తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్‌ రైళ్లు | Two New Vande Bharat Trains For AP And Telangana Know Details | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్‌ రైళ్లు

Published Fri, Sep 13 2024 6:49 PM | Last Updated on Fri, Sep 13 2024 8:15 PM

Two New Vande Bharat Trains For AP And Telangana Know Details

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ రైల్వే వ్యవస్థ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లు అనేక రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. ఈ సెమీ హైస్పీడ్‌ రైలులో ఛార్జీలు కొంచెం ఎక్కువైనా సరే, అత్యాధునిక టెక్నాలజీతోపాటు అనేక సౌకర్యాలు ఉండటంతో ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని రూట్లలో మరిన్ని వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్  రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌, చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్‌ జంక్షన్‌ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
చదవండి: తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement