bengaluru
-
యువ జంట ఘనత.. జస్ట్ 10 గంటల్లో..
బెంగళూరు యువ జంట అరుదైన ఘనత సృష్టించారు. కేవలం పది గంటల్లో శ్రీలకం నుంచి భారత్‌కు ఈది రికార్డు సృష్టించారు. మొత్తం పదిగంటల 45 నిమిషాల పాటు నీటిలో ఈదుతూ ఈ అరుదైన ఘనతను నమోదు చేశారు. ఇలా బహిరంగంగా జల ఈతను పూర్తి చేసితన తొలి జంట వారే. బెంగుళూరుకు చెందిన డానిష్ అబ్ది, వృషాలి ప్రసాదే దంపతులు హిందూ మహాసముద్రంలో రామ్ సేతు మార్గం గుండా దాదాపు 32 కిలోమీటర్లు ఈదారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈతను పూర్తి చేసిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేస్తూ "మేము సాధించాం". పోస్టు పెట్టారు. మరిన్ని విషయాలు 12 గంటల పాటు హాయిగా నిద్రపోయిన తదనంతరం చెబుతానని అన్నారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడమేకాదు..గర్వించదగ్గ క్షణం, ఇరువురికి అభినందనలు అని ప్రశింసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఆ రేంజ్లో మంచి మార్కులు సాధించినా..ఆ తల్లి..!) -
15 కి.మీ.లకు రూ.1200
యశవంతపుర: బెంగళూరులో 15 కిలోమీటర్ల దూరం ఆటోరిక్షాలో వెళ్లినందుకు రూ.1200 చార్జీ వసూలు చేసినట్లు ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వర్షం వస్తున్న సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది, అందువల్ల స్నేహితులతో కలిసి ఆటోలో వెళ్లాను, ఇందుకు రూ.1200 వసూలు చేశారు, ఇది చాలా ఎక్కువ అని వివరించారు. ఈ పోస్టుపై సాన్యా సింగ్ అనే నెటిజన్ స్పందిస్తూ, బెంగళూరులో ఇలా ఉంటుందని ఊహించలేదు. మంగళవారం తన స్నేహితులతో కలిసి 15 కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణించినందుకు 12 వందలు చార్జీ చేశారు. ఈ డబ్బుతో రెండుసార్లు ఇంటి సరుకులను కొనవచ్చు. బెంగళూరులో వయొలిన్ కంటే హార్న్ శబ్దమే జోరుగా వినపడుతుంది. కాలేజీలో ప్రవేశం కంటే ఇక్కడ రైడ్‌ను బుక్ చేయడం కష్టంగా ఉంటుంది అని విమర్శించారు. మన కెరియర్ పెరుగుతుందో, లేదో తెలియదు. ఆటో డ్రైవర్లు మాత్రం శ్రీమంతులు అవుతారని దుయ్యబట్టారు. పెద్ద మొత్తంలో చార్జీ చేయటం అన్యాయమంటూ కొందరు పేర్కొన్నారు. ఈ పోస్టుతో బెంగళూరులో ఆటో, క్యాబ్ చార్జీలు చర్చనీయాంశమయ్యాయి. -
ఐపీఎల్ ఫైనల్ పోయింది
బెంగళూరు: అనుకున్నట్లుగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ మరోచోటుకు మారింది. గుజరాత్లో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ ప్రకటించడంతో బెంగళూరు క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నెల 31న మ్యాచ్ జరగాల్సి ఉంది. ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్లు, చిన్న స్టేడియం కావడం తదితర కారణాలతో మార్చేసినట్లు బీసీసీఐ ప్రకటించడం గమనార్హం. ఇటీవల చిన్నస్వామిలో భద్రతా సమస్యలు తలెత్తాయి. గతంలో తీవ్ర తొక్కిసలాట జరిగి అనేకమంది చనిపోవడం తెలిసిందే. ఇటీవల ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ సమయంలో సుమారు 240 కెమెరాలను పనిచేయలేదు.ఎమ్మెల్యేల టికెట్లకు లింకు లేదు: డీసీఎంఅహ్మదాబాద్లో పెద్ద స్టేడియం ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి అక్కడికి మార్చి ఉండవచ్చు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్ల పంపిణీకి, మ్యాచ్ మార్పునకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీసీసీఐ పెద్దలు అలాగే మాట్లాడనీ, సరైన సమాధానం ఇస్తానన్నారు. -
భారత్ 'మిషన్ దృష్టి' సక్సెస్: మస్క్ ట్వీట్!
బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీఐ (GalaxEye) రూపొందించిన 'మిషన్ దృష్టి' ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా అభినందనలు తెలిపారు.కాలిఫోర్నియా నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే మొదటి 'ఆప్టోసార్' శాటిలైట్‌గా గుర్తింపు పొందింది. ఇది ఎలక్ట్రో ఆప్టికల్ (EO), సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) సాంకేతికతల కలయికతో రూపొందింది.EO సిస్టమ్ ద్వారా.. స్పష్టమైన, వాతావరణంలోని హై క్వాలిటీ ఫోటోలను పొందవచ్చు. SAR సాంకేతికత ద్వారా వర్షం, మబ్బులు, రాత్రి వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. ఈ రెండు టెక్నాలజీలు కలిసి ఉండటం వల్ల.. భూమి పరిశీలనలో ఉన్న పరిమితులను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక వసతుల ప్రణాళిక వంటి అనేక రంగాలకు ఉపయోగకరమైన డేటా లభిస్తుంది.Congratulations! 🇮🇳— Elon Musk (@elonmusk) May 5, 2026ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ప్రాజెక్ట్‌ను భారత యువత ప్రతిభకు నిదర్శనంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి సాంకేతికత ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. భారత అంతరిక్ష సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావడం దేశానికి మరింత బలం చేకూరుస్తోంది.భవిష్యత్తులో.. గెలాక్స్ఐ సంస్థ ఈ వ్యవస్థను మరింత విస్తరించి 2030 నాటికి 10 ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భారతదేశం స్వంతంగా బలమైన భూ పరిశీలన వ్యవస్థను నిర్మించుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి -
వర్షం పడితే చాలు దోపిడీ
దేశ ఐటీ రాజధానిగా, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరులో వర్షం కురిస్తే చాలు జనజీవనం స్తంభించడంతోపాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ కింద ఏకంగా రూ.1,200 వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ సర్జ్ ప్రైసింగ్ (అధిక ఛార్జీలు) వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాన్యా సింగ్ తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కేవలం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆటో డ్రైవర్ రూ.1,200 డిమాండ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె అంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ట్రాఫిక్ కారణంగా ఇంటికి చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.గందరగోళంబెంగళూరు వర్షాల గురించి సాన్యా సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘బెంగళూరులో వర్షం కురిసినప్పుడు వయోలిన్ సంగీతం వినిపించదు. కేవలం హారన్ల మోత మాత్రమే వినిపిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ పొందడం కంటే వర్షం సమయంలో ఆటో బుక్ చేయడం చాలా కష్టమైన పని. మా కెరీర్లు ఎలా ఉన్నా ఆటో డ్రైవర్లు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sanya Singh (@sanya.unfiltered)సోషల్ మీడియాలో..ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ‘వర్షం పడితే చాలు ఆటోలు, క్యాబ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అని ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. ‘డిమాండ్, సరఫరా పేరుతో డ్రైవర్లు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారు. దీనిని నియంత్రించే వ్యవస్థ లేదా నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?’ అని మరొకరు ప్రశ్నించారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే!
బెంగళూరులోకారులో కాలిపోయిన స్థితిలో ఒక మహిళా ప్రొఫెసర్ మృతదేహం లభ్యమైంది. వాహనం మంటల్లో కాలిపోతున్న ప్పుడు, చూసిన స్థానికులు దొడ్డబళ్లాపూర్ గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక వాహనాలతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘోరంపై కూపీ లాగిన అధికారులకు సంచలన విషయాలు తెలిసాయి.పోలీసుల కథనం ప్రకారం, వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. స్వల్ప వివాదంతో ప్రియరాల్ని పెట్రోలు పోసి తగుల బెట్టాడు. ఒక రోజు తర్వాత నిందితుడి మృతదేహం రైల్వే ట్రాక్‌పై లభ్యమైంది. జరిగిన కథ ఏంటీ అంటే.రాజనకుంటె సమీపంలోని మరసంద్ర నివాసి, దేవనహళ్లి తాలూకా కార్యాలయంలో పనిచేస్తున్న 45 ఏళ్ల సి. రామన్జినప్ప, బెంగళూరు ఉత్తర జిల్లాలోని దేవనహళ్లిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో కన్నడ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 40 ఏళ్ల సరోజ జె. మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రామన్జినప్ప విడాకులు తీసుకున్న వ్యక్తి కావడంతో, వారిద్దరూ ఈ విషయాన్ని దాచి పెట్టి, గోప్యంగా తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి వీకెండ్లో ఔటింగ్‌కి వెళ్లారు.ఇందుకోసం రామన్జినప్ప అర్జంట్ అవసరమని చెప్పి తన స్నేహితుడు సురేష్ కుమార్ వద్ద నంచి కార్ తీసుకున్నాడు. అక్కడినుంచి దేవనహళ్లికి వెళ్లి, అక్కడ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో స్థానిక బస్ స్టాప్ నుండి సరోజను పిక్ చేసుకున్నాడు. వారిద్దరూ ఉదయం నంది హిల్స్ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించి, ఉత్సాహంగా గడిపారు.మధ్యాహ్నం చివరికల్లా,ఈ జంట దొడ్డబళ్లాపూర్లోని జింకెబచ్చహళ్లి శివార్లలోని ఏకాంత ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసుల విచారణ ప్రకారం, ఇక్కడే కథ విషాదమైన మలుపు తీసుకుంది.వాహనం లోపల ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో రామంజినప్ప సరోజ తలపై సుత్తితో కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆమె శరీరాన్ని వెనుక సీటులోకి తరలించి, కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కినుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అతనికీ కొన్ని కాలిన గాయాలయ్యాయి. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫోరెన్సిక్స్ ఆధారాలతోపాటు, కారు, దాని అలారం, ఆధార్ ఆధారం కీలకంగా మారింది.కారు కాలిపోతున్న సమయంలో, కారులోని ఫీచర్ ఆధారంగా కార్ ఓనర్ సురేష్ కుమార్ మొబైల్ ఫోన్‌కు ప్రమాద ఆటోమేటిక్ అలర్ట్ వచ్చింది. దీంతో కుమార్ రామన్జినప్పకు కాల్ చేశాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదే సమయంలో పోలీసులు కాలిపోయిన వాహనాన్న కుమార్‌కు చెందినదిగా గుర్తించి కాల్ చేశారు. దీంతో అతను సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ఉదయమే రామన్జినప్ప తన కారు తీసుకున్నాడనే విషయాన్ని తెలిపాడు.దీనిపై సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలోని కమిటీ విచారణ చేపట్టింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్‌లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇంతలో బెంగళూరు సౌత్‌లోని బిడది సమీపంలో రైలు పట్టాలపై ఒక మృతదేహం లభ్యమైందని, పూర్తిగా ఛిద్రమై, అవయవాలు తెగిపోయి ఉన్నాయని రైల్వే పోలీసులు సమాచార మిచ్చారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని రామంజినప్పగా గుర్తించారు. ఇదీ చదవండి: 75 ఏళ్ల వయసులో ప్రభంజనం, ఎవరీ రంగస్వామిఇదిలా ఉండగా శనివారం రాత్రి దేవనహళ్లికి చెందిన మృతురాలు సరోజ భర్త జయశంకర్ తన భార్య అదృశ్యమైనట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేశాడు. కారులో లభ్యమైన కాలిపోయిన మృతదేహం నుండి అధికారులు కాలిపోయిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సరోజ భర్త జయశంకర్‌ను సంప్రదించగా, ఆ ఆభరణాలు తన భార్యవేనని ఆయన ధృవీకరించినట్లు ఆ అధికారి తెలిపారు. గతవారం చోటుచేసుకున్న ఈ కేసు దిగ్భ్రాంతి రేపింది. ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా -
నింగిలోకి ‘మిషన్ దృష్టి’
న్యూఢిల్లీ: బెంగళూరులోని అంతరిక్ష స్టార్టప్ సంస్థ గెలాక్సీఐకి చెందిన ‘మిషన్ దృష్టి’ఉపగ్రహాన్ని ఆదివారం అమెరికాలోని కాలిఫోరి్నయాలో స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. మిషన్ దృష్టి అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం. ఇది ఎలక్ట్రో–ఆప్టికల్ (ఈఓ), సింథటిక్ అపర్చర్ రాడార్(ఎస్ఏఆర్) సెన్సార్లను ఒకే కార్యాచరణ ప్లాట్‌ఫారమ్‌లోకి అనుసంధానిస్తుంది. ఈఓ సెన్సార్లు సూర్యకాంతిలో లేదా నిర్మలమైన ఆకాశం ఉన్నప్పుడు అధిక రిజల్యూషన్‌తో చిత్రాలను బంధిస్తాయి. ఎస్ఏఆర్ సెన్సార్లు రాడార్ పల్స్‌లను ఉపయోగించి అన్ని కాలాల్లో, అన్నిరకాల వాతావరణ పరిస్థితులలో స్పష్టమైన చిత్రాలను అందిస్తాయి. మిషన్ దృష్టి ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరుకున్నట్లు గెలాక్సీఐ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుయాష్ సింగ్ తెలిపారు. ఈ ఉపగ్రహం సంప్రదాయ వ్యవస్థల్లోని దీర్ఘకాలిక పరిమితులను అధిగమించడంతోపాటు విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో మరింత విశ్వసనీయమైన, స్థిరమైన డేటాను సేకరిస్తుంది. ఇది ద్వంద్వ ప్రయోజన భూ పరిశీలన ఉపగ్రహం. రక్షణ, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక సదుపాయాల ప్రణాళిక వంటి రంగాల్లో తోడ్పాటు అందిస్తుంది. ఐదేళ్ల స్వదేశీ పరిశోధన, అభివృద్ధి, విస్తృతమైన పర్యావరణ పరీక్షలు, ‘మిషన్ దృష్టి’పనితీరు ధ్రువీకరణ తర్వాత ఈ ప్రయోగం జరిగింది. మిషన్ దృష్టి ప్రయోగం భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభివరి్ణంచారు. -
బెంగళూరు చరిత్రలో అదే భారీ వర్షం
బనశంకరి: కర్ణాటక రాజధాని బెంగళూరు చరిత్రలో గత నెల 29న అత్యధిక వర్షపాతం నమోదైన రోజుగా రికార్డుల్లోకి ఎక్కింది. బుధవారం సాయంత్రం బెంగళూరు మధ్య భాగంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలి, వడగండ్లతో 11 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పోటెత్తిన వరద నీరు అకాల వర్షానికి బెంగళూరులో వరదనీరు పోటెత్తినట్టు అధికారులు గుర్తించారు. 200 చదరపు కిలోమీటర్లు పరిధిలో భారీ వర్షం కురిసిందని గ్రేటర్ బెంగళూరు ప్రాధికార సంస్థ తెలిపింది. 20 నుంచి 22 మిలియన్ ఘనపు మీటర్ల నీరు వచి్చందని అంచనా వేశారు. భౌగోళికంగా 900 మీటర్ల ఎత్తులో ఉన్న బెంగళూరులో వార్షికంగా 95 సెంటీమీటర్ల నుంచి 110 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. ఐఎండీ వివరాల ప్రకారం బెంగళూరులో వార్షికంగా కురిసే వర్షం కన్నా సుమారు 10 శాతం అధిక వర్షం కురిసిందని తెలిపింది. -
బెంగళూరులో ఘోర విషాదం.. స్పాటికి సీఎం సిద్ధరామయ్య
-
భారీ వర్షాలకు కూలిన గోడ.. ఏడుగురు మృతి
బెంగళూరులో కురిసిన అకాల వర్షాలు ఏడుగురిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ రోజు బుధవారం కురిసిన భారీ వర్షాలకు ఓ ఆసుపత్రి ప్రహారి గోడ కూలి ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు.నగరంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు బౌరింగ్ మరియు లేడీ కర్జన్ ఆసుపత్రి ప్రహారి గోడ కూలింది. వర్షం పెద్దఎత్తున కురవడంతో బలమైన గాలులు వీశాయని దీంతో గోడ పక్కన నిల్చున్న ఏడుగురు బాధితులు అక్కడికక్కడే మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. మృతులలో అధికంగా అక్కడే వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులని తెలిపారు.దీంతో వివరాలు తెలుసుకున్న సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహాయంతో శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుళ్లిన స్థితిలో యువతి మృతదేహం
బొమ్మనహళ్లి: బెంగళూరులో మంగళవారం ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. అడుగోడిలో అద్దె ఇంట్లో పూజ దత్తా (34) అనే యువతి నగ్న స్థితిలో శవమై తేలింది. మొదట్లో హత్య అనుకున్నా, తరువాత ఆత్మహత్య అని అనుమానాలు బలపడ్డాయి. వివరాలు... జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన పూజ దత్తా గత మూడేళ్లుగా అదే ఇంట్లో నివసిస్తూ ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తుల సంస్థలో పనిచేస్తోంది. కొన్నాళ్ల కిందటే ఉద్యోగం వదిలేసిందని తెలుస్తోంది. మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఇంట్లోంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇంటి యజమాని తలుపు పగలగొట్టి చూడగా, పూజ మృతదేహం దాదాపు కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా, చేరుకుని విచారణ చేపట్టారు. ఆమె ఎవరితోను మాట్లాడేది కాదు, తరచుగా ఒంటరిగా రోడ్డుపై తిరిగేదని స్థానికులు తెలిపారు. ఆమె మానసికంగా కుంగిపోయినట్లు కనిపించిందని చెప్పారు. ఒక యువకుడు బైక్‌లో పూజ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడని చెప్పారు. ఆమె ఫోన్ స్విచాఫ్‌లో ఉండగా, కాల్ డీటైల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఇల్లంతా చెత్త చెత్త ఆమె ఇల్లంతా చెత్తకుప్పలా ఉంది. గోడపై రకరకాల రాతలు రాసి ఉన్న పేపర్లు అతికించి ఉన్నాయి. అవి ఆంగ్లం, హిందీ భాషల్లో ఉన్నాయి. ఒక గది మొత్తం చెత్తతో, చిరిగిన కాగితాలతో నిండి ఉంది. ఇంట్లో సుమారు ఐదారు పాత కాగితాల కట్టలు దొరికాయి. ఆమె మానసిక స్థితి సరిగా లేదా అనేది సందేహంగా ఉంది. పోస్టమార్టం నివేదిక వస్తే హత్యా, ఆత్మహత్యా అనేది తెలుస్తుందని పోలీసులు చెప్పారు. -
87కు బదులు 47 మార్కులు
బెంగళూరు: పగలూ రాత్రీ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్న ఒక పేద విద్యార్థిని కలలపై మూల్యాంకనం పొరపాటు నీళ్లు చల్లింది. చిక్కనాయకనహళ్లి తాలూకా, మేలనహళ్లిలోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని కె.అంకిత మూల్యాంకనంలో మాస్టార్ల పొరపాటు వల్ల అన్యాయానికి గురైంది. అంకిత తండ్రి గతంలో మరణించాడు, తల్లి గార్మెంట్స్‌లో పనిచేస్తూ చదివిస్తోంది. ఇటీవల విడుదలైన ఎస్ఎస్ఎల్సీ ఫలితాలలో అంకితకు కన్నడలో 47 మార్కులు వచ్చాయి. అనుమానంతో తనిఖీ చేయగా ఆమె కన్నడలో ఎంతో ప్రావీణ్యం ఉన్న విద్యార్థిని, పరీక్ష కూడా బాగా రాసింది. దీంతో అనుమానం వచ్చి ఆమె పాఠశాల ఉపాధ్యాయులు, మార్కుల షీటును పరిశీలించారు. అందులో తేడా కనిపించింది. అన్ని సమాధానాలకు వచ్చిన మార్కులను కలిపితే, మొత్తం 87 మార్కులు ఉన్నాయి, కానీ మూల్యాంకనం చేసిన మాస్టారు ఎవరో కానీ 47 అని నమోదు చేశారు. ఈ పొరపాటు వల్ల తన కూతురికి అన్యాయం జరిగిందని, సరిచేయాలని తల్లి లలితమ్మ కోరింది. తప్పు చేసినవారికి శిక్ష పడాలని డిమాండ్ చేసింది. -
అందుకే కిరణ్‌కు నిప్పంటించా!
ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని వెస్ట్రన్ స్టయిల్లో ప్రపోజ్ చేస్తానంటూ కుర్చీకి కట్టేసి మరీ తగలబెట్టి చంపేసింది ఓ ప్రియురాలు. ఈ కేసు దేశవ్యాప్తంగా.. అందునా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో వివాహానికి కిరణ్ ఒప్పుకున్నాడని నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ చెబుతోంది.బెంగళూరులో ప్రియున్ని తన ఇంట్లో కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ నెమ్మదిగా నిజాలు బయటపెడుతోంది. కిరణ్‌ను తాను చాలా ప్రేమించేదాన్నని, అయితే అతడు మాత్రం శారీరక అవసరాలు తీర్చే వస్తువుగా తనను భావించేవాడని అంటోంది.వారం కిందట(21 ఏప్రిల్) బెంగళూరు శివారులోని బైదరహళ్లి పీఎస్ పరిధిలోని అంజనానగర్లో ఈ దారుణం జరిగింది. తుమకూరుకు చెందిన కిరణ్.. నగరంలోని ఓ మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ(ప్రేరణ)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత.. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాంట్, షర్ట్ ఊడదీసి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం కాళ్లు, చేతులూ కట్టేసింది.ఆ సమయంలో కిరణ్ కంగారుపడ్డాడు. అయితే.. పాశ్చాత్య దేశాల్లో ఇలాగే చేస్తారని, తానూ అలా వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని (Love Proposal) నమ్మించింది. ఆ వెంటనే కిరోసిన్ పోసి నిప్పటించి తన మొబైల్లో రికార్డు చేసింది. స్థానికులు వచ్చేలోపే హాహాకారాలు చేస్తూ కుర్చీలోనే కిరణ్ సజీవదహనమయ్యాడు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూమ్లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె తీరుపై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించారు. దీంతో పథకం ప్రకారమే ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.నార్త్‌వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ నేతృత్వంలోని టీం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించింది. తొలుత దూరం పెడుతున్నాడనే అతన్ని హత్య చేసిందని అంతా భావించారు. అయితే.. ‘‘కిరణ్‌ను తాను ఎంతో ప్రేమించానని.. కానీ, అతను తనను ఎంతో అవమానించేవాడని ప్రేమ పోలీసుల వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. ‘కిరణ్ నన్ను శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నాడన్న విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. పెళ్లి చేసుకుందామని అడిగా. ‘నువ్వు కులం తక్కువదానివి.. మా ఇంట్లో ఒప్పుకోరు’ అనేవాడు. ఈ విషయం ప్రేమించినప్పుడు.. కలిసి తిరిగినప్పుడు తెలియదా? అని గట్టిగా నిలదీశా. దీంతో పెద్దల్ని ఒప్పించి ఎలాగోలా వివాహం చేసుకుంటానన్నాడు. అయితే.. పెళ్లి తర్వాత కూడా కేవలం శారీరక అవసరం కోసమే తనతో ఉంటానని చెప్పేవాడు. ఆ మాట నాతోనే కాదు.. అతని స్నేహితుల వద్ద చెబుతూ నన్ను బూతులు తిట్టేవాడు. ఆ విషయం అతని స్నేహితులు రికార్డ్ చేసి పంపారు. నన్ను వాడుకుంటూ నన్నే తిట్టడం, అవమానించడం ఎంతో బాధించింది. భరించలేకపోయా.. అందుకే నిప్పు పెట్టి చంపేశా’’ అని పోలీసుల ముందు ప్రేరణ కన్నీళ్లతో నిజం ఒప్పుకుంది. -
మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తారా?
యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని వేసిన ఫిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు బీకే దిగంత్.. బెంగళూరు మెట్రో చిక్స్ అనే ఇన్‌స్టా ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసేవాడు. గత ఏడాది మేలో బనశంకరి పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసు చెల్లుబాటు కాదని, కొట్టేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అర్జీని విచారించిన న్యాయమూర్తి.. నిందితునిపై భగ్గుమన్నారు. మహిళలను ఎక్కడా సురక్షితంగా ఉండనివ్వరా? అని దిగంత్‌ను నేరుగా ప్రశ్నించారు. ఇలా చేయడం చూస్తే నీకు మానవత్వం ఉందా? అంటూ అర్జీని కొట్టివేశారు. మహిళలను ముందు, వెనుక నుంచి వీడియో తీసి ఎడిట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తారా?, మీరు ఎలాంటి మనుషులు అని జడ్జి ఆగ్రహించారు. నిందితుని న్యాయవాది వాదిస్తూ, మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నారు. అయితే సాంకేతిక అంశాలను చూపించి తప్పించుకోలేదని న్యాయమూర్తి చురకలు ముట్టించారు. కొన్ని విషయాలలో నైతికత, భద్రత ముఖ్యమన్నారు. మహిళల అనుమతి లేకుండా అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే పెద్దనేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
ఏం జరగాలో అది జరుగుతోంది
బెంగళూరు: ఎప్పుడు ఏమి జరగాలో అది జరుగుతోంది, ఇకపై రాజకీయాల గురించి మీడియాతో మాట్లాడను, సమయం వచ్చినపుడు అదే తెలుస్తుంది అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆదివారం బెంగళూరులో సదాశివనగరలో నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘మాలో ఎలాంటి సమస్య లేదు. ఏ రాజకీయం కూడా లేదు. ఏమేమి తీర్మానం అయ్యాయో అవి అమల్లోకి వస్తాయి. ఎప్పుడు ఏమి చేయాలో దానిని పార్టీ చేస్తుంది. పార్టీపై విశ్వాసముంది’ అని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో చెరి సగం కాలం ఉండాలని సిద్దరామయ్య, తన మధ్య ఒప్పందం కుదిరిందని, దానిని అమలు చేయాలని డీకే డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. డీకే మాటలను బట్టి సీఎం కురీ్చని మార్చడానికి హైకమాండ్ సిద్ధమైనట్లు సమాచారం. హైకమాండ్ మాట పాటిస్తాం ముఖ్యమంత్రి కుర్చీ మార్పుపై స్పందించిన ఆయన, మీకు ఈ విషయంలో గందరగోళంగా ఉండవచ్చు. హైకమాండ్ చెప్పినదానిని పాటిస్తామని నేను, సీఎం చెప్పాం. అదే ప్రకారంగా నడచుకొంటామని తెలిపారు. మే 15న తన పుట్టిన రోజుకు ఎవరూ కూడా ఫ్లెక్స్, బ్యానర్లను వేయరాదని కోరారు. రోడ్ల సౌందర్యాన్ని నాశనం చేయరాదని, అలాంటివారిపై జరిమానా విధించాలని కమిషనర్‌కు సూచించానని తెలిపారు. అంతర్గత రిజర్వేషన్లకు పరిష్కారం ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లను తాము చెప్పినట్లు చేశామని బీజేపీ విమర్శల గురించి డీకే పేర్కొన్నారు. మాల, మాదిగ సముదాయాల్లో ముందు ఎవరికి, ఆ తరువాత ఎవరికి అనే ప్రశ్న గతంలో ఉండేది. దానిని పరిష్కారానికి దారిని కనిపెట్టామన్నారు. మాదిగ, మాల, లంబాణి, భోవి వర్గాలందరికీ న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. 30, 40 ఏళ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించామని చెప్పారు. -
తుపాకీతో కాల్చుకుని టీచర్ ఆత్మహత్య
బెంగళూరు: కొడగు జిల్లా మడికెరి తాలూకా చేరంబాణె గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఒకరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామవాసి రోహిణి (51) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆదివారం ఇంట్లో ఉన్న బ్యారెల్ తుపాకీతో కాల్చుకోవడంతో అక్కడే మరణించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మడికెరి గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంబారు చేయలేదని... తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా మూడగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. సౌజన్య పూజారి (22) మృతురాలు. శనివారం ఉదయం తండ్రి కాయగూరలు తెచ్చి మధ్యాహ్నం భోజనానికి సాంబారు వండాలని చెప్పి వెళ్లాడు. కానీ ఆమె చేయలేదు, భోజనవేళకు వచ్చిన తండ్రి.. ఎందుకు చేయలేదని దండించి, హోటల్ నుంచి సాంబారు తెచ్చుకుందామని బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి సౌజన్య ఉరికి వేలాడుతూ ఉంది. గోణిబీడు పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్టాండప్ కమెడియన్ పై రెచ్చిపోయిన పచ్చ మూకలు
-
బెంగళూరులో ఇంటి ఓనర్స్ అయిపోయాం..
సొంత ఇల్లు.. సగటు మధ్యతరగతి మనిషి జీవితకాల కల. అదీ ముంబై తర్వాత అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా (Real Estate Market) చెప్పే బెంగళూరు నగరంలో. ఆ సొంతింటి కలని నిజం చేసుకోవడం వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయో, ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉంటాయో వివరిస్తూ బెంగళూరుకు చెందిన ఓ జంట పంచుకున్న కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.అడుగు ముందుకు వేయడమే అతిపెద్ద సాహసం!సుమారు 18 నెలల క్రితం జెనిత్ రాయ్ చక్రవర్తి, ఆమె భర్త బెంగళూరులోని ఒక ప్రైమ్ లొకేషన్లో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితికి అది కొంత భారము అయినా, ఆ రిస్క్ తీసుకోవడానికే వారు సిద్ధపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంపై కనీస అవగాహన గానీ, సరైన మార్గదర్శకులు గానీ లేకపోయినా.. ధైర్యమే పెట్టుబడిగా ముందుకెళ్లారు.నిద్రలేని రాత్రులు.. ఎన్నో సందేహాలుఈ ప్రయాణం పూల బాట ఏమీ కాదని జెనిత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వారు ఎదుర్కొన్న సవాళ్లు ఇవే.. ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉంది, ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. గృహ రుణాలు (Home Loans), ప్రాపర్టీ మార్కెట్ నిబంధనలు అర్థం చేసుకోవడానికి సొంతంగా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ‘మేము సరైన నిర్ణయమే తీసుకున్నామా?’ అనే భయం, నిద్రలేని రాత్రులు వారిని వెన్నెంటే ఉన్నాయి.‘మేము దాదాపు శూన్యం నుంచి మొదలుపెట్టాం. ప్రతి అడుగులోనూ భయం ఉన్నా, ఒకరికొకరం అండగా నిలబడ్డాం. మా కుటుంబ సభ్యుల మద్దతు మమ్మల్ని ముందుకు నడిపించింది’ అని జెనిత్ భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Zenith Roy Chakraborty (@zenithroyofficial)నిర్మాణంతో పాటే.. ఆత్మవిశ్వాసం కూడా!వందల సార్లు సైట్ విజిట్లు చేయడం, డాక్యుమెంట్లు సరిచూసుకోవడం, బ్యాంకుల చుట్టూ తిరగడం.. ఇలా ప్రతి దశలోనూ వారు కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఇల్లు రూపుదిద్దుకుంటున్న కొద్దీ, వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. చివరకు ఆ ఇల్లు పూర్తి కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు..‘ఇది ఇతరులకు కేవలం ఒక ఆస్తిలా కనిపించవచ్చు. కానీ మాకు మాత్రం ఇది మా కష్టానికి, పట్టుదలకు నిదర్శనం’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జంట వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరైనా కష్టపడితే, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే తమ కలను ఎలా నిజం చేసుకోవచ్చో చెప్పడానికి ఈ జంట ప్రయాణమే ఒక నిదర్శనం.ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా? -
ఆర్సీబీ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది. ఈ గెలుపు ద్వారా ఆర్సీబీ ఓ అరుదైన ఘనత సాధించింది. సొంత మైదానం బెంగళూరులో తమ 50వ విజయాన్ని నమోదు చేసింది. తద్వారా ముంబై ఇండియన్స్ (వాంఖడే), కేకేఆర్ (కోల్‌కతా), సీఎస్కే (చెన్నై) జట్ల సరసన చేరింది. ఈ జట్లు కూడా తమతమ సొంత వేదికలపై 50 విజయాలు నమోదు చేశాయి. గత 18 సీజన్లలో కలిపి బెంగళూరులో 46 విజయాలు నమోదు చేసిన ఆర్సీబీ, ఈ ఒక్క సీజన్లో ఇప్పటికే (5 మ్యాచ్‌ల్లో) 4 విజయాలు సాధించింది. ఈ సీజన్లో బెంగళూరులో ఆర్సీబీకి ఎదురైన ఏకైక పరాజయం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో. ఈ మ్యాచ్‌లో 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారానూ ఆర్సీబీ ఓ ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అలాగే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఛేదించిన 206 పరుగుల లక్ష్యం ఆ జట్టుకు ఐపీఎల్లో రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా నిలిచింది.ఐపీఎల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన టాప్-5 జట్లుపంజాబ్ కింగ్స్- 10ముంబై ఇండియన్స్- 6ఆర్సీబీ-5రాజస్థాన్- 5ఎస్ఆర్హెచ్- 5ఐపీఎల్లో ఆర్సీబీ ఛేదించిన 200 ప్లస్ లక్ష్యాలు228 vs LSG, లక్నో, 2025206 vs GT, బెంగళూరు, 2026*204 vs KXIP, బెంగళూరు, 2010202 vs SRH, బెంగళూరు, 2026201 vs GT, అహ్మదాబాద్, 2024ఐపీఎల్లో ఒక వేదికపై ఒక జట్టు సాధించిన అత్యధిక విజయాలు58 - MI (వాంఖడే)55 - KKR (కోల్‌కతా)53 - CSK (చెన్నై)50 - RCB (బెంగళూరు)*40 - SRH (హైదరాబాద్)*సూపర్ ఓవర్ విజయాలతో కలిపికాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కాడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
కోట్లు సంపాదించి అద్దె ఎగ్గొట్టిన విరాట్ కోహ్లి.. హోటల్ మూసివేత
-
టెక్కీ ఖర్చుల చిట్టా వైరల్!
దేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో జీవన వ్యయం చుక్కలు చూపిస్తోంది. ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా ఉండే ఈ మహానగరంలో భారీ జీతాలు తీసుకుంటున్న యువ నిపుణులు సైతం పొదుపు చేయడం గగనమైపోతోంది. తాజాగా, ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ చేజ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆరుషి గార్గ్ అనే 23 ఏళ్ల యువతి తన నెలవారీ ఖర్చులను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.నెలవారీ బడ్జెట్ ఇలా..ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరుషి పంచుకున్న లెక్కల ప్రకారం, ఆమె జీవనశైలికి నెలకు సుమారు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చవుతోంది. ఈ వ్యయంలో సింహభాగం ఇంటి అద్దెకే వెళ్తుండటం గమనార్హం. ఖర్చు వివరాలుఅంచనా మొత్తం (నెలవారీ.రూ ల్లో)ఇంటి అద్దె17,000కిరాణా సామాగ్రి5,000బయట భోజనం3,000 - 6,000షాపింగ్3,000 - 7,000మెడిసిన్స్, గిఫ్ట్స్2,000 - 6,000పని మనిషి2,000రవాణా1,000 - 2,000మొత్తం ఖర్చు30,000 - 35,000 ‘నేను మరీ ఎక్కువగా ఖర్చు చేస్తున్నానా?’ అంటూ ఆమె అడిగిన ప్రశ్న నెటిజన్లలో చర్చనీయాంశమైంది.నెటిజన్ల రియాక్షన్ఆరుషి పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె బడ్జెట్ చాలా పొదుపుగా ఉందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మెట్రో నగరాల్లోని ఆర్థిక ఒత్తిడిని ఏకరువు పెడుతున్నారు. ‘నేను రూ.50 వేలు సంపాదిస్తే.. అందులో రూ.48 వేలు ఖర్చులకే పోతున్నాయి. అసలు నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నానో అర్థం కావడం లేదు’ అని ఒక యూజర్ చెప్పారు. ‘ఇది ఒక మెట్రో సిటీలో ఉండాల్సిన సాధారణ బడ్జెట్. బెంగళూరు వంటి నగరాల్లో ఇంతకంటే తక్కువ ఖర్చుతో జీవించడం కష్టం’ అని ఇంకొకరు చెప్పారు.ఆదాయం ఉన్నా ఆదా సున్నాఐటీ ఉద్యోగులతోపాటు అధిక జీతాలు తీసుకునే వారు కూడా ఆర్థికంగా ఎందుకు వెనుకబడుతున్నారో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయెల్ విశ్లేషించారు. లింక్డ్ఇన్లో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘నెలకు రూ.1.2 లక్షలు సంపాదిస్తున్నా రూపాయి కూడా పొదుపు చేయలేని వారిని నేను చూశాను. దీనికి కారణం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ (జీవనశైలి ద్రవ్యోల్బణం). ఆదాయం పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా అనవసరమైన ఖర్చులు కూడా పెంచుకుంటూ పోవడమే పెద్ద సమస్య’ అని మీనాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు -
బెంగళూరు ఐఫోన్ ఫ్యాక్టరీ టాయిలెట్లో షాకింగ్ ఘటన
బెంగళూరు: ఆపిల్ ప్రధాన ఐఫోన్ ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో దారుణం జరిగింది. టాయిలెట్లో బిడ్డకు 19 ఏళ్ల యువతి జన్మనిచ్చింది. ఆపై పసికందు గొంతుకోసి హత్యకు పాల్పడింది. దేవనహళ్లిలోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఉద్యోగినిగా పనిచేస్తున్న నిందితురాలు.. బుధవారం టాయిలెట్లోకి వెళ్లిన సమయంలో ప్రసవించింది. అనంతరం శిశువు గొంతు కోసి.. మృతదేహాన్ని ఒక బ్యాగులో పడేసింది. ఆమె టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా ప్రసవం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.అవివాహిత అయిన ఆ యువతి.. సమాజంలో ఎదురయ్యే అవమానాలకు భయపడి శిశువును చంపినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. సహా ఉద్యోగి టాయిలెట్లోకి వెళ్లినప్పుడు అక్కడ శిశువు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. శిశువు పుట్టిన తర్వాతే హత్యకు గురైనట్లు నిర్ధారించారు. నిందితురాలను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి చెత్త వేయడానికి వెళ్లి... ప్రియుడితో పరార్!
యశవంతపుర( కర్ణాటక): భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో ఉడాయించిన భార్య ఉదంతం బెంగళూరు బాగలగుంటె పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియాంక, శరత్‌కుమార్ అనే దంపతులు బాగలగుంటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. శరత్ పనులకు వెళ్లిన సమయంలో ప్రియాంక కటింగ్ షాపు నిర్వహిస్తున్న ప్రభు వద్దకు వెళ్లి మాట్లాడేది. ఇదే విషయంపై ప్రయాంక, శరత్‌ల మధ్య గొడవ జరిగేది. ఈ నెల 11న అర్ధరాత్రి సమయంలో ఇంటిలోని చెత్తను తీసుకోని చెత్తకుండీలో వేసేందుకు వెళ్లిన ప్రియాంక తిరిగి రాలేదు. శరత్ బయటకు వెళ్లి ఆరా తీయగా ప్రభు బైక్‌పై ప్రియాంక వెళ్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భోజనంలో తనకు నిద్రమాత్రలు కలిపిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. A woman who left home saying she was going to dispose of garbage has gone missing. Her husband has now made a serious allegation that she may have eloped with a known person. The incident occurred under Bagalagunte police station limits.The husband Sharaath Naik TG has been… https://t.co/xUSeaboUcj pic.twitter.com/OQIMaucxEF— Hate Detector 🔍 (@HateDetectors) April 22, 2026 -
సైకిల్‌కు టోల్ ఫీజా ?
దొడ్డబళ్లాపురం: దేశ వ్యాప్తంగా ఉన్న టోల్గేట్లలో ద్విచక్ర వాహనాలు, సైకిళ్లకు ఎటువంటి ఫీజులు వసూలు చేయరనేది అందిరికీ తెలిసిందే. అయితే నైస్ రోడ్డులో సైకిల్‌కి రూ.25 టోల్ ఫీజు చెల్లించిన ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి వీడియో తీస్తూ తన బాధ చెప్పుకున్నాడు. తాను దేశంలో ఎన్నో రాష్ట్రాలు దాటి సైకిల్ మీద వస్తున్నానని, అయితే తన సైకిల్‌కి ఎక్కడా టోల్ వసూలు చేయలేదన్నారు. మొట్టమొదటి సారి కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని నైస్ రోడ్డులో రూ.25లు వసూలు చేశారని, ఇది ట్యాక్సా లేక పగటి దోపిడీనా అంటూ ప్రశ్నించాడు. ఈడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Hook NewsFeed (@hooknewsfeed) -
బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ద్వారా కీర్తిని గడించిన ఈ ఢిల్లీ స్టార్.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. స్వయంగా ఎన్నో బ్రాండ్లు కూడా కలిగి ఉన్నాడు. వన్8 కమ్యూన్ ద్వారా ఆతిథ్య రంగంలోనూ కోహ్లి అడుగుపెట్టాడు.దేశ వ్యాప్తంగాదేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ చైన్ వ్యాపించి ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్, పుణె, కోల్‌కతా, నోయిడా, హైదరాబాద్ వంటి సిటీల్లో వన్8 కమ్యూన్కు శాఖలు ఉన్నాయి. అయితే, బెంగళూరులో ఉన్న వన్8 కమ్యూన్ బ్రాంచీ కోర్టు ఆదేశాలతో మూతపడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..అద్దె కట్టకుండా..బెంగళూరులో చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో వన్8 కమ్యూన్ రెస్టారెంట్ ఉంది. ట్రియో హిల్స్ హాస్పిటాలిటీ దీనిని నిర్వహిస్తూ కోహ్లితో భాగస్వామ్యంలో ఉంది. అయితే, గత ఆర్నెళ్లుగా అద్దె చెల్లించడంలో ట్రియో హిల్స్ విఫలమైంది. మెయింటెనెన్స్ కూడా బాకీ పడింది. దీంతో సదరు భవన నిర్మాణ యజమాని ఈ విషయమై సివిల్ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో అద్దె చెల్లించి, యజమానితో సమస్యలు పరిష్కారం చేసుకునేంత వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా ఇప్పటికే ఈ రెస్టారెంట్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బంధం తెంచుకున్న కోహ్లిఈ రెస్టారెంట్ అగ్రి పమాద భద్రతకు సంబంధించి నిరభ్యంతర పత్రం (NOC) కూడా పొందలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఇప్పటికే తన బ్రాండ్ పేరును తొలగించాల్సిందిగా ట్రియో హిల్స్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్ల రాక తగ్గిపోయి ఆర్థికంగానూ సదరు రెస్టారెంట్ నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి 247 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఆర్సీబీ ఆరింట నాలుగు విజయాలతో జోరు మీద ఉంది.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు -
ప్రేమ.. ఎంత పని చేసింది?
ప్రేమలో అనుమానం ఎంత ఘోర పరిణామానికి దారి తీస్తుందో తెలియజేసే ఘటనే ఇది. ఓ యువతి తన ప్రియుడ్ని ఇంటికి పిలిచి ఘాతుకానికి పాల్పడింది. తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో అతన్ని సజీవదహనం చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం అసలు వివరాల్లోకి వెళ్తే.. ప్రేరణ, కిరణ్ ఇద్దరూ ఓ టెలికాం స్టోర్‌లో జాబ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా. అయితే కొంత కాలంగా అతను ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని.. మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె అనుమానించింది. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించింది. మంగళవారం దక్షిణ బెంగళూరులో ఉన్న తన ఇంటికి రావాలంటూ పిలిచింది. వెరైటీ ప్రపోజ్ ప్లాన్ గురించి చెప్పింది. దానికి తొలుత అతను ఒప్పుకోలేదు. అయితే ఫారిన్లో ఇదంతా కామన్ అని బలవంతం చేసేసరికి సరే అన్నాడు. కిరణ్‌ను ఓ కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు చేతులు కట్టేసింది. కళ్లకు గంతలు కట్టేసింది. అతను నిజంగానే ఆమె ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతోందని ఆశపడ్డాడు. కానీ.. ఇంట్లో అప్పటికే దాచిన కిరోసిన్‌ను తెచ్చి అతని మీద పోసి నిప్పంటించి దూరం నుంచి ఫోన్లో వీడియో తీయసాగింది. కిరణ్ ఆరుపులు విని స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే అతను మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో.. తనను పెళ్లి చేసుకోడనే అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియోను ఆమె ఫోన్ నుంచి స్వాధీనపర్చుకున్నారు. కిరణ్-ప్రేరణల మధ్య స్నేహం గురించి తమకు తెలుసని.. వాళ్లు ఒప్పుకుంటే వివాహం కూడా జరిపించాలని తాము భావించామని ఇరువైపులా పెద్దలు చెబుతున్నారు. ప్రేమ అనేది నమ్మకం.. కానీ అనుమానం ప్రాణాలు తీసింది అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. -
శూన్యమే మిగిలింది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ
సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలను పలకరించగా..ఇంకా ఆ దృశ్యం కళ్లముందు మెదులుతూనే ఉందంటున్నారు. ఆ ఘటన మిగిల్చిన కన్నీళ్లని అంతతేలిగ్గా మర్చిపోలేమంటున్నారు భర్తలను పోగోట్టుకున్న మహిళలు. అంతేగాదు తమ కళ్లలోని కన్నీటి చెమ్మ తడి ఆరదు అని గద్గద హృదయంతో చెబుతోంది ఆ పహల్గామ్ బాధితుల్లో ఒకరైన డాక్టర్ సుజాత. గుండెల్ని పిండేసే ఆమె మనో వ్యథ వింటే ప్రతి ఒక్కరి మనసు ద్రవించిపోవడమే కాదు ఈ ఉగ్రవాదం సమూలంగా పోయేదెప్పుడూ అన్న ఆక్రోశం కట్టలుతెచ్చుకుంటుంది.నాటి పహల్గామ్ దాడిలో డాక్టర్ సుజాత ఎంబీఏ పట్టభద్రుడైన భర్త భరత్ భూషణ్‌ని పోగొట్టుకుంది. అతడికి ప్రపంచం గురించి తెలిస్తే..ఆమెకు రోగుల గురించి తెలుసు. అలా ఒకరికొకరం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాళ్లం అని భోరున విలపిస్తున్నారు సుజాత. ఆ దాడిని తన నాలుగేళ్ల కుమారుడు ప్రత్యక్ష్యంగా చూశాడంటూ నాటి భయంకర ఘటనను గుర్తుచేసుకున్నారు. నాన్నకు దెబ్బ తగిలింది, చాలా రక్త కారింది అన్నమాటలు ఇంకా తన చెవిలో వినిపిస్తూనే ఉన్నాయంటున్నారు. ఆ దాడి నీలి నీడలా వెంటాడుతూనే ఉందంటున్నారామె. ఆ బాధను తట్టుకోవడం అంత ఈజీకాదు. ఆ ఘటన తన భావోద్వేగాల నుంచి చిరునవ్వు వరకు అన్నింటి దూరం చేసిందని, కేవలం శూన్యమే మిగిలిందని చాలా నిర్వేదంగా చెప్పుకొచ్చారామె. అంత తేలిగ్గా మర్చిపోలేను ఆ విషాదకరమైన రోజుని, తాను, తన కుమారుడు రక్తంతో తడిచిపోయిన ఆ భయంకపితమైన క్షణాలు బతుకున్నంత వరకు మర్చిపోలేనంటున్నారామె. ఆ కన్నీటి దృశ్యం ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉందన్నారామె. అందుకే తాను ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యేలా చూసుకుంటూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారామె. కాస్త ఖాళీ దొరికినా..ఆ బాధ వెన్నాడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఎంత భయానకమైనవంటే..మనం అనుభవించిన సంతోషకరమైన క్షణాల కంటే ..ఆ బాధే అత్యంత భారంగా అధికంగా ఉంటుందని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నేసి గంటలు ఆస్పత్రిలో పనిచేసినా..ఒక్క ఆదివారం మాత్రం కొడుకు కోసం కేటాయించుకుంటానని చెప్పారు. భతవంతుడి దయవల్ల తన కొడుడు చాలా మంచివాడని అంటున్నారు. ఎందుకుంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారి కూడా తండ్రి గురించి అడగలేదు. ప్రశాంతంగా ఉన్నాడని అన్నారు. పైగా తాను లేనప్పుడూ అస్సలు అల్లరి చేయడు, తాను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నాతో అల్లరి చేస్తుంటాడని నవ్వుతూ చెప్పారు. ఈ విషయంలో భగవంతుడికి సదా కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. అంతేగాదు తన కొడుకుకి తండ్రిన కోల్పోయినట్లు తెలుసు, కానీ ఆ లోటు వాడికి కనపడకుండా అన్నీతానై పెంచుకుంటున్నానని చెప్పారామె. నిజానికి ఏప్రిల్ నెల ఎప్పుడూ పండుగ మాసం, కానీ అది మాకు సర్వం కోల్పోయేలా చేసిన విషాదకరమైన మాసంగా మిగిలిందన్నారు. "ఈ పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు తన భర్త పుట్టినరోజు వేడుకులు చేసుకున్నాం అని అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 14న విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాం. నిజానికి తాము ఎప్పుడు గుడికి వెళ్లి..ఆ తర్వాత బయటకు వెళ్లేవాళ్లం. ఆరోజు తన తల్లిదండ్రలు కూడా కాశ్మీర్లో గట్టి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పినప్పుడూ కూడా అంతగా ఆందోళన చెందలేదు. పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటే టపాసులు అనుకున్నా..భద్రతా సిబ్బంది అంతా చూసుకుంటారిని అనుకున్నా. కానీ ఆ ప్రాంతంలో భద్రత లేదు, ఒక్క మనిషి గానీ, సాయుధగార్డు గానీ ఉంటే ఆ ఘటనను నివారించి ఉండేవారంటూ". ఆ విపత్కర పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. బహుశా తీవ్రవాద భావజాలం ఈ దాడులు చేసేవాళ్ల మెదడులను పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశారన్నారు. తాము చేస్తుంది తప్పు కాదు సరైనదే అన్నంత క్రూరంగా మార్చేశారన్నారు. అయితే ఈ ఉగ్రవాదాన్ని ఎలా మట్టుపెట్టాలో తనకు తెలియదు గానీ..ఇక్కడితో ఈ మారణకాండ ఆగిపోవాలి అని ఉద్విగ్నంగా అన్నారామె. ఆ దాడి జరిగిన రోజు తమ పెళ్లిరోజు అని, ఆయనతో తనకు అదే చివరి భయానక జ్ఞాపకమని కన్నీళ్లుపెట్టుకున్నారామె. కాగా, పహల్గామ్ సంఘటన జరిగినప్పుడు ఆ దంపతులకు పెళ్లై ఆరేళ్లయింది. ప్రస్తుతం ఆమె తనను ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నా..కానీ ఈ నష్టం ఏ స్త్రీకైనా పూడ్చలేనది అని గద్గద స్వరంతో అన్నారు డాక్టర్ సుజాత.#PahalgamTerroristAttackDr. Sujatha, a pediatrician from Bengaluru, witnessed the tragic killing of her husband, Bharath Bhushan, during a terrorist attack in Pahalgam, Jammu and Kashmir, on April 22, 2025. #DrSujatha, her husband, and their three-year-old son were vacationing… pic.twitter.com/Wn5D9ZnMuL— Dr Parveen Yograj (@ParveenYograj) April 24, 2025 (చదవండి: ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ) -
ఆలయాన్ని తలపించే కేఫ్..! ఏకంగా ప్రపంచంలోనే..
ఎన్నో కేఫ్‌లు చూసుంటాం. ఇలాంటి కేఫ్ చూసే ఛాన్సే లేదు. ఎందుకంటే..మనసుకి హాయినిచ్చే ఆధ్యాత్మికత, కడుపు నింపే కమ్మని భోజనం ఒకే చోట లభించే హోటల్ లేదా రెస్టారెంట్ గురించి ఇంతవరకు చూడలేదు. అలాంటి అపురూపమైన దృశ్యం ఆ కేఫ్‌లో చూడొచ్చు. ఆలయానికి వెళ్తున్నామా లేక కేఫ్‌కి వెళ్తున్నామా అనే గందరగోళానికి గురి చేసే అద్భుతమైన కేఫ్ ఇది. ఎక్కడ ఉందంటే..బొమ్మసంద్రలోని బెంగళూరు కొత్త రామేశ్వరం కేఫ్, 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో 'ప్రపంచంలోనే అతిపెద్ద కేఫ్'గా అలరారుతోంది. ఇందులో 600 మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉంది. ఆదియోగి విగ్రహంతో కూడిన ఒక జలాశయం కూడా ఉంది. బొమ్మసంద్రలో రామేశ్వరం కేఫ్ సరికొత్త అతిపెద్ద అవుట్లెట్తో బెంగళూరు పాక ప్రపంచాన్ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. ఆలయ ప్రాంగణాన్ని తలపించే ప్రవేశ ద్వారం అత్యంత ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. అతిథులు రాగానే, మధ్యలో ఆదియోగి విగ్రహం, ఫౌంటెన్‌తో కూడిన ప్రశాంతమైన జలాశయం వారికి స్వాగతం పలుకుతుంది. దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పాన్ని ఆధునికతను జోడించి..భోజనాన్ని కేవలం ఒక పూట భోజనంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక ఆచారంగా అందంగా మార్చారు. 'దైవ స్పర్శ' అనే థీమ్‌తో ఈ కేఫ్‌ని నిర్మించారట. ఈ కేఫ్‌లో హైలెట్‌గా దేవి లింగ భైరవి ఆలయం, అలాగే కర్ణాటక వారసత్వానికి ప్రతీక అయిన భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు, వీణా కచేరీలతో సహా సంగీత ప్రదర్శనల కోసం రూపొందించిన ఒక యాంఫీథియేటర్ కూడా ఉంది. అలాగే అక్కడ సేవ కౌంటర్ల వద్ద విత్ర చిహ్నాల క్లిష్టమైన చెక్క శిల్పాలు చూపురులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఒక ప్రత్యేక గోశాల కూడా ఉంది. ఆధ్యాత్మిక దృశ్యాలను ప్రదర్శించే హై-టెక్ డిజిటల్ స్క్రీన్లు, పురాతన రాతి విగ్రహాల వైభవంతో చాలా అందంగా తీర్చిదిద్దారు. 'ది రామేశ్వరం కేఫ్' వ్యవస్థాపకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న తత్వాన్ని గురించి వెల్లడించారు. ఇది సంస్కృతి, నమ్మకం, ఆహారం ఏకమై ఉండే ఒక ప్రదేశాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఇలా కేఫ్‌ని తీర్చిదిద్దామని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతేగాదు పోస్ట్‌లో రామేశ్వరం కేఫ్ ఇలా పేర్కొంది. ఇక్కడ ప్రతి దేవాలయం, ప్రతి విగ్రహం, ప్రతి వివరం ఒక ఉద్దేశ్యంతోనే ఉంచాం. కేవలం సర్వీస్ మాత్రమే కాదు సంస్కృతి, నమ్మకం, ఆహారం కలగలిసిన అనుభూతికి కేంద్రబిందువుగా ఒక దేవాలయ అనుభూతిని తీసుకొచ్చే.. ఒక దివ్యమైన భోజన అనుభవం అని ప్రకటించింది. View this post on Instagram A post shared by Aditya Raj | Dev & Creator (@addywithlens) (చదవండి: లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..) -
AP: రైలులో దోపిడీ దొంగల బీభత్సం
సాక్షి, బాపట్ల జిల్లా: రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బెంగుళూరు- నరసాపురం(07154) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో నాలుగు కోచ్‌ల్లో చోరీకి పాల్పడ్డారు. ఎస్7, ఎస్11, ఎస్12, ఎస్13 కోచ్‌లలో ప్రయాణికుల నుండి సుమారు 11 తులాలు బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాపట్ల- అప్పికట్ల మధ్య ఘటన జరిగింది. అప్పికట్లలో రైలు అపి దుండగులు దిగిపోయారు. విజయవాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ నెల ఏప్రిల్ 15న మహారాష్ట్రలోని మన్వత్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో కాకినాడ-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్(17206)లో దోపిడీ దొంగలు చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. సిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసిన దొంగలు.. రైలును ఆపి, మహిళా ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైళ్లలో దోపిడీలు వరసగా జరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి సమయంలో దోపిడీ దొంగలు టార్గెట్ చేస్తున్నారుజ ఇటీవల సికింద్రాబాద్, నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో దోపిడీ ఘటనలు వెలుగుచూశాయి. -
రైలు పట్టాలపై సిలిండర్, స్టవ్
బెంగళూరు: రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్, స్టవ్ కనిపించడంతో పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. మద్దూరు–చెన్నపట్టణ రైల్వే మార్గంలో ఇది జరిగింది. సోమవారం ఉదయం ఖాళీ గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, కొన్ని బట్టలు కలిగిన మూట ఒకటి రైలు పట్టాల ఉంది. మైసూరు నుంచి బెంగళూరు వస్తున్న మంగళ ఎక్స్‌ప్రెస్ రైలు లోకోపైలట్ వాటిని చూసి రైలును నిలిపివేశాడు. రైలులో ప్రయాణికులు తీసుకువెళ్తున్న ఈ వస్తువులు అనుకోకుండా జారిపడి ఉంటాయని అనుమానిస్తున్నారు. లేదా ఎవరైనా కావాలనే సిలిండర్‌ను పట్టాలపై ఉంచారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వల్ల కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. -
ఫిట్‌నెస్‌పై ఇంత క్రేజా?!
పట్టణాల్లో, నగరాల్లో మారథాన్, అధిక ఫోర్స్‌తో చేసే వర్కౌట్లు వంటి ఫిట్నెస్ ఈవెంట్ల పట్ల ప్రజల ఆదరణ ఏ రేంజ్లో ఉందో తెలిస్తే షాకవ్వుతారు. వాటిపై పెడుతున్న ఖర్చులకు మాటలు రావ్. అందుకు ఉదాహరణ బెంగుళూరు ఫిట్నెస్ సెంటర్ ఈవెంటే. ఏం జరిగిందంటే..బెంగళూరులో హైరాక్స్ ఫిట్నెస్ ఈవెంట్ ధరలు చూస్తూ కళ్లు బైర్లుకమ్ముతాయ్. అందుకు సంబంధించిన పోస్ట్‌ని అంకిత్ కేడియా అనే యూజర్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ ప్రకారం..అక్కడ జరిగిన ఫిట్నెస్ ఈవెంట్లో దాదాపు తొమ్మిది వేల మంది దాక పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రూ. 9 వేలు చొప్పున ప్రవేశ రుసుము చెల్లించారు. అంటే ఒక్క రోజుల్లోనే సుమారుగా రూ. 8.1 కోట్లు వచ్చాయ్. మారథాన్‌లో కూడా ఇదో ధోరణి కనిపిస్తోంది. కేవలం ఒక రోజు పరుగుతీయడానికే రూ. 3 వేలు నుంచి రూ. 5 వేలు ఛార్జ్ చేస్తున్నారంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు కేడియా. ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు ఇదంతా ఫిట్నెస్ కోసం కాదని, కేవలం గుర్తింపు కోసం జరుగుతున్న ఆరాటం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఫిట్నెస్ అనేది ఒకరోజు ప్రదర్శన కాదు, అది జీవితాంతం కొనసాగే ప్రయాణం అని అబివర్ణిస్తున్నారు కొందరు ఫిట్నెస్ ప్రియులు. HYROX fitness event in Bengaluru saw around 9,000 participants.They charged ₹9,000 per person to participate, which comes to roughly ₹8.1 crore made in a single day.Same trend is showing up in marathons. People are paying ₹3,000–₹5,000 just to run for a day.Being fit is…— Ankit Kedia (@Ankittskedia) April 13, 2026 (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!) -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ క్షిప్రా మృతి
బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో యువ టెక్కీ దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా సుళ్యకు చెందిన టెక్కీ క్షిప్రా (27) మృతి చెందింది. మంగళూరుకు చెందిన శశి కళాభట్‌కు ఏకైక కూతురు క్షిప్రా. బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. రాయచూరు జిల్లాలో స్నేహితురాలి పెళ్లి ఉండడంతో సహ ఉద్యోగులతో కలిసి ఆనందంగా కారులో కర్నూలు పర్యటనకు వెళ్లారు. ఆదోని పట్టణం వద్ద కారు డ్రైవర్‌కు నిద్ర మత్తు వచ్చి చెట్టును ఢీన్నాడు. ఈ ప్రమాదంలో క్షిప్రాకు బలమైన గాయాలై అక్కడే చనిపోయింది. మరో యువకుడు, ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. క్షిప్రా ఎంటెక్ చేసింది, కొన్నేళ్ల కిందట తండ్రి చనిపోగా, ఆమెను తల్లి కంటికి రెప్పలా చూసుకుంటోంది. తల్లీ కూతురు బెంగళూరులోనే నివసిస్తున్నారు. ఇంతలో ఏకైక ఆధారంగా ఉన్న కూతురు కూడా మరణించడంతో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
కృతికా కేసు: ‘పోలీసులు అడిగితే మనం స్నేహితులమని చెప్పు’
బెంగళూరు: సంచలనం సృష్టించిన బెంగళూరు డాక్టర్ కేసులో ఏడాది తర్వాత.. చాటింగ్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బెంగళూరుకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి.. కట్టుకున్న భార్యను(చర్మవ్యాధి నిపుణురాలు) కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి తన ప్రియురాలితో కలిసి పథకం పన్నినట్లు తెలుస్తోంది. తన భార్య కృతికా రెడ్డికి ఇంట్లోనే మోతాదుకు మించి అనస్థీషియా డ్రగ్ ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేంద్ర రెడ్డిని.. గతేడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన గత ఏడాది ఏప్రిల్ 21న జరిగింది. ఇంట్లో కృతిక అస్వస్థతకు గురైనట్లు నాటకమాడి, మహేంద్ర ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మొదట ఇది సహజ మరణంగా భావించినప్పటికీ తదుపరి విచారణలో పోలీసులకు అనుమానాలు కలిగాయి. ఒక డాక్టరుగా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు మహేంద్ర ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.దర్యాప్తు సమయంలో నిందితుడు హర్షిత అనే నర్సుతో సంబంధంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఈ కేసులో అత్యంత కీలక ఆధారాలుగా మారాయి. నిఘా సంస్థలకు దొరకకుండా ఉండేందుకు మహేంద్ర వాట్సాప్ వంటి సాధారణ ప్లాట్‌ఫారమ్‌లను వాడకుండా, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా సందేశాలు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నిందితుడి ఫోన్ నుండి డిజిటల్ ఫైళ్లను రికవరీ చేసింది. ఇందులో డిలీట్ చేసిన డేటా, సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఫోన్ పే చాట్లు ఉన్నాయి. వీటిని పోలీసులు చార్జ్‌షీట్‌లో చేర్చారు.నిందితుడు హర్షితకు పంపిన కొన్ని మెసేజ్‌లు.. అతని నేరం చేయడానికి ముందస్తు ప్లాన్ బయటపడింది. "ఈ మెసేజ్ చూసిన తర్వాత నాకు ఎక్కడా టెక్స్ట్ చేయొద్దు, కాల్ చేయొద్దు. అంతా సర్దుకున్నాక నేనే కాల్ చేస్తాను. ఒకవేళ పోలీసులు నిన్ను పిలిచి మన మధ్య సంబంధం ఏంటని అడిగితే.. మనం కేవలం స్నేహితులమని చెప్పు’’ అంటూ చేసిన చాటింగ్ బయటపడింది. మహేంద్ర, కృతికలకు మే 2024లో వివాహం జరిగింది. వీరిద్దరూ బెంగళూరులోని ఒకే ఆసుపత్రిలో పనిచేసేవారు. సేకరించిన ఆధారాలు బలంగా ఉండటంతో స్థానిక కోర్టు.. మహేంద్ర రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. -
అద్దె భారం.. సౌకర్యాలు శూన్యం!: బెంగళూరులో ఇలా..
బెంగళూరు నగరంలో రోజురోజుకి ఇళ్ల అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. కానీ కావలసిన కనీస అవసరాలు కూడా లభించడం లేదు. అధిక మొత్తంలో డబ్బు చెల్లించినప్పటికీ, తగిన ఇళ్లు దొరకడం లేదని చాలా మంది అద్దెదారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.బెంగళూరు నివాసి ఒకరు ఇటీవల కడుబీసనహళ్లికి 6 కిలోమీటర్ల పరిధిలో 1BHK ఫ్లాట్ కోసం వెతుకుతున్నప్పుడు ఎదురైన తమ అనుభవాన్ని రెడ్డిట్‌లో పంచుకున్నారు. ఈ అన్వేషణలో.. బెల్లందూర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, మారతహళ్లి, ఏఈసీఎస్ లేఅవుట్, సమీపంలోని సర్జాపూర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.ఎక్కడ ఇల్లు కోసం సెర్చ్ చేసినా.. కనీస సౌకర్యాలు లేదని వెల్లడించాడు. అయితే అద్దె మాత్రం చాలా ఎక్కువగా ఉందని వాపోయాడు. దాదాపు రూ. 30,000 చెల్లిస్తున్నప్పటికీ, సరైన బాల్కనీ, పార్కింగ్ సౌకర్యాలు ఉన్న ఫ్లాట్‌ను వెతుక్కోవడం కష్టంగా ఉందని కూడా ఆయన అన్నారు.ఫ్లాట్లు రూ.28 వేల నుంచి రూ.32 వేలు లేదా అంతకంటే ఎక్కువ ధరకే లభిస్తున్నాయి, అయినా కూడా వాటిలో సరైన బాల్కనీ లేదా ప్రత్యేక కార్ పార్కింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. నన్ను మరింత ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటంటే, ఇళ్లను చూపించే విధానం. చాలా చోట్ల బాల్కనీ ఉందని చెబుతారు, కానీ మీరు నిజంగా వెళ్ళినప్పుడు, అది వాషింగ్ మెషీన్ పక్కన ఉండే ఒక చిన్న పని ప్రదేశంలా ఉంది. ఇది తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా అనిపిస్తుందని అతడు వెల్లడించాడు.ఇదీ చదవండి: రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!నేను మరీ అంత ఆడంబరమైన ఇళ్ల కోసం ఏమీ వెతకడం లేదు. గేటెడ్ సొసైటీలో.. కనీసం నిలబడటానికి లేదా కూర్చోవడానికి వీలుగా ఒక చిన్న ప్రైవేట్ బాల్కనీ, సరైన కార్ పార్కింగ్ ఉన్న ఒక సాధారణ 1BHK చాలు. అయినా అలాంటివి అస్సలు దొరకడం లేదు. దీన్నిబట్టి చూస్తే నగరంలో సరైన సౌకర్యాలున్న ఇళ్లను వెతుక్కోవడం పెద్ద సహజంగా అనిపిస్తుంది. -
మహిళను ఇంట్లోంచి ఈడ్చి కొట్టిన జనాలు!
కర్ణాటక: పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో స్థానిక జనం ఇంట్లోంచి బయటకు ఈడ్చి దాడి చేసిన సంఘటన బెంగళూరు వర్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. 4వ తేదీన రాత్రి ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్తూరు పీఎస్ పరిధిలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ రాత్రి అపరిచిత యువకునితో ఉందని ఆరోపిస్తూ స్థానికులు కేకలు వేస్తూ ఆమెను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి కొట్టారు. మహిళ గాయపడగా కొందరు ఆస్పత్రికి తరలించారు. వర్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
హీరో వెంకటేష్ మెచ్చిన 'బటర్ దోసె'..! ఎలా చేస్తారంటే..
దోసెలంటే ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి దోసెలలో అత్యంత ఫేమస్ దోసె ఇది. కాసింత నూనె, మసాలా జోడిస్తే అబ్బో.. నోట్లో నీళ్లూరిపోవాల్సిందే. అలాంటి టేస్టీ.. టేస్టీ.. దోసెను దశాబ్దాలుగా అందిస్తోంది బెంగుళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్. ఈ దోసె కోసం సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు క్యూలు కడుతుంటారు. పైగా అదెలా తయారు చేస్తారనేది బయటకు పొక్కనివ్వకుండా కేర్ తీసుకుంటుందట ఆ రెస్టారెంట్. అంతలా పకడ్బందిగా తయారు చేసే ఆ దోసె మన టాలీవుడ్ హీరో మనసుని సైతం దోచుకుంది. మరి ఆ వంటకం విశిష్టత తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ భోజనశాలలలో విద్యార్థి భవన్ ఒకటి. గాంధీ బజార్‌లోని రద్దీ వీధుల్లో ఉన్న దీనిని ఒక వారసత్వ ప్రదేశంగా చూస్తారు స్థానికులు. ఆహారం ద్వారా సంప్రదాయాన్ని పరిరక్షించడంలో పేరుగాంచిన ఈ రెస్టారెంట్ తరతరాలుగా వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంటుంది. సాంప్రదాయ దక్షిణ భారత వంటకాలను అందించడంలో మంచి పేరు సంపాదించుకుంది. ప్రత్యేకమైన బటర్ దోసె మెనూలో అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకంగా నిలవడం విశేషం. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay)దోసె వెనుకున్న వారసత్వం..ఆ రెస్టారెంట్‌ని అరుణ్ కుమార్ అడిగా ఒక పకడ్బందీ ప్రణాళికగా తయారు చేస్తారట. ఈ వంటకం రుచి కోసం అక్కడ పాకనిపుణుల బృందం అవిశ్రాంతంగా పనిచేస్తుందట. ప్రత్యేకమైన కరకరలాడే ఈ ఆకృతి, బంగాళ దుంపల కూర, వెన్న సమపాళ్లలో ఉండేలా చూసుకుంటారట. ఇలాంటి దోసెలు రోజుకి సుమారు 1500 నుంచి 1800 దాక తయారు చేస్తారట. అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా అక్కడ బాగా ఫేమస్ ఈ దోసె. ఈ రెస్టారెంట్‌ని 1943లో దక్షిణ కన్నడలో సాలిగ్రామానికి చెందని వెంకటరమణ ఉరల్ దీనిని స్థాపించారు. Honoured to host the ever-charming Mr. Venkatesh Daggubati @VenkyMama along with Mr. Rezwan Razack @indianbanknotes at Vidyarthi Bhavan for breakfast today!It was truly our pleasure to serve one of Tollywood’s finest!❤️ pic.twitter.com/zKQqJIcTrB— Vidyarthi Bhavan (@VidyarthiBhavan) March 29, 20261970వ దశకంలో, ఈ సంస్థ యాజమాన్యం అరుణ్ కుమార్ అడిగ తండ్రి అయిన రామకృష్ణ అడిగ నుంచి వారసత్వంగా బదిలీ అయ్యింది. ఆ కుటుంబికులు ఆ ప్రామాణికతను కాపాడుకునేలా వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. ఇక ఇటీవల టాలీవుడ్ నటుడు హీరో వెంకటేశ్ కారణంగా మరోసారి ఈ దోసె, సదరు రెస్టారెంట్ గురించి నెట్టంట సంచలనంగా మారింది. రెస్టారెంట్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం..నటుడు విక్టరీ వెంకటేశ్ సందడిగా ఉన్న ఈ రెస్టారెంట్‌ని సందర్శించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. వెంకటేశ్ అక్కడ బటర్ దోసెను చట్నీ తోపాటు ఆస్వాదిస్తూ కనిపించారు. దీంతోపాటు వడ, ఇడ్లీ సాంబార్ చట్నీలను కడా రుచి చూశారు. చివరగా కాఫీతో తన బ్రేక్‌ఫాస్ట్‌ని ముగించారు. ఇంకెదుకు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి.(చదవండి: కంటెంట్ క్రియేటర్ అవ్వాలని రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్‌చేస్తే..) -
ఐపీఎల్ టికెట్ ప్లీజ్
బెంగళూరు: రాష్ట్రంలో గ్యాస్ కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం ఆర్సీబీ, సీఎస్కే మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. 3 ఉచిత టికెట్ల కోసం ఎమ్మెల్యేల పీఏలు విధానసభలో స్పీకర్ కార్యాలయం ముందు శనివారం బారులుతీరారు. ప్రతి మ్యాచ్‌కు ఎమ్మెల్యేకు 3 టికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం క్రికెట్ సంఘాన్ని ఆదేశించడం తెలిసిందే. ఆ టికెట్లు సభాపతి ఆఫీసుకు వస్తే అక్కడ ఎమ్మెల్యేలకు బట్వాడా చేస్తారు. జాగ్రత్తలు పాటించాలి: కమిషనర్ పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ గత మ్యాచ్ ప్రశాంతంగా జరిగిందని చెబుతూ, ఈసారి మ్యాచ్‌కు 4 గంటల ముందుగానే ప్రేక్షకులు మైదానానికి రావాలన్నారు. ఎలాంటి భౌతిక టికెట్లు లేకుండగా క్యూఆర్ టికెట్లను మాత్రమే అనుమతిస్తారు. టికెట్ ఎవరి పేరుపై బుక్ అయిఉంటుందో వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. టికెట్లు ఉన్నవారు మెట్రో రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు, నిర్దేశిత స్థలాల్లో వాహనాల పార్కింగ్‌కు అవకాశం ఉంది. టికెట్ లేనివారు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించరాదు, అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ మ్యాచ్‌కు 2,500 పోలీసులతో భద్రత కల్పించామన్నారు. -
రెండు నెలలే బెంగళూరులో.. ముంబైవాసి ఏమన్నారంటే?
కొత్త నగరానికి వెళ్తే.. తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరికి ఇది ఒక స్వేచ్ఛని, కొత్త అవకాశాలను ఇవ్వడానికి ఒక అవకాశంలా అనిపించినా.. కష్టంగానే ఉంటుందని ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.''బెంగళూరు వచ్చి రెండు నెలలైంది, నాకు ముంబై గుర్తొస్తోంది. అక్కడి మనుషులు గుర్తొస్తున్నారు. ఇక్కడ (బెంగళూరు) ప్రతి చిన్న సంభాషణ ఒక బేరమాడటంలా అనిపిస్తుంది. ఆటో డ్రైవర్లు, ప్యాకర్లు, అద్దెదారులు అందరితోనూ కొంత కష్టమే. ప్రతి ఒక్కరూ మన నుంచి ఏదో ఒకటి పిండుకోవాలని చూస్తుంటారు. ముంబైలో క్యాబ్ డ్రైవర్ వేడిగా ఉందని చూసి ఏసీ వేసేస్తాడు. ఇక్కడ మాత్రం.. అదొక వ్యక్తిగత సహాయం అన్నట్టు అడగాలి. ఈ ఒక్క విషయం మీకు అన్ని విషయాలు చెబుతుంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించాడు.2 months in Bangalore and I miss Mumbai. I miss the people.Every small interaction here feels like a negotiation. Auto drivers, packers, old tenants. Everyone’s trying to squeeze something out of you.In Mumbai a cab driver sees it’s hot and just turns on the AC. Here you have…— poobesh (@pbshgthm) April 3, 2026ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది ముంబై నివాసి అభిప్రాయాలతో ఏకీభవించగా, మరికొందరు ఇలాంటి అనుభవాలు చాలావరకు వ్యక్తిగతమైనవని అభిప్రాయపడ్డారు.నిజమే! ముంబై చాలా స్వాగతించేదిగా, ఆప్యాయంగా ఉంటుందని ఒక వినియోగదారుడు అనగా, మరొకరు ఇలా అన్నారు.. ముంబైలో ఏ క్యాబ్ డ్రైవర్ అయినా అడగకుండా ఏసీ ఆన్ చేస్తాడా? అని అడిగాడు. నేను బెంగళూరు వాసిని, చాలా నగరాలు తిరిగాను, నేను పూర్తిగా ఈ విషయంలో ముంబై వాసికి సపోర్ట్ చేస్తున్నా.. అని అన్నాడు. -
ఐటీ సిటీలో రియల్ ఎస్టేట్ ఎటు పోతోంది?
దేశ ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరులో నివసించే సగటు ఉద్యోగికి ఇప్పుడు 'సొంత ఇల్లు' అనేది ఒక తీరని కలగా మారుతోంది. నగరంలో ఇళ్ల ధరలు, అద్దెలు ఆకాశాన్ని తాకుతుండటంతో నివాసితులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి 'రెడ్డిట్' (Reddit) వేదికగా పంచుకున్న తన చేదు అనుభవాలు నగరంలోని భయానక రియల్ ఎస్టేట్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.పీడకలగా మారిన ఇంటి వేటబెంగళూరు నగరంలో ఒక రెండు పడక గదుల (2BHK) ఇంటి కోసం తాను చేస్తున్న అన్వేషణ ఒక "పీడకల"గా మారిందని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. "బెంగళూరు రియల్ ఎస్టేట్ ఎటు వెళ్తోంది?" అనే శీర్షికతో ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.మూడేళ్ల క్రితం రూ. 1.4 కోట్లుగా ఉన్న ఒక ఫ్లాట్ ధర, ప్రస్తుతం ఏకంగా రూ. 2 కోట్లకు చేరింది. సదరు అపార్ట్మెంట్ ఒక పెద్ద మురికి కాలువ సమీపంలో ఉండటమే కాకుండా, అనేక లోపాలు, అసౌకర్యాలు ఉన్నాయి. అయినా కేవలం ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉందనే సాకుతో ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.అద్దెలు కూడా భారమే..కేవలం కొనుగోలు ధరలే కాకుండా, అద్దెలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. గతంలో తక్కువ ధరకే లభించిన ఫ్లాట్లకు ఇప్పుడు నెలకు రూ. 70,000 పైగా అద్దె చెల్లించాల్సి వస్తోందని, ఇది నమ్మశక్యంగా లేదని నివాసితులు వాపోతున్నారు. మూడు, నాలుగేళ్లలో డబ్బు ఆదా చేసి ఇల్లు కొందామనుకునే లోపే, ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి.పరిస్థితి తీవ్రతకొన్ని ప్రాంతాల్లో 2BHK ఫ్లాట్లు ఏకంగా రూ. 2.5 కోట్లకు అమ్ముడవుతుండటం గమనార్హం. ఇంత ధర పెట్టినా డిమాండ్ తగ్గకపోవడం, సామాన్య, మధ్యతరగతి ప్రజలను గృహ కొనుగోలుకు దూరం చేస్తోంది. పెరుగుతున్న ధరలు, క్షేత్రస్థాయిలోని సమస్యల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం బెంగళూరు వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. -
బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతం
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. 11 నెలల తన బిడ్డ ప్రమాదవశాత్తు నీటి బకెట్లో మునిగి చనిపోయిన కొద్ది నిమిషాలకే, 29 ఏళ్ల మహిళా టెకీ ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.సాఫ్ట్వేర్ నిపుణురాలైన ప్రతిభ తన బిడ్డతో ఇంట్లో ఉండగా, ఆమె భర్త మహంతేష్ పనిలో ఉన్నారు. ప్రతిభ తన బిడ్డ అగస్త్యను బట్టలు తీసుకోవడానికి టెర్రస్‌పైకి వెళ్లింది. ఆమె తన పనిలో ఉండగా, పాకుతూ వెళ్లిన బిడ్డ ప్రమాదవశాత్తు నీటితో నిండిన బకెట్లో పడిపోయింది. ప్రతిభ ఇది గమనించేసరికి, తన బిడ్డ బకెట్లో ప్రాణాలు కోల్పోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె, మొదల మణికట్టు కోసుకుని, కొన్ని మాత్రలు మింగి, తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో, మహంతేష్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తలుపు లోపలి నుండి గడియ పెట్టి ఉండటాన్ని గమనించాడు. వారి వద్ద ఉన్న అదనపు తాళంచెవితో అతను ఇంట్లోకి ప్రవేశించి చూడగా, తన భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయి ఉన్నారు. ప్రతిభ రాసిన ఆత్మహత్య లేఖను చూశాడు. తన తప్పిదం వల్లే బిడ్డ చనిపోయిందని ప్రతిభ తన సూసైడ్ లేఖలో పేర్కొంది. దీంతో 15 మాత్రల ఖాళీ స్ట్రిప్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తన బిడ్డ మరణానికి తానే 'బాధ్యురాలినని' సూసైడ్‌లో ఆమె పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. గత నాలుగేళ్లుగా ఆ కుటుంబం అద్దె ఫ్లాట్‌లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి ! -
గ్యాస్ రేటు పెరిగింది.. ఇల్లు ఖాళీ చేయండి!
కృష్ణరాజపురం: బెంగళూరులో ఇళ్లలో బాడుగకు ఉండేవారు లక్షలాది రూపాయలను అడ్వాన్సుగా ఇచ్చుకుని, వేలాది రూపాయలను ప్రతి నెలా అద్దె చెల్లించాలి, అంతే కాదు.. ఇంటి యజమాని దౌర్జన్యం చేస్తే చేయించుకోవాలి... ఇలా ఉంది కొన్నిచోట్ల దుస్థితి. ఇంటి యజమాని కుటుంబం దాడి చేయడంతో అద్దెకున్నవారు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన మార్చి 29న బెంగళూరులోని కోడిహళ్లి, జీవన్ బీమా నగరలో జరిగింది. ఇంటి యజమాని శోభ, దేవరాజ్ వారి పిల్లలు అద్దెకున్నవారి పైన దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. నరేష్ అతని సోదరుడు సచిన్, సోదరి రేఖ ఈ ఇంట్లో బాడుగకు ఉంటున్నారు. అది కూడా వారం క్రితమే చేరారు. గ్యాస్ రేటు పెరిగిందని, నీటి బిల్లు కూడా ఎక్కువ చెల్లించాలని, లేకపోతే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని వారిని ఒత్తిడి చేశారు. దీని మీద గొడవ జరిగింది. యజమాని కుటుంబీకులు నరేష్ సచిన్, రేఖలను కొట్టారు. వారి మీద బకెట్లతో నీళ్లు చల్లి అల్లరి చేశారు. కత్తి, బ్లేడ్లతో కోయడంతో నరేష్‌కు రక్త గాయాలు అయ్యాయి. బాధితులు జీవన్ బీమా నగర ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
భర్త బతికుండగానే వితంతు పింఛన్ తీసుకున్న భార్య..!
బెంగళూరు: బతికున్న వ్యక్తి చనిపోయాడని పాలికె అధికారులు డెత్ సరి్టఫికెట్ ఇచ్చారు. ఆ పత్రం ద్వారా అతని భార్య రేషన్ కార్డు, ఇతరత్రా ప్రయోజనాల కోసం కిద్వాయి ఆస్పత్రిని మోసం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన మహబూబ్ బాషా (39), షబానా దంపతులు గొడవలు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. నా భర్త చనిపోయాడంటూ షబానా ప్రచారం చేసుకుని గతేడాది ఏప్రిల్ 23న డెత్ సర్టిఫికెట్‌ను తెచ్చుకుంది. వితంతు మహిళగా ప్రభుత్వం నుంచి వస్తున్న అన్నీ సౌకర్యాలను తీసుకుంటోంది.ఇది తెలిసి మహబూబ్ బాషా లబోదిబోమంటూ కోర్టుకెళ్లారు. చిక్కపేటలోని జనన–మరణ రిజి్రస్టార్ ఈ డెత్ సర్టిఫికెట్‌ను జారీ చేశారని తేలింది. కోర్టు ఆదేశాల మేరకు బీబీఎంపీ అధికారులు విచారణ చేశారు. షబానా తన భర్త పేరుపై ఉన్న బీపీఎల్, ఆధార్ కార్డును ఉపయోగించి కిద్వాయి ఆస్పత్రిలో మరో వ్యక్తికి చికిత్సలు చేయించింది. అయితే అతడు చనిపోయాడు. అతడు తన భర్తేనని సిబ్బందికి తెలిపింది. అతని పత్రాలన్నీ బాషా పేరుపైనే ఉన్నాయి. దీనితో ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రాలతో ఆమె సులభంగా డెత్ సర్టిఫికెట్‌ను సంపాదించింది. -
బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)
-
పానీపూరీతో ఇంత ఆదాయం వస్తుందా..?! నెలకు ఏకంగా..
పానీపూరీ అమ్ముతూ ఎంత సంపాదించొచ్చు అనగానే మహా అయితే రూ. 20 వేలు లేదా రూ. 30 వేలు ఉండొచ్చని అనుకుంటాం. రోజంతా నిలబడి.. అర కొర సంపాదనతో కష్టపడే వేతన జీవులుగా భ్రమపడతాం అని అంటున్నాడు కంటెంట్ విక్రేత. అంతేకాదండోయ్ వాళ్లు నిజంగా పానీపూరీ అమ్ముతూ ఎంత సంపాదించగలరో స్వయంగా తెలుసుకునేందుకు ఆ స్టాల్లో పనిచేసి మరి రోజువారీ వేతనం లెక్కించాడు. మరి ఇంతకీ ఎంత సంపాదించొచ్చంటే..బెంగళూరుకు చెందిన పెరీరా అనే కంటెంట్ క్రియేటర్ రోడ్డు పక్కనే ఉన్న ఒక పానీపూరీ స్టాల్లో ఒక రోజంతా పనిచేసి అతడి రోజువారీ సంపాదనను లెక్కించాడు. అందుకోసం ఉల్లిపాయలు, బంగాళ దుంపల తొక్కు తీయడం, మసాల పూరీని తయారు చేయడం వంటి ప్రాథమిక తయారీ పనులను కుణ్ణంగా నేర్చుకుని మరి ప్రారంభించాడు పెరారీ. ఆ పనులు అలవాటయ్యాక వినియోగదారులకు అందించడం ప్రారంభించడు. మొదట్లో కాస్త తడబడ్డాడు. ఆ తర్వాత రద్దీ పెరిగాక త్వరగా అలవాటుపడిపోయాడు. కేవలం ఒక గంటలోనే సుమారు 120 పూరీలు దాక అమ్మాడు. ఈ స్టాల్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుందని, సాయంత్రం అయ్యే కొద్దీ జనం క్రమంగా పెరుగుతారని ఆయన పేర్కొన్నారు. అంతేగాదు ఆయన పనిచేస్తున్న సమయంలో పలువురు సన్నిహితులు ఆయన గుర్తుపట్టారు కూడా. ఎంత ఆదాయం వస్తుందంటే..ఒక ప్లేట్ ధర రూ. 30లు. అంటే రోజుకి సుమారు 80 నుంచి 100 ప్లేట్లు అమ్ముడవుతాయని పెరీరా తెలిపారు. అంటే రోజువారీ మొత్తం ఆదాయం సుమారు రూ. 3000 దాక ఉంటుంది. దానిప్రకారం నెలకు రూ. 90,000 వరకు గడిస్తాడని, దాదాపు ఏడాదికి రూ. 10.8 లక్షలకు సమానమని పెరారీ అంచనా వేశారు. అందుకు సంబంధించిన వీడియోతో సహా నెట్టింట షేర్ చేయడంతో సర్వత్రా పానీపూరీ వంటి సంప్రదాయ వ్యాపారాలతో ఇంతలా ఆర్జిస్తారా అని చర్చల మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Cassy Pereira (@cassiusclydepereira) (చదవండి: నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!) -
బావమరిదిని చంపి డిక్కీలో వేసుకుని పోలీసుల వద్దకు..
బెంగళూరు: బంధువుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసిన ఘటన బెంగళూరు శివారులోని ఆనేకల్ తాలూకా బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తన సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో వరుసకు బావమరిది అయిన యువకుడికి ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వివరాలు.. బన్నేరుఘట్ట సమీపంలోని బైరప్పనహళ్లి నివాసి శ్రీనివాస్ నిందితుడు. మరసూరు వాసి, తన సొంత బావమరిది రంజిత్(24)ను హత్య చేశాడు. శ్రీనివాస్‌కు రంజిత్ సొంత సోదరి పవిత్రతో వివాహం జరిగింది. దీంతో రంజిత్, నిందితుడైన శ్రీనివాస్‌కు సొంత బావమరిది అయ్యాడు. నిందితుడైన శ్రీనివాస్ సోదరి కోమలతో రంజిత్‌కు అక్రమ సంబంధం ఉందని చెబుతున్నారు. కోమలికి అప్పటికే వేరొకరితో వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమె తన భర్తను విడిచిపెట్టి రంజిత్‌తో పారిపోయింది. ఈ సంఘటన రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలకు కారణమైంది. పరువు తీశాడనే కోపంతో.. తన కుటుంబ పరువును పది మందిలో వేలం వేస్తున్నాడనే కోపంతో శ్రీనివాస్ చాలాసార్లు రంజిత్‌ను హెచ్చరించాడు. కానీ అతను వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహించిన శ్రీనివాస్ ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూశాడు. సినీ ఫక్కీలో హత్య చేయడానికి పథకం వేసిన శ్రీనివాస్ గురువారం సాయంత్రం మాట్లాడదామనే నెపంతో రంజిత్‌ను తన కారులోకి ఎక్కించుకున్నాడు. బన్నేరుఘట్టలోని బిల్వరదహళ్లిలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశాడు. ఆ తర్వాత రక్తసిక్తమైన ఆ మృతదేహాన్ని తన కారు డిక్కీలో పెట్టుకుని నేరుగా బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ అతను పోలీసుల ఎదుట తాను చేసిన హత్యను ఒప్పుకుని లొంగిపోయాడు. మొదట శ్రీనివాస్ మృతదేహాన్ని ఎక్కడో ఒకచోట పడేసి పారిపోవాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ తర్వాత భయపడి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న బన్నేరుఘట్ట పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగళూరు ఎఫ్‌సీ హెడ్ కోచ్‌గా మునోజ్
బెంగళూరు: స్పెయిన్ చెందిన పెప్ మునోజ్‌ను బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ 2026–27 సీజన్ కోసం అతన్ని తీసుకున్నట్లు బెంగళూరు ఫ్రాంచైజీ తెలిపింది. గత ఏడాది ఐఎస్ఎల్లో బెంగళూరు జట్టు రన్నరనప్గా నిలిచింది. మునోజ్ ఐఎస్ఎల్ జట్టుకు హెడ్ కోచ్ కావడం ఇదే తొలిసారి. గతంలో అతను ఎఫ్‌సీ బార్సిలోనా యూత్ జట్టుకు సేవలించాడు. బార్కా అండర్–19, బార్సిలోనా ‘బి’, చైనాకు చెందిన దేశవాళీ జట్లకు కోచింగ్ ఇచ్చిన మునోజ్ తదనంతరం చైనా జాతీయ జట్టు సహాయక బృందంలో కోచ్‌గా పనిచేశాడు. కంబోడియాకు చెందిన క్లబ్ జట్టుకు తొలిసారి హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అతని కోచింగ్‌లో కంబోడియాకు చెందిన క్లబ్ లీగ్‌లో రెండు విజేతగా నిలిచింది. ఏఎఫ్సీ చాలెంజ్ లీగ్‌లో ఒకసారి ఫైనల్ కూడా చేరింది. ‘బెంగళూరు ఎఫ్‌సీ ద్వారా భారత ఫుట్‌బాల్‌లో భాగమవడం ఆనందంగా ఉంది. నాకు తెలిసి ఐఎస్ఎల్లో బెంగళూరు ఒక మోడల్ క్లబ్. అభిమానులు అలరించే విధంగా బెంగళూరు ప్రదర్శన ఉంటుంది’ అని మునోజ్ అన్నాడు. బెంగళూరు ఎఫ్‌సీ యజమాని పార్థ్ జిందాల్ పెప్ మునోజ్ మార్గదర్శనంలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. -
యశ్ దయాళ్ విషయంలో ఆర్సీబీ కీలక ప్రకటన
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కీలక ప్రకటన చేసింది. తమ పేసర్ యశ్ దయాళ్ ఐపీఎల్-2026లో పాల్గొనడం లేదని తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడిని పక్కనపెట్టామని.. అయితే, కాంట్రాక్టు మాత్రం కొనసాగిస్తామని వెల్లడించింది.సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తొలిసారి గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ఇందులో యశ్ దయాళ్ (Yash Dayal) కూడా తన వంతు పాత్ర పోషించాడు. సీజన్ మొత్తం కలిపి 13 వికెట్లతో రాణించి జట్టును చాంపియన్‌గా నిలపడంలో తోడ్పడ్డాడు.సంచలన ఆరోపణలుఅయితే, అనూహ్య రీతిలో యశ్ దయాళ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో గతేడాది జూలైలో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐదేళ్లు తనతో రిలేషన్షిప్లో ఉండి.. పెళ్లి పేరిట మోసం చేశాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా తనను హింసించాడని.. లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.పోక్సో కేసు కూడాఆ తర్వాత ఓ టీనేజర్ తెరమీదకు వచ్చింది. 2023 నుంచి తనపై యశ్ దయాళ్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద జైపూర్‌లో మరో కేసు నమోదైంది. ఐపీఎల్-2025 సందర్భంగానూ హోటల్ గదిలో దయాళ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని సదరు టీనేజర్ ఆరోపించింది. క్రికెట్లో తనకు కెరీర్ ఆశ చూపి ఇలా చేశాడని వాపోయింది.అయితే, మొదటి కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాళ్ అరెస్టు కాకుండా స్టే విధించగా.. రెండోకేసులో జైపూర్‌లోని పోక్సో కోర్టు యాంటిసిపేటరీ బెయిల్‌ను 2025 డిసెంబరులో తిరస్కరించింది. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటీవలే యశ్ దయాళ్ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అతడిని ఈ సీజన్లో ఆడించము.. కానీకాగా యశ్ దయాళ్ను కొనసాగించడంపై ఆర్సీబీపై విమర్శలు రాగా.. ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మొ బొబాట్ తాజాగా స్పందించాడు. ‘‘యశ్ దయాళ్ ఈసారి జట్టుతో చేరడం లేదు. వ్యక్తిగతంగా అతడు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు మేము అతడికి మద్దతుగానే నిలబడ్డాము.అతడిపై నమ్మకం ఉంది కాబట్టే రిటైన్ చేసుకున్నాము. అతడి కాంట్రాక్టు కొనసాగుతుంది. అతడితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము. ఈరోజు కూడా అతడిని సంప్రదించిన తర్వాతే జట్టుతో చేర్చకూడదనే నిర్ణయానికి వచ్చాము. అతడితో పాటు జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాము. అతడికి మా మద్దతు ఉంటుంది’’ అని మొ బొబాట్ పేర్కొన్నాడు. కాగా మార్చి 28న ఐపీఎల్-2026 టోర్నీకి తెరలేవనుండగా.. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ- సన్‌రైజర్స్ తలపడతాయి. ఇందుకు చిన్నస్వామి స్టేడియం వేదిక.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే? -
1 నుంచి టోల్ గేట్ చార్జీల పెంపు!
బెంగళూరు: ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో టోల్ గేట్ చార్జీలు పెరగనుండటంతో వాహన యజమానులు, డ్రైవర్ల జేబుకు రంధ్రం పడనుంది. ప్రతి ఏడాది తరహాలో ఈసారి 3 నుంచి 5 శాతం మేర టోల్ రుసుము పెరగనుంది. రాష్ట్రంలోని 9 జాతీయ రహదారుల్లో టోల్ గేట్లలో ఇది వర్తిస్తుంది. మైసూరు–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే ప్రయాణం మరింత వ్యయం కానుంది. జాతీయ హైవే అథారిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా ఏటా టోల్ పెంచుతూ ఉన్నారు. ఇప్పటికే ఎన్హెచ్ఐఏ ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా ఫాస్ట్‌ట్యాగ్ పాస్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో హైవేలలో సొంత వాహనాలలో ప్రయాణ ఖర్చు పెరగనుంది. -
ఉద్యోగాల పేరిట రూ.25 కోట్లకు కుచ్చుటోపీ
యశవంతపుర: కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసగించే కిలాడీ దంపతులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన జైసన్ డిసోజా, లవీనా దంపతులు నిరుద్యోగులు. వీరు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న యువకులను గుర్తించి, కోర్టుల్లో గ్రూప్–డి ఉద్యోగాలను ఇప్పిస్తామని నమ్మించేవారు. నిరుద్యోగులను గుర్తించేందుకు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డబ్బు వసూలు చేశారు.ఖరీదైన హోటల్స్‌లో ధ్రువపత్రాల తనిఖీ, ఇంటర్వ్యూలు అని నాటకాలు ఆడేవారు. నకిలీ నియామక పత్రాలను చేతిలో పెట్టేవారు. నకిలీ పత్రాలు తీసుకుని కోర్టులకు వెళ్లినవారికి తాము మోసపోయామని అర్థమయ్యేసరికి, ఈ జంట ఫోన్లను స్విచాఫ్ చేసేది. చేసేది లేక బాధితులంతా బసవేశ్వరనగరతో పాటు నగరంలోని వివిధ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. 500 మంది నుంచి రూ.25 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. 2024లో ఇదే ఫిర్యాదుపై అరెస్టయి కొన్నాళ్లు జైలులో ఉండి వచ్చిన ఈ దంపతులు, మళ్లీ అదే దందా కొనసాగిస్తున్నారని, కేసు విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఆర్సీబీ టికెట్ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ
బెంగళూరు (శివాజీనగర): ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ఒక వారం మాత్రమే గడువు ఉంది. పోటీలను స్వస్థలం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిపేందుకు అనుమతి పొందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు తన అభిమానులకు బంపర్ ఆఫర్‌ను ఇచ్చింది. టికెట్ కొనుగోలు చేసిన వారికి ‘నమ్మ మెట్రో’లో ఆయా రోజుల్లో ఉచితంగా ప్రయాణానికి అవకాశం లభించనుంది. మెట్రో ప్రయాణపు క్యూర్ కోడ్ సైతం లభించనుంది. టికెట్ కొనుగోలు ఎలా? ఈసారి ఆర్సీబీ జట్టు స్వస్థలంలో పోటీలకు ఆన్లైన్ టికెట్లకు మాత్రమే ప్రాధాన్యత కల్పించింది. జట్టు అధికారిక వెబ్సైట్ లేదా, యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. త్వరలో టికెట్ అమ్మకాల తేదీని ప్రకటిస్తారు. ఇతర వెబ్సైట్లకు గాని వ్యక్తులకు కాని టికెట్ అమ్మకాల హక్కులు లేవు. ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడు? 2026వ సంవత్సర ఐపీఎల్ టోర్నీ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయమై తొలి దశ టైం టేబల్‌ను సైతం విడుదల చేశారు. పశి్చమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా తొలి 20 పోటీల టైం టేబల్‌ను మాత్రం ప్రకటించారు. టోర్నీ ప్రారం¿ోత్సవ పోటీల్లో ప్రస్తుతం చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైసర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖి తలపడతాయి. ఈ పోటీలకు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానం అతిథ్యం ఇస్తోంది. తొలి దశలో ఆర్సీబీ తలపడే మ్యాచ్‌లు: -
చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి
బెంగళూరులో ఓ సీనియర్ ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారిని మోసం చేసి లక్షల్లో దోచుకున్నాడో మోసగాడు. ముఖం చూసి భవిష్యత్తు చెబుతానంటూ నమ్మబలికిన చిలుక జ్యోతిష్యాన్ని నమ్మి దారుణంగా మోసపోయిన వైనం విభ్రాంతి రేపింది. చదువుకున్న వారు, ఉన్నత హోదాల్లో ఉన్నవారు కూడా మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి మోసపోవడం ఆశ్చర్యం అంటూ నెట్టింట చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.బెంగళూరులో చిలుక జోస్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్నతమిళనాడుకు చెందిన శేఖర్ (59) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి సమాచారం ప్రకారం ఆదాయపు పన్ను శాఖలో పరిపాలనా అధికారిగా పనిచేస్తున్న సత్యనారాయణను నిందితుడు ముఖం చూసి భవిష్యత్తు చెబుతానంటూ నమ్మించాడు. కెరీర్ ఎదుగుదల, బదిలీలు వంటి ఆశలు చూపించాడు. ఇందుకు పూజలు, క్రతువు చేయాలని ఆ అధికారిని ఒప్పించాడు. ఇందుకోసం రూ. 50,000 చెల్లించేలా చేశాడు.ఆ తరువాత మరింత శక్తివంతమైన పూజలు చేస్తేనే దోషాలు తొలగిపోతాయని నమ్మించాడు. ఇలా సుమారు రూ. 35 లక్షల విలువైన 194 గ్రాముల బంగారం, 1.3 కిలోల వెండి వస్తువులను కాజేశాడు. చివరికి అనుమానం వచ్చి విలువైన తన వస్తువులను తిరిగి ఇవ్వమని అడగడంతో చిలుక జ్యోతిష్యుడి అసలు బండారం బయట పడింది. అధికారి వెండి, బంగారు వస్తువులను తిరిగి ఇవ్వలేదు సరికదా ఎదురు బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు భారతీనగర్ పోలీసులను ఆశ్రయించాడు.మార్చి5 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి 12న కాంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. విలువైన వస్తువులను హలసూరులోని ఒక జ్యువెలరీ షాపులో అమ్మేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతని సమాచారం ఆధారంగా, పోలీసులు 124 గ్రాముల బంగారం, 796 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 20.60 లక్షలు.మార్చి 17న నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే తాను ఈ మోసానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. విచారణలో భాగంగా, నిందితుడు జ్యోతిష్యం, చిలుక జ్యోతిష్య సేవలను అందిస్తానని చెబుతూ, ఇదే తరహాలో మరికొంతమందిని కూడా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసం ద్వారా సేకరించిన డబ్బు మరియు బంగారాన్ని నిందితుడు ఎక్కడికి తరలించాడనే విషయంపై అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగళూరులో సిలిండర్ దొంగతనం.. CCTV విజువల్స్ వైరల్
-
గ్యాస్ కష్టాలు.. ఆఫీసుకు రాకండి!
దేశంలో గ్యాస్ కొరత మొదలైపోయింది. దీని ప్రభావం సాధారణ ప్రజలపై మాత్రమే కాకుండా.. టెక్ కంపెనీలపై కూడా పడింది. దీంతో ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హెచ్‌సీఎల్ కంపెనీ మార్చి 12,13 తేదీలలో చెన్నై కార్యాలయంలోని తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించింది. క్యాంటిన్లలో ఆహారం వండటానికి గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదే సమస్య ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా తలెత్తింది. దీంతో బెంగళూరు, చెన్నైలలోని ఆఫీసుల్లో క్యాఫెటీరియా సేవలను పరిమితం చేశారు. వంటగ్యాస్ కొరత కారణంగా క్యాఫెటీరియాల్లో మెనూ ఐటెమ్స్ తగ్గించారు. లైవ్ ఫుడ్ కౌంటర్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగులు వీలైతే ఇంటి నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని తినాలని సంస్థ సూచించింది.అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడులు ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనివల్ల ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఫలితంగా వంటగ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా నగరాల్లోని అనేక రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. -
సిటీలో ఆటో గ్యాస్ బంద్
శివాజీనగర( కర్ణాటక): ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ధం, గల్ఫ్ దేశాలపై దాడులు వల్ల బెంగళూరులో వంట గ్యాస్, వాహనాలకు సీఎన్జీ, ఎల్పీజీ కొరత ఏర్పడింది. స్టాక్ లేక బుధవారం నగరంలోని పలు ఆటో గ్యాస్ బంక్‌లు బంద్ అయ్యాయి. బంక్‌లకు మంగళవారం నుంచి సక్రమంగా గ్యాస్ సరఫరా కాలేదంటూ యజమానులు మూసివేశారు. శేషాద్రిపురం–గుట్టహళ్లి వద్ద ఉన్న ఆటో గ్యాస్ బంక్‌లో నో స్టాక్ బోర్డు పెట్టారు. పలుచోట్ల బంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం కేజీ గ్యాస్ రూ.65 ఉండగా ఇప్పుడు రూ. 80 అయ్యింది. ఓ బంక్ మేనేజర్ బాబు మాట్లాడుతూ, ఆటో గ్యాస్ సక్రమంగా సరఫరా కావడం లేదు. ఎక్కువ ధర పెట్టి కొని విక్రయించే స్తోమత లేదు. కొత్త స్టాక్ వచ్చిన తరువాత బంక్‌ను తెరుస్తామని తెలిపారు. ఉపాధికి గండిపడుతోందని డ్రైవర్లు ఆవేదన చెందారు. బెంగళూరులో ప్రముఖ ఆలయాల కూడా ఇబ్బంది వచ్చింది. ప్రసాదాలు, నైవేద్యాలు వండడానికి రోజుకు కనీసం 1 నుంచి 4 సిలిండర్లు కావాలి. మంగళవారం, శుక్ర, శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ. గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. -
దొరికినవి.. దేవతల నగలు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఈ ఏడాది జనవరి 10వ తేదీన కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్కుండిలో లభించిన నిధి గురించి కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఆ చారిత్రక గ్రామంలో ఓ మహిళ ఇంటి పునాది తవ్వతుండగా పురాతనమైన రాగి చెంబు, అందులో అపురూపమైన బంగారు నగలు లభించడం తెలిసిందే. వాటిని ప్రభుత్వానికి అప్పగించారు. పురావస్తుశాఖ అధికారులు ఆ బంగారు ఆభరణాలు సుమారు 600 సంవత్సరాల క్రితం నాటివని, కళ్యాణ చాళుక్య రాజులు, విజయనగర అరస రాజుల కాలం నాటివని నిర్ధారించారు. ఇవి మనుషులు ధరించేవి కావని, ఆలయాలలో దేవతలకు లేదా ఉత్సవ మూర్తులకు అలంకరించే ఆభరణాలని తెలిపారు. వీటి విలువ రూ.8 కోట్లని ప్రకటించారు. చదవండి: అరుదైన ఈ రైల్వేస్టేషన్ గురించి తెలుసా? -
ఎల్పీజీ ఎఫెక్ట్... బెంగళూరులో హోటళ్లు బంద్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో హోటళ్లకు ఎల్పీజీ షాక్ తగిలింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి నగరమంతటా హోటళ్లు మూతబడనున్నాయి. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. ‘‘ఎల్పీజీ లేకుండా హోటళ్లను నడపడం అసాధ్యమని అందరికీ తెలుసు.అందుకే మాకిష్టం లేకపోయినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’’అని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.సి.రావు విలేకరులకు తెలిపారు. కేంద్రం తక్షణం ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరుకు చెందిన పలువురు ఎంపీల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. హోటళ్లకు పరిమిత స్థాయిలోనైనా ఎల్పీజీ సరఫరాలు కొనసాగేలా చూడాలని కోరారు. ఎల్పీజీ కొరతపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు చెన్నైలో కూడా బెంగళూరు తరహా పరిస్థితే నెలకొన్నట్టు వార్తలొస్తున్నాయి. -
బెంగళూరులో హోటళ్లు బంద్!?
వంటగ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం బెంగళూరు నగరంలోని హోటళ్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కారణంగా ‘బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ సోమవారం కీలక ప్రకటన చేసింది. నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో మంగళవారం బెంగళూరులోని హోటళ్లు మూతపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే వేలాది మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు, సీనియర్ సిటిజన్లు, వైద్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడనుంది.గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయని, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడం పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని, సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతల ప్రభావంఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా గొలుసును దెబ్బతీసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా చూడాలని, ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.Bengaluru Hotels to Shut Down From Tomorrow Amid Sudden Commercial Gas Supply CrisisBengaluruIn a major blow to the city’s food industry and daily commuters, the Bangalore #Hotels Association has announced a city-wide shutdown of hotels starting tomorrow. The decision comes… pic.twitter.com/h48xEbBHjh— Yasir Mushtaq (@path2shah) March 9, 2026పెరిగిన ధరల భారంమరోవైపు, సామాన్యుడిపై ధరల భారం మరింత పెరిగింది. శనివారం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. సౌదీ అరేబియా ముడి చమురు ధరల కారణంగా వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా అధికమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఎల్పీజీ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు! -
నేపాల్‌కు కాబోయే ప్రధాని.. అప్పట్లో బెంగళూరులో..
కాఠ్మాండు: నేపాల్‌తో పాటు ఆ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాల రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అధికంగా వినిపిస్తున్న పేరు బాలెన్ షా (బాలేంద్ర షా). ర్యాపర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి నేపాల్‌లో అతి ముఖ్యమైన నేతగా ఎదిగారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) తరఫున ఆయన ప్రధాని అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో పోరాడారు.ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇప్పటికీ కొనసాగుతోంది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 124 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరో నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది. నేపాలీ కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచింది. మరో స్థానంలో ముందంజలో ఉంది. యూఎంఎల్ ఎనిమిది స్థానాలు గెలిచింది. ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఎన్సీపీ కేవలం ఏడు స్థానాలు మాత్రమే గెలిచింది. ఆర్పీపీ ఒక స్థానంలో గెలిచింది. శ్రామ్ సంస్కృతి పార్టీ మూడు స్థానాలు గెలిచింది. మయాగ్డి నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.నేపాల్‌లో 165 స్థానాలకు నేరుగా (ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్), మరో 110 స్థానాల్లో నైష్పక్షిక విధానం (ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్) కింద ఎన్నికలు జరిగాయి. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ కింద జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు 162 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ (నైష్పక్షిక విధానం) కింద ఉన్న 110 స్థానాల్లో 68 స్థానాల లెక్కింపు పూర్తైంది. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే పార్టీకి వచ్చిన మొత్తం ఓట్ల శాతానికి అనుగుణంగా స్థానాలు కేటాయించే ఎన్నికల విధానం. బెంగళూరులో బాలేంద్ర షా ఎంటెక్ బాలేంద్ర షా నేపాల్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు బాలేంద్ర షా బెంగళూరు నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో చదివారు. అక్కడ ఆయన ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో విద్యనభ్యసించారు.తాజాగా, నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లెక్చరర్లు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ పూర్వ విద్యార్థి ఇప్పుడు నేపాల్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన తీరు చూసి గర్వంగా ఉందని తెలిపారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ సంస్థలో చదువుతున్న సమయంలో బాలేంద్ర షా రాజకీయాల్లో ఆసక్తి స్పష్టంగా చూపలేదు.రాజకీయాల్లోకి రావడానికి ముందు బాలేంద్ర షా.. నేపాలీ రాప్ మ్యూజిక్‌లో బాగా పాపులర్ అయ్యారు. అయినా క్యాంపస్‌లో ఉన్న సమయంలో ఆయన రాప్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. ఆయన మ్యూజిక్, పాటలు అధికంగా నేపాలి భాషలోనే ఉండేవి.బాలేంద్ర షాకు నేపాల్ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉందని బెంగళూరులోని ఆయన లెక్చరర్లు భావిస్తున్నారు. ర్యాపర్ నుంచి కాఠ్మాండు మేయర్ స్థాయికి, అక్కడి నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిని బాలేంద్ర షా రాజకీయ ప్రయాణం ఇంకా ముందుకు సాగుతోంది. ఒకవేళ ఆయన తిరిగి క్యాంపస్‌కి అతిథిగా వస్తే ఘనస్వాగతం పలకాలని నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భావిస్తోంది. బాలేంద్ర షా ఝాపా-5 నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికలో విజయం సాధించారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ నేపాలి ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ఓటమి చెందారు. ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది. -
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్-2026లో ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మీనన్ మంగళవారం ధ్రువీకరించాడు.తీవ్ర విషాదంకాగా 2008లో ఐపీఎల్ మొదలైన నాటి నుంచి క్రేజీ జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. గతేడాది వరకు టైటిల్ గెలవలేకపోయింది. పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2025లో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగిపోగా.. ఫ్రాంఛైజీ తొందరపాటు చర్య తీవ్ర విషాదానికి దారితీసింది.హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో.. అనుమతి లేకుండానే ఆర్సీబీ విజయోత్సవ సభ ఏర్పాటు చేయగా.. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగి పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆర్సీబీపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.ఈ క్రమంలో ఐపీఎల్-2026లో ఆర్సీబీ తమ హోం గ్రౌండ్‌ను మారుస్తుందనే వార్తలు వచ్చాయి. పుణె, ముంబై సహా ఇతర నగరాల్లో తమ మ్యాచ్‌లు ఆడేలా ఆర్సీబీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే, కర్ణాటక ప్రభుత్వం అనుమతితో తిరిగి చిన్నస్వామి స్టేడియంలోనే తమ మ్యాచ్‌లు ఆడేందుకు ఆర్సీబీ నిర్ణయించుకుంది.ఎంతో సంతోషిస్తున్నాఈ విషయం గురించి ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మీనన్ స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘ చర్చలు.. అన్ని అనుమతులు తీసుకున్న అనంతరం మీకు ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఆర్సీబీ ఈసారి ఐదు మ్యాచ్‌లు బెంగళూరులోనే ఆడుతుంది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు.బెంగళూరులో మ్యాచ్‌లు సజావుగా సాగేలా హామీ ఇచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు’’ అని ప్రకటన విడుదల చేశాడు. కాగా భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కెప్టెన్‌గా టైటిల్ అందుకోలేకపోయిన కోహ్లి.. గతేడాది రజత్ పాటిదార్ సారథ్యంలో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ తమ మిగిలిన రెండు హోం మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.చదవండి: అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్: గంభీర్ -
ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!
2026లోనూ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా బెంగళూరుకు చెందిన ఒక ఐటీ స్టార్టప్.. తన ఉద్యోగులలో 40 శాతం మందిని ఒకే రోజులో తొలగించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.బెంగళూరులో ఒక ఐటీ స్టార్టప్‌లో పనిచేస్తున్న నా స్నేహితుల్లో ఒకరు.. ఇటీవల తన ఉద్యోగాన్ని కోల్పోయారు. అతనితో పాటు కంపెనీ ఒకేరోజు 40 శాతం మందిని తొలగించినట్లు సీఏ అర్పిత్ గోయల్ అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ వెల్లడించారు.నా స్నేహితుడు పనిచేసే ఐటీ స్టార్టప్‌లో ఏడాదికి రూ. 92 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే ప్రస్తుతం కంపెనీలు ఖర్చును తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులను తొలగించేస్తున్నారని అర్పిత్ గోయల్ పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇది ఉద్యోగ మార్కెట్లో పెరుగుతున్న అనిశ్చితిని స్పష్టం చేస్తోందని పేర్కొంటున్నారు.ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కలిగి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండాలని ఒకరు పేర్కొన్నారు. రూ. 92 లక్షల జీతం అంటే.. ఒక ఐదేళ్లు జీతం తీసుకున్న వ్యక్తిని కంపెనీ తొలగించినప్పటికీ.. అది అతన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం లేదని మరొకరు అన్నారు. రూ. 92 లక్షల జీతం, జీరో సేఫ్టీ అని ఇంకొకరు అన్నారు.One of my friend working in IT startup at bangalore, Recently his company did a 40% layoff in literally a single day and this is a real story.And he is having a CTC of 92 lakhs.The job loss is real.— CA Arpit Goyal (@Arpit1223) February 24, 2026 -
కొత్త ప్రియుడుతో కలిసి పాత లవర్ హత్య
బెంగళూరులోదారుణం చోటు చేసుకుంది. టీవీ నటి పార్టీ పేరుతో పిలిచి ప్రియుడిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని మంజునాథనగర్‌లో ఫిబ్రవరి 18న జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన హత్య దాదాపు 12 రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.గత కొన్ని రోజులుగా టీవీ నటి నటి ఊర్మిళ అలియాస్ బిందు, మోహన్ కృష్ణా రావు (40) కొంత కాలంగా 'లివ్-ఇన్' రిలేషన్షిప్లో ఉన్నారు. తాజాగా లారీ డ్రైవర్ వినయ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే దీన్ని మోహన్ రావు వ్యతిరేకించడంతో అతని హత్యకు పూనుకున్నారని నార్త్-వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) డీల్ నాగేష్ తెలిపారు.ఇదీ చదవండి: న్యూక్లియర్ వాచ్ డాగ్ వార్నింగ్, స్పందించని ఇరాన్దీంతో తన పెళ్లికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా మోహన్ రావును వదిలించుకోవడానికి ప్లాన్ వేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం బిందు, మోహన్ కలిసి ఉంటున్న ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారు. ఫుల్‌గా మద్యం సేవించిన తర్వాత, వినయ్ తన స్నేహితుడు ధనుష్‌తో కలిసి మోహన్ రావుపై ఎటాక్ చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి, నోటికి, ముక్కు టేపులు వేసి మరీ మోహన్ రావును పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో ఊపిరి ఆడకపోవడంతో మోహన్ రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.అయితే హత్య జరిగిన 12 రోజుల తర్వాత, ఆ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో మోహన్ రావు మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, ఈ క్రైమ్‌లో ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై విచారణ జరుపుతున్నారు. బిందు 'భజరంగి', 'పోలీస్ క్వార్టర్స్', 'కాలభైరవ' వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. -
అమెజాన్ అతిపెద్ద ఆఫీస్.. ఇక్కడే..
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఆసియాలో రెండవ అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయంగా నిలిచే తన కొత్త క్యాంపస్‌ను బెంగళూరులో అధికారికంగా ప్రారంభించింది. 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ప్రధాన కార్యాలయం ఈ-కామర్స్, ఆపరేషన్స్, చెల్లింపులు, సాంకేతికత, విక్రేత సేవల విభాగాల్లో 7,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసుకునేందుకు వీలు కల్పించనుంది.గతంలో అమెజాన్ ఇండియా ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగళూరులోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహించేది. వ్యయ నియంత్రణ చర్యలలో భాగంగా ఆ కార్యాలయాన్ని మారుస్తూ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ మాట్లాడుతూ.. “భారత్ అమెజాన్‌కు దీర్ఘకాలిక ప్రాధాన్యతగల మార్కెట్. మా ప్రయాణంలో బెంగళూరు కీలక పాత్ర పోషించింది. ప్రారంభ దశలోనే సాంకేతిక, వ్యాపార బృందాలకు ఈ నగరం నిలయమైంది. నేడు ఇది ఆవిష్కరణ, ప్రతిభకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది” అని తెలిపారు.ఆర్థిక ఫలితాల పరంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ ఇండియా మార్కెట్‌ప్లేస్ సంస్థ ‘అమెజాన్ సెల్లర్ సర్వీసెస్’ కార్యకలాపాల ద్వారా సాధించిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగి రూ.30,139 కోట్లకు చేరుకుంది. వ్యయాలు నెమ్మదిగా పెరగడంతో నష్టాలు 89 శాతం తగ్గి రూ.374 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే, కోవిడ్ కాలంతో పోలిస్తే ఆదాయ వృద్ధి మోస్తరు స్థాయిలోనే నమోదైనట్లు వెల్లడైంది. -
ఆటోలో పూలు బదులు..చెవిపోగులు..!
కొన్ని పనులు చూసేందుకు చిన్నగా ఉన్నా.. అందరి హృదయాలను దోచుకుంటుంది. కాస్త మనసుపెడితే..పెద్దపనులతోనే మన ప్రేమను వ్యక్తం చేయాల్సిన పనిలేదు. చాలా చిన్నపాటి వాటితో కూడా అనంతమైన ప్రేమను చాలా సునిశితంగా వ్యక్తం చేయొచ్చు. అందుకు ఈ ఆటో డ్రైవరే నిదర్శనం. బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో వేలాడిదీసిన చెవిపోగులు కారణంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అవి ఆయన భార్య చెవిపోగులు. రోజంతా ఆమెతో ఉన్నట్లుగా ఫీలయ్యేలా ఆటోలో అద్దానికి వేలాడదీయడంతో అవి ప్రతి ఒక్కర్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. నిజానికి చాలామంది ఆ అద్దం ముందు పూలు వంటి ఇతర డెకరేటెడ్ ఐటెమ్స్ పెట్టుకుంటారు. భార్య గుర్తొచ్చేలా..ప్రతి నిమిషం ఆమెతో ఉన్నట్లుగా ఎదురుగా అలా వేలాడదీయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రేమను వ్యక్తపరుస్తారు. స్వచ్ఛమైన ప్రేమ మాత్రం చాలా అద్భుతంగా బయటపడుతుంది అనేందుకు ఈ ఆటోడ్రైవర్ చేసిన పనే ఉదాహరణ. సింపుల్‌గా చెప్పాలంటే అతడి ప్రేమ చూస్తే..మనుషులెరగలేరు మాములు ప్రేకాదు..అగ్నికంటే స్వచ్ఛమైనది..అనే పాట గుర్తొస్తోంది కదూ..! నెటిజన్లు సైతం సదరు డైవర్‌పై ప్రశంసలు కురిపిస్తు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sula (@marilyn.sultana.akand) (చదవండి: ఆ అమ్మకు దక్కిన వెలకట్టలేని గొప్ప అనుభూతి..! -
బెంగళూరు AMB మల్టీఫ్లెక్స్‌లో సందడి చేసిన మహేష్ బాబు (ఫోటోలు)
-
బెంగళూరులో అద్దె ‘మంట’
సహజ వనరులైన గాలి, వెలుతురును కూడా వ్యాపార వస్తువులుగా మార్చేస్తున్న నగర అద్దె పోకడలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బెంగళూరులో ఇల్లు దొరకడం కంటే, దొరికిన ఇంటికి అద్దె కట్టడమే పెద్ద సవాలుగా మారింది. బెంగళూరులో నివాస గృహాల అద్దెలు ఇటీవల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటీ ఉద్యోగుల రాకతో ఇప్పటికే డిమాండ్ పెరిగిపోగా తాజాగా ఒక ఇంటి యజమాని పెట్టిన వింత నిబంధన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గదుల్లో మెరుగ్గా సూర్యరశ్మి (సన్‌లైట్) వస్తుందనే కారణంతో ఒక ఫ్లాట్‌కు రూ.80,000 అద్దె అడగడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.అసలేం జరిగింది?నగరంలో నివాసం కోసం ఇల్లు వెతుకుతున్న అను అనే మహిళకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. బెంగళూరు అద్దెలు ఎప్పుడూ తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయని, కానీ ఈసారి ఎదురైన అనుభవం షాకింగ్‌గా ఉందని ఆమె పేర్కొన్నారు.‘ఒక గదిలోకి సహజమైన సూర్యరశ్మి వస్తుందనే కారణంతో దానికి రూ.80,000 అద్దె అడిగారు. కనీస సౌకర్యంగా ఉండాల్సిన సూర్యకాంతి ఇప్పుడు ప్రీమియం ఫీచర్‌గా మారిపోయింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.Bangalore Rent would never stop surprising me. What do you mean “ma’am is room me sunlight bhi aati hai to iska rent ₹80,000 hai” 😭— Anu (@Escapeplace__) February 13, 2026సోషల్ మీడియా స్పందనఅను చేసిన ఈ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ కావడంతో నెటిజన్లు బెంగళూరు అద్దె మార్కెట్‌పై భిన్నంగా స్పందిస్తున్నారు. ‘నెలకు రూ.80 వేల అద్దె కట్టడం కంటే ఆ డబ్బుతో హోమ్ లోన్ తీసుకుని సొంత ఇల్లు కొనుక్కోవడం ఉత్తమం’ అని ఒక వినియోగదారుడు సలహా ఇచ్చారు. ‘బెంగళూరు అద్దెలు చూస్తుంటే ముంబై రియల్ ఎస్టేట్ ధరలను తలపిస్తున్నాయి’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలి వస్తుందని మరో రూ.20 వేలు అదనంగా అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.ఎందుకింత ధర?గత రెండేళ్లుగా బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, సర్జాపూర్, కోరమంగళ వంటి ప్రాంతాల్లో అద్దెలు 30% నుంచి 50% వరకు పెరిగాయి. దీనికిగల కొన్ని కారణాలు.. ఆఫీసులు పూర్తిస్థాయిలో ప్రారంభం కావడంతో టెక్కీల తాకిడి పెరిగింది. విదేశీ కంపెనీల ప్రతినిధులు, హై-నెట్ వర్త్ వ్యక్తులు అధిక ధరలకు వెనకాడకపోవడంతో యజమానులు అద్దెలను భారీగా పెంచేస్తున్నారు.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
ఘోరరోడ్డు ప్రమాదం గాల్లోకి ఎగిరిన బైక్.. ఏడుగురు మృతి
సాక్షి బెంగళూరు : బెంగళూరు రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం దొబ్బాస్‌పేట-హోస్కోట్ శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ పై అతి వేగంతో వస్తున్న SUV, లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.బెంగళూరు అర్బన్ జిల్లా హోస్కోట్ తాలూకాలోని ఎం సత్యవారా గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రెండు SUVలు, ఒక క్యాంటర్ ట్రక్ , మోటార్ సైకిల్ పరస్పరం ఢీకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం ఒక కాలేజ్ కు చెందిన ఆరుగురు యువకులు మహేంద్రా SUVలో అతివేగంగా వస్తున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ తొలుత బైక్ ను ఢీకొట్టి అదే స్పీడుతో అనంతరం ట్రక్కును ఢీకొట్టారు. SUV ఢీకొట్టిన వేగానికి బైకునడుపుతున్న వ్యక్తి గాలిలోకి ఎగిరిపడ్డాడు. అనంతరం అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఆ ట్రక్కు సైతం బోల్తా పడింది.అధిక వేగంతో ఢీకొట్టడంతో SUV గుర్తుపట్టలేకుండా నుజ్జునుజ్జయ్యింది.ఇదిలా ఉండగా వెనుక వస్తున్న మరో కారు వెనక వస్తున్న మరో కారు SUVని ఢీకొట్టింది. మెుత్తంగా ఈ ప్రమాద ఘటనల SUVలో ప్రయాణిస్తున్న ఆరుగురితో పాటు బైక్ పై పయణిస్తున్న వ్యక్తి మెుత్తంగా ఏడుగురు మృతిచెందారు. గాయపడిన వారిని స్థానికంగా గల ఎంవీజే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన వారు ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విపరీతమైన వేగంతో ప్రయాణించడమే రోడ్డు ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. . Horrific chain #accident in #BengaluruSeven feared dead near Sathyawara on the Hoskote-Dabaspet STRR stretch.The crash involved a truck, 2 SUVs and a bike. The truck’s chassis got cut & the vehicle toppled. @timesofindia (FwD 📹: Part 1) pic.twitter.com/s6hapuFqvd— TOI Bengaluru (@TOIBengaluru) February 13, 2026 -
ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఫ్లిప్‌కార్ట్!
ఈ కామర్స్ విభాగంలో ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో అడుగుపెట్టనుంది. కంపెనీ ఎప్పటి నుంచి ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేయనుంది?,.. ఈ రంగంలో జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఫ్లిప్‌కార్ట్ 2026 మే-జూన్ నాటికి బెంగళూరులో ప్రయోగాత్మకంగా డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ ఏడాది చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఫుడ్ డెలివరీ ప్రారంభించనున్నట్లు సమాచారం.వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్.. ఫుడ్ డెలివరీ ప్రారభించినట్లయితే.. ఇప్పుడు ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ 2025 ఆర్థిక సంవత్సరంలో 9 బిలియన్ డాలర్లు, కాగా ఇది 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.ఫుడ్ డెలివరీ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే టీమ్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రెండేళ్ల క్రితమే ఈ కంపెనీ ఓలా, పేటీఎం సంస్థలతో కలిసి ఓఎన్డీసీ ద్వారా ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టాలని యోచించింది. అయితే ఈ చర్చలు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ ఫుడ్ డెలివరీ విషయం తెరమీదికి వచ్చింది. కానీ దీనిపై ఫ్లిప్‌కార్ట్ అధికారిక ప్రకటన వెల్లడించలేదు.ఫుడ్ డెలివరీ చేయడానికి చాలా కంపెనీలే పుట్టుకొచ్చాయి. కానీ జొమాటో,స్విగ్గీ మాదిరిగా పాపులర్ కాలేదు. ఇప్పుడు ఈ రంగంలో అడుగుపెట్టనున్న ఫ్లిప్‌కార్ట్ సక్సెస్ సాధిస్తుందా?, లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా.. ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ విభాగంలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపించగానే జొమాటో, స్విగ్గీ షేర్స్ తగ్గుముఖం పట్టాయి. -
‘గగన్‌యాన్’పై మున్ముందుకే..
బెంగళూరు: మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో ఎన్ని అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే భారత్ మున్ముందుకే దూసుకెళ్లాలని గ్రూప్ కెప్టెన్, భారత వ్యోమగా మి, అశోక చక్ర అవార్డు గ్రహీత శుభాంశు శుక్లా అన్నారు. చిరకాల ఆకాంక్ష నెరవేర్చుకోవాలని చెప్పారు. సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ ఉత్సాహంతో పనిచేస్తే అనుకున్నది సాధించడం తథ్యమని పేర్కొన్నారు. ఆయన బుధవారం బెంగళూరులో మీడియా సమావేశంలో మాట్లా డారు. మిషన్ గగన్‌యాన్ విజయవంతం అయి తే ఇలాంటి ఘనత సాధించిన దేశాల జాబితా లో భారత్ చేరుతుందని తెలిపారు. మనదేశ కీర్తిప్రతిష్టలు మరింత పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం మూడు దేశాలు మాత్రమే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో విజయవంతం అయ్యాయని గుర్తుచేశారు. గగనయాన్ యాత్ర ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇదే మనదేశంలో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, మూడు రోజుల్లో క్షేమంగా వెనక్కి తీసుకురావాలన్నది గగన్‌యాన్ లక్ష్యం. 2027లో ఈ యాత్రను చేపట్టాలని నిర్ణయించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ అదే ఉత్సాహం శుభాంశు శుక్లా ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లొచ్చారు. గగన్‌యాన్ కోసం శుక్లాతోపాటు మరో ము గ్గురు వ్యోమగాములను ఇస్రో ఎంపిక చేసింది. గగన్‌యాన్ సాధారణమైన మిషన్ కాదని శుక్లా పేర్కొన్నారు. ఇది అత్యంత సంక్లిష్ట మైన, సవాళ్లతో కూడుకున్న కార్యక్రమమని వివరించారు. అయినప్పటికీ అధైర్యపడే ప్ర సక్తే లేదన్నారు. మొదటి రోజు ఎంత ఉత్సా హంతో ఉన్నామో ఇప్పటికీ అదే ఉత్సాహంతో పని చేస్తున్నామని స్పష్టంచేశారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, మళ్లీ భూమిపైకి తీసుకురావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ష్టాత్మకంగా భావిస్తున్నామని తెలిపారు. పెద్ద కార్యక్రమంలో కొన్ని అవరోధాలు, ఆలస్యా లు సహజమేనని వ్యాఖ్యానించారు. వాటిని ప్రతికూలతలుగా చూడొద్దని పేర్కొన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. అంతరిక్ష ప్రయోగాల్లో వేర్వేరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని శుక్లా తెలిపారు. ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం కలిసి పనిచేయడంలో తప్పులేద న్నారు. తాను ఐఎస్ఎస్కు వెళ్లిరావడానికి అమెరికా కూడా సహకరించిందని గుర్తుచేశా రు. మన దేశంలో అంతరిక్ష కేంద్ర ప్రభుత్వం చక్కటి సహకారం అందిస్తోందని వివరించారు. సైన్స్, అంతరిక్ష ప్రయోగాల్లో పెట్టుబ డులు నానాటికీ పెరుగుతుండడం శుభ పరిణామం అని చెప్పారు. గగన్‌యాన్ కోసం అందరూ ఓపిగ్గా ఎదురు చూడాలని యా త్రకు ఎంపికైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ పేర్కొన్నారు. ఏది జరగాలో అది కచ్చితంగా జరుగుతుందన్నారు. గగన్‌యాన్ యాత్ర విజయవంతమైతే ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ రికార్డు కెక్కుతుందని స్పష్టంచేశారు. -
ప్రతి స్కూల్ లో ఉండాలి టీచర్ల బుక్‌క్లబ్స్
టీచర్లు టెక్ట్స్‌బుక్స్ చదువుతారు. సిలబస్ మారితే కొత్త పాఠ్యపుస్తకాలు చదువుతారు. సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉన్నవారు ఆ సబ్జెక్ట్‌కు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటారు. కాని పుస్తకాలు చదువుతున్నారా?పుస్తకాలంటే...సాహిత్యం, చరిత్ర, రాజకీయాలు, జీవిత చరిత్రలు, సినిమా, సంగీతం, సైకాలజీ, యాత్రాకథనాలు... ఈ పుస్తకాలు చదువుతున్నారా? హెచ్ఆర్ఏ అందుకునే టీచర్లు తమ నివాసంలో కనీసం ఒక బుక్‌షెల్ఫ్ అయినా మెయిన్‌టెయిన్ చేస్తున్నారా? ఎందుకంటే పుస్తక పఠనం ఉపాధ్యాయులకు చాలా మేలు చేస్తుందని విద్యావేత్తలు అంటున్నారు. బెంగళూరు నగరంలో టీచర్ల బుక్‌క్లబ్స్ ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి.→ రెండు విధాలా మేలు..పుస్తకాలు చదవడం వ్యక్తిగతంగా, వృత్తిగతంగా మేలు కలిగిస్తున్నాయి. బెంగళూరులోని క్రేయన్ ప్రీస్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ మధు ప్రకాశ్ కొన్నిరోజుల నుంచి ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఏ అనారోగ్య సమస్యా లేదు. అయినా జీవితంలో ఏదో వెలితి. ఆ వెలితిని పుస్తక పఠనం ద్వారా అధిగమించారు. రోజూ కనీసం అరగంట సేపు పుస్తకాలు చదవడం ద్వారా ఒత్తిడి దూరమవడంతోపాటు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తోందని, దానివల్ల ఉద్యోగం మీద ఏకాగ్రత పెరిగిందని వివరిస్తున్నారామె. ఆమె అనుభవం తెలుసుకున్న మరికొందరు టీచర్లు పుస్తకాలు అందుకున్నారు. విద్యావేత్త నీలమ్ దీక్షిత్ పరిశీలనలో రోజుకో అరగంటపాటు పుస్తకాలు, దినపత్రికలు చదివే టీచర్లు ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తున్నారని వివరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పాఠశాల యాజమాన్యాలు బుక్ క్లబ్‌లు ఏర్పాటు చేసి టీచర్లను అందులో భాగస్వాములను చేస్తున్నారు. వారానికో పుస్తకం చొప్పున చదివేలా ప్రోత్సహిస్తున్నారు. తమతోపాటు టీచర్లు కూడా కూర్చొని పుస్తకాలు చదువుతుండటంతో పిల్లలకు అది ఉత్సాహం కలిగిస్తోందని పాఠశాల యాజమాన్యాలు అంటున్నాయి. → అభి్రపాయాలను మారుస్తూ..‘అకాడమిక్ పుస్తకాలతో కుస్తీ పట్టడానికే సమయం చాలడం లేదు. ఇక బయట దొరికే పుస్తకాలు చదివే వీలెక్కడిది?’ అని కొందరు ఉపాధ్యాయులు పెదవి విరిస్తే ఈ అభి్రపాయాన్ని మార్చేందుకు మధు ప్రకాశ్ ఓ పని చేశారు. జొనాథన్ హైడ్ రాసిన ‘ది ఆంక్షియస్ జనరేషన్’ అనే పుస్తకం గురించి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఇతర టీచర్లకు ఆసక్తి కలిగించడంతో వారు ఆ పుస్తకం చదివేందుకు ముందుకొచ్చారు. స్టాన్లీ గ్రీన్ స్పాన్ రాసిన ‘ప్లేగ్రౌండ్ పాలిటిక్స్’ పుస్తకం చదవడం ద్వారా తాను బోధించే విధానం మారిందని వాణి అనే ఉపాధ్యాయిని చెప్పడంతో ఇతర టీచర్లకూ ఆ పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగింది. వర్జీనియా ఆక్స్లైన్ రాసిన ‘డిబ్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ సెల్ఫ్’, ఇ.ఆర్.బ్రెత్‌వెయిట్ రాసిన ‘టు సర్, విత్ లవ్’ పుస్తకాలు చదవడం వల్ల పిల్లలతో తాను ప్రవర్తించే విధానంగా సమూలంగా మారిందని ప్రతిమా అనే ఉపాధ్యాయిని వివరిస్తున్నారు.→ ఎలాంటి పుస్తకాలు మేలు?టీచర్ బుక్క్లబ్లో ఎలాంటి పుస్తకాలు చదవాలనేదానిపైనా కొందరు టీచర్లు సూచనలు చేస్తున్నారు. హెలెన్ కెల్లర్, ఐన్ స్టీన్, మేరీ క్యూరీ, అన్నా ఫ్రాంక్, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ వంటి మహనీయుల జీవితచరిత్రలతోపాటు సైన్స్, చరిత్ర, సాంస్కృతిక అంశాలపై పుస్తకాలకుప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. పాఠాల్లో ఉన్న అంశాలపై మరింత లోతైన సమాచారం అందించే పుస్తకాలనూ టీచర్లు చదువుతూ విద్యార్థుల చేత చదివిస్తున్నారు. బెంగళూరులో కొన్ని స్కూళ్లలో పాటిస్తున్న ఈ విధానం చూసి ఇతర స్కూళ్లలోనూ టీచర్స్ బుక్‌క్లబ్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. టీచర్లు పాఠకులేనా?టెట్సుకో కురొయానాగి రాసిన ‘టొటొ చాన్ ’ చదివితే పిల్లల సామర్థ్యాలేమిటో అర్థమయ్యాయి అంది ఒక ఉపాధ్యాయిని. స్టాన్లీ గ్రీన్‌స్పాన్ రాసిన ‘ప్లే గ్రౌండ్ పాలిటిక్స్’ చదివితే పిల్లల మధ్య అనుబంధాలు తెలిసొచ్చాయి అంది మరో ఉపాధ్యాయిని. ప్రభుత్వాలు పిల్లల చేత న్యూస్‌పేపర్లు చదివించే నిబంధనలను తెస్తున్నాయి.కాని టీచర్లు పాఠకులుగా ఉంటున్నారా? టీచర్లు పుస్తకాలు చదివితే వృత్తి నైపుణ్యంతోపాటు పిల్లల వికాసం మరింత బాగుంటుందని బెంగళూరు టీచర్లు నిర్వహిస్తున్న వాట్సప్ టీచర్స్ బుక్ క్లబ్స్ నిరూపిస్తున్నాయి. టీచర్లూ... ఏం చదువుతున్నారు? -
ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్‌లో కోడింగ్..!
మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదలుకుని నచ్చిన జాబ్‌లో కొనసాగాలంటే చాలా ధైర్యం కావాలి. తీరా మనకు నచ్చిన రంగంలో కొనసాగాక..సమస్యలు వెంటాడితే ఇక అంతే సంగతులు. అంతా సవ్యంగా ఉంటే పర్లేదు. ఏదైనా సమస్య వస్తేనే ఇబ్బంది. అందులోనూ భారీ వేతనం లభిస్తున్న ఉద్యోగం వదలాలన్న గట్స్ కావాలి. అయితే ఈ టెక్కీ అంత సాహసం చేశాడు. అది కూడా యూట్యూబ్‌లో కోడింగ్ నేర్పడం కోసం అంత పెద్ద ఉద్యోగం వదిలేశాడు. అబ్బా ఇదేంటని అడిగితే.. తాను కోరుకున్నది ఇదేనని నవ్వుతూ చెబుతాడు సదరు టెక్కీ. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారడమే గాక టెక్కీ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వ్యక్తే అక్షయ్ సైనీ. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో మాజీ ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్షయ్ సైనీ ఐదేళ్ల క్రితం సురక్షితమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకున్న తన జర్నీని పంచుకున్నాడు. ఈ నిర్ణయం అతడికి తన డడ్రీమ్ లైఫ్‌ని నిర్మించుకునేందుకు సహాయపడింది. అంతేగాదు సైనీ తన యూట్యూబ్ ఛానెల్లో రెండు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నాడు. నిజానికి తాను ఉబర్‌లో ఉద్యాగాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడూ..అందరు తనని మతిస్థిమితం లేనివాడిగా చూశారని చెప్పుకొచ్చాడు. కేవలం యూట్యూబ్‌లో బోధించేందుకు మంచి జీతం, మంచి బ్రాండెడ్ కంపెనీ తదితరాలన్నీ కాదనుకుంటున్నావా అని కూడా ప్రశ్నించారని రాసుకొచ్చాడు. ఇది చాలా తెలివితక్కువ నిర్ణయమని. అంతగా కావాలనుకుంటే జాబ్ చేస్తూనే వారాంతాలలో య్యూట్యూబ్ కంటెంట్క్రియేటర్గా, కోడింగ్ బోధించమని సలహ ఇచ్చారని తెలిపాడు. కొందరైతే ఏకంగా ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్యాగ్‌తో పెళ్లి అయిపోని.. ఆ తర్వాత నచ్చినదాంట్లో కొనసాగమని సూచించారు కూడా. అయితే నా దృష్టిలో వివాహాం పెద్ద మేటర్ కాదు కాబట్టి..గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగాలనే నిర్ణయించుకున్నా. అందుకోసం తొందరపడలేదని..జీతం లేకుండా పది నెలలకు పైగా సెలవులు తీసుకుని మరి ఒక నిర్ణయానికి వచ్చినట్లు వివరించాడు. ఆ విరామ సమయంలో బోధన, డెవలపర్ విద్యపై దృష్టి సారించి నమస్తేదేవ్ అనే వేదికపై పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో తాను కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మాత్రమే ఇప్పుడు..వ్యవస్థాపకుడిగా, సీఈవోగా, మార్కెటర్‌గా, సేల్స్గైగా, ప్రొడక్ట్ మేనేజర్‌గా, ఫైనాన్స్గైగా, కొన్నిసార్లు కస్టమర్ సపోర్ట్‌గా అన్ని రోల్స్ నిర్వరిస్తున్నా అని ఆనందంగా చెబుతున్నాడు. అంతేగాదు మనకు బయట స్టార్టప్‌లు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. కానీ చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏళ్లుగా ఎన్నో విమర్శలు, ఆన్లైన్ ద్వేషాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ వెనుతిరగలేదని, ఎన్నోప్రతికూలతలను దాటుకుంటూ చాలా దూరం వచ్చానంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు సైని. అలా ఇప్పటికీ ఐదేళ్లు అయ్యిందని, స్వస్థలం డెహ్రాడూన్, అక్కడే ఒక చిన్న రిమోట్ బృందంతో పనిచేస్తున్నట్లు తెలిపాడు. దీని వల్ల కుటుంబంతో గడపగలుగుతున్నానని, పనిని ఆనందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్..అందరి మనుసుని గెలుచుకోవడమే గాక..ఇలాంటి నిర్ణయాల తీసుకునేందుకు చాలా గట్టి ధైర్యం కావాలని, ఆత్మసంతృప్తినిచ్చే పని ఎంతో నచ్చుతుందని. దానికి మించింది మరొకటి లేదని పోస్టులు పెట్టారు. అలాగే అన్నివేళలా సురక్షితమైన ఉద్యోగం కంటే..ఓర్పుతో నచ్చిన వృత్తిలో గెలుపు అందుకోవడంలో ఉన్న కిక్ వేరేలెవెల్ అంటూ మరికొందరూ పోస్టుల్లో పేర్కొన్నారు.When I left Uber, a lot of people thought I had lost my mind.Good salary, big brand, stable life.And I was walking away from it to do YouTube, teaching, content creation. In India.People told me very seriously, “This is not a good decision.”Some said, why don’t you do…— Akshay Saini (@akshaymarch7) February 9, 2026 (చదవండి: ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటలెక్కించారు..కానీ..!) -
ఐటీ అన్నదమ్ములు.. భలే కట్టారు ఇల్లు!
కొన్ని ఇళ్లు చూడగానే ఆకట్టుకుంటాయి. బెంగళూరులో ఇద్దరు ఐటీ ఇంజనీర్ సోదరులు నిర్మించిన ఈ అద్భుతమైన 4BHK ట్విన్ హోమ్ సింపుల్ స్టైల్, స్మార్ట్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. లోపల విశాలమైన గదులు, సహజ గాలి ప్రవాహం, ఆధునిక ఆలోచనలతో రూపొందిన ఈ ఇంటిని బిల్డ్ ఎ హోమ్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ నిర్మించింది. ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ శివరాయ్ ఈ ఇంటిని సందర్శించి, ఆ హౌస్ టూర్‌ను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఇంట్లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ప్రత్యేకతలేంటో మనమూ చూద్దామా...రెండు ప్లాట్లు ఒకే ఇల్లు30×40 పరిమాణంలోని రెండు ప్లాట్లను కలిపి, మొత్తం 2,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ట్విన్ హోమ్‌ను నిర్మించారు. తాము పక్కపక్కనే నివసిస్తూ ఒకే కుటుంబంగా ఉండాలనుకున్నామని అందుకే ఇల్లు ఇలా నిర్మించుకున్నట్లు చెప్పారు. బయట నుండి చూస్తే ఇది ఒకే ఆధునిక ఇంటిలా కనిపిస్తుంది. కానీ లోపలికి అడుగుపెడితే, అచ్చు ఒకేలా ఉండే రెండు పోర్షన్లు కనిపిస్తాయి. క్లీన్ డిజైన్, స్మార్ట్ లేఅవుట్, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలే ఈ ఇంటి ప్రత్యేకత.ఇంటి లోపలి అందండబుల్-హైట్ సీలింగ్‌తో ఉన్న లివింగ్ రూమ్ ఈ ఇంటికి హైలైట్. సహజ సూర్యకాంతి లోపలికి వెల్లువలా ప్రవహించేలా డిజైన్ చేయడం వల్ల, ఆ స్థలం మరింత విశాలంగా, ఆహ్వానకరంగా అనిపిస్తుంది. ఓపెన్-ప్లాన్ కిచెన్, పూజ గది, చిన్న ఆఫీస్-కమ్-బెడ్రూమ్, హాయిగా కూర్చునే బే విండోతో మాస్టర్ బెడ్రూమ్ ఈ ఇంటి సౌకర్యాన్ని పెంచుతాయి.పిల్లల ప్రతి బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ ఏరియా ఉండటం గోప్యతను, సౌకర్యాన్ని అందిస్తుంది. రెండు ఇళ్లను కలిపే కనెక్టింగ్ హాల్వే ఒక వంతెనలా పనిచేస్తుంది. పై అంతస్తులో గెస్ట్ రూమ్, యుటిలిటీ ఏరియా ఉండటంతో, కుటుంబ సభ్యులతో పాటు అతిథులను కూడా సౌకర్యంగా ఆహ్వానించగలిగేలా ఇంటిని రూపొందించారు. యజమానులు ఈ ఇల్లు కేవలం అందంగా మాత్రమే కాకుండా, ఆచరణాత్మకంగా కూడా ఉండేలా జాగ్రత్తగా ప్లాన్ చేసి నిర్మించుకున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shiva Rai (@_mr.swashbuckler_) -
కారును ఢీకొని.. హెల్మెట్‌తో దాడి..
బెంగళూరు: మద్యం మత్తులో కారు డ్రైవరుపై యువతులు హెల్మెట్‌తో దాడికి పాల్పడి వీరంగం సృష్టించిన ఘటన హుళిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి 10 గంటలప్పుడు జరిగింది. స్నేహితులతో కలిసి హోటల్‌కు భోజనానికి వెళ్లిన ఉత్తర భారతదేశానికి చెందిన లీసా, మ్యాథ్యూ అనే ఇద్దరు యువతులు వీవీ రోడ్డు దోసె క్యాంప్ వద్ద స్కూటర్లో వెళ్తూ ముందున్న కారును ఢీకొట్టారు. ఈ సమయంలో కారు డ్రైవరు అహ్మద్ కారు దెబ్బతినిందని, రిపేరు చేయించాలని వారిని నిలదీశాడు. మత్తులో ఉన్న యువతులు తప్పు నీదే అని అతనితో వాదించి నోటికొచ్చినట్లు దూషించి హెల్మెట్‌తో కొట్టారు. స్థానికులు యువతులను సముదాయించినా రభస సృష్టించారు. జనం హుళిమావు పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకుని యువతులను, స్కూటర్‌ను ఠాణాకు తరలించారు. అక్కడ విచారించి మందలించి నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. -
భారత్‌లో గూగుల్ భారీ విస్తరణ.. 20,000 మందికి ఉద్యోగాలు!
అమెరికాలో హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, పెరుగుతున్న వ్యయాల నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ తన వ్యూహాన్ని మార్చుకుంది. విదేశీ సిబ్బందిని అమెరికాకు పిలిపించుకునే బదులు ప్రతిభ ఉన్న చోటికే తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరులో గూగుల్ భారీ విస్తరణకు చర్యలు చేపట్టింది.బెంగళూరులో భారీ క్యాంపస్బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న అలెంబిక్ సిటీలో భారీ కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేస్తోంది. మొత్తం మూడు టవర్లలో సుమారు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఉండబోతోందని ప్రాథమిక సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 20,000 మంది సాఫ్ట్వేర్ నిపుణులకు ఉపాధి లభిస్తుంది. భారత్‌లో ప్రస్తుతం గూగుల్‌కు 14,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త క్యాంపస్‌తో గూగుల్ ఇండియా తన సిబ్బంది సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుంది. 6.5 లక్షల చదరపు అడుగుల మొదటి టవర్ రాబోయే కొద్ది నెలల్లోనే ప్రారంభం కానుంది. మిగిలిన రెండు టవర్లు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతాయని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది.వీసా ఆంక్షలే వరంగా..అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వస్తున్న మార్పులు భారతీయ ఇంజినీర్లకు వరంగా మారాయి. యూఎస్ హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుములను భారీగా పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తుకు కంపెనీలు దాదాపు 1,00,000 డాలర్లు (సుమారు రూ.91 లక్షలు) వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. వీసా అనుమతుల కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం కంటే భారత్‌లోనే స్థానిక బృందాలను నిర్మించడం కంపెనీలకు లాభదాయకంగా మారుతుంది. మానవ వనరులను అమెరికాకు తరలించే ఖర్చు తగ్గడమే కాకుండా, భారతీయ నైపుణ్యాన్ని తక్కువ వ్యయంతోనే వినియోగించుకునే వీలు కలుగుతోంది.ఏఐ రేసులో భారతే కీలకంప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, చిప్ డిజైనింగ్ వంటి క్లిష్టమైన విభాగాల్లో వందలాది పోస్టుల కోసం గూగుల్ నియామకాలు చేపడుతోంది. గూగుల్ మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా వంటి సంస్థలు కూడా భారత్‌లో తమ సిబ్బందిని పెంచుకుంటున్నాయి. గడిచిన ఏడాదిలో ఈ దిగ్గజ కంపెనీల భారతీయ ఉద్యోగుల సంఖ్య 16 శాతం పెరగడం గమనార్హం. ఇది గత మూడేళ్లలో అత్యధిక వృద్ధి.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే.. -
‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు
బెంగళూరు: రైలు, బస్సు, విమాన ప్రయాణాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా మెలగడమనేది కనీస బాధ్యత అని చెబుతుంటారు. అయితే బెంగళూరు ‘నమ్మ మెట్రో’లో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తూ, కలవర పెడుతోంది. ప్రయాణికుల పౌర స్పృహ (Civic Sense) ప్రశ్నార్థకంగా మారుతోంది.హెడ్ఫోన్లు లేకుండా బిగ్గరగా సంగీతం వినడం, రిజర్వ్ చేసిన సీట్లను ఆక్రమించుకోవడం, రైలులో ఆహారం తీసుకోవడం తదితర సుమారు లక్షకు పైగా ఉల్లంఘనల కేసులు గత ఏడాది కాలంలో బెంగళూరు ‘నమ్మ మెట్రో’ నమోదయ్యాయి. ప్రయాణికుల నుంచి నిత్యం వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న మెట్రో అధికారులు, ఈ గణాంకాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. క్రమశిక్షణ లేని ప్రయాణికుల వల్ల తోటి వారికి కలుగుతున్న ఇబ్బందులను అరికట్టేందుకు భారీ ఎత్తున జరిమానాలు విధించేందుకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్పీఎల్)సిద్ధమైంది.నివేదికల ప్రకారం సుమారు 57,538 మంది ప్రయాణికులు హెడ్ఫోన్లు లేకుండా బిగ్గరగా పాటలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించారు. అలాగే, తమకు కేటాయించని రిజర్వ్డ్ సీట్లను 37,038 మంది ఆక్రమించుకోగా, 1,907 మంది రైలులో భోజనం చేస్తూ పట్టుబడ్డారు. వీటితో పాటు, 1,677 మంది నిబంధనలకు విరుద్ధంగా గుట్కా, పాన్ వంటి పొగాకు ఉత్పత్తులను తీసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి చర్యలు ప్రయాణికుల మధ్య వాగ్వాదాలకు, ఘర్షణలకు దారితీస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.మెట్రో రైల్వే (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్, 2002 ప్రకారం ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే ఏ చర్య అయినా శిక్షార్హమని బీఎంఆర్సీఎల్ స్పష్టం చేసింది. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లను ఇతరులు ఆక్రమించుకుని, అడిగినా ఖాళీ చేయనివారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో అనేది సామాజిక బాధ్యతతో కూడిన పబ్లిక్ స్పేస్ అని, ఇక్కడ తోటి ప్రయాణికులకు గౌరవం ఇవ్వడం ప్రతీ ఒక్కరి కనీస ధర్మమని ‘నమ్మ మెట్రో’ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.బాధ్యతాయుతమైన ప్రయాణ సంస్కృతిని ప్రోత్సహించేందుకు బీఎంఆర్సీఎల్ ఒక ప్రత్యేక అవగాహన డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా, ప్రతి మెట్రో రైలులో ఇద్దరు హోంగార్డులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించింది. వీరు నిరంతరం రైలులో తిరుగుతూ, నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తారు. నిబంధనలు అతిక్రమించే వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, అవసరమైతే అక్కడికక్కడే జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టనున్నారు.ఇది కూడా చదవండి: ఏఐ ‘దొంగ’ ఫొటోలు.. కంగుతిన్న పర్యాటకులు -
బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తను వదిలేసిన భార్య
(కర్ణాటక) దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపుర తాలూకాలో ఖతర్నాక్ కిలేడీ లీలలు వెలుగు చూశాయి. వివాహమై పిల్లలు ఉన్నా మరో ఇద్దరు వ్యక్తులను మోసం చేసి వివాహం చేసుకుని రూ.లక్షల్లో డబ్బు దోచుకున్నారు. ఈ కిలేడీ బాగోతాన్ని మోసపోయిన భర్తలు బయటపెట్టారు. దొడ్డ తాలూకాలోని హణబె గ్రామానికి చెందిన సుధారాణిపై ఈమేరకు ఆరోపణలు వచ్చాయి. బాధితుల కథనం మేరకు వివరాలు.. వీరేగౌడ అనే వ్యక్తిని సుధారాణి మొదటి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మొదటి భర్తతో సంతృప్తి చెందని సుధారాణి అతడికి బుల్లెట్, కారు లేదని అసలు నడపడమే రాదనే సాకులు చెప్పి గొడవపడి పిల్లలను, భర్తను వదిలి చేతికందినంత డబ్బు, నగలు తీసుకుని వెళ్లిపోయింది. తరువాత డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న అనంతమూర్తి అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తనకు భర్త లేడని, చనిపోయాడని, ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పుకుంది. తరువాత మాయ మాటలు చెప్పి అనంతమూర్తిని ఒక గుడిలో వివాహం చేసుకుని 18 నెలలు సంసారం చేసింది. ఈ ఏడాదిన్నర కాలంలో పలు కారణాలు చెప్పి అనంతమూర్తి వద్ద రూ.20 లక్షల వరకూ నగదు తీసుకుంది. డబ్బులు తీసుకున్నాక సుధారాణి అనంతమూర్తిని వదిలి కనకపురకు చెందిన మరో డబ్బున్న వ్యక్తిని ట్రాప్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మొదటి భర్త వీరేగౌడ, రెండవ భర్త అనంతమూర్తి ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమాయకులను మోసం చేసి వివాహం చేసుకున్నట్టు నాటకమాడి తరువాత వారి నుంచి డబ్బులు గుంజి వదిలేస్తున్న సుధారాణిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వదిలేయండి ప్లీజ్.. రూ.4 లక్షల లంచంతో సీఐ దొరికిపోయి..
బెంగళూరు: లంచం తీసుకుంటూ బెంగళూరులోని కేపీ.అగ్రహార సీఐ గోవిందరాజు లోకాయుక్త పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలు.. చిట్టీల విషయంపై వివాదం ఏర్పడటంతో సూరజ్ అనే వ్యక్తిని సీఐ గోవిందరాజు నిత్యం స్టేషన్‌కు పిలిపించి వేధించేవాడు. కేసునుంచి తప్పించేందుకు రూ.5 లక్షలకు డిమాండ్ చేశాడు. తొలుత రూ.లక్ష తీసుకున్నాడు. మిగతా డబ్బు కోసం డిమాండ్ చేసేవాడు. ఏసీపీకి కూడా వాటా ఇవ్వాలని, వెంటనే నగదు సమకూర్చాలని ఒత్తిడి చేశాడు. దీంతో సూరజ్ లోకాయుక్తను ఆశ్రయించాడు. పథకం ప్రకారం సూరజ్ గురువారం చామరాజపేట గ్రౌండ్ వద్ద నగదు అందజేస్తుండగా లోకాయుక్త ఎస్పీ శివప్రకాష్దేవరాజు నేతృత్వంలో అధికారులు దాడి చేశారు. నగదు తీసుకుంటున్న సీఐని పట్టుకున్నారు. అయితే సీఐ కేకలు వేస్తూ హల్చల్ చేశాడు. ఆరుమంది అధికారులు అతన్ని బంధించి స్టేషన్‌కు తరలించారు. ఫిర్యాదుదారుడు సూరజ్ మాట్లాడుతూ పోలీసులు న్యాయం చేస్తారని వారిని ఆశ్రయిస్తే ఇక్కడ కూడా లంచాల కోసం గోల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. లోకాయుక్త ఎస్పీ మాట్లాడుతూ సీఐ గోవిందు నుంచి రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. A police inspector identified as Govindaraju was caught red-handed by Lokayukta for accepting a bribe of ₹4 lakh from a builder in Bengaluru !!pic.twitter.com/ZHCujV4MgV— Aryan (@chinchat09) January 31, 2026 -
బెంగళూరు విషాదం: రియల్ ఎస్టేట్ టైకూన్ సీజర్ రాయ్ ఆత్మహత్య
బెంగళూరు: ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ టైకూన్, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీజర్ రాయ్(డాక్టర్ చిరియాంకందత్ జోసెఫ్ రాయ్) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని రిచ్మండ్ టౌన్‌లోని తన నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యాపార పరిశ్రమ వర్గాలను ఈ సంఘటన తీవ్రంగా కలచివేసింది.సీజర్ రాయ్) బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. 2005లో ఆయన కాన్ఫిడెంట్ గ్రూప్‌ను స్థాపించారు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో విస్తరించింది.అప్పులు లేకుండా వ్యాపారం నడిపిన మోడల్‌తో ప్రసిద్ధి గాంచారు సీజర్ రాయ్. : రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయత, విస్తృత నెట్వర్క్ తో వ్యాపార వర్గాల్లో గుర్తింపు పొందారు. ఈరోజు ఐటీ శాఖ ఆయన నివాసంలో దాడులు చేస్తున్న సమయంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను నారాయణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. -
ముచ్చట్లు పెట్టుకుంటే మూడినట్లే
ముచ్చట్లన్నాక ముగింపు ఉండాలి, కానీ బెంగళూరు కేఫ్‌లలో కూర్చునే ‘జ్ఞానులకి’కాలజ్ఞానమే ఉండదు. కప్పు కాఫీ ఆర్డర్ ఇచ్చి, ఆ ఆవిరి ఆరిపోయేలోపే ప్రపంచ సమస్యలన్నీ పరిష్కరించేద్దామని ఫిక్స్ అయిపోతారు. స్టార్టప్ చర్చలకు, ఆఫీస్ మీటింగ్‌లకు అడ్డాగా మార్చేస్తారు. ఇలాంటి ‘మీటింగ్’రాయుళ్లకి చుక్కలు చూపిస్తూ ఒక కేఫ్ యజమాని అదిరిపోయే చెక్ పెట్టాడు. శోభిత్ బక్లీవాల్ అనే వ్యక్తి ‘ఎక్స్’లో ఈ నోటీసు ఫొటోను షేర్ చేశారు.నోటీసు సారాంశం ఏమనగా..‘మీటింగ్స్ నాట్ అలౌడ్..’.. అంటే ఇకపై అక్కడ ‘స్టార్టప్ ఐడియాల’గురించి తీవ్ర చర్చోపచర్చలు పెట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మీ ముచ్చట్లు గంట దాటితే.. నిమిషానికి ఒక లెక్క కాదు, ఏకంగా గంటకు రూ.1000 వదిలించుకోవలసిందే.. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పేలుతున్నాయి. కేఫ్‌కి వెళ్లేది కాఫీ తాగడానికి కాదు, నెట్ ఫ్రీగా వస్తుందని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ‘యూనికార్న్’కంపెనీలు పెట్టేయడానికి! గంటల తరబడి టేబుల్ ఆక్రమించేసి, పాపం యజమాని కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంటారు. రాజకీయాలు, సినిమాలు, ఆఫీస్ గాసిప్స్.. వీటన్నింటినీ ఒక చిన్న కాఫీ కప్పు సాక్షిగా గంటల తరబడి తెగ చర్చించేసుకోవడం వీరికి అలవాటు. ఇప్పుడు ఆ ముచ్చట్లు సాగాలంటే.. ముచ్చట తీరాలంటే.. వెయ్యి రూపాయలు వదలాల్సిందే.కప్పు కాఫీ.. కబుర్లు బోలెడుకొందరికైతే ఆ కేఫ్ టేబులే వాళ్ల ఆఫీస్ డెస్్క.. ఆర్డర్ ఇచ్చేది చిన్న సమోసా, కానీ బిల్డప్ మాత్రం బిల్‌గేట్స్ రేంజ్లో ఉంటుంది. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ‘గంటకు వెయ్యి అంటే.. ఆ బిల్లు చూశాక ముచ్చట్లు పెట్టుకునే వారికి గుండె ఆగిపోవడం ఖాయం!’.. అని ఒకరంటే.. ‘పాపం కేఫ్ యజమాని ఎంత కసి మీద ఉన్నాడో.. ఆ వెయ్యి రూపాయల చార్జి చూస్తేనే అర్థమవుతోంది!’.. అని ఇంకొకరు నవ్వుకున్నారు. మొత్తానికి, ఆ కేఫ్‌కి వెళ్లేవారు ఇకపై ‘వాచ్’చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకోవాలి. లేదంటే కాఫీ కంటే ఎక్కువ బిల్లు ముచ్చట్లకే కట్టాల్సి వస్తుంది సుమా.. -
ఇంటిపేరే ‘బెంగళూరు’..!
కొన్ని ఇంటి పేర్లు, ఊర్లు, గ్రామాల పేర్లుగా ఉండటం చూశాం. అంతేగానీ మెట్రో నగరాల్లాంటి మహా నగరాల పేరే ఇంటిపేరుగా ఉండటం గురించి విన్నారా?. వాట్ సీటీ పేరు ఇంటి పేరుగానా అని అనుకోకండి. ఇది నమ్మక తప్పని నిజం. ఓ మహిళ ఇంటిపేరే బెంగళూరు. ఎందుకలా వింటే.. ఆలోచన వేరేలెవెల్ అని అంటారు. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకుందో ఆమె చకచక చదివేయండి మరి..!.బెంగళూరుకు చెందిన విప్రా బెంగళూరు అనే మహిళ తను పుట్టి.. పెరిగిన నగరంతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ఓ వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించడమేకాదు ఆమె తాత ఆలోచనకు ఫిదా అయ్యారు కూడా. మీ తాతగారి ముందుచూపుకి హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె తన వాయిస్ ఓవర్‌తో వివరించి వ్యక్తిగత కథ అందరి మనసులను తాకింది. ఆ వీడియోలో క్లిప్‌లో విప్రా ఇలా చెప్పడం ప్రారంభించింది. తన ఇంటి పేరు బెంగళూరు అని ఉండటం గమనించారా. ఇదేంటని అనుకుంటున్నారా..?. అయితే నగరం పేరు ఇంటిపేరుగా ఎలా మారిందో మీకు తెలియాలి అంటూ వివరించడం మొదలుపెట్టింది ఆమె.."మా తాతయ్య నిజానికి తన పిల్లలకు అంటే మా నాన్నకు ఇంటి పేరు పెట్టలేదు. ప్రజలు వారి ఇంటి పేరుని బట్టి వారి నేపథ్యం, హోదాను అంచనా వేస్తారనే ఉద్దేశంతో తన పిల్లలకు ఇంటిపేరు పెట్టేందుకు ఇష్టపడ లేదు. దాంతో మా నాన్నకు ఇంటిపేరు లేదు. ఇక నా వద్దకు వచ్చేటప్పటికీ..ఇంటి పేరు తప్పనిసరి కావడంతో..నేను పుట్టిన బెంగుళూరు నగరమే నా ఇంటి పేరుగా మారింది అని వివరించింది "విప్రా బెంగళూరు. ఈ మహిళ కథ తన తాతయ్య సామాజిక కట్టుబడులకు దూరంగా ఉంచడానికి ఆయన ఎలాంటి స్పృహతో వ్యవహరించారో అవగతమవుతోంది. తన పిల్లలకు ఇంటి పేరు పెట్టకుండా..వ్యక్తిగతంగా వారి నేపథ్యం, గుర్తింపుతోనే బతికేలా చేసేందుకు ఆయన ప్రయత్నించిన తీరు నిజంగా ప్రశంసనీయం. అలాగే ఇంటి పేరు తప్పనిరి పరిస్థితులో తను పుట్టిన నగరమే తన గుర్తింపుగా మార్చుకోవడం కూడా తాత ఆశయాలకు అనుగుణంగా చాలా అర్థవంతంగా ఉంది కదూ..!. నెటిజన్లు కూడా ఆ మహిళ ఇంటి పేరు వెనుక ఉన్న ఆలోచన చాలా గొప్పగా, ఆదర్శంగా ఉందంటూ ఆమె తాతపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Vipra Bangalore (@vip_z_z) (చదవండి: ఒత్తిడికి మూలం డబ్బేనా..!) -
BCCI: ప్రపంచకప్ జట్టులోకి ఊహించని ఆటగాడు!
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే హ్యాట్రిక్ విజయాలతో 3-0తో సత్తా చాటింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా సాగుతున్న ఈ సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేయాలని సూర్యుకుమార్ సేన పట్టుదలగా ఉంది.అయితే, మెగా టోర్నీకి ముందు గాయాల బెడద టీమిండియాకు ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాగా.. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) సైతం వేలునొప్పితో బాధపడుతున్నాడు.రేసులోకి ఊహించని ఆటగాడుఇక వాషీ కోలుకునేందుకు ఇంకా రెండు వారాలకు పైగానే పట్టవచ్చని బీసీసీఐ (BCCI) వర్గాలు ఇప్పటికే జాతీయ మీడియాకు వెల్లడించాయి. దీనిని బట్టి అతడు వరల్డ్‌కప్ టోర్నీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం రియాన్ పరాగ్ (Riyan Parag)ను రేసులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.భుజం నొప్పిఅసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. భుజం నొప్పితో బాధపడుతున్న అతడు గత మూడు వారాలుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు. గతేడాది డిసెంబరు 6న చివరగా అసోం తరఫున దేశీ క్రికెట్ ఆడిన ఈ ఆల్‌రౌండర్.. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు.రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లకు కూడా రియాన్ పరాగ్ అందుబాటులో లేడు. అయితే, ప్రస్తుతం అతడు వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తున్నప్పటికీ నొప్పి లేకపోవడం సానుకూలాంశంగా పరిణమించింది. జనవరి 28, 30 తేదీల్లో అతడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం.ఈ క్రమంలో జనవరి 31న రియాన్ పరాగ్ ఫిట్‌నెస్‌కు సంబంధించి క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ అయ్యే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ పరిస్థితి గురించి ఆరా తీసిన బీసీసీఐ.. ఫిబ్రవరి 2న టీమిండియాతో పాటు స్టాండ్‌బై ప్లేయర్‌గా అతడిని ముంబైకి పిలిచినట్లు సమాచారం.వాషీ దూరమైతేఒకవేళ వాషింగ్టన్ సుందర్ కోలుకోకపోతే.. అతడి స్థానంలో రియాన్ పరాగ్‌ను వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేసే అవకాశం ఉంది. కాగా గువాహటికి చెందిన 24 ఏళ్ల రియాన్ పరాగ్.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతి వాటం గల బ్యాటర్ అయిన ఈ యువ ఆటగాడు.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా!జింబాబ్వేతో 2024 నాటి టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్.. చివరగా శ్రీలంక పర్యటనలో వన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 9 టీ20లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 106 పరుగులు చేయడంతో పాటు.. నాలుగు వికెట్లు తీశాడు. ఒకే ఒక్క వన్డేలో 15 రన్స్ చేసిన పరాగ్.. మూడు వికెట్లు పడగొట్టాడు.చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము -
రెండు కంటైనర్లు.. రూ.400 కోట్లు.. అసలేం జరిగింది?
బెంగళూరు (బనశంకరి): గోవా నుంచి మహారాష్ట్రకు సుమారు రూ.400 కోట్ల నగదు తరలిస్తున్న రెండు ట్రక్ కంటైనర్లు కర్ణాటకలో అదృశ్యమయ్యాయి. అక్టోబర్‌లో బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా చోలార్ఘాట్లో ఈ కంటైనర్లు మాయమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిశోర్ సేఠ్ ఈ నగదును తరలిస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల పోలీసులు కంటైనర్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సిట్ ఏర్పాటుకు ఆదేశించారు.మహారాష్ట్రలో స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచడానికి ఈ నగదు తరలిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖానాపుర తాలూకాలో ప్రమాదకర అటవీ ప్రదేశమైన చోలార్ఘాట్ ఈ కంటైనర్లు అదృశ్యమైన కొద్దిరోజులకు మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సందీప్పాటిల్ను నగదును యజమాని కిశోర్ సేఠ్ అనుచరులు బంధించారు. నగదు నువ్వే అపహరించావని ఆరోపించి, వెనక్కి ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామంటూ చిత్రహింసలు పెట్టారు.వారి చెరనుంచి తప్పించుకున్న సందీప్‌పాటిల్ ఈ నెల 1వ తేదీన నాసిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రూ.400 కోట్ల నగదు కంటైనర్లు మాయం కావడంతో తనను కిడ్నాప్ చేశారని తెలిపాడు. నాసిక్ పోలీసులు గోవా, బెళగావి పోలీసులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురిని.. విరాట్గాం«దీ, జయేశ్ కదమ్, విశాల్‌నాయుడు, సునీల్ దుమాల్, జనార్దన్ దైగుడేలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరిలో విరాట్‌గాంధీ రాజస్థాన్‌కు చెందిన హవాలా ఆపరేటర్. ఇద్దరు నిందితులు.. అజార్ బిల్డర్, కిశోర్ సావ్లా పరారీలో ఉన్నారు. -
ఇది రేసింగ్ ట్రాక్ కాదు.. లంబోర్గిని కారు కోసం గాలింపు
బెంగళూరు: బెంగళూరు నగరంలో ఎంతో ఖరీదైన లంబోర్గిని కారుతో హల్చల్ చేసిన వీడియో ప్రచారమైంది. మైసూరు రోడ్డులోని కెంగేరి మెట్రో స్టేషన్ వద్ద గ్రీన్ మార్గంలో లంబోర్గిని కారు అతివేగంగా, ఇతర వాహనదారులను భయపెట్టేలా విపరీతమైన శబ్ధంతో దూసుకెళ్లారు. ఆ కారు మహారాష్ట్ర రిజి్రస్టేషన్‌తో ఉంది. కొందరు జనం వీడియో తీయడంతో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు కారు నంబరు ఆధారంగా గుర్తించి కేసు నమోదు చేశారు. కారు కోసం గాలిస్తున్నామని, దొరికితే సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇది రేసింగ్ ట్రాక్ కాదు, అతని డ్రైవింగ్ లైసెన్సుని రద్దు చేయాలి అని నెటిజన్లు మండిపడ్డారు. లగ్జరీ కారు అయినంత మాత్రాన ఇష్టానుసారం వెళ్తామంటే కుదరదన్నారు. Driver of a green #Lamborghini Huracan in #Bengaluru has been booked for rash driving on Mysuru Road near Kengeri. @DCPTrWestBCP Anoop Shetty has confirmed an FIR has been registered. Efforts are on to trace the suspect. @DeccanHerald pic.twitter.com/QpZ7eV62Wz— Prajwal D'Souza (@prajwaldza) January 20, 2026 -
బెంగళూరు ఎన్నికలపై బీజేపీ గురి.. కీలక నిర్ణయం
మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కాషాయ పార్టీ ఇప్పుడు కర్ణాటకపై గురి పెట్టింది. దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో 28 ఏళ్ల శివసేన ఆధిపత్యానికి ముగింపు పలికిన కమలం పార్టీ బెంగళూరులోనూ పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. మరో నాలుగైదు నెలల్లో జరగనున్న స్థానిక ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు కీలక నేతలకు బెంగళూరు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది.బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జిగా నియమించింది. రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీశ్ పూనియా, (Satish Poonia) మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయ్‌లను సహ-ఇంచార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తూ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటనను జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యాలయం ఇంచార్జి అర్జున్ సింగ్ మంగళవారం విడుదల చేశారు.అసెంబ్లీ సమరం లాంటిదే.. గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జిగా తనను నియమించినందుకు నితిన్ నబీన్‌కు 'ఎక్స్'లో రాంమాధవ్ ధన్యవాదాలు తెలిపారు. మే నెలలో జరగనున్న బృహద్ బెంగళూరు మహానగర్ పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. 90 లక్షల ఓటర్లు, 369 వార్డులు ఉన్న బీబీఎంపీ ఎన్నికలు.. అసెంబ్లీ సమరం కంటే తక్కువేమీ కాదన్నారు. కర్ణాటక బీజేపీ నాయకులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, బెంగళూరు నగర నేతలు, కార్యకర్తలతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు.ఎన్నికలకు సిద్ధం: సీఎంబెంగళూరు కార్పొరేషన్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంతకుముందే ప్రకటించారు. జూన్ 30లోపు బీబీఎంపీ ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తమదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ-జేడీఎస్ పొత్తు గురించి తమకు బెంగలేదని సిద్ధరామయ్య, శివకుమార్ అన్నారు. చదవండి: నితిన్ నబీన్‌కు తొలి అడుగే అగ్నిపరీక్ష! -
కారు ధర రూ.70వేలు.. జరిమానా తెలిస్తే షాక్..!
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కారుతో బీభత్సం సృష్టించిన ఒక ఆకతాయికి పోలీసులు తగిన శిక్ష వేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నడిరోడ్డుపై మాడిఫై చేసిన కారుతో సినిమా స్టంట్లు చేస్తూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బీభత్సం సృష్టించాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారి పోలీసుల వరకూ చేరడంతో రూ. లక్షకు పైగా జరిమానా విధించారు.ఇటీవలే న్యూఇయర్ వేడుకలు జరుపకోవడానికి కేరళ కన్నూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బెంగళూరుకు వచ్చారు. అయితే అతను 2002కు చెందిన హోండా సిటీ కారును రూ. 70 వేలకు కొనుగోలు చేశాడు. అనంతరం దానిని రూ. లక్ష ఖర్చు చేసి ఆధునాతనంగా మాఢిపై చేయించాడు. ఈ కారుతో బెంగళూరు రోడ్లపై ప్రమాద కరంగా విన్యాసాలు చేశాడు. మంటలు విదజిమ్ముతూ కారును నడిపాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీటిని చూసి భయాందోళనలకు గురైన ప్రజలు వాటి వివరాలను పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు ఆ కారును స్వాధీన పరుచుకొని అనంతరం దానిపై రూ. 1,11,500 భారీ జరిమానా విధించారు. ఆ యువకుడు ఆ మెుత్తాన్ని చెల్లించడంతో కారును అతనికి అప్పజెప్పినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఈ విధంగానే జరిమానా విధిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
రూ .35 లక్షల జీతం.. వైరల్ అయిన ఉద్యోగ ప్రకటన
బెంగళూరులో కేవలం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థికి ఆఫర్ చేస్తున్న భారీ వేతన ప్యాకేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. SDE-1 (సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్) పోస్టుకు ఈ ఉద్యోగానికి వార్షికంగా రూ.25 లక్షల జీతం, నాలుగు సంవత్సరాల్లో రూ.20 లక్షల విలువైన ఈఎస్ఓపీలు లేదా స్టాక్ బోనస్, అలాగే రోజుకు రూ.600 జొమాటో క్రెడిట్స్ అందిస్తామని పేర్కొన్నారు.ఇదే కాకుండా 10 శాతం పనితీరు బోనస్, రూ.5 లక్షల వరకు రీలొకేషన్, సైనింగ్ ఇన్సెంటివ్లతో మొదటి సంవత్సరంలో మొత్తం వేతనం సుమారు రూ.35 లక్షలకు చేరుతుందని సమాచారం. ఉచిత జిమ్ సభ్యత్వం, ఫోన్, వైఫై బిల్లుల రీయింబర్స్మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కోసం రూ.21,000 భత్యం, ప్రతి మూడు సంవత్సరాలకు ఫోన్ అప్‌గ్రేడ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.ఈ జాబ్ లిస్టింగ్‌ను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ వినియోగదారు షేర్ చేయగా, వెంటనే వైరల్ అయింది. ఒక వైపు టెక్ రంగంలో తొలగింపులు జరుగుతుండగా, మరో వైపు జూనియర్ స్థాయి ఉద్యోగాలకు ఇంత భారీ ప్యాకేజీలు ఇవ్వడంపై నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందించారు. ఈ ఘటన టెక్ పరిశ్రమలో మారుతున్న నియామక ధోరణులు, వేతన వ్యత్యాసాలపై మరోసారి చర్చకు దారి తీసింది.At one side layoffs are happening and other side companies are offering such high salaries for 1 year experienceAnd the fun part is that same company would be paying lesser to 5-8yrs experience employee already working with them.Salary structure is completely broken in tech. pic.twitter.com/5k5Rivwb3H— EngiNerd. (@mainbhiengineer) January 14, 2026 -
షాకింగ్ ట్విస్ట్: కోరిక తీర్చలేదన్న కోపంతోనే..
ఇంటర్నెట్లో బూతు సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో ఓ టీనేజర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. చాలారోజులుగా ఆమెపై ఓ కన్నేసి ఉంచిన ఆ కామాంధుడు.. అదను చూసి ఆమెపై విరుచుకుపడ్డాడు. ప్రతిఘటించడంతో ఆ కోపంలో ఆమెను అత్యంత కిరాతకంగా చంపాడు. వారం కిందట ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిందని భావిస్తున్న టెక్కీ షర్మిల(36) కేసులో ఈ షాకింగ్ ట్విస్ట్ బయటపడింది.రామమూర్తి నగర్‌లోని సుబ్రమణి లే అవుట్‌లోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్‌లో జనవరి 3న అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో షర్మిల(36) అనే యువతి చనిపోయింది. షార్ట్ సర్క్యూట్‌తో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని.. మంటలు చెలరేగడంతో ఊపిరాడకే ఆమె మరణించినట్లు తొలుత అంతా భావించారు. అయితే.. పోలీసులకు మాత్రం అనుమానం వచ్చింది. అందుకే బీఎన్ఎస్ (BNSS) సెక్షన్ 194(3)(iv) కింద అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే..ఆ ఎవిడెన్స్‌తో..దర్యాప్తులో భాగంగా సైంటిఫిక్ మెథడ్స్, టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలు సేకరించారు. ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు లేవని.. ఆమె ఊపిరి ఆడకే చనిపోయిందని.. అయితే అది హత్యే అని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆమె పక్కింట్లోనే ఉండే కర్నాల్ కురై(18) కదలికలపై నిఘా వేశారు. చివరకు.. అతనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు.ఆరోజు ఏం జరిగిందంటే.. కొడగు జిల్లా విరాజ్పేట్కు చెందిన కర్నాల్ తన తల్లితో కలిసి సుబ్రమణి లే అవుట్‌లోని సంకల్ప నిలయలో అద్దెకు ఉంటున్నాడు. ఇంటర్ చదివే ఈ కుర్రాడు.. నీలి చిత్రాలకు, సోషల్ మీడియాకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో పక్క ఇంట్లోనే ఉంటున్న షర్మిల, ఆమె రూమ్మేట్లపై కన్నేశాడు. తన తల్లి ద్వారా వాళ్లతో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేశాడు. దక్షిణ కన్నడకు చెందిన షర్మిలకు ఇంకా పెళ్లి కాలేదు. ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తూ కొలీగ్‌తో ఉంటోంది. ఆమె రూమ్మేట్ రెండు నెలల కిందట స్వస్థలం అసోంకి వెళ్లింది. దీంతో షర్మిల ఒక్కతే ఉంటుందని గుర్తించాడు.ఘటన జరిగిన రోజు రాత్రి.. స్లైడింగ్ కిటికీ(పక్కకు జరిగే కిటికీ) గుండా లోపలికి చొరబడ్డాడు కర్నాల్. తన కోరిక తీర్చాలని బతిమిలాడాడు. ఆమె తిరస్కరించడంతో బలాత్కారం చేయబోయాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అరుస్తుందేమోనన్న భయంతో.. నోరు, ముక్కు మూసి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ పెనుగులాటలో ఆమెకు గాయాలై.. తీవ్ర రక్తస్రావం అయ్యింది కూడా. ఆపై భయంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకుని ఆమె బట్టలు, నేరానికి కారణమైన వస్తువులను బెడ్‌పై ఉంచి వాటికి నిప్పంటించి, ఆమె మొబైల్ ను తీసుకుని పారిపోయాడు. చేసిన నేరాన్ని కర్నాల్ ఒప్పుకోవడంతో అతనిపై బీఎన్ఎస్ 103(1), 64 (2), 66, 238 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. -
నా భార్య నిత్య పెళ్లికూతురు
బెంగళూరు: బెంగళూరులో భార్యాభర్తల వివాదం రచ్చకెక్కింది. తనపై ఫిర్యాదు చేసిన భార్యే అసలు మోసగత్తె అని భర్త ఆరోపిస్తున్నాడు. వివరాలు.. తన భర్త ఇంట్లో తల్లిదండ్రులు ముందు నగ్నంగా తిరుగుతాడని, వీడియోలు చూపించి అలా లైంగిక క్రియకు ఒత్తిడి చేస్తాడని మేఘశ్రీ అనే యువతి కేంద్ర మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేసింది. విల్సన్‌గార్డెన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే వీరికి 3 నెలల కిందటే పెళ్లయింది. ఇప్పుడు భర్త మంజునాథ్ స్పందిస్తూ మేఘశ్రీ అబద్ధాలు చెబుతోందని, రూ.30 లక్షల నగదు, 50 గ్రాముల బంగారం కోసం తనను బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించాడు. ఆమె నిత్య పెళ్లికూతురని, గతంలో రెండు వివాహాలు చేసుకుందని, భర్తలపై పోలీసులకు ఫిర్యాదులు చేసి విడాకులు తీసుకుని, తనను పెళ్లాడిందని చెప్పాడు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తూ, పరిచయమై వివాహం చేసుకున్నామని మంజునాథ్ తెలిపాడు. మేఘశ్రీ స్పందిస్తూ నేను మంజునాథ్ నుంచి రూపాయి కూడా తీసుకోలేదని, నాకు రెండు వివాహాలు జరిగిన మాట నిజమని చెప్పింది. భర్త లైంగికంగా తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపించింది.సినీ నటి కేసులో మలుపు సాక్షి బెంగళూరు: నగరంలో ఓ శాండల్‌వుడ్ నటిని నిర్మాత అరవింద్ వెంకటేశ్ రెడ్డి లైంగికంగా వేధించాడని కేసు పెట్టగా అతనిని పోలీసులు విచారించారు. అయితే ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. తనను నటి మోసం చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు, ఇందుకు అవసరమైన వారిద్దరు కలిసి ఉన్న ప్రైవేటు ఫోటోను కూడా అందించినట్లు తెలిసింది. తాను ఆమెకు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చినట్లు చెప్పాడు. -
రెండో పెళ్లి.. రూ.36 లక్షలతో భర్త జంప్
కర్ణాటక: విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడి, కూతురు పుట్టిన తరువాత రూ.36 లక్షల డబ్బుతో ఉడాయించిన ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరులో బనశంకరిపోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువతి భర్తకు అనారోగ్యం కారణంగా 2021లో విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. తరువాత మోసగాడు మోహన్‌రాజ్ పరిచయమై ప్రేమించింది, 2022లో వివాహం చేసుకున్నారు. తరువాతి ఏడాది వారికి కూతురు పుట్టింది. మోహన్‌రాజ్‌ను నమ్మిన ఆమె అడిగినంత డబ్బు ఇచ్చింది. కొత్తగా ఇల్లు కట్టిస్తానని చెప్పడంతో బంగారం కుదువ పెట్టి డబ్బులు ఇచ్చింది, ఇలా రూ.36 లక్షల వరకూ జేబులో వేసుకున్నాడు. గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి జాడ లేదు. దీంతో కంగుతిన్న బాధితురాలు మోసపోయినట్లు గుర్తించింది. తనకు న్యాయం చేయాలని బనశంకరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
భలే మంచి బాస్! కార్పొరేట్ ఆఫీస్‌లో వైరల్ వీడియో
విషపూరిత పని సంస్కృతులు రాజ్యమేలుతున్న కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగులకు ఆనందాన్ని పంచే బాస్లూ అక్కడక్కడా ఉంటారు. ఎప్పుడూ వర్క్ టెన్షన్లో ఉండే ఓ ఉద్యోగినిని ఇలాగే సర్ప్రైజ్ చేశారు ఆమె మేనేజర్, తోటి ఉద్యోగులు.బెంగళూరులోని ఓ కార్యాలయంలో పని చేస్తున్న ఐశ్వర్యను ఏదో మీటింగ్ అంటూ రూంలోకి పిలిచారు. దీంతో చేత్తో ల్యాప్‌టాప్ పట్టుకుని చకాచకా వెళ్లిపోయింది. తలుపు తీసి లోపలికి అడుగు పెట్టగానే ఆమె మేనేజర్ సహా తోటి ఉద్యోగులు మరచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 2 వేల మంది ఫారోవర్లను చేరుకోవడాన్ని సెలబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించి ఆనందాన్ని పంచారు.ఈ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు ఐశ్వర్య. "నా కార్పొరేట్ ప్రయాణంలో కొత్త ప్రయత్నాలు చేసేందుకు, ఎదిగేందుకు నిరంతరం ప్రోత్సహించే గొప్ప బాస్ దొరికినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలిని" అంటూ తన అనుభూతిని పంచుకున్నారు.ఎప్పుడూ మా బాస్ అలాంటోడు.. ఇలాంటోడు.. అంటూ బాస్‌ల రాక్షసత్వాల గురించే వినే సోషల్ మీడియాలో ఈ మంచి బాస్ వీడియో వైరల్‌గా మారింది. ‘భలే మంచి బాస్’ అంటూ కామెంట్లు చేశారు నెటిజనులు. View this post on Instagram A post shared by Aiswarya (@dentist_in_corporate_) -
బ్రయాన్ జాన్సన్‌లా భారత్ యువకుడు..! ఏకంగా ఏడువేల..
వృద్ధాప్యఛాయలు కనిపించకుండా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ అనే వ్యాపారవేత్త ఎన్ని కోట్లు ఖర్చుచేస్తున్నాడో తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో చికిత్సలు, అనుక్షణం హెల్త్ ట్రాకింగ్‌లు, చుట్టూ వందలాది డాక్టర్లను మెయింటైన్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. అదీగాక ఇటీవల త్వరలో వృద్ధాప్యాన్ని, చావుని జయిస్తానిని చాలా నమ్మకంగా ప్రకటించేశాడు కూడా. ఇది ఎంత వరకు సాధ్యం అన్న సందేహాలు వెల్లువెత్తున్న తరుణంలో ఒక భారత యువకుడు తాను కూడా బ్రయన్ జాన్సన్‌లా కావాలనుకుంటున్నా అంటూ షాంకింగ్ ప్రకటన చేశాడు. ఆయన బాటలోనే నడుస్తున్నానంటూ..తప వ్యక్తిగత ఆరోగ్య ప్రయోగం గురించి పూసగుచ్చినట్లు వివరించి నోరెళ్లబెట్టేలా చేశాడు. యవ్వనంపై ఇంత వ్యామోహమా అని నెటిజన్లు ఆ యువకుడిని ఏకీపారేస్తున్నారు నెటిజన్లు..ఇంతకీ ఆ యువకుడి ఏవిధంగా తనపై ప్రయోగాలు చేసుకుంటున్నాడంటే..బెంగళూరు సెడోనా హెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకుడు 23 ఏళ్ల పునర్వ్ దినకర్ భారత్ బ్రయన్ జాన్సన్‌గా అవతరించాలని కోరుకుంటున్నా అని సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నాడు. అందులో భాగంగా తన వ్యక్తిగత ఆరోగ్య ప్రయోగాన్నికూడా మొదలు పెట్టేశానని, ప్రతీ అవయవం పనితీరుపై ఫోకస్ పెట్టేలా ట్రాక్ చేస్తున్నట్లు కూడా వెల్లడించాడు. అంతేకాదండోయ్ ఏకంగా ఇప్పటి వరకు ఏడు వేలకు పైగా రక్తపరీక్షలు కూడా చేయించుకున్నాడట. ఆఖరికి నిద్ర, ఒత్తిడిని ట్రాక్ చేసేలా WHOOPని కొనుగోలు చేసాను - నా కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి స్ట్రావా, నా కేలరీలను ట్రాక్ చేయడానికి Amy, ఈ పరీక్షలన్నింటిని ట్రాక్ చేసేలా Sedona వంటివి అన్నింటిని సెటప్ చేశానని చెబుతున్నాడు. పైగా తన ఆరోగ్యానికి సంబంధించి ప్రతి అణవణువు శోధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే ఈ యువకుడి లక్ష్యం బ్రయాన్లా వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం కానే కాదట. ఇతడి ఆశయం అత్యంత భిన్నగా ఉంది. బదులుగా డేటా ఆధారిత ఆప్టిమైజేషన్ ద్వారా జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించడం అనేది అతడి లక్ష్యమట. అలాగే ఇతరులు తన ఆరోగ్యం గురించి తెలసుకునేందుకు మొత్తం డేటాని బహిర్గతం చేసేలా డాక్యుమెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట. తన శరీరంలో కొలిచే, ట్రాక్ చేసే, మెరుగుపరిచే ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేస్తాను కాబట్టి ఇతరులు కూడా సులభంగా తనలా స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా ప్రేరణగా ఉంటుదనేది అతడి అభిప్రాయం. చావుని జయించి దీర్ఘాయువుతో ఉండాలనే దానిపై విపరీతంగా పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో దినకర్ ప్రకటన రావడం విశేషం. కాగా, దీపిందర్ గోయల్(జోమాటో వ్యవస్థాపకుడు) వంటి ప్రముఖ వ్యక్తులు కూడా మెదడు రక్త ప్రవాహాన్ని ట్రాక్ చేయడానికి ధరించగలిగే కంటిన్యూ', 'టెంపుల్' వంటి ప్రాజెక్టులతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే నెటిజన్లు దినకర్ ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ప్రయోగాలకు సిద్ధమవ్వడానికి ప్రశంసించినప్పటికీ..ఇలా నిరంతరం ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తే..చిన్న చిన్ని వాటికి ఆందోళన చెందే పరిస్థితికి దారితీస్తుందనేది వారి వాదన. పైగా దీని కారణంగా ఒత్తిడి బారినపడే ప్రమాదం కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు. అంతేగాదు బ్రో ఎవ్వరూ జీవితాన్నిపూర్తి స్థాయిలో ఆస్వాదించలేరనేది జగమెరిగిన సత్యం అంటూ పోస్టులు పెట్టారు.To everyone reading this, Hi, I'm Punarv.I'm 23 and starting today, I will be the Bryan Johnson of India.- Got a blood test done worth 7k covering all the imp biomarkers- Bought a WHOOP last month to track sleep, strain and recovery- Strava to track my activities, Amy to… pic.twitter.com/h8079K5LHW— punarv (@ycocerious) January 5, 2026 (చదవండి: తండ్రికి చదువు లేదు, తల్లి సూట్లు కుట్టేది....కానీ కూతురు ఐపీఎస్..!) -
భార్య హత్యకు గన్ ఫైరింగ్‌లో శిక్షణ
బెంగళూరు: బసవేశ్వర నగరలో గతనెల 24న చోటు చేసుకున్న బ్యాంక్ మహిళా ఉద్యోగి భువనేశ్వరి హత్య కేసు దర్యాప్తులో కొత్త అంశం వెలుగు చూసింది. భార్యను పిస్తోలుతో కాల్చేందుకు భర్త బాలమురుగన్ బిహార్‌లో 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్నట్లు మాగడిరోడ్డు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. బాలమురుగన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో భువనేశ్వరి తన పిల్లలతో కలిసి వేరే ఇంట్లో నివాసం ఉంటోంది. భార్యను హత్య చేయాలని భావించిన బాలమురుగన్ బిహార్‌కు వెళ్లి అక్కడ ఓ వ్యక్తితో రూ.50 వేలకు పిస్తోల్ కొనుగోలు చేసి 15 రోజుల పాటు అక్కడే మకాం పెట్టి గన్ ఫైరింగ్‌పై శిక్షణ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. గతంలో తమిళనాడుకు చెందిన వ్యక్తికి భార్య హత్యకు రూ.1.25 లక్షలు సుపారీ ఇచ్చాడు. అయితే సుపారీ కిల్లర్ ఆమెను హత్యచేయకుండా వెనక్కి వచ్చేశాడు. దీంతో బాలమురుగన్ గతనెల 24 తేదీన నడిరోడ్డులో భార్యపై పిస్తోల్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. -
‘పచ్చందనమే పచ్చదనమే’.. గార్డెన్ సిటీకి పూర్వ వైభవం
కాంక్రీట్ జంగిల్లో ఉంటున్న ఆ నగరవాసులకు ఇది నిజంగా తీపి కబురే.. దాదాపు ఒకటిన్నర శతాబ్దాల నిరీక్షణ తర్వాత బెంగళూరు తన కిరీటంలో మరో పచ్చని రత్నాన్ని అలంకరించుకోబోతోంది. నగర శివార్లలోని యెలహంక సమీపంలో 153 ఎకరాల విస్తీర్ణంలో భారీ పర్యావరణ ఉద్యానవనాన్ని (Eco-Park) ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కేవలం ఒక పార్కు మాత్రమే కాదు.. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించే ‘పచ్చందనమే పచ్చదనమే’ అనేలా మారబోతోంది.చారిత్రక పునరుజ్జీవనంబెంగళూరు చరిత్రలో 1870లో కబ్బన్ పార్క్, ఆ తర్వాత లాల్బాగ్ (240 ఎకరాలు) ప్రధాన ఆకుపచ్చని ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇంతటి భారీ స్థాయిలో ఒక పర్యావరణ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. మాదప్పనహళ్లిలో నిర్మించబోయే ఈ 153 ఎకరాల పార్క్.. నగరం కోల్పోయిన ‘గార్డెన్ సిటీ’ హోదాను తిరిగి తీసుకురావడంలో కీలక మైలురాయిగా మారనున్నదని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.వారసత్వం- వైవిధ్యంఈ పర్యావరణ ఉద్యానవనం కేవలం చెట్లకు మాత్రమే పరిమితం కాకుండా, సంస్కృతిని, జీవవైవిధ్యాన్ని ప్రతిబింబించేలా మూడు ప్రధాన విభాగాలుగా రూపుదిద్దుకోనుంది.బసవన్న మెడిసినల్ గ్రోవ్: ఇక్కడ ప్రాచీన భారతీయ వైద్య విధానాల్లో ఉపయోగించే అరుదైన మూలికా మొక్కలను పెంచనున్నారు.అంబేద్కర్ బర్డ్ పార్క్: పక్షుల కిలకిలా రావాలతో అలరించే ఈ జోన్, స్థానిక, వలస పక్షులకు సురక్షిత ఆశ్రయంగా మారనుంది.కెంపెగౌడ మినీ జూ: నగర వ్యవస్థాపకులు కెంపెగౌడ పేరు మీద ఏర్పాటు చేయనున్న ఈ జూలో జంతుజాలంపై అవగాహన కల్పించే ప్రదర్శనలు ఉంటాయి.తెలంగాణ ‘హరితహారం’.. ఒక మార్గదర్శిఆకుపచ్చని కవచాన్ని పెంపొందించడంతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ‘హరితహారం’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మొక్కలు నాటడమే కాకుండా, పట్టణ ప్రాంతాల్లో ‘అర్బన్ ఫారెస్ట్ పార్కులను’ అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలను పార్కులుగా మార్చడంతో నగరంలో కాలుష్య స్థాయిలు తగ్గడమే కాకుండా, ప్రజలకు ఆహ్లాదకరమైన వినోద కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి.దేశవ్యాప్తంగా పచ్చని పోరాటంపర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారత్‌లోని వివిధ రాష్ట్రాలు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ‘పైకప్పులపై పచ్చదనం (Rooftop Greening)ను ప్రోత్సహిస్తుండగా, రాజస్థాన్ ప్రభుత్వం క్షీణిస్తున్న ఆరావళి పర్వత శ్రేణులను కాపాడేందుకు ‘ఆరావళి గ్రీన్ వాల్’ ప్రాజెక్టును చేపట్టింది. అలాగే కేరళలో మడ అడవుల సంరక్షణ, తమిళనాడులో పురాతన ఆలయ కోనేరుల పునరుద్ధరణ తదితర చర్యలు పర్యావరణ సమతుల్యతకు ఎంతగానో తోడ్పడుతున్నాయి.గ్రీన్ ఇండియా మిషన్ జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘గ్రీన్ ఇండియా మిషన్’ను 2025లో మరింత పటిష్టం చేసింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా ఐదు మిలియన్ హెక్టార్ల క్షీణించిన భూములను అడవులుగా మార్చడం దీని ప్రధాన ఉద్దేశ్యం. తద్వారా 2.5 నుండి 3 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను (CO2) పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బెంగళూరు ఎకో పార్క్ వంటి ప్రాజెక్టులు ఈ జాతీయ లక్ష్యానికి ఊతమిస్తాయి.ఇది కూడా చదవండి: బుల్లెట్ రైలు స్పీడుకు ఖర్చుల బ్రేక్ -
నా భర్త అశ్లీల వీడియోలు చూస్తూ.. నరకం చూపిస్తున్నాడు..!
బెంగళూరు: భర్త విచిత్ర ప్రవర్తన, లైంగిక వేధింపులతో మనస్తాపం చెందిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు.. భార్యాభర్తలిద్దరూ ఒకే కంపెనీలో సహోద్యోగులు. హెచ్ఆర్గా ఉన్నప్పుడే ఇద్దరికీ పరిచయమై అనంతరం ప్రేమకు దారి తీసింది. యువతి తల్లిదండ్రులను ఒప్పించిన అనంతరం 2025 సెపె్టంబరు 3 తేదీన కుటుంబ సభ్యులు చింతామణిలో మంజునాథ్‌తో వివాహం జరిపించారు.వివాహమైన అనంతరం భర్త సైకోలా ప్రవర్తిస్తుండగా ఫోన్ చూసి లైంగిక ప్రక్రియకు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో వారి ముందు నగ్నంగా తిరుగుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారని మహిళ ఆరోపించింది. ప్రస్తుతం సైకో భర్త వేధింపులకు భార్య హడలిపోయింది. నేను వివాహం చేసుకుంది ఇలాంటి సైకో వ్యక్తినా అని మదనపడుతోంది. వివాహమైన కొద్దిరోజుల పాటు అన్యోన్యంగా ఉన్న భర్త ప్రస్తుతం సైకోలా ప్రవర్తిస్తుండటంతో భార్య బెంబేలెత్తిపోతోంది. అత్తమామల ముందు కూడా నగ్నంగా సంచరిస్తుండటంతో పాటు ప్యాసేజ్లోకి వెళ్లి చుట్టుపక్కల వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. భర్త విచిత్ర ప్రవర్తన, వేధింపులతో పాటు తనను భర్త అసభ్య పదజాలంతో దూషిస్తూ, శారీరకంగా, మానసికంగా హింసించాడని, తనతో పాటు తన తల్లిని కూడా అసభ్యంగా దూషించి దాడికి ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు మద్దతు ఇస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కేంద్ర విభాగం మహిళా స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
BIG Twist: పెళ్లికి ముందే హర్ష అనే యువకుడితో ప్రేమ!
బెంగళూరు: బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా సంచలనం కలిగిస్తున్న నవ వివాహిత గానవి, భర్త సూరజ్ ఆత్మహత్యల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భర్త ఆదరించలేదని, నపుంసకుడని ఆరోపిస్తూ గానవి మెట్టినింటిలో ఆత్మహత్యాయత్నం చేసి రెండురోజుల తరువాత కన్నుమూసింది. ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టడంతో సూరజ్, అతని తల్లి జయంతి, అన్న నాగపూర్‌కు పరారయ్యారు, అక్కడ సూరజ్ శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో రెండు నెలలకే కొత్త జంటకు నూరేళ్లు నిండాయి. హనీమూన్‌లో పోట్లాట అందుకే అయితే గానవి పెళ్లికి ముందు ఓ యువకున్ని ప్రేమించిందని ఆదివారం ప్రచారంలోకి వచ్చింది. ఆమె భర్తతో శ్రీలంకకు హనీమూన్ వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తాను హర్ష అనే యువకున్ని ప్రేమిస్తున్నట్లు భర్తకు చెప్పడమే కారణమని తెలిసింది. అతనినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, తల్లిదండ్రుల ఒత్తిడితో నిన్ను చేసుకున్నట్లు ఆమె చెప్పడంతో సూరజ్ కుంగిపోయాడు. హనీమూన్‌ని రద్దుచేసుకుని తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సూరజ్ మృతికి గానవి తల్లిదండ్రులు కారణమని అతని బావ రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యారణ్యపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గానవి తల్లి రుక్మిణి రాధ, బాబుగౌడ, సతీశ్‌లు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయడం వల్ల సూరజ్ ప్రాణాలు తీసుకున్నాడన్నారు. రెండు కుటుంబాల్లో ఇద్దరు చనిపోవడంతో పాటు, కేసులు పెట్టుకుంటూ బతుకులను బుగ్గి చేసుకుంటున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. -
హనీమూన్‌లో గొడవ?.. నవ జంట బలవన్మరణం
కొత్తగా పెళలైన ఆ జంట.. హనీమూన్‌కు వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో తెలీయదు. తిరిగి రాగానే ఆమె ప్రాణం తీసుకుంది. అది తట్టుకోలేకనో.. కేసు భయం వల్లనో.. అతడు దూరంగా పారిపోయాడు. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పచ్చని పందిళ్లు వేసి మూడు నెలలు తిరగకముందే.. ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఇప్పుడు.. బెంగళూరు: బెంగళూరుకు చెందిన సూరజ్ శివన్న (36), గణవి (26) జీవితం అర్ధాంతరంగా ముగిసింది. గణవి మొదట బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడగా, రెండు రోజుల తర్వాత సూరజ్ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒక హోటల్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.అక్టోబర్ 29వ తేదీన ఈ జంటకు వివాహం జరిగింది. అయితే ఈ మధ్యే హనీమూన్ కోసం శివన్న, గణవి శ్రీలంకకు వెళ్లారు. అక్కడి వెళ్లిన ఆ జంటకు మధ్యలోనే గొడవలు తలెత్తడంతో తిరిగి బెంగళూరుకు వచ్చారు. గణవి తన పుట్టింటికి వెళ్లింది. అత్తింట్లో ఎదురైన అవమానం, తిరస్కారం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైందని ఆమె కుటుంబం ఆరోపిస్తుండగా.. డిసెంబర్ 23న ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చేరింది. రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరికి మృతి చెందింది.గణవి మరణం తర్వాత ఆమె కుటుంబం సూరజ్, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య సూరజ్ తన తల్లి జయంతితో కలిసి బెంగళూరును విడిచి నాగపూర్‌కి వెళ్లాడు. అక్కడ వార్ధా రోడ్‌లోని ఒక హోటల్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. అదే సమయంలో అతని తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ఘటన కొత్తగా పెళ్లైన జంట జీవితం ఎంతటి విషాదాంతానికి దారితీసిందో చూపిస్తోంది. కుటుంబ తగాదాలు, వరకట్న వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు సమాజంలో ఇంకా ఎంతటి ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయో మరోసారి స్పష్టమైంది.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
బనశంకరి: కర్ణాటక, కేరళ మధ్య తాజాగా చిచ్చు రేగింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజరుతో ముస్లింల ఇళ్లను నేలమట్టం చేశారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించడమే కారణం. బెంగళూరు యలహంకలోని కోగిలు లేఅవుట్ వద్ద ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులు నాలుగు రోజుల క్రితం కూల్చివేశారు. ఈ విషయమై విజయన్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బెంగళూరు ఫకీర్ కాలనీ, వసీం లేఅవుట్లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ముస్లింల ఇళ్లను బుల్డోజర్తో ధ్వంసం చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సంఘపరివార్ సర్కారు అనుసరిస్తున్న మైనారిటీ వ్యతిరేక ధోరణి కర్ణాటకలో కూడా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కపట ప్రవృత్తిని సెక్యులర్ ప్రజాస్వామ్య శక్తులు ఏకమై ఎండగట్టాలన్నారు. రాజకీయ జిమ్మిక్కులు వద్దు: డిప్యూటీ సీఎం డీకే కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పినరయి విజయన్ రాజకీయ జిమ్మిక్కులు చేయవద్దని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన స్పందిస్తూ.. ‘‘సీనియర్ నేత పినరయి విజయన్ వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడారు. కొందరు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నివాసం ఉండడంతో మా ఎమ్మెల్యేలు, అధికారులు వాటిని తొలగించామని చెప్పారు. మాకు బెంగళూరు గురించి బాగా తెలుసు.. ఎవరు ఇళ్లు కోల్పోయినా వారికి రాజీవ్‌గాంధీ వసతి గృహమండలి ద్వారా ఇళ్లు కేటాయిస్తాం. మేము బుల్డోజర్ పద్ధతిని ఉపయోగించలేదు’’ అని తెలిపారు. విజయన్ ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడడం సరికాదని, ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలేది లేదని డీకే స్పష్టం చేశారు. -
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
యశవంతపుర (బెంగళూరు): ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో మహిళలు బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలను మొబైల్‌ఫోన్ రికార్డ్ చేయడానికి యత్నించాడో జూనియర్ టెక్నిషియన్. నాగరబావి సెకండ్ స్టేజ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సువెందు మెహతా (23) అనే కామోన్మాదిని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితుడు ఏడాదిగా ఈ ఆస్పత్రిలో టెక్నిషియన్‌గా పని చేస్తూ పీజీ హాస్టల్లో ఉండేవాడు. 20న ఉదయం 8:30 గంటలకు శస్త్రచికిత్స విభాగం గదిలో మహిళా సిబ్బంది బట్టలు మార్చుకొనే దృశ్యాలను రికార్డ్ చేయడానికి రహస్యంగా మొబైల్ఫోన్ని పెట్టాడు. ఫోన్ చూసిన నర్సులు కేకలు వేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి: ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది! -
బులెట్ బైక్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు..
యశవంతపుర: అచ్చం సినిమా స్టైల్లో ఈ ఘటన జరిగింది. కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతున్న కారు.. ముందు వెళుతున్న బులెట్ బైక్‌ను ఢీకొని అర్ధ కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. సుమనహళ్లి వంతెనపై బుధవారం రాత్రి జరిగిన ఘటన వీడియో ఆలస్యంగా వైరల్ అయ్యింది. కారులోని వ్యక్తి ఇస్టానుసారం నడుపుతూ బులెట్ బైకును లాక్కొని వెళ్లాడు. నీ కారుకు బైక్ చిక్కుకుందని పక్కలో వెళ్లతున్న మరో కారు డ్రైవర్ హెచ్చరించినా పట్టించుకోలేదు. బుల్లెట్వాహనదారు రోహిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ రభసకు కారు కింద నిప్పురవ్వుల ఎగజిమ్మాయి, మంటలు వ్యాపించటంతో ఇతర వాహనదారులు భయపడ్డారు. నాయండహళ్లి జంక్షన్ వద్ద కొందరు ఆ కారును అడ్డుకొని పోలీసులకు పట్టించారు. డ్రైవర్ తుమకూరు జిల్లా కుణిగల్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. తాగిన మత్తులో ఉన్నాడని తెలిసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలుదొడ్డబళ్లాపురం: గత నాలుగు రోజుల్లో బెంగళూరులో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు 1,784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసారు. 1,27,938 వాహనాలు తనిఖీ చేయగా మద్యం తాగి నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. नशे में धुत कार ड्राइवर ने बुलेट को मारी टक्कर, 500 मीटर तक घसीटा #BhrashtMahayutiBMC pic.twitter.com/CfJD2pD7NX— HASHTAG BHARAT NEWS (@HTB_tweets) December 26, 2025 -
ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!
ఆఫీస్ అయ్యాక మెట్రో రైలులో ఆ యువతి తాను ఉంటున్న ప్లేస్‌కు బయల్దేరింది. రద్దీలో ఎలాగోలా సీటు సంపాదించుకుని ఇద్దరు మగాళ్ల మధ్య కూర్చోగలిగింది. ఈలోపు.. తన పక్కన కూర్చన్న వ్యక్తి దిగిపోయి.. మరొకతను ఎక్కాడు. నెమ్మదిగా అతనిలోని కామోన్మాది బయటపడ్డాడు. ఒక్క నిమిషం ఆమెకు గుండె ఆగినంత పనైంది. అయితే ఆ వెంటనే ధైర్యం తెచ్చుకున్న యువతి ఆ మృగాడి చెంపలు చెడామడా వాయించింది.డిసెంబర్ 23 సాయంత్రం నమ్మా మెట్రో(బెంగళూరు) ప్రయాణిస్తున్న ఒక యువతి, తనకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘నా ప్రయాణం అప్పటిదాకా సాఫీగా సాగింది. మధ్యలో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దిగిపోవడంతో, మరో వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడు. నా మీద పడడం, శరీర భాగాలకు తాకడంతో ఇబ్బంది పడ్డా. అయితే రద్దీ కాబట్టి యాదృచ్ఛికమని భావించా. ఈలోపు.. అతని తీరు మారింది. కావాలనే చేస్తున్నాడని అర్థమైంది. ఇదేమిటన్నట్లు చూస్తే వెకిలినవ్వులు నవ్వాడు. ఇంతలో.. నేను దిగాల్సిన స్టేజ్ వచ్చింది. అతను మరికొందరిని కూడా ఇలాగే వేధించే అవకాశం ఉందని భావించా. అతని చెంప పగలకొట్టి లేవమన్నా. స్టేషన్ బయటకు వచ్చాక మరోసారి చెంప పగలకొట్టా. కెంపగౌడ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ సిబ్బంది అది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు సర్దుకుపోవాల్సిన అవసరం ఏ అమ్మాయికీ లేదు’’ అంటూ ఆమె వీడియో ఉంచింది. ఈ ఘటనపై ఆ యువతి ఉప్పారపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అతని పేరు ముత్తప్ప (48) అని తెలిసింది. తర్వాత తప్పయిపోయిందంటూ అతడు యువతి పాదాలపై పడి క్షమాపణలు చెప్పాడు. యువతి అంగీకరించడంతో అతనిని మందలించి పంపించివేశారు. లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్న యువతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. Namma Metro Harassment Case | ನಮ್ಮ ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಕಾಮುಕ ಅಂಕಲ್ ಕಾಟ | Bengaluru....#NammaMetro #MetroHarassment #BengaluruNews #WomenSafety #MajesticMetro #PublicSafety #HarassmentCase #bengaluru pic.twitter.com/YaNsNgACW4— Sanjevani News (@sanjevaniNews) December 26, 2025 -
నవ్య– మానస చావులోనూ స్నేహబంధం
సాక్షి, బళ్లారి: బెంగళూరు నుంచి గోకర్ణకు బయలుదేరిన ప్రైవేటు సీబర్డ్ స్లీపర్ కోచ్ ట్రావెల్స్ బస్సును– కంటైనర్ లారీ ఢీ కొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులోని నలుగురు యువతులు, ఓ బాలిక, లారీ డ్రైవర్ కలిసి ఆరు మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకాలో 48వ హైవేలో జరిగిన ఘోర దుర్ఘటన ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. సుమారు 25 మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ రఫీ మృతి బస్సు డ్రైవర్ మహమ్మద్ రఫీ హుబ్లీ కేఎంసీఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ప్రమాదం జరగగానే కిటికీలో నుంచి రఫీ దూకేశాడు. ఆ సమయంలో కాళ్లు చేతులకు గాయాలు తగిలాయి, కానీ కోలుకోలేకపోయాడు. దీంతో మృతుల సంఖ్య 7కు పెరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గాయపడినవారు ఇప్పటికీ ఆ ఘోరాన్ని తలచుకుని వణికిపోతున్నారు. బయటపడ్డ బండారి యశవంతపుర: కార్వార కుమటాకు చెందిన విజయ్ బండారి అనే యువకుడు ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. ఆ తొందరలో మొబైల్‌ఫోన్, లగేజీని బస్సులోనే వదిలేయడంతో బూడిదయ్యాయి. కుటుంబసభ్యులను సంప్రదించడం వీలు కాకపోయిందని చెప్పాడు. చివరికి ఎలాగో వారికి క్షేమ సమాచారం పంపించాడు.నవ్య– మానస చావులోనూ స్నేహబంధంఅందరి మృతదేహాలు హుబ్లీ కిమ్స్ ఆస్పత్రిలో ఉండడంతో కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరారు. నవ్య కుటుంబ సభ్యుల వేదనను ఆపడం ఎవరితరమూ కాలేదు. మృతులు నవ్య, మానస ఒకటవ తరగతి నుంచి స్నేహితులని, ఎంటెక్ వరకు ఒకే కాలేజీలో చదువుకొని బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. హాసన్ జిల్లా చెన్నరాయపట్టణవాసి మానస, మండ్య జిల్లా కేఆర్ పేట తాలూకావాసి నవ్య. నిజానికి ఒకే రోజు తమ తమ పెళ్లిళ్లు జరగాలని కూడా అనుకున్నారు. మృత్యువులోనూ కలిసే వెళ్లారని బంధువులు తెలిపారు. ఎవరి మృతదేహం ఎవరిదో తెలియనంతగా కాలిపోవడంతో మృతుల బంధువుల నుంచి, శవాల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఆ నివేదికలను బట్టి మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నివేదికలు వస్తాయని చెప్పారు.కళ్ల ముందే స్నేహితురాలు..బనశంకరి: బస్సు ప్రమాదంలో గాయపడిన టెక్కీ గగనశ్రీ బెంగళూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో శుక్రవారం ఆ ఘోర దుర్ఘటన గురించి వివరించింది. బస్‌లో పైన సీటులో నిద్రపోయిన నేను, ప్రమాదం జరిగిన వెంటనే రక్షితతో కలిసి బయటకు దూకాము. రశ్మి కూడా దూకేలోపు ఆమె మంటల్లో చిక్కుకుందని తెలిపింది. గోకర్ణ కు వెళ్లి రశ్మి ఇంటికి వెళ్లాల్సి ఉంది, బస్లోపల ఉన్న లగేజీ బ్యాగుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి, రశ్మి బయటకు రావడానికి దేవుడు సమయం ఇవ్వలేదు అని ఆమె ఆవేదన చెందింది. మృతురాలు రశ్మి మురుడేశ్వరవాసి. ఈ ముగ్గురు ప్రమాదానికి ముందు తీసుకున్న ఫోటో వైరల్ కావడం తెలిసిందే. ప్రి వెడ్డింగ్ పారీ్టపై నిప్పులు బాధితుల్లో 7 మంది బృందం బెంగళూరు మావళ్లి, బిన్నిమిల్స్వాసులు. మంజునాథ్– కాబోయే భార్య కవిత, స్నేహితులు దిలీప్, సంధ్య, శశాంక్, బిందు–ఆమె కూతురు గ్రేయ. వీరందరూ బెంగళూరులో టెక్కీలుగా పనిచేస్తారు. మంజునాథ్– కవితకు ఫిబ్రవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో స్నేహితులకు గోకర్ణలో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వాలనుకుని అందరూ ఈ బస్సులో ఎక్కారు. మంజునాథ్‌కు తీవ్ర కాలినగాయాలు కాగా, బెంగళూరు విక్టోరియాలో చికిత్స పొందుతున్నాడు. ఇక దిలీప్‌కు బిందు సొంత సోదరి అవుతుంది. ఇలా ఒకరికొకరికి బంధుత్వాలు కూడా ఉన్నాయి. బిందు, ఆమె కూతురు ప్రమాదంలో చనిపోయారు. -
‘కొత్త ఏడాదిలో భారత్‌ను వదిలి వెళ్తున్నా!’
భారతదేశంలో వ్యాపారవేత్తలు, ముఖ్యంగా నిజాయితీగా పన్నులు చెల్లించేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరోసారి చర్చ మొదలైంది. దేశంలోని పన్ను నిబంధనలు పన్ను చెల్లింపుదారులపై అనుమానం పెంచేలా ఉన్నాయని, దీనివల్ల వ్యాపారం చేయడం భారంగా మారుతోందని బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త, అఫ్లాగ్ గ్రూప్ భాగస్వామి రోహిత్ ష్రాఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన లింక్డ్ఇన్లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. 2026 నాటికి తాను భారతదేశాన్ని విడిచిపెట్టి, విదేశాల్లో తన వ్యాపారాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.రూ.4 కోట్ల పన్ను చెల్లించినా దక్కని గుర్తింపురోహిత్ ష్రాఫ్ తన పోస్ట్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం.. దేశానికి అత్యధికంగా సహకరించే పన్ను చెల్లింపుదారులను వ్యవస్థ డిఫాల్ట్‌గా అనుమానంతో చూస్తోందని ఆయన మండిపడ్డారు. తాను జీఎస్టీ, ఆదాయపు పన్ను రూపంలో సుమారు రూ.4 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. ‘దేశంలో కేవలం 4-5% మందే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. నోటీసులు పంపాలన్నా, పరిశీలన (Scrutiny) చేయాలన్నా అధికారులు కొద్ది మందినే లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని ఆయన ఆరోపించారు. జీఎస్టీ బృందాలు, ఆదాయపు పన్ను అధికారుల తనిఖీలు నిరంతరం కొనసాగుతుంటాయని, పన్ను నిబంధనలు పాటించే వ్యాపారాలకు ఎటువంటి గుర్తింపు లేదా ప్రోత్సాహకాలు లభించడం లేదని ఆయన విమర్శించారు.భారతీయులు విదేశాలకు వెళ్లడంపై స్పందిస్తూ, ‘ఇండియన్స్‌కు సామర్థ్యం తక్కువ కాదు. యూఏఈ, యూఎస్ వంటి దేశాల్లో వారు పెద్ద వ్యాపారాలను నడుపుతున్నారు. వారు దేశాన్ని ద్వేషించి వెళ్లడం లేదు, కానీ ఇక్కడి వ్యవస్థ వృద్ధికి ప్రతిఫలాన్ని ఇవ్వదు. పైగా జరిమానా విధిస్తుంది. ఒక దశలో నినాదాల కంటే స్వీయ సంరక్షణ ముఖ్యం. ఇది దేశభక్తికి సంబంధించిన విషయం కాదు, వాస్తవికత. ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపార సులభతర నిర్వహణ) లోపించింది. అందుకే 2026లో ఇండియా వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని ష్రాఫ్ వ్యాఖ్యానించారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలురోహిత్ ష్రాఫ్ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘సిస్టమ్ మిమ్మల్ని ప్రోత్సహించడం కంటే ప్రాసిక్యూట్ చేయడానికే ఎక్కువ ప్రయత్నిస్తుంది’ అని ఒక వినియోగదారుడు తెలిపారు. ‘నేను 9 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాను, పక్కాగా నిబంధనలు పాటిస్తే ఒక్క నోటీసు కూడా రాదు. మీ వ్యక్తిగత నిర్ణయానికి దేశాన్ని నిందించకండి’ అని కొందరు ష్రాఫ్ వాదనను కొట్టిపారేశారు.ఇదీ చదవండి: 2025.. ఏఐ ఇయర్ -
ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!
ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని గంటల తరబడి వేచి చూసే రోజులకు కాలం చెల్లనుందా.. అంటే అవుననే చెప్పాలి. గాల్లో ప్రయాణించే పక్షిలా.. నగరంలోని గగనతలంలో విహరిస్తూ గమ్యాన్ని నిమిషాల్లో చేరుకునే ఎయిర్ టాక్సీ కల సాకారం కాబోతోంది. బెంగళూరుకు చెందిన ‘సరళా ఏవియేషన్’ తమ అధునాతన ఎయిర్‌క్రాఫ్ట్‌తో భారత విమానయాన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘సరళా ఏవియేషన్’ (Sarala Aviation) అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమానం SYL-X1 హాఫ్-స్కేల్ ప్రోటోటైప్ గ్రౌండ్ టెస్టింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. నగరంలోని కంపెనీ టెస్ట్ ఫెసిలిటీలో జరిగిన ఈ పరీక్షలు దేశీయ ఎయిర్ టాక్సీ ప్రయాణాన్ని నిజం చేసే దిశగా నిలిచాయి.ఈ విమానం ప్రత్యేకతలు7.5 మీటర్ల భారీ రెక్కల విస్తీర్ణంతో రూపొందిన SYL-X1 ప్రస్తుతం భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన అతిపెద్ద, అధునాతన eVTOL విమానంగా గుర్తింపు పొందింది. కేవలం 9 నెలల కాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేశారు. సాధారణ మోడల్స్ లాగా కాకుండా ఈ విమానాన్ని మొదటి నుంచే వాణిజ్య ధ్రువీకరణ (Certification) పొందేలా డిజైన్ చేశారు. ఇది భవిష్యత్తులో రాబోయే 15 మీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగిన పూర్తిస్థాయి విమానానికి పునాదిగా నిలుస్తుంది.‘ఈ విభాగంలో కేవలం మొదటి స్థానంలో ఉండటం కాదు, ఏవియేషన్ రంగంలో ఒక దిగ్గజంగా ఎదగడమే మా లక్ష్యం’ అని సరళా ఏవియేషన్ సహ వ్యవస్థాపకులు, సీటీఓ రాకేష్ గావ్కర్ పేర్కొన్నారు. కంపెనీ తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తయారు చేసిన ఆరు సీట్ల ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీతో ఎంతో మేలు జరుగుతుందని సంస్థ పేర్కొంది. ఇది బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె వంటి మెట్రో నగరాల్లో గంటల తరబడి ఉండే ట్రాఫిక్ ప్రయాణ సమయాన్ని నిమిషాల్లోకి తగ్గించనుందని చెప్పింది.నిధుల సేకరణఇప్పటికే ఈ సంస్థ తన కార్యకలాపాల కోసం సుమారు 13 మిలియన్ డాలర్ల (సుమారు రూ.108 కోట్లు) నిధులను సేకరించింది. దీనికి అదనంగా, భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో జాతీయ ప్రదర్శన కోసం ఒక పూర్తిస్థాయి స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా సిద్ధం చేసింది. 2024లోనే, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL)తో సరళా ఏవియేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు తక్కువ సమయంలో ప్రయాణించేలా eVTOL సేవలను ప్రారంభించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని తెలిపింది.తదుపరి దశ ఏమిటి?గ్రౌండ్ టెస్టింగ్ విజయవంతం కావడంతో కంపెనీ ఇప్పుడు తన ఎయిర్ టాక్సీ ప్రోగ్రామ్‌లో అతి ముఖ్యమైన ధ్రువీకరణ (Validation) దశలోకి ప్రవేశించింది. త్వరలోనే ఈ హాఫ్-స్కేల్ విమానం గాలిలోకి ఎగిరే అవకాశం ఉంది. ఇది విజయవంతమైతే భారత్ సొంత ఎయిర్ టాక్సీలను కలిగిన దేశాల జాబితాలో చేరుతుంది.ఇదీ చదవండి: ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే! -
శతక్కొట్టిన విరాట్ కోహ్లి
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఈ కుడిచేతి వాటం ఆటగాడు వరుస శతకాలతో అలరించిన విషయం తెలిసిందే. ప్రొటిస్ జట్టుతో తొలి రెండు వన్డేల్లో సెంచరీలు చేసిన విరాట్.. మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (45 బంతుల్లో 65) సాధించాడు.ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి (Virat Kohli)... వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు.298 పరుగులుఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్రతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రిక్కీ భుయ్ (122) సెంచరీ చేయగా.. షేక్ రషీద్ 31, కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి 23, హేమంత్ రెడ్డి 27, సింగుపురం ప్రసాద్ 28 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆంధ్ర ఎనిమిది వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.శతక్కొట్టిన విరాట్ కోహ్లిఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అర్పిత్ రాణా డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య అర్ధ శతకం (74) బాదగా.. అతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లి సెంచరీ చేశాడు. కేవలం 83 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు.మొత్తంగా 101 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 131 పరుగులు చేశాడు. రాజు బౌలింగ్‌లో షేక్ రషీద్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.చదవండి: తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర -
చిన్నస్వామిలో మ్యాచ్‌లపై సమీక్ష
బెంగళూరు: ఇటీవల ప్రాణాంతకమైన తొక్కిసలాట జరిగిన బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే విషయం పరిశీలనకు కమిటీని నియమించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. సోమవారం విధానసౌధలో క్రికెట్ సంఘం అధికారులు, పోలీసు అధికారులతో ఆయన భేటీ జరిపారు. 24న విజయ్ హజారె టోర్నీ జరపడానికి క్రికెట్ సంఘం అనుమతి కోరిందన్నారు. జీబీఏ కమిషనర్ నేతృత్వంలో పలు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామని, స్టేడియాన్ని పరిశీలించి మార్పులు చేర్పుల గురించి ప్రభుత్వానికి నివేదికను ఇస్తుందని, దానిని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇదోరకం ప్రేమ!
అది అక్టోబర్ 30, 2024. బెంగళూరులోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్లో 45 ఏళ్ల ఇన్స్పెక్టర్, తన దైనందిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. హఠాత్తుగా.. ఆయన అధికారిక ఫోన్‌కి ఒక అపరిచిత నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత.. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లు వెల్లువెత్తాయి. అవతలి నుంచి మాట్లాడుతున్న మహిళ మాటలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయి. మొదట్లో ఇన్స్పెక్టర్ దాన్ని ఏదో సాధారణ ఫిర్యాదు అనుకున్నారు. కానీ, అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది!ప్రేమించకపోతే ఉద్యోగం తీయిస్తా.. ఆ మహిళ పదేపదే ఫోన్ చేసింది. తనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి వంటి అత్యున్నత రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పడం మొదలుపెట్టింది. వాట్సాప్‌లో ఆ ప్రముఖులతో తాను ఉన్న ఫొటోలను పంపింది. ఆమెది ఫిర్యాదు కాదని, ప్రేమ ప్రతిపాదన అని ఇన్స్పెక్టర్కు అర్థమైంది. ‘నా ప్రేమను అంగీకరించండి. లేదంటే, నా పలుకుబడిని ఉపయోగించి మీ ఉద్యోగాన్ని, కెరీర్‌ను నాశనం చేస్తాను’.. అంటూ బెదిరింపులకు దిగింది. నిందితురాలి అధికారం, పలుకుబడి ఇన్స్పెక్టర్ను మానసిక ఆందోళనకు గురిచేసింది.రక్తంతో లేఖ అధికారిక విధులకు ఆటంకం కలుగుతుండడంతో, ఇన్స్పెక్టర్ ఆమెను పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వమని పదేపదే సూచించారు. కానీ, ఆమె స్టేషన్‌కు రాలేదు.. వేధింపులు కూడా ఆపలేదు. నవంబర్ 7వ తేదీన ఆమె వేధింపులు పతాక స్థాయికి చేరాయి. ఆ మహిళ ఏకంగా ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వచ్చింది. అతనికి ఒక కవరును అందజేసింది. ఆ కవరులో కొన్ని మాత్రలు, చేతితో రాసిన లేఖలు ఉన్నాయి. అత్యంత భావోద్వేగపూరితంగా ఉన్న ఆ లేఖలు తన రక్తంతో రాసినవని ఆమె స్పష్టం చేసింది. ఇది ఆమె తీవ్రమైన మానసిక సమస్యకు నిదర్శనం. ఇన్స్పెక్టర్ అధికారిక డ్యూటీ నంబర్‌కు అనవసర కాల్స్, మెసేజ్‌లు పంపిస్తూ.. ఆయన రోజువారీ పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తూనే ఉంది. పోలీసుల విచారణలో, ఈ మహిళ గతంలో కూడా ఇతర పోలీసులు, ప్రభుత్వ అధికారుల్ని ఇలాగే వేధించినట్లు వెల్లడైంది.ఆత్మహత్య చేసుకుంటా.. డిసెంబర్ 12న, ఇన్స్పెక్టర్పై వేధింపుల పర్వం తారస్థాయికి చేరింది. ఆ మహిళ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, అందరూ చూస్తుండగానే అరిచింది. ‘నా ప్రేమ ప్రతిపాదనను అంగీకరించకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. నీ ఉద్యోగాన్ని, కెరీర్‌ను నాశనం చేస్తాను’.. అని బెదిరించింది. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో, రామమూర్తి నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదు ఆధారంగా, ఆ మహిళపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 132 (ప్రభుత్వ ఉద్యోగిని విధులకు ఆటంకం కలిగించడం), 351(2) (క్రిమినల్ బెదిరింపు), 221 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విచిత్ర కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒక పోలీసు అధికారికి తన విధి నిర్వహణలో ఎదురైన ఈ ‘ప్రేమ ఉచ్చు’రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రాణం మీదకొచ్చిన పార్టీ
బెంగళూరు: స్నేహితులతో కలిసి హోటల్లో పార్టీ చేసుకుంటున్న సమయంలో పోలీసులు రావడంతో భయపడి ఓ యువతి పరుగులు తీసే క్రమంలో పై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటన బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. వైష్ణవి (21), 8 మంది స్నేహితులతో ఏఇసీఎస్ లేఔట్‌లోని ఓ హోటల్లో 3వ అంతస్తులో పార్టీ పెట్టుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి గట్టిగా మ్యూజిక్ వేసుకుని కేకలు వేస్తూ డ్యాన్స్ చేస్తుండటంతో చుట్టుపక్కల ఇళ్లవారు 112 కు ఫోన్‌చేశారు. స్థానిక పోలీసులు వచ్చి పార్టీ జరుగుతున్న పై అంతస్తుకు వెళ్లారు. దీంతో అందరూ తలోదిక్కుకు పరుగులు తీశారు. వైష్ణవి భయపడి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పై అంతస్తు నుంచి పైపును పట్టుకుని కిందికి దిగడానికి ప్రయత్నిస్తుండగా జారి కింద ఇనుప గ్రిల్స్ మీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో మృత్యువు అంచుల్లో ఉంది. లంచం అడిగారు హోటల్ వద్దకు వచ్చిన పోలీసులు కేసు కాకూడదంటే డబ్బులు ఇవ్వాలని అడిగారు, మేము ఫోన్ పే చేస్తామని చెప్పగా, వద్దు క్యాష్ కావాలన్నారు అని పారీ్టలో పాల్గొన్నవారు ఆరోపించారు. దీనిపై డీసీపీ విచారణ చేపట్టారు. హోటల్, పోలీసు సిబ్బందిపై యువతి తండ్రి ఆంథోనీరాజ్ హెచ్ఏల్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. -
రన్నింగ్ ట్రాక్ కాదది.. రూ.449 కోట్ల ఫ్లైఓవర్!
బెంగళూరు: బెంగళూరు నగరంలో రూ. 449 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కాస్తా రన్నింగ్ ట్రాక్‌గా మారిపోయింది. నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్, ఎలక్ట్రానిక్స్ సిటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రూ. 449 కోట్ల భారీ వ్యయంతో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. దాదాపు ఐదు కి.మీ పొడవున్న ఈ ఫ్లైఓవర్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా పేరొందింది.ఈ ఫ్లైఓవర్ మొదటి దశ (రాగిగుడ్డ నుండి హెచ్ఆర్ఎస్ లేఅవుట్‌కు) పనులు 2024 జూలై నాటికి పూర్తయ్యాయి. దీంతో సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద రద్దీ కొంత మేరకు తగ్గింది. అయితే రెండవ దశ (హెచ్ఎస్ఆర్ నుండి రాగిగుడ్డ వైపు) నిర్మాణం పూర్తైనట్లు కనిపిస్తున్నా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.ఈ జాప్యానికి భారీ ట్రాఫిక్ రద్దీ, పని గంటలపై విధించిన ఆంక్షలే కారణమని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)అధికారులు చెబుతున్నారు. కాగా ప్రారంభానికి నోచుకోని ఈ ఫ్లైఓవర్‌ను స్థానికులు తమ మార్నింగ్ జాగింగ్, వాకింగ్‌లకు ట్రాక్‌గా ఉపయోగిస్తున్నారు.స్థానికుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ‘ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి దాదాపు సిద్ధమైంది. అయితే యాక్సెస్ ర్యాంప్ ఇంకా సిద్ధం కాలేదు. అందుకే మేము కట్టే రోడ్డు టాక్స్‌ను సద్వినియోగం చేసుకునేందుకు దీనిపై రన్నింగ్ చేస్తున్నామన్నారు. అధికారికంగా వాహన రాకపోకలకు తెరుచుకోని ఈ ఫ్లైఓవర్ నగరంలో తాత్కాలిక వాహన రహిత రన్నింగ్ ట్రాక్‌గా మారిపోయింది. కాగా బీఎంఆర్సీఎల్ అధికారులు మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలోని మిగిలిన 10శాతం పనులు త్వరలోనే పూర్తిచేసి, 2026 జనవరి చివరి నాటికి అందుబాటులోకి తెస్తామంటున్నారు.ఇది కూడా చదవండి: కొద్ది రోజుల్లో ప్రళయం.. ఘనా ప్రవక్త జోస్యం! -
చిలుక తెచ్చిన తంటా
కర్ణాటక: చిలుకను రక్షించబోయి యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన సంఘటన బెంగళూరు గిరినగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. అరుణ్‌కుమార్(32) అనే వ్యక్తి ఫారిన్ నుంచి రూ.2 లక్షల విలువైన చిలుకను కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. అది ఎగిరి వెళ్లి అపార్ట్మెంట్ లోపలి నుంచి వేయబడ్డ హైటెన్షన్ విద్యుత్ తంతిపై వాలింది. అరుణ్‌కుమార్ స్టీల్ పైప్‌కి కర్ర కట్టి అపార్ట్మెంట్ కాంపౌండ్ గోడ ఎక్కి చిలుకను రక్షిస్తుండగా విద్యుత్ షాక్‌కి గురై మృతిచెందాడు. గిరినగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య
బెంగళూరు ఐటీ ఉద్యోగి అకాల మరణం ఆందోళన రేపింది. నల్లురహళ్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మురళి గోవిందరాజు గురువారం ఆత్మహత్య చేసుకున్నడు. అయితే ఒక స్థలం కొనుగోలు విషయంలో లంచాలకు ఆశపడిన అధికారులు వేధింపుల కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.మురళి గోవిందరాజుకు భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ఠ, దేశిత ఉన్నారు. 2018లో నల్లురహళ్లిలో ఒక బంధువు నుండి ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. అక్టోబర్ 25న, ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు మురళిని పలుసార్లు (సుమారు 10 నుంచి 15 సార్లు) ఇంటికొచ్చి మరీ రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి మృతుడు నిరాకరించడంతో వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. వారు కొంతమంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులతో కుమ్మక్కయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదేపదే సందర్శించి, తమ కుమారుడిని మానసికంగా వేధించి, బెదిరించారని కుటుంబం ఆరోపించింది. నిరంతర వేధింపులతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదులో తల్లి పేర్కొంది. సంఘటన జరిగిన రోజు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటలకు నిర్మాణంలో ఉన్న భవనానికి వెళ్లాడని తెలుస్తోంది. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ కోసం ఉద్దేశించిన ఇనుప హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పని కోసం వచ్చిన వడ్రంగి గణేష్ మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.ఉష, శశిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మురళి తల్లి కోరింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా! -
‘బ్రేక్‌ఫాస్ట్ రారాజు’.. ఇంటర్నెట్లో ఆసక్తికర యుద్ధం
ఆహారం.. కేవలం ఆకలిని తీర్చుకునే పదార్థమే కాదు.. జీవితం, సంస్కృతి,చరిత్రల ప్రతిబింబం. ప్రపంచంలోని ప్రతి మూలనా ఆహారం ఒక భాషగా పరిణమించింది. తరతరాలుగా అందిన ఆహార కథలు సంప్రదాయాలను తెలియజేస్తాయి. పండుగలలో కుటుంబంతో పాటు పంచుకునే విస్తృతమైన విందుల నుండి, రోడ్ల పక్కన దొరికే అల్పాహారం వరకు.. మనం తినే ప్రతి వంటకం ఆ ప్రదేశపు గుర్తింపును,చరిత్రను తెలియజేస్తుంది. ఇప్పుడు భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లను అధిగమిస్తూ బెంగళూరు ‘ఉత్తమ ఆహార నగరం’గా నిలిచింది. నెట్టింట మరో యుద్ధానికి దారి తీసింది.స్కాటిష్ కంటెంట్ సృష్టికర్త హ్యూ ఆన్లైన్లో ‘హ్యూ అబ్రాడ్’గా పేరొందారు. తన ఆహార రుచుల పరిశోధన తరువాత ఆయన బెంగళూరుకు పట్టంకట్టారు. బెంగళూరులో లభ్యమయ్యే అల్పాహారాలలో ముఖ్యంగా ఇడ్లీ, దోసె, ఫిల్టర్ కాఫీల క్లాసిక్ కలయిక, తన హృదయాన్ని దోచుకుందని హ్యూ ఆనందంగా తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో హ్యూ భారతదేశంలోని ఏడు ప్రధాన నగరాల మీదుగా వారాల తరబడి ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, కొచ్చిలతో పాటు బెంగళూరులను సందర్శించారు. అల్టిమేట్ ఫుడ్ సిటీ?భారతదేశ పర్యటన ముగించుకున్న ఆయన పాకిస్తాన్‌కు కూడా వెళ్లారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఈ రెండు దేశాల ఆహారాన్ని పోల్చుతూ నిర్వహించిన ప్రశ్నోత్తరాల సెషన్లో, ఒక అభిమాని భారతదేశంలో ‘అల్టిమేట్ ఫుడ్ సిటీ’ ఏదని అడిగారు. దీనికి సమాధానంగా హ్యూ.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆహార పర్యాటక ప్రాంతాలను పక్కన పెట్టి, బెంగళూరు పేరును వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బెంగళూరులో లభ్యమైన అల్పాహారానికి ఫిదా అయిన ఆయన అల్టిమేట్ ఫుడ్ సిటీ కిరీటం బెంగళూరుకే దక్కుతుందన్నారు. అక్కడ తాను తాగిన ఫిల్టర్ కాఫీ, తిన్న దోసెలు, ఇడ్లీలు మరో ప్రపంచాన్ని చూపించాయని ఆయన అన్నారు. తన ఈ ప్రయాణంలో బెంగళూరులోనే తాను ఆహారాన్ని అమితంగా ఆస్వాదించానని స్పష్టం చేశారు.గుర్తుకొస్తే చాలు..దోసె వేసే తీరును, రుచిని ఆయన వర్ణిస్తూ ‘దోసెలు.. గ్లాస్ మాదిరిగా పారదర్శకంగా క్రిస్పీగా ఉంటాయి’ అని వివరించారు. అదేవిధంగా ఇడ్లీలు నోటిలో పెట్టుకోగానే కరిగిపోతాయని అభివర్ణించారు. ఆ వంటకాల గురించి ఆలోచిస్తుంటే మళ్లీ ఆకలిని పెరుగుతున్నదన్నారు. హ్యూ ఆహార తీర్పు వెలువడిన వెంటనే ఆన్లైన్లో అది చర్చకు దారితీసింది. బెంగళూరులో నివసించే కొందరు ఉత్తర భారతీయులతో సహా పలువరు ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు అల్పాహారం విషయంలో బెంగళూరు టాప్‌లో ఉంటుందని అంగీకరించారు. ఉత్తర భారతీయులు గరంగరంఒక యూజర్ తాను బెంగళూరులో నివసిస్తున్న ఉత్తర భారతీయుడినని.. దోసె, ఇడ్లీలు ఉత్తమ అల్పాహారం అని నేను అంగీకరిస్తున్నానని రాశారు. మరికొందరు ఈ వ్లాగర్ అందించిన తీర్పు కేవలం అల్పాహారం వరకే పరిమితమని రాశారు. ఆహార ప్రియులైన మరికొందరు హ్యూను భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఆహార కేంద్రాలను సందర్శంచాలని కోరారు. మరొక యూజర్ మీరు దేశవ్యాప్తంగా ఇతర ఆహారాలను కూడా ప్రయత్నించాలని, అల్పాహారం ఆధారంగా ఇలా చెప్పడం తప్పని హ్యూకు సూచించారు. మరొకరు.. పంజాబ్, యూపీలను మినహాయించి ఈ వ్యక్తి ఆహారంపై వీడియో చేశాడని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.హైదరాబాద్, ఢిల్లీ..మరో వినియోగదారు ఉత్తమ ఆహార నగరాలుగా లక్నో, హైదరాబాద్‌లను పేర్కొన్నారు. పాకిస్తాన్ విషయానికొస్తే హ్యూ అక్కడి కరాచీని తనకు ఇష్టమైన ఆహార నగరంగా ఎంచుకున్నారు. భారతదేశంలో బెంగళూరుకు కిరీటాన్ని పెట్టిన ఆయన ఢిల్లీని కూడా ప్రశంసించారు. అక్కడ లభ్యమైన జిలేబీ, రబ్డీని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ అంతిమంగా ఇడ్లీ, దోసె, ఫిల్టర్ కాఫీల కలయికతో బెంగళూరు అత్యుత్తమ ఆహార అనుభూతిని అందించిన నగరంగా నిలిచిందని హ్యూ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: Pakistan: అప్పు కోసం విమానయాన సంస్థ బేరం -
రూ.29 కోట్ల డ్రగ్స్ పట్టివేత
బెంగళూరు(బనశంకరి): బెంగళూరులో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.29 కోట్ల విలువ చేసే 10.36 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్, 8 కేజీల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చామరాజపేటేలోని పోస్టాఫీస్‌లో డ్రగ్స్ పార్శిల్స్ వచ్చినట్లు తెలిసి పోలీసులు సోదాలు చేయగా 8 కిలోల హైడ్రో గంజాయి లభించింది. మరోఘటన.. బెంగళూరు విమానాశ్రయంలో ఓ ప్రయాణికుని నుంచి కోట్ల రూపాయల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా.. ప్రొద్దుటూరువాసి మృతి
సాక్షి, కడప: కడప నుండి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. ఆంధ్ర- కర్ణాటక బార్డర్‌లోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోట సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి, 10మందికి పైగా గాయాలు పాలైనట్టు సమాచారం. మంగళవారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనిత (58)గా గుర్తింపు. గాయపడిన వారిలో కడప, రాయచోటి, బెంగళూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు తెలుస్తోంది.ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. ప్రమాద ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
IND vs AFG ODIs: ఫైనల్ వర్షార్పణం.. విజేత ఎవరంటే?
బెంగళూరు: అండర్–19 ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ వర్షం కారణంగా రద్దు అయింది. దిత్వా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను 31 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసిన దశలో వెలుతురులేమి, వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత ఎంతసేపు ఎదురుచూసినా ఆట తిరిగి ప్రారంభించే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కెప్టెన్ విఫలంభారత బ్యాటర్లలో కనిష్క్ చౌహాన్ (28 నాటౌట్), అభిజ్ఞ కుందు (27) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ విహాన్ మల్హోత్రా (10), వన్ష్ ఆచార్య (2), వఫీ (2), వినీత్ (0) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్ అజీజ్ 2 వికెట్లు పడగొట్టాడు.ఈ టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్‌తో పాటు భారత్ ‘బి’ జట్టు కూడా పాల్గొంది. లీగ్ దశలో అఫ్గానిస్తాన్ 4 మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడి 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... భారత ‘ఎ’ జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలతో 8 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత ‘బి’ జట్టు 4 మ్యాచ్‌ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో చివరి స్థానంలో నిలిచింది. చదవండి: సూర్యవంశీ మరోసారి ఫెయిల్.. మాత్రే వరుస సెంచరీలు -
బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత సంయుక్త మీడియా సమావేశం
-
‘పాదరసం’తో భార్య ప్రాణం తీశాడు
దొడ్డబళ్లాపురం: ఓ భర్త అత్యంత క్రూరంగా భార్యను హత్య చేశాడు. పాదరసం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా.. ఒక్కో అవయవం పాడయ్యేలా చేసి.. 9 నెలల పాటు నరకం చూపించి హతమార్చాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. విద్య(37), బసవరాజు దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరు బెంగళూరులోని అత్తిబెలెలో నివసిస్తున్నారు. కొన్నాళ్లుగా భార్య, భర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో భార్యను ఎవరికీ అనుమానం రాకుండా అంతమొందించాలనుకున్న బసవరాజు.. ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పని చేసే శ్వేత, ఆమె భర్త సాయంతో క్లోరోఫాం, పాదరసం, సిరంజిలు తీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాత్రి బసవరాజు విద్యతో ప్రేమ గా మాట్లాడుతూ.. క్లోరోఫాం ఇచ్చాడు. కొంచెం మత్తులోకి జారుకున్నాక పాదరసం ఇంజెక్షన్ చేశాడు.మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన విద్యకు కుడి తొడ భాగంపై వాపు, విపరీతమైన నొప్పి వచ్చింది. అప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో మార్చి 7న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వారు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆమె శరీరాన్ని పాదరసం విషమయం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కొక్క అవయవం పాడవుతుండగా.. 9 నెలల పాటు నరకం చూసిన విద్య సోమవారం మరణించింది. తన భర్త, మామ కలిసి తనను హత్య చేసేందుకు పాదరసం ఇంజెక్షన్ ఇచ్చారని ముందుగా ఇచ్చిన వీడియో వాంగ్మూలంలో తెలిపింది. -
నగరాలకు ‘కే100’ పాఠం!
సాక్షి బెంగళూరు: హైదరాబాద్, ముంబై, చైన్నై, కోల్‌కతా...దేశంలోని ఈ మెట్రోపాలిటన్ నగరాలన్నింటిలో ఉన్న సాధారణ అంశం ఏమిటి? మురికి కూపాలుగా మారిన నాలలు!. కర్ణాటక రాజధాని బెంగళూరు కూడా దీనికి మినహాయింపేమీ కాదు కానీ.. అక్కడో అద్భుతం జరిగింది. మురికి నాలా కాస్తా సుందర ఉద్యావనంగా మారింది. మురికి కంపు, చెత్తా చెదారాల స్థానంలో పచ్చటి గడ్డి.. పూల మొక్కలు.. దర్శనమిస్తున్నాయి. పక్షుల కిలకిల రవాలు వినిపిస్తున్నాయి. ఈ కే100 కథా కమామీషేమిటో తెలుసా?Photo Credits: Mod Foundationసిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, పబ్ కేపిటల్ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా.. బెంగళూరుకు ఉన్న అనేకానేక నామాల్లో ఇవి కొన్ని. ఎప్పుడు 1537లో కెంపేగౌడ అనే విజయనగర సామ్రాజ్యపు పాలెగాడు ఇక్కడ మట్టి కోట కట్టడంతో బెంగళూరు మహా నగర నిర్మాణం మొదలైందని అంచనా. ఆ తరువాతి కాలంలో టిప్పూ సుల్తాన్, మైసూరు మహారాజుల ఏలుబడిలో ఈ నగరం మరింత సుందరంగా తయారైంది. అయితే.. ప్రపంచంలోని అన్ని నగరాల మాదిరిగానే ఆధునిక కాలం వచ్చే సమయానికి బెంగళూరునూ అన్ని రకాల సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే కెంపేగౌడ అప్పుడెప్పుడో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన గొలుసుకట్టు చెరువులు, అన్నింటినీ అసుంధానించే కాల్వలూ కబ్జాలకు గురయ్యాయి. లేదంటే మురికి కాలువలుగా మారాయి. నగరంలోని కోరమంగల లోయ ప్రాంతంలో ఉండే ఇలాంటి ఒకానొక కాలువే.. ఈ ‘‘కే100’. నగరంలోని ప్రధాన బస్టాండ్ ఒకప్పటి ధర్మాంబుధి చెరవును, కోరమంగలలోని బెళందూరు చెరువును కలుపుతూ ప్రవహించే కే100 వరద కాలువ (కన్నడలో రాజకాలువె అని పిలుస్తారు) నిన్నమొన్నటివరకూ చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, మలమూత్రాలతో నిండిపోయి ఉండేది. జనాలు అటువైపు వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. కానీ.. బెంగళూరు నగర కార్పొరేషన్, మోడ్ అనే డిజైన సంస్థ నరేశ్ నరసింహన్ అనే నిపుణుడి పుణ్యమా అని ఇప్పుడు దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సుమారు రూ.180 కోట్ల వ్యయంతో మొత్తం పన్నెండు కిలోమీటర్ల పొడవైన కాలువ సుందరీకరణ పనులు చేపట్టి పూర్తి చేశారు.Photo Credits: Mod Foundationకాలువ వెంబడే వాక్‌వే...కే100 ప్రక్షాళనతో మొదలైన సుందరీకరణ పనులు మొదలయ్యాయి. వ్యర్థాలనన్నింటినీ తొలగించడమే కాకుండా.. దీంట్లోకి మురికి నీరు రాకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ఒకప్పుడు ఈ కాలువ గుండా రోజూ పదమూడు కోట్ల లీటర్ల మురికినీరు ప్రవహించేది. ఇప్పుడు ఈ మోతాదును కేవలం 50 లక్షల లీటర్లకు తగ్గించారు. మురికినీటిని శుద్ధి చేసి వదులుతున్నారు. నీటి వెంబడే పచ్చదనం కోసం రకరకాల మొక్కలు, గడ్డి పొదలు ఏర్పాటు చేశారు. ప్రజలు కాసేపు హాయిగా గడిపేందుకు అక్కడక్కడ సీట్లు ఏర్పాటు చేశారు. చిన్న చిన్న వినోద కార్యక్రమాల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. నాలాకు రెండువైపులా నివసిస్తున్న వారి భాగస్వామ్యం కూడా ఉండటంతో కే100 ఇప్పుడు స్వచ్ఛమైన నదిలా గలగలా పారుతోంది. ఇప్పుడు ఏమిటి?కే100 ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలికె (కార్పొరేషన్) ఈ మోడల్‌ను నగరవ్యాప్తం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. నగరంలోని మొత్తం 450 కిలోమీటర్ల పొడవైన రాజకాలువెలను కే100 తరహాలు సుందరంగా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా చిన్నపాటి వర్షానికే నగరాలు మునిగిపోకుండా కాపాడవచ్చునని అంచనా. మురికి, చెత్తా చెదారం తొలగిపోవడంతో వరద నీరు సాఫీగా ప్రయాణిస్తుంది కాబట్టి వరద ముప్పు ఉండదన్నమాట. కాలుష్యం, దోమలబెడద కూడా తగ్గుతుంది. ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధి, పౌర సంఘాల చేయూతలతో ఇలాంటి అద్భుతాలు ప్రతి మహానగరంలోనూ జరిగితే ఎంత బాగుంటుందో!!! -
లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!
బెంగళూరు: నకిలీ ఆయుర్వేద దవాఖానా చేతిలో బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి దారుణంగా మోసపోయాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 48 లక్షలు పోగొట్టుకున్నాడు. కారణం తెలిస్తే నెటిజన్లే కాదు మీరు కూడా షాక్ అవుతారు. కొండ నాలుకకు మందిస్తే.. ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టు అయిపోయింది బాధితుడి పరిస్థితి.బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్డు పక్కన నకిలీ ఆయుర్వేద వైద్యుడి వద్దకు వెళ్లాడు. లైంగిక ఆరోగ్య చికిత్స పేరుతో 48 లక్షలు సమర్పించుకున్నాడు. ఉన్న సమస్య తీరడం మాట అటుంచి అశాస్త్రీయమైన వైద్యంతో కొత్త సమస్యలొచ్చి పడ్డాయి. ఆ నకిలీ మందుల కారణంగా కిడ్నీ సంబంధిత సమస్యలు అతణ్ని చుట్టుముట్టాయి. తరువాత విషయం తెలుసుకుని జ్ఞానభారతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.బాధితుడు పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం 2023లో తన వివాహం అయింది. ఈ సందర్భంగా అతనిలోని లైంగిక లోపం బైటపడింది. దీంతో ఒక మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయినా ఫలితం లేదు. దీంతో కేఎల్ఈ లా కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన కనిపించిన 'ఆయుర్వేదిక్ దవాఖానా' అతణ్ని ఆకర్షించింది. 'విజయ్ గురూజీ'గా పరిచయం చేసుకున్న అందులోని వ్యక్తి, తన దగ్గరున్న అరుదైన మందులతో సమస్యను శాశ్వతంగా నయం చేస్తానని నమ్మించాడు.ఆయుర్వేద గూడారం మోసం మే 3న, బాధితుడు లైంగిక సమస్యలకు 'త్వరిత నివారణ' హామీ ఇస్తూ యశ్వంత్‌పూర్‌లోని ఆయుర్వేద స్టోర్ నుండి 'దేవరాజ్ బూటీ' కొని వాడమని సిఫారసు చేశాడు. దీన్ని ప్రత్యేకంగా హరిద్వార్ నుండి తీసుకువచ్చామని, గ్రాముకు రూ. 1.6 లక్షలు ఖర్చవుతుందని గురూజీ బాగా నమ్మించాడు. అప్పు చేసి మరీ, రూ. 48 లక్షలుదొంగ గురూజీ మాటల్ని బాగా విశ్వసించిన టెక్కీ, ఆ మందును కొన్నాడు. ఈసారి మరో ఖరీదైన మందుతో వచ్చాడు. 'భావన బూటీ తైలా' అనే మరో మూలికా మిశ్రమాన్ని అతనితో కొనుగోలు చేయించాడు. దీని ధర గ్రాముకు రూ.76,000. దీని కోసం భార్య , తల్లిదండ్రుల నుండి రూ.17 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇక్కడితో అయిపోలేదు. మందు క్రమంగా వాడాలని లేదంటే, ఇప్పటిదాకా వాడిందంతా వేస్ట్ అవుతుందని భయ పెట్టేశాడు విజయ్ గురూజీ . దీంతో బాధితుడు ఈసారి ఏకంగా బ్యాంకు నుంచి రూ. 20 లక్షల రుణం తీసుకున్నాడు. ఇలా మొత్తంగా గురూజీని నమ్మి 48 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. కానీ ఫలితం శూన్యం. పైగా ఆరోగ్యం దెబ్బతింది.నెటిజన్ల స్పందనవిద్యావంతులు కూడా ఇలా మోసపోవడం షాక్ అంటూ నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని, సొంత అనుభవాలను సోషల్ మీడియాలో చాలామంది మొత్తుకుంటున్నా, జనం పిచ్చిగా మోసపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి చిన్ని పట్టణాల్లోనూ, నగరాల్లోనూ లైంగిక ఆరోగ్యం కోసం మందు, హెర్బల్ మందులు అంటూ రోడ్డు పక్కన చాలా దుకాణాలు దర్శనిమిస్తూ ఉంటాయి. ఇలాంటి ఆయుర్వేద గుడారాల చట్టబద్ధతను పరిశీలించాలని బెంగళూరు వాసులు అధికారులను కోరారు. -
ఒకే ఫ్రేమ్ లో YS జగన్, కేటీఆర్
-
‘ది సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్’ ముగింపు వేడుకలో వైఎస్ జగన్, కేటీఆర్ (ఫొటోలు)
-
రూ.7.5 కోట్ల ఏటీఎం నగదు చోరీ కేసు.. ఛేదించిన పోలీసులు
సాక్షి, చిత్తూరు జిల్లా: బెంగళూరు ఏటీఎం వ్యాన్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏపీలోని కుప్పంలో తనిఖీలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు.. కూర్మానీపల్లెలో రూ. 7.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా నిందితులు నగదును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుస్తూ.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పంలో నగదును మారుస్తున్న క్రమంలో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అధికారులమంటూ ఏటీఎం కరెన్సీ వ్యాన్ సిబ్బందిని నమ్మించి ఏకంగా రూ.7.5 కోట్ల కరెన్సీ కట్టలను దోచుకెళ్లిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం(నవంబర్ 19) మధ్యాహ్నం 12.24 గంటలకు జేపీ నగర్ హెచ్డీఎఫ్సీ కరెన్సీ చెస్ట్ నుంచి రూ.7.5 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను తీసుకుని వేర్వేరు ఏటీఎంలలో నింపేందుకు బయల్దేరిన సీఎంఎస్ ఇన్నో సిస్టమ్స్ వారి ఏటీఎం క్యాష్‌వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అశోకా పిల్లర్ వద్ద అడ్డగించారు.ప్రభుత్వ స్టిక్టర్ అంటించి ఉన్న ఖరీదైన ఎస్యూవీ వాహనంలో దిగిన ఆ దొంగలు తాము ఆర్బీఐ ఉన్నతాధికారులమంటూ నమ్మబలికారు. డాక్యు మెంట్లను వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటూ కస్టోడియన్ అఫ్తాబ్, గన్‌మెన్ రాజన్న, తమ్మయ్యలనూ తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తమ వాహనాన్ని అనుసరించాలని ఏటీఎం క్యాష్ వాహన డ్రైవర్‌కు సూచించారు. డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పిస్టల్ చూపించి డ్రైవర్‌ను బెదిరించి కరెన్సీ కట్టలు తీసుకుని ఉడాయించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసును కర్ణాటక పోలీసులు ఇవాళ ఛేదించారు. -
బెంగళూరులో రూ.7 కోట్లు కొట్టేసిన దుండగులు.. చిత్తూరు జిల్లాలో వాహనం లభ్యం
గుడిపాల: బెంగళూరులో ఏటీఎంలలో నగదు నింపే వాహనం నుంచి బుధవారం పట్టపగలే రూ.7.11 కోట్లు కొట్టేసిన ఆరుగురు దుండగులు డబ్బుతో పరారైన ఇన్నోవా వాహనం గురువారం చిత్తూరు జిల్లాలో లభించింది. రిజర్వు బ్యాంకు, ఆదాయపన్ను అధికారులమంటూ ఏటీఎంలకు నగదు తీసుకెళుతున్న వాహనాన్ని అడ్డగించి సిబ్బందిని దించేసి డ్రైవర్‌ను తీసుకెళ్లిన దుండగులు కొంతదూరం వెళ్లాక డ్రైవర్‌కు పిస్టల్ చూపించి కేంద్రప్రభుత్వ స్టిక్కర్ ఉన్న ఇన్నోవా వాహనంలోకి ఆ నగదును మార్చి పరారైన విషయం తెలిసిందే.జీపీఎస్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన కర్ణాటక పోలీసులు.. చెన్నై–బెంగళూరు రహదారిలోని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం 190 రామాపురం చర్చివద్ద యుపి14–బిఎక్స్2500 నంబరుగల ఆ ఇన్నోవా వాహనం ఉన్నట్లు గుర్తించారు. ఇన్నోవాను అక్కడ ఆపేసిన దుండగులు డబ్బును మరో వాహనంలో తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఇన్నోవా వాహనం బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గుడిపాల మండల కేంద్రం మీదుగా మండలంలోని చిత్తపార గ్రామానికి వెళ్లి కొంత సమయం తరువాత వెనక్కి వచ్చినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దీంతో చిత్తపార గ్రామంలో ఎవరైనా అనుమానితులు ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. -
టక్కులు, టైలతో వచ్చారు.. దర్జాగా రూ.7 కోట్లు దోచుకెళ్లారు
సిలికాన్ సిటీలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినిమా స్టైల్లో దొంగలు దోచుకున్నారు. ఏటీఎంలలో నగదు నింపడానికి వెళ్తున్న ఏజెన్సీ వాహనాన్ని అడ్డగించి.. తాము సెంట్రల్ ఏజెన్సీల అధికారలమంటూ సిబ్బంది బోల్తా కొట్టించారు. ఆపై కొంత దూరం తీసుకెళ్లి బెదిరించి నగదును లూటీ చేసి ఉడాయించారు.బుధవారం (నవంబర్ 19న) మధ్యాహ్నం బెంగళూరులో సీఎంఎస్(క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్) వ్యాన్ నుంచి రూ. 7.11 కోట్ల భారీ దొంగతనం జరిగింది. జేపీ నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ కరెన్సీ చెస్ట్ నుంచి నగదు తీసుకుని ఏటీఎంలలో నింపేందుకు వాహనం బయలుదేరింది. బండిలో కస్టోడియన్ అఫ్తాబ్, డ్రైవర్ బినోద్ కుమార్, గన్‌మెన్ రాజన్న, తమ్మయ్య ఉన్నారు.వ్యాన్ అశోకా పిల్లర్ వద్దకు రాగానే ఓ వైట్‌కలర్ టయోటా ఇన్నోవా అడ్డగించింది. అందులోంచి ఐదారుగురు బయటికి దిగి.. తాము ఆర్బీఐ అధికారులమంటూ చెప్పారు. వాళ్ల అవతారాలు చూసి సిబ్బంది కూడా నిజమని నమ్మారు. సదరు సంస్థపై ఫిర్యాదు ఉందని.. ఆర్బీఐ విచారణ జరుపుతోందని.. తమ వెంట రావాలని ఒత్తిడి చేశారు. ఆ హఠాత్ పరిణామంతో ఏం చేయాలో పాలుపోక వాళ్లంతా ఆ వాహనంలోకి ఎక్కారు. అటుపై డెయిరీ సర్కిల్ వద్ద వ్యాన్ డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి రూ. 7.11 కోట్ల నగదు తీసుకుని పరారయ్యారు.Money Heist in BengaluruRobbers posing as Govt officials intercepted a CMS ATM cash loading vehicle allegedly claiming "verification", transferred about 7 crore into their Innova, left the staff & vehicle near a flyover, and escaped. A citywide search is underway. pic.twitter.com/sGb0IpgcXF— Deepak Bopanna (@dpkBopanna) November 19, 2025ఈ ఘటనపై సీబీఐ కోర్టు పరిధిలోని సిద్ధాపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్వయంగా విచారణను పర్యవేక్షిస్తున్నారు. ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి, CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అవల్లహళ్లి ప్రాంతంలో దుండగుల వాహనం చివరిసారిగా కనిపించింది, అక్కడి నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటన జరిగిన తీరు నేపథ్యంలో సీఎంఎస్ ఉద్యోగుల హస్తం కూడా ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంత దర్జాగా దోచుకున్నది లోకల్ దొంగలా? ఉత్తరాది ముఠాలా? అసలెవరు?? అనేది ఉత్కంఠగా మారింది.ప్రభుత్వం చచ్చిందా: అశోక్ఈ దోపిడీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీజేపీ పక్ష నేత ఆర్ అశోక్ ఆరోపించారు. ట్రాఫిక్ జామ్ మధ్య, వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితిలో దోపిడీ చేశారంటే ఇది కచ్చితంగా బ్రాండ్ బెంగళూరే అని హేళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో ఉన్న ఖైదీలకు, టెర్రరిస్టులకు మొబైళ్లు ఏర్పాటు చేస్తున్నట్టే దోపిడీ దొంగలకు కూడా ఏర్పాట్లు చేశారని అనుమానాలు వస్తున్నాయన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం, పోలీసు శాఖ ఉన్నా చచ్చినట్టే అనిపిస్తోందని దుయ్యబట్టారు. బ్యాంకు డబ్బులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో ఊహించవచ్చన్నారు. -
రూ. 32 కోట్లు కొట్టేశారు
బెంగళూరు: సైబర్ నేరగాళ్ల చేతిలో బెంగళూరుకు చెందిన సీనియర్ ఐటీ ఉద్యోగి మోసపోయారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను బెదిరించిన నేరగాళ్లు ఏకంగా.. రూ.32 కోట్లు కొట్టేశారు. గతేడాది చివరి మూడు నెలల్లో మొదలైన ఈ ఘరానా మో సం ఈ ఏడాది వరకు కొనసాగింది. కొడుకు పెళ్లి ఉండటంతో విషయం బయటకు తెలియకుండా ఉంచిన మహిళ.. ఎట్టకేలకు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని చెప్పి...బెంగళూరుకు చెందిన 57 మహిళ ఐటీ ఉద్యోగి. 2024 సెప్టెంబర్ 15న ఆమెకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను తాను డీహెచ్ఃల్ కొరియర్ కంపెనీ ప్రతినిధిగా చెప్పుకొన్నాడు. మహిళ పేరుతో 3 క్రెడిట్ కార్డులు, 4 పాస్‌పోర్టులు, నిషేధిత ఎండీఎం డ్రగ్స్ ఉన్న పార్సిల్ ముంబైలోని తమ కొరియర్ సెంటర్‌కు వచ్చిందని చెప్పాడు. అయితే తానుండేది బెంగళూరులోనని, ఆ ప్యాకేజీతో తనకు సంబంధం లేదని మహిళ చెప్పారు. ఆ ప్యాకేజీ ఆమె నెంబర్‌తోనే లింక్ చేసి ఉందని, అది సైబర్ మోసం కావచ్చని కూడా చెప్పాడు. అంతేకాదు సైబర్ క్రైమ్‌సెల్‌కు ఫిర్యాదు చేయాలంటూ ఆమెకు సూచించాడు. సీబీఐ అధికారిగా చెప్పుకున్న ఓ వ్యక్తికి కాల్ ట్రాన్స్ఫర్ చేశారు. సదరు వ్యక్తి మహిళ నుంచి అనేక వివరాలు సేకరించాడు. సాక్షాలన్నీ ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఆమెపై తమ నిఘా ఉందని భయపెట్టాడు. ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు చెప్పొద్దని, ఎవరికైనా చెప్పాలని చూస్తే కుటుంబం మొత్తం కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో భయపడ్డ ఆమె.. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లే చేసింది. కొన్ని రోజులకు మరో వ్యక్తి సీబీఐ అధికారినంటూ ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేసి ఆమెను డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు బెదిరించారు. ఆ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మహిళ ఆ విషయాన్ని వాళ్లకు చెప్పారు. దీంతో 2024 సెప్టెంబర్ 23న ఫోన్ చేసిన ఆ వ్యక్తి.. మహిళ ఆస్తులన్నింటినీ ఆర్బీఐకి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ముందు ప్రకటించాలని చెప్పాడు. బాధిత మహిళ ఆ కాల్ చేసిన వ్యక్తి చెప్పినట్లే చేసింది. నెమ్మదిగా వారిని నమ్మేసింది. దీంతో ఆమె నుంచి డబ్బు లాగడం మొదలుపెట్టారు. 187 లావాదేవీల్లో రూ. 31.83 కోట్లు బదిలీ..ఆమెను రెండు స్కై‹ప్ ఐడీలను ఇన్స్టాల్ చేయాలని చెప్పి, నిరంతరం వీడియో కాల్లో ఉండాలని బెదిరించారు. వీడియో కాల్ మొదలైన తరువాత మోహిత్ హండా అనే వ్యక్తి ఆమెను రెండు రోజులు పర్యవేక్షించాడు. ఆ తర్వాత రాహుల్ యాదవ్ అనే వ్యక్తి ఒక వారం పాటు ఆమెపై నిఘా ఉంచాడు. ప్రదీప్‌సింగ్ అనే వ్యక్తి సీనియర్ సీబీఐ అధికారిగా నటిస్తూ ఆమె నిర్దోషి అని నిరూపించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అలా గతేడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 22 మధ్య మహిళ తన ఆర్థిక వివరాలను వెల్లడించి, పెద్ద మొత్తంలో డబ్బును వారికి బదిలీ చేసింది. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 3 వరకు రూ. 2 కోట్లు డిపాజిట్ చేసింది, ఆ తరువాత పన్నుల పేరుతో మరికొంత చెల్లించింది. చివరకు తన ఫిక్స్డ్ డిపాజిట్లను, ఇతర పొదుపులను కూడా డ్రా చేసి 187 లావాదేవీల్లో రూ.31.83 కోట్లను వారికి బదిలీ చేసింది. ఆమె నిర్దోషి అని తేలితే ఈ ఏడాది ఫిబ్రవరిలో డబ్బు తిరిగి స్తామని వారు చెప్పారు. నిరంతరం నిఘా, ఒత్తిడి మధ్య ఆమె జబ్బు పడింది. దీంతో ఒక నెల చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనూ ఆమె ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నదనే విషయాలను ఎప్పటికప్పుడు వారికి చెబుతూ వచ్చింది. ఫిబ్రవరిలో డబ్బు తిరిగి ఇచ్చేస్తామన్న వారు.. మార్చికి వాయిదా వేశారు. కొన్ని రోజుల తరువాత వారి నుంచి కాల్స్ ఆగిపోయాయి. కమ్యూనికేషన్ లేకుండా పోయింది. జూన్‌లో తన కొడుకు పెళ్లి ఉండటంతో అప్పటివరకు ఆగిన మహిళ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెలæ 14న బెంగళూరులోని తూర్పు డివిజన్ క్రెమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు పెల్లి, ఇతర కారణాల వల్ల ఫిర్యాదు ఆలస్యమైందని తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో వందేభారత్ రైలును రైల్వే శాఖ మంజూరు చేసింది. విజయవాడ–బెంగళూరు వందేభారత్ రైలు ఈ నెలాఖరుకు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్, షెడ్యూల్‌ను రైల్వే శాఖ ఖరారు చేసింది. మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు ప్రయాణించే ఈ రైలులో విజయవాడ నుంచి ఎస్ఎంవీటీ (బెంగళూరు) 9 గంటల్లో చేరుకోవచ్చు. ఈ రైలుకు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాటా్పడి, కృష్ణరాజపురంలో హాల్ట్‌లు కల్పించింది. మొత్తం 8 బోగీలు ఉండే ఈ రైలులో 7 ఏసీ చైర్‌కార్ బోగీలు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయి. ఈ రైలు (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరు చేరుతుంది. అలాగే, రైలు (20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. కాగా, ఇప్పటికే ప్రారంభించిన విజయవాడ– చెన్నై సెంట్రల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించారు. గుడివాడ, భీమవరంలో హాల్ట్‌లు కల్పించారు. -
అన్నా.. ప్లీజ్ అన్నా.. వద్దన్నా..!
బైక్‌పై వెళ్తున్న టైంలో హఠాత్తుగా అతను నా కాళ్లపై చేతులు వేశాడు. వద్దని చెప్పినా మళ్లీ మళ్లీ అదే పని చేశాడు. నా గుండె ఆగినంత పనైంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉండిపోయా. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు ఎదురు కాకూడదని కోరుకుంటున్నా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బైక్ డ్రైవర్‌తో తనకు ఎదురైన పరిస్థితిని ఓ యువతి పంచుకోగా అది నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఎదురైంది. మెట్రో నగరం బెంగళూరులో ఓ యువతితో బైక్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. బైక్‌పై వెళ్తున్న సమయంలో ఆమెను తాకుతూ ఇబ్బంది పెట్టాడు. ఈ వేధింపులను ఆ యువతి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గురువారం సాయంత్రం విల్సన్ గార్డెన్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో నేపథ్యం, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి చర్చ్ చర్చ్ స్ట్రీట్ నుంచి తాను ఉండే హాస్టల్‌కు ర్యాపిడో ద్వారా బైక్ రైడ్‌ను బుక్ చేసుకుంది. ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి కెప్టెన్ తన చేతులతో ఆమె తొడలను తాకడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతన్ని వారించింది. అయినా కూడా పట్టించుకోకుండా అతను అదే పని చేస్తూ ఉండిపోయాడు. దీంతో ఆమె ‘‘అన్నా.. ఏం చేస్తున్నావ్?.. వద్దన్నా..’’ అంటూ బతిమాలుకుంది. అయినా ఆ కామాంధుడు వినలేదు. ఈలోపు.. తన గమ్యస్థానం రావడంతో ఆమె దిగేసింది. ఆ సమయంలోనూ ఆమె ఇబ్బందిని గమనించిన ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశాడు. జరిగిందంతా చెప్పడంతో ఆ వ్యక్తి ఆ కెప్టెన్‌ను నిలదీశాడు. దీంతో తప్పైపోయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోసాగాడు. కాస్త దూరం వెళ్లాక యువతిని చూస్తూ చేతులతో అసభ్య సంజ్ఞలు చేశాడు. దీంతో ఆమె భరించలేకపోయింది. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తాను సిటీకి కొత్త అని, అందుకే ఆ రైడ్‌ను మధ్యలో ఆపలేకపోయానని, ఇలాంటి ఘటనలు కొత్త కాకపోయినా తనకు ఎదురైన అనుభవం మరేయితర మహిళకు ఎదురుకాకూడదని, ఇలాంటి ప్రయాణాల్లో ఒంటరి మహిళలు భద్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ పోస్ట్ చేసింది. నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నట్లు విల్సన్ గార్డెన్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ర్యాడిడో సంస్థ స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: తుపాకులు కావాలా? ల్యాప్‌ట్యాప్‌లు కావాలా? -
బెంగళూరులో వినూత్న ప్రయోగం...
నగరాల్లోని అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌ను చూసి మీరెప్పుడైనా తిట్టుకున్నారా? పోలీసులు ఏం చేస్తున్నారని కసురుకున్నారా? చలాన్లతో వేధించడమే వారికి పని అని అనుకున్నారా?. అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. ఏటికేడాదీ పెరిగిపోతున్న వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా రోడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగు కాకపోవడంతో మహా నగరాల్లో ట్రాఫిక్ నరకప్రాయం అవుతున్న సంగతి తెలిసిందే. కిలోమీటరు దూరం ప్రయాణించేందుకు కూడా గంటల సమయం పట్టే సందర్భాలు తరచూ ఎదురవుతూంటాయి. వర్షమొచ్చిందంటే ఇక అంతే సంగతి. నగరాలు చెరువులైపోతాయి. ఎన్ని మెట్రోలు, బస్సులు, రైళ్లు ఉన్నా.. స్తంభించిపోతాయి. ఆకస్మిక ట్రాఫిక్ జామ్‌లు, వీవీఐపీల టూర్లు వాహనదారులను విసిగించడమూ కద్దు. అయితే.. దిగితే కానీ లోతు ఎంతో తెలియదని తెలుగు సామెత. ట్రాఫిక్ పోలీసుల విషయమూ అంతే. ఒకసారి వాళ్లు ఎలా పనిచేస్తున్నారన్నది తెలుసుకుంటే కానీ వారి సాధకబాధకాలు, కష్టనష్టాలు తెలియవు. ఇప్పటివరకూ మనలాంటి వారికి ఆ అవకాశం లేకపోయింది కానీ.. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులిప్పుడు ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ట్రాఫిక్ కాప్ ఫర్ ఏ డే’ పేరుతో ఆసక్తికలిగిన ప్రజలు ఒక రోజుపాటు ట్రాఫిక్ నియంత్రణలో పాలుపంచుకునేలా చేస్తున్నారు. ఈ కొత్త కార్యక్రమం వివరాలను బెంగళూరు నగర ట్రాఫిక్ విభాగం ఎక్స్ వేదికగా అందరితో పంచుకుంది. ఈ ట్వీట్లో జాయింట్ కమిషనర్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ‘‘బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను వీలైనంత తగ్గించేందుకు ఏం చేస్తున్నామో ప్రజలకు ప్రత్యక్షంగా వివరించేందుకు ఉద్దేశించింది ఈ కార్యక్రమం’’ అని వివరించారు.What if you were in charge of Bengaluru’s busiest junction for a day? 😎Here’s your chance to step into the shoes of a real traffic officer!Join “#Trafficcopforaday” — a unique initiative by Bengaluru Traffic Police where citizens become part of the force, experience the… pic.twitter.com/o94Hpdsjvy— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) November 7, 2025అవగాహనతో మొదలు..ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నింటికంటే ముందుగా బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ విభాగం పనితీరును వివరిస్తారు. ఆ తరువాత నగరంలోని అత్యంత బిజీ కూడళ్లలో ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. పాదాచారులు రోడ్డు క్రాస్ చేసేందుకు సాయపడటం, వాహనాల రాకపోకలకు సిగ్నల్స్ ఇవ్వడం వంటివి చేస్తారు. అంతేకాకుండా... తాము పనిచేసిన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను మెరుగుపరిచేందుకు ఏవైనా ఆలోచనలు ఉంటే వాటిని కూడా పంచుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు "ASTraM" అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. పద్దెనిమిదేళ్ల పైబడ్డ బెంగళూరు నగర నివాసులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరం, అభ్యర్థి ఆసక్తి, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి ముందుగా భద్రత నియమాలు, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన ప్రాథమిక అంశాలను వివరించి ఆ తరువాత విధుల్లోకి తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ అనుభవాలను సోషల్‌మీడియా ద్వారా ఇతరులతో పంచుకునేలా చేయడం ద్వారా మరింత మందికి ట్రాఫిక్‌పై అవగాహన పెరుగుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను ప్రజలతో కలిసి పరిష్కరించేందుకు, రహదారి భద్రతను పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. -
IND vs SA: టీమిండియాకు భారీ షాక్
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా (IND vs SA)కు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant Injured) మరోసారి గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ.. రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. కాగా సఫారీ జట్టుతో టీమిండియా స్వదేశంలో రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే.ఇందుకు సన్నాహకంగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా - ‘ఎ’ జట్లు ముందుగా అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ పంత్ భారత్- ‘ఎ’ కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు. ఇక బెంగళూరులోని బీసీసీఐ (BCCI) ఆఫ్ ఎక్సలెన్స్ స్టేడియం వేదికగా.. తొలి అనధికారిక టెస్టులో పంత్ సేన గెలుపొందింది.ధ్రువ్ జురెల్ అజేయ శతకంఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో అనధికారిక టెస్టు మొదలుకాగా.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. ధ్రువ్ జురెల్ అజేయ శతకం (132) కారణంగా ఈ మేర స్కోరు సాధ్యమైంది.అయితే, తొలి ఇన్నింగ్స్ సందర్భంగా పంత్ గాయపడ్డాడు. సఫారీ పేసర్ షెపో మొరేకి వేసిన రాకాసి బౌన్సర్ పంత్ చేతి వేలికి బలంగా తాకింది. ఫిజియో వచ్చి పరిశీలించగా.. పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేసి మొరేకి బౌలింగ్‌లో అవుటయ్యాడు.34 పరుగుల స్వల్ప ఆధిక్యంఇక సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కు.. 34 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కగా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్ 78 పరుగులు చేసింది.ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆదిలోనే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (60 బంతుల్లో 27) వికెట్‌ను భారత్ కోల్పోగా.. పంత్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు 108-4గా ఉన్న వేళ పంత్‌కు రెండుసార్లు గాయమైంది. రెండుసార్లు బంతి బలంగా తాకడంతోమొరేకి బౌలింగ్‌లో తొలుత పంత్ ఎడమ మోచేతికి గాయమైంది. తర్వాత గజ్జల భాగంలో బంతి బలంగా తాకింది. దీంతో 22 బంతులు ఎదుర్కొన్న పంత్.. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నవంబరు 14 నుంచి టెస్టు సిరీస్ మొదలు కానుండగా.. పంత్ రూపంలో కీలక ఆటగాడు గాయపడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో భారత్ 43 ఓవర్ల ఆట ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి.. 158 పరుగుల ఆధిక్యం సంపాదించింది.చదవండి: ఐసీసీ కీలక నిర్ణయంRishabh Pant retires hurt after taking three blows today. First on the helmet, second on the left-hand elbow, third on the abdomen. Tough day for the fighter. ❤️🩹 pic.twitter.com/kdTX8jdM8B— Harsh 17 (@harsh03443) November 8, 2025 -
IND vs SA: రీఎంట్రీలో బవుమా డకౌట్.. సౌతాఫ్రికాకు భారీ షాక్
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్లో సౌతాఫ్రికాను విజేతగా నిలిపి ఘనత కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) సొంతం. ఇంగ్లండ్ వేదికగా పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి బవుమా బృందం ‘ఐసీసీ గద’ను గెలుచుకుంది. అయితే, ఈ మోగా ఫైనల్ తర్వాత ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా బవుమా టెస్టులకు దూరమయ్యాడు.ఈ క్రమంలో టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా- ‘ఎ’ తరఫున రెడ్‌బాల్ క్రికెట్లో బవుమా పునరాగమనం చేశాడు. భారత్- ‘ఎ’ (IND A vs SA A)తో గురువారం మొదలైన రెండో అనధికారిక టెస్టు తుదిజట్టులో ఈ కెప్టెన్ సాబ్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు.గోల్డెన్ డకౌట్శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా... అకెర్మాన్ సారథ్యంలోని ఈ టీమ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బవుమా.. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఒకే ఒక్క బంతి ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.ధ్రువ్ జురేల్ వీరోచిత అజేయ శతకంకాగా సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో సహచరులు తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... ధ్రువ్ జురేల్ పట్టుదలతో ఆడి వీరోచిత అజేయ శతకం సాధించాడు. జురేల్ (175 బంతుల్లో 132 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పుణ్యమాని... గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు గౌరవప్రద స్కోరు నమోదు చేసింది.బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా- ‘ఎ’ కెప్టెన్ అకెర్మాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ జట్టు 77.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా... కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 19; 3 ఫోర్లు), సాయి సుదర్శన్ (52 బంతుల్లో 17; 3 ఫోర్లు) క్రీజులో కుదురుకుంటున్న దశలో అవుటయ్యారు.రాణించిన కుల్దీప్, సిరాజ్ఒకదశలో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును జురేల్ ఆదుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు కుల్దీప్ యాదవ్ (88 బంతుల్లో 20; 1 ఫోర్)తో కలిసి జురేల్ 79 పరుగులు జత చేసి భారత స్కోరును 200 దాటించాడు.కుల్దీప్ అవుటయ్యాక సిరాజ్ (31 బంతుల్లో 15; 3 ఫోర్లు)తో కలిసి జురేల్ 34 పరుగులు జోడించాడు. 62 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జురేల్... 145 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో సెంచరీ మైలురాయిని దాటాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వాన్ వురెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా... సుబ్రాయెన్, మోరెకిలకు రెండు వికెట్ల చొప్పున లభించాయి.చెలరేగిన భారత బౌలర్లుఇక రెండో రోజు ఆటలో భాగంగా తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. 44 ఓవర్ల ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో పేసర్లు ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, మొహమ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ప్రొటిస్ బ్యాటర్లలో కెప్టెన్ అకెర్మాన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.చదవండి: అందుకే వరల్డ్‌కప్ విన్నర్‌ని వదిలేశాం: అభిషేక్ నాయర్ -
బ్యాంక్ సిబ్బంది స్థానిక భాషలో మాట్లాడాలి
ముంబై: కస్టమర్లతో మరింత మమేకం అయ్యేందుకు గాను బ్యాంకు సిబ్బంది స్థానిక భాషలో మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) సూచించారు. స్థానిక భాష తెలిసిన వారినే నియమించాలన్న డిమాండ్లు ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో వినిపిస్తుండడంతో కేంద్ర మంత్రి దీనిపై స్పందించారు. బెంగళూరులో ఇటీవల ఎస్బీఐ మేనేజర్ ఒకరు కన్నడ భాష తెలియక, దురుసు ప్రవర్తనతో విమర్శల పాలు కావడం తెలిసిందే. ‘‘బ్రాంచ్‌లో నియమించే ప్రతీ ఉద్యోగి తన కస్టమర్‌ను అర్థం చేసుకుని, స్థానిక భాషలో మాట్లాడే విధంగా ఉండాలి. ముఖ్యంగా యాజమాన్యానికి స్థానిక భాష తెలియని పరిస్థితుల్లో, బ్రాంచ్ స్థాయి అధికారులు అయినా స్థానిక భాషలో మాట్లాడగలగాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం ఆధారంగా ఉద్యోగుల పనితీరును మదింపు వేసే విధానం ఉండాలి’’అని ఎస్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి స్పష్టం చేశారు. వివిధ మాతృభాషల అధికారులను వేర్వేరు భిన్న ప్రాంతాల్లో నియమించరాదన్న విధానాన్ని మాత్రం తాను సమర్థించబోనన్నారు. కస్టమర్లతో అనుబంధమే కీలకం బ్యాంకు తన కార్యకలాపాల నిర్వహణకు స్థానిక కస్టమర్లు కీలకమని, బ్యాంకు వృద్ధి అవసరాల పరంగా చూసినా వారితో అనుసంధానత ఎంతో కీలకమని మంత్రి గుర్తు చేశారు. కస్టమర్లతో అనుబంధం తగ్గిపోతుండడంతో క్రెడిట్ సమాచార సంస్థలపై (సిబిల్ తదితర క్రెడిట్ బ్యూరోలు) బ్యాంకులు ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఆయా సంస్థలు తాజా సమాచారాన్ని అప్డేట్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని, దీంతో కొన్ని సందర్భాల్లో కస్టమర్లు రుణ తిరస్కరణలు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు గుర్తు చేశారు. గతంలో బ్యాంక్ అధికారులకు తన కస్టమర్ల రుణ సామర్థ్యం గురించి అవగాహన ఉండేదన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను అడ్డుకోమురిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో)లో ట్రేడింగ్ చేయకుండా ప్రభుత్వం అడ్డుకోబోదని మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు. కాకపోతే అందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన కల్పిస్తామని ప్రకటించారు. ఎఫ్‌అండ్‌వో మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లలో ప్రతి 100 మందికి 91 మంది నష్టపోతున్నట్టు సెబీ అధ్యయనంలో వెల్లడి కావడం తెలిసిందే.పెద్ద బ్యాంక్‌లు కావాలి.. మన దేశానికి అతిపెద్ద, ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు. ఇందుకు సంబంధించి ఆర్బీఐ, బ్యాంకులతో సంప్రదింపులు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంతో కసరత్తు చేయాల్సి ఉందంటూ.. బడా బ్యాంకుల ఏర్పాటుకు ఎలా ముందుకు వెళ్లాలనే విషయమైన ఆర్బీఐ అభిప్రాయాలు కూడా తీసుకుంటామని ప్రకటించారు. బ్యాంకుల విలీనం కూడా ఒక మార్గమని చెప్పారు. పరిశ్రమలకు బ్యాంకుల నుంచి రుణ వితరణ మరింత విస్తృతం కావాలన్నారు. జీఎస్టీ రేట్ల కోతతో డిమాండ్ పెరిగి, అది పెట్టుబడుల సైకిల్‌కు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. బలమైన బ్యాంకుల అంశంతోనే కేంద్ర సర్కారు 2019లో ప్రభుత్వరంగ బ్యాంకుల మెగా విలీనాన్ని చేపట్టడం తెలిసిందే. దీంతో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనాల అనంతరం 12కు తగ్గాయి. మరో విడత ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంపై కేంద్ర సర్కారు యోచిస్తున్నట్టు ఇటీవలే వార్తలు రావడం గమనార్హం. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ దిశగా చర్యలు కూడా కొనసాగుతున్నాయి. -
మహా నగరాల్లోనే ఎక్కువ.. ఎందుకంటే?
డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను మోసం భారీగా డబ్బు కాజేస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా వృద్దులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ఎంతో మంది కోట్ల రూపాయల్లో డబ్బు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే మహా నగరాల్లోనే ఇలాంటి ఎక్కువగా జరుగుతున్నట్టు తాజాగా వెల్లడైంది. డిజిటల్ అరెస్టులకు (Digital Arrest) హాట్స్పాట్లుగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాలు అవతరించాయి. దేశంలో జరిగే సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల్లో మూడింట రెండింతల మోసాలు ఈ నగరంలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోనే దాదాపు 65 శాతం ఈ తరహా కేసులు నమోదు అవుతున్నట్లు ఇటీవల ‘ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్’(ఐ4సీ) జాతీయ మీడియాకు వెల్లడించింది.బెంగళూరులో అత్యధికంగా 26.38% డిజిటల్ అరెస్టుల కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత హైదరాబాద్‌లో 19.97% కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఎన్సీఆర్ నిలిచింది. ఢిల్లీ ఎన్సీఆర్లో డిజిటల్ అరెస్టుల కేసులు 18.14 శాతం నమోదు అయ్యాయి. ఈఏడాది మొదటి ఆరు నెలల డేటా ప్రకారం డిజిటల్ అరెస్టులు ఈ మూడు నగరాల్లో అత్యధికంగా జరుగుతున్నట్లు ఐ4సీ గుర్తించింది. ఇక తర్వాతి స్థానాల్లో ముంబై, సూరత్, పుణె, నాగపూర్, అహ్మదాబాద్, వడోదర నగరాల్లో కేసులు నమోదు అవుతున్నాయి.సైబర్ నేరగాళ్లు 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.చదవండి: బిహార్ ఎన్నికల్లో టాప్-10 ధనిక అభ్యర్థులు వీరేటెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్ (e-mail) తదితర మార్గాల ద్వారా లింకులు పంపడం, అవి క్లిక్ చేసిన వెంటనే నేరగాళ్లు అకౌంట్లో ఎంత ఉంటే అంత మొత్తాన్ని కాజేయడం చేస్తున్నారు. ఇప్పటివరకు సైబర్ మోసాలకు సంబంధించిన 9.42 లక్షల సిమ్ కార్డులు, 2.63 లక్షల ఐఎంఈఐ నంబర్లను ఐ4సీ బ్లాక్ చేసింది. ఈ తరహా కేసుల్లో పోలీసు వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
IND vs SA: కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్.. శతక్కొట్టిన జురెల్
సౌతాఫ్రికా- ‘ఎ’తో అనధికారిక రెండో టెస్టులో భారత్ -‘ఎ’ (IND A vs SA- Day 1) మెరుగైన స్కోరు సాధించింది. పర్యాటక జట్టు బౌలర్లు ఆది నుంచే చెలరేగి.. టాపార్డర్‌ను కుదేలు చేయగా.. ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) శతక్కొట్టి జట్టును ఆదుకున్నాడు. కాగా బెంగళూరు వేదికగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్లు రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే.టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్ఇందులో భాగంగా తొలి టెస్టులో రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్సీలోని భారత జట్టు ప్రొటిస్ జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు మొదలైంది. బెంగళూరులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా- ‘ఎ’ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది.కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్ఇక ఈ మ్యాచ్‌తో జట్టులోకి వచ్చిన ఓపెనింగ్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (19), అభిమన్యు ఈశ్వరన్ (0) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ (17) నిరాశపరచగా.. దేవదత్ పడిక్కల్ (5) మరోసారి ఫెయిల్ అయ్యాడు.ఇలాంటి దశలో ఐదో నంబర్ ఆటగాడు, కెప్టెన్ రిషభ్ పంత్ జట్టును ఆదుకునే క్రమంలో వేగంగా ఆడాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసిన పంత్.. షెపో మొరేకి బౌలింగ్‌లో ఎంజే అకెర్‌మన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.సౌతాఫ్రికా ఆనందం ఆవిరి చేసిన జురెల్దీంతో సౌతాఫ్రికా శిబిరం సంతోషంలో మునిగిపోయింది. హర్ష్ దూబే (14), ఆకాశ్ దీప్ (0)లను కూడా త్వరత్వరగా అవుట్ చేసింది. అయితే, వారి ప్రొటిస్ జట్టుకు ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవకుండా చేశాడు ధ్రువ్ జురెల్.సహచర ఆటగాళ్లు విఫలమైన చోట జురెల్ అద్భుత శతకంతో మెరిశాడు. మొత్తంగా 175 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్ (88 బంతుల్లో 20), మొహమ్మద్ సిరాజ్ (31 బంతుల్లో 15) వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ జురెల్‌కు సహకరించారు.భారత్ ఆలౌట్.. స్కోరెంతంటే?ఈ క్రమంలో 77.1 ఓవర్ వద్ద ప్రసిద్ కృష్ణ (0) పదో వికెట్‌గా వెనుదిరగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. తొలి రోజు పూర్తయ్యేసరికి77.1 ఓవర్లలో 255 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. జురెల్ అద్భుత శతకం కారణంగా భారత జట్టుకు ఈ మేర మెరుగైన స్కోరు సాధ్యమైంది. ఇక సఫారీ జట్టు బౌలర్లలో టియాన్ వాన్ వారెన్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. షెపో మొరేకి, ప్రెనేలన్ సుబ్రయాన్ చెరో రెండు, ఒకులే సిలీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.భారత్- ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా -‘ఎ’ రెండో అనధికారిక టెస్టు తుదిజట్లుభారత్కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), హర్ష్ దూబే, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికాజోర్డాన్ హెర్మాన్, లిసెగో సెనొక్వనే తెంబా బవుమా, జుబేర్ హంజా, మార్వ్కెస్ అకెర్మన్ (కెప్టెన్), కొనొర్ ఎస్తర్హుజీన్ (వికెట్ కీపర్), టియాన్ వాన్ వారెన్, కైలీ సైమండ్స్, ప్రెనేలన్ సుబ్రయాన్, షెపో మొరేకి, ఒకులే సిలీ.చదవండి: క్రీజులోకి వెళ్లు.. నీ తల పగలకొడతా! -
జియో-బీపీ మొబిలిటీ హబ్: ఒకేచోట 28 చార్జింగ్ పాయింట్స్
జియో–బీపీ తాజాగా వివిధ రకాల ఇంధనాలతో పాటు చార్జింగ్ పాయింట్లు కూడా ఒకే చోట అందుబాటులో ఉండేలా బెంగళూరులో భారీ స్థాయి సమగ్ర మొబిలిటీ హబ్‌ను తీర్చిదిద్దింది. ఇందులో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ విక్రయిస్తుండగా, ఈవీ చార్జింగ్ హబ్‌ను కూడా ఏర్పాటు చేసింది.ఈ ఔట్లెట్లో 28 చార్జింగ్ పాయింట్లు, కేఫ్ ఉంటాయని సంస్థ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. 360 కిలోవాట్ల సూపర్‌ఫాస్ట్ చార్జర్లతో వేగవంతంగా వాహనాన్ని చార్జ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. భారత్‌లో ఈ తరహా భారీ సమగ్ర హబ్ ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని సంస్థ తెలిపింది. జియో–బీపీకి దేశవ్యాప్తంగా 1,000 ప్రాంతాల్లో 7000 చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. -
Bengaluru: రోడ్లపై చెత్తవేస్తే.. ‘అంతకన్నా అవమానం ఉండదు’
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో పరిశుభ్రత పక్కదారి పడుతుండటంతో గ్రేటర్ బెంగళూరు అథారిటీ తాజాగా ‘గార్బేజ్ డంపింగ్ ఫెస్టివల్’ను ప్రారంభించింది. రోడ్ల మీద చెత్త పడేసి, చేతులు దులుపుకుని వెళ్లే నగర పౌరుల తీరుకు చెక్ పెట్టేందుకు నడుంబిగించింది. బెంగళూరు మున్సిపల్ అథారిటీ.. నగరం పరిశుభ్రంగా ఉండాలంటే.. ముందు మనం మారాలి అనే నినాదంతో చెత్త డంపింగ్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టింది. ఎవరైనా రోడ్ల మీద చెత్త పారవేస్తే, అదే చెత్తను వారికి రిటర్న్ గిఫ్ట్‌గా పంపిస్తామని హెచ్చరిక చేసింది. సీసీ కెమెరాల ద్వారా చెత్త పడేసే వారిని గుర్తించి, వారి చెత్తను వారి ఇంటి ముందే డంప్ చేస్తామని తెలిపింది. అలాగే వారికి రెండు వేల రూపాయలు జరిమానా కూడా విధిస్తామని పేర్కొంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ), బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (బీఎస్‌డబ్ల్యూఎంఎల్) సంయుక్తంగా ఈ ‘చెత్త డంపింగ్ ఫెస్టివల్’ను నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ముందుగా జీబీఏ ప్రత్యేక సిబ్బంది వీధులు, ఫుట్‌పాత్‌లు, ఖాళీ స్థలాలలో చెత్తను వేసే వ్యక్తులను గుర్తిస్తారు. తరువాత వారు ఆ చెత్తను వారి ఇళ్ల వెలుపల పోస్తారు. అలాగే ఇటువంటి చర్యలకు పాల్పడేవారికి రూ.రెండు వేలు జరిమానా విధిస్తారు. ఈ విధంగా జీబీఏ ప్రత్యేక సిబ్బంది చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం తొలి రోజున 218 ఇళ్ల ముందు చెత్తను వేసి, వారి నుంచి రూ. 2.8 లక్షల జరిమానాలు వసూలు చేశారు. ఈ ప్రచారం తొలుత నగరంలోని బనశంకరిలో ప్రారంభమైంది. క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు.బహిరంగ వ్యర్థాల తొలగింపు, ప్రజా జవాబుదారీతనం పెంపొందించేందుకు బెంగళూరు మున్సిపల్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. బెంగళూరును పరిశుభ్రంగా ఉంచడంలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. దీనిని కొందరు బెంగళూరువాసులు మెచ్చుకుంటుండగా, మరికొందరు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అధికారులు బెంగళూరు అంతటా ఈ ప్రచారాన్ని విస్తరించాలని యోచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Egypt: ‘నాలుగో పిరమిడ్’ లేచింది.. ‘వారెవ్వా’ అనాల్సిందే! -
చావులే.. వారికి డబ్బులు పుట్టించే మెషిన్లు!
ఒక చావు.. కొందరిని కుంగదీస్తుంది. కుమిలిపోయేలా చేస్తుంది. అదే చావు.. మరికొందరికి మాత్రం కాసుల పంట పండిస్తుంది. ‘శవాల మీద పేలాలు ఏరుకుని తినే నీచులు..’ అంటూ.. మానవత్వం లేని మనుషుల గురించి మనం తిట్లు వింటూ ఉంటాం. కానీ.. ఈ సంఘటన గురించి తెలుసుకుంటే.. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా ఉంటూ.. లంచాలు తెగమేసి బతకడానికి అలవాటుపడిన దుర్మార్గులు.. ఈ తరహా అమానవీయ పోకడల విషయంలో ఎంతటి మాస్టర్ డిగ్రీలు చేశారో అర్థమవుతుంది.తాము లంచాలు కాజేయడం మాత్రమే వారికి ప్రయారిటీ! సందర్భం ఏదైనా సరే వారికి పట్టింపులేదు. అవతలి వారు ఎంతటి దారిద్ర్యంలో ఉన్నారో, ఎంతటి వేదనలో ఉన్నారో కూడా వారికి అక్కర్లేదు. లంచాలు మింగడం మాత్రమే కాదు.. వేదనలో ఉన్న వారిని పరుషవ్యాఖ్యలతో నొప్పించడం వారి దుర్మార్గానికి మరింత పరాకాష్ట. ఆధునిక సమాజంలో మానవీయ విలువలు పూర్తిగా కనుమరుగైపోయాయని మనం చెప్పలేం. కాకపోతే.. ఇలాంటి ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు మాత్రం ఆ మానవీయతకే తీరని కళంకం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులో ఒక వేదనాభరితమైన దుర్ఘటన చోటుచేసుకుంది. బీపీసీఎల్ సంస్థలో చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్‌గా పనిచేసిన 64 ఏళ్ల కె శివకుమార్ జీవితంలో చోటుచేసుకున్న విషాదం అది. ఆయనకున్న ఏకైక కూతురు అక్షయ శివకుమార్ (34). ఐఐటీ నుంచి బిటెక్ చేసింది, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీయే చేసింది. ఓ మల్టినేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. విషాదం ఏంటంటే.. ఇటీవల ఆమె బ్రెయిన్ హెమరేజ్ తో దుర్మరణం పాలైంది. అసహజ మరణంగా గుర్తించడంతో మెడికో లీగల్ కేసు నమోదు అయింది. ఒక చావు సంభవిస్తే.. అనుబంధాలను పెనవేసుకున్న వందల వేల హృదయాలు దుఃఖిస్తాయి. ఇలాంటి చావు సంభవించినప్పుడు.. దాని నుంచి డబ్బులు ఏరుకోవడానికి పదుల సంఖ్యలో పరాన్నభుక్కుల వంటి కుక్కలు సదా సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి దుర్మార్గాలు, శివకుమార్‌కు వరుసగా స్వానుభవంలోకి వచ్చాయి.అంబులెన్సులో ఆస్పత్రికి, శ్మశానానికి తరలించే వాడికి ఓ రేంజి లంచం, కేసు రిజిస్టరు అయింది గనుక.. బెలందూరు పోలీసు వారికి లంచం, అంతా పూర్తయి కూతురు డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలనుకుంటే.. బెంగుళూరు నగరపాలిక సంస్థ వారికి లంచం.. ఈ వ్యవహారాలతో అసలే దుఃఖంలో ఉన్న ఆయన మరింతగా క్షోభకు గురయ్యారు. లంచాలు డిమాండ్ చేయడం మాత్రమే కాదు.. ఉన్న ఒక్కగానొక్క కూతురును కోల్పోయి పుట్టెడు బాధలో ఉంటే.. లంచం కోసం బెలందూరు పోలీసులు దూషించిన తీరు కూడా ఆయన క్షోభను మరింతగా పెంచింది. ఈ గోడు మొత్తం వెళ్లగక్కుతూ ఆయన ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. ఇలాంటి వారి బారిన పడి.. ఎన్ని వేల లక్షల హృదయాలు ఎంతగా క్షోభిస్తూ ఉంటాయో.. ఆ పోస్టు కాస్తా వైరల్ అయింది. పోలీసు పెద్దలు కొంచెం జాగ్రత్త పడి.. బెలందూరు స్టేషన్లో ఇద్దరిని సస్పెండ్ చేశారు.లంచగొండితనం అనేది ఇవాళ్టి సమాజంలో ఒక యాక్సెప్టబుల్ వ్యవహారం అయిపోయింది. గవర్నమెంటుతో ముడిపడిన ఈ పని మనకు ఉన్నా.. తృణమో పణమో అడక్కముందే సమర్పించేసుకోవడం సాధారణ జనానికి అలవాటుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇలా పుట్టే డబ్బులు పుట్టెడు ఉంటాయి. అలాగని ఒకరో ఇద్దరో దారిద్ర్యంలో పడి అలమటిస్తున్న వారు.. డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉంటే.. ఈ లంచగొండులు విడిచిపెట్టడం లేదు. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో, బాధాకరమైన వేళల్లో కూడా తమ దందా తాము సాగించాలనే అనుకుంటున్నారు. అక్కడే అసలు సమస్య మొదలవుతోంది.‘నేనంటే డబ్బున్న వాణ్ని గనుక.. అందరికీ అడిగినంత లంచాలు ముట్టజెప్పాను. డబ్బులేని పేదల పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆ శివకుమార్ తన పోస్టులో ప్రశ్నించిన తీరు.. సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. ఈసడించుకున్నంత మాత్రాన.. కించిత్తు కూడా ఈ లంచగొండి అవతారాల్లో మార్పు రాదన్నది నిజం. ఎందుకంటే.. ఆస్పత్రుల్లో లంచాలు, తప్పుడు చికిత్సలు, పోలీసుల లంచాలు, నీతిమాలిన వైనం గురించి.. కొన్ని వందల సినిమాల్లో ఘాటుగా చర్చిస్తూనే వచ్చారు. ఏం మారింది సమాజం? అలా లంచం తీసుకోవడాన్ని ఒక లాంఛనంగా, అధికారిక క్రతువులాగా మార్చేసుకుంటున్నారు. కేవలం ఒకటిరెండు సస్పెన్షన్లతో ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట పడుతుందా? ఆ అంబులెన్సు డ్రైవరూ, ఆ ఆసుపత్రి సిబ్బంది, శ్మశానం సిబ్బందీ, బెంగుళూరు కార్పొరేషన్ పెద్దలూ, పోలీసు మహానుభావులూ అందరివీ పత్రికల్లో పెద్దపెద్ద ఫోటోలు వేసి.. చావుల మీద లంచాల డబ్బులు ఏరుకుంటున్న నీచులు వీళ్లేనని తగుమాత్రం ప్రచారం కల్పించాలి. సోషల్ మీడియా లో ఫోటోలతో సహా వారి నీచత్వాన్ని డప్పు కొట్టి మరీ చెప్పాలి. నగరమంతా పోస్టర్లు వేయాలి. వారి బతుకుల్లో సిగ్గు పుట్టించాలి. లేకపోతే ఇలాంటి అరాచకత్వాలకు నిష్కృతి లేదు...ఎం.రాజేశ్వరి -
రిటర్న్ గిఫ్ట్.. ఫుడ్ డెలివరీ కాదు చెత్త డెలివరీ!
పరిశుభ్రత గురించి ఎంతలా అవగాహాన కార్యక్రమాలు చేపట్టినా..మార్పు మాత్రం శూన్యం. స్వచ్ఛభారత్ అంటున్న..చెత్త, అపరిశుభ్రత తాండవిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో బెంగళూరు నగరవాసులకు గట్టి పాఠమే చెప్పనుంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ. చాలా వినూత్నమైన రీతీలో తగిన గుణపాఠం చెబుతోంది. చెప్పినా..వినకపోతే ఈ శాస్తి తప్పదని గట్టిగానే హెచ్చరిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం దీన్ని వింతైన చర్యగా అభివర్ణించడమే కాదు..ఈ పనిష్మెంట్ హాట్‌టాపిక్‌గా మారింది. విననివాళ్లకు అదే 'రిటర్న్ గిఫ్ట్'..ఈ మేరకు బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(బీఎస్‌డబ్ల్యూఎంఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) కరిగౌడ మాట్లాడుతూ.."ఇది వింతైన చర్య కాదు. మా కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి వ్యర్థాలను వేరు చేయడం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పొడి, తడి చెత్తను సేకరించడానికి ఇళ్లకు దాదాపు 5 వేలకు పైగా ఆటోలు వెళ్తున్నాయి. అయినప్పటికీ కొందరు మాత్రం రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. ఆ వ్యక్తులను పట్టుకునేందుకే సీసీటీవీలను కూడా ఏర్పాటు చేశాం. ఎవరైతే చెత్తవెయ్యొదని అవగాహన కల్పిస్తున్నా వేస్తున్నారో వారికి రిటర్న్ గిఫ్ట్‌లా ఆ చెత్తను వాళ్ల ఇంటి వద్ద తిరిగి వేయడమేగాక, రూ. 2000లు వరకు జరిమానా విధిస్తాం. అలాగే ఇదేమి వింతేన చర్య కాదు. ఎందుకంటే మా కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి వ్యర్థాలను వేరు చేయడం గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో కూడా అవగాహన కల్పిస్తున్నాం. అలాగే రోడ్లపై చెత్త వేయకండని అభ్యర్థిస్తున్నాం. అయినా ఇలా చేస్తే..ఇలాంటి చర్య సమంజసమే. బెంగళూరు ఒక "ఉద్యానవన నగరం" అని హైలైట్ చేస్తూ.. ప్రజలను చెత్తను వేయొద్దని, పరిశుభ్రతను కాపాడుకోవాలని చెప్పారు. అయితే కొన్నిచోట్ల చెత్త సేకరించేవారు లేకపోవడంతోనే వాళ్లంతా ఇలా వీధుల్లో చెత్త వేస్తున్నారని అన్నారు. అందుకోసమే భారీ చెత్తడబ్బాలను కూడా ఏర్పాటు చేయనున్నామని." కరిగౌడ తెలిపారు. ఇలాంటి చర్యలు అన్ని రాష్ట్రాల్లో గట్టిగా అమలైతే పూర్తి స్థాయిలో స్వచ్ఛ భారత నినాదం విజయవంతమైనట్లే కదూ..!.(చదవండి: ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు !) -
భారత హాకీ దిగ్గజం కన్నుమూత
భారత హాకీ దిగ్గజం మాన్యుయేల్ ఫ్రెడెరిక్ (Manuel Frederick- 78)కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.మొట్టమొదటి క్రీడాకారుడుకాగా కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన చెందిన ఫ్రెడెరిక్ రాష్ట్రం తరఫున ఒలింపిక్ పతకం గెలిచిన మొట్టమొదటి క్రీడాకారుడు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో భారత్ హాలాండ్‌ను ఓడించి కాంస్య పతకం గెలవడంలో ఆయన గోల్‌కీపర్‌గా తన వంతు పాత్ర పోషించారు.ధ్యాన్ చంద్ అవార్డుఅదే విధంగా.. నేషనల్ చాంపియన్స్ టైబ్రేకర్స్‌లో జట్టును 16 సార్లు విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించారు. భారత జట్టు తరఫున ఏడేళ్లపాటు హాకీ ఆడిన ఫ్రెడెరిక్ 2019లో ధ్యాన్ చంద్ అవార్డు అందుకున్నారు.కాగా ఫుట్‌బాల్ స్ట్రైకర్‌గా కెరీర్ ఆరంభించిన ఫ్రెడెరిక్.. ఆ తర్వాత హాకీ గోల్‌కీపర్‌గా నిలదొక్కుకున్నారు. అక్టోబరు 20, 1947లో జన్మించిన ఫ్రెడెరిక్ పదిహేడేళ్ల వయసులో బాంబే గోల్డ్ కప్ ఆడారు. 1971లో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఫ్రెడెరిక్.. క్యాన్సర్ బారిన పడి లోకాన్ని వీడారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇదీ చదవండి: ప్రాక్టీస్‌లో బంతి తగిలి... యువ క్రికెటర్ మృతి మెల్బోర్న్: ప్రాక్టీస్ సమయంలో బంతి బలంగా తగలడంతో... ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ మృతి చెందాడు. మెల్బోర్న్లో నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మెల్బోర్న్లో ఫెరన్ట్రీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి అతడి మెడకు బలంగా తగిలింది. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా... వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ‘బెన్ ఆస్టిన్ మృతితో పూర్తిగా కుంగిపోయాము. దీని ప్రభావం మొత్తం క్రికెట్‌పై పడుతుంది. ఈ క్లిష్ట సమయంలో అతడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి’ అని క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాక్టీస్ సమయంలో బెన్ హెల్మెట్ ధరించినా... నెక్ గార్డ్ లేకపోవడంతోనే బంతి అతడి మెడ నరాలను దెబ్బతీసింది. 2014లోనూ ఆ్రస్టేలియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. న్యూ సౌత్ వేల్స్‌తో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ సందర్భంగా... సౌత్ ఆ్రస్టేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఫిలిప్ హ్యూగ్స్ 25 ఏళ్ల వయసులో బంతి చెవి దగ్గర బలంగా తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఇప్పుడు తాజా ఘటనతో మరోసారి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం భారత్, ఆసీస్ మధ్య సెమీఫైనల్ సందర్భంగా ప్లేయర్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. చదవండి: చిన్న పిల్లలా ఏడ్చేసిన హర్మన్‌ప్రీత్.. అంబరాన్నంటిన సంబరాలు.. వీడియో -
IND vs SA: కోహ్లిని అవమానించిన రిషభ్ పంత్?!.. ఫ్యాన్స్ ఫైర్
టెస్టు క్రికెట్లో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. సంప్రదాయ ఫార్మాట్లో కెప్టెన్‌గా భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన కోహ్లి.. మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.ఇక టీమిండియా తరఫున మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి.. 9230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు కూడా ఉన్నాయి. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు ముందు తనకు ఇష్టమైన టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లి.భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గాఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ సందర్భంగా పంత్ భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం బెంగళూరు వేదికగా తొలి టెస్టు మొదలైంది.కోహ్లిని అవమానించిన పంత్?!.. ఫ్యాన్స్ ఫైర్ఈ మ్యాచ్‌లో పంత్ ‘18’ నంబర్ ఉన్న జెర్సీ ధరించడం కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కాగా 18 నంబర్ విరాట్ కోహ్లిది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘‘రిషభ్ పంత్ కావాలనే 18వ నంబర్ జెర్సీ ధరించి కోహ్లిని అవహేళన చేయాలని చూస్తున్నాడా?.. కోహ్లి అంటే పడని.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ దృష్టిలో పడి.. అతడిని ఆకట్టుకోవాలనే ఇలా చేస్తున్నాడా?అది కింగ్ కోహ్లి నంబర్. క్రీడా ప్రపంచంలో దిగ్గజ ఆటగాడు రిటైర్ అయిన తర్వాత అతడి గౌరవార్థం జెర్సీ నంబర్‌కు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి’’ అంటూ తీవ్ర స్థాయిలో కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా ఇటీవల భారత్- ‘ఎ’ తరఫున ఇంగ్లండ్ లయన్స్‌తో మ్యాచ్‌లో పేసర్ ముకేశ్ కుమార్ కూడా 18 నంబర్ ఉన్న జెర్సీ ధరించగా ఇలాగే విమర్శలు వచ్చాయి.అసలు విషయం ఇదీ!ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘భారత్- ‘ఎ’ జట్టులో జెర్సీ నంబర్లు ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించబడవు. వాటిపై పేర్లు కూడా ఉండవు. కాబట్టి మ్యాచ్‌కు ముందు తమకు వచ్చిన జెర్సీలను ఆటగాళ్లు ధరిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రమే పర్టికులర్‌గా జెర్సీ నంబర్లకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని తెలిపాయి.కాగా సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో టాస్ గెలిచిన భారత్-‘ఎ’ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 79 ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్!? -
సైడ్ మిర్రర్‌ను తాకాడని..
మెట్రో నగరం బెంగళూరులో మరో ఘాతుకం చోటు చేసుకుంది. తమ కారు సైడ్ మిర్రర్‌కు తాకిందని బైకర్‌తో గొడవపడి.. ఆపై ఆ యువకుడిని వెంటాడి కారుతో గుద్ది చంపారు ఇక్కడో జంట. ఈ షాకింగ్ ఘటనలో పోలీసులు వెల్లడించిన వివరాలు ఉన్నాయి. ఈ నెల 25న అర్ధరాత్రి దర్శన్ తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ఫుట్టనహెళిలోని శ్రీరామ లేఅవుట్ ప్రాంతంలో బైకుపై వెళ్తున్నారు. ఆ సమయంలో పక్కగా వెళుతున్న ఓ కారు సైడు మిర్రర్‌ను వీరి బైకు తాకింది. కారులో ఉన్న దంపతులు బైక్ నడుపుతున్న దర్శన్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న బైకును దంపతులు కారులో రెండు కి.మీ. వెంబడించారు. వెనక నుంచి బైకును ఢీకొట్టి వెళ్లిపోయారు.#Bengaluru Road Rage Turns Deadly!A Kalaripayattu trainer & his wife were arrested for killing a delivery agent near JP Nagar: They rammed their car into his bike after its handle grazed their rear-view mirror. The pillion rider survived the crash.@timesofindia pic.twitter.com/IqlaIedTGt— TOI Bengaluru (@TOIBengaluru) October 29, 2025ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్‌లను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. దర్శన్ చనిపోగా.. వరుణ్ చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేపీనగర పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. యాక్సిడెంట్ తర్వాత కారు నుంచి విడిభాగాలు పడిపోతే ఆ జంట మాస్కులతో వెనక్కి వచ్చి మరీ వాటిని తీసుకెళ్లడం రికార్డైంది. ఈ క్రమంలో.. లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులకు నిందితుల ఆచూకీ లభ్యమైంది. నిందితులను భార్యాభర్తలైన మనోజ్, ఆరతిగా గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. విచారణలో తాము నేరానికి పాల్పడినట్లు వాళ్లు ఒప్పుకున్నారు. తొలుత బైక్‌తో ఢీ కొట్టడానికి ప్రయత్నించగా.. వాళ్లు తప్పించుకున్నారని, ఆపై యూటర్న్ తీసుకుని మరోసారి వెంబడించి మరీ ఢీ కొట్టామని ఈ దంపతులు పోలీసులకు తెలిపారు. -
ముంబై x బెంగళూరు
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) టోర్నీ తుది పోరుకు చేరింది. నాలుగో సీజన్ విజేత ఎవరో నేడు తేలనుంది. ముంబై మిటియోస్, బెంగళూరు టార్పెడోస్ల మధ్య ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో టైటిల్ పోరు జరుగనుంది. ఈ లీగ్ ఆరంభం నుంచి ఇరు జట్లు కూడా నిలకడైన ప్రదర్శనతో అదరగొట్టాయి. లీగ్ దశలో ముంబై ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. టార్పెడోస్ ఒక్క మ్యాచ్ తక్కువగా గెలిచిందంతే! ఏడు మ్యాచ్‌లాడిన బెంగళూరు ఐదింట విజయం సాధించింది. ఇప్పుడు ఈ టాప్–2 జట్లే అమీతుమీకి సిద్ధమవడంతో నేటి ఫైనల్ తుదికంటా ఆసక్తి రేపడం ఖాయం. బెంగళూరుకిది రెండో ఫైనల్. 2023లో తుది పోరుకు చేరినప్పటికీ... అహ్మదాబాద్ డిఫెండర్స్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. రెండేళ్ల క్రితం చేజారిన టైటిల్‌ను ఈసారి కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో బెంగళూరు ఆటగాళ్లున్నారు. లీగ్ టాపర్ ముంబై మిటియోస్కిది తొలి ఫైనల్ కాగా... ఆఖరి పోరులోనూ గెలిచి విజయవంతంగా సీజన్‌ను ముగించాలని ఆశిస్తోంది. మిటియోస్ కెప్టెన్ అమిత్ గులియా ఎప్పటిలాగే సమష్టి ప్రదర్శనపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆరంభం నుంచే మ్యాచ్‌లో పట్టు బిగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతామని చెప్పాడు. మరోవైపు బెంగళూరు సారథి మ్యాట్ వెస్ట్ మాట్లాడుతూ ముంబైలాంటి గట్టి జట్టును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. తమ ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటమే తమకు కలిసొచ్చే అంశమని చెప్పాడు. -
రేపే పీవీఎల్ 2025 ఫైనల్.. టైటిల్ పోరుకు ముంబై, బెంగళూరు సై
హైదరాబాద్: ఆర్ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ తుది పోరులో ముంబై మీటియర్స్, బెంగళూరు టార్పెడోస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఈ బ్లాక్‌బస్టర్ పోరుకు ముందు, ఇరు జట్ల కెప్టెన్లు, కోచ్‌లు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని, గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఫైనల్ పట్ల ఉత్కంఠ, పరస్పర గౌరవం, గెలవాలన్న బలమైన సంకల్పం వాళ్ళ మాటల్లో స్పష్టంగా కనిపించాయి. లీగ్ దశలో ముంబై మీటియర్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి, 17 పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరు జట్టు క్రమశిక్షణ కలిగిన జట్టు అని, దాన్ని ఓడించాలంటే కేవలం తప్పులు చేయకుండా ఉంటే సరిపోదని, అంతకుమించి ఆడాలని ముంబై హెడ్ కోచ్ మాట్ వాన్ వెజెల్ పేర్కొన్నాడు. ప్రతి బంతిని జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంలా ఆడటం తమ జట్టు మానసిక బలమని అన్నాడు. కెప్టెన్ అమిత్ గులియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, గడిచిన పాయింట్ల గురించి కాకుండా రాబోయే పాయింట్‌పైనే దృష్టి సారిస్తామని, జట్టు సమష్టి కృషితో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.మరోవైపు, బెంగళూరు టార్పెడోస్ సైతం బలమైన ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి, 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ముంబై లీగ్‌లోనే అత్యంత నిలకడైన జట్టు అని బెంగళూరు హెడ్ కోచ్ డేవిడ్ లీ ప్రశంసించాడు. అయితే, ఫైనల్ ఫలితం ప్రత్యర్థి ఆటకంటే, తమ సొంత ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుందని, సర్వ్ అండ్ పాస్ గేమ్‌లో దూకుడుగా ఆడతామని స్పష్టం చేశాడు. ముంబైకి ఇది తొలి ఫైనల్ కాగా, 2023లో తన జట్టును ఫైనల్‌కు నడిపిన అనుభవం లీకి ఉంది.ఈసారి టైటిల్ గెలవడం ద్వారా ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఫైనల్లో కీలక ఆటగాళ్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. టార్పెడోస్ తరఫున అటాకర్ జోయెల్ బెంజమిన్ 103 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా ఉండగా, ముంబైకి చెందిన శుభమ్ చౌదరి (102) అతని వెనుకే ఉన్నాడు. అయితే, బెంగళూరు అటాకర్లకు ముంబై బ్లాకర్లు పీటర్ ఓస్ట్విక్, శుభమ్ చౌదరి నుంకి గట్టి సవాలు ఎదురుకానుంది. ఈ ఈద్దరూ లీగ్‌లోని టాప్-5 బ్లాకర్లలో ఉన్నారు. అదే సమయంలో, బెంగళూరు సర్వర్ సేతు (11 సర్వ్ పాయింట్లు) ముంబైకి అతిపెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.బెంగళూరు కెప్టెన్ మాట్ వెస్ట్ మాట్లాడుతూ, "మీరు ఎక్కడ ఉన్నారన్నది కాదు, మీరెలా ఆడతారన్నదే ముఖ్యం. మీ ఆటతీరు మార్చుకోవద్దు" అని సహచరులకు సలహా ఇచ్చాడు. ఫైనల్ ఆడే అరుదైన అవకాశాన్ని ఆస్వాదించాలని పిలుపునిచ్చాడు.ఫైనల్లో ఇరు జట్లు భారతీయ వాలీబాల్లోని అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తాయని ఆశిస్తున్నట్లు రెండు జట్ల కోచ్ లు, కెప్టెన్లు ఆశాభావం వ్యక్తం చేశారు. "పీవీఎల్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలుస్తుంది" అని ముంబై కెప్టెన్ గులియా ముగించాడు. -
హెచ్‌టీటీ–40 టెస్టు సక్సెస్
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారుచేసిన మొట్టమొదటి దేశీయ శిక్షణ విమానం హిందూస్తాన్ టర్బో ట్రైనర్–40(హెచ్‌టీటీ–40) ఆకాశంలో విజయవంతంగా దూసుకెళ్లింది. ఎలాంటి లోపాలు లేకుండా విమా నం అద్భుతమైన స్థిరత్వాన్ని, పనితీరును కనబర్చినట్లు హెచ్ఏఎల్ అధికారులు ధ్రువీకరించారు. శుక్రవారం బెంగళూరులో ఈ విమానాన్ని పరీక్షించారు. హెచ్‌టీటీ–40 అనేది బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పైలట్లకు ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నారు. దీనిద్వారా వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించవచ్చు. సైనిక విన్యాసాలు చేపట్టవచ్చు. రాత్రిపూట కూడా పనిచేస్తుంది. హెచ్‌టీటీ–40ని పూర్తిగా హెచ్ఏఎల్ అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేసింది. ఇందులో అత్యాధునిక వసతులున్నాయి. ఈ విమానంతో తక్కువ ఖర్చుతోనే పైలట్లకు శిక్షణ ఇవ్వొ చ్చు. దేశీయంగానే రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోందని హెచ్ఏఎల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైమానిక దళంలో పాత కాలం నాటికి విమానాలతోనే శిక్షణ ఇస్తున్నారు. వీటి స్థానంలో ఇకపై హెచ్‌టీటీ–40 విమానాలను ప్రవేశపెట్టబోతున్నారు. -
ఇన్ఫోసిస్ క్యాంపస్ పాత వీడియో వైరల్
ఒకప్పుడు సాఫ్ట్వేర్ కార్యాలయాల్లో విరామ సమయాలంటే సహోద్యోగులతో సరదా సంభాషణలు, కలిసి భోజనం చేస్తూ అనుభవాలు పెంచుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం విరామ సమయాల్లో ఫోన్లను చూస్తూ గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 1990 దశకంలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంటీన్ లోపల తీసిన ఒక పాత వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో యువ నిపుణుల బృందం భోజనం చేస్తూ, ఉల్లాసంగా మాటామంతి చేస్తూ, నవ్వుతూ కనిపిస్తున్నారు. ‘1990లలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంటీన్ ఫుటేజ్. ఇందులో దాదాపు చాలామంది మల్టీ-మిలియనీర్లు అయ్యారు. ప్రస్తుతం వారు విదేశాల్లో స్థిరపడ్డారు’ అనే క్యాప్షన్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ సమయంలో భారతదేశ సాంకేతిక విప్లవంలో తాము భాగమవుతున్నామన్న విషయం వారికి తెలియకపోయి ఉండవచ్చు. ఈ వీడియో మాజీ ఉద్యోగులు, ఐటీ ఎక్స్‌పర్ట్‌లతో సహా అనేక మందిని ఆకట్టుకుంది.దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..‘చాలా క్లాస్! వారు రిలాక్స్‌గా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్‌గా, తెలివిగా ఉన్నారు. చేతిలో ఫోన్ కూడా లేదు. అవి నిజంగా గోల్డెన్ డేస్’ అని ఒకరు రాశారు. మరొకరు ‘కులం, మతం, లింగ వ్యత్యాసాలను పట్టించుకోని, సమాజంలో సానుకూలంగా ప్రభావితమైన క్యాంపస్’ అని రాశారు.Footage from Infosys canteen, Bangalore in 1990s. Almost everyone in this is probably a multi-millionaire and settled abroad today. pic.twitter.com/nTKDQMiXrJ— Arjun* (@mxtaverse) October 18, 2025ఇదీ చదవండి: చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే.. -
వివాదం వేళ ట్విస్ట్.. డీకేతో కిరణ్ మజుందార్ షా భేటీ
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో బయోకాన్(Biocon) ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా(Kiran Mazumdar-Shaw) భేటీ అయ్యారు. బెంగళూరు రోడ్ల దుస్థితి, చెత్త సమస్యలపై ఇటీవల బయోకాన్ ఛైర్మన్ పోస్టులు పెట్టారు. దీనిపై డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కిరణ్ మజుందార్‌కు మద్దతుగా నిలిచిన పారిశ్రామిక వేత్త హర్ష్ గొయెంకా.. సమస్యకు పరిష్కారం వెతకకుండా.. రాజకీయాలా? అంటూ నేతలపై మండిపడ్డారు.ఈ రోడ్లపై వివాదం నేపథ్యంలో డీకేతో బయోకాన్ ఛైర్మన్ భేటీ కావడం విశేషం. సమావేశంలో నగర మౌలిక సదుపాయాలపై ఆమె చేసిన విమర్శలపై చర్చ జరిగినట్లు సమాచారం. శివకుమార్ ఆమెకు సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ‘‘ఈ రోజు తన నివాసంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్-షాను కలవడం ఆనందంగా ఉందంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. బెంగళూరులో అభివృద్ధి, ఆవిష్కరణలు, రాష్ట్ర ప్రగతి దిశలో ముందుకు సాగే మార్గం గురించి తాము చర్చ జరిపాం’’ అంటూ ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.#WATCH | Bengaluru | Biocon Chairman, Kiran Mazumdar Shah met Karnataka Deputy Chief Minister DK Shivakumar. Visuals from outside Dy CM DK Shivakumar's residence. https://t.co/ktBNzwI3AO pic.twitter.com/qLF9l3zo2M— ANI (@ANI) October 21, 2025ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఓ విదేశీ విజిటర్.. బెంగళూరు నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానంటూ ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. దీంతో ఆ పోస్టుపై బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలు చేశారు. డీకే శివకుమార్ రోడ్లపై పెడుతున్న పోస్టులపై కౌంటరిస్తూ.. కాస్త ఘాటుగా బదులిచ్చారు. మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చంటూ పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే.. ఆ గుంతలు పూడ్చేందుకు రోడ్లను కేటాయిస్తామన్నారు. It was a pleasure to meet Ms. @kiranshaw, entrepreneur and Founder of Biocon, at my residence today. We had an engaging discussion on Bengaluru’s growth, innovation, and the path ahead for Karnataka’s growth story. pic.twitter.com/NsEkos6tFS— DK Shivakumar (@DKShivakumar) October 21, 2025 -
వైఎస్ జగన్ నివాసంలో దీపావళి వేడుకలు
బెంగళూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్ జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు.దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్ ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
బెంగుళూరులో దారుణం.. సీసీ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు
బెంగుళూరు: ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం.. బెంగుళూరులో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. గత నెల సెప్టెంబర్ 13న గణేష్ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాకు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి.. నగలు దోచుకున్నారు. నిందితులను ప్రవీణ్, యోగనందగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై ఆ మహిళల వద్దకు వచ్చి వారి బంగారు గొలుసులను లాక్కోవడానికి ప్రయత్నించారు.భయపడిన ఉష తన గొలుసును వారికి ఇచ్చేసింది. కానీ మరొక మహిళ వరలక్ష్మి, ప్రతిఘటించింది. దీంతో యోగానంద ఆమెపై కత్తితో క్రూరంగా దాడి చేసి.. రెండు వేళ్లను నరికాడు. ఆ తర్వాత నిందితులు 55 గ్రాముల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి పారిపోయారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది.ఈ ఘటనపై పోలీసులు వారాల తరబడి దర్యాప్తు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్టు చేసింది. వారు దొంగిలించిన బంగారాన్ని, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత యోగనంద పుదుచ్చేరి, ముంబై, గోవా వంటి నగరాలకు పారిపోయి.. ఆ తర్వాత కర్ణాటకలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అతనికి గతంలో నేర చరిత్ర ఉందని, ఒక హత్య కేసులో కూడా ప్రమేయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు వరలక్ష్మి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.On camera: Two men on a bike wielding machetes rob women in Bengaluru, chop off two fingers and snatch their gold chain. Arrested after a month, police have now recovered 74g of gold and the weapons.https://t.co/ymRnB0fF5t pic.twitter.com/ElKFdlFKH2— Deepak Bopanna (@dpkBopanna) October 18, 2025 -
ఒకప్పుడు మిలిటరీ డాక్టర్.. ఇప్పుడేమో క్యాబ్ డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఓ మహిళకు కెనడాలో కారులో మిస్సిస్సాగా నుంచి టొరంటోకు ప్రయాణిస్తున్నప్పుడు వింత అనుభవం ఎదురైంది. తాను ఎక్కిన క్యాబ్ డ్రైవర్‌తో మాటామంతి సాగిస్తుండగా తన ప్రొఫైల్ విని ఆశ్చర్యపోయింది. ఆ డ్రైవర్ తనతో ఏ విషయాలు పంచుకున్నారో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయింది.క్యాబ్ డ్రైవర్ బెంగళూరు మహిళ మేఘనా శ్రీనివాస్‌తో చెప్పిన వివరాల ప్రకారం..‘నేను ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వ్యక్తిని. గతంలో యూఎస్, కెనడా కోసం మిలిటరీలో వైద్యుడిగా పనిచేశాను. ప్రస్తుతం కెనడాలో పర్మనెంట్ రెసిడెంట్(PR) కోసం ప్రయత్నిస్తున్నాను. నా వైద్య వృత్తిని కొనసాగించడానికి అవసరమైన లైసెన్స్ పొందడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం కెనడాలో ఒక డిగ్రీ కోసం చదువుతున్నాను. రోజువారీ ఖర్చుల కోసం ఇలా క్యాబ్ నడుపుతున్నాను. క్యాబ్ నడపడం ద్వారా సుమారు నెలకు 4,000 డాలర్లు సంపాదిస్తున్నాను. కానీ టొరంటోలో ఒక పడకగదికి సుమారు 3,000(రూ.2.63 లక్షలు) డాలర్లు చెల్లించవలసి వస్తుంది. టొరంటోలో అద్దెగదులు చాలా ఖరీదైనవి’మేఘనా తన పోస్ట్‌లో విదేశాలకు మకాం మార్చే ముందు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి సరైన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. కెనడాకు వెళ్లే ముందు విద్యార్థులు, ఇతర వ్యక్తులు క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. అక్కడి విద్యా వ్యవస్థ లేదా నగరాల గురించి మాత్రమే కాకుండా జీవన ఖర్చులు, విధానాలు, ఉద్యోగ మార్కెట్.. వంటి చాలా అంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలని తెలిపారు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో విస్తుపోయే విషయాలు
ఆ ఇద్దరూ క్లాస్మేట్స్. అయితే బ్యాక్‌లాగ్స్‌తో అతగాడు ఆమెకు ఓ సెమిస్టర్ జూనియర్ అయిపోయాడు. అయినా వాళ్ల మధ్య స్నేహం కొనసాగింది. ఇదే అదనుగా.. అదీ కాలేజీ క్యాంపస్‌లో.. అందులోనూ మెన్స్ టాయ్లెట్లో ఆమెపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడిని జీవన్ గౌడ(21)గా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం అతనితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు(20), జీవన్ ఒకేసారి కాలేజీలో చేరారు. ఈ క్రమంలో జీవన్ ఓ సెమిస్టర్ తప్పడంతో వెనకబడిపోయాడు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం కాలేజీకి బాధితురాలికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని జీవన్ రిసీవ్ చేసుకుని ఆ వంకతో యువతిని కలిసి అందించాడు. దానిని అందుకుని ఆమె అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. అయితే.. మధ్యాహ్నాం లంచ్ సమయంలో ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలంటూ ఏడో ఫ్లోర్లో ఉన్న అర్కిటెక్ట్ బ్లాక్ దగ్గరకు రావాలంటూ పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెకు ఎవరూ లేనిది చూసి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో భయానికి గురైన యువతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. అయితే.. లిఫ్ట్‌లో ఆమెతో పాటే కిందకు వెళ్లి.. ఆమె నోరు మూసేసి ఆరో ఫ్లోర్లో ఉన్న మెన్స్ టాయ్లెట్లోకి లాక్కెల్లాడు. అక్కడ వాష్‌రూంలో తలుపు బిగించి 20 నిమిషాలపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన తరవాత ఆమె హాస్టల్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పింది. ఆ సమయంలో మరోసారి కాల్ చేసిన నిందితుడు పిల్ కావాలా సీనియర్?( ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర) అంటూ వెటకారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అయితే.. ఇదంతా మాములు విషయమని, పెద్దది చేయొద్దంటూ తోటి రూమ్స్మేట్స్కు ఆమెకు సలహా పడేశారు.అయితే.. జరిగిన విషయాన్ని రెండు రోజుల తర్వాత పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వాళలు బెంగళూరు వచ్చి.. అక్టోబర్ 15వ తేదీన హనుమంత నగర పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన క్యాంపస్ ఫ్లోర్లో సీసీకెమెరాలు లేకపోవడంతో.. ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు జీవన్ నేరానికి పాల్పడింది నిర్ధారించుకుని.. అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం.. రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ఘటనతో రుజువైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించగా.. ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.ఇదీ చదవండి: వెనక నుంచి వచ్చి.. యామిని మెడపై కత్తి పెట్టి! -
అయ్యో.. యామిని!
కర్ణాటక రాజధాని నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది జరిగింది. ఓ యువతిని వెనక నుంచి వచ్చిన ఓ యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటనలో.. గిలగిలా కొట్టుకుంటూ ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం మధ్యాహ్నాం శ్రీరాంపుర ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హోస్కెరెహళ్లి ಹೊಸಕೆರೆಹಳ್ಳಿలో యామిని ప్రియ(20) కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బీఫార్మసీ చదువుతున్న ఆమె గురువారం పరీక్ష కోసమని ఉదయం 7.గంకే ఇంటి నుంచి బయల్దేరింది. అయితే.. మధ్యాహ్నాం 3గం. సమయంలో మంత్రిమాల్ వద్ద శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై ఓ యువకుడు దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో యామిని ప్రియ కుప్పకూలిపోగా.. ఊహించని ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. శ్రీరాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.ప్రియా యామిని ఆ నిందితుడి బైక్ మీదే వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రేమ కోణం ఉందనే చర్చ నడుస్తోంది. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.A 20 year old college student, Yamini Priya,was murdered by a known individual who slit her throat near the railway tracks in Srirampura,#Bengaluru.The victim was returning from college when she was attacked.Police have launched a manhunt to apprehend the accused..@DCPNorthBCP pic.twitter.com/3zMrcVEx1s— Yasir Mushtaq (@path2shah) October 16, 2025ఇదీ చూశారా?.. యువకుడి టైమింగ్‌తో తల్లీబిడ్డా సేఫ్! -
షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
బెంగళూరు: ఆ దంపతులు ఇద్దరూ వైద్యులు. అనారోగ్యం పాలైన భార్యకు వైద్యం చేయించడానికి బదులు ఏకంగా ఆమె ప్రాణమే తీశాడు ఆ భర్త. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భార్యను హతమార్చి.. సహజ మరణంగా కుటుంబ సభ్యులను నమ్మించాడు. కానీ చివరకు నిజం బయట పడింది. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్. కాగా, కృతికారెడ్డి గ్యాస్ట్రిక్, షుగర్ వంటి సమస్యలతో బాధ పడుతోంది. పెళ్లి సమయంలో ఈ సమస్యలు ఉన్నట్లు భార్య కుటుంబం తనకు చెప్పలేదని మహేంద్రరెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. రోజూ వాంతులు, ఇతరత్రా రుగ్మతలతో ఇబ్బందులు పడే భార్యను హత్య చేసి, అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆరోగ్యం (Health) సరిగా లేదని కృతికారెడ్డి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, మహేంద్రరెడ్డి ఆమెకు ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇలా రెండు రోజులు వరుసగా ఇవ్వడంతో ఆమె ఏప్రిల్ 23వ తేదీన మరణించింది. ఆపై తన భార్య అనారోగ్యంతో బాధ పడుతోందని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో మారతహళ్లి పోలీసులు వెళ్లి పరిశీలించారు. వారి ఇంట్లో నుంచి ఇంజెక్షన్, ఐవీ సెట్ వంటి ఉప కరణాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మృతదేహం నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులుఈ నెల 13వ తేదీన అందిన రిపోర్టులో కృతికారెడ్డి దేహంలో ఎక్కువ మొత్తంలో మత్తు మందు ఆనవాళ్లు కనిపించాయని ఉంది. దీంతో అల్లుడే కూతురిని హత్య చేశాడని మృతురాలి తండ్రి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు డాక్టర్ మహేంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆమె భర్త తప్పుడు ఉద్దేశంతో కావాలనే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. -
కర్ణాటక ఓటర్ల జాబితా మోసాలపైసిట్ ఏర్పాటుకు సుప్రీం నో
న్యూఢిల్లీ: బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ‘మేము పిటిషనర్ తరఫు వాదనలు విన్నాం. ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్)గా దాఖలైన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము. పిటిషనర్ కావాలంటే ఎన్నికల సంఘం ముందు తన అభ్యర్థనను ఉంచవచ్చు’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం తమ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది రోహిత్ పాండే చేసిన అభ్యర్థనను సైతం ధర్మాసనం త్రోసిపుచి్చంది. ఇలాంటి సందర్భాల్లో తగిన న్యాయ మార్గాలను అనుసరించవచ్చని సుప్రీం సూచించింది.


