న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రోహిత్ శర్మకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హిట్‌మ్యాన్ నిర్ణయం బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(2) సహా స్టార్ బ్యాటర్లంతా విఫలం కావడంతో 46 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది.
టీమిండియా శుభారంభం
అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 రన్స్ చేసి.. ఏకంగా 356 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుభారంభమే అందుకుంది.
రోహిత్ హాఫ్ సెంచరీ
ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 52 బంతులు ఎదుర్కొని 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రోహిత్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేశాడు. అయితే, నిలకడగా ఆడుతున్న సమయంలో రోహిత్ దురదృష్టకరరీతిలో అవుట్ అయ్యాడు.
ఊహించని రీతిలో బౌల్డ్
భారత రెండో ఇన్నింగ్స్ 22వ ఓవర్‌ను కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ వేశాడు. అతడి బౌలింగ్‌లో ఐదో బంతికి రోహిత్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, ఊహించని విధంగా బంతి బ్యాట్‌ను తాకి.. బౌన్స్ అయి వికెట్లను తాకగా.. స్టంప్స్ ఎగిరిపడ్డాయి. నిజంగా ఇది రోహిత్ దురదృష్టమనే చెప్పవచ్చు.
ఇలా ఎలా బౌల్డ్ అయ్యాను?.. దురదృష్టం భయ్యా!
ఒకవేళ ప్రమాదాన్ని పసిగట్టి కాస్త జాగ్రత్త పడి ఉంటే వికెట్ నిలిచేదే! ఏదేమైనా.. తాను అవుటైన తీరుపై రోహిత్ శర్మ సైతం తీవ్ర నిరాశకు గురయ్యాడు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ అతడు.. ‘‘ఇలా ఎలా బౌల్డ్ అయ్యాను?’’ అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో.. ‘‘ఈ మ్యాచ్‌లో నువ్వు నిజంగా అన్‌లక్కీ భయ్యా’’ అంటూ నెటిజన్లు రోహిత్‌పై సానుభూతి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా 25 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్
👉మొదటి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20
👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు కాగా.. రెండో రోజు టాస్ పడింది
👉బెంగళూరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
👉భారత్ తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే ఆలౌట్
👉పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయానంటూ తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్
👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్.
చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్
What a terrible test match for Rohit Sharma to remember in all senses.#INDvNZ pic.twitter.com/f0d3gtrGvZ
— iNaveenVijayakumar (@iNaveentalks) October 18, 2024
Comments
Please login to add a commentAdd a comment