Youtube video
-
కడపుబ్బా నవ్వించే డాక్టర్! ఇలా కూడా ఆరోగ్య సూచనలు ఇవ్వొచ్చా?
నవ్వు ఆరోగ్యానికి మంచిది అని అంటుంటారు. మనస్పూర్తిగా నవ్వేవాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని కూడా అంటారు. నవ్వు నాలుగు విధాల చేటు అనేది తప్పని, చాలా రోగాలకు చిరునవ్వు చక్కటి ఔషధం అని విన్నాం. అయితే అది ఎలాగే ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు ఓ వైద్యుడు. ఏ డాక్టర్ చేయని రీతీలో రోగులకు ఆరోగ్యంపై అవగాహన కలిగేలా చేస్తూనే కామెడీ షో నిర్వహిస్తున్నాడు. వారందర్నీ కడుపుబ్బా నవ్వేలా చేసి ఆరోగ్యంగా ఉండమని చెబుతున్నాడు. అంతేగాదు ఆయన కామెడీ షో వీడియోలను యోట్యూబ్లో ఉన్న క్రేజ్ వింటే ఆశ్చర్యపోతారు. ఆ వైద్యుడు వైద్యలందరికంటే విభిన్నంగా ఈ జర్నీని ఎలా ఎంచుకున్నాడో తెలుసుకుందామా! కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్గా పిలిచే పళనియప్పన్ మాణిక్కమ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజషన్ కోసం ఆరోగ్యానికి సంబంధించిన కామెడీ వీడియోలను చేశారు. అ తర్వాత అదే తన ప్రోఫెషన్గా మార్చుకున్నాడు. అందుకు ప్రధాన కారణం 2020లో వచిన కరోనా మహమ్మారి. ఆ టైంలో లాక్డౌన్లతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ధైర్య చెప్పేలా యూట్యూబ్‌లో ఈ కామెడీ వీడియోలు చేయడం నుంచి మొదలైంది ఆయన జర్నీ. అలా ఆయన తన వీడియోల్లో హాస్యాన్ని జోడిస్తు బరువు తగ్గడం, ఉపవాసం చేయడం తదితర చక్కటి ఆరోగ్య విషయాలను వివరించేవారు. దీంతో అతని వీడియోలకు భారీ ఫాలోయింగ్ రావడం మొదలైంది. ఆయన తొలి వీడియో క్లిప్ ఏకంగా ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రాంలో అయితే మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 'మెడ్‌కామ్' అనే యూట్యూబ్ ఛానెల్లో తన వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. అందులో వైద్య సమాచారంతో కూడిన కామెడీ షో ఉంటుంది. అందులో హేమోరాయిడ్స్, అనోరెక్టల్ సమస్యలు, పెద్దప్రేగు పెద్దప్రేగు క్యాన్సర్ గురించి వైద్యుడు పాల్ మాట్లాడతారు. ఆ అనారోగ్య సమస్యలను తదదైన శైలిలో సామాన్య రోగికి కూడా అర్థమయ్యేలా చెబుతాడు. ఇక్కడ రోగి భయపడడు కాదుగదా! ధైర్యంగా అనారోగ్య సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు. అందువల్లే అతని వీడియోలకు ఇంత క్రేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ డాక్టర్ పాల్ యూఎస్‌లో వైద్యుడిగా చేస్తున్న టైంలో ఏకంగా 110 కిలోల బరువు ఉండేవాడు. గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయోమోనని భయపడేవాడు. అసలు వైద్యుడిగా నేనే ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించి తాను చికిత్స అందించే రోగులకు చెబితేనే దాని ప్రభావం ఉంటుందని గ్రహించాడు. చాలామంది రోగులకు బరువుతగ్గాలని, వ్యాయామాలు చేయాలని సూచిస్తామే గానీ వైద్యులే ముందుగా ఇవేమీ చేయరని అన్నారు. ఇలా పాల్ ముందుగా తనాఉ చక్కటి జీవనశైలిని అవలంభించి ఆ తర్వాత తన వీడియోలతో ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాడు. గుండెకు స్టంట్ వేయించుకుంటే సరిపోదు, బరువు పెరగకుండా చూసుకోవడమూ చాల ముఖ్యం అని అంటున్నారు వైద్యుడు పాల్. ఆయన తన వీడియోల్లో చాల వరకు ప్రతి ఆరోగ్య సమస్యకు ఇప్పటి వరకు శాశ్వత నివారణ లేదని చెబుతారు. ఇక్కడ కేవలం వైద్యుడి మీద రోగికి గల నమ్మకం, అతడి మానసిక స్థితి తదితరాలే వ్యాధిని నయం చేయగలవని అన్నారు. అందుకే తాను నమ్మకంగా చెప్పగలను పెదాలపై ఉండే చిరునవ్వు రోగి ఆయుర్ధాయాన్ని పెంచగలదని. అందుకే తాను ఇలా హాస్య భరితంగా ఆరోగ్య సలహలు ఇస్తున్నాని అన్నారు డాక్టర్ పాల్. దీని గురించే చాలామంది రోగులు ఆయన స్టాండప్ కామెడీ షోకి వస్తారు. అక్కడ ఆయన చెప్పే ఆరోగ్య చిట్కాల తోపాటు హాస్య భరితంగా సాగే ఆరోగ్య సలహాలను మనసారా ఆశ్వాదిస్తారు. తన కామెడీలో శర్వణ కుమార్ అనే కాల్పనిక పాత్రతో హాస్యం పండిస్తారు. ఆ పాత్ర అతిగా అల్పాహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్ తినే వ్యక్తి. ఇలా శరవణ్ కుమార్ 'తినడం' అనే వీక్నెస్ అతని ఆరోగ్యానికి ఎలా చేటు తెస్తుందో హాస్యంతో వివరించడం విశేషం. ఇలాంటి శరవన్ కుమార్‌లు మనలో ఎందరో ఉన్నారని చెబుతుంటారు పాల్. తినాలనే కోరిక మిమ్మల్ని ఎలాంటి వాటిని తినేలా ప్రోత్సహిస్తుందో గమనించాలి అంటారు. అంతేగాదు డైటింగ్, ఉపవాసాల పేరుతో నోరు కుట్టేసుకోకుండా ప్రతి ఫంక్షన్‌కి హాజరయ్యి ఎలా తక్కువుగా తినాలో వివరిస్తారు. అక్కడ ఉండే ప్రతి ఒక్క పదార్థంతో అరటి ఆకు ప్లేట్‌ని నింపేలా కొద్ది కొద్దిగా వడ్డించుకోండి. ఇక్కడ మీ లోపల ఉన్న అంతరంగిక వ్యక్తి కోరిక తీరుతుంది. అన్ని రుచులు ఆశ్వాదిస్తూ తక్కువగా కడుపు ఫుల్ అయ్యేలా తినగలుగుతారని అంటారు డాక్టర్ పాల్ . మీరు కూడా అతని వీడియోలు చూసి మనసారా నవ్వుకుని హాయిగా జీవించండి. (చదవండి: న్యూమోనియాతో పోరాడుతుండగానే కరోనా బారినపడ్డ నటుడు విజయ్‌కాంత్!అలా కాకుండా ఉండాలంటే..) -
మోదీపై డాక్యుమెంటరీ.. దెబ్బకు ఆ లింక్‌లు బ్లాక్
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ.. బీబీసీ తీసిన డాక్యుమెంటరీలను షేర్ చేసే పలు యూట్యూబ్ వీడియోలను, ట్విటర్లోని ట్వీట్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార మత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే సంబంధిత యూట్యూబ్ వీడియోలు కలిగి ఉన్న 50కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలని ట్విట్టర్‌ని కేంద్రం ఆదేశించింది. ఐటీ నిబంధనల ప్రకారం.. విశేషాధికారాలను ఉపయోగించి సమాచార ప్రసార కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఐతే యూట్యూబ్, ట్విట్టర్ రెండూ ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. బీబీసీ భారత్‌లోకి డాక్యుమెంటెరీని అందుబాటులోకి తీసుకురానప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు భారత్ వ్యతిరేక ఎజెండాను ప్రచారం చేయడానికి అప్లోడ్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే మళ్లీ తన ఫ్లాట్‌ఫామ్‌లో ఈ వీడియోలను అప్లోడ్ చేస్తే బ్లాక్ చేయమని యూట్యూబ్‌కు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేగాదు ఇతర ఫ్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో లింక్‌ను కలిగి ఉన్న ట్వీట్లను కూడా గుర్తించి బ్లాక్ చేయమని అదేశించినట్లు పేర్కొన్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నత ప్రభుత్వాధికారులు ఈ డాక్యుమెంటరీని పరిశీలించి.. దేశ ప్రతిష్టను దెబ్బ తీసేలా, భారత సుప్రీం కోర్టు అధికారం విశ్వసనీయతపై దుష్ప్రచారం చేసేలా, పైగా.. వివిధ భారతీయ వర్గాల మధ్య విభేదాలను కలిగించేలా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం ఫైర్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా ఉందని, విదేశాలతో భారత్‌కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని కేద్రం అభిప్రాయపడింది. ఇంతకు ముందు బీబీసీ నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీని విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా, యూకే నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ గురించి వ్యతిరేకంగా రెండు భాగాల సిరీస్‌ను ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీపై దుమారం రేగడంతో.. ఎపిసోడ్ లింక్‌లను తొలగించమని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: మోదీపై డాక్యుమెంటరీలో ఏముంది? రిషి సునాక్ ఎలా రియాక్ట్ అయ్యారు? -
FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా?
ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే గ్రూప్ దశతో పాటు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ముగిశాయి. శుక్రవారం నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అరబ్ గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌ను లైవ్‌లో వీక్షించేందుకు దాదాపు కోటికి పైగా వెళ్లారు. లైవ్ చూడలేని వాళ్లు మాత్రం టీవీల్లో, జియో సినిమాలో, తమకు నచ్చిన ఫ్లాట్‌ఫాంలో చూస్తూ ఆనందిస్తున్నారు. తాజాగా యూట్యూబ్ మాత్రం ఫిఫా అభిమానులను దారుణంగా మోసం చేసింది. ఫిఫా వరల్డ్‌కప్ సందర్భంగా గ్రూప్ దశలో జపాన్, జర్మనీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రీప్లేను యూట్యూబ్‌లో టెలికాస్ట్ చేశారు. రియల్ మ్యాచ్ అనుకొని ఎంజాయ్ చేసిన అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ ట్విస్ట్ ఏంటంటే.. అది రియల్ మ్యాచ్ కాదు ఫేక్ గేమ్ అని. ఫిఫా 23 గేమ్‌ప్లే(ఆన్లైన్ గేమ్)లో భాగంగా ఒక గేమింగ్ కంపెనీ దీనిని రూపొందించింది. మాములుగా యూట్యూబ్‌లో మనం ఏదైనా మ్యాచ్ వీక్షిస్తే.. ఒరిజినల్‌కు, డూప్లికేట్‌కు తేడా ఇట్టే తెలిసిపోతుంది. కానీ సదరు యూట్యూబ్ చానెల్ మాత్రం మ్యాచ్ రెజల్యూషన్(క్వాలిటీ) తగ్గించి గేమింగ్‌ను కాస్త రియల్ గేమ్‌లాగా చూపించారు. దూరం నుంచి చూస్తే మాత్రం అచ్చం రియల్ మ్యాచ్‌లానే కనిపిస్తోంది. కాస్త దగ్గరి నుంచి పరిశీలిస్తే కానీ అది బొమ్మల గేమ్ అని అర్థమవుతుంది. అంత మాయ చేశారు యూట్యూబ్ నిర్వాహకులు. అయితే నిజంగానే జపాన్, జర్మనీలు ఒకే గ్రూప్‌లో ఉండడంతో ఎవరికి అనుమానం రాలేదు. చిత్రమైన విషయం ఏంటంటే.. ఫేక్ మ్యాచ్‌ను ఒరిజినల్ అనుకొని దాదాపు 40వేల మంది వీక్షించారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు చాంపియన్ అయిన జర్మనీ గ్రూప్ దశలో వెనుదిరగ్గా.. జపాన్ ప్రీక్వార్టర్స్‌లో ఇంటిబాట పట్టింది. చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్ పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం! -
ఊహించని షాక్.. భారత్‌లో 17 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్!
కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వీడియోలపై కొరడా ఘుళిపించింది ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్. భారతలో ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య దాదాపు 17 లక్షలకు పైగా రూల్స్ పాటించిన వీడియోలను తొలగించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 56 లక్షలకు వరకు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు 73.7 కోట్ల కామెంట్లను కూడా యూట్యూబ్ నుంచి తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో రోజు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అయితే అందులో తప్పుదారి పట్టించే మెటాడేటా, థంబ్‌నెయిల్స్, నిబంధన పాటించని వీడియోలు స్పామ్ కామెంట్లు వంటివి కలిగి ఉన్న వీడియోలను 50 లక్షలకు పైగా తొలగించింది. డేటా ప్రకారం, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పరీక్షించిన తర్వాత 99 శాతం కామెంట్లు తొలగించింది. మెషీన్ల ద్వారా గుర్తించి వీడియోలలో 36 శాతం వీడియోలు ఒక వ్యూస్ కూడా పొందకముందే తీసేవేసింది. కంపెనీ అనుసరిస్తున్న నియమాల ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేసింది. యూట్యూబ్ దీనిపై స్పందిస్తూ.. “మేము ఇందులో మెషీన్ లెర్నింగ్‌తో హ్యూమన్ రివ్యూయర్ల కలయిక ఉన్న టెక్నాలజీని ఉపయోగించి మా విధానాలను అమలు చేస్తున్నాము. మా ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్‌ల కంపెనీ మార్గదర్శకాలకు లోబడి పని చేస్తుంటాయి. ఇవి ఉల్లంఘనలకు పాల్పడిన వీడియోలను గుర్తించడంతో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. చదవండి: బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..! -
మోసం చేస్తూ ఏడాదికి రూ.312 కోట్లు సంపాదన.. స్వయంగా అంగీకరించిన యూట్యూబర్!
యూట్యూబ్.. ఈ మధ్య కాలంలో విపరీతంగా వినపడుతున్న పేరు. ప్రత్యేకంగా చెప్పాలంటే వినోదంతో పాటు సామాన్యులను కూడా సెలబ్రిటీలుగా మారుస్తోంది ఈ వీడియో ప్లాట్‌ఫాం. గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో వీటి యూజర్లు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసందే. కొందరు దీని ఎంటర్టైన్మెంట్ సాధనంగా చూస్తుంటే మరికొందరు తమ ఉపాధికి యూట్యూబ్‌ని మార్గంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వీడియోలు అప్లోడ్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఓ యూట్యూబర్ అందరూ షాక్ అయ్యేలా ఏడాదికి రూ.312 కోట్లు సంపాదిస్తూన్నాడు. దీంతోపాటు మరికొన్ని సంచలన విషయాలను అతను బయటపెట్టాడు. ఇదంతా మోసం చేసి సంపాదించాను! వివరాల్లోకి వెళితే.. మార్క్ ఫిష్‌బాచ్ అనే ఒక యూట్యూబర్ ఒక సంవత్సరంలో యూట్యూబ్ ద్వారా 38 మిలియన్ డాలర్లు (రూ. 312 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఈ సంపాదన చూసి అతనే ఆశ్చర్యపోతున్నాడట. అయితే ఎందుకో గానీ ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు అతనే స్వయంగా అంగీకరించాడు. యూట్యూబ్ ప్రారంభించిన మొదట్లో అనిపించకపోయినా ఇంత పెద్ద మొత్తంలో సంపద రావడంతో మోసం చేస్తున్న భావన కలుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ వ్యక్తి మార్క్ సంపాదన గురించి అడిగాడు. అందుకు అతను బదులిస్తూ.. ‘యూట్యూబ్ ద్వారా నాకు ఇంత డబ్బు వస్తోందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనే నమ్మలేకపోతున్నాను. అయితే ఒక్కోసారి ఈ దారిలో సంపాదించడం నాకు అన్యాయంగా అనిపిస్తుంది. ఈ అంశంపై మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే ఈ స్థాయిలో సక్సెస్, సంపాదన రావడం వెనుక సమాజాన్ని మోసగిస్తున్నట్లు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందని’ తెలిపాడు. భవిష్యత్తులో తన సంపాదనతో ప్రజలకు సహాయం చేయాలని, వారి స్నేహితులు, బంధువుల జీవితాలను మెరుగుపరచాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవలే యూట్యూబర్ MrBeast, (అసలు పేరు జిమ్మీ డోనాల్డ్సన్), అతని యూట్యూబ్ ఛానెల్ కోసం $1 బిలియన్ల డీల్‌ను ఆఫర్ చేసిన సంగతి తెలసిందే. చదవండి: స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! -
యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ భారీ షాక్!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. 2016లో లాంఛ్ చేసిన 'యూట్యూబ్ గో'ను షట్ డౌన్ చేస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్‌లో అధికారికంగా ప్రకటించింది. గూగుల్ నిర్ణయంతో కొంత మంది యూజర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. 2016లో గూగుల్ సంస్థ యూట్యూబ్గోను విడుదల చేసింది. కనెక్టివిటీ తక్కువగా ఉండి, ప్రాసెసర్ స్లోగా ఉండి, లిమిటెడ్‌గా టెక్నాలజీ అందుబాటులో ఉండే లో ఎండ్ మొబైల్ ఫోన్స్ వినియోగిస్తున్న యూట్యూబ్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ తరహాలో 'యూట్యూబ్ గో'ను అందుబాటులోకి తెచ్చింది. కానీ యూట్యూబ్‌ను ఎలా డెవలప్ చేసిందో ఆ స్థాయిలో యూట్యూబ్ గోను అభివృద్ధి చేయడం అసాధ్యంగా మారింది. అందుకే ఇకపై యూట్యూబ్ గో సేవల్ని నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ ప్రకటనతో లో ఎండ్ మొబైల్స్ ఫోన్స్‌తో యూట్యూబ్ వీడియోలు చేస్తున్న క్రియేటర్లకు షాక్ తగలనుంది. కానీ గూగుల్ మాత్రం యూట్యూబ్ గో క్రియేటర్లకు ఎలాంటి నష్టం లేదని, యూట్యూబ్ గో క్రియేటర్లు మెయిన్ స్ట్రీమ్ యాప్ యూ ట్యూబ్‌ను వినియోగించాలని కోరింది. లోఎండ్ మొబైల్స్ వినియోగిస్తున్న యూజర్లు సైతం యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేసేలా మార్పులు చేసినట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. అంతేకాదు యూట్యూబ్ గోలో అందుబాటులో లేని ఫీచర్లను యూట్యూబ్‌లో అందిస్తున్నామని..ఆ ఫీచర్లలో కామెంట్ చేయడం, పోస్ట్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేసేలా అవకాశం కల్పించడంతో పాటు డార్క్ థీమ్‌ను అందిస్తున్నట్లు' కంపెనీ అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. చదవండి👉యూట్యూబ్‌కు భారీ షాక్..! పడిపోతున్న యూజర్లు! -
'వార్న్ భుజాలు బలమైనవి'... రహస్యం తెలుసన్న అశ్విన్
ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 52 ఏళ్ల వార్న్ మార్చి 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అచేతన స్థితిలో మృతి చెందడం అందరిని కలిచివేసింది. వార్న్ మరణంపై క్రీడాలోకం తమ అశ్రు నివాళి అర్పిస్తోంది. వార్న్‌ది సహజ మరణమేనని తేల్చిన పోలీసులు.. భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం వార్న్ అంత్యక్రియలను అధికార లాంచనాలతో జరుపుతామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా వార్న్ మృతిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నివాళి అర్పించాడు. దిగ్గజ స్పిన్నర్‌గా క్రికెట్‌ను ఏలిన వార్న్ సేవలు మరువలేనివని.. అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి ప్రకటించాడు. ఈ సందర్భంగా వార్న్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సాధారణంగా వార్న్ భుజాలు చాలా బలంగా ఉండేవని.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తనకు తెలిసిందని అశ్విన్ పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్‌తో జరిగిన చిట్‌చాట్‌లో వార్న్ గురించి కొన్ని విషయాలు తెలిశాయని తెలిపాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా అశ్విన్ మాట్లాడుతూ.. '' కోచ్ ద్రవిడ్‌తో సంభాషణ సందర్భంగా వార్న్ మృతి ప్రస్తావన మా మధ్య వచ్చింది. దిగ్గజ స్పిన్నర్‌గా ఆయన సేవలు మరువలేనివి. ఒక స్పిన్నర్‌కు భుజాలతో పాటు శరీరంలో నడుము పై భాగం బలంగా ఉండాలి.. ఎందుకంటే వివిధ రొటేషన్లు ఉపయోగిస్తూ స్పిన్ బౌలింగ్ చేయాలి. అందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఒక లెగ్ స్పిన్నర్ బౌలర్‌కు భుజాలు మరింత బలంగా ఉండాలి.. అప్పుడే ఆ బౌలర్‌కు అది అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఈ విషయంలో వార్న్ అదృష్టవంతుడు. అతని భుజాలు చాలా బలమైనవి. ఈ విషయం నాకు రాహుల్ ద్రవిడ్ వల్ల తెలిసింది. వార్న్ బలమైన భుజాల వెనుక ఒక చిన్న కథ ఉంది. వార్న్ పిల్లాడిగా ఉన్నప్పుడు.. ఒక సందర్భంలో తన రెండు కాళ్లు గాయానికి గురయ్యాయి. తన స్నేహితుడు ఆడుకుంటూ కాస్త ఎత్తు నుంచి వార్న్ కాళ్ల మీదకు దూకాడంట. దీంతో అతని రెండు కాళ్లు కాస్త దెబ్బతిన్నాయి. మూడు, నాలుగు వారాల పాటు వార్న్ నడవలేక బెడ్‌కే పరిమితమయ్యాడు. ఆ సమయంలో తన చేతులను కిందపెట్టి నడవడం అలవాటు చేసుకున్నాడు. ఇది వార్న్లో కసిని పెంచింది. ఆ తర్వాత క్రికెటర్‌గా మారే సమయంలో.. ఎక్కువగా భుజాలపై ఒత్తిడి తెస్తూ బలంగా తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత వార్న్‌కు ఎదురు లేకుండా పోయింది. ఒక రకంగా వార్న్ దిగ్గజ స్పిన్నర్‌గా తయారు కావడానికి తన భుజాలే సక్సెస్ ఫార్ములాగా నిలిచింది.'' అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్విన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక షేన్ వార్న్ 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 15 ఏళ్ల కెరీర్లో వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: 'భయమేస్తే గట్టిగా హత్తుకునేదాన్ని.. మిస్ యూ నాన్న' Shane Warne: ‘నేను వార్న్‌ను అంతమాట అనకుండా ఉండాల్సింది’ Prithvi Shaw: నా బ్యాటింగ్ చూస్తే అసహ్యమేస్తోంది: పృథ్వీ షా -
చికెన్ కర్రీ అదరగొట్టిన రణు మండల్ .. వీడియో వైరల్
రణు మండల్ పేరు గుర్తుందా! అదేనండి ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ సింగర్ గా మారడమే కాకుండా సెలబ్రిటీ స్టేటస్ సొంతం కూడా చేసుకుంది. అదే ఊపులో బాలీవుడ్ లో పాటలు పాడే అవకాశాలు కూడా వచ్చాయి. ఏమైందో గానీ ఆమె జీవితంలో అనుకోకుండా వచ్చిన అదృష్టం ఆమెను స్టార్ సింగర్ గా మార్చలేకపోయింది. సినిమాలో పాటల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియా లో మాత్రం ట్రెండింగ్ లో ఉంటుంది రాను మండల్. తాజాగా మరోసారి నెట్టింట ఆమె వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. కానీ ఈ సారి పాటతో కాకుండా, ఆమె వంటతో వైరల్ గా మారింది. తాజాగా ఓ యూట్యూబర్.. రాను మండల్ ఇంటికి వెళ్ళాడు. సింగర్ దగ్గర పాట కామన్ అనుకున్నాడో ఏమో వంట వండించాలని ఫిక్స్ అయ్యి తనతో చికెన్ కర్రీ వండించాడు. ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్లో పెట్టాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాను మండల్.. చికెన్ కర్రీ వండుతూ.. పాటలు పాడుతూ.. యూట్యూబ్ వీక్షకులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేసింది. చదవండి:Fake Jalakanya Video: మైపాడు బీచ్‌లో జలకన్య? అసలు నిజం ఏంటంటే.. -
జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ
Anchor Suma Reveals About The Secrets She Hide From Long Time: యాంకర్ సుమ కనకాల..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్‌లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతుంది. ఆడియో ఫంక్షన్, ఈవెంట్ సహా పలు టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన సుమ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలాకాలంగా దాచిపెట్టిన ఒక విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. చదవండి: 'గుండె తరుక్కుపోతుంది..సమంత ఎలా భరిస్తుందో' 'చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇకపై దాన్ని దాచాలనుకోవడం లేదు. నేను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నా. అంటే ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. అంటే చిన్న గాయం కూడా పెద్దదిగా చూపిస్తుందనమాట. దీన్ని పోగొట్టుకోవడానికి చేయాల్సినవి అన్నీ చేసి చూశాను. కానీ ఫలితం లేదు. ఇది నా శరీరంలో భాగమైపోయిందని అర్థమైంది.చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ గతంలో ఈ ప్రొఫెషనలిజంలోకి వచ్చినప్పడు మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి తెలియక జరగాల్సిన డ్యామెజ్ జరిపోయింది. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. సాదారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచిపెడుతూ వస్తాం. కానీ అది మన శరీరంలోనే ఉంటుంది అని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం' అంటూ వీడియోను షేర్ చేసింది. చదవండి: సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ -
కొత్త అప్డేట్, ఇక యూట్యూబ్‌లో డబ్బులే డబ్బులు
క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆడియన్స్ నుంచి యూట్యూబ్ క్రియేటర్ల మనీ ఎర్నింగ్ చేసేందుకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ తో యూట్యూబ్ క్రియేటర్లు వ్యూవర్స్ నుంచి నాలుగు రకాలుగా డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించినట్లైంది. షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ సంస్థలు క్రియేటర్లు మంచి కంటెంట్‌ను అందించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే వాటికి పోటీగా యూట్యూబ్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. కాంపిటీటర్ల నుంచి పోటీని ఎదుర్కొనేలా యూట్యూబ్ క్రియేటర్లు డబ్బులు సంపాదించేందుకు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసింది. 'సూపర్ థ్యాంక్స్' అనే ఫీచర్ ద్వారా వ్యూవర్స్ క్రియేటర్లను సపోర్ట్ చేస్తూ సుమారు రూ.150 నుండి రూ.3,730 వరకు చెల్లించవచ్చు. తద్వారా తమ అభిమాన యూట్యూబ్ ఛానల్ లో మద్దతు ఇవ్వడానికి ఒక మార్గంగా ఉంటుందని యూట్యూబ్ ప్రకటించింది. సూపర్ థ్యాంక్స్ ఫీచర్ నుంచి మనీ డొనేట్ చేస్తే వారి పేర్లు కామెంట్ సెక్షన్లో హైలెట్‌గా నిలుస్తాయి. ఈ ఆప్షన్ ప్రపంచ వ్యాప్తంగా 68 దేశాలలో ఉన్న యూట్యూబ్ క్రియేటర్లకు అందుబాటులో ఉంటుందని యూట్యూబ్ ప్రతినిథులు అధికారికంగా వెల్లడించారు. కాగా,ఇప్పటికే యాడ్స్, ఛానల్ సబ్‌స్కిప్షన్,లైవ్ స్ట్రీమ్‌లో సూపర్ చాట్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండగా..మనీ ఎర్నింగ్ కోసం మరో ఫీచర్ అందుబాటులోకి తేవడంపై ఆన్ లైన్ లో మనీ ఎర్నింగ్ చేయాలనుకునే ఔత్సాహికులు, యూట్యూబ్ క్రియేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కమ్మని ‘అమ్మచేతి వంట’!
అమ్మ... ప్రేమ ఎంత తియ్యగా ఉంటుందో ఆమె చేతి వంట కూడా అంతే కమ్మగా ఉంటుందని గుర్తించిన ఆవుల భార్గవి ‘అమ్మచేతి వంట’ను ఆయుధంగా చేసుకుని సక్సెస్‌పుల్ యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. భార్గవి తల్లి వెన్నుతట్టి దారిచూపడంతో తనదైన శైలిలో వంటల వీడియోలు పోస్టుచేస్తూ లక్షలమంది యూజర్లను ఆకట్టుకుంటూ ఎంతోమంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తున్నారు. రాజమండ్రిలో పుట్టిపెరిగిన భార్గవికి బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తవ్వగానే పెద్దలు పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక భర్తతో విశాఖపట్నంలో ఉండేది. వెంట వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టడంతో ఇల్లు, పిల్లలతో బిజీగా ఉండేది. 2017 జనవరిలో.. సంక్రాంతి పండక్కి పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో భార్గవి తల్లి గీతామహాలక్ష్మి ‘‘మనం చేసే వంటలను వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెడితే అవి చాలామంది చూస్తారు. నువ్వు అలా చేయవచ్చు కదా! మొదట నేను వంట చేసి వీడియోలు తీస్తాను. నువ్వు వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చెయ్యి’’ అని సలహా ఇచ్చారు. దానికి సరేనంది భార్గవి. తల్లి ప్రోత్సాహంతోనే... యూట్యూబ్‌లో వీడియోలు పెట్టాలని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోని భార్గవి సంక్రాంతి తరువాత విశాఖపట్నం తిరిగి వెళ్లి బిజీ అయిపోయింది. ఆ సమయంలో భార్గవి తల్లి ఫోన్ చేసిప్పుడల్లా గుర్తు చేసేవారు. దాంతో భార్గవి తను వంట చేసేటప్పుడు వీడియోలు తీసి పెట్టుకునేది. 2017 మే 31న ‘అమ్మ చేతివంట’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి .. ఆ వీడియోలను పోస్టు చేసింది. అయితే వాటికి చెప్పుకోదగ్గ వ్యూస్ రాకపోవడంతో సబ్స్రై్కబర్స్ని ఎలా పెంచుకోవాలి? వ్యూస్ ఎలా పెరుగుతాయి? ట్యాగ్స్, టైటిల్స్, థంబ్ నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి... అనే విషయాలపై టెక్ ఛానల్స్‌లో గాలించి, తెలుసుకుని ప్రొఫెషనల్‌గా వీడియోలు పెట్టడం నేర్చుకుంది. మొదటి నెలలోనే 90 వీడియోలు పోస్టు చేసింది. ఛానల్ క్లిక్ అవడంతో..గతేడాది..‘‘మనలో మనమాట’’ పేరిట మరోఛానల్ను ప్రారంభించి వ్యూవర్స్‌కు ఉపయోగపడే సమాచారం అందిస్తోంది. ప్రసాదాలతో ఫేమస్.. దసరా నవరాత్రులలో నైవేద్యం పెట్టే ప్రసాదం తయారీ వీడియోలకు మంచి స్పందన రావడంతో భార్గవి ఛానల్ బాగా ఫేమస్ అయ్యింది. వ్యూవర్స్ ‘‘మీరు చేసిన వంటను మేము ప్రయత్నించాము... చాలా బాగా వచ్చింది’’ అని ప్రోత్సాహంతో కూడిన కామెంట్లు చేయడంతో మరిన్ని వీడియోలు పోస్టుచేసేది. ఛానల్ ప్రారంభించిన ఐదు నెలల్లో మంచి గుర్తింపుతోపాటు, యాడ్లు కూడా వచ్చేవి. తన వీడియోలలో ఆనియన్ సమోసా బాగా క్లిక్ అయ్యింది. వీడియో అప్లోడ్ చేసిన రెండు వారాల్లోనే పదిలక్షల వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టంట్‌గా చేసుకునే టమోటా పచ్చడి, పానీపూరి వీడియోలు సబ్‌స్క్రైబర్స్‌ని అమాంతం పెంచేశాయి.ముఖ్యంగా స్నాక్స్ వీడియోలు, లాక్డౌన్లో ఓవెన్ లేకుండా కేక్ తయారీ వంటకాల వీడియోలకు మంచి ఆదరణ వచ్చింది. కేక్ తయారీ వీడియోలు యూ ట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోలలో భార్గవి కేక్ తయారీ వీడియోలు నంబర్ వన్ స్థానంలో నిలిచాయి. వెజ్, నాన్‌వెజ్ వంటకాల వీడియోలకు సబ్‌స్రై్కబర్స్ పెరగడంతో యూట్యూబ్ సిల్వర్ బటన్, గోల్డ్ ప్లే బటన్లతో భార్గవిని సత్కరించింది. ప్రస్తుతం ‘అమ్మ చేతివంట’ ఛానల్‌కు దాదాపు ఇరవై లక్షలమంది సబ్‌స్రై్కబర్స్ ఉన్నారు. కంటెంట్‌ను బట్టి సబ్స్క్రైబర్లు.. ‘‘నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే యూట్యూబ్ ఛానల్‌ను నడపగలుగుతున్నాను. ‘యూ ట్యూబ్‌లో చేసిన వంటకాలు మనం చేస్తే సరిగ్గా రావు’ అని జనాల్లో నాటుకుపోయిన అభిప్రాయాన్ని తీసేయాలనుకున్నాను. అందుకే నేను చేసిన వంటను మా వారికి రుచి చూపించి ఆయన ఓకే అంటే ఆ వీడియోను పోస్టు చేస్తాను. వ్యూవర్స్ నా వీడియో చూసి చేసిన వంటకు కూడా అదే రుచి వచ్చే విధంగా చేస్తాను. కొత్తగా ఛానల్స్ పెట్టినవారు.. వ్యూస్ రావడం లేదని నిరాశపడకూడదు. మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి. కంటెంట్‌ను బట్టి సబ్‌స్రై్కబర్స్ పెరుగుతారు’’ అని భార్గవి చెప్పింది. –సంభాషణ: పి. విజయ -
కుకింగ్ క్వీన్ .. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్..
పిల్లల చదువులు పూర్తయ్యి ఉద్యోగాల్లో స్థిరపడగానే పెళ్లి చేసి కోడళ్లకు కిచెన్ బాధ్యత లు అప్పజెప్పి మనవళ్లు మనవరాండ్రతో ఆడుకోవాలనుకుంటారు మన భారతీయ సంప్రదాయ మహిళలు. కానీ నిషా మధులిక మాత్రం అలా అనుకోలేదు. జీవితంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్‌ను ప్రారంభించి కోట్లమంది అభిమానుల్ని సంపాదించారు. దాంతో ఆమె సోషల్ మీడియా స్టార్‌గానే గాక ..‘‘పాపులర్ ఇండియన్ వెజిటేరియన్, యూట్యూబ్ చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్, ఫుడ్ బ్లాగర్, టెలివిజన్ పర్సనాలిటీ’’ వంటి అనేక సెలబ్రిటీ హోదాలను సొంతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన నిషాకి ఢిల్లీకి చెందిన ఎంఎస్ గుప్తాతో వివాహం జరిగింది. ఢిల్లీకి వచ్చేసిన నిషాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల పెంపకంలోనూ, మరోపక్క భర్త వ్యాపారంలో సాయం చేస్తూ బిజీగా ఉండేవారు. పిల్లలు చదువులు పూరై తమ ఉద్యోగాలతో బిజీ అయిపోయారు. దీంతో అప్పటిదాకా తీరిక లేకుండా గడిపిన నిషాకి ఒక్కసారిగా తీరిక ఏర్పడడంతో తనని తాను బిజీగా ఉంచుకునేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తన కొడుకు బ్లాగ్‌కు రాస్తుండడం చూసి.. తనకు బాగా అనుభవమున్న కుకింగ్‌ను బ్లాగ్స్లో రాయాలనుకున్నారు. కొడుకు సాయంతో.. భర్త, కొడుకు సాయంతో.. నిషా 2007లో కుకింగ్ బ్లాగ్‌ను ప్రారంభించి దానిలో వంటల తయారీ గురించి రాసేవారు. తర్వాత తనే సొంత వెబ్సైట్ https:/nishamadhulika.com లో తన తల్లి దగ్గర నేర్చుకున్న విభిన్న వంటకాలు వండుతూ అవి ఎలా వండాలో రాసి పోస్టులు పెట్టేవారు. నిషా వంటలను ఇష్టపడిన అభిమానులు ‘‘వీడియోలు పెట్టండి మేడం’’ అని అడగడంతో.. వీడియోలు కూడా అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటిదాకా 1300 కుపైగా వంటల వీడియోలను అప్లోడ్ చేశారు. సిసలైన శాకాహార వంటలు మధులిక కుటుంబం 2009 లో నోయిడాకు మకాం మార్చింది. అప్పుడే ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. శాకాహార వంటకాలకు ప్రాధాన్యత నిచ్చిన నిషా ఉల్లి, వెల్లుల్లి లేని వంటకాల వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వీడియోలు మిలియన్ల మందిని ఆకర్షించేవి. ప్రస్తుతం నిషా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోటీ పదిహేను లక్షలకు పైనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వేలమంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఐదుగురితో టీం .. యూ ట్యూబ్ వీడియోల ద్వారా ఆదాయం వస్తుండడంతో.. మంచి కిచెన్‌ను సెటప్ చేసి, ఐదుగురితో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీమ్ రెండుమూడు వంటల వీడియోలు తీసి.. తరువాత ఛానల్లో అప్లోడ్ అయిన వంటకాలకు వచ్చే కామెంట్లు, అభిప్రాయాలను సమీక్షిస్తూ లోపాలను ఎలా సరిదిద్దాలో చూసుకునేది. టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబర్.. మొదట్లో బ్లాగ్స్, వీడియోలు చేయడం ప్రారంభించినప్పుడు ఇది వ్యాపారంగా చూడని నిషా.. తనకు తెలిసిన అనేక వంటకాలను హిందీలో అప్లోడ్ చేసేవారు. తరువాత ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలో ఉన్న తన ఫాలోవర్స్ తమ భాషల్లో వీడియోలు అప్లోడ్ చేయమని అడగగా వాళ్ల భాషల్లో వంటల వీడియోలు, సబ్‌టైటిల్స్‌తో పోస్టు చేసేవారు. అంతేగాక పలు వెబ్సైట్లకు వంటల ఆర్టికల్స్ రాసిచ్చేవారు. దీంతో సబ్స్క్రైబర్స్తోపాటు, ఆదాయం పెరిగింది. ఈ క్రమంలో ఆమె 2014లో యూట్యూబ్ చెఫ్స్ టైటిల్, 2017లో టాప్ యూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్ అవార్డులు అందుకున్నారు. ఇండియన్ టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబ్ స్టార్స్ జాబితాలో.. రెండుసార్లు నిషా స్థానం దక్కించుకున్నారు. అంతేగాక ప్రముఖ మ్యాగజీన్లు బ్లూమ్‌బర్గ్, ఎకనామిస్ట్, ఇండియా టుడే వంటివి ఆమె సక్సెస్ స్టోరీని ప్రచురిస్తూ ‘కుకింగ్ క్వీన్’గా అభివర్ణించాయి. లోక్‌సభ టీవీ ఆమె ఇంటర్వ్యూనూ టెలికాస్ట్ చేయడం విశేషం. -
యూట్యూబర్ గౌరవ్ శర్మ అమానుష ప్రవర్తన
-
పైశాచిక చర్య: కుక్కపై యూట్యూబర్ అమానుషం
న్యూఢిల్లీ: శునకంపై ఓ యూట్యూబర్ పైశాచికంగా ప్రవర్తించాడు. హైడ్రోజన్ బెలూన్లు కుక్క మెడకు కట్టి వదిలేశాడు. ఆ బెలూన్లు పైకి వెళ్తుండగా దానికి కట్టిన కుక్క కూడా గాల్లోకి వెళ్తుంటే అతడు పైశాచిక ఆనందం పొందాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అతడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికుడు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని మాలవ్యనగర్కు చెందిన గౌరవ్ జాన్ ఓ యూట్యూబర్. తన యూట్యూబ్ చానల్లో వ్యూస్ కోసం పై విధంగా చేసి వీడియో రూపొందించాడు. తన కుక్కకు డాలర్ అని పేరు పెట్టుకున్నాడు. దాని బర్త్ డే సందర్భంగా ఈ విధంగా చేశాడు. పార్క్ వద్ద అతడు తన తల్లితో కలిసి హైడ్రోజన్ బెలూన్లు కట్టి ఎగురవేస్తున్నారు. ఇంట్లో.. బయట.. చాలాసార్లు కుక్కకు బెలూన్లు మొత్తం కట్టి గాల్లోకి వదిలారు. గాల్లోకి బెలూన్లతో పాటు కుక్క కూడా ఎగురుతుండంతో అతడు, అతడి తల్లి, కొందరు యువతులు కేరింతలు వేస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఈ బిత్తిరి చర్యను చూసిన కొందరు మాలవ్య నగర్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో గౌరవ్ జాన్‌తో పాటు అతడి తల్లిపై కేసు నమోదైంది. ఈ చర్యకు అతడు క్షమాపణలు చెప్పాడు. జంతు ప్రేమికులు, వ్యూవర్స్‌కు క్షమాపణలు చెబుతూ వీడియో రూపొందించాడు. అయితే అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. -
BTS Butter Music Video: గంటలో రికార్డులు బద్ధలు!
'బీటీఎస్'... వరల్డ్ వైడ్‌గా పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ బ్యాండ్. ఇండియాలోనూ ఈ గ్రూప్‌కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏడుగురు సౌత్ కొరియన్ బాయ్స్‌తో ఉండే ఈ గుంపు.. పాప్ ప్రపంచంలో ఓ ప్రభంజనం. కొరియా నుంచి మొదలై జపాన్, అమెరికా.. ఇలా వరుస దేశాల్లో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ.. ఇంటర్నేషనల్ సెన్సేషన్‌గా మారింది. వీళ్ల ఆల్బమ్స్ మిలియన్ల కొద్దీ కాపీల్ని అమ్ముడు పోతుంటాయి. రీసెంట్గా ట్విట్టర్, యూట్యూబ్‌లతో అదిరిపోయే రికార్డులతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది బీటీఎస్. బీటీఎస్ లేటెస్ట్ ఆల్బమ్ ‘బటర్’ శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అయిన కాసేపటికే రికార్డుల మోత మొదలైంది. సాంగ్ లాంచ్ లైవ్‌ను 3.89 మిలియన్ల మంది యూట్యూబ్ ప్రీమియర్‌లో వీక్షించగా, కేవలం పదమూడు నిమిషాల్లోనే కోటి మంది యూట్యూబ్‌లో ఈ ఆల్బమ్‌ను చూశారు. 54 నిమిషాల్లో రెండు కోట్ల మంది వీక్షించడం కూడా యూట్యూబ్‌లో ఓ రికార్డే. ఇది వరకు ఈ రికార్డు బీటీఎస్ వాళ్ల ‘డైనమైట్’ ఆల్బమ్ పేరిటే ఉండేది. ఇక నాలుగు గంటల్లో యూట్యూబ్‌లో 37 మిలియన్ల వ్యూస్ దాటేసి దూసుకుపోతోంది బటర్. ఇది బీటీఎస్కి రెండో ఇంగ్లీష్ సింగిల్ ఆల్బమ్. ఇంకోవైపు వరల్డ్‌వైడ్‌గా బటర్‌కి సంబంధించిన హ్యాష్‌ట్యాగులు ట్విట్టర్లో టాప్ ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. -
నటిని అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్
ముంబై : ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే ఈజీగా దొరకిపోతారు. ఫలితంగా సోషల్ మీడియా మీతో ఓ ఆటాడేసుకోవడం మాత్రం ఖాయం. టెలివిజన్ నటి మున్మున్ దత్తాకు కూడా సరిగ్గా ఇలాంటి చేదు అనుభమే ఎదురైంది. యూట్యూబ్‌లో చేసిన ఓ వీడియో ఆమెను ముప్పుతిప్పలు పెట్టింది. మున్మున్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రెండ్ చేయడంతో ఆఖరికి ఆమె క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవలె మేకప్ టిప్స్‌పై యూట్యూబ్‌లో వీడియో చేసిన మున్మున్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. నేను భంగీ (దళిత కులానికి చెందిన వ్యక్తి)లా కనిపించాలనుకోవడం లేదు. ఎంతో అందంగా కనిపించాలనుకుంటున్నా అంటూ వీడియోలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అగ్గిని రాజేశాయి. ఓ కులాన్ని తక్కువ చేసి మాట్లాడిందన్న కారణంతో మున్మున్పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. #ArrestMunmunDuttaఅంటూ హ్యాష్‌ట్యాగ్‌ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. దీంతో తన తప్పు తెలుసుకున్న నటి మున్మున్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, భాషపై అంతగా అవగాహన లేకపోవడంతో, అందుకే ఈ తప్పు జరిగిందని వివరణ ఇచ్చింది. తను చెప్పిన భావాన్ని అర్థం చేసుకోకుండా కేవలం ఓ పదాన్ని మాత్రమే టార్గెట్ చేసి తనను దూషించడం సబబు కాదని పేర్కొంటూ ట్విట్టర్లోఘో పోస్టును రిలీజ్ చేసింది. इस घटिया मानसिकता पर @moonstar4u की जातिवादी टिप्पणी करने पर sc-st एक्ट के तहत मुकदमा दर्ज होना चाहिए।@BhimArmyChief pic.twitter.com/T2RQulNBA1 — Kanishk Singh (@kanishkbhimarmy) May 10, 2021 చదవండి : 'కూతురిని బోల్డ్ సీన్లలో చూసి.. 'ఓ మై గాడ్' అని షాకవుతాడు' ఆర్థిక ఇబ్బందులున్నాయి.. అందుకే తప్పడం లేదు: శృతి హాసన్ -
మహిళకు మరిచిపోలేని షాకిచ్చిన ఒంటె
-
సిగ్గులేని బతుకు’.. యూట్యూబ్ ఛానల్‌పై విశ్వక్ ఫైర్
-
‘సిగ్గులేని బతుకు’.. యూట్యూబ్ ఛానల్‌పై విశ్వక్ ఫైర్
యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌పై తన ప్రతాపాన్ని చూపించాడు. ఇబ్బందికరమైన హెడ్డింగ్‌తో యూట్యూబ్‌లో ఓ వీడియోను పోస్టు చేసినందుకు సంబంధిత ఛానల్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. ఇలాంటి వీడియోలు పోస్టు చేసే ముందు మన ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారన్న విషయం గుర్తుంచుకొని కొంచెం ఇంగితజ్ఞానంతో వ్యవహరించాలని ఫైర్ అయ్యాడు. ఆ వీడియో పెట్టిన వ్యక్తి 24 గంటల్లో క్షమాపణలు చెబుతూ మరో వీడియో పోస్టు చేయాలని, లేకుంటే తన ఇంటికి వచ్చి మరీ వీడియో పెట్టిస్తానని గట్టిగా హెచ్చరించాడు. అయితే విశ్వక్ సేన్ ఇంతలా అగ్రెసివ్ అవ్వడానికి బలమైన కారణమే ఉంది. అదేంటంటే.. నందితశ్వేత హీరోయిన్గా నటిస్తున్న ‘అక్షర’ చిత్రంలోని ఓ పాట విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. దీనికి విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా.. విశ్వక్ గురించి హీరోయిన్ నందిత మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విశ్వక్సేన్ రావడం సంతోషంగా ఉందని.. ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే.. ఆ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్లో అర్థం మార్చి ఇబ్బందికరమైన టైటిల్‌తో పోస్టు చేశాడు. ‘విశ్వక్.. నీకు ఏం కావాలన్నా సిగ్గులేకుండా అడుగు ఇచ్చేస్తా’ అనే థంబ్‌నైల్ పెట్టగా.. ఇది కాస్తా విశ్వక్సేన్ దృష్టికి వెళ్లింది. ఇంకేముంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో ఓ వీడియో పెడుతూ.. సదరు యూట్యూబ్ ఛానల్‌ను ఏకిపారేశాడు. ‘ఇప్పుడే థంబ్‌నైల్ చూశా. అంటే మీకు మన ఇంట్లో ఆడవాళ్లు ఉండారని కొంచెం కూడా అనిపించడం లేదా.. వాళ్ల గురించి కూడా ఇలానే మాట్లాడదాం అనే ఇంటెన్షన్ ఉంటేనే నువ్వు ఇలా రాస్తావ్.. ఆ అమ్మాయి మాట్లాడింది ఏంటి.. మీరు రాసింది ఏంటి. మీరు రాసింది ఎంత గలీజ్‌గా ఉంది తెలుసా.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్న కానీ.. అది రాసినవాడు ఎవడో కానీ ఎంత సిగ్గులేని బతుకు వాడిది. ఆ ఛానల్ పేరు అక్కడే రాసి ఉంది. 24 గంటల్లో సారీ(sorry) చెబుతూ ఇంకో వీడియో పెట్టకుంటే.. ఎక్కడున్నా నీ ఇంటికొచ్చి మరీ నీతో వీడియో పెట్టిస్తా. నాకు షూటింగ్ ఉన్నా పర్వాలేదు’.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు యూట్యూబ్‌లో ఇలాంటివి ఇలాంటివి సర్వసాధారణంగా మారిపోయిందని నెటిజన్లు విశ్వక్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. చదవండి: టీజర్: హీరో నిజంగా పిచ్చోడే! -
యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. రెస్టారెంట్ మూత
సియోల్: తప్పుడు రివ్వూ ఇచ్చి రెస్టారెంట్ మూతపడటానికి కారణమైన ఓ యూట్యూబర్‌పై నెటిజన్లు మండిపడుతూ అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన హయన్ ట్రీ యూట్యూబ్‌లో ఫుడ్ బ్లాగ్ నడుపుతున్నాడు. దీనికోసం అతడు రెస్టారెంట్లు, హోటళ్లను సందర్శిస్తూ అక్కడి వంటకాలపై తన యూట్యూబ్ చానల్లో వీడియోలు పోస్టు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్‌ను సందర్శించిన హయన్ ట్రీ తప్పుడు రివ్యూ ఇచ్చి ఆ రెస్టారెంటు మూసివేతకు కారణమయ్యాడు. వివరాలు.. డయగు అనే ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంటుకు హయాన్ ట్రీ వెళ్లి ఫుడ్ అర్డర్ ఇచ్చాడు. అయితే తన ప్లేటులో వడ్డించిన ఆహారపదార్థాల్లో అన్నం మెతుకులు కనిపించాయి. దీంతో ఇతర కస్టమర్లు తినగా మిగిలిన వాటిని మళ్లీ వడ్డిస్తున్నారని భావించాడు. దీంతో రెస్టారెంటు నిర్వహకులు కస్టమర్లను ఈ విధంగా మోసం చేస్తున్నారంటూ వీడియో పోస్టు చేసి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. (చదవండి: టర్కీలో కరువు తాండవం.. 45 రోజుల్లో..) అయితే అతడి చానల్‌కు 7లక్షలకు పైగా సబ్‌స్రైబర్స్ ఉన్నారు. దీంతో ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరు తిన్న ఫుడ్ మళ్లీ సర్వ్ చేసి ఇలా కస్టమర్లను మోసం చేస్తున్నారా అని సదరు రెస్టారెంట్‌పై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఈ వీడియో కాస్తా ఫుడ్ సెక్క్యూరిటీ అధికారుల కంటపడింది. ఇక వెంటనే అధికారులు స్పందిస్తూ ఆ రెస్టారెంట్‌పై దాడికి దిగారు. అక్కడి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ రెస్టారెంట్‌ను మూసివేశారు. ఈ క్రమంలో రెస్టారెంట్ యాజమాన్యం హయాన్ ట్రీ వీడియో తప్పని తాము తాజా ఆహర పదార్థాలనే వడ్డిస్తున్నామని చెబుతూ వీడియో సాక్ష్యాన్ని చూపించినప్పటిక అధికారులు పట్టించుకోకుండా రెస్టారెంట్‌ను మూసివేశారు. చదవండి: అమెరికా మా ప్రధాన శత్రువు: కిమ్ జాంగ్ ఉన్ అయితే ఈ సంఘటన గతంలో జరిగినప్పటికి ఇటీవల హయాన్ ట్రీ మళ్లీ ఆ రెస్టారెంటు వీడియోని వీక్షించగా అసలు విషయం బయటపడింది. ఆ పదార్థాలకు అంటుకున్న మెతుకులు అతడి ప్లేటులోనివేనని తెలిసి అతడు విస్తుపోయాడు. జరిగిన తప్పుకు తానే కారణం కావడంతో పశ్చాతాపం పడుతూ రెస్టారెంట్ యాజమాన్యాన్ని తాజాగా క్షమాపణలు కోరాడు. అంతేగాక తాను చేసిన తప్పిదాన్ని మన్నించాలని తను పెట్టిన వీడియోలో తప్పుడు సమాచారం ఇచ్చానంటూ మరో వీడియో పోస్టు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. దీంతో అతడి సబ్‌స్రైబర్స్ అంతా తమని తప్పుదొవ పట్టించడమే కాకుండా.. రెస్టారెంట్ మూతకు కారణమయ్యావంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వెనకాముందు చూసుకొకుండా తప్పుడు వీడియో పోస్ట్ చేయడంతో వేల సంఖ్యలో సబ్‌స్రైబర్స్ ఆ చానల్‌ను అన్‌సబ్‌స్క్రైబ్ చేశారు. -
16 లక్షల వ్యూస్‌తో బిలాల్ వీడియో
మీకు బిలాల్ గోరెగెన్ గుర్తుండే ఉంటారు. అతను టర్కిష్‌కు చెందిన వీధి సంగీత కారుడు, వైబింగ్ క్యాట్ మీమ్ ద్వార ప్రసిద్ధి చెందాడు. 1981లో జ్యోతి మూవీకి చెందిన హిట్ సాంగ్ కలియోన్ కా చమన్ పాటను పాడటంతో ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు. దృష్టిలోపం ఉన్న సంగీత కారుడు బిలాల్ . గత సంవత్సరం తను పాడిన ఒక పాట చాల వైరల్ అయింది. 1930లో ప్రసిద్ధి చెందిన ఇవాన్ పోల్కా అనే పాటను బిలాల్ ఒక పార్కులోని బెంచ్‌పై కూర్చోని దర్బుకా(తబలా) ప్లే చేస్తూ పాడాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్ అయి వైరల్ అయింది. చదవండి: (దేశంలో మరింత తగ్గిన కరోనా మరణాలరేటు) అక్టోబర్ 2020లో ఒక వ్యక్తి బిలాల్ సంగీతానికి పిల్లి ఆశ్వాదిస్తూ తలూపుతున్నట్లు మీమ్‌ను చేశాడు. అది ట్విట్టర్లో, పలు సోషల్ మీడియా వేదికలపై తెగ హల్ చల్ చేసింది. దీంతో బిలాల్ వైబింగ్ క్యాట్ మీమ్ ద్వారా ప్రసిద్ధి చెందాడు. పలు కారణాలతో వార్తల్లో నిలుస్తు వస్తున్న బిలాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఐదురోజుల క్రితం దర్బుకా ప్లే చేస్తు కలియోన్ అనే పాటను పాడాడు. చాల అద్భుతంగా పాడిన ఆ పాటను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో 16 లక్షల వ్యూస్‌తో వైరల్ అయ్యింది. -
యూట్యూబ్ యూజర్లకు గుడ్‌న్యూస్!
న్యూఢిల్లీ: మళ్లీ ఇప్పుడు ఇండియాలో హెచ్డీ క్వాలిటీలో వీడియోలు చూసే అవకాశాన్ని యూట్యూబ్ కల్పించనుంది. లాక్డౌన్ సమయంలో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగిలిన వారందరూ వర్క్ ఫ్రం హోం ద్వారా సేవలను అందించారు. అందువల్ల మొబైల్ నెట్‌వర్క్‌ల మీద అధిక భారం పడింది. దీనిని అదుపు చేయడానికి యూట్యూబ్ మార్చి నెలలో 1080 పిక్సల్ హెడీ వీడియోలను నిలిపివేసింది. బ్రాండ్ బాండ్ సేవలకు అంతరాయం కలగకుండా 480 పిక్సల్ క్వాలిటి వీడియోలకు మాత్రమే యూట్యూబ్ అనుమతినిచ్చింది. మొబైల్‌నెట్ వర్క్, బ్రాండ్‌బాండ్ నెట్‌వర్క్‌ల మీద కూడా ఈ నిషేధాన్ని విధించింది. అయితే ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేయడంతో దాదాపు కార్యాలయాలన్ని తిరిగి ప్రారంభమయ్యాయి. ఇంటి నుంచి కాకుండా ఆఫీసుల నుంచి వర్క్ చేయడం ప్రారంభిస్తున్నారు. దీంతో భారతదేశంలో మళ్లీ హెచ్డీ 1080 పిక్సల్ హెడీ వీడియోలకు యూట్యూబ్ అనుమతినిచ్చింది. వైఫై నెట్వర్క్ ద్వారా వీడియోలను హై క్వాలిటీలో చూడొచ్చు. కొన్ని ఫోన్స్‌లో 1080 పిక్సల్ వీడియోలు ప్లే అవుతుండగా కొన్ని మొబైల్స్‌లో 1440 పిక్సల్ వీడియోలు ప్లే అవుతున్నాయి. అయితే రీసెంట్గా విడుదలై ఐవోఎస్‌తో నడిచే ఐఫోన్ XR, ఐఫోన్ 11 వంటి వాటిలో ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా 4కే వీడియోలను ప్లే చేయవచ్చు. అదేవిధంగా ఎయిర్టెల్, జియో నెట్‌వర్క్‌లలో ఐఫోన్ ఎక్స్ఆర్లో 4 కె వీడియోలను, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రోలో 1440 పి వీడియోలను ప్లే చేయవచ్చు. వీడియో క్వాలిటీ మీద ఉన్న నిషేధాలను ఎత్తివేయడంతో ఇక నుంచి హెచ్డీ వీడియోలను చూసి ఆనందించవచ్చు. చదవండి: రికార్డు బ్రేక్: ఈ పాటకు 7+ బిలియన్ వ్యూస్ -
రికార్డు బ్రేక్: ఈ పాటకు 7+ బిలియన్ వ్యూస్
యూట్యూబ్‌లో పిల్లల సాంగ్స్ కానీ, రైమ్స్ కానీ కనిపిస్తే పట్టించుకోకుండా వదిలేస్తాం. కానీ ఓ పాట మాత్రం యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. యూట్యూబ్ చరిత్రలోనే ఎక్కువ మంది వీక్షించిన వీడియోగా "బేబీ షార్క్" రికార్డుకెక్కింది. పిల్లల కోసం రూపొందించిన ఈ సాంగ్‌ను దక్షిణ కొరియాలోని పింక్‌ఫాంగ్ అనే కంపెనీ 2016లో జూన్ 17న రిలీజ్ చేసింది. ఆ పాటలో ఉన్న మ్యాజిక్ పిల్లలనే కాదు పెద్దలను కూడా ఆకర్షించింది. ఎలెన్ డీజెనర్స్, జేమ్స్ కార్డన్, సోఫీ టర్నర్ వంటి సెలబ్రిటీలు సైతం 2018లో ఈ పాటను రీక్రియేట్ చేసి చాలెంజ్‌లు విసురుకున్నారు. వాషింగ్టన్ నేషనల్ బేస్‌బాల్ టీమ్ కూడా ఈ పాట నుంచి మనసు తిప్పుకోలేకుండా పోయింది. దీన్ని జాతీయ గేయంగా ప్రకటించింది. ఈ పాట ఇచ్చిన ఉత్సాహంతో గతేడాది ఈ జట్టు ఆటగాళ్లు ప్రపంచ సిరీస్‌ను కైవసం చేసుకోవడం విశేషం. (చదవండి: కనకవ్వ: అన్నీ బతుకుపాటలే..) 2019లో బిల్బోర్డ్ హాట్ 100లో ఈ సాంగ్ 32వ స్థానాన్ని సైతం సంపాదించింది. ఇక ఇప్పటివరకు 7.039 బిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో డెత్రోన్ లూయిస్ ఫాన్సికి చెందిన "డెస్పాసిటో" సాంగ్ అత్యధిక మంది వీక్షించిన వీడియోగా తొలిస్థానంలోనే ఉండేది. కానీ బేబీ షార్క్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. 7.046 బిలియన్ల వ్యూస్‌తో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2.16 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ పాప, ఓ బాబు మాత్రమే ఉంటారు. వాళ్ల చుట్టూ షార్క్(సొరచేప)లు ఉంటాయి. పాట మొత్తంలో 'షార్క్ డుడుడుడు' అనే క్యాచీ పదాలే ఎక్కువగా ఉండటంతో పిల్లలు ఈ పాటను సులువుగా నేర్చేసుకుంటున్నారు. ఇక యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోల్లో బేబీ షార్క్ తర్వాత డెస్పాసిటో, షేప్ ఆఫ్ యూ, సీ యూ అగెన్, మాషా అండ్ ద బీర్ రెసిపీ ఫర్ డిజాస్టర్ అనే వీడియోలు తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. (చదవండి: అప్పులపాలై ఇంటికి తిరిగొచ్చిన పిల్లి!) -
యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తున్న సాంగ్
కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ మొదటి ఇంగ్లీష్ సింగిల్ “డైనమైట్” ను శుక్రవారం విడుదల చేసింది. డైనమైట్ విడుదలయిన ఒక్కరోజులోనే అత్యధిక వీక్షణలు పొంది యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. డైనమైట్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విడుదలయ్యింది. అయితే శనివారం ఉదయం 6.05 గంటలకు వరకు ఈ వీడియోను 86.4 మిలియన్ల మంది చూశారు. అంతకుముందు కూడా మరొక కొరియా పాప్ బ్యాండ్ బ్లాక్‌పింక్ చేసిన ట్రాక్ “హౌ యు లైక్ దట్” కూడా 86.3 మిలియన్ల వీక్షణలతో రికార్డ్‌ను సృష్టించింది. శనివారం యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోలలో డైనమైట్ మొదటిస్థానంలో నిలిచింది. కేవలం ఇది మాత్రమే కాకండా డైనమైట్ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ వీడియో 3 మిలియన్లకు పైగా ప్రత్యక్ష వీక్షకులతో అత్యధికంగా వీక్షించిన యూట్యూబ్ ప్రీమియర్‌గా రికార్డును సృష్టించింది. అయితే, కొరియా పాప్ బ్యాండ్ ఈ ఘనతను సాధించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు విడుదలైన “బాయ్ విత్ లవ్” 24 గంటల్లో 74.6 మిలియన్ వీక్షణలను పొందింది. దీని గురించి బీటీఎస్ సంస్థ వారు మాట్లాడుతూ, ‘ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ఒక ఇంగ్లీష్ పాటను రూపొందించి వారికి కొంత ఆనందాన్ని పంచాలనుకుంటున్నాం’ అని తెలిపారు. -
యువతుల్ని వేధించిన 'డ్రీమ్ బాయ్'
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ చానళ్లకు పరిమితమైన ప్రాంక్ వీడియోల విష సంస్కృతి యూట్యూబ్ చానళ్ల పుణ్యమా అని నగరానికీ పాకింది. ప్రాంక్ పేరుతో కొందరు హద్దు మీరి వ్యవహరిస్తున్నారు. ఆడవాళ్లను వేధింపులకు గురిచేస్తున్నారు. ‘నేను సింగిల్ అండి... నాకు ఓ హగ్ ఇస్తారా? అంటూ ప్రాంక్ పేరిట వీడియో రూపొందించిన ‘డ్రీమ్ బాయ్ జయసూర్య’ అనే యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు రమావత్ సురేష్..తన చానల్లో వీడియోను పోస్టు చేశాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇద్దరు యువతులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులుదర్యాప్తు చేపట్టారు. ఈ తరహా కేసు నమోదు కావడం నగరంలో ఇదే తొలిసారి. సురేష్ గత కొన్నాళ్లుగా డ్రీమ్ బాయ్ జయసూర్య పేరుతో ఓ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే దీని కేంద్రంగా ఆన్లైన్ గేమ్స్‌కు సంబంధించిన లింకులు ఏర్పాటు చేయడం, బెట్టింగ్స్‌కు అవసనరమైన లింకులు పొందుపరచడం, వీటిని వినియోగించుకోవడానికి నిర్ణీత మొత్తం సబ్స్క్రిప్షన్ కట్టించుకోవడం వంటివి చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు. దీనికితోడు తన చానల్ పాపులారిటీ పెంచుకోవడానికి ప్రాంక్ వీడియోలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒంటిపై షార్ట్..పైన టవల్ కట్టుకుని ఓ పబ్లిక్ ప్లేసులో సంచరిస్తూ యువతుల్ని వేధించాడు. సినిమా చూస్తారా? అంటూ వారిని ప్రశ్నిస్తూ హఠాత్తుగా తన టవల్ తీసేసి భయభ్రాంతులకు గురి చేశాడు. ఇలా రూపొందించిన ప్రాంక్ వీడియోను గత ఏడాది ద్వితీయార్థంలో తన యూట్యూబ్ చానల్లో పెట్టాడు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ సైబర్ స్పేస్ పోలీసింగ్ ద్వారా ఈ విషయం గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది జనవరిలో రమావత్ సురేష్‌ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో ఇతడు రూపొందించిన వీడియో ఇప్పడు కేసు నమోదుకు కారణమైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో సంచరించిన ఇతగాడు నేను సింగిల్ అండి... ఓ హగ్ ఇస్తారా? అంటూ యువతులు, విద్యార్థినుల్ని అడుగుతూ వీడియో రికార్డు చేశాడు. దాదాపు పది నిమిషాల నిడివితో ఉన్న దీన్ని తన యూట్యూబ్ చానల్ డ్రీమ్‌బాయ్ జయసూర్యలో పొందుపరిచాడు. ప్రతి సీన్‌ను వెనుక బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్, మ్యూజిక్ ఏర్పాటు చేశాడు. దీన్ని ఇప్పటి వరకు 12 లక్షల మంది వీక్షించారు. ప్రతి సీన్ ముగిసిన తర్వాత ఇది ప్రాంక్ వీడియో అంటూ వారికి చెబుతూ..అదిగో అక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పండి అంటూ సూచించాడు. అయితే ఇద్దరు యువతుల విషయంలో మాత్రం వారికి ఇలా చెప్పలేదు. యూ ట్యూబ్ చానల్లో ఉన్న ఆ వీడియో ఇటీవల ఈ ఇద్దరు యువతుల దృష్టికి వచ్చింది. తమ అనుమతి లేకుండా రూపొందించిన వీడియోను చానల్లో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నగర సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.