nagpur
-
‘ఈవీఎంలను ఊరేగించి గుడి కట్టండి’
ముంబై: ఈవీఎంల చుట్టూ వివాదాలు నడుస్తున్న వేళ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని ఎంవీఏ కూటమి భావిస్తోంది. ఈలోపు.. మహాయుతి ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతోంది. సీఎం ఎన్నిక జాప్యంపై ఎద్దేవా చేసిన థాక్రే సేన.. ఇప్పుడు ఈవీఎంలకు గుడి కట్టండంటూ అధికార కూటమికి సలహా ఇస్తోంది.ముంబైలో కాకుండా నాగ్‌పూర్‌లో మంత్రి వర్గ విస్తరణకు మహాయుతి ఏర్పాట్లు చేసింది. ఈ పరిణామంపై థాక్రే శివసేన నేత సంజయ్‌రౌత్ స్పందించారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంలకు గుడి కట్టుకోండంటూ సలహా ఇచ్చారాయన.‘‘సీఎం ఉరేగింపు కంటే ముందు.. వాళ్లు ఈవీఎంలను ఊరేగిస్తే బాగుంటుంది. ఆపై నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయం ఎదుట ఈవీఎంలకు వాళ్లు గుడి కట్టుకుంటే బాగుంటుంది. ఈ మేరకు కేబినెట్ తొలిభేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ సెటైర్లు వేశారు. #WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "...First of all, the procession of the Chief Minister will be taken out there (in Nagpur). I think that before taking out the procession of the CM, they should take out a procession of EVMs and in the first cabinet they… pic.twitter.com/0ue8Labe5v— ANI (@ANI) December 14, 2024 ‘‘ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర నెలకావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువు దీరలేకపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అయినా కొత్త ప్రభుత్వానికి పట్టనట్లు ఉంది. కనీసం సీఎం అయినా దీనికి సమాధానం ఇస్తారేమో’’ అని రౌత్ అన్నారు.1991 తర్వాత నాగ్‌పూర్‌లో మహా కేబినెట్ విస్తరణ జరుగుతుండడం ఇదే. ఆ టైంలో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డ తర్వాత.. డిసెంబర్లో ఛగన్ భుజ్‌బల్, మరికొందరితో గవర్నర్ సుబ్రహ్మణ్యం మంత్రులుగా ప్రమాణం చేయించారు.ఇదీ చదవండి: బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా! -
సీఎంగా హ్యాట్రిక్ కొడుతున్న బ్యాక్ బెంచర్
ముంబై: ఏబీవీపీ కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానం ఆరంభించిన దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ పట్ల విధేయత, అంకితభావం, పట్టుదలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన 1970 జూలై 22న మహారాష్ట్రలోని నాగపూర్‌లో జన్మించారు. తండ్రి దివంగత గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్, బీజేపీలో కీలక నాయకుడిగా వ్యవహరించారు. దేవేంద్ర 1989లో ఏబీవీపీలో చేరారు. 22 ఏళ్ల వయసులో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా గెలిచారు. 1997లో 27 ఏళ్ల పిన్న వయసులోనే నాగపూర్ మేయర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలిసారిగా 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్ట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం విశేషం. మహారాష్ట్రలో మనోహర్ జోషీ తర్వాత రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఫడ్నవీస్ నిరుత్సాహపడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని విజయపథంలో నడిపించారు. సున్నిత మనస్కుడు ఫడ్నవీస్ పాఠశాలలో చదువుకునేటప్పుడు బ్యాక్ బెంచర్ అని ఆయన గురువు సావిత్రి సుబ్రమణియం చెప్పారు. ఫడ్నవీస్ ఎనిమిది నుంచి పదో తరగతి దాకా సరస్వతి విద్యాలయలో చదువుకున్నారు. తన విద్యార్థి అయిన ఫడ్నవీస్ చిన్నప్పుడు సున్నిత మనస్కుడిగా ఉండేవాడని, అందరినీ చక్కగా గౌరవించేవాడని, ఇతరులకు చేతనైన సహాయం చేసేవాడని, చాలా మర్యాదస్తుడని సావిత్రి సుబ్రమణియం తెలిపారు. చదువులో సగటు విద్యారి్థగానే ఉండేవాడని అన్నారు. అసాధారణమైన విద్యార్థి కానప్పటికీ బాగానే చదివేవాడనని వెల్లడించారు. బాగా పొడగరి కావడంతో తరగతిలో చివర వరుసలో కూర్చొనేవాడని పేర్కొన్నారు. -
వీధి వ్యాపారి కాస్త స్టార్ చాయ్‌వాలాగా మారి ఏకంగా ..!
ఓ సామాన్య వీధి టీ వ్యాపారి తన అసాధారణ టాలెంట్‌తో ఒక్కసారిగా స్టార్ చాయవాలాగా మారి శెభాష్ అనిపించుకున్నాడు. రోజు చూసే చిన్న వ్యాపారమైన కాస్త విభిన్నంగా చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చని చాటి చెప్పాడు. ఒకప్పుడు వీధుల్లో ఏడు రూపాయల టీతో మొదలైన ప్రస్థానం నేడు ఏకంగా రూ. 5 లక్షలు వసూలు చేసే స్థాయికి చేరుకుందంటే..అది ఊహకే అందని విజయంగా చెప్పొచ్చు. ఇంతకీ ఎవరా ఆ స్టార్ చాయ్‌వాలా అంటే..?అతడే డాలీ చాయ్‌వాలాగా పేరుగాంచిన సునీల్ పాటిల్. నాగ్‌పూర్ వీధుల్లో రూ. 7ల కప్పు చాయ్‌తో అతడి టీ వ్యాపారం మొదలయ్యింది. అయితే అందరూ చాయ్వాళ్లలా కాకుండా కాస్త విభిన్నంగా కస్టమర్లను ఆకర్షించేలా టీని తయారు చేయడం, సర్వ్ చేయడం అతడి స్పెషాల్టీ. వ్యాపారానికి కీలకమైన సూత్రం కూడా ఇదే. దాన్నే మనోడు ఎలాంటి బిజినెస్ స్కూల్లో చదవకుండానే జీవన పోరాటంతో తెలుసుకున్నాడు. దాన్ని అప్లై చేసి తన టీ షాపు వద్దకే జనాలు వచ్చేలా చేసుకున్నాడు. దీంతోపాటు తన విలక్షణమైన టీ సర్వీంగ్కి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఫిబ్రవరి 2024లో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ప్రసిద్ధ చాయ్ సర్వీంగ్ కోసం వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా డాలీ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఆ ఒక్క వీడియో అతడి దశనే మార్చేసింది. ఏకంగా దుబాయ్‌లో కార్యాలయాన్ని తెరిచే స్థాయికి చేరుకున్నాడు. అతడు సర్వ్ చేసే విధానమే కాదు వేషధారణ కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది. అత్యంత స్టైలిష్‌గా..ఫంకీ గోల్డెన్ గాగుల్స్, గోల్డెన్ చైన్ తోపాటు వెరైటీ హెయిర్ స్టైల్‌తో ఫ్యాషన్ లుక్‌లో ఉంటాడు. ఒక రకంగా వ్యాపారాన్ని విజయవంతం చేసుకునేలా హంగు ఆర్భాటాలతో స్టైలిష్‌గా సర్వ్ చేస్తాడు. అదే అతడిని ఫేమస్ అయ్యేలా చేసింది. ఇంత స్టార్డమ్ వచ్చిన తన మూలాలను మరిచిపోకుండా తన టీ స్టాల్ సామాన్యుడి వలే పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం అతడు దుబాయ్ నుంచి కువైట్ల వరకు పలు ఈవెంట్లలో డాలీ టీ సర్వీస్ కోసం బుక్ చేసుకుంటారట. అందుకు చాయ్‌వాలా ఏకంగా రూ. 5 లక్షలు దాక వసూలు చేస్తున్నాడు. కానీ జనాలు కూడా లెక్క చేయకుండా అతడి సేవల కోసం ఎంత డభైన వెచ్చించడం విశేషం. ఇంత క్రేజ్ పెరిగినా డాలీ తన దుకాణం వద్ద మాత్రం టీని ఇంకా రూ. 7లకే కస్టమర్లకు అందిస్తుండటం గ్రేట్. View this post on Instagram A post shared by Dolly Ki Tapri Nagpur (@dolly_ki_tapri_nagpur) (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ! యుద్ధం కారణంగా..) -
Peruri Jyoti Varma: పవర్ ఫుల్
విరామం అంటే వెనక్కి తగ్గడం కాదు, పరాజయం అంతకంటే కాదు. విత్తనం నాటిన రోజు నుంచి అది పచ్చగా మొలకెత్తడానికి మధ్య కూడా విరామం ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్‌బాల్ గేమ్ నేషనల్ ప్లేయర్ అయిన జ్యోతి పెళ్లి తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. విరామం తర్వాత మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పేరూరి జ్యోతి పవర్ లిఫ్టింగ్‌లో తక్కువ సమయలోనే సాధన చేసి గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో 45 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది. నిజానికి అది పతకం కాదు... అపూర్వమైన ఆత్మవిశ్వాసం...జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్‌పూర్. పెళ్లికిముందు హ్యాండ్‌బాల్ గేమ్‌లో నేషనల్ ప్లేయర్. 1994లో ‘విజ్ఞాన్ యూనివర్శిటీ’లో ప్రొఫెసర్‌గా చేస్తున్న డాక్టర్ పిఎల్ఎన్ వర్మతో వివాహం జరగడంతో గుంటూరుకు వచ్చింది. కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు దూరంగా ఉండక తప్పలేదు. అయితే వ్యాయామాలకు, యోగ సాధనకు విరామం ఇవ్వలేదు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం పని... వంటి అభిరుచుల పట్ల మక్కువను విడవలేదు. మనం అడుగుపెట్టే స్థలాలు కూడా భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి అంటారు. జ్యోతి విషయంలో అలాగే జరిగింది.ఏడాది క్రితం స్థానిక ‘ఇన్ఫినిటీ జిమ్’లో చేరి రకరకాల వ్యాయామాలు చేసేది. ఆమె ఉత్సాహం, పట్టుదల చూసి కోచ్ రమేష్ శర్మ ‘మీరు పవర్ లిఫ్టింగ్‌లో అద్భుతాలు సాధించగలరు’ అన్నారు. ఆమె నవ్వుతూ ఊరుకుంటే ఆ కథ అక్కడితో ముగిసేది. కోచ్ మాటలను ఆమె సీరియస్‌గా తీసుకుంది. ‘ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు’ అనుకున్నది. అలా అనుకోవడంలో పతకాలు సాధించాలనే ఆశయం కంటే... ఆటల పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమే కారణం. ఆరు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్‌లో సాధన మొదలుపెట్టింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఇంకా నువ్వు కాలేజీ స్టూడెంటే అని అనుకుంటున్నావా’ లాంటి వెటకారాలు వినిపించాయి. అయితే ఈ వెటకారాలు, మిరియాలు ఆమె సాధన ముందు నిలవలేకపోయాయి. మరింత దీక్షతో సాధన చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్‌లో కొద్దితేడాతో పతకం మిస్ అయింది. ‘పతకంతో తిరిగి వస్తావనుకున్నాం’ అన్నారు మిత్రులు. ‘వంద పతకాలతో తిరిగి వచ్చాను’ అన్నది జ్యోతి నవ్వుతూ. ఆమె చెప్పిన వంద పతకాలు... ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్స్ చాంపియన్ షిప్లో రికార్డు స్థాయిలో 45 కేజీలు బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిజానికి ఇదిప్రారంభం మాత్రమే. ఆమె ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో పడతాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే...ఏదైనా సాధించాలంటే మన విలువ మనం ముందుగా గుర్తించాలి. నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుంది. నాకు ఆరోగ్య సమస్యలున్నాయి. హైపో థైరాయిడ్, స్పాండిలైటిస్ నన్ను ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాను. రోజూ యోగ, జిమ్, మెడిటేషన్, గార్డెనింగ్ చేస్తాను.– పేరూరి జ్యోతి– దాళా రమేష్‌బాబు, సాక్షి, గుంటూరుఫొటోలు: మురమళ్ల శ్రీనివాసరావు. -
బాంబు బెదిరింపుల వెనక నాగ్‌పూర్‌కు చెందిన పుస్తక రచయిత..
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలు ఎక్కువగా వస్తుండటంతో పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది.ఈనేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు గుర్తించారు.ఈ బూటకపు బెదిరింపుల వెనక గోండియాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. అయితే నిందితుడు గతంలో ఉగ్రవాదంపై ఓ పుస్తకాన్ని రచించడం గమనార్హం. నిందితుడిని జగదీష్ యూకీగా గుర్తించామని, ఓ కేసులో 2021లో అరెస్ట్ కూడా అయినట్లు నాగ్‌పూర్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని. అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు.జగదీశ్ యూకీ అనే వ్యక్తి ఇ-మెయిల్ ద్వారా పలు ఎయిర్‌లైన్స్‌లకు నకిలీ బాంబు బెదిరింపులు పంపించాడు. దీని కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం కార్యాలయాలతోపాటు పలు ఎయిర్‌లైన్స్ కార్యాలయాలకు, డీజీపీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)తో సహా వివిధ ప్రభుత్వ సంస్థలకు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు డీసీపీ శ్వేతా ఖేద్కర్ వెల్లడించారు. సోమవారం నాగ్‌పూర్ పోలీసులు ముంబైలోని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సైతం బెదిరింపులు రావడంతో ఆయన నివాసం వెలుపల భద్రతను పెంచారు. తాను తెలుసుకున్న రహస్య ఉగ్రవాద కోడ్‌పై సమాచారం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలుపుతానంటూ నిందితుడు బెదిరింపు మెయిల్లో పేర్కొన్నాడు. ఉగ్రవాద బెదిరింపులపై తనకున్న అవగాహన గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాలని కూడా అభ్యర్థించారు. -
మనుమలకు టపాసులు కొనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ
నాగ్‌పూర్: దేశంలో దీపావళి సందడి నెలకొంది. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీపావళి షాపింగ్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో నితిన్ గడ్కరి తన మనుమడు, మనుమరాలితో దీపావళి షాపింగ్ చేయడాన్ని చూడవచ్చు. గడ్కరీ ఒక బాణసంచా దుకాణంలో తన మనుమలకు బాణసంచా కొనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నితిన్ గడ్కరీ కార్యాలయం విడుదల చేసింది.ఇదిలావుండగా పాన్ మసాలా, గుట్కా తిని రోడ్డుపై ఉమ్మివేసే వారికి బుద్ధి చెప్పేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక వినూత్న ఆలోచన వెలిబుచ్చారు. అటువంటివారి ఫొటోలు తీసి పత్రికల్లో ప్రచురించాలని, అప్పుడే వారికి బుద్ధి వస్తుందన్నారు. దేశ ప్రజలు రోడ్లు మురికిగా మారకుండా కాపాడుకోవాలని మంత్రి సూచించారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
నాగ్‌పూర్‌లో పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సుభాష్ చంద్రబోస్ రైల్వేషన్ సమీపంలో మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరిన ఈ రైలు షాలిమార్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.రైలులోని S1, S2 కోచ్‌లు, గూడ్స్ కోచ్ పట్టాలు తప్పాయి. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్‌కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. వందేభారత్‌లో బాంబు ఉందని ఓ ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. అయితే రైలులో బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందని సమాచారంచ్చినక్తిని లింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి మధుసూదన్‌గా గుర్తించారు, దీంతో అతడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.కాగా సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ ప్రారంభించగా.. సెప్టెంబర్ 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ కొత్త రైలు ఏర్పాటు చేశారు.అయితే ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి 80 శాతం ఖాళీతో నడుస్తోంది. ట్రైన్ మొత్తం సామర్థ్యం 1,440 కాగా.. దాదాపు 1200 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ ట్రైన్ బోగీల సంఖ్యను తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 బోగీలతో నడుస్తుండగా.. 10 బోగీలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. -
తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి నమో భారత్ ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ సోమవారం(సెప్టెంబర్16) ప్రారంభించారు. భుజ్-అహ్మదాబాద్ మధ్య నడిచే వందేభారత్ మెట్రో రైలు సర్వీసుల పేరును నమోభారత్ ర్యాపిడ్ రైలుగా మార్చారు. ఈ రైలుతో మరిన్ని వందేభారత్ రైళ్లను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.దుర్గ్-విశాఖపట్నం,వందేభారత్,నాగ్‌పుర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-నాగ్‌పుర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. వందేభారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతిపక్షాలు తన పట్ల ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయన్నారు. అయితే, ప్రతిపక్షాల అవమానాలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి.. ఈ టర్ములోనే ఒకే దేశం-ఒకే ఎన్నికలు -
తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే వ్యవస్థ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లు అనేక రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైలులో ఛార్జీలు కొంచెం ఎక్కువైనా సరే, అత్యాధునిక టెక్నాలజీతోపాటు అనేక సౌకర్యాలు ఉండటంతో ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని రూట్లలో మరిన్ని వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్, చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జంక్షన్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.చదవండి: తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు -
సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. వివరాలివే
భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా మరికొన్ని రూట్లలో వందే భారత్ రైళ్లనుప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు వందే భారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, విజయవాడ- చెన్నై, కాచిగూడ- బెంగళూరు మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది.సికింద్రాబాద్‌నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు కొత్తగా వందే భారత్ రైలు నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య 578 కి.మీ దూరం ఉండగా.. కేవలం 7 గంటల 20 నిమిషాల్లోనే గమ్య స్థానాలకు చేర్చనుంది. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్ పూర్ నుంచి బయలు దేరి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌లో బయలు దేరి రాత్రి 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.ఇక ఈ రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, రామగుండం, కాజీపే స్టేషన్లలో మాత్రమే ఆగనుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నాగ్‌పూర నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. ఇప్పుడు నాగ్‌పూర్- సికింద్రాబాద్ రైలుతోపాటు నాగ్‌పూర్- పుణె రైలు కూడా సెప్టెంబర్ 15న ప్రారంభం కానుంది.#Secunderabad - #Nagpur VandeBharat Express will be introduced very soonTentative launch date: 📅 15th September pic.twitter.com/K43a6Eu1an— TechChaitu (@techchaituu) September 9, 2024హైదరాబాద్ నగరం నుంచి ప్రస్తుతం ఏపీలోని తిరుపతి, విశాఖ, కర్ణాటకలోని యశ్వంత్‌పుర (బెంగళూరు) నగరాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ, తిరుపతి నగరాలకు రైల్లు నడుస్తుండగా.. కాచిగూడ స్టేషన్ నుంచి యశ్వంత్‌పురకు ట్రైన్ పరుగులు పెడుతోంది. దీంతో నాగపూర్ ప్రాంతానికి మరో ట్రైన్ ప్రతిపాదించారు. -
‘కోల్‌కతాలో జరిగినట్లు...’ బాలికలను బెదిరించిన ఆటో డ్రైవర్
దేశంలో తరచూ అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భాల్లో జనం ఆగ్రహం వ్యక్తంచేస్తూ, నిందితులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఒక ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్కూల్‌కు వెళుతున్న ఇద్దరు బాలికలను ఓ ఆటో డ్రైవర్ బెదిరించాడు. పైగా కోల్‌కతాలో ట్రైనీ మహిళా డాక్టర్‌కు జరిగినట్టే మీపైన కూడా దాడి చేస్తానని నిందితుడు బెదిరించాడని ఆ బాలికలు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్‌ను చావబాదడాన్ని వీడియోలో చూడవచ్చు. మరోవైపు కొందరు ఆ బాధిత బాలికలకు ధైర్యం చెప్పడం కూడా కనిపిస్తుంది. తరువాత బాధితురాలు ఆ నిందితుడిని చెప్పుతో కొట్టింది.దీనికిముందు ఆటో డ్రైవర్ ఆ బాలికలను వెనుక సీట్లో కూర్చోవాలని, బిగ్గరగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. ఈ నేపధ్యంలో ఆ బాలికలకు డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే ఆ డ్రైవర్ కోల్‌కతా ఉదంతాన్ని గుర్తుచేస్తూ వారిని బెదిరించాడు. దీంతో ఆ బాలికలు ఆటోను ఆపాలని కేకలు పెట్టారు. దీనిని విన్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్‌ను ఆటోలో నుంచి బయటకు లాగి చావబాదారు. "I will do the same to you as happened in Kolkata!" An auto driver threatened a girl. Public caught him and serviced him properly before handing him over to police. pic.twitter.com/BfNvNakZj6— Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2024 -
అంబానీ ‘పవర్’ను కొంటున్న అదానీ పవర్!
దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్‌తో సహా అనేక రంగాలలో ఉన్న అదానీ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న ఆయన విద్యుత్ రంగంలో మరో ముందడుగు వేసే యోచనలో ఉన్నారు.రూ. 2.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన అతని అదానీ పవర్.. నాగ్‌పూర్‌లో ఉన్న బుటిబోరి థర్మల్ పవర్ ప్లాంట్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోందని ‘మింట్’ నివేదిక పేర్కొంది. ఈ పవర్ ప్రాజెక్ట్‌కు రుణదాతగా ఉన్న సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీతో అదానీ గ్రూప్ మాట్లాడుతోందని, ఈ డీల్ విలువ రూ.2,400 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని నివేదిక పేర్కొంది.ఈ పవర్ ప్లాంట్ ఒకప్పుడు అనిల్ అంబానీకి చెందిన దివాలా తీసిన రిలయన్స్ పవర్ ఆధీనంలో ఉండేది. ఇది ఇప్పుడు రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ అయిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ కింద ఉంది. ఈ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 600 మెగావాట్లు. ఈ వార్తల తర్వాత సోమవారం (ఆగస్టు 19) రిలయన్స్ పవర్ షేర్లు 5 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకాయి. ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ.32.79 వద్ద ముగిసింది. -
Divya Deshmukh: ప్రపంచ చాంపియన్.. ఈ విషయాలు తెలుసా?
గాంధీనగర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత యువ చెస్ తార దివ్య దేశ్‌ముఖ్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించింది. ప్రపంచ జూనియర్ మహిళల అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 18 ఏళ్ల దివ్య 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.చివరిదైన 11వ రౌండ్లో దివ్య 57 ఎత్తుల్లో క్రస్తెవా బెలోస్లావా (బల్గేరియా)పై గెలిచింది. నాగపూర్‌కు చెందిన దివ్య ఈ టోర్నీలో తొమ్మిది గేముల్లో నెగ్గి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది.క్రచ్యాన్ మరియం (అర్మేనియా; 9.5 పాయింట్లు) రెండో స్థానాన్ని దక్కించుకోగా... అలవెర్దియెవా అయాన్ (అజర్బైజాన్; 8.5 పాయింట్లు) మూడో స్థానాన్ని సంపాదించింది. విజేతగా నిలిచిన దివ్యకు 2000 యూరోల (రూ. 1 లక్షా 79 వేలు) ప్రైజ్‌మనీతోపాటు స్వర్ణ పతకం, విన్నర్స్ ట్రోఫీ లభించాయి. విజయానంతరం దివ్య మాట్లాడుతూ.. ‘‘ఒత్తిడిని ఎలా అధిగమించాలో నాకు తెలుసు. ఆటను ఎలా ఆడాలో కూడా పూర్తిగా నేర్చుకున్న తర్వాతే నేను రంగంలోకి దిగాను’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది.18 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య సాధించిన విజయాలు2020- ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్(టీమ్)- స్వర్ణం2022- వుమెన్స్ ఇండియన్ చెస్ చాంపియన్‌షిప్- విజేత2022- చెస్ ఒలింపియాడ్(వ్యక్తిగత విభాగం)- కాంస్యం2023- ఆసియా మహిళా చెస్ చాంపియన్‌షిప్- విజేత2023- టాటా స్టీల్ ఇండియా చెస్ టోర్నమెంట్(వుమెన్స్ రాపిడ్)- ప్రథమ స్థానం2024- ఫిడే వరల్డ్ అండర్ 20 గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్- చాంపియన్. -
‘ఖతర్నాక్ కోడలు’.. చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే
ముంబై : రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో అత్యంత సాధారణ రకాలు హిట్ అండ్ రన్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఒక వ్యక్తిని ఢీ కొట్టి అతని పరిస్థితి ఎలా ఉందో? పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయినప్పుడు దాన్ని హిట్-అండ్-రన్‌గా పరిగణిస్తారు. తాజాగా, హిట్-అండ్-రన్ ప్రమాదంలో మృతి చెందిన 82 ఏళ్ల పురుషోత్తం కేసులో విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం..నాగపూర్ సిటీలో అర్చనా మనీష్ పుట్టేవార్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మనీష్ పేరున్న డాక్టర్. టౌన్ ప్లానింగ్ అధికారిణిగా నగరంలో తనకున్న పేరు పలుకుబడితో భారీ ఎత్తున ఆస్తుల్ని పోగేశారు. అయినప్పటికీ మామ పూరుషోత్తం పుట్టేవార్ ఆస్తిపై కన్నేసింది. ఆయనకున్న రూ.300 కోట్ల ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం అర్చన తన క్రిమినల్ మైండ్‌కు పదును పెట్టింది. తన మామను కారుతో ఢీకొట్టి అది ప్రమాద మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. హత్య చేయించేందుకు ఆమె భర్త డ్రైవర్ బాగ్డే, నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్లకు కోటి రూపాయిలకు సుపారీ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే?అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసేందుకు పురుషోత్తం ఆస్ప్రత్రికి వెళ్లారు. తిరిగి వస్తున్న ఆయనను ప్లాన్‌లో భాగంగా కారుతో ఢీకొట్టిచ్చింది.రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడడంతో స్థానికుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పురుషోత్తంకు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీపుటేజీని నిశితంగా పరిశీలించగా..అందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పురుషోత్తంకు జరిగింది రోడ్డు ప్రమాదం కాదని, హిట్-అండ్-రన్ కేసుగా అనుమానం వ్యక్తం చేశారు. ఆ కారులో ప్రయాణిస్తున్న బాగ్డే, నీరజ్,సచిన్‌లను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా.. కోడలు అర్చన భాగోతం బట్ట బయలైంది. ఆస్తి కోసమే అర్చన తన మామ పురుషోత్తంను హతమార్చేందుకు సిద్దపడినట్లు తేలడంతో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పురుషోత్తం 15 రోజుల పాటు పోరాడి చివరికి ప్రాణాలొదిలినట్లు పోలీసులు తెలిపారు. -
మణిపూర్‌లో సమస్యకు గన్ పరిష్కారం కాదు: సుప్రియా సూలే
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే స్వాగతించారు. మణిపూర్‌లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అన్నారామె.‘‘ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మణిపూర్‌పై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఎందుకంటే మణిపూర్ భారత్‌లో భాగం. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనందరినీ చాలా తీవ్రంగా కలచివేస్తోంది. మణిపూర్ విషయంపై చర్చ జరగాలి. మణిపూర్‌లో నెలకొన్న అశాంతిపై చర్చ జరపాలని ఇండియా కూటమి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది’’ అని అన్నారు.#WATCH | Pune, Maharashtra: On RSS chief Mohan Bhagwat's statement, NCP-SCP MP Supriya Sule says, "I welcome his statement because Manipur is part of India. And when we see our people suffering so much, it is extremely disturbing for all of us. This is something we have been… pic.twitter.com/JgRvnDET6y— ANI (@ANI) June 11, 2024 ‘‘ ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలతో ఒక మంచి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ద్వారా మణిపూర్ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించాలి. ప్రతి సమస్యకు గన్‌తో పరిష్కారం లభించదు’’ అని సుప్రియా సూలే అన్నారు. మణిపూర్‌లో శాంతి, ఎన్నికలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన ఓ కార్యక్రమంలో తొలిసారి మాట్లాడారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలిచిన అనంతరం మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘‘మణిపూర్‌లో అల్లర్లు చెలరేగి ఏడాది అవుతోంది. అయినా అక్కడ శాంతి నెలకొనటం లేదు. గత పదేళ్లలో శాంతంగా ఉన్న మణిపూర్‌లో ఒక్కసారిగా గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇక్కడి సమస్యను పరిష్కరించటమే తొలి ప్రాన్యంగా భావించాలి. ఎన్నికల్లో చూపించిన మాటల చాతుర్యం వదిలేసి.. దేశంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.‘‘ ఎన్నికల ఫలితాల కంటే ప్రజాస్వామ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా సమాజం మారుతోంది. అదే ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో ఎకరినొకరు దూషించుకోవటం, సాంకేతికతను తప్పుదారి పట్టించటం, నకిలీ వార్తలు సృష్టించటం సరికాదు. ఎన్నికలు, ఫలితాలు వాటి నుంచి బయటకువచ్చి దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి’’ అని మోహన్ భగవత్ అన్నారు. -
గూఢచర్యం కేసు.. ‘బ్రహ్మోస్’ మాజీ ఇంజినీర్‌కు జీవిత ఖైదు
నాగ్‌పూర్: బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్‌కు నాగ్‌పూర్ సెషన్స్‌కోర్టు జీవిత ఖైదు విధించింది. నాగ్‌పూర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ టెక్నికల్ రీసెర్చ్ విభాగంలో నాలుగేళ్లు పనిచేసిన నిషాంత్ అగర్వాల్ పాకిస్థాన్‌కు ప్రాజెక్టు కీలక రహస్యాలను చేరవేశాడని కోర్టులో రుజువైంది. దీంతో కోర్టు నిషాంత్‌కు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధించింది. పాక్ గూడఛారి సంస్థ ఐఎస్ఐకి రహస్యాలు చేరవేస్తున్న నిషాంత్‌ను మిలిటరీ ఇంటెలిజెన్స్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2018లో అరెస్టు చేశాయి. అనంతరం నిషాంత్‌పై ఐపీసీతో పాటు అఫీషియల్స్ సీక్రెట్ యాక్ట్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 2018 నుంచి జైలులో ఉన్న నిషాంత్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మహారాష్ట్ర హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. డీఆర్డీవో, మిలిటరీ పారిశ్రామిక కన్సార్టియం సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాయి. -
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మహిళకు ఐదేళ్ల తరువాత న్యాయం లభించింది. ఈ ఉదంతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన నాగపూర్ కోర్టు ప్రభుత్వ వైద్యశాల డీన్ రాజ్ గజ్భియేతో సహా 11 మంది వైద్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని అజ్ని పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే 2019లో నాగపూర్‌కు చెందిన కేవల్రామ్ పాండురంగ్ పటోలే భార్య పుష్ప తన గొంతులో చిన్నపాటి గడ్డకు చికిత్స కోసం నాగ్‌పూర్‌లోని మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. ఈ సమయంలో సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ గజ్భియే బాధిత మహిళ భర్త కేవల్రామ్ పాండురంగ్ పటోలేతో శస్త్రచికిత్స ద్వారా బాధితురాలి గడ్డను తొలగించవచ్చని తెలిపారు. ఆ వైద్యుని సలహా మేరకు పటోలే తన భార్య పుష్పను 2019 జూలై 5న ఆసుపత్రిలో చేర్చారు. 6న ఉదయం 8 గంటలకు ఆమెకు ఆపరేషన్ జరిగింది.ఈ ఆపరేషన్ తర్వాత పుష్ఫ పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఐసీయూలో ఆమెకు చికిత్సనందించారు. అయితే జూలై 7న ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పుష్ఫ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు పేర్కొన్నారు. అయితే తన భార్య ఆపరేషన్‌లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పటోలే 2020 జూన్ 30న డాక్టర్ గజ్భియేతో పాటు ఇతర వైద్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వైద్యాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేసి, కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికలో బాధితురాలు గుండెపోటుతో మృతి చెందిందని కమిటీ పేర్కొంది.అయితే పటోలే దీనిపై రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో వైద్యశాఖ ఈ ఉదంతంపై విచారణకు కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధితురాలికి ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా పటోలే నాగపూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఆ వైద్యులపై కేసు నమోదు చేయాలని అజ్ని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
కన్నతల్లి ఆచూకీకై పరితపిస్తున్న స్వీడిష్ యువతి!
కొందరూ తల్లులు పేదరికం, దారుణమైన కుటుంబ పరిస్థితులు వంటి కారణాల రీత్యా చారిటీ సంస్థల వద్ద లేదా దత్తత కింద తమ పిల్లలను ఇచ్చేయడం జరుగుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్లై.. తమను పెంచిన వాళ్లు అసలైన తల్లిదండ్రులు కాదని తెలిస్తే.. ఆ బాధ మాములుగా ఉండదు. అక్కడ నుంచి మొదలవుతాయి తమ తల్లిదండ్రులు ఎవరూ, ఎక్కడ ఉంటారనే ఆలోచనలు. వాళ్లు అసలు బతికే ఉన్నారా? ఒకవేళ బతికే ఉంటే ఒక్కసారి వాళ్లను తమ కళ్లతో చూసుకోవాలనే ఆరాటం, ఆత్రం మాటలకందని విధంగా ఉంటాయి. అలాంటి భావోద్వేగపు కథ ఈ స్విడిష్ యువతి గాథ! అసలేం జరిగిందంటే..స్వీడన్‌కి చెందిన 41 ఏళ్ల ప్యాట్రిసియా ఎరిక్సన్ ఫిబ్రవరి 1983లో నాగాపూర్‌లోని డాగా హాస్పిటల్లో జన్మించింది. ఒక ఏడాది తర్వాత స్వీడిష్ దంపతులు ఆమెను దత్తత తీసుకున్నారు. తనన పెంచి పెద్ద చేసిన తల్లి తన కన్నతల్లి కాదని తెలుసుకుని భావోద్వేగానికి గురవ్వుతుంది. అయినప్పటికీ ఇన్నేళ్లు తనను ఎంతో ప్రేమగా పెంచిన పెంపుడు తల్లి పట్ల అపారమైన కృజ్ఞత ఉన్నప్పటికీ ఒక్కసారి తన తల్లిని తనవితీరా చూడాలని కోరుకుంటుంది. అందుకోసం ఆమె తన తల్లి ఎక్కడ ఉండేది అనే దిశగా ఆమె ఆచూకీకై వెతకడం ప్రారంభించింది. అలా ఆమె తన తల్లిని వెతుక్కుంటూ నాగ్‌పూర్‌కి చేరుకుంది. అక్కడ తన తల్లి ఆచూకీకి సంబంధించిన వివరాలు, ఆధారాలు సేకరించడం మొదలు పెట్టింది. ఆ భావోద్వేగపూరిత అన్వేషణలో ఎరిక్సన్కి అంజలా పవార్ అనే న్యాయవాది సాయం అందిస్తున్నారు. ఇలా జీవ సంబంధమైన తల్లుల కోసం వేరే దేశ యువతలు భారతదేశానికి వచ్చి కోరడం అనేది తొలిసారి కాదు. ఇంతకుమునుపు స్విస్ మహిళ విద్యా ఫిలిప్పన్ కూడా ముంబైలో తన జీవసంబంధమైన తల్లి కోసం ఒక దశాబ్దంగా వెతుకుతూ ఉంది. అయితే ఆ కేసులో ఆమె తల్లి చిరునామా, ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఆ యువతి ప్రధాన సవాలుగా మారింది. దీంతో ఆమె తల్లి ఎక్కడకు వెళ్లి ఉంటుందనేది చిక్కముడి వీడని మిస్టరీలా మారిపోయింది. #WATCH | Nagpur, Maharashtra: Swedish National Patricia Eriksson comes to Nagpur to search for her biological mother. She says, "The kids in school started to explain that they have their mother's hair and father's nose. Then I realised I couldn't do the same... From a child's… pic.twitter.com/bcyXL4se6o — ANI (@ANI) April 3, 2024 (చదవండి: హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ చేయించుకుంటున్నారా? వైద్యులు వార్నింగ్) -
తూర్పు విదర్భలో హోరాహోరీ!
మహారాష్ట్రలో లోకసభ ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. బరిలోకి దిగిన పార్టీలు తమ సత్తాను చాటేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని తూర్పు విదర్భలో ఎన్నికల పోరు ఆసక్తికరంగామారింది. ఇక్కడి ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, శివసేన, బీఎస్పీతో సహా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రామ్‌టెక్ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన పార్టీల నుండి ముగ్గురు అభ్యర్థులు రాజు పర్వే (శివసేన), శ్యాంకుమార్ బార్వే (కాంగ్రెస్), సందీప్ మెష్రామ్ (బీఎస్పీ) ఉన్నారు. అయితే అంతగా గుర్తింపు లేని పార్టీల నుండి 13 మంది, 12 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. రామ్‌టెక్‌లో కాంగ్రెస్ తన అభ్యర్థిగా రష్మీ బార్వేని నిలబెట్టింది. అయితే ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లదు. దీంతో ఆమె భర్త ఎన్నికల రంగంలో నిలిచారు. నాగ్‌పూర్ విషయానికొస్తే బీజేపీ నుంచి నితిన్ గడ్కరీ, వికాస్ థాకరే (కాంగ్రెస్), యోగేష్ లాంజేవార్ (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీల నుండి 13 మంది, 10 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. భండారా-గోండియా నియోజకవర్గంలోని 18 మంది అభ్యర్థులలో, సునీల్ మెంధే (బీజేపీ), ప్రశాంత్ పడోలే (కాంగ్రెస్), సంజయ్ కుంభాల్కర్ (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీలకు చెందినవారు కాగా, నలుగురు గుర్తింపు పొందనివారున్నారు. 11 మంది స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. అశోక్ నేతే (బీజేపీ), కర్సన్ నామ్‌దేవ్ (కాంగ్రెస్), యోగేష్ హొన్నాడే (బీఎస్పీ) మధ్య త్రిముఖ పోటీ ఉండనుందని భావిస్తున్నారు. చంద్రాపూర్‌లో 15 మంది అభ్యర్థుల్లో ప్రతిభా ధనోర్కర్ (కాంగ్రెస్), సుధీర్ ముంగంటివార్ (బీజేపీ), రాజేంద్ర రామ్టేకే (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీల నుంచి, 9 మంది గుర్తింపు లేని అభ్యర్థులు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎస్. చొక్కలింగం తెలిపారు. ఈ నియోజకవర్గాల్లోని 10,652 పోలింగ్ కేంద్రాల ద్వారా 95,54,667 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
Nitin Gadkari: 5 లక్షలకుపైగా ఓట్లతో గెలుస్తా
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్ నుంచి 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను నాగ్‌పూర్‌ను ఎప్పుడూ మరచిపోలేదని, ఇకపైనా ఎప్పుడూ మరచిపోనని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో నేను 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానన్న నమ్మకం ఉంది. మీరందరూ నన్ను ఎంతో ప్రేమించారు. నేను ఏ పని చేసినా అది మీ ప్రేమ, ఆదరణ వల్లే చేయగలిగాను. ఆ ఘనత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకే చెందుతుంది. నేను నాగ్‌పూర్‌ను ఎప్పుడూ మరచిపోలేదు. ఇకపైనా ఎప్పుడూ మరచిపోను’ అని నితిన్ గడ్కరీ వివరించారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా తాను ఏ పని చేసినా ఆ ఘనత తనను అధికారంలోకి తెచ్చిన ఓటర్లకే దక్కుతుందన్నారు. గత పదేళ్లలో నాగ్‌పూర్‌లో రూ. లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశానని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. తన రాజకీయ వారసత్వంపై బీజేపీ కార్యకర్తలకే హక్కు ఉందని నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకులు ఎవరూ రాజకీయాల్లో లేరన, రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా గోడలపై పోస్టర్లు అతికించి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని వారికి చెప్పినట్లుగా తెలిపారు. కాగా నాగ్‌పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పోటీకి దింపాలని బీజేపీ నిర్ణయించింది. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు ఐదు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
ఆర్ఎస్ఎస్ పురిటి గడ్డలో బీజేపీ గెలిచింది మూడుసార్లే!
మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో నాగ్‌పూర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. నాగ్‌పూర్ విదర్భ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. నాగ్‌పూర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పురిటి గడ్డగా చెబుతారు. మహారాష్ట్రలోని ఐదు కీలక స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో నాగ్‌పూర్ కూడా ఉంది. ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానానికి ఎంపీగా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. నాడు కాంగ్రెస్ అభ్యర్థి అనసూయాబాయి కాలే ఇక్కడి నుంచి గెలిచారు. నాగ్‌పూర్ సీటు కొన్నాళ్లు కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది. 1996లో బీజేపీ తొలిసారి ఇక్కడ నుంచి గెలుపొందింది. నాగ్‌పూర్ ఎన్నికల చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నాయి. 1952లో మొదటి సాధారణ ఎన్నికల్లో నాగ్‌పూర్ స్థానం కాంగ్రెస్‌కు దక్కింది. 1962లో రాజకీయ నేత మాధవ్ శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఆర్ దేవ్ఘరే విజయం సాధించారు. 1971లో నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌కు తొలి పరాజయం ఎదురైంది. ఈసారి సుభాష్ చంద్రబోస్ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ నాగ్‌పూర్ స్థానాన్ని కైవసం చేసుకోగా, భోటే జంబువంతరావు ఎంపీ అయ్యారు. 1977లో కాంగ్రెస్ ఇక్కడ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 1980 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత భోటే జంబువంతరావు విజయం సాధించారు. 1984లో కాంగ్రెస్ నేత బన్వరీలాల్ భగవాన్‌దాస్ విజయం సాధించారు. బన్వరీలాల్ 1989 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో బన్వరీలాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. అయితే ఈసారి బన్వరీలాల్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి దత్తాజీ రఘోబ్జీ మేఘే ఎంపీగా ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ మరోసారి బన్వరీలాల్‌కు టికెట్ ఇచ్చింది. అప్పుడు తొలిసారిగా నాగ్‌పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 1998లో కాంగ్రెస్ పార్టీ నాగ్‌పూర్ సీటును సొంతం చేసుకుంది. విలాస్ ముత్తెంవార్ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009లలో వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో మోదీ వేవ్ కారణంగా చాలా విరామం తర్వాత బీజేపీ తిరిగి నాగ్‌పూర్ సీటును సొంతం చేసుకుంది. ఈసారి నితిన్ గడ్కరీ ఎంపీ అయ్యారు. నితిన్ గడ్కరీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచి తిరిగి తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానం నుండి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారు. సంఘ్‌కు బలమైన కోటగా ఉన్నప్పటికీ నాగ్‌పూర్‌లో బీజేపీ మూడు లోక్‌సభ ఎన్నికల్లో(1996,2014,2019) మాత్రమే విజయం సాధించగలిగింది. -
బిల్‌గేట్స్‌కు చాయ్, ప్రధాని మోదీకి కూడా చాయ్ : డాలీ చాయ్‌వాలా
భారత్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్ సోషల్ మీడియా స్టార్, డాలీ చాయ్‌వాలా వద్దకు వెళ్లి చాయ్ తాగిన వీడియో వైరల్ అయింది. దీంతో మరోసారి మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సునీల్ పాటిల్ వార్తల్లోకి వచ్చేశాడు. ఈ సందర్భంగా చాయ్‌వాలా చేసిన కమెంట్స్ విశషంగా నిలుస్తున్నాయి. బిల్ గేట్స్ డాలీ చాయ్‌వాలా మీట్‌పై మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. విదేశం నుంచి వ్యక్తి అని మాత్రం అనుకున్నా.. కానీ ఆయన బిట్ గేట్స్ అని అస్సలు తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అందరికీ ఇచ్చినట్టే అతనికీ టీ ఇచ్చాను. తరువాత నాగ్‌పూర్‌కి తిరిగి వచ్చాక తాను ఎవరకి టీ ఇచ్చిందీ గుర్తించానని తెలిపాడు. బిల్ గేట్స్ తన దగ్గరికి వచ్చి 'వావ్, డాలీకి చాయ్' అన్నారని గుర్తు చేసుకున్నారు. పనిలో బిజీగా ఉండి, ఆయన తన పక్కనే ఉన్నా, తాను అస్సలు మాట్లాడలేక పోయానని చెప్పాడు. దక్షిణాది సినిమాలు చూస్తా.. వాటినుంచే స్టైల్స్ నేర్చుకున్నా.. వెరైటీ టీ అందిస్తూ ‘నాగ్‌పూర్ కా డాలీ చాయ్‌గా మారా’ అంటూ తన స్టయిల్ గురించి వెల్లడించాడు. అంతేకాదు 'భవిష్యత్తులో ప్రధాని నరేంద్రమోదీకి కూడా టీ అందించాలనుకుంటున్నా అంటూ తన మనసులోని కోరికను బైట పెట్టాడు. కాగా సునీల్ పాటిల్ టీస్టాల్‌తో ఉపాధిని వెదుక్కోవడమే కాదు, తన డ్రెస్సింగ్ స్టైల్, టీ తయారీలోనూ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ‘డాలీ చాయ్ వాలా’ పేరుతో ఇన్ స్టాగ్రామ్‌లో కూడాసెలబ్రెటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. #WATCH | Nagpur (Maharashtra): Microsoft Co-founder Bill Gates posted a video, in which he can be seen enjoying Dolly's tea. Dolly Chaiwala says, "I was not aware at all I thought that he was a guy from a foreign country so I should serve him tea. The next day when I came back… pic.twitter.com/hicI3vY31y — ANI (@ANI) February 29, 2024 -
డాలీ చాయ్వాలాతో బిల్ గేట్స్: ఏఐ వీడియోనా? ఇంటర్నెట్ ఫిదా
మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ భారత పర్యటనలో మరోసారి తన స్పెషాల్టీని చాటుకున్నారు. భారత దేశ ఆవిష్కరణలపై ఎప్పటిలాగానే ప్రశంసలు కురిపించారు. పాపులర్ నాగ్‌పూర్ డాలీ చాయ్ వాలా టీ స్టాల్‌ను సందర్శించిన ఆయన ఇక్కడి టీకి ఫాదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలా ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ బిల్‌గేట్స్ టీ అడిగి మరీ తాగారు. అంతే చాయ్‌వాలా టీకి బిల్ గేట్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ‘‘ఇండియాలో ఎక్కడికెళ్లినా అక్కడ ఆవిష్కరణలను కనుగొనవచ్చు- సాధారణ కప్పు టీ తయారీలో కూడా!’’ అంటూ ఒక వీడియోషేర్ చేశారు. బిల్‌గేట్స్ సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇది ఏఐ సృష్టి కాదు కదా అని ఒక యూజర్, "ఇది డీప్‌ఫేకా’’ అని కూడా ఒక వినియోగదారు ఆశ్చర్యపోవడం విశేషం. దీనికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా సరదాగా కమెంట్ చేశాయి. జొమాటో బిల్ గేట్స్‌కి స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. అలాగే బిల్ ఎంత స్విగ్గీ స్పందించింది. నాగ్‌పూర్‌లో వెరైటీ, స్టయిలిష్ టీతో డాలీ చాయ్‌వాలా బాగా ఫ్యామస్. 10వేల మందికి పైగా ఫాలోవర్లున్నారంటేఈ చాయ్‌వాలా స్పెషల్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. కాగా బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) -
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్‌పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్‌పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్‌కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్‌సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్‌పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్‌ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్‌వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్‌ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.