Ajaz Patel
-
అతడు క్రీజులో ఉన్నంతవరకూ మేము భయపడ్డాము: అజాజ్ పటేల్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో టీమిండియా వైట్‌వాష్ అయినప్పటికి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అద్బుత ఇన్నింగ్స్‌లతో అందరని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో రిషబ్ విరోచిత పోరాటం కనబరిచాడు.బంతి గింగరాల తిరుగుతున్న చోట కివీస్ స్పిన్నర్లను పంత్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట పంత్ బౌండరీల వర్షం కురిపించాడు. ఓ దశలో భారత్‌ను గెలిపించేలా కన్పించిన పంత్.. ఓ వివాదస్పద నిర్ణయంతో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. దీంతో 25 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ ముగిసి రెండు రోజులు అవుతున్నప్పటికి పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. అతడి సాహసోపేత ఇన్నింగ్స్‌కు న్యూజిలాండ్ ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. పంత్ క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయంట. ఈ విషయాన్ని స్వయంగా ముంబై టెస్టు హీరో అజాజ్ పటేల్ చెప్పుకోచ్చాడు.అజాజ్ పటేల్ తాజాగా ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించినప్పుడు న్యూజిలాండ్ జట్టు భయపడిందా అన్న ప్రశ్న అజాజ్‌కు ఎదురైంది. అవును రిషబ్ క్రీజులో ఉన్నప్పుడు మేముంతా చాలా భయపడ్డాము అని అజాజ్ పటేల్ బదులిచ్చాడు.ఈ సిరీస్‌లో రిషబ్ పంత్‌ను ఎక్కువగా టార్గెట్ చేశాం. అతడు క్రీజులో ఉన్నప్పుడు ఏ బౌలర్‌కు భయపడడు. ఏది ఏమైనా తన ఆట ఆడుతుంటాడు. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు రాబట్టడానికే ప్రయత్నిస్తాడు. అతడు త్వరగా ఔట్ అయితే ఏ సమస్య లేదని అజాజ్ పటేల్ అదే ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
IND VS NZ 3rd Test: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్ చరిత్ర ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు నాలుగు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది తొలిసారి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్‌లో ఇది జరిగింది. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా, న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయగా.. అజాజ్ పటేల్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు.కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, ఆకాశ్‌దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) అర్ద సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు.28 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 174 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తలో వికెట్ పడగొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 121 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6 వికెట్లు పడగొట్టగా.. ఫిలిప్స్ 3 వికెట్లతో తీశాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(64) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
చరిత్ర సృష్టించిన అజాజ్ పటేల్
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్ కూడా అతడే! అంతేకాదు.. మాతృదేశంలో.. విదేశీ జట్టుకు ఆడుతూ ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన రికార్డునూ అజాజ్ పటేల్ సొంతం చేసుకున్నాడు.కాగా ముంబైలో జన్మించాడు అజాజ్ పటేల్. ఆ తర్వాత అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు మకాం మార్చింది. అయితే, బాల్యం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అజాజ్ అంచెలంచెలుగా ఎదిగి కివీస్ ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. ఈ క్రమంలో 2021లో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌తో ఒక్కసారిగా అతడు భారత్‌లో ఫేమస్ అయ్యాడు.నాడు 10 వికెట్ల హాల్ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాడు టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 వికెట్లు కూల్చాడు. జన్మనిచ్చిన గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు అజాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తన జట్టును గెలిపించలేకపోయాడు.ఈసారి ఐదేసిన అజాజ్ఇక తాజాగా టీమిండియాతో మ్యాచ్‌లో మరోసారి అజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లతో మెరిశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(30)తో పాటు శుబ్‌మన్ గిల్(90), మహ్మద్ సిరాజ్(0), సర్ఫరాజ్ ఖాన్(0), రవిచంద్రన్ అశ్విన్(6)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో భారత్ ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్ల జాబితాలో అజాజ్ పటేల్ చోటు సంపాదించాడు. వాంఖడే స్టేడియంలో ఇప్పటి వరకు అజాజ్ 19 వికెట్లు(10+4+5) పడగొట్టాడు.భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్లుఇయాన్ బోతమ్(ఇంగ్లండ్)- వాంఖడేలో 22 వికెట్లుఅజాజ్ పటేల్(న్యూజిలాండ్)- వాంఖడేలో 19 వికెట్లురిచీ బెనాడ్(ఆస్ట్రేలియా)- ఈడెన్ గార్డెన్స్‌లో 18 వికెట్లుకర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్)- వాంఖడేలో 17 వికెట్లు.భారత్ 263 ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మొదలైన మూడో టెస్టులో ఇరుజట్ల బౌలర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను భారత్ 235 పరుగులకు తొలిరోజే ఆలౌట్ చేసింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. తర్వాత భారత్ బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో 86/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు -
అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్న యశస్వి
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా కష్టాల ఊబిలో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కాలంటే మరో రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు టార్గెట్‌ను న్యూజిలాండ్ ముందుంచాలి. భారత్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 282 పరుగులు వెనుకపడి ఉంది. చేతిలో మరో తొమ్మిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. రోహిత్ శర్మ (37), విరాట్ కోహ్లి (0) క్రీజ్‌లో ఉన్నారు.అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. రచిన్ రవీంద్ర (134) సెంచరీతో, డెవాన్ కాన్వే (91), టిమ్ సౌథీ (65) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, అశ్విన్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.pic.twitter.com/2qmdnkyZmK— ViratKingdom (@kingdom_virat1) October 18, 2024అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్న యశస్వితొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి మ్యాచ్‌పై పట్టు కోల్పోయిన భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయినా జాగ్రత్తగా ఆడాలని అభిమానులు కోరుకున్నారు. అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (35) అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకుని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. యశస్వి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు క్రీజ్ వదిలి ముందుకు వచ్చి స్టంపౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి షాట్ ఆడాల్సిన అవసరం లేదు. అయినా యశస్వి ఓవరాక్షన్ చేసి చేజేతులా వికెట్‌ను సమర్పించుకున్నాడు.కుప్పకూలిన భారత్మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఓరూర్కీ (4/22), సౌథీ (1/8) ధాటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారు. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. చదవండి: PAK VS ENG 2nd Test: 52 ఏళ్లలో తొలిసారి ఇలా..! -
IND Vs NZ: ఇలా ఎలా బౌల్డ్ అయ్యాను? షాక్‌లో రోహిత్ శర్మ
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రోహిత్ శర్మకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హిట్‌మ్యాన్ నిర్ణయం బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(2) సహా స్టార్ బ్యాటర్లంతా విఫలం కావడంతో 46 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది.టీమిండియా శుభారంభంఅనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 రన్స్ చేసి.. ఏకంగా 356 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుభారంభమే అందుకుంది.రోహిత్ హాఫ్ సెంచరీఓపెనర్లు యశస్వి జైస్వాల్ 52 బంతులు ఎదుర్కొని 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రోహిత్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేశాడు. అయితే, నిలకడగా ఆడుతున్న సమయంలో రోహిత్ దురదృష్టకరరీతిలో అవుట్ అయ్యాడు.ఊహించని రీతిలో బౌల్డ్భారత రెండో ఇన్నింగ్స్ 22వ ఓవర్‌ను కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ వేశాడు. అతడి బౌలింగ్‌లో ఐదో బంతికి రోహిత్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, ఊహించని విధంగా బంతి బ్యాట్‌ను తాకి.. బౌన్స్ అయి వికెట్లను తాకగా.. స్టంప్స్ ఎగిరిపడ్డాయి. నిజంగా ఇది రోహిత్ దురదృష్టమనే చెప్పవచ్చు.ఇలా ఎలా బౌల్డ్ అయ్యాను?.. దురదృష్టం భయ్యా!ఒకవేళ ప్రమాదాన్ని పసిగట్టి కాస్త జాగ్రత్త పడి ఉంటే వికెట్ నిలిచేదే! ఏదేమైనా.. తాను అవుటైన తీరుపై రోహిత్ శర్మ సైతం తీవ్ర నిరాశకు గురయ్యాడు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ అతడు.. ‘‘ఇలా ఎలా బౌల్డ్ అయ్యాను?’’ అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘ఈ మ్యాచ్‌లో నువ్వు నిజంగా అన్‌లక్కీ భయ్యా’’ అంటూ నెటిజన్లు రోహిత్‌పై సానుభూతి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా 25 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్👉మొదటి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు కాగా.. రెండో రోజు టాస్ పడింది👉బెంగళూరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ👉భారత్ తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే ఆలౌట్👉పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయానంటూ తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్ 👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్.చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema)What a terrible test match for Rohit Sharma to remember in all senses.#INDvNZ pic.twitter.com/f0d3gtrGvZ— iNaveenVijayakumar (@iNaveentalks) October 18, 2024 -
రచిన్ రవీంద్రకు బంపరాఫర్
న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్రకు బంపరాఫర్ దక్కింది. కివీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో తొలిసారి అతడు చోటు దక్కించుకున్నాడు.గత ఏడాది కాలంగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న రచిన్‌కు బోర్డు ఈ మేరకు సముచిత స్థానం కల్పించింది. 2024- 25 ఏడాదికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రతిపాదిత జాబితాలోని 20 మంది ఆటగాళ్లలో 24 ఏళ్ల రచిన్‌కు చోటు ఇచ్చింది.బెంగళూరు మూలాలుభారత్లోని బెంగళూరు మూలాలు ఉన్న రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. గతేడాది కివీస్ తరఫున అతడు 578 పరుగులు సాధించాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ఆట తీరుతో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.అంతేకాదు.. ఈ ఏడాది మార్చిలో.. ప్రతిష్టాత్మక సర్ రిచర్డ్ హాడ్లీ మెడల్ అందుకున్నాడు. తద్వారా ఈ మెడల్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడుతూ తాజాగా సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు.ఈ సందర్భంగా రచిన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నానని.. ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బ్లాక్‌క్యాప్స్ తరఫున ఆడటం తనకు దక్కిన గొప్ప గౌరవమని.. ఇప్పుడిలా కాంట్రాక్టు దక్కించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. రూ. 1.8 కోట్లుకాగా రచిన్ రవీంద్రతో పాటు బెన్ సియర్స్, విల్ ఓ రూర్కే, జాకోబ్ డఫీలు కూడా తొలిసారి న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు సంపాదించారు.న్యూజిలాండ్ తరఫున ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడిన రచిన్ రవీంద్ర 519 పరుగులు చేశాడు. ఇక 25 వన్డేలు ఆడిన అతడి ఖాతాలో 820 పరుగులు ఉన్నాయి. ఇందులో మూడు సెంచరీలు. కాగా ఐపీఎల్లో రచిన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది వేలంలో రూ. 1.8 కోట్లకు అతడు అమ్ముడుపోయాడు.ఇక 23 టీ20 ఆడిన రచిన్ 231 పరుగులు చేయగలిగాడు. అదే విధంగా.. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో వరుసగా 10, 18, 13 వికెట్లు పడగొట్టాడు. కాగా సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది సంబంధిత క్రికెట్ బోర్డు, క్రికెటర్ల మధ్య కుదిరే వార్షిక ఒప్పందం. అందుకు అనుగుణంగానే ప్లేయర్ల పారితోషికం, సదుపాయాలు ఉంటాయి.న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2024- 25గానూ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
Pak Vs NZ: మెరిసిన హెన్రీ, ఎజాజ్.. కివీస్ భారీ స్కోరు
Pakistan vs New Zealand, 2nd Test- కరాచీ: టెయిలెండర్లు మ్యాట్ హెన్రీ (68 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎజాజ్ పటేల్ (35; 4 ఫోర్లు) అసాధారణ పోరాటంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓవర్‌నైట్ స్కోరు 309/6తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ 449 స్కోరు వద్ద ఆలౌటైంది. 345/9 స్కోరు వద్ద కివీస్ పతనం అంచున నిలిచింది. ఈ దశలో హెన్రీ, ఎజాజ్ ఆఖరి వికెట్‌కు 104 పరుగులు జోడించారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఇమామ్ (74 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్), షకీల్ (13 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. కాగా.. తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో పై చేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. చదవండి: IND vs SL: అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్ అందించడానికా సెలక్ట్ చేశారు? IPL 2023: ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్’ దూరం?! Abrar Ahmed finally ends the 10th-wicket stand. New Zealand are all out for 449 🏏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/esH89R4AOd — Pakistan Cricket (@TheRealPCB) January 3, 2023 -
కివీస్‌తో పాక్ మ్యాచ్.. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
Pakistan vs New Zealand, 1st Test: టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. వరల్డ్ టెస్టు చాంపియన్సషిప్ 2021-23 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో కరాచీ వేదికగా సోమవారం(డిసెంబరు 26) ఆరంభమైన తొలి మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు నమోదైంది. టాస్ గెలిచిన ఆతిథ్య పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌతీ.. బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో నాలుగో ఓవర్లో బంతిని అజాజ్ పటేల్ చేతికి ఇవ్వగా.. స్పిన్‌తో తిప్పేశాడు. ఈ బాల్‌ను అంచనా వేయడంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(7) విఫలం కాగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండల్ అతడిని స్టంపౌట్ చేశాడు. 145 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇక ఏడో ఓవర్ మొదటి బంతికి బ్రాస్‌వెల్ బౌలింగ్‌లోనూ వన్‌డౌన్ బ్యాటర్ షాన్ మసూద్(3)ను ఇదే రీతిలో బ్లండల్ స్టంపౌట్ చేశాడు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు నమోదైంది. 145 ఏళ్ల పురుషుల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా తొలి రెండు వికెట్లు స్టంపౌట్ ద్వారా లభించడం ఇదే మొదటిసారి కాగా.. ఓవరాల్‌గా రెండోసారి. గతంలో.. 1976లో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జమైకాలో జరిగిన టెస్టులో తొలిసారి ఈ ఫీట్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ మారీ కార్నిష్ నాలుగు వికెట్లు(టూయీస్ బ్రౌనీ, జాస్మిన్ సామీ, గ్లోరియా గిల్) తీయగా.. అందులో మూడు స్టంపౌట్లే ఉండటం విశేషం. చదవండి: Ind Vs Ban: ఆ క్యాచ్ పడితే నీ ఆట ముగిసేది.. భారత్ 89కే ఆలౌట్ అయ్యేది! దిమ్మతిరిగేలా అశ్విన్ కౌంటర్ Mohammad Rizwan: వైస్ కెప్టెన్‌పై వేటు! 4 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలి మ్యాచ్.. ఆఫ్రిదిపై విమర్శలు Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు -
భారత్‌పై పదికి పది వికెట్లు తీసిన బౌలర్ టీషర్ట్ వేలానికి..
న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ మీ అందరికి గుర్తుండే ఉంటాడు. గతేడాది డిసెంబర్లో వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి ఎజాజ్ పటేల్ క్రికెట్ చరిత్రను తిరగరాశాడు. తద్వారా టెస్టు క్రికెట్లో ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఎజాజ్ పటేల్ కంటే ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేలు ఈ ఘనత సాధించారు. తాజాగా ఎజాజ్ పటేల్ ఏ జెర్సీతో ఆ ఫీట్ సాధించాడో.. అదే జెర్సీని వేలం వేయబోతున్నట్లు తెలిపాడు. ఎజాజ్ పటేల్ తన టీషర్ట్ వేలం వేయడం వెనుక దాగున్న చిన్నకథను స్టఫ్ డాట్‌కామ్ వెబ్సైట్ రివీల్ చేసింది. గతేడాది ఎజాజ్ పటేల్ కూతురు ఆరోగ్య సమస్యతో బాధపడింది. న్యూజిలాండ్‌లోని స్టార్‌షిప్ చిల్రన్ ఆసుపత్రిలో తన కూతురుకు చికిత్స చేయించాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కొన్నిరోజులు ఉండాల్సి వచ్చింది. కొంచెం భయమైనప్పటికి ఎజాజ్ పటేల్ కూతురు తొందరగానే రికవరీ అయింది. అయితే తన కూతురును బాగు చేసిన ఆసుపత్రికి ఏదైనా చేయాలని భావించాడు. కొన్నిరోజుల క్రితం స్టార్‌షిప్ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగం చిన్న పిల్లల చికిత్స కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న ఎజాజ్ పటేల్ 10 వికెట్ ఫీట్ సాధించిన రోజున వేసుకున్న టీషర్ట్‌ను వేలానికి వేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ టీషర్ట్‌పై న్యూజిలాండ్ జట్టు సభ్యుల సంతకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎజాజ్ తన టీషర్డ్ను వేలానికి పెట్టాడు.. బుధవారం(మే 11తో) వేలం ముగియనుంది. ఇక టీమిండియాతో తొలి టెస్టులో 14 వికెట్లతో ఎజాజ్ పటేల్ మంచి ప్రదర్శన చేసినప్పటికి జట్టు ఓటమిపాలైంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత న్యూజిలాండ్ 65 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆడిన భారత్ ఇన్నింగ్స్‌ను 276 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తద్వారా న్యూజిలాండ్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచగా.. కివీస్ 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టును గెలిచిన టీమిండియా 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మకు రెగ్యులర్ టెస్టు కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. ఆ తర్వాత జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. చదవండి: IND Vs NZ: వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్‌గా ‘టెన్’ రికార్డు -
టీమిండియా ఓపెనర్‌కు నిరాశ.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న న్యూజిలాండ్ స్పిన్నర్
Ajaz Patel: టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు నిరాశ ఎదురైంది. డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో మాయంక్ అగర్వాల్, అజాజ్ పటేల్‌లతో పాటు ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉన్నప్పటికీ.. అజాజ్‌నే అవార్డు వరించింది. గతేడాది డిసెంబర్లో ముంబై వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల పడగొట్టిన అజాజ్.. జిమ్‌లేకర్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ టెస్ట్‌లో మొత్తం 14 వికెట్లు తన ఖాతాలోకి వేసుకున్న అజాజ్.. తన జన్మస్థలమైన ముంబైలో అరుదైన ఫీట్‌ను సాధించాడు. కాగా, అవార్డు ప్రకటన సందర్భంగా ఐసీసీ ఓటింగ్ కమిటీ మెంబర్ జేపీ డుమిని మాట్లాడుతూ.. క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే 10 వికెట్ల ఫీట్‌ను అందుకున్న అజాజ్‌కు ఐసీసీ జ్యూరీతో పాటు అభిమానులు భారీ ఎత్తున ఓటింగ్ చేశారని, మరి ముఖ్యంగా భారత అభిమానులు అజాజ్ పటేల్‌కు భారీ ఎత్తున మద్దతు తెలిపారని పేర్కొన్నాడు. అజాజ్ సాధించిన ఫీట్ చాలా ప్రత్యేకమైందని, చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోతుందని డుమిని అన్నాడు. చదవండి: NZ Vs BAN: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు -
ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా ఓపెనర్.. పది వికెట్ల కివీస్ బౌలర్ కూడా..
2021 డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నామినేట్ అయ్యాడు. అతనితో పాటు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కూడా అవార్డు రేసులో నిలిచారు. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన మయాంక్.. గత నెలలో ఆడిన రెండు టెస్ట్‌ల్లో (న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఒకటి, ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్‌లో తొలి టెస్ట్) 69 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. An Aussie fast bowler, an in-form India opener and a record-equaling spinner from New Zealand. Who will be your ICC Men's Player of the month? 👀 Details 👉 https://t.co/XsumbkHtzj And VOTE 🗳️ https://t.co/FBb5PMInKI pic.twitter.com/hhZeqJIopf — ICC (@ICC) January 8, 2022 ఇక ఇదే సిరీస్‌లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్ల సాధించి.. జిమ్‌లేకర్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసాడు. ఆ టెస్ట్‌లో మొత్తం 14 వికెట్లను తన ఖాతాలోకి వేసుకున్న అజాజ్.. మాయంక్తో పాటు అవార్డు రేసులో నిలిచాడు. మరోవైపు ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో సత్తా చాటుతున్న ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ వీరికి పోటీగా నిలిచాడు. స్టార్క్ డిసెంబర్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 19.64 సగటుతో 14 వికెట్లు తీశాడు. చదవండి: పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు -
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌కు బిగ్‌షాక్!
ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌ను తర్వాత సిరీస్ నుంచే తప్పించారు. బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో అతనికి చోటు దక్కలేదు. ఇది బాధ కలిగించేదే అయినా స్వదేశంలో జరిగే సిరీస్‌లో తమ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌కు చోటు లేదని, ఘనతలను బట్టి కాకుండా టీమ్ అవసరాలను బట్టే ఆటగాళ్లను ఎంపిక చేస్తామని కివీస్ సెలక్టర్లు ప్రకటించారు. కాగా, ముంబై వేదికగా భారత్‌తో జరిగిన టెస్ట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సిరీస్‌కు కెప్టెన్ విలియమ్సన్కు సెలక్టర్లు విశ్రాంతిని కల్పించారు. అతడి స్ధానంలో టామ్ లాథమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (సి), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వారం), రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, డెవాన్ కాన్వే చదవండి: Ashwin-Steve Smith: 'స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసేందుకు ఆరు నెలలు రీసెర్చ్ చేశా' -
R Ashwin: బౌలర్‌గా,ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన అశ్విన్.. నెం2..
R Ashwin moves up to the No.2 spot among allrounders: ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకిగ్స్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఏకంగా 30స్ధానాలు ఎగబాకి 11వ స్ధానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరగిన రెండో టెస్ట్‌లో మయాంక్ వరుసగా 150, 62 పరుగులు సాధించాడు. అదేవిధంగా మరో ఓపెనర్ శుభమాన్ గిల్ 21 స్ధానాలు ఎగబాకి 45వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక తొలి స్థానంలో 903 పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఉన్నాడు. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్(879), మార్నస్ లబుషేన్(878) మూడు, నాలుగో స్ధానంలో కొనసాగుతున్నారు. మార్నస్ లబుషేన్ రోహిత్ శర్మ(797 పాయింట్లు), విరాట్ కోహ్లి( 775 పాయింట్లు) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. 908 పాయింట్లతో పాట్ కమ్మిన్స్ అగ్ర స్ధానంలో కొనసాగుతుండగా, 883 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ స్సిన్నర్ అజాజ్ పటేల్ 23 స్ధానాలు ఎగబాకి 38 వ స్ధానానికి చేరుకున్నాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అజాజ్ పటేల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో 382 పాయింట్లతో జాసన్ హోల్డర్ తొలి స్ధానంలో ఉండగా, అశ్విన్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. చదవండి: ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు R Ashwin moves up to the No.2 spot in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings for all-rounders. Full list: https://t.co/vrogyWdn0u pic.twitter.com/RwPzCXd57J — ICC (@ICC) December 8, 2021 -
అవకాశం రావాలే కాని.. ఐపీఎల్‌పై మనసులో మాటను బయటపెట్టిన అజాజ్ పటేల్
Would Love To Play In Indian Premier League Says Ajaz Patel: టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో పదికి పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ తాజా సంచలనం అజాజ్ పటేల్ క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై తన మనసులోని మాటను బయటపెట్టాడు. అవకాశం రావాలే కాని ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని అస్సలు వదులుకోలేనని తెలిపాడు. భారత్ వేదికగా జరిగే ఐపీఎల్లో ఆడడం చాలా గొప్ప అనుభూతి అని, అలాంటి థ్రిల్లింగ్ లీగ్‌లో పాల్గొనే అవకాశం కోసం ప్రతి క్రికెటర్ ఎదురుచూస్తాడని పేర్కొన్నాడు. ప్రతి ఐపీఎల్ సీజన్‌ను మిస్ కాకుండా అనుసరించానని, వచ్చే ఏడాది జరగబోయే మెగా లీగ్‌లో ఆడే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఐపీఎల్‌పై తన క్రష్‌ను బహిర్గతం చేశాడు. కాగా, ముంబై వేదికగా భారత్‌తో జరిగిన చివరిదైన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు నేలకూల్చిన అజాజ్.. రాత్రికిరాత్రి హీరోగా మారిపోయాడు. క్రికెట్ చరిత్రలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత ఈ అత్యంత అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. అజాజ్ అద్భుతమైన ప్రతిభ చూపినప్పటికీ ఆ మ్యాచ్‌లో కివీస్ 372 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవ్వడం విశేషం. చదవండి: జనవరి 11, 2022.. ఆ రోజు కోహ్లికి చిరకాలం గుర్తుండిపోనుంది.. ఎందుకంటే..? -
ఎజాజ్ పటేల్‌కు అశ్విన్ సాయం.. ఫ్యాన్స్ ఫిదా
Ravichandran Ashwin Helps Ajaz Patel.. టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా ఎజాజ్ నిలిచాడు. ఒకవైపు ఎజాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్నవేళ .. ఒక విషయంలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎజాజ్‌కు సాయపడ్డాడు. చదవండి: Babar Azam: బాబర్ అజమ్ హాఫ్ సెంచరీ .. పాపం ప్రకృతి సహకరించడం లేదు ఎజాజ్ 10 వికెట్ల ఫీట్ సాధించనంతవరకు అతని పేరు పెద్దగా ఎవరికి పరిచయం లేదు. అతను పేరిట ట్విటర్ ఎకౌంట్ ఉన్నప్పటికి బ్లూ టిక్ మార్క్ లేదు. ఈ విషయాన్ని గమనించిన అశ్విన్ స్వయంగా రంగంలోకి దిగి ఎజాజ్ తరపున ట్విటర్‌కు రిక్వెస్ట్ పెట్టాడు. '' డియర్ ట్విటర్.. టెస్టు చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఎజాజ్ నిలిచాడు. అతని అకౌంట్‌ను వెరిఫై చేసి బ్లూ టిక్ మార్క్ ఇవ్వండి'' అంటూ రాసుకొచ్చాడు. అశ్విన్ పోస్ట్‌కు స్పందించిన ట్విటర్ అధికారులు ఎజాజ్‌ను వెరిఫై చేసి బ్లూటిక్ మార్క్ ఇచ్చారు. ఇది తెలుసుకున్న అశ్విన్ తర్వాత ట్విటర్‌కు థ్యాంక్స్ చెబుతూ రీట్వీట్ చేశాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు 10 వికెట్లు ప్రదర్శన చేసిన ఎజాజ్‌కు అశ్విన్ తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ జెర్సీపై టీమిండియా ఆటగాళ్ల సంతకాలు ఉండడం విశేషం. ఇక అశ్విన్ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు తీసిన అశ్విన్.. ఓవరాల్‌గా రెండు టెస్టులు కలిపి 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. చదవండి: IND vs SA: రహానే, గిల్‌కు షాక్.. ఆకాశ్ చోప్రా ఫేవరెట్ జట్టులో దక్కనిచోటు Dear @verified , a ten wicket bag in an innings definitely deserves to be verified here! 😂 @AjazP — Ashwin 🇮🇳 (@ashwinravi99) December 6, 2021 Thank you @verified 🤩 — Ashwin 🇮🇳 (@ashwinravi99) December 6, 2021 -
Ind Vs Nz: అక్షర్.. పటేల్.. రవీంద్ర.. జడేజా.. ఇదేదో సర్ఫ్ యాడ్‌లా ఉందే!
Ind Vs Nz: Axar Azaz Rachin Ravindra Jadeja BCCI Shared Pic Viral India Won: అజాజ్ పటేల్.. రచిన్ రవీంద్ర... టీమిండియా- న్యూజిలాండ్ టెస్టు సిరీస్ సందర్భంగా ఈ రెండు పేర్లు భారత అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఇద్దరూ భారత మూలాలున్న క్రికెటర్లే.. ఇద్దరి కుటుంబాలు న్యూజిలాండ్‌కు వలస వెళ్లగా.. అక్కడి అంతర్జాతీయ క్రికెట్ జట్టులో ఈ ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. ఇక తొలి టెస్టులో భారత్‌తో దోబూచూలాడిన విజయాన్ని దక్కకుండా అడ్డుకున్నదీ వీరిద్దరేనన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అజాజ్, రచిన్ అడ్డుగోడగా నిలబడటంతో టీమిండియా ఆఖరి వికెట్ తీయలేకపోవడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. ఇక ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టులో... పుట్టిన గడ్డ మీద అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఏకంగా పది వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. మరోవైపు.. టీమిండియా ఆటగాళ్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కూడా టెస్టు సిరీస్‌లో తమదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో.. రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత ఈ నలుగురు స్పిన్నర్లు కలిసి దిగిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. PC: BCCI నలుగురూ తమ జెర్సీ నంబర్లు, పేర్లు కనబడేలా వెనుకకు నిల్చుని ఫొటోలు దిగారు. అక్షర్(అక్షర్ పటేల్).. పటేల్(అజాజ్ పటేల్)... రవీంద్ర(రచిన్ రవీంద్ర)... జడేజా(రవీంద్ర జడేజా) వరుసగా నిలబడి... అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా పూర్తి పేర్లు వచ్చేలా పోజులిచ్చారు. ఇక రచిన్, జడేజా జెర్సీ నెంబర్లు కూడా ఒకటే(నంబర్ 8) కావడం విశేషం. ఈ ఫొటోను షేర్ చేసిన బీసీసీఐ.. ‘‘ఆ నలుగురు ఎలా ఉన్నారు’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఈ క్రమంలో.. ‘‘వావ్ ఈ సీన్ అదిరింది. నలుగురు స్పిన్నర్లు.. సూపర్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు... ‘‘తెలుపు.. పూర్తి తెలుపు.. ఇదేదో సర్ఫ్ యాడ్‌లా ఉందే’’ అని సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. చదవండి: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే.. Rachin Ravindra Facts: ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్‌తో ఏంటి సంబంధం? In Sync! ☺️ How's that for a quartet! 🇮🇳 🇳🇿#INDvNZ #TeamIndia @Paytm pic.twitter.com/eKqDIIlx7m — BCCI (@BCCI) December 6, 2021 -
వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్‌గా ‘టెన్’ రికార్డు
ఒకటి, రెండు, మూడు, నాలుగు... భారత ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నారు... న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ వికెట్ల లెక్క కూడా మారుతోంది... తొలి రోజు ఆట ముగిసేసరికి పడిన నాలుగు వికెట్లూ అతని ఖాతాలోనే... ఎజాజ్ సంబరపడ్డాడు. తాను పుట్టిన ఊర్లో ఒక గుర్తుంచుకునే ప్రదర్శన వచ్చినందుకు అందరి ముందు సంతోషాన్ని ప్రదర్శించాడు. శనివారం ఉదయం సాహా అవుట్ కాగానే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత... ఇదీ చెప్పుకోదగ్గ విశేషమే! తర్వాతి బంతికే ఆరో వికెట్. కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కూడా వచ్చేసింది. టెస్టుల్లో భారత జట్టు తొలి ఆరు వికెట్లు ఒక స్పిన్నర్‌కు కోల్పోవడం ఇదే తొలిసారి. అయినా సరే అద్భుతం జరగవచ్చని ఎవరూ ఊహించడం లేదు. ‘ఆ ఘనత’ సాధ్యమా అనే చర్చ కూడా వినిపించలేదు. దాదాపు 28 ఓవర్ల పాటు మరో వికెట్ పడకపోవడంతో ఎజాజ్ బౌలింగ్‌పై విశ్లేషణ కూడా దాదాపుగా ఆగిపోయింది. కానీ ఎజాజ్ మాత్రం యంత్రంలా అలుపెరుగకుండా బౌలింగ్ చేస్తూనే పోయాడు. మయాంక్ వికెట్‌తో ఒక్కసారిగా కదలిక... ఏదైనా సాధ్యమే అనిపించింది! కొద్ది సేపటి తర్వాత ఆ సమయం రానే వచ్చింది. 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు... అంతే! పదికి పది.. ఎజాజ్ యూనుస్ పటేల్ టెస్టు క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 144 ఏళ్లు... 2,438 టెస్టుల చరిత్రలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. పాతికేళ్లు తిరిగే సరికి... శుక్రవారం తొలి రోజు 4 వికెట్లు తీసిన ఎజాజ్ పటేల్ ఆట ముగిసిన తర్వాత వాంఖెడే స్టేడియం నుంచి బయటకు వెళుతూ అక్కడి ‘ఆనర్స్ బోర్డ్’ వద్ద క్షణకాలం పాటు ఆగి బోర్డు వైపు చూస్తూ నిలబడ్డాడు. ఈ మైదానంలో సెంచరీలు సాధించిన, ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా దానిపై ఉంది. రేపు మరో వికెట్ తీసి తన పేరు అక్కడ చేర్చాలని అతను అనుకున్నాడు. అయితే ఐదు వికెట్లే కాదు... మరికొన్ని గంటల్లో ఏకంగా 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టిస్తానని అతను ఊహించి ఉండకపోవచ్చు! ► ముంబైలోనే పుట్టిన ఎజాజ్ ఎనిమిదేళ్ల వయసులో ఉపాధి కోసం అతని కుటుంబం న్యూజిలాండ్‌కు తరలి వెళ్లింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకో, ఇక్కడే ఉండిపోయిన బంధుమిత్రులను కలిసేందుకో గతంలోనూ ఎజాజ్ చాలా సార్లు వచ్చాడు. కానీ ఈసారి మాత్రం పుట్టిన గడ్డపై ఒక అద్భుతాన్ని సృష్టించేందుకే వచ్చినట్లున్నాడు. బాంబేను వీడిన సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మరో జట్టు తరఫున ఆడేందుకు వచ్చి భారత్‌పైనే అతను అత్యంత అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ పాతికేళ్ల ప్రస్థానం అతని కళ్ల ముందు కచ్చితంగా సినిమా రీళ్లలా కదలాడి ఉంటుంది! ► ముంబై టెస్టుకు ముందు మూడేళ్ల కెరీర్లో ఎజాజ్ పటేల్ ఆడినవి 10 మ్యాచ్‌లే! 32.48 పరుగుల సగటుతో 29 వికెట్లు తీసిన సాధారణ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్. టీమ్ మేనేజ్మెంట్ లెక్కల్లో అతను ఆ జట్టు నంబర్‌వన్ స్పిన్నర్ కూడా కాదు. సాన్‌ట్నర్, ఇష్ సోధిల తర్వాతే అతనికి ప్రాధాన్యం. వీరిలో ఎవరైనా తప్పుకుంటేనే మ్యాచ్ దక్కే అవకాశం. కెరీర్ తొలి టెస్టులోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచినా అది అతని కెరీర్ జోరుగా సాగేందుకు ఏమాత్రం పనికి రాలేదు. సరిగ్గా చెప్పాలంటే తాజా ప్రదర్శనకు ముందు 33 ఏళ్ల ఎజాజ్‌కు పెద్దగా గుర్తింపూ లేదు. కానీ ఇకపై ఎవరూ మరచిపోలేని విధంగా తన పేరును అతను చరిత్రలో చెక్కుకున్నాడు! ► న్యూజిలాండ్ వెళ్లిన తర్వాతే క్రికెట్‌పై ఎజాజ్‌కు ఆసక్తి కలిగింది. అయితే ఆటను అతను లెఫ్టార్మ్ పేస్ బౌలర్‌గా మొదలు పెట్టాడు. స్వింగ్ బౌలర్‌గా రాణించిన అతను ఆక్లాండ్ తరఫున అండర్–19 స్థాయిలో సౌతీతో సమానంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయినా సరే న్యూజిలాండ్ అండర్–19 టీమ్‌లో అతనికి చోటు దక్కలేదు. 5 అడుగుల 8 అంగుళాల తన ఎత్తు పదునైన పేస్ బౌలింగ్‌కు పనికి రాదని కూడా అతను గుర్తించాడు. భవిష్యత్తులో కివీస్ తరఫున ఆడాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అర్థమైంది. తన క్లబ్ తరఫున ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్లిన ఎజాజ్‌కు న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ దీపక్ పటేల్ మార్గదర్శిగా నిలువగా... స్పిన్నర్‌గా ఎదిగేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని భావించి కఠోర సాధన చేశాడు. వరుసగా మూడేళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడంతో జాతీయ జట్టు పిలుపు లభించింది. 30 ఏళ్ల వయసులో న్యూజిలాండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ► ఈ పది వికెట్ల జాతరలో ఎజాజ్ ప్రయోగాలేమీ చేయలేదు. సాంప్రదాయ లెఫ్టార్మ్ స్పిన్నర్ వేసే బంతులతోనే సత్తా చాటాడు. ‘లెన్త్’ మాత్రం తప్పకుండా జాగ్రత్త పడ్డాడు. సహచర బౌలర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోవడం కూడా అతనికి మేలు చేసింది. చివరకు రచిన్ రవీంద్ర పట్టిన క్యాచ్‌తో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. అయితే దురదృష్టవశాత్తూ గత రెండు సందర్భాలకు భిన్నంగా ఇంత గొప్ప ఆట తర్వాత కూడా ఎజాజ్ ఓటమి పక్షానే నిలవాల్సి వస్తుందేమో! నా క్రికెట్ కెరీర్లో ఇదే అత్యుత్తమ రోజు. ఇక ముందు కూడా ఇదే ఉంటుందేమో. అన్నీ కలిసి రావడంతోనే నేను ముంబైలో ఈ ఘనత సాధించగలిగాను. ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నాకు, నా కుటుంబానికి ఇదో ప్రత్యేక క్షణం. ఇంకా నేను ఆనందం నుంచి తేరుకోలేకపోయాను. ఇలాంటి ఘనతకు అందించిన దేవుడికి కృతజ్ఞతలు. ‘10’ వికెట్ల క్లబ్లో చేరడం గర్వకారణం. కుంబ్లే ఘనత నాకు బాగా గుర్తుంది. ఎన్నోసార్లు ఆ వీడియో చూశా. ఇలాంటి క్షణాలు కెరీర్లో ఎప్పుడో గానీ రావు కాబట్టి చివరి వికెట్‌కు ముందు చాలా ఒత్తిడిలో ఉన్నా. ఆఖరి వికెట్ సమయంలో బంతి గాల్లోకి లేచినప్పుడు అందరం ఎంతో ఉత్కంఠ అనుభవించాం. పదో వికెట్ కోసం ఇతర బౌలర్లు వైడ్ బంతులు వేయాలనే చర్చే మాలో జరగలేదు. తొమ్మిది వికెట్లతో కూడా నేను సంతృప్తి చెందేవాడిని. –ఎజాజ్ పటేల్ 10 వికెట్ల క్లబ్‌లోకి ఎజాజ్‌కు స్వాగతం. పర్ఫెక్ట్10. చాలా బాగా బౌలింగ్ చేశావు. టెస్టు తొలి, రెండో రోజు ఇలాంటి ఘనత సాధించడం ఎంతో ప్రత్యేకం. –అనిల్ కుంబ్లే , భారత మాజీ కెప్టెన్ మొత్తం టీమ్‌ను మన జేబులో వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇదో అసాధారణ ప్రదర్శన. –రవిశాస్త్రి, భారత మాజీ హెడ్ కోచ్ టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ ఎజాజ్ పటేల్. గతంలో ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ (1956 జూలైలో ఆస్ట్రేలియాపై మాంచెస్టర్‌లో 10/53)... భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (1999 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌పై ఢిల్లీలో; 10/74) మాత్రమే ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా ఇదే. రిచర్డ్ హ్యాడ్లీ (9/52) రికార్డును ఎజాజ్ బద్దలుకొట్టాడు. -
Ajaz Patel- Ashwin: ‘‘ఏంటి అశ్విన్ బౌల్డ్ అయ్యావు కదా.. మరి ఇదేంటి?’’ వైరల్
Ind Vs Nz Mumbai Test: Ajaz Patel Bowled Ashwin Signaling For Review Video Viral: టీమిండియా- న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ సంచలన రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసి.. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు ఒకప్పటి ఈ ముంబై కుర్రాడు. ఈ క్రమంలో వాంఖడే స్టేడియం మొత్తం నిలబడి కరతాళ ధ్వనులతో అతడిని అభినందించింది. ఇక ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ను అజాజ్ క్లీన్‌బౌల్డ్ చేసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో గందరగోళానికి గురైన అశూ.. తాను బౌల్డ్ అయిన విషయాన్ని గమనించకుండా రివ్యూ కోరడం విశేషం. ఆ తర్వాత తప్పు తెలుసుకుని పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ‘‘ఏంటి అశ్విన్ బౌల్డ్ అయ్యావు కదా.. మరి ఇదేంటి? క్లీన్‌బౌల్డ్‌కు రివ్యూ కోరి చరిత్ర సృష్టించావు పో’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సైతం.. ‘‘బౌల్డ్ అయిన తర్వాత కూడా అశ్విన్ రివ్యూకు వెళ్లి ఉంటే ఇండియా రివ్యూ అవకాశం కోల్పోయి ఉండేది’’ అని ట్వీట్ చేశాడు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత బౌలర్ల విజృంభణతో కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ మూడు, అశ్విన్ 4, అక్షర్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. చదవండి: Sourav Ganguly: నాలుగైదేళ్లలో ఇదే అత్యంత దారుణ వైఫల్యం.. ‘కోహ్లి సేన’పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు! Ashwin trying to review a clean bowled. LoL. #ashwin #AllRounder #INDvzNZ #Ashwin #BCCI #ViratKohli pic.twitter.com/2YNMMepErC — Reshebh Pent🇮🇳 (@reshebpent17) December 4, 2021 Who reviews a clean bowled. Ravi Ashwin 😂 pic.twitter.com/KbxJBVOyIk — Mirchi RJ Vijdan (@rj_vijdan) December 4, 2021 Ashwin makes history by taking a review after getting clean bowled.... pic.twitter.com/drtG5JPJAE — Katherine (@jawairiasyed) December 4, 2021 -
Ajaz Patel: పుట్టిన గడ్డ మీద.. టీమిండియాపై అరుదైన రికార్డు.. సూపర్!
Ind Vs Nz Mumbai Test: Ajaz Patel Record 10 Wickets 1st innings Twitter Reactions: అజాజ్ పటేల్.. భారత మూలాలున్న ఈ న్యూజిలాండ్ క్రికెటర్ జీవితంలో ముంబై టెస్టు చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీమిండియా వంటి పటిష్ట జట్టును ఆలౌట్ చేసి.. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అది కూడా తాను పుట్టిన గడ్డపైనే ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. టీమిండియా- న్యూజిలాండ్ రెండో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో 47.5 ఓవర్లు వేసిన అజాజ్ పటేల్... 119 పరుగులు(12 మెయిడెన్) ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే.. ఈ రికార్డు సాధించిన ఆటగాళ్ల క్లబ్‌లోకి స్వాగతం అంటూ అభినందించగా... మహ్మద్ కైఫ్ అద్భుతమైన ఇన్నింగ్స్ అంటూ ఆకాశానికెత్తేశాడు. ఈ మేరకు.. ‘‘అజాజ్ పటేల్.. వాటే స్టోరీ! ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు.. అత్యద్భుతం.. నువ్వు పుట్టిన గడ్డపై ఈ రికార్డు నమోదు చేయడం మరింత ప్రత్యేకం. వాంఖడే మొత్తం నిలబడి నిన్ను అభినందించడం చూడముచ్చటేసింది. నువ్వు నీ ఇంట్లోనే(స్వదేశం) ఉన్నావన్న భావన కలిగించారు’’ అని కైఫ్ ట్వీట్ చేశాడు. అదే విధంగా ఆర్పీ సింగ్, పార్థివ్ పటేల్ సహా సిమన్ డౌల్ తదితరులు అజాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక అజాజ్ రికార్డు నేపథ్యంలో కివీస్ ఆటగాళ్లంతా చప్పట్లు కొడుతూ.. అతడిని తీసుకువస్తుండగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ సహా ఇతర ఆటగాళ్లు అతడిని చూసి సంతోషపడుతున్న క్షణాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టిన ఘనత సాధించిన మూడో బౌలర్ అంటూ అభినందించింది. కాగా అజాజ్ పటేల్ ముంబైలో పుట్టాడు. అతడి కుటుంబం 1996లో న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. చదవండి: IND vs NZ 2nd Test- Mohammed Siraj: వారెవ్వా సిరాజ్.. దెబ్బకు రాస్ టేలర్ దిమ్మతిరిగింది పో! వీడియో వైరల్ How about this message from @anilkumble1074 to @AjazP #INDvNZ https://t.co/OWUaN0Jiaf — BLACKCAPS (@BLACKCAPS) December 4, 2021 That’s the most amazing thing I’ve ever seen!! Ajaz Patel….what a phenomenal performance — Aaron Finch (@AaronFinch5) December 4, 2021 Ajaz Patel, what a story! 10 wickets in an inning is magical. To do that in the city you are born is extra special. Great to see Wankhede giving a standing ovation and making Ajaz feel at home.@AjazP — Mohammad Kaif (@MohammadKaif) December 4, 2021 #AjazPatel bowling -47.5 overs#NZ batting- 28.1 overs Sums up the first innings #INDvzNZ Test😊 — R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) December 4, 2021 -
Ind vs NZ Mumbai 2nd Test: అయ్య బాబోయ్... ఒకేరోజు ఇన్ని రికార్డులా!
Ind vs NZ Mumbai 2nd Test: Lowest Test Totals Wankhede Another Records: ముంబై వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ రెండో టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ బౌలర్, భారత మూలాలున్న అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించాడు. ఇక ఈ వ్యక్తిగత ఫీట్‌తో పాటు నమోదైన ఇతర రికార్డులను పరిశీలిద్దాం. వాంఖడే స్టేడియంలో ఇదే అత్యల్పం రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక టీమిండియా బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో న్యూజిలాండ్ కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. కాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టెస్టుల్లో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. అంతకు ముందు 2004లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 93 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక అదే ఏడాది ఆసీస్‌తో మ్యాచ్‌లో ఇండియా 104 పరుగులకే ఇన్నింగ్స్ ముగించింది. అదే విధంగా 2006లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగులు, 1981లో ఇంగ్లండ్ ఇండియాతో మ్యాచ్‌లో 102 పరుగులు చేసింది. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా- అత్యల్ప టెస్టు స్కోర్లు ►ముంబై-2021- 62 పరుగులు ►హామిల్టన్-2002- 94 పరుగులు ►వెల్లింగ్టన్- 1981- 100 పరుగులు ►అక్లాండ్-1968-101 పరుగులు టీమిండియాపై టెస్టుల్లో ప్రత్యర్థి జట్ల అత్యల్ప స్కోర్లు ►న్యూజిలాండ్-2021- 62 పరుగులు- ముంబై ►దక్షిణాఫ్రికా- 2015- 79 పరుగులు- నాగ్‌పూర్ ►ఇంగ్లండ్- 2021- 81 పరుగులు- అహ్మదాబాద్ ►శ్రీలంక- 1990- 82 పరుగులు- చండీగడ్ భారత్‌లో నమోదైన అత్యల్ప టెస్టు స్కోర్లు ►న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా- 2021- 62 పరుగులు ►ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 1987- 75 పరుగులు ►ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా- 2008- 76 పరుగులు ►దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా- 2015- 79 పరుగులు రెండో టెస్టు: టీమిండియా తొలి ఇన్నింగ్స్: 325 పరుగులు ఆలౌట్ న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62 పరుగులు ఆలౌట్ -
రికార్డుల అజాజ్..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే
Ajaz Patel Becomes 3rd Bowler to Pick 10 Wickets in a Test Cricket History: న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 47 ఓవర్లు వేసిన ఆజాజ్ పటేల్ 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు సాధించాడు. అంతకు ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. 1956లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై పది వికెట్లు సాధించగా, 1999లో భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాకిస్తాన్‌పై 10 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ 150 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక అజాజ్ ఘనతపై స్పందించిన అనిల్ కుంబ్లే.. ‘‘చాలా బాగా బౌలింగ్ చేశావు. వెల్కమ్ టూ క్లబ్’’ అంటూ స్వాగతం పలికాడు. చదవండి: Ind Vs Nz 2nd Test: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు సాధించిన న్యూజిలాండ్ బౌలర్ #10wickets #AjazPatel #INDvzNZ Retweet ♻️ Like ♥️ pic.twitter.com/cuEIlgFfVZ — Yash Vashisth Tyagi (@vashisthtyagi3) December 4, 2021 Spinner Ajaz Patel smashed all records as he became only the third player in Test cricket history to grab all 10 wickets in an innings#AjazPatel #INDvsNZhttps://t.co/W5QzdjeTvr — CricketNDTV (@CricketNDTV) December 4, 2021 Welcome to the club #AjazPatel #Perfect10 Well bowled! A special effort to achieve it on Day1 & 2 of a test match. #INDvzNZ — Anil Kumble (@anilkumble1074) December 4, 2021 -
ఒకే ఒక్కడు 6 వికెట్లు.. భారత్‌పై అరుదైన రికార్డు సాధించిన కివీస్ స్పిన్నర్..
First New Zealand spinner to take a five wicket haul in 1st Innings of a Test in India: టెస్ట్‌ల్లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్‌లో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్‌లను వరుస బంతుల్లో ఔట్ చేయడంతో ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా తన కేరిర్‌లో ఇది మూడో 5 ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. అయితే ఈ మూడు 5 వికెట్ల హాల్ కూడా ఆసియాలోనే సాధించాడు. అంతకు ముందు 2012లో హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ 4 వికెట్లు సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ 6వికెట్లు కోల్పోతే.. మొత్తం ఆ 6 వికెట్లు కూడా అజాజ్ పటేల్ తీసినవే కావడం గమనర్హం. చదవండి: Rohit Sharma: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ! -
రచిన్, ఎజాజ్ పటేల్.. భారత్‌తో బంధం
Intresting Facts About Rachin Ravindra And Ajaz Patel.. కివీస్‌ను ఓటమి నుంచి రక్షించిన ఇద్దరు ఆటగాళ్లకు మన దేశపు నేపథ్యం ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన రచిన్ రవీంద్ర వెల్లింగ్టన్లో పుట్టినా... అతని తండ్రి రవి కృష్ణమూర్తి భారత్‌కు చెందినవాడు. స్వస్థలం బెంగళూరు కాగా... సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన కృష్ణమూర్తి వేర్వేరు దేశాల్లో ఉద్యోగం చేస్తూ చివరకు న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు. క్లబ్ స్థాయి క్రికెట్లో తనతో కలిసి ఆడిన జవగల్ శ్రీనాథ్‌తో అతనికి మంచి స్నేహం ఉంది. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్ల కలయికతో తన కొడుకుకు ‘రచిన్’ పేరు పెట్టిన కృష్ణమూర్తి సరైన సాధన, పోటీ కోసం భారత్‌లోనే వేర్వేరు నగరాలకు తరచుగా అతడిని పంపించి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయిస్తూ వచ్చాడు. 33 ఏళ్ల ఎజాజ్ పటేల్ ముంబైలోనే పుట్టాడు. 1996లో అతని కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. భారత్‌లో భారత జట్టుపై నాలుగో ఇన్నింగ్స్‌లో 95 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు ఆడి టెస్టు మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించడం న్యూజిలాండ్ జట్టుకిది ఐదోసారి. గతంలో న్యూజిలాండ్ జట్టు కాన్పూర్ (1976), మొహాలీ (1999), అహ్మదాబాద్ (1999), అహ్మదాబాద్ (2003) టెస్టుల్లో కూడా ఇలాగే ‘డ్రా’ చేసుకుంది. చదవండి: Rachin Ravindra Facts: ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్‌తో ఏంటి సంబంధం? పేర్లలో కన్ఫ్యూజన్.. ఈసారి జడేజాదే పైచేయి -
Ind Vs Nz 1st Test: నీకిది తగునా రహానే.. ఇక బై బై చెప్పేయడమే!
Ind Vs Nz 1st Test: Trolls On Ajinkya Rahane For Another Failure In Kanpur Test: అజింక్య రహానే ఆట తీరు మారడం లేదు. కాన్పూర్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 35 పరుగులకే పెవిలియన్ చేరిన రహానే.. రెండో ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా విఫలమయ్యాడు. 15 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు(బౌండరీ) చేసి నిష్క్రమించాడు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. దీంతో నెటిజన్లు రహానేపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ‘‘కెప్టెన్ అయి ఉండి ఏమాత్రం బాధ్యత లేకుండా ఆడుతున్నావు. నీకిది తగునా రహానే. వరుసగా విఫలమవుతున్నాడు. ఇకనైనా రహానేను జట్టు నుంచి తప్పించాల్సిన సమయం ఆసన్నమైంది. అతడి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి’’ అని ట్రోల్ చేస్తున్నారు. దేశవాళీ టోర్నీలో ఆడి తిరిగి ఫామ్‌లోకి వస్తే బాగుంటుందని రహానేకు హితవు పలుకుతున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో రహానే జెమీషన్ బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా వికెట్ సమర్పించుకుని ఇదే తరహాలో ట్రోలైన సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో రహానే సారథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Nz Test- Srikar Bharat: ఆ క్యాచ్ నిజంగా సూపర్.. ఒకవేళ భరత్ పట్టుబట్టకపోయి ఉంటేనా! I think it’s time we discuss Rahane replacement. #NZvIND — Tweeter (@tweetersprints) November 28, 2021 Told @AddyDaddy28 last night I trust Ashwin and Umesh more than Rahane in batting. Those 2 shots just show why.. Umesh and Ashwin are better batsman than Rahane right now. He's that awful — Remember the name (@AngryYoungMan24) November 28, 2021 @ImRo45 Jeet k haaarne waale ko #TeamIndia bolte hai😡😡, high time to replace #Rahane as a player, 51 lead nd u r on a spot of looossing a test that too givin wiket to pacers #ViratKohli #RohitSharma #RahulDravid #IndianCricket #INDvsNZ #INDvsNZTestSeries #BCCI — vishal bansal (@vishalpbansal) November 28, 2021 Interesting now to see who sits out when Virat comes into the XI in Mumbai #INDvsNZ — Vikrant Gupta (@vikrantgupta73) November 28, 2021 -
గిల్ కళ్లు చెదిరే సిక్స్.. వీడియో వైరల్
Shubman Gill smashes a fluent six down the ground off Ajaz Patel: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ అర్ధసెంచరీతో మెరిశాడు. అయితే భారత ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అజాజ్ పటేల్ బౌలింగ్‌లో.. రెండో బంతికి గిల్ కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. దీంతో బౌలర్ ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యాడు. అంతే కాకుండా అతడి సిక్స్ దెబ్బకు బంతి స్టేడియం అవతల పడడంతో కొత్త బంతి తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. ఆదిలోనే మయాంక్ ఆగర్వాల్ వికెట్ కోల్పోయినప్పటకీ.. శుభమన్ గిల్, పూజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కాగా లంచ్ విరామం తర్వాత తొలి ఓవర్లోనే భారత్ శుభమన్ గిల్(52) వికెట్ కోల్పోయింది. 34 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. చదవండి: IND Vs NZ 1st Test: నిలకడగా ఆడుతున్న భారత్.. 20 ఓవర్లకు 63/1 pic.twitter.com/CZK8CVNHXG — Simran (@CowCorner9) November 25, 2021