న ఈ ఢిల్లీ డైనమెట్.. వరల్డ్‌కప్‌నకు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు శిఖర్ ధావన్ టాక్ షో 'ధావన్ కరేంగే'లో రిషబ్ పాల్గోనున్నాడు. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలను పంత్ పంచుకున్నాడు. తనను క్రికెటర్‌గా చూడాలన్న తన తండ్రి కలను నేరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని పంత్ చెప్పుకొచ్చాడు. నేను క్రికెటర్ కావాలనేది మా నాన్న కల. మా నాన్న కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్ని కావాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న నాకు 14వేల విలువైన బ్యాట్‌ని బహుమతిగా ఇచ్చాడు. అయితే మా అమ్మకు మాత్రం చాలా కోపం వచ్చింది అంటూ నవ్వుతూ" పంత్ పేర్కొన్నాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్..
ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.ఈ ఏడాది సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు."ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్‌లో మా జట్టు కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. అతడు గత రెండు సీజన్ల నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీకి వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో కూడా చాలా అనుభవం ఉంది. గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. కెప్టెన్సీ చేసే అవకాశం రావడంతో అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ దూరం కావడం మా దురదృష్టం. మేము అతడి బ్యాన్పై అప్పీల్ చేశాము. కానీ ఫలితం మాత్రం మాకు అనుకూలంగా రాలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాంటింగ్ పేర్కొన్నాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. రిషబ్ పంత్‌పై సస్పెన్షన్ వేటు
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా రూ. 30 లక్షల జరిమానా కూడా విధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. ఢిల్లీ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఇది మూడో సారి. అయితే ఐపీఎల్ నియమావళి ప్రకారం వరుసగా మూడో సారి స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్‌పై 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతో పాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఏప్రిల్ 4న వైజాగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు రిషబ్ పంత్‌కు రూ.24 లక్షల జరిమానా విధించారు. అంతకుముందు వైజాగ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించిన పంత్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి నియమావళి ఉల్లంఘించినందుకు పంత్‌పై ఐపీఎల్ మెనెజ్‌మెంట్ చర్యలు తీసుకుంది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌కు పంత్ దూరం కానున్నాడు. కాగా ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఆర్సీబీతో జరిగే మ్యాచ్ చాలా కీలకం. -
IPl 2024 DC Vs RR: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్‌పై ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ 86 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. మిగితా బ్యాటర్ల నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లు రాకపోవడంతో రాజస్తాన్ ఓడిపోయింది. ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ తలా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్ పటేల్, రసిఖ్ దార్ సలామ్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
ఢిల్లీతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ బౌలర్ రీ ఎంట్రీ! తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో మరో కీలక పోరుకు తెరలేచింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమైన పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు కేకేఆర్ రెండు మార్పులు చేసింది. తుది జట్టులోకి మిచెల్ స్టార్క్, వైభవ్ ఆరోరా వచ్చారు. ఇక పాయింట్ల పట్టికలో కేకేఆర్ రెండో స్ధానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ ఆరో స్ధానంలో ఉంది.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్ -
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. టీమిండియా వైస్ కెప్టెన్‌గా పంత్!?
టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తమ జట్టును మే 1న ప్రకటించనుంది. ఇక ఇప్పటికే వరల్డ్‌కప్ కోసం తుది జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్‌కప్ జట్టు ఎంపిక చేసే క్రమంలో బీసీసీఐ సెలక్టర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు అప్పగించేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రోహిత్ డిప్యూటీగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాపై సెలక్టర్లు వేటు వేసినట్లు సమాచారం. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు హార్దిక్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక 14 నెలల తర్వాత తిరిగి రీ ఎంట్రి ఇచ్చిన రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో పంత్ ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లలో 371 పరుగులు చేశాడు. కెప్టెన్సీ పరంగా కూడా పంత్ ఆకట్టుకుంటున్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది. -
Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
30, డిసెంబర్ 2002.. ఘోర రోడ్డు ప్రమాదం.. చావుకు సమీపంగా వెళ్లి అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్న రోజు.. 23 మార్చి, 2024.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోజు.. ఈ రెండు ఘటనల మధ్య దాదాపు 15 నెలల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో బాధ, వేదన ఉంది. జీవితంతో పోరాడిన సంఘర్షణ ఉంది. బతికితే చాలు.. ఆట గురించి అసలు ఆలోచనేరాని క్షణం నుంచి వేలాది మంది సమక్షంలో మళ్లీ క్రికెట్ ఆడగలిగే అవకాశం రావడం వరకు ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసిన అద్భుతం ఉంది. అన్నింటికి మించి ఆ మనిషి నరనరాల్లో పట్టుదల ఉంది.అదే పట్టుదల, అదే పంతం అతడిని మళ్లీ నిలబెట్టింది. అసలు ఆడగలడా అనుకున్న సగటు భారత క్రికెట్ అభిమానులంతా అతడిని గ్రౌండ్లో చూస్తూ సంతోషంగా ఆహ్వానించిన క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ యువకుడే 26 ఏళ్ల రిషభ్ పంత్. భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న దశలో జరిగిన కారు ప్రమాదం పంత్ కెరీర్‌కు చిన్న కామా పెట్టింది. కానీ అతను ఈ సవాల్‌ను స్వీకరించి మళ్లీ అగ్రశ్రేణి మ్యాచ్‌లు ఆడే వరకు రావడం అసాధారణం. అతని పునరాగమనం స్ఫూర్తిదాయకం. భారత క్రికెట్లో రిషభ్ పంత్ ఒక సంచలనం. దూకుడైన ఎడమ చేతి వాటం బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌గా 2016 అండర్–19 ప్రపంచకప్‌లో సత్తా చాటడంతో అతనేంటో అందరికీ తెలిసింది. వేగవంతమైన అర్ధ సెంచరీ, సెంచరీలతో అతను చెలరేగాడు. భారత్ టైటిల్ గెలుచుకోకపోయినా మనకు దక్కిన సానుకూల ఫలితాల్లో పంత్ వెలుగులోకి రావడం ఒకటి. అతని ప్రదర్శన ఊరికే పోలేదు. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతడిని తమ జట్టులోకి తీసుకుంది. మరో వైపు ఢిల్లీ రంజీ టీమ్‌లో కూడా రెగ్యులర్ సభ్యుడిగా మారిన అతను కెప్టెన్సీ బాధ్యతలనూ తీసుకున్నాడు.ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో 32 బంతుల్లో పంత్ కొట్టిన రికార్డు సెంచరీ అతని స్థాయిని పెంచింది. ఆ జోరు చూసిన ఢిల్లీ ఐపీఎల్ టీమ్ మరే ఆలోచన లేకుండా అతణ్ణి జట్టులో కొనసాగించింది. ఇన్ని సీజన్లు ముగిసినా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను అదే జట్టుతో ఉండటం విశేషం. 2017లో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తండ్రి ఆకస్మిక మరణం 20 ఏళ్ల ఆ కుర్రాడిని కుంగదీసింది. అయితే అంత్యక్రియలు ముగిసిన 48 గంటల్లోనే తిరిగి వచ్చి మళ్లీ ఐపీఎల్లో తన మెరుపులను ప్రదర్శిస్తూ 57 పరుగులు చేశాడు. తర్వాతి సీజన్లో సన్‌రైజర్స్‌పై చెలరేగి పంత్ కొట్టిన సెంచరీ లీగ్‌లో బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.ఒకే ఒక లక్ష్యంతో..పంత్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చాడు. తండ్రి రాజేందర్ ఒక ప్రైవేట్ స్కూల్‌ను నడిపేవాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ స్వస్థలం కాగా క్రికెట్ అవకాశాల కోసం ఢిల్లీ వైపు చూడాల్సి వచ్చింది. రూర్కీ నుంచి ఢిల్లీ ఆరున్నర గంటల ప్రయాణం. చిన్నప్పటి నుంచి అన్ని చోట్లకు అతని తల్లి సరోజ్ తోడుగా వచ్చేది. ఢిల్లీలోని ప్రముఖ కోచ్ తారక్ సిన్హాకు చెందిన సానెట్ అకాడమీలో అతను శిక్షణ తీసుకున్నాడు. 12 ఏళ్ల వయసులో జరిగిన ఒక ఘటన పంత్‌లో ఆటకు సంబంధించి పట్టుదలను పెంచింది.సెలక్షన్స్, కోచింగ్ కోసం 45 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వసతి కోసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో స్థానికంగా మోతీబాగ్‌లోని ఒక గురుద్వారాలోనే తల్లి, కొడుకులు ఉన్నారు. ఆ సమయంలోనే తాను భారత్‌కు ఆడాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అతను చెప్పుకున్నాడు. ఐపీఎల్లో అవకాశం దక్కినా.. టీమిండియా ప్లేయర్‌గా వచ్చే గుర్తింపు కోసం అతను శ్రమించాడు. కొన్నాళ్లకే అతని కల నెరవేరింది. భారత జట్టులో అవకాశం దక్కించుకున్న అతను కొన్ని చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.మన గిల్లీ..అంతర్జాతీయ క్రికెట్లో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను పంత్ గుర్తుకు తెచ్చాడు. తన మూడో టెస్టులోనే ఇంగ్లండ్ గడ్డపై అద్భుత సెంచరీతో అతను ఆకట్టుకున్నాడు. తర్వాతి ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై సిడ్నీలో 159 పరుగులతో తన బ్యాటింగ్ పదును చూపించాడు. భారత జట్టు ఆస్ట్రేలియాలో తొలి సిరీస్ గెలిచేందుకు ఇది ఉపకరించింది. తర్వాతి ఏడాది సిడ్నీలోనే 97 పరుగులతో రాణించిన అతను ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అసలు ఘనత తర్వాతి టెస్టులోనే బ్రిస్బేన్‌లో వచ్చింది. భారత్‌కు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అజేయంగా 89 పరుగులతో అతను జట్టును గెలిపించిన తీరు ఈ సిరీస్ విజయాన్ని చిరస్మరణీయంగా మార్చింది. అంతకు ముందే రంజీ ట్రోఫీలో పంత్ చేసిన ట్రిపుల్ సెంచరీ అతను పైస్థాయికి చేరగలడనే నమ్మకాన్ని కలిగించింది.మూడు దశల ప్రణాళికతో..రిషభ్ పంత్‌కు ఎదురైన ప్రమాద తీవ్రత చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉండింది. చావు నుంచి తప్పించుకోవడం మాత్రమే ఊరట కలిగించే అంశం. మిగతా అన్నీ ప్రతికూల అంశాలే. ఆట సంగతేమో కానీ ముందు సాధారణ జీవితమైతే గడపగలగాలి కదా! చాలారోజుల వరకు ఆస్పత్రిలోనే ఉన్నాడు. శస్త్ర చికిత్సలు, స్కానింగ్, పరీక్షలు, రిపోర్టులతోనే సాగిపోయింది.2022 డిసెంబర్లో పంత్కి జరిగిన రోడ్డు ప్రమాదంఅలాంటి స్థితిలో పంత్ తన కోసం తాను ఒక కొత్త ప్రణాళికను రూపొందించుకోవాల్సి వచ్చింది. ప్రమాదం నుంచి మైదానం వరకు అతను తన పురోగతిని మూడు రకాలుగా విభజించుకొని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముందుగా ఆరోగ్యపరంగా సాధారణ స్థితికి రావడం. ఆటగాడి కోణంలో కాకుండా ఒక సామాన్యుడు ప్రమాదం బారిన పడితే వైద్యుల పర్యవేక్షణలో ఏం చేస్తాడో పంత్ కూడా అదే చేశాడు. ముందుగా కోలుకోవడం, ఇతరుల సహాయం లేకుండా నడక, తన పనులు తాను సొంతంగా చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. రెండో క్రమంలో జనరల్ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకున్నాడు.తేలికపాటి ఎక్సర్సైజ్లు, యోగావంటి వాటితో తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. ఆపై మూడో దశకు వచ్చే సరికి క్రికెటర్ మ్యాచ్ ఫిట్నెస్ కోసం శ్రమించాడు. ఈ విషయంలో బీసీసీఐకి చెందిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఎంతో సహాయం అందించింది. డైట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్, ఫిజియో ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పంత్ సిద్ధమయ్యాడు.గాయాల నుంచి కోలుకుంటూలీగ్లో సత్తా చాటి..‘నేను మళ్లీ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నాకు ఎదురైన దురదృష్టకర ఘటనలను దాటి మళ్లీ క్రికెట్ ఆడటం అంటే కొత్త జన్మ ఎత్తినట్లు’ అని తొలి మ్యాచ్‌కు ముందు పంత్ స్వయంగా చెప్పుకున్నాడు. ఐపీఎల్లో 2024లో పంత్ మ్యాచ్‌లు చూసినవారికి పంత్ పురోగతి ఆశ్చర్యం కలిగించింది. అసలు ఎప్పుడూ ఏ ప్రమాదం జరగనట్లుగా, కొంత విరామం తర్వాత మాత్రమే అతను ఆటలోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు.బ్యాటింగ్‌లో పదును, వికెట్ కీపింగ్‌లో చురుకుదనం, మైదానంలో అతని కదలికలు, కెప్టెన్సీ నైపుణ్యం కొత్త పంత్‌ను చూపిస్తున్నాయి. మరో సందేహం లేకుండా పూర్తి ఫిట్నెస్ స్థాయిని అతను ప్రదర్శించాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో గతంలోలాగే ర్యాంప్ షాట్లు, స్విచ్ హిట్లు, ఒంటి చేత్తో సిక్సర్లు, ఏ బౌలర్‌నూ వదలకుండా అతను ఆధిపత్యం చూపించడం సగటు క్రికెట్ అభిమానిని సంతృప్తిపరచాయి. ఎందుకంటే లీగ్‌లో ఎవరికి ఆడినా అతను భారత క్రికెట్ భవిష్యత్తు అనే విషయం అందరికీ తెలుసు.ఇంత తక్కువ సమయంలో కోలుకోవడంలో అతని వయసు కూడా కీలక పాత్ర పోషించడం వాస్తవమే అయినా.. అన్ని రకాల ప్రతికూలతలను దాటి అతను సగర్వంగా నిలిచాడు. అతని పోరాటానికి హ్యాట్సాఫ్ చెబుతూ మున్ముందు భారత్‌కు పంత్ మరిన్ని విజయాలు అందించాలని ఆశిద్దాం! — మొహమ్మద్ అబ్దుల్ హాది -
రిషబ్ పంత్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధం
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఢిల్లీ సజీవంగా నిలుపున్‌కుంది.ఇక ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం ఐపీఎల్ మెన్జ్మెంట్ విధించే సూచనలు కన్పిస్తున్నాయి. శనివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు. కాగా ఢిల్లీ క్యాపిటిల్స్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఇది మూడో సారి. అయితే ఐపీఎల్ నియమావళి ప్రకారం వరుసగా మూడో సారి స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్‌పై 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతోపాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఒకవేల అదే జరిగితే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తదపరి మ్యాచ్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. -
DC Vs GT: రిషబ్ పంత్ విధ్వంసం.. ఏకంగా 8 సిక్స్‌లతో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. అక్షర్ పటేల్‌తో కలిసి స్కోర్ బోర్డును పంత్ పరుగులు పెట్టించాడు. ఆఖరి ఓవర్ వేసిన మొహిత్ శర్మకు అయితే పంత్ చుక్కలు చూపించాడు.ఢిల్లీ ఇన్నింగ్స్ 20 ఓవర్లో పంత్ 4 సిక్స్‌లు, ఒక ఫోరుతో 31 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 43 బంతులు ఎదుర్కొన్న రిషబ్.. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు వరల్డ్కప్న్కు పంత్ రెడీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో పంత్‌తో పాటు అక్షర్ పటేల్(66), స్టబ్స్(26) పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. No Rishabh Pant fan will scroll without liking this tweet. ❤️ pic.twitter.com/AwcmRcnD1u— 𝐕𝐈𝐑𝐀𝐓𝕏𝐌𝐀𝐗𝐖𝐄𝐋𝐋 (@ProfKohli18) April 24, 2024 -
IPL 2024 DC vs GT: ఉత్కంఠ పోరులో గుజరాత్ ఓటమి..
IPL 2024 DC vs GT Live Updates:ఉత్కంఠ పోరులో గుజరాత్ ఓటమి..అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోరి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. రషీద్ ఖాన్ 14 పరుగులు మాత్రమే రాబట్టాడు. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(65) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మిల్లర్(55), వృద్దిమాన్ సాహా(39) తమ వంతు ప్రయత్నం చేశారు. ఢిల్లీ బౌలర్లలో రాసిఖ్ ధార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్, నోర్జే తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 పరుగులు చేశాడు. పంత్‌తో పాటు అక్షర్ పటేల్(66) పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు.ఏడో వికెట్ కోల్పోయిన గుజరాత్..డేవిడ్ మిల్లర్ రూపంలో గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన మిల్లర్.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 12 బంతుల్లో 37 పరుగులు కావాలి.17 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 176/617 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్లర్(51), రషీద్ ఖాన్(0) ఉన్నారు.ఐదో వికెట్ డౌన్..షారూఖ్ ఖాన్ రూపంలో గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన షారూఖ్..రాసిఖ్ సలామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి షారూఖ్ ఖాన్ వచ్చాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 147/5నాలుగో వికెట్ డౌన్..121 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 65 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. రాసిఖ్ సలామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి షారూఖ్ ఖాన్ వచ్చాడు. 14 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 139/4మూడో వికెట్ డౌన్..ఒమర్జాయ్ రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఒమర్జాయ్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(59), మిల్లర్(2) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్..95 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు వృద్దిమాన్ సహా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఒమర్జాయ్ వచ్చాడు.3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 41/13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజులో వృద్దిమాన్ సహా(26), సాయిసుదర్శన్(8) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్..225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. నోర్జే బౌలింగ్‌లో ఔటయ్యాడు.రిషబ్ పంత్ విధ్వంసం.. గుజరాత్ టార్గెట్ 225 పరుగులుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 పరుగులు చేశాడు. పంత్‌తో పాటు అక్షర్ పటేల్(66) పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు.19 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 193/419 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(58), స్టబ్స్(26) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్..157 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 157/4. క్రీజులో రిషబ్ పంత్(48), స్టబ్స్ పరుగులతో ఉన్నారు.అక్షర్ పటేల్ ఫిప్టీ..15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ అదరగొడుతున్నాడు. అక్షర్ కేవలం 37 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. క్రీజులో అక్షర్ పటేల్(50), రిషబ్ పంత్(34) పరుగులతో ఉన్నారు.ఢిల్లీ మూడో వికెట్ డౌన్.. హోప్ ఔట్హోప్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన హోప్.. సందీప్ వారియన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఢిల్లీ మూడు వికెట్లు నష్టపోయి 68 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(19), రిషబ్ పంత్(7) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా ఔట్పృథ్వీ షా రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన పృథ్వీషా.. సందీప్ వారియర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు ఢిల్లీ రెండు వికెట్లు నష్టపోయి 43 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. మెక్ గర్క్ ఔట్34 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఫ్రేజర్ మెక్‌గర్క్.. సందీప్ వారియర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు.ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ -
టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్.. సిక్సర్ల కింగ్‌లు ఎంట్రీ!?
ఈ ఏడాది జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024 అనంతరం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ జూలై 6న ప్రారంభమై అదే నెల 14న ముగియనుంది. ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. అయితే ఈ జింబాబ్వే పర్యటనకు భారత తృతీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఒకరిద్దరూ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికి ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీలో అదరగొడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు ఈ సిరీస్‌లో భారత జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట. కాగా పంత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పునరాగమనంలో కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా సత్తాచాటుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పంత్ 210 పరుగులు చేశాడు. మరోవైపు ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, సాయిసుదర్శన్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లను సైతం జింబాబ్వే టూర్‌కు పంపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
IPL LSG Vs DC Photos: కుల్దీప్ మాయాజాలం, 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు (ఫొటోలు)
-
IPL 2024 LSG vs DC: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
IPL 2024 LSG vs DC Live Updates : ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిషబ్ పంత్(41) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. యష్ ఠాకూర్, నవీన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో బదోని(55 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్(39) పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ రెండు, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు. ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్.. పంత్ ఔట్ రిషబ్ పంత్ రూపంలో ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన పంత్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 18 పరుగులు కావాలి. ఢిల్లీ మూడో వికెట్ డౌన్.. 140 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన ఫ్రెజర్ ముక్గర్క్.. నవీన్ ఉల్హక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 32 బంతుల్లో 28 పరుగులు కావాలి. క్రీజులో రిషబ్ పంత్(37) పరుగులతో ఉన్నాడు. దంచి కొడుతున్న పంత్.. 12 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 100/2 12 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. క్రీజులో పంత్(29), ముక్గర్క్(25) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లు ఢిల్లీ స్కోర్ : 75/2 10 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జాక్ ఫ్రెజర్ ముగ్గార్క్(21), రిషబ్ పంత్(8) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా ఔట్ 63 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన పృథ్వీ షా.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 63/2 తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. వార్నర్ ఔట్ 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. యష్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 30/1 బదోని సూపర్ ఇన్నింగ్స్.. ఢిల్లీ టార్గెట్ 168 పరుగులు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన లక్నోను యువ ఆటగాడు ఆయుష్ బదోని ఆదుకున్నాడు. టెయిలాండర్ ఆర్షద్ ఖాన్(20)తో కలిసి తన జట్టుకు మెరుగైన స్కోర్‌ను అందించాడు. బదోని(55 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్(39) పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ రెండు, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు. 17 ఓవర్లకు లక్నో స్కోర్: 128/7 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో ఆయూష్ బదోని(30), ఆర్షద్ ఖాన్(9) పరుగులతో ఉన్నారు. లక్నో ఏడో వికెట్ డౌన్.. 94 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు లక్నో స్కోర్ : 94/7 90 పరుగులకే 6 వికెట్లు.. కష్టాల్లో లక్నో 89 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన దీపక్ హుడా.. వార్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు లక్నో స్కోర్ : 90/6 కుల్దీప్ మాయ.. లక్నో ఐదో వికెట్ డౌన్ 80 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు లక్నో స్కోర్ : 84/5 కుల్దీప్ మాయ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కుల్దీప్ యాదవ్ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత మార్కస్ స్టోయినిష్ ఔట్ కాగా.. తర్వాత నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి దీపక్ హుడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. 9 ఓవర్లకు లక్నో స్కోర్ : 75/4. క్రీజులో రాహుల్(39), హుడా (3) పరుగులతో ఉన్నారు. లక్నో రెండో వికెట్ డౌన్.. పడిక్కల్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన దేవ్‌దత్త్ పడిక్కల్.. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్లు ముగిసే సరికి లక్నో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(21), స్టోయినిష్(1) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. 28 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి దేవ్‌దత్త్ పడిక్కల్ వచ్చాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. లక్నో మాత్రం ఒకే మార్పు చేసింది. ఢిల్లీ జట్టులోకి ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ వచ్చారు. అదేవిధంగా ఈ మ్యాచ్‌కు లక్నో సంచలన పేసర్ మయాంక్ యాదవ్ దూరమయ్యాడు. తుది జట్లు ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్ -
కనికరం లేకుండా ఆడారు.. మా ఆటతీరును చూసి సిగ్గేసింది: రికీ పాంటింగ్
ఐపీఎల్-2024లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఢిల్లీ విఫలమైంది. తొలుత కేకేఆర్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశారు. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 272 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో డీసీ 166 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. తమ జట్టు ఆట తీరును తనకు చాలా బాధ కల్గించందని పాంటింగ్ అన్నాడు. "ఈ మ్యాచ్‌లో మా జట్టు తొలి అర్ధభాగం ఆటను చూశాక సిగ్గేసింది. బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. చెత్త బౌలింగ్‌తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 20 ఓవర్లు వేయడానికి ఏకంగా రెండు గంటలు సమయం పట్టింది. నిర్ణీత సమయానికి మేము 2 ఓవర్లు వెనుకబడ్డాము. దీంతో సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లతోనే చివరి రెండు ఓవర్లు బౌలింగ్ చేశాం. ఈ మ్యాచ్‌లో చాలా విషయాలు ఆమోదయోగ్యం కానివిగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా మేము చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. కేకేఆర్ బ్యాటర్లు కనీసం కనికరం లేకుండా ఆడారు. పవర్‌ప్లేను వారు బాగా ఉపయోగించుకున్నారు. పవర్ ప్లేలోనే 88 పరుగులు రాబట్టారు. ఆట ఆరంభంలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోతే తిరిగి రావడం చాలా కష్టం. మా బౌలర్లు కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికి వారు మాత్రం మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో మేము ఓడిపోయినప్పటికీ పంత్ తన ఫామ్‌ను కొనసాగించడం మా జట్టుకు సానుకూలాంశమని" పాంటింగ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. -
IPL 2024: సీఎస్కేపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం..
IPL 2024 DC vs CSK Live Updates: సీఎస్కేపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం.. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. వైజాగ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆఖరిలో (16 బంతుల్లో 37, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో మెరుపులు మెరిపించినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. ధోనితో పాటు అజింక్యా రహానే(45) క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ రెండు, అక్షర్ పటేల్ ఒక్క వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(52), రిషబ్ పంత్(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అదేవిధంగా ఈ ఏడాది సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ షా(43) పరుగులతో రాణించాడు. వార్నర్,పృథ్వీ షా తొలి వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీఎస్కే బౌలర్లలో పతిరాన 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా, ముస్తఫిజర్ రెహ్మన్ తలా వికెట్ సాధించారు. ధోని ఆన్ ఫైర్..18 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 146/6 18 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మెరుపులు మెరిపిస్తున్నాడు. కేవలం 6 బంతుల్లో 16 పరుగులతో ధోని బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆరో వికెట్ డౌన్.. శివమ్ దూబే ఔట్ 120 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన శివమ్ దూబే.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి ధోని వచ్చాడు. సమీర్ రిజ్వీ ఔట్ సమీర్ రిజ్వీ రూపంలో సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో రిజ్వీ ఔటయ్యాడు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్ : 120/5 సీఎస్కే నాలుగో వికెట్ డౌన్.. రహానే ఔట్ 102 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన అజింక్య రహానే.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 92/3 12 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో రహానే(45), దూబే(3) పరుగులతో ఉన్నారు. 6 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 32/2 6 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే(18), డార్లీ మిచెల్(7) పరుగులతో ఉన్నారు. సీఎస్కేకు బిగ్ షాక్.. 7 పరుగులకే 2 వికెట్లు 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఢిల్లీ పేసర్ ఖాలీల్ అహ్మద్ వీరిద్దరి ఔట్ చేశాడు. 4 ఓవర్లకు సీఎస్కే స్కోర్ : 17/2 చెలరేగిన వార్నర్, పంత్.. సీఎస్కే టార్గెట్ 192 పరుగులు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(52), రిషబ్ పంత్(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అదేవిధంగా ఈ ఏడాది సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ షా(43) పరుగులతో రాణించాడు. వార్నర్,పృథ్వీ షా తొలి వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీఎస్కే బౌలర్లలో పతిరాన 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా, ముస్తఫిజర్ రెహ్మన్ తలా వికెట్ సాధించారు. 18 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 162/4 18 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రిషబ్ పంత్(35),అక్షర్ పటేల్(5) పరుగులతో ఉన్నారు. వారెవ్వా పతిరనా.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు సీఎస్కే పేసర్ మతీషా పతిరనా తన యార్కర్లతో ఢిల్లీ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. 15 ఓవర్ వేసిన పతిరనా వరుస క్రమంలో మార్ష్, స్టబ్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 15 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 134/4 రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా ఔట్ 103 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన పృథ్వీ షా.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. వార్నర్ ఔట్ 92 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. ముస్తఫిజర్ రెహ్మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సీఎస్కే ఆటగాడు పతిరనా అద్బుతమైన క్యాచ్‌తో వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ : 95/1. దంచి కొడుతున్న ఢిల్లీ ఓపెనర్లు.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 62/0. క్రీజులో డేవిడ్ వార్నర్(35), పృథ్వీషా(24) పరుగులతో ఉన్నారు. 3 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 19/0 3 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్(13), పృథ్వీ షా(6) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా విశాఖపట్నం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. సీఎస్కే ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. తుది జట్లు ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/ వికెట్ కీపర్ ), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా, ముస్తాఫిజుర్ రెహమాన్ -
'సన్ ఆఫ్ ఢిల్లీ'.. అతడి రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నా: ఏబీడీ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. రోడ్డు ప్రమాదం కారణంగా గత 14 నెలలకు ఆటకు దూరంగా ఉన్న రిషబ్.. తిరిగి ఐపీఎల్-2024తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్లో పాల్గోనేందుకు పంత్‌కు ఏన్సీఏ కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. దీంతో అతడి రీ ఎంట్రీకి కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ను 'సన్ ఆఫ్ డిల్లీ'గా ఏబీడీ అభివర్ణించాడు. "సన్ ఆఫ్ డిల్లీ(పంత్) పునరాగమనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. అతడు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. పంత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. పంత్ జెర్సీ నెం 17. నా జెర్సీ నెంబర్ కూడా పదిహేడే. రిషబ్ ఆట అంటే నాకు ఏంతో ఇష్టం. అతడికి ఐపీఎల్లో సెంచరీ కూడా ఉంది. పంత్ రీ ఎంట్రీలో కూడా సత్తాచాటాలని కోరుకుంటున్నానని" తన యూట్యూబ్ ఛానల్లో మిస్టర్ 360 పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో పంత్ నాయకత్వంలోనే ఢిల్లీ బరిలోకి దిగనుంది. గతేడాది అతడి గైర్హజరీలో ఢిల్లీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవహరించాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. -
పడి లేచిన కెరటం పంత్
రిషబ్ పంత్.. పరిచయం అవసరం లేని పేరు. ధోనీ తర్వాత క్రికెట్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అద్భుతంగా రాణించిన ఆటగాడు పంత్. టెస్టుల్లో.. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయాలు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు పంత్. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ.. భవిష్యత్ ఆశాకిరణంగా ప్రశంసలు అందుకున్న పంత్.. 2022, డిసెంబరు 31న జరిగిన కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. రూర్కీ సమీపంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి చావు అంచుల దాకా పోయి వచ్చాడు. ఇప్పుడు అదంతా చరిత్ర. కొత్త రికార్డులు సృష్టించేందుకు పంత్ సిద్ధమవుతున్నాడు. గ్రేటేస్ట్ కం బ్యాక్ సాధారణ ఆటగాడిగా అడుగుపెట్టి.. అసాధారణ ఆటతీరుతో భారతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసుకున్న పంత్.. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడం గొప్పవిషయం అంటోంది బిసిసిఐ. ప్రమాదం నుంచి పంత్ కోలుకున్న తీరు.. ఎందరికో స్పూర్తినిచ్చేలా ఉందంటూ ప్రశంసించింది. ప్రమాదంలో దెబ్బతిన్న పంత్.. పడిలేచిన కెరటాన్ని మరిపిస్తూ మళ్లీ ఆడబోతున్నట్టు ప్రకటించింది. పంత్ కోలుకున్న తీరును ఓ వీడియో రూపంలో రేపు ఉదయం bcci.tvలో ప్రసారం చేయబోతుంది బిసిసిఐ. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించిన బిసిసిఐ.. పంత్‌ను ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసింది. అత్యున్నత చికిత్స అందించడంతో పంత్ వేగంగా కోలుకున్నాడు. ప్రస్తుతం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కసరత్తులు చేసి మళ్లీ ఫిట్నెస్ సాధించాడు పంత్. రానున్న ఐపీఎల్ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నేతృత్వం వహించనున్నాడు పంత్. ఢిల్లీ టీం తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. మొహాలీలో జరిగే ఆ మ్యాచ్‌లో డీసీ టీమ్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. The Greatest Comeback Story This story is about inspiration, steely will power and the single-minded focus to get @RishabhPant17 back on the cricket field. We track all those who got the special cricketer back in shape after a deadly car crash. Part 1 of the #MiracleMan… pic.twitter.com/ifir9Vplwl — BCCI (@BCCI) March 13, 2024 -
చరిత్ర సృష్టించిన ఆసీస్ వికెట్ కీపర్.. పంత్ రికార్డు బద్దలు
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీ కీలక పాత్ర పోషించాడు. 98 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. నాలుగో రోజు ఆటలో ఆసీస్ విజయానికి 202 పరుగులు అవసరమైన దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన క్యారీ కివీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తృటిలో సెంచరీతో చేసే అవకాశాన్ని క్యారీ కోల్పోయాడు. ఇక ఈమ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన క్యారీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా క్యారీ(98*) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2021లో బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఓ టెస్టులో పంత్ నాలుగో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో గిల్ క్రిస్ట్ 149 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు సారధి రిషబ్ పంత్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎన్సీఏ ఎన్ఓసీతో ఐపీఎల్ 2024 ఆడేందుకు పంత్‌కు లైన్ క్లియర్ అవుతుంది. ఎన్సీఏ నుంచి అధికారికంగా అనుమతి లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ పేరును జట్టులో చేర్చలేదు. గత కొద్ది రోజులుగా పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ క్యాంప్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. అతని ఫిజికల్ ఫిట్నెస్ చూస్తే మనుపటి తరహాలో కనిపిస్తుంది. ప్రాక్టీస్ క్యాంప్‌లో పంత్ మునుపటిలా భారీ షాట్లు ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. అయితే పంత్ వికెట్‌కీపింగ్ చేయడంపై మాత్రం డీసీ యాజమాన్యం ఆఖరి నిమిషం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోదని తెలుస్తుంది. పంత్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని పలు నివేదికలు తెలుపుతున్నాయి. 2022 డిసెంబర్ 31న పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కొద్ది రోజుల కిందటే అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. పంత్ ఎన్సీఏలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. వీరు క్లీన్ చిట్ ఇస్తేనే పంత్ ఐపీఎల్ 2024లో ఆడతాడు. పంత్ గైర్హాజరీలో గతేడాది డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో డీసీ.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. తొలి విడతలో క్యాపిటల్స్ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. పంజాబ్ (మార్చి 23), రాజస్థాన్ (మార్చి 28), సీఎస్కే (మార్చి 31), కేకేఆర్ (ఏప్రిల్ 3), ముంబై ఇండియన్స్‌ను (ఏప్రిల్ 7) డీసీ ఢీకొట్టనుంది. -
పిల్లలతో గోళీలాట ఆడిన రిషబ్ పంత్.. వీడియో వైరల్
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి దాదాపు 15 నెలల నుంచి ఆటకు దూరంగా ఉంటున్న పంత్.. ఈ ఏడాది ఐపీఎల్‌తో మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ఢిల్లీ క్యాపిటిల్స్ ఫ్రాంచైజీ ధ్రువీకరించింది. నేషనల్ క్రికెట్ ఆకాడమీ కూడా రిషబ్‌కు త్వరలోనే క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఆదివారం ఏన్సీఏ నుంచి బయటకు వచ్చిన పంత్ రోడ్డు పక్కన చిన్నపిల్లలతో గోళీల ఆట ఆడాడు. సరదగా పిల్లలతో ఆడుతూ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. వారితో ఆడే క్రమంలో ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి కర్చీఫ్, తలకు క్యాప్ పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన స్కోరు ఎంత అని పిల్లలను అతడు అడగడం కూడా వీడియోలో కన్పించింది. చదవండి: IND vs ENG: మూడే 3 సిక్స్‌లు.. వరల్డ్ రికార్డుపై కన్నేసిన జైశ్వాల్? Rishabh Pant playing "Golli" with kids. 😄 👌[Pant Instagram] pic.twitter.com/v2IPgrkIrw — Johns. (@CricCrazyJohns) March 3, 2024 -
టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు!
టీమిండియాకు ఓ గుడ్ న్యూస్. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. అతి త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఏన్సీఏలో ఉన్న రిషబ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రత్యేక ట్రైనర్ సాయంతో శిక్షణ పొందుతున్నాడు. ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ను అభిమానులతో పంత్ పంచుకుంటున్నాడు. తాజాగా యాంటీ గ్రావిటీ ట్రెడ్‌మిల్‌పై సాధన చేస్తూ ఉన్న వీడియోను పంత్ షేర్ చేశాడు. ఢిల్లీ ప్రాక్టీస్ క్యాంప్‌లో పంత్.. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు కోల్‌కతాలో 4 రోజుల ప్రాక్టీస్ క్యాంప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాక్టీస్ క్యాంప్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పాల్గోనున్నట్లు సమాచారం. పంత్ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సన్నాహక క్యాంప్‌లో ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, మెంటార్ సౌరవ్ గంగూలీ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. రేవ్‌స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. రిషబ్ పంత్ ఒకట్రెండు ప్రాక్టీస్ గేమ్‌లు ఆడే అవకాశం ఉంది. కాగా గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్‌కు పంత్ దూరంగా ఉన్నాడు. చదవండి: World cup 2023: అత్యంత చెత్త రివ్యూ.. నవ్వు ఆపుకోలేకపోయిన కేన్ మామ! వీడియో వైరల్ -
ఊర్వశి రౌతేలా చేసింది ఆరు సినిమాలు.. ఆస్తి రూ. 300 కోట్లు ఎలా?
బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరు ఊర్వశి రౌతెలా.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తూ యువతలో మంచి క్రేజ్‌ను అందుకుంది.. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ బ్యూటీ 15 సంవత్సరాల వయస్సులోనే తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. అలా మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 టైటిల్‌ను కూడా గెలుచుకుంది, ఈ పోటీలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. అలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్పంతి, మరెన్నో చిత్రాలలో నటించి అలరించింది. కానీ ఆమెకు పెద్దగా సినిమా ఛాన్స్‌లు దక్కలేదు. దీంతో చేతిలో అంతగా డబ్బులేదు.. సినిమా ఛాన్స్‌లు ఇస్తామని ఆమెను మోసం చేసిన వారే ఎక్కువ కావడంతో అలా ఆమె సినీ కెరీయర్ ముగిసిపోయిందని అనుకుంది. (ఇదీ చదవండి: తప్పని పరిస్థితిలో నేడు మీడియా ముందుకు హీరో రవితేజ) సరిగ్గా అదే సమయంలో ఊర్వశికి భారత క్రికెటర్ హర్థిక్ పాండ్యాతో పరిచయం కావడమే కాకుండా ఆయనతో డేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో సినిమా ఛాన్స్‌ల కోసం బాలీవుడ్ నిర్మాత సమీర్ నాయర్‌తో కూడా ఆమె డేట్ చేస్తున్నట్లు తెరపైకి వచ్చింది. ఆమె కంటే సమీర్ వయసులో చాలా పెద్దవాడు అయినా సినిమా అవకాశాల కోసం ఆయనతో టచ్‌లో ఉండేదని సమాచారం. కానీ అతను మాత్రం ఆమెకు ఛాన్స్‌లు ఇస్తానంటూ కాలయాపన చేస్తున్నట్లు గ్రహించిన ఊర్వశి నెమ్మదిగా అతనికి గుడ్‌బై చెప్పేసింది. ఎలాగైనా బాలీవుడ్లో ఒక్క ఛాన్స్ వస్తే తన టాలెంట్‌తో లైఫ్‌లో సెటిల్ కావచ్చని ఆమె కలలు కనేది. అలా టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయన ఊర్వశికి పాగల్ పంథీ సినిమాలో ఒక హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అయినా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అలా ఆయనతో కూడా ఊర్వశి డేట్ చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. సినిమా గ్లామర్ ఫీల్డ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఆమెకు రిషబ్ పంత్ ఒక ఫంక్షన్లో పరిచయం కావడం ఆపై కొంత కాలం డేట్ చేసినట్లు వార్తలు వచ్చినా రిషబ్ తిప్పికొట్టాడు. మొదట రిషబ్ తన సోషల్ మీడియాలో ఊర్వశిని బ్లాక్ చేయడంతో వీరిద్దరూ మీడియాలో ప్రధాన వార్తలుగా మిగిలారు. తర్వాత కొద్దిరోజుల పాటు ఇద్దరూ పరోక్షంగా ఒకరిపైమరొకరు సోషల్ మీడియాలో కామెంట్లు,స్టేటస్లు పెట్టుకోవడంతో వారిద్దరి మధ్య ఎఫైర్ నిజమేనని వార్తలు వచ్చాయి. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఊర్వశి రౌతెలా ఇప్పటి వరకు ప్రధాన హీరోయిన్గా కేవలం 6 సినిమాలు మాత్రమే చేసింది. అవి కూడా అంతగా చెప్పుకోతగినవి కాదు. అడపాదడపా ఐటమ్ సాంగ్స్‌లలో కనిపించేది. దీంతో ఆమెకు పెద్దగా ఇన్కమ్ సోర్స్ కనిపించలేదు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లలోనే ఆమె రూ. 150 కోట్లు పెట్టి ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొనింది. ఈ డబ్బంతా దుబాయ్,యూకే,కెనడా వంటి దేశాల్లో ఈ బ్యూటీ గ్లామర్‌తో కొల్లగొట్టిందని ప్రచారం ఉంది. అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలకు దుబాయ్‌లో ఎక్కువ క్రేజ్ అట. అక్కడి షేక్స్ కూడా ఎక్కువగా వారినే ఇష్టపడి ట్రాప్ చేస్తారట. అలా అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిల్ని దక్కించుకునేందుకు వారు ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారట. ఇలా ఊర్వశి కేవలం 11 ఏళ్ల సినిమా కెరియర్లో సంపాదించలేనిది కేవలం రెండు సంవత్సరాల్లోనే సుమారు రూ. 300 కోట్లు వెనుకేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సినిమా ఛాన్స్‌ల కోసం ఆమె శ్రీదేవి భర్త బోణీ కపూర్‌తో డేట్ చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ కలిసి పార్టీలు,వెకేషన్లు అంటూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. -
రిషబ్ పంత్ ఒక అద్భుతం.. ఎంతో మంది వికెట్ కీపర్లకు ఆదర్శం: గిల్‌క్రిస్ట్
గతేడాది డిసెంబర్లో కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. రిషబ్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేశాడు. అతడిని త్వరలోనే తిరిగి మైదానంలో చూసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో పంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏదమైనప్పటికీ పంత్ వంటి విధ్వంసకర బ్యాటర్ వరల్డ్‌కప్‌కు దూరం కావడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ప్రపంచకప్‌లో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక తన దూకుడుతో వరల్డ్ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పంత్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిసబ్ తన విధ్వంసకర ఆట తీరుతో ఎంతో మంది యువ వికెట్కీపర్లకు ఆదర్శంగా నిలిచాడని గిల్‌క్రిస్ట్ కొనియాడాడు. "ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వికెట్ కీపర్ బ్యాటర్లను రిషబ్ పంత్ తను ఆడే విధంగా ప్రేరేపించాడు. యువ వికెట్ కీపర్లు పంత్‌ను ఫాలో అవుతున్నారు. ఇది నిజంగా చాలా గ్రేట్. ఇక భారత్‌కు వికెట్ కీపర్లు చాలా మంది అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌కు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ రూపంలో రెండు ఎంపికలు ఉన్నాయి. కేఎల్ గాయంతో జట్టుకు దూరంగా ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతడు తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. ఇది నిజంగా భారత క్రికెట్‌కు శుభసూచికం అంటూ" గిల్‌క్రిస్ట్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: #Mohammed Shami: వరల్డ్‌కప్‌కు ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు -
ఇషాన్ కిషన్ సింగిల్ హ్యాండ్ సిక్స్.. పంత్‌ను గుర్తు చేశాడుగా! వీడియో వైరల్
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన పవర్ హిట్టింగ్‌ను టెస్టు క్రికెట్లో కూడా చూపించాడు. విండీస్‌తో తొలి టెస్టులో విఫలమైన కిషన్.. రెండో టెస్టులో మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 52 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే కిషన్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను తనదైన స్టైల్లో అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన రోచ్ బౌలింగ్‌లో ఐదో బంతిని కిషన్ ఒంటి చెత్తో సిక్సర్‌గా మలిచాడు. దీంతో తన హాఫ్ సెంచరీని కూడా పూర్తిచేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కిషన్ తన సింగిల్ హ్యాండ్ షాట్‌తో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను గుర్తుచేశాడని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. పంత్ గతంలో ఈ తరహా షాట్స్ చాలా ఆడాడు. కాగా గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్.. క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అతడు వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక పంత్ స్ధానంలోనే కిషన్‌కు టెస్టు జట్టులో చోటు దక్కింది. చదవండి: IND vs WI: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! That's a smashing way to bring your maiden Test 50*@ishankishan51 . .#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/WIFaqpoGiD — FanCode (@FanCode) July 23, 2023 -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్! పంత్ రీ ఎంట్రీ
గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ తన పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎప్పటికప్పుడు జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను కూడా పంత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా బీసీసీఐ అతడి ఫిటెనెస్కు సంబంధించిన మెడికల్ బులెటిన్ కూడా బీసీసీఐ వెల్లడించింది. పంత్ బ్యాటింగ్ సాధనతో పాటు వికెట్ కీపింగ్ కూడా మొదలు పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది. అయితే అతడు పూర్తి స్ధాయి ఫిట్నెస్ సాధించడానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అంటే భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు పంత్ దూరం కానున్నాడు. అతడు తిరిగి మళ్లీ వచ్చే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగున్న టెస్టు సిరీస్‌తో మైదానంలో అడుగు పెట్టనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో స్వదేశంలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ప్రస్తుత టెస్టు జట్టులో పంత్ లేని లోటు సృష్టంగా కన్పిస్తోంది. వెస్టిండీస్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో పంత్ స్ధానంలో ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతకుముందు డబ్ల్యూటీసీ ఫైనల్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో శ్రీకర్ భరత్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. చదవండి: IND vs WI: 'అతడు మళ్లీ ఫామ్‌లోకి రావాలి.. ఎందుకంటే రోహిత్ తర్వాత తనే దిక్కు' -
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎవరి సాయం లేకుండా మెట్లెక్కేసిన పంత్!
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్న పంత్..పూర్తి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు. ఇక తన హెల్త్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకొనే పంత్.. తాజాగా మరో వీడియో పోస్టు చేశాడు. తన ట్రైనింగ్ సంబంధించిన వీడియోను పంత్ షేర్ చేశాడు. పంత్ ఎటువంటి సపోర్ట్ లేకుండా మెట్లు ఎక్కుతుండడం ఈ వీడియోలో కన్పించింది. అయితే మెట్లు ఎక్కే క్రమంలో తొలుత పంత్ కాస్త ఇబ్బంది పడిన ఆ తర్వాత మాత్రం కొంచెం ఈజీగా ముందుకు వెళ్లాడు. కాగా ఈ వీడియోకు "నాట్ బ్యాడ్ యార్ రిషబ్. చిన్న పనులే కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి" అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన పంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికన్నా వేగంగా రిషబ్ కోలుకుంటున్నాడని.. త్వరలోనే మైదానంలో కనిపిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా పంత్ గాయం కారణంగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా సిరీస్, ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పంత్ దూరమయ్యాడు. రిషబ్ తిరిగి మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌కు మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. చదవండి: BAN vs AFG: ఆఫ్గాన్ పేసర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే ఏడో బౌలర్‌గా View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) -
వరల్డ్ కప్ కి రిషబ్ పంత్ రీఎంట్రీ ..!
-
డగౌట్ పై రిషబ్ పంత్ జెర్సీ..ఢిల్లీ కి షాక్ ఇచ్చిన బీసీసీఐ
-
గుజరాత్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ పోరు.. పంత్ వచ్చేస్తున్నాడు!
ఐపీఎల్-2023లో భాగంగా మంగళవారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న గుజరాత్ టైటాన్స్.. ఢిల్లీపై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఢిల్లీ భావిస్తోంది. ఢిల్లీ క్యాంప్‌లో పంత్.. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యూలర్ కెప్టెన్ రిషబ్ పంత్ అరుణ్‌జైట్లీ స్టేడియంకు రానున్నట్లు సమాచారం. దగ్గరుండి తన జట్టును సపోర్ట్ చేసేందుకు పంత్ స్టేడియం రానున్నాడు. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. "రిషబ్ ఎప్పుడూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అంతర్భాగమే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఢిల్లీ మొదటి హోం మ్యాచ్‌ను వీక్షించేందుకు పంత్ వచ్చే అవకాశం ఉంది. అతడు స్టేడియంకు వస్తే..కచ్చితంగా జట్టు యజమాని స్పెషల్ బాక్స్ నుంచే మ్యాచ్‌ను వీక్షిస్తాడు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు ఢిల్లీ క్రికెట్ ఆసోసియషన్ చేస్తోంది. అదే విధంగా బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం, భద్రతా విభాగం అనుమతి ఇస్తే.. అతడు ఢిల్లీ డగౌట్లో కూడా కూర్చునే ఛాన్స్ ఉంది" అని ఐపీఎల్ వర్గాలు పీటీఐతో వెల్లడించాయి. చదవండి: IPL 2023- MS Dhoni: చెత్త బౌలింగ్.. 13 వైడ్లు, 3 నోబాల్స్.. పేసర్లకు వార్నింగ్ ఇచ్చిన ధోని.. ఇలాగే కొనసాగితే.. -
పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే?
ఐపీఎల్‌కు-2023కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అయితే అతడు మరో ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. పంత్ తిరిగి మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. పంత్ స్థానంలో కేరళ వికెట్ కీపర్ ఇక ఈ ఏడాది సీజన్‌కు పంత్ దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వ్యవహరించనున్నాడు. కాగా పంత్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో ప్రస్తుతం ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్ పడింది. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫిల్ సాల్ట్ మినహా మరో వికెట్ కీపర్ లేడు. కాబట్టి కచ్చితంగా మరో వికెట్ కీపర్‌ను జట్టులోకి తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో పంత్ స్థానాన్ని కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ అజారుద్దీన్‌తో భర్తీ చేయాలని ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మహ్మద్ అజారుద్దీన్‌కు దేశవాళీ టీ20 క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు దేశవాళీ టీ20 క్రికెట్లో 39 మ్యాచ్‌లు ఆడిన అజారుద్దీన్ 741 పరుగులు సాధించాడు. అతడు ఇన్నింగ్స్‌లలో 1 సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాడు. అదేవిధంగా అతడి కెరీర్లో అత్యధిక స్కోర్ 137(నాటౌట్)గా ఉంది. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం సృష్టించే సత్తా అజారుద్దీన్‌కు ఉంది. ఇక 28 ఏళ్ల అజారుద్దీన్‌కు ఐపీఎల్-2022లో ఆర్సీబీకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే గతేడాది సీజన్‌కు మొత్తం బెంచ్‌కే అజారుద్దీన్ పరమితమయ్యాడు. ఇక ఐపీఎల్-2023కు ముందు ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మినీ వేలంలోకి వచ్చిన అతడిని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే మరోసారి ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం అజారుద్దీన్‌కు పంత్ రూపంలో దక్కనున్నట్లు తెలుస్తోంది. చదవండి: IPL 2023: శ్రేయస్ అయ్యర్ దూరం.. కేకేఆర్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్! -
అతడిని టీమిండియా చాలా మిస్ అవుతోంది.. లేదంటే ఆసీస్‌కు చుక్కలే!
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమికి అడుగు దూరంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకి ఆలౌట్ అయిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో ఆసీస్ ముందు కేవలం 76 పరుగుల లక్ష్యాన్నే మాత్రమే టీమిండియా నిర్దేశించింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం అసాధ్యమే. కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ దాటికి భారత బ్యాటర్లు విలవిల్లాడారు. ఛతేశ్వర్ పూజారా(59) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భారత జట్టులో రిషబ్ పంత్ లేని లోటు సుస్పష్టంగా కన్పిస్తోంది అని కనేరియా అభిప్రాయపడ్డాడు. ఇండోర్ టెస్టులో పంత్ ఉండి ఉంటే లియాన్, కుహ్నెమాన్‌లపై ఎదురుదాడికి దిగేవాడు అని అతడు అన్నాడు. "బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రిషబ్ పంత్‌ను సేవలను టీమిండియా కోల్పోతోంది. ఒకవేళ ఇండోర్ టెస్టుకు జట్టులో పంత్ ఉండే ఉంటే ఆసీస్ స్నిన్నర్లకు చుక్కలు చూపించేవాడు. లియోన్, కుహ్నెమాన్‌లను ఎటాక్ చేసి ఒత్తిడిలోకి నెట్టేవాడు. ఎటువంటి పిచ్‌లపైన అయినా స్నిన్నర్లపై ఎదురుదాడికి దిగే సత్తా అతడికి ఉంది. బంతిని స్టాండ్స్‌కు పంపడం ఒక్కటే అతడికి తెలుసు. అయితే ఈ టెస్టులో మాత్రం భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 250 నుంచి 300 పరుగులు చేసి ఉంటే బాగుండేది. కానీ రెండు ఇన్నింగ్స్‌లలోనూ టీమిండియా విఫలమై ఓటమి అంచున నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 80 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డానిష్ కనేరియా పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్.. అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు -
బీసీసీఐ మంచి మనసు.. పంత్ క్రికెట్ ఆడకపోయినా ఫుల్ సాలరీ!
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ మరో సారి అండగా నిలిచింది. ఇప్పటికే పంత్ ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆరేడు నెలలు గాయంతో పంత్ క్రికెట్ కు దూరమైనా అతడి మొత్తం జీతాన్ని చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది. పంత్ ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ-ఎలో ఉన్నాడు. అంటే ప్రతీ ఏటా రూ.5 కోట్ల రూపయాలు జీతం రూపంలో పంత్‌కు అందనుంది. ఇప్పుడు పంత్ కొన్ని నెలలపాటు క్రికెట్‌కు దూరమైన అతడికి ఫుల్ సాలరీ అందనుంది. అదే విధంగా పంత్‌కు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కాంట్రాక్టు కూడా ఉంది. ఇందుకు గాను రూ. 16 కోట్ల వేతనం అందుతుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దాదాపు దూరమైనట్లే అని చేప్పుకోవాలి. ఈ క్రమంలో ఐపీఎల్-2023 ఆడకపోయినా మొత్తం చెల్లాంచాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లందరికి బీమా ఉంటుంది. వారిలో ఎవరైనా గాయపడితే బోర్డు మొత్తం చెల్లుస్తుంది. ఐపీఎల్లో కూడా ఇదే విధానం అమల్లో ఉంది. అయితే ఐపీఎల్లో సంబంధిత ఫ్రాంచైజీ కాకుండా బీమా సంస్ధలు ఆటగాడికి రావల్సిన మొత్తాన్ని చెల్లిస్తాయి. ఇక ముంబైలోని కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి మోకాలి సర్జరీ కూడా విజయవంతమైంది. అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 8 నుంచి 9 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: WTC FINAL RACE: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా! మరి టీమిండియా సంగతి? -
రిషభ్ పంత్ మోకాలి సర్జరీ సక్సెస్.. కానీ!
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పంత్‌కు శుక్రవారం శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కోకిలాబెన్ ఆసుపత్రిలోనే అతడి మోకాలి లిగమెంట్లకు సర్జరీ చేయించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా పంత్ ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక లండన్‌లో సర్జరీ చేయంచాలని తొలుత బీసీసీఐ భావించింది. కానీ ఇప్పడు ముంబైలోనే చేయించినట్లు సమాచారం. "రిషభ్ పంత్ మోకాలి లిగమెంట్ల శస్త్రచికిత్స శుక్రవారం విజయవంతమైంది. ప్రస్తుతం అతడు వైద్యుల పరిశీలనలో ఉంచారు. తదుపరిగా ఏం చేయాలో, పునరావాసం(రిహాబిలిటేషన్)కు ఎప్పుడు పంపించాలో డాక్టర్ దిన్షా పార్ధీవాలా నేతృత్వంలోని వైద్యబృందం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ వైద్య బృందం, బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ టీంతో నిరంతరం టచ్‌లో ఉంటుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. అయితే పంత్ మాత్రం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు 7 నుంచి 9 నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. దీంతో అతడు స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: IPL 2023: ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా! కానీ పాపం.. -
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పంత్ దూరం! ఆంధ్రా ఆటగాడు అరంగేట్రం..
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిషబ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే అతడు పూర్తి స్థాయిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పంత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్‌కు దూరం కావడం దాదాపు ఖాయమనిపిస్తోంది. దీంతో ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ టెస్టుల్లో భారత్ తరపున అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా ఆస్ట్రేలియా సిరీస్ సమయానికి సిద్దంగా ఉండాలని భరత్‌కు బీసీసీఐ కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా భారత జట్టుకు భరత్ ఎంపిక అవుతున్నప్పటికీ.. కేవలం బ్యాకప్ వికెట్ కీపర్‌గా మాత్రమే ఉండిపోయాడు. 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భరత్‌కు తొలి సారిగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. కానీ రెండో టెస్టులో సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన భరత్.. తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అందరిని అకట్టుకున్నాడు. అదే విదంగా ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భరత్‌కు చోటు దక్కింది. కానీ రెండు మ్యాచ్‌లకు కూడా బెంచ్‌కే పరిమితమ్యాడు. ఇక భరత్‌కు దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో కూడా భరత్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇషాన్ కిషన్ టెస్టు ఎంట్రీ.. బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు భరత్‌కు బ్యాక్‌ఆప్ వికెట్ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో స్వదేశంలో భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. చదవండి: Rishabh Pant: ఐసీయూ నుంచి ప్రైవేటు గదికి రిషభ్ పంత్.. కారణమిదే? -
అంతా ఓకే.. అతని ఆటను మళ్లీ చూస్తాం: బాలీవుడ్ నటులు
టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. క్రీడాకారులు, సినీ ప్రముఖులు సైతం రిషబ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్దెఎత్తున ట్వీట్స్ చేశారు. ప్రధాని మోదీతో పలువురు రాజకీయ ప్రముఖులు ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్‌కు ఢిల్లీ నుంచి వస్తుండగా.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగింది. (ఇది చదవండి: Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు) తాజాగా రిషబ్ పంత్‌ను బాలీవుడ్ నటులు పరామర్శించారు. డెహ్రడూన్‌లో ఆస్పత్రికి వెళ్లిన అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ క్రికెటర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ రిషబ్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అనిల్ కపూర్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం పంత్ బాగానే ఉన్నాడు. అభిమానులుగా మేము అతనిని కలిశాం. రిషబ్ త్వరగా కోలుకోవాలని మనందరం ప్రార్థిద్దాం. అతని ఆటను మళ్లీ గ్రౌండ్లో చూస్తాం.' అని అన్నారు. అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. 'పంత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు వచ్చాం. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. పంత్, అతని తల్లి, బంధువులను కలిసి మాట్లాడాం. అందరికీ ధైర్యంగా ఉండాలని చెప్పాం. మేము వారందరినీ నవ్వించాం.' అని అన్నారు.