న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో టీమిండియా వైట్‌వాష్ అయినప్పటికి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అద్బుత ఇన్నింగ్స్‌లతో అందరని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో రిషబ్ విరోచిత పోరాటం కనబరిచాడు.
బంతి గింగరాల తిరుగుతున్న చోట కివీస్ స్పిన్నర్లను పంత్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట పంత్ బౌండరీల వర్షం కురిపించాడు. ఓ దశలో భారత్‌ను గెలిపించేలా కన్పించిన పంత్.. ఓ వివాదస్పద నిర్ణయంతో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.
దీంతో 25 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ ముగిసి రెండు రోజులు అవుతున్నప్పటికి పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. అతడి సాహసోపేత ఇన్నింగ్స్‌కు న్యూజిలాండ్ ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. పంత్ క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయంట. ఈ విషయాన్ని స్వయంగా ముంబై టెస్టు హీరో అజాజ్ పటేల్ చెప్పుకోచ్చాడు.
అజాజ్ పటేల్ తాజాగా ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించినప్పుడు న్యూజిలాండ్ జట్టు భయపడిందా అన్న ప్రశ్న అజాజ్‌కు ఎదురైంది. అవును రిషబ్ క్రీజులో ఉన్నప్పుడు మేముంతా చాలా భయపడ్డాము అని అజాజ్ పటేల్ బదులిచ్చాడు.
ఈ సిరీస్‌లో రిషబ్ పంత్‌ను ఎక్కువగా టార్గెట్ చేశాం. అతడు క్రీజులో ఉన్నప్పుడు ఏ బౌలర్‌కు భయపడడు. ఏది ఏమైనా తన ఆట ఆడుతుంటాడు. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు రాబట్టడానికే ప్రయత్నిస్తాడు. అతడు త్వరగా ఔట్ అయితే ఏ సమస్య లేదని అజాజ్ పటేల్ అదే ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు?
Comments
Please login to add a commentAdd a comment