Vande Bharat Express
-
కశ్మీర్‌కు వందేభారత్ .. టిక్కెట్ ఎంత? ఏ రూట్లో వెళుతుంది?
రాబోయే వేసవి సెలవుల్లో కుటుంబంతోపాలు ఆనందంగా గడపాలని అనుకుంటున్నారా? అయితే అందుకు కశ్మీర్‌కు వెళ్లే వందేభారత్ సిద్ధంగా ఉంది. అందమైన లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సహజసిద్ధ అందాలను ఈ రైలులో నుంచి చూసి ఎంతగానో ఆనందించవచ్చు. అంతేకాదు ఈ ప్రయాణంలోని మధురానుభూతులను మీ వెంట తీసుకెళ్లవచ్చు.ఇదంతా ఎంతో దూరంలో లేదు. కశ్మీర్‌కు ప్రతిపాదిత వందే భారత్ రైలును ఎప్పుటి నుంచి నడుపుతారనే దానికి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఒక సీనియర్ రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న శ్రీనగర్‌కు వెళ్లే వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. శ్రీనగర్‌కు నడిచే ఈ వందే భారత్ రైలు కాట్రా- శ్రీనగర్ మధ్య నడుస్తుంది. అంటే ఢిల్లీలో లేదా దేశంలోని మరో ఇతర ప్రాంతంలో నివసిస్తున్నవారు ముందుగా కాట్రా చేరుకోవాలి. ఇక్కడి నుండి కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలులో శ్రీనగర్‌కు చేరుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఢిల్లీ నుంచి కట్రాకు గల వందేభారత్ రైలులో కట్రా చేరుకుని, అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్లవచ్చు. కాగా కట్రా- శ్రీనగర్ మధ్య నడిచే కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలు దేశంలోని ఇతర ప్రాంతాలకు నడిచే వందే భారత్ రైళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.కశ్మీర్‌కు నడిచే ప్రత్యేక వందే భారత్ రైలును అక్కడి వాతావరణం, అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ ప్రత్యేక రైలు -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రయాణిస్తుంది. ఈ రైలులోని కోచ్‌లు చైర్ కార్లు, జనరల్ చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్లుగా విభజించారు. కొన్ని నెలల తర్వాత ఈ రైలును జమ్మూ వరకు పొడిగించనున్నారు. అప్పటి నుంచి ఈ రైలు జమ్మూ- శ్రీనగర్ మధ్య నడవనుంది. ఈ రైలు మార్గంలో రియాసి, బక్కల్, దుగ్గ, సవల్కోట్, సంగల్డాన్, సుంబెర్, ఖారి, బనిహాల్, ఖాజిగుండ్, సదురా, అనంతనాగ్, బిజ్బెహారా, పంజ్‌గామ్, అవంతిపోరా, రత్నిపోరా, కాకాపోరా, పాంపోర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు కాట్రా నుంచి శ్రీనగర్‌కు రెండున్నర నుండి మూడు గంటల్లో చేరుకుంటుంది.రైల్వే వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ రైలులో ఏసీ చైర్ కార్ ఛార్జీ రూ.1500 నుంచి రూ.1700 మధ్య ఉండే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ రూ. 2400 నుండి రూ. 2600 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 17న రైలు ప్రారంభించిన అనంతరం రైల్వే అధికారులు ఛార్జీలను ప్రకటించనున్నారు. అప్పటి నుంచి సీట్ల బుకింగ్ ప్రారంభం కానుంది. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్? -
హైరిస్క్ జోన్లో వందేభారత్!
కుదుపులు లేని వేగవంతమైన ప్రయాణం, ఆధునిక కప్లింగ్ సిస్టం వల్ల కోచ్‌ల మధ్య సమన్వయం, ‘కవచ్’(Kavach)ఏర్పాటుతో ప్రమాదాలకు అతి తక్కువ ఆస్కారం.. వందేభారత్ రైళ్ల(Vande Bharat) గురించి రైల్వే శాఖ చెప్పే విశేషాలివి. నిజానికి ఈ రైళ్లు హై రిస్క్ జోన్లో పరుగు పెడుతున్నాయి. ఒక్క ప్రాంతంలో తప్ప మరెక్కడా రైలు ప్రమాదాలు నివారించే కవచ్ వ్యవస్థ ఈ రైళ్లలో లేదు. ఢిల్లీ–ఆగ్రా, మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. నిడివిలో మాత్రమే వందేభారత్ రైళ్లు సురక్షితంగా ప్రయాణిస్తాయి.మిగతా ప్రాంతాల్లో సాధారణ రైళ్లకు ఉన్న ప్రమాద భయం వీటినీ వెంటాడుతోంది. గంటకు 50 – 70 కి.మీ. సగటు వేగంతో ప్రయాణించే సాధారణ రైళ్లు నిరంతరం ‘రిస్క్’లో ఉంటే.. 100 కి.మీ. సగటు వేగం (గరిష్టం 130 కి.మీ.)తో దూసుకెళ్లే వందేభారత్ రైళ్లు హై రిస్కులో ఉన్నాయని స్పష్టమవుతోంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న ఐదు వందేభారత్ రైళ్లు ప్రమాదకరంగానే పరుగు పెడుతున్నాయి. పట్టాలపై రైళ్ల అధిక సాంద్రత, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించకపోవటం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఆ పరికరం నిరుపయోగమే.. ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో కవచ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. లోకో పైలట్ నిర్లక్ష్యంగా ఉన్నా, తప్పుడు సిగ్నల్‌తో వేరే రైళ్లకు చేరువగా దూసుకెళ్లినా రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుందనే భావన చాలా మందిలో ఉంది. కానీ, రైళ్ల లోకోమోటివ్‌లలో మాత్రమే కవచ్ యంత్రం ఉంటే నిరుపయోగమే. కవచ్ వ్యవస్థ పనిచేయాలంటే, రైలు ఇంజిన్లలో కవచ్ పరికరం ఉండటంతో పాటు, ప్రతి స్టేషన్లో కవచ్ వ్యవస్థ ఉండాలి.అక్కడి ట్రాక్ వెంట ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్ ఏర్పాటు చేయాలి. ట్రాక్ వెంట ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉండాలి. వీటిని అనుసంధానిస్తూ ఆ మార్గంలో నిర్ధారిత నిడివిలో టెలికం టవర్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ అనుసంధానమై పనిచేసినప్పుడే రైళ్లు వాటంతట అవి ప్రమాదాన్ని నివారించుకోగలవు. లోకో పైలట్లను కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. మిగతావి ఏవీ లేకుండా కేవలం ఇంజిన్లలో కవచ్ పరికరంతో పరుగుపెట్టే వందేభారత్‌లు ప్రమాదాన్ని నివారించుకోలేవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఒకే మార్గంలో.. ఢిల్లీ–ఆగ్రా మధ్య దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ పరుగు పెడుతోంది. దీని వేగం గంటకు 160 కి.మీ.. ఈ వేగాన్ని సాధారణ ట్రాక్ తట్టుకోలేదన్న ఉద్దేశంతో ఆ మార్గంలో 125 కి.మీ. ప్రత్యేక ట్రాక్ నిర్మించారు. అదే మార్గంలోని మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. మేర పూర్తిస్థాయి కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. ఆ మార్గంలో మాత్రమే రైళ్లు కవచ్ రక్షణతో ఉన్నట్టు. ఆ మార్గంలో ఒకే ఒక వందేభారత్ రైలు నడుస్తోంది.దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లింగంపల్లి–వికారాబాద్–వాడీ సెక్షన్ల మధ్య 245 కి.మీ. మేర కవచ్ ఏర్పాటైంది. కానీ ఆ మార్గంలో వందేభారత్ రైలు తిరగటం లేదు. మన్మాడ్–ముధ్ఖేడ్–డోన్ మధ్య 959 కి.మీ... బీదర్–పర్బణి మధ్య 241 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. నార్తర్న్ రైల్వే పరిధిలో కూడా కొంతమేర ఉంది. మొత్తంగా 1,548 రూట్ కి.మీ. మేర మాత్రమే ఇది ఏర్పడింది. మరో 3 వేల కి.మీ.లో పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వందేభారత్ రైళ్లను పెంచటంపై ప్రదర్శిస్తున్న వేగం.. కవచ్ వ్యవస్థ ఏర్పాటులో చూపటం లేదు. -
వందేభారత్ రైళ్లలో భోజనం.. రైల్వే కీలక ప్రకటన
న్యూఢిల్లీ:వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు రైల్వేశాఖ తాజాగా మరో సదుపాయం కల్పించింది. టికెట్ బుకింగ్ సమయంలో ‘ఫుడ్ ఆప్షన్’ ఎంచుకోని వారికి కూడా ప్రయాణం సమయంలో అప్పటికప్పుడు ఆహారం అందించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే అప్పటికప్పుడు కొనుగోలు చేసేందుకు ప్రయాణికులకు అవకాశం కల్పించనుంది.టికెట్ బుకింగ్ సమయంలో ‘ఫుడ్ ఆప్షన్’ ఎంచుకున్న వారికే ప్రస్తుతం ఆ సేవలను ఐఆర్సీటీసీ అందిస్తోంది. ప్రయాణంలో భోజన వసతి కల్పించడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఐఆర్సీటీసీ మార్పులు చేసింది. ఈ మేరకు ఇండియన్ రైల్వే శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక ప్రకటన విడుదల చేసింది. -
కశ్మీర్‌కు వందేభారత్ రికార్డు పరుగు
శ్రీనగర్: కశ్మీర్‌ను రైలు మార్గం ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే బృహత్ కార్యక్రమం విజయవంతమైంది. శనివారం ప్రఖ్యాత వైష్ణో దేవి ఆలయం నెలకొన్న జమ్మూలోని కాట్రా నుంచి కశ్మీర్‌లోని బుద్గాం వరకు వందే భారత్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. నౌగావ్ ప్రాంతంలోని శ్రీనగర్ స్టేషన్‌కు ఉదయం 11.30 గంటల సమయంలో ఆరెంజ్– గ్రే– కలర్ రైలు చేరుకుంది. ఆ రైలులో వచ్చిన వారికి జనం పూల దండలతో స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో మంచు, అతిశీతల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అత్యాధునిక వసతులతో రూపొందించిన ప్రత్యేక రైలు శుక్రవారం జమ్మూకు చేరుకుంది. ట్రయల్ రన్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంజి ఖాద్ వంతెనతోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ వంతెన మీదుగా ఈ రైలు పరుగులు తీసిందని అధికారులు తెలిపారు. కొద్ది సమయం తర్వాత రైలు బుద్గాం స్టేషన్ నుంచి ముందుకు వెళ్లి ట్రయల్ రన్‌ను పూర్తి చేసింది. ఉత్తర రైల్వే చీఫ్ ఏరియా మేనేజర్(శ్రీనగర్) సకీబ్ యూసఫ్ మాట్లాడుతూ.. ఈ ట్రయల్ రన్ చారిత్రక ఘట్టంగా అభివరి్ణంచారు. ఇంజినీరింగ్ అధికారుల పదేళ్ల శ్రమకు తగిన ప్రతిఫలమన్నారు. రైల్వే సేఫ్టీ కమినర్ కూడా ధ్రువీకరించినందున కాట్రా–బారాముల్లా సెక్షన్లో నడిచే ఈ రైలును త్వరలోనే ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించే అవకాశముంది. సుమారు 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్–శ్రీనగర్– బారాముల్లా రైల్ లింక్(యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టును రైల్వే శాఖ డిసెంబర్లో పూర్తి చేసింది. వాతావరణానికి తగ్గ ఏర్పాట్లు కాట్రా–శ్రీనగర్ రైలు మార్గం కోసం జమ్మూకశ్మీర్‌లోని పర్వత ప్రాంతంలోని శీతాకాల పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును గతేడాది జూన్ 8వ తేదీన అధికారులు ఆవిష్కరించారు. ఇందులో ఇతర వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఉండే వసతులతోపాటు అనేక ప్రత్యేకతలున్నాయి. శీతాకాలంలో రైలులోని పైపులు, బయో టాయిలెంట్ ట్యాంకుల్లో నీరు గడ్డకట్టకుండా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థను అమర్చారు. వాక్యూమ్ సిస్టమ్‌కు వెచ్చని గాలి అందేలా చేశారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినా ఎయిర్ బ్రేక్ వ్యవస్థ యథా ప్రకారం పనిచేస్తుంది. తీవ్రంగా మంచు కురుస్తున్న సమయంలో సైతం డ్రైవర్ ముందున్న వస్తువులను స్పష్టంగా చూడగలిగేలా విండ్ షీల్డ్‌పై పేరుకుపోయిన మంచును స్వయంచాలితంగా తొలగించే ఏర్పాటుంది. అదనంగా మిగతా వందే భారత్ రైళ్లలో ఉండే ఇతర అన్ని వసతులు..ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, మొబైల్ చార్జింగ్ సాకెట్ల వంటివి ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ రైలు వంతెన అంజి ఖాద్ బ్రిడ్జి, చినాబ్ నదిపై కౌరి వద్ద నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జిల మీదుగా గత నెలలో ఈ రైలును ఆరుసార్లు ప్రయోగాత్మకంగా నడిపారు. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులోని భాగమైన అంజి ఖాద్ వంతెన ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. నది గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఒకే ఒక పైలాన్‌పై నిర్మితమైన వారధి ఇది. పునాది నుంచి దీని ఎత్తు 191 మీటర్లు. దీనిని పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులకు ఏళ్లు పట్టింది. మొత్తం 473.25 మీటర్ల పొడవైన అంజి ఖాద్ వంతెన ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, చినాబ్ నదిపైప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల పొడవెక్కువ. -
కశ్మీర్‌కు వందేభారత్.. మంచులోనూ వెచ్చదనం
దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతూ, ప్రయాణికులకు నూతన రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి. తాజాగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రైల్వే లైన్ ద్వారా దేశాన్ని అనుసంధానించడానికి ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్(యూఎస్బీఆర్ఎల్) పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఢిల్లీ నుండి రైళ్లు కశ్మీర్‌కు బయలుదేరనున్నాయి. ఈ మార్గంలో నడిపేందుకు ముందుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంపిక చేశారు. అయితే కశ్మీర్ లోయలో హిమపాతం, అక్కడి సబ్-జీరో ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ వందేభారత్ రైలులో పలు నూతన ఫీచర్లను జోడించారు.ఇప్పటివరకు కశ్మీర్ వైపు వెళ్లే రైళ్లు కాట్రా వరకు మాత్రమే నడుస్తున్నాయి. తదుపరి రైల్వే లైన్ వేసే పనిని వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్(USBRL Project) కింద చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా 17 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది. ఇది త్వరలో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్మూ, కాట్రా గుండా వెళతాయి. సంగల్డాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీనిని రోడ్డు మార్గంతో పోలిస్తే, ఆరు గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం అవుతుంది.కశ్మీర్ లోయ వరకూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందే భారత్‌ను ఎంపిక చేశారు. ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. రైలు బయట మంచుకురుస్తుంటో లోపలి ప్రయాణికులు వెచ్చదనాన్ని అనుభవించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్లో రైళ్లు నడపడానికి మంచు కురువడం, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ప్రధాన సవాలుగా నిలుస్తున్నాయి. విండ్ స్క్రీన్ పై మంచు కురుస్తున్న కారణంగా, లోకో పైలట్ ముందున్న రోడ్డును చూడలేకపోతారు. మైనస్ ఉష్ణోగ్రత(Subzero temperature)లో టాయిలెట్ పైప్లైన్లు కూడా స్తంభించిపోతాయి. అలాగే విపరీతమైన చలి కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.కశ్మీర్‌కు నడిపేందుకు రూపొందించిన రైలులో పైలట్ క్యాబిన్ విండ్‌స్క్రీన్ డబుల్ లేయర్ గ్లాస్‌తో తయారు చేశారని, మధ్యలో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఉత్తర రైల్వే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ మీడియాకు తెలిపారు. ఈ సాంకేతికత కారణంగా గ్లాస్‌కు అంటుకున్న మంచు వెంటనే కిందకు జారిపోతుందన్నారు. వైపర్ నుండి వేడి నీరు కూడా బయటకు వస్తుందని, ఇది మిగిలిన మంచు, ఆవిరిని తొలగిస్తుందన్నారు. కొత్త ఫీచర్లతో కూడిన ఈ వందే భారత్‌లో లోకో పైలట్ క్యాబిన్‌లోని సీట్లు కూడా మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. రైలు అంతటా హీటర్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌లో హై లెవల్ థర్మోస్టాట్ లేయరింగ్ ఉంటుంది. తద్వారా సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా లోపలి ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉంటుంది.వందే భారత్ టాయిలెట్లలో నీటి పైప్‌లైన్‌ను సిలికాన్ హీటింగ్ ప్యాడ్లతో ఇన్సులేట్ చేశారు. తద్వారా బయో టాయిలెట్‌లోని ట్యాంక్‌కు హీటింగ్ కూడా అందుతుంది. ఫలితంగా దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు. ఇదేవిధంగా ఈ నూతన వందే భారత్ రైలు కిటికీలకు డబుల్ లేయర్డ్ గ్లాస్ కూడా అమర్చారు. దీంతో ఎవరైనా ఒకవేళ రాయి విసిరినప్పటికీ, పైగాజు మాత్రమే పగిలిపోతుంది. ప్రయాణికులకు ఎటువంటి హాని వాటిల్లదు.ఇది కూడా చదవండి: సంధ్యావేళ.. మహా కుంభమేళా -
చర్లపల్లి టెర్మినల్‌తో గణనీయ అభివృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్‌ను ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో గణనీయ అభివృద్ధి సాకారం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. చర్లపల్లి స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, సౌరశక్తితో నడిచే కార్యకలాపాలతో సహా సుస్థిరమైన మౌలిక ఆధునిక సౌకర్యాలను సృష్టించడంలో ఇది ఒక ముందడుగు అని అన్నారు. ఈ కొత్త టెర్మినల్ సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడలలోని ప్రస్తుత స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రజలకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి ప్రాజెక్ట్‌లు ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడమే కాకుండా, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వ్యాపారాన్ని సులభతరం చేయడాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ ఉద్ఘాటించారు. సమష్టిగా ఈ వృద్ధిని మరింతగా వేగవంతం చేసేందుకు తాను నిశ్చయించుకున్నానని ప్రధాని అన్నారు. చర్లపల్లి న్యూ టెర్మినల్ రైల్వే స్టేషన్‌తో పాటు జమ్మూ రైల్వే డివిజన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే రాయగడ రైల్వే డివిజన్ భవనానికి ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘జమ్మూకశ్మీర్, తెలంగాణ, ఒడిశాలో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభంతో పర్యాటకం మరింత పెరుగుతుంది. ఈ ప్రాంతాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది’’ అని అన్నారు.త్వరలోనే తొలి బుల్లెట్ రైలు‘‘ఇవాళ ప్రజలు ఎక్కువదూరాలను తక్కువ సమయంలో పూర్తిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే మేం పనిచేస్తున్నాం. వందేభారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం చూశాక నాకెంతో సంతోషం కలిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భారతదేశంలో మొదటి బుల్లెట్ రైలు పరుగులు తీసే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. రాబోయే రోజుల్లో రైల్వేల ప్రయాణం ఓ గుర్తుండిపోయే మధురస్మృతిగా నిలిచిపోయేలా చేస్తాం. దేశంలో 2014లో 74 ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 150కి పైగా పెంచాం. 5 నగరాల నుంచి 21 నగరాలకు మెట్రో సేవలు విస్తరించాం. దేశం కలిసికట్టుగా, అంచెలంచెలుగా ముందుకు సాగుతోందనడానికి ఇలాంటి కార్యక్రమం ఒక నిదర్శనం’’ అని అన్నారు. -
Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే..
భారతీయ రైల్వే అనునిత్యం లక్షలాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. 2024లో రైల్వే అనేక ఆధునిక మార్పులను సంతరించుకుంది. ఈ ఏడాది పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఫలితంగా దేశంలోని పలు నగరాలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం ఏర్పడింది. 2024లో కొత్తగా ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవే..ఢిల్లీ-పట్నా ఢిల్లీ-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 30న ప్రారంభమయ్యింది. ఈ రైలు న్యూఢిల్లీ- పట్నాలను అనుసంధానం చేస్తుంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీ-బీహార్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ ఆధునిక రైలులో ఆన్‌బోర్డ్ వైఫై, జీపీఎస్ ఆధారిత సమాచార ప్రదర్శనలు, సౌకర్యవంతమైన ఏటవాలు సీట్లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.మీరట్-లక్నో మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్టు 31న ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించిన దరిమిలా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా మేరకు తగ్గింది. భద్రతతో పాటు వేగాన్ని దృష్టిలో పెట్టుకుని వందేభారత్ రైళ్లను రైల్వేశాఖ తీసుకువచ్చింది.మదురై-బెంగళూరుమదురై-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తమిళనాడులోని మదురైని కర్ణాటకలోని బెంగళూరుతో కలిపేందుకు ఆగస్ట్ 31న ప్రారంభించారు. రెండు నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ రైలు పట్టాలెక్కింది. పర్యాటకులకు ఈ రైలు ఎంతో అనువైనదని చెబుతున్నారు.చెన్నై-నాగర్కోయిల్తమిళనాడులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్ట్ 31న ప్రారంభించారు. ఈ రైలు చెన్నైని నాగర్‌కోయిల్‌తో కలుపుతుంది. ఈ రైలు ప్రయాణం ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తుంది.టాటానగర్-పట్నా టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్‌లోని టాటానగర్ను బీహార్‌లోని పట్నాను కలుపుతుంది. సెప్టెంబర్ 15న దీనిని ప్రారంభించారు. ఈ రైలు రద్దీగా ఉండే మార్గంలో ప్రయాణించేవారికి వరంలా మారింది.భాగల్పూర్-హౌరాభాగల్పూర్-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2024 సెప్టెంబర్ 15న బీహార్‌లోని భాగల్పూర్ను హౌరాతో కనెక్ట్ చేయడానికి ప్రారంభించారు. రైలు ప్రారంభంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుంది.బ్రహ్మపూర్-టాటానగర్బ్రహ్మపూర్-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ప్రారంభించారు. ఇది ఒడిశాలోని బ్రహ్మపూర్ను టాటానగర్తో కలుపుతుంది. ఈ రెండు పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ రైలు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపార, పర్యాటకరంగ వృద్ధికి తోడ్పాటునందిస్తుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: నూతన రామాలయం మొదలు వయనాడ్ విలయం వరకూ.. -
వందేభారత్‌పై రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. డెహ్రాడూన్ నుంచి ఆనంద్ విహార్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మీరట్ నుండి మోదీనగర్‌కు వస్తుండగా ఈ స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల ముందుగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడితో రైలు అద్దాలు పగిలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ ప్రాంతంలో టార్గెట్ చేయడం ఇది నాలుగోసారి. గతంలో అక్టోబర్ 22, 27 తేదీల్లో, నవంబర్ 22, 27 తేదీల్లో ఇదేవిధమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ నెలలో సిక్రి కలాన్- సోనా ఎన్క్లేవ్ కాలనీ సమీపంలో, నవంబర్‌లో హనుమాన్పురి- శ్రీనగర్ కాలనీ సమీపంలో వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వారు.ఘజియాబాద్ పోలీసులు ఈ నాలుగు ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైల్వే ట్రాక్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వందేభారత్‌పై రాళ్లు రువ్వుతున్న ఘటనలు అటు రైల్వే యంత్రాంగాన్ని, ఇటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ తీర్పుతో 16 ఏళ్లకు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం -
11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన
న్యూఢిల్లీ: ఉత్తరాదిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనికి పొగమంచు ప్రధాన కారణంగా నిలిచింది. తాజాగా భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 11 గంటలు ఆలస్యమైంది. ఇలా రైలు ఆలస్యంగా నడవడానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు భోపాల్‌లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుండి సాంకేతిక లోపం కారణంగా సుమారు 11 గంటల ఆలస్యంగా బయలుదేరింది.ఈ రైలు సాధారణంగా రాణి కమలాపతి స్టేషన్ నుండి ఉదయం 5.40 గంటలకు బయలుదేరుతుంది. అయితే సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో కోపోద్రిక్తులైన ప్రయాణికులు రైలు పట్టాలపై నిరసన తెలిపారు. రైలు ఆలస్యం గురించి తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.ఈ సెమీ-హై స్పీడ్ రైలు ఉదయం నిర్ణీత సమయానికి బదులుగా సాయంత్రం గమ్యస్థానానికి చేరేందుకు బయలుదేరిందని పశ్చిమ మధ్య రైల్వే తాత్కాలిక ప్రజా సంబంధాల అధికారి (భోపాల్ డివిజన్) నావల్ అగర్వాల్ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల రైలు ఆలస్యమైందన్నారు. అయితే రైలు సంబంధిత యాప్‌లతో సహా పలు మార్గాల ద్వారా ఆలస్యంపై ప్రయాణికులకు సమాచారం అందించామని ఆయన చెప్పారు.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5.40 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌కు బయలుదేరాల్సిన రైలు రాకపోవడంతో రాణి కమలపాటి స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు నిరసన తెలిపారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో కొంతమంది ప్రయాణికులు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (న్యూఢిల్లీకి వెళ్లేది)లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు బ్యాగులు పట్టుకుని పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. ఆదివారం రాత్రి 10.20 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి రాణి కమలాపతి స్టేషన్‌కు రావాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20172)లో సాంకేతిక లోపం తలెత్తిందని, సీ11 కోచ్ స్ప్రింగ్ పాడైందని అధికారులు తెలిపారు. మరమ్మతుల కోసం రైలును యార్డుకు తరలించామని, అయితే లోపాన్ని సకాలంలో సరిదిద్దలేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున రైలు బయలుదేరలేదన్నారు.ఇది కూడా చదవండి: దావూద్ బెదిరింపుల వల్లే భారత్ వీడా -
ప్రీమియం రైళ్లలో ప్రత్యేకత ఇదే
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అందుకే వీటిని దేశానికి లైఫ్ లైన్ అని అంటారు. భారతీయ రైల్వేలు పేద తరగతికి అతి తక్కువ ఛార్జీలతో జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతుండగా, ధనికుల కోసం వందే భారత్ వంటి ప్రీమియం సెమీ-హై స్పీడ్ రైళ్లను కూడా నడుపుతున్నాయి. వీటిలోని కొన్ని రైళ్లలో ప్రయాణీకులు ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు.సాధారణంగా సుదూర రైళ్లలో మాత్రమే ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం ఉంటుంది. తక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదు. అయితే దేశంలోని కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికులకు ఉచిత ఆహారం అందిస్తారు. దీని కోసం విడిగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ తదితర ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందిస్తారు. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుంచి వారు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ఆహారం కోసం ఛార్జీలు వసూలు చేస్తారు. అంటే ఈ రైళ్ల టిక్కెట్లలో ఆహారం ఖర్చు కూడా జతచేరి ఉంటుంది. ఇతర రైళ్లలో మాదిరిగా కాకుండా ఈ రైళ్లలో విడిగా ఆహారానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేయవలసిన అవసరం ఉండదు.ఇతర సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల నుంచి టిక్కెట్లతో పాటు ఆహారం కోసం ఎటువంటి ఛార్జీ విధించరు. అటువంటి పరిస్థితిలో ఈ సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఆహారం కోసం విడిగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది తదితర ప్రీమియం రైళ్లలో ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
'వందే భారత్' మేడిన్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో త్వరలోనే రైల్ కోచ్.. మేడ్ ఇన్ తెలంగాణ అన్న అక్షరాలు కనిపించబోతున్నాయి. దశాబ్దాలుగా కలగానే మిగిలిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ మరికొన్ని నెలల్లో కార్యరూపం దాల్చబోతోంది. దేశవ్యాప్తంగా దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లకు ఇక్కడి నుంచి హైస్పీడ్ బోగీలు సరఫరా కాబోతున్నాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరగటం, కేంద్రం కూడా భవిష్యత్తులో సాధారణ రైళ్ల స్థానంలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తుండటంతో కాజీపేటలో ఎక్కువగా వందేభారత్ రైల్ కోచ్‌లు తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు బడ్జెట్ ను కూడా పెంచింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నది. రొబోటిక్ టెక్నాలజీ వినియోగం..: కాజీపేటలో ఏర్పాటుచేస్తున్న కోచ్ ఫ్యాక్టరీలో అత్యాధునిక రొబోటిక్ యంత్రాలు వాడాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని కోచ్ ఫ్యాక్టరీగా మార్చిన నేపథ్యంలో ఆ మేరకు నిర్మాణాల డిజైన్లను మార్చింది. వందేభారత్ రైళ్ల బోగీల తయారీకి వీలుగా జపాన్‌కు చెందిన టైకిషా ఇంజినీరింగ్ సంస్థ నుంచి ఆధునిక రొబోటిక్ యంత్రాలను దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే ఆ సంస్థకు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీని రూ.521 కోట్లతో ఏర్పాటుచేస్తామని గతంలో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆధునిక యంత్రాలు కొనుగోలు చేస్తుండటంతో బడ్జెట్‌ను మరో రూ.150 కోట్ల మేర పెంచుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా.. ఆలస్యానికి బ్రాండ్‌గా మారిన భారతీయ రైల్వేలను పరుగులు పెట్టించే పని మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా క్రమంగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. వందేభారత్ రైళ్లు కూడా అందులో భాగమే. రైల్వేశాఖ సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల వినియోగాన్ని కూడా ఆపేసి పూర్తిగా ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే వినియోగించటం ప్రారంభించింది. క్రమంగా ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్ రైళ్లను కూడా తప్పించి వందేభారత్ రైళ్లనే తిప్పాలని నిర్ణయించింది. అన్ని కేటగిరీల్లో వాటినే వాడాలన్నది కేంద్రం యోచన. వందేభారత్ రైళ్లకు డిమాండ్ కూడా అమాంతం పెరిగింది. రైల్వేకు చెందిన ప్రధాన కోచ్ ఫ్యాక్టరీలైన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్‌ఫ్యాక్టరీ (ఐసీఎఫ్), కపుర్తలాలోని రైల్ కోచ్‌ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్)లలో ప్రస్తుతం సింహభాగం కోచ్‌ల ఉత్పత్తి జరుగుతోంది. త్వరలో లాతూరులోని మరాటా్వడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంఆర్సీఎఫ్)లో ఉత్పత్తి మొదలు కాబోతోంది. వీటితోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా కోచ్‌ల కోసం రైల్వేశాఖ ఆర్డర్ ఇస్తోంది. భవిష్యత్తు డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి జరగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కాజీపేటలో కూడా అత్యాధునిక కోచ్‌ల తయారీని ప్రారంభిస్తున్నది. క్రమంగా ఉత్పత్తి పెంపు – పూర్తిస్థాయిలో నిర్మాణ వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు కాజీపేటలో తక్కువ పరిమాణంలో అయినా ఉత్పత్తిని ప్రారంభించాలన్నది కేంద్రం యోచన. ఇందులో భాగంగా తొలుత నెలకు 10 ఎల్‌హెచ్‌బీ, వందేభారత్ కోచ్‌లు తయారు చేసేలా ఏర్పాట్లు చేస్తారు. – తదుపరి ఐదారు నెలల్లో నెలకు 20 చొప్పున కోచ్‌లు తయారు చేసేలా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా సామరŠాధ్యన్ని మరింత పెంచుతారు. అందుకు తగ్గట్టు బడ్జెట్‌ను కేటాయిస్తారు. – యాద్గిర్లో తయారయ్యే చక్రాలను ఇక్కడికి పంపుతారు. మరో ప్రాంతంలో తయారైన విడి భాగాలను (కోచ్ దిగువ భాగం) ఇక్కడికి తీసుకొచ్చి పూర్తిస్థాయి బోగీగా రూపొందించి దానిపై షెల్ (కోచ్ బాడీ)ను బిగిస్తారు. – కోచ్‌లలో కావాల్సిన అమరికలను సిద్ధం చేసేందుకు కాంపోనెంట్ ఎరిక్షన్, ఫ్యాబ్రికేషన్ షెడ్లను నిర్మిస్తున్నారు. –తయారైన కోచ్‌లకు రంగులు వేయటం, వాటి పనితీరును తనిఖీ చేసేందుకు పెయింటింగ్ బూత్, టెస్ట్ షాప్‌లను ఏర్పాటుచేస్తున్నారు. – ఒక వందేభారత్ రైలు రేక్ తయారీకి రూ.125 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల రైలుకు రూ.80 కోట్లవుతుంది. ఐదు దశాబ్దాల కల కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ ఐదు దశాబ్దాలుగా ఉన్నది. 1982లో ఈ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అయింది. నాటి ప్రధాని ఇందిర హత్య, ఆ తర్వాత సిక్కులపై ఊచకోత.. కాంగ్రెస్‌పై సిక్కుల్లో ఆగ్రహం.. వారిని శాంతపరిచే చర్యల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటువాల్సి కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించారు. అప్పటి నుంచి ఫ్యాక్టరీ కోసం తెలంగాణలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2009లో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కాజీపేటకు రైలు చక్రాల తయారీ యూనిట్ మంజూరైంది. అది కూడా ఆ తర్వాత రద్దయ్యి, మోదీ ప్రభుత్వం వచ్చాక పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌గా మారింది. భూ సమస్య కారణంగా దాని ఏర్పాటు పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. చివరకు గత ఏడాది ఫిబ్రవరిలో దాన్ని గూడ్సు రైలు వ్యాగన్ల తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పుడు దాన్ని కోచ్‌ల తయారీ కేంద్రంగా మళ్లీ అప్‌గ్రేడ్ చేశారు. మరో 35 ఎకరాల భూ సేకరణకాజీపేట ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం 160 ఎకరాల భూమిని మంజూరు చేసింది. అందులో 150 ఎకరాలు ఇప్పటికే రైల్వేకు అప్పగించింది. మిగతా భూమి త్వరలో అందజేయనుంది. మారిన డిజైన్ నేపథ్యంలో తాజాగా మరో 35 ఎకరాలు కూడా రైల్వే తీసుకోనున్నట్టు తెలిసింది. కాజీపేట స్టేషన్‌తో అనుసంధానిస్తూ కోచ్ తయారీ కేంద్రంలోకి ట్రాక్ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. 390 మీటర్ల పొడవైన షెడ్లుకాజీపేట ఫ్యాక్టరీలో తొలుత వ్యాగన్లు తయారుచేయాలని నిర్ణయించినందున అందుకు తగ్గట్టుగానే డిజైన్లు రూపొందించారు. తాజాగా ఆ డిజైన్లలో 50 శాతం వరకు మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం 30 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. 2026 మార్చి నాటికి పూర్తిగా యూనిట్ సిద్ధమై ఉత్పత్తి పనులు మొదలుపెట్టాలన్నది లక్ష్యం. ఇక్కడ భారీ షెల్ అసెంబ్లింగ్ షెడ్ నిర్మిస్తున్నారు. ఇందులో కోచ్‌ల బాడీలు సిద్ధమవుతాయి. వందే భారత్ రైలు దాదాపు 390 మీటర్ల పొడవుంటుంది. దానికి సరిపడే రీతిలో దీన్ని నిర్మిస్తున్నారు. 600 మంది ఉద్యోగులుకాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ప్రత్యక్ష్యంగా 600 మంది ఉద్యోగులు పనిచేస్తారు. పరోక్షంగా 8 వేల నుంచి పది వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. వేగంగా కోచ్‌లను సిద్ధం చేయాల్సిన నేపథ్యంలో ఇది అసెంబ్లింగ్ యూనిట్‌గా ఏర్పాటవుతోంది. కోచ్‌ల తయారీకి కావాల్సిన ముడి సరుకు పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. దీంతో ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా స్థానికంగా ప్రైవేటు సంస్థలు లాభపడతాయి. వాటిల్లో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రాబోతున్నారు. -
భీమ్ ఆర్మీ చీఫ్ ప్రయాణిస్తున్న వందే భారత్‌పై రాళ్ల దాడి
లక్నో: భీమ్ ఆర్మీ పార్టీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రయాణిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై అల్లరి మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో రైలు కిటికీ ధ్వంసమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా కమల్పూర్లో ఆదివారం చోటుచేసుకున్న ఘటనలో ఆజాద్‌కు ఎటువంటి హాని జరగలేదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వస్తుండగా ఉదయం 7.12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురయ్యాయనని అనంతరం ఆజాద్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘నా కంటే రెండు సీట్లు ముందు కూర్చున్న ప్రయాణికుడి దగ్గర ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటనతో నేను షాక్‌కి గురయ్యాను. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాదు, ప్రయాణికుల భద్రతకు సైతం ముప్పు కలిగించే పరిణామమిది. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదు’అని ఆయన పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో భద్రత కోసం సి–3 నుంచి సి–14 బోగీకి మారినట్లు చెప్పారు. దీనిపై రైల్వే భద్రతాధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి పరిశీలించారని, సి–3 బోగీపై మాత్రమే రాళ్ల దాడి జరిగినట్లు గుర్తించారని ఆజాద్ చెప్పారు. ‘ఒక్క 2022 లోనే రైళ్లపై రాళ్లు రువి్వన ఘటనలు 1,503 నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటితో రైల్వే శాఖకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. పదేపదే జరుగుతున్న ఈ ఘటనలు ప్రయాణికుల ప్రాణాలకు సైతం ప్రమాదకరంగా మారాయి’అని ఆజాద్ తెలిపారు. -
సికింద్రాబాద్–పుణే మధ్య వందే భారత్ రైలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్–పుణే మధ్య త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనే ఈ మార్గాన్ని రైల్వేబోర్డు నోటిఫై చేసినా.. రైల్ రేక్ సిద్ధంగా లేకపోవటంతో ప్రారంభించలేదు. ఈ క్రమంలో త్వరలో ఈ రైలును పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. అది ముగిశాక ప్రారంభించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ది సర్వీసు కొనసాగుతోంది. అది రోజూ మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుంది. వందే భారత్‌ను ఉదయమే బయలుదేరేలా నడిపే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెప్తున్నాయి.స్లీపర్ కేటగిరీపై పరిశీలన!వందే భారత్ రైళ్లలో స్లీపర్ కేటగిరీ త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇటీవలే నమూనా రైలు సిద్ధమైంది. ఆ రైలు రేక్స్ తయారవుతున్నాయి. ట్రయల్‌రన్ తర్వాత వాటిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 16 రూట్లను ఈ రైళ్లకోసం ఖరారు చేశారు. మరిన్ని మార్గాలను కూడా ఎంపిక చేయనున్నారు. సికింద్రాబాద్–పుణే మధ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపే అంశాన్ని కూడా రైల్వే బోర్డు పరిశీలిస్తోంది.ఈ నగరాల మధ్య ప్రస్తుతమున్న పుణే శతాబ్ది రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతోంది. కానీ రాత్రివేళ సర్వీసు పెట్టాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఈ క్రమంలో రాత్రివేళ వందే భారత్ స్లీపర్ సర్వీసును ప్రారంభించి.. ఆ తర్వాత సాధారణ వందే భారత్‌ను శతాబ్ది స్థానంలో ప్రవేశపెట్టాలన్నది రైల్వే యోచన అని సమాచారం.నాగ్‌పూర్ సర్వీసు విఫలంతో..సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య 20 కోచ్‌లతో వందే భారత్ రైలు సేవలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు నగరాల మధ్య నిత్యం నాలుగు రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో వందే భారత్‌కు డిమాండ్ లేకుండా పోయింది. ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం కూడా ఉండటం లేదు. నెల గడుస్తున్నా దీనికి ఆదరణ పెరగకపోవటంతో కోచ్‌ల సంఖ్యను తగ్గించి.. ఎనిమిది కోచ్‌లకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పుణే సర్వీసు ఎలా ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.సికింద్రాబాద్–పుణే మధ్య సర్వీసులు తక్కువ. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న నగరాలు కావడం, ప్రయాణికుల డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో.. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ సర్వీసు విఫలమయ్యే చాన్స్ లేదని ప్రాథమికంగా తేల్చారు. వందే భారత్‌ను పట్టాలెక్కించాలనే నిర్ణయానికి వచ్చారు. సాధారణ వందే భారత్ సర్వీసా? స్లీపర్ సర్వీసా? అన్నదానిపై మహారాష్ట్ర ఎన్నికల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. అట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు
-
చెన్నైలో వందే భారత్ స్లీపర్ ఆవిష్కరణ
సాక్షి, చెన్నై: వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైలును చెన్నై ఐసీఎఫ్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) జనరల్ మేనేజర్ సుబ్బారావు ఈ రైలు గురించి మీడియాకు తెలిపారు. చెన్నైలోని ఐసీఎఫ్‌లో వందే భారత్ రైళ్ల తయారీ జరుగుతోందని చెప్పారు. దీంతోపాటు వందే మెట్రో రైళ్లు, అమృత్ వందే మెట్రో రైళ్లు కూడా తయారు చేస్తున్నామన్నారు. అదే సమయంలో స్లీపర్ సౌకర్యాలతో కూడిన వందే భారత్ రైళ్లను సిద్ధం చేసి రాత్రి వేళల్లో నడపాలని రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా స్లీపర్ వెర్షన్ అన్ని హంగులతో రూపుదిద్దుకుందని వివరించారు. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించి పట్టా లెక్కించబోతున్నట్లు తెలిపారు. -
నిలిచిన వందేభారత్
బాపట్ల టౌన్: వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో బాపట్ల ప్రాంతంలో వందేభారత్ రైలు సుమారు గంటన్నరకుపైగా నిలిచిపోయింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం 6.12 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరింది. 7.45 గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది.7 గంటలకు పొన్నూరు మండలం మాచవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకునే సమయానికి మాచవరం సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న సమాచారం అందుకున్న లోకో పైలట్ రైలు నిలిపేశాడు. ట్రాక్ ఏ ప్రాంతంలో దెబ్బతిందో.. ఎంతమేర దెబ్బతిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలును మాచవరం నుంచి అప్పికట్ల రైల్వేస్టేషన్ వరకు వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ట్రాక్ మరమ్మతు చేయడంతో రైలు యధావిధిగా గుంటూరు వైపు ప్రయాణించింది. -
స్లీపర్ వందేభారత్ జిగేల్..!
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే గతిని మార్చిన ‘వందేభారత్’సిరీస్‌లో స్లీపర్ బెర్తులతో కూడిన రైలు త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వేయి కిలోమీటర్లను మించిన దూరంలో ఉన్న ప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై తొలి పరుగుకు సన్నద్ధమైంది. ఇప్పటి వరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.రైల్వే శాఖ మంత్రి అశ్వీనీవైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. త్వరలో దేశంలోని ప్రధాన ప్రాంతాల మధ్య ఇవి రాత్రి వేళ పరుగులు పెట్టబోతున్నాయి. 14 రూట్లలో వీటినే నడిపే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నారు. స్వదేశీ పరిజ్ఞానం, పూర్తిస్థాయి అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో ఈ రైలు రూపుదిద్దుకుంది. ⇒ ఈ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరో డైనమిక్ డిజైన్‌తో కనువిందు చేయనుంది. ⇒ ఇంటీరియర్‌ను జీఎఫ్ఆర్పీ ప్యానల్‌తో రూపొందించారు. ⇒ అగ్ని నిరోధ వ్యవస్థ ఈఎన్ 45545 ప్రమాణ స్థాయితో రూపొందింది (హజార్డ్ లెవెల్:3). ⇒ దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు ఇందులో పొందుపరిచారు. ⇒ ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని, మూసుకునే పద్ధతి గల డోర్లు ఏర్పాటు చేశారు. ఇవి సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్‌తో పనిచేస్తాయి. ⇒ దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ⇒ మొదటి శ్రేణి ఏసీ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ⇒ కోచ్‌లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. ⇒ అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ, ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. మొత్తం 16 కోచ్‌లు ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్తులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. లోకో పైలట్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. -
సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్‌కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. వందేభారత్‌లో బాంబు ఉందని ఓ ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. అయితే రైలులో బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందని సమాచారంచ్చినక్తిని లింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి మధుసూదన్‌గా గుర్తించారు, దీంతో అతడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.కాగా సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ ప్రారంభించగా.. సెప్టెంబర్ 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ కొత్త రైలు ఏర్పాటు చేశారు.అయితే ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి 80 శాతం ఖాళీతో నడుస్తోంది. ట్రైన్ మొత్తం సామర్థ్యం 1,440 కాగా.. దాదాపు 1200 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ ట్రైన్ బోగీల సంఖ్యను తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 బోగీలతో నడుస్తుండగా.. 10 బోగీలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. -
వందేభారత్ రైళ్ల కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి
న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. చిలీ, కెనడా, మలేషియా తదితర దేశాలు ‘వందే భారత్’ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ రైలు నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.ఇతర దేశాలలో ఆధునిక సౌకర్యాలు కలిగిన రైళ్ల నిర్మాణానికి రూ. 160-180 కోట్ల మధ్య ఖర్చు అవుతుంది. భారతదేశంలో నిర్మితమయ్యే వందే భారత్ రైలు వ్యయం రూ.120 నుండి రూ. 130 కోట్ల మధ్య ఉంటుంది. వందే భారత్ గంటకు 0 నుండి 100 కి.మీ. వేగాన్ని చేరుకోవడానికి కేవలం 52 సెకన్లు పడుతుంది. ఇది జపాన్ బుల్లెట్ రైలు కంటే అధికం. జపాన్ బుల్లెట్ రైలు గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి 54 సెకన్లు పడుతుంది. వందేభారత్‌ను మరింత మెరుగ్గా రూపొందించారని విదేశీ ప్రతినిధులు చెబుతున్నారు.కాగా భారతీయ రైల్వేల అభివృద్ధి గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ గడచిన 10 ఏళ్లలో 31,000 కిలోమీటర్లకు పైగా ట్రాక్‌లను జోడించామని తెలిపారు. దీన్ని 40,000 కిలోమీటర్ల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 10,000 లోకోలు, 9,600 కిలోమీటర్ల ట్రాక్‌కు టెండర్లు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇది కూడా చదవండి: ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్ -
కొత్త రైళ్లను తగ్గించి.. కోచ్‌ల సంఖ్య పెంచేలా!
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ స్లీపర్ రైళ్ల కాంట్రాక్టును రైల్వే శాఖ సవరించింది. రైళ్ల సంఖ్యను తగ్గిస్తూ.. కోచ్‌ల సంఖ్యను పెంచుతూ కాంట్రాక్టులో మార్పులు చేసింది. స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే రూట్లను కూడా కుదించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న చైర్ కార్ వందేభారత్ రైళ్లతోపాటు స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కాంట్రాక్టు ఖరారు చేసింది. 800 కి.మీ. నుంచి 1,200 కి.మీ. దూరప్రాంతాలకు స్లీపర్ కోచ్‌లతో కూడిన 200 వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రూ.58వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసింది. కానీ.. స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో ప్రవేశపెట్టాలనే అంశంపై రైల్వే శాఖ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది.స్లీపర్ కోచ్‌ల నిర్వహణ వ్యయం, టికెట్ల ద్వారా వచ్చే రాబడి మధ్య సమతుల్యత లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. అందుకే.. మొదటి స్లీపర్ వందేభారత్ రైలును ప్రారంభించే విషయంలో కాలయాపన చేస్తోంది. డిమాండ్ ఉన్న, అంతగా లేని మొత్తం 200 రూట్లలో స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టడం నిర్వహణ వ్యయం పరంగా సరైన నిర్ణయం కాదని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎందుకంటే.. ఒక్కో కోచ్‌లో 80 సీట్లు ఉంటాయి. 16 కోచ్‌లతో కూడిన స్లీపర్ రైళ్లను అంతగా డిమాండ్‌లేని రూట్లలో కూడా నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతుందని అంచనాకు వచ్చింది.దాంతో స్లీపర్ కోచ్‌లకు అధిక డిమాండ్ ఉంటుందని భావిస్తున్న రూట్లలోనే ఆ రైళ్లను పరిమితం చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచడం ద్వారా టికెట్ల ఆదాయాన్ని పెంచుకోవాలని భావించింది. ఈ మేరకు స్లీపర్ రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కు తగ్గించింది. ఇక ఒక్కో రైలులో కోచ్‌ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచింది. కాంట్రాక్టు మొత్తం వ్యయం మాత్రం రూ.58వేల కోట్లుగానే ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్), భారతహెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు సవరించిన కాంట్రాక్టును ఖరారు చేసింది. -
Narendra Modi: దేశ ప్రతిష్ట దిగజార్చే యత్నం
అహ్మదాబాద్: పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. విద్వేషాన్ని నింపుకున్న వాళ్లు దేశ ప్రతిష్టను మసకబార్చేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వదలిపెట్టరని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో రూ.8,000 కోట్ల పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. తర్వాత దేశంలోనే తొలి వందేభారత్ మెట్రో సర్వీస్ అయిన భుజ్–అహ్మదాబాద్ ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ను ప్రారంభించారు. దీంతోపాటు ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాహుల్, కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కొందరు ప్రతికూలత, విద్వేషంతో భారత్‌ను విడగొట్టేందుకు దేశ ఐక్యత, సమత్రలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇండియా, గుజరాత్ల పరువు తీసేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వీళ్లు చేజార్చుకోరు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక తొలి 100 రోజుల్లో పాలనపై విపక్షాలు దారుణంగా విమర్శించాయి. నేను మాత్రం అభివృద్ధి అజెండా అమలుపైనే దృష్టిపెట్టా. నేను జీవిస్తే మీ కోసమే జీవితాన్ని ధారపోస్తా. పోరాడితే మీ కోసమే పోరాడతా. చనిపోవాల్సి వస్తే మీ కోసమే ప్రాణాలప్పిస్తా’’ అని వేలాది మంది సభకులనుద్దేశించి అన్నారు.తొలి భారత్ మెట్రో పేరు మార్పుమెట్రో నగరాల మధ్య తిరిగే దేశంలో తొలి మెట్రో ‘వందే మెట్రో’ పేరును ప్రారంభోత్సవానికి కొద్దిసేపటి ముందు కేంద్రం ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’గా మార్చింది. సోమవారం సాయంత్రం ఈ రైలును మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది తొమ్మిది స్టేషన్లలో ఆగుతూ 359 కి.మీ. ప్రయాణించి అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు టికెట్ ధర రూ.455గా నిర్ణయించారు.మరో మెట్రోలో ప్రధాని ప్రయాణంఅహ్మదాబాద్, గాంధీనగర్‌లను కలిపే రెండో దశ మెట్రోను మోదీ ప్రారంభించారు. అందులో గాంధీనగర్ సెక్టార్1 స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీకి వెళ్లారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కొందరు విద్యార్థులు ప్రయాణించారు. రూ.5,384 కోట్ల వ్యయంతో ఫేజ్2 పనులు చేపట్టారు.భారత సౌర విప్లవం ఒక సువర్ణాధ్యాయంగాంధీనగర్లో నాలుగో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడి దారుల సదస్సు, ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. ‘‘వెయ్యేళ్ల ప్రగతికి భారత్ పునాదులు వేసుకుంటోంది. అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవడమే గాక, అక్కడే కొనసాగాలని లక్షిస్తోంది. మూడో దఫా పాలన తొలి 100 రోజుల్లో మా ప్రాధమ్యాలను గమనిస్తే దేశం వేగం, విస్తృతి అర్ధమవుతాయి’’ అని పెట్టుబడిదారులను ఉద్దేశించి అన్నారు. ‘‘సౌర, పవన, అణు, జల విద్యుదుత్పత్తి ద్వారా భారత్ ఇంధన అవసరాలు తీర్చుకోనుంది. దేశ 21వ శతాబ్ద చరిత్రలో సౌరవిప్లవ అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో రాస్తారు’’ అన్నారు. గాంధీనగర్‌లో వవోల్ ప్రాంతంలోని షాలిన్–2 సొసైటీలో ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనా’ పథక లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు. -
తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి నమో భారత్ ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ సోమవారం(సెప్టెంబర్16) ప్రారంభించారు. భుజ్-అహ్మదాబాద్ మధ్య నడిచే వందేభారత్ మెట్రో రైలు సర్వీసుల పేరును నమోభారత్ ర్యాపిడ్ రైలుగా మార్చారు. ఈ రైలుతో మరిన్ని వందేభారత్ రైళ్లను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.దుర్గ్-విశాఖపట్నం,వందేభారత్,నాగ్‌పుర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-నాగ్‌పుర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. వందేభారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతిపక్షాలు తన పట్ల ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయన్నారు. అయితే, ప్రతిపక్షాల అవమానాలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి.. ఈ టర్ములోనే ఒకే దేశం-ఒకే ఎన్నికలు -
నేడు వందే మెట్రో పరుగు
సాక్షి, హైదరాబాద్: రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వందే మెట్రో రైళ్లను తిప్పాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందేభారత్ రైలు సిరీస్‌లో మరో కొత్త కేటగిరీని ప్రారంభిస్తోంది. దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సోమవారం పట్టాలెక్కుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి 360 కి.మీ. దూరంలో ఉన్న భుజ్ నగరం మధ్య ఇది రాకపోకలు సాగిస్తుంది. ఇప్పటికే మరిన్ని వందే మెట్రో రైళ్లను సిద్ధం చేసిన రైల్వే శాఖ, త్వరలో వాటిని కూడా ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చెన్నై–తిరుపతి మధ్య దీన్ని నడపనున్నట్లు సమాచారం. తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్–విజయవాడ రూట్ ఉంది.వందేభారత్ తరహాలోనే..వందే మెట్రో కూడా వందేభారత్ రూపులోనే ఉండనుంది. బయటి నుంచి చూస్తే పెద్దగా తేడా ఉండదు. కానీ, లోపలి వ్యవస్థ మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది. దీని సీటింగ్ పూర్తిగా వేరుగా ఉండనుంది. ముగ్గురు చొప్పున కూర్చునే వెడల్పాటి సీట్లను ఏర్పాటు చేశారు. సీట్ల మధ్యలో ప్రయాణికులు నిలబడి ప్రయాణించేందుకు వీలుగా లోకల్ రైళ్లలో ఉన్నట్టుగా రూఫ్ భాగంలో హ్యాండిల్స్ ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో 12 కోచ్‌లుంటాయి. మొత్తం 1,150 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. నిలబడి ప్రయాణించేవారితో కలుపుకొంటే మొత్తం సామర్థ్యం 3208 అవుతుంది. ఈ రైళ్లలో రిజర్వేషన్ వ్యవస్థ అమల్లో ఉండదంటున్నారు. అందుకే సీట్లకు నంబరింగ్ ఉండదు.350 కి.మీ. నిడివి వరకు..100 నుంచి 350 కి.మీ. దూరం ఉండే రెండు ప్రధాన నగరాలు/పట్టణాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ట వేగం 110 కి.మీ. వీటిలో ప్రతి కోచ్‌లో రెండు చొప్పున టాయిలెట్లు ఉంటాయి. ఒకవైపు ఇండియన్ మోడల్, మరోవైపు వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ ఉంటాయి. ఇవి పూర్తి ఏసీ రైళ్లు, భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లను కూడా నడపనున్నట్టు సమాచారం.కనీస చార్జీ రూ.30ఈ రైళ్లలో కనీస చార్జీ రూ.30. దూరాన్ని బట్టి గరిష్ట చార్జీ (350 కి.మీ.కు) రూ.445గా ఉండనుంది. సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్, నేరుగా లోకోపైలట్‌తో మాట్లాడేందుకు టాక్ బ్యాక్ యూనిట్, అగ్నిమాపక వ్యవస్థ, ఇన్ఫర్మేషన్ స్క్రీన్, ఫైర్ అలారమ్, దివ్యాంగుల టాయిలెట్, అనారోగ్యానికి గురైన వారికి స్ట్రెచర్ తదితరాలు రైల్లో ఉంటాయి. -
ఇంటర్సిటీ స్థానంలో వందే మెట్రో
సాక్షి, హైదరాబాద్: రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వందే మెట్రో రైళ్లను తిప్పాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందేభారత్ రైలు సిరీస్‌లో మరో కొత్త కేటగిరీని ప్రారంభిస్తోంది. దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సోమవారం పట్టాలెక్కుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి 360 కి.మీ. దూరంలోని భుజ్ నగరం మధ్య ఇది నడవనుంది. మరిన్ని వందే మెట్రో రైళ్లను కూడా త్వరలో ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చెన్నై–తిరుపతి మధ్య దీన్ని నడపనున్నట్లు సమాచారం. తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్–విజయవాడ రూట్ ఉంది. వందే మెట్రో కూడా వందేభారత్ రూపులోనే ఉండనుంది. బయటి నుంచి చూస్తే పెద్దగా తేడా ఉండదు. లోపలి వ్యవస్థ మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది.350 కి.మీ. నిడివి వరకు..100 నుంచి 350 కి.మీ. దూరం ఉండే రెండు ప్రధాన నగరాలు/పట్టణాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ట వేగం 110 కి.మీ. వీటిలో ప్రతి కోచ్‌లో రెండు చొప్పున టాయిలెట్లు ఉంటాయి. ఒకవైపు ఇండియన్ మోడల్, మరోవైపు వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ ఉంటాయి. ఇవి పూర్తి ఏసీ రైళ్లు, భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లను కూడా నడపనున్నట్టు సమాచారం. ఈ రైళ్లలో కనీస చార్జీ రూ.30. దూరాన్ని బట్టి గరిష్ట చార్జీ (350 కి.మీ.కు) రూ.445గా ఉండనుంది. -
ఆరు వందేభారత్‌లకు మోదీ పచ్చ జెండా
న్యూఢిల్లీ: ఆరు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల రాకతో 54గా ఉన్న వందేభారత్ రైళ్ల సంఖ్య 60కి చేరిందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రధాని మోదీ ఆదివారం నాడు జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఆరు నూతన వందేభారత్ రైళ్లు టాటా నగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటా నగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మధ్య నడుస్తాయి.ఈ కొత్త వందే భారత్ రైళ్లు దేవఘర్‌లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, కాళీఘాట్, కోల్‌కతాలోని బేలూర్ మఠం వంటి మతపరమైన ప్రదేశాలకు త్వరగా చేరుకోవడానికి సహాయపడతాయి. ఇది కాకుండా ఈ రైళ్లు ధన్బాద్లో బొగ్గు గనుల పరిశ్రమను, కోల్‌కతాలోని జనపనార పరిశ్రమను, దుర్గాపూర్‌లో ఇనుము, ఉక్కు పరిశ్రమను చూపిస్తాయి.ఇది కూడా చదవండి: కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లుమొదటి వందే భారత్ రైలు 2019, ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యింది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యేక ప్రయాణ అనుభూతిని అందజేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు వందే భారత్ మొత్తం సుమారు 36,000 ప్రయాణాలను పూర్తి చేసింది. 3.17 కోట్ల మంది ప్రయాణీకులకు ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. #WATCH | PM Modi virtually flags off the Tatanagar-Patna Vande Bharat train at Tatanagar Junction Railway Station.He will also lay the foundation stone and dedicate to the nation various Railway Projects worth more than Rs. 660 crores and distribute sanction letters to 20,000… pic.twitter.com/vNiDMSA6tK— ANI (@ANI) September 15, 2024 -
వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రాంచీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్15) ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ జెండా ఊపి ప్రారంభించనున్న ఆరు కొత్త వందే భారత్ రైళ్లు వేగం, సురక్షితమైన సౌకర్యాలను ప్రయాణికులకు అందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జార్ఖండ్ టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ కొత్త రైళ్లు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో, 280 జిల్లాలను కవర్ చేస్తూ ప్రతిరోజు 120 సార్లు రాకపోకలు నిర్వహిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. కాగా,ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా ఈ ఆరు కొత్త మార్గాల్లో కార్యకలాపాల్ని నిర్వహించనున్నాయి.గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ట్రైన్లు సెప్టెంబర్ 14, 2024 నాటికి 54 రైళ్లు 108 సర్వీసులుతో 36,000 ట్రిప్పులను పూర్తి చేసి 3.17 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. కాగా, మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 15,2019న ప్రారంభమైంది.ఇదీ చదవండి : నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది -
వందేభారత్‌పై రాళ్ల దాడి.. ఐదుగురు నిందితుల అరెస్ట్
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో మూడు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. సెప్టెంబరు 16న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో మహాసముంద్లో వందేభారత్ రైలు ట్రయల్ రన్ జరుగుతోంది. రాళ్ల దాడిలో సీ2-10, సీ4-1, సీ9-78 కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. బాగ్బహ్రా రైల్వే స్టేషన్లో ఈ రాళ్ల దాడి జరిగింది.ఈ దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బాగ్బహ్రాకు చెందినవారు. వీరిపై పోలీసులు రైల్వే చట్టం 1989 కింద కేసు నమోదు చేశారు. 16 నుంచి నడవనున్న వందేభారత్ రైలుకు ట్రయల్ రన్ జరుగుతుండగా, రాళ్ల దాడి చోటుచేసుకున్నదని ఆర్పీఎఫ్ అధికారి పర్వీన్ సింగ్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశారన్నారు. ఇది కూడా చదవండి: పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య -
సికింద్రాబాద్–నాగ్‌పూర్ వందేభారత్‌కు 20 కోచ్‌లు?
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పునకు కారణమైన వందేభారత్ రైళ్ల సిరీస్‌లో మరో నూతన అంకానికి కేంద్ర ప్రభుత్వం తెరదీస్తోంది. అత్యంత వేగంగా ప్రయాణించే సెమీ హైస్పీడ్ కేటగిరీ రైళ్లలో మొదలైన వందేభారత్ తదుపరి వర్షన్‌గా వందేభారత్ స్లీపర్ సరీ్వసులు ప్రారంభిస్తున్న రైల్వే, తాజాగా 20 కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు 16 కోచ్‌ల వందేభారత్, 8 కోచ్‌ల మినీ వందేభారత్ రైళ్లే తిరుగుతున్నాయి. మొదటిసారి 20 కోచ్‌ల రేక్‌ను ప్రారంభిస్తున్నారు. ఒకేసారి అలాంటి నాలుగు రైళ్లను ప్రారంభిస్తుండగా, అందులో ఒకటి తెలంగాణ నుంచి నడవనుండటం విశేషం. ఈనెల 16న ప్రారంభం కానున్న సికింద్రాబాద్–నాగ్‌పూర్ ఆరెంజ్ వందేభారత్‌ను కూడా 20 కోచ్‌లతో ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి నాలుగు రైళ్లే..మరింతమంది ప్రయాణికులను సర్దుబాటు చేసే క్రమంలో 20 కోచ్‌ల సెట్‌ను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దాదాపు నాలుగు నెలల క్రితమే ఈ ఆలోచనకు రాగా, ప్రతినెలా అలాంటి ఒక సెట్‌ను తయారు చేయాలని చెన్నైలోని ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యా క్టరీని ఆదేశించింది. దీంతో మే, జూన్, జూలై, ఆగస్టులకు సంబంధించి నాలుగు రేక్‌లు సిద్ధమయ్యాయి. వాటిల్లో రెండింటిని ఉత్తర రైల్వేకు, తూర్పు రైల్వేకు, సెంట్రల్ రైల్వే జోన్‌కు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. హైదరాబాద్–నాగ్‌పూర్ మధ్య వందేభారత్ రైలు గతంలోనే మంజూరైంది. రేక్ కొరత వల్ల దాని ప్రారంభం ఆలస్యమవుతూ వచి్చంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వేకు కేటాయించిన 20 కోచ్‌ల రైలును సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య తిప్పనున్నట్టు తెలిసింది. 20 కోచ్‌ల వందేభారత్‌లో 3 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌లు, 16 ఎకానమీ (ఏసీ చైర్‌కార్) కోచ్‌లు ఉంటాయని సమాచారం. సాధారణ 16 కోచ్‌ల రేక్‌లో ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు 2, ఎకానమీ కోచ్‌లు 14 ఉంటున్నాయి.యమ గిరాకీఎనిమిది కోచ్‌ల వందేభారత్‌లో 530 సీట్లుంటున్నాయి. అదే 16 కోచ్‌ల వందేభారత్‌లో 1,128 సీట్లు ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబోతున్న 20 కోచ్‌ల రేక్‌లో 312 సీట్లు పెంచుతూ వాటి సంఖ్యను 1,440కి విస్తరించారు. ఆ మేరకు ప్రయాణికులకు అదనంగా వెసులుబాటు కలుగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు విపరీతమైన గిరాకీ ఉంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న నాలుగు వందేభారత్ రైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేషియో 110 శాతంగా ఉంది. మరి ముఖ్యంగా విశాఖపట్నం వందేభారత్‌లో అది 130 శాతాన్ని మించింది. దీంతో కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్–నాగ్‌పూర్ మధ్య మూడు డెయిలీ ఎక్స్‌ప్రెస్‌లు తిరుగుతున్నాయి. హైదరాబాద్–న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–దానాపూర్ మధ్య నడిచే దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు నాగ్‌పూర్ మీదుగా నడుస్తున్నాయి. ఇవి కాకుండా వారానికి ఓసారి నడిచే హైదరాబాద్–ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, వారానికి నాలుగు రోజులు తిరిగే బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు సహా మొత్తం 8 రైళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వందేభారత్ రైలు రానుంది. -
తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే వ్యవస్థ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లు అనేక రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైలులో ఛార్జీలు కొంచెం ఎక్కువైనా సరే, అత్యాధునిక టెక్నాలజీతోపాటు అనేక సౌకర్యాలు ఉండటంతో ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని రూట్లలో మరిన్ని వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్, చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జంక్షన్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.చదవండి: తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు -
తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రూట్లలో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్, కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు సైతం రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.తాజాగా వందే భారత్ రైళ్లకు తోడు వందే భారత్ మెట్రో రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16వ తేదీన తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలు ఎక్కనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రయాణించనున్న తొలి వందే భారత్ మెట్రో రైలును..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.ఈ రైలు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఉండగా.. వాటి కంటే సుదూర ప్రయాణాలకు ఉపయోగించనున్నారు. అహ్మదాబాద్-భుజ్ మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణించనుంది. భుజ్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రారంభమై.. ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకోనుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్‌లో ప్రారంభమై.. రాత్రి 11.10 గంటలకు భుజ్ చేరుకోనుంది. వారంలో 6 రోజులు ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణం చేయనుంది. ఇక భుజ్-అహ్మదాబాద్ మార్గంలో ఈ రైలుకు 9 స్టాప్‌లు ఉండగా.. ప్రతీ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుందని భారతీయ రైల్వే తెలిపింది.వందే భారత్ మెట్రో అనేది సెమీ-హై-స్పీడ్ రైలు. ఇది గంటకు 100 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వందే భారత్ రైలు లాగానే ఈ రైలు కూడా పూర్తిగా ఎయిర్ కండీషన్ కలిగి ఉంటుంది. మొదట 12 కోచ్‌లతో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ మెట్రో రైలుకు.. ప్రయాణికుల రద్దీ దృష్టా వాటిని 16 కోచ్‌లకు పెంచనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉండనుండగా.. నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ఇందులో మన మెట్రో రైలు లాగా ఆటోమేటిక్ డోర్లు ఉండటం మరో ప్రత్యేకత. ఈ వందే భారత్ మెట్రో రైలును గంటకు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు.ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్‌తో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి కోచ్‌లో మంటలు, పొగ వంటి ప్రమాదాన్ని వెంటనే గుర్తించేలా మొత్తం 14 సెన్సార్లతో కూడిన సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. దివ్యాంగుల కోసం కోచ్‌లలో వీల్‌చైర్ యాక్సెస్ కలిగిన టాయిలెట్లు ఏర్పాటు చేశారు. -
Vande Bharat: ఆటోమెటిక్ తలుపులు.. ఆధునిక టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వెయ్యి కి.మీ.ని మించిన దూరప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై త్వరలో తొలి పరుగుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. పూర్తిస్థాయిలో అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం విశేషం. ప్రత్యేకతలు ఇవే.. 👉స్లీపర్ వందేభారత్ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీలుతో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరోడైనమిక్ డిజైన్‌తో కనువిందు చేస్తోంది. 👉 ఇంటీరియర్‌ను జీఎప్ఆర్పీ ప్యానెల్‌తో రూపొందించారు. ఇందులో మాడ్యులర్ పాంట్రీ ఉంటుంది. 👉 అగ్ని నిరోధక వ్యవస్థలో ఈఎన్–45545 ప్రమాణ స్థాయితో రూపొందింది. 👉 దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లను ఇందులో పొందుపరిచారు. 👉 ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని మూసుకునే పద్ధతిగల తలుపులను ఏర్పాటు చేశారు. ఇది సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్‌తో పనిచేస్తాయి. 👉 దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 👉 లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. 👉 మొదటి శ్రేణి ఏసీ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. 👉 కోచ్‌లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. 👉 అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ ఉంటుంది. 👉 ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. 👉 సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. లోకోపైలట్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. మొత్తం 16 కోచ్‌లు.... ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. అందులో ఏసీ 3–టైర్ కోచ్‌లు 11 ఉంటాయి. వాటిల్లో 611 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఏసీ 2 టైర్ కోచ్‌లు 4 ఉంటాయి. వీటిల్లో 188 బెర్తులు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఒకటి ఉంటుంది. అందులో 24 బెర్తులుంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్డులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. æ బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. -
Bihar: ట్రయల్ రన్లోని ‘వందేభారత్’పై రాళ్ల దాడి
గయ: బీహార్‌లోని గయలో ట్రయల్ రన్లో ఉన్న వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇంతలోనే ఈ రైలుపై కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వి, రైలు అద్దాలు పగలగొట్టారు. ధన్‌బాద్ రైల్వే డివిజన్ పరిధిలోని గయలోని బంధువా-టంకుప్ప స్టేషన్ మధ్య ఈ రాళ్ల దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ రైలు జంషెడ్పూర్ నుండి పట్నా వరకు నడవనుంది.ఈ ఘటనలో వందేభారత్ రైలు ఇంజన్‌కు ఆనుకుని ఉన్న రెండో కోచ్‌లోని సీటు నంబర్ నాలుగు దగ్గరున్న కిటికీ అద్దం పగిలిందని రైల్వే అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ కావడంతో ఈ వందే భారత్ రైలులో ప్రయాణికులెవరూ లేరు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఇదిలావుండగా సోమవారం న్యూఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
ఆటోమెటిక్ తలుపులు..ఆధునిక టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వెయ్యి కి.మీ.ని మించిన దూరప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై త్వరలో తొలి పరుగుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. పూర్తిస్థాయిలో అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం విశేషం. ప్రత్యేకతలు ఇవే.. » స్లీపర్ వందేభారత్ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీలుతో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరోడైనమిక్ డిజైన్‌తో కనువిందు చేస్తోంది. » ఇంటీరియర్‌ను జీఎప్ఆర్పీ ప్యానెల్‌తో రూపొందించారు. ఇందులో మాడ్యులర్ పాంట్రీ ఉంటుంది. » అగ్ని నిరోధక వ్యవస్థలో ఈఎన్–45545 ప్రమాణ స్థాయితో రూపొందింది. » దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లను ఇందులో పొందుపరిచారు. » ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని మూసుకునే పద్ధతిగల తలుపులను ఏర్పాటు చేశారు. ఇది సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్‌తో పనిచేస్తాయి. » దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. » లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. » మొదటి శ్రేణి ఏసీ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. » కోచ్‌లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. » అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ ఉంటుంది. » ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. » సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. లోకోపైలట్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. మొత్తం 16 కోచ్‌లు.... ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. అందులో ఏసీ 3–టైర్ కోచ్‌లు 11 ఉంటాయి. వాటిల్లో 611 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఏసీ 2 టైర్ కోచ్‌లు 4 ఉంటాయి. వీటిల్లో 188 బెర్తులు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఒకటి ఉంటుంది. అందులో 24 బెర్తులుంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్డులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. æ బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. -
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో 4 వారాల్లోగా చెప్పండి.. : రాష్ట్ర హైకోర్టు ఆదేశం
-
విశాఖకు మరో వందే భారత్!
తాటిచెట్లపాలెం: వేగవంతమైన ప్రయాణానికి పేరొందిన వందే భారత్ రైళ్లను మరింత విస్తరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మరో వందే భారత్ రైలును విశాఖకు నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే సిద్ధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్‌కు రెండు వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.మూడో వందేభారత్ దుర్గ్–విశాఖపట్నం–దుర్గ్ మధ్య నడిపేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వాల్తేర్ డివిజన్ నుంచి ఏ విధమైన అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ రైలు నడిచేది మాత్రం వాస్తవమేనని తెలిసింది. కొంచెం మార్పులతోనైనా లేదా ఇదే విధంగానైనా దుర్గ్–విశాఖపట్నం–దుర్గ్ వందే భారత్ రాకపోకలు సాగించనుంది. దుర్గ్–విశాఖపట్నం(20829) వందే«భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నంలో విశాఖపట్నం–దుర్గ్(20830) వందే భారత్ మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుందని సమాచారం. -
Video: వందే భారత్ రైలులో సాంకేతిక లోపం.. లాక్కెళ్లిన మరో ఇంజిన్
లక్నో: భారత రైల్వే తీసుకొచ్చిన సెమీ స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. అంతే స్పీడ్‌తో పలు రూట్లలో పరుగులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ రైళ్లపై అంతే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి . గతంలో ఎన్నోసార్లు రైళ్లపై రాళ్లు రువ్వడం, గేదేలు వంటివి ఢీకొని రైళ్లు ధ్వంసమైన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.తాజాగా ఓక వందే భారత్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగిన ఆ రైలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. చివరకు మరో రైలు ఇంజిన్ ద్వారా వందే భారత్ రైలును సమీపంలోని స్టేషన్ వరకు లాక్కెళ్లారు. ఈ ఘటన న్యూఢిల్లీ- వారణాసి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. రైలు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సోమవారం ఉదయం 9.15 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో అది ఆగిపోయింది. సమాచారం రైల్వే టెక్నికల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని వందే భారత్ రైలు ఇంజిన్‌లోని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చివరకు మూడు గంటల తర్వాత మరో రైలు ఇంజిన్‌ను రప్పించారు. దాని ద్వారా వందే భారత్ రైలును భర్తానా రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లారు.What a sight.The old engine comes to rescue the famed Vande Bharat which ran into technical glitch and got stranded in Etawah, UP. Happened to the Varanasi bound Vande Bharat adversely affecting operations of other trains on the route. pic.twitter.com/rvOwbkDz4K— Piyush Rai (@Benarasiyaa) September 9, 2024మరోవైపు ఈ సంఘటన వల్ల వందే భారత్ ట్రైన్‌లోని ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపార్ట్‌మెంట్స్‌లోని ఏసీలు పని చేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. చివరకు వందే భారత్ ట్రైన్‌లోని సుమారు 750 మంది ప్రయాణికులను ఇతర రైళ్లలో వారి గమ్యస్థానాలకు చేర్చారు. కాగా, వందే భారత్ ట్రైన్‌ను మరో రైలు ఇంజిన్ ద్వారా లాక్కెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వేతోపాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. వివరాలివే
భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా మరికొన్ని రూట్లలో వందే భారత్ రైళ్లనుప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు వందే భారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, విజయవాడ- చెన్నై, కాచిగూడ- బెంగళూరు మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది.సికింద్రాబాద్‌నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు కొత్తగా వందే భారత్ రైలు నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య 578 కి.మీ దూరం ఉండగా.. కేవలం 7 గంటల 20 నిమిషాల్లోనే గమ్య స్థానాలకు చేర్చనుంది. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్ పూర్ నుంచి బయలు దేరి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌లో బయలు దేరి రాత్రి 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.ఇక ఈ రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, రామగుండం, కాజీపే స్టేషన్లలో మాత్రమే ఆగనుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నాగ్‌పూర నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. ఇప్పుడు నాగ్‌పూర్- సికింద్రాబాద్ రైలుతోపాటు నాగ్‌పూర్- పుణె రైలు కూడా సెప్టెంబర్ 15న ప్రారంభం కానుంది.#Secunderabad - #Nagpur VandeBharat Express will be introduced very soonTentative launch date: 📅 15th September pic.twitter.com/K43a6Eu1an— TechChaitu (@techchaituu) September 9, 2024హైదరాబాద్ నగరం నుంచి ప్రస్తుతం ఏపీలోని తిరుపతి, విశాఖ, కర్ణాటకలోని యశ్వంత్‌పుర (బెంగళూరు) నగరాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ, తిరుపతి నగరాలకు రైల్లు నడుస్తుండగా.. కాచిగూడ స్టేషన్ నుంచి యశ్వంత్‌పురకు ట్రైన్ పరుగులు పెడుతోంది. దీంతో నాగపూర్ ప్రాంతానికి మరో ట్రైన్ ప్రతిపాదించారు. -
Lucknow: 24 గంటల్లో రెండు వందేభారత్ రైళ్లపై దాడి
లక్నో: కొందరు అల్లరిమూకలు వందేభారత్ రైళ్లపై రాళ్లదాడికి పాల్పడ్డారనే వార్తలను అప్పుడప్పుడు మనం వింటుంటాం. తాజాగా గడచిన 24 గంటల్లో రెండు వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటి సంఘటన బుధవారం రాత్రి యూపీలోని లక్నో- పట్నా వందే భారత్‌పై జరగగా, రెండవ ఘటన గురువారం ఉదయం రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై జరిగింది.బుధవారం రాత్రి లక్నో నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై అల్లరి మూకలు భారీగా రాళ్లు రువ్వారు.ఈ దాడి కారణంగా రైలులోని సీ-5 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. యూపీలోని వారణాసి స్టేషన్ నుండి రైలు బయలుదేరిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. రైల్వేశాఖ కూడా విచారణ చేపట్టింది.ఇదేవిధంగా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందే భారత్ రైలుపై గురువారం ఉదయం రాళ్ల దాడి జరిగింది. 24 గంటల్లోనే రెండు వందేభారత్ రైళ్లపై దాడి జరిగిందని రైల్వేశాఖ తెలిపింది. రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలు నంబర్ 22350లోని బోగీ నంబర్ ఈ వన్‌పై రాళ్ల దాడి జరిగింది. ఇందులో ఐదు, ఆరో నంబర్ సీట్ల సమీపంలోని అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన హజారీబాగ్‌లోని చార్హి- బేస్ రైల్వే స్టేషన్ మధ్య జరిగింది.ఈ రాళ్లదాడిలో కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో రైలులో కూర్చున్న ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైల్వేశాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా అల్లరి మూకలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. -
వావ్..!అనిపించే వందేభారత్ స్లీపర్ కోచ్ (ఫొటోలు)
-
వందేభారత్ స్లీపర్ కోచ్ వచ్చేసింది..విశేషాలివే..
బెంగళూరు: ప్రతిష్టాత్మక వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎమ్ఎల్) తయారీ కర్మాగారంలో వీటిని ప్రారంభించారు. బీఈఎమ్‌ఎల్‌లో ఏర్పాటు చేసిన వందే భారత్ తయారీ కేంద్రానికి మంత్రి ఆదివారం(సెప్టెంబరు1) శంకుస్థాపన చేశారు. First visual of the #VandeBharatSleeper is here!Union Minister @AshwiniVaishnaw unveiled the prototype version of #VandeBharat sleeper coach today.#VandeBharatTrain Credit: @DDNewslive@RailMinIndia @Murugan_MoS @PIB_India pic.twitter.com/TbTew5TJLN— Ministry of Information and Broadcasting (@MIB_India) September 1, 2024ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. వందే భారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత, వందే భారత్ స్లీపర్ కోసం చాలా శ్రమించామని చెప్పారు.వందేభారత్ స్లీపర్ కోచ్‌ల తయారీ ఇప్పుడే పూర్తయిందన్నారు. పది రోజుల పాటు వీటికి కఠినమైన ట్రయల్స్, టెస్ట్‌లు నిర్వహించనున్నామని తెలిపారు. మూడు నెలల్లో ప్రయాణికులకు ఈ కోచ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.The Vande Bharat sleeper train will have 24 coaches and will reach Chennai from Bangalore on September 20 for final testing. 🚄🏁#VandeBharat #vandebharatsleeper pic.twitter.com/5zgFAsQNqE— MAYA ✍🏻 (@Maya_Lokam_) August 24, 2024 వందేభారత్ స్లీపర్ కోచ్‌లలో ఉండే సౌకర్యాలు ఇవే...కోచ్‌లలో రీడింగ్ ల్యాంప్స్, ఛార్జింగ్ అవుట్లెట్లు, స్నాక్ టేబుల్, మొబైల్, మ్యాగజైన్ హోల్టర్స్ ఉంటాయి.India's first Vande Bharat prototype sleeper train unveiled in Bengaluru. Excited to Travel in Vande Bharat Sleeper 😍#IndianRailways #VandeBharatExpress #VandeBharatSleeper pic.twitter.com/8n6dcmFXyE— Shiwangi Thakur (@ShiwangiThakurX) September 1, 2024రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ‘కవచ్’ వ్యవస్థ ఉంటుంది.అన్ని కోచ్‌లు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో నిర్మించారు. లోపల జీఎఫ్ఆర్పీ ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి.కోచ్‌లన్నీ అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన సదుపాయాలతో మరుగు దొడ్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్లు ఇందులో అమర్చారు.16 కోచ్‌లు, 823 బెర్త్‌లతో స్లీపర్ ట్రైన్ రానుంది. వీటిలో పదకొండు 3టైర్ ఏసీ కోచ్‌లు (600 బెర్త్‌లు), నాలుగు 2 టైర్ ఏసీ కోచ్‌లు (188 బెర్త్‌లు), ఒక ఫస్ట్ టైర్ ఏసీ కోచ్(24 బెర్త్‌లు) ఉంటాయి. #WATCH : First Look of Vande Bharat Trains Sleeper Version.#VandeBharat #VandeBharatExpress #VandeBharatSleeper #India #latest #LatestUpdate pic.twitter.com/1Vt7Zmjo1g— upuknews (@upuknews1) October 2, 2023 -
ప్రజలందరికీ సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యం
న్యూఢిల్లీ: సమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రైల్వేలకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వచ్చేదాకా ఈ పరుగు ఆగదని స్పష్టంచేశారు. మూడు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇవి మీరట్–లక్నో, మధురై–బెంగళూరు, చెన్నై–నాగర్కోయిల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. వందేభారత్ రైళ్ల ఆధునీకరణ, విస్తరణ ద్వారా ‘వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధన దిశగా భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇండియన్ రైల్వే ఒక గ్యారంటీగా మారాలన్నదే తమ ధ్యేయమని, అది నేరవేరేదాకా తమ కృషి ఆగదని స్పష్టంచేశారు. భారత రైల్వే శాఖ సాగిస్తున్న అభివృద్ధి ప్రయాణం తమ ప్రభుత్వ అంకితభావానికి ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ దార్శనికతకు ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలు ఒక బలమైన మూలస్తంభమని ఉద్ఘాటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రైల్వేశాఖకు రూ.2.5 లక్షల కోట్లకుపైగా కేటాయించినట్లు గుర్తుచేశారు. మన రైల్వే వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తున్నామని, హై–టెక్ సేవలతో అనుసంధానిస్తున్నామని వివరించారు. దక్షిణాది అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మన ఆశయ సాధనకు దక్షిణాది రాష్ట్రాల వేగవంతమైన ప్రగతి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దక్షిణాదిన నిపుణులకు, వనరులకు, అవకాశాలకు కొదవ లేదని చెప్పారు. సౌత్ ఇండియా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో రైళ్ల సంఖ్యను పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు ఎన్నో రెట్లు పెంచామని వివరించారు. రైల్వే ట్రాకులు మెరుగుపరుస్తున్నామని, విద్యుదీకరణ వేగం పుంజుకుందని, రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుందని, ప్రయాణికులకు మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. -
Uttar Pradesh: నేడు వందేభారత్ రైలులో ఉచిత ప్రయాణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్-లక్నోల మధ్య నేటి నుంచి వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. మీరట్-లక్నో-మీరట్(22490/22491) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు, రాకపోకల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.ఈరోజు (శనివారం) ఈ రైలు తొలిసారిగా పట్టాలు ఎక్కనుంది. నేడు అతిథి ప్రయాణికులకు రైల్వేశాఖ మీరట్-లక్నోల మధ్య ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల రెగ్యులర్ ఆపరేషన్ ఆదివారం నుండి ప్రారంభంకానుంది. శుక్రవారం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ రైలు అప్డేట్ అయిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు.బరేలీ జంక్షన్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ రైలు మీరట్-లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపధ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. ప్రస్తుతం బరేలీ జంక్షన్లో రైలుకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మీరట్-లక్నో వందే భారత్ మీరట్ నుండి ఉదయం 6:35 గంటలకు బయలుదేరి, 8:35 గంటలకు మొరాదాబాద్, 9:56 గంటలకు బరేలీ చేరుకుని మధ్యాహ్నం 1:45 గంటలకు లక్నో చేరుకుంటుంది. అలాగే లక్నో-మీరట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుండి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:02 గంటలకు బరేలీకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రాత్రి 7:32 గంటలకు మొరాదాబాద్, రాత్రి 10 గంటలకు మీరట్ చేరుకుంటుంది. -
డిసెంబరులో పట్టాలపైకి వందేభారత్ స్లీపర్ రైలు
భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది.2019లో వందేభారత్ చైర్-కార్ రైలును ప్రారంభించారు. ఇప్పుడు వస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు ఈ సిరీస్‌లో మూడవ ఎడిషన్. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు గుజరాత్లో నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అధికారికంగా ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. ఈ రైలును రెండు నెలల పాటు పరీక్షించనున్నారు.వందే భారత్ తొలి స్లీపర్ రైలు బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఇఎంఎల్) ప్లాంట్ నుండి సెప్టెంబర్ 20 నాటికల్లా బయలుదేరుతుందని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐపీఎఫ్) చెన్నై జనరల్ మేనేజర్ యూ సుబ్బారావు మీడియాకు తెలిపారు. దీని తర్వాత రైలు ట్రయల్ రన్ జరగనుంది. వాయువ్య రైల్వే జోన్లో హైస్పీడ్ రైలు ట్రయల్‌ను నిర్వహించనున్నారు.స్లీపర్ వందేభారత్‌లో స్టెయిన్లెస్ స్టీల్ కార్ బాడీ, ప్రయాణీకులకు మెరుగైన రక్షణ సదుపాయాలు, జీఎఫ్ఆర్పీ ఇంటీరియర్ ప్యానెల్లు, ఏరోడైనమిక్ డిజైన్, మాడ్యులర్ ప్యాంట్రీ, ఫైర్ సేఫ్టీ కంప్లైయెన్స్, డిసేబుల్డ్ ప్యాసింజర్ల సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, సెన్సార్ ఆధారిత ఇంటర్కమ్యూనికేషన్, ఫైర్ బారియర్ డోర్లు ఉన్నాయి. యూఎస్బీ ఛార్జింగ్‌తో కూడిన ఎర్గోనామిక్ టాయిలెట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్ కూడా దీనిలో ఉండనున్నాయి. -
వందేభారత్‌కు ఏలూరులో హాల్ట్
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయం కల్పించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 25 నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఉదయం 9.49 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని, 9.50 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా 26 నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు సాయంత్రం 5.54 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని, 5.55 గంటలకు బయలుదేరి వెళుతుంది. -
20 కోచ్‌ల వందేభారత్.. ట్రయల్ రన్ విజయవంతం
అత్యాధునిక, సౌకర్యవంతమైన ప్రయాణానికి వందేభారత్ రైలు పేరొందింది. ఇప్పుడు మరో వందేభారత్ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. పశ్చిమ రైల్వే తాజాగా అదనపు బోగీలతో కూడిన వందేభారత్ రైలును పరీక్షించింది. ఈ రైలు ఐదు గంటల 21 నిమిషాల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకుంది.కొత్తగా పట్టాలెక్కిన ఈ కాషారంగు వందేభారత్‌కు అదనంగా నాలుగు కోచ్‌లను జతచేర్చారు. దీంతో మొత్తం 20 బోగీలతో ఈ నూతన వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. శుక్రవారం నాడు అహ్మదాబాద్- ముంబై మధ్య గంటకు 130 కి.మీ. వేగంతో ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారి తెలిపారు. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరిన రైలు మధ్యాహ్నం 12:21 గంటలకు ముంబై సెంట్రల్‌కు చేరుకుంది.తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ రైలు ముంబై సెంట్రల్ నుండి అహ్మదాబాద్‌కు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. భారతీయ రైల్వే 2024, జూలై 29 నుంచి దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైలు సర్వీసులను నడుపుతోంది. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య వందే భారత్, తేజస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లతో సహా 50కి పైగా రైలు సర్వీసులు నడుస్తున్నాయి. -
ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ షెడ్యూల్ మార్పు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రమాణీకులకు ముఖ్య గమనిక. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలు షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.వివరాల ప్రకారం.. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలు షెడ్యూల్లో మార్పులు చేశారు అధికారులు. డిసెంబర్ 10వ తేదీ నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు. ప్రస్తుతం ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు నడుస్తోంది. మారిన షెడ్యూల్ ప్రకారం ఈ రైలు మంగళవారం ప్రయాణించదు. ఈ విషయాన్ని ప్రయాణీకులు దృష్టిలో పెట్టుకోవాలని రైల్వే శాఖ తెలిపింది. Change in Days of Service of Visakhapatnam - Secunderabad - Visakhapatnam Vande Bharat express @drmsecunderabad pic.twitter.com/kNudtIeEc1— South Central Railway (@SCRailwayIndia) August 9, 2024 -
మాంసాహారం వడ్డన.. వందేభారత్ రైలులో వెయిటర్‌పై దాడి
కలకత్తా: వందేభారత్ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్‌లోని హవ్డా నుంచి రాంచీకి వందేభారత్ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్ చేశాడు. అయితే ఒక వెయిటర్ పొరబాటున మాంసాహారం వడ్డించారు. ఆ వృద్ధ ప్రయాణికుడు కొద్దిసేపటికి అది నాన్-వెజ్ భోజనం అని గుర్తించాడు. Kalesh b/w a Passenger and Waiter inside Vande Bharat over A person slapped a waiter for mistakenly serving him non-vegetarian foodpic.twitter.com/Oh2StEthyX— Ghar Ke Kalesh (@gharkekalesh) July 29, 2024 శాకాహారి అయిన తనకు మాంసాహారాన్ని వడ్డించాడన్న ఆగ్రహంతో వెయిటర్‌పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై తూర్పు రైల్వే స్పందించింది. ‘అవును, పొరబాటు జరిగింది. అంగీకరిస్తున్నాం. సమస్యను పరిష్కరించాం’అని క్లారిటీ ఇచ్చింది. -
‘వందేభారత్‌పైనే శ్రద్ధనా?’ రైల్వే మంత్రి ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్‌పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్‌లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. -
కొత్త రైళ్లు కూత వేసేనా?
» కోట్లాదిమంది భక్తులు సందర్శించే ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసికి కొంతకాలంగా హైదరాబాద్ నుంచి భక్తుల రద్దీ పెరిగింది. కానీ భక్తుల డిమాండ్ మేరకు రైళ్లు లేవు. » నగరవాసులు అయోధ్య బాలరాముడిని సందర్శించాలంటే ఖరీదైన ఐఆర్‌సీటీ ప్యాకేజీతో భారత్ గౌరవ్ రైళ్లు ఎక్కాల్సిందే. పైగా అది వారం, పది రోజుల పర్యాటక రైలు (టూరిస్ట్ ట్రైన్). జంటనగరాల నుంచి నేరుగా అయోధ్యకు వెళ్లేందుకు ఎలాంటి సదుపాయం లేదు. » సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు ఒకే ఒక్క రైలు అందుబాటులో ఉంది. ఇది ప్రతిరోజూ 180 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. తాజాగా ఈ ట్రై న్కు 2 సాధారణ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. కానీ ఈ రూట్లో మరో రైలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖ, బెంగళూరులకు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు మినహా హైదరాబాద్ మహా నగరానికి సంబంధించి ఈ పదేళ్లలో కొత్తగా పట్టాలెక్కిన రైళ్లు తక్కువే. ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కార్ ఈ నెలలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టింది. దీంతో ఈసారైనా కొత్త రైళ్లు కరుణిస్తాయేమోనని నగర ప్రయాణికు లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ అత్యధికంగా ఉన్న మార్గాల్లో కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ వే స్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఈ మార్గాల్లో భారీ డిమాండ్ .... ∙సికింద్రాబాద్ నుంచి బిహార్‌లోని దానాపూర్‌కు ఇప్పుడు ఒకే ఒక్క సూపర్‌ఫాస్ట్ రైలు ఉంది. కానీ ప్రతిరోజూ కనీసం రెండు రైళ్లకు సరిపడా ప్రయాణికులు పడిగాపులు కాస్తూనే ఉంటారు. ఈ రూట్లో అన్ని వర్గాల ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేయవలసి ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి అయోధ్యకు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, బల్లార్షా, గోండియా, జబల్పూర్, కట్ని, ప్రయాగరాజ్, వారణాసిల మీదుగా వారానికి రెండుసార్లు బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలనే డిమాండ్ ఉంది. ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే నగరానికి చెందిన భక్తులు ఐఆర్సీటీసీ రైళ్లపైన ఆధారపడవలసిన అవసరం లేకుండా నేరుగా అయోధ్య, వారణాసిలకు రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. » సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చి ( కోల్‌కతా )కి కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ రూట్లో ఒక బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ను ప్రవేశపెట్టవలసి ఉంది. దీంతో సికింద్రాబాద్ నుంచి కాజీపేట, బల్లార్షా, గోండియా, రాయ్‌పూర్, ఝర్సుగూడ, టాటానగర్‌ల మీదుగా ప్రయాణికులకు సదుపాయం లభిస్తుంది. కాజీపేట– బల్లార్షా సెక్షన్లో కోల్‌కతాకు వెళ్లేందుకు ప్రస్తుతం ఒక్క రైలు కూడా లేదు. » ప్రతి సంవత్సరం లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరికి వెళ్తారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్–శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఇక్కడినుంచి అందుబాటులో ఉంది. ఈ రూట్లో సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు ఒక బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును వికారాబాద్, గుంతకల్, తిరుపతిల మీదుగా నడపాలని భక్తులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి గాం«దీధాం (గుజరాత్) వరకు బై వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశ పెట్టాలనే డిమాండ్ కూడా పెండింగ్‌లోనే ఉంది. తెలంగాణ సంపర్క్ క్రాంతి ఏమైనట్లు? హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు రాకపోకలు సాగించే విధంగా తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలనే ప్రతిపాదన పదేళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ప్రతిరోజూ వందలాది మంది వెయిటింగ్ లిస్ట్‌పై దృష్టి పెట్టి పడిగాపులు కాస్తుంటారు. మరోవైపు ఇటీవలి కాలంలో నగరవాసులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ నుంచి రామేశ్వరం రూట్లో ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట, విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాంచీపురం, విల్లుపురం మీదుగా ప్రవేశపెడితే ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. రాజధానితో అనుసంధానం ఏదీ? రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి, ఉమ్మడి జిల్లా కేంద్రాలకు ట్రైన్ కనెక్టివిటీ అరకొరగానే ఉంది. ఇంటర్సిటీ రైళ్ల తరహాలో ప్రత్యేకంగా వివిధ జిల్లా కేంద్రాలకు రైళ్లను ప్రవేశపెట్టాలని చాలాకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి.సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వరకు కాజీపేట, పెద్దపల్లి పట్టణాల మీదుగా వందే మెట్రో రైలును ప్రవేశపెట్టాలి, అలాగే సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో ఒక ఇంటర్ సిటీ రైలును నడపాలనే ప్రతిపాదన చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. అలాగే హైదరాబాద్ – బోధన్, కాచిగూడ–పుదుచ్చేరి తదితర మార్గాల్లో రైళ్లకు డిమాండ్ ఉంది. చర్లపల్లిని ప్రారంభిస్తారా? టెరి్మనల్గా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి స్టేషన్ ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ ఇంకా రైళ్ల రాకపోకలు అందుబాటులోకి రాలేదు. ఇది ప్రారంభమైతే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న దృష్ట్యా కూడా చర్లపల్లిని వినియోగంలోకి తేవలసి ఉంది. ఎన్నికల నేపథ్యంలో చర్లపల్లి ప్రారంభోత్సవం వాయిదా పడినట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలు వుదీరింది. ఇప్పటికైనా చర్లపల్లి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సదుపాయంగా ఉంటుంది. -
వైష్ణోదేవి దర్శనానికి వందేభారత్... ఖర్చెంత?
వైష్ణో దేవి భక్తులకు ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. ఇకపై అమ్మవారి దర్శనాన్ని వందేభారత్ రైలు ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. ఇది లగ్జరీ రైలు కావడంతో ప్రయాణికులకు పలు సౌకర్యాలు అందనున్నాయి. దీనిలో ప్రయాణించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ నుండి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కట్రాకు చేరుతుంది. అదే ఇతర రైలు అయితే ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి కట్రాకు సాయంత్రం ఆరు గంటలకు చేరుతుంది. అయితే ఈ మార్గంలో ప్రయాణించే వందే భారత్ ఛార్జీలు మిగిలిన రైళ్ల ఛార్జీల కంటే కొంచెం అధికం.ఢిల్లీ నుండి మాతా వైష్ణో దేవి కట్రా స్టేషన్‌కు ఇతర రైళ్ల టిక్కెట్ రూ. 990 వరకూ ఉంటుంది. అయితే వందే భారత్ చైర్ కార్లో రూ. 1610 టిక్కెట్‌తో కట్రాకు చేరుకోవచ్చు. ఎకనామిక్ చైర్ క్లాస్‌లో వెళితే ఒక్కో ప్రయాణికునికి రూ. 3005 చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్ రైలులో టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్, ఆఫ్లైన్లలోనూ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. -
వందే భారత్ రీషెడ్యూల్.. నాలుగు గంటల ఆలస్యం!
ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘వందే భారత్’ రైలు సుమారు నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరనుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది. రేపు (ఆదివారం) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే ట్రైన్ సుమారు 4.15 గంటలకు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకోనుంది.Train RescheduleTrain No.20833 Visakhapatnam - Secunderabad Vande Bharat express is rescheduled to leave at *10:00 hrs* on 23.06.2024 instead of its scheduled departure at 05:45 hrs. (Rescheduled by 4 hrs 15 Minutes) @RailMinIndia@EastCoastRail@SCRailwayIndia @drmvijayawada pic.twitter.com/fJjRmKUV5z— DRMWALTAIR (@DRMWaltairECoR) June 21, 2024 అయితే రేపు ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్‌ను ఉదయం 10 గంటలకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఇక.. రీషెడ్యూల్ కారణంగా ఆలస్యం జరగనున్నట్లు సమాచారం. దీంతో ట్రైన్ ఆలస్యానికి చింతిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్‌కు సంబంధించిన సమాచారం ప్రస్తుతం ‘ఎక్స్’లో వైరల్‌గా మారింది. -
వందే భారత్ రైలు ఆహారంలో బొద్దింక..
కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణ రైళ్లలో కంటే వందేభారత్‌లో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఫుడ్ మాత్రం సరిగా ఉండటం లేదని.. పాచిపోయిన, పురుగులు పడిన ఆహారం వచ్చిందంటూ ప్రయాణికుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.తాజాగా ఓ జంటకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తుండగా దంపతులక వందే భారత్ రైలులో అందించిన ఫుడ్‌లో చచ్చిన బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో ఈ విషయాన్ని తన బందువుల తరుపున విదిత్ వర్ష్నే అనే నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు. ‘ఈనెల 18వ తేదీన మా ఆంటీ, అంకుల్ వందేభారత్ రైలులో భోపాల్ నుంచి ఆగ్రా వరకూ ప్రయాణించారు. ఆ సమయంలో ఐఆర్సీటీసీ పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చింది’ అని పోస్టు పెట్టారు.అంతేకాకుండా ఘటనపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు ట్వీట్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.అయితే ఈ ఘటనపై ఐఆర్సీటీసీ క్షమాపణలు చెప్పింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ‘మీకు కలిగిన అనుభవానికి క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు తగిన జరిమానా విధించాం’ అని తెలిపింది.Today on 18-06-24 my Uncle and Aunt were travelling from Bhopal to Agra in Vande Bharat.They got "COCKROACH" in their food from @IRCTCofficial. Please take strict action against the vendor and make sure this would not happen again @RailMinIndia @ AshwiniVaishnaw @RailwaySe pic.twitter.com/Gicaw99I17— Vidit Varshney (@ViditVarshney1) June 18, 2024 కాగా వందేభారత్ రైళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదేం తొలిసారి కాదు. గత మార్చిలో సిలిగురి నుంచి కోల్‌కతా వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న ప్రసూన్ దేవ్.. తన ఆహారంలో పురుగును గుర్తించాడు. -
స్లీపర్ వందేభారత్ ప్రత్యేకతలివే..
త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ రైలు గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ న్యూ జనరేషన్ రైలు పూర్తిగా భారత్‌లోనే తయారు కావడం విశేషం. ఇప్పటి వరకు వందేభారత్ రైలులో కేవలం చైర్ కార్ సౌకర్యం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు స్లీపర్ వందే భారత్ మరిన్ని సౌకర్యాలతో మనముందుకు రానుంది. ఈ రైలుకు సంబంధించిన కార్యకలాపాలను ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024, ఆగస్టు 15న ఈ రైలు ట్రయల్ రన్ జరగనుంది.తాజాగా స్లీపర్ వందే భారత్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌చేస్తున్నాయి. భారీ గాజు అద్దాల కిటికీలు రైలుకు ప్రీమియమ్ లుక్‌ని ఇస్తున్నాయి. బోగీలోని పైసీటు కాస్త కిందకే ఉంది. దాన్ని ఎక్కడానికి అమర్చిన మెట్లలో గ్యాప్ తక్కువగా ఉంది. అంతేకాకుండా మెట్లపై కుషన్లు కూడా ఏర్పాటు చేశారు. బోగీలో ఒకవైపు మూడు సీట్లు ఉన్నాయి.సీటు రంగు లేత గోధుమ రంగులో ఉంది. ఫ్యాన్సీగా కనిపించే లైట్లను అమర్చారు. ఇది కోచ్‌కు మరింత అందాన్నిచ్చింది. రాబోయే ఐదేళ్లలో 500 వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను పట్టాలపై పరుగులు తీయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్స్
న్యూఢిల్లీ: త్వరలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఆగస్ట్ 15వ తేదీ నాటికి వీటి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఇవి మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. ఇవి త్వరలో ట్రయల్ రన్ పూర్తి చేసుకుని పట్టాలెక్కే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు అంటున్నాయి. వీటితోపాటుగా, తక్కువ దూరంలో ఉండే నగరాల మధ్య ప్రయాణాల కోసం వందే మెట్రో లేదా వందే భారత్ మెట్రోగా పిలిచే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే మొదలవనుందని చెబుతున్నారు. -
‘వందేభారత్’లో టికెట్లేని ప్రయాణికులు.. స్పందించిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ: భారత్ రైళ్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటిపై రాళ్లదాడులు జరగడం సర్వ సాధారణమైపోయింది. వందేభారత్‌కు సంబంధించి రోజూ ఏదో ఒక వార్త ఎక్కడో ఒక చోట చూస్తుంటాం. అయితే తాజాగా లక్నో-డెహ్రాడూన్ వందేభారత్ రైలులో టికెట్లేని ప్రయాణికులు చాలా మంది ఎక్కి టికెట్ ఉన్న ప్రయాణికులకు ఇబ్బందులు కలుగజేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.ప్రీమియం రైలులో ఈ పరిస్థితి తలెత్తితే మిగిలిన రైళ్ల పరిస్థితి ఏంటని వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు బోగీలను కూడా పెంచాలని వారు రైల్వే శాఖను డిమాండ్ చేశారు.అయితే వందేభారత్ వీడియోపై రైల్వేశాఖ స్పందించింది. ఇది పాత వీడియో అని తెలిపింది. కొందరు రైతులు గతంలో బలవంతంగా రైలులోకి ఎక్కినపుడు తీసిన వీడియో అని వెల్లడించింది. ఇలాంటి పాత వీడియోలను మళ్లీ వైరల్ చేసి ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని కోరింది. -
వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం
బీహార్‌లోని గయ జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్లో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.గయ జిల్లాలో గల ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్ పరిధిలోని మాన్పూర్ జంక్షన్లో హోమ్ సిగ్నల్ దగ్గర ఓవర్‌హెడ్ వైరు తెగిపోయింది. ఈ నేపధ్యంలో రాంచీ-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ-పట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను ముందుజాగ్రత్త చర్యగా అంతకు ముందుగల స్టేషన్లలో నిలిపివేశారు. తెగిన వైర్‌ను సరిచేయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. దీంతో వందే భారత్, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలోని ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.మాన్పూర్ జంక్షన్ హోమ్ సిగ్నల్ సమీపంలో ఓవర్ హెడ్ వైరు తెగిపోవడంతో రైల్వే సిబ్బంది వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో ట్రాక్షన్ డిపార్ట్మెంట్, ఇతర విభాగాలకు చెందిన బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి తొమ్మిది గంటలకు మరమ్మతు పనులు పూర్తయ్యాక ఈ మార్గంలోని కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రమాద సమయంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గుర్పా రైల్వే స్టేషన్లో, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను టంకుప్ప రైల్వే స్టేషన్లో నిలిపివేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. -
భూమి చుట్టూ 310 రౌండ్లు
సాక్షి, హైదరాబాద్: రైల్వే ఆధునికీకరణలో భాగంగా కొత్తగా ప్రారంభించిన వందేభారత్ రైళ్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లకు ఇప్పుడు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. 2019 ఫిబ్రవరి 15న ప్రారంభమైన వందేభారత్ రైళ్లు ఇప్పటి వరకు తిరిగిన నిడివిని పరిశీలిస్తే.. 310 పర్యాయాలు భూపరిభ్రమణం చేసిన దూరంతో సమానమట. ఇది సరికొత్త రికార్డు అంటూ రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది. 105.57% ఆక్యుపెన్సీ రేషియోతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సగటు 105.57 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. వీటిలో కేరళలో తిరుగుతున్న వందేభారత్ రైలు సర్వీసు గరిష్టంగా 175.3 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసింది. వందేభారత్ రైళ్లలో తిరుగుతున్న ప్రయాణికుల్లో 26–45 ఏళ్ల మధ్య ఉన్నవారు 45.9 శాతంగా నమోదవుతోంది. కేరళలో తిరుగుతున్న వందేభారత్ సర్వీసుల్లో అత్యధికంగా 15.7 శాతం వృద్ధులు ప్రయాణిస్తున్నట్టు తేలింది. గోవాలో తిరుగుతున్న వందేభారత్ రైళ్లలో అత్యధికంగా 42 శాతం మంది మహిళా ప్రయాణికులుంటున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని సర్వీసుల్లో గరిష్టంగా 67 శాతం మంది పురుషులు ఉంటున్నట్టు నమోదైంది. తెలంగాణలో నాలుగు రైళ్లుప్రస్తుతం తెలంగాణలో నాలుగు వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య 16 కోచ్‌లతో కూడిన వందేభారత్ రైలు సేవలు గతేడాది సంక్రాంతికి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రైలులో 120 శాతానికి మించి ఆక్యుపెన్సీ రేషియో ఉంటుండటంతో ఇటీవల ఇదే రూట్లో రెండో వందేభారత్ రైలు మొదలైన విషయం తెలిసిందే. రెండోది 8 కోచ్‌ల మినీఆరెంజ్ వందేభారత్. ఒకే రూట్లో రెండు వందేభారత్ రైళ్లు తిరగటం తొలుత కేరళలో మొదలైంది. రెండో ప్రయత్నంగా సికింద్రాబాద్– విశాఖ మార్గం ఎంచుకోవటం విశేషం. ఈమా ర్గం కాకుండా, సికింద్రాబాద్–తిరుపతి, కాచిగూడ–బెంగుళూరు మధ్య మరో రెండు సర్వీసులు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లు తిప్పాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఆమేరకు వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. ఇక త్వరలో రాత్రి వేళ తిరిగే స్లీపర్ వందేభారత్ రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి.సెమీ హైస్పీడ్ రైళ్లుగా...రైళ్ల వేగాన్ని గరిష్టస్థాయికి తీసుకెళ్తూ సెమీ హైస్పీడ్ రైళ్లుగా వీటిని ప్రారంభించారు. గంటకు 160 కి.మీ. వేగ సామర్థ్యమున్న ఈ రైళ్లు సగటున 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 వరకు సర్వీసులు (స్పెషల్ రైళ్లు కలుపుకొని) సేవలు అందిస్తున్నాయి. తొలి రైలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అన్ని వందేభారత్ రైళ్లు 18423 ట్రిప్పులు తిరిగాయి. వీటి మొత్తం నిడివి1,24,87,540 కిలోమీటర్లుగా నమోదైంది. ఇది 310 పర్యాయాలు భూమి చుట్టూ పరిభ్రమించిన దూరంతో సమానమని రైల్వే శాఖ పేర్కొంది. గత ఏడాది కాలంలో 97,71,705 కి.మీ.లు తిరిగినట్టు వెల్లడించింది. -
పరుగులకు మరో ‘వందేభారత్’ సిద్ధం
పట్టాలపై పరుగులు తీసేందుకు మరో వందేభారత్ రైలు సిద్ధంకానుంది. పట్నా- ఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో పట్టాలు ఎక్కనుంది. ఈ రైలు రాకతో పట్నా నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి పట్నాకు కేవలం తొమ్మది గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం పట్నా-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్ వంటి హై స్పీడ్ రైళ్లు ఢిల్లీ నుండి పట్నా చేరుకోవడానికి 13 గంటలు పడుతోంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం రైల్వే బోర్డు త్వరలో పట్నా- ఢిల్లీ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనుంది. అంటే త్వరలోనే పట్నా- న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ విడుదల కానున్నది. భారతీయ రైల్వే తొలిసారి ఢిల్లీ-హౌరా లైన్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపింది. అయితే అది గయ జంక్షన్ మీదుగా ఢిల్లీకి చేరుతుంది. అయితే ఇప్పుడు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బీహార్ రాజధాని పట్నా నుండి నడపడానికి ప్లాన్ చేస్తున్నది.న్యూఢిల్లీ- పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 130 కి.మీ. వందే భారత్ పట్నా నుండి అర్రా, బక్సర్ మీదుగా 9 గంటల ప్రయాణంతో ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలులో ఒక కోచ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ క్లాస్, ఏడు కోచ్‌లు ఎయిర్ కండిషన్డ్ చైర్‌కార్‌గా ఉండవచ్చు. ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో 52 సీట్లు, ఎయిర్ కండిషన్డ్ చైర్‌కార్‌లో 478 సీట్లు ఉండనున్నాయి. కాగా పట్నా-ఢిల్లీ మార్గంలో వందేభారత్‌ను నడిపే విషయమై భారత రైల్వే నుండి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. -
‘వందేభారత్’ నత్తనడక..
హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ విజయవాడకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చి వందేభారత్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ, ఆ రోజు రైలు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. తక్కువ టికెట్ ధర ఉన్న రైళ్ల కంటే ఆలస్యంగా అది విజయవాడకు చేరింది. వందేభారత్ సర్విసు మొదలైన 16 నెలల కాలంలో ఈ తరహా సమస్యలు తక్కువే, కానీ, ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. వెంటవెంటనే ఏర్పడుతుండటం ఇటు ప్రయాణికులకు చికాకు తెప్పిస్తుండగా, రైల్వే అధికారులను కలవరపెడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే ఆధునికతకు అద్దంపడుతూ దూసుకొచ్చిన ‘వందేభారత్’కూ సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. రైళ్లలో సాంకేతిక సమస్యలు సాధారణమే అయినా, క్రమంగా ఆ సమస్య పెరుగుతోంది. దూర ప్రాంతాల మధ్య తిరిగే సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు మూడు జతల రేకు(ఓ రైలు సెట్) ఉంటుంది.ప్రయాణ సమయం దాదాపు 26 గంటలు తీసుకునే హైదరాబాద్–ఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకుంటే.. హైదరాబాద్‌లో ఉదయం ఒక రైలు బయలు దేరగా, దాని ఒక జత రైలు అదే రోజు ఢిల్లీలో బయలుదేరుతుంది. మరో జత రైలు దారిలో ఉంటుంది. తక్కువ దూరం తిరిగే వాటికి రెండు జతలుంటాయి. » హైదరాబాద్–విశాఖపట్నంలాంటి సాధారణ దూరం తిరిగే (సగం రోజు ప్రయాణ సమయం) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తీసుకుంటే.. ఒక రైలు హైదరాబాద్‌లో బయలుదేరుతుంటే, అదే సమయానికి దాని జత రైలు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. » హైదరాబాద్‌లో ఉదయం బయలుదేరే తిరుపతి వందేభారత్ రైలు, అదే రోజు మధ్యాహ్నం తిరుపతి చేరుకొని, కాసేపటికే అక్కడ బయలుదేరి రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. దేశంలోని అన్ని వందేభారత్ రైళ్లది ఇదే తీరు. ఇక్కడే ఇప్పుడు సమస్య ఏర్పడుతోంది. ఒక చోట రైలు బయలుదేరేప్పుడు సాంకేతిక సమస్య ఏర్పడి ఆలస్యంగా బయలుదేరితే, గమ్యస్థానం చేరి, తిరిగి అక్కడ బయలుదేరేందుకు జాప్యం తప్పటం లేదు. » ఈనెల 16న విశాఖపట్నంలో హైదరాబాద్ వచ్చే వందేభారత్ రైలు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. విజయవాడలో మరో రెండు గంటలు ఆలస్యమైంది. వెరసి ఐదు గంటలు ఆలస్యంగా హైదరాబాద్ చేరుకుంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరుగుప్రయాణం ఉండాల్సి ఉండగా, ఐదు గంటలు ఆలస్యంగా రాత్రి 8 గంటలకు ఆ రైలు బయలుదేరాల్సి వచ్చింది. ఒక కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే రైలు ఆగిపోవాల్సిందే.. ఇక వందేభారత్ డిజైన్ కూడా ఈ జాప్యానికి మరో కారణమవుతోంది. ఇది సంప్రదాయ ఎక్స్‌ప్రెస్ రెళ్లకు భిన్నంగా ఉంటుంది. డెమూ, మెమూ తరహాలో రెండు ఇంజిన్లు రైలులో అంతర్భాగంగా ఉంటాయి. మూడునాలుగు కోచ్‌లు కలిపి ఒక సెట్‌గా ఉంటుంది. దీనికి పవర్‌కార్ జత కలిసి ఉంటుంది. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఇదే డిజైన్‌తో ఉంటాయి. ఓ కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే, ఆ కోచ్ ఉండే సెట్ మొత్తాన్ని తొలగించి దాని స్థానంలో మరో సెట్ చేర్చి రైలును పంపేస్తారు. తర్వాత.. సాంకేతిక సమస్య తలెత్తిన కోచ్‌ను డిపోనకు తీసుకెళ్లి మరమ్మతు చేస్తారు. ఇందుకోసం స్పేర్ కోచ్‌లను అందుబాటులో ఉంచుతారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సర్విసుకు 12 కోచ్‌లతో కూడిన రెండు రేక్‌లు స్పేర్ విధుల్లో ఉన్నాయి. కానీ వందేభారత్‌కు స్పేర్ చోక్ సెట్లు లేవు. ఓ కోచ్‌లో సమస్య తలెత్తితే దానికి మరమ్మతు చేసేవరకు మొత్తం రైలును నిలిపివేయాల్సిందే. వారంరోజుల క్రితం విశాఖపట్నం నుంచి ఐదు గంటలు ఆలస్యంగా రావటానికి ఇదే కారణమైంది. -
ఇంటర్సిటీల మధ్య వందే మెట్రోలు!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మార్గాల్లోనే!హైదరాబాద్ నుంచి నల్లగొండ మీదుగా గుంటూరు, సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కరీంనగర్, సికింద్రాబాద్–కర్నూలు, కాచిగూడ–కర్నూలు, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొదట ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–విజయవాడ వంటి రూట్లలో వందే మెట్రోలను ప్రవేశపెట్టొచ్చు. అనంతరం దశలవారీగా ఇతర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమైన స్టేషన్లలోనే హాల్టింగ్.. వందే మెట్రో రైళ్లు ప్రస్తుతం హైదరాబాద్‌లో నడుస్తున్న మెట్రో రైళ్ల తరహాలోనే ఉంటాయి. మొదట 12 కోచ్‌లతో ప్రారంభించి డిమాండ్‌కు అనుగుణంగా ఆ తరువాత 16 కోచ్‌ల వరకు పెంచనున్నారు. మెట్రో రైళ్ల తరహాలోనే పూర్తిగా ఏసీ సదుపాయం, ఆటోమేటిక్‌గా తలుపులు తెరుచుకొని మూసుకొనే ఏర్పాటు ఉంటుంది. ప్రారంభ స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు ముఖ్యమైన స్టేషన్లలోనే ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ఉండనుంది. ప్రస్తుతం పుష్పుల్ రైళ్లకు ఉన్నట్లుగానే ముందు, వెనుక రెండు ఇంజన్లు ఉంటాయి. దీంతో ఈ రైళ్లను ప్రత్యేకంగా పిట్ లైన్లకు తరలించాల్సిన అవసరంలేదు. తక్కువ సమయంలోనే తిరుగు ప్రయాణ సేవలను అందించే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు ఉండవు... ఈ రైళ్లన్నీ సాధారణ రైళ్ల తరహాలోనే సేవలు అందిస్తాయి. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు కొనుక్కొని బయలుదేరొచ్చు. కూర్చొని ప్రయాణం చేసేందుకు వీలుగా సీట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే వీటిలో కొద్దిగా టికెట్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవాలనుకొనే వారికి ఈ రైళ్లలో ప్రయాణం లాభదాయకం. వివిధ మార్గాల్లో నడిచే ఇంటర్ సిటీ రైళ్ల స్థానంలోనే వందే మెట్రోలు రానున్నాయి. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్సిటీ ట్రైన్ యథాతథంగా సేవలను కొనసాగించనుంది. -
త్వరలో తొలి స్లీపర్ వందేభారత్.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
దేశంలోని తొలి స్లీపర్ వందేభారత్ త్వరలో పట్టాలపై పరుగులు తీయనుంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్- న్యూఢిల్లీ మధ్య స్లీపర్ వందే భారత్‌ను నడపడానికి ఈశాన్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇండియన్ రైల్వే టైమ్ టేబుల్ కమిటీ (ఐఆర్టీటీసీ) ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జైపూర్‌లో సమావేశం కానుంది. దీనిలో ఈ రైలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రైల్వే జోన్ల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు.. కొత్త రైళ్లను నడపడం, ట్రిప్పులను పెంచడం, రూట్లను మార్చడం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈశాన్య రైల్వే రూపొందించిన ప్రతిపాదన ప్రకారం నూతన స్లీపర్ వందేభారత్ రైలు వారానికి మూడు రోజులు నడవనుంది. గోరఖ్‌పూర్ నుంచి రాత్రి వేళల్లో ఈ రైలును నడపాలని ప్రతిపాదించారు. ఈ రైలు గోరఖ్‌పూర్ నుండి న్యూఢిల్లీకి 12 గంటల్లో చేరుకుంటుంది. ఈ సమావేశంలో ఈ రైలుకు ఆమోదం లభిస్తే 2024, జూలై నుంచి ఈ రైలు రాకపోకలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోరఖ్‌పూర్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా రైలు నడపాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం గోరఖ్‌పూర్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు వందే భారత్ రైలు నడుస్తోంది. నూతన ప్రతిపాదనల ప్రకారం స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌పూర్ నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. అంటే గోరఖ్‌పూర్ నుంచి ఢిల్లీకి కేవలం 12 గంటల్లోనే చేరుకోవచ్చు. -
‘ఆటోమేటిక్ డోర్‌కు అలవాటు పడలేదు’
‘వందే భారత్’ రైలులో ప్రయాణించాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఆధునిక సౌకర్యాలతో తళతళలాడుతున్న ఈ రైలు ఎక్కాలని చాలామంది తహతహలాడిపోతుంటారు. అయితే ఈ రైలులోని కొన్ని సాంకేతిక విషయాలు తెలియక కొందరు చిక్కుల్లో పడుతున్నారు. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా రైలు ప్రయాణానికి బయలుదేరినప్పుడు వారిని దిగబెట్టేందుకు తోడుగా ఎవరో ఒకరు వెళుతుంటారు. ఇదేవిధంగా ఒక భర్త తన భార్యను వందేభారత్ రైలు ఎక్కించేందుకు వెళ్లాడు. ఆమె తన సీటులో కూర్చున్నాక భర్త కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. అయితే ఇంతలో వారుంటున్న కోచ్ డోర్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోయింది. మరి అప్పుడేం జరిగింది? వివరాల్లోకి వెళితే ఒక మహిళ తన కుమార్తె దగ్గర ఉండేందుకు తొలిసారిగా వందే భారత్ రైలులో గుజరాత్‌లోని వడోదర నుంచి ముంబైకి బయలుదేరింది. ఆ మహిళకు తోడుగా స్టేషన్ వరకూ ఆమె భర్త వచ్చాడు. లగేజీని ఆమె కూర్చున్న సీటు దగ్గర ఉంచి, కాసేపు కూర్చున్నాడు. ఇంతలో రైలు తలుపులు మూసుకుపోయిన శబ్ధం వినిపించింది. ఆ వ్యక్తి రైలు దిగకముందే డోర్ మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి టీసీతో మాట్లాడి రైలును ఆపాలనుకున్నాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో రైలు వేగం అందుకుంది. దీంతో ఆ వ్యక్తి తనకు ఇష్టం లేకపోయినా తదుపరి స్టేషన్ వచ్చే వరకు ప్రయాణించవలసి వచ్చింది. అతని కుమార్తె తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ కొన్ని లక్షలమంది వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్.. ‘అతను స్టేషన్‌లోని నో పార్కింగ్ జోన్లో పెట్టిన తన కారు గురించి ఆందోళన చెందుతున్నాడేమోనని’ రాయగా, మరొక యూజర్ ‘ఇది అతనికి అందమైన జ్ఞాపకంగా మిగులుతుందని’ రాశాడు. మరో యూజర్ ‘అతనింకా ఆటోమేటిక్ డోర్‌కు అలవాటుపడలేదని’ పేర్కొన్నాడు. My mother is travelling for the first time in Vande Bharat from Vadodara to Mumbai today to visit me. As it is going to be a longer stay, she had two big bags to travel with. (1/4) — Kosha (@imkosha) April 2, 2024 -
‘వందేభారత్’ వేళలు మార్చండి
సాక్షి, హైదరాబాద్: ‘సికింద్రాబాద్ – విశాఖ’ వందేభారత్ రైలు టైమింగ్ మార్చాలనే డిమాండ్ రైల్వే ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 5:05 గంటలకే బయలుదేరుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరానికి నలువైపులా ఉన్నవారు తెల్లవారుజామునే స్టేషన్‌కు చేరుకోవాలి. అయితే ఆ సమాయానికి క్యాబ్‌లు, ఆటోలు బుక్ కావడం లేదు. ఒకవేళ బుక్ అయినా ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో ఆ రైలు టైమింగ్ మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. సికింద్రాబాద్–విశాఖ మధ్య ఈ నెల 12న రెండో వందేభారత్ రైలుకు ప్రారంభించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ రైలు ఉదయం 6 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి బయలు దేరాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో ఇతర రైళ్లు నడుస్తుండటంతో ఈ రైలును నడపలేని దుస్థితి నెలకొంది. మరో గంట తర్వాత కాస్త నిడివి ఉంది. కానీ, ఉదయం ఏడున్నరకు లింగంపల్లి–విశాఖ మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.10కి సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. అది కూడా వందేభారత్ తరహాలో చైర్‌కార్ ఎక్స్‌ప్రెస్ రైలు. దీంతో విశాఖపట్నానికి రెండు చైర్‌కార్ ఎక్స్‌ప్రెస్‌లు ఒకేసారి బయలుదేరాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో వందేభారత్ రైలును ఉదయం 5.05 సమయాన్ని ఖరారు చేశారు. అయితే ఆ సమయం ప్రయాణికులకు అసౌకర్యంగా మారింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఉదయం ఐదింటిలోపు చేరుకోవాలంటే, దూరప్రాంతాల నుంచి వచ్చే వారు ఉదయం నాలుగింటికల్లా ఇళ్లలో బయలుదేరాలి. ఆ సమయాల్లో ఆటోలు, క్యాబ్‌లు తక్కువగా ఉండటంతో వాటి బుకింగ్ ఇబ్బందిగా మారింది. మూడోలైన్ పూర్తయితేనే... విశాఖకు నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లు వరంగల్ మీదుగా తిరుగుతున్నాయి. ఆ మార్గంలో మూడో లైన్ అందుబాటులో లేదు. ఉన్న రెండు లైన్లమీదుగా వందల సంఖ్యలో రైళ్లు పరుగుపెడుతున్నాయి. ప్రయాణికుల రైళ్లు, సరుకు రవాణా రైళ్లు ఆ రెండు లైన్లమీదుగానే నడపాల్సి వస్తోంది. ఈమార్గంలో మూడోలైన్ పనులు 2017 నుంచి న డుస్తున్నా..తీవ్ర జాప్యం జరుగుతోంది. మూడోలైన్ పూర్తయి తే, మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలవుతుంది. ప్రయాణికుల కు అనువైన వేళల్లో నడిపేందుకూ అవకాశం కలుగుతుంది. ఆ రూట్లో నడపలేక.. విశాఖపట్నం మొదటి వందేభారత్ రైలును వరంగల్ రూట్లో నడుపుతున్నందున, రెండో వందేభారత్‌ను నల్లగొండ–నడికుడి– గుంటూరు మార్గంలో తిప్పాలని తొలుత భావించారు. కానీ, ఆ మార్గం ప్రస్తుతం సింగిల్ లైన్‌తో ఉంది. ఎదురుగా ఓ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వస్తే, మిగతా వాటిని ఆయా ప్రాంతాల్లోని స్టేషన్లలో నిలపాలి. ఈ మార్గంలో తిరుపతి వందేభారత్ రైలు నడుస్తోంది. ఆ సింగిల్లైన్ను దాటే సమయంలో చాలా రైళ్లు క్రాసింగ్ సమయంలో నిలిచిపోవాల్సి వస్తోంది. దీంతో ఆ రూట్లో ఇబ్బందులు ఉన్నాయని, వరంగల్రూట్కు మార్చారు. అయినా వెయిటింగ్ జాబితానే.. విశాఖకు నడిచే మొదటి వందేభారత్ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. దానికి దాదాపు 114 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. కనీసం ఐదారు రోజుల వెయిటింగ్ లిస్టు ఉంటోంది. దీనికి ఆదరణ బాగుందనే రెండో వందేభారత్ రైలు ప్రారంభించారు. ఇది కూడా వందశాతం ఆక్యుపెన్సీ రేషియో దాటి నడుస్తోంది. నాలుగు రోజుల వెయిటింగ్ లిస్టు ఉంటోంది. -
ఉత్తరప్రదేశ్‌లో ‘వందేభారత్’పై రాళ్ల దాడి!
ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్ రైలుపై అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనతో రైల్వేశాఖలో కలలకం చెలరేగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. యూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై ఈ రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్ మధ్య జరిగింది. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై బయటి నుంచి ఎవరో రాళ్లు విసిరారు. దీంతో రైలులోని సీ-3 కోచ్ కిటికీ అద్దం బద్దలయ్యింది. రైలు టెక్నీషియన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. -
పట్టాలెక్కిన సికింద్రాబాద్– విశాఖ రెండో వందేభారత్
సాక్షి, హైదరాబాద్/ రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్– విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించటం సహా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పూర్తయిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. మంగళవారం ఉదయం ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి అహ్మదాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజె క్టులను జాతికి అంకితం చేశారు. గతేడాది సంక్రాంతి రోజున సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రారంభించిన తొలి వందేభారత్ రైలు కిక్కిరిసి ప్రయాణిస్తుండటంతో దానికి అద నంగా ఇటీవలే రైల్వే బోర్డు రెండు నగరాల మధ్య రెండో వందేభారత్ రైలును మంజూరు చేసింది. సికింద్రాబాద్‌లో ఉద యం ప్రారంభమయ్యే ఈ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. కొల్లాం–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రా రంభించారు. కాజీపేట– విజయవాడ, కాజీపేట– బలార్షా మధ్య పూర్తయిన మూడో లైన్ భాగాలను, 14 డబ్లింగ్ లైన్ల ను, కొన్ని బైపాస్, గేజ్ మార్పిడి లైన్లు, పాత రైల్ కోచ్‌లను, స్టేషన్లలో ఏర్పాటుచేసిన రెస్టారెంట్లను, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 193 స్టేషన్లలో ఏర్పాటు చేసిన వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ కేంద్రాలను, తొమ్మిది పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్సు షెడ్లు, రెండు జన్ ఔషధి కేంద్రాలను ఆయన జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్‌లో చోటుచేసుకుంటున్న పురోగతిని ఆయన వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా.. ప్రధాని అహ్మదాబాద్ నుంచి నిర్వహించిన ఈ వర్చువల్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనటం విశేషం. సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, డీఆర్ఎం కుమార్, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జన ఔషధి షాపులో తక్కువ ధరకు మందులు సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన జన ఔషధి, స్థానిక ఉత్పత్తుల కేంద్రాలను కిషన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు, తక్కువ ధరకు మందులు అందుబాటులో ఉండేలా జన ఔషధి షాపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్, రూ.350 కోట్లతో నాంపల్లి స్టేషన్ల పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. చర్లపల్లి టెర్మినల్ పనులు చాలావరకు పూర్తయ్యాయని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. -
రైలు పట్టాలపై జీవితం ఆరంభించా: ప్రధాని మోదీ
అహ్మదాబాద్/పోఖ్రాన్: రైలు పట్టాలపైనే తన జీవితాన్ని ప్రారంభించానని, రైల్వే శాఖకు సంబంధించిన కష్టాలు, ప్రయాణికుల ఇబ్బందులన్నీ తనకు తెలుసని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నరకం లాంటి పరిస్థితి నుంచి రైల్వేలను బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైల్వే రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వాలు రైల్వేశాఖ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని, సొంత రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయని విమర్శించారు. 21వ శతాబ్దంలో రైల్వేల ప్రగతిని దృష్టిని పెట్టుకొని రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేశామని వెల్లడించారు. తద్వారా రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మంగళవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించారు. సబర్మతి ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.1,06,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. పది నూతన వందేభారత్ రైళ్లను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో సికింద్రాబాద్–విశాఖపట్నం, పూరీ–విశాఖపట్నం వందేభారత్ రైళ్లు కూడా ఉన్నాయి. తిరుపతి–కొల్లాం స్టేషన్ల మధ్య కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కాదు 2004–2014తో పోలిస్తే గత పదేళ్లలో తమ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి 6 రెట్లు అధికంగా ఖర్చు చేసిందని ప్రధానమంత్రి అన్నారు. గతంలో రైళ్లు ఆలస్యంగా నడవడం అనేది సాధారణ వ్యవహారంగా ఉండేదన్నారు. 2014 వరకు దేశంలో కేవలం 35 శాతం రైల్వే లైన్లు విద్యుదీకరణకు నోచుకున్నాయని గుర్తుచేశారు. రైళ్లలో ప్రయాణానికి రిజర్వేషన్ దొరకడం చాలా కష్టంగా ఉండేదని, టికెట్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిల్చునేవారని, ఏజెంట్లు కమీషన్లు వసూలు చేసేవారని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. దేశ ప్రగతి అనే మిషన్‌లో భాగంగానే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు చేపడుతున్నామని, అంతేతప్ప కొందరు ఆరోపిస్తున్నట్లు ఎన్నికల్లో లబ్ధి కోసం ఎంతమాత్రం కాదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారసత్వ సంపదను కాపాడుకోవాలి సొంత వారసత్వ సంపదను కాపాడుకోని దేశానికి భవిష్యత్తు ఉండదని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. మన దేశ వారసత్వ సంపదను కాపాడే విషయంలో గత ప్రభుత్వాలు ఏమాత్రం నిబద్ధత చూపలేదని విమర్శించారు. మంగళవారం అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో దండి యాత్ర వార్షికోత్సవంలో మోదీ పాల్గొన్నారు. రూ.1,200 కోట్లతో అమలు చేయనున్న గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రారంభించారు. ఆధునీకరించిన కోచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఆరంభించిన సబర్మతి ఆశ్రమం కేవలం మన దేశానికే కాదు, మొత్తం మానవాళికే వారసత్వ సంపద అని తేల్చిచెప్పారు. పోఖ్రాన్లో అబ్బురపర్చిన ‘భారత్ శక్తి’ భారతదేశ ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి పోఖ్రాన్ ఒక ఘనమైన సాక్షి అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. రాజస్తాన్ రాష్ట్రం పోఖ్రాన్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో మంగళవారం భారత త్రివిధ దళాలు ‘భారత్ శక్తి’ పేరిట సైనిక విన్యాసాలు నిర్వహించారు. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ విన్యాసాలను మోదీ ప్రత్యక్షంగా తిలకించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, రక్షణ పరికరాల విన్యాసాలు చూపరులను అబ్బురపర్చాయి. తేజస్, ఏఎల్ఎస్ ఎంకే–4 యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు అర్జున్, కె–9 వజ్ర, ధనుష్ వంటివి ఆకట్టుకున్నాయి. పినాకా ఉపగ్రహ వ్యవస్థతోపాటు డ్రోన్ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఆకాశంలో మన యుద్ధ విమానాల గర్జనలు, నేలపై మన జవాన్ల సాహసాలు నవ భారత్(న్యూ ఇండియా)కు ఆహ్వానం పలుకుతున్నామని మోదీ పేర్కొన్నారు. -
10 ‘వందే భారత్’లకు ప్రధాని మోదీ పచ్చ జెండా!
దేశంలోని ప్రజలకు మరో పది నూతన వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 10 నూతన వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అలాగే ఇతర రైల్వే సేవలను కూడా స్వాగతించారు. ‘రైల్వేని నరకం నుంచి బయటపడేశాం’ ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతీయ రైల్వేలను నరకం లాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. తమ సంకల్ప శక్తికి సజీవ నిదర్శనం రైల్వేల అభివృద్దేనని అన్నారు. దేశంలోని యువత ఎలాంటి దేశం, ఎలాంటి రైళ్లు కావాలో నిర్ణయించారన్నారు. తమ ఈ పదేళ్ల కృషి కేవలం ట్రైలర్ మాత్రమేనని, మనం మరింత ముందుకు సాగాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ కూడా పాల్గొన్నారు. 10 రైళ్ల వివరాలు ఇవే.. అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ సికింద్రాబాద్-విశాఖపట్నం మైసూరు- డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై) పాట్నా- లక్నో న్యూ జల్పాయిగురి-పాట్నా పూరీ-విశాఖపట్నం లక్నో – డెహ్రాడూన్ కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు రాంచీ-వారణాసి ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్) మరోవైపు.. కొత్తవలస-కోరాపుట్,.. కోరాపుట్-రాయగఢ్ లైన్లలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్‌లో కొన్ని పనులు ప్రారంభించారు మోదీ. మొత్తం 85వేల కోట్ల విలువైన కొన్ని కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లు వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. Honourable PM @narendramodi ji virtually flags off Second Vande Bharat Express between Secunderabad & Visakhapatnam, facilitating swift connectivity between #Telangana & #AndhraPradesh.#VandebharatExpress #ModiKiGuarantee pic.twitter.com/t8nDqOlqzi — Dr K Laxman (Modi Ka Parivar) (@drlaxmanbjp) March 12, 2024 ప్రారంభించిన కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా... సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం నాడు ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య రెండో రైలు కాగా... మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది. Live: Flagging off 4th Vande Bharat Train From Telangana, Secunderabad - Visakhapatnam (Train Number 20707), Secunderabad Railway Station. https://t.co/wkmmWP0wth — G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) March 12, 2024 మహాత్మునికి ప్రధాని మోదీ నివాళులు అహ్మదాబాద్‌లోని సబర్మతిలోగల మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొచరబ్ ఆశ్రమాన్ని, గాంధీ ఆశ్రమం మెమోరియల్ మాస్టర్ ప్లాన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. నేడు (మంగళవారం) ప్రధాని మోదీ గుజరాత్, రాజస్థాన్‌లలో పర్యటిస్తున్నారు. #WATCH | Prime Minister Narendra Modi offers floral tributes to Mahatma Gandhi at Mahatma Gandhi Ashram at Sabarmati, in Ahmedabad, Gujarat. He will inaugurate Kochrab Ashram and launch the Master plan of Gandhi Ashram Memorial here. pic.twitter.com/x95WUUF7Tt — ANI (@ANI) March 12, 2024 -
ఇకపై కాశీ నుంచి అయోధ్యకు మూడు గంటలే..
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైనది మొదలు కాశీ నుండి అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలోని ప్రజలకు మరో కానుక అందించారు. ఇకపై వారణాసికి వచ్చే భక్తులు కేవలం మూడు గంటల్లో ‘వందే భారత్’ సాయంతో అయోధ్య ధామ్ చేరుకోగలుగుతారు. ప్రధాని మోదీ నేడు (మంగళవారం) ఈ నూతన వందేభారత్ రైలుకు పచ్చ జెండా చూపించనున్నారు. మంగళవారం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వందే భారత్ బీహార్‌లోని పట్నా నుండి అయోధ్య ధామ్, లక్నో మీదుగా వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. ఇది కాశీ పర్యాటకులు అయోధ్యకు వెళ్లడాన్ని సులభతరం చేయనుంది. ఈ వందే భారత్ పట్నా నుండి వారణాసి కాంట్ స్టేషన్‌కు ఉదయం 9.30 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. కాశీ నుండి అయోధ్య కు భక్తులు కేవలం మూడు గంటల్లో చేరుకోగలుగుతారు. -
Vande Bharat: సికింద్రాబాద్–విశాఖ మధ్య వందేభారత్–2
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సదుపాయాలు, అత్యధిక వేగంతో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీసే వేళైంది. ఈ నెల 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లో ఈ ట్రైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో నిర్వహించనున్న ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్– విశాఖ మధ్య ఇప్పటికే నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వంద శాతానికిపైగా ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా రైల్వేశాఖ ఈ రూట్లో రెండోరైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 13న విశాఖపట్టణం నుంచి, 15న సికింద్రాబాద్ నుంచి వందేభారత్ సెకెండ్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 12వ తేదీ నుంచి ప్రయాణాలను బుక్ చేసుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ నుంచి విశాఖకు సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో చేరుకోనుంది. ఈ ట్రైన్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో నిమిషం నుంచి 2 నిమిషాలపాటు హాల్టింగ్ సదుపాయం ఉంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వేళలు ► సికింద్రాబాద్–విశాఖపట్టణం(20707) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఇది ఉదయం 6.39 గంటలకు వరంగల్, 7.43 గంటలకు ఖమ్మం, 9.05 గంటలకు విజయవాడ, 11 గంటలకు రాజమండ్రి, ఉదయం 11.43 గంటలకు సామర్లకోట స్టేషన్లకు చేరుకుంటుంది. ► విశాఖపట్టణం–సికింద్రాబాద్ (20708) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 4.03 గంటలకు సామర్లకోట, 4.38 గంటలకు రాజమండ్రి, సాయంత్రం 6.40 గంటలకు విజయవాడ, రాత్రి 8.03 గంటలకు ఖమ్మం, 10.03 గంటలకు వరంగల్, రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. -
త్వరలో అందుబాటులోకి వందే భారత్ స్లీపర్ రైలు
దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగుళూరులో బీఈఎంఎల్ తయారు చేసిన వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్ రైలు కార్ బాడీ స్ట్రక్చర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ చైర్ కార్, నమో-భారత్ (రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్), అమృత్ భారత్ రైలు (పుష్-పై రైళ్లు) విజయవంతమయ్యాక తదుపరి వందే భారత్ స్లీపర్, వందే మెట్రో రైళ్లను పరిచయం చేయడమేనని అన్నారు. Furnishing of Vande Sleeper started! pic.twitter.com/itYaSQyNG2 — Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 9, 2024 వందే భారత్ స్లీపర్ వెర్షన్లో పురోగతి ఆశాజనకంగా ఉందని, పూర్తి నిర్మాణం, పైకప్పుతో సహా కొత్త డిజైన్ పూర్తయిందని వైష్ణవ్ చెప్పారు. ఫర్నిషింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేయాలని మేము భావిస్తున్నామని వెల్లడించారు. -
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 12న వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు మరో వందే భారత్ రైలు నడపనున్నారు. గురువారం మినహా మిగిలిన ఆరు రోజులు వందే భారత్ నడవనుంది. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకి వందేభారత్( రైల్ నంబర్-20707) విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 11.20కి వందేభారత్ ( రైలు నంబర్-20708) సికింద్రాబాద్ చేరుకోనుంది. ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్- విశాఖ మధ్య మరొక వందేభారత్ రైలును కేటాయించారు. విశాఖ- పూరి మధ్య ఈ నెల 12 నుంచి వందే భారత్ పరుగులు పెట్టనుంది. శనివారం మినహా మిగిలిన ఆరు రోజులలో పూరి- విశాఖ మధ్య వందేభారత్ నడవనుంది. పూరిలో ఉదయం 5.15 బయలుదేరి.. ఉదయం 11.30 గం.లకి విశాఖ చేరుకోనున్న వందేభారత్ ( రైలు నంబర్- 20841).. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.40కి బయలుదేరి రాత్రి 9.55 గంటలకి పూరి వందేభారత్ ( రైలు నంబర్- 20842) చేరుకోనుంది. కుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరంలో స్టాపేజ్‌లు ఉన్నాయి. ఇదీ చదవండి: ఇంగ్లిష్.. భవిత భేష్ -
మరో ‘వందే భారత్’ ట్రయల్ రన్ విజయవంతం
ఇది రామ భక్తులకు పండుగలాంటి వార్త. అయోధ్యలోని రాములోరిని చూసేందుకు యూపీ భక్తులు ఇకపై కాషాయ రంగులో మెరిసిపోయే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ వందే భారత్ రైలు యూపీ రాజధాని పట్నా నుండి అయోధ్య మీదుగా లక్నో వరకు నడుస్తుంది. ఈ రైలుకు సంబంధించిన తుది ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఈ ట్రయల్ రన్లో ఈ రైలు నిర్ణీత సమయానికి ముందుగానే లక్నోకు చేరుకుంది. ఈ రైలును మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. కాగా అధికారికంగా ఈ రైలు టైమ్ టేబుల్‌ను ఇంకా విడుదల చేయలేదు. పట్నా నుంచి అయోధ్య మీదుగా లక్నో వరకు నిర్వహించిన ఈ రైలు ట్రయల్ రన్లో నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందుగా వారణాసి, 12 నిమిషాల ముందుగా అయోధ్య , 20 నిమిషాల ముందుగా లక్నో చేరుకుంది. ట్రయల్ రన్లో ఈ రైలు ఉదయం 6:05 గంటలకు పట్నా నుంచి లక్నోకు బయలుదేరింది. ఈ సమయంలో రైలు వేగం 130 కి.మీ.గా ఉంది. -
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు రద్దు
సాక్షి, సికింద్రాబాద్/ విశాఖపట్నం: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) విజ్ఞప్తి అందించింది. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నేడు రద్దయినట్లు తెలిపింది. విశాఖ పట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలుతోపాటు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ విశాఖ పట్నం వందే భారత్ రైలు కూడా రద్దు చేసినట్లు పేర్కొంది. రేక్‌ల సమస్య వల్ల రైలును క్యాన్సల్ చేసినట్లు అధికారులువ వెల్లడించారు. అయితే ప్రత్యామ్నాయంగా ప్రయాణికుల సౌకర్యం కోసం అధికారులు ప్రత్యేక రైలును (08134A) ఏర్పాటు చేశారు. ఇది మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుందని, రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలుకు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. వరంగల్, ఖమ్మంలో ఒక్క నిమిషం.. రాజమండ్రి, సామర్లకోటలో రెండు నిమిషాలు.. విజయవాడ స్టేషన్లో ఐదు నిమిషాలు ఈ రైలు ఆగుతుంది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. మరోవైపు ఇలా అనూహత్యం, రైలురద్దయినట్లు ప్రకటించడం సరైనది కాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
పట్టాలెక్కనున్న ‘స్లీపర్ వందే భారత్’.. రూట్ ఇదే!
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనంతరం ‘స్లీపర్ వందే భారత్’ త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం పలువురు ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వందే భారత్ మాదిరిగానే ‘స్లీపర్ వందే భారత్’ కూడా ప్రత్యేకమైన రైలుగా గుర్తింపు పొందనుంది. దేశంలోనే మొట్టమొదటి ‘స్లీపర్ వందే భారత్’ ఏ మార్గంలో నడుస్తుందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం 41 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 39 రైళ్లు ట్రాక్‌పై నడుస్తుండగా, రెండు రైళ్లు రిజర్వ్‌లో ఉన్నాయి. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లన్నీ చైర్ కార్ సౌకర్యం కలిగినవి. అంటే వీటిలో కూర్చుని ప్రయాణించవచ్చు. రాబోయే రోజుల్లో ‘వందే భారత్’ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ‘స్లీపర్ వందే భారత్’ రైళ్లలో మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు చాలా దూరం వరకూ ప్రయాణిస్తాయి. ఇవి రాత్రిపూట నడుస్తాయి. ఇందులో ప్రయాణికులు నిద్రిస్తూనే ప్రయాణం సాగించవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని ప్రధాన మార్గాలైన ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రూట్లలో సాధారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకకాలంలో ఈ రెండు మార్గాల్లో నడపపనున్నారని తెలుస్తోంది. ఈ రెండు మార్గాలే కాకుండా, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-గౌహతి, ఢిల్లీ-భువనేశ్వర్, ఢిల్లీ-పాట్నా రూట్లలో 10 ‘స్లీపర్ వందే భారత్’ రైళ్లు నడవనున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొదటి స్లీపర్ వందే భారత్ రైలును ఐసీఎఫ్ చెన్నై తయారు చేయనుంది. దీని స్లీపర్ కోచ్ రాజధాని, ఇతర ప్రీమియం రైళ్లకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఒక్కో కోచ్‌లో నాలుగు టాయిలెట్లకు బదులుగా మూడు టాయిలెట్లు ఉంటాయి. దీనితో పాటు మినీ ప్యాంట్రీ కూడా ఉంటుంది. స్లీపర్ వందే భారత్ రైలులో మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి. ఇందులో ప్రయాణికులకు 823 బెర్త్‌లు, రైల్వే సిబ్బందికి 34 బెర్త్‌లు ఉంటాయి. -
వందే భారత్‌లో పాడైపోయిన భోజనం?
దేశంలోనే సెమీహైస్పీడ్ రైళ్లుగా ప్రత్యేకతను చాటుకుంటున్నాయి వందే భారత్ రైళ్లు. సాధారణ రైళ్ల కంటే టికెట్ ధర ఎక్కువైనప్పటికీ.. త్వరగా గమ్యస్థానం చేర్చడం, ఇతర సదుపాయాల విషయంలో వందేభారత్ రైళ్లకు మంచి స్పందనే వస్తోంది. అయితే.. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న రైలులో ఓ ప్రయాణికుడికి భోజనం విషయంలో చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఎక్స్‌లో వందేభారత్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాసిరకంగా ఉండటమే కాకుండా, దుర్వాసన వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికుడు వెంటనే వీడియో తీశాడు. పాడైపోయిన భోజనం ఇచ్చారంటూ ఆ కస్టమర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన డబ్బులు తనకు రిటర్న్ చేయాలంటూ.. ఆ ఘటనంతా వీడియో రూపంలో బయటకు రావడంతో రైల్వే శాఖ స్పందించింది. ఫిర్యాదు అందిందని.. ఘటనపై దర్యాప్తు చేపడతామని రైల్వేస్‌సేవ తెలియజేసింది. ఫిర్యాదు వివరాల కోసం తమను సంపద్రించాలంటూ సదరు ఎక్స్ యూజర్‌కు సూచించింది. ఇక.. ఐఆర్సీటీసీ సైతం సదరు వీడియోపై స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూనే.. విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. దీనికి సర్వీస్ ప్రొవైడర్ పెనాల్టీ విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. @indianrailway__ @AshwiniVaishnaw @VandeBharatExp Hi sir I am in journey with 22416 from NDLS to BSB. Food that was served now is smelling and very dirty food quality. Kindly refund my all the money.. These vendor are spoiling the brand name of Vande Bharat express . pic.twitter.com/QFPWYIkk2k — Akash Keshari (@akash24188) January 6, 2024 Sir, our sincere apologies for the unsatisfactory experience you had. The matter is viewed seriously. A suitable penalty has been imposed on the service provider. Further the service provider staff responsible have been disengaged and the licensee has been suitably instructed.… — IRCTC (@IRCTCofficial) January 11, 2024 -
ప్రౌడ్ మూమెంట్
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వర్చువల్‌గా ప్రారంభించిన జాల్నా–ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో–పైలట్ అయిన కల్పన ధనవత్ సోషల్ మీడియా అట్రాక్షన్‌గా మారింది. 27 సంవత్సరాల కల్పన ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత అసిస్టెంట్ లోకో–పైలట్‌గా చేరింది. ట్రైన్ ప్రారంభోత్సవ సమయంలో కల్పన సెలబ్రిటీగా మారింది. సెల్ఫోన్లో ఆమె ఫొటోలు తీసుకోవడానికి ప్రయాణికులు పోటీ పడ్డారు. ‘ప్రౌడ్ మూమెంట్: గర్ల్ ఫ్రమ్ పూలంబ్రీ బికమ్స్ ది ఫస్ట్ ఉమన్ లోకో–పైలట్ ఆఫ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు ‘ఎక్స్చేంజింగ్ ఆఫ్ సిగ్నల్స్ బిట్వీన్ లోకో– పైలట్ అండ్ అసిస్టెంట్ లోకో – పైలట్ ఆఫ్ జాల్నా–ముంబై ఎక్స్‌ప్రెస్’ కాప్షన్‌తో రైల్వేశాఖ పోస్ట్ చేసిన కదులుతున్న ట్రైన్ వీడియో కూడా ఆట్టుకుంటోంది. -
100% ఆక్యుపెన్సీ దాటిన ‘వందేభారత్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన వందేభారత్ రైళ్లు అత్యధిక ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తున్నాయి. దక్షిణమధ్య రైల్వేలో గతేడాది ప్రవేశపెట్టిన నాలుగు రైళ్లలో ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్‌లో 134% ఆక్యుపెన్సీ.. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను గతేడాది జనవరిలో ప్రవేశపెట్టారు. 16 కోచ్‌లతో ఈ రైలు ప్రారంభమైంది. మొదటి నుంచి ఈ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. గత డిసెంబర్లో ఈ ట్రైన్లో ప్రయాణికుల నుంచి అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. సికింద్రాబా ద్ నుంచి విశాఖకు వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో 134 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఇక విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే వందేభారత్‌లో ఇది ఏకంగా 143 శాతానికి చేరుకుంది. సంవత్సరాంతం కావడంతో రెండు వైపుల నుంచి ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో చాలా మంది వెయిటింగ్ జాబితాలో నిరీక్షించవలసి వచ్చింది. గత డిసెంబర్ ఆఖరు వారంలో వరుస సెలవులు రావడంతో ఎక్కువ మంది రాకపోకలు సాగించారు. సంక్రాంతి వరకు కూడా ప్రయాణికుల రద్దీ ఇలాగే ఉండవచ్చని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్‌లో... గతేడాది ఏప్రిల్‌లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మొదట 8 కోచ్‌లతో ప్రారంభించారు. ఈ ట్రైన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తోంది. ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో గతేడాది మే 17 నుంచి 16 కోచ్‌లకు పెంచారు. గత డిసెంబర్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు 114 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే వందేభారత్‌లో 105 శాతానికి ఆక్యుపెన్సీ చేరుకోవడం గమనార్హం. మరోవైపు గత సెపె్టంబర్లో 8 బోగీలతో ప్రవేశపెట్టిన కాచిగూడ–యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో డిసెంబర్లో ఆక్యుపెన్సీ 107 శా తానికి చేరింది. తిరుగుదిశలో యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడ వరకు 110 శాతం వరకు నమోదైంది. అలాగే దక్షిణమధ్య రైల్వే పరిధిలోని విజయవాడ–ఎంజీఆర్ చెన్నై–వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో సైతం గత డిసెంబర్లో 126 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా చెన్నై నుంచి విజయవాడకు వచ్చే ట్రైన్లో ఇది 119 శాతం వరకు ఉంది. గత సెస్టెంబర్లో 8 కోచ్‌లతో ఈ ట్రైన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ట్రైన్ తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తోంది. ఆకట్టుకుంటున్న సదుపాయాలు... వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏర్పాటు చేసిన సదుపాయాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకొనే విధంగా రైళ్లను నడుపుతుండటంతో ఎక్కువ మంది వందేభారత్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ ట్రైన్లో ఏసీ చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో అన్ని రకాలసదుపాయాలు అందుబాటులో ఉన్నా యి. జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, డిఫ్యూజ్డ్ ఎల్ఈడీ లైటింగ్, చార్జింగ్ పాయింట్లు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికులకు పూర్తిగా సురక్షితమైన, మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. -
అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. ఏపీలోని స్టాప్స్ ఇవే..
సాక్షి, అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. కొత్త రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామకరణం చేశారు. శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను సుందరంగా నిర్మించారు. శిఖరం, విల్లు బాణం వంటివి శ్రీరాముడిని గుర్తుకు తెస్తున్నాయి. నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్ విస్తరించి ఉంది. ఈ స్టేషన్‌ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్, ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్) అభివృద్ధి చేసింది. #WATCH | Uttar Pradesh: Visuals of the new Amrit Bharat train, which PM Narendra Modi will flag off in Ayodhya today. PM Narendra Modi will also inaugurate the redeveloped Ayodhya Dham railway station and flag off the new Amrit Bharat trains and Vande Bharat trains. pic.twitter.com/y9oWEt6sXm — ANI (@ANI) December 30, 2023 రెండు అమృత్ భారత్ రైళ్లలో ఒకటి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి అయోధ్య మీదుగా బీహార్‌లోని దర్బంగా వరకూ ప్రయాణించనుండగా.. రెండో పశ్చిమబెంగాల్లోని మాల్దా టౌన్ నుంచి బెంగళూరులోని ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినస్ మధ్య నడవనుంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణం సాగనుంది. అయితే, ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఆగుతుంది. జనవరి 7 నుంచి రెగ్యులర్‌గా నడవనుంది. చదవండి: Live: అయోధ్య మెగా రోడ్ షోలో ప్రధాని మోదీ ఈ సూపర్‌ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో 22 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో 12 నాన్ ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ క్లాస్‌లు, 8 జనరల్ అన్‌రిజర్వుడ్ కోచ్‌లతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సౌకర్యవంతమైన సీట్లు, మెరుగైన లగేజీ రాక్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఎల్ఈడీ లైట్లు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సీసీ టీవీ, పరిశుభ్రత, ఆధునిక టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేశారు. ఈ రైళ్లలో ఒక కి.మీ నుంచి 50 కి.మీ లోపు ప్రయాణానికి కనీస టికెట్ ధర రూ.35గా నిర్ణయించారు. టికెట్ ఛార్జీలు ఇతర మెయిల్/ ఎక్స్‌ప్రెస్‌ల కంటే 15-17% ఎక్కువగా ఉంటాయి. దానికి రిజర్వేషన్ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు అన్ని జోన్లకు సమాచారమిచ్చింది. ఏసీ తరగతుల రుసుములు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అమృత్ భారత్ రైళ్లు గరిష్టంగా 130 కి.మీ వేగంతో పరుగులు పెట్టనుంది. 50 కి.మీ.లోపు దూరానికి కనీస టికెట్ ధర రూ.35గా ఉంటుంది. మరోవైపు అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. రామమందిర శంకుస్థాపనకు ముందు ప్రధాని మోదీ శనివారం అయోధ్యలో పర్యటిస్తున్నారు. రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను పటిష్టం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా పెంచారు. -
Minister RK Roja: గుంటూరు నుంచి తిరుపతికి వందేభారత్ రైలులో ప్రయాణించిన మంత్రి రోజా (ఫొటోలు)
-
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
భువనేశ్వర్: రూర్కెలా–పూరి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మెరామండలి, బుద్ధపంక్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లోని ఒక కిటికీ రాళ్ల తాకిడికి దెబ్బతిందని తెలిపింది.