బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా మూడో రోజు ఆటకు దూరమైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట సందర్భంగా పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి నాలుగో రోజును పంత్ ప్రారంభించాడు. నిజంగా ఇది భారత్‌కు ఆదిరిపోయే వార్త అనే చెప్పుకోవాలి. పంత్ గాయం తీవ్రమైనది కావడంతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టడని చాలా మంది భావించారు.
కానీ పంత్ మాత్రం ఫిజియోల సాయంతో ఫిట్‌నెస్ సాధించి బ్యాటింగ్‌కు దిగాడు. ప్రస్తుతం భారత్ 53 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(88), పంత్(1) ఉన్నారు. భారత్ ఇంకా 103 పరుగుల వెనకంజలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment