
శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కర్ణాటకలో పర్యటించారు. మూడు వందే భారత్ రైళ్లు, మెట్రో ఎల్లో మార్గాన్ని ఆయన ప్రారంభించారు. ప్రత్యేక విమానంలో హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మేఖ్రి సర్కిల్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మెజెస్టిక్‌లోని సంగొళ్లి రాయణ్ణ రైల్వేస్టేషన్‌కు చేరుకొని బెంగళూరు– బెళగావి మధ్య వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపారు. అలాగే అమృత్‌సర్– శ్రీమాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్, నాగపూర్–పూణె మధ్య వందే భారత్ రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం ఆర్‌వీ రోడ్డు రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌కు చేరుకొని మెట్రో ఎల్లో మార్గం ప్రారంభించి.. మెట్రో రైలులో ఎల్రక్టానిక్ సిటీ వరకు ప్రయాణించారు.
#WATCH | Bengaluru | Prime Minister Narendra Modi, along with Karnataka CM Siddaramaiah, Dy CM DK Shivakumar, and Union Minister Manohar Lal Khattar, undertakes a metro ride from RV Road (Ragigudda) to Electronic City metro station via the Yellow line that PM Modi inaugurated… pic.twitter.com/RxB1AcCPwC
— ANI (@ANI) August 10, 2025
ఎల్రక్టానిక్ సిటీలో ఐఐఐటీ సభా మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెట్రో 3వ దశకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించారు. బెంగళూరు-బెళగావి వందే భారత్ రైలు సంచారంతో కళ్యాణ కర్ణాటకకు రవాణా వసతి మరింత మెరుగుపడుతుంది. ఈ రైలు బుధవారం తప్ప వారంలో అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది. రోజూ ఉదయం 5.20కి బెళగావిలో బయలుదేరి మధ్యాహ్నం 1.50కి బెంగళూరు రాయణ్ణ రైల్వే స్టేషన్‌కు చేరుకొంటుంది. మధ్యాహ్నం 2.20కి రాయణ్ణ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి బెళగావికి రాత్రికి 10.40కి బెళగావి చేరుకొంటుంది. యశ్వంతపుర, తుమకూరు, దావణగెరె, హావేరి, హుబ్లీ–ధారవాడ స్టేషన్‌లలో నిలుస్తుంది.