![YouTuber Makes Pet Dog Fly Using Balloons Case Filed In Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/27/Dog-Balloons.gif.webp?itok=kCayXsKc)
కుక్కను బెలెన్లూ కట్టి ఎగురవేస్తున్న యూట్యూబర్, అతడి తల్లి
న్యూఢిల్లీ: శునకంపై ఓ యూట్యూబర్ పైశాచికంగా ప్రవర్తించాడు. హైడ్రోజన్ బెలూన్లు కుక్క మెడకు కట్టి వదిలేశాడు. ఆ బెలూన్లు పైకి వెళ్తుండగా దానికి కట్టిన కుక్క కూడా గాల్లోకి వెళ్తుంటే అతడు పైశాచిక ఆనందం పొందాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అతడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికుడు డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీలోని మాలవ్యనగర్‌కు చెందిన గౌరవ్ జాన్ ఓ యూట్యూబర్. తన యూట్యూబ్ చానల్‌లో వ్యూస్ కోసం పై విధంగా చేసి వీడియో రూపొందించాడు. తన కుక్కకు డాలర్ అని పేరు పెట్టుకున్నాడు. దాని బర్త్ డే సందర్భంగా ఈ విధంగా చేశాడు. పార్క్ వద్ద అతడు తన తల్లితో కలిసి హైడ్రోజన్ బెలూన్లు కట్టి ఎగురవేస్తున్నారు. ఇంట్లో.. బయట.. చాలాసార్లు కుక్కకు బెలూన్లు మొత్తం కట్టి గాల్లోకి వదిలారు. గాల్లోకి బెలూన్లతో పాటు కుక్క కూడా ఎగురుతుండంతో అతడు, అతడి తల్లి, కొందరు యువతులు కేరింతలు వేస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఈ బిత్తిరి చర్యను చూసిన కొందరు మాలవ్య నగర్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో గౌరవ్ జాన్‌తో పాటు అతడి తల్లిపై కేసు నమోదైంది. ఈ చర్యకు అతడు క్షమాపణలు చెప్పాడు. జంతు ప్రేమికులు, వ్యూవర్స్‌కు క్షమాపణలు చెబుతూ వీడియో రూపొందించాడు. అయితే అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment