ballon
-
వధువు ఎంట్రీ మాములుగా లేదుగా!ఐడియా అదుర్స్
ఇటీవల యువత వివాహంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. వెడ్డింగ్ కార్డుల దగ్గర నుంచి వివాహ తంతు వరకు ఏదో ఒక విషయంలో వినూత్న రీతిలో ప్రత్యేకత చూపిస్తున్నారు. అవన్నీ అదరహో అనేలా ఉంటున్నాయి. అబ్బా! ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది అనేంతగా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి ఆ డిఫరెంట్ ఐడియాలు. ఇక్కడ కూడా ఓ జంటా అలానే చేసి బంధువులంతా వావ్! అని ఆశ్చర్యపోయేలా చేసింది. ఓ జంట కళ్యాణ మండపానికి ఇచ్చిన ఎంట్రీ ఓ రేంజ్లో ఉంది. అక్కడ ఉన్నవాళ్లంతా వధువుని అలా చూసి స్టన్ అయిపోయారు. ఆ ఆలోచనే చాలా కొత్తగా ఉంది. ఓ మహారాణి మాదిరిగానే వచ్చింది. కాకపోతే కొంచెం డిఫెరెట్గా వచ్చింది. మాములుగా రాణుల వచ్చేటప్పడూ వెనక వైపు పొడుగుగా ఉండే క్లాత్‌ని సేవకులు మోస్తు తీసుకొస్తారు. ఔనా! కానీ ఇక్కడ బెలూన్ల సాయంతో ఆ క్లాత్‌ని పైకెత్తించి తీసుకువచ్చారు. ఆ వధువు స్టయిలిష్‌గా అలా వరుడు చేతిలే చేయి వేసి వస్తుంటే..బంధువలంతా నోరెళ్లబెట్టి..చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: ఆ ఒక్క సంజ్ఞతో..ఆ ఆవుల మందను కదలకుండా చేశాడు!) View this post on Instagram A post shared by Surrey Memes 🇨🇦 (@thesurreymemes) -
చైనా బెలూన్ పేల్చివేత
వాషింగ్టన్/బీజింగ్: అమెరికా గగనతలం మీదుగా ఎగురుతూ కొద్ది రోజులుగా కలకలం రేపుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్ను అగ్రరాజ్యం కూల్చివేసింది. అట్లాంటిక్ సముద్రంపైకి వచ్చేదాకా వేచి చూసి అత్యాధునిక ఎఫ్–22 యుద్ధ విమానంతో దాన్ని పేల్చేసింది. అమెరికా అణుక్షిపణుల్ని భద్రపరిచిన మోంటానా స్థావరంపై ఈ చైనా బెలూన్ ఎగురుతూ కన్పించడం, అది ఇరు దేశాల మద్య చిచ్చు రేపడం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు దక్షిణ కరోలినాకు ఆరు మైళ్ల దూరంలో అట్లాంటిక్ సముద్ర జలాల్లో దాన్ని కూల్చివేశామని రక్షణ శాఖ ప్రకటించింది. దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దక్షిణ కరోలినా మిర్టిల్ బీచ్ సమీపంలో సముద్ర జలాల్లో 11కి.మీ. మేరకు పడిపోయిన బెలూన్, దాని విడి భాగాల కోసం రెండు నేవీ నౌకలు, ఇతర భారీ నౌకల సాయంతో అన్వేషిస్తున్నారు. బెలూన్ని కూల్చివేసే మిషన్‌ను బైడెన్ స్వయంగా పర్యవేక్షించారు. ‘‘దాన్ని పేల్చివేసినప్పుడు ఎలాంటి నష్టం జరగకూడదని ఒత్తిడి ఎదుర్కొన్నాను. సైనిక సిబ్బంది విజయవంతంగా పని పూర్తి చేశారు. వారికి అభినందనలు’’ అన్నారు. నిబంధనల ఉల్లంఘన: చైనా అమెరికా తమ బెలూన్ను కూల్చివేయడంపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా చేసిన పనికి తగిన సమయంలో దీటుగా బదులిస్తామని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలలో పేర్కొంది. అది పౌర వినియోగం కోసం ప్రయోగించిన బెలూన్ మాత్రమేనని పునరుద్ఘాటించింది. వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన బెలూన్ను అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా కూల్చేసినందుకు తమ నుంచి త్వరలోనే గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. ఇలా కూల్చేశారు... ► దాదాపు మూడు స్కూలు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ తొలిసారిగా జనవరి 28న అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది. ► దాదాపు 60 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ అమెరికా నిఘా కంటికి చిక్కింది. వెంటనే కెనడా వైపుగా వెళ్లి 30వ తేదీన తిరిగి అమెరికాలోకి ప్రవేశించింది. ► అణ్వాయుధ క్షిపణి ప్రయోగశాల తదితరాలున్న మొంటానాపై కూడా తిరుగుతుండటంతో కలకలం రేగింది. ► బెలూన్ కూల్చివేతకు మల్టిపుల్ ఫైటర్, రీ ఫ్యూయలింగ్ యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. వర్జీనియాలోని లాంగ్లీ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి దూసుకెళ్లిన ఎఫ్22 ఫైటర్ జెట్ పని పూర్తి చేసింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ఏఐఎం–9ఎక్స్ సూపర్‌సానిక్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని ప్రయోగించింది. వేడిని అనుసరిస్తూ దూసుకెళ్లే ఆ క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది. ► ముందుజాగ్రత్తగా సమీప విల్మింగ్టన్, మిర్టిల్ బీచ్, చార్లెస్టన్ ప్రాంతీయ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. ► బెలూన్‌కు అమర్చిన నిఘా పరికరాలను అమెరికా సేకరించి పరిశీలించనుంది. సముద్రంలో 47 అడుగుల లోతుకు పడిపోయిన సె¯్సర్లు తదితర విడి భాగాల కోసం నేవీ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ ఆస్కార్ ఆస్టిన్, డాక్ లాండింగ్ షిప్ యూఎస్ఎస్ కార్టర్ హాల్ వంటివాటితో పాటు నేవీ డైవర్లు గాలిస్తున్నారు. (చదవండి: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత) -
వైరల్ వీడియో : బెలూన్ తో ఆటలాడుతున్న కుక్క
-
బెలూన్‌లో గాలిని నింపే సిలిండర్ పేలి చిన్నారి మృతి
నాగ్‌పూర్: బెలూన్లలో గాలిని నింపేందుకు ఉపయోగించే సిలిండర్ పేలి రెండేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఆ చిన్నారి వ్యవసాయంలో ఉపయోగించే ఎద్దుల ప్రాముఖ్యతను తెలియజేసే తాన్హాపోలా పండుగ వేడుకలకు తన తాతాతో కలిసి వెళ్లింది. అక్కడ ఆ చిన్నారికి తాతా ఒక బెలూన్ని కొనివ్వబోతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నాగ్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచల్పూర్ తాలుకాలోని షిండే గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. అక్కడ బెలూన్‌లో గాలిని నింపుతుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఆ చిన్నారి కాలిపై పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు అచల్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకుపోయిన దుండగుడు) -
యూట్యూబర్ గౌరవ్ శర్మ అమానుష ప్రవర్తన
-
పైశాచిక చర్య: కుక్కపై యూట్యూబర్ అమానుషం
న్యూఢిల్లీ: శునకంపై ఓ యూట్యూబర్ పైశాచికంగా ప్రవర్తించాడు. హైడ్రోజన్ బెలూన్లు కుక్క మెడకు కట్టి వదిలేశాడు. ఆ బెలూన్లు పైకి వెళ్తుండగా దానికి కట్టిన కుక్క కూడా గాల్లోకి వెళ్తుంటే అతడు పైశాచిక ఆనందం పొందాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అతడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికుడు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని మాలవ్యనగర్కు చెందిన గౌరవ్ జాన్ ఓ యూట్యూబర్. తన యూట్యూబ్ చానల్లో వ్యూస్ కోసం పై విధంగా చేసి వీడియో రూపొందించాడు. తన కుక్కకు డాలర్ అని పేరు పెట్టుకున్నాడు. దాని బర్త్ డే సందర్భంగా ఈ విధంగా చేశాడు. పార్క్ వద్ద అతడు తన తల్లితో కలిసి హైడ్రోజన్ బెలూన్లు కట్టి ఎగురవేస్తున్నారు. ఇంట్లో.. బయట.. చాలాసార్లు కుక్కకు బెలూన్లు మొత్తం కట్టి గాల్లోకి వదిలారు. గాల్లోకి బెలూన్లతో పాటు కుక్క కూడా ఎగురుతుండంతో అతడు, అతడి తల్లి, కొందరు యువతులు కేరింతలు వేస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఈ బిత్తిరి చర్యను చూసిన కొందరు మాలవ్య నగర్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో గౌరవ్ జాన్‌తో పాటు అతడి తల్లిపై కేసు నమోదైంది. ఈ చర్యకు అతడు క్షమాపణలు చెప్పాడు. జంతు ప్రేమికులు, వ్యూవర్స్‌కు క్షమాపణలు చెబుతూ వీడియో రూపొందించాడు. అయితే అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. -
హాట్ ఎయిర్ బెలూన్ సందడి