నేడు దేశవ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రీతుల్లో సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో గంగా స్నానం, గాలిపటాలు ఎగురవేడం లాంటివి ఉన్నాయి. మరోవైపు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది.
మకర సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలాచోట్ల గాలిపటాలను ఎగురవేస్తారు. అయితే ఈ గాలిపటాలను ఎగురవేసేందుకు వినియోగించే చైనా మాంజా కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు పోయిన సందర్బాలు కూడా ఉన్నాయి.
మకర సంక్రాంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీఎత్తున గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం ఉంది. గాలిపటాలు ఎగురవేసే వారు నైలాన్ దారం లేదా చైనా మాంజాను ఉపయోగిస్తుంటారు. వీటి కారణంగా ప్రాణహాని జరుగుతున్న నేపధ్యంలో నాగ్‌పూర్ పోలీసులు చైనీస్ థ్రెడ్ వినియోగం, విక్రయాలపై ఓ కన్నేసి ఉంచారు. లక్షల రూపాయల విలువైన చైనీస్ మంజాను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్‌ల సాయంతో.. గాలిపటాలు ఎగురవేసేవారిపై నాగపూర్ పోలీసులు నిఘా సారించారు. అదేవిధంగా నగరంలోని ప్రతీవీధివీధినా తిరుగుతూ చైనీస్ దారాన్ని ఉపయోగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజాగా నాగ్‌పూర్ పోలీసులు రూ.25 లక్షల విలువైన చైనీస్ దారాన్ని స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేశారు. ఇండోర్ మైదానంలో 2,599 బండిళ్లు కలిగిన దాదాపు రూ.25 లక్షల విలువైన నిషేధిత నైలాన్ మాంజాను రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఆ ప్రాంత పౌరుల సమక్షంలో పోలీసులు ఈ విధమైన చర్యలు చేపట్టారు. చైనామాంజా వినియోగిస్తూ ఎవరైనా పట్టుబడితే వారిని నేరుగా కస్టడీకి పంపుతామని పోలీసులు హెచ్చరించారు. చైనీస్ థ్రెడ్ కారణంగా బైక్ రైడర్లు ప్రమాదాల బారిన పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: పతంగులకు ఎంత గాలి అవసరం? ఎందుకు తెగిపోతాయి?
Comments
Please login to add a commentAdd a comment