ముంబై : ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే ఈజీగా దొరకిపోతారు. ఫలితంగా సోషల్ మీడియా మీతో ఓ ఆటాడేసుకోవడం మాత్రం ఖాయం. టెలివిజన్ నటి మున్మున్ దత్తాకు కూడా సరిగ్గా ఇలాంటి చేదు అనుభమే ఎదురైంది. యూట్యూబ్‌లో చేసిన ఓ వీడియో ఆమెను ముప్పుతిప్పలు పెట్టింది. మున్మున్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున ట్రెండ్ చేయడంతో ఆఖరికి ఆమె క్షమాపణలు చెప్పక తప్పలేదు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవలె మేకప్ టిప్స్‌పై యూట్యూబ్‌లో వీడియో చేసిన మున్మున్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. నేను భంగీ (దళిత కులానికి చెందిన వ్యక్తి)లా కనిపించాలనుకోవడం లేదు. ఎంతో అందంగా కనిపించాలనుకుంటున్నా అంటూ వీడియోలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అగ్గిని రాజేశాయి. ఓ కులాన్ని తక్కువ చేసి మాట్లాడిందన్న కారణంతో మున్మున్‌పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. #ArrestMunmunDuttaఅంటూ హ్యాష్‌ట్యాగ్‌ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు.
దీంతో తన తప్పు తెలుసుకున్న నటి మున్మున్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, భాషపై అంతగా అవగాహన లేకపోవడంతో, అందుకే ఈ తప్పు జరిగిందని వివరణ ఇచ్చింది. తను చెప్పిన భావాన్ని అర్థం చేసుకోకుండా కేవలం ఓ పదాన్ని మాత్రమే టార్గెట్ చేసి తనను దూషించడం సబబు కాదని పేర్కొంటూ ట్విట్టర్‌లోఘో పోస్టును రిలీజ్ చేసింది.
इस घटिया मानसिकता पर @moonstar4u की जातिवादी टिप्पणी करने पर sc-st एक्ट के तहत मुकदमा दर्ज होना चाहिए।@BhimArmyChief pic.twitter.com/T2RQulNBA1
— Kanishk Singh (@kanishkbhimarmy) May 10, 2021
చదవండి : 'కూతురిని బోల్డ్ సీన్లలో చూసి.. 'ఓ మై గాడ్' అని షాకవుతాడు'
ఆర్థిక ఇబ్బందులున్నాయి.. అందుకే తప్పడం లేదు: శృతి హాసన్
Comments
Please login to add a commentAdd a comment