![2 Years Girl Dead Gas Cylinder Exploded Inflating Balloon In Maharashtra - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/28/ballon.jpg.webp?itok=0xhBLNxY)
నాగ్‌పూర్: బెలూన్‌లలో గాలిని నింపేందుకు ఉపయోగించే సిలిండర్ పేలి రెండేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఆ చిన్నారి వ్యవసాయంలో ఉపయోగించే ఎద్దుల ప్రాముఖ్యతను తెలియజేసే తాన్హాపోలా పండుగ వేడుకలకు తన తాతాతో కలిసి వెళ్లింది.
అక్కడ ఆ చిన్నారికి తాతా ఒక బెలూన్‌ని కొనివ్వబోతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నాగ్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచల్‌పూర్ తాలుకాలోని షిండే గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. అక్కడ బెలూన్‌లో గాలిని నింపుతుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఆ చిన్నారి కాలిపై పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు అచల్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకుపోయిన దుండగుడు)
Comments
Please login to add a commentAdd a comment