
Ind vs NZ Mumbai 2nd Test: Lowest Test Totals Wankhede Another Records: ముంబై వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ రెండో టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ బౌలర్, భారత మూలాలున్న అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించాడు. ఇక ఈ వ్యక్తిగత ఫీట్‌తో పాటు నమోదైన ఇతర రికార్డులను పరిశీలిద్దాం.
వాంఖడే స్టేడియంలో ఇదే అత్యల్పం
రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక టీమిండియా బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో న్యూజిలాండ్ కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. కాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టెస్టుల్లో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం.
అంతకు ముందు 2004లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 93 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక అదే ఏడాది ఆసీస్‌తో మ్యాచ్‌లో ఇండియా 104 పరుగులకే ఇన్నింగ్స్ ముగించింది. అదే విధంగా 2006లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగులు, 1981లో ఇంగ్లండ్ ఇండియాతో మ్యాచ్‌లో 102 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా- అత్యల్ప టెస్టు స్కోర్లు
►ముంబై-2021- 62 పరుగులు
►హామిల్టన్-2002- 94 పరుగులు
►వెల్లింగ్‌టన్- 1981- 100 పరుగులు
►అక్లాండ్-1968-101 పరుగులు
టీమిండియాపై టెస్టుల్లో ప్రత్యర్థి జట్ల అత్యల్ప స్కోర్లు
►న్యూజిలాండ్-2021- 62 పరుగులు- ముంబై
►దక్షిణాఫ్రికా- 2015- 79 పరుగులు- నాగ్‌పూర్
►ఇంగ్లండ్- 2021- 81 పరుగులు- అహ్మదాబాద్
►శ్రీలంక- 1990- 82 పరుగులు- చండీగడ్
భారత్‌లో నమోదైన అత్యల్ప టెస్టు స్కోర్లు
►న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా- 2021- 62 పరుగులు
►ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 1987- 75 పరుగులు
►ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా- 2008- 76 పరుగులు
►దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా- 2015- 79 పరుగులు
రెండో టెస్టు:
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 325 పరుగులు ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62 పరుగులు ఆలౌట్